7, జూన్ 2024, శుక్రవారం

జీర్ణక్రియ కోసం ఆయుర్వేద సూత్రాలు:*

 ✍️ *మంచి జీర్ణక్రియ కోసం ఆయుర్వేద సూత్రాలు:*


👉ఆయుర్వేదం ప్రకారం, దాదాపు అన్ని వ్యాధులకు జీర్ణ సమస్యలే ఆధారం. 


👉జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తే, అనేక వ్యాధులను నివారించవచ్చు.


✍️ *మలబద్ధకం సమస్య వున్నప్పుడు:*


👉నెయ్యి, ఉప్పు మరియు వేడి నీటితో చేసిన పానీయం తీసుకోండి. 


👉నెయ్యి ప్రేగుల లోపలి భాగాన్ని ద్రవపదార్థం చేయడానికి సహాయపడుతుంది మరియు ఉప్పు బ్యాక్టీరియాను తొలగిస్తుంది.


👉 నెయ్యిలో బ్యూటిరేట్ యాసిడ్ ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడే శోథ నిరోధక ప్రభావాలతో కూడిన కొవ్వు ఆమ్లం.


👉1 tsp తాజా నెయ్యి మరియు 1/4 tsp ఉప్పును 1/4 కప్పు వేడి నీటిలో బాగా కలపండి.


👉రాత్రి భోజనం చేసిన ఒక గంట తరువాత కూర్చుని ఈ పానీయాన్ని నెమ్మదిగా సిప్ చేయండి. 


✍️పొట్ట ఉబ్బరం వున్నప్పుడు:


👉వెచ్చని నీరు మరియు సోపు గింజలు లేదా అల్లం ప్రయత్నించండి.


👉మీకు వేడి పానీయం సిద్ధంగా లేనట్లయితే తిన్న తర్వాత సోపు గింజలను నమలడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియకు సహాయపడుతుంది మరియు గ్యాస్ మరియు ఉబ్బరం తగ్గుతుంది. 


👉మీరు టీ తాగే వారైతే, కడుపు ఉబ్బరానికి సహాయం చేయడానికి ఫెన్నల్ (సోంపు) మరియూ పుదీనా టీని తీసుకోండి.


👉టీస్పూన్ ఫెన్నెల్ గింజలను దోరగా వేయించి, పొడి చేసుకుని, 1 కప్పు ఉడికించిన నీటిలో కలపండి. ఈ మిశ్రమాన్ని భోజనం అయిన తర్వాత సిప్ చేయండి.


👉ఉడికించిన నీటిలో కొన్ని తాజా అల్లం ముక్కలు, చిటికెడు హింగ్ (ఇంగువ) మరియు చిటికెడు రాతి ఉప్పు కలపండి.  మీ భోజనం తర్వాత దీన్ని నెమ్మదిగా సిప్ చేయండి.


✍️ *యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉన్నప్పుడు:*


👉 ఫెన్నెల్ గింజలు, పవిత్ర తులసి మరియు ఇతర సుగంధ ద్రవ్యాలు కలిసిన మిశ్రమం బాగా పని చేస్తుంది.


👉కొన్ని సోంపు (ఫెన్నెల్ గింజలు), తులసి ఆకులు (పవిత్ర తులసి) , లవంగం  మీ నోటిలో వేసి నెమ్మదిగా నమలండి.


👉1/4 కప్పు సాదా పెరుగును 3/4 కప్పు నీటితో కలపండి . అనగా మూడు భాగాల నీళ్లు కలపాలి.


👉1 టీస్పూన్ రాక్ సాల్ట్, చిటికెడు వేయించిన జీలకర్ర (జీలకర్ర) పొడి, కొంచెం తురిమిన అల్లం మరియు తాజా కొత్తిమీర ఆకులు జోడించండి.


👉ఈ మిశ్రమాన్ని భోజనం తర్వాత సిప్ చేయండి.


✍️ *డయేరియా సమస్య వున్నప్పుడు:*


👉పొట్లకాయ (కాబాలాష్) విరేచనాలకు అద్భుతమైనది. 


👉దీన్ని చారుగానో, టమాటాతో చేసిన కూరగానో చేసుకుని అన్నంతో కలిపి తినొచ్చు.


👉మీకు విరేచనాలు వచ్చినప్పుడు డీ హైడ్రేషన్ ని నివారించడం చాలా ముఖ్యం, కాబట్టి మీరు సాధారణంగా తీసుకునే దానికంటే ఎక్కువ ద్రవాలు త్రాగాలి.


👉1 అంగుళం అల్లం తురుము మరియు 1/4 కప్పు నీటిలో కలపండి.


👉కొద్దిగా ఇంగువ వేసి మరిగించాలి. అది ఉడికిన తర్వాత చిటికెడు పసుపు వేసి కలపాలి.


👉ఈ మిశ్రమాన్ని భోజనం తర్వాత సిప్ చేయండి.


✍️ *అజీర్ణం సమస్య ఉన్నప్పుడు:*


👉వండిన కూరగాయలు మరియు సూప్ వంటకాలు సహాయపడతాయి.


👉అజీర్ణంతో బాధపడుతున్నప్పుడు పచ్చి బియ్యం, కొత్త బియ్యం,  పచ్చి కూరగాయలు, జంక్ ఫుడ్, నూనెలో బాగా వేయించినవి మరియు జీర్ణం కావడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆహారాలు ఏవో మీకు ఇదివరకే తెలిసి ఉంటే వాటిని గుర్తించి తినకుండా ఆపాలి.


👉 కూరగాయలను ఉడికించి లేదా నూనె లేకుండా వేయించి, అల్లం, దాల్చినచెక్క, నల్ల మిరియాలు వంటి జీర్ణక్రియకు సహాయపడే సుగంధ ద్రవ్యాలను మాత్రమే జోడించండి. 


👉 3-4 వెల్లుల్లి రెబ్బలు, 10-12 తులసి ఆకులు, మరియు 1/4 కప్పు గోధుమ గడ్డి రసం లో కలిపి మిక్సీ లో వేసి బాగా జ్యూస్ గా చేసుకుని భోజనం తరువాత త్రాగాలి.


*


✍️ *

ఆత్మ అంటే ఏమిటి

 ""ఆత్మ అంటే ఏమిటి?

"పరమ"ఆత్మ అనీ,"జీవ"ఆత్మ అనీ

"ప్రేత"ఆత్మ అనీ!అంతరాత్మ అనీ

ఆత్మ కి ఇన్ని తీరులా?ఇన్ని పేరులా?


ఇంతకు ,ఆత్మ అంటే ప్రాణమా?కాదు.మనస్సా?కానే కాదు.

బుద్ధా?అసలే కాదు.మరి దేనిని "ఆత్మ"అని పిలవాలి?

శరీరాన్ని కాదులే అని అందరికీ తెలిసిందే.


ఆత్మ స్థిరమన్నారు--సత్యమన్నారు.

అది తెగదన్నారు--తడవదన్నారు.

కాగదన్నారు--కాలదన్నారు.

అసలు దానికి--ఏమీ కాదన్నారు.

శరీరం వస్తే--అది వస్తుందన్నారు.

శరీరం చస్తే--అది చావదన్నారు.

శరీరం కర్మ--దానిని చేర దన్నారు.

కర్మ ఫలానికి--అది పూచీ కాదన్నారు.

జన్మ పరంపర కు--దానికి సంబంధం లేదన్నారు.

పూర్వ జన్మ స్థూల కర్మ ఫలంలో సూక్ష్మ శరీరం మళ్ళీ పుట్టి స్థూలమైతే,అందులో చేరుతుందన్నారు.అది చచ్చేదాక అందులోనే ఉంటుందని అన్నారు.

మళ్లీ మళ్ళీ---అదే తీరు!..

.

మానవజీవిత గమ్యం -వేమన పద్యం

తెలుగునాట పుట్టిన మహనీయుల్లో వేమన యోగి ఉత్తమ శ్రేణికి చెందినవాడు.ఆయనను చాలామంది ఒక సంఘసంస్కర్తగా భావిస్తున్నారు. ఇది పొరపాటు.ఆయనను ఒక కులానికి పరిమితం చెయ్యడమూ తప్పే.సాధారణ మానవ పరిమితులను దాటినవారే మహానీయులనబడతారు. వారు కులానికి మతానికి జాతికి అతీతులౌతారు. మానవత్వమూ దైవత్వమే వారి విధానాలు అవుతాయి.వేమన అటువంటి సద్గురువులలో ఒకడు.మానవాతీతులైనవారిని ఒకకులానికి మతానికి ప్రాంతానికి పరిమితం చెయ్యకూడదు.ఆదిత్యయోగీ..


ఆయన పద్యాలలో ఉత్తమమైన యోగసాధన రహస్యంగా చెప్పబడింది. వేదాంతమూ వైరాగ్యమూ యోగమూ ఆయన తన పద్యాలలో సరళంగా బోధించాడు.రసవాదం కూడా రహస్యంగా ఆయన పద్యాలలో చెప్పబడింది."తాళకంబెరుగరో తగరంబు నెరుగరో" అనే పద్యం రసవాద రహస్యమే.అలాంటి పద్యాలు ఇంకా ఉన్నాయి.క్షుద్రలోహాలను బంగారంగా మార్చే విధానాన్ని గుప్తంగా వాటిలో వేమన వివరించాడు.కాని వాటిని అర్ధంచేసుకున్నవారు తక్కువ.


రసవాదమూ మొదలైన ఇతర భావాలను అలా ఉంచితే,అసలు మానవజన్మకు ఏమి చేస్తే సార్ధకత వస్తుందో వేమన భావాలలో కొంచం పరిశీలిద్దాం.


పశు పక్ష్యాదులవలె ఆహారనిద్రాభయమైదునాలలో వృధాగా గడపడానికి ఉద్దేశించబడింది కాదు మానవజన్మ.మానవజన్మకు ఒక పరమార్ధం ఉన్నది. వృధాగా పుట్టి గిట్టుటకొరకు వచ్చినది కాదు మానవజన్మ. తిరిగి పుట్టనట్టి చదువును చదువుకోవటమే మనిషిజన్మకు పరమార్ధం. జననమరణచక్రం నుంచి విముక్తి పొందగలిగే మహత్తర అవకాశం మానవజన్మకు దైవంచేత ఇవ్వబడింది. కాని దానిని గ్రహించేవారెందరు? కొండొకచో కొందరు గ్రహించినా ఆ మార్గంలో నడిచేవారెందరు? నడిచినా గమ్యాన్ని చేరేవారెందరు? నిరంతరం ఆహార సముపార్జనకు, సుఖలాలసకు అంకితం అయిన మనిషి పరమార్ధాన్ని పొందేది ఎప్పుడు?

పగలు పొట్టకోరకు బహు ధనార్జనచింత

రాత్రి రమణి తోడ రతులచింత

మోక్షచింత ఇంక మూడాత్ముకెపుడురా

విశ్వదాభిరామ వినురవేమ

మోక్షచింత వైపు మనసు పోకుండా తిండి,సంపాదన,భోగలాలసలనే మాయతో మనిషిని కప్పింది జగన్మాత.ఈ మాయను గెలిచినవాడే పరమపదం వైపు అడుగులు వెయ్యగలడు.లేకుంటే ఆ ఊబిలో మునగక తప్పదు.అసువులు బాయక తప్పదు. నిరంతరం ఈషణాత్రయంలో ఈత కొట్టే వారికి ఒడ్డు దొరికేదేన్నడు? రాగద్వేషాలనే వలలో చిక్కినవానికి విముక్తి ఎట్లా దొరుకుతుంది?తమస్సుతో నిండిన మనస్సుకు మోక్షచింత ఎప్పుడు ఉద్భవిస్తుంది? ఎంతసేపూ తిండి,సుఖం వీటిగురించే ఆలోచించే మూర్ఖునికి మోక్షచింత ఎప్పుడు కలుగుతుంది?.ఆదిత్యయోగీ..


వినవలె దశవిధ నాదము

గనవలె నిర్భేద పదము గాంచిన పైపై

గనవలె సోహంభావము

మనవలె పరిపూర్ణమూని మదిలో వేమా

యోగాభ్యాసపరుడై లోలోన వినిపించే పదిరకాల నాదాలను వినాలి. దానిని మించినట్టి చెక్కుచెదరని గట్టిదైన భూమిని చూడాలి. దానినికూడా దాటి సోహం భావమున ప్రతిష్టితుడై పరిపూర్ణమైన బ్రహ్మపదమును సాధకుడు చేరుకోవాలి. అప్పుడే అతని జన్మకు పరిపూర్ణత.సాధనాపరుడై పరమపదాన్ని అందుకున్నపుడే మనిషి జన్మకు ధన్యత.అది లేకుంటే ఎన్నెన్ని వేషాలు వేసినా అన్నీ చివరకు వృధా అవక తప్పదు.

వ్యాపించి యున్న లోకము

ప్రాపించక గురుని వేడి బహుతంత్రముగా

దీపించి మనసు నిల్పుము

రూపంబగు బట్టబయలు రూఢము వేమా

చిత్ర విచిత్రమైన హంగులతో నిండిన ఈ లోకాన్ని లెక్కించక సద్గురువైనవాడిని  సమీపించి తంత్రోక్తమైన అతని ఉపదేశము పైన మనసు నిల్పితే అంతా తేటతెల్లముగా కనిపిస్తుంది. మనిషికి ప్రధమ కర్తవ్యం ఇదే. కాని మానవులు ఇదిమాత్రం వదిలిపెట్టి తక్కిన అన్నింటినీ చక్కగా ఆచరిస్తున్నారు.అందుకే సంసార సాగరంలో మునిగి మరణిస్తున్నారు గాని దరిచేరేవారు ఒక్కరూ లేరు. మాయామోహాలతో నిండిన ఈ లోకం మనిషిని ఎంతో ఆకర్షించి అతన్ని కాళ్ళూ చేతులూ కట్టి ఒక బానిసలా వాడుకుంటుంది. ఆ బానిసత్వమే ఆనందం అన్న భ్రమలో మనిషి గానుగెద్దులా జీవిస్తూ తన ఆయువు హరించుకు పోవడాన్ని గమనించడు. ఈ భ్రమ నుండి మనిషి బయటపడి సద్గురుప్రోక్తమైన  సాధనామార్గంలో నడక సాగించాలి. అప్పుడే అతనికి సత్యం సాక్షాత్కరిస్తుంది.

లోకము తను 'ఛీ' యనగా

లోకము తా 'ఛీ' యనంగ లోకములోనే

ఏ కర్మల నోనరింపక

లోకములెంచంగ ముక్తిలోకము వేమా

లోకవిధానాలను తాను ఏవగించుకోవాలి. అనగా తనకు లోకవాసనలపైన విరక్తి కలగాలి. లోకమూ తనను అసహ్యించుకోవాలి. అంటే సమాజపు కుళ్ళుపోకడలకు విరుద్ధమైన సత్యమార్గంలో తాను నడవాలి. లోకాన్ని తాను  ఛీకోడితే లోకమూ తనను 'ఛీ' అంటుంది.అంటే లోకరీతికి భిన్నమైన మార్గంలో సాధకుడు నడవాలి.అటువంటి స్తితిలో ఉంటూ,కర్మను క్షయింపచేసుకునే రహస్యయోగమార్గాన్ని అనుసరించి,తద్వారా లభించినట్టి  యోగసిద్ధితో, సమస్త లోకాలను సాక్షిగా తిలకించగలిగితే అదే ముక్తి.

రానిది కోరిన రాదది

రానున్నది కోరకున్న రానేవచ్చున్

తానెంత చింత చేసిన

కానున్నది కాకపోదు గదరా వేమా

తనకు యోగం లేకపోతే ఎంత కోరుకున్నా అది దక్కదు.అలాగే,తనకు రాసిపెట్టి ఉంటే ఎంత వద్దనుకున్నా అది అనుభవించక తప్పదు.కనుక తానెంత చింతించినా కానున్నది కాకమానదు.రానున్నది రాకమానదు. జరుగనున్నది జరుగక మానదు.ఇది అంతిమ సత్యం.దీనిని గ్రహించి ఆచరించగలిగినవాడు ధన్యుడు.అటువంటివాడు ఒక రమణమహర్షిగా రూపు దిద్దుకుంటాడు. జిల్లెళ్ళమూడి అమ్మ కూడా ఇదే భావాన్ని"అనుకున్నది జరగదు.తనకున్నది తప్పదు"అని చెప్పారు.మహనీయులు ఎవ్వరైనా ఇదే సత్యాన్ని ఎన్నో మార్లు చెప్పారు.కాని మూడత్వంతో నిండియున్నవానికి ఇది తలకేక్కుతుందా? ఎక్కదు.అందుకే లోకంలో జ్ఞానులు కొందరే ఉంటారు.మిగిలినవారు మిడుతల దండులే.పుట్టలోని చెదలే.ఆదిత్యయోగీ..

మాయల సంసారముకై

మాయలలో బొరలుచుండు మనుజుడు మరితా

మాయను మదిలో దలచిన

మాయలనే ముక్తి గలుగు మహిలో వేమా

ఈ మాయదారి సంసారమోహంతో నిండిన మానవుడు మాయ అనే బురదగుంటలో పడిన పందిలాగా దొర్లుతున్నాడు. మాయాస్వరూపాన్ని తన మనసులో చింతనచేత చక్కగా అర్ధం చేసుకుంటే, ఆ మాయలో నుంచే ముక్తి అనే మార్గం చక్కగా కనిపిస్తుంది. కాని మాయను ఆనందిస్తున్న మనుజునికి మాయపై మనసు విరిగేదేన్నడు?సాధనామార్గంపైన మనసు నిలిచేది ఎప్పుడు? అసలలా జరిగే అవకాశం ఉన్నదా?

జ్ఞాననిష్ఠ బూని మేను మరచువాడు

కామిగాడు మోక్షగామి గాని

నియమ నిష్ఠలుడిపి నిర్గుణమ్మందురా

విశ్వదాభిరామ వినురవేమ

జ్ఞానకాంక్షి యైనవాడు మొదటిలో నియమ నిష్టలను ఎన్నో ఏళ్ళు పాటించాలి. తర్వాత జ్ఞాననిష్టను బూని నియమనిష్టలకు అతీతుడై సర్వాతీతమైన నిర్గుణపదవిని అందుకోవాలి.ఇదే మనిషి యొక్క ప్రధమకర్తవ్యం.అంతే కాదు.ఇదే మానవ జీవితపు నిజమైన గమ్యం కూడా. దీనిని సాధించినవాడే నిజమైన మానవుడు. అతని జన్మ మాత్రమే సార్ధకమైన జన్మ...

.

 ప్ర : 'విశ్వామిత్ర' అనే మాటను 'విశ్వానికి అమిత్రుడు'(విశ్వ+  అమిత్రుడు) అనే అర్థం వస్తుందేమో ? ఈ నామానికి అసలైన అర్థం  ఏమిటి ?

 జ : ఈ సవర్ణదీర్ఘ సంధి ఇక్కడ వర్తించదు.

 "మిత్రే  చర్షౌ ఇతి విశ్వశబ్దస్య దీర్ఘః. తస్యాం విశ్వం మిత్రమాసీద్యదిదం కించ తస్మాద్విశ్వామిత్ర ఇత్యాచక్షతే” 

అని శాస్త్ర నిర్వచనం. ఎవనికి విశ్వం మిత్రమో(స్నేహభావంతో కూడినది), ఎవరు విశ్వానికి మిత్రుడో అతడు - విశ్వామిత్రుడు.

 విశ్వే దేవాశ్చ మే మిత్రం మిత్రమస్మి గవాం తథా| విశ్వామిత్ర ఇతి ఖ్యాతం యాతుధాన నిబోధమాన్ ll 

-"విశ్వేదేవతలు / సమస్తదేవతలు నాకు మిత్రులు. గోవు (వేదమంత్రములు, ఆవులు, ఇంద్రియములు)లకు నేను మిత్రుడను. అందువలన నన్ను 'విశ్వామిత్రుడు' అంటారు". - అని విశ్వామిత్రుడే స్వయంగా చెప్పిన నిర్వచనం (మహాభారతం)....

.


నీవు కనీసం ద్వితీయ శ్రేణి గురువులు కూడా పొందలేని పక్షంలో ఆత్మసాక్షాత్కారం పొందిన జగద్గురు ఆదిశంకరులు, దత్తాత్రేయ మరియు ఇతర మహాత్ములు రాసిన పుస్తకాలలో చెప్పిన బోధనలను అనుసరించవచ్చు. జీవన్ముక్తుడైన లేదా ఆత్మ సాక్షాత్కారం పొందిన అటువంటి గురువుల యొక్క చిత్తరువు/చిత్రపటం నీ లభ్యమైతే, నీ ముందు ఉంచుకొని దానిని భక్తివిశ్వాసాలతో పూజించు. క్రమంగా నీకు ప్రేరణ కలుగుతుంది, మరియు రైన సమయంలో గురువు స్వప్నంలో కనిపించి, దీక్ష ఇచ్చి,  ప్రేరణ కలజేస్తారు. నిజాయితీగల సాధకులకు సహాయం అనేది చాలా గుహ్యమైన రీతిలో వస్తుంది.


భగవంతుని నుంచి గుహ్యమైన సహాయము 


కొన్ని సందర్భాల్లో భక్తులకు భగవంతుడు ఏ విధంగా సహాయపడ్డాడో చూడు. ఏకనాథుడు ఆకాశవాణి విన్నాడు. అది ఏమన్నదంటే "దేవగిరిలో ఉన్న జనార్ధన పంత్‌ను దర్శించు. ఆయన నిన్ను సరైన మార్గంలో పెట్టి నడిపిస్తాడు". అతను ఆ విధంగా నడుచుకొని తన గురువును పొందాడు. తుకారాం 'రామకృష్ణ హరి' అనే మంత్రాన్ని స్వప్నంలో పొందాడు. ఆయన ఈ మంత్రాన్ని మననం చేసి కృష్ణ దర్శనం పొందాడు. శ్రీకృష్ణుడు నామదేవుడిని తన యొక్క దీక్ష కోసం మల్లికార్జున దగ్గరున్న సన్యాసిని దర్శించమని ఆదేశించాడు. రాణి చూడాలి 'కుంభ ముని' రూపాన్ని పొంది, తన భర్త అయిన సిఖద్వజుని ముందు అడవిలో కనిపించి, కైవల్యం యొక్క రహస్యాలను అతనికి ఉపదేశించింది. మధురకవి మూడు రోజులపాటు ఆకాశంలో కాంతిని చూసాడు. అది అతనికి మార్గదర్శనం చేసి, తిన్నేవెలిలో చింత చెట్టు కింద సమాధిలో కూర్చున్న తన గురువైన నమ్మాళ్వార్ వద్దకు తీసుకెళ్ళింది. బిల్వమంగళుడు నాట్యగత్తె, చితామణిని చూసి బాగా ఆకర్షితుడయ్యాడు. ఆ తర్వాత ఆమయే అతనికి గురువయ్యింది. తులసీదాసు అగోచరమైన ఒక జీవి (బ్రహ్మరాక్షసుడు) ద్వారా సూచనలు పొంది హనుమంతుని దర్శనం పొందగలిగాడు. హనుమంతుని ద్వారా, అతనికి రాముని దర్శనం..*

.

విషం విషం కాదు

 *ప్రతీ దేవాలయం లో ఈ శ్లోకాన్ని ఏర్పాటు చేయాలి.*


భక్తులు కష్టించి తెచ్చి ఇచ్చిన సొమ్మును, తమ స్వప్రయోజనాల కోసం స్వార్ధం కోసం వాడుకునే.. అధికారులు & రాజకీయ నాయకుల్లో మార్పు కలుగుతుంది..


*భక్తుల సొమ్ము*


శ్లో॥ 

న విషం విషమిత్యాహుః । 

భక్తస్వం విష ముచ్యతే | 

విష మేకాకినం హంతి | 

భక్తస్వం పుత్రపౌత్రకమ్ ||


భావం : *విషం విషం కాదు. భక్తుల సొమ్ము నిజమైన విషం. విషం వలన ఒక్కడే మరణించును. భక్తుల సొమ్మును అవహరించినవానికి పుత్రపౌత్రాదులు నాశనమవుదురు. భక్తుల సొమ్ముకు ధర్మకర్తగా ఉండాలి. తాను అనుభవించరాదు. దైవకార్యాలకు వినియోగించాలి. సత్యనిష్ఠ తప్పక ఆచరించాలి.*

శ్ర్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం!!

 శ్ర్రీ దాసాంజనేయ స్వామి

దేవాలయం!!


🔆 కృష్ణా జిల్లా : " మాచవరం"


💠 విజయవాడలోనే కాక రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తులు అమితంగా కొలిచే దేవాలయాల్లో మాచవరంలోని దాసాంజనేయ స్వామి ఆలయం ప్రముఖంగా పేర్కొనవచ్చు. 


💠 700 ఏళ్ళ చరిత్ర కలిగిన గొప్ప దేవాలయం .

విజయ నగర సామ్రాజ్యాన్ని పాలించిన సాలువ ,తులువ వంశ రాజులకు పూజనీయ, గురు స్థానంలో ఉన్న వ్యాస రాయలవారు (వ్యాస తీర్ధులు )ప్రతిష్ట చేసి,నిర్మించిన ప్రసిద్ధ దేవాలయం.


💠 పూర్వం వ్యాసరాయలనే హనుమద్భక్తుడు పాదచారిగా పర్యటిస్తూ తాను బసచేసిన ఊళ్ళలో హనుమంతుని విగ్రహాలను ప్రతిష్టించే వాడని, ఆ పర్యటనలో విజయవాడ చేరుకొని ఆంజనేయ స్వామి ప్రేరణపై ప్రస్తుతం వున్న ఆంజనేయస్వామి ఆలయ ప్రాంతానికి వచ్చి అక్కడ శంఖు - చక్రాదులతో తనకి లభించిన స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించి శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు.


💠 క్రీ.శ. 1509 లో వ్యాస తీర్ధ మహాశయులు పాద చారియై దేశాటనం సాగిస్తూ భగవద్ భక్తీని ప్రబోధించారు .ఆ యాత్రలో విజయవాడ వేంచేసి ఇంద్ర కీలాద్రి వేంచేసి ఉన్న శ్రీ కనక దుర్గమ్మ అమ్మ వారిని దర్శించారు .

అప్పుడు ఒక వింత సంఘటన జరిగింది  అంటారు.. 

ఆంజనేయస్వామి  ఒక వానర వేషంలో తీర్ధుల వద్దకు వచ్చి ,సౌజ్నలతో తన వెంట రమ్మని కోరింది .

అలా ఆ వానరం కొండలు గుట్టలు దాటించి ఇప్పుడున్న మాచవరం వద్దకు తీసుకు వెళ్ళింది .అప్పుడు వానర రూపం లోని ఆంజనేయస్వామి తీర్ధుల వారిని శంఖ చక్రాలతో ఉన్న తన విగ్ర హాన్ని ప్రతిష్టించి ,ఆలయ నిర్మాణం చేయమని కోరారు .

వ్యాస తీర్ధుల వారు స్వామి ఆనతిచ్చినట్లే విగ్రహ ప్రతిష్టచేసి దేవాలయ నిర్మాణం పూర్తి చేశారు .


💠 విజయ నగర సామ్రాజ్య పతనం తర్వాత ఈ అలయం ముస్లిముల పాలనలో ధ్వంసం అయ్యింది.

తదననంతరం సుమారు 150సంవత్స రాల క్రితం శ్రీ దున్న వీరాస్వామి అనే కాంట్రాక్టర్ విజయవాడ –ఏలూరురోడ్డు మార్గాన్ని నిర్మిస్తుండగా ఒక రోజు శ్రీ ఆంజనేయస్వామి వారు ఆయన స్వప్నంలో సాక్షాత్కరించి తన విగ్రహం ఉన్న చోటు ను చూపించి ,అక్కడ త్రవ్వి విగ్రహాన్ని బయటకు తీసి గుడి కట్టించమని ఆదేశించారు .


💠 వీరయ్య గారు అత్యంత భక్తీ శ్రద్ధలతో ఆ ప్రదేశానికి కూలీలను తీసుకొని వెళ్ళి త్రవ్వించారు .అక్కడ భూమిలో గంధ సింధూరం తో పూర్తి గా అలంకరింప బడ్డ శ్రీ మారుతి స్వామి విగ్రహం కనిపించింది .

ఆయన ఆ విగ్రహాన్ని బయటికి తీయించి ,ఇప్పుడు దేవాలయం ఉన్న చోట ఒక రావి చెట్టు కింద పాక వేసి అందులో స్వామిని ప్రతిష్టించి పూజాదికాలు నిర్వహించి భక్తులకు స్వామి దర్శనానికి వీలు కల్పించారు 


💠 అదే నేడు అత్యంత వైభవం గా విలసిల్లుతున్న మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం.


💠 శ్రీ దాస ఆంజనేయస్వామి విగ్రహం మూడు అడుగుల పొడవు ఉండి శ్రీ రాముడి ముందు మోకాళ్లపై కూర్చుని అతని రెండు చేతులు అంజలి గటించి  స్వామికి నమస్కరించినట్లు ఉంటుంది. 

ఇక్కడ ప్రతిరోజు అనేక మంది తాము కొత్తగా కొన్న వాహనాలకు పూజలు చేయిస్తారు 


💠 శ్రీ దాస ఆంజనేయుడు ఇక్కడ శ్రీరాముని ముందు మోకాళ్లపై కూర్చున్న దాసు (విద్యార్థిగా) కనిపిస్తాడు. 

అతని రెండు చేతులు అరచేతులతో ముడుచుకున్న అంజలిలో అతని ప్రభువుకు ప్రణామాలు సమర్పించడం కనిపిస్తుంది. 

అతని ప్రకాశవంతమైన కుండలం పరిమాణంలో పెద్దది మరియు మిరుమిట్లు గొలిపేది.


💠 ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తే భక్తుల కోర్కెలు నెరవేరుతాయని విద్యా, ఉద్యోగ, వ్యాపారాల్లో అన్నింటా కూడా విజయం చేకూరుతుందని భక్తుల నమ్మకం. 

నగరంలో ఏ చోట కొత్త వాహనాలు కొనుగోలు చేసినా ఈ ఆలయం వద్ద వాహన పూజను జరిపించటం కూడా ఆనవాయితీగా వుంది. 


💠 హనుమత్ జయంతి ఈ ఆలయంలో జరుపుకునే ప్రదాన పండుగ. 

ఆకు (తమలపాకు) పూజను ఎంతో గౌరవప్రదంగా నిర్వహిస్తారు.


💠 ఆలయం దర్శనం ఉదయం 6:00 గంటలు నుండి రాత్రి 9:30 గంటలు వరకు


     

💠 మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం విజయవాడ పండిట్ నెహ్రు బస్‌స్టేషన్ నుండి 3 కి.మీ దూరంలో ఏలూరు రోడ్డులో ఉంది .!!

Photo




 

గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపం*

 *గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపం*


గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి. శంఖాలకు ఏవిధమైన ప్రాధాన్యత ఉందో 

గవ్వలకు అదేవిధమైన ప్రాధాన్యత ఉంది.

గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు.

దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. 

గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు. 

గవ్వలు లక్ష్మీ దేవి చెల్లెళ్లు అని, 

శంఖాలను లక్ష్మీదేవి సోదరులనీ భావిస్తుంటారు. 

గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి కూడా 

ప్రత్యక్ష సంబందం ఉంది. 

శివునికి చేసే అష్టాదశ అలంకరణలో 

గవ్వలుకూడ ఉంటాయి. 

శివుని జటాజూటంలోను, 

శివుని వాహనమైన నందీశ్వరుని మెడలోనూ గవ్వలే అందంగా ఉంటాయి. 

గవ్వలు అలంకరణ వస్తువుగాను, ఆటవస్తువుగాను, తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుంది. 

పంచతంత్రంలో ఒక చోట "చేత గవ్వలు లేనట్లయితే స్నేహితుడే శత్రువు అవుతాడు." అని ఉంది. 

కాబట్టి గవ్వలకి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, 

ఆర్ధిక జీవనంతో సంబందాలు ఉన్నాయి అనేది వాస్తవం.

1) పిల్లలకి దృష్టిదోష నివారణకు గవ్వలను 

వారి మెడలోగాని,మొలతాడులోగాని కట్టాలి. 

2) కొత్తగా కొన్న వాహానాలకు నల్లని తాడుతో 

గవ్వలని కట్టి దృష్టిదోషం లేకుండా చేసుకోవచ్చు. 

3) గృహా నిర్మాణ సమయంలోను ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను 

ఎక్కడో ఒకచోట కడతారు. 

కొత్తగా గృహప్రవేశం చేసే వారు గుమ్మానికి తప్పనిసరిగా గుడ్డలో గవ్వలను కట్టాలి. 

అలా చేయటం వలన గృహాంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే. 

4) గవ్వలని పసుపు వస్త్రంలో పూజా మందిరంలో ఉంచి లలిత సహాస్త్రనామాలతో కుంకుమార్చన చేస్తే 

ధనాకర్షణ కలుగుతుంది. 

5) గల్లా పెట్టెలో (cashbox)గవ్వలను డబ్బులుకు తగులుతూ 

ఉంచటం వలన ధనాభివృద్ధి కలుగుతుంది. 

6) వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను 

దగ్గర ఉంచుకోవటం వలన శీఘ్రంగా వివాహా ప్రయత్నాలు జరుగుతాయి.

 7) వివాహ సమయములలో వధూవరులు 

ఇద్దరి చేతికి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చక్కగా ఉంటుంది. 

గవ్వలు శుక్రగ్రహానికి సంబందించినది కాబట్టి 

గవ్వలు కామప్రకోపాలు, 

వీనస్, యాప్రోడైట్ వంటి కామదేవతల్ని గవ్వలతో పూజిస్తారు.

8) వశీకరణ మంత్ర పఠన సమయంలోను 

గవ్వలను చేతిలో ఉంచుకోవటం మంచిది. 

9) గవ్వల గలలలు ఉన్న చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది.

కామాక్షి

 కోరినవారికి కొంగు బంగారమైన తల్లి కామాక్షి. కామాక్షి అమ్మవారి ఆలయాల గురించి తలచుకోగానే మొట్టమొదట గుర్తొచ్చేది తమిళనాట ఉన్న కంచి కామాక్షే. కానీ అమ్మవారి కృపకి హద్దులున్నాయా ? ఉంటాయా ? ఆ దేవదేవి కొలువైన తెలుగు క్షేత్రం గొప్ప వైభవాన్ని, చరిత్రని సొంతం చేసుకున్నది. అటువంటి దివ్య క్షేత్రాన్ని సందర్శించి ఆ దివ్య వైభవాన్ని ఈ అక్షరాల్లో ఆస్వాదిద్దాం రండి . 


అవతార విశేషం : 


లోకహితం కోరిన కశ్యప మహర్షి ఒకసారి పినాకిని ఒడ్డున తల్పగిరి, రజితగిరి, వేదగిరి అనే కొండల వద్ద యాగం మొదలుపెట్టాడు. యాగం ముగిసిన తర్వాత మల్లికార్జునస్వామి ప్రత్యక్షమయ్యాడు. పరమానందభరితుడై ప్రత్యక్షమైన పరమేశ్వరుని చూసి కాశ్యప మహర్షి ‘స్వామీ! లోకహితం కోసం తొందరపడి ఒంటరిగా వచ్చావే! దేవి కూడా ఇక్కడ ప్రత్యక్షమైతే మహదానందం కలుగుతుంది’ అన్నాడు. పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి సమ్మతించగా కామాక్షిదేవి ప్రత్యక్షమైంది. కాశ్యప మహర్షి మల్లికార్జునస్వామిని, కామాక్షిదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. పూజలు సల్పారు.


దూర్వాసుని శాపం : 


దుర్వాసముని రాజగిరికి చేరుకున్నాడు. అయితే ఆయన రాకను గమనించలేదు శివుడు. అందువల్ల ఆగ్రహించిన దుర్వాసముని శివునితో ‘ఈప్రదేశంలోని ఆలయం పుట్టుపూర్వోత్తరాలే లేకుండా పోతుంది’ అని శపించాడు.


ప్రళయం వచ్చింది. పినాకిని నదిలో ఉప్పెన పొంగింది. ఉప్పెనలో ఆలయం మునిగిపోయింది. మల్లికార్జునస్వామి, కామాక్షిదేవిల విగ్రహాలు ఉప్పెనలో కొట్టుకుపోయాయి. ఇది పూర్వగాథ.


జొన్నవాడ కామాక్షి : 


పచ్చనిపైర్లతో ఎంతో సమృద్ధిగా ఉన్న జొన్నవాడ ప్రదేశంలో పశువుల కాపర్లు తమ పశువులను మేపుతున్నారు. వారిలో ఒక బాలుడు భూమిలో ఏదో ప్రకాశం ఉన్నట్టు చూసాడు. అక్కడ భూమిని తవ్వగా ఒక శివలింగం కనిపించింది. ప్రజలు దాన్ని చూసి ఆ లింగం ఉప్పెనలో కొట్టుకుపోయిన లింగం అని తెలుసుకున్నారు. లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. ఆయనతో పాటు ఉండాల్సిన కామాక్షిదేవి ఏమయింది? నని చింతించసాగారు. మరికొద్ది రోజుల్లోనే ఆ ప్రశ్నకు సమాధానం లభించింది. పినాకిని నదిలో చేపలు పట్టడానికి విసిరిన వలలో అమ్మవారి విగ్రహం దొరికింది. సంతసించిన ప్రజలు మల్లికార్జునస్వామి పక్కనే అమ్మవారిని ప్రతిష్టించారు. వారు తినే మాంసం, చేపలనే నైవేద్యంగా సమర్పించసాగారు. 


కాని ఆ అమ్మవారు రాత్రిపూట బిగ్గరగా నవ్వడమూ, ఉగ్రరూపంలో సన్నిధి వదిలి ఊరిలోపలికి ప్రవేశించి ఆవులను, కొంగలను, కోళ్లను చంపి స్వాహా చేయసాగింది. ప్రపంచాన్ని కాపాడాల్సిన తల్లి అలా జీవరాశులను నాశనం చేయడం చూసి ప్రజలు కలవరపడ్డారు. ఆ సమయంలో అక్కడికి ఆదిశంకరుడు వచ్చారు. మల్లికార్జునస్వామిని, కామాక్షిదేవిని దర్శించుకుని పూజించాడు. ఆరోజు రాత్రి ఆ ఆలయంలోనే ఉండి ఉదయాన  బయలుదేరాలని ఆయన నిర్ణయించుకున్నాడు. 


ఆ దేవి ఆదిశంకరుణ్ణి కూడా హింసిస్తుందేమోనన్న అనుమానంతో ప్రజలు భయపడ్డారు. అమ్మవారి గురించి, ఆమె మాంసాహార్రపీతి గురించి వారు ఆదిశంకరునికి తెలిపారు. ఆమె వెళ్లే మార్గంలో ఆదిశంకరుడు శయనిస్తే ఆయన ప్రాణాలకు హాని జరుగుతుందని ప్రజలు వారించారు. ఆయను జాగ్రత్తగా ఉండమనిచెప్పారు. ఆదిశంకరుడు ‘మీ పశువులను ఆ కామాక్షిదేవి భుజించకుండా ఉండేలా చేస్తాను’ అని మాటిచ్చాడు


అమ్మపైన ఆదిశంకరుల ఆంక్ష: 


అర్ధరాత్రి అయ్యింది. దేవి బిగ్గరగా నవ్వుతూ ఆలయంనుండి బయటికి వెళ్లింది. దారిలో శయనించిన ఆదిశంకరుణ్ని తప్పుకోమని హెచ్చరించింది. ఆదిశంకరుడు ఆ దేవినిప్రసన్నం చేసుకోవాలని స్తుతించారు. ఆయన కీర్తించే ఒక్కో శ్లోకానికి అమ్మవారి రౌద్రం తగ్గసాగింది. ఆమె మొహం ఎంతో ప్రశాంతంగా మారిపోయింది. ఆదిశంకరుడు ఆమె ఎదుట ఒక శ్రీ చక్రాన్ని స్థాపించాడు. ఆ తర్వాత దేవిని చూసి ‘‘తల్లీ! భక్తులు ఇకపై భయపడకుండా నిన్ను పూజించాలంటే నువ్వు ఇకపై వికటాట్టహాసం చేయకూడదు. మాట్లాడకూడదు. ఆలయంనుండి బయటికి వెళ్లకూడదు’’ అని ఆంక్ష విధించాడు. 


కలలోనే అనుగ్రహం : 


దేవి ‘‘నన్ను నమ్మి వచ్చే భక్తులకు వరములివ్వడం, ఆశీర్వదించడం ఎలా’’ అని ప్రశ్నించింది


‘‘భక్తుల కలలో దర్శనమిచ్చి ఆశీర్వదించు. వారు వేడుకుంటే నెరవేరుస్తానని తెలిసేలా చేసి, వారు సంతోషంగా జీవించడానికి సాయపడు’’ అన్నాడు ఆదిశంకరుడు.


కామాక్షిదేవి ఆయన ఆంక్షలకు కట్టుబడింది. తన సన్నిధిలో తమ సమస్యలను చెప్పుకుని మొరపెట్టుకునే భక్తులు ఆ ఆలయంలో నిద్రిస్తే వారి సమస్యలు తీరిపోతాయని వరమిచ్చింది.


ఆలయంలో అమ్మ దర్శనం : 


నెల్లూరునుండి 15 కిలోమీటర్ల దూరంలో వున్న జొన్నవాడలో శాంతస్వరూపిణిగా కామాక్షిదేవి కొలువై ఉంది. అమ్మవారి ఆలయ గోపురం లోపలికి ప్రవేశించగానే ముందు ఎడమవైపున వున్న మార్గంలో వెడితే పినాకిని నదికి చేరుకోవచ్చు. ఆలయ ప్రవేశ ద్వారంలో దేవి కామాక్షి సన్నిధి వైపు వెళ్లే మార్గంలో రెండు వైపులా శూలాన్ని చేతబూనిన మహిళా ద్వారపాలకులు గోచరిస్తారు. లోపలికి వెడితే విశాలమైన లోగిలి. దాన్ని దాటి వెడితే ముందుగా కల్యాణ మండపం వస్తాయి. కల్యాణ మండపానికి కుడివైపు కామాక్షిదేవి గర్భగుడికి వెళ్లే దారిలో బలిపీఠం, ధ్వజస్థంభం ఉంటాయి.


ధ్వజస్తంభం ముందు ఒక పెద్ద నంది, దానిపక్కనే చిన్న నంది ఉంటాయి. లోపలికి వెళ్లగానే అర్ధమండపంలో చాలా స్తంభాలుంటాయి. ఆలయ పురాణం శిల్పాల రూపంలో తెలిసేలా అమర్చారు. అర్ధమండపం తర్వాత వరసగా గర్భగుడులు ఉంటాయి. మొదటి గర్భగుడిలో లక్ష్మీగణపతి, ఎడమవైపున చిన్న మహలక్ష్మి విగ్రహం ఉంటాయి. గర్భగుడిలో మల్లికార్జునస్వామి కొలువై ఉన్నారు. చిన్న లింగం, వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్నారు. అఖిల జగత్తును కాపాడే కామాక్షిదేవి ఈ క్షేత్రంలో నిల్చున్నట్టు మనకు దర్శనమిస్తుంది. చిరునవ్వుతో ఉన్న ముఖారవిందం, కరుణ భరితమైన నయనాలతో సర్వాలంకారాలతో దర్శనిమిస్తుంది. నాలుగు హస్తాలతో ఉన్న అఖిలాండేశ్వరి పై రెండు చేతులలో అంకుశము, పాశము ఉంటాయి. కింది రెండు చేతులలో ఒకటి అభయ హస్తంగాను, మరొకటి శరణాగతి పొందమని చూపినట్టు ఉంటాయి. ఆ తల్లిని చూడడానికి రెండు కళ్లు చాలవు. ఆ దేవి ఎదుట శ్రీ చక్రం స్థాపించిన ఆది శంకరుడు చేత ఒక దండంతో దర్శనమిస్తారు. బయటి ప్రాకారంలో గణపతి, వల్లి, దేవయాని సమేతుడైన సుబ్రహ్మణ్యస్వామి, పసుపు రాసిన ముఖారవిందంతో దుర్గాదేవి చిన్న మండపాలలో దర్శనమిస్తారు. దుర్గాదేవి పక్కనే నవగ్రహాలున్నాయి. బయటి ప్రాకారంలో భక్తులు వేచి ఉంటారు. ఈ క్షేత్ర దర్శనానంతరం బయటికి వచ్చేటప్పుడు మానసికంగా ఎంతో ప్రశాంతత లభిస్తుంది. 


శ్రీ మాత్రే నమః..🙏🚩

భగవన్నామం

 శ్లోకం:☝️

*హే జీవే రససారజ్ఞే*

*సర్వదా మధురప్రియే |*

*నారాయణాఖ్యం పీయూషం*

*పిబ జిహ్వే నిరంతరమ్ ||*


భావం: సకల రసాల సారాంశాన్ని తెలుసుకుని, మధురమైన పదార్థాలను ఇష్టపడే ఓ నాలుకా! రోజూ నారాయణ నామామృతాన్ని సేవించు. అన్ని రసాలకంటే భగవన్నామం మధురమైనది కదా అని భావం.

*పిబరే రామరసం*🙏

పంచాంగం 07.06.2024

 ఈ రోజు పంచాంగం 07.06.2024  Friday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠ మాస శుక్ల పక్ష: ప్రతిపత్తి తిధి భృగు వాసర: మృగశిర నక్షత్రం శూల యోగ: బవ తదుపరి బాలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


పాడ్యమి సాయంత్రం 04:49 వరకు.

మృగశిర  రాత్రి 07:46 వరకు.


సూర్యోదయం : 05:45

సూర్యాస్తమయం : 06:45


వర్జ్యం : ఈ రోజు లేదు 


దుర్ముహూర్తం : పగలు 08:21 నుండి 09:13 వరకు తిరిగి మధ్యాహ్నం 12:41 నుండి 01:33 వరకు.


అమృతఘడియలు : పగలు 11:10 నుండి 12:44 వరకు.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

జ్యేష్ఠ మాసం

 *జ్యేష్ఠ మాసం ప్రారంభం సందర్భంగా...*


*జూన్ 07 శుక్రవారం జ్యేష్ఠ మాసం ప్రారంభం...*


*జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవునికి ప్రీతికరమైన మాసం...*


ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని. ఈ మాసంలో చేసే విష్ణుసహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది. అలాగే నీళ్ళను దానం చేయడం వలన చాలా ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయి. జ్యేష్ఠ శుద్ద తదియనాడు రంభా తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతి దేవిని పూజించడమే కాదు, దానాలకు శుభకాలం. ముఖ్యంగా అన్న దానం చేయడం ఉత్తమం. జ్యేష్ఠశుద్ద దశమిని దశపాపహర దశమి అంటారు. అంటే పది రకాలను పాపాలను పోగొట్టే దశమి అని అర్ధం. పాపాలను హరించే శక్తి కలిగిన దశమి రోజున గంగా స్నానం, లేదా ఏదైనా నదిలో పదిసార్లు మునకేస్తే మంచి ఫలితాన్నిస్తుంది. ఈ మాసం శుక్లపక్ష పాడ్యమి మొదలు దశమి వరకు అంటే తొలి పదిరోజులూ కాశీలోని దశాశ్వమేధఘాట్ లో బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని గంగానదిలో స్నానం చేయడంతో పాటు గంగానదిని పూజించాలి. అందుకు వీలుకాని వారు సమీపంలోని నది గానీ, లేదా ఇంటిలో గానీ గంగానదిని స్మరిస్తూ స్నానం చేయాలి. నల్ల నువ్వులు, నెయ్యి, పేలాలు, బెల్లం నదిలో వేయాలి. ఈ రోజున ఇష్ట దైవాన్ని పూజించి ఆలయాల సందర్శిస్తే శుభం జరుగుతుంది.


జ్యేష్ఠ శుద్ద ఏకాదశినే నిర్జల 'మతత్రయ' ఏకాదశి అనే పేరుతోనూ పిలుస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు, పాయసం, పానకం, నెయ్యి, గొడుగు పేదవారికి దానం చేయాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే 12 ఏకాదశులను ఆచరించిన ఫలితం దక్కుతుంది. జ్యేష్ఠ శుద్ద ద్వాదశిని దశహరా అంటారు. ఇది దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగిన తిథి. ఈరోజు నది స్నానాలు చేయాలి. అలాంటి అవకాశంలేనప్పుడు ఇంట్లో స్నానమాచరించే సమయంలో గంగా దేవిని స్మరించడం ఉత్తమం. జ్యేష్ఠ పూర్ణిమను మహాజ్యేష్టి అంటారు. ఈ రోజున తిలలు దానం చేసిన వారికి ఆశ్వమేథయాగం చేసిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ మాసంలో గొడుగు, చెప్పులను అనాధలకు, నిర్భాగ్యులకు దానం చేసిన వారికి ఉత్తమగతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని విష్ణు పురాణం తెలిపింది. వామన ప్రీతికి విసనకర్ర, జల కలశం, మంచి గంధం దానం చేయాలి. ఈ పౌర్ణమినే ఏరువాక పున్నమి పేరుతో జరుపుకుంటారు. ఇది రైతుల పండుగ.. ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి, ఉరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్లి దుక్కి దున్నిస్తారు. వటసావిత్రి వ్రతం చేయనున్న మహిళలు జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత పదమూడో రోజున మహిళలు వటసావిత్రి వ్రతం చేసుకుంటారు. భర్తలు పది కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని మనసార కోరుకుంటూ ఈ పూజ చేస్తారు.


జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగినీ 'వైష్ణవ మాద్వ ' ఏకాదశి, సిద్ద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అనుకున్న పనులు నేరవేరుతాయి. ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు నీటిని త్యాగం చేసి ద్వాదశినాడు స్నానాదికాలు పూర్తిచేసి, బ్రాహ్మణులకు నీటితోపాటు సువర్ణదానం చెయ్యి. తర్వాత జితేంద్రియులైన బ్రాహ్మణులతో కలసి భోజనం చెయ్యి. శ్రీమహావిష్ణువు నాతో ' *ఏ మానవుడు నన్ను తలచి ఏకాదశి వ్రతం చేస్తారో వారు పాపాల నుండి విముక్తులవుతారు అని తెలియజేశాడు. జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రి ప్రదోష కాలంలో శివునికి అభిషేకం, బిల్వదళాలతో పూజిస్తే అకాల మృత‌్యుహరణం, యశస్సు కీర్తి, ఆరోగ్యం లభిస్తుంది. సూర్యుడిని ఆరాధించే 'మిథున సంక్రమణం' వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే 'ఏరువాక పున్నమి' ఈ మాసంలోనే పలకరిస్తుంటాయి. ఇక దాన ధర్మాలకు అవకాశమిస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదించే 'జ్యేష్ఠ పౌర్ణమి' శ్రీ మహా విష్ణువు ఆరాధనలో తరింపజేసే 'అపర ఏకాదశి' ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంది. ఏకాదశి వ్రతం చేసిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది. ఏకాదశి రోజు ఎవరైతే నీటిని కూడా తాగకుండా వుంటారో వారికి ఒక్కొక్క ఏకాదశికి కోటి సువర్ణ ముద్రలు దానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది.

అధ్యాత్మికజ్ఞానం

 *అధ్యాత్మికజ్ఞానం ఉంటేనే శాస్త్రాధ్యయన ప్రయోజనం* 


మూడు వాసనలు, లోక వాసన, శాస్త్ర వాసన, దేహ వాసనలు మనిషిని జనన మరణ చక్రంలో బంధించే బలమైన ఇనుప గొలుసుల వంటివి.   ఈ గొలుసులు మన నుండి తీసివేయబడినప్పుడే మనం ఆ రెంటి నుండి విముక్తి పొందగలము.   కాబట్టి, అటువంటి వాసనలను మనం ఎంతవరకు వృద్ధి చేస్తామో, మనం ఆ బంధాన్ని  అంతలా అభివృద్ధి చేస్తాము.   మనకు ఆ అనుబంధం నుండి విముక్తి కావాలంటే, మనం ఈ వాసనలను వదిలించుకోవాలి.   దానికి గురు కృప, భగవంతుని అనుగ్రహం కావాలి.

శ్రీ విద్యారణ్యులు శాస్త్ర వాసనలు గురించి ఇలా చెప్పారు...

 *గురుకరుణారహితస్య* *శాస్త్రవ్యసనం వ్యసనమేవ భవతి* 

 అన్నారు.   "గురువు అనుగ్రహం లేని వానికి శాస్త్ర వాసనం దుర్భరం" అంటాడు.   ఎందుకంటే, ఆధ్యాత్మిక జ్ఞానం పొందకుండా కేవలం శాస్త్రాలు నేర్చుకుంటే ప్రయోజనం ఉండదు.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*