23, మార్చి 2023, గురువారం

సుభాషితమ్

 .


            _*సుభాషితమ్*_


𝕝𝕝శ్లోకం𝕝𝕝 


*దేహే పాతిని కా రక్షా*

*యశో రక్ష్యమపాతవత్|*

*తస్మాద్దేహేష్వనిత్యేషు* *కీర్తిమేకాముపార్జయేత్||*


తా𝕝𝕝 

*"నశించునట్టి ఈ మానవదేహమునకు రక్షణ ఎక్కడ? అందువల్ల అనిత్యమైన ఈ దేహమందు నిత్యమై సత్యమై వెలుగొందు శాశ్వతమైన కీర్తిని మానవుడు ఆర్జించాలి* "

తెలుగు సంవ‌త్స‌రం

 మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు... అంటే ఠ‌క్కున చెప్పేస్తారు.

కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేరు.

అందుకే మీ కోసం ఆ తెలుగు సంవ‌త్స‌రాలు ఇస్తున్నాను..

మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి.

 

*( 1867, 1927,1987,)*: ప్రభవ

*(1868,1928,1988)*: విభవ

*(1869,1929,1989)*: శుక్ల

*(1870,1930,1990)*: ప్రమోదూత

*(1871,1931,1991)*: ప్రజోత్పత్తి

*(1872,1932,1992)*: అంగీరస

*(1873,1933,1993)*శ్రీముఖ

*(1874,1934,1994)*: భావ

*(1875,1935,1995)*: యువ

*(1876,1936,1996)*: ధాత

*(1877,1937,1997)*:  ఈశ్వర

*(1878,1938,1998)*: బహుధాన్య

*(1879,1939,1999)*: ప్రమాది

*(1880,1940,2000)*: విక్రమ

*(1881,1941,2001)*: వృష

*(1882,1942,2002)*: చిత్రభాను

*(1883,1943,2003)*: స్వభాను

*(1884,1944,2004)*: తారణ

*(1885,1945,2005)*: పార్థివ

*(1886,1946,2006)*:  వ్యయ

*(1887,1947,2007)*: సర్వజిత్

*(1888,1948,2008)*: సర్వదారి

*(1889,1949,2009)*: విరోది

*(1890,1950,2010)*: వికృతి

*(1891,1951,2011)*: ఖర

*(1892,1952,2012)*:  నందన

*(1893,1953,2013)*: విజయ

*(1894,1954,2014)*: జయ

*(1895,1955,2015)*: మన్మద

*(1896,1956,2016)*: దుర్ముఖి

*(1897,1957,2017)*: హేవిళంబి

*(1898,1958,2018)*: విళంబి

*(1899,1959,2019)*: వికారి

*(1900,1960,2020)*: శార్వరి

*(1901,1961,2021)*: ప్లవ

*(1902,1962,2022)*: శుభకృత్

*(1903,1963,2023)*: శోభకృత్

*(1904,1964,2024)*: క్రోది

*(1905,1965,2025)*: విశ్వావసు

*(1906,1966,2026)*: పరాభవ

*(1907,1967,2027)*: ప్లవంగ

*(1908,1968,2028)*: కీలక

*(1909,1969,2029)*: సౌమ్య

*(1910,1970,2030)*:  సాదారణ

*(1911,1971,2031)*: విరోదికృత్

*(1912,1972,2032)*: పరీదావి

*(1913,1973,2033)*: ప్రమాది

*(1914,1974,2034)*: ఆనంద

*(1915,1975,2035)*: రాక్షస

*(1916,1976,2036)*: నల

*(1917,1977,2037)*: పింగళi

*(1918,1978,2038)*: కాళయుక్తి

*(1919,1979,2039)*: సిద్దార్థి

*(1920,1980,2040)*: రౌద్రి

*(1921,1981,2041)*: దుర్మతి

*(1922,1982,2042)*: దుందుభి

*(1923,1983,2043)*: రుదిరోద్గారి

*(1924,1984,2044)*: రక్తాక్షి

*(1925,1985,2045)*: క్రోదన

*(1926,1986,2046)*: అక్షయ


దయచేసి షేర్ చెయ్యండి.

మన తెలుగు వారు అందరూ తెలుసుకోవాలి.

మాతృ భాష

 106వ రోజు:

Know about a telugu word Daily.

మన మాతృ భాష పరిరక్షింప బడవలెననిన ముందు అందరకు ఆ భాష మీద అవగాహన, పదకోశము అత్యంతావశ్యకము. అందు నిమిత్తము నా వంతు కృషిలో భాగముగా ప్రజోపయోగము గల ఒక పదమునకు గల పర్యాయ పదములను అందించ సంకల్పించినాను. ఈ నా కృషికి అందరు సహకరించి తమ తమ సమూహములలో ఉంచి విశేష ప్రచారణకు తమవంతు సహాయమును అందింతురని ఆశించు చున్నాను

106వ రోజు: (23-03-2023)

అంగారకుడు: ఆషాడభవుడు, ఐలుడు, కర్షకుడు, కుజుడు, క్రూరదృక్కు, గగనోత్సుకుడు, భూజుడు, భూమిజుడు, రక్తాంగుడు, లోహితాంగుడు, వప్రుడు.

ఉగాది

 ఉగాది.


ఉర్వి పల్కు ఉషోదయము

మామిడి ఆకుల తోరణం

శోభకృత్ నామవత్సరం

తొలి పండుగ సంబరము.


తెలుగు ప్రాంత పర్వదినం

షడ్రుచుల జీవన సారం

ఉగాది పండుగ సమయం

కోయిల పాటల సంగీతం.


సంవత్సరాదిన పంచాంగం

భవిష్యత్ ఆశాజనకం

గతమంతా యుద్ద ప్రభావం

రాబోవు శాంతి ఆశా చిత్రం.


తెలుగు ప్రాంత వికాసము

మేలు హెచ్చుగా మేల్కొనుము

తెలుగు నాట నవోదయం

శోభకృత్ కాల గమనం.


ఉగాది పండుగ శుభాకాంక్షలతో...


అశోక్ చక్రవర్తి.నీలకంఠం.

బడంగపేట, తెలంగాణ.

9391456575.

తను గోల చేస్తుంది

 తను గోల చేస్తుంది

తను సొద పెడుతుంది

తను రొద జేస్తుంది

తనువులో కల్వమని


ఎర వేసి వల విసిరింది

తనను తలంచు కోమంది

మాయ చేసి మురిపించి

మాలలు కట్టి 

'పదము'లతో 

శృంగార కేళి.


తనువంతా తడిపివేసి

ముగ్ధముగా తన్మయం

ఆనంద లాహిరి.


తన దరి చేరమంది.

నా మదిలో గోల పెట్టి

'ఛందస్సు'తో మనస్సున

మధనం చేయమంది.


తన దరి చేరగానే 

ఆకలిదప్పులు ఏమాయేను. 

నాలో కవనం మొదలయ్యేను.


మల్లెలతో 'చంపక  మాల'కట్టి

మనోసౌందర్యముగా ముద్దు లాడమంది.


ఉత్తేజంతో 'ఉత్పల మాల' తీసివేయంగా 

'శార్ధు లం'బుగా మాట గ్రుచ్చెను

'మత్తేభం'నైన నా మనస్సుకు.


కమ్మని కల కూర్పులు

పులకరింతలు పలకరింతలు

ఆపై పాదముల కలయికలు.


తన అందాన్ని చూరగొని

'సంధి' చేయమంటూ

'సమాసాలు' లెఖ్ఖలతో

'వ్యాకరణ విశేషం' లతో 

'పద్యము'ను వారసత్వంగా 

అందజేయమంది నా "కవిత".


కవితా దినోత్సవ శుభాకాంక్షలు.


అశోక్ చక్రవర్తి.నీలకంఠం.

ఉల్లిపాయతో ఉపయోగాలు -

 ఉల్లిపాయతో  ఉపయోగాలు  - 


  *  సిగిరెట్లు , పాన్ పరాగ్ లు అధికంగా వాడటం వలన cancer లు వంటి వ్యాధులకు అద్బుతంగా విరుగుడుగా పనిచేస్తూంది . 


 *  పిల్లలు బాగా పుష్టిగా ఆరోగ్యంగా ఎదగడానికి నీరుల్లి బెల్లం కలిపి తినిపిస్తూ ఉండాలి.


 *  రాత్రి పూట నిద్రపట్టక అవస్తలు పడే వాళ్లు పచ్చి నీరుల్లి పాయల రసం 20 గ్రా , పంచదార 10 గ్రా కలుపుకుని పూటకు ఒక మోతాదుగా రెండు పూటలా తాగుతూ ఉంటే పైల్స్ వ్యాధులు ఆశ్చర్య కరంగా తగ్గుతాయి . 


 *  మేహా వాత నొప్పులు తో బాధపడే రోగులు ఆవాల నూనె , నీరుల్లిగడ్డ రసం సమాన బాగాలుగా కలిపి మర్దన చేస్తూ ఉంటే వాతనోప్పులు మాయం అయిపోతాయి . 


 *  కుక్క కరిచినప్పుడు వెంటనే ఉల్లిపాయని తేనేతో కలిపి మెత్తగా నూరి కాటు వేసినచోట పట్టువేస్తే విషం హరిస్తుంది .


 *  నీరస రోగంతో బాధపడేవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా 10 గ్రా నీరుల్లి రసం 10 గ్రా తేనే కలిపి తాగుతూ ఉంటే మంచిబలం , వీర్యవ్రుద్ది కలుగుతుంది.


 *  స్థనాల వాపు , పోట్లుతో  బాధ పడే స్త్రీలు ఒక నీరుల్లి గడ్డని కుమ్ములో పెట్టి ఉడికించి స్థనాల మీద వేసి కట్టుకడుతూ ఉండాలి. ఇలా రెండు మూడు సార్లు చేయగానే వాపు , పోటు పోతాయి .


 *  మూర్చ వచ్చినపుడు నీరుల్లి రసం 4 చుక్కలు  ముక్కులో వేసి నీరుల్లి రసాన్ని అరికాళ్ళకు మర్దన చేస్తే వెంటనే మూర్చ నుండి తేరుకుంటారు.


 *  కలరా సోకినపుడు వెంటనే 10 గ్రా నీరుల్లి రసం 10 గ్రా నిమ్మకాయ రసం కలిపి అందులో కొంచం పంచదార వేసి తాగుతూ ఉంటే చాలా తొందరగా కోలుకోవచ్చు . 


 *  వాంతులు విపరీతంగా అవుతుంటే నీరుల్లి గడ్డని చితగ్గొట్టి వాసన చుస్తూ ఉండాలి. 


 *  మూత్రాశయం లొ గాని , మూత్రపిండాల్లో గాని రాళ్లు ఏర్పడిన వాళ్లు ప్రతిరోజు నీరుల్లి రసం 10 గ్రా తీసుకుంటూ ఉంటే రాళ్లు కరిగిపోతాయి. బొట్టుబొట్టుగా పడే మూత్రవ్యాది కూడా పొతుంది.


 *  ముక్కునుండి చెడు నీరు , రక్తం ధారాపాతంగా కారుతూ భాద పడేవాళ్లు నీరుల్లి రసాన్ని రెండు ముక్కు రంద్రాల్లో రెండు చుక్కలు వేస్తే వెంటనే రక్తం , నీరు ఆగిపోతుంది . 


 *  తేలు కాటుకి నీరుల్లిపాయ రసాన్ని రుద్దితే వెంటనే విషం విరుగుతుంది. 


 *  చెవిపోటు వచ్చినపుడు నీరుల్లిపాయల రసం నువ్వుల నూనెలో కలిపి కొంచం గోరువెచ్చ చేసి గోరువెచ్చటి ద్రవాన్ని నాలుగు చుక్కలు చెవిలొ వేస్తే పోటు తగ్గును . 


 *  కంటి రోగాలు ఉన్నవాళ్ళు నీరుల్లిరసం తేనే సమబాగాలుగా కలిపి కళ్ళలో రెండు చుక్కలు వేస్తూ ఉంటే కంటి కలకలు , కంటి ఎరుపులు , కంటి మంటలు , కంటి శుక్లాలు హరించి పోతాయి . 


  

         మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక  -


     నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

శ్రీవేదవ్యాస

 🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏


                       *శ్రీవేదవ్యాస* 

           *అష్టోత్తరశతనామవాళి* 



 *🌸1. ఓం శ్రీ వేదవ్యాసాయనమః🌸* 


వ్యాసం అంటే విస్తరించటం. *వేదాలను* విభజించి మరియు వ్యాప్తి  గావించారు. కనుకనే కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసులుగా పిలవబడుతున్నారు.


రాశులుగా పోసి ఉన్న వేదజ్ఞానాన్ని ఆపోసన పట్టి 1 ఋగ్వేదము, 2 యజుర్వేదము, 3 సామవేదము, 4 అధర్వవేదము అని నాలుగుగా విభజించి మనకు అందించారు. 


మన మహర్షులు సత్యమేదో, ఆ భగవంతుని స్వరూపాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేయగా, పరమాత్మ వారికి శబ్దరూపంలో వినిపించారు. ఆ దివ్య శబ్దాలే *వేదాలు*.   అందుకే వేదాలను అపౌరుషేయాలు  అని అంటారు. అంటే మానవులచే కూర్చబడినవి కావు అని అర్థం. 


ఒక మహర్షి విన్నది ఇంకొకరు వినలేదు. కానీ అన్నీ ఆ భగవంతునికే తెలుసు. ఆయన స్వరూపం తెలియచేయాలి అంటే ఆ భగవంతునికే  సాధ్యం. అందుకే  భగవంతుడే స్వయంగా వ్యాసులదేవులవారిగా అవతరించారు. మనపై అపారమైన కరుణతో మనలను సన్మార్గంలో నడిపించడం కోసం  వేద, ఇతిహాస, పురాణ, వ్రత, పుజాది సర్వసంప్రదాయాలు, ధర్మనిర్ణయాలు అందించిన మన తండ్రికి కృతజ్ఞతలు తెలియచేస్తూ 

 *ఓం శ్రీ వేదవ్యాసాయ నమః* అని స్మరించుకుందాం🙏


🙏జై గురుదేవ్🙏