గురుపౌర్ణమి శుభాకాంక్షలు
*********************
పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి,9347537635. గానం: శ్రీ భాగి కృష్ణమూర్తి, చీరాల
సీసం:
వ్యాసమహాముని ప్రభవమైన దినము
గురువులన్ పూజించు పరమదినము
సూర్యోదయము వేళ శుచి యుపవాసము
నారంభమొనరించు నవ్యదినము
చంద్రోదయము వేళ చంద్రుని వీక్షించి
యుపవాసమును వీడు సుఫల దినము
శ్రద్ధగా బుద్ధిగా పెద్దలన్ పూజించి
యాశీస్సులన్ పొందునట్టి దినము
తేటగీతి:
శుభము లెన్నియొ ఆషాఢ శుద్ధ పౌర్ణ
మిచ్చు గావుత! యెల్లర కిచ్చు గాక!
పూజలొనరించు వారెల్ల పుణ్యములను
వ్యాసపూర్ణిమ దినమున బడయుగాక!
అభ్యుదయముగోరి కురిసెనగ్నిధార
రుద్రవీణ మీటి జనుల నిద్రలేపె
ఆశయాలోచనాలోచనంబులనిడి
దాశరథిరాక్షసులపైన దాడిజేసె
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి