ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
19, అక్టోబర్ 2023, గురువారం
రామాయణం లో
*రామాయణం లో అత్యంత ముఖ్యమయిన/ విశిష్టమయిన శ్లోకం ఏది?*
➖➖➖✍️
```
ఒకసారి విక్రమాదిత్య అనే రాజుకు తన సభలో ఉన్న "నవరత్నాలలో" ఎవరు ఉత్తమ పండితులో తెలుసుకోవాలని అనిపించింది.
రాజ్యసభలో ఉన్న పండితులు అందరినీ పిలిచి "రామాయణం" లో ఉన్న శ్లోకాలలో అత్యంత ముఖ్యమైన శ్లోకం ఏది అయి ఉంటుంది అని ప్రశ్నించారు.
ఆ శ్లోకం గురించి చెప్పిన వారికి 1000 బంగారపు నాణేలు ఇస్తాము అని కూడా ప్రకటించారు.
ఈ శ్లోకాన్ని రామాయణంలో నుంచి వెతికి పట్టుకోవడానికి పండితులకు విక్రమాదిత్యుడు 40 రోజుల గడువు ఇచ్చాడు.
విక్రమాదిత్యుని రాజ్యసభలో "వరరుచి" అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి ఆ వెయ్యి బంగారు నాణాలు ఎలాగైనా సంపాదించాలి అని కోరిక కలిగింది.
అప్పుడు ఆ వరరుచి దేశాటనకు బయలుదేరి అనేక రాజ్యాలు తిరుగుతూ రామాయణం లో ఉన్న ముఖ్యమైన శ్లోకం ఏది అని అందరు పండితులను అడగటం మొదలు పెట్టాడు.
అయితే అతనికి రామాయణం లో ఉన్న అన్ని శ్లోకాలలో ఒకే ఒక్క శ్లోకాన్ని ఉత్తమమైనది అని చెప్పటం సాధ్యం కాదు అన్న సమాధానమే దొరికింది.
40 రోజులలో చివరి రోజు అతను తన రాజ్యానికి తిరిగి వస్తూ అలసిపోయి ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నాడు.
నిద్రపోతున్న సమయంలో ఆ చెట్టు మీదకు ఇద్దరు వనదేవతలు వచ్చి సంభాషించుకుంటూ ఉన్నారు.
వారిలో ఒక వనదేవత మాట్లాడుతూ మాటల్లో రామాయణంలో ప్రముఖమయిన శ్లోకం "మాం విద్ధి... అని చెప్పింది.
ఆ సంభాషణ విన్న వరరుచికి ఎంతో ఆనందం కలిగింది.
అతను వెంటనే విక్రమాదిత్య రాజ్యసభకు వెళ్లి ఆ ముఖ్యమయిన శ్లోకం ఏదో చెప్పాడు.
*ఆ శ్లోకం ఇది...```
రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్
అయోధ్యామటవీం విద్ధి గచ్ఛ తాత యథాసుఖమ్
```ఆ శ్లోకాన్ని విన్న విక్రమాదిత్యుడు.. ఆ శ్లోకానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? అని అడిగాడు.
అతను చెప్పిన 18 రకాలయిన అర్ధాలను విన్న విక్రమాదిత్యుడు రామాయణంలో ఇదే ఉత్తమమైన శ్లోకం గా భావించి అతనికి 1000 బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు.```
ఈ శ్లోకంలో ఉన్న అర్ధం ఏమిటి? ఎందుకు ఈ శ్లోకం అంత ముఖ్యమయినదిగా చెప్పారు?```
ఈ శ్లోకం వాల్మీకి రామాయణంలో అరణ్యకాండలో 40వ సర్గలో వస్తుంది...
రాముడు అరణ్యాలకి వెళ్తున్నాడు అని తెలిసి లక్ష్మణుడు తను కూడా అరణ్యాలకు బయలుదేరుతూ, తన తల్లి "సుమిత్ర" ఆశీర్వాదం కోరినప్పుడు సుమిత్ర లక్ష్మణుడికి చెప్పిన సమాధానం ఈ శ్లోకం...
ఈ శ్లోకానికి ఉన్న అనేక అర్థాలలో కొన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం...```
రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్.
అయోధ్యామటవీం విధ్ది గచ్ఛ తాత! యథాసుఖమ్৷৷
*మొదటి అర్ధం:```
రామ= రాముడు: దశరథం=దశరథుడు:
విద్ధి=అనుకో: మామ్= నేనే; జనకాత్మజ= జనకుని కూతురు;
విద్ధి= అనుకో; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర;
యథా సుఖమ్=సుఖంగా```
లక్ష్మణా! రాముడే దశరథుడు అనుకో, సీతనే నేను(సుమిత్ర) అనుకో, అడవినే అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళిరా!
*రెండవ అర్ధం:```
రామ= రాముడు: (దశ = పక్షి రథం=రధం) దశరథం= పక్షిని రధంగా కలిగిన వాడు, విష్ణువు ; మామ్= లక్ష్మీదేవి; జనకాత్మజ= జనకుని కూతురు; అయోధ్యా= శతృదుర్భేద్యమయినది(వైకుంఠం); మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్=సుఖంగా.```
ఓ పుత్రా! ఈ రాముడే శ్రీమహావిష్ణువు, సీతే శ్రీ మహాలక్ష్మి, వారిద్దరూ ఎక్కడ ఉంటే అదే వైకుంఠం అనుకుని సుఖంగా వెళ్లి రా!
*మూడవ అర్ధం:```
రామ= రాముడు: దశరథం=దశరథుడు: విద్ధి=వలెనే: మామ్=నీ తల్లి (కైకను ఉద్దేశించి ); జనకాత్మజ= జనకుని కూతురు; విద్ధి= వలెనే; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=వలెనే; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్= వీలయినంత సుఖంగా```
ఓ పుత్రా! నీ తండ్రి దశరధుడు భార్యమాటని విని, అత్యంత అమూల్యమయిన రాముని సాంగత్యం పోగొట్టుకుని ఎలా దుఃఖిస్తాడో, సీత మాట విని రాముడు కూడా అతనికి అమూల్యమయిన సీతను చేజార్చుకుని దుఃఖాన్ని పొందుతాడు.
రాముడు లేక అయోధ్య ఎలా శోకిస్తుందో అలాగే అరణ్యం కూడా సీత జాడ లేక శోకిస్తుంది.
కనుక వీలయినంత దైర్యం చెప్తూ రాముని చెంత నీవు ఉండు.✍️
ఈ దేశం ఎంత గొప్పది, ఇక్కడ ఋషులు ఎంత గొప్ప వారో వారు!
వారసత్వంగా మనకు అందించిన….
ఆ అమూల్య రత్నాలు ఎంత విలువైనవో గదా.✍️```
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
తిరుమలేశునికి పవళింపు సేవ.
🎻🌹🙏తిరుమలేశునికి పవళింపు సేవ....
(Tirumala Pavalimpu Seva)
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸తిరుమలలో శ్రీ వేంకటేశ్వరునికి జరిగే సేవల్లో చివరి సేవ పవళింపు సేవ. ప్రతిరోజూ అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో ఆలయాన్ని మూసే ముందు స్వామివారికి పవళింపు సేవ నిర్వహిస్తారు.
🌿ఈ పవళింపు సేవనే ఏకాంత సేవ అంటారు. రాత్రి రెండు గంటల వేళ తిరుమల శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని మూస్తారు.
🌸ముఖ మంటపంలో వెండి గొలుసు లతోఏర్పాటుచేసినబంగారుఊయలలో భోగ శ్రీనివాస మూర్తిని శయనిం పచేసి పాలు, పళ్ళు, బాదంపప్పు లను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
🌿మూలవిరాట్టు పాదపద్మాలకు ఉన్న కవచాన్ని తొలగించి, చందనం రాస్తారు.
🌸తిరుమలలో ప్రతిరోజూ రాత్రివేళల్లో బ్రహ్మదేవుడు వచ్చి వేంకటేశ్వరుని అర్చిస్తాడని పూరాణ కథనాలు ఉన్నాయి. అందుకే, వేంకటేశ్వర స్వామి వారిని దర్శించేందుకు విచ్చేసే బ్రహ్మదేవుని
🌿కోసం వెండి పాత్రల్లో నీటిని సిద్ధంగా ఉంచుతారు. పవళింపు సేవలో తాళ్ళపాక అన్నమయ్య సంకీర్తనలతో వేంకటేశ్వరుని నిద్రపుచ్చుతారు.
🌸సంవత్సరంలో పదకొండు నెలల పాటు ఏకాంతసేవ భోగశ్రీనివాసునికి జరుపుతారు. ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణునికి చేస్తారు.
🌿రాత్రి రెండు గంటల వేళ స్వామివారికి పవళింపు సేవ ముగిసిన తర్వాత ముందుగా మూడో ద్వారాన్ని మూస్తారు. ఆ తర్వాత బంగారు వాకిలి మూసి లోపలి గడియలు వేస్తారు.
🌸ఆలయ అధికారులు బయటి వైపు తాళాలు వేసి వాటిమీద సీలు వేస్తారు. తిరుమల ఆలయం మూసి ఉంచే సమయం చాలా తక్కువ. మరి కొద్దిసేపటికే ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి.
🌿అయినప్పటికీ తాళం వేయడం, దానికి సీలు కూడా వేయడం అనే సంప్రదాయం సనాతన ఆచారంగా ఇప్పటికీ కొనసాగుతోంది..🚩🌞🙏🌹🎻
🌹🙏ఓం నమో వెంకటేశాయ🙏🌹
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
మహాభారతములో - ఆది పర్వము* *తృతీయాశ్వాసము* *28*
*మహాభారతములో - ఆది పర్వము*
*తృతీయాశ్వాసము*
*28*
*కచ దేవయానుల వృత్తాంతం*
వృషపర్వుడు అనే రాక్షస రాజుకు శుక్రాచార్యుడు గురువుగా ఉన్నాడు. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని. శుక్రాచార్యునికి మృతసంజీవిని తెలుసు. ఆ విద్యతో దేవాసుర యుద్ధంలో మరణించిన రాక్షసులను బ్రతికిస్తూ వచ్చాడు. అందు వలన రాక్షసబలం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. దేవతలు దేవగురువు కుమారుడైన కచుని వద్దకు వెళ్ళి అతనితో శుకృని వద్దకు వెళ్ళి అతని కుమార్తె దేవయాని అభిమానం సంపాదించి ఆమె ద్వారా మృతసంజీవని విద్య తెలుసుకు రమ్మని లేనియడల రాక్షసులను జయించుట కష్టమని అడిగారు. శుకృనికి దేవయాని మీద అత్యంత ప్రేమ కనుక ఇది సాధ్యం కాగలదని చెప్పారు. కచుడు సమ్మతించి శుకృని వద్దకు వెళ్ళి బృహస్పతి కుమారునిగా తనను తాను పరిచయం చేసుకుని శిష్యుడుగా చేరాడు. క్రమంగా కచుడు దేవయాని శుకృల అభిమానం చూరకొన్నాడు. అది మిగిలిన రాక్షస శిష్యులకు నచ్చక అతనిని అనేక యాతనలకు గురిచేసి చివరకు అతనిని చంపి బూడిద చేసి శుకృనికి మధ్యంలో కలిపి ఇచ్చారు. దేవయాని ద్వారా అది తెలుసుకున్న శుకృడు ఆమె దిగులు పోగొట్టటానికి తన కడుపులోని కచునకు మృతసంజీవిని నేర్పాడు. కచుడు ఆవిద్యతో బయటకు వచ్చి తిరిగి శుకృని బ్రతికించాడు. కొంత కాలానికి కచుడు శుకృని వద్ద శెలవు తీసుకుని తన లోకానికి పోయే సమయంలో దేవయాని అడ్డు వచ్చి అతనిని పోవద్దని తనను వివాహ మాడమని బ్రతిమాలింది. కచుడు గురుపుత్రి సోదరితో సమానం కనుక వివాహం పొసగదని చెప్పాడు. అందుకు కోపించిన దేవయాని తన దయతో సంపాదించిన మృతసంజీవని అతనికి పనిచేయకూడదని శపించింది. కచుడు అది తనకు ఉపయోగించక పోయినా తన వద్ద ఉపదేశం పొందిన వారికి పని చేస్తుందని చెప్పి, తనకు కలిగిన శాపానికి ప్రతి శాపంగా దేవయానిని క్షత్రియుడు పెళ్ళాడతాడని చెప్పి తన లోకానికి వెళ్ళాడు.
శ్రీ దేవీ భాగవతం
శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
భోగః కాలవశాదేతి తత్రైవ ప్రతియాతి చ |
నాత్ర శోకస్తు కర్తవ్యో నిష్షలే భవవర్మ్తని
వైకత్ర సుఖసంయోగో దుఃఖియోగస్తు వైకతః ।
ఘటికాయంత్రవత్కామం భ్రమణం సుఖదుఃఖియోః||
మహారాజా! క్షణభంగురమే అయినా మానవజన్మ కడుంగడు దుర్లభం. అది లభించినవారికి
ఎప్పుడైనా ఏకైక కర్తవ్యం ఆత్మసాధన మాత్రమే. ఇంద్రియాలూ అవయవాలూ అన్నీ పశువులకు
ఉంటాయి. మానవదేహానికి అధికంగా ఉన్నది ఒకే ఒక్కటి జ్ఞానం. అంచేత జ్ఞానివై ఈ శోకాన్ని త్యజించు.
ఇదంతా ఒక మహామాయ అని గ్రహించు. ఆదిపరాశక్తి ఈ మాయతో అఖిలజగత్తునూ అన్ని కాలాలలోనూ
నమ్మోహపరుస్తోందని తెలుసుకో. వెళ్ళు. ఇంటికి వెళ్ళి హాయిగా రాజ్యం ఏలుకో.
శ్రీహరి చేసిన ఉపదేశంతో తాళధ్వజుడు తేరుకున్నాడు. సాష్టాంగనమస్కారం చేశాడు. సరోవరంలో
స్నానం చేసి, రణరంగంలో మరణించిన పుత్రపౌత్రమిత్రబంధుగణానికి నువ్వులూ నీళ్ళూ విడిచిపెట్టిరాజధానికి వెళ్ళిపోయాడు. బతికిబట్టగట్టిన ఒక మనుమడికి రాజ్యం అప్పగించేసి తత్త్వజ్ఞానియై
తపస్సుకోసం అడవులకు వెళ్ళిపోయాడు.
• శ్రీహరి చెప్పిన మాయావిలాసం
శ్రీమన్నారాయణుడు నావైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్నాడు. రెండు చేతులూ జోడించి
నమస్కరించాను. జగన్నాథా! చాలా అందంగా వంచించావు నన్ను. సంతోషం. మాయాబలం ఎంతటిదో
దాని మహత్తు ఏమిటో బాగా తెలిసివచ్చేట్టు చేశావు. స్త్రీరూపం పొందినప్పటి నా అనుభవాలన్నీ
జ్ఞాపకంలోనే ఉన్నాయి. అవునూ! ఈ సరోవరంలోనేగదా అలనాడు మునిగాను. మునగడంతోనే స్త్రీగా
మారిపోయాను. పూర్వవిజ్ఞానమంతా చిటుక్కున మాయమయ్యింది. అదెలా జరిగిందో అంతుబట్టడం
లేదు. స్త్రీరూపాన్ని పొంది సంసారసమ్మోహంలో మునిగిపోయాను. అనురూపభర్తను పొందాను. శచీ
పురందరుల్లా రాజభోగాలు అనుభవించాము. ఇప్పుడు మళ్ళీ అదే మనస్సు. అదే చిత్తం. అదే పురాతన
పురుష శరీరం. స్త్రీగా మారినప్పుడు పురుషజ్ఞానం ఎందుకు పోయింది? పురుషుడిగా మారిన ఇప్పుడు
రూప పరిజ్ఞానం ఎలా మిగిలింది? ఇది చాలా వింతగా ఉంది. అప్పటి జ్ఞాననాశానికి కారణం ఏమిటో
మహానుభావుడవు నువ్వే చెప్పాలి. స్త్రీరూపంలో రకరకాల భోగాలు అనుభవించాను. సురాపానం చేశాను.
అభక్ష్య భక్షణం అకాల భోజనం ఇత్యాదులన్నీ చేశాను. నేను నారదుడిని అనే స్పృహయే లేకపోయింది.
జరిగినదంతా ఇప్పటిలా అప్పుడు జ్ఞాపకం లేకపోయింది. కారణమేమిటో రవ్వంత వివరించు మహాప్రభో!
బతుకమ్మ పండుగ
https://youtu.be/EKkOcJxZmwY?si=jPF7bTXvm3mVyP5o
శ్రీభారత్ వీక్షకులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 🌹 బతుకమ్మ పండుగ అంటేనే పూల పండుగ. మహిళా శక్తి నిండుగా కనిపించే పండుగ. తెలంగాణ, ఏపీలోనే కాదు.. అమెరికాలో ఈ పండుగను అద్భుతంగా జరుపుకుంటున్నారు అక్కడి తెలుగు వారు. అక్కడి ప్రతి తెలుగిల్లు ఓ తంగేడు పూల వనమే. అమెరికాలో ఎంతో ఉత్సాహంతో జరుగుతున్న వేడుకల గురించి కళ్లకు కట్టినట్లు చెబుతున్నారు అక్కడే ఉన్న ప్రముఖ రచయిత్రి డా. కొండపల్లి నీహారిణి గారు. ఆ విశేషాలు వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
అవధూత చరిత్ర..*
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...(మొదటి రోజు)*
*ఇది ఒక అవధూత చరిత్ర..*
*ఇది ఒక సాధకుడి జీవనయానం!..*
1970 వ సంవత్సరం...
ఒకప్పటి ప్రకాశం జిల్లా.. నేటి నెల్లూరు జిల్లా లో వున్న వలేటి వారి పాలెం మండలం లో గల మాలకొండ గా పిలువబడుతున్న మాల్యాద్రి ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం..శ్రీ లక్ష్మీనారసింహుడు స్వయంభువు గా వెలసిన స్థలమది.. వారం లో ఒక్క శనివారం నాడు మాత్రమే, శ్రీ స్వామి వారికి అర్చనలు జరుగుతాయి..మిగిలిన ఆరు రోజులూ ఆ దేవాలయం మూసివేసి ఉంటుంది..కొన్ని శతాబ్దాల నుంచి ఉన్న ఆచారమది..ఆరు రోజుల పాటు ఆ లక్ష్మీ నారసింహుడు ఋషులు, దేవతలచే పూజింపబడుతాడనీ.. ఒక్క శనివారం నాడు మాత్రం మానవ పూజ కు అర్హత ఉందనీ స్థల పురాణం..అక్కడి స్వామి వారిని "శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి " గా పిలుస్తారు..కొలుస్తారు..
ఆ మాలకొండ కు దక్షిణ దిశగా ఉన్న మొగలిచెర్ల వాస్తవ్యులు శ్రీ పవని శ్రీధరరావు, నిర్మల ప్రభావతి దంపతులు..మొగలిచెర్ల లో వున్నవే నాలుగు బ్రాహ్మణ కుటుంబాలు..అందులో వీరి కుటుంబం ఒకటి..మొగలిచెర్ల గ్రామం లో నే కాకుండా చుట్టుప్రక్కల కూడా వీరి కుటుంబానికి మంచి పేరు ఉంది..
మాలకొండ దేవస్థానానికి శ్రీ శ్రీధరరావు గారు ట్రస్టు బోర్డ్ అధ్యక్షుడిగా వుండేవారు..అదీకాక, ఆ దంపతులు మాల్యాద్రి లక్ష్మీ నారసింహుడికి భక్తులు..పవని నిర్మల ప్రభావతి గారు ఆసరికే తెలుగులో రచయిత్రి గా పేరు తెచ్చుకుని వున్నారు..ప్రతి శనివారం ఆ దంపతులు క్రమం తప్పకుండా మాలకొండ కు వెళ్లి, ఆ స్వామిని దర్శించి వచ్చేవారు..మొగలిచెర్ల నుంచి, రెండెద్దుల తో కట్టబడిన గూడు బండిలో..తమతో పాటు మరో పదిమందికి ఆహారం ఇంటినుంచే తయారుచేసుకుని మాలకొండకు తీసుకు వెళ్లేవారు..మాలకొండ పైకి వెళ్ళడానికి ఆరోజుల్లో రోడ్డు సౌకర్యం లేదు..అందువల్ల, కొండ క్రిందనే తమ బండిని ఉంచి, దంపతులిద్దరూ మెట్ల మార్గం గుండా పైకి నడచి వెళ్లి, మళ్లీ సాయంత్రం కొండదిగి, తిరిగి ఇంటికొచ్చేవారు..
శ్రీధరరావు గారు, మాలకొండ పైకి వెళ్ళడానికి రోడ్డు కొరకు అధికారులతో మాట్లాడి ఎటువైపునుంచి కొండమీదకు రోడ్డువేస్తే సౌకర్యంగా ఉంటుందో నని సర్వే చేయించే పనిలో, ఇతర రోజుల్లో మాలకొండకు వెళ్లసాగారు..
డిసెంబర్ నెలలో ఒకరోజు...శ్రీధర రావు గారు మాలకొండ వెళ్లి, ఆ కొండలోనే కొద్దిగా దిగువున ఉత్తరంగా ఉన్న పార్వతీదేవి అమ్మవారి ఆలయం వద్దకు వెళ్లారు..పార్వతీ దేవి ఆలయానికి ఇంకొంచెం పైన కొండలోనే మలచబడ్డ శివాలయం నుంచి, మెల్లిగా దిగుతూ వస్తున్న ఒక దిగంబర యువకుడిని చూసారు..జన సంచారం లేని ఈ కొండమీద ఈ దిగంబర యువకుడెవరు?..శ్రీధరరావు గారికి సందేహం కలిగింది..ఇంతలో ఆ యువకుడు పార్వతీదేవి అమ్మవారి ఆలయం లోకి వెళ్ళిపోయి తలుపువేసేసుకున్నాడు..
శ్రీధరరావు గారికి కుతూహలం రెట్టింపు అయింది..కొండదిగి, అక్కడ వున్న స్థానికులను "మీరెప్పుడైనా అమ్మవారి ఆలయం దగ్గర దిగంబరంగా ఉన్న వ్యక్తిని చూసారా?" అని అడిగారు..ఈ మధ్య తాము కొండమీదకు వెళ్ళినప్పుడు అతను కనబడ్డాడనీ..తపస్సు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడని..పార్వతీదేవి అమ్మవారి ఆలయాన్ని తనకు నివాసంగా మార్చుకున్నాడనీ తెలిపారు..
"నిజంగా తపస్సు కోసమే ఇక్కడకు వచ్చాడా?..లేదా మరేదైనా ఆశించి ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నాడా?.." ఆ నిమిషంలో శ్రీధరరావు గారికొచ్చిన సందేహాలు..ఒక్కక్షణం కూడా ఆలస్యం లేకుండా శ్రీధరరావు గారు తిరిగి పార్వతీదేవి ఆలయం వద్దకు వెళ్లారు..తలుపు మూసి ఉంది..అక్కడే అరుగు మీద కూర్చున్నారు..పది, పదిహేను నిమిషాలు గడిచాయి..
తలుపుతీసుకుని, ఆ యువకుడు బైటకు వచ్చాడు..శ్రీధర రావు గారికి అప్పటిదాకా వేధిస్తున్న ఒక్క సందేహమూ మనసులో గుర్తులేదు..ఏమి అడగాలని అనుకున్నారో ఒక్క ప్రశ్న కూడా నోటినుంచి బైటకు రావడం లేదు..తానొక దిగంబర యువకుడి ఎదురుగా నిలుచున్నాననే స్పృహ కూడా లేదు..ఏదో మాయ!..ఏదో వింత అనుభూతి..ఇదీ అని చెప్పలేని మానసిక స్థితి..అలా మాన్ప్రడిపోయి నిలుచున్నారు..ఆ యువకుడు ఒక్క మాటా మాట్లాడలేదు..ప్రశాంతమైన చిరునవ్వుతో చూస్తున్నాడు..కొద్దిసేపటికి శ్రీధరరావు గారికి పరిసరాలు తెలిసివచ్చాయి.."మీరూ..." అని మాత్రం అనగలిగారు..
చేయెత్తి, ఒక్క క్షణం ఆగమన్నట్టు సైగచేసాడా యువకుడు..అమ్మవారి ఆలయం లోకి వెళ్లి ఒక చిన్న కాగితము, పెన్నూ తీసుకొని వచ్చి, "నేను ప్రస్తుతం మౌనం లో వున్నాను..సంక్రాంతి తరువాత మాట్లాడతాను.." అని వ్రాసి ఇచ్చాడు..శ్రీధరరావు గారు నమస్కారం చేసారు.. అదే చిరునవ్వు!..అదే ప్రశాంతత!..కొద్దిసేపు అక్కడే నిలుచుండి.. ఇక తాను వెళ్ళొస్తానన్నట్లు గా తలా ఊపి.. అమ్మవారి ఆలయంలోకి వెళ్ళిపోయాడు..శ్రీధరరావు గారు కొండ దిగి..రెండెడ్ల బండిలో తిరిగి మొగలిచెర్ల కు ప్రయాణమయ్యారు..
శ్రీధర రావు దంపతుల తో మాట్లాడటం..రేపు..
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..సెల్..94402 66380 & 99089 73699).
శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీస్తుతి
శ్రీమాత్రేనమః
*శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీస్తుతి*
ది:19-10-2023
శా॥
పాతాళమ్మున ద్రోసినన్ నను మహాపాపాత్ముడం చానకన్
రీతిన్ రాజ్యము సర్వసంపదల భూరింగూర్చి పెంపిచ్చినన్
నీ తీరెట్లగుగాత! త్వత్పదములన్ నేనెన్నడున్ వీడబో
నో తల్లీ! భవతాపహారిణి! వెసన్నోమంగదే ప్రేముడిన్ -10
*~శ్రీశర్మద*
8333844664
🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 68*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 68*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
ఉద్యోగాన్వేషణలో ఒక రోజు వర్షంలో బాగా తడిసిపోయి రాత్రి ఇంటికి తిరిగివస్తున్నాను. శరీరం బాగా డస్సిపోయింది. మనస్సు దానితో చేరిపోయింది. ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని స్థితిలో, ప్రక్కనే ఉన్న ఒక ఇంటి అరుగు మీద కుప్పకూలిపోయాను. బాహ్యస్మృతి ఉందో లేదో తెలియదు. కాని ఏవేవో ఆలోచనలు ఒకటి వెంట ఒకటిగా తలెత్తడమూ, తొలగిపోవడమూ జ్ఞాపకం ఉంది. వాటిని త్రోసివేయడానికి ఏదో ఒక భావనలో మనస్సును ప్రగాఢంగా లీనం చేయలేకపోయాను.
ఆ సమయంలో ఏదో ఒక దివ్యశక్తి నా ఆంతరికమైన తెరలను ఒకటి వెంట ఒకటిగా తొలగిస్తున్నట్లుగా అనిపించింది. ఇన్ని
రోజులుగా నా మనస్సును గందరగోళానికి లోను చేస్తున్న 'మంచితనం మూర్తీభవించిన భగవంతుని సృష్టిలో చెడు ఎందుకు ఉంటుంది? భగవంతుని కఠోర న్యాయంతోపాటు అపార కారుణ్యమూ ఎలా కలగలసి ఉంటుంది?' లాంటి పలు సంశయాలకు శాశ్వతమైన పరిష్కారాలను నా హృదయాంతరాళంలో కనుగొన్నాను. కట్టలు తెగిన ఆనందంతో లేచాను. శరీరంలో అలసట కాస్త కూడా లేకుండా పోయింది. మనస్సు ఒక అద్భుతమయిన శక్తితోను, ప్రశాంతతతోను భాసించింది.
సాధారణమైన మనుషుల్లా డబ్బు సంపాదించడానికీ, కుటుంబాన్ని పోషించడానికి, సుఖాలను అనుభవించడానికి నేను జన్మించలేదనే భావన నా మనస్సులో పాతుకుపోయింది. నా తాతలా సర్వసంగ పరిత్యాగానికి నేను రహస్యంగా తయా రయ్యాను. అందుకోసం తేదీ కూడా నిర్ణయించుకున్నాను.
కాని ఆశ్చర్యం! ఆ రోజు శ్రీరామకృష్ణులు కలకత్తాలో ఒక భక్తుని ఇంటిని పావనం చేయబోతున్నారని తెలియవచ్చింది. మంచిదే, గురువు దర్శనానంతరం శాశ్వతంగా ఇంటిని పరిత్యజించగోరాను. కాని నేను ఆయనను చూడగానే, 'ఈ రోజు నువ్వు నాతోపాటు దక్షిణేశ్వరం వచ్చే తీరాలి' అని గట్టిగా పట్టుబట్టారు. ఎన్నో కుంటిసాకులు చెప్పిచూశాను. కాని ఆయన ఏదీ వినిపించుకోలేదు. ఇక గత్యంతరం లేక ఆయనతోపాటు వెళ్లాను. బండిలో పోతున్నప్పుడు కూడా ఆయను ముక్తసరిగానే మాట్లాడారు. దక్షిణేశ్వరం వెళ్లాక కాసేపు ఇతరులతోపాటు ఆయన గదిలో కూర్చున్నాను.
ఇంతలో శ్రీరామకృష్ణులకు పారవశ్య స్థితిలో కళ్ల వెంట నీరు ధారలు కట్టగా,నన్ను ఆప్యాయంగా పట్టుకొన‌్నారు.“హృదయంలో పొంగిపొరలుతున్న ఉద్వేగ ప్రవాహాన్ని ఇక ఆపుకోలేక పోయాను. ఆయన మాదిరి నా కళ్లలోనూ నీరు ధారకట్టింది. అంతా ఆయనకు తెలిసిపోయిందని స్పష్టంగా నాకు అర్థమయింది. మా ఇద్దరి మధ్య ఏం జరుగు తున్నదో ఎవరికీ అంతుబట్టలేదు.
శ్రీరామకృష్ణులు మామూలు స్థితికి వచ్చాక కొందరు, 'విషయం ఏమిటి?' అని అడిగారు. ఆయన నర్మగర్భంగా నవ్వుతూ, 'ఓ అదా, అది మా ఇద్దరికీ సంబంధించింది' అన్నారు. రాత్రి అందరూ సెలవు పుచ్చుకొని వెళ్లిపోయాక, నన్ను దగ్గరకు పిలిచి, గద్గద స్వరంలో, 'నాకు తెలుసు. నాయనా! నువ్వు జగజ్జనని కార్యం నిమిత్తమే వచ్చావని నాకు బాగా తెలుసు. నువ్వు లౌకిక జీవితం గడపలేవు. అయినప్పటికీ నేను ఉన్నంతదాకా నా కోసం ఇంట్లోనే ఉండు' అని చెబుతూ, కన్నీరుమున్నీరయినారు.”🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
రాశి ఫలితాలు* 19-10-2023
*19-10-2023*
*గురు వారం* *బృహష్పతి వాసరః*
*రాశి ఫలితాలు*
*మేషం*
ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున ముఖ్యమైన పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.
*వృషభం*
వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు తగినంత దూరంగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు కలిగిస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వ్యాపారాలలో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది.
*మిధునం*
సన్నిహితుల నుండి నూతన విషయాలు సేకరిస్తారు. గృహమునకు బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.
*కర్కాటకం*
మొండి బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగమున మంచి పనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
*సింహం*
ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
*కన్య*
చేపట్టిన పనులలో ఒత్తిడి అధికమైన సకాలంలో పూర్తిచేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది.
*తుల*
నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
*వృశ్చికం*
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకుంలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.
*ధనస్సు*
కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతాయి. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారములను విస్తరించి లాభాలు అందు కుంటారు.
*మకరం*
వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు చికాకు పరుస్తాయి. ధన పరంగా ఒడిదుడుకులు అదిగమిస్తారు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి.
*కుంభం*
వృత్తి వ్యాపారాలు కొంత అనుకూలంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్న నాటి మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన స్థాన చలనాలుంటాయి.
*మీనం*
ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. దూర ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. వృత్తి వ్యాపారాల్లో స్వంత ఆలోచనలు అమలుచేస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్ధిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది.
🕉️
కనుమరుగైన 'కన్యాశుల్కం' తిట్లు'*
*కనుమరుగైన 'కన్యాశుల్కం' తిట్లు'*
*--- ప్రకాష్.*
~~~~~~~~~~~~~~~~~
*“నన్ను సప్తవెధవని చేశావు”* అంటాడు రామప్పంతులు మధురవాణితో! 'సప్తవెధవ' అనేది సామాజిక చరిత్రకు సంబంధించిన పదం. పురుషుణ్ణి స్త్రీ ఎంచుకుంటుంది కాబట్టి అతనికి వరుడు అనే పేరొచ్చింది. స్త్రీ అలా వరులను ఏడుసార్లు మార్చుకోవచ్చు. ఏడోసారి కూడా స్త్రీ అతణ్ణి వరించకపోతే అతణ్ణి 'సప్తవెధవ' అంటారు. ( రాంభట్ల కృష్ణమూర్తి 'వేల్పుల కథ)
*" నీ ఇంట కోడిని కాల్చా"* అంటాడు అగ్నిహోత్రవదాన్లు. 'మీ ఇంట పీనుగెళ్ళా! అనే తిట్టు లాంటిదే ఇది. పూర్వం కొన్ని కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే కోడిని శవం చుట్టూ ముమ్మారు తిప్పి ఆ తరువాత కాల్చేవారు. అనంతరం దాని ఆ ఇంటి చాకలి తీసుకుపోయేవాడు.
*"నా సొమ్మంతా 'ఘటాశ్రాద్ధపు' వెధవల పాలవుతుంది”* అని లుబ్దావధాన్లు, *“రేపు ఇంటికి వెళుతూనే 'ఘటాశ్రాద్ధం' పెట్టేస్తాను”* అనిఅగ్నిహోత్రావధాన్లు వేరువేరు సందర్భాల్లో తిడ
తారు. ఘటం అంటే కుండ. శ్రాద్ధం అంటే పితృదేవతలను ఉద్దేశించి చేసే దానం మొ॥ కార్యాలు. శ్రాద్ధకర్మలుమొత్తం 10 .అవి ఏకోద్దిష్ట , నిత్య, దర్శ, మహాలయ, సపిండి లేక సపిండీకరణ, తీర్థ, నాందీ, హిరణ్య, ఆమ, ఘట. చివరిదైన ఘటశ్రాద్ధం గురించి“పతితుడైనవాడుప్రాయశ్చిత్తానికి ఒప్పుకోకపోగా, అతనిజ్ఞాతులు బతికి ఉండగానే అతనికి ప్రేతకార్యం జరిపి, ఒక కుండను నీటితో నింపి, దాసితో దానిని తన్నించి నీటిని ఒలకపోయించడం అనే అపరకర్మ. 'ఘటనినయం' అనితెలుగుఅకాడమీ వివరించింది.
*“దండుముండా'* అని తిడతాడు రామప్పంతులు పూటకూళ్ళమ్మని, 'దండు' అంటే 'సమూహం' అని అర్ధం. దండుముండ అంటే 'బజారుముండ' అని అర్ధం చెప్పాయి కొన్ని నిఘంటువులు.
మధురవాణి *“ఏం నంగనాచివే!”* అంటుంది ఆడపిల్లవేషంలో ఉన్న కరటకశాస్త్రి శిష్యుడితో. 'నంగనాచి' అంటే సామర్థ్యంఉండి కూడా ఏమీ తెలియనట్టు ఉండటం' అనికొన్ని నిఘంటువుల్లో ఉంది. కానీ “అందరితోనూ ప్రేమకలాపాలు సాగించే పడుచు" అని తెలుగుఅకాడమీ నిఘంటువుసూచిస్తోంది. అసలు ఇది హిందీ నుంచివచ్చిందని పరిశోధకులఅభిప్రాయం. 'నంగా' అంటే 'నగ్నం' అనీ, 'నాచ్' అంటేనృత్యంఅనీ అర్ధాలు ఉన్నాయి. సిగ్గు విడిచి నగ్నంగా నృత్యం చేయడంసాహసమే కాబట్టి 'సిగ్గు విడిచినది' అని చెప్పే సందర్భంలో ఈతిట్టు వాడుకలోకి వచ్చి ఉంటుందనిసురవరం ప్రతాపరెడ్డిగారు 'శబ్దాల ముచ్చట' అనే వ్యాసంలో వివరించారు.
*'ధగిడీకె'* అనికరటకశాస్త్రి నోట వెలువడిన తిట్టు ఉర్దూపదం. గోదావరి జిల్లాలో 'గయ్యాళి' అనితిట్టడానికి ఈ మాట వాడేవారు. నీచస్త్రీ, దుష్టుడు అని ఈ మాటకు అర్ధం. సి.పి.బ్రౌన్ కాలంనాటికి కూడా ఈ పదం వాడుకలో ఉందేమో! jade, slut,wretch అనే ఇంగ్లిష్ అర్థాలు ఇచ్చాడు తన నిఘంటువులో. కానీఈనాడెక్కడా ఈ పదం వాడుకలో వినిపించదు.
*“భష్టాకారిముండా!"* అని తిడతాడు లుబ్ధావధాన్లు తన కూతుర్ని (మీనాక్షిని). ఈ మాటకు రెండర్థాలున్నాయి. “భష్టాకారి' అనేది భ్రష్టఅనే రూపం నుంచి వచ్చింది. భ్రష్టుడు=వెలివేయబడ్డవాడు అనిఅర్థం. ఈస్కమ్మునిటెడ్ అన్నాడు బ్రౌన్ . హిందీలో భ్రష్ట అంటే పతిత అనే అర్ధం ఉంది.
వితంతువుని పెళ్ళాడానేమో అని ఆందోళన చెందుతున్న లుబ్ధావధాన్లుతో *“ఎందుకీ తంబళ అనుమానం?”* అంటుంది మీనాక్షి. సురవరం ప్రతాపరెడ్డిగారు తంబల జాతివారు పూర్వం గ్రామాలలో తమలపాకులనిచ్చే వృత్తిలో ఉండేవారని అన్నారు. సి.పి.బ్రౌన్ “బ్రాహ్మణ స్త్రీ యందు బ్రాహ్మణునికి దొంగతనంచేత పుట్టి, ఆగమాలు చదివి శివార్చన చేసే ద్విజుడు” అన్నారు.(Aman of mixed caste, descended from a female brahmi, by adultery with a man ofthe same tribe. A brahmin who officiates in the temple of Sova) “తంబళ అనుమానం” అనేది జాతీయం.
*“అభాజనుడా!”* అని తిడతాడు రామప్పంతులు లుబ్ధావధాన్లుని. ఈ తిట్టు ఇపుడెక్కడా వాడుకలో వినిపించదు. అయోగ్యుడు. అసమర్ధుడు అని ఈ మాటకి అర్ధం jade, slut, wretch అనే ఇంగ్లిష్ అర్ధాలిచ్చాడు బ్రౌన్.
“ఇలాంటి *'చాడీకోర్'* కబుర్లు చెప్పడానికి యవడికి గుండెఉంది” అంటాడుగిరీశం రామప్పంతులుతో. “చారీఖోర్" అనేఉర్దూ పదం దీనికి మూలం. salanderer, a tale bearer, కొండెగాడు, చాడీ కత్తె a busybody, a girl that tells talesఅని వివరించాడు బ్రౌన్.
“మధురవాణి *'సిగ్గోసిరి'* దాన్ని వదిలేస్తాను” అంటాడు రామప్పంతులు. వీళ్ళమ్మా *'శిఖాతరగా'* అంటాడు అగ్నిహోత్రావధాన్లు. ఈ రెండు తిట్లూ ఒకటే. నాటకంలో చాలా సందర్భాల్లో వస్తాయి. “దీని సిగతరగా' అనేది ఈనాటి వ్యవహార రూపం. సిగ్గోసిరి (సిగ+కోసిరి) అన్నా, శిఖ తరగడం అన్నా, సిగతరగా అన్నా శిరోముండనం అనే అర్ధం. అంటే భర్తచనిపోయినపుడ పూర్వకాలం కొన్ని కుటుంబాలలో స్త్రీలకిజరిగేతంతు. ఎదుటి స్త్రీ మీద కోపం వచ్చినపుడు వాడే శాపనార్థంవంటి తిట్టు. కొన్నిసందర్భాలలో ఊతపదంగా కూడా కనిపిస్తుంది.
“వాడు (గుంటూరుశాస్త్రి) *'పంచాళీ మనిషి'* అనడానికి సందేహం ఏమిటి? అంటాడు రామప్పంతులు లుబ్ధావధాన్లుతో. “పంచాళీ అంటేవదరుబోతు, వాచాలుడు, గయ్యాళి అనే
అర్ధాలున్నాయి. ప్రస్తుతం వాడుకలోవినిపించని తిట్టు ఇది.
“ఈ రామప్పంతులు కథ ' *పైన పటారం లోన లొటారం'* లా కనిపిస్తుంది” అంటుంది స్వగతంగా మధురవాణి. ‘పటారం'అసలు రూపం 'పటీరం'. చందనంఅని దీనికి అర్ధం. 'లొటారం'అంటే రంధ్రం, బిలం అనే అర్థాలున్నాయి. పైపై మెరుగులేతప్పలోపల శూన్యం అనే అర్ధంలో దీన్నిసామెతలా వాడుతుంటారు.
ఇలాకన్యాశుల్కం
నాటకంలోని పదాలు వివరించుకుంటూ పోతే పెద్ద గ్రంధం అవుతుంది. *_(ఈ రోజు గురజాడ జయంతి)_*
భక్తిసుధ
ॐ卐 *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐
*_శ్లోకమ్-_*
*_బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వాస్వవస్థాస్వపి_*
*_వ్యావృత్తా స్వను వర్తమాన మహమి త్యంతస్స్ఫురంతంసదా_*
*_స్వాత్మానం ప్రకటీ కరోతిభజతాం యోముద్రయా భద్రయా_*
*_తస్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే....._*
*_దక్షిణాముర్తి స్తోత్రమ్-7 -_*
ఎవరి ఉనికి అయితే దేహము, బుద్ధి యొక్క వివిధ అవస్థల వల్ల వచ్చే మార్పులకు అతీతంగా ఉండునో, జ్ఞాన ముద్ర ద్వారా ఆత్మ జ్ఞానమును కలుగ జేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
విషానికి విరుగుడు..*
*విషానికి విరుగుడు..*
"ఏమైంది కొండయ్యా?..చాలా బాధపడుతున్నావు..?" అని అడిగాను.."గంట క్రితం చేతి మీద తేలు కుట్టిందయ్యా..భుజం దాకా నొప్పి పెడుతున్నది..స్వామి దగ్గరకు వచ్చేసాను.." అని చెప్పాడు..ఈ లోపల మా అర్చకస్వామి స్వామివారి సమాధి వద్ద వెలిగించిన దీపపు ప్రమీదలోని నూనె కొద్దిగా తీసుకొచ్చి..కొండయ్య కు తేలు కుట్టిన ప్రదేశం లో దానిని పూయమని చెప్పారు..కొండయ్య ఆ నూనె తీసుకొని..స్వామివారికి నమస్కారం చేసుకొని..తన చేతిమీద పూసుకున్నాడు.."పో..పోయి..ఆ మంటపం లో పడుకో..మరి కొద్దిసేపటిలో నొప్పి తగ్గిపోతుంది.." అని అర్చకస్వామి చెప్పారు.."అలాగే స్వామీ.." అని కొండయ్య వెళ్లి స్వామివారి సమాధికి ఎదురుగా ఉన్న మంటపం లో పడుకున్నాడు..అతని భార్య అతని ప్రక్కనే కూర్చున్నది..ఒక గంట కాలం గడిచింది..కొండయ్య లేచి కూర్చున్నాడు.."ఎలా ఉంది?" అని భార్య ఆతురత తో అడిగింది..నొప్పి చాలా వరకూ తగ్గిపోయిందనీ..కేవలం తేలు కుట్టిన ప్రదేశం లోనే కొద్దిగా నొప్పి పుడుతున్నదనీ కొండయ్య చెప్పాడు..మరో అరగంట తరువాత..ఆ నొప్పి కూడా తగ్గిపోయిందని చెప్పి.. తన భార్యతో కలిసి..స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని..నా దగ్గరకు వచ్చి.."అయ్యా..వెళ్ళొస్తాను.." అన్నాడు.."సరే కొండయ్యా..జాగ్రత్త గా ఉండు.." అని చెప్పాను..
ఇటువంటి సంఘటనలు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద ప్రతి వారమూ ఒకటి రెండు సార్లు చూస్తూనే ఉంటాము..తేలు కుట్టినా..పాము కరచినా..మొగిలిచెర్ల..ఆ చుట్టుప్రక్కల గ్రామాల లోని ఎక్కువ మంది గ్రామస్తులు మరే వైద్యమూ చేయించుకోరు..నేరుగా శ్రీ స్వామివారి మందిరం వద్దకు వస్తారు..అటువంటి వారు రాగానే..ఆ సమయం లో స్వామివారి మందిరం లో ఉన్న అర్చకస్వాములు..గబ గబా స్వామివారి సమాధి ప్రక్కనే వెలుగుతున్న దీపపు ప్రమిద లోని నూనె కొద్దిగా తీసుకొచ్చి..వారికి ఇచ్చి..ఆ విషపు పురుగు కుట్టిన చోట ఆ నూనె రాయమని చెపుతారు..అదొక్కటే వైద్యం..మరో గంటా..రెండుగంటల్లో..ఆ వచ్చిన వ్యక్తి తనకు నొప్పి తగ్గిపోయిందని చెప్పి..స్వామివారి సమాధికి నమస్కరించి..తిరిగి తన పనికి వెళ్లిపోతూ వుంటారు..కానీ ఒకటి రెండు గంటల సేపు ఆ బాధ పడాలి..నొప్పి ని భరించాలి..తప్పదు..
ఇలాటి సంఘటన గురించి ఒక అనుభవాన్ని ఈరోజు మీతో పంచుకుంటాను..పది పన్నెండేళ్ల క్రితం..విజయవాడ నుంచి మారుతీరావు గారని ఒక వ్యక్తి మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..ఆరోజుల్లో స్వామివారి మందిరం వద్ద ఉండటానికి కనీస వసతులు కూడా లేవు..ఉన్న రేకుల షెడ్ లోనే పడుకోవాలి..లేదా స్వామివారి మందిరం లో ఉన్న ఒక్క మంటపం లోనే ఉండాలి..మారుతీరావు గారు వచ్చింది శనివారం నాడు..వారు వస్తూ వస్తూ దారిలో మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకొని..అక్కడినుంచి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మొగిలిచెర్ల స్వామివారి వద్దకు వచ్చారు..అదే సమయం లో మొగిలిచెర్ల ను ఆనుకొని ఉన్న నారసింహాపురం గ్రామం లో గల ఒక రెడ్డి గారి అబ్బాయికి తేలు కుట్టి..ఆ అబ్బాయిని కూడా స్వామివారి మందిరానికి తీసుకొచ్చారు..ఆ అబ్బాయి వయసు పన్నెండేళ్ళు..నొప్పి భరించలేక ఏడుస్తున్నాడు.."ఊరుకో నాయనా..స్వామి దగ్గరకు వచ్చాము..నూనె పూస్తారు..నొప్పి తగ్గిపోతుంది.." అని ఆ పిల్లవాడి తండ్రి కుమారుడిని ఓదారుస్తున్నాడు..ఈ లోపలే అర్చకస్వామి స్వామివారి సమాధి ప్రక్కన ఉన్న దీపపు ప్రమిద లోని నూనె తీసుకొచ్చి..ఆ పిల్లవాడి తండ్రి చేతికి ఇచ్చారు..ఆ నూనె ను ఆ పిల్లవాడికి తేలు కుట్టిన చోట రాశారు..మంటపం లోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు..
"ప్రసాద్ గారూ..ఇలా స్వామివారి వద్ద ఉన్న నూనె రాయడం..తేలు విషానికి అది విరుగుడు గా పనిచేయడం..అనేది నమ్మశక్యం గా లేదు..మీరేమో నిశ్చింతగా చూస్తూ వున్నారు..నా మాట విని ఏదైనా ప్రాథమిక వైద్యం అందించే మార్గం చూడండి..నాకు ఆయుర్వేద వైద్యంలోను, హోమియో వైద్యం లోనూ ప్రవేశం ఉన్నది..మీ వద్ద కొన్ని మాత్రలు పెడతాను..ఎవరైనా ఇలా వస్తే..వారికి ముందుగా ఆ మాత్రలు ఇవ్వండి..ప్రాణహాని జరుగకుండా ఉంటుంది.." అన్నారు.."ఇంతవరకూ ఒక్కసారి కూడా ఇక్కడ తేలు, పాము ఇట్లాటి విషపు పురుగుల బారిన పడ్డ ఏ వ్యక్తికీ ప్రాణహాని జరుగలేదు.." అని చెప్పాను.."మీరు చదువుకున్న వారు..కొంచెం ఆలోచించండి.." అన్నారు.."ఏమీ వద్దండీ..మా అందరికీ స్వామివారి మీద అపార నమ్మకం.." అని చెప్పాను..మారుతీరావు గారు ఇక ఏమీ మాట్లాడలేదు..
ఆరోజు రాత్రికి మారుతీరావు గారు నిద్ర చేసి..ఆదివారం ఉదయం స్వామివారి సమాధి దర్శించుకొని ఇవతలికి వచ్చారు..అక్కడే ఉన్న అర్చకస్వామితో ఒక ఐదు నిమిషాలు మాట్లాడుతూ వున్నారు..ఆ తరువాత నా దగ్గరకు వచ్చి.."ప్రసాద్ గారూ..నిన్న రాత్రి ఈ మంటపం లోనే పడుకున్నానండీ..నిన్న తేలు కుట్టిన పిల్లవాడు కూడా రాత్రి ఇక్కడే వున్నాడు..వాడు చాలా ఉషారుగా వున్నాడు..నాకే ఆశ్చర్యం వేసింది..కేవలం స్వామివారి వద్ద ఉన్న నూనె పూయగానే తేలు తాలూకు విష ప్రభావం మాయమై పోయిందా?..రాత్రంతా ఆలోచించాను..కొన్ని విషయాలను తార్కికంగా ఆలోచించకుండా..కేవలం భక్తి తో చూడాలి అని అనిపించింది..అందుకే అర్చకస్వామి వారిని అడిగి ఆ నూనె కొద్దిగా చిన్న సీసా లో తీసుకున్నాను..నేను మీ వద్ద మాత్రలు ఉంచడం కాదు..నేనే నా వద్దకు ఇలాటి సమస్యతో వచ్చేవాళ్లకు..స్వామివారి వద్ద ఉన్న ఈ నూనెను ఇస్తాను.." అన్నారు..
మారుతీరావు గారిలో ఉన్న అనుమానం అనే విషానికి కూడా స్వామివారే విరుగుడు చూపించారు అని మాకు అర్ధం అయింది..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
ఆలోచనాలోచనాలు
☺️ ఆలోచనాలోచనాలు 😊 ప్రభో! అది ఎలాగో ప్రదర్శించు! ఇవాళ నేను ఏదైనా మేలుచేయగలిగితే, జీవితంలో ఎవరికైనా సేవ.చెయ్యగలిగితే, ఒరులకు ఉపయోగపడేలాగా ఒక మంచిమాట చెప్పగలిగితే, ప్రభో! అది ఎలాగో ప్రదర్శించు! నేను లోపాలను సరిదిద్దగలిగితే, ఎవరైనా బలపడటానికి నేను తోడ్పడగలిగితే, చిరునవ్వు తో ,లేదా ఒక మధురమైన పాటతో మరొకరిని ఉత్సాహపరచగలిగితే, ప్రభో! అది ఎలాగో ప్రదర్శించు! కష్టాలలో ఉన్న వ్యక్తిని ఆదుకోగలిగితే, ఎవరి భారాన్నైనా కొద్దిగానైనా తగ్గించగలిగితే, ఎవరి కన్నీటిని తుడిచి అతడికి లేదా ఆమెకు ధైర్యం చెప్పగలిగితే, ప్రభో! అది ఎలాగో ప్రదర్శించు! ----- గ్రెన్ విల్ క్లెయ్ సెర్. ----౦ తృప్తికరమైన జీవనం ౦---- ఆనందదాయకంగా పనిచేయడానికి తగిన ఆరోగ్యం. అవసరాలకు మద్దతు నిచ్చేలాగ సంపద. కష్టాలనుండి కడతేరడానికి పోరాడటానికి తగిన శక్తి దేవుడి విషయాలను యదార్థీకరించడానికి తగిన విశ్వాసం. భవిష్యత్తును గురించి భయాందోళనలను తొలగించేలా తగినంత ఆశ. ఇతర ప్రాణులను ఆత్మీయంగా చూడగలిగే ప్రేమ. దీనుల బాధలపట్ల కరగిపోయేంతగా కారుణ్యం. ఇవే నా తృప్తికరమైన జీవితానికి కనీస అవసరాలు. ---- గోథే. - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - Sharpen your mind! 1* Who spends the day at the window, goes to the table for meals and hides at night? 2* The answer I give is yes, but what I mean is no. What was the question? 3* First you eat me, then you get eaten. What amI? (For proper answers you have to wait 24 hrs only.). - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -. తెలుగు నుడికారం ( సామెతలు మరియు జాతీయాలు) 1* కంచెలేని చేను, తల్లి లేని బిడ్డా ఒకటే! 2* కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువే! 3* కాలు జారితే తీసుకోవచ్చు; నోరు జారితే తీసుకోలేం. 4* గోటితోపోయే పనికి గొడ్డలి ఎందుకు? 5* గుడ్డి కంటే మెల్ల మేలు. 6* కుక్క కాటుకు చెప్పుదెబ్బ. 7* ఏరు ఎన్ని వంకలు తిరిగినా చివరకు చేరేది సముద్రంలోనే; 8* ఏఱు దాటి తెప్ప తగలేసినట్లు. 9* గాలివానలో ఏనుగులే కొట్టుకపోయినయ్ అంటే మరి దోమలో అన్నాట్ట, ఒక బుద్ధిలేని పెద్దమనిషి. 10* తాటిచెట్టు ఎక్కించి నిచ్చెన లాగేసినట్లు. తేది 19--10--2023, గురువారం, శుభోదయం.
గురువారం, అక్టోబరు 19, 2023
🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
గురువారం, అక్టోబరు 19, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం - శరదృతువు
ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం
తిథి:పంచమి రా10.27 వరకు
వారం:గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ రా8.09 వరకు
యోగం:సౌభాగ్యం ఉ7.15 వరకు తదుపరి శోభన తె5.07వరకు
కరణం : *బవ* ఉ10.44 వరకు
తదుపరి *బాలువ* రా10.27 వరకు
వర్జ్యం : *తె3.56 - 5.29*
దుర్ముహూర్తము:ఉ9.48 - 10.35 &
మ2.27 - 3.14
అమృతకాలం:ఉ11.26 - 1.01
రాహుకాలం:మ1.30 - 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:5.56
సూర్యాస్తమయం: 5.34
సర్వేజనా సుఖినో భవంతు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
శ్రీ భ్రమరామ్బాష్టకమ్
ॐ శ్రీ భ్రమరామ్బాష్టకమ్
श्री भ्रमराम्बाष्टकम्
SREE BHRAMARAAMBAASHTAKAM
(श्रीमच्छंकरभगवतः कृतौ
శ్రీమచ్ఛంకరభగవత్పాద విరచితం
By Sri Adi Sankara)
శ్లోకం : 5/9
SLOKAM : 5/9
श्रीनाथादृतपालितत्रिभुवनां श्रिचक्रसंचारिणीं
ज्ञानासक्तमनोजयौवनलसद्गन्धर्वकन्यादृताम् ।
दीनानामतिवेलभाग्यजननीं दिव्याम्बरालंकृतां
श्रीशैलस्थलवासिनीं भगवतीं श्रीमातरं भावये ॥ ५॥
శ్రీనాథాదృతపాలితత్రిభువనాం
శ్రీచక్రసంచారిణీం
జ్ఞానాసక్తమనోజయౌవనలసత్
గన్ధర్వకన్యాదృతామ్ I
దీనానామతివేలభాగ్యజననీం
దివ్యామ్బరాలంకృతాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం
శ్రీమాతరం భావయే ৷৷5৷৷
విష్ణువుచే ఆదరింపబడుచూ, మూడు లోకములనూ పాలించునదీ,
శ్రీ చక్రమునందు సంచరించుచున్నదీ,
యువతులైన గంధర్వకన్యలచే పాటలు పాడుచూ సేవింపబడుచున్నదీ,
దీనులకు మిక్కిలి భాగ్యమునిచ్చునదీ,
దివ్యవస్త్రములను ధరించునదీ,
శ్రీశైలము నందు నివసించునదీ,
భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.
I meditate on the Goddess who
- lives in Sri Saila
- is my mother,
- protects the three worlds ruled by Lord Vishnu,
- moves inside three chakra,
- is appreciated by the pretty Gandharva maidens who are interested in music,
- great luck to the down trodden and
- wears divine silk apparel.
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
నవగ్రహా పురాణం🪐* . *58వ అధ్యాయం*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *58వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*సూర్యగ్రహ చరిత్ర - 1*
తన సంతానం - శనైశ్చరుడూ , సావర్ణి , తపతీ పెద్దవాళ్లయ్యే కొద్దీ - ఛాయ సంజ్ఞ పిల్లలకు మానసికంగా బాగా దూరంగా జరిగింది. వైవస్వతుడినీ , యముడినీ , యమినీ చూడడానికే ఆమె ఇష్టపడడంలేదు.
ఛాయ తన బిడ్డలు ముగ్గుర్నీ రహస్యంగా సమావేశపరిచింది. *"వైవస్వతుడూ , యముడూ , యమి మంచి వాళ్ళు కారు. వాళ్ళకు మీరు దూరంగా ఉండాలి"* అంది. ముగ్గురూ ముఖాలు చూసుకొన్నారు.
*“అన్నలిద్దరూ మంచివాళ్ళమ్మా !”* సావర్ణి ఆశ్చర్యపోతూ అన్నాడు.
*“నాకు కూడా అలాగే అనిపిస్తుంది ! వైవస్వతుడు , యముడూ మాతో చక్కగా ఆడుకుంటారు !”* శనైశ్చరుడు ఛాయనే చూస్తూ అన్నాడు.
*“వాళ్ల మనసులు మీకు తెలీవు ! మీరు చిన్న పిల్లలు...”* ఛాయ చెప్పుకుపోతోంది.
*"అక్క యమి చాలా మంచిదమ్మా ! నేను ఏది కావాలన్నా అడ్డు చెప్పకుండా ఇచ్చేస్తుంది తెలుసా !"* తపతి ఛాయ వైపే చూస్తూ అంది.
ఛాయ అసహనాన్ని దాచుకుంటూ నిట్టూర్చింది. *"మీకో నిజం తెలుసా ? మంచివాళ్ళకు సర్వమూ మంచిగానే , అందరూ మంచివాళ్ళగానే అనిపిస్తారు !”*
*“అయితే మేం మంచి వాళ్ళమా అమ్మా ?"* శని ఆసక్తిగా అడిగాడు.
*“అందుకే గద నాయనా ! ఆ ముగ్గురూ మంచి వాళ్ళు కాకపోయినా మీకు మంచివాళ్ళుగా కనిపిస్తున్నారు !”* ఛాయ తెలివిగా అంది. *“వాళ్ళు ముగ్గురూ ఎంత చెడ్డ వాళ్ళంటే , మీ పరోక్షంలో మీ గురించి నాతో చెడుగా చెబుతూనే ఉంటారు. అయినా , నేను నమ్మనుగా ! మీరు చాలా మంచివాళ్ళనీ , చాలా బుద్ధిమంతులనీ , అమ్మ మాట జవదాటరనీ నాకు తెలుసుగా !"*
శనీ , సావర్జీ , తపతీ అనుమానంగా ఒకర్నొకరు చూసుకొన్నారు. ముందుగా శని పెదవి విప్పాడు.
*“అందుకేనేమో వాళ్ళను చూసినప్పుడల్లా ఎందుకో తెలియకుండానే నాకు కోపం వస్తూంటుంది. గుడ్లు ఉరిమి ఆగ్రహంగా చూడాలనిపిస్తుంది !"*
ఛాయ శనిని ఆప్యాయంగా చూసింది. *"చూశారా ! ఇక నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి...".*
*"అంటే..."* తపతి అమాయకంగా అడిగింది. *"ఏం చేయాలి ?"*
*"మీరు ముగ్గరూ ఒక బృందంగా కలిసి ఉండాలి. ఆ ముగ్గురితో కలవకూడదు. అర్ధమైంది కదా ?"* ఛాయ అడిగింది.
*"మా బృందానికి నేను నాయకుడిని ! సరేనా , అమ్మా !"* శని ఉత్సాహంగా అడిగాడు.
*"ఔను ! మీలో పెద్దవాడివి నువ్వేగా , నాయనా ! అయితే ఒక ముఖ్యమైన విషయం. నేను మీతో చెప్పిందంతా వైవస్వతుడికీ , యముడికీ , యమికీ చెప్పకూడదు. అలాగే మీ తండ్రిగారికీ చెప్పకూడదు !"* ఛాయ గొంతు తగ్గించి అంది.
*"నాన్నగారికి చెప్తే ఏం ?"* శని అనుమానం వ్యక్తం చేశాడు.
*“చెప్పకూడదు. అన్నాను కద !"* ఛాయ విసుగ్గా అంది.
*"ఎందుకు ?"* శని మొండిగా అడిగాడు.
*"మీ నాన్నగారు నమ్మరు ! ఆయనకి వాళ్ళంటే ఎక్కువ ఇష్టం !"* ఛాయ అంది.
*"అలాగా...మాకు తెలీదమ్మా !”* సావర్ణి ఆశ్చర్యంగా అన్నాడు.
*"అందుకే మీరెప్పుడూ అమ్మ మాటే వినాలి !"* అంది ఛాయ.
ఛాయ ప్రబోధం ఆమె పిల్లల్లో మార్పు తెచ్చింది. వాళ్ళు సంజ్ఞ సంతానానికి దూరంగా ఉండటం ప్రారంభించారు. ముందుగా ఆడపిల్లలైన యమి , తపతి అభిప్రాయభేదాలకు అంకురార్పణ చేశారు. తల్లి మాటల్ని పూర్తిగా నమ్మిన తపతి యమి పట్ల ఇన్నాళ్ళూ ఉన్న ప్రేమను ద్వేషంగా మార్చుకుంది.
రోజులు గడిచే కొద్దీ ఛాయలో సంజ్ఞ బిడ్డల పట్ల వేళ్ళుతన్నిన ద్వేషం కొద్దికొద్దిగా వ్యక్తం కాసాగింది.
తల్లిలో కనిపిస్తున్న మార్పు వైవస్వతుణ్ణి , యముడినీ ఆశ్చర్యంలో పడవేసింది. తల్లి తనను చూస్తున్న విధానం వల్ల యమి అమితంగా బాధపడసాగింది. ముగ్గురూ , తమలో తాము బాధపడుతూ ఉండిపోయారు.
*“అమ్మ మనల్ని సరిగ్గా చూడడం లేదు. శనినీ , సావర్ణినీ , తపతినీ ప్రత్యేకంగా చూసుకుంటోంది. అమ్మలో వచ్చిన మార్పు మన మనసుల్ని బాధపెడుతోంది. నాన్నగారికి చెప్పాలి"* యముడు ఆవేశంగా అన్నాడు.
*"అమ్మ మంచిది కాదని నాన్నకు చెప్పడం తప్పు , తమ్ముడూ !”* వైవస్వతుడు యముడి భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు.
*"తప్పెందుకవుతుంది ? తప్పు చేసే వాళ్ళ గురించి పెద్దలకు చెప్పడం తప్పు కాదు. ధర్మం తప్పి ప్రవర్తించే వాళ్ళని వదిలి పెట్టరాదన్నయ్యా ! తల్లి అయినా , తండ్రి అయినా అంతే ! ధర్మం ధర్మమే ! అధర్మం అధర్మమే !"*
*"ఈ మధ్య నువ్వు ధర్మం గురించి ఎక్కువగా చెప్తున్నావు , యమా !"* వైవస్వతుడు నవ్వుతూ అన్నాడు.
*"అవును !"* యముడు వైవస్వతుడిని తదేకంగా చూస్తూ అన్నాడు. *"మీకు గుర్తుందో లేదో...మన తమ్ముడు శని జన్మించినప్పట్నుంచీ అమ్మ మారిపోయింది. సావర్ణి పుట్టాక ఇంకొంచెం , తపతి పుట్టాక మరికొంచెం - వాళ్ళు ముగ్గురూ పెద్ద వాళ్ళయ్యాక - ఇప్పుడు పూర్తిగా మారిపోయింది అమ్మ !”*
*"ఏమో , యమన్నయ్యా ! నేను గమనించలేదు !"* అంది యమి.
*"నేను కూడా !"* వైవస్వతుడు అన్నాడు. *"నువ్వెలా గమనించగలిగావో నాకు తెలీదు !"*
*"ఎలా గమనించానంటే - అమ్మ కళ్ళు చూసి ! ఆ తపతినీ , సావర్ణినీ , శనినీ చూస్తున్నప్పుడు అమ్మ కళ్ళు దీప కళికల్లా మెరుస్తాయి. మనల్ని చూసినప్పుడు అగ్ని గోళాల్లా మెరుస్తాయి"* యముడు వివరిస్తూ అన్నాడు. *"అమ్మ కళ్ళల్లో నాకు మన పట్ల ద్వేషం కనిపిస్తుంది , తెలుసా ? ఇప్పుడు అమ్మ మాటల్లో కూడా మన పట్ల అయిష్టత స్పష్టంగా వ్యక్తమవుతోంది !"*
*"అమ్మ... ఎందుకిలా అయిపోయిందన్నయ్యా !"* యమి వైవస్వతుణ్ణి అడిగింది అమాయకంగా. *“ఆలోచిస్తుంటే , నాకూ నిజమే అనిపిస్తోంది. తపతిని మెచ్చుకుంటుంది. నేను - కంటపడితే చాలు - కసురుతుంది !"*
*“బిడ్డలందర్నీ సమానంగా చూడడం తల్లిదండ్రుల విధి ! అది ధర్మం ! ఈ సారి అమ్మ పక్షపాతం చూపిస్తే నేను ఊరుకోను !"* యముడు నిష్కర్షగా అనేసి , అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
*"యముడు ఎప్పుడూ 'ధర్మం , ధర్మం' అంటూ వుంటాడు ! ఏం చేస్తాడో ఏమో !"* వైవస్వతుడు ఆందోళనగా అన్నాడు.
*“ఏం చేస్తాడు ? 'ధర్మం, ధర్మం' అనే వ్యక్తి ధర్మమైందే చేస్తాడు !"* యమి యముడు
వెళ్ళినవైపే చూస్తూ అంది.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 68*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 68*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
ఉద్యోగాన్వేషణలో ఒక రోజు వర్షంలో బాగా తడిసిపోయి రాత్రి ఇంటికి తిరిగివస్తున్నాను. శరీరం బాగా డస్సిపోయింది. మనస్సు దానితో చేరిపోయింది. ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని స్థితిలో, ప్రక్కనే ఉన్న ఒక ఇంటి అరుగు మీద కుప్పకూలిపోయాను. బాహ్యస్మృతి ఉందో లేదో తెలియదు. కాని ఏవేవో ఆలోచనలు ఒకటి వెంట ఒకటిగా తలెత్తడమూ, తొలగిపోవడమూ జ్ఞాపకం ఉంది. వాటిని త్రోసివేయడానికి ఏదో ఒక భావనలో మనస్సును ప్రగాఢంగా లీనం చేయలేకపోయాను.
ఆ సమయంలో ఏదో ఒక దివ్యశక్తి నా ఆంతరికమైన తెరలను ఒకటి వెంట ఒకటిగా తొలగిస్తున్నట్లుగా అనిపించింది. ఇన్ని
రోజులుగా నా మనస్సును గందరగోళానికి లోను చేస్తున్న 'మంచితనం మూర్తీభవించిన భగవంతుని సృష్టిలో చెడు ఎందుకు ఉంటుంది? భగవంతుని కఠోర న్యాయంతోపాటు అపార కారుణ్యమూ ఎలా కలగలసి ఉంటుంది?' లాంటి పలు సంశయాలకు శాశ్వతమైన పరిష్కారాలను నా హృదయాంతరాళంలో కనుగొన్నాను. కట్టలు తెగిన ఆనందంతో లేచాను. శరీరంలో అలసట కాస్త కూడా లేకుండా పోయింది. మనస్సు ఒక అద్భుతమయిన శక్తితోను, ప్రశాంతతతోను భాసించింది.
సాధారణమైన మనుషుల్లా డబ్బు సంపాదించడానికీ, కుటుంబాన్ని పోషించడానికి, సుఖాలను అనుభవించడానికి నేను జన్మించలేదనే భావన నా మనస్సులో పాతుకుపోయింది. నా తాతలా సర్వసంగ పరిత్యాగానికి నేను రహస్యంగా తయా రయ్యాను. అందుకోసం తేదీ కూడా నిర్ణయించుకున్నాను.
కాని ఆశ్చర్యం! ఆ రోజు శ్రీరామకృష్ణులు కలకత్తాలో ఒక భక్తుని ఇంటిని పావనం చేయబోతున్నారని తెలియవచ్చింది. మంచిదే, గురువు దర్శనానంతరం శాశ్వతంగా ఇంటిని పరిత్యజించగోరాను. కాని నేను ఆయనను చూడగానే, 'ఈ రోజు నువ్వు నాతోపాటు దక్షిణేశ్వరం వచ్చే తీరాలి' అని గట్టిగా పట్టుబట్టారు. ఎన్నో కుంటిసాకులు చెప్పిచూశాను. కాని ఆయన ఏదీ వినిపించుకోలేదు. ఇక గత్యంతరం లేక ఆయనతోపాటు వెళ్లాను. బండిలో పోతున్నప్పుడు కూడా ఆయను ముక్తసరిగానే మాట్లాడారు. దక్షిణేశ్వరం వెళ్లాక కాసేపు ఇతరులతోపాటు ఆయన గదిలో కూర్చున్నాను.
ఇంతలో శ్రీరామకృష్ణులకు పారవశ్య స్థితిలో కళ్ల వెంట నీరు ధారలు కట్టగా,నన్ను ఆప్యాయంగా పట్టుకొన‌్నారు.“హృదయంలో పొంగిపొరలుతున్న ఉద్వేగ ప్రవాహాన్ని ఇక ఆపుకోలేక పోయాను. ఆయన మాదిరి నా కళ్లలోనూ నీరు ధారకట్టింది. అంతా ఆయనకు తెలిసిపోయిందని స్పష్టంగా నాకు అర్థమయింది. మా ఇద్దరి మధ్య ఏం జరుగు తున్నదో ఎవరికీ అంతుబట్టలేదు.
శ్రీరామకృష్ణులు మామూలు స్థితికి వచ్చాక కొందరు, 'విషయం ఏమిటి?' అని అడిగారు. ఆయన నర్మగర్భంగా నవ్వుతూ, 'ఓ అదా, అది మా ఇద్దరికీ సంబంధించింది' అన్నారు. రాత్రి అందరూ సెలవు పుచ్చుకొని వెళ్లిపోయాక, నన్ను దగ్గరకు పిలిచి, గద్గద స్వరంలో, 'నాకు తెలుసు. నాయనా! నువ్వు జగజ్జనని కార్యం నిమిత్తమే వచ్చావని నాకు బాగా తెలుసు. నువ్వు లౌకిక జీవితం గడపలేవు. అయినప్పటికీ నేను ఉన్నంతదాకా నా కోసం ఇంట్లోనే ఉండు' అని చెబుతూ, కన్నీరుమున్నీరయినారు.”🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
సౌందర్యలహరి🌹* *శ్లోకం - 58*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 58*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*అరాళం తే పాళీ యుగళ మగరాజన్యతనయే*
*న కేషా మాధత్తే కుసుమశర కోదండ కుతుకమ్ |*
*తిరశ్చీనో యత్ర శ్రవణపథ ముల్లంఘ్య విలసన్*
*అపాంగ వ్యాసంగో దిశతి శరసంధాన ధిషణామ్ ‖*
ఓ శైలరాజ తనయా నీ కణతలు మన్మధుడి పుష్పబాణ కోదండ సౌభాగ్యముగా ఎవరికి అనిపించదు?
ఎందుకంటే, నీ కడగంటి చూపుల ప్రకాశం కనుకొలకులను దాటి కణతల మీదుగా చెవులను సమీపించి, వింటినారిపై సంధించిన బాణాన్ని తలపింపచేస్తున్నది. అనగా అమ్మవారి అపాంగ వీక్షణాలు పుష్పబాణాల్లా శోభిల్లి, చెవుల వైపుకు విస్తరించటంతో, కణత ప్రదేశం కొద్దిగా వంగి, మన్మధుని విల్లును తలపింపజేస్తున్నది అని భావము.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
దుర్గాదేవి
🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺
*🌹దుర్గాదేవి తొమ్మిది అవతారాలలో ఎక్కడ ఎక్కడ వెలిశారో తెలుసుకుందామా🌺*
*🌹1.శైలపుత్రి*
🪷🪷🪷🪷🪷🪷
ఉత్తరప్రదేశ్ లో వారణాసిలో శైలపుత్రి ఆలయం ఉంది. నవదుర్గలలో దుర్గాదేవి మొదటి అవతారం శైలపుత్రి అని చెబుతారు. దుర్గామాత, శైల రజగు హిమవంతుని కుమార్తెగా జన్మించినది. ఈ అమ్మవారు వృషభ వాహనం పైన ఉండి కుడిచేత త్రిశూలం, ఎడమచేత పద్మం ధరించి ఉంటుంది. శరన్నవరాత్రులలో ఈ దేవిని ఉత్సవ మూర్తిగా అలంకరించి తొలినాడైనా పాడ్యమినాడు పూజించి, ఉపవాస దీక్షలు చేసి భక్తులు తరిస్తారు.
*🌺 2. బ్రహ్మచారిని*
🪷🪷🪷🪷🪷🪷
ఈ ఆలయం ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో ఉంది. దుర్గామాత రెండవ అవతారం ఇదేనని చెబుతారు. ఈ అమ్మవారు తెల్లటి వస్త్రాలను ధరించి ఉంటారు. శివుడిని భర్తగా పొందటం కోసం నారదుడి ఆదేశానుసారం ఘోర తపస్సు చేసినది. ఈ అమ్మవారిని ఆరాదిస్తే విజయం లభిస్తుందని చెబుతారు.
*🌹 3. చంద్రఘంట*
🪷🪷🪷🪷🪷🪷
శ్రీ దుర్గామాత మూడవ అవతారం చంద్రఘంట అవతారం. ఈ అమ్మవారు గంటాకృతితో ఉన్న అర్ద చంద్రుడిని శిరస్సున ధరించి ఉంటుంది. ఈ అవతారంలో దర్శనమిచ్చే అమ్మవారి ఆలయం వారణాసి లో ఉంది. ఈ అమ్మవారు దశభుజాలతో దర్శనం ఇస్తుంది. ఈ అమ్మవారిని ప్రార్థిస్తే భయం, అపజయం దారికి రావు అని నమ్మకం.
*🌺 4. కూష్మాండ*
🪷🪷🪷🪷🪷🪷
శ్రీ దుర్గామాత నాలుగవ అవతారం కూష్మాండ. ఈ అమ్మవారు సింహవాహనం పైన అష్టభుజాలతో దర్శనం ఇస్తుంది. అందుకే ఈ అమ్మవారిని అష్టభుజి దేవి అని కూడా అంటారు. ఈ అమ్మవారి ఆలయం కాన్పూర్ లో ఉంది. ఈ అమ్మవారిని ఆరాదిస్తే శ్రీగ్రంగా కటాక్షించి రక్షిస్తుంది.
*🌹 5.స్కందమాత*
🪷🪷🪷🪷🪷🪷
నవదుర్గలలో ఐదవ అవతారం స్కందమాత. స్కందుడు అంటే కుమారస్వామి అని అర్ధం. స్కందుడి తల్లి కనుక ఈ దేవిని స్కందమాత అని అంటారు. ఈ దేవి బాలస్కందుడిని తన ఒడిలో కూర్చుబెట్టుకొని మాతృమూర్తిగా భక్తులకి దర్శనం ఇస్తుంది. ఈ దేవిని ఆరాదిస్తే పతనం లేకుండా కనుకరిస్తుంది.
*🌺 6. క్యాత్యాయని*
🪷🪷🪷🪷🪷🪷
నవదుర్గలలో ఆరవ అవతారం క్యాత్యాయని. కోత్స అనే ఒక ఋషి పార్వతీదేవి తనకి కూతురిగా జన్మించాలంటూ ఘోర తపస్సు చేయగా అతడిని కూతురిగా జన్మించింది. అందువలనే ఈ దేవికి క్యాత్యాయని అనే పేరు వచ్చింది. ఈ అవతారంలో దర్శనమించే ఆ దేవి ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది.
*🌹 7. కాళరాత్రి*
🪷🪷🪷🪷🪷🪷
నవదుర్గలలో ఏడవ అవతారం కాళరాత్రి. ఈ దేవి శరీరం ఛాయా చీకటి తో నల్లగా ఉంటుంది. అందుకే ఈ దేవిని కాళరాత్రి అనే పేరు వచ్చినది. ఈ దేవి వాహనం గాడిద. ఎల్లప్పుడూ శుభ ఫలితాలు ఇస్తుంది కనుక ఈ దేవిని శుభకరీ అని కూడా అంటారు. ఈ దేవి ఆలయం కూడా వారణాసి లో ఉంది.
*🌺 8.మహాగౌరి*
🪷🪷🪷🪷🪷🪷
నవదుర్గలలో ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈ దేవి హిమాచలం కంటే తెల్లని ధవళ కాంతితో శోభిస్తుంటుంది. అయితే శివుడిని భర్తగా పొందాలని పార్వతీదేవి ఘోర తపస్సు చేయగా ఆమె శరీరం నల్లబడుతుంది. ఇక ఆ దేవి భక్తికి మెచ్చిన స్వామివారు గంగా జలంతో ఆమె శరీరాన్ని ప్రక్షాళన చేస్తారు. అప్పటినుండి ఆమె మహాగౌరి గా ప్రసిద్ధి చెందింది.
*🌹9. సిద్ధిధాత్రి*
🪷🪷🪷🪷🪷
శ్రీ దుర్గా మాత అవతారాలలో తొమ్మిదొవ అవతారం సిద్ధిధాత్రి. ఈ దేవతని దేవతలు, సిద్దులు, మనుషులు ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తారు. ఈ దేవి బుద్ది, విద్య, భోగ భాగ్యాలను ప్రసాదిస్తుంది.
ఈవిధంగా శ్రీ దుర్గాదేవి తొమ్మిది అవతారాలు ఉండగా. ఈ తొమ్మిది అవతారలకు సంబంధించిన ఆలయాలు అన్ని కూడా వారణాసి లో ఉన్నాయి.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
వేద ఆశీర్వచనం.
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*
🌷🌷🌷
*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - ఆశ్వీయుజ మాసం - శుక్ల పక్షం - పంచమి - జేష్ఠ - గురు వాసరే* *(19-10-2023)*
ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.
https://youtu.be/OETwDTSPmzs?si=o-1cgng3_sZ8terU
🙏🙏
అనుగ్రహం
*శ్రీ గురుదేవుల అనుగ్రహం వలన మీకు మీ కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ శుభోదయ శుభాకాంక్షలతో, మీ శ్రేయోభిలాషి, నిష్ఠల సుబ్రహ్మణ్యం.*
https://youtu.be/YwEYaRFQ0sg?si=AYAr8zkKQvvS4PLj
⚜ శ్రీ రామనాథ ఆలయం
🕉 మన గుడి : నెం 212
⚜ గోవా : రామనధిమ్
⚜ శ్రీ రామనాథ ఆలయం
💠 గోవా భారతదేశంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. గోవా బీచ్‌లు, నిర్మలమైన వాతావరణం, పాత కోటలు, చర్చిలు , పాశ్చాత్య సంస్కృతి, సహజ ప్రకృతి వైభవం మరియు మంచి ఆహారాన్ని కోరుకునే ఎవరికైనా గోవా ఒక రాష్ట్రంగా చాలా కాలంగా ప్రసిద్ధి చెందింది.
💠 గోవా బీచ్‌లు, చర్చిలు మరియు పోర్చుగీస్ ప్రభావంతో ఉన్న వాస్తుశిల్పానికి సంబంధించిన ప్రశంసలు లక్షలాది మంది పర్యాటకులను రాష్ట్ర తీరానికి తీసుకువచ్చాయి.
ఏది ఏమైనప్పటికీ, గోవా కేవలం అద్భుతమైన చర్చిలు మరియు యూరోపియన్ శైలి నిర్మాణాలకు నిలయం కాదు, గోవా నడిబొడ్డున భారతీయ వాస్తుశిల్పం మరియు పురాతన సంస్కృతిని గుర్తుకు తెచ్చే ఆలయాలను కూడా చూడవచ్చు.
💠 శైవులు మరియు వైష్ణవులు సమానంగా గౌరవించే ఒక అద్భుతమైన ఆలయం కూడా ఈ గోవాలో కలదు. అదే రామనాథ్ ఆలయం.
ఇక్కడి విశేషం ఏమనగా ఒకే విగ్రహాన్ని రెండు భావనలతో పూజిస్తారు.
అదే రాముడు మరియు శివుడిగా.
💠 " రామనాథుడు " రాముడు పూజించిన శివ స్వరూపం మరియూ శివుడు పూజించే రాముడి స్వరూపంగా.
💠 హరి (విష్ణువు) మరియు హర (శివుడు) కలయికకు దైవిక చిహ్నం శ్రీ రామనాథ్.
రామ మరియు నాథ అనే రెండు పదాలు కలిపి రామనాథ్ అనే పదాన్ని ఏర్పరుస్తాయి. రామ్‌నాథ్ అనేది హిందీ పేరు.
నాధ్ అంటే ప్రభువు అని అర్థం.
రామ్‌నాథ్ అంటే... రాముడే నిజమైన నాధుడు అని.
మహాసముద్రాల మథనంలోని విషాన్ని శివుడు తాగినప్పుడు, అతని గొంతు నీలంగా మారింది. ప్రశాంతత కోసం రామనామస్మరణ చేశాడు.
శివుడు నిరంతరం ధ్యానించుకునే తారక బ్రహ్మ మంత్రం రామనామం కనుక ఈ విగ్రహం రాముడుది అని వైష్ణవుల భావన..
ఇక రామనాథ్ అనగా రాముడికి నాథుడు శివుడు.
శ్రీరాముడు తన అవతార కాలంలో ఎన్నో శివలింగాలను భక్తి పూర్వకంగా ప్రతిష్టించి, శివుడిని దేవుడిగా ఆరాధించాడు కనుక శ్రీరాముడికి ఇష్టమైన ఆరాధ్య దైవం శివుడు అనేది శైవుల భావన..
ఈ రకంగా ఈ ఆలయంలోని విగ్రహం ఏకకాలంలో శ్రీరాముడిగా మరియు శివుడిగా అందరి చేత ఆరాధించబడుతుంద
💠 ఈ ఆలయ సముదాయాన్ని పంచాయతనంగా కూడా ప్రముఖంగా వర్ణిస్తారు.
రామనాథ పంచాయతనం అని పేరుగాంచిన ఆలయాలు :
పోండా నుండి 35 కి.మీ. దూరంలో
శ్రీరామ్ నాథ్,
శ్రీ లక్ష్మీనారాయణ,
శ్రీ శాంతదుర్గ,
శ్రీ విఠల్
శ్రీ సిద్ధనాథ్ ఆలయములు కలవు.
ఈ అయిదు ఆలయాలు ప్రక్క ప్రక్కనే ఉండడం వలన ఈ ఆలయాలను పంచాయతనం అని
అంటారు.
⚜ ఆలయ చరిత్ర ⚜
💠 రామనాథ్ విగ్రహాన్ని మొదట రామేశ్వరంలో రాముడు ప్రతిష్టించాడని నమ్ముతారు. రాముడు సీతతో పాటు లంక నుండి తిరిగి వచ్చినప్పుడు, రావణుడిని చంపిన తరువాత, బ్రాహ్మణ హత్య దోషవిముక్తి కోసం శివుడిని ప్రార్థించాలని నిర్ణయించుకున్నాడు. అందుచేత, ఒక లింగాన్ని స్థాపించి ప్రార్థించాడు.
💠 ఆలయ ప్రధాన దైవం రామనాథ్. రామనాథుడు ప్రధాన దేవత కాబట్టి, ఈ ఆలయాన్ని "రామనాథ్" అని పిలుస్తారు.
శ్రీ రామ్‌నాథ్ ఆలయం శివుడు మరియు విష్ణువు ఆరాధకులకు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది, ఎందుకంటే ఇది ఇద్దరు దేవతల శక్తుల సంగమం అని నమ్ముతారు
హరి (విష్ణువు) మరియు హర (శివుడు) యొక్క ఈ దివ్య ఐక్యతనే రామనాథ్ ఆలయం సూచిస్తుంది.
💠 గోవాలోని ఈ ఆలయం 450 సంవత్సరాల పురాతనమైన గౌడ సారస్వత్ బ్రాహ్మణులకు అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది మొదట్లో సాల్సెట్‌లో ఉంది కానీ 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారి నుండి విగ్రహాలను కాపాడేందుకు మార్చబడింది.
💠 గోవాలోని రామనాథ్ యొక్క అసలు ఆలయం, గోవాలోని సాల్సెట్ (సష్టి) లోని లౌటోలిమ్‌లో ఉంది . 16వ శతాబ్దంలో అప్పటి పోర్చుగీస్ అధికారులు రామనాథ్ విగ్రహాన్ని ధ్వంసం చేయకుండా నిరోధించడానికి ప్రస్తుత ప్రదేశానికి మార్చారు. మే 2011లో, రామనాథ్ ఆలయం ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో 450 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
💠 ఆలయానికి ప్రధానంగా వత్స , కౌండిన్య గోత్ర మాధ్వ అనుచరుడు గౌడ్ సరస్వత్ బ్రాహ్మణులు మరియు దైవాన్య బ్రాహ్మణ సమాజం నుండి అధిక భక్తులు వస్తుంటారు
💠 ఈ ఆలయం ఆధునిక వాస్తుశిల్పానికి ఒక ఉదాహరణ, ఇది సంక్లిష్టమైన ద్రావిడ శైలి వాస్తుశిల్పం యొక్క ప్రాథమిక అంశాలతో మిళితం చేయబడింది
💠 ఆలయ ప్రాంగణంలో ఐదు అంతస్తుల ధ్వజస్తంభం ఉంది.
ఆలయ ప్రధాన ద్వారంలోకి ప్రవేశించిన తర్వాత, ''సభా మంటపం'' లేదా పూజా మందిరంలోకి ప్రవేశిస్తారు. ఈ కట్టడం 1951లో పునర్నిర్మించబడింది. ప్రధాన లోపలి మందిరంలో శ్రీ రామనాథుని విగ్రహం ఉంది,
💠 రామనాథ్ దేవాలయం యొక్క వార్షిక జాతర పూర్తి ఉత్సాహంతో మరియు భక్తితో స్వామివారి విగ్రహాన్ని మోస్తూ ఆలయం చుట్టూ పల్లకి ఊరేగింపుతో జరుపుకుంటారు. నవరాత్రులు కూడా ఘనంగా జరుపుకుంటారు.
💠 ఆలయ సమయాలు:
ఉదయం 7:30 నుండి రాత్రి 9:30 వరకు.
💠 ఈ ఆలయం గోవా రాజధాని పనాజీకి దాదాపు 20 కిమీ దూరంలో ఉన్న బండివాడే అనే అందమైన నగరంలో కనిపిస్తుంది.
ఈ దేవాలయం కావలెంలోని శాంతదుర్గ దేవాలయం నుండి కొద్ది నిమిషాల దూరంలో ఉంది.