*నేడు వ్యాసపూర్ణిమ*
*వ్యాసమునికి వందనం*
--------
అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః
అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః
------
మ॥
ముఖముల్ నాలుగు లేని బ్రహ్మ యతడై స్పూర్తిన్ ప్రసాదించెడిన్
సుఖమై బాహులు రెండు గల్గి సతమున్ శోభించు తా విష్ణువై
మఖమున్ భగ్నము జేసినట్టి శివుడౌ మండేటి నేత్రమ్ము లే
కుఖువద్గుణ్యుడు బాదరాయణునకున్ యోచించకే మ్రొక్కెదన్
శా॥
వేదమ్మంతయు ధారణన్నిలుపగా విద్వత్తునన్ భూప్రజల్
వాదుల్ పొందుట బాదరాయణుడు సంవాదించి చిత్తమ్మునన్
భేదమ్మింతయు లేని మార్గమున సంప్రీతుల్ దగం గల్గగా
వేదవ్యాసము జేసినట్టి మునికిన్ ప్రీతి న్నమోవాకముల్
మీ
*~శ్రీశర్మద*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి