12, అక్టోబర్ 2023, గురువారం

Panchaag


 

బృహస్పతిరువాచ

 ఓమ్

బృహస్పతిరువాచ

సౌవర్ణం రాజతం తామ్రం పితౄణాం పాత్రముచ్యతే | రజతం రజతాక్తం వా పితౄణాం పాత్రముచ్యతే || రజతస్య తథా చాపి దర్శనం దానమేవ చ | అనంతమక్షయం స్వర్గ్యం పితౄణాం దానముచ్యతే || పితౄనేతేన దానేన సత్పుత్రాస్తారయన్త్యుత | 

- బృహస్పతి పలికెను. సువర్ణము రజతము తామ్రము ఈ పాత్రలు పితృదేవతలకు మిక్కిలి ప్రియమైనవి. ఈ పాత్రములను శ్రాద్ధములో ఉపయోగించి దానము జేసినయెడల మహాఫలము ప్రాప్తించును. అనంతమూ అక్షయమూ అయిన స్వర్గాది మహాఫలము ప్రాప్తించును. సత్పుత్రులు ఇటువంటి ఉత్తమమైన దానమునుజేసి తమ పితృలకు ఉత్తమపదవిని దొరకింపజేతురు. నరకాద్యనర్థములు రాగొడక వాని తప్పింతురు. 


రాజతే హి స్వధా దుగ్ధా పాత్రేऽస్మిన్పితృభిః పురా || స్వధాదాయార్థిభిస్తాత తస్మిన్ దత్తే తదక్షయమ్ | 

- వత్స ! పూర్వమునందు సత్పుత్రులు రజతపాత్రమునందు పిండ తర్పణాది దానములొసగి తమ పితృలకు అక్షయమైన మహాఫలమును దొరకింపజేసినారు. స్వధాపేక్షులైన పితృదేవతలు ఇటువంటి మహాఫలమును పొందినారు.


కృష్ణాజినస్య సాన్నిధ్యం దర్శనం దానమేవ వా | రక్షోఘ్నం బ్రహ్మవర్చస్యం పితౄంస్తత్తద్వితారయేత్ || 

- శ్రాద్ధకాలమునందు కృష్ణాజినమునుపయోగించి, తద్దర్శనము, దానములతో భూతాదిపరిహారములూ, బ్రహ్మవర్చస్సూ కలుగును. పితృవులకు నరకాది విపత్తులు రాకుండగజేసి (శ్రాద్ధమునూ) రక్షించును. అతః కృష్ణాజినము అతిప్రియమైనదియని గ్రహించవలెను.


కాఞ్చనం రాజతం తామ్రం దౌహిత్రం కుతపస్తిలాః | వస్త్రం చ పావనీయాని త్రిదండో యోగమేవ చ || శ్రాద్ధకర్మణ్యయం శ్రేష్ఠో విధిర్బాహ్యః సనాతనః |  ఆయుః కీర్తిః ప్రజాశ్చైవ ప్రజ్ఞాసంతతివర్ద్ధనః ||

- సువర్ణ, రజత తామ్రపాత్రలు, దౌహిత్రుడు, కుతపకాలము, తిలలు, త్రిదండము (యోగదండము) ఇవి శ్రాద్ధమునందు పవిత్రములు ఉత్తముములైనవి. మరియు శాస్త్రవిహితములూ, బ్రహ్మజ్ఞానదాయకములూ, సనాతనములూ, ఆయుః కీర్తి సంతాన దివ్యజ్ఞాన ప్రజాదాయక-వర్ధనములైయున్నవి. (వాయుపురాణమ్).

విదురనీతి

 విదురనీతి

శ్లో)సమాగతం ద్విజం దృష్ట్వా కేశినీ భరతర్షభ ప్రత్యుత్థాయాసనం తస్మై పాద్యమర్ఘ్యం దదౌపునః॥


అ)భరతకులోత్తమా తనదగ్గరికి వచ్చిన బ్రాహ్మణుణ్ణి చూచి కేశిని ఎదురులేచి అతనికి అర్ఘ్యపాద్యాలు సమర్పించెను

ఉద్ధవగీత

 ఉద్ధవగీత

శ్లో)దత్త్వాఽచమనముచ్ఛేషం విష్వక్సేనాయ కల్పయేత్ | ముఖవాసం సురభిమత్ తాంబూలాద్యమధార్హ యేత్ ||


 అ)తరువాత ఆచమనీయము నిచ్చి మిగిలిన

 నైవేద్యభాగమును విష్వ క్సేనున కర్పింపవలెను. సుగంధయుక్త మగు తాంబూలాదిముఖవాసమును, పుష్పాంజలిని సమర్పించి పూజింపవలెను

శ్రీ ఆదిశక్తి దుర్గాదేవి మందిర్

 🕉 మన గుడి : నెం 206





⚜ ఢిల్లీ : ఝాన్డే వాలన్


⚜ శ్రీ ఆదిశక్తి దుర్గాదేవి మందిర్ 



💠 ఆది శక్తి మా జందెవాలి మా దుర్గా దేవి అవతారం.  

సృష్టిలో నైతిక క్రమాన్ని మరియు ధర్మాన్ని కాపాడే పరమాత్మ శక్తిని ఆమె సూచిస్తుంది.  ఆమె ఎరుపు రంగును ధరించి, అనేక ఆయుధాలను పట్టుకుని, తన వాహనం (పులి)పై ప్రయాణిస్తుంది, ఇవన్నీ ఆమె అపారమైన మరియు అపరిమితమైన శక్తిని సూచిస్తాయి, ఇది ధర్మాన్ని రక్షించడానికి మరియు చెడును నాశనం చేయడానికి ఉపయోగిస్తుంది.


💠 ఝండేవాలన్ మాత ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతంలో ఉండేదని, మాతరణి యొక్క గొప్ప భక్తుడైన బద్రీ భగత్ ఆమె గురించి కలలు కన్నాడని మరియు ఆమె ఈ విగ్రహం గురించి అతనికి చెప్పిందని చెబుతారు.  

ఈ ప్రదేశంలో బద్రీ భగత్ అమ్మవారి విగ్రహాన్ని తవ్వినప్పుడు, విగ్రహం భూమిలో కనిపించింది, అయితే దురదృష్టవశాత్తు తల్లి విగ్రహం త్రవ్వినప్పుడు చేతులు విరిగిపోయాయి.

హిందూ గ్రంధాల ప్రకారం, విరిగిన విగ్రహాన్ని పూజించడం నిషేధించబడింది, అందుకే వెండి చేతులు తయారు చేయబడ్డాయి. 

ఇది ఇప్పటికీ ఆలయ గుహలో సురక్షితంగా ఉంచబడింది.



💠 దీని తరువాత అదే స్థలంలో ఝండేవాలన్ ఆలయం నిర్మించబడింది మరియు దీనిని శ్రీ బద్రీ భగత్ ఝండే వాలా మందిర్ అని కూడా పిలుస్తారు.  

ఇక్కడికి కుల, హోదా అనే తేడా లేకుండా అందరూ వచ్చి పూజలు చేసుకోవచ్చు.


💠 అది కొండ ప్రాంతం కాబట్టి గుడి ఆవరణలో పెద్ద పెద్ద జెండాలు అప్పట్లో పెట్టారు  తద్వారా ఆలయాన్ని చాలా దూరం నుండి చూడవచ్చు అని.

ఆ రోజులలో భక్తులు మా ఆది శక్తికి ప్రార్థన జెండాలను అధిక సంఖ్యలో సమర్పించారు కనుక దీనిని ఝండేవాలన్ దేవాలయం అంటారు.


💠 ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు, ఆలయ పవిత్ర వాతావరణం ఒక వ్యక్తిలో పవిత్రతను నింపుతుంది. అందమైన శిల్పకళతో, నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయాన్ని పువ్వులు, దీపాలతో అలంకరించి, భారీ సంఖ్యలో జనాలతో ఆలయం మరింత అందంగా కనిపిస్తుంది. 


💠 ఇందులో మా జందెవాలి విగ్రహం మరియు సరస్వతి మరియు కాళీ విగ్రహం ఇతర దేవుళ్ళతో పాటు ఉన్నాయి. ఇది కాకుండా, ఆలయం యొక్క దిగువ స్థాయికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో శివపూజ చేయడం కోసం మంత్రముగ్ధులను చేసే శివ మందిరం కూడా ఉంది


💠 ఆలయం అద్భుతంగా చెక్కబడింది మరియు కొన్ని స్తంభాలు బంగారంతో చెక్కబడ్డాయి.  

ఈ కాంప్లెక్స్‌లో మా ఆది శక్తితో పాటు అనేక ఇతర దేవాలయాలు ఉన్నాయి.


💠 గుహలో రెండు దీపాలు 8 దశాబ్దాలుగా వెలుగుతున్నాయి.  ఆలయంలో నవరాత్రులలో ప్రతిరోజూ భారీ అన్నదానం నిర్వహిస్తారు.  నవరాత్రి సమయంలో వేలాది మంది ప్రజలు ఆలయాన్ని సందర్శిస్తారు.


💠 అన్ని ప్రధాన పండుగలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు 'బద్రీ భగత్ ఝండేవాల్ మందిర్ సొసైటీ' ద్వారా ఆలయంలో నిర్వహించబడతాయి.

ముఖ్యంగా దుర్గాపూజ మరియు నవరాత్రి పండుగలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


💠 ఆలయ సమయం : 

ఉదయం 5:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు మరియు సాయంత్రం 4:00 నుండి రాత్రి 10:00 వరకు (పండుగల సమయంలో సమయాలు మారవచ్చు)


మంగళ ఆరతి- 5:30 AM

శృంగార్ ఆరతి- 9:30 AM

భోగ్ ఆరతి- 12:00 మధ్యాహ్నం

సాయంత్రం ఆరతి- 7:30 PM

రాత్రి ఆరతి- 10:00


💠 ఎలా చేరుకోవాలి ?

బ్లూ లైన్‌లో ఉన్న ఝండేవాలన్ మెట్రో స్టేషన్‌లో దిగాలి.  ఆలయం 5-10 నిమిషాల నడక దూరంలో ఉంది.

Stitching teqnic


 

A I


 

Home trick


 

Sewing machine teqnics


 

Knots


 

Light connection


 

Sewing teqnic

 https://youtube.com/shorts/6nJbR7MQcYE?si=nxMICZw47MuHUcFN


నీతికధ

 పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి, అడవుల్లోకి పారిపోయాడు. అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతున్నాడు. గెలిచిన రాజు ఆ ఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు. అనుకోకుండా, అక్కడ యాగధేనువు మరణించింది. అది అశుభ సూచన. యజ్ఞాన్ని ఎలా పూర్తిచేయాలో తెలియక ఆ రాజు తికమక పడ్డాడు. నగర పురోహితుల్ని సంప్రతిస్తే- ఆ ధర్మసూక్ష్మం తెలిసినవాడు ఓడిపోయిన రాజేనని తేలింది. ధర్మసంకటం నుంచి గట్టెక్కించగలవాడు ఆయనేనని నిశ్చయమైంది.

గెలిచిన రాజు ఏమాత్రం సందేహించకుండా ఓడిన రాజు వద్దకు వెళ్లి, యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించాడు. ఆయనా ఏ శషభిషలకూ తావు లేకుండా ధర్మనిర్ణయం కోసం ముందుకొచ్చాడు. శత్రువుకు సహకరించాడు.

ఆ ఇద్దరు రాజులూ ఆర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాల్ని త్యజించారు. వారి కథే- శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’లోని ‘ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం’ సారాంశం. సమాజం అనే ధర్మసౌధం పటిష్ఠంగా నిలిచేందుకు భారతీయ ప్రాచీన సాహిత్యం ఎంతగా తోడ్పడిందో, ఈ ఉదాహరణ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఈ కథలో ఓడిన రాజు ఖాండిక్యుడు; గెలిచినవాడు కేశిధ్వజుడు. కథ చివర గొప్ప మలుపు ఒకటుంది.

తన యజ్ఞ సంపూర్తికి సహకరించిన ఖాండిక్యుడికి గురుదక్షిణగా ఏది కావాలన్నా ఇస్తానని కేశిధ్వజుడు ప్రకటిస్తాడు. అది సంప్రదాయం. ఓడిన రాజుకు ఓర్మి ఎంత ప్రధానమో- గెలిచిన రాజుకు సంయమనం, ధర్మ సంప్రదాయ పరిరక్షణ అంతే అవసరం. ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న ఖాండిక్యుడు తాను కోల్పోయిన రాజ్యం తిరిగి గురుదక్షిణగా కావాలన్నా ఇచ్చేయడానికి కేశిధ్వజుడు సిద్ధపడతాడు. ఇక్కడే ఓ చిత్రం చోటుచేసుకుంటుంది. రాజ్యసంపద అయాచితంగా వచ్చిపడుతున్నా ఖాండిక్యుడు కాదంటాడు! తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని, అదే కేశిధ్వజుడి నుంచి తాను కోరుకునే గురుదక్షిణ అని ప్రకటిస్తాడు.

ఖాండిక్యుడి నిర్ణయం కేశిధ్వజుణ్ని విస్మయానికి గురిచేస్తుంది. ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు ఖాండిక్యుడు అంటాడు- ‘రాజ్యభోగాలు కేవలం భౌతిక సంపదలు. వాటిని కష్టంతో, శారీరక శ్రమతో సాధించుకోవాలి. అంతేగాని, అవి అయాచితంగా లభించాలని కోరుకోకూడదు. కష్టపడి సాధిస్తేనే, వాటి విలువ తెలుస్తుంది. నా కంటే బలవంతుడి చేతిలో ఓడిపోయాను. అందులో సిగ్గు పడాల్సింది ఏముంటుంది? తిరిగి పుంజుకొని ధర్మమార్గంలో, క్షాత్రంతో నా రాజ్యాన్ని నేను తిరిగి చేజిక్కించుకోవాలి. అది ఒప్పుతుంది గాని, దొడ్డిదారిన పొందితే పాపమవుతుంది’ అని బదులిస్తాడు ఖాండిక్యుడు!

ఇలాంటి కథల్ని పిల్లలకు పాఠ్యాంశాలుగా నిర్ణయిస్తే, వారి బాల్యాన్ని అవి ధార్మిక పథంలోకి నడిపిస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. ఉచితాల కోసం తాపత్రయపడకుండా ఆపుతాయి. ఉచితానుచిత జ్ఞానాన్ని వారికి అలవరుస్తాయి.

ఆముక్తమాల్యదలోని ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం- ఆ కావ్యానికి గుండెకాయ వంటిదని ప్రశస్తి రావడానికి ముఖ్య కారణాలేమిటి? ఆ కథలోని ధార్మిక నేపథ్యం, ప్రబోధ గుణం. గెలుపు ఓటముల విషయంలో, కర్తవ్య నిర్వహణలో, అయాచిత అవకాశాల తిరస్కరణలో ప్రతిఫలించిన ధర్మస్వరూపమే- భారతీయతకు వన్నెలద్దుతూ వచ్చింది.

లోకంలో ఇలాంటి కథలు ఒళ్లు మరిపించడమే కాదు, కళ్లు తెరుచుకొనేలా చేస్తాయి. దీనికి మన ప్రాచీన సాహిత్యమే గొప్ప ఆదరువు.

🙏దయచేసి ఇలాంటి నీతికధలను తప్పకుండ ముందుతరాలకు పంచండి🙏
****************

Aaraadhana yenduku


 

Chetny powder


 

Karma yogam gnyana yogam


 

ఎంచుకోండి

 *హిందూ సోదరులందరినీ అభ్యర్థిస్తున్నాము, ఖచ్చితంగా దీన్ని చేయండి*: -

1) నాయకుడిని ఎన్నుకోండి *హిందూ*

2) న్యాయవాదిని ఎంచుకోండి *హిందూ*

3) ఇంజనీర్ *హిందూ* ఎంచుకోండి

4) ఆటో ఎక్కలా *హిందూ* ఎంచుకోండి

5) కూరగాయలు అమ్మే వాడు ఎంచుకోండి *హిందూ*

6) మొబైల్ రీఛార్జ్

*హిందూ* ఎంచుకోండి

7) మెడికల్ స్టోర్ *హిందూ* ఎంచుకోండి

8) మిల్క్ డెయిరీ *హిందూ* ఎంచుకోండి

9) ప్రింటింగ్ ప్రెస్ *హిందూ* ఎంచుకోండి

10) మిల్క్‌మ్యాన్ *హిందూ* ని ఎంచుకోండి

11) స్టేషనరీ దుకాణాలను ఎంచుకోండి *హిందూ*

12) బట్టల షోరూమ్ ఎంచుకోండి మరియు షాపింగ్ *హిందూ*

13) ఎలక్ట్రానిక్ & ఎలక్ట్రికల్ స్టోర్ *హిందూ* ఎంచుకోండి

14) వ్యవసాయ సేవా కేంద్రాన్ని ఎంచుకోండి *హిందూ*

15) ట్రావెల్ బుకింగ్ *హిందూ* ఎంచుకోండి

16) ఫ్లోర్ మిల్ *హిందూ* ఎంచుకోండి

17) కిరణా దుకాణాలను ఎంచుకోండి *హిందూ*

18) హార్డ్‌వేర్ స్టోర్ *హిందూ* ఎంచుకోండి

19) జిరాక్స్ సెంటర్ *హిందూ* ఎంచుకోండి

20) హోటల్ *హిందూ* ఎంచుకోండి

21) కూరగాయలు మరియు పండ్లు అమ్మేవారు  *హిందూ* ఎంచుకోండి

22) మిషన్ *హిందూ* ఎంచుకోండి

23) స్వీట్ షాప్ *హిందూ* ఎంచుకోండి

24) మిగతా అన్నిటికీ చికెన్ మటన్ కొనాల *హిందూ* వ్యాపారిని ఎన్నుకోండి


హిందువుకి ఇలాంటి ఆలోచన ఉండాలి ఎందుకంటే ఒక చిన్న ఆలోచన పెద్ద ఆయుధం గా మారుతుంది.

మీరు భుజంతో భుజం కలిపిన తర్వాత, ప్రతి ఒక్కరూ తల వంచకపోతే చూడండి. 


 *జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్* 


గమనిక: 

ఈ సందేశాన్ని ప్రతి 10 మంది హిందువులకు పంచుకోండి మరియు రోజుకు ఒకసారి ఈ సందేశాన్ని ఉంచండి. చాలా ధన్యవాదాలు


జై శ్రీ రామ్


చివరిగా

ఒక పాయింట్ మరియు


*ఈ సందేశాన్ని  హిందువుకు మాత్రమే పంపండి*


 *తప్పకుండా పంపించండి.*

🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

రాముడి విషయంలో

 రాముడి విషయంలో లేదా రామాయణం విషయంలో పరమ ప్రమాణం వాల్మీకి విరచిత 24వేల శ్లోకములే. మిగతా రామాయణాలు వివిధ భాషల్లో వివిధ కవులు తమ భక్తిని రంగరించి రాసినవి. ఆ కవి ఎంతటి వారైనా సరే వారు రాసిన దాంట్లో వారిదైన కల్పన ఉంటుంది. అవి కేవలం ఆస్వాదించటానికే తప్ప ప్రమాణానికి నిలబడవు. బ్రహ్మ అనుగ్రహంతో బ్రహ్మ నిర్దేశానుసారం రాముడు నడయాడిన కాలాన్ని పూర్తిగా(భూత భవ్య భవిషత్తు)దర్శించి రామాయణాన్ని రాముడి చేతేనే ఆమోద ముద్ర వేయించి వాల్మీకి మనకందించారు. కాబట్టి వాల్మీకి రాముడే పరమ ప్రమాణం.🙏

Joke






 

సనాతనధర్మానికి శత్రువు హిందువే.

 సనాతనధర్మానికి శత్రువు హిందువే.


దైవం మాట ఎత్తితే చాలు టైం లేదు అంటాడు. 

అన్యమతస్థులకు ఎక్కడి నుండి వస్తుంది టైం?

నీకంటే కూడా గొడ్డు చాకిరి చేస్తారు. కానీ పిల్లలకి చిన్ననాటి నుండే మతబోధ చేస్తారు. మనం చేయం. 


పోనీ చేసేవారిని సపోర్ట్ చేస్తారా అంటే అదీ ఉండదు. నీకెందుకు అంటారు. పిల్లలు ఈ విషయం మీద ఏదన్నా మాట్లాడితే ఈ వయస్సులో దేనికి నీకు అంటారు. టైం ఉండదు. చిన్నప్పుడు నేర్పక, వయస్సు లో చేయక ఎప్పుడు చేస్తారు?


అందుకే హిందువులలో ఉన్నవారు కన్వర్ట్ అవుతారు కానీ అన్యమతస్థులలో కన్వర్షన్ చాలా తక్కువ. మనవాళ్ళు 1000 మంది వెళితే అవతలివారిలో మహా అయితే ఓ 10మంది ఉంటారు..


ధర్మాన్ని ఎవరో వచ్చి నిలబెడతారు. ఎవరో వచ్చి కాపాడతారు అని యువతని సనాతనాధర్మానికి దూరం చేసేశారు. దేవుడంటే కోరికలు తీర్చేవాడుగా చేశారు. దేవాలయాలు ఈ బలహీనతలని కేవలం పూజలు, 2నిముషాలు దండ పెట్టి దర్శనాలు అంటూ పరిమతి  చేసినంము.పిల్లలకి గాని, యువతకి కానీ ధర్మం చెప్పేవారు లేరు. బోధించేవారు అసలే లేరు. ఒకరిద్దరు ఏదన్నా బోధిద్దామని ప్రయత్నిస్తే భాషాజ్ఞానం లేకపోవడం వల్ల తప్పులు పట్టి వారిని అవమానిస్తున్నారు. 


మనం మాత్రం సంపాదించాలి. మేడలు కట్టాలి. ధర్మం మాత్రం బోధించకూడదు. అదేమంటే వీటికే సమయం లేదు.

అన్యమతస్థులు కూడా వాళ్ళ ధర్మాన్ని పిల్లలకి నేర్పుతున్నారు. మనకి ఎందుకు సమయం ఉండదో మరి..ధన్యవాదములు.🙏👍

శరణాగతి ఫలితం..*

 *శరణాగతి ఫలితం..*


కొన్ని సంవత్సరాల క్రిందట ఆశ్వీయుజ మాసం లో దీపావళి పండుగ కు ముందు శనివారం నాడు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వాడ మధ్యాహ్నం మూడు గంటల నుంచీ వర్షం కురవడం మొదలైంది..మరో అరగంటకల్లా..వాతావరణం పూర్తిగా మారిపోయి..కుండపోత వర్షం కురవసాగింది..మా సిబ్బంది నా దగ్గరకు వచ్చి.."అయ్యా..ఈరోజు పల్లకీసేవ జరపడం కష్టం..పల్లకీ తిరుగాడే దారి అంతా బురదగా మారిపోయింది..ఇంకో అరగంటకు ఎండ వచ్చినా..ఈ బురద ఆరిపోదు..అందువల్ల పల్లకీని మంటపం లోనే ఉంచి..కేవలం పూజ మాత్రమే చేద్దాము.." అన్నారు..అర్చకస్వాములు కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు..పరిస్థితి కళ్లారా చూస్తున్నాను కనుక..నేను కూడా సరే అన్నాను..సాయంత్రం ఆరు గంటలకు వర్షం తగ్గింది.."ఈరోజు పల్లకీసేవ వద్ద అర్చన మాత్రమే జరుగుతుంది..పల్లకీని మందిరం చుట్టూరా త్రిప్పటం లేదు.." అని భక్తులకు మైక్ ద్వారా తెలియపరచమని మా సిబ్బందికి చెప్పాను..అదే విషయాన్ని వాళ్ళు మైక్ ద్వారా రెండు మూడు సార్లు చెప్పారు..


అదే సమయం లో మందిరం వద్దకు బస్సు వచ్చి ఆగింది..అందులోనుండి మధ్యవయకులైన ఓ భార్యా భర్తా వచ్చారు..ఇద్దరూ స్వామివారి మందిర ప్రాంగణం లోకి వచ్చి..మైక్ లో పల్లకీసేవ గురించి మా సిబ్బంది చెపుతున్న ప్రకటన విని..నిరుత్సాహానికి గురైనట్టు బాధపడుతూ..నేరుగా మా సిబ్బంది వద్దకు వెళ్లి.."ఈరోజు పల్లకీసేవ రద్దు చేసారా..? అందులో పాల్గొనాలి అని చాలా దూరం నుండి వచ్చాము.." అన్నారు..మా సిబ్బంది వాళ్లకు పరిస్థితి వివరించి..మందిరం వెలుపల దారి అంతా వర్షం కారణంగా బురదగా మారినందున..పల్లకీ తిరగడం సాధ్యం కానందున..అలా త్రిప్పటం ఆపేసామని..పల్లకీ వద్ద అర్చన మాత్రం మందిరం లో జరుపుతామని " చెప్పారు.. "అలాగా..." అని సాలోచనగా అన్నారు..కొద్దిసేపు ఆలోచించుకొని.."సరే..మేము అర్చన చేయించుకుంటాము..మా పేర్లు నమోదు చేయండి.." అన్నారు..వాళ్ళ పేర్లు మా సిబ్బంది నమోదు చేసుకున్నారు..చిత్రంగా..ఆరోజు పల్లకీసేవ వద్ద అర్చన చేయించుకోవడానికి ఆ దంపతులు తప్ప మరెవ్వరూ పేర్లు నమోదు చేసుకోలేదు..


ఆరోజు సాయంత్రం ఏడు గంటలకు  మా అర్చకస్వాములు పల్లకీ ని అలంకరించి..స్వామివారి సమాధికి ఎదురుగా ఉన్న ముఖమంటపం లో ఉంచారు..అప్పటికి వర్షం ఆగిపోయి దాదాపుగా రెండు గంటలు అవుతున్నది..మా సిబ్బందిని పిలిచి.."పల్లకీ వద్ద అర్చన అయిపోయిన తరువాత..మందిరం లోపలే..స్వామివారి గర్భాలయపు మందిరం చుట్టూ..శ్రీ సాయిబాబా మందిరం ముందునుంచి..ప్రదక్షిణగా పల్లకీని త్రిప్పుదామని అనుకుంటున్నాను..మీ అభిప్రాయం చెప్పండి.." అని మా సిబ్బందిని అర్చకస్వాములను అడిగాను.."అయ్యా..ఈరోజు గట్టిగా వందమంది భక్తులు కూడా లేరు..ఇక్కడే త్రిప్పుదాము.." అన్నారు..అందరమూ ఒక అభిప్రాయానికి వచ్చిన తరువాత..పల్లకీసేవ మొదలుపెట్టాము..ఆ దంపతులు అత్యంత భక్తిగా పల్లకీవద్ద తమ గోత్రనామాలతో అర్చన చేయించుకున్నారు..పల్లకీ ని స్వామివారి మందిరం లోపలి భాగం లోనే మూడు ప్రదక్షిణాలుగా త్రిప్పుతున్నాము అని చెప్పగానే..ఆ భార్యా భర్తల ముఖం లో సంతోషం వచ్చింది..అతను గబ గబ పల్లకీ ని ఒక వైపు తన భుజం మీద ఎత్తుకొనున్నాడు..మూడు ప్రదక్షిణాలు పల్లకీ మోసి..హారతి కళ్లకద్దుకొని..తీర్ధ ప్రసాదాలు తీసుకొని ఇవతలికి వచ్చారు..వాళ్ళ ముఖాల్లో ఏదో తృప్తి ఉన్నది.."రేపుదయం ఎన్ని గంటలకు మేము మందిరం లో ఉండాలి..?" అని నన్ను అడిగారు..ఆదివారం ఉదయం ప్రభాతసేవ తాలూకు అభిషేక హారతుల గురించి చెప్పి..ప్రొద్దున్నే ఐదు గంటలకు రమ్మన్నాను..సరే అని వెళ్లిపోయారు..


ఆదివారం ఉదయం ఐదు గంటల నుంచి..స్వామివారి సమాధికి అర్చకస్వాములు నిర్వహించే అభిషేకము..హారతులను ఆ దంపతులు చూసారు..ఏడు గంటలకు స్వామివారి సమాధిని దర్శించుకున్నారు..తమ గోత్రనామాలతో స్వామివారి ఉత్సవ మూర్తి వద్ద అర్చన చేయించుకొని..నేరుగా నావద్దకు వచ్చి.."అయ్యా..మేము అనుకున్న విధంగా స్వామివారిని దర్శించుకొన్నాము..చాలా తృప్తిగా ఉంది..కొండంత సమస్యతో ఇక్కడికి వచ్చాము..మా సమస్యను స్వామివారి పాదాల వద్ద విన్నవించుకున్నాము..ఇక మాకు స్వామివారే దిక్కు.. మా సమస్య తీరిపోయి మేము ఒడ్డున పడితే..స్వామివారి వద్దకు మళ్లీ వచ్చి తలనీలాలు సమర్పించుకుంటాము..శనివారం పల్లకీ సేవ..ఆదివారం ప్రభాత సేవ..రెండింటిలో పాల్గొని..మా శక్తికొద్దీ అన్నదానం చేస్తాము.." అన్నారు..స్వామివారి విభూతి గంధం ఉన్న పాకెట్లు ఐదు కొనుక్కున్నారు..వాళ్ళు ఎక్కడినుంచి వచ్చారో కూడా తెలుపలేదు..ఆ ఉదయం 10 గంటల బస్సులో వెళ్లిపోయారు.. ఆ తరువాత వాళ్ళ గురించి మర్చిపోయాము కూడా..


సరిగ్గా ఆరేడు నెలల తరువాత..శ్రీ స్వామివారి దత్తదీక్షా సమయం లో ఒక శనివారం మధ్యాహ్నం నాడు ఆ దంపతులు స్వామివారి మందిరానికి వచ్చారు..మందిరం లోపలికి వస్తూనే..నేరుగా మా దంపతులము కూర్చుని ఉన్న చోటుకి వచ్చారు..ఏ ఉపోద్ఘాతమూ లేకుండా.."అయ్యా..మేము గుర్తువున్నామా?..ఆరు నెల క్రితం ఇక్కడికి వచ్చాము..ఆరోజు వర్షం కారణంగా పల్లకీని మందిరం లోపలే త్రిప్పారు..మాకొక సమస్య ఉన్నది..తీరగానే స్వామివారి వద్దకు వస్తాము అని మీతో చెప్పి వెళ్ళాము.." అన్నారు..నాకు గుర్తుకు వచ్చింది..ఆ మాటే చెప్పాను.."అయ్యా..మా సమస్య తీరిపోయింది..స్వామివారే తీర్చారు..మేము నమ్మి ఇంతదూరం వచ్చాము..మా మొర ఈ స్వామివారు ఆలకించారు..ఇప్పుడు మా సమస్య చెపుతాము వినండి..గత పదేళ్లుగా  మేము ఇళ్లు కట్టించి..అమ్ముకునే వ్యాపారం చేస్తున్నాము..బాగా జరుగుతూ ఉన్నది..మొదట్లో మా శక్తిమేరకు ఒకటో రెండో ఇళ్లు కట్టించి అమ్ముకునే వాళ్ళం..సంవత్సరానికి ఓ పదిలక్షలు మిగిలేది..తరువాత ఎక్కువ కట్టించి అమ్ముకుంటే లాభాలు ఎక్కువుంటాయని ఆలోచన చేసి..అప్పుచేసి మరీ వ్యాపారం పెంచుకున్నాము.ఒకేసారి నాలుగు చోట్ల మొదలుపెట్టాము..ఇళ్లు పూర్తయ్యేనాటికి డిమాండ్ తగ్గిపోయింది..ఒక్కసారిగా పెట్టుబడి ఇరుక్కుపోయింది..మాకు దిక్కు తోచలేదు..మా ఇంట్లో ఉన్న బంగారం..చేతిలో ఉన్న డబ్బూ అన్నీ కరిగిపోయాయి..అప్పులకు వడ్డీ పెరిగింది..ఒకానొక స్థితిలో ఆత్మహత్యే శరణ్యం అనే స్థాయికి వెళ్లిపోయాము..ఆ సమయం లో ఈ స్వామివారి గురించి హైదరాబాద్ లోని నా మిత్రుడు చెప్పి..మమ్మల్ని బలవంతంగా ఇక్కడకు పంపాడు..స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మండి..మీకు మేలు జరుగుతుంది..అన్నాడండీ..అతని మాట మీద ఇక్కడకు వచ్చాము..స్వామివారిని శరణాగతి చెందిన రెండు నెలల్లోనే..పరిస్థితి మారిపోయింది..సగం ఇళ్ళు అమ్ముడుపోయాయి..ముందు అప్పులు తీర్చుకున్నాము..ఇప్పుడు మా పెట్టుబడి రావాలి..అదికూడా వస్తుంది..ఎందుకంటే ఇంకొన్ని ఇళ్లకు అగ్రిమెంట్ అయింది..ధైర్యం వచ్చింది..అంతా ఈ స్వామివారి కారుణ్యం మాత్రమే...ఒక్కటి మాత్రం నిజమండీ..ఈ స్వామివారికి శరణాగతి చెందితే..వెంటనే ఫలితం చూపిస్తారు..అందుకు మా జీవితాలే సాక్ష్యం.." అని ఉద్వేగంతో..ఇద్దరూ కళ్లనీళ్ళతో చెప్పుకొచ్చారు..


ఆ రోజు పల్లకీసేవ లో పాల్గొన్నారు..ఆదివారం ఉదయం ఇద్దరూ తలనీలాలు ఇచ్చారు..ఆ తరువాత స్వామివారి సమాధి దర్శించుకొని ఇవతలికి వచ్చి..దత్తదీక్ష రోజుల్లో జరిగే అన్నదానం గురించి తెలుసుకొని..రాబోయే శని ఆదివారాల్లో అన్నదానానికి అయ్యే వ్యయం ఇస్తామని చెప్పి..అంతేకాకుండా దత్తదీక్ష చేసే స్వాములకు మూడురోజుల అన్నప్రసాదానికి కూడా ఖర్చు తామే భరించి..ఐదు రోజులు నిద్ర చేసి..ప్రతిరోజూ స్వామివారి సమాధి దర్శించుకొని..తిరిగి వెళ్లారు..


స్వామివారు కారుణ్యమూర్తి అని మేము అందరితో చెపుతుంటాము..ఆ మాటను ఆ అవధూత దత్తాత్రేయుడు పదే పదే మాకు ఋజువు చేస్తూ మౌనంగా సమాధిలో కూర్చుని వుంటారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

ఆచార్య సద్బోధన:

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


🌹రామ్ కృష్ణ హరి 🌹



         * ఆచార్య సద్బోధన:*

                 ➖➖➖✍️


*"మనకు తెలియకుండానే మన కర్మలు నశించుకుపోయి, మన సకల పాపములు భస్మమై మన జన్మలు ధన్యం అయ్యే మార్గం ఏమైనా ఉందా?"*


గురు శిష్యుల, సంవాదం ...!!!

```

మానసిక శాంతి మరియు అంతర్గత ఆనందం పొందడం అనేది ఆధ్యాత్మిక రంగంలో పూర్తిగా మీ సొంతం. 


కష్ట నష్టాలు, సుఖ దుఃఖములు పూర్తిగా మీరే భరించాల్సి ఉంటుంది. దానిని ఇతరులకు బదిలీ చేసే హక్కు మీకు లేదు.


ఇంధనం అయిపోతే మంట ఆరిపోతుంది, మంటలో మరింత ఇంధనం పోస్తే మంట ఇంకా పెద్దది అవుతుంది. 

కనుక ఇంద్రియాలు అనే అగ్నికి విషయాలనే ఇంధనాన్ని జోడించవద్దు. 

మనస్సును తాత్కాలికం నుండి వేరు చేసి శాశ్వతమైన దానికి జతచేయండి. 

మీ మనసులో భక్తి మొలకలను నాటండి, అంటే మనస్సులో భగవంతుని నామస్మరణ చేస్తుండండి.

ధర్మం, సేవ, త్యాగం, ప్రేమ, సమానత్వం, ధైర్యం అనే శాఖలతో చెట్టుగా ఎదగండి.

రుచులను అనుభవించుటకు,  దేహమును పెంచుకోవడానికి కాకుండా అత్మోద్దరణకు, పరోపకారం నిమిత్తం శరీరం పనిచేయుటకు మంచి ఆహారాన్ని తీసుకోండి. 

భగవంతుని నామ స్మరణ చేస్తూ.., నిస్వార్థంగా సమాజ శ్రేయస్సు కొరకు శ్రమించండి.

తద్వారా మీకు తెలియకుండానే మీ కర్మలు నశించుకుపోతాయి.

“మీ సకల పాపములు భస్మమై మీ జన్మలు ధన్యం అవుతాయి.”

అని గురువుగారు సెలవిచ్చారు...✍️

```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

always think of

 I always think of -My income.  My house.  My car, my business,.  My other Assets etc.  All this is safe, as long as my country is safe.  Otherwise everything will go up in flames.  Today two million Ukrainians are taking refuge in other countries leaving everything behind in the Russo-Ukraine war. HAMAS AND PALESTINIANS are lucky to have neighboring MUSLIM countries to get shelter. ISRAELIES are surviving because of strong National feeling even though badly surrounded by Islamic cutter vadies. What will happen to us???.  Where do you think we HINDUS can go???  Pakistan on one side, Bangladesh on one side, Indian Ocean below, China above, countless traitors inside the country!!!  BHARAT GIVEN SHELTER TO IRANIANS - ZEWS-CHINIES- ALL RELIGIONS. BUT  remember that there is no  country to give us asylum.  So instead of asking cheap petrol and free ration,  PREFER STRONG NATION. POSSIBLE ONLY WHEN WE LOVE AND THINK OF ALL THE SUPPRESSED  PEOPLE OF OUR BELOVED NATION.    

   *An undeniable truth.*🙏

Bhagavth geeta about diet


 

Gaanam


 

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-72🌹

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-72🌹*



🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*పూలబావి*


అద్దాల మండపానికి కొద్దిగా ఉత్తరంవైపున వెలసి ఉన్న బావి పూలబావిగా ప్రసిద్దిచెందింది. పుష్పాలంకార ప్రియుడైన శ్రీవారి అలంకరణకు ఎన్నోరకాల పూలమాలలు ఉపయోగపడుతున్నాయన్నది విదితమే. స్వామివారికి సమర్పించే తులసి, పుష్పం, పూలమాలలను వేరెవరూ ఉపయోగించకుండా ఈ పవిత్రమైన బావిలో వేస్తారు. అందుకే దీనిని పూలబావి అని పేరువచ్చింది. చారిత్రక ప్రాశస్థ్యం నేపథ్యంలో ఈ బావిని ‘తీర్థం’గా కూడా వ్యవహరిస్తారు. సాక్షాత్తూ భూదేవి తిరుమలలో ఏర్పాటుచేసిన తీర్థం కనుక దీనికి ఆ పేరు సిద్ధించింది. అయితే కాలాంతరంలో ఈ తీర్థం ఇక్కడే నిక్షిప్తమైపోయింది. అనంతరకాలంలో శ్రీనివాసుని ఆనతిపై రంగదాసు అనే భక్తుడు ఓ బావిని త్రవ్వగా ఈ భూతీర్థం మళ్లీ వెలుగులోనికి వచ్చింది. రంగదాసు ఈ బావిలోని నీళ్లను వాడుతూ స్వామివారి పూజకై సంపంగి, చామంతి తోటలను పెంచాడు. తరువాతి కాలంలో రంగదాసే తొండమాన్ చక్రవర్తిగా పునః జన్మించాడని చరిత్ర చెబుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి గత జన్మలో రంగదాసు నిర్మించిన శిథిలమైన బావిని మళ్లీ పునరుద్ధరించాల్సిందిగా ఆదేశించగా తొండమానుడు ఈ బావిని రాతితో కట్టి అవసరమైనపుడు బావిలోని ఒక రహస్య బిలం ద్వారా తిరుమలకు వచ్చి శ్రీనివాసుని దర్శించి వెళుతుండేవాడు. వరాహపురాణాంతర్గత వేంకటాచల మహత్యం అనుసారం ఒకప్పుడు శత్రువులతో యుద్ధంలో తరమబడిన తొండమానుడు ఈ రహస్యబిలం ద్వారా పరుగు పరుగున వచ్చి శ్రీనివాసుని చేరాడు. ఈ సమయాన తన ఉభయ దేవేరులతో ఏకాంతంలో స్వామివారు ఉన్నారు. అయితే తటాలున వచ్చిన తొండమానుని చూసి శ్రీదేవి అమ్మవారు స్వామివారి వక్షస్థలంలోనూ, భూదేవి అమ్మవారు సిగ్గుతో బావిలో దాక్కున్నారని తెలుస్తుంది. శ్రీ వేంకటాచల ఇతిహాసమాల ప్రకారం భగద్రామానుజులవారు తిరుమలకు వేంచేసినపుడు భూదేవి బావిలో దాక్కున్నదన్న పురాణ నేపథ్యంలో ఈ బావిలోనే భూదేవిని ప్రతిష్టించి తీర్థ్ధాపతిగా స్వామివారికి అరచనాది నివేదనలు జరుగుతున్నాయని అంతేగాక స్వామివారికి అలంకరించబడి తొలగించబడిన నిర్మల్యాన్ని (పూమాలలు, తులసిమాలలు వగైరా) భూదేవి కోసమే ఈ బావిలో వేస్తున్నారని తెలియజెప్తున్నది.


*శంఖనిధి - పద్మనిధి*


మహాద్వారానికి ఇరుప్రక్కల విడుపుల్లో ద్వారపాలకుల వలే సుమారు రెండడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు కనిపిస్తున్నాయి. కదా ! వీరే శ్రీ వేంకటేశ్వర స్వామివారి సంపదలను, నవనిధులను రక్షించే దేవతలు. ఇందులో ఎడమవైపున అంటే దక్షిణ దిక్కున ఉన్న దేవత, రెండు చేతుల్లోనూ రెండు శంఖాలు ధరించి ఉండటం గమనించండి! ఈయన పేరు ‘శంఖనిధి’ ఇలాగే కుడివైపున అంటే ఉత్తర దిక్కున ఉన్న రక్షక దేవత చేతుల్లో రెండు పద్మాలు ధరింపబడి ఉన్నాయి. ఈయన పేరు ‘పద్మనిధి’. ఈ నిధి దేవతల పాదాల వద్ద అంగుళాల పరిమాణంగల రాతి విగ్రహం నమస్కార భంగిమలో నిల్చొని ఉండటం గమనించండి. ఈ విగ్రహం విజయనగర రాజైన అచ్యుత దేవరాయలిది. బహుశా అచ్యుత దేవరాయలే ఈ నిధి దేవతామూర్తులను ప్రతిష్టించి ఉండవచ్చు. ఆగమశాస్త్రం ప్రకారం సాదారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి మూడవ ప్రాకారం ప్రవేశద్వారం వద్ద ఏర్పాటుచెయ్యడం సంప్రదాయం. దీన్ని బట్టి తిరుమల ఆలయం మూడు ప్రాకారాలు కలిగిన ఆలయమని ఈ నిధి దేవతల ప్రతిష్ఠ వల్ల స్పష్టమవుతున్నది. ఆలయం యొక్క మొదటి ఆవరణ ముక్కోటి ప్రదక్షిణం. రెండవది విమాన ప్రదక్షిణం. మూడవది సంపంగి ప్రదక్షిణం. మహద్వార దేవతలైన శ్రీ శంఖనిధి, పద్మనిధి దేవతలకు భక్తితో నమస్కరిద్దాం.


*జయ విజయులు*


తిరుమలలోని శ్రీవారి ఆలయంలోని తిరమమహామణి మండపంలో బంగారు వాకిలికి ఇరువైపులా శంఖుచక్ర గధాధారులై ద్వారపాలకులగు జయవిజయులు నిలచి ఉండి స్వామివారిని సదా సేవిస్తుంటారు. సుమారు 10 అడుగుల ఎత్తుగల ఈ పంచలోహ విగ్రహాలు స్వామివారి సన్నిధిలో భక్తులకు శ్రద్ద్భాక్తులతో వ్యవహరించండని సూచిస్తున్నట్లుగా జయుడు కుడిచేతి చూపుడువేలును విజయుడు ఎడమచేతి చూపుడువేలును చూపిస్తూ ఉంటాడు. రెప్పపాటు కాలం ఏమరుపాటు చెందకుండా స్వామి భక్తిపరాయణులగు జయవిజయులు స్వామివారి సన్నిధికి వేయికళ్ల కావలికాస్తుంటారు. తిరుమల క్షేత్రాన్ని సాక్షాత్తూ శ్రీ మహావైకుంఠాన్ని తలపించేరీతిలో వీరు బంగారువాకిట కావలి కాస్తారు.


*శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

_హిందువుల రా!

 🍁🍁🍁🌷🌷🌷🌷

*_హిందువుల రా! ఆలోచించండి...             కేవలం మీరు ఒక్క పని చేస్తే చాలు మీరు మొత్తం  బాగైపోతుంది ..... మీ ఓటు హక్కును వినియోగించండి_*


 *_ఎన్నికలు జరిగే రోజు మీరు సొంతంగా ఒక  10 మందిని హిందూ ధర్మం కోసం పాటు పడే పార్టీ కి ఓటు వేసేలా  పోలింగ్ స్టేషన్ వరకు రప్పిoచండి మీ కుటుంబం, మీ స్నేహితులు అందరూ ఓటు వేసేలా చూడండి ఇదొక్కటి చేయండి ఇదొక్కటి చేయండి చాలు ఈ దేశం తప్పకుండా మారుతుంది.                          కర్ణాటకలో బిజెపి ఘోర ఓటమికీ కారణం ఓటు హక్కు ఉండి కూడా  ఓటును వేయకుండా ఇంట్లో కూర్చున్న హిందువులే కారణం.._* 


*_హిందువు ఓటు వేయకుండా ఇంట్లో కూర్చుంటాడు , ముస్లిం వీలైతే ఒక్కోడే రెండు ఓట్లు వేస్తాడు ఈ దేశపు దౌర్భాగ్యనికి కారణం చాలా మంది హిందువులు ఓటు హక్కును వినియోగించుకోలేక పోవడం మన దేశం.. దర్మన్ని మనం నాశనం చేసుకోవడం అవుతుంది_*    

                

*_కాబట్టి ఓటు వేసి మన ధర్మం నిలబెట్టిండి..  దేశాన్ని కాపాడే పని  మోడీజీ.. యోగి జి చూసుకుంటారు._*   

                              

*_కాబట్టి ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోండి, లేకపోతే వెంటనే ధరకాస్తు చేసుకోండి 18 సం నిండిన ఇప్పటికీ ఓటరు కార్డు పొందని వారు కూడా ఇప్పుడే నమోదు చేసుకోండి..._*. 


 *_మీరు దేశానికి చేసే అత్యుత్తమ సేవ అని  మర్చిపోకండి..._*

🙏🙏🙏🙏🙏

లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయం

 లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయం

శ్రీనివాససిద్ధాంతి9494550355


*లక్ష్మీ కటాక్షం*


ధన మూలం ఇదం జగత్ అంటుంటారు అనగా ఈ జగత్తుకు మూలమైనది డబ్బు అని అర్థం ప్రతి ఒక్కరికి ధనం చాలా అవసరం సంపూర్ణంగా ధనం ఉంటే అన్ని కార్యక్రమాలు సజావుగా జరుగుతాయి. అటువంటి ధనము పొందాలంటే లక్ష్మీ కటాక్షం ఉండాలి జాతకమునందు 12 రాశులలో ఒక్కొక్క రాశి వారికి ఆ రాశిని అనుసరించి కొన్ని నియమాలు పాటించడం ద్వారా లక్ష్మీ కటాక్షం పొంది ధనానికి లోటు లేకుండా జీవించగలుగుతారు. ఉదాహరణకు కుంభ రాశి వారు ఏ నియమాలు పాటిస్తే లక్ష్మి కటాక్షం పొంది అత్యధిక ధనాన్ని సంపాదిస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కుంభ రాశి వారు గృహ ఆవరణలో ఆగ్నేయ భాగంలో పూల మొక్కను పెంచండి. ముఖ్యంగా మందార మొక్కను పెంచినట్లయితే ధనానికి ఎటువంటి లోటు ఉండదు అత్యధిక ధన ప్రవాహం ఉంటుంది.. కుంభ రాశి వారు హనుమంతుని దేవాలయాన్ని తరచుగా సందర్శించడం హనుమంతుని దేవాలయంలో రావి చెట్టు లేదా మర్రిచెట్టు ఇటువంటి ఉంటే వాటికి ప్రదక్షిణ చేయడం నమస్కారం చేసుకోవడం చేస్తూ ఉండాలి. అక్కడ ఏమి చెట్లు లేకపోతే మీరు ఒక వేప మొక్కను నాటండి. కుంభ రాశి వారు మీ జీవితకాలంలో ఎటువంటి చెట్లను నరకరాదు ఈ రాశి వారు చెట్లను ఎక్కువగా నాటడం పోషించడం చేస్తూ ఉంటే అత్యధిక అఖండమైన ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు. దేవత వృక్షాలు ఎక్కడ కనిపించినా సరే అనగా రావి మర్రి ఔదంబరి,వేప చెట్లు మొదలైన వృక్షాలకు నమస్కారం చేసుకోవాలి అవకాశం ఉంటే ప్రదక్షిణ చేయాలి. పై నియమాలు పాటిస్తూ ఉన్నప్పుడు కుంభరాశి జాతకులకు ధనపరమైన ఇబ్బందులు లేకుండా ఐశ్వర్యంతో జీవించగలుగుతారు.


జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

*ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*

*జ్యోతిషరత్న, member in international astrology federation. ..శ్రీనివాస సిద్ధాంతి*

*9494550355*


PlZ Forward the message



Disclaimer.  This blogger is not responsible for the above content. Vewers are requested to enquir before proceed. 

మహిషాసురమర్ధిని జ్యోతిష నిలయం

 ⚜️[ 8074538053]⚜️

⚜8074538053⚜

   || జ్యోతిష్యం చెప్పబడును ||


మహిషాసురమర్ధిని జ్యోతిష నిలయం 


√నమ్మినవారు దురం కావటం👬


√నిందలూ, అవమానాలు రావటం


√ఇతరులు అపార్థం చేసుకోవడం


√వివాహాం ఆలస్యంగా అవ్వటం👰🤵


√ఉద్యోగం సమస్య 👮


√పిల్లల పుట్టకపోవడం🤱🤰


√వ్యక్తిగత  జతక సమాచారం కోరకు


⚜️[8074538053]⚜️


••••••••ఓం శ్రీ మాత్రే నమః••••••••••


✓వ్యాపార వశీకరణ లేక నష్టం


✓రావల్సిన ఆస్థి, ధనం రాకపోవడం


✓భార్యా భర్తలు మధ్య వశీకరణ👫


✓విద్యా, విదేశి ప్రయణం, ఉద్యొగం 


✓కుటుంబ సభ్యుల  మధ్య విబేధాలు👨‍👩‍👦‍👦


✓అరోగ్య సమస్యలకు 


✓ప్రేమా సమస్యలకు 💏


ఇటువంటి  సమస్యలకూ ప్రత్ర్యకం గా 


చేయబడును ⚜8074538053⚜


🌷ఉన్నదీ వున్నట్లు గా చెప్పబడును🌹⚜8074538053⚜


👉.మీరు అనేక మంది జ్యోతిష్యులను సంప్రదించి నిరాశ చెంది ఉన్నారా అయితే చివరగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి పూర్తి పరిష్కారం లభిస్తుంది దయచేసి టైం పాస్ కోసం సరదా కోసం కాల్ చేయకండి మేము కోరేది కూడా మీ మంచి గురించే..  📲📲[[8074538053]]


Disclaimer. This blogger is not responsible for the above content. Vewers are requested to enquir before proceed. 

శ్రీ మద్భగవద్గీత🪷* *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*

 *🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*

*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*

*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*

*🌸 సాంఖ్య యోగః 🌸*


*2-అధ్యాయం,57వ శ్లోకం*


 *యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ ।* 

 *నాభినందంతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ।। 57* 


 *ప్రతిపదార్థము* 


యః — ఎవరైతే; సర్వత్ర — అన్ని పరిస్థితులలో; అనభిస్నేహః — మమకారం/ఆసక్తి లేకుండా; తత్-తత్ — వాటి వాటి; ప్రాప్య — పొంది; శుభ — మంచి; అశుభమ్ — చెడు; న, అభినందంతి — హర్షింపడు; న, ద్వేష్టి — ద్వేషింపడు; తస్య — అతని; ప్రజ్ఞా — జ్ఞానం; ప్రతిష్ఠితా — స్థిరమైనది.


 *తాత్పర్యము* 


ఎవరైతే అన్నీ పరిస్థితులలో మమకారం/ఆసక్తి లేకుండా ఉంటాడో, సౌభాగ్యానికి హర్షమునొందకుండా మరియు కష్టాలకు క్రుంగిపోకుండా ఉంటాడో, అతను పరిపూర్ణ జ్ఞానం తో ఉన్న ముని.


 *సర్వేజనాః సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

రామాయణమ్ 352

 రామాయణమ్ 352

...

మా భరతుడు నాకు జ్ఞాతి , రాజ్యము అతను కోరకుండగనె తల్లి అతనికి సంపాదించి పెట్టినది ,రాజ్యార్హత అతనిదే ! ,

.

మా తండ్రిగారు అందుకు సమ్మతించినారు కూడా .అనాయాసముగా తల్లి అడిగిన వరము ద్వారా సంక్రమించిన రాజ్యలక్ష్మిని అన్న నైన నాకొసము తృణ ప్రాయముగా వదులుకొనుటకు సిధ్ధపడినాడు.  

.

 మా భరతుని మంచితనము చూడుము .నన్ను అనుసరించి నన్ను వెదుకుతూ అడవికి వచ్చి అన్నా !రాజ్యము నీదే నాది కాదు అందుకు అర్హుడవు నీవె అని ప్రాధేయ పడినాడు.

 ఇట్టి సొదరుడు ఎచట వుండును ? 

.

ఇక లొకములొని కొడుకులలొ  నా అంత భాగ్యశాలి అయిన వాడు ఎవడూ ఉండడు .తండ్రి ప్రెమను సంపూర్ణముగా  చూరగొన్నవాడె అదృష్టవంతుడు .నా తండ్రికి నా మీద గల ప్రేమ ఇంత అంత అని చెప్ప తరమా ? 

.

నన్ను వదలిన వెంటనె స్వర్గస్తుడైనాడు  ,అందుచెత పుత్రులలొ నెను గొప్పవాడను .

.

ఇక మిత్రులలొ నీ వంటి వాడు ఎవ్వడూ కానరాడు ,పరుషముగా దూషించిన మిత్రుని భరించి ,ఆతని కార్యమునకు తన సకల శక్తులూ వినియోగించువాడు గొప్పవాడు కాదా ? 

.

నాలుగు నెలలు వర్షాకాలము కిష్కింధలొ ఉండమని నేనె చెప్పితిని .

.

వర్షము వెనుకబడగానె నీవు నాకు ఏమీ చెయ్యలేదని నిన్ను దూషించినా భరించి   నన్ను అనునయించి నా కార్య సాఫల్యమునకు సర్వ శక్తులూ ధారవోయు నీ వంటి మిత్రుడెచట లభించునోయి ! 

కావున మిత్రులలొ నీవు శ్రేష్ఠుడవు .

.

అనుచూ శ్రీరామచంద్రుడు కొనసాగించెను.

.

వూటుకూరు జానకిరామారావు

ఆనందంగా ఉన్నారంటే



           *జీవితంలో ఒకరు ఆనందంగా ఉన్నారంటే వాళ్ళకు కష్టాలు ఏమీ లేవని కాదు*

         *ఎన్ని కష్టాలొచ్చినా వాటిని ఎదుర్కొనే  ధైర్యం ఉందని అర్థం.*


🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞

నవగ్రహ పురాణం - 79*_

 _*నవగ్రహ పురాణం - 79*_


*బుధగ్రహ చరిత్ర - 6*


*"నా పేరు అదే - ఈ రూపం రాకముందు పురుష రూపంలో సుద్యుమ్నుడు..."* *"సుద్యుమ్నుడా !! నారాయణ !"* నారదుడు ఆశ్చర్యంతో అన్నాడు.


*"ఔను ! స్త్రీ రూపం రాగానే నా పేరు 'ఇల' అని అనిపించింది ఎందుకో ?"* ఇల దీనంగా అంది.


*“నారాయణ ! సుద్యుమ్నుడు...ఇది... అప్పుడు పురుషుడు... ఇప్పుడు స్త్రీ...అప్పుడు యువకుడు... ఇప్పుడు యువతి ! బాగుంది... "* నారదుడు స్వగతంలా అనుకుంటున్నాడు. 


*"మహర్షీ ! నాకు ఈ గతి ఎందుకు పట్టింది ?"* ఇల దయనీయంగా అడిగింది.


*"ఎందుకు ?"* నారదుడు సాలోచనగా అన్నాడు. *"నారాయణ ! నువ్వు... పొరపాటున ఆ 'కుమార వనం'లో అడుగుపెట్టలేదు కద ?"* 


*"కుమారవనం అని తెలీదు కానీ , ఒక వనంలోకి వెళ్ళాం నేనూ , భటులూ..."* అంటూ ప్రారంభించి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది ఇలా..


*"నారాయణ ! ఇంక నీ గతి ఇంతే ! ఈ ఇల మీద నువ్వు 'ఇల'గా జీవించాల్సిందే !”* నారదుడు నిష్కర్షగా అన్నాడు. *"ఎందుకు ఇలా జరిగిందని కదా నీ అనుమానం. ఆ కుమారవనంలోకి ఎవరు అడుగుపెట్టినా అంతే ! ఏ పురుష ప్రాణి అయినా సరే - కుమార వనంలో పాదం మోపగానే స్త్రీ ప్రాణిగా మారిపోవాల్సిందే ! స్త్రీ ప్రాణిగా జీవించాల్సిందే ! స్త్రీ ప్రాణిగా మరణించాల్సిందే !*


*"అలా జరగాలని పార్వతీ పరమేశ్వరులు తమ శాపంతో శాసించారు. కుమారవనం ఆ ఆదిదంపతుల ప్రత్యేక ప్రణయోద్యానం ! పార్వతీ మాత శాపంక్ పెట్టడానికి కారణం ఉంది. ఒకనాడు ప్రశాంత సమయాన పార్వతీ శంకరులు కుమారవనంలో , ఏకాంతంలో ఒకరికి ఒకరై ఆనందిస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి కొందరు మహామునులు వాళ్ళ దర్శనానికి వచ్చి , వనంలో ప్రవేశించారు. ఆది దంపతుల ప్రణయ కాలక్షేపం గురించి తెలియని ఆ మునులు వాళ్ళిద్దరూ ఆదమరిచి ఉన్న ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళిపోయారు.”*


*"పార్వతి సిగ్గుపడింది. ఆగ్రహించింది. తమ అభ్యంతర విహార స్థలమైన కుమారవనంలోకి ప్రవేశించిన ప్రతి పురుషప్రాణీ స్త్రీగా మారిపోయేలా శాపం పెట్టాలంది ! శివుడు సరే అన్నాడు ! ఇద్దరూ ఏక కంఠంతో ఆ విధంగా శాపం పెట్టేశారు !"* నారదుడు వివరించి , ఇల వైపు చూశాడు.


*"నారద మహర్షీ ! నా గతి ఏమిటి ? ఆదిశక్తి శాపానికి విరుగుడు లేదా ?"* ఇల ఆశగా అడిగింది.


*"చండిక శాసనం అది ! అంటే చండశాసనం అన్నమాటే. తల్లీ ! ఆదిశక్తి ఆగ్రహమైనా , అనుగ్రహమైనా అనుభవించక తప్పదు ! నిన్ను సుద్యుమ్నుడుగా ఎవరూ గుర్తించరు. నిన్ను స్త్రీగానే భావిస్తారు ! అంగీకరిస్తారు ! స్వీకరిస్తారు ! అందగత్తెవైన నీలాంటి యువతులకు పురుషులతో ప్రమాదం ఉండనే ఉంది ! అంచేత నువ్వు... రాజధానికి తిరిగి వెళ్ళడం శ్రేయస్కరం కాదు...”* నారదుడు చెప్పుకు పోతున్నాడు.


*"అయితే...నా భవిష్యత్తు ? మీరే నాకు మార్గ దర్శనం చేయాలి ?"* ఇల ప్రాధేయ పూర్వకంగా అంది.


*"ఈ అరణ్యంలో తూర్పుదిక్కుగా వెళ్తే నీకు మేలు జరిగే అవకాశం ఉంది. మహాసాత్వికులైన మంచి వ్యక్తులు నీకు పరిచయమవుతారు. నీ భవిష్యత్తుకు అంకురార్పణ జరుగుతుంది !"* నారదుడు భవితను సూచించే జ్యోష్కుడిలాగా అన్నాడు.


*“అయితే... నన్ను... ఇటు వైపు వెళ్ళమంటారా ?”* ఇలా అడిగింది. 


*"ప్రస్తుతం నీ మార్గాంతరం అదే ! బయలుదేరు ! శుభం భూయాత్ !"* నారదుడు దీవిస్తూ అన్నాడు.


ఇల నారదుడు సూచించిన దిశగా అడుగులు వేస్తోంది. రూపం మారేసరికి తనలో మానసికంగా కూడా ఏదో మార్పు వచ్చేసింది. చిన్న చప్పుడుకు కూడా తను జడుసుకుంటోంది. కుందేళ్ళనీ , లేళ్ళనీ , దుప్పులనీ చూస్తుంటే - పురుషావతారంలో అనిపించినట్టు వాటిని సంహరించాలనిపించడం లేదు. వాటిని చేరదీసి ముద్దు చేయాలని ముచ్చటవేస్తోంది. పురుష మనస్తత్వానికీ , స్త్రీ మనస్తత్వానికీ , ఆలోచనా సరళికి ఇంత అంతరం ఉంటుందా ?


మెత్తటి అడుగుల చప్పుడు ఇలను ఆలోచనల నుండి లాగింది. ఆమెలో ఆలోచనలు ఆగినట్టే , ఎదురుగా వినవచ్చిన అడుగుల సవ్వడి కూడా ఆగింది. ఇల బెరుకు బెరుకుగా చూసింది.


ఎదురుగా ఒక యువకుడు ! తనలాగే నిలబడి , తనలాగే ఆశ్చర్యపోతూ చూస్తున్న యువకుడు. ఇందాక లేడిని చూడగానే భయంతో స్పందించిన ఆమె గుండె ఇంకా ఎంతో వేగంగా స్పందిస్తోంది. అయితే భయంతో కాదు , ఏదో ఉద్వేగంతో !


పురుష సౌందర్యానికి నిర్వచనంలా ఉన్నాడా యువకుడు ! పోతపోసిన అందంలా ఉన్నాడు ! తళతళ లాడుతూ కనిపిస్తున్న శరీర సౌష్టవం ! గుండ్రటి ముఖం. చూపుల్ని బలంగా లాగి బంధించివేసే అందమైన పెద్ద పెద్ద కళ్ళు ! దరహాసానికి ప్రాణం పోస్తున్న పెదవులు... దగ్గరైన అదృష్టవంతురాలికి ప్రణయ పీఠంలా భాసించే విశాల వక్షం.... కళ్ళు చెదిరే శరీర వర్ణం... ఆ దేహకాంతిని హెచ్చవేత వేసి చూపించే వస్త్రధారణ... గాలికి ఎగురుతున్న పల్చటి అంగవస్త్రం. 


ఇల తటాలున రెప్పవాల్చి తనను చూసుకుంది. మరుక్షణం ఆమె సిగ్గుతో కుంచించుకు పోయింది. ఎడమ చెయ్యి తటాలున ఆమె పయ్యద ఉండాల్సిన స్థానాన్ని ఆక్రమించింది. కుడి చెయ్యి కిందకి జారిపోయి గాలికి మెలికలు తిరుగుతున్న పైటకొంగుని అందుకుంది. ఇదంతా లిప్త పాటు కాలంలో జరిగిపోయింది.

సిగ్గుతో ఇంకా రెప్పలు దించుకునే ఉన్న ఇలలో ఆలోచన వెన్నెల్లో కలువ మొగ్గలా వికసిస్తోంది. అంటే... అంటే... గాలి తాకిడికి పైట తొలగిపోయిన విషయాన్నీ , తన వక్షభాగం అనాచ్ఛాదితంగా ఉన్న విషయాన్నీ గమనించే స్థితిని దాటిపోయి, ఆ యువకుడిని చూస్తూ ఉండిపోయింది తను. అంత అందగాడా అతడు ? ఇలా అంతరంగంలో పుట్టిన ఆ ప్రశ్నకు అంతరంగంలోనే సమాధానం దృశ్య రూపంలో లభించింది. ఇంకా కిందికి వాలి ఉన్న రెప్పల వెనక తను ఇందాకా చూసిన ఆ యువకుడి సమ్మోహనాకారం ప్రత్యక్షమైంది ! తన అంతరంగం మీదికి చేరిపోయి కనిపిస్తున్న ఆ యువకుణ్ణి అలాగే 'లో' చూపుతో చూస్తూ ఉండిపోయింది ఇల.


తాను నిలుచున్న రెండు పొదరిండ్ల మధ్య అందమైన యవ్వన వృక్షంలో ఉన్న యువకుడు ప్రకృతి నేపథ్యంలో తన ముందు నిలుచున్న ఆ యువతిని చూస్తూ. ఉండిపోయాడు. ఆమె నిసర్గ సౌందర్యం తనను మంత్రముగ్ధుణ్ణి చేసి వేసింది. బంగారు తీగను గుర్తుకు తెచ్చే శరీరం... పూర్తిగా వికసించిన పద్మంలాంటి ముఖం ! కలువరేకుల్లాంటి అందమైన విశాల నేత్రాలు... ఊహూ... అవి నేత్రాలు కావు , ఎదుటి వారి మీద కాంతి కిరణాల్ని రువ్వే జ్యోతులు ! పగడాల్లాంటి పెదవులు. అవి కదిలినప్పుడల్లా తొంగి చూస్తున్న ముత్యాల్లాంటి పళ్ళు ! ఆమె సౌందర్యాన్ని ఇనుమడింప చేస్తున్న ఆ పైట... ఆమె అందాన్ని తన చర్మచక్షువులకు కనిపించకుండా దాచగలిగింది కానీ , తన అంతర్నేత్రాల నుంచి , ఇంకా ఆ అయస్కాంత సౌందర్యాన్ని దర్శిస్తున్న తన అంతర్నేత్రాల నుండి దాచలేకపోతోంది !


ఈ నడుస్తున్న సౌందర్యం ఎక్కడిది ? ఎక్కణ్ణుంచి వచ్చింది ? ప్రశ్నకు సమాధానాన్ని కనుక్కోలేకా , ఆమెను అడగలేకా సతమతమనుతున్న యువకుడు తనకు తెలీకుండానే ముందుకు సాగాడు. అతని కదలిక కోసమే కాచుకున్నట్టు , ఆమె కూడా ముందుకు అడుగులు వేసింది. ఇద్దరూ ఒకర్ని దాటి ఒకరు ముందుకు వెళ్ళిపోయారు.


ఏదో అజ్ఞాత సంకేతాన్ని అందుకున్న వాళ్ళలాగా ఇద్దరూ ఒకేసారి వెనుదిరిగారు. ఒకరికొకరు అభిముఖంగా నిలుచున్నారు. ఇద్దరి ప్రయత్నమూ లేకుండానే , ఇద్దరి కళ్ళూ తమ భాషలో పలకరించుకుంటున్నాయి. ఆ 'నేత్రభాష' పెదవులను స్పందింప జేస్తోంది. రెచ్చగొట్టుతోంది.


*“నా పేరు... బుధుడు...”* యువకుడు ఆమె కళ్ళలోకే చూస్తూ అన్నాడు *“నువ్వు...”*


*"నా పేరు... ఇల...”.*


*"నేను చంద్రుడి పుత్రుణ్ణి. తారాదేవి నా తల్లి. నేను ఈ దగ్గర్లోని ఆశ్రమంలో నివసిస్తున్నాను. నువ్వు..."* బుధుడు రెండు అక్షరాలతో ప్రశ్నను పూర్తి చేశాడు.


*“నాకు... నాకు... ఎవ్వరూ లేరు...”* తన గతం గురించి , పురుష జన్మ గురించి , పార్వతి శాపం గురించి చెప్పాలనిపించడంలేదు ఇలకు. ఆ అందగాడికి భయాందోళనలూ , సందేహాలూ కలిగించే నిజాలేవీ చెప్పకూడదనిపిస్తోంది. చెప్తే , తనకు... దూరమైపోతాడేమో ! ఇల తన ఆలోచనలకు తానే నవ్వుకుంది. ఇప్పుడు దగ్గరయ్యాడా దూరం కావడానికి ?!


*"సూర్యాస్తమయం కావస్తోంది. అరణ్యం క్షేమకరం కాదు. నా ఆశ్రమంలో... విశ్రాంతి తీసుకోవచ్చు...”* బుధుడు ఆహ్వాన సూచకంగా అన్నాడు.


*“సరే..."* ఇలా అసంకల్పితంగా అంది. 


బుధుడు వెనుదిరి , తన ఆశ్రమం వైపు దారి తీశాడు. తనను వేటాడుతున్న ఇల కళ్ళను చూశాక అతను వేట గురించి , వేటగాళ్ళ గురించి మరచి పోయాడు.

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


అల్లంత దూరంనుంచే నన్ను చూశాడు. నా సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. ఈ అరణ్యంలో

ఒంటరిగా ఎవరీ సౌందర్యరాశి అని ఆశ్చర్యపోయాడు. దగ్గరకు వచ్చి

కల్యాణీ! ఎవరునువ్వు? దేవతావనితవా? మానవాంగనవా? గంధర్వోరగకాంతామణివా? ఎవరి

అమ్మాయివి? రూపయౌవన విభూషితవై ఈ గాఢారణ్యంలో ఏకాంతంగా నిలబడ్డావెందుకు? వివాహితవా?

కవ్యవా? చంద్రవదనా! నిజం చెప్పు. మధుకరచికురా! పెదవి కదుపు. మృగవయనా! ఈ సరోవరంలో

ఏమిటి తిలకిస్తున్నావు? తదేకదీక్షగా అటే చూస్తున్నావు ఏమిటి కారణం? హే కృశోదరి! హే మరాళాక్షి!

హే మదనమోహిని! నన్ను పతిగా వరించి మహారాజభోగాలు అనుభవించు.

(అధ్యాయం-28, శ్లోకాలు- 54)

తాళధ్వజుడు అనురక్తుడై పలవరించాడు. నేనూ క్షణకాలం ఆలోచించాను. మృదుమధురంగా

బదులు పలికాను.

హేరాజన్! నేనెవరి కూతురినో నాకే తెలియదు. తల్లిదండ్రులెవరో ఎక్కడ ఉంటారో తెలియదు.

ఎవరు నన్ను ఈ సరోవరతీరంలో విడిచిపెట్టారో అంతకన్నా తెలియదు. ఏమి చెయ్యాలో, ఎక్కడికి

వెళ్ళాలో, నా అదృష్టం ఎలాఉందో ఏమీ తోచక ఇలా నిలబడ్డాను. నిరాధారను. ఏమి చెయ్యాలా అని

ఆలోచిస్తున్నాను. దైవమే దిక్కు. ఎటు నడిపిస్తాడో? నువ్వు ధర్మజ్ఞుడివి. నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి

నువ్వు తప్ప నాకు సంరక్షకులు ఎవరూ లేరు. తండ్రిలేడు, తల్లిలేదు, ఇల్లు లేదు, వాకిలిలేదు,

బంధువులులేరు, చెలిమికత్తెలులేరు. ఒంటరిదానను, నీదానను.

నా పలుకులకు తాళధ్వజుడు మురిసిపోయాడు. మనస్సులో మన్మథుడు గిలిగింతలు

పెట్టాడు. వెంటనే భృత్యులను పిలిచి

బంగారుపల్లకీ సిద్ధం చెయ్యండి. పట్టువస్త్రాలు తెరలు కట్టండి. మెత్తని పరుపులు పరవండి.

బాలీసులు సర్దండి. ఈ విశాలాక్షి అధిరోహిస్తుంది. మనతో రాజధానికి వస్తుంది అని ఆజ్ఞాపించాడు.

.

గురువారం, అక్టోబరు 12, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


గురువారం, అక్టోబరు 12, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

భాద్రపద మాసం - బహుళ పక్షం

తిథి:త్రయోదశి రా7.13 వరకు  

వారం:గురువారం (బృహస్పతివాసరే)

నక్షత్రం:పుబ్బ మ12.12 వరకు

యోగం:శుక్లం ఉ11.08 వరకు

కరణం:గరజి ఉ6.13 వరకు తదుపరి వణిజ రా7.13వరకు 

వర్జ్యం:రా8.07 - 9.52

దుర్ముహూర్తము:ఉ9.49 - 10.36 &

మ2.30 - 3.17

అమృతకాలం:ఉ6.53వరకు

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30

సూర్యరాశి: కన్య

చంద్రరాశి : సింహం 

సూర్యోదయం:5.55

సూర్యాస్తమయం:5.38


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

పార్థ సారథి దేవాలయం..

 మనగుడి 205

🌹🙏పార్థ సారథి దేవాలయం..




🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸చెన్నైలోని పార్థ సారథి దేవాలయం ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం చెన్నై నగరం ట్రిప్లికేనులో ఉంది. ఈ ఆలయాన్ని 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు. 


🌿ఈ దేవాలయం ఎనిమిదో శతాబ్దానికి చెందినది చరిత్రకారుల అంచనా. 

సంస్కృత భాషలో పార్థసారధి అంటే పార్థుడు = అర్జునుడు యొక్క సారథి = రథాన్ని నడిపినవాడు అని అర్థం అంటే శ్రీ కృష్ణుడు.


🌷స్థల పురాణం


🌸సుమతి అనే మహారాజుకి ఇచ్చిన మాట ప్రకారం వేంకటేశ్వర స్వామి పార్థసారధిగా ఇక్కడ వెలసినాడని అంటారు. ఈ పార్థసారధి విగ్రహాన్ని ఆత్రేయ మహర్షి ప్రతిష్టించాడని చెబుతారు. 


🌿ఇంకో కథ ప్రకారం శ్రీ రామానుజా చార్యుల తల్లిదండ్రులు ఇక్కడకు వచ్చి సంతానం కొరకు స్వామిని వేడుకొనగా రామానుజాచార్యుడు జన్మిస్తాడు. మరో కథ ప్రకారంపార్థసారథిస్వామిధర్మసంస్థా పనకువిశిష్టాద్వైతాన్నిఆవిష్కరించడానికి రామానుజాచార్యులగాజన్మించాడని చెబుతారు. 


🌸బ్రహ్మాండ పురాణం ప్రకారము ఈ క్షేత్రానికితిరుఅల్లికేనిఅనిపేరని, కాలక్రమంలో ఇది ట్రిప్లికేన్ గా మారిందని అంటారు.మూల విరాట్టు పార్థసారధి విగ్రహం విశిష్టత


🌿మహాభారత ఇతిహాసం ప్రకారం శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని రథసారధిగా ఉంటాడు. కురుక్షేత్ర సంగ్రామప్రారంభంలో అర్జునుడు ఇరువైపుల ఉన్న బంధువు యుద్ధ సంగ్రామంలో మరణిస్తారని తలచి 


🌸అస్త్రాలను విడిచి పేడుతుంటె కృష్ణుడు భగవద్గీతను భోధించి అర్జునున్ని యుద్ధానికి సమాయత్తం చేస్తాడు. కురుక్షేత్రంలో పాల్గొన్న ఆనవాళ్ళను తెలియజేస్తూ ఇక్కడి మూల విరాట్టుకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. 


🌿భీష్ముడువిడిచినఅస్త్రాలు, బాణాలు శ్రీకృష్ణుడికి కూడ తగలడం వళ్ల స్వామి ముఖంపై కొన్ని మచ్చలు ఉంటాయి. సాధారణానికి భిన్నంగా స్వామికి మీసాలు ఉంటాయి. 


🌸కురుక్షేత్ర సంగ్రామంలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేయడం వల్ల ఈ విగ్రహానికి మహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రం ఉండదు. చేతిలో కేవలం శంఖం మాత్రమే ఉంటుంది. 


🌿పార్థసారధి యాదవుల వంశంలో జన్మించడం వల్ల ఉత్సవ మూర్తిగా ఒక దారుశిల్పం (చెక్క బొమ్మ) మాత్రమే ఉంటుంది. సాధారణంగా ఉత్సవ మూర్తుల విగ్రహాలను పంచలోహాలతో గాని రాతితో గాని తయారు చేస్తారు.


🌷ఆలయ విశేషాలు మరియు అనుబంధ ఆలయాలు


🌸చెన్నై నగరములోని అత్యంత పురాతనమైన దేవాలయాలలో పార్థసారథి దేవాలయం ఒకటి. ఈ దేవాలయానికి రెండు వేర్వేరు ధ్వజ స్థంభాలు ఉన్నాయి. 


🌿ఒకటిగర్భగుడికిఎదురుగా, మరొకటి నరసింహ స్వామి దేవాలయానికి ఎదురుగా ఉన్నాయి. ఆలయ గోపురము, మండపాలు ద్రవిడ ఆలయ నిర్మాణ శైలిలోనిర్మించబడ్డాయి.


🌷ఈ దేవాలయ ప్రాంగణములో ఉన్న అనుబంధ గుళ్ళు


• వేదవల్లి గుడి


 రంగనాథ స్వామి గుడి


• శ్రీరాముని గుడి


•వరదరాజస్వామి గుడి


•నరసింహ స్వామి దేవాలయం


•ఆండాళ్ళమ్మ గుడి


•అంజనేయ స్వామి దేవాలయం


•అళ్వార్ల సన్నిధి


•రామానుజాచార్యుల సన్నిధి


•భృగు మహర్షి గుడి


🌷పండుగలు


🌸చైత్రై (ఏప్రిల్-మే) అనే తమిళ మాసంలో స్వామి బ్రహ్మోత్సవాలు జరుతాయి.


🌿ఆణి(జూన్-జూలై) అనే తమిళ మాసంలో అయగియసింగార్ ఉత్సవాలు జరుగుతాయి.


🌸రామానుజాచార్యుల గురించి ప్రత్యేక ఉత్సవాలు ఏప్రిల్- మేలో జరుతాయి.


🌿మణవలమ్ముణిగళ్ (అక్టోబరు-నవంబరు) ఆళ్వార్లకు, ఆచార్యులకు ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.


🌸వైకుంఠ ఏకాదశి మరియు చైత్ర మాసం ఇక్కడ ప్రత్యేక విశేషం. ఈ కాలములో భక్తులు అసంఖ్యాకంగా స్వామి దర్శనం చేసుకొంటారు.


🌿స్వామి ఉభయ నాంచారులతో ఉత్సవమూర్తిగా ఉరేగింపుగా వెళ్ళేటప్పుడు ఆయన దర్శనం నయనానందం చేస్తుంది.


🌸పవిత్ర దినాల్లో ఆలయ మండపాలలో అనేక పురాణ సంబంధిత కథా కాలక్షేపాలు జరుగుతూ ఉంటాయి.


🌷స్వామి పుష్కరిణి


🌿దేవాలయానికి ఎదురుగా ఉన్న తటాకం లేదా పుష్కరిణిని కైరవిణి (తెలుగులో తెల్లటి మల్లెపూవు) అని పిలుస్తారు. తెల్లని మల్లెపువ్వు భగవంతుడుని అర్చించడానికి అత్యంత పవిత్రమైన పుష్పము.


🌸 ఈ కైరవిణికి అనుసంధానంగా ఇంద్ర, సోమ, మీనా,  అగ్ని, విష్ణు అనే ఐదు తీర్థాలు ఉన్నాయి.


🌷మన నిజమైన  శత్రువు ఎవరో చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడు .


🌿ప్రతీ మనిషిలోను ఏదో ఒక లోపం ఉంటుంది. దానిని పరిస్థితులకు అనుగుణంగా అదుపులో పెట్టుకోవాలి. మన ప్రవర్తనను బట్టే మనకి శత్రువులైనా, మిత్రులైనా ఏర్పడతారు.


🌸అంటే… మన మిత్రుడు, శత్రువు ఇద్దరూ మనలోనే ఉన్నారు. 


🌿కోపం, లోభం, అసూయ, స్వార్ధం, కామం, అహంకారం ఇవన్నీ మన శత్రువులే. ఎందుకంటే… వీటివలనే ఎదుటివారు మనకి శత్రువులు అవుతారు.గీతలో… శ్రీకృష్ణ పరమాత్ముడు మన నిజమైన శత్రువు ఎవరో చెప్పారు. అదేమిటంటే…


🌷కామ ఏష క్రోధఏషరజో గుణసముద్భవఃమహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్॥


🌸రజో గుణం వలన ఉత్పన్నం అయ్యే కామక్రోధాలని తృప్తి పరచడం అసాధ్యం. రజో గుణం వలన ఇంద్రియాల మీద నిగ్రహం ఉండదు.

డెంగ్యూ జ్వరం జాగ్రత్త వహించండి

 👉 డెంగ్యూ జ్వరం విస్తరిస్తోంది.  కొబ్బరి నూనెను మీ మోకాళ్ల నుండి మీ కాలి వరకు రాయండి.  ఇది ఉదయం నుంచి రాత్రి వరకు యాంటీబయాటిక్ పొరలా పనిచేస్తుంది.  👍🏻డెంగ్యూ దోమ మోకాలి ఎత్తు కంటే ఎక్కువ ఎగరదు.


  ఎవరైనా డెంగ్యూతో బాధపడుతున్నట్లయితే, పచ్చి యాలకుల గింజలను నోటికి రెండు వైపులా ఉంచుకోండి, వాటిని నమలకుండా జాగ్రత్త వహించండి.  ఖాళీ నోటిలో ఉంచడం ద్వారా, రక్త కణాలు నార్మల్‌గా మారతాయి మరియు ప్లేట్‌లెట్స్ వెంటనే పెరుగుతాయి.


  ఈ సందేశాన్ని అందరికీ పంపవలసిందిగా వినయపూర్వకమైన మనవి.

  డెంగ్యూ వ్యాధిని 48 గంటల్లో నిర్మూలించవచ్చు

  సామర్థ్యం

  మందు  దయచేసి ఈ సందేశాన్ని పంపండి

  ముఖ్యమైన సమాచారాన్ని వీలైనంత ఎక్కువ మందికి పంపండి:-

  ఎవరైనా డెంగ్యూ లేదా సాధారణ జ్వరం కారణంగా ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉంటే, హోమియోపతి ఔషధం ఉంది.

  యుపటోరియం పర్ఫ్యూయం 200

  లిక్విడ్ డైల్యూషన్ హోమియోపతి ఔషధం.

  ప్రతి 2-2 గంటలకు సాదా నీటిలో 3 లేదా 4 చుక్కలు వేసి 2 రోజులు మాత్రమే త్రాగాలి.

  మీరు మంచి పనులు చేయాలనుకుంటే, ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరికీ పంపండి🤝

ధర్మాచరణ కర్తవ్యం*

 *ధర్మాచరణ    కర్తవ్యం*


ఎంత దార్శనిక శ్రేష్టుణ్ణైనా ధర్మాచరణ నాకూ కర్తవ్యమే అని ఆచార్య శంకరులు అనుకున్నారు. వాళ్ళు ఎవరూ కూడా ధర్మమార్గంలో తమకు మినహాయింపు ఉంది అని ఎవరూ అనుకోలేదు. అటువంటప్పుడు మనమంతా ఏరీతిగా ఉండాలి. మనకు ఇంకొక దుర్దైవం ఏమి వచ్చింది అంటే పాశ్చాతుల అంధానుకరణం అనేటటువంటిది మనవాళ్లలో వస్తున్నది, గుడ్డిగా పాశ్చాతులను అనుసరించటం అని. ఆ పాశ్చాతులలాగా నేనుంటే నేను పెద్దమనిషిని అవుతాను గొప్పవాడినినైతాను అనే ఒక భ్రమ మనవాళ్లలో వస్తున్నది. అది చాలా పొరపాటు. పాశ్చాతులను మనం ఎన్నడూ అనుకరించకూడదు. వాళ్ల సంస్కృతి వాళ్లకు, వాళ్ల రీతి వాళ్లకు, అది మనకు అనుకరణీయం కాదు. అది తప్పా, సరా? అనేటటువంటి విమర్శ మనకు అక్కర్లేదు, కానీ మనకు అనుకరణీయం కాదు.  


మనము ఏ పరంపరలో ఏవచ్చామో ఏ ధర్మ మార్గంలో వచ్చామో అదే మనకు అనుకరణీయంకాని, అన్యులది మనకు అనుకరణీయం కాదు. అది ఎప్పుడు అనుకరణీయం అవుతుంది అంటే మనకు ఉన్న ధర్మమార్గం మనకు శ్రేయఃప్రదం కాకపోతే వాళ్లయొక్క ధర్మం మనకు శ్రేయఃప్రదం అనటానికి ఏమైనా ప్రమాణం ఉంటే అప్పుడు వాళ్ళది మనకు అనుకరణీయం అవుతుంది. వాళ్ళది మనకు శ్రేయఃప్రదం అనటానికి ప్రమాణం లేదు, మనయొక్క ధర్మం మనకు శ్రేయఃప్రదం కాదు అనటానికి ప్రమాణం లేదు.


అలాంటప్పుడు మనం అన్యధర్మాన్ని అనుసరించాలి. సర్వదా మనకు అది అనుకరణీయం కాదు. ఏ విధంగా చూచినా మనయొక్క ధర్మాన్ని ఉపేక్షించటానికి ఏ విధమైన కారణం కనపడదు. అందువలన పాశ్చాతుల అంధానుకరణం మనకు పనికిరాదు.


--- *జగద్గురు శ్రీశ్రీశ్రీ  భారతితీర్థ మహాస్వామి వారు.*

విదురనీతి

  విదురనీతి

శ్లో)బ్రాహ్మణాః స్విచ్ఛ్రేయాంశో దితిజాః స్విద్విరోచన

అధికేనస్మ పర్యంక సుధన్వానాధిరోహతి ॥ 


అ)విరోచనా! బ్రహ్మజ్ఞానం కలవారు గొప్పవారా? దితి కుమారులైన రాక్షసులు గొప్పవారా? సుధన్వుడు నాశయ్యపై ఎందుకు ఎక్కకూడదు? తెలుపుము

: విదురనీతి


విరోచన ఉవాచ విరోచనుడు చెప్పెను.

శ్లో)ప్రాజాపత్యాస్తు వైశ్రేష్ఠా వయం కేశిని! సత్తమాః -

అస్మాకం ఖల్విమే లోకా: కేదేవాః కేద్విజాతయః॥


అ)ఓ కేశినీ! మేము ప్రజాపతి సంతానానికి చెందిన వారిమి కనుక మేమే గొప్పవారము. ఈ లోకాలన్నీ మావే. దేవతలెవ్వరు? బ్రాహ్మణులెవ్వరు

ఉద్ధవగీత

 ఉద్ధవగీత

శ్లో)పాద్యమాచమనీయం చ గంధం సుమనసోఽ క్షతాన్ | ధూపదీపోపహార్యాణి దద్యాన్మే శ్రద్ధయార్చకః ॥


అ) అర్చకుడు శ్రద్ధతో పాద్యము ఆచమనీయము గంధము.పుష్పము.అక్షతలు.ధూపము.దీపము.మొదలైన ఉపచారములను నాకు అర్పింపవలెను


: ఉద్ధవగీత

శ్లో)పాద్యమాచమనీయం చ గంధం సుమనసోఽ క్షతాన్ | ధూపదీపోపహార్యాణి దద్యాన్మే శ్రద్ధయార్చకః ॥


అ) అర్చకుడు శ్రద్ధతో పాద్యము ఆచమనీయము గంధము.పుష్పము.అక్షతలు.ధూపము.దీపము.మొదలైన ఉపచారములను నాకు అర్పింపవలెను

 ఉద్ధవగీత

శ్లో)గుడపాయససర్పీంషిశష్కుల్యాపూపమోదకాన్|

సంయావదధిసూపాంశ్చనైవేద్యంసతికల్పయేత్||


అ)వీలైనచో.బెల్లము.పాయసము.నేతితోవండినపదార్ధములు.చక్కిలములు.అపూపములు.ఉండ్రాళ్ళు.యవాన్నము.పెరుగు.పప్పు.మున్నగుద్రవ్యములను.నాకు నివేదింపవలెను

గురు వారం* *బృహష్పతి వాసరః* *12-10-2023* *రాశి ఫలితాలు*

 *గురు వారం*

 *బృహష్పతి వాసరః*

  *12-10-2023*

  *రాశి ఫలితాలు*

*మేషం*

దూర ప్రయాణాలలొ వాహన ఇబ్బందులుంటాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులు  కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి  మించి  ఖర్చులు ఉంటాయి.  చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి.  ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది.

*వృషభం*

ఇతరులతో  వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులు మీ మాటతో విబేదిస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన శిరోభాధలు తప్పవు. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం కనిపించదు.  సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. 

*మిధునం*

చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ఆలయాలు దర్శిస్తారు. ఆకస్మిక  ధన లాభ సూచనలున్నవి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు   పనిఒత్తిడి  నుండి  బయటపడతారు. 

*కర్కాటకం*

ఒక కీలక వ్యవహారంలో బంధువులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేక నష్టాలు ఎదుర్కొంటారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు.  ఉద్యోగమున అధికారులతో ఆలోచించి మాట్లాడాలి. దూరప్రయాణాలలో  మార్గ  అవరోధాలు కలుగుతాయి. 

*సింహం*

సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు హోదాలు  పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక సమయంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.  ఆర్థిక పురోగతి సాధిస్తారు.

*కన్య*

చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు  కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

*తుల*

చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. చాలా కాలంగా పూర్తి కానీ పనులు సకాలంలో  పూర్తి చేస్తారు. వ్యాపారమున నూతన లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కలలు  సాకారమౌతాయి.  

*వృశ్చికం*

నూతన వ్యాపారాలకు  పెట్టుబడులు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు పొందుతారు. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూలత కలుగుతుంది. బంధు మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. ధన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి.

*ధనస్సు*

దూరప్రయాణ  సూచనలు ఉన్నవి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. జీవిత భాగస్వామి  ఆరోగ్య  సమస్యలు మానసికంగా భాదిస్తాయి.  చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఉద్యోగస్తులకు అధికారులతో ఆలోచించి మాట్లాడటం మంచిది.

*మకరం*

ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కష్టం వృధాగా మిగులుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది.

*కుంభం*

భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. 

*మీనం*

కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సోదరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో ఉన్న సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. 

🕉️

విదురనీతి

 విదురనీతి

శ్లో)విరోచనోఽథదైతేయస్తదా తత్రాజగామహ

ప్రాప్తుమిచ్ఛంస్తత స్తత్ర దైత్యేంద్రం ప్రాహకేశని॥ 


అ)అప్పుడు విరోచనుడనే పేరు గల రాక్షస జాతివాడు ఆమెను పొందటానిఅక్కడకి వచ్చినాడు. ఆసమయంలో కేశిని అతనితో ఇట్టన్నది

భక్తిసుధ

 

       ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 


𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


*_వందే పావనమంబరాత్మవిభవం వందే మహేంద్రేశ్వరం_౹*

*_వందే భక్తజనాశ్రయామర తరుం వందే నతాభీష్టదం_౹*

*_వందే జహ్నుసుతాఽంబికేశమనిశం వందే గణాధీశ్వరం_*౹

 *_వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం_౹౹*


_ " *శివస్తుతి " - 10_*


శుద్ధమైన, ఆకాశమను మించిన  ఆత్మ శక్తి కలవాడు, ఇంద్రునికి అధిపతి, భక్తులపాలిటి కలవృక్షము వంటి వాడు, మ్రొక్కే వారి కోరికలు తీర్చే వాడు, జహ్ను మహర్షి కుమార్తె అయిన గంగను జాటాజుటములతో బంధించిన వాడు, పార్వతికి పతియైన వాడు, నాశనము లేని వాడు, గణములకు అధిపతి అయిన వాడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నాపరి పరి వందనములు.


*_శ్రీ శంకరాచార్య విరచిత "శివస్తుతి - సంపూర్ణం_*

శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-72

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-72🌹*



🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*పూలబావి*


అద్దాల మండపానికి కొద్దిగా ఉత్తరంవైపున వెలసి ఉన్న బావి పూలబావిగా ప్రసిద్దిచెందింది. పుష్పాలంకార ప్రియుడైన శ్రీవారి అలంకరణకు ఎన్నోరకాల పూలమాలలు ఉపయోగపడుతున్నాయన్నది విదితమే. స్వామివారికి సమర్పించే తులసి, పుష్పం, పూలమాలలను వేరెవరూ ఉపయోగించకుండా ఈ పవిత్రమైన బావిలో వేస్తారు. అందుకే దీనిని పూలబావి అని పేరువచ్చింది. చారిత్రక ప్రాశస్థ్యం నేపథ్యంలో ఈ బావిని ‘తీర్థం’గా కూడా వ్యవహరిస్తారు. సాక్షాత్తూ భూదేవి తిరుమలలో ఏర్పాటుచేసిన తీర్థం కనుక దీనికి ఆ పేరు సిద్ధించింది. అయితే కాలాంతరంలో ఈ తీర్థం ఇక్కడే నిక్షిప్తమైపోయింది. అనంతరకాలంలో శ్రీనివాసుని ఆనతిపై రంగదాసు అనే భక్తుడు ఓ బావిని త్రవ్వగా ఈ భూతీర్థం మళ్లీ వెలుగులోనికి వచ్చింది. రంగదాసు ఈ బావిలోని నీళ్లను వాడుతూ స్వామివారి పూజకై సంపంగి, చామంతి తోటలను పెంచాడు. తరువాతి కాలంలో రంగదాసే తొండమాన్ చక్రవర్తిగా పునః జన్మించాడని చరిత్ర చెబుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి గత జన్మలో రంగదాసు నిర్మించిన శిథిలమైన బావిని మళ్లీ పునరుద్ధరించాల్సిందిగా ఆదేశించగా తొండమానుడు ఈ బావిని రాతితో కట్టి అవసరమైనపుడు బావిలోని ఒక రహస్య బిలం ద్వారా తిరుమలకు వచ్చి శ్రీనివాసుని దర్శించి వెళుతుండేవాడు. వరాహపురాణాంతర్గత వేంకటాచల మహత్యం అనుసారం ఒకప్పుడు శత్రువులతో యుద్ధంలో తరమబడిన తొండమానుడు ఈ రహస్యబిలం ద్వారా పరుగు పరుగున వచ్చి శ్రీనివాసుని చేరాడు. ఈ సమయాన తన ఉభయ దేవేరులతో ఏకాంతంలో స్వామివారు ఉన్నారు. అయితే తటాలున వచ్చిన తొండమానుని చూసి శ్రీదేవి అమ్మవారు స్వామివారి వక్షస్థలంలోనూ, భూదేవి అమ్మవారు సిగ్గుతో బావిలో దాక్కున్నారని తెలుస్తుంది. శ్రీ వేంకటాచల ఇతిహాసమాల ప్రకారం భగద్రామానుజులవారు తిరుమలకు వేంచేసినపుడు భూదేవి బావిలో దాక్కున్నదన్న పురాణ నేపథ్యంలో ఈ బావిలోనే భూదేవిని ప్రతిష్టించి తీర్థ్ధాపతిగా స్వామివారికి అరచనాది నివేదనలు జరుగుతున్నాయని అంతేగాక స్వామివారికి అలంకరించబడి తొలగించబడిన నిర్మల్యాన్ని (పూమాలలు, తులసిమాలలు వగైరా) భూదేవి కోసమే ఈ బావిలో వేస్తున్నారని తెలియజెప్తున్నది.


*శంఖనిధి - పద్మనిధి*


మహాద్వారానికి ఇరుప్రక్కల విడుపుల్లో ద్వారపాలకుల వలే సుమారు రెండడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు కనిపిస్తున్నాయి. కదా ! వీరే శ్రీ వేంకటేశ్వర స్వామివారి సంపదలను, నవనిధులను రక్షించే దేవతలు. ఇందులో ఎడమవైపున అంటే దక్షిణ దిక్కున ఉన్న దేవత, రెండు చేతుల్లోనూ రెండు శంఖాలు ధరించి ఉండటం గమనించండి! ఈయన పేరు ‘శంఖనిధి’ ఇలాగే కుడివైపున అంటే ఉత్తర దిక్కున ఉన్న రక్షక దేవత చేతుల్లో రెండు పద్మాలు ధరింపబడి ఉన్నాయి. ఈయన పేరు ‘పద్మనిధి’. ఈ నిధి దేవతల పాదాల వద్ద అంగుళాల పరిమాణంగల రాతి విగ్రహం నమస్కార భంగిమలో నిల్చొని ఉండటం గమనించండి. ఈ విగ్రహం విజయనగర రాజైన అచ్యుత దేవరాయలిది. బహుశా అచ్యుత దేవరాయలే ఈ నిధి దేవతామూర్తులను ప్రతిష్టించి ఉండవచ్చు. ఆగమశాస్త్రం ప్రకారం సాదారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి మూడవ ప్రాకారం ప్రవేశద్వారం వద్ద ఏర్పాటుచెయ్యడం సంప్రదాయం. దీన్ని బట్టి తిరుమల ఆలయం మూడు ప్రాకారాలు కలిగిన ఆలయమని ఈ నిధి దేవతల ప్రతిష్ఠ వల్ల స్పష్టమవుతున్నది. ఆలయం యొక్క మొదటి ఆవరణ ముక్కోటి ప్రదక్షిణం. రెండవది విమాన ప్రదక్షిణం. మూడవది సంపంగి ప్రదక్షిణం. మహద్వార దేవతలైన శ్రీ శంఖనిధి, పద్మనిధి దేవతలకు భక్తితో నమస్కరిద్దాం.


*జయ విజయులు*


తిరుమలలోని శ్రీవారి ఆలయంలోని తిరమమహామణి మండపంలో బంగారు వాకిలికి ఇరువైపులా శంఖుచక్ర గధాధారులై ద్వారపాలకులగు జయవిజయులు నిలచి ఉండి స్వామివారిని సదా సేవిస్తుంటారు. సుమారు 10 అడుగుల ఎత్తుగల ఈ పంచలోహ విగ్రహాలు స్వామివారి సన్నిధిలో భక్తులకు శ్రద్ద్భాక్తులతో వ్యవహరించండని సూచిస్తున్నట్లుగా జయుడు కుడిచేతి చూపుడువేలును విజయుడు ఎడమచేతి చూపుడువేలును చూపిస్తూ ఉంటాడు. రెప్పపాటు కాలం ఏమరుపాటు చెందకుండా స్వామి భక్తిపరాయణులగు జయవిజయులు స్వామివారి సన్నిధికి వేయికళ్ల కావలికాస్తుంటారు. తిరుమల క్షేత్రాన్ని సాక్షాత్తూ శ్రీ మహావైకుంఠాన్ని తలపించేరీతిలో వీరు బంగారువాకిట కావలి కాస్తారు.


*శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహా పురాణం🪐* . *51వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *51వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*శనిగ్రహ జననం - 2*


భర్తకు చెప్పిన విధంగా సంజ్ఞ పుట్టినింటికి వెళ్ళలేదు. వెళ్ళే ఆలోచన లేదామెకు. ఆరణ్యం వైపు నడుస్తోంది. సంజ్ఞ తన భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ.


భర్తకు చెప్పిందిగానీ , చెప్పిన విధంగా మారిపోయి , ఆయన అతి ప్రకాశాన్నీ , అత్యుష్టాన్నీ భరించడానికి సిద్ధమైపోయి , ఆయనను తిరిగి చేరడం సంభవం కాదని ఆమెకు అప్పుడే తెలుసు.


ఇప్పుడు ఏం చేయాలి తను ? తన రాక కోసం కొన్నాళ్ళు చూశాక , తన భర్త తన కోసం అత్తగారింటికి వెళ్తారు. తాను అక్కడికి వెళ్ళలేదన్న సంగతి తెలిసి పోతుంది. 


భర్తకు భార్యగా తను అవసరం. దానికి వెయ్యింతలుగా తన బిడ్డలకు తల్లిగా తను అవసరం. అంటే సూర్య మందిరంలో తన ఉనికి అత్యవసరం. 


తన సమస్యకు పరిష్కారం కోసం తనలోనే అన్వేషిస్తూ అరణ్యంలో ఒక చెట్టు నీడన కూర్చున్న సంజ్ఞ , ఆలోచనలను కొనసాగిస్తూ అప్రయత్నంగా ధ్యానంలోకి జారుకుంది.


సంజ్ఞలో నెలకొంటున్న ఏకాగ్రత ఆమె సమస్యకు పరిష్కారాన్ని వెదుకుతోంది. గంటలు గడుస్తున్నాయి. సంజ్ఞలో ఒక ఆలోచన మెరిసింది.


ముమ్ముర్తులా తనలాంటి స్త్రీ మరొకతె ఉంటే ! ముమ్మూర్తులా , రూపంలో , మాటలో , నడకలో , నవ్వులో , అన్నింటా తనను పోలిన ఒక స్త్రీ తనకు లభిస్తే ! తన ప్రతిబింబంలా ఉండే అలాంటి స్త్రీని , తన స్థానంలో సూర్య పత్నిగా , తన సంతానానికి తల్లిగా నటిస్తూ ఉండమని నియోగించి , పంపిస్తే ! భరించలేని సూర్యుడి వేడిమికి , తట్టుకోలేని ఆ అమిత కాంతికీ దూరంగా శాశ్వతంగా దూరంగా - చల్లగా , హాయిగా ఉండిపోవచ్చు !


ధ్యానంలో మునిగి , అరమోడ్పు కళ్ళతో ఉన్న సంజ్ఞ తటాలున కళ్ళు పూర్తిగా తెరిచింది. తన ప్రతిబింబంలాంటి స్త్రీ ఉంటే , అన్న ఆలోచన ఆమెలో నరనరానా ఉధృతమైన వేగంతో ప్రవహిస్తోంది. సంజ్ఞ ఇంక అక్కడ కూర్చోలేక పైకి లేచింది.


ఆలోచనల దండయాత్రను తట్టుకోలేని సంజ్ఞ అరణ్యంలో అటూ ఇటూ తిరుగుతూ ఉండిపోయింది. చీకట్లు ముసురుకుంటున్నాయి - వెలుపల చీకట్లు ముసురు కుంటున్నాయి. ఆమె లోపల ఏదో వెలుగు మెల్లగా , చాలా మెల్లగా విస్తరిస్తోంది. ఆ వెలుగు పూర్తిగా తనను ఆవరిస్తూ విస్తరిల్లేదాకా తను ధ్యాన నిష్ఠలో ఉండాలి. ఎలాగో తను చల్లటి ప్రకృతిలో తపస్సు చేస్తూ జీవితాన్ని ప్రశాంతంగా గడిపివేయాలనుకుంటోంది. సమస్య పరిష్కారం కోసం చేసే సాధన - భవిష్యత్తులో తపస్సుకు పునాది అవుతుంది !


రోజులు గడుస్తున్నాయి. తనకు కావాల్సిన సమాధానం కోసం , అంది రావాల్సిన పరిష్కారం కోసం ధ్యాన కాంతిలో వెదుకుతూ ఉండిపోయింది సంజ్ఞ.


ప్రాతఃకాలం... సంజ్ఞ ధ్యానం ఆపి , సరోవరం వైపు బయలుదేరింది. ఆమెలో సర్వకాలాలలో , సర్వావస్థల్లో మెదులుతూ ఉండే అంశం ఒక్కటే - తనకు ఇప్పుడు అత్యవసరంగా తనలాంటి స్త్రీ ఒకతె కావాలి !


సంజ్ఞ సరస్సు గట్టున నిలుచుని , అందంగా వికసిస్తున్న కన్నెతామరలను చూస్తూ ఉండిపోయింది. సరస్సులో నీరు నిర్మలంగా , నిశ్చలంగా ఉంది. తామర ప్రక్కనే తన ప్రతిబింబం నీటిలోంచి తన వైపు చూస్తోంది.


సంజ్ఞ అప్రయత్నంగా చిరునవ్వు నవ్వింది. 


నీటిలో ప్రతిబింబం చిరునవ్వు నవ్వింది.


గాలికి కదిలిపోతూ , స్థాన భ్రంశం చెందుతున్న పైటను సర్దుకుంది సంజ్ఞ. 


సరస్సులో ప్రతిబింబం పైట సర్దుకుంది. తనలాగే ఉన్న 'నీటిలో నీడ' తాను ఏం చేస్తే , అది చేస్తోంది ! ఉన్నట్టుండి సంజ్ఞ గుండె వేగంగా స్పందించడం ప్రారంభించింది.


తనలాగే , ముమ్మూర్తులా తనలాగే ఉన్న స్త్రీ తన ముందే ఉంది ! తనతోనే ఉంది ! అయితే దానికి - తన ప్రతిబింబానికి వ్యక్తిత్వం లేదు. తను ఉంటే అది ఉంటుంది ; తను కదిలితే కదుల్తుంది. అంతే !


అంతేనా ?! ఆ ప్రతిబింబానికి ప్రాణం పోస్తే ? ప్రత్యేకమైన ఉనికినీ , వ్యక్తిత్వాన్నీ దానికి ఆపాదింపచేస్తే ! తనలోని అన్ని లక్షణాలనూ , గుణగణాలనూ , అందులోకి ఆవాహనం చేస్తే !


సంజ్ఞలో ఏదో ఉత్సాహం ఉప్పెనలా పొంగుతోంది. ఔను ! సమస్యకు సమాధానం దొరికింది ! తన శక్తితో తన నీడకు ప్రతిబింబానికి ప్రాణం పోస్తుంది ! దానికో - పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తుంది ! దానిలో జ్ఞానేంద్రియాలూ , కర్మేంద్రియాలూ తమ 'వ్యాపారాలు', క్రియలు నిర్వర్తించేలా చేస్తుంది !



తనకు ఆ శక్తి ఉంది. విశ్వకర్మ పుత్రికగా తనకు కొన్ని అపూర్వ శక్తులు జన్మసిద్ధంగా లభించాయి. అవసరం వస్తే , తాను కోరిన రూపాన్ని ధరించగలదు. తన ఛాయా రూపాన్ని నిజరూపంగా ఆవిష్కరించగలదు. నీడలోకి సర్వ ఇంద్రియాలనూ , మనస్సునూ , వాక్కునూ , ఆవాహనం చేయగలదు. ఆ సర్వేంద్రియాలకూ ప్రాణప్రతిష్ఠ చేయగలదు !


సంజ్ఞ ఆవేశంగా సరస్సులోకి దిగి , స్నానం చేసింది. వెలికి వచ్చి , తాను తపసు చేసిన చోటికి బయలుదేరింది. సరోవరం వద్దకు వచ్చినప్పుడు తన వెనక వైపున ఉంటూ తనను అనుసరించిన నీడ , ఇప్పుడు ముందు నడుస్తూ , తనకు దారి చూపుతోంది !


సంజ్ఞ ఆగింది. ఆలోచిస్తూ , సరోవరంలోని నీటిని చేతిలోకి తీసుకుంది. వెను దిరిగింది. తనలాగా నిలుచున్న నీడను చూస్తూ ఏదో సంకల్పించింది. చేతిలోని నీటిని నీడ మీద చల్లింది.


మరుక్షణం ఆ నీడ తన రూపంతో , తనలాగా రక్తమాంసాలతో నిలుచుంది ! తనను తాను నిలువుటద్దంలో చూసుకుంటున్న అనుభూతి కలుగుతోంది సంజ్ఞకు ! ప్రశ్నార్థకంగా తననే చూస్తున్న ఆ ప్రతిరూపాన్ని సంజ్ఞ చిరునవ్వుతో చూసింది.


*"నువ్వు నా ప్రతిరూపానివి !"* సంజ్ఞ అంది. ఆమెను సరస్సు వద్దకు లాగుతూ. *"నీటిలో మన ప్రతిబింబాలను చూడు !"* అంది.


*"ఓహ్ ! ఇద్దరం ఒక్కలాగే ఉన్నాం !"* ప్రతిరూపం ఉత్సాహంగా అంది. సంజ్ఞ చిరునవ్వుతో తల ఊపింది.


*"నా పేరు ?"* ప్రతిరూపం అడిగింది. తన కంఠస్వరాన్ని విన్న సంజ్ఞ అబ్బురపడకుండా ఉండలేకపోయింది.


*"నువ్వు నా ప్రతిబింబానివి ! నా నీడవు ! అంటే , నా ఛాయ అయిన కారణంగా నీకు 'ఛాయ' అని పేరు పెడుతున్నాను. నా పేరు సంజ్ఞ !”* 


*"నాకు ప్రాణప్రతిష్ఠ చేశావు ! ఎందుకు ?"* ఛాయ ప్రశ్నించింది.


*"నువ్వు నా ప్రతిరూపానివి. నా స్థానంలో , నా భర్త అయిన సూర్యుడి పత్నిగా , నా బిడ్డలైన వైవస్వతుడికీ , యముడికీ , యమికీ తల్లిగా నటించాలి ; ఆ నటనలో జీవించాలి. నేను ఈ అరణ్యంలో తపస్సులో మునిగిపోతాను.”*


ఛాయ నవ్వింది. *"నేను నీలాగా ఉన్నాను ! నీ భర్త వద్దా , సంతానం ముందూ నీలాగే ఉంటాను ! అలా ఎంతకాలం ఉండాలి ?"* 


*"శాశ్వతంగా !"* సంజ్ఞ అంది. *"శాశ్వతంగా నా భర్తతో సుఖిస్తూ , శారీరక , మానసిక ఆనందాలు పొందుతూ ఉండిపోవచ్చు నువ్వు. అయితే ఒక నిబంధన...”*


*“ఏమిటది ?”* ఛాయ అడిగింది.


*"నా భర్తను నీ భర్తగా స్వీకరించినట్టే , నా బిడ్డలను నీ బిడ్డలుగా స్వీకరించి ప్రేమాభిమానాలతో పెంచాలి !”*


*"నువ్వు నా ప్రాణదాత్రి సంజ్ఞా ! ఈ శరీరం , ఈ మనస్సు - అన్నీ నీవే ! నీ మాట జవదాటను. నీ భర్తకు భార్యగా , నీ బిడ్డలకు తల్లిగా , నటించడం కాదు - జీవిస్తాను !”* ఛాయ నవ్వుతూ అంది.


సంజ్ఞ ఛాయ వైపు ప్రేమగా చూసింది. *"నిన్ను చూస్తుంటే నాకు ముచ్చట వేస్తోంది , ఛాయా ! నా పోలికలతో , నా కవలగా జన్మించిన నా చెల్లెలివేమో అనిపిస్తోంది !'*


*"నాకూ అలాగే అనిపిస్తోంది సంజ్ఞా ! నువ్వు నా అక్కవి ! నేను నీ చెల్లిని ! ఇద్దరం ఒకే పోలికతో పుట్టాం అని... నాకు నిజంగా అనుభూతి కలుగుతోంది...”* ఛాయ చిరునవ్వుతో అంది.


సంజ్ఞ ప్రేమగా ఛాయ చేతిని పట్టుకుంది. *"రా , ఛాయా , వెళ్దాం ! నేను తపస్సు చేసే ప్రశాంత స్థలంలో కూర్చుని మాట్లాడుకుందా !”*


ఇద్దరూ అన్యోన్యంగా నడుస్తున్నారూ...


సంజ్ఞ , ఛాయా ఎదురెదురుగా కూర్చున్నారు.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 61*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 61*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*"ఈ లోకంలో దుఃఖం ఎందుకు ఉంది"?*


దేశం, భాష, జాతి, మతం ఇత్యాదులన్నింటికీ అతీతంగా తాత్త్వికులందరినీ సతమతం చేసిన ప్రశ్న ఏదైనా ఉందా అంటే అది ఇది: "ఈ లోకంలో దుఃఖం ఎందుకు ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి  పలువురు ప్రయత్నించకపోలేదు. కాని సబబైన సమాధానం లభించని ప్రశ్నగానే అది మిగిలిపోయింది. జీవితం సుఖదుఃఖ మిశ్రితం. ఎవరూ పరిపూర్ణ సుఖంతో జీవించలేరు.


 అదే విధంగా జీవితమంతా దుఃఖమయంగానూ గడపరు. ఆశ్చర్యపరిచే నిజం ఏమిటంటే అనేక మహత్కార్యాలు సాధించిన మహనీయులందరికీ సుఖం కన్నా దుఃఖమే ఉత్కృష్ట మార్గ దర్శిగా విరాజిల్లింది. దుఃఖాలే వారిలో నిద్రాణావస్థలో నున్న అనేక శక్తులనూ, ప్రతిభలనూ అభివ్యక్తం చేశాయి.


 తన ఇరవై నాలుగవ ఏట నరేంద్రుడు అటువంటి దుఃఖభరితమైన ఘట్టాన్ని ఎదుర్కొనవలసి వచ్చింది.1884 (సం) నరేంద్రుని బి.ఏ. పరీక్షలు  పూర్తయ్యీ , న్యాయశాస్త్ర అధ్యయనం నిమిత్తం నరేంద్రుడు ఇంగ్లాండు వెళ్లగోరాడు. విశ్వనాథ్ అందుకు అంగీకరించాడు. కాని విధి వక్రీస్తుందని ఎవరి కెరుక!


నరేంద్రుని తండ్రి (విశ్వనాధ్) గుండెపోటుతో మరణించాడు.విశ్వనాథ్ సహాయసహకారాలతో తమ జీవిత స్థితిగతులను మెరుగుపరుచుకొన్న బంధువులు ఈ శోచనీయ స్థితిలో శత్రువుల్లా వ్యవహరించారు. నరేంద్రుని కుటుంబాన్ని శాశ్వతంగా ఇంటి నుండి బయటకు పంపివేయడానికే న్యాయస్థానంలో దావా వేశారు. కుటుంబానికి ఎలాంటి ఆదాయమూ లేదు. కాని ఐదారుగురిని పోషించవలసిన పరిస్థితి. కనుక నిమాయిచరణ్ వద్ద తాను పొందుతున్న న్యాయశాస్త్ర శిక్షణను సగంలోనే నరేంద్రుడు మానుకొని, మైల రోజులు పూర్తికాక మునుపే ఉద్యోగం కోసం పలుచోట్ల తిరగసాగాడు.


 కాలం కలసిరానప్పుడు వందలాది ప్రయత్నాలు సైతం విఫలమవడంలో ఆశ్చర్యం లేదు. ఎలాంటి ఉద్యోగమూ లభించకపోవడంతో నరేంద్రునికి అన్ని వైపులా శూన్యమే కానవచ్చింది. నరేంద్రునికి శ్రీరామకృష్ణుల స్మృతులు విశ్వాస సంకేత దీపాల్లా భాసిల్లాయి. మైల రోజులు ముగియక  మునుపే, నరేంద్రుడు దక్షిణేశ్వరం వెళ్లి శ్రీరామకృష్ణులను దర్శించాడు. శ్రీరామకృష్ణులు రెండు నెలల క్రితం క్రిందపడ డంతో ఆయన చేయి ఎముక స్థానభ్రంశం చెందింది. చేతికి కట్లు కట్టారు. నొప్పితో ఇంకా బాధపడుతున్నారు. నరేంద్రుడు ఇతర భక్తులతో పాటు కూర్చున్నాడు. 

 

బ్రహ్మసమాజ భక్తుడైన త్రైలోక్యుడు పాడుతున్నాడు. నరేంద్రుని దుఃఖం చూసిన శ్రీరామకృష్ణుల ఆవేదన వర్ణనాతీతం. అయినప్పటికీ ఆయన ప్రత్యక్షంగా నరేంద్రునితో ఏమీ చెప్పలేదు. పాట పూర్తయ్యాక ...


లోకం, భగవంతుని గురించి పలు అభిప్రాయాలు వెలిబుచ్చి, “దేహం ఉండేది రెండు రోజులు మాత్రమే, భగవంతుడు ఒక్కడే సత్యం. దేహం ఇదుగో ఉంది, మరు క్షణం లేదు..... దేహానికి సుఖదుఃఖాలు ఉండనే ఉంటాయి. నరేంద్రుణ్ణే తీసుకోండి - తండ్రి మరణించాడు, ఇంట్లో అలవికానన్ని కష్టాలు, ఏ దారీ కానరాదు. భగవంతుడు కొన్ని సమయాల్లో మనలను సుఖాలలో ఓలలాడిస్తాడు, మరికొన్ని సమయాలలో దుఃఖంలో ముంచెత్తుతాడు" అని అన్నారు.( 'నరేంద్రుణ్ణి ఇంకా కరుణించలేదే అని భగవంతుని పట్ల శ్రీరామకృష్ణులు ఆక్రోశంతో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఉంది. మధ్యమధ్యలో ఆయన నరేంద్రుణ్ణి ఆప్యాయంగా చూస్తున్నారు.)🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 51*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 51*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*శివే శృంగారార్ద్రా తదితరజనే కుత్సనపరా*

 *సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ |*

 *హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీ*

 *సఖీషు స్మేరా తే మయి జనని దృష్టిస్సకరుణా ‖*


మనకు శాస్త్రములో నవ రసాలు అంటే తొమ్మిది అనుభూతులు చెప్పారు. 

ఇవి

శృంగారము,హాస్యము, భీభత్సము,భయానకము, వీరము,రౌద్రము,కరుణ, అద్భుతము,శాంతము. ఎవరైనా ఈ అనుభూతుల  భావ ప్రకటన చేసేది నేత్రముల ద్వారా. ఈ శ్లోకంలో ఈ అనుభూతులను అమ్మవారి పరంగా చెప్తున్నారు.  


శివే శృంగారార్ద్రా = శివుని చూసినప్పుడు శృంగార భావనతో ఆమె ఆర్ద్రమౌతుందట.


తదితర జనే కుత్సనపరా =  శివుని కాకుండా ఇంకెవరిని చూసినా జుగుప్స కలుగుతుందట (శృంగారపరంగా)


సరోషా గంగాయాం = శివుని జటాజూటంలో తిష్ఠ వేసుకొని వున్న గంగను చూస్తే రోషం (రౌద్రం), సవతి భావనతో. నిజానికి ఇద్దరూ ఒకటే. ఈ భావ ప్రకటన కేవలం లీలా విశేషం.


గిరిశచరితే విస్మయవతీ = శివుని చరితము, ఆయన లీలలు. 

హాలాహల భక్షణ, మన్మధ దహనం, గజాసుర వధ, త్రిపురాసుర సంహారం, గంగావతరణం మొ...

ఎవరైనా చెప్తుంటే విస్మయం (అద్భుత రసం)


హరాహిభ్యో భీతా = శివుని శరీరంపై తిరుగాడే పాములను చూసి భయం! అందరికీ అభయమిచ్చే తల్లికి భయమేమిటి? ఆవిడ అభయాంబిక. ఇది కూడా లీలా విలాసమే.


సరసిరుహ సౌభాగ్యజయినీ = ఆమె నేత్రములు పద్మముల సౌందర్యమును, సౌభాగ్యమును జయించినప్పటి వీర రసము. మహిషాసుర వధ, భండాసుర వధ, మొదలైనవన్నీ అమ్మవారి వీర రసమునకు ఉదాహరణలు.


సఖీషు స్మేరా తే = చెలికత్తెలతో మాట్లాడేటప్పుడు హాస్య రసము 


మయి జనని దృష్టిస్సకరుణా = భక్తులపట్ల ఆమెకు కల కరుణ 


ఇప్పటికి ఎనిమిది చెప్పారు నవ రసములలో. మరి శాంత రసము? శాంతము ఈ ఎనిమిదింటికీ అతీతమైనది. అది లోకాతీతమైన అనుభూతి. అన్ని భావనలు అణగిపోయినప్పుడు కలిగేది శాంతము. ఆ అనుభూతి మాటలలో చెప్పలేనిది. దక్షిణామూర్తి స్తోత్రములో *మౌనవ్యాఖ్య* వలె. శాంతము అనేది రసమా? (రసమంటే అనుభూతి) భావమా? ఒక స్థితియా? అది వ్యక్తపరచలేనిది. అందుకే, భావప్రకటనకు అనుకూలమైన నాట్యశాస్త్రములో కూడా భరత ముని ఈ ఎనిమిది రసములు గురించే చెప్పారు.


ఇక యోగపరంగా చూస్తే, శ్రీచక్రములో ఎనిమిది ఆవరణలు దాటి బిందువును చేరినప్పుడు శాంతము,శాంతి. బిందువు శాంతమునకు స్థానము. అది సచ్చిదానంద స్వరూపము. అమ్మవారు ఇన్ని రసాలను తన నేత్రముల ద్వారా ప్రకటిస్తున్నా, ఆమె స్వభావము, తత్త్వము శాంతము. అమ్మ కరుణతో చూస్తే కానీ మనకు ఆ శాంతి లభించదు. లలితా సహస్ర నామాల్లో చెప్పినట్లు *ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః* అమ్మ కనురెప్ప తెరిస్తే ప్రపంచము, కనురెప్ప  మూస్తే లయము. సృష్టి, స్థితి, లయాలు ఆమె కన్నుల కదలికలోనే వున్నాయి. ఆమె కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి.

ఓం శాంతిః శాంతిః శాంతిః 🙏🏻


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ఆలోచనాలోచనాలు

 ///// ఆలోచనాలోచనాలు /////       ***** ప్రతిపక్ష సభ్యునిగా చెప్పిన మాటలను అధికారంలోకి వచ్చాక చెప్పకూడదు. ప్రపంచవ్యాప్తంగా అందరు రాజకీయనాయకులు పాటించే ఏకైక సిద్ధాంతం ఇదే! ---- జాన్ గ్లాస్ వర్డ్.           ***** రచయితలు గాలిలో మేడలు కడుతుంటారు. పాఠకులు అందులో కాపురముంటారు. పబ్లిషర్స్ అద్దెలు వసూలు చేసుకొని బ్రతుకుతుంటారు.                ***** ఈ దేశంలో ఒకరోజు నీతి వాహ్యాళికని పొరబాటున బయటకు వచ్చింది. అసత్యం, అన్యాయం, అధర్మం ఆమెను మానభంగం గావించాయి. ఫలితంగా ఆమె "" అవినీతిని"" ప్రసవించి, ఆపై మరణించింది. మనం ఆ "" అవినీతి"" ని గత 75 సంవత్సరాలుగ పోషిస్తున్నాం.                        ***** అందరూ "" సమత్వం, సమత్వం"" అంటూ కేకలు వేస్తూ కాలం గడిపేవారే! ఈ సమత్వం గతంలో లేదు. భవిష్యత్తులో ఉండబోదు. సమత్వం బ్రతకడంలో కనుపించడం లేదు. అందరికీ సమాన అవకాశాలను మనం కల్పించినా అందరి బుద్ధి వైభవం ఒకేతీరుగా ఉండదుకదా! అందరి తెలివితేటలు సమానంగా ఉండవుకదా!                         ***** మతాన్ని నమ్మినప్పటికీ మనుషులు ఇంత క్రూరత్వంతో ఉన్నారంటే , అసలు ప్రపంచంలో మతమనేది లేకపోతే లోకం ఏమవుతుందో? ---- ఫ్రాంక్లిన్.                                ***** ఈ శతాబ్దంలోని దురదృష్టం ఏమిటంటే నేర్చుకోవడం మానివేసినవారంతా ఎగబడి బోధించడం ప్రారంభిస్తున్నారు.                 ***** ఐదు కిలోల మాంసాన్ని , రెండు ఆల్ఫేషియన్ కుక్కల మధ్య ఉంచి గది తలుపులు మూసివేస్తే , అవి ఆహారాన్ని తినకుండా ,తెల్లవార్లూ కొట్లాడుకొని, గాయపరచుకొని , రొప్పుతూ, రోజుతూ గాయాలతో మరునాడు ఉదయాన దర్శనమిస్తాయి. అదే ఐదు మేకలకు ఇంత చెట్ల ఆకులు, పచ్చని గడ్డి ముందు వేసి తలుపులు మూసివేస్తే తెల్లవారేసరికి ఒకదానిపై ఒకటి పడుకొని దర్శనమిస్తాయి. మొదటిది అనైక్యతకు, రెండవది ఐక్యతకు సంకేతాలు.              ***** పల్లె తల్లివంటిది. పట్నం ప్రియురాలివంటిది. పల్లె రమ్మంటుంది. ప్రియురాలు తెమ్మంటుంది. అంతే తేడా!                          ***** గుడి లో మ్రొక్కులు అందుకొనేది ఒక.రాయి. గుడి మెట్లు కూడా రాయే. ఒకటి కోటి చేతులతో నివాళులందుకొంటూవుంటే, మరొకటి కోటి పాదాలతో తొక్కబడుతున్నది. అదృష్ట, దురదృష్టాలకు ఇంతకంటే ఉదాహరణ వేరెక్కడ మీకు దొరుకుతుంది.                       ***** పగలంతా ఎండలో రాళ్ళు కొట్టిన చెయ్యి, సాయంత్రానికి క్రిందికి వస్తున్నది అంటే లోపం "" అనాటమీ"" లో లేదు. బోడి "" ఎకానమీ"" లోనే ఉంది.      ----------------------------------------------                                  Sharpen your mind!         1* Why did grandma put wheels on her rocking chair?                   2* What is a mathematician's favourite dessert?          3* What gives you the strength and power to walk through walls?        4* What stays where it is when it goes off?     (For proper answers you have to wait 25 Hrs only.)                           ******************************.                               తెలుగు వారి పొడుపు కథలు మరియు విడుపులు.                            1* ముళ్ళుంటాయి గాని గుచ్చుకోవు. పళ్ళుంటాయి గాని తినలేదు. ఏమిటది?       (దువ్వెన)                              2* ముళ్ళకంచెలో మిఠాయి పొట్లం. తెచ్చుకొందామంటే గిచ్చుళ్ళు తప్పవు. ఏమిటది? ( తేనెతుట్టె)           3* మూటతెరిస్తే ముత్యాల సరాలు. మధ్యలో కదిలే చేప. ఏమిటవి? ( నోట్లో దంతాలు , మధ్యలో నాలుక)                                 4* మూట విప్పితే రత్నాలు రాలతాయి. ఏమిటవి? ( దానిమ్మ గింజలు)               5* మూడవ అక్షరం " క" ష్టంలో ఉంటుంది. నష్టంలో మాత్రం కాదు. ఏమిటది?      (రామచిలుక)                        తేది 12--10--2023, గురువారం, శుభోదయం.

Guruvulu

 https://youtu.be/sb5VGGy_6vc?si=_0UXGpa5iIaIU9Kn


పంచాంగం 12.10.2023 Thursday

 ఈ రోజు పంచాంగం 12.10.2023  Thursday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష: త్రయోదశీ తిధి బృహస్పతి వాసర: పూర్వఫల్గుని నక్షత్రం శుక్ల యోగ: గరజి తదుపరి వణిజ కరణం ఇది ఈరోజు పంచాంగం.


త్రయోదశీ రాత్రి 07:51 వరకు.

పూర్వఫల్గుని పగలు 11:34 వరకు .

సూర్యోదయం : 06:12

సూర్యాస్తమయం : 05:53

వర్జ్యం : రాత్రి 07:32 నుండి 09:18 వరకు

దుర్ముహూర్తం : పగలు 10:06 నుండి 10:52 వరకు తిరిగి మధ్యాహ్నం 02:46 నుండి 3:33 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు 


యమగండం : ఉదయం  06:00 నుండి 07:30 వరకు.  



శుభోదయ:, నమస్కార:

_అక్టోబరు 12, 2023_

 *ఓం శ్రీ గురుభ్యోనమః* 

 శుభోదయం, నేటి పంచాంగం *_అక్టోబరు 12, 2023_* 

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

 *దక్షిణాయనం**వర్ష ఋతువు*

*భాద్రపద మాసం**కృష్ణ పక్షం*

తిథి: *త్రయోదశి* రా7.13

వారం: *బృహస్పతివాసరే*

(గురువారం)

నక్షత్రం: *పుబ్బ* మ12.12

యోగం: *శుక్లం* ఉ11.08

కరణం: *గరజి* ఉ6.13

*వణిజ* రా7.13

వర్జ్యం: *రా8.07-9.52*

దుర్ముహూర్తము: *ఉ9.49-10.36*

*మ2.30-3.17*

అమృతకాలం: *ఉ6.53వరకు*

రాహుకాలం: *మ1.30-3.00*

యమగండం: *ఉ6.00-7.30*

సూర్యరాశి: *కన్య*

చంద్రరాశి: *సింహం*

సూర్యోదయం: *5.55*

సూర్యాస్తమయం: *5.38*

 *సర్వే జనాః సుఖినోభవంతు*

ఎన్నెన్నో నదులు

 ఎన్నెన్నో నదులు వొచ్చి గంగలో కలుస్తాయి. ఎన్ని కలిసినా అన్నిటినీ  గంగా నదే అంటారు.  తనలో కలుస్తున్న నదులను "గంగ" హేళన చేయదు. సాదరంగా కలుపుకొని తన పేరుమీదే పిలిచేలా పావనం చేస్తుంది. ఇదే తీరులో  "ద్వైతం " కి అయినా " విశిస్టాద్వైతము" కి అయినా  చివరిదశ "అద్వైతమే".   అద్వైత సాధకులు  గంగలా  యదార్ధ చింతనలో సాధన చేయాలి.  ద్వైతాన్ని ఖండిస్తే ఎలా? దాని అంతిమ స్టితి అద్వైతమే కదా!! అందుకే విగ్రహారాధనను ఖండించటం  ఎలాంటిది అనగా...తనలో కలుస్తున్న నదులను "గంగ" హేళన చేయటం లాంటిది. గంగా మాత ఆ పని ఎప్పుడూ చేయదు.  అద్వైత సాధకులకు గంగయే అద్భుత గురువు. 🙏🙏

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు -  భాద్రపద మాసం - కృష్ణ పక్షం  -  త్రయోదశి -  పూర్వాఫల్గుణి - గురు వాసరే* (12.10.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/Ig7JZUOmOXo?si=0cHSutudMacurmQA



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*