*పద్యభారతికి నమస్సులు*
=================
ఆత్మోద్ధరణకై
*గురుస్మరణ*
•••••••••••••••••••
భిక్షనిచ్చినయట్టి పేదరాలి కనక
వర్షాన కరుణించె బాల్యమందు
మాత గాసిలకుండ మరలించె నదిగతి
సన్న్యసించెను తల్లి సమ్మతమున
ఉపనిషత్తులకు వ్యాసోరు బ్రహ్మ సూ
త్రములభాష్యములను వ్రాసె ఘనుడు
దేశమంతయు చుట్టి శ్రీ శంకరాఖ్యుడు
అద్వైత వాదంబు వ్యాప్తిజేసె
నాల్గు పీఠముల్ స్థాపించి, నష్టపరచు
భ్రష్ట వాదములకు స్వస్తి పలికె
వివిధ స్తోత్రాలు కవచము
లవిరళముగ
భక్త లోకము తరియింప వాసి వ్రాసె
నాది శంకరునకు వేల వందనములు.
--తంగిరాల నరసింహకుమార్
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి