22, జులై 2024, సోమవారం

శ్రీ భూవరహస్వామి ఆలయం

 *🕉 మన గుడి : నెం 386,,*


⚜ *కర్నాటక  :కాలహళ్లి - మండ్యా*


⚜ శ్రీ భూవరహస్వామి ఆలయం 



💠 మీకు జీవితంలో సమస్యలు ఉన్నాయా?" "మీరు కష్టాల లోతుల్లో మునిగిపోయారా?" "జీవితంలో మీ కోసం ఏదీ పనిచేయడం లేదని మీరు విచారంగా ఉన్నారా?" - 

ఎక్కడా చూడకండి, నేరుగా భూవరాహ స్వామి ఆలయానికి వెళ్లండి. 


💠 సొంతిల్లు కల నెరవేరాలనుకునేవారు ఒక్కసారి భూవరాహా స్వామిని దర్శిస్తే చాలు అని ప్రజలు నమ్ముతారు.

భూ వివాదానికి సంబంధించిన అన్ని సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయని భక్తులు నమ్ముతారు


💠 భూవరాహస్వామి ఆలయం స్థానికులలో చాలా ప్రసిద్ధి చెందింది మరియు దేవతకి మర్మమైన శక్తులు ఉన్నాయని నమ్ముతారు.


💠 ఆలయంలో, 48 రోజులు (ఒక మండలం) స్వచ్ఛమైన హృదయంతో సేవ చేయాలని ప్రతిజ్ఞ చేసి, దానిని చేయడం ప్రారంభించండి. 100% విశ్వాసం మరియు సమర్పణతో నిర్వహిస్తే, భక్తుడు 48 రోజుల తర్వాత ఫలితాలను చూడటం ప్రారంభిస్తాడని చెప్పబడింది.


💠 భక్తులను కాపాడేందుకు శ్రీమహావిష్ణువు ఎత్తిన అవతారాలలో మూడవ అవతారమే భూవరాహ అవతారం.


💠 కర్ణాటకలోని హేమావతి నది ఒడ్డున ఈ ప్రతిష్టాత్మక దేవాలయం ఉంది.


💠 ఇక్కడ కనిపించే విగ్రహాన్ని గౌతమ మహర్షి ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి.ఈ విగ్రహం చూసేందుకు భయానకంగా ఉన్న భక్తులకి అభమయిస్తుంది.


💠 ఆలయం పక్కనే హేమావతి నది ఉంది.ప్రవాహం ఎక్కువగా ఉండే నదిలో పున్యస్నానాలు అంత శ్రేయస్కరం కాదు.వర్షాకాలంలో ఈ నదిలోనీ నీరు దేవాలయం గోడను కూడా తాకుతూ వెళ్తుంది.

ప్రతి సంవత్సరం మే నాటికి నది మట్టం తగ్గుతుంది.ఆ సమయంలోనే వార్షిక ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు.



💠 ఈ దేవాలయం దగ్గర మట్టి పూజా, ఇసుక పూజ చేస్తున్నారు.

స్వామివారి దగ్గర మట్టిని పూజించి ఇస్తారు.

దాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇంటి ప్రాంతంలో వాడితే మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు.

అక్కడ ఇటుకలను కూడా పూజ చేసి ఇస్తుంటారు.

వాటిని మనం ఉండే చోట పెడితే సొంతిల్లు ప్రాప్తిస్తుందని భక్తులు విశ్వాసంతో ఉన్నారు.


💠 విగ్రహం 18 అడుగుల ఎత్తు & భూదేవి విగ్రహం 3.5 అడుగుల ఎత్తుతో ప్రధాన విగ్రహం కింద  హనుమాన్ విగ్రహం ఉంది.


💠 ఈ ఆలయం 2500 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. పురాణాల ప్రకారం వీర బల్లాల రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు మరియు ప్రతి సంవత్సరం ప్రార్థనలు చేసేవాడు.


💠 2500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయాన్ని రాజు వీర బల్లాలకి ఒక గొప్ప కుక్క చూపించిందని పురాణాలు చెబుతున్నాయి.


💠 పురాణాల ప్రకారం, రాజు వీర బల్లాల తన వేట యాత్రలో ఈ అడవులలో తప్పిపోయాడు. 

అతను ఒక పెద్ద చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటుండగా, ఒక కుందేలును వెంబడిస్తున్న వేట కుక్కను చూశాడు.  

వారు ఒక నిర్దిష్ట ప్రదేశానికి చేరుకున్నప్పుడు, కుందేలు వెనక్కి తిరిగి భయంకరమైన కుక్కను వెంబడించడం ప్రారంభించింది.  

ఈ వింత పరిణామాన్ని గమనించిన రాజుకు ఆ ప్రదేశంలో కొన్ని అదృశ్య శక్తులు ఉన్నాయని నమ్మాడు.

 అతను మొత్తం ప్రాంతాన్ని తవ్వి భూమి పొరల క్రింద దాగి ఉన్న ప్రళయ వరాహస్వామిని కనుగొన్నాడు.  రాజు దానిని ఆలయంలో ప్రతిష్టించి నిత్య ప్రార్థనలు చేశాడు.  


💠 ఈ రోజు మనం చూస్తున్న దేవాలయం రాజు కట్టిన దాని అవశేషాలు. ఆలయానికి ఎదురుగా దేవనాగిరి శాసనాలు ఉన్న శిలాఫలకం మనకు స్థల చరిత్రను తెలియజేస్తుంది.


💠 కలహళ్లి గ్రామం హేమావతి నదికి కుడి ఒడ్డున ఉంది.  ఈ ఆలయం ఒక కొండపైన ఉంది, దాని పాదాల వద్ద కావేరి, హేమావతి మరియు లక్ష్మణతీర్థ నదులు ఉన్నాయి.  వరాహ  ఆలయానికి సమీపంలో వేణుగోపాలస్వామి ఆలయం ఉంది, ఇది కృష్ణ రాజ సాగర డ్యాం యొక్క బ్యాక్ వాటర్స్ కింద అసలు స్థలం మునిగిపోయిన తరువాత మార్చబడింది.  

వరాహనాథ స్వామి ఆలయం ఉన్న కొండ ఎత్తు కారణంగా, సాగర్ డ్యామ్ వరద నీటి నుండి రక్షించబడింది, ఇది వరాహ భగవానుడు మళ్లీ రక్షించినట్లుగా ఉంది.


💠 వరాహనాథ స్వామి దేవాలయం తూర్పు ముఖంగా ఎత్తైన గుట్టపై ఉంది, ప్రధాన ద్వారం వరకు మెట్లు ఉన్నాయి.  ఈ ఆలయంలో గర్భగృహం, అంతర్ద్వారం మరియు నవరంగ ఉన్నాయి.  

గర్భగుడిలో వరాహదేవుడు తన ఒడిలో భూదేవితో కూర్చున్నాడు.  అతని దిగువ కుడి చేయి అభయ ముద్రలో ఉంది, అతని పై చేతులలో చక్రం మరియు శంఖంతో మరియు భూదేవి చుట్టూ అతని మిగిలిన చేయి ఉంది. 


 💠 వరాహ భగవానుడు కిరీట ముఖాన్ని ధరించగా, భూదేవి కరంద ముఖాన్ని ధరిస్తుంది మరియు ఆమె కమలాన్ని పట్టుకుంది.  భగవంతుని దంతాలు లేత రంగులో ఉంటాయి మరియు అతని కళ్ళు ఎరుపు రంగును కలిగి ఉంటాయి.  దేవత (మూలమూర్తి) సాలగ్రామ-శిల, మరియు అతని వెనుక సుదర్శన చక్రం ఉంటుంది. 


🔆 మార్గం


 👉 మైసూరు - పాండవపుర > ఆరతి ఉక్కడ > బన్నంగాడి > బల్లేనహళ్లి > మాచగోనహళ్లి > గంజిగెరె > కల్లహల్లి.

వివేకానంద సమయ స్పూర్తి*

 *🚩స్వామి వివేకానంద సమయ స్పూర్తి*


స్వామి వివేకానంద యూనివెర్సిటీలో Law చదువుకునేటప్పుడు..

ఒక తెల్ల ప్రొఫెసర్ కి వివేకానందుడు అంటే ఎందుకో నచ్చేది కాదు...!!


ఒక రోజు, డైనింగ్ రూమ్ లో ప్రొఫెసర్ లంచ్ చేస్తుండగా..


వివేకానందుడు వచ్చి ప్రొఫెసర్ పక్కనే కూర్చోని తన బాక్స్ ఓపెన్ చేస్తుండగా...


ప్రోఫెసర్ ఇలా అన్నాడు..!!

" పంది, పావురం పక్క పక్కన కూర్చోని భోజనం చెయ్యవు అది నువ్వు తెలుసుకోవాలి"


దానికి వివేకానందుడు..!!

ప్రొఫెసర్ తో గొడవెందుకు అనుకుని ( చమత్కారంగా) :

" మీరు దిగులు పడకండి సార్, నేను ఎగిరిపొతా" అని వేరే టేబుల్ దగ్గరకెళ్లిపోయాడు.

*(1st Punch👊)*


ప్రోఫెసర్ మొహం ఎర్రటి కందగడ్డలా కందిపోయింది...!!

ఎలాగైనా వివేకానంద మీద ప్రతీకారం తీర్చుకోవాలుకున్నాడు..!!


ఆ తరువాత ఒకరోజు క్లాస్ రూమ్ లో...

వివేకానందని ప్రోఫెసర్ ఓ ప్రశ్న వేసారు...!!

"వివేకానందా..!!

నువ్వు రోడ్ మీద నడుస్తున్నప్పుడు..

నీకు రెండు బాగ్ లు దొరికాయి అనుకుందాం...!!

ఒక దానిలో జ్ఞానం, ఇంకో బాగ్ లో డబ్బు వున్నాయి. నువ్వు దేనిని తీసుకుంటావు?"


వివేకానందుడు (సందేహించకుండా)...

"అనుమానమెందుకు సర్,డబ్బులున్న బ్యాగ్ నే తీసుకుంటాను" ఆన్నారు..!!


ప్రోఫెసర్ వంకరగా నవ్వుతూ..వ్యంగ్యంగా..

"అనుకున్నా...నీ సమాధానం అదేనని...!!

నేనే నీ ప్లేస్ లో వుంటే, జ్ఞానమున్న బ్యాగ్ నే తీసుకుంటా" అన్నాడు..!!


దానికి వివేకానందుడు..!! 

" నిజమే. ... సహజంగా.... ఎవరికి ఏది తక్కువో అదే తీసుకుంటారు కదా సర్..!!"

*(2nd Punch👊)*


ప్రొఫెసర్ కి తిక్కరేగిపోయింది..!!

అవకాశం, టైమ్ కలిసి వచ్చినప్పుడు...

వివేకానందని వదలకూడదు అని మనసులో ప్రతిజ్ఞపూనాడు..!!


టైము, అవకాశం రెండు కిలిసి రానే వచ్చాయి ప్రొఫెసర్ కి...!!

ఆ రోజు, దిద్దిన ఆన్సర్ పేపర్ లు, క్లాస్ లో ఇవ్వలి..!!


కోపంతో రగిలిపోయి వున్న ప్రొఫెసర్..

వివేకానంద ఆన్సర్ పేపర్ మీద ఈడియట్ అని వ్రాసి వివేకానందకి ఇచ్చాడు..!!


ఆన్సర్ షీట్ అందుకున్న వివేకానంద...

తన సీట్లో కూర్చొని ప్రొఫెసర్ రాసిన " ఈడియట్" అనే Word చూసి...తనని తాను శాంత పరచుకోవడానికి చాలాసేపు పట్టింది

కోపం తగ్గిన తరువాత హుందాగా.. 

ప్రొఫెసర్ టేబుల్ దగ్గరకెళ్ళి...

గౌరవప్రదంగా...

వినమ్రమయిన శాంత స్వరంతో...

"సర్...!! తమరు నా అన్సర్ షీట్ లోసంతకం చేసి మార్కులు వేయడం మరిచారు....!

*(లాస్ట్ పంచ్👊)*


🙏🙏that is Swamy  Vivekananda...🙏🙏

దత్తపది

 దత్తపది 


ఇక్కడ 

అక్కడ 

ఎక్కడ 

తక్కెడ


అనె పదాలతొ కూరగాయల మార్కెటును ఇచ్హాచంధస్సులొ వర్ణించగలరు.


దత్తపది పూరణ -- నా ప్రయత్నము 


*ఇక్కడకే రండయ్యా*

*యక్కడ నాసిరకము, వెలయది యెక్కువయే!*

*యెక్కడకుఁ బోవలదయా,*

*తక్కెడ కెక్కువనె తూచి ధరపెంచనయా !*


🙏 *--వేంఉగోపాల్ యెల్లేపెద్ది*





కందము తెలిసిన కాయగూరల వ్యాపారి అందముగా ఆకర్షిస్తున్నాడు తన అంగడికే రమ్మంటూ అందరినీ 🤣


తక్కెట్లో కాసిని కూరలు అధికంగానే ఇస్తాను కానీ , ధరను పెంచి మాత్రము అమ్మను అని ..


(ఇక్కడ) దొండకాయ లవి యింపుగ నున్నవి లేతలేతగా

(నక్కడ) దోస లద్భుతపు టానపకాయలు గానుపించె నిం

(కెక్కడ) నోయి వంగ విను మీయవి నీవిక నాలసింపకే

(తక్కెడ) దూచి యిమ్మనుచు తా నొక డాడెడు నాపణంబునన్.


ఎక్కడ జూచినన్ కననదేమి విచిత్రమొ కూరలంగడిన్

అక్కడ గొట్టుకాయల నయమ్ముగనమ్మగజూతురయ్యవే

తక్కెడనున్నకూరలనిదానముగాకొనజూచుచున్న నే

నిక్కడ నిల్చి యుంటి నికనేమగునోగమనింపగావలెన్


కం॥

ఎక్కడదొరకనికూరలు  

ఇక్కడనే దొరకుమీకుహితమునుగూర్చున్ 

అక్కడనిలబడనేలా?తక్కెడమోసంబులేదు,ధరలునుచౌకే! 

 గుడ్లూరివేంకటెశ్వరరావు,కందుకూరు.


ఎక్కడపంటపండినవొ?యిక్కడకన్పడెదోస,యల్లముల్ 

ఇక్కడజూడు"వంగ"మదికింపునుగూర్చెడి"బెండ" "చిక్కుడుల్ 

అక్కడజూడగుమ్మడియునద్భుతతింత్రిణిపల్లవంబులన్ 

తక్కెడజూచి యిత్తుమయధర్మముతప్పమురండి!విల్వుడీ! 

           గుడ్లూరివేంకటేశ్వరరావు,కందుకూరు.


ఇక్కడ దొరికెడి కంద మ 

రెక్కడ మనకు దొరకదని యిల్లాలనగా 

అక్కడ నే గల పెనిమిటి 

తక్కెడ సరిరీతి తూచి తానది తెచ్చెన్ 


శనగల చంద్రశేఖర్




గురుపౌర్ణమి


 గురుపౌర్ణమి శుభాకాంక్షలు

*********************

పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి,9347537635. గానం: శ్రీ భాగి కృష్ణమూర్తి, చీరాల 


సీసం:

వ్యాసమహాముని ప్రభవమైన దినము 

     గురువులన్ పూజించు పరమదినము 

సూర్యోదయము వేళ శుచి యుపవాసము 

     నారంభమొనరించు నవ్యదినము 

చంద్రోదయము వేళ చంద్రుని వీక్షించి 

     యుపవాసమును వీడు సుఫల దినము 

శ్రద్ధగా బుద్ధిగా పెద్దలన్ పూజించి 

     యాశీస్సులన్ పొందునట్టి దినము 


తేటగీతి: 

శుభము లెన్నియొ ఆషాఢ శుద్ధ పౌర్ణ

మిచ్చు గావుత! యెల్లర కిచ్చు గాక!

పూజలొనరించు వారెల్ల పుణ్యములను

వ్యాసపూర్ణిమ దినమున బడయుగాక!

 అభ్యుదయముగోరి కురిసెనగ్నిధార 

రుద్రవీణ మీటి జనుల నిద్రలేపె

ఆశయాలోచనాలోచనంబులనిడి

దాశరథిరాక్షసులపైన దాడిజేసె

ధాటిజూపినకవి...దాశరథి

 ధాటిజూపినకవి...దాశరథి

సీ..

ఉద్యమస్ఫూర్తితోనువ్వెత్తుగనెగసి

     అక్షరాస్త్రములెల్లనాజినిలిపి

నైజాముసర్కారు బేజారు నొందంగ

     పదునైన కవితలపాఱజేసి

బంగారు తెలగాణ భద్రమై నిలువంగ

     నిగళాలతెగద్రుంప నింగినరచి

యమ్మహాంధ్రోదయమిమ్మహాధరియిత్రి

      మనసారకాంక్షించి మమతజూపి

తేగీ.

దులిపె తరతరములబూజు నలఘుమతిగ

నాదు తెలగాణ కోటిరత్నాలవీణ

యనుచు నినదించిప్రేమించె నతిశయముగ

నట్టి దాశరథి నుతింతు దిట్టకవిగ..

 ఆమహాకవి జయంతి సందర్భంగా అక్షర నివాళి..

రాయప్రోలు జగదీశచంద్రశర్మ తెనాలి

వంటగదిని విడిచిపెట్టిన

 అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు


ఇంట్లో వంట ఆగిపోవడంతో అమెరికాలో ఏం జరిగింది?

1980ల నాటి ప్రఖ్యాత అమెరికన్ ఆర్థికవేత్తలు, కుటుంబంలో బయటి నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేస్తే, దేశంలో కుటుంబ వ్యవస్థ క్రమంగా అంతరించిపోతుందని అమెరికన్ ప్రజలను హెచ్చరించారు.

కుటుంబ సభ్యులకు బదులు బయటి నుంచి వచ్చే పిల్లల పెంపకానికి ఏర్పాట్లు చేస్తే పిల్లల మానసిక వికాసానికి, కుటుంబానికి కూడా ప్రాణాపాయం తప్పదని రెండో హెచ్చరికతో పాటు.

  కానీ చాలా తక్కువ మంది మాత్రమే అతని సలహాను పాటించారు. ఇంట్లో వంట చేయడం దాదాపు ఆగిపోయింది మరియు ఆర్డర్ చేయడం (ఇది ఇప్పుడు ఆచారం) అమెరికన్ కుటుంబం అంతరించిపోయేలా చేసింది, నిపుణులు హెచ్చరించారు.

ఇంట్లో వంట చేయడం అంటే కుటుంబ సభ్యులతో ప్రేమగా కనెక్ట్ అవ్వడం.

వంట అంటే కేవలం ఆహారాన్ని వండడమే కాదు. బదులుగా, కుటుంబ సంస్కృతి కేంద్ర బిందువు.

ఇంట్లో కిచెన్ లేదు, ఒకే బెడ్ రూమ్ ఉంటే అది ఇల్లు కాదు, హాస్టల్.


ఇప్పుడు తమ వంటగదిని మూసివేసి, పడకగది ఒక్కటే సరిపోతుందని భావించిన అమెరికన్ కుటుంబాలు ఎలా ఉంటాయి?

1971-72లో, దాదాపు 72% అమెరికన్ కుటుంబాలు భార్యాభర్తలు, వారి పిల్లలతో నివసిస్తున్నారు.

2020 నాటికి, ఈ సంఖ్య 22%కి తగ్గింది.

2-ఇంతకుముందు సహజీవనం చేసిన కుటుంబాలు ఇప్పుడు వృద్ధాశ్రమంలో (వృద్ధాశ్రమం) నివసిస్తున్నాయి.

3- అమెరికాలో, 15% మహిళలు అణు కుటుంబాలలో నివసిస్తున్నారు.

4-12% మంది పురుషులు కూడా న్యూక్లియర్ కుటుంబాలుగా జీవిస్తున్నారు.

USలో 5-19% కుటుంబాలు ఒకే తండ్రి లేదా తల్లికి చెందినవి.

ప్రస్తుతం అమెరికాలో పుట్టిన పిల్లల్లో 6- 38% మంది పెళ్లికాని మహిళలకు జన్మించారు.వారిలో సగం మంది బాలికలు, కుటుంబ రక్షణ లేకుండా చిన్నవయసులోనే శారీరక వేధింపులకు గురవుతున్నారు.

యునైటెడ్ స్టేట్స్లో దాదాపు 52% మొదటి వివాహాలు విడాకులతో ముగుస్తాయి.

8- 67% రెండవ వివాహాలు కూడా సమస్యాత్మకమైనవి.


  వంటగది మరియు పడకగది మాత్రమే లేకపోతే అది పూర్తి ఇల్లు కాదు.

వివాహ వ్యవస్థ విచ్ఛిన్నానికి యునైటెడ్ స్టేట్స్ ఒక ఉదాహరణ.

మన ఆధునికవాదులు కూడా అమెరికాలో లాగా దుకాణాల నుండి లేదా ఆన్‌లైన్‌లో ఆహారాన్ని కొనుగోలు చేయడాన్ని సమర్థిస్తున్నారు మరియు మేము వంట సమస్య నుండి విముక్తి పొందామని సంతోషిస్తున్నారు. దీనివల్ల భారత్‌లోని కుటుంబాలు కూడా అమెరికా కుటుంబాల మాదిరిగానే మెల్లమెల్లగా నాశనమవుతున్నాయి.

కుటుంబాలు నాశనం అయినప్పుడు, మానసిక మరియు శారీరక ఆరోగ్యం రెండూ క్షీణిస్తాయి. అనవసరమైన ఖర్చుతో పాటు, బయటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరం లావుగా మారి ఇన్‌ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా శారీరక ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యం చాలా అవసరం.


అందుకే బయట తిండికి దూరంగా ఉండమని మా ఇంటి పెద్దలు సలహా ఇచ్చేవారు.

అయితే ఈరోజు మనం నా కుటుంబంతో కలిసి రెస్టారెంట్‌లో తింటాము...",

Swiggy మరియు Zomato ద్వారా తెలియని వ్యక్తులు (వివిధ రసాయనాలతో) వండిన ఆహారాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం మరియు తినడం ఉన్నత విద్యావంతులు, మధ్యతరగతి ప్రజలలో కూడా ఫ్యాషన్‌గా మారుతోంది.

ఈ అలవాటు దీర్ఘకాలిక విపత్తుగా మారుతుంది.

ఈ రోజు మనం మన ఆహారాన్ని నిర్ణయించడం లేదు, దీనికి విరుద్ధంగా ఆన్‌లైన్ కంపెనీలు మనం ఏమి తినాలో మానసికంగా ప్రకటనల ద్వారా నిర్ణయిస్తాయి.

మన పూర్వీకులు ఆరోగ్యంగా మరియు దీర్ఘకాలం జీవించారు ఎందుకంటే వారు ప్రయాణానికి వెళ్ళే ముందు కూడా వండిన తాజా ఆహారాన్ని ఇంటికి తీసుకెళ్లేవారు.

అందుకే ఇంట్లోనే తయారు చేసుకొని కలిసి తినండి. పౌష్టికాహారం కాకుండా, ప్రేమ మరియు ఆప్యాయత ఉంటుంది.


పై విషయాన్ని ఆలోచించండి నిజమే కదా 😍........ అందరికి తెలియచేయండి.

మన కవులు

 🌼🌸🌺 2. మన కవులు - పద్యములు - సాహిత్యము 🌺🌸🌼


సీ. నన్నయ తిక్కన ఎఱ్ఱన లెన్నగ ఆంధ్రభా

               రత మహాకావ్య నిర్మాత లనగ

     శ్రీకార మొనరించె శ్రీనాథ కవిరాట్టు

               బహుకావ్య నిర్మాణ ప్రవరుడగుచు

     రామునానతి మేర రచియించె భక్తితో

               బమ్మెర పోతన్న భాగవతము

     అష్టదిగ్గజకవు లాంధ్రభోజుండును

                కావ్యప్రబంధాల కర్తలనగ  


తే. కృతుల నెన్నెన్నొ వెలయించి రిటుల మున్ను

     మహిత కవివర్యు లెందరో మానితముగ

     ఆంధ్రభారతి కవ్వారు అనుగుసుతులు

     ఆలకించగ రావయ్య! ఆంధ్ర జనుడ!  1


సీ. రమ్యమౌ పద్యాల రామగాథ రచించె

              మల్లెల కవనాల మొల్లమాంబ

     రామభద్రాంబయు, రంగాజి, కృష్ణాజి

              ఛందోకళనిపుణ; చంద్రరేఖ 

     రసరమ్య కావ్యమ్ము రాధికాస్వాంతన

              మును రచియించిన ముద్దుపళని

     పోలిబోటి తరుణి, పొలతుక తంజనా

              యకి కవయిత్రులై యలరినట్టి


తే. ఆంధ్రసాహితీ రంగాన అతివలనగ!

     తెలుగుతల్లికి సింధూరతిలక మగుచు

     మాన్యతను పొందిన వనితామణులు వారు!

     ఆలకించగ రావయ్య!ఆంధ్ర జనుడ!  2


తే. అల జగన్నాథ కవివర్యు డనుపముండు

     మహిని పండితరాయ నామాంకితుండు

     ఘనుడు బహుముఖ ప్రాజ్ఞుడా కవివరుండు

     అతని నెఱుగుదువా? నీవు! ఆంధ్ర జనుడ!  3


ఆ. అచ్చతెలుగు నుడుల నాటవెలదులందు

     అందమొప్పు నటుల పొందుపరచి

     “విశ్వదాభిరామ వినుర వేమ యటంచు”

     వెలయ జేసెను గద వేమన కవి.  4


తే. ఘనుడు ఏనుగు లక్ష్మణ కవివరుండు

     తెనుగున ననువదించినా డనుపమముగ

     భర్తృహరి సుభాషిత సూక్తిపదములెల్ల

     ఆలకించగ రావయ్య! ఆంధ్ర జనుడ!  5


తే. కావ్యములు కంఠమందున్న గణపతిముని

     ఘనుడు కారణజన్ముడు కవుల యందు

     కావ్యకంఠ గణపతిగ ఖ్యాతి గాంచె

     అతని నెఱుగుదువా? నీవు! ఆంధ్ర జనుడ!  6


కం. శిక్షాస్మృతులై వెలసిన

      లక్షణవాచకము లెన్నొ లక్ష్యార్థముగా

      దీక్షగ రచించి రెందరొ!

      వీక్షించితె? ఆంధ్ర జనుడ! వీసంబైనన్?  7


ఉ. పద్యము సాహితీప్రియుల భాగ్యవిశేషము తెల్గుతల్లికిన్

     హృద్యము పూర్వసత్కవి సుహృత్సుమజన్య మరందకోశమున్

     వేద్యము సద్రసజ్ఞులకు విద్యలతల్లికి ప్రీతి గొల్పు నై

     వేద్యము సత్త్వహీనుల కభేద్యము సత్కవి చేయు సేద్యమున్. 8


కం. పద్యము ఛందోబద్ధము

      గద్యము లాక్షణికమ్ము గణుతింపంగా

      హృద్యంబుగ విలసిల్లును

      గద్యము పద్యమ్ము లాంధ్ర కావ్యములందున్. 9


కం. పద్యము రసపోషణకును

      గద్యము కథనానుగమన గంభీరతకున్

      హృద్యంబుగ విలసిల్లగ

      మధ్యగ దండకము వెలసె మానితమగుచున్. 10


కం. శతముకు పైబడి యెనిమిది

      స్థితమగు పద్యములు గల్గి చిరుమకుటముతో

      స్తుతి, సూక్తి, విమర్శలతో

      శతకము విలసిల్లె తెల్గు సాహిత్యమునన్. 11


కం. ఇటునుండియు నటువైపుకు

      అటునుండి నిటుదరికైన ననులోమముగన్

      దిటవుగ చదివిన నొకటగు

      పటుపద్యము తెలుగుఠీవి! పరికింపంగాన్.  12


కం. ఏక గుణింతము నుండియు

      నేకాక్షర పదములెల్ల నేకము కాగా

      ఏకముగ తెలుగు నందున

      ఏకాక్షరపద్య మొప్పె నెక్కటి భంగిన్.  13


కం. ఇటునుండి సంస్కృతంబును

      అటునుండి తెలుగునడకలు నలరారంగన్

      పటుపద్యము లొప్పె తెలుగున

      ఇటులొప్పెనె? ఇతరభాష నిట్టివి జూడన్. 14


కం. ఛందము లన్నిటి యందున

      కందమ్మున చిందు శోభ కమనీయముగాన్

      కందము తెల్గున కందము

      మందారమరందమందు మధురిమ వోలెన్. 15


కం. అందని ద్రాక్షాఫలముల

      పొందగ లేనట్టి నక్క పులుపను నటులన్

      సుందరమౌ పద్యమ్మును

      నిందింతురు మూఢమతులు నిష్ఫల మనుచున్. 16

జ్ఞాన సమమగు సౌఖ్యము

 లేదు కామమునకు సరి వ్యాధిలేదు 

లేదు మోహమువంటిది రిపువు లేదు 

క్రోధం సమమగు ననలము లేదు లేదు 

జ్ఞాన సమమగు సౌఖ్యము కాన గలమె.

*ఆ పూలజడ అద్వీతీయము కాక ఏమిటి ?

 *ఆ పూలజడ అద్వీతీయము కాక ఏమిటి ?*


🌹🙏🌹🙏🌹


*సుమముల !  సకలసురలు  దిగి*

*యమరిరి ఘనకేశపాశ మందె త్వరితముగా !*

*సమయము మీరిగ నీయక* 

*జమళి సిరియుభువియాయె జడగంటలుగా !!*


🌹🙏🌹🙏🌹


✍️ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది* 



🌺☘️🌺☘️🌺


అమ్మ రథము అలా ముందుకు సాగుతూ వెళుతుంటే   పరవశాన అలాగే ఉండిపోయాను .🙏


అయ్యో ముందుకు నేను కూడా ఎందుకు వెళ్లలేదు అని బాధపడుతున్న తరుణములో , 


అమ్మ అందమైన పూలజడ దర్శన భాగ్యము కల్పించి నది .🙏


ఇందుకేనేమో అమ్మ ముందుగా వెళ్లిపోయింది .


ఆ పూలజడను ఏమని వర్ణించగలము ! 🙏


ఆ జడకు ఉన్నవి పువ్వులా ?  కానే కాదు సకలదేవతలు , త్వరత్వరపడి , దివినుంచీ క్రిందకు దిగివచ్చి అమరిపోయారు , పువ్వులుగా ఆ పూలజడలో . 🙏


సమయము మించిపోతే తమకు అదృష్టము దక్కునో లేదో అని , భూదేవీ శ్రీదేవి కాస్త తమ సింగారములను ఆపి ఉదుటన , వచ్చి ఆ జడను మిక్కిలి ప్రకాశవంతము చేసారు జడగంటలుగా ఒదిగి ! 🙏


అట్టి దివ్యాలంకారముతో ప్రకాశించే మా *కామాక్షీ అమ్మకు* సదా మంగళములు పాడెదను !🙏

*యే వేళనైనా పున్నమే యీ కాంచీపురాన !*🙏

 *యే వేళనైనా పున్నమే యీ కాంచీపురాన !*🙏


🌹☘️🌹☘️🌹


*ఆకాశంబున పున్నమి*

*సాకారమగు నెలకొక్క సారె కనులకున్!*

*మాకిట సతతము పున్నమె ,*

*శ్రీకామాక్షమ్మ సెలవి నిడు నగవులతో !*


🌹🙏🌹🙏🌹 


✍️ *--వేణుగోపాల్ యెల్లేపెద్ది*


🌹🙏🌹🙏🌹


పున్నమి రేయిన  మా అమ్మ  *శ్రీ కామాక్షమ్మ ,*   దయతలచి దర్శన భాగ్యమును అనుగ్రహించినది .🙏


ఆ నింగిలోని పున్నమి వెన్నలలో మరీ అంత  గొప్పతనమేమున్నది ? 


 అది నెలకొకసారే కనిపిస్తుంది మన కనులకు .



కానీ మాకు ఈ భూమిపైననే గొప్ప అదృష్టమును అనుగ్రహించినది చల్లని తల్లియైన *శ్రీ కాంచీపుర కామాక్షమ్మ !*🙏


అఖిలాండమంతా నిండి పోయే పండువెన్నెలను , 

 తన పెదవి అంచున చిరుదరహాసములతో ,

నిరంతరమూ , మనకు  అందిస్తూనే ఉన్నది నిండైన పండు వెన్నెల ! 🙏


*ఇది కదా మాయలేని వెన్నెల ! అసలైన వెన్నెల !!*🙏

పరుగున పర్గులెత్తుచు

 చం. పరుగున పర్గులెత్తుచు ప్రపంచములన్ మరి చుట్టివచ్చినన్ 

శరవణుడొందలేదకట శంకర ! సర్వగణాధిపత్యమున్

నిరతిగ నేకదంతుడును నీదు ప్రదక్షిణమున్ జరింపగన్

కరముఖునే వినాయకునిగా శివ! యెంచితివీవు కూర్మితోన్

పరముగ వేడఁ నిత్యమును భక్తులకిచ్చెదవంట యీశ్వరా ! 7 .

🙏🙏🙏

✍️ కొరిడె విశ్వనాథ శర్మ ,

 ధర్మపురి

Support this blog

 Support this blog


Do you think this blog is useful. 

Please support financially by donating via G Pay Or phone pay to this Mbl. 9848647145

ఆత్మోద్ధరణకై

 *పద్యభారతికి నమస్సులు*

          =================

               ఆత్మోద్ధరణకై

                      *గురుస్మరణ* 

               •••••••••••••••••••

       భిక్షనిచ్చినయట్టి  పేదరాలి కనక

           వర్షాన కరుణించె బాల్యమందు

       మాత గాసిలకుండ మరలించె నదిగతి

            సన్న్యసించెను తల్లి సమ్మతమున

        ఉపనిషత్తులకు వ్యాసోరు బ్రహ్మ సూ

            త్రములభాష్యములను వ్రాసె ఘనుడు

        దేశమంతయు చుట్టి శ్రీ శంకరాఖ్యుడు

               అద్వైత వాదంబు వ్యాప్తిజేసె


         నాల్గు పీఠముల్ స్థాపించి, నష్టపరచు

         భ్రష్ట వాదములకు స్వస్తి పలికె

         వివిధ స్తోత్రాలు కవచము

                                        లవిరళముగ

         భక్త లోకము తరియింప    వాసి వ్రాసె

         నాది శంకరునకు వేల వందనములు.

          --తంగిరాల నరసింహకుమార్

మలినుడవునీవు

 తేటగీతి 

మలినుడవునీవు ,రాగరమ్యాంగ యామె 

వాగెదవు నీవు , వికసిత వదన యామె 

చపల మానసుఁడవు నీవు సరస యామె 

ఏలపద్మినివిడచిపోయెదవు ? భ్రమర !

( దేవీదాస శర్మ )

మేలి పసిడికంటె

 *నేటిమేటిమాట*               *చక్రవర్తి*

ఆవె.

పట్టుఁగట్టు, మేనఁ బైడిని దిగవేయుఁ,

జదువు సున్న,చూపు మదము హెచ్చు.

కనులమోసగించు కపటపుబంగారు

పసలు రెట్లు మేలి పసిడికంటె

శుభాకాంక్షలు

 గురు పూర్ణిమ శుభాకాంక్షలు 


పోపూరి అరుణశ్రీ 


తల్లియు దండ్రియు దైవము కలసిన 

రూపమే గురువౌను లోకమందు 

దోసము తొలగించి తోడుగ నిల్చెడి 

దివ్యమైన యఖండ దీపమతఁడు

సద్భక్తి మృష్టాన్న సత్సంగ పానమ్ము 

లార్తికల్గినవారికమ్మ యగును 

గమ్యమందు వరకు కరము పట్టి నడుప

తపన కల్గిన వారి తండ్రి యటుల


ధర్మ హాని కల్గిన యంత ధరణి వెలసి 

తగిన మార్గముఁ జూపెడు దైవమతడు 

గురియు గతియు వారని జగద్గురువు లైన

వ్యాస శంకరార్యులకేను ప్రాంజలింతు

గురువు

 అంశము :      *గురువు* 


*మత్తేభము*


తరువుల్ చక్కని నీడనిచ్చి ప్రజకున్ దాపంబుఁ దీర్చున్గదా!


వరమౌ జ్ఞాన శరంబులన్నొసగి విద్వత్తున్ బ్రసాదింపగన్


గురువే యుత్తమ మార్గదర్శి పరమౌ గోప్యంబుఁ జూపించగాన్


దరమా సామ్యముఁ జెప్పగా గురువుకున్ దానెంత యోచించినన్


       *ఆదిభట్ల సత్యనారాయణ*

వేదవ్యాసుడు

 సద్గురుస్తుతి.




1.వేదవ్యాసుడు.




ఉ.భారతభారతీమహితభవ్యతపోధనుడార్షధర్మసే

వారతుడున్ కవీంద్రుడురుభారతభాగవతాదిసత్కథా

సారధనుండువ్యాసముని ,సత్యమువిష్ణునిరూపునిన్ సదా


ధారునిగొల్చెదన్ శుభదుధార్మికసద్గురుబాదరాయణున్.




మహావిశిష్టమైనభారతదేశమునందు ,మహితమైనభారతీదయను ,భవ్యతపోధనుడును ,ఆర్షధర్మసేవకుడును ,కవీంద్రుడును ,భారతభాగవతాదిసత్కథలనేధనముగలిగినవాడును ,విష్ణుస్వరూపుడును ,సత్యమునకాధారభూతుడును ,శుభములనిడువాడును ,బాదరాయణుడనువ్యాసుని సద్గురునిగాగొలుతును.





2.ఉ.ఆదరమొప్పభారతము నాతతశక్తిపురాణశాస్త్రముల్

మోదముతోరచించి జనమోక్షపథమ్ముగవేదభాగముల్


మేదురతన్నొసంగెనిల ,మేచకవర్ణుడుకృష్ణనాముడై


సాదరభక్తిమ్రొక్కెదను సద్గురుసత్తమువేదవ్యాసునిన్.





భా.మిక్కిలిఆదరముతో బహుపురాణశాస్త్రములను రచించి ,జనులకుమోక్షపథముజూపు వేదవిభజననొనరిచిన మేఘవర్ణుడును ,కృష్ణ యనుపేరుగల ,సద్గురూత్తముని వేదవ్యాసునికి మ్రొక్కెదను.





3.దక్షిణామూర్తి.




ఉ.రక్షణనిచ్చుదైవమయి ,రాజిలుతత్త్వమునాత్మముద్రయై


వీక్షణమౌనధారియయి ,విశ్వముపర్వగజ్ఞానధారలే

శిక్షితమైస్రవించగను ,శీఘ్రముశిష్యులబ్రోచుసామియౌ

దక్షుని జ్ఞానసాగరుని  దక్షిణమూర్తినిగొల్తుభక్తితో.




భా:దైవమువలెరక్షిస్తూ ,ఆత్మజ్ఞానమునందించుచిన్ముద్రనుధరించి ,చూచెడివారికి మౌనముద్రధరించి ,జగమంతటా జ్ఞానధారలనువర్షింపచేసి ,శిష్యులనుసుశిక్షితులనొనరిచినదక్షుడు ,దక్షిణామూర్తిని భక్తితోగొలిచెదను.




4.దత్తాత్రేయుడు.




మ.అనసూయాత్రితనూజుడై వసుధదత్తాత్రేయుడైశోభిలెన్


మనసారాభుజియించినాడుహరియున్మన్నించిసాధ్వీమణిన్


శునకంబుల్ తనవెంటవచ్చిపలికెన్ సూక్తుల్ సువేదంబులన్


విననాశ్చర్యముగాదెసద్గురుకథల్ ,సద్వేదాంతునేగొల్చెదన్.




భా.దత్తాత్రేయుడు అనసూయాత్రికుమారుడు.త్రిమూర్తులుబాలలై అనసూయనుపరీక్షించిభుజించారు.వీరివెంటవచ్చుశునకములుకూడాఆశ్చర్యకరంగావేదములువల్లించెనట.అట్టివేదాంతగురుని ,నేనుగొల్చెదను.





5.ఆదిశంకరాచార్య



శా.అద్వైతామృతధారలన్ జగతిలోనత్యంతసందీప్తి ,సం

పద్వైశిష్ట్యమహాసుధల్ పరగసంప్రావీణ్యతన్ గూర్చి ,శ్రీ

మద్వాక్కుల్ శుభమైవరింపసతమున్ మాన్యుండునైధన్యుడై

సద్వైశిష్ట్యముగన్నధీమణి!తపస్సారా!నతుల్ శంకరా!




భా.అద్వైతమనేఅమృతధారలుజగతిలో నత్యంతదీపింపగా ,విశిష్టజ్ఞానసంపదలనేసుధలుప్రావీణ్యముతోనందించి ,శ్రీసూక్తులతోనలరించినధన్యుడు ,మాన్యుడు ,నైనశంకరాచార్యునికినతులు.




6.భగవద్రామానుజాచార్య



మ.కుమతంబుల్ భువిఖండనంబొనరచెన్ గోవిందునర్చించుచున్

సమతావాదిగమంత్రరాజమునిలన్ ,సంతోషియైజెప్పె ,నా

సమతావాదిని భాష్యకారుయతిరాట్ ,సత్సాధురక్షాకరున్


రమణీయున్ కలినాశకారుగొలుతున్ ,రామానుజాచార్యునిన్.





భా.సమాజంలో అప్పటికినెలకొన్న కుమతములను నిరసించి ,సర్వసమత్వభావంతో ,అష్టాక్షరీమంత్రరాజమునెల్లరకూ ఉపదేశించినవారు ,గోవిందభక్తుడు ,సమతావాది ,భాష్యకారుడు ,యతిరాజు ,కలిపాపనాశకరుడైనరామానుజాచార్యునిగొలుతున్.




7.శ్రీమదనానందయతీంద్రులు.



మ.మదనానందయతీంద్రువందితపదున్ ,మాధుర్యవాక్శోభితున్


సదయాపాంగుని ధర్మరక్షణధృతిన్ సచ్ఛాత్రరక్షాకరున్


కదలేదైవము పాపనాశకరునిన్ ,కన్పించుశ్రీశంకరున్


పదముల్ గూర్చినుతింతుసంతతము సద్భావంబులన్ గోరుచున్.



భా.శ్రీమదనానందయతీంద్రులు నమస్కరింపదగినపాదములుకలవారు.మాధుర్యవాక్కులుగలవారు.దయాసాగరులు.ఛాత్రరక్షకులు.ధర్మరక్షణాదక్షులు.నడయాడేదైవము.కన్పించేశివుడు.వారిని నేనుపదములల్లినుతించి ,మంచిభావములిమ్మనిగోరెదను.




8.శ్రీ.అష్టకాలనరసింహరామశర్మగారు.



వరకావ్యార్ధవిధాతయై గురువునై ,వాణీదయాపాత్రుడై


సురభాషామయధీస్వరూపుడిలలో శోభిల్లువాణ్యాకృతిన్


నరసింహాఖ్యునిరామశర్మవరదున్ నైర్మల్యచిత్తంబుతో


ధరలోసద్గురుపాదునిన్ గొలిచెదన్ సత్సాహితీరూపునిన్.




భా.విశిష్టమైనకావ్యరచనలో విధాతయు ,సద్గురువును ,రూపముధరించినసరస్వతియు ,దేవభాషతోనిండినధీశక్తియుతులు ,నడయాడే సరస్వతిగా పేరందినవారు ,ఆకారముదాల్చినసాహిత్యమువంటీసద్గురుపాదులు ,శ్రీఅష్టకాలనరసింహరామశర్మగారినిగొలుతును.



కం.నరులైననుసురవరఖే

చరులైననువిద్యలంద సద్గురుకరుణన్


వరలగవలయునుతథ్యము


గురుముఖమునచదవకున్న కోవిదుడగునే.




డా.గాయత్రీదేవి

*శ్రీ గణనాథోద్భవము

 శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏☘️☘️


*శ్రీ గణనాథోద్భవము!*

(ఖండకావ్యం;)

(మూలగ్రంధము.,శ్రీ శివమహాపురాణము!)

శా.

శ్రీ గౌరీ ప్రియనందనా! గజముఖా!సేవింతు మున్ముందుగన్! వాగీశాదులు వేల్పులెల్లరిలఁ నీ ప్రాపున్ సదా గోరరే, 

భోగంబుల్ గడు గూర్తువీవు సుముఖా!పూజింప నిన్ లోకముల్! సాగంజేయుము శంభుపుత్ర సతమున్ సంకల్పముల్ చక్కగన్!!


భావము: గజముఖుడవైన పార్వతీ కుమారా! నిన్నేముందు పూజించెదను. బ్రహ్మా మొదలగు దేవతలందరూ నీ యండ కోరెదరు. నిన్ను పూజించిన వారికనేక భోగములు భాగ్యములు కలిగించే సుముఖుడవు. నాయొక్క సంకల్పములు చక్కగా సాగునట్లు దయతో చూడుము!


వినా గురుం జ్ఞానమతిప్రమాదం

వినాగురుం నాస్తి వివేకవృద్ధిః

గురుంవినా నాస్తి మహాత్మసౌఖ్య

మతఃగురుర్నిత్య సుపూజనీయః


గురువులేనిజ్ఞానమహితకరముభువికి

గురువు లేక యోచన శుభకరముకాదు

గురువులేకనాత్మజ్ఞానగరిమ లేదు

గురువు నిత్యపూజార్హుడు ధరనుజూడ


పారాశర్యం హరేరంశం

శ్రుతిసారప్రదాయకమ్

పౌరాణికంమహాజ్ఞేయం

వేదవ్యాసగురుంభజే


ఆచార్య శ్రేణికి ప్రణామపూర్వక గురుపూజోత్సవ(వ్యాసపౌర్ణమి) శుభాకాంక్షలతో........

చిలకమఱ్ఱి కృష్ణమాచార్యులు

గురువందనం

 గురువందనం


గురుపౌర్ణమి శుభదినమున,

గురువులనెదఁ దలచుకొందు గురుతర భక్తిన్,

గురువాక్యమె వల్లించెద,

గురువులకును వందనములు గురు తుల్యులకున్.


ఎల్ల వేళలయందు చల్లగా కాపాడు

తల్లి ప్రేమయె నాకు తొల్లి గురువు,

ఏదికోరకముందె ఎదనంత పరచుచు

తల్లడిల్లెడి నాదు తండ్రి గురువు,

అద్వైత వేదాంతమార్తితో పలికించు

ఆదిశంకరరూప మాత్మగురువు,

అన్నపూర్ణమ్మగా అవతారమెత్తిన

ఇలవేల్పు సీతమ్మ యింటి గురువు,


ప్రతిమ గురువు, పరగ ప్రకృతి మాత గురువు 

పశువు, పైరు, గురువు, పక్షి గురువు,

అక్షరములు గురువులందరు గురువులే,

పలుకు పరమ గురువు, భాష గురువు..


ఒద్దిక సుద్దులు నేర్పుచు

దిద్దించిరి యక్షరములు దీవెనలిడుచున్,

విద్దెలతల్లిని తలచుచు 

పెద్దలకివె వందనములు పేరిమి మీరన్..


అణువణువున గురువు కలడు,

క్షణక్షణమునందు గలడు కాలాత్మకుడై,

ఋణమెట్లు తీర్చుకొందును?

కణకణమున గురువు కలడు కాంచుచు మ్రొక్కన్..


అందరికీ గురుపౌర్ణమి శుభాకాంక్షలు..


🙏🕉️🙏


- రామ్ డొక్కా, ఆస్టిన్, టెక్సస్

వ్యాసమునికి వందనం*

 *నేడు వ్యాసపూర్ణిమ*

*వ్యాసమునికి వందనం*



--------

అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః 

అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః 

------

మ॥

ముఖముల్ నాలుగు లేని బ్రహ్మ యతడై స్పూర్తిన్ ప్రసాదించెడిన్ 

సుఖమై బాహులు రెండు గల్గి సతమున్ శోభించు తా విష్ణువై 

మఖమున్ భగ్నము జేసినట్టి శివుడౌ మండేటి నేత్రమ్ము లే 

కుఖువద్గుణ్యుడు బాదరాయణునకున్ యోచించకే మ్రొక్కెదన్ 



శా॥

వేదమ్మంతయు ధారణన్నిలుపగా విద్వత్తునన్ భూప్రజల్ 

వాదుల్ పొందుట బాదరాయణుడు సంవాదించి చిత్తమ్మునన్ 

భేదమ్మింతయు లేని మార్గమున సంప్రీతుల్ దగం గల్గగా 

వేదవ్యాసము జేసినట్టి మునికిన్ ప్రీతి న్నమోవాకముల్ 

మీ 

*~శ్రీశర్మద*

నమో గణపతయే

 శ్రీమాత్రేనమః 


నమో గణపతయే...


మ॥

శ్రీకారమ్మది నీదు తుండము మహాశ్రేయమ్ము లా కర్ణముల్ 

కాకేమౌనిక విద్యకాదరువు నీ గాంభీర్య మాహార్యమున్ 

మాకున్ శాంతి నొసంగుమా గణపతీ! యాదిన్ విధిన్ పూజలన్ 

నీకే యిత్తుము పార్వతీ తనయ! నీ నెయ్యమ్ము మాకీయవే! 

*~శ్రీశర్మద*

*శ్రీ కాలభైరవస్వామి ఆలయం*

 🕉 మన గుడి : నెం &85


⚜ *కర్నాటక  :  ఆదిచుంచానగరి- మండ్యా*


⚜ *శ్రీ కాలభైరవస్వామి ఆలయం*



💠 ఏ శివాలయంలోనైనా కాలభైరవుడు ఎల్లప్పుడూ ముఖ్యమైన గర్భగుడిలో ఉంటాడు. శతాబ్దాలుగా దేవతకు ప్రత్యేక దేవాలయం లేదు. ఆదిచుంచనగిరి దేవాలయం దక్షిణ భారతదేశంలోని కాలభైరవునికి అంకితం చేయబడిన ఏకైక ఆలయం, ఇది గత 500 సంవత్సరాలలో నిర్మించబడింది.


💠 కాలభైరవేశ్వర స్వామి దేవాలయం, ఆదిచుంచనగిరి అని కూడా పిలుస్తారు.  

ఈ ఆలయం కర్ణాటకలోని మాండ్య జిల్లా ఆదిచుంచనగిరి కొండలలో 3,300 అడుగుల ఎత్తులో ఉంది.

దాని చుట్టూ దట్టమైన అడవి ఉంది, ఇక్కడ మనం స్వేచ్ఛగా తిరిగే నెమళ్లను చూడవచ్చు.  దీనినే మయూరవనం అని కూడా అంటారు.  ఇక్కడ పూజించే దేవుడు గంగాధరేశ్వరుడు. 


💠 సుమారు 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న పురాతన దేవాలయాలలో ఇది ఒకటి.  

ఇక్కడ ప్రాచీన వైదిక సంస్కృతి స్థాపించబడింది.  


💠 శ్రీ కాలభైరవేశ్వర స్వామి ఆలయ ప్రధాన దైవం గంగాధరేశ్వరుడు. జ్వాలా పీఠాన్ని, పంచ లింగాలను, స్తంభాంబికను భక్తులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. 

ఆకాశ భైరవ కొండ శిఖరం, మరియు బిందు సరోవరం ఆలయం యొక్క పవిత్ర చెరువు. ఇటీవల, రెండు భారీ సరస్సులు వచ్చాయి మరియు పాతది కూడా పునరుద్ధరించబడుతుంది.


💠 ఆదిచుంచనగిరి  శివునికి పవిత్ర ప్రదేశం. అతని తపస్సు సమయంలో, చాలా కాలంగా ఈ ప్రాంతాన్ని మొత్తం పీడిస్తున్న ఇద్దరు రాక్షస సోదరులు, చుంచ మరియు కంచలను సంహరించాడు.

తరువాత ఈ ప్రాంతానికి "ఆదిచుంచనగిరి మరియు చుంచనకోటే" అని పేరు వచ్చింది. ఆదిచుంచనగిరిలో గంగాధరేశ్వర, మల్లేశ్వర, చంద్రమౌళీశ్వర, సిద్దేశ్వర, సోమేశ్వరాలలో తాను పంచలింగాల రూపంలో నివసిస్తానని శివుడు హామీ ఇచ్చాడు.


💠 గంగాధరేశ్వరుడు (సోమేశ్వరుడు) అధిష్టానం, చంద్రమౌళీశ్వరుడు 'ఆత్మార్థ దేవత.' ఆదిచుంచనగిరి ఆలయంలో శివుడు, 

శ్రీ కాలభైరవేశ్వరస్వామి "రక్షించే దేవుడు". కంబదమ్మ లేదా స్తంబాంబికే రూపంలో, పార్వతి దేవి ఇక్కడ పూజించబడుతుంది. 


💠 శ్రీ కాలభైరవేశ్వర స్వామి ఆలయాన్ని "పంచలింగ క్షేత్రం" అని కూడా అంటారు.

శివుని జట నుండి విడుదలైన పవిత్ర జలం బిందు సరోవర పుష్కరిణికి కొన్ని వందల అడుగుల పైన నిలిచి, ఆదిచుంచనగిరిని ఏర్పరుస్తుంది. 

భక్తులు తమ పాపాలను మరియు అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి సరస్సులో పవిత్ర స్నానం చేస్తారు, దాని పవిత్రతను పరిగణనలోకి తీసుకుంటారు.


💠 ఆదిచుంచనగిరి దేవాలయం గురించి శివ పురాణం మరియు అనేక శాసనాలలో ప్రస్తావన ఉంది. మఠం మరియు సిద్ధ సింహాసనాన్ని స్థాపించిన సిద్ధ యోగికి రుద్రుడు ఈ పవిత్ర భూమిని అప్పగించాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి. 

సమాజంలో ధర్మాన్ని వ్యాప్తి చేయమని శివుడు యోగికి సూచించాడు.


💠 కాలభైరవ దేవాలయం యొక్క వాస్తుశిల్పం

ఈ కాలభైరవేశ్వర స్వామి ఆలయాన్ని 2008లో ప్రముఖ భారతీయ మత గురువు శ్రీ బాలగంగాధరనాథ స్వామిజీ 85 కోట్లుతో  చాలా మంది ప్రముఖ శిల్పులు మరియు 1200 మందికి పైగా ప్రజలు స్వామీజీ కలల ఆలయాన్ని సాకారం చేయడానికి త్వరగా నిర్మించారు. 


💠 కాలభైరవేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మొత్తం ఆలయాన్ని నిర్మించడానికి రాళ్లను మాత్రమే ఉపయోగించారు. 

ఆలయ స్తంభాలు, తలుపులు, పైకప్పు మరియు ప్రతి ఇతర భాగం రాతితో నిర్మితమైనది. 

యాత్రికులు 4-5 అడుగుల ఎత్తులో ఉండే 64 రకాల భైరవ విగ్రహాలను పూజించవచ్చు.


💠 ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలు

సంతానం లేని వారు మరియు అవివాహితులు ఆదిచుంచనగిరి ఆలయాన్ని సందర్శించి తమ కోర్కెలు తీర్చే కంబదమ్మ దేవిని దర్శించుకుంటారు.


💠 7 అడుగుల ఎత్తైన గణేశ విగ్రహం,

 6 అడుగుల సుబ్రమణ్య విగ్రహం,

 23 అడుగుల నాగలింగేశ్వరుడి విగ్రహం, బంగారంతో మెరుగుపెట్టిన 25 అడుగుల ధ్వజ స్తంభంతో 11 అడుగుల భైరవ ప్రతిమలను భక్తులు చూడవచ్చు.


💠 శివుడు తపస్సు ప్రారంభించిన ప్రదేశాన్ని అగ్ని పీఠం లేదా జ్వాలా పీఠం అంటారు.

జాతరోత్సవాలు, నవరాత్రులు, శివరాత్రిల్లో లక్షలాది మంది భక్తులు ఆలయానికి, పీఠానికి తరలివస్తారు.


💠 శ్రీ మఠం రోజుకు ఇరవై వేల మందికి పైగా భక్తులకు ఉచితంగా భోజనం పెడుతోంది. కాబట్టి, ఈ రోజువారీ దాణా కార్యక్రమం ద్వారా అది "అన్నదాన మఠం" అనే మరో పేరును సంపాదించుకుంది.

భక్తులకే కాదు, ఆకలితో ఉన్న ఏ ఆత్మకైనా తేడా లేకుండా ఇక్కడ ఆహారం అందిస్తారు.


💠 మయూర వన, కాలభైరవేశ్వర స్వామి దేవాలయం చుట్టూ ఉన్న అందమైన అడవి, భక్తులు మరియు పర్యాటకుల మనస్సులకు శాంతి మరియు ఆధ్యాత్మిక ఏకాంతాన్ని కలిగిస్తుంది.

అన్ని శివాలయాలలో, భక్తులు దేవత ముందు కనిపించే నంది ప్రతిమలను పూజించవచ్చు. కానీ ఇక్కడ, భక్తులు తన వాహనంగా భావించే కుక్క విగ్రహాన్ని చూడవచ్చు.


💠 ఈ ఆలయానికి 130 కి.మీ దూరంలో బెంగళూరులో  అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

జన్మనిచ్చిన తల్లి

 *సీసము*

జన్మనిచ్చిన తల్లి జనులకు తొలియొజ్జ

   కర్మమిచ్చెడితండ్రి ధర్మ గురువు.

తోడబుట్టిన వారు తూర్ణంపు గురువులౌ

   చెలిమిజేసెడివారు చెంత గురులు

విద్య నిచ్చినవాడు వెలగట్ట ధరలేని

   ఉత్తమోత్తమ మైన ఉర్వి గురువు.

ఇట్టి గురుగణంబులెట్టివారలె గాన

  కొలువకున్నను నింద గొలుప దగదు.

*ఆ.వె.*

వేదశాస్త్రములను భేదమెంచకనిచ్చి

జగతి వెలుగులిచ్చు నిగమగురుల

వ్యాసపూర్ణిమమున న్యాసించి మనమున

పూజలొనరువారు తేజరిల్లు.

*అందరికీ వ్యాసపూర్ణిమ అనబడే గురుపూర్ణిమ శుభాకాంక్షలు. గురువులందరికీ సాష్టాంగ ప్రణామములు.*


*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

వ్యాస వాఙ్మయము

 *వ్యాస వాఙ్మయము - విశ్వ చేతనము*


१.

జ్ఞానీ మౌని తపోనిధీ గుణమణీ జాగృద్విరాడ్ఢృత్పునీ

తానంతామిత కాలబోధ నిపుణోదార స్వభావారుణీ

ప్రాణాయామ నిధానయోగ కరణోద్భాస క్రమోద్దీప ని

ర్వ్యాజ వ్యాసమహర్షి రూపమనిశమ్ ధ్యాయేమ భక్త్యాత్మకమ్


२.

లోకాలోకన శోకవారణ సమ క్రోధాంత శాంతప్రకా

శైకాత్మాయత వీతరాగ వివిధోచ్చార స్వరోల్లాస ని

ర్వ్యాజ వ్యాసమహర్షి రూపమనిశమ్ ధ్యాయేమ భక్త్యాత్మకమ్


3.

ధరణిని ధర్మ హృత్కృత విధానముఁ దెల్ప విశేషరూప సం

స్కరణ పథానుగుణ్యమగు జన్మమునొంది జగత్కృతార్థమౌ

కరణినిఁ దీర్చినట్టి వరగంగ కృపానిధి బాదరాయణా

శరణము మీ పదంబులు విశాల వికాస వివేచనోద్ధృతా!


4.

విధిగా వేదవిధానమేర్చి గుణవద్వేదాంతమున్ ౙూపి స

న్నిధిగా భవ్యపురాణగాథలను సందేశించి సారస్వతో

పధియా భారతమున్ రచించి జననంబన్నన్ స్వధర్మాప్త వా

రధిగాఁ ౙూపిన బాదరాయణ కృతార్థానందపాథోనిధీ!

గురుదక్షిణగా

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


🙏 *గురు/వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ 🙏*


 శ్లో𝕝𝕝  *గురు మధ్యే స్థితం విశ్వం* 

        *విశ్వమధ్యే స్థితో గురుః*।

        *విశ్వరూపో విరూపోసౌ*

        *తస్మై శ్రీ గురవే నమః*॥


తా𝕝𝕝 *ఈ ప్రపంచమంతా గురువులో ఉంది... విశ్వమంతటిలోను గురువు ఉన్నారు.... ఆయన విశ్వరూపుడు... ఆయన రూపరహితుడు. అట్టి శ్రీ గురువుకి నమస్కారము*....

 *~~~~~~*


శ్లో𝕝𝕝  *ఏకమేవాక్షరం యస్తు*

       *గురుశ్శిష్యం ప్రబోధయేత్*|

       *పృథివ్యాం నాస్తి తద్రవ్యం*

       *యద్దత్వా చా ఽనృణీ భవేత్*॥


తా𝕝𝕝 *గురువుగారి వద్దనుండి ఒక్క అక్షరమంత జ్ఞానం పొందినా ఆ ఋణము నుండి విముక్తిని పొందడానికి గురుదక్షిణగా ఇవ్వగలిగిన ద్రవ్యము ఈ ధరణిలో లేదు*....


 ✍️🌷💐🌹🙏

ఎక్కువ

 🟣బురద లో పుట్టిన కమలానికి సంస్కార మెక్కువ,


🟡మట్టి లోనుండి  పుట్టిన వరి గింజలకు త్యాగం ఎక్కువ,


🟤ఆకాశం లోనుండి పుట్టిన వాన నీటి బిందువుల కు జాలి ఎక్కువ,


🌐అడవి లో పుట్టిన క్రూర జంతువులకు ఆకలి ఎక్కువ.


⚫ చెట్టుకు కాచిన పండుకు తీపి ఎక్కువ.


🔵 పట్టాల మీద పరిగెత్తే రైలు కి పరోపకారం అధికం.


🟤భూమ్మీద పుట్టిన మనిషికి కుళ్ళు,కల్మషం,కసి, విషం ఎక్కువ.


మూర్తి,సీనియర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ,

కాలమిస్ట్,9985617100

*శ్రీ వేదవ్యాస అష్టోతరశతనామావళిః

 🌹  *శ్రీ వేదవ్యాస అష్టోతరశతనామావళిః* 🌹


1. ఓం వేదవ్యాసాయ నమః

2. ఓం విష్ణురూపాయ నమః

3. ఓం పారాశర్యాయ నమః

4. ఓం తపోనిధయే నమః

5. ఓం సత్యసన్ధాయ నమః

6. ఓం ప్రశాన్తాత్మనే నమః

7. ఓం వాగ్మినే నమః

8. ఓం సత్యవతీసుతాయ నమః

9. ఓం కృష్ణద్వైపాయనాయ నమః

10. ఓం దాన్తాయ నమః

11. ఓం బాదరాయణసంజ్ఞితాయ నమః

12. ఓం బ్రహ్మసూత్రగ్రథితవతే నమః

13. ఓం భగవతే నమః

14. ఓం జ్ఞానభాస్కరాయ నమః

15. ఓం సర్వవేదాన్తతత్త్వజ్ఞాయ నమః

16. ఓం సర్వజ్ఞాయ నమః

17. ఓం వేదమూర్తిమతే నమః

18. ఓం వేదశాఖావ్యసనకృతే నమః

19. ఓం కృతకృత్యాయ నమః

20. ఓం మహామునయే నమః

21. ఓం మహాబుద్ధయే నమః

22. ఓం మహాసిద్ధయే నమః

23. ఓం మహాశక్తయే నమః

24. ఓం మహాద్యుతయే నమః

25. ఓం మహాకర్మణే నమః

26. ఓం మహాధర్మణే నమః

27. ఓం మహాభారతకల్పకాయ నమః

28. ఓం మహాపురాణకృతే నమః

29. ఓం జ్ఞానినే నమః

30. ఓం జ్ఞానవిజ్ఞానభాజనాయ నమః

31. ఓం చిరఞ్జీవినే నమః

32. ఓం చిదాకారాయ నమః

33. ఓం చిత్తదోషవినాశకాయ నమః

34. ఓం వాసిష్ఠాయ నమః

35. ఓం శక్తిపౌత్రాయ నమః

36. ఓం శుకదేవగురవే నమః

37. ఓం గురవే నమః

38. ఓం ఆషాఢపూర్ణిమాపూజ్యాయ నమః

39. ఓం పూర్ణచన్ద్రనిభాననాయ నమః

40. ఓం విశ్వనాథస్తుతికరాయ నమః

41. ఓం విశ్వవన్ద్యాయ నమః

42. ఓం జగద్గురవే నమః

43. ఓం జితేన్ద్రియాయ నమః

44. ఓం జితక్రోధాయ నమః

45. ఓం వైరాగ్యనిరతాయ నమః

46. ఓం శుచయే నమః

47. ఓం జైమిన్యాదిసదాచార్యాయ నమః

48. ఓం సదాచారసదాస్థితాయ నమః

49. ఓం స్థితప్రజ్ఞాయ నమః

50. ఓం స్థిరమతయే నమః

51. ఓం సమాధిసంస్థితాశయాయ నమః

52. ఓం ప్రశాన్తిదాయ నమః

53. ఓం ప్రసన్నాత్మనే నమః

54. ఓం శఙ్కరార్యప్రసాదకృతే నమః

55. ఓం నారాయణాత్మకాయ నమః

56. ఓం స్తవ్యాయ నమః

57. ఓం సర్వలోకహితే రతాయ నమః

58. ఓం అచతుర్వదనబ్రహ్మణే నమః

59. ఓం ద్విభుజాపరకేశవాయ నమః

60. ఓం అఫాలలోచనశివాయ నమః

61. ఓం పరబ్రహ్మస్వరూపకాయ నమః

62. ఓం బ్రహ్మణ్యాయ నమః

63. ఓం బ్రాహ్మణాయ నమః

64. ఓం బ్రహ్మిణే నమః

65. ఓం బ్రహ్మవిద్యావిశారదాయ నమః

66. ఓం బ్రహ్మాత్మైకత్వవిజ్ఞాత్రే నమః

67. ఓం బ్రహ్మభూతాయ నమః

68. ఓం సుఖాత్మకాయ నమః

69. ఓం వేదాబ్జభాస్కరాయ నమః

70. ఓం విదుషే నమః

71. ఓం వేదవేదాన్తపారగాయ నమః

72. ఓం అపాన్తరతమోనామ్నే నమః

73. ఓం వేదాచార్యాయ నమః

74. ఓం విచారవతే నమః

75. ఓం అజ్ఞానసుప్తిబుద్ధాత్మనే నమః

76. ఓం ప్రసుప్తానాం ప్రబోధకాయ నమః

77. ఓం అప్రమత్తాయ నమః

78. ఓం అప్రమేయాత్మనే నమః

79. ఓం మౌనినే నమః

80. ఓం బ్రహ్మపదే రతాయ నమః

81. ఓం పూతాత్మనే నమః

82. ఓం సర్వభూతాత్మనే నమః

83. ఓం భూతిమతే నమః

84. ఓం భూమిపావనాయ నమః

85. ఓం భూతభవ్యభవజ్జ్ఞాత్రే నమః

86. ఓం భూమసంస్థితమానసాయ నమః

87. ఓం ఉత్ఫుల్లపుణ్డరీకాక్షాయ నమః

88. ఓం పుణ్డరీకాక్షవిగ్రహాయ నమః

89. ఓం నవగ్రహస్తుతికరాయ నమః

90. ఓం పరిగ్రహవివర్జితాయ నమః

91. ఓం ఏకాన్తవాససుప్రీతాయ నమః

92. ఓం శమాదినిలాయాయ నమః

93. ఓం మునయే నమః

94. ఓం ఏకదన్తస్వరూపేణ లిపికారిణే నమః

95. ఓం బృహస్పతయే నమః

96. ఓం భస్మరేఖావిలిప్తాఙ్గాయ నమః

97. ఓం రుద్రాక్షావలిభూషితాయ నమః

98. ఓం జ్ఞానముద్రాలసత్పాణయే నమః

99. ఓం స్మితవక్త్రాయ నమః

100. ఓం జటాధరాయ నమః

101. ఓం గభీరాత్మనే నమః

102. ఓం సుధీరాత్మనే నమః

103. ఓం స్వాత్మారామాయ నమః

104. ఓం రమాపతయే నమః

105. ఓం మహాత్మనే నమః

106. ఓం కరుణాసిన్ధవే నమః

107. ఓం అనిర్దేశ్యాయ నమః

108. ఓం స్వరాజితాయ నమః


*|| ఇతి శ్రీ వేదవ్యాస అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||*


*(ఆచార్య దేవో భవ)*


           🌹🌹🌹🌹