22, జులై 2024, సోమవారం

వ్యాస వాఙ్మయము

 *వ్యాస వాఙ్మయము - విశ్వ చేతనము*


१.

జ్ఞానీ మౌని తపోనిధీ గుణమణీ జాగృద్విరాడ్ఢృత్పునీ

తానంతామిత కాలబోధ నిపుణోదార స్వభావారుణీ

ప్రాణాయామ నిధానయోగ కరణోద్భాస క్రమోద్దీప ని

ర్వ్యాజ వ్యాసమహర్షి రూపమనిశమ్ ధ్యాయేమ భక్త్యాత్మకమ్


२.

లోకాలోకన శోకవారణ సమ క్రోధాంత శాంతప్రకా

శైకాత్మాయత వీతరాగ వివిధోచ్చార స్వరోల్లాస ని

ర్వ్యాజ వ్యాసమహర్షి రూపమనిశమ్ ధ్యాయేమ భక్త్యాత్మకమ్


3.

ధరణిని ధర్మ హృత్కృత విధానముఁ దెల్ప విశేషరూప సం

స్కరణ పథానుగుణ్యమగు జన్మమునొంది జగత్కృతార్థమౌ

కరణినిఁ దీర్చినట్టి వరగంగ కృపానిధి బాదరాయణా

శరణము మీ పదంబులు విశాల వికాస వివేచనోద్ధృతా!


4.

విధిగా వేదవిధానమేర్చి గుణవద్వేదాంతమున్ ౙూపి స

న్నిధిగా భవ్యపురాణగాథలను సందేశించి సారస్వతో

పధియా భారతమున్ రచించి జననంబన్నన్ స్వధర్మాప్త వా

రధిగాఁ ౙూపిన బాదరాయణ కృతార్థానందపాథోనిధీ!

కామెంట్‌లు లేవు: