7, ఆగస్టు 2024, బుధవారం

Panchaag


 

⚜ *శ్రీ కంఠేశ్వర ఆలయం*

 🕉 *మన గుడి : నెం 402*


⚜ *కర్నాటక  : నంజనగూడు - మైసూరు*


⚜ *శ్రీ కంఠేశ్వర  ఆలయం*



💠 కన్నడలో నంజు అంటే "విషం". నంజుండేశ్వర అనే పేరుకు"విషం తాగిన దేవుడు" అని అర్థం.


💠 కర్ణాటక రాష్ట్రంలో ఇది అతి పెద్ద దేవాలయం.ఈ దేవస్థానం ఈ పట్టణంలో ముఖ్యదేవాలయం. ఇక్కడి శివలింగాన్ని గౌతమ మహర్షి ప్రతిష్ఠించాడని అంటారు. 


💠 ఈ దేవుడిని నంజుండేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈ నంజుండేశ్వరుని పేరునుండే నంజనగూడు ఏర్పడింది.

నంజున్‌గూడును శివపురాణంలో శ్రీ గారాలపురిగా పేర్కొనబడింది .


💠 సాగరమథనంలో అమృతానికన్నా ముందుగా హాలాహలం ఉద్భవిస్తుంది.

ఆ కాలకూట విషం లోకమంతా విస్తరించకుండా ఈశ్వరుడు దానిని మ్రింగివేస్తాడు.

 అయితే పార్వతీదేవి కోరికపై శివుడు ఆ హాలాహలాన్ని తన గొంతులోనే నిలుపుకుంటాడు. ఆ విషం శివుని కంఠంలోనే నిలిచిపోయి ఆ కంఠం నీలంగా మారిపోతుంది.


💠 అప్పటి నుండి ఈశ్వరుడు నీలకంఠుడుగ పిలువబడుతున్నాడు. 

కన్నడ భాషలో నంజనగూడు అంటే నంజుడి యొక్క నివాసస్థానం అని అర్థం. 

నంజుండ అంటే విషము మ్రింగినవాడు అని అర్ధం.


🔆 *త్రివేణీ సంగమం:*


💠 నంజనగూడు సమీపంలో కపిలానది, కౌండిన్యనది, చూర్ణవతి నదుల త్రివేణీ సంగమం ఉంది. 

దీనికి పరశురామ క్షేత్రం అని పేరు. పరశురాముడు తన తల్లిని సంహరించిన తరువాత ఈ ప్రాంతానికి వచ్చి నదీస్నానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడని అంటారు.


💠 ఈ స్థల పురాణం ప్రకారం ఆ సమయంలో అక్కడ ఆదికేశవుని దేవాలయం (ప్రస్తుతం ప్రధాన దేవాలయం ప్రక్కన ఉంది) మాత్రమే ఉండేది. 

పరశురాముడు తన ఆయుధం గొడ్డలిని నదీ జలంలో శుభ్రం చేసుకొనే సందర్భంలో అతని గొడ్డలి నదిలోపలి శివలింగానికి తాకి శివుడి తల నుండి నెత్తురు ప్రవహిస్తుంది

అది చూసి పరశురాముడు భీతి చెంది శివుడిని క్షమించమని వేడుకుంటాడు. 


💠 శివుడు ప్రత్యక్షమై పరశురాముడిని ఆశీర్వదించాడు మరియు శివలింగంపై తడి మట్టిని పూయమని చెప్పాడు (శ్రీ నంజన్‌గూడ్ మట్టికి అపారమైన వైద్యం చేసే శక్తి ఉంది). శివలింగానికి రక్తస్రావం ఆగింది.


💠 శివుడు పరశురాముడిని మంటపాన్ని నిర్మించి తపస్సు కొనసాగించమని సలహా ఇచ్చాడు ఇచ్చటి మృత్తిక ఔషధంతో సమానమంటారు. అనేక చర్మరోగాలకు

ఈ మృత్తికను ఉపయోగిస్తారు.


💠 శివుడు సంతోషించి తన దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు పరశురామ దేవాలయాన్ని సందర్శించాలని వరాన్ని ప్రసాదిస్తాడు. నంజనగూడు దేవస్థానాలకే కాక అక్కడ పండే ప్రత్యేక రకం అరటి పళ్లకు ప్రసిద్ధి. 

ఈ రకం అరటి పళ్లను స్థానికులు నంజనగూడు రసబాళె అని పిలుస్తారు.


💠 ఒకసారి పార్వతీ దేవి  ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించాలని కోరుకుంది, అందువలన అతను ఆమెను (గారాలపురి) నంజన్‌గూడ్‌కు తీసుకువచ్చాడు. ఆమె కబినీ నదికి వెళ్లి నీటిని తాకడానికి వంగి ఉన్నప్పుడు, ఆమె కిరీటం నుండి ఒక రత్నపు పూస ( మణి ) నీటిలో పడిపోయింది. 


💠 శివుడు సంతోషించి, "దేవీ, ఇప్పటి వరకు, ఈ ప్రదేశం నా దివ్య ఆశీర్వాదం మరియు ఉనికిని కలిగి ఉంది; ఈ క్షణం నుండి, ఇది మీ ఉనికిని, దయ మరియు ఆశీర్వాదాలను కలిగి ఉంటుంది. దీనిని దక్షిణ మణికర్ణికా ఘాట్ అని కూడా పిలుస్తారు" అని ప్రకటించాడు.


💠 ప్రాకారం చుట్టూ శైవభక్తులు 63 నాయన్మారుల విగ్రహాలు ఉంటాయి.


💠 నంజన్ గూడి కి దగ్గరగా పరశురామ దేవాలయాన్ని దర్శిస్తేగానీ తీర్థయాత్ర పూర్తికాదు. ఈ పరశురామ దేవాలయం కౌండిన్య నది గట్టుపైన ఉంది.


💠 హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ లకు ఈ దేవస్థానంతో సన్నిహిత సంబంధాలున్నాయి. తన పట్టపుటేనుగు కంటిచూపును కోల్పోతే టిప్పు సుల్తాన్ ఇక్కడి నంజుండేశ్వరుని ప్రార్థించాడని, దానితో పట్టపుటేనుగుకు చూపు మరలా వచ్చిందని అప్పటి నుండి టిప్పు సుల్తాన్ ఈ దేవుడిని హకీమ్‌ నంజుండేశ్వర అని కొలిచేవాడని ఒక కథనం.


💠 రాఘవేంద్రస్వామి మఠం కూడా ఇక్కడే ఉంది. ఇది 15వ శతాబ్దం చివరిభాగంలో నిర్మింపబడిందని

అంటారు.


 💠 ఈ ఆలయంలో నెలకొని ఉన్న శివుడు ముఖ్యంగా దృష్టి ప్రదాత, నేత్ర సంబంధమయిన వ్యాధులు కలవారు ఇక్కడికి వచ్చి స్వామినిపూజించి ఫలితం పొందారని జనవాక్యం. 


💠 ఈ దేవాలయ ప్రహరీ గోడలపై వివిధ గణపతి రూపాలు ప్రతిష్టించబడ్డాయి. 

ఈ క్షేత్రం గురించి మరొక ఆనంద కరమయిన విషయం ఏమిటంటే తురుష్కురుడైన హైదరాలీ బహుకరించిన పచ్చల నెక్లెస్ను స్వామి ధరించటం. 

ఇక్కడి శివుని మహిమకు ముగ్ధుడై హైదరాలీ స్వామికి ఈ నజరానా యిచ్చాడట. 

శ్రీ శ్రీకంఠేశ్వరుడిని ప్రతిరోజూ శైవాగమం ప్రకారం అభిషేకం మరియు పూజల ద్వారా పూజిస్తారు.  సోమవారాలు, అమావాస్య రోజులు మరియు పౌర్ణమి రోజులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.  మిథున మాసంలో (జూలై) జరిగే గిరిజా కళ్యాణం గొప్ప వేడుక 


💠 నంజనగూడు  రథోత్సవంకి చాలా పేరు పొందింది. మూడురోజుల పాటు జరిగే బ్రహ్మాండమైన ఈ రథోత్సవానికి వేలకొలది భక్తులు దక్షిణదేశం అనేక మూలలనుండి వస్తారు.

పెద్దజాతర సందర్భంలో రథోత్సవం ఘనంగా జరుగుతుంది. శ్రీకంఠేశ్వరుడిని, పార్వతీదేవిని, గణపతిని, సుబ్రహ్మణ్యస్వామిని, చండికేశ్వరుడిని ఐదు ప్రత్యేక రథాలలో ఉంచి వేలాది భక్తులు ఈ రథాలను పురవీధులలో లాగి ఊరేగిస్తారు.


💠 ఇది మైసూరు నుండి 23 కి.మీ.ల దూరం

వింత లక్షణములు

  ,  

*వాట్సప్ సమూహ వినియోగదారుల వింత లక్షణములు*


1 *. #కుప్పరులు* 

వీరు రోజస్తమానం కుప్పలు తెప్పలుగా సమాచారమును సమూహములో గ్రుమ్మరించుచుందురు. 


2 *. #ఆకస్మికులు* 

వీరు అప్పుడప్పుడు తమ ఉనికిని తెల్పుటకు అసందర్భపు సమాచారమును సమూహములో ప్రచురించెదరు. 


 *3. #విధ్యుక్తులు* 

వీరు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లేదా రాత్రి వేళలో శుభోదయం, శుభరాత్రి లాంటి సమాచారములు మరియు లేదా పుట్టిన రోజు శుభాకాంక్షలు, వివాహ శుభాకాంక్షలు లాంటివి మాత్రమే సమూహములో ప్రచురించెదరు.


4 *. #గవాక్షులు.* 

వీరు సమూహములో ఏమి జరుగుతున్నదో చూచెదరుకాని ఎటువంటి సమాచారమునూ ప్రచురించరు. బహుశా వీరికి సాంకేతిక పరిజ్ఞానం కాని భాషా పరిజ్ఞానం కాని లోపించి ఉండవచ్చు. 


*5. #అవ్యవస్థితులు* . 

వీరు అనేక సమూహములలో సభ్యత్వం కలిగి ఉండుటచే ఏ సమాచారమును ఎక్కడ ముద్రించవలయునో అనే అయోమయావస్థితిలో ఉండి తను ప్రస్తుతం ఉన్న సమూహములోని సమాచారమును అదే సమూహములో ప్రచురించెదరు. 


 *6. #అనుక్రియాయులు.* 

వీరు సమూహములో ప్రచురించబడిన ప్రతి సమాచారమునకు, కార్యాలయంలో అధికారి ఎవరి ఉత్తరము వారికి తన వాఖ్యనము వ్రాసి ఏవిథంగా పంచునో ఆ విధంగా తన వాఖ్యనము తో విధిగా ప్రతిస్పందిస్తారు.


 7 *. #తంత్రజ్ఞులు.* 

వీరు తమ సమాచారములతో అందరూ ఏకభవించాలని ఆశిస్తారు. 


8 *. #పృథక్కులు.* 

సమూహములో వీరి ఉనికి మిగతా సభ్యులెవరికి తెలియదు. తామరాకు మీది నీటి బొట్టులాగా.


*9. #అసంబద్ధులు.* 

వీరు ప్రచురించే సమాచారమునకు సమయము సందర్భము ఉండదు. సాయంకాలమునకు  శుభోదయ మన్నన ఉదయమున శుభ రాత్రి మన్నన లాంటివి ప్రచురించెదరు. 


*10. #మేషియలు* 

వీరు తమ మేథస్సుననుసరించరు. తమకంటే ముందున్న సమాచారమును సరించి,  తథనుగుణంగా సమాచారమును తప్పు ఒప్పు విచారణ విస్మరించి ప్రచురించెదరు.


*11. #తస్కరులు.* 

వీరు ఇంతకు ముందే ప్రచురితమైన సమాచారమును కాపీ చేసి పేస్ట్ చేయుదురు. 


*12. #రవాణాగ్రేసరులు* 

వీరు వివిధ మార్గములలో తమకు సంక్రమించిన సమాచారమును కేవలం రవాణా చేయుదురు. అది ఎటువంటి సమాచారము, ఇతరులకు అది ఉపయోగకరమా అనేది కూడ పట్టించుకోరు.


*13. #దైవఙ్ఞులు* 

వీరు సోమవారం శివుడు, మంగళవారం హనుమాన్, బుధవారం వినాయకుడు, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వేంకటేశ్వర స్వామి, 

ఆదివారం సకల దేవతలను మనకు దర్శింపచేస్తారు. 


*14 #వ్యాపార_దిగ్గజాలు* 

అర్థం పర్థం లేకుండా తమ సరుకుల, సేవల గురించి ప్రింటెడ్ ప్రకటనలు పెట్టేస్తుంటారు. మనం ఫలానా మితృడికీ యాక్సిడెంట్ అయిందని పెడితే, వీళ్ళు టక్కున 'అందమైన జుట్టుకు మా నూనెనే వాడండి' అని మోకాళ్ళ వరకు జుట్టున్న ఒక గిరికన్య ఫోటో పెడతారు. ఇట్లాంటివి ఎన్నో! 


 *15# సంజ్ఞా స్పందకులు* 

వీరు ఎటువంటి భావాలనైనా కేవలం సంజ్ఞల (emoji) ద్వారా మాత్రమే స్పందిస్తారు. ఎటువంటి పదాలు ముద్రించరు 😜


*ఇది ఎవరిని దృష్టి లో ఉంచుకొని వ్రాసినది కాదు. 

ఒకవేళ మీకలా అనిపిస్తే అది కేవలం కాకతాళీయం మాత్రమే. హాయిగా నవ్వుకోండి.

 *ఆనందో బ్రహ్మ** 

😂😂😂😂😂

అమరకోశః

 *అమరకోశః*

అమరకోశము అనేది ఒక ప్రాచీన సంస్కృత నిఘంటువు. ఒకనాటి జాతీయ పాఠ్యపుస్తకం. అమరాన్ని రచించినది అమరసింహుడనే నిఘంటుకారుడు. ఆయన ఏ కాలీనుడో, ఏ ప్రాంతీయుడో, ఏ కులస్థుడో నిర్ధారించడానికి తోడ్పడే వివరాలేవీ ఆ గ్రంథంలో లేవు. బ్రిటీషువారు భారతదేశానికి రాకముందు మన ప్రాచీన గురుకుల పాఠశాలల వ్యవస్థలో పై తరగతుల పిల్లలకి అమరకోశంతో పాటు రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం, కిరాతార్జునీయం, శిశుపాలవధ అనే ఈ అయిదు పుస్తకాలూ తప్పనిసరి వాచకాలుగా నిర్దేశించబడ్డాయి. ఇవి కాక ఆంధ్రదేశ పాఠశాలల్లో మఱో అయిదు తెలుగు కావ్యాల్ని కూడా ఆంధ్ర పంచకావ్యాలుగా భావించి పిల్లల చేత చదివించేవారు. మహాకవులుగా పేరుపడ్డ గుఱ్ఱం జాషువా, శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ మొదలైన ఆధునిక కాల కవులతో సహా అందరూ తమ చిన్నప్పుడు అమరకోశ పాఠకులే.


త్రిలిజ్గ్యాం త్రిష్వితి పదం మిథునే తు ద్వయోరితి!

నిషిద్ధ లిజ్గం శేషార్థం త్వంతాథాది న పూర్వభాక్!!

Aadi shankara books pdf

 *ఆదిశంకరాచార్యుల రచనలు సంబంధ 49 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

శంకరాచార్య చరిత్రము www.freegurukul.org/g/AdiShankaracharya-1


శంకర భగవత్పాద గ్రంధ మాల www.freegurukul.org/g/AdiShankaracharya-2


వివేకచూడామణి(సర్వవిధానంద సరస్వతి స్వామి అనువాదం) www.freegurukul.org/g/AdiShankaracharya-3


శంకర గ్రంధ రత్నావళి www.freegurukul.org/g/AdiShankaracharya-4


శంకర హృదయము www.freegurukul.org/g/AdiShankaracharya-5


పంచీకరణ భాష్యము www.freegurukul.org/g/AdiShankaracharya-6


ప్రభోధ రత్నావళి www.freegurukul.org/g/AdiShankaracharya-7


ఆదిశంకరుల అపరోక్షానుభూతి www.freegurukul.org/g/AdiShankaracharya-8


సిద్ధాంత బిందు www.freegurukul.org/g/AdiShankaracharya-9


జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్య www.freegurukul.org/g/AdiShankaracharya-10


శంకర గ్రంధ రత్నావళి-1 www.freegurukul.org/g/AdiShankaracharya-11


శంకర గ్రంధ రత్నావళి-2 www.freegurukul.org/g/AdiShankaracharya-12


శంకర గ్రంధ రత్నావళి-7 www.freegurukul.org/g/AdiShankaracharya-13


శంకర గ్రంధ రత్నావళి-13 www.freegurukul.org/g/AdiShankaracharya-14


శంకర గ్రంధ రత్నావళి-16 www.freegurukul.org/g/AdiShankaracharya-15


ఆదిశంకరాచార్య దివ్యచరితామృతము www.freegurukul.org/g/AdiShankaracharya-16


ఆదిశంకరుల ఆత్మ బోధ www.freegurukul.org/g/AdiShankaracharya-17


బ్రహ్మ సూత్రాలు www.freegurukul.org/g/AdiShankaracharya-18


శివానందలహరి www.freegurukul.org/g/AdiShankaracharya-19


శివానందలహరి,బ్రమరాంబ అష్టకం www.freegurukul.org/g/AdiShankaracharya-20


సౌందర్యలహరి(వచన) www.freegurukul.org/g/AdiShankaracharya-21


శ్రీ విద్యా లహరి-సౌందర్యలహరికి విశేష వ్యాఖ్య www.freegurukul.org/g/AdiShankaracharya-22


సౌందర్యలహరి www.freegurukul.org/g/AdiShankaracharya-23


నిత్య సౌందర్య లహరి www.freegurukul.org/g/AdiShankaracharya-24


భవాని సౌందర్యలహరి www.freegurukul.org/g/AdiShankaracharya-25


వివేక చూడామణి www.freegurukul.org/g/AdiShankaracharya-26


వివేక చూడామణి(పుల్లెల శ్రీరామచంద్రుడు అనువాదం) www.freegurukul.org/g/AdiShankaracharya-27


భజ గోవిందం www.freegurukul.org/g/AdiShankaracharya-28


భజగోవిందం(విద్యాప్రకాశానందగిరి స్వామి అనువాదం) www.freegurukul.org/g/AdiShankaracharya-29


అవధూత గీత www.freegurukul.org/g/AdiShankaracharya-30


భజించు మనసా(పాటలు) www.freegurukul.org/g/AdiShankaracharya-31


భజగోవిందం(వచన) www.freegurukul.org/g/AdiShankaracharya-32


ఆదిశంకరుల అమృత గుళికలు www.freegurukul.org/g/AdiShankaracharya-33


ఆదిశంకరుల స్తోత్రాలు www.freegurukul.org/g/AdiShankaracharya-34


ఆదిశంకరుల ప్రకరణాలు www.freegurukul.org/g/AdiShankaracharya-35


మణిరత్నమాల స్తోత్రం www.freegurukul.org/g/AdiShankaracharya-36


శ్రీ శాంకర సూక్తం www.freegurukul.org/g/AdiShankaracharya-37


అష్టావక్ర గీత www.freegurukul.org/g/AdiShankaracharya-38


కనకధార స్తవం www.freegurukul.org/g/AdiShankaracharya-39


ప్రభోద సుధాకరం www.freegurukul.org/g/AdiShankaracharya-40


శంకర విజయం(వచన) www.freegurukul.org/g/AdiShankaracharya-41


ప్రశ్నోత్తరి మణిమాల www.freegurukul.org/g/AdiShankaracharya-42


షట్పదీ స్తోత్రం www.freegurukul.org/g/AdiShankaracharya-43


దక్షిణామూర్తి స్తోత్రం-వివరణ www.freegurukul.org/g/AdiShankaracharya-44


దక్షిణామూర్తి స్తోత్రం www.freegurukul.org/g/AdiShankaracharya-45


దక్షిణామూర్తి స్తోత్రం(వచన) www.freegurukul.org/g/AdiShankaracharya-46


శంకర గ్రంధ రత్నావళి లలితా త్రిశతి భాష్యం www.freegurukul.org/g/AdiShankaracharya-47


గాయత్రి మంత్ర శంకర భాష్యము www.freegurukul.org/g/AdiShankaracharya-48


శ్రీమద్భగవద్గీత -శ్రీ శంకర భాష్యం యధాతదం www.freegurukul.org/g/AdiShankaracharya-49


🙏🌺💐🌸🌻🌼🪷🌹🌷🦚🦜🌞🌝

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦||¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


      𝕝𝕝 శ్లోకం 𝕝𝕝 


   *అంతామిథ్య తలంచిచూచిన నరుండట్లౌటెఱింగిన్‌ సదా*

   *కాంతల్పుత్రులు నర్థమున్‌ తనువు నిక్కంబంచు మోహార్ణవ*

   *భ్రాంతింజెంది చరించుఁగాని పరమార్థంబైన నీయందుఁ దాఁ*

   *జింతాకంతయుఁ జింతనిల్పఁడు గదా శ్రీకాళహస్తీశ్వరా!*


           *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 03*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ప్రపంచమంతా మిథ్య అని తెలిసి కూడా సంసారభవభందనములు వీడలేక కాంతాపుత్రనిజగృహ మోహమును విడిచి నీయందు ఒక చింత ఆకు సమమైన భక్తిని కూడా నిలపడు కదా ప్రభో కాళహస్తీశ్వరా*!

              

✍️🌹🌷💐🙏

సుభాషితమ్

 💎🌅 |¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


      𝕝𝕝 శ్లోకం 𝕝𝕝 


   *అంతామిథ్య తలంచిచూచిన నరుండట్లౌటెఱింగిన్‌ సదా*

   *కాంతల్పుత్రులు నర్థమున్‌ తనువు నిక్కంబంచు మోహార్ణవ*

   *భ్రాంతింజెంది చరించుఁగాని పరమార్థంబైన నీయందుఁ దాఁ*

   *జింతాకంతయుఁ జింతనిల్పఁడు గదా శ్రీకాళహస్తీశ్వరా!*


           *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 03*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ప్రపంచమంతా మిథ్య అని తెలిసి కూడా సంసారభవభందనములు వీడలేక కాంతాపుత్రనిజగృహ మోహమును విడిచి నీయందు ఒక చింత ఆకు సమమైన భక్తిని కూడా నిలపడు కదా ప్రభో కాళహస్తీశ్వరా*!

              

✍️🌹🌷💐🙏

దైత్యుని సేవ చేయుటకు

 *దైత్యుని సేవ చేయుటకు దైవగణమ్ములు సాగె నొక్కటై*

ఈ సమస్యకు నాపూరణ. 


*హిరణ్యకశిపుడు*

"భృత్యులు మీరు మాకిపుడు భిన్నము సేయుదు మీ శిరంబులన్


నిత్యము శిక్ష వేయుదును నీమము దప్పిన, దేవలోకమున్


స్వత్యము గాగ చిత్యమగు సాగును రాక్షస" మన్న బేలలై


దైత్యుని సేవ చేయుటకు దైవగణమ్ములు సాగె నొక్కటై.


(స్వత్యము =హక్కు

చిత్యము =సంస్కరింపదగిన) 


అల్వాల లక్ష్మణ మూర్తి.

మకరముc బట్టి చుంబనము

 *మకరముc బట్టి చుంబనము మాటికిc జేసెను ప్రేమ పొంగగన్*

 ఈ సమస్యకు నాపూరణ. 


పకపక నవ్వి దాగుకొను భార్యను కౌగిట జేర్చ కృష్ణుడున్


మకుటము పక్కనుంచి వనమాలను మూలన వేసి వేణువున్


ముకురము చెంత నిల్పి సతి మోమును ద్రిప్పుచు జూచి సత్యభా


మ కరముc బట్టి చుంబనము మాటికిc జేసెను ప్రేమ పొంగగన్.



అల్వాల లక్ష్మణ మూర్తి.

పూజలు 3*

 *దేవాలయాలు - పూజలు 3*


సభ్యులకు నమస్కారములు.


*పూర్వకాలంలో* దేవాలయ నిర్మాణంలో మొట్ట మొదటి అంశము భూమిని ఎన్నుకునుట. అధిక సంఖ్యలో దేవాలయాలు సాధారణంగా నదీ తీరారలో గాని, నీటి బుగ్గలు ఉన్న పర్వతాగ్రాల పైనగాని కట్టబడి ఉండడం వయోధికులందరికి తెలిసిన విషయమే. పుణ్య క్షేత్రాల సమీపంలో, నదీ తీరాన, సముద్ర మరియు నదీ సంగమ స్థానాలలో, పర్వతాగ్రాన, ఉద్యాన వనాలలో, రమ్య ప్రదేశాలలో మరియు సిద్ధుల ఆశ్రమ ప్రాంతాలలోనూ దేవాలయాల నిర్మాణ సంకల్పము జరుగుచుండేది.


ఈ క్రమంలో ఉన్న దేవాలయాలలో కొన్నిటిని *తీర్థాలు* మరియు *క్షేత్రాలు* అని చెప్పబడుచున్నాయి.

*తీర్థము* అను పదమునకు సామాన్య అర్థము...దేవాలయాలలో అర్చక స్వాములు భక్తులు పుచ్చుకునుటకు ఇచ్చు పవిత్ర జలము. *తీర్థము* కానీ తీర్థము యొక్క విశేషార్థము...*పుణ్య క్షేత్రము లేక దేవాలయము*...అందునా ఋషులు, మహర్షులు తపోస్నానమాచరించే *కోవెలలు* గల దేవాలయాలు. *క్షేత్రము* అను పదమునకు ఉన్న నానార్థములలో *నిద్ర చేయదగిన ప్రదేశము* అని తెలుపబడినది. క్షేత్ర ప్రాముఖ్యతను వివరంగా తెలుసుకుంటే...కొన్ని క్షేత్రాలు భక్తి ప్రధానము, మరికొన్ని ఇష్ట సంప్రాప్తి, కొన్ని కష్ట నివారణ మిగిలినవి తత్వ మరియు జ్ఞాన ప్రదము. మరికొన్ని దేవాలయాలు *స్వయంభూ దేవాలయాలు*

ఆయా అవతార పురుషులు తమ అవతార విశేషాలను తెలియజేస్తూ ప్రకటింప జేసుకొన్నవి... ఉదాహరణకు తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి.


దేవాలయ వ్యవస్థ సులభ గ్రాహ్యము కొరకు దేవాలయములను రెండు విభాగాలుగా పేర్కోనవచ్చును. 1) గ్రామ దేవతా గుడులు. 2) శిష్టాచార దేవాలయాలు.

 *1) గ్రామ దేవతా గుడులు* గ్రామ రక్షణకై తర తరాలుగా గ్రామ సంస్కృతిలో నిలదొక్కుకున్న మరియు పూజలందుకుంటున్న గుడులు. ఉదాహరణకు...ఎల్లమ్మ, గంగమ్మ, మారమ్మ, పోచమ్మ, మైసమ్మ, రేణుకమ్మ మొదలగునవి. ఈ దేవాలయాలన్నీ శక్తి (స్త్రీ) కేంద్రాలు. వాస్తు మరియు శిల్ప రహితంగా ఉన్నా ఈ గుడులు సుందరంగా ఉంటాయి. ఈ దేవాలయాలలోని పూజాదికాలలో షోడశోపచారాలు అంతగా ప్రతిబింబించవు. బ్రాహ్మణేతర జాతుల చేతకూడా పూజలందుకుంటున్నవి... ఉదాహరణకు ప్రఖ్యాత సమ్మక్క సారలమ్మ జాతరలాంటి వన దేవతలు.


*2) శిష్టాచార దేవాలయాలు*. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, విఘ్నేశ్వర, శ్రీ లక్ష్మీ, శ్రీ దుర్గా, శ్రీ సరస్వతి మరియు వారి దేవతా గణాల (తదితర) ఆలయాలు. ఈ ఆలయాలలో పూజలు ఆగమ శాస్త్రం నిర్దేశించిన విధంగా అనగా పంచోపచారాలు (5), షోడషోపచారాలు (16) మరియు చతుష్షష్టి (64) ఉపచారాలు జరుపబడుతూ ఉంటాయి. శిష్ట దేవాలయాలు వాస్తు శాస్త్ర అనుగుణంగా నిర్మించ బడుతాయి. దేవాలయాల వాస్తు ఆగమాల ఆధారంగా ఉంటాయి. ఆగమాలలో దేవాలయ నిర్మాణం, పూజా విధానాల మరియు ఉత్సవాల ప్రస్తావన ఉంటుంది. *కామిక కారణ ఆగమాలలో* దేవాలయ నిర్వహణా నియమ నిబంధనలు చెప్ప బడినవి. 


*మాన్యులకు విజ్ఞప్తి*

*దేవాలయము - పూజలు* అను విషయముపై ధారావాహిక రచనా నిర్మాణము బహు సున్నితము, విస్తృతమే గాకుండా క్రమానుసారమైన, ప్రామాణిక, సుస్థాపిత విశేష్య అంశము గనుక, ఈ గ్రూప్ లోని మాన్యులు... ఈ రచనలలో అన్యమైన, అసంగత, అసంబద్ధ, అప్రస్తుత, అనంగీకార ప్రస్తావనలు ఉంటే తెలుపగలరు, సరిదిద్దగలరు.

🙏🙏


ధన్యవాదములు.

*(సశేషము)*

పుణ్యకార్యాలే చేయాలి...

 🎻🌹🙏 జై శ్రీ రామ్ పుణ్యకార్యాలే చేయాలి.....!!




🌿పాప, పుణ్యాల అనుభవం ఎంత కాలం,

మానవజన్మ ఎలా పుడుతుంది అన్నది ప్రశ్న అయితే....


🌸స్త్రీ, పురుషుల సంయోగమే.. మానవ జన్మకు మూలకారణం... అన్నది జవాబు.


🌿అది భౌతిక పరమైన జవాబే కానీ., సరైన జవాబు అది కాదు.

మరి ఏది సరైన జవాబు


🌸చేసుకున్న పాప, పుణ్యాల అనుభవం కోసమే ఈ జన్మ అనునది ఆధ్యాత్మికమైన జవాబు.


🌿అయితే... ఎంతకాలం ఈ అనుభవం అనేదీ ప్రశ్నే. దానికీ జవాబు ఉంది.


🌸చేసిన పాప, పుణ్యాల గురించి ఈ లోకంలో తలచుకున్నంత కాలం... ఆ పాప, పుణ్య ఫలాన్ని అనుభవించ వలసిందే.


🌿ఇదేం తీర్పు... దీనికేదైనా నిదర్శనముందా...అనే సందేహం కలగచ్చు.


🌸ఏ సందేహానికైనా సరైన జవాబు చెప్పే సామర్థ్యం మన రామాయణ, భారత, భాగవతాలకే ఉంది. దీనికి సంబంధించిన కథ ఒకటి మహాభారతంలో ఉంది.


🌹ఆ కథ ఏమిటంటే....🌹


🌿కృతయుగకాలంలో., ఇంద్రద్యుమ్నుడు అనే చక్రవర్తి ఈ భూలోకాన్ని ధర్మబధ్ధంగా, ప్రజారంజకంగా పరిపాలిస్తూండేవాడు. 


🌸ఆయన గొప్ప దాత. దశమహాదానాలే కాక షోడశమహాదానాలు విరివిగా చేసాడు. అంతేకాక ఎన్నో పుణ్యకార్యాలు కూడా చేసాడు. 


🌿ఇంద్రద్యుమ్నుడు చేసిన పుణ్యకార్యాల వల్ల, అతను మరణించాక., దేవదూతలు వచ్చి అతన్ని సరాసరి స్వర్గలోకం తీసుకెళ్లారు.


🌸 ఇంద్రద్యుమ్నుడు స్వర్గంలో సుఖభోగాలు అనుభవిస్తూ... ఆనందిస్తున్నాడు. అలా ఎంతకాలం అయిందో అతనికే తెలియదు.


🌿ఒకరోజు ఇంద్రద్యుమ్నుని దగ్గరకు దేవదూతలు వచ్చి, ‘నీవు చేసుకున్న పుణ్యఫలం అయిపోయింది. నీవు స్వర్గంలో ఉండే అర్హత లేదు. భూలోకానికి వెళ్లిపో’ అన్నారు.


🌸‘అదేమిటి.. నా పుణ్యఫలం అప్పుడే తీరిపోవడమేమిటి... ఇంకా చాలా ఉంది’ అన్నాడు ఇంద్రద్యుమ్నుడు.


🌿‘నిరూపిస్తావా’ అని అడిగారు దేవదూతలు.


🌸‘నిరూపిస్తాను.. నన్ను భూలోకం తీసుకొని వెళ్లండి’ అన్నాడు ఇంద్రద్యుమ్నుడు.


🌿దేవదూతలు అతన్ని భూలోకం తీసుకు వచ్చారు.


🌸ఇంద్రద్యుమ్నునకు భూలోకం చాలా కొత్తగా కనిపించింది. అతనికి తెలిసున్న వారెవరూ కనిపించలేదు. ఆ కాలంలో భూలోకవాసులందరిలోకి అతివృద్ధుడు 🙏మార్కండేయుడు ఒక్కడే అని తెలిసి.....


🌿దేవదూతలతో అతని దగ్గరకు వెళ్లి ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు.

‘మీరెవరో నాకు తెలియదు. 


🌸10 అయితే నాకన్న వృద్ధుడు ‘ప్రావారకర్ణుడు’ అనే గుడ్లగూబ ఉంది. వెళ్లి దాన్ని అడుగుదాం రండి ’ అన్నాడు మార్కండేయుడు.


🌿అందరూ కలిసి ఆ గుడ్లగూబ దగ్గరకు వచ్చారు.

‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. ‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు ‘నాళీజంఘుడు’ అనే కొంగ ఉంది. వెళ్లి దాన్ని అడుగుదాం రండి ’ అన్నాడు ప్రావారకర్ణుడు.


🌸అందరూ కలిసి ఆ ఆ కొంగ దగ్గరకు వచ్చారు

‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు.


🌿‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు ‘ఆకూపారుడు’ అనే తాబేలు ఉంది. వెళ్లి దాన్ని అడుగుదాం రండి ’ అన్నాడు నాళీజంఘుడు.


🌸అందరూ కలిసి ఆ తాబేలు దగ్గరకు వచ్చారు. ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు.


‘🌿మీరెవరో నాకు బాగా తెలుసు. మిమ్మల్ని నేనెలా మర్చిపోతాను.., మీరు ఇంద్రద్యుమ్న చక్రవర్తి. మీరు ఎన్నో యఙ్ఞాలు చేసారు. 


🌸నన్ను ఎన్నోసార్లు కాపాడారు. దానాలు చెయ్యడంలోనూ మీరు చక్రవర్తే. 

ఆ కాలంలో మీరు చేసిన గోదానాలు అనంతం. దానగ్రహీతలైన బ్రాహ్మణులు ఆ గోవులను తోలుకుంటూ వెడుతూంటే.. 


🌿ఆ గోవుల కాలి గిట్టల తొక్కుడు చేతనేకదా ఈ కొలను ఏర్పడింది. అందుకే ఈ కొలనుకు ‘ఇంద్రద్యుమ్నము’ అని నీ పేరే పెట్టారు ప్రజలు. 

🌸

నా సంతతి వారంతా ఈ కొలనులోనే ఇప్పటికీ..నివసిస్తున్నారు’ అన్నాడు ఆకూపారుడు.


🌿దేవదూతలు ఆ సమాధానంతో తృప్తిచెంది.. ఇంద్రద్యుమ్నుని తిరిగి స్వర్గానికి తీసుకుని వెళ్లారు. ఇదీ కథ.


🌸కనుక కలకాలం అందరూ చెప్పుకునే విధంగా పుణ్యకార్యాలే చెయ్యాలి... జై శ్రీ రామ్ కంచర్ల వెంకట రమణ

నాది నేను అనేవి రెండు

 నేటి మంచి మాట 8/8/24

1) నాది నేను అనేవి రెండు. ఇవే దుఃఖానికి కారణం,అనే సత్యాన్ని గ్రహిస్తే చాలు.

2) మందులు మానవ జీవితాన్ని పొడిగించవచ్చునేమో గాని మరణం మాత్రం పేరుమోసిన వైద్యులును కూడా వదలదు.

3) అవధి చూపించే వాడు గురువు,అవరోధాలను దాటేవాడు శిష్యుడు,అధిగమించే దశలో కష్టమంతా శిష్యునిదే అయితే కరుణ అంతా గురువుది.

చీకటి వెలుగులు ప్రకృతిని ఎలా.వదలవో అలాగే కష్ట సుఖాలు,మనం చేసుకున్న కర్మలు మనల్ని వదలవు.

4) దేముడు మనకి విజయాలు ఇవ్వడు,వాటికి కావలసిన శక్తిని మాత్రమే ఇస్తాడు,వాటిని సరైన మార్గంలో సద్వినియోగం చేసుకోవాలి.

5) The only difference between A Good And Bad day is our ATTITUDE. So change Our ATTITUDE.

అందరికీ నమస్కరిస్తూ శుభోదయం.

విధివశాత్తు ప్రాప్తించిన దానితోనే

 *విధివశాత్తు ప్రాప్తించిన దానితోనే సంతృప్తి చెందండి*


కోరికలు బాధల ఫలమని గ్రహిస్తే విచక్షణ ఒక్కటే మార్గం.   అందుచేత, నిరుపేదలు కూడా  వస్తువులను, భోగాలను కోరుకోకూడదు.  వారు తనకు లభించిన దానితో,లేదా ఉన్నదానితో సంతృప్తి చెందాలి అంటారు భగవత్పాదులు.  

 *విధివశాత్ ప్రాప్తేన సంతుష్ట్యo*  

(విదివశాత్తు నుండి పొందిన

 దానితో సంతృప్తి చెందండి) 

 అని ఆయన చెప్పారు.  విధి కనుక ఉంటే, ఏది కావాలంటే అది మనకు లభిస్తుంది.   విధి యొక్క శక్తి అలాంటిది. మనం నిర్జన ప్రదేశంలో ఉన్నా కూడా అదే జరుగుతుంది. 

 *ద్వీపాదన్యస్మాధాభి మధ్యాదభి జలనిధర్తిసోప్యన్త I* 

 *అనేయా జడితి కడయతి విదిరభిమదమపిముమకీభూత:   II* 

 "కోరుకున్న రెండు కోరికలు ఒకేసారి నెర వేరాలని అనుకుంటే, అవి వేర్వేరు ద్వీపాల నుండి, సముద్రం యొక్క కడుపులో లేదా చాలా దూరంలో ఉన్నప్పటికీ, విధి వాటిని ఒకచోట చేర్చుతుంది." 

కాబట్టి మనం కోరికలకు ఆస్కారం ఇవ్వకుండా భగవత్ స్తోత్రాల పవిత్ర బోధనలను అనుసరించి జీవిత లక్ష్యాన్ని సాధించాలి. అప్పుడే విధి ని అధిగమించి భగవంతుని కృప కలుగుతుంది.అదే గొప్ప తృప్తిని, సంతృప్తిని ఇస్తుంది.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ  భారతీతీర్ధ మహాస్వామి వారు*

పంచాంగం 07.08.2024

 ఈ రోజు పంచాంగం 07.08.2024 Wednesday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం వర్ష  ఋతు శ్రావణ మాస శుక్ల పక్ష తృతీయా తిధి సౌమ్య వాసర: పూర్వఫల్గుని నక్షత్రం పరిఘ యోగ: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.


త దియ రాత్రి 10:07 వరకు.

పూర్వఫల్గుని రాత్రి 08:31 వరకు.


సూర్యోదయం : 06:01

సూర్యాస్తమయం : 06:43


వర్జ్యం : ఈ రోజు లేదు .


దుర్ముహూర్తం : మధ్యాహ్నం 11:57 నుండి 12:47 వరకు.


అమృతఘడియలు : మధ్యాహ్నం 01:23 నుండి 03:10 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.



శుభోదయ:, నమస్కార: