13, అక్టోబర్ 2020, మంగళవారం

రోడ్లు


 

గానం


 

ఒంటె డ్యాన్స్

 


వాన నీటీలొ


 

భారతదేశం

 # భారతదేశం అంటే ఏమిటి?#


భారతదేశం అంటే - 


1) వేద భూమి & కర్మ భూమి

2) సంస్కృతి 

3) సనాతన ధర్మం

4) దాన ధర్మం

5) ఆవులు 

6) యజ్ఞాలు & యాగాలు 

7) దేవాలయాలు & పుణ్య క్షేత్రాలు 

8) వేద పాఠశాలలు 

9) సాధువులు & గురువులు 

10) గంగా నది 

11) శివ అభిషేకం 

12) ప్రపంచానికి పూజ గది 

13) శాంతి 

14) వైవిధ్యంలో ఐక్యత 

15) వాక్ వైభవం

16) పుష్కరాలు & కుంభమేలలు 

17) జ్యోతిషశాస్త్రం / వాస్తుశాస్త్రం

18) ఆయుర్వేదం 

19) ఆదిశంకర ఆచార్య

20) శాస్త్రీయ నృత్యం /శాస్త్రీయ సంగీతం

21) రామాయణ, భారత, భాగవతాలు

22) దేవుని భజనలు & కీర్తనలు

23) ఉపవాసాలు 

24) సేవా భావన

25) అష్టాదశ శక్తి పీఠాలు

26) ద్వాదశ జ్యోతిర్లింగాలు

27) 108 వైష్ణవ దివ్యదేశాలు

28) భగవద్గీత

29) కుటుంబ వ్యవస్థ

30) ప్రేమ & ఆప్యాయతలు


భారతదేశం నా మాతృభూమి & మేరా భారత్ మహాన్.

హనుమ రాముని వద్దకు

పట్టాభిషేకం జరిగింది, శ్రీ రాముడు విశ్రాంతి గా కూర్చుని ఉన్నాడుహనుమ రాముని వద్దకువచ్చి ఇలా అంటున్నారు...


ప్రభూ!  లంకలో విభీషణుడు ఇంటికి వెళ్ళేంతవరకు , నాకు లంకలో అసలు మహాపురుషులు ఉంటారా నాకు కనబడతారా అనే సందేహం ఉండేది.


 ప్రభూ! భక్తులు, సాధువులు, సంత్ లూ కేవలం భరతభూమిలోనే ఉంటారనీ పృథ్విలో ఇంక ఎక్కడ ఉండరని అభిప్రాయం ఉండేది. కానీ లంకలో ఎంత వెతికినా సీతామాతను కనుగొనలేకపోయినవేళలో విభీషణుని సలహామేర తల్లిి దర్శనం కలిగిన తరువాత అనిపించింది స్వామి ఎవరినైతే ఎంత వెతికినా చూడలేకపోయానో ఆ తల్లి జాడ లంకలో ఒక సాధుపురుషుని ద్వారా తెలియజేయబడిందే.. 

బహుశా నా ప్రభువు నాకు ఈ సత్యాన్ని ఎరుకపరచడానికి పంపేడేమో అని అనుకున్నాను... 


అశోకవనం లో రావణుడు తీవ్రమైన క్రోధంతో సీతామాతను వధించేందుకు కత్తిదూసిన క్షణంలో ,

ఆ ఎత్తిన కత్తితో వాడి శిరస్సులు ఖండించి వాడిని అంతం చేయాలనే బలమైనకోరిక నాలో కలిగింది. కానీ అంతలోనే మండోదరి ఆ దుష్టుడి ని వారించి వాడినుంచి అమ్మని కాపాడిన ఆ దృశ్యం నన్ను మ్రాన్పడేటట్లు చేసింది.  ప్రభూ! ఎంతచక్కని అనుభవమిచ్చావు, అక్కడ కూడా మంచి వారి రూపం లో మండోదరి తల్లి ని చూపించావు,


నేనే  లేకపోతే సీతమ్మని ఎవరు రక్షించగలిగేవారనే భ్రమ కలిగేది.   చాలా మంది కి ఇటుువంటి భ్రమే కలుగుతుంది, నాకూడ కలిిగిిఉండేేది...


కానీ స్వామీ నీవు ఆ తల్లిని రక్షించడమేకాదు , ఆ పని స్వయం రావణుని పత్ని మండోదరి చేత చేయించేవు. 

దీంతో నాకు, స్వామీ నువ్వు ఎవరితో నీ పని చేయించిలనుకుంటావో వారి తో ఆ పని నెరవేర్చుకుంటావు. ఇందులో మా మహత్వమేమీలేదు. 


దేవా! త్రిజట తన స్వప్ననవృత్తాంతం తోటిరాక్షస స్త్రీలకు చెబుతూ లంక లోకి ఒక కోతి వస్తుందనీ, 

ఆ వానరం లంకని దహిస్తుందని చెప్పగా విని నేను చాలా చింతలో మునిగిపోయాను. ప్రభు శ్రీీరాముడు నాకు లంక దహించడం గురించి ఏమీ ఆదేశమివ్వలేదే కానీ ఇక్కడ త్రిజట ఇలా చెప్తోందే మరేం చేయాలి అని. రావణుడి ఆస్థానంలో రావణ సైనికులు ఆతని ఆజ్ఞ మేరకు నన్ను వధించేందుకు మీదకి ఉరికినపుడు విభీషణుడు వారించి దూతలను వధించడం నీతి కాదని అన్నకి నచ్చచెప్పడంతో నాకు నువ్వు నన్ను కాపాడడానికి ఆ రావణుని తమ్ముణ్ణే నియోగించేవని అర్ధమైంది. 


ఇంతలో నా ఆశ్చర్యం అవధులు లేేేనంతగా అయింది ...

రావణుడు తమ్ముని మాటమన్నించి నన్ను చంపకుండా నా తోకకి నిప్పు పెట్టమని భటులని ఆదేశించినపుడు...


లంకలో ఆ సాధ్వి త్రిజట చెప్పిన మాటలు ఈ విధంగా నిజమవుతున్నందుకు. లేకపోతే లంకని దహించడానికి కావలసిన బట్టలు , నెయ్యి అన్నీ నాకెలాగ సమకూరేవి తండ్రీ....


ఒక భక్తురాలి మాట నెగ్గించడానికి నువ్వు రావణునే ఉపయోగించుకొని కార్యం నడిపావు, అటువంటి ది నాచే చేయించుకోవటంలో ఆశ్చర్యం ఏమున్నది ప్రభూ! దీనిని పట్టి నేను నిమిత్త మాత్రుణ్ణి , మీ కార్యం మీరే నెరవేర్చుకుంటున్నారు, అని అర్థం అయింది, అందుచేత మనం జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే...

మన జీవితాలలో ఏం జరిగినా మనమేమి సాధించినా అది ఈశ్వర సంకల్పమే కానీ మన గొప్పతనమో మన సాధకత్వమో కాదు..


*అందుకని నేనే కనక లేకపోతే ఏమీజరగదు అనే భ్రమ ఎన్నడూ కలగకూడదు.*


     

***   *ఆంజనేయ స్వామి అంతటి మహాను భావులే అలా అనుకున్నప్పుడు.. మానవ మాత్రులం.. ఎగిరి పడుతూ ఉంటాము.. నా అంతటి వాడు లేడని.. నేను కాకపోతే ఎవరు చేయగలరని.*.

స్తోత్రానికి మూలం ఏమిటి ?

 శివతాండవ స్తోత్రానికి మూలం ఏమిటి ?


రావణుడు శివుని గొప్ప భక్తుడు, వారిద్దరి గురించి ఎన్నో కధలు ఉన్నాయి. ఒక భక్తుడు గొప్పవాడు కాకూడదు, కానీ రావణుడు గొప్పవాడయ్యాడు. దక్షిణం నుండి ఎంతో దూరం ప్రయాణించి కైలాసానికి చేరుకున్నాడు – అంతదూరం నడిచి రావడం మీరు ఊహించుకోండి – శివుని పొగుడుతూ #పాటలు పాడటం మొదలుపెట్టాడు. అతని దగ్గర ఉన్న ఢంకాను వాయిస్తూ 1008 పద్యాలని అలా ఆశుకవిత్వముగా వినిపించాడు, అదే #శివ తాండవ స్తోత్రం. 


శివ తాండవ స్తోత్రం – #తెలుగు పద్యాలు ఇంకా తాత్పర్యములు


జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే

గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |

డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం

చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || 1 ||


జటాఝూటం నుండి ప్రవహిస్తున్న గంగాజలంతో అభిషేకించబడుతున్న మెడతో – మెడలోని సర్పహారము మాలలా వ్రేలాడుచుండగా – చేతిలోని #ఢమరుకము ఢమ ఢమ ఢమ ఢమ యని మ్రోగుచుండగా శివుడు ప్రచండ తాండవమును సాగించెను. ఆ తాండవ నర్తకుడు- #శివుడు – మాకు సకల శుభములను ప్రసాదించుగాక.


జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-

-విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని |

ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే

కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || 2 ||


శివుని జడలు నీటిని ఒడిసిపట్టే లోతైన బావిలా ఉండగా, అందులో సురగంగ వేగంగా సుడులు తిరుగుచున్నది. అప్పుడు దానిలో బారులుతీరి ప్రకాశించే తరంగాలతో ఆయన శిరము మిరిమిట్లుగొలుపుతుంది. అలాంటి మహాదేవునియందు – నుదుటి భాగమున ధగ ధగ మెరుస్తున్న అగ్నిని, శిరస్సుపై బాలచంద్రుని ధరించియున్న శివునిపట్ల నాకు గొప్ప శ్రద్ధ కలదు.


ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర

స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే |

కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది

క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని || 3 ||


ఎవరి మదిలోనైతే తేజోవంతమైన విశ్వంలోని జీవులు వర్ధిల్లుతాయో, ఎవరు పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవికి తోడై ఉంటాడో,ఎవరు- తన కరుణా కటాక్షములచే ఎంతటి ప్రమాదాన్ని అయినా అడ్డుకోగలడో, ఎవరు అంతటా విరాజిల్లుతున్నాడో, ఎవరు ముల్లోకములను వస్త్రాలుగా కప్పుకుని ఉన్నాడో – అట్టి పరమ శివుని యందు నా మనస్సు రమించుగాక!


జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా

కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే |

మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే

మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || 4 ||


సర్వ దిక్కులను పాలించే దేవతల చెక్కిళ్ళపై ఎర్రని కాంతులను విరజిమ్మేవిధంగా ప్రకాశించే మణిని పడగలపై ఉంచుకున్న సర్పమును చుట్టుకుని, మదపుటేనుగు చర్మంతో చేయబడిన అందమైన ఉత్తరీయమును భుజముపై ధరించి,సర్వ ప్రాణులకు సమ న్యాయం చేసే, భూతనాథుడైన పరమ శివునియందు నా మానస్సు మహానందభరితమై వర్ధిల్లుగాక!


సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర

ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః |

భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక

శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః || 5 ||


చంద్రుని తలపై కిరీటంగా కలవాడు, ఎర్రని సర్పమాలతో కేశాలను బిగించి ముడివేసిన వాడు, ఇంద్రాదిదేవతల సిగదండలలోని పువ్వుల పుప్పొడితో ధూళి దూసరమైఉన్న నల్లని పాదపీఠముగల వాడు అయిన పరమేశ్వరుడు మాకు తరుగని సిరులను కరుణించుగాక!


లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా-

-నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ |

సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం

మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః || 6 ||


ఏది- ఇంద్రాది దేవతలచే మ్రొక్కబడుతుందో, ఏది-చంద్రరేఖతో శోభాయమానంగా వెలుగుతోందో, అటువంటి నుదుటిని కలిగి, దానియందు ప్రజ్వరిల్లే అగ్గిరవ్వల సెగలతో ఎవరు, మన్మథుని హరించాడో, అటువంటి పరమశివుని యొక్క చిక్కులుపడ్డ జటల నుండి సర్వ సంపత్కరమైన సిద్ధులు మాకు అనుగ్రహింపబడు గాక!


కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-

ద్ధనంజయాధరీకృతప్రచండపంచసాయకే |

ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక-

-ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ || 7 ||


విశాల నుదుటి భాగమున ధగ ధగ మనే మహా అగ్నిజ్వాలలతో ప్రచండుడై, మన్మధుని ఆహుతియొనర్చి, పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవి యోక్క కుచాగ్రములపై, మకరికాపత్రరచనా శిల్ప నైపుణ్యమును ప్రదర్శించు మూడుకన్నుల వేలుపు స్వామిపై నా మనస్సు లగ్నమై వర్ధిల్లుగాక!


నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-

కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః |

నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః

కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః || 8 ||


సర్వ జగత్తు యొక్క భారాన్ని తనపై ఉంచుకున్నవాడు, చంద్రుని ధరించి శోభించేవాడు, సురగంగను తనయందు కలవాడు, కారు మబ్బులు చెలరేగి చుట్టుముట్టిన – #అమావాస్య నాటి అర్ధరాత్రమందలి చిమ్మ చీకట్లను ముద్దగా చేసి ఇక్కడ బంధించినారా , అన్నట్టున్న నల్లని కంఠం కలవాడు అయిన #మహాదేవుడు మాకు సకల సిరులను కరుణించుగాక!


ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-

-విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్ |

స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం

గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే || 9 ||


వికసించిన నల్లకలువ పూల మధ్య మూల భాగం ఎంత నల్లని కాంతిని విరజిమ్మునో – అంత నల్లదనముతో ప్రకాశించు కంఠము గలిగి – మన్మథుని హరించినవాడు – త్రిపురములను సంహరించినవాడు – భవబంధ #హరుడు- సంసారహారి – గజదనుజారి – అందకాసురుని చీల్చి చెండాడిన శూలపాణి – యముడిని అదుపుచేసిన వాడు అయిన ఆ శివుడికి, నేను మ్రొక్కెదను.


అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ

రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్ |

స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం

గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే || 10 ||


సర్వమంగళ కళావిలాసములతో, కదంబ పూల నుండి వచ్చే తేనెల గుభాళింపులకు, గండుతుమ్మెదవలె ఆసక్తుడై చెలగు ప్రభువు- మన్మథుని హరించినవాడు – త్రిపురములను సంహరించినవాడు – భవబంధ హరుడు- సంసారహారి – గజదనుజారి – అందకాసురుని చీల్చి చెండాడిన శూలపాణి – యముడిని అదుపుచేసిన వాడు అయిన ఆ నటరాజుకి నేను మ్రొక్కెదను!


జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-

-ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ |

ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ

ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః || 11 ||


వేగంగా చరిస్తూ, సర్పములు చేసే బుసల శ్వాసలకు, మరింతగా రాజుకుని ఎగసిపడే అగ్ని కీలలతో ఉన్న నుదురు గల రుద్రునకు, ధిమి, ధిమి అను మద్దెల సమున్నత మంగళ ధ్వనులకు తగినట్లుగా అడుగులువేయుచు ప్రచండముగా తాండవించు నటరాజునకు – శివునకు జయమగుగాక!


దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-

-గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః |

తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః

సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే || 12 ||


కటికనేలను, హంసతూలికా తల్పమును – సర్పమును, చక్కని ముత్యాల దండను – మహారత్నమును, మట్టిబెడ్డను – గడ్డిపరకను, కలువకంటిని – సామాన్య ప్రజలను, సకల భూమండలాధీశుడైన మహారాజును – మిత్ర పక్షమును, శత్రుపక్షమును అన్నింటినీ సమప్రవృత్తితో తిలకించుచున్న సదాశివునికి నేనెప్పుడు సేవ చేసుకుంటానో కదా!


కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్

విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ |

విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః

శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ || 13 ||


గంగానది ఒడ్డున – ఆశ్రయం ఏర్పాటుచేసుకుని, చిత్తమున గల దురాలోచనలను విడిచి, చంచల దృష్టిని స్థిరంగా చేసి, నుదుటిమధ్య నా మనసు నిలిపి, శివనామ మహామంత్రమునుచ్చరించుచు తరించే మహాభాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో కదా!


ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం

పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్ |

హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం

విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ || 14 ||


నిత్యము ఈ స్తోత్రము చదివినను, అర్ధము స్మరించినను, వివరించి పలికినను, మానవుడు శుద్ధుడగును. వాడు మహా శివ భక్తుడగును. #శివశక్తి సంపాదనకు వేరుదారి లేదు. శరీరధారుల అజ్ఞానము సదా #శివ ధ్యానముచే మాత్రమే నశించును.


పూజావసానసమయే దశవక్త్రగీతం యః

శంభుపూజనపరం పఠతి ప్రదోషే |

తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం

లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః || 15 ||


ప్రదోషకాలమున శివపూజా పరిసమాప్తియందు ఎవడీ శివార్చనాపరమైన రావణకృతమైన స్తుతిని పఠించునో వానికి శివానుగ్రహముచే రథగజతురంగములతో సదా సుప్రసన్నయైన స్థిరసంపదలు సిద్ధించును.

*రోగ నిరోధక మంత్రాలు:*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


            *రోగ నిరోధక మంత్రాలు:*

                     ➖➖➖✍


 *రోగ నిరోధక మంత్రాలు కూడా ఉంటాయా ఇప్పటి రోజుల్లో అనీ అనుకోవచ్చు..!* 

 *కానీ నిజం..!* 


 *రోగ నిరోధక మంత్రాలు కచ్చితంగా* 

 *ఉన్నాయి. అసలు మంత్రం అనేది ఎలా నిర్మించ బడినది?* 

 *ఒకదానికి ఒకటి ఒక ఫార్ములా లాగా* 

 *పనిచేసే విధంగా నిర్మించ బడినది.* 


మంత్రం చదివేటప్పుడు ఆ శబ్దనికి ప్రతిస్పందించే ప్రకృతిలోని కొన్ని శక్తులు 

మన శరీరాన్ని ఆకర్షిస్థాయి..

అప్పుడు మనకు రోగ నిరోధక శక్తి 

మనో ధైర్యం, బలం లభిస్తుంది..


ఒకప్పుడు వైద్యులు ఔషధంతోపాటు 

ఒక మంత్రం కూడా ఇచ్చే వాళ్ళు. ఔషధం సేవించే టప్పుడు ఆ మంత్రాన్ని చదివి ఔషధం తీసుకోమని చెప్పే వాళ్ళు.


తేలు మంత్రం..పాము మంత్రంతో ప్రాణాలు నిలుపుకున్న పల్లె ప్రజలు ఉన్నారు.

ఇప్పుడు అలాంటి కొన్ని మంత్రాల గురించి తెలుసుకుందాము...


*1. నారాయణీయం:*

(ఇది గురువాయూరు కృష్ణుడి గురించి 

రాసిన వేయి పద్యాల అద్భుతమైన వర్ణన) 

ఈ శ్లోకాలు జబ్బుతో ఉన్న వారు కానీ,

లేక వారి కోసం ఎవరు చదివినా భయంకరమైన ప్రాణాపాయ జబ్బులు, కాన్సర్, దీర్ఘకాలిక రోగాలు నశించి పోతాయి.


ఒకసారి ఆ పుస్తకం తెచ్చుకుని ప్రయత్నం చేయండి, కృష్ణుడి పైన పద్యాలు వాటి అర్థాలు ఎంతో భక్తి భావనతో భావోద్వేగాలు కలిగిస్తుంది... 

చక్కటి ఆరోగ్యం ఆలోచన కలిగిస్తుంది..


*2. వైద్యనాద్ స్త్రోత్రం:*

శివయ్య గొప్ప వైద్యుడు కూడా!   

పురాణకాలం నుండి వైద్యంకోసం శివుని ఆరాధించేవారు. చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్ 

తో బాధపడే వారు, ప్రదోష కాలంలో 

ఈ వైద్యనాద్ స్త్రోత్రం, శివ స్త్రోత్రాలు పారాయణం ప్రతి రోజు చేయాలి. సోమవారంనాడు శివునికి వాయుప్రతిష్ఠ చేసిన లింగానికి వారి చేత్తో అభిషేకం చేయాలి. ఆరుద్ర నక్షత్రంరోజు ప్రదోష 

కాలంలో మట్టితో శివలింగాన్ని చేసుకుని, బియ్యం పిండి, గంధం, విభూది వీటితో 

ఒక్కో దానితో ఓం నమః శివాయ అని 108 సార్లు అర్చన చేసి, నైవేద్యం పెట్టి వైద్యనాద్ స్త్రోత్రం పఠించి హారతి ఇవ్వాలి.


కాసేపు ధ్యానం చేసి ప్రసాదం భక్తిగా స్వీకరించాలి.. సంకల్పంతో మీకు ఆరోగ్యం ప్రసాదించమని వేడుకోవాలి, ప్రసాదం తినేటప్పుడు మీకు మంచి ఆరోగ్యం ప్రసాదించమని కోరుకుని తినాలి.. 

తర్వాత మీరు చేసిన మట్టి శివలింగాన్ని ప్రవహిస్తున్న నీటిలో కలపాలి 

చెరువు అయినా పర్వాలేదు... 

అలా నిమర్జన చేయడంలోనే మీకు 

మీ బాధ నుండి చాలా ఉపశమనం లభిస్తుంది.. 

ఇలా ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజు చేస్తూ రావాలి 

మీకు పూర్తి ఆరోగ్యం లభించాక శివాలయంలో

అభిషేకం చేయించండి...


*3.* చిన్న చిన్నవి తరచూ వచ్చే జ్వరాలు, 

కీళ్ల నొప్పులు, ఊబకాయం, తిన్నది అరగక పోవడం, వంటికి పట్టకపోవడం, తరచు నీరసం లాంటి కారణం తెలియని రోగాలు మంచి ఉపాయం హనుమంతుడి గుడి సందర్శన, హనుమాన్ చాలీసా రోజూ చదవడం..!


*4.* రాహుకాలం లో దుర్గ దేవి, సుబ్రహ్మణ్యస్వామి , కాలభైరవ స్వామి శ్లోకములు చదువుతూ ఉన్నా అకారణంగా వచ్చే భయాలు, నిద్రలో ఉలిక్కి పడటం, తరచు క్రిందపడటం ఇలాంటి బాధలు ఉండవు,.


*5.* ఏ ఔషధం సేవిస్తున్నా కూడా

"ఓం నమో భగవతే వాసుదేవాయా " అని సేవిస్తే... ఆ మందు మీకు బాగా పనిచేస్తుంది.!


*6.* మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి ఆలోచన వస్తుంది. మంచి జీవితం ఉంటుంది.

ఎవరికీ భారం కాకుండా ప్రాణం పోవాలి చివరి రోజుల్లో... అంటే రోజూ ఐదు తులసి ఆకులు తినండి, 

కాసేపు తులసికి దగ్గరగా కూర్చోండి.

తులసి మొక్క ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేస్తుంది, 

రేఖీ, విశ్వప్రాణ శక్తిని ఆకర్షించే గుణం తులసికి ఉంది , ఇలాగే ఆవుకి కూడా.


అవకాశం ఉన్న వారు కాసేపు గోసాలలో గడపండి..


వైద్యం చేయించుకుంటూ ఇవి పాటిస్తే 

త్వరగా గుణం ఉంటుంది.

మానవ ప్రయత్నం మానకూడదు.

దైవ బలం వదులు కోకూడదు.✍



                     🌷🙏🌷


 *🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏* 



🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ప్రవచనములు


 

తల్లిపాలలో కలుగు దోషాలు - శిశువుకి కలుగు ఉపద్రవాలు - 2 .

 తల్లిపాలలో కలుగు దోషాలు - శిశువుకి కలుగు ఉపద్రవాలు - 2 . 


   తల్లిపాల విశిష్టత గురించి అంతకు ముందు పోస్టు నందు వివరించాను. ఇప్పుడు మీకు తల్లిపాలు ఎందువలన దోషము పొందుతాయో మీకు వివరిస్తాను. 


 తల్లిపాలు దోషము పొందుటకు కారణాలు - 


   ముందు తిన్న ఆహారం జీర్ణం కాకమునుపే తల్లి మరలా భుజించడం , తేలికగా జీర్ణం అవ్వని పదార్ధాలు భుజించటం , విరుద్ద ఆహారాలు భుజించడం , ఉప్పు , పుల్లటి , చేదు , పదార్దాలు అతిగా సేవించటం , చెడిన ఆహార సేవనం , అతిగా దుఃఖం పొందుట , రాత్రి యందు నిద్రపోకపోవడం , తీవ్ర ఆలోచన కలిగి ఉండటం , మలమూత్ర వేగాలు నిరోధించుట , బెల్లముచే చేయబడు పరమాన్నం , పులగము , పెరుగు , చేపలు , మాంసపదార్ధాల సేవనం , పగలు నిద్రించుట , మద్యపానం , దెబ్బలు తగిలించుకొనుట , కోపము , ఇతర వ్యాధులు . 



                పైన చెప్పిన కారణాల వలన శరీరము నందు దోషము ప్రకోపించి స్తన్యము వాహకములు అగు సిరలు చెడి స్తన్యము ( తల్లిపాలు ) దోషము పొంది 8 రకముల దోషాలు శిశువుకు కలిగించును . వాతము వలన స్తన్యము దోషము పొందిన రుచి లేకుండా ఉండటం , నురుగుతో కూడి రూక్షముగా ఉండును. పిత్తము వలన దోషము పొందిన తల్లిపాల రంగు మారును . దుర్గన్ధమ్ కలిగి ఉండును. కఫము వలన దోషము పొందిన తల్లిపాలు జిడ్డుగా ఉండి చేదుగా ఉండు లక్షణాలు కలిగి ఉండును. 


                 వాతపిత్తకఫాల వలన దోషములు పొందిన పాలు తాగడం వలన శిశువుకు అనేక రకాలైన జబ్బులు సంభవించును . శిశువుకు ఎటువంటి దోషాలు సంభవించునో తరవాతి పోస్టునందు సంపూర్ణముగా వివరిస్తాను . 


  గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

రెడ్ అలర్ట్

 తెలంగాణవ్యాప్తంగా రెడ్ అలర్ట్

తెలంగాణవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈ మేరకు వాతావరణ విభాగం అధికారి రాజారావు హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో...

వాతావరణం అలెర్ట్


Red alert for Telangana state: తెలంగాణవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈ మేరకు వాతావరణ విభాగం అధికారి రాజారావు హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఆయనంటున్నారు. కేవలం భారీ వర్షాలే కాదు.. బలమైన ఈదురుగాలులు వీస్తాయని, వీటి తీవ్రత కారణంగా చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకూలే స్థాయిలో వుంటుందని ఆయన అంఛనా వేస్తున్నారు.


తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం వుందని రాజారావు తెలిపారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం వుందన్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలే ప్రమాదం వుందని, తీవ్రమైన స్థాయిలో పంట నష్టం జరిగే అవకాశం వుందని ఆయన వివరించారు. రిజర్వాయర్లు ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా వుండాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.


మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలుస్తోంది. రాజధాని హైదరాబాద్ కూడా భారీ వర్షాల కురిసే జోన్‌లో వుందంటున్నారు.

##న్యూస్ అప్డేట్

ಚಾಮುಂಡಿ చాముండి

 ಚಾಮುಂಡಿ ಬೆಟ್ಟದ ಶ್ರೀ ಚಾಮುಂಡೇಶ್ವರಿ ದೇವಾಲಯದ ಅತಿ ವಿಶಿಷ್ಟ ಪ್ರಾಚ್ಯವಸ್ತುಗಳಲ್ಲಿ ಈ ಪಾಂಚಜನ್ಯವೂ ಒಂದು. ಇದಕ್ಕೆ ಪಾಂಚಜನ್ಯ ಎಂದು ಹೆಸರು ಬರಲು ಕಾರಣ ಇದರಲ್ಲಿರುವ ಐದು ಶಂಖಗಳ ಆಕೃತಿಯಿಂದ. ಇದನ್ನು ಶ್ರೀ ಚಾಮುಂಡಿ ತಾಯಿಯ ಅಭಿಷೇಕಕ್ಕೆ ಬಳಸಲಾಗುತ್ತದೆ. ಈ ಶಂಖದಲ್ಲಿ ಅಭಿಷೇಕ ಮಾಡಿದರೆ ಸಾಕ್ಷಾತ್ ಶ್ರೀ ಕೃಷ್ಣನ‌ ಪಾಂಚಜನ್ಯದಲ್ಲಿ ಅಭಿಷೇಕ ಮಾಡಿದಂತೆ ಎನ್ನುವ ನಂಬಿಕೆ ಇದೆ. ಈ ಶಂಖ ಸಿಗುವುದು ಅತ್ಯಂತ ವಿರಳ. ಈ ಶಂಖಕ್ಕೆ ಚಿನ್ನದ ಕವಚ ಮಾಡಿಸಲಾಗಿದೆ. ಚಿನ್ನದಲ್ಲಿ ಅತ್ಯಂತ ಸೂಕ್ಷ್ಮ‌ ಕುಸುರಿ ಕಾರ್ಯಗಳಿಂದ ಅಲಂಕರಿಸಲಾಗಿದೆ. ಶಂಖದ ತುದಿಯಲ್ಲಿ ಪಚ್ಚೆ, ಮುತ್ತು, ಹವಳ ಇತ್ಯಾದಿ ಬೆಲೆ ಬಾಳುವ ರತ್ನಗಳಿಂದ ಅಲಂಕರಿಸಲಾಗಿದೆ. ಈ ಶಂಖವನ್ನು ಮೈಸೂರು ರಾಜರಾದ ಶ್ರೀ ಮುಮ್ಮಡಿ ಕೃಷ್ಣರಾಜ ಒಡೆಯರ್ ಅವರು ದೇವಾಲಯಕ್ಕೆ ನೀಡಿದ್ದಾರೆ. ಇದನ್ನು ನೋಡುವ ಭಾಗ್ಯ ನನ್ನದಾಯಿತು.

,...

Chamundi

 The Chamundeshwari Temple on the Chamundi Hill is one of the most unique antiquities of the temple. It is called Panchajanya because of the five cones. It is used for the anointing of Sri Chamundi's mother. It is believed that the consecration of this conch is anointed in the sacrament of Lord Krishna. This cone is extremely rare. The conch is made of gold. Gold is adorned with fine art. At the end of the conch is adorned with emeralds, pearls, corals, etc. The shrine was handed over to the temple by Sri Mummadi Krishnaraja Wodeyar, the King of Mysore. I was lucky to see this

చాముండి


 చాముండి కొండపై ఉన్న చాముండేశ్వరి ఆలయం ఈ ఆలయంలోని అత్యంత పురాతనమైన పురాతన వస్తువులలో ఒకటి. ఐదు శంకువులు ఉన్నందున దీనిని పంచజన్య అని పిలుస్తారు. ఇది శ్రీ చాముండి తల్లి అభిషేకం కోసం ఉపయోగిస్తారు. ఈ శంఖం యొక్క పవిత్రం శ్రీకృష్ణుని మతకర్మలో అభిషేకం చేయబడిందని నమ్ముతారు. ఈ కోన్ చాలా అరుదు. శంఖం బంగారంతో తయారు చేయబడింది. బంగారాన్ని లలితకళతో అలంకరించారు. శంఖం చివరలో పచ్చలు, ముత్యాలు, పగడాలు మొదలైన వాటితో అలంకరించబడి ఉంటుంది. ఈ ఆలయాన్ని మైసూర్ రాజు శ్రీ ముమ్మడి కృష్ణరాజ వడయార్ ఆలయానికి అప్పగించారు. ఇది చూడటం నా అదృష్టం




.

దైవాన్ని కోరిక ఎలా కోరాలి*

 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*దైవాన్ని కోరిక ఎలా కోరాలి* 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏


🌻 *నువ్వు బతికి ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు నీ సంపదతో చేయాలి అని కోరుకోవాలి, అంటే ఎప్పుడూ నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం అంటే ఎప్పటికీ నీకు సంపాదన ఉంటుంది.* 


🌻 *నా ఇంట్లొ దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది.* 


 🌻 *నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి అంటే నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు..* 


 🌻 *నా ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి అంటే నీకు అనుకూల వతి అయిన ధర్మపత్నీ (పతి) భాగస్వామి అవుతుంది.* 


🌻 *నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి అంటే నీకు సంపూర్ణ మైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం..* 


🌻 *భాగవతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి అంటే నీకు సమాజంలో తగిన గౌరవం మంచి పేరు రావాలి అని కోరుకోవడం...* 


 🌻 *కుటుంబం అంతా సంతోషం గా క్షేత్ర దర్శనంకి రావాలి అని కోరాలి అంటే నువ్వు ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబంలో అన్యోన్యంగా ఉంటేనే జరుగుతుంది ఇంక ఏమీ కావాలి జీవితానికి..* 


🌻 *చివరిగా నేను పండు ముత్తైదువుగా సంతోషంగా కాలం చేయాలి అని కోరుకోవాలి అంటే భర్తకు సంపూర్ణ ఆయువు ఆరోగ్యం కోరుకోవడం..* 


🌻 *మనము అడిగే కోరిక ఎలా ఉంటే ఆ దైవం కూడా ఆ విధంగా అనుగ్రహిస్తుంది.*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

గాయత్రి శక్తి

 🌷గాయత్రి శక్తి🌷(శాప విమోచన మంత్రం)


చాలా కాలం క్రితం ఒక కలెక్టర్ గారి కి కార్య నిర్వహణలో ఒకరితో గొడవ జరిగింది వారు కక్ష కట్టి ఎలాగైనా అతన్ని చంపాలి అని ఒక క్షుద్ర మంత్రికుడిని ఆశ్రయించారు.. వారిపైన ప్రయోగం చేశారు.. ఆ క్షుద్ర శక్తి కలెక్టర్ గారి ఇంటి పైకి వచ్చింది అయితే ఆ ఇంటి గుమ్మం ముందు తలుపుకి అడ్డంగా ఒక గుమ్మస్తా నిద్రపోతున్నారు అతన్ని దాటి ఆ క్షుద్ర ప్రయోగ శక్తి ఇంట్లోకి ప్రవేశించ లేక పోయింది చాలా ప్రయత్నాలు చేస్తూ వికృతంగా అరుపులు గాలి అక్కడ వస్తువులు చిందరగా గాలికి ఎగురుతున్నాయి అక్కడే నిధురిస్తున్న ఆ బ్రాహ్మణుడు లేచి చూసి పరిస్థితి అర్తం చేసుకుని భయపడకుండా కలెక్టర్ గారిని బయటకు రాకండి అని చెప్పి వారించారు వారికి ధూళితో సుడి గుండాలి తిరుగుతూ కనిపిస్తుంది లోపలి నుండి.. ఈ గుమస్తా గా ఉన్న బ్రాహ్మణుడు గాయత్రి ఉపాసకుడు నిత్యం గాయత్రి జపిస్తూ ఉంటారు వారి గాయత్రి జప శక్తి ముందు ఏ దుష్ట శక్తి ఏమీ చేయలేక వారిని దాటి రాలేక దాని ప్రయోగం చేసిన వారి వద్దకే తిప్పి కొట్టింది ఇది కృత్యా ప్రయోగం.. దాని ఉపసంహరణ అప్పటికప్పుడు ప్రయోగించిన వాడు కూడా చేయలేడు అటువంటిది ఆ గాయత్రి శక్తి తట్టుకోలేక ప్రయోగించిన వారిని మింగింది కృత్య ప్రయోగం అంతే ఎవరి పైకి అయినా ప్రయోగించి నప్పుడు అది వారు తిప్పి కొట్టగలిగితే పంపిన వారినే మింగుతుంది.. ఇదంతా ఆశ్చర్యంగా చూసిన ఆ కలెక్టర్ బయటకు వచ్చే సరికి ఆయన జంధ్యం పట్టుకుని ఆపకుండా గాయత్రి జపిస్తూనే ఉన్నారు వెంటనే అతని కాళ్ళ పైన పడి గుమస్తాగా చూసి నందుకు క్షమాపణ అడిగారు అతను నిజాయితీగా అయ్యా ఇది నా వృత్తి నా కర్తవ్యం.. నా ఉద్యోగ ధర్మం ఇందులో మీరు చేసింది ఏముంది అని వారిని లోనికి పంపి వారి జపం కొనసాగించారు గాయత్రి శక్తిని కళ్లారా చూసిన కలెక్టర్ కూడా గాయత్రి ఉపాసన మొదలు పెట్టారు ఇది కథ కాదు యదార్థంగా జరిగిన సంఘటన... ఇది ఒక ఉదాహరణ..


ఇంకో జరిగిన విషయం తెలుసుకుందాము.. ఒక బ్రాహ్మణుడు గాయత్రి నిత్య ఉపాసకుడు వారికి ఒక ప్రత్యంగిరా కృత్యా ప్రయోగం చేసే ఉపసకుడితో పరిచయం ఏర్పడింది కొద్ది రోజులు స్నేహం బాగానే నడిచింది తర్వాత మనస్పర్థలు మాట మాట పెరగడం నువ్వెంత అంటే నువెంత అనుకోవడం నిన్ను ఏమీ చేస్తానో చూడు అని ఆ గాయత్రి ఉపాసకుడి పైన కృత్యా ప్రయోగం చేసాడు అదే రాత్రి కృత్య వచ్చి గుండెల పైన అదిమి నెత్తురు కక్కేలా తొక్కి ప్రాణం పోయింది ఈయన గాయత్రి ఉపాసకుడు కానీ తనకు తాను రక్షించు కోలేక పోయారు..


ఇప్పుడు ఈ రెండు కథలు విన్నారు కదా యదార్థంగా జరిగినవే వాస్తవానికి గాయత్రి ఉపసాకులు పైన ఏ మంత్రం ప్రయోగం చెడు జరగదు మరణించిన వ్యక్తి కొన్ని లక్షల్లో జపం చేస్తూ ఉండే గాయత్రి ఉపాసకులు నిజానికి ప్రయోగించిన వాడి ప్రాణం పోవాలి కానీ ఇతనికే ముప్పు కలిగింది.. దీనికి కారణం ఏంటి ఎక్కడ పొరబాటు జరిగింది..


ఇద్దరూ గాయత్రి ఉపసాకులు అయిన ఒకరికి పనిచేసి ఒకరికి ఆ ప్రభావం చూపలేదు అంటే కారణం గాయత్రి జపం సాధనకు ముందుగా శాప విమోచన మంత్రం జపించి గాయత్రి జప సాధన చేయాలి.. అది నియమం అది తెలియక కొందరు కొన్ని లక్షల్లో జపం చేస్తూ ఉంటారు.. ఆ శాప మంత్రాలు ఇక్కడ ఇస్తాను మీరు అనుభవం గల గాయత్రి ఉపాసకులను కలిసి ఈ శాప విముక్తి విధానం. కూడా గ్రహించి ఆ విధంగా ముందు ఈ శాంతి జపము చేసి తర్వాత గాయత్రి చేయండి ఆ తల్లి మంత్ర శక్తి ఏంటో అనుభవ పూర్వకంగా చూడండి..


1.బ్రహ్మశాపవిమోచన మంత్రములు


 అస్య శ్రీ బ్రహ్మశాపవిమోచన మంత్రస్య నిగ్రహాను గ్రహకర్తా . ప్రజాపతి ఋషిః | కామదుఘా గాయత్రీ ఛందః | బ్రహ్మశాప విమోచనీయ గాయత్రీశక్తి:ప్రజా సవితాదేవతా | బ్రహ్మ శాపవిమోచనార్దే జపే వినియోగః


*మంత్రము* : సవితుర్భహ్మామేత్యుపాసనాతద్ర్బహ్మవిదో విదుస్తా ప్రయతంతిధీరాః | సుమనసావాచాయ మాగ్రతః బ్రహ్మశాసాద్విముక్తాభవ.


2.విశ్వామిత్ర శాప విమోచన మంత్రము 


అస్య శ్రీ విశ్వామిత్ర శాపవిమోచన మంత్రస్య నూతన సృష్టికర్తా విశ్వామిత్ర ఋషిః వాగ్గుఘాగాయత్రీఛందః | భుక్తిముక్తి ప్రదావిశ్వామిత్రానుగృహీతా గాయత్రీ శక్తిః | సవితా దేవతా | విశ్వామిత్రశాపవిమోచనార్దే జపే వినియోగః ||


*మంత్రము* తత్వాని చాంగేష్వగ్ని చితోధియాంసః | త్రిగర్భాంయదుద్భవాందేవాశ్శోచిరే ఎవ్వసృష్టించాం కళ్యాణీం సృష్టికరీం ప్రపత్యయమ్మ ఖాన్నిసృతో వేదగర్భః || ఓం గాయత్రీత్వం విశ్వామిత్ర శాపాద్విముక్తాభవ ||


3.వసిష్ట శాప విమోచన మంత్రము

వసిష్ట శాపవిమోచన మంత్రస్య, వసిష్ఠఋషిః

విశ్వోద్భవా గాయత్రీ ఛందః |

వశిష్టాను గ్రహీతా గాయత్రీశక్తిః | సవితాదేవతా | వసిష్ఠ శాప విమోచనార్దే జపే : వినియోగః 


*మంత్రము* : తత్వానిచాంగేష్యగ్ని చితోధియాంసః, ధ్యాయనివిష్ణోరా యుధానిబిభ్రతే జనానతో శో పరమంచశశ్వత్ | గాయత్రీ మాపాచ్చుర సుత్త మంచధామ | ఓం గాయత్రి వసిష్ట శాపాద్విముక్తాభవ 


'అహ మార్కం మహజ్యోతి రర్కజ్యోతి రహం శివః | 

ఆత్మజ్యోతిహం శుక్తం శుక్ల జ్యోతిర సోహమోం | 

'అహో విష్ణు మహేశేశే దివ్యసిద్దే సరస్వతి |

'అజరే అమరేచైవ దివ్యయోనే నమోస్తుతే ||


ఈ బ్రహ్మశాప, విశ్వామిత్రశాప, వసిష్ఠ శాప మంత్రములను ముందుగా జపము చేసి, శాపనివృత్తమైన పిమ్మట గాయత్రీ మంత్రమును యధాశాస్త్రీయముగా పురశ్చరణము చేసిన యెడల గాయత్రీ మంత్ర యంత్రములు తప్పక సిద్దించును. పూర్వమొకప్పుడు గాయత్రీదేవి మంత్రమునకు బ్రహ్మ, విశ్వామిత్రుడు, వసిష్టుడు శాపము నిచ్చియున్నారు. కనుక ఈ శాపవిమోచన మంత్రములను జపము చేయకుండా గాయత్రీ మంత్రమును

"శత లక్షం ప్రజాస్వాపి గాయత్రీ నచసిద్ధ్యతి” 

అను న్యాయాను సారము నూరు లక్షల జపించినను ఫలించదు అను రహస్యమును అందరూ తెలుసుకోవాలి..


🙏ఓం శ్రీ మాత్రే నమః🙏


ఇలాంటి వన్నీ తెలుసుకోకుండా చేయాకుడదు అనే కొన్ని మంత్రాలు సాధనలు ఉపదేశం లేకుండా చేయాకుడదు అంటారు.. అయితే ఈ రెండు కథలు తెలిసిన తర్వాత దీనికి కారణం తెలుసుకోవాలి అని ఎంతో ప్రయత్నం చేసాను ఎందరో గాయత్రి జపిస్తున్న వాళ్ళాను అడిగాను వాళ్లకు కూడా ఇది తెలియలేదు చాలా మంది ఇది చేయకుండానే జపం మొదలు ఐపోతుంది . ఒక సంస్కృత గ్రంధంలో గాయత్రి ఉపాసన విధానంలో ఈ విషయం వివరంగా లభించింది.. జప క్రమంలో ఒక్కో బీజాన్ని ఎలా జపం చేయాలి అలా 24 బీజాలతో సాధన ఎలా చేయాలి తర్వాత పూర్తిగా కలిపి ఎలా చేయాలి , గాయత్రి మంత్ర శక్తిని ఎలా ప్రయోగించాలి , వారికి బ్రహ్మాది రుద్రులు విష్ణువు తో తగిన శక్తిని కూడా పొందగలరు అని ఎంతో గొప్పగా వర్ణించ బడినది.. మహాద్భుతం శ్రీ గాయత్రీ శరణం మమ... ఆ తల్లి ఉపాసకులకు ఈ సందేశం ఇవ్వాలి తెలియని వారికి ఉపయోగ పడాలి అని ఈ వివరణ ఇవ్వడం జరిగింది.


                               ఇట్లు 

                                  మీ

                  అవధానుల శ్రీనివాస శాస్త్రి

ప్రాణనాథం

 🌻⚜️⚜️🌷🙏🌷⚜️⚜️🌻

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం

జగన్నాథ నాథం సదానంద భాజాం

భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం

శివం శంకరం శంభు మీశానమీడే

గళే రుండమాలం తనౌ సర్పజాలం

మహాకాల కాలం గణేశాది పాలం

జటాజూట గంగోత్తరంగై ర్విశాలం

శివం శంకరం శంభు మీశానమీడే

ముదామాకరం మండనం మండయంతం

మహా మండలం భస్మ భూషాధరం తమ్

అనాదిం హ్యపారం మహా మోహమారం

శివం శంకరం శంభు మీశానమీడే

వటాధో నివాసం మహాట్టాట్టహాసం

మహాపాప నాశం సదా సుప్రకాశమ్

గిరీశం గణేశం సురేశం మహేశం

మహేశం శివం శంకరం శంభు మీశానమీడే

గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం

గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహమ్

పరబ్రహ్మ బ్రహ్మాది భిర్వంద్యమానం

శివం శంకరం శంభు మీశానమీడే.

మిత్రులందరికీ శుభ దినం 

శుభ సోమవారం శుభోదయం

🌻🌷🌷🌷🙏🌷🌷🌷🌻

గణిత గుర్తులు చెక్కబడిన

 




#ఇంగ్లాండ్‌ లోని ఒక నది నుండి #మత్స్యకారుల ద్వారా

 #భారతీయ_భాషలో #గణిత గుర్తులు చెక్కబడిన 60 #క్యూబిక్ నవగ్రహ యంత్రాలు కనుగొనబడ్డాయి, ఈ నవగ్రాహాలు #సీసంతో తయారు చేయబడ్డాయి మరియు 6000 సంవత్సరాల క్రితం నాటివి అని తేలింది.

 ఈ భారతీయ యంత్రాలు 6000 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్‌కు ఎలా చేరుకున్నాయని ఇప్పుడు #శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు?


   సనాతన హిందువులు మనం శాశ్వతత్వం నుండి వచ్చామని ఎప్పుడూ చెబుతూనే ఉన్నారు. ప్రపంచ చరిత్ర, వేటలు మరియు పురావస్తు శాస్త్రవేత్తలతో సంబంధం లేకుండా, సనాతన ధర్మం యొక్క ప్రాచీనతను మీరు ఎంతకాలం ప్రపంచం నుండి #దాచవచ్చు, ఇప్పుడు మీ దేశంలో 6వేల సంవత్సరాల పురాతన సాక్ష్యాలను కొనసాగించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒకప్పుడు ప్రపంచం అంతా ఉన్నది కేవలం #సనాతనధర్మం మాత్రమే అని ఋజువు చేసేందుకు ప్రపంచం నలుమూలల రోజు ఏదోక సనాతన ధర్మం యొక్క #చిహ్నం బయల్పడుతోనే ఉంది.

Sours:-#దీప్తి_దీప్తి

భువనగిరి కోట


 

నీవు ఎవరవు

 నీవు ఎవరవు? ఎవరి వాడివి? ఎక్కడి నుండి వచ్చావు? విచారణ - యదార్ధం

భార్యాభర్తలు అన్యోన్యంగా, అనురాగంగా ఉంటారు. అలా ఉండాల్సిందే. అయితే వారి మధ్య ఉండవలసిన బంధం యొక్క అసలు తత్త్వం తెలిసి ఉంటే వారి బంధం అందంగాను, అద్భుతంగా ఉంటుంది. అలా తెలుసుకోలేక పోతే దుఃఖమయం అవుతుంది. 

  కళ్ళు అందంగా కనిపించాలని కాటుక పెట్టుకున్నారు. అది సరైనది కాకపోతే అందం సంగతి ఎలా ఉన్నా కళ్లు పోయే ప్రమాదం ఉంటుంది. 

  అలాగే భార్యాభర్తల మధ్యగల బంధం యొక్క యదార్థస్థితిని తెలుసుకోలేకపోతే సుఖం కోసం చేసుకున్న వివాహం దుఃఖంతో అంతమవుతుంది. 

  భార్యాభర్తలు కలసి ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కాని ఇలా కలిసి ఉన్నప్పుడు కూడా ఇద్దరి మధ్య కొంచెం ఎడం ఉండాలి. ఒకరికొకరు పూర్తిగా అతుక్కుపోతే, ఒకరు లేకపోతే మరొకరు బ్రతుకలేని పరిస్థితిని తెచ్చిపెట్టుకుంటే అది ఇద్దరిలోను ఎవరో ఒకరికి భరించలేని దుఃఖ కారణమవుతుంది. కనుక తత్త్వాన్ని విచారించాలి.

1. కాతేకాంతః :- నీ భార్య ఎవరు? ఇప్పుడు నీ భార్య అనబడే స్త్రీ వివాహానికి ముందు ఒకరి కుమార్తె. ఆమె పుట్టుకలోగాని, పెరగటంలోగాని నీకే ప్రమేయమూ లేదు. ఆమె ఎక్కడో పుట్టింది. నీవు ఎక్కడో పుట్టావు. అయినా పెళ్ళితో మీ ఇద్దరకూ ముడిపెట్టటం జరిగింది. పోనీ ఇప్పుడు ఇద్దరూ కలిసి ప్రయాణిస్తారు గదా! చివరిదాకా ఇలా కలిసే ప్రయాణిస్తారా? అదేం లేదు. ఈ ప్రయాణంలో ఎవరో ఒకరు ముందుగా దిగిపోతారు. ఆ రెండవ వారు ఒంటరి ప్రయాణం సాగించాలి. అంటే జన్మించటం ఒక్కసారి జరగలేదు. వెళ్ళిపోవటం కూడా ఒక్కసారిగా జరగటం లేదు. ఈ మధ్యలో మాత్రం కొంతకాలం విడిగాను, కొంతకాలం కలసి మెలసి జీవిస్తారు అంతే. 

  ఇదంతా రైలు ప్రయాణం లాంటిది. ఒక ప్రయాణీకుడు మద్రాసులో రైలెక్కాడు. కొంతదూరం ప్రయాణించి నెల్లూరు రాగానే మరొక ప్రయాణీకుడు ఆ కంపార్ట్ మెంట్ లోకి ఎక్కాడు. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. లోకాభిరామాయణంతో ప్రారంభమై -, రాజకీయాలు, సినిమాలు, వేదాంతం అన్నీ మాట్లాడుకున్నారు. ఎంతో ఆత్మీయులయ్యారు. మొదటి ప్రయాణీకుడు చీరాల రాగానే దిగిపోయాడు. రెండవ ప్రయాణీకుడు మొదటివాణ్ణి విడిచి ఒంటరిగా, దీనంగా ప్రయాణించి విజయవాడలో దిగిపోయాడు. ఇంతే వారి మధ్య సంబంధం. 

  భార్యాభర్తల సంబంధం కూడా ఇట్టిదే. అందుకే తత్త్వవిచారణ చేసి ఈ బంధం ఎట్టిదో సరియైన అవగాహన చేసుకోవాలి. అప్పుడే నీవు ఎలా ప్రవర్తించాలో సరిగ్గా తెలుస్తుంది. 

2. కస్తే పుత్రః :- అలాగే నీకుమారుడెవరు? అని కూడా విచారించు. పుట్టిన దగ్గర నుండి అతడు నీకెంతో ప్రేమాస్పదుడైన కుమారుడు. మరి అంతకుముందు? అతడు నీ భార్య గర్భంలో పిండం. అంతకు ముందో! అతడు నీలో బీజరూపం! ఆ బీజం ఎలా వచ్చింది? నీవు తిన్న ఆహారం ద్వారా నీలో తయారైంది? మరి ఆ ఆహారం ఎక్కడి నుండి వచ్చింది? భూమిలో నుండి వచ్చింది. అంటే మట్టి అనేక మార్పులు చెంది, ఆహారంగా మారి, ఆ ఆహారం నీలో బీజంగా మారి, ఆ బీజం నీ భార్య గర్భంలో ప్రవేశించి పిండంగా మారి, అది వృద్ధి చెంది శిశువుగా వ్యక్తమైంది. అంటే మట్టి యొక్క చివరి రూపమే నీ కుమారుడన్నమాట. మరి నీవెవరు? నీవూ అంతే. కాకపోతే ఆ బిడ్డకన్నా కాలంలో నీవు ముందున్నావు. నీవు కూడా మట్టి యొక్క ఆఖరి రూపమే. 

  ఈ లెక్కన చూస్తే కదులుతున్న ఒక పెద్ద మట్టిముద్ద మరొక చిన్న మట్టిముద్దను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది, ప్రేమను పెంచుకుంటుంది. విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు విలవిలలాడి పోతుంటుంది. దూరంగా ఉండి ఈ రెండు మట్టిముద్దల నాటకాన్ని మనం తమాషాగా చూస్తున్నాం అనుకోండి. నవ్వకుండా ఉండలేం. కాని అదే నాటకంలో మనం పాత్రధారులమై ఎంతో సీరియస్ గా ఆ మట్టిముద్దల పాత్రలను పోషిస్తున్నాం. ఇదే భ్రమ, ఇదే మాయ, ఇదే అజ్ఞానం. ఉన్నది ఉన్నట్లుగ చూడలేక 'నాది - నాది' అని భ్రమలో పడి కొట్టుకుపోతుంటాం. ఎంత చిత్రం? అందుకే ఈ సంసారం అతి విచిత్రం, తమాషా అయినట్టిది. 

  ఇంతకీ ఈ సంసార బంధంలో చిక్కుకు పోయిన నీవెవరు? ఎవరి వాడవు? ఎక్కడి నుండి వచ్చావు? ఈ విచారణ ముఖ్యమైనది. 

  వేదాంతంలో నేనెవరు? అని విచారణ చేయటమే మానవజీవిత సార్థక్యానికి ఏకైక ఉపాయం. సమస్త దుఃఖాలకు అజ్ఞానానికి అంతం ఈ నేనెవరు? అనే విచారణయేనని భగవాన్ రమణ మహర్షుల వారి ఉపదేశం. 

  నేనెవరు? నేను ఈ శరీరమా? కాదు. ఇదొక గృహం లాంటిది. జడమైనది. ఇందులో కూర్చుని నేను నా పనులను నిర్వర్తించు కుంటున్నాను. మరి నేను మనోబుద్ధులా? కాదు. అవి నేను పనిచేయటానికి ఉపయోగించుకొనే పనిముట్లు మాత్రమే. అవీ జడమే. వాటిని నేను ఉపయోగించుకుంటున్నాను. మరైతే నేనెవరు? దేహంలో కూర్చొని, మనోబుద్ధులను ఉపయోగించుకొని పనిచేసే జీవుడను. అయితే జీవుడనైన నేను ఎవరికి చెందిన వాడను? ఎక్కణ్ణించి వచ్చాను? నేను నిజంగా అంతటా వ్యాపించియున్న పరమాత్మకు చెందినవాడను. నేనువచ్చింది అక్కణ్ణించే. మరి ఎక్కడకు వెళ్ళాలి? ఆ పరమాత్మ వద్దకే. పరమాత్మ నుండి వచ్చిన జీవుడు కొంతకాలం ఈ జీవన నాటకరంగంలో సుఖదుఃఖాలు అనుభవించి చివరకు ఆ పరమాత్మలో చేరిపోవాలి. అప్పుడే పరమశాంతి, శాశ్వతానందం. (సేకరణ : : గురు చరణం

సద్దర్శనము

 అరుణాచల శివ 🙏


🍁🍁🍁🍁🍁🍁🍁



' సద్దర్శనము - సద్విద్య' (ఉన్నది నలుబది)

        - భగవాన్ శ్రీ రమణ మహర్షి



శ్లోకం: 15


 సత్య శ్చిదాత్మా వివిధాకృతి శ్చిత్

 సిద్ధ్యేత్ పృథక్ సత్యచితో న భిన్నా l

 భూషావికారాః కిము సన్తి సత్యం

 వినా సువర్ణం పృథ గత్ర లోకే ll15!!* 



జ్ఞాన స్వరూపమైన ఆత్మ సత్యము. అది ఒక్కటే. నానా విధములైన జ్ఞానములు ఏకమైన ఆ సత్యజ్ఞానస్వరూపము కంటె భిన్నములు కావు. 


 ఈ ప్రపంచమునందు సత్యము ఉపాదానమైన బంగారముకంటె వేరుగా భూషణములు లేవు.


ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏


🍁🍁🍁🍁🍁🍁🍁

అరుణాచల శివ🙏


🍁🍁🍁🍁


మనసులో ఏ కోరిక లేనప్పుడు మనసు ఎలా ఉంటుంది !??_




కోరిక చేత నా మనసును, మరొక గుణం ఆవరించిందని గుర్తిస్తే, అది లేని మనసు ఎలా ఉంటుందన్న శోధన మొదలవుతుంది. 


ఉదయం లేచింది మొదలు పడుకునే వరకూ మనం ఏదో ఒకటి కోరుతూనే ఉన్నాం.


 మనం దేన్ని కోరుతున్నామో ఆ గుణంగా ఉంటున్నాం. 


ఇక మనం మనంగా ఉంటున్నది ఎక్కడ ? నిద్రలో మనం మనంగా ఉంటున్నాం. 


కానీ ఆ మత్తులో అది మనకు తెలియటం లేదు.


 ఒక వ్యక్తి మద్యం దుకాణం ముందు నుండి వెళుతున్నాడు.. కానీ అతడికి ఆ మద్యం ధ్యాస రాలేదు.

 అప్పుడు అతడు అతడిగానే ఉన్నాడు. 


కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఒక స్వీట్ షాప్ కనిపించింది. స్వీట్ తినాలనిపించింది. ఇప్పుడతడు తన గుణంతో కాక కనిపించే వాటి గుణంగా ఉన్నాడు. 


విషయం ఏదైనా ఒకదాన్ని కోరుకోవడం అంటే అది గుణం చేతనే. 


అలా కోరుకుంటున్నప్పుడు మనం ఆ గుణంతో ఉండి మన గుణాన్ని మరుగునపెడుతున్నాం. 


ఏదో కావాలనుకోవటం కోరిక. అది ఏదైనా కానీ, చివరికి ప్రయోజనాన్ని ఆశించి చేసే పూజ, జపం, ధ్యానం ఏదైనా సరే అది కోరికే అవుతుంది !


---శ్రీరమణీయం నుండి...


🍁🍁🍁🍁

క్షురకర్మ


 

చీరఅందం

 



*స్త్రీ కి #చీరఅందం, #చీరస్త్రీకి #అందం!*


స్త్రీ లు చీరలు అందంగా కట్టుకుంటారు కొందరు కొంగు యెడమపక్కన వేసుకుంటే కొందరు కుడిపక్కన వేసుకుంటారు.ఐతే, ఆ చీర కట్టు కూడా మడతలతో ఒకరకమైన అందాన్ని సంతరించుకుంటుంది.

అందుకే చీర ఆడవారికి అందం అని అంటారు.

అదే అందమైన చీర కట్టు ఒకశిల్పానికి అలా మడతలు వస్తూ కట్తుకున్నట్టు చెక్కినది ఐతే ఆ శిల్పి మనసు ఇంకెంత అందంగా ఉండిందో కదా!!!!


ఇది పంచభూత లింగం ఉన్న #జంబుకేశ్వర ఆలయం,#తిరువనైకోవిల్_తిరుచిరాపల్లి దెగ్గర,#తమిళనాడు.ఇక్కడ ఇది #జల_లింగం గా పంచభూతాల లింగాలలో ప్రసిద్ధికెక్కింది.

ఇక్కడే ,ఇదే ఆలయం లో #లక్షీదేవి శిల్పం ఇది.ఎంత అద్భుతం గా చెక్కారు చూడొచ్చు. 

మహిమగలా మంత్రం 🙏

 చాలా అద్భుతమైన మంత్రం 

చాలా మహిమగలా మంత్రం 🙏


ఒకసారి పాలసముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీసమేతుడై ఉండగా, అనుకోకుండా పార్వతీదేవి, సరస్వతీదేవి..లక్ష్మీదేవిని చూడటానికి వైకుంఠానికి వచ్చారు. అల్లంతదూరాన వారిని చూసిన లక్ష్మీదేవి, 

భర్త అనుమతితో ఆయన పాదాలను వొత్తడం ఆపి, శేషపానుపు దిగి వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించింది.


ముగ్గురు సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్లి, 

ఓ చంద్రకాంత శిల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు. వారలా మాట్లాడుకుంటుండగా, దూరంగా నారదుడు వస్తుండటం కనిపించింది. 

నారదుడు కూడా వీరిని చూశాడు. 


ఇంకేం.. .కలహభోజనుడు తనకు కావలసినంత 

కాలక్షేపం దొరికింది అనుకున్నాడు. త్రిమూర్తుల భార్యలంతా ఒకేచోట కూర్చుని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి.. 

వారి మధ్య కలహాన్ని రేపి, తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు. 


అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి 

'ఈ కలహ భోజనుడు ఊరకనే రాడు. ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి'' అని నిర్ణయించుకుని బ్రహ్మమానసపుత్రుడిని సగౌరవంగా ఆహ్వానించారు. 


ఈ సందర్భంగా నారదుడు ముగ్గురమ్మలను చూసి.. నమస్కరించాడు. ముగ్గురమ్మలు సైతం నారదుడిని ఆశీర్వదించి, విషయాలేంటని అడిగారు. ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలెట్టాడు. 


త్రిమూర్తులైన వారికి..భార్యలైన మీరు ముగ్గురూ, 

సకల లోక వాసులచే స్తుతింపబడుతున్నారు. 

అంతవరకు బాగానే ఉంది.. కానీ మీ ముగ్గురిలో ఎవరుగొప్ప? అనే సందేహమే చాలామందిని వేధిస్తోందని చెప్తాడు. 


నారదుడు తన పనిని ప్రారంభించాడనుకున్న ముగ్గురమ్మలు.. నారదా నీ సందేహం ధర్మసమ్మతమే. నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్ళి.. అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తుండు. కొంతకాలం తర్వాత మా తర్వాత మాలో ఎవరు గొప్పో నీకే అర్థమవుతుందని చెప్పారు. 


ముందు సరస్వతీ దేవి నారదునితో.. ! నారదా! భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి, అక్కడున్న ఓ గురుకులంలో సెల్వనాథుడనే విద్యార్థిని కలిసి, సమయం సందర్భం చూసుకుని అతని చెవిలో "ఓం శ్రీ మాత్రే నమః'' అనే మంత్రాన్ని మూడుసార్లు ఉచ్ఛరించి అతనికి మంత్రోపదేశం చేయమంటుంది. మంత్రోచ్ఛరణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పగలవని సరస్వతీ దేవి అంటుంది. 


ఇలా నారదుడు పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్లి సెల్వనాథుడి గురువును కలిశాడు. సెల్వనాథుడి బంధువని తెలుసుకున్న గురువు.. సెల్వ నాథుడికి అక్షరం ముక్క రాదు...వాడితో నా ప్రాణం విసిగిపోయింది. పశువులను మేపాల్సిందిగా పంపేశాను.. 

వెళ్ళి చూడమంటాడు. 


నారదుడు విషయం తెలుసుకుని బాలుడి దగ్గరికి వెళ్తాడు. ఆ బాలుడు చదువు రాదని.. 

తాను పడే కష్టాల్ని చెప్పి బోరుమన్నాడు. నారదుడు ఆ బాలుడిని ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు. ఇలా సముద్రంలో స్నానం చేసి.. శుచియై వచ్చిన 

ఆ బాలుడికి ''ఓం శ్రీ మాత్రే నమః'' అనే మంత్రాన్ని 

108 సార్లు జపం చేయమని చెప్తాడు. 


ఇలా 108 సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను, శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు. అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగ్గురమ్మలకు ఈ విషయం చెప్పాడు. 


పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది. 

నారదా.. కావేరి నది ఒడ్డున సమయపురం అనే ఊరుంది. అక్కడ పెరినాయకి అనే ఆవిడ ఇంట గురించి అడుగు. అక్కడి పరిస్థితులను గమనించి సమయం సందర్భం కుదిరినప్పుడు నేను చెప్పే ''ఓం శ్రీ మాత్రే నమః'' మంత్రాన్ని ఆవిడకు ఉపదేశించమంటుంది. 

ఇలా పెరినాయకి ఇంటికి వెళ్లిన నారదుడు.. ఆమెకు సంతానం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు. 


సంతానం లేకపోవడంతో ఆమె భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లు గమనిస్తాడు. ఈమెకు కూడా పై మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు. 

ఈ మంత్ర ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరియనాయకి సంతానవతి అయింది. ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగ్గురమ్మలకు చేరవేశాడు. 


ఇక మూడో సారిగా లక్ష్మీదేవి నారదుడిని గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడనే 

పేద పండితుడిని కలవమంటుంది. ''ఓం శ్రీ మాత్రే నమః'' అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది.


అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్లి.. 

దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుడిని కలుస్తాడు. రాజశేఖరుడు తనవద్ద ఉన్న బియ్యాన్ని మారు వేషంలో వచ్చిన నారదునికి ఇవ్వపోగా, రాజశేఖరుని వద్దనున్న బియ్యం కుండ నిండుకుంది. 


దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకుముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటాడు. ఇలా రాజశేఖరుడికి కూడా నారదుడు ''ఓం శ్రీ మాత్రే నమః'' అనే మంత్రాన్ని ఉపదేశించి 108సార్లు జపించమని చెప్తాడు. 


ఆ తర్వాత ఆ పేద పండితుడు శ్రీమంతుడిగా మారిపోతాడు. ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసిన నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ ముగ్గురమ్మలను దర్శింటుకుంటాడు. 


అమ్మలారా! మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను. ఇప్పటికైనా ఈ మంత్రం ఎలా పుట్టిందని అడుగుతాడు. 


అప్పుడు నారదునితో లక్ష్మీదేవి ఇలా అంది. 

బ్రహ్మదేవ పుత్రా.. మా ముగ్గురు శక్తిలో ఎటువంటి తేడాలుండవు. జగదాంబ ఆజ్ఞానుసారం..

నా వలన ఐశ్వర్యం, సంపదలు, పార్వతీదేవి వలన ఐదవతనం, సౌభాగ్యం, సరస్వతీదేవి వలన విద్యలు, కళలు ప్రాప్తిస్తుంటాయి. 


శ్రీ లక్ష్మిలోని శ్రీ సరస్వతీ లోని శ్రీ శక్తి లోని

బీజాక్షరాలు జతచేసి ''ఓం శ్రీ మాత్రే నమః'' 

అనే మంత్రసృష్టి.

ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది.


అందువల్ల ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు, భక్తురాలకు ఉపదేశం చేయగలవు అని చెప్పింది.   


                 ఆ మంత్రమే 

  ' ఓం శ్రీ మాత్రే నమః' అనే మంత్రం. 🙏

*వాల్మీకి జయంతి

 *ఈ రోజు, అది కావ్యం రామాయణము రాసిన *వాల్మీకి జయంతి*.


*ఒక్కసారి వాల్మీకి ని స్మరుంచుకుందాము*


త్రేతాయుగంలో గంగా తీరంలోని నైమిషారణ్యంలో అనేక మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకుని నిష్టతో తపస్సు చేస్తుండేవాళ్లు. వీరిలో ప్రచస్థాముడు అనే ముని కుమారుడు రత్నాకరుడు. ఒకరోజు అడవిలో ఆడుకుంటూ దారితప్పి ఎటుపోవాలో తెలియక భయంతో ఏడుస్తున్న రత్నాకరుడిని అటుగా వెళ్తున్న ప్రయాణిస్తున్న ఓ వేటగాడు గమనించాడు. ఆ ముని కుమారుడిని ఓదార్చి తనతో పాటు తీసుకెళ్లిన బోయవాడు తన కుమారునిగా పెంచుకున్నాడు 

కుమారుడు అడవిలో ఏ క్రూర మృగాల బారినో పడి మరణించి ఉంటాడని ప్రచస్థాముడు భావించాడు


. బోయవారి ఇంట పెరిగిన రత్నాకరుడు విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించాడు . యుక్త వయస్సుకు వచ్చిన రత్నాకరుడికి ఓ యువతితో వివాహమవుతుంది. వీరికి ముగ్గురు సంతానం. వీరితోపాటు తల్లిదండ్రులను పోషించడానికి సంపాదన చాలక దారి దోపిడీలు, దొంగతనాలను వృత్తిగా చేసుకుని కొన్ని సందర్భాల్లో బాటసారులను చంపడానికి వెనుకాడని పరిస్థితికి చేరుకుంటాడు రత్నాకరుడు. అడవిలో బాటసారుల కోసం ఎదురుచూస్తున్న సమయంలో నారద మహర్షి ఓ సాధారణ మనిషి రూపంలో ఆ దారి వెంట వచ్చాడు ఆయనను దోచుకోడానికి రత్నాకరుడు ప్రయత్నంచగా.. తన వద్ద వీణ, రుద్రాక్షలు, కాషాయ వస్త్రాలు తప్ప ఏమీ లేవన్నా వినిపించుకోకుండా చంపుతానంటూ భయపెట్టాడు . నీవు ఇన్ని పాపకార్యాలు ఎవరికోసం చేస్తున్నావని నారదుడు ప్రశ్నించగా తన కుటుంబం కోసమని రత్నాకరుడు బదులిచ్చాడు


పోషణ కోసం తెలిసిన విద్య ఇది ఒక్కటే. పాప పుణ్యాలు నాకు తెలియవని అన్నాడు రత్నాకరుడికి జ్ఞానోదయం కలిగించేందుకు నారదుడు ఓ ఉపాయం పన్నాడు . ఓ బోయవాడా! .. నీవు చేసే ఈ పాపాల్లో నీ కుటుంబ సభ్యులు ఎవరైనా భాగం పంచుకుంటారేమో అడిగి తెలుసుకోమని తనతో పాటు ఇంటికి వెళ్లాడు. తన పాపాల్లో మీరూ కూడా భాగస్వాములే కదా అని తల్లిదండ్రులు, భార్యా బిడ్డలను ప్రశ్నించగా, అందుకు వారు సమ్మతించరు. పైగా కుటుంబ పోషణ ఇంటి యజమాని బాధ్యత.. పాప, పుణ్యాలు ఒకరి నుంచి ఇంకొరికి ఇవ్వలేం, తీసుకోలేమని బదులిచ్చారు . వారి మాటలతో పశ్చాత్తాపం చెందిన రత్నాకరుడు పాపవిముక్తి కలిగించాలని నారదుని వేడుకున్నాడు అప్పుడు నారదుడు తన నిజస్వరూపాన్ని చూపి భక్తి మార్గానికి 'రామ.. రామ' అనే రెండక్షరాల మంత్రాన్ని ఉపదేశించాడు . అప్పటి నుంచి నైమిషారణ్యంలో రామ మంత్రాన్ని జపిస్తూ కొన్నేళ్లు తపస్సు చేసాడు . తపస్సులో కూర్చున్న రత్నాకరుడి చుట్టూ పుట్టలు వెలిసాయి . అలా కొనేళ్లు గడిచిన తర్వాత పుట్టలో బక్క చిక్కి బయట ప్రపంచంతో సంబంధం లేని రత్నాకరుని చెవిలో రామ.. రామ.. రామ.. అని నారదుడు మూడుసార్లు పలికాడు


ఆ తారక మంత్రాన్ని విన్నంతనే రత్నాకరుడు తపస్సు నుంచి బయటకు వచ్చాడు. ''రత్నాకరా.. నీవు గొప్ప తపశ్సాలివి అయ్యావు. దేవుడు నిన్ను కరుణిచాడు. నీవు మళ్లీ జన్మించావు. ఈ పుట్ట నుంచి పుట్టావు కాబట్టి నీవు వాల్మీకి నామంతో లోక కల్యాణం కోసం ఓ గొప్ప కావ్యాన్ని రాస్తావు'' అని దీవించి నారదుడు అదృశ్యమయ్యాడు . ఆ తర్వాత వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణ సంకలనం చేసాడు . సంస్కృతంలో రాసిన మొదటి కావ్యం కావడంతో రామయాణాన్ని ఆదికావ్యం అంటారు. ఇకపోతే వాల్మీకి మొదటి శిష్యులు, రాముడి కుమారులైన లవకుశలు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

వివేకానంద

 🕉🌞🌎🌙🌟🚩


*-Swami Vivekananda's wisdom for daily inspiration - Oct 13.*_


_*స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి -అక్టోబరు 13.*_


*What our country now wants are muscles of iron and nerves of steel, gigantic wills which nothing can resist, which can penetrate into the mysteries and the secrets of the universe, and will accomplish their purpose in any fashion even if it meant going down to the bottom of the ocean and meeting death face to face.*


*మన దేశానికి ఇప్పుడు కావలసింది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు. ఇంకా ఎవ్వరూ నిరోధించలేనిదీ, జగత్తులో రహస్యాలను ఛేదించగలిగేదీ అయిన వజ్ర సంకల్పం! మహా సముద్రంలో అట్టడుగునకు మునగవలసి వచ్చినా, ముఖాముఖీ మరణాన్ని ఎదుర్కోవలసి వచ్చినా, లక్ష్యాన్ని ఏ విధంగానైనా సాధించగలిగే ధృఢసంకల్పం మనకు కావలసి ఉంది.*


🕉🌞🌎🌙🌟🚩


*-Inspiring Sayings of Swami వివేకానంద / స్వామి వివేకానంద స్ఫూర్తిదాయక వచనాలు.-*


*Hold the ideal a thousand times, and if you fail a thousand times, make the attempt once more.*


*స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో వేయిసార్లు విఫలమైనా, మరోసారి ప్రయత్నించండి.*


🕉🌞🌎🌙🌟🚩

శుద్ధవిద్యాంకురాకారాద్విజపంఙ్తిద్వయోజ్వలా

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 26 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


 ‘శుద్ధవిద్యాంకురాకారాద్విజపంఙ్తిద్వయోజ్వలా’


శుద్ధవిద్యకు సంబంధించిన అంకురములను తన దంతపంక్తిగా చేసుకుని ప్రకాశిస్తున్న తల్లి. పాలను పొయ్యిమీద పెడితే అవి ఎప్పుడు పొంగుతాయో చెప్పలేరు. పాలలో ఉండే ప్రతి బిందువు పొంగడానికి వీలయ్యే ఉష్ణోగ్రతకు చేరితే తమంత తాము పొంగుతాయి. ఒక పాత్రలో బియ్యం పోసి ఉడికిస్తున్నప్పుడు ఎప్పుడు మెతుకులుగా మారతాయో తెలియదు. పైన ఉన్న గింజ మెత్తపడితే లోపల ఉన్న గింజలు కూడా మెత్తబడి ఒకేసారి అన్నముగా మారతాయి. అది ఎలా జరిగిందో అలా భక్తితో కూడిన కర్మాచరణము చెయ్యగా చెయ్యగా జ్ఞానము కూడా అలా ఆవిర్భవిస్తుంది. జ్ఞానము వలన మాత్రమే మోక్షము సాధింపబడుతుంది. ఆ విధమైన మోక్షము సాధించడానికి ఉన్న విద్యకి శుద్ధవిద్య అని పేరు. 

శుద్ధవిద్యలో ఒక స్థితిని పొందితే – అనగా తాను శుద్ధవిద్యలో తరించినవాడై ఆ విద్య స్వరూపమును పొందితే తనకు, విశ్వమునకు అభేదమును పొందుతాడు. విశ్వమే విష్ణువు, విశ్వమే అమ్మవారు. విశ్వములో అంతర్భాగమైన తానుకూడా విష్ణువే. ఉన్నది ఒకటే వస్తువు రెండువస్తువులు లేవన్న స్థితికి వెళ్ళడము జరుగుతుంది. ఈ స్థితి అటువంటి వారియందు కారుణ్యముగా వ్యక్తము అవుతుంది. ఎక్కడ అటువంటి సమున్నతమైన స్థాయిలో నిలబడాలో ఆ స్థాయికి చేరితే దానిని శుద్ధవిద్య అంటారు. ఆ విద్యను చేరడానికి ఉన్న అంకురాలు ఏవి ఉంటాయో అవి ‘ద్విజపంక్తిద్వయోజ్వలా’ తన పళ్ళవరుసలుగా కలిగి ఉన్నది. పళ్ళు రెండు వరసలుగా ఉంటాయి. షోడశీవిద్య అని ఒక విద్య. అందులో అమ్మవారికి, శ్రీవిద్యకు సంబంధించిన బీజాక్షరముల గురించి వివరణ ఉంటుంది. 

ఒక గింజ భూమిలో పాతిపెడితే మొక్కవచ్చేప్పుడు అది రెండుదళముల కింద విచ్చుకుంటుంది. అలా ఈ షోడశీవిద్య పైకి ఉచ్ఛరింపబడేప్పుడు విచ్చుకుని పైకి వైఖరిగా వినబడే సమయములో స్వరూపము రెండుగా మారితే, పదహారు రెళ్ళు ముప్పైరెండు అయి అమ్మవారి దంతపంక్తిగా ఉంటాయి. 


‘ద్విజపంక్తిద్వయోజ్వలా’ అనడములో ఒక రహస్యము ఉన్నది. ద్విజులు అన్న మాటకు అనేకమైన అర్థములు ఉన్నాయి. ద్విజులు అంటే బ్రాహ్మణులు, రెండుసార్లు పుట్టినవారు. లోకములో రెండుసార్లు పుట్టినవి కొన్ని ఉంటాయి. పక్షి రెండుసార్లు పుడుతుంది. ముందు గుడ్డుపుట్టి తరవాత పొదగబడి పక్షి అవుతుంది. బ్రాహ్మణుడు రెండుసార్లు పుడతాడు. ఒకసారి తల్లి కడుపులోనుంచి, రెండవసారి ఉపనయనము చేసి గాయత్రీ మంత్రోపదేశము చేసిన తరవాత ద్విజ సంస్కారము ఏర్పడింది అంటారు. యజ్ఞోపవీతము మెడలో వేసుకుని సంధ్యావందనము చేయని వాళ్ళకు ద్విజత్వం వర్తించదు. వేదవిద్యను వేదము చేత ప్రతిపాదింపబడిన సనాతనధర్మ భక్తి రహస్యములను, భక్తి జ్ఞానములను లోకమునకు వ్యాప్తి చేస్తారో, తాము అధ్యయనము చేసి తెలుసుకుని లోకమంతటికీ అందించాలనే తాపత్రయముతో ఉన్నవారు అమ్మవారి దంతములై ఉంటారు. 


పక్షి భక్తి, కర్మ అన్న రెండురెక్కలతో ఆకాశములో ఎగురుతుంది. ఒక గదిలో ఒక మఠములో ఎగురుదామని ప్రయత్నము చెయ్యదు. ‘ఆ’ అంటే అంతటా – ‘కాశ్’ అంటే ప్రకాశించడము భక్తి కలిగి ఉంటారు, అనుష్ఠానము తెలుస్తుంది. భక్తి కలిగి ఉంటే సరిపోదు అనుష్ఠానములో పెట్టాలి. అపారమైన భక్తి ఉన్నవారు పరమేశ్వరుని పూజ చేయకుండా ఉండలేరు. భక్తి ఉన్నది నిజమైతే కర్మాచరణముగా ప్రకటితము కావాలి. కాబట్టి వారు భక్తి, కర్మ రెండురెక్కలై విహరిస్తూ, బ్రహ్మముతో అనుసంథానమవుతూ నిరంతరము ఆకాశములో ఎగిరే పక్షి ఎటువంటిదో అమ్మవారి అనుగ్రహమును పొందిన వారి జీవితములు కూడా అలా ఉంటాయి. అలా అనుష్టించి అనుష్టించి భక్తిమార్గములో నడచి ద్వందములను దాటిపోయిన అందరు అమ్మవారి దంతములయి ఉన్నారు. ఎవరికైనా కూడా మొదటగా వచ్చిన పళ్ళు ఊడిపోతాయి మళ్ళీ రెండవసారి వస్తాయి. అమ్మవారి పళ్ళు ముప్పదిరెంటినీ మాతృకావర్ణములు అంటారు.


అ ఇ ఉ ఋ ఌ క ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ ఞ 

ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ స హ


మిగిలిన ఏ అక్షరములైనా వీటినుండి పుడతాయి. ఈ నామముతో అమ్మవారి దంత పంక్తికి నమస్కరించాలి.  


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage/

మోక్షం

 మోక్షం*





మనిషిని అన్ని బంధాల నుంచి విముక్తం చేసేదే ముక్తి. దీన్నే ‘మోక్షం’ అంటారు పెద్దలు. 


అది ఎలా లభిస్తుందనే చర్చ అనాదిగా సాగుతోంది. ఎవరి వాదం వారికి వేదం. ఎవరి మతం వారికి సమ్మతం. వ్యక్తిగత వాదాలే మతాలుగా పరిణమించి, అనేకంగా ఆవిర్భవించాయి. ఇవన్నీ ముక్తిని సాధించడానికి ఉపయోగపడేవే!


ఒక గమ్యస్థానానికి వెళ్లాలనుకొన్నప్పుడు, మనిషి బయలుదేరే చోటు నుంచి ఒకే దారి ఉండదు. అన్ని దిక్కుల నుంచీ ఎన్నో దారులుంటాయి. ఎటు నుంచి వెళ్లినా చేరాల్సిన చోటు ఒకటే. ఏ దారిలో వెళ్లినా ప్రయాణికుడు గమ్యం చేరేవరకు విశ్రమించడు. ఇదే జీవన స్వభావం. 


ఈ విషయాన్నే మోక్షానికీ అన్వయిస్తూ ‘శివ మహిమ్న స్తోత్రం’ ఇలా ప్రబోధించింది-

ఓ పరమేశ్వరా! నిన్ను చేరడానికి మనుషులు ఎన్నో మార్గాలు ఏర్పరచుకొన్నారు. కొందరు వేదమార్గంలో నిన్ను చేరుకొంటున్నారు. కొందరు సాంఖ్యమార్గంలో, కొందరు యోగమార్గంలో, కొందరు శైవ మార్గంలో, కొందరు వైష్ణవ మార్గంలో ముందుకు సాగుతున్నారు’. ఎవరికి వారు తాము నమ్మిన మార్గాలే గొప్పవని వాదిస్తారు. ఇదంతా చూస్తుంటే ‘లోకో భిన్న రుచిః’ అనే సామెత గుర్తుకు వస్తుంది.

అన్ని లౌకిక బంధాలనూ పరిత్యజించి, పరమేశ్వరుడిలో లీనం కావడమే మోక్షం.


అది నాలుగు విధాలని ‘శివానంద లహరి’లో శంకర భగవత్పాదులు బోధించారు.


మొదటిది సారూప్య ముక్తి. భక్తుడు శివుణ్ని అర్చిస్తున్నప్పుడు తానూ శివుడిలా రూపం ధరించాలని కోరుకోవడమే ఈ ప్రక్రియలోని పరమార్థం. స్తోత్ర పఠనంలో- శివుడి రూపాన్ని స్మరించడం, ఆ రూపాన్నే ఆరాధించడం అంటే శివుడితో సమానమైన రూపాన్ని కోరుకోవడమే! అందువల్ల దీన్ని సారూప్య ముక్తిగా భావిస్తారు.


రెండోది సామీప్య ముక్తి. శివుడి కథలు ప్రవచించేవారికి ఎప్పుడూ దగ్గరగా ఉండటం, వారు చేసే ఆరాధనల్లో పాలుపంచుకోవడం, వారితోనే స్నేహం చేస్తూ కలిసి మెలిసి తిరగడం వంటివి ఇందులో ఉంటాయి. ఇవన్నీ ఆనందదాయకాలైన అంశాలే కాబట్టి- దీన్ని సామీప్య ముక్తిగా పిలుస్తారు.


మూడోది, సాలోక్య ముక్తి. అంటే, శివుడు ఉండే లోకంలోనే ఉండాలనుకోవడం! శివుడు లేని చోటు ఏదైనా ఉందా అంటే ‘లేనే లేదు’ అని బదులిస్తుంది ప్రాచీన సాహిత్యం. చరాచరాలతో కూడిన మానవ లోకంలోనూ అణువణువునా శివుడున్నాడంటారు. మానవ లోకంలోని మనిషి- శివుడు ఉన్నచోటే ఉన్నాడని దీని అర్థం. ఈ ప్రపంచం అంతా శివుడి శరీరమే అని వేదాలు చెబుతున్నాయి. ‘శివుడి తనువే ఈ జగత్తు’ అనే భావన ఇందులో కనిపిస్తుంది. శివుడున్న లోకంలోనే తానూ ఉన్నాననే భావనను భక్తుడికి కలిగించడం వల్ల ఇది సాలోక్య ముక్తి!


నాలుగోది సాయుజ్య ముక్తి. సాయుజ్యం అంటే- కలిసి ఉండటం. చరాచరాలన్నీ శివమయాలే అన్నప్పుడు, అందులో చరాలు (చైతన్యం కలిగిన ప్రాణులు)గా మనుషులూ ఉన్నట్లే. మనుషులందరూ శివస్వరూపాలైనప్పుడు, ఆయనతో వారు నిరంతరం కలిసి ఉన్నట్లే అవుతుంది. మనిషికి శివుడితో సాయుజ్య ముక్తి లభించడం అంటే ఇదే.


ఇలా ప్రతి మనిషికీ నాలుగు మోక్షాలు అందుబాటులో ఉంటాయి. 


ముక్తి అనేది ఎవరికైనా సాధ్యమే!


శివుడి కరుణకు ఎలాంటి తారతమ్యాలూ ఉండవు. అందుకే ఆయన తనను అర్చించిన సాలీడు, పాము, ఏనుగును తనలో లీనం చేసుకొన్నాడు. శ్రీ (సాలీడు), కాళ (పాము), హస్తి (ఏనుగు) నామాలతో ‘శ్రీకాళహస్తీశ్వరుడు’ అయ్యాడు.


కాలు కదపనివాడికి ఏదీ లభించదు. కదిలి ముందుకు సాగేవాడికి ప్రపంచమంతా ఓ కుగ్రామంలా కనపడుతుంది.... 

వారణాసి పీఠస్థాన వివరములు: వివిధ భైరవ రూపా

 🙏🙏🙏🙏🙏

🕉️🕉️🕉️🕉️🕉️




🌹🌹🌹🌹🌹

వారణాసి పీఠస్థాన వివరములు: వివిధ భైరవ రూపాలు.

🕉️🕉️🕉️🕉️🕉️

ఇక్కడ ఇవ్వబడ్డ వివరాలు అన్ని కాశీ లోని శివలింగం రూపాల్లో ఉన్న భైరవులు ఇవి చాలా వరకు భూగర్భంలో కలసి పోయింది , కొన్ని మటుకే ఇప్పుడు అక్కడక్కడ ఉన్నాయి ..మొత్తం వారణాసిలో 10,000 పైన శివలింగాలు భూగర్భంలో ఉన్నాయి వాటికి రక్షణగా ఈ బైరావులు ఉంటారు, కాలక్రమంలో కొన్ని దాడుల వలన చాలా ఆలయాలు భూమట్టంలో కలిసిపోయాయి అందువల్ల ఈ శివలింగ రూపంలోనే భైరవ రూపాలు నామాలు చాలా మందికి తెలియదు, అలాగే విశ్వప్రాణ శక్తిని ఆకర్షించే కాస్మిక్ ఎనర్జీ శక్తి కేంద్రాలు ఒక్క కాశిలోనే 51 ప్రాంతాలు ఉన్నాయి వాటికి గుర్తుగా వినాయక పురాతన ఆలయాలు అక్కడ ఉన్నాయి..


కాశీ క్షేత్రం మహా మహిమాన్వితమైన నది ,ఇది శతకోటి యొగినులుతో పరివేష్టితమై యుండును.ఈ స్థానం మండాలాకార రూపముగా మాతృకా స్వరూపముగా విరాజిల్లుతుంది.కోటానుకోట్ల స్వయంభూలింగములు సాధకులకు అభీష్టములు నెరవెర్చుతుంది.. ఎక్కడ జపం చేసే త్వరగా మంత్రం సిద్ధిస్తుంది, కాశీలో మరణించిన వారు శివుని రూపంలోనే కైలాసం చేరుకుంటారు అంటారు..అటువంటి కాశీ క్షేత్రంలో ఏ దిశలో ఏ రూపంలో భైరవుడు లింగ రూపంలో ఉంటారో ఇక్కడ వివరాలు తెలుసుకుందాము. బైరవుడి అనుగ్రహము ఆజ్ఞ లేకుండా కాశీలో అడుగు పెట్టలేరు... ఈ నామాలు చదివి భైరవుడికి నమస్కరించు కున్నా ఎన్నో భయాలు తొలగిపోతాయి ఆ స్వామిని తలుచుకున్నాను అంత అనుగ్రహం దక్కుతుంది.


  పూర్వదిశయందు దశలింగములు ముఖ్యమైనవి కలవు.వాటిపేర్లు 1.జటిల 2.కాల 3.ఉన్మత్త 4.క్రోధరాజ 5.సదాశివ 6.దధీచినాధ 7.సువాశీ 8.ప్రమధేశ్వర 9.యఙనాధేశ్వర 10.అయితేశ్వర వల్లభ.


  ఆగేయదిశలో 10 లింగములున్నవి. 1.వజ్రధర 2.మహాకాల 3.కపిలేశ్వర 4.పంచానన 5.యోగినాధ 6.ఘఘిరేశ 7.పినాకదృక్ 8.పశుపాల 9.క్షేమద 10.బ్రహ్మనాధ.


  దక్షిణదిశలో 10 లింగములున్నవి. 1.వీరేశ్వర 2.శూలేశ్వర 3.సిద్దేశ్వర 4.శ్రీ పార్వతీశ్వర 5.గణనాదీశ్వర 6.శంభు 7.ప్రచండ 8.దక్షయఙహా 9.కామరాజేశ్వర 10.కామకలేశ.


   పశ్చిమ దిశలో 10 లింగములున్నవి. 1.ఆరుణేశ్వర 2.యోగేంద్రేశ్వర 3.ఈశాన 4.అసురాంతకేశ్వర 5.త్రిశూలేశ్వర 6.వరుణేశ్వర 7.కాళేశ్వర 8.కామదాయకేశ్వర 9.కాలఙిరుద్రేశ్వర 10.భద్రేశ.


  వాయువ్యదిశలో 10 లింగములున్నవి. 1.మహారుద్ర 2.వాతనాధ 3.రుద్రాత్మ 4.రౌద్రరూపక 5.రూపనాధ 6.హనుమాన్ 7.సూర్యేశ 8.వసుదేశ్వర 9.వాసుకీవల్లభ 10.సత్యపతి.

  

  ఉత్తరదిశలో 11 లింగములున్నవి. 1.ఉత్తరాస్య 2.కుబేరేశ్వర 3.ఈశ్వర 4.పంచాధార 5.పరమేశ 6.పరహంస 7.ప్రభాకర 8.ఆనంతేశ 9.కామరక్ష 10.రత్నేశ్వర 11.ఉమాపతి.


  ఈశాన్యదిశయందు 11 లింగములున్నవి. 1.ఈశ 2.వైశ్వానరేశ్వర 3.ఈశాన 4.మాయేశ 5.బటుకేశ 6.రామేశ్వర 7.కాలంతకేశ 8.విస్వామిత్రేశ్వర 9.మహాకామపురీశ్వర 10.సర్వరూపప్రకాశక 11.కామాఖ్యేశ్వర.


   మండలములో క్రిందభాగమందు 13 లింగములున్నవి. 1.మృత్యుంజయ 2.మోక్ష 3.శివేశ 4.భైరవేశ 5.భూతనాధ 6.భూతకర్తా 7.క్షేత్రపాల 8.పరాపర 9.మృత్యుఘోషేశ్వర 10.కాలదమన 11.కౌశలేశ్వర 12.మునినాధ 13.వర్ణమాలి.


  ఈ భైరవరూప రుద్రమూర్తులు 10వేలలింగములకు ప్రతినిధులుగా ఉన్నవి.పంచతత్వములతో సాధకులను రక్షించిచూ అభీష్టసిద్దినిచ్చుచున్నవి.


   ఊర్ధ్వస్థానమున 13 లింగములున్నవి. 1.బ్రహ్మేశ 2.బ్రహ్మకులేశ 3.బ్రహ్మలింగ 4.విధీస్వర 5.బ్రహ్మాండభేదక 6.ఆత్మరామ 7.వక్రేశ్వర 8.బలీశ 9.భార్గవేశ 10.సదానందేశ్వర 11.హర 12.కృష్ణేశ్వర 13.రామనాధ.


   కాశీనాధుడు అర్చించిన 12 మహావిద్యలు కలవు. 1.త్రిపురసుందరి 2.త్రిపుర భైరవి 3.భువనేశీ 4.అన్నపూర్ణ 5.మాతంగి 6.వింధ్యవాసిని 7.చినమస్తా 8.బగళాముఖి 9.త్రికూటా 10.పంచమి 11.కాళీ 12.తార.


  ఇవి తంత్రోక్త పూజావిధానములో అర్చించిన సాధకుల అభీష్టములు నెరవేర్చ గలవు.

🕉️🕉️🕉️🕉️🕉️

ఓం నమః శివాయ

శ్రీ మాత్రే నమ:

🕉️🕉️🕉️🕉️🕉️

🙏🙏🙏🙏🙏 

enroll your name in *Graduate MLC Voter's List*.

 Request every one to enroll your name in *Graduate MLC Voter's List*. This is very simple. *Last Date is Nov 6th*

Ranga Reddy district

Go to the below Site and register your details.


https://ceotserms1.telangana.gov.in/MLC/Form18.aspx


1. Passport Photo

2. Your Degree Certfiicate Photo


If you are already a voter in RangaReddy/Hyd Voter's list then enter 

Your existing Voter ID details. *Golden Opportunity to cast your vote in upcoming Graduate MLC Elections*. I believe that *every vote counts*

Digital Rare Book :

 Digital Rare Book :

Ancient India As Described By Megasthenes and Arrian

- A translation of the fragments of the INDIKA of Megasthenes collected by Dr.Schwanbeck, and of the first part of Indika of Arrian

By J.W. McCrindle

Published by Trubner & Co., London - 1877


Read Book Online:


https://bit.ly/33KJ5cQ


Download pdf Book:


https://bit.ly/36UMdou


The Lost Indika

By Sumedha Verma Ojha


The oldest and most comprehensive record we have on India comes from Megasthenes, the Greek ambassador from the court of the Seleucid Emperor to that of Chandragupta Maurya. He wrote the Indika, a description of India, based on his sojourn. Megasthenes was a companion of Alexander of Macedon on his short-lived invasion of North Western India and had lived with Sibyrtius, the satrap of Arachosia, after Alexander's death and during the fight of the Diadochi. On the establishment of friendly relations between Chandragupta and Seleucus, he was sent as an ambassador to Chandragupta's court by the latter.


Sandrocottus has been mentioned by him in the Indika and has been identified with Chandragupta Maurya, placing the book squarely in fourth century BCE. (A caveat: the dating and chronology of Ancient Indian history is based on some seminal but problematic identifications which merit separate study).


Strabo, Arrianus and Klemens of Alexandria tell us most of what we know about Megasthenes life. Klemens informs us that he was a contemporary of Seleucus, Strabo that he was sent to Chandragupta Maurya's court at Pataliputra and Arrian that he lived with Sibyrtius at Arachosia, and frequently visited Chandragupta's court. Reportedly, he had even met Chandragupta himself.


Indika itself, modelled on Hekataios Aegyptiaka , was either in the Attic or Ionian dialect and was divided into four sections. Megasthenes wrote down descriptions of the country, its soil, climate, animals, plants, government, religion, manners of the people, arts, etc. In short, a detailed description from the king to the remotest tribe.


Over time, the book itself was lost. However, Greek and Roman writers Diodorus, Strabo, Arrian, Eratosthenes, Pliny and many others have quoted from his book over millennia. Its fragments lay scattered but, in 1846, Professor Schwanbeck of Bonn collected the scattered fragments and published them as a reconstructed Megasthenes Indica in Latin and Greek. In 1877, J.W. McCrindle published, for the first time, an authoritative English translation which remains a resource although it has been the subject of many critiques since then. What is the relevance of this book today?


For one, it is the earliest surviving and most comprehensive description of Ancient India by a foreign visitor the first in the tradition of visitors such as Fa Hien, Hiuen Tsang and Al-Biruni who have provided valuable insights into the position of the country at the relevant time. Apart from its role as an invaluable resource for Indian antiquity, Indika's influence on other Roman and Greek writers, and on their scientific knowledge, has been immense. It was not written on the run, so to speak, as snippets of information from Alexander of Macedon's other companions were written, but was designed as an encyclopedic study of the country.


Image:

Mappa di Eratostene

19th century reconstruction of Eratosthenes' map of the known world, c. 194 BC


Source: Bunbury, E.H. (1811-1895), A History of Ancient Geography among the Greeks and Romans from the Earliest Ages till the Fall of the Roman Empire. London: John Murray, 1883

సర్వశక్తి స్వరూపంగా

 *జై శ్రీమన్నారాయణ - జై శ్రీహనుమాన్*


మన కోర్కెలు తీర్చే భగవంతుని సర్వశక్తి స్వరూపంగా, గుణపూర్ణునిగా కొలవడం సహజం. నిర్గుణుడు, నిరాకారుడు మనకు ఏమి ఇవ్వగలడు? లోకానికి కల్యాణం కలిగించేవాడే భగవంతుడు. 


భగవంతుని భార్య, ఆయన దివ్య స్వభావానికి ప్రతీక. భగవానుని ప్రక్కన అమ్మవారు ఉండవలసిన అవసరం ఆయనకంటే మనకే ఎక్కువ. ఎందుకంటే భగవానుని మనం ఆశ్రయించినపుడు ఆయన కాదనకుండా మనల్ని అనుగ్రహించాలంటే ప్రక్కన అమ్మవారుండాలి.


ఆమె బిడ్డలమైన మన మీద ఆమెకు సహజసిద్ధంగా వాత్సల్యం ఉంటుంది. అంతేనా *నిత్య మజ్ఞాత నిగ్రహాం* ఆమె ఎప్పుడూ కోపమనేది ఎరగదు. భగవంతుడికి మన మీద అనుగ్రహంతో పాటు ఆగ్రహం కూడా వస్తుంటుంది. ఆ సమయాల్లో అమ్మ స్వామి ప్రక్కన ఉంటే స్వామి ఆగ్రహాన్నుండి మనల్ని కాపాడుతుంది.


*విష్ణో రే షానపాయి నీ, దేవత్వే దేవ దేహేయం మనుష్య త్వేచ మానుషీ* భగవానుడు దేవుడుగా అవతరిస్తే మానవిగా, ఈమె కూడా అవతరిస్తూ, మనల్ని రక్షించడం కోసమే, స్వామిని ఎడబాయకుండా ఉంటుంది.


భగవంతుని ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులే అమ్మవార్లని గ్రహించాలి. స్వామితో అమ్మ కల్యాణం లోక కళ్యాణాన్ని కలిగిస్తుంది. దేవుడి కల్యాణాలు చేయించే మానవుల కోర్కెలు తీరి, వారికి సర్వశుభాలు కలుగుతాయి. లోకం ఆనందధామం అవుతుంది.


*శుభంభూయాత్*

మహాభారతము ' ...49.

 మహాభారతము ' ...49. 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


సభా పర్వం..


రాజసూయయాగంలో, నిండుసభలో తనను, పెద్దలను, నిందిస్తున్న శిశుపాలుని, శ్రీకృష్ణుడు చూశాడు. తనను యుద్ధానికి ఆహ్వానిస్తున్న ఆఉన్మాదిని, ఆవాచాలుని యిక ఉపేక్ష చెయ్యకూడదని తలచాడు. తాను సింహాసనం నుండి లేచి నిల్చున్న చోటు నుండే, యెంతో గంభీరంగా సభాసదులను చూస్తూ ' ఓ రాజన్యులారా, ఋషి పుంగవులారా, పెద్దలారా ! మీరందరూ ఈశిశుపాలుని అహంకార పూరితమైన, సంస్కార రహితమైన ప్రవర్తన కనులారా గమనిస్తూనే వున్నారుకదా ! శాంతస్వభావానికే, చెదలు పట్టించే సంస్కారి యీతడు. తాను పుట్టిన యాదవకులానికే కళంకంగా మారాడు. మాకు యెంతో కావలసినవాడు, మేనత్త కుమారుడైన యీశిశుపాలుడు అకారణంగా మాపై కత్తి గట్టాడు. మేము లేనిసమయంలో ద్వారక ప్రవేశించి అనేక అకృత్యాలకు పాల్పడ్డాడు. '


' అయినా మేనత్తకుమారుడనే ఒకే ఒక్క సానుభూతితో, నేను మా అత్తకు యిచ్చినమాట తప్పకుండా, ఈ శిశుపాలుని నూరుతప్పుల వరకు కాస్తానని చెప్పాను. అందుకే మిగుల శాంతస్వభావంతో యింతవరకు మౌనం వహించాను. మన అందరిమౌనాన్ని బలహీనతగా భావించాడు, యీ అహంకారి. నేటితో శిశుపాలుడు నాయెడ చేసిన నూరు తప్పులు పూర్తి అయ్యాయి. ఈతని కడతేర్చే సమయం ఆసన్నమైంది. '


అంటూ శ్రీకృష్ణుడు ఒక్కసారి తన హృదయం మీద కుడిచేతిని వుంచి సుదర్శన చక్రాన్ని స్మరించాడు. వెంటనే దేదీప్యమానంగా ప్రకాశిస్తూ యెక్కడినుంచో వచ్చి సుదర్శన చక్రం శ్రీకృష్ణుని కుడి చేతి చూపుడువేలుకి చేరింది. ' శిశుపాలా ! మందభాగ్యుడా !! నీ నూరుతప్పులు కాచాను. ఇక భగవద్బంధువులను, భగవంతుని తూలనాడే వాళ్లకు పడే శిక్షను అనుభవించు. ' అంటూ సుదర్శనాన్ని శిశుపాలుని వైపు వదిలాడు.  


సభికులందరూ చూస్తుండగానే, సుదర్శనచక్రం సరాసరి వెళ్లి, శిశుపాలుని కంఠాన్ని ఒక పర్వత శిఖరాన్ని కోసినట్లు కోసి, తలను మొండెము నుండి వేరు చేసింది. శిశుపాలుని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వెనువెంటనే, ధర్మరాజు, శిశుపాలుని దేహానికి ఘనంగా దహన సంస్కారాలు యేర్పాటు చేయించాడు. అప్పటికప్పుడే శిశుపాలుని కుమారుని చేదిరాజ్యానికి పట్టాభిషిక్తుని చేయించాడు. 


తరువాత, యధావిధిగా శ్రీకృష్ణునికి అగ్రతాంబూలం సమర్పించి రాజసూయయాగం పూర్తిచేశాడు ధర్మరాజు. విశేషమైన దానాలతో ధర్మరాజు బ్రాహ్మణులని, పెద్దలనీ సంతృప్తి పరచాడు. వ్యాసుడు, ధౌమ్యుడు మొదలైన పెద్దలను, బలరామకృష్ణులు, మొదలైన బంధుమిత్రులను, ఉచితరీతిన సత్కరించి వారి ఆశీర్వచనాలు పొందాడు. యాగసమాప్తి సూచకంగా అందరికీ అవబృధస్నానం జరిగింది. అనగా పవిత్ర యాగజలాలు అందరి శిరస్సులపై సంప్రోక్షణా కార్యక్రమం జరిగింది..  


వచ్చిన అతిధులందరూ ధర్మజుని శ్లాఘిస్తూ , దీవిస్తూ, యెంతో ఆనందంగా వారి వారి రాజ్యాలకు తిరిగివెళ్లారు. శ్రీకృష్ణుడు ద్వారకకు బయలు దేరుతూ, ' ధర్మనందనా ! నీవు చక్రవర్తి హోదాలో యెల్లప్పుడూ జాగరూకతతో వుండు. ప్రజల మనసులలోనుండి యెన్నడూ దూరంకాకు. జనరంజకంగా పరిపాలించు. నీ ఆప్తులకు ఆశ్రయస్థానంగా వుండు. ఎవరికైనా యేదైనా కష్టంవస్తే, మాకు ధర్మజుడు వున్నాడు, అనే విశ్వాసంతో మెలిగేటట్లు వారిని ఆదరించు. ' అని హితోక్తులు పలికి, ద్వారకు వెళ్ళాడు.  


వచ్చిన వారందరూ వెళ్లిపోగా, దుర్యోధనుడు, శకుని మాత్రం మిగిలారు. కాలక్షేప నిమిత్తం మయసభ ప్రాంగణం లోనికి వీరిరువురూ వెళ్లారు.  


వ్యాసభగవానుడు తిరిగి వెళ్లబోతుండగా, ధర్మరాజు, ' మహాత్మా ! నాకొక సంశయం పట్టి పీడిస్తున్నది. ఈ శిశుపాలుని మరణంతో, వుపద్రవాలు అన్నీ తగ్గుముఖం పట్టినట్లేనా ? ప్రజలు నిశ్ఛయింతగా ఉండవచ్చా ? ' అని ప్రశ్నించాడు. అప్పడు వ్యాసుడు, ' యుధిష్ఠరా ! నీ కారణంగానే, ఈ ఉత్పాతాలు పదమూడు సంవత్సరాలు కొనసాగుతాయి. సమస్త క్షత్రియ వినాశనం జరుగుతుంది. దుర్యోధనుని అకృత్యాల వలన, భీమార్జునుల పరాక్రమం వలన, ఈ అకృత్యాలు కార్యరూపం దాలుస్తాయి. నీ చర్యలు కారణభూతంగా వుంటాయి. కాల మహిమను నిరోధించే శక్తి యెవరికీ లేదు. రానున్న దాని గురించి మనసు పాడిచేసుకోకు. ' అని చెప్పి, శిష్యులతో కూడి, వ్యాసుడు కైలాసపర్వతం వైపు తపస్సు కొరకై బయలుదేరి వెళ్ళాడు.


వ్యాసుని మాటలు మననం చేసుకుంటూ, తనవల్ల క్షత్రియవినాశనమా అని ధర్మజుడు బాధపడసాగాడు.  


స్వ స్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందామా !


తీర్థాల రవి శర్మ

విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం. హిందూపురం.

9989692844

విషయం జ్ఞానం

 విషయం జ్ఞానం 

వస్తు జ్ఞానం గురుంచి మనం తెలుసుకున్నాము ఇప్పుడు విషయజ్ఞానం గూర్చి తెలుసుకుందాము. వస్తుజ్ఞానం అంటే మనం చూసే వస్తువుల గురించి జ్ఞానం. మన ముందు వున్న వస్తువుల జ్ఞానం తెలుసుకోవటం కొంత సరాళము ఎందుకంటె వస్తువులు మనకు ప్రత్యక్షంగా గోచరిస్తూవున్నాయి. కానీ విషయజ్ఞానం దానికన్నా బిన్నంగా ఇంకా కొంచం క్లిష్టంగా ఉంటుంది. నీకు అర్ధం చేయటానికి ఒక చిన్న ఉదాహరణతో వివరిస్తాను. మనం ఒక కంప్యూటరు చూస్తూవున్నామనుకోండి దానిలోని హార్డ్ వెరే వస్తుజ్ఞానం అదే విధంగా దానిలోని హార్డ్ వెరే విషయజ్ఞానం. 

విషయం జ్ఞానం మనకు ప్రత్యక్షంగా గోచరించక పోయిన అప్రత్యక్షంగా దాని ఉనికి గోచరిస్తుంది అంటే అది అప్రత్యక్ష ప్రమాణం. 

స్పందనలు తెలియచేయాండి

దేశ విదేశాలలో అనేక మంది ఈ బ్లాగు చూస్తున్నారని తెలియచేయటానికి సంతోషిస్తున్నాము. మీరు మీకు నచ్చిన పోస్టు చుసిన వెంటనే ఆ పోస్టుకు మీ స్పందనలను తెలియచేయగలరు. దానిద్వారా ఈ బ్లాగుని ఇంకా మంచిగా తీర్చిదిద్దటానికి తోడ్పడుతుంది. అంటే కాక మీరు కూడా మీకు నచ్చిన మీరు మెచ్చిన విషయాలను ఇక్కడ కామెంట్ రూపంలో పెట్టగలరు. వాటిని ఎంచి పబ్లిష్ చేయబడును. మీ సహాయ సహకారాలు ఈ బ్లాగు నిర్వహణకు సర్వదా దోహద పడుతాయి.  

మీరు ఫాలోవరులు కాగలరు, మరియు మీ మెయిల్ అడ్రస్ బాక్స్ లో నింపితే ఇక్కడ పెట్టె ప్రీతి పోస్టు మీకు మెయిల్ ద్వారా తెలియ చేయబడును. మీరు బ్లాగర్కు ఏమైనా వ్యక్తిగతముగా వివరించదలచిం మీరు పైన క్రుడి వైపున వున్నా ఫారంలో పొందుపరచగలరు. 

మీ సహాయ సహకారాలు ఈ బ్లాగు నిర్వహణకు ఎల్లప్పుడు కోరుకుంటున్నాము. 


భాగవతం


 జూమ్ చేసి చూడండి భాగవతం అంతా కనిపిస్తుంది🙏

హిందూ ధర్మం - 24

 **దశిక రాము**


హిందూ ధర్మం - 24



ఇంద్రియాలకు మనసుకు సంబంధం ఉంటుంది. 5 జ్ఞానేంద్రియాలు ప్రపంచం నుంచి జ్ఞానాన్ని తెలుసుకోవడంలో, అనుభూతి చెందడంలో ఉపయోగపడితే, మిగితా 5 కర్మేంద్రియాల ద్వారా మనిషి ప్రపంచంలోకి సంకేతాలను పంపుతాడు, వివిధ పనులు చేస్తాడు. ఒక వస్తువును మీ కళ్ళతో చూస్తున్నారంటే, మీ నయనేంద్రియం (కన్ను) ద్వారా మీరు చూస్తున్న విషయం, మీ మనసుకు చేరుతుంది. మీరు మంచి పాట వినడం అంటే, మీ కర్ణేంద్రియం (చెవి) ద్వారా, ఆ విషయం మీ మనసుకు చేరుతోందని కదా. అదే మీరు మాట్లాడుతున్నారంటే, మీ వాక్కు ద్వారా మీ మనసు ఈ ప్రపంచంలోకి కొన్ని ఆలోచనలను పంపుతోంది.


 జ్ఞానేంద్రియాల ద్వారా మనసు విషయాలను గ్రహిస్తే, కర్మేంద్రియాల ద్వారా ప్రపంచం మీ మనసులో విషయాన్ని గ్రహిస్తుంది. అందుకే జ్ఞానేంద్రియాలు శరీరానికి ప్రవేశ ద్వారాలయితే, కర్మేంద్రియాలు బయటకు వెళ్ళే మార్గాలు అంటారు స్వామి పరమార్ధానంద సరస్వతీ.


 సులభంగా చెప్పుకుంటే, జ్ఞానేద్రియాల ద్వారా లోపలికి తీసుకుంటున్నారు, కర్మేంద్రియాల ద్వారా బయటకు సంకేతాలను పంపుతున్నారు, కర్మ చేస్తున్నారు.


తరువాయి భాగం రేపు......

🙏🙏🙏

సేకరణ


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://t.me/SANAATANA


**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏

https://t.me/Dharmamu

హిందూ ధర్మం* 64

 **దశిక రాము**


**హిందూ ధర్మం* 64


వెంటనే శబల దుఖిస్తూ కంటతడి పెట్టడం ప్రారంభించింది. ఎంత దీన పరిస్థితి దాపురించింది నాకు. నన్ను రాజు సైనికులు ఈడ్చుకుపోతున్నారు. నన్ను వశిష్టమహర్షి వదిలిపెట్టారా? లేకపోతే నేను మహర్షి పట్ల ఏదైనా ఘోరమైన తప్పు చేశానా? నేను మహర్షి పట్ల ఎప్పుడు భక్తితో ఉన్నాను, ఏ తప్పు చేయనేలేదు. అయినా నాకీ పరిస్థితి ఏంటి? అని ఆలోచిస్తూ శబల తనను వందల మంది సైనికులు లాక్కుని వెళుతున్నా, శక్తి పుంజుకుని వశిష్టమహర్షి పాదాలపై పడింది. బాధతో మూలుగుతు సబల వశిష్టమహర్షితో 'మీరు నన్ను ఎందుకు విడిచిపెట్టారు. నన్ను ఈ రాజు సైనికులు మీ నుంచి వేరు చేస్తున్నారు' అంటూ మొరపెట్టుకుంది.


తన సొంత సొదరితో మాట్లాడిన విధంగా వశిష్టమహర్షి ఆందోళన చెందుతూ శబలతో ఈ విధంగా అన్నారు. నేను నిన్ను విడిచిపెట్టేదిలేదు, నువ్వు నా పట్ల ఏ అపరాధమూ చేయలేదు. ఈ రాజే నిన్ను బలవంతంగా లాక్కువెళుతున్నాడు. నాకు అతనితో సమానమైన బలం లేదు కదా? ఇది కాకుండా అతడు ఇప్పుడు రాజు, బలవంతుడు, క్షత్రియుడు, ఈ భూమికి రాజు, కనుక మనం అతనికి తలవంచాలి, కాదాంటావా? ఈ అక్షౌహిణి సైన్యం నిండా ఏనుగులు, గుర్రాలు, రధాలు, ధ్వజాలు ఉన్నాయి. ఇదే అతని బలాన్ని సూచిస్తోంది అంటూ శబల శాంతి పడేలా మాట్లాడారు. (మహర్షికి బలం లేక కాదు, శక్తి ఉన్నా ప్రదర్శించడం ఇష్టంలేక అంటున్న మాటలు ఇవి.)


దానికి బదులుగా శబల ఎంతో వినయంతో 'బ్రహ్మజ్ఞాని! రాజు బలం గొప్పదే. కానీ అది బ్రాహ్మణుని బలం కంటే కాదు. ఋషి రాజు కంటే బలవంతుడు. రాజు బలం ధనం, సైన్యం, ఇతర సంపద. అవి కాలక్రమంలో నశించిపోతాయి. లేదా ఇతర రాజు దండయాత్ర చేసి ఓడిస్తే, మొత్తం పరుల పాలవుతాయి. లేదా మరణంతో నశిస్తాయి

. కానీ తపస్వులకున్న బలం అసమాన్యమైనది. అది దైవానుగ్రహం చేత లభిస్తుంది. భౌతిక సంపద కాలంలో నశిస్తుంది. కానీ ఆధ్యాత్మిక శక్తి కాలంతో పాటు రెట్టింపవుతుంది. ఎంత మంది వచ్చిన, ఎన్ని చేసిన తపోశక్తి చేత వచ్చిన బలాన్ని ఎత్తుకుపోలేరు. దానితో ఏమైనా చేయచ్చు. ఇంత గొప్ప శక్తి కలిగినప్పటికి బ్రాహ్మణుడు తనను తాను నిగ్రహించుకుంటాడు. మీ బలం అసమాన్యమైంది, మీరు విశ్వామిత్రునకంటే గొప్పవారు. మీరు తేజోవంతులు. నాకు ఆదేశం ఇవ్వండి. మీ దగ్గర ఉండడం చేత వచ్చిన శక్తితో ఈ రాజు దర్పాన్ని, బలాన్ని అంతం చేస్తాను. ఇతను చేస్తున్న ఈ దుష్కార్యానికి బదులు చెప్తాను అన్నది.


తరువాయి భాగం రేపు.....

🙏🙏🙏

సేకరణ

నిజం


 

ధార్మికగీత - 48*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                       *ధార్మికగీత - 48*

                                *****

        *శ్లో:- అలసస్య కుతో విద్యా ?*

               *అవిద్యస్య కుతో ధనం?*

                *అధనస్య కుతో మిత్రం?*

                *అమిత్రస్య కుత స్సుఖమ్?*

                                *****

*భా:- నేటి ఆధునిక సాంకేతిక యుగంలో అరచేతిలోనే అంతర్జాలం ఒదిగిన కారణంగా మానసిక, శారీరక, కాయిక శ్రమకు తావు లేకుండా పోయింది. యువతలో బాగా సోమరితనం ప్రబలమైంది. శ్రద్ధాసక్తులు, భక్తిప్రపత్తులు, దీక్షాదక్షతలతో నేర్వవలసిన "విద్య" "సోమరి"కి ఎలా అబ్బుతుంది? అబ్బదు. క్షణ క్షణంగా, కణం కణంగా ; మేధోమధనము, నిరంతరశ్రమలతో సాధ్యపడే "ధనం" "నిరక్షరకుక్షి" కి ఎలా లభిస్తుంది? లభించదు. డబ్బు లేనివాడు డుబ్బుకు కొరగాడు. హితుడు, సన్నిహితుడు,ఆప్తుడు,ఆత్మీయుడు అయిన "మిత్రుడు" అలాంటి "నిర్ధనుని"కి ఎలా దొరుకుతాడు ? దొరకడు. తల్లి,తండ్రి తరువాత లోకంలో మన సుఖాన్ని కోరుకొనేవాడు మిత్రుడొక్కడే. అలాంటి "మిత్రుడు లేనివాని"కి ఇహలోక, పరలోక సంబంధమైన "సుఖం" ఎలా ప్రాప్తిస్తుంది? ప్రాప్తించదు. కాన అన్ని అనర్థాలకు మూలం "అలసత్వమే". ఆ సోమరితనాన్ని వీడితే అన్ని సానుకూలంగా అమరుతాయి. " అలసత కూడ దించుకయు అధ్యయనంబున"; "కృషితో నాస్తి దుర్భిక్షం"; "శ్రమ ఏవ జయతే"; " కష్టే ఫలీ " అని పెద్దలు పదే పదే చెబుతుంటారు*.

                           *****

                      *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

దుర్గామాత విగ్రహాన్ని

 దుర్గామాత విగ్రహాన్ని ఏ దిశలో ప్రతిష్టాపించాలో తెలుసా?


నవరాత్రుల్లో దుర్గామాతను ఒక్కో రోజు ఒక్కో రూపంలో పూజిస్తారు. ఈ ఏడాది నవరాత్రుల ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నవరాత్రి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దుర్గామాత విగ్రహాన్ని ఏ దిశలో ఉంచాలో తెలుసా?

 

దేశంలో అత్యంత విశిష్టమైన పండుగల్లో విజయదశమి ఒకటి. ముఖ్యంగా నవరాత్రులకు ఎంతో ప్రత్యేక స్థానముంది. 9 రోజుల పాటు నిర్వహించే ఈ నవరాత్రుల్లో దుర్గామాతను ఒక్కో రోజు ఒక్కో రూపంలో పూజిస్తారు. ఈ ఏడాది నవరాత్రుల ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నవరాత్రి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దుర్గామాత విగ్రహాన్ని ఏ దిశలో ఉంచాలో తెలుసా? ఎందుకంటే మీరు ఇంట్లో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టాపించవచ్చు. అయితే సరైన దిశలో ఉంచడం ముఖ్యం. వాస్తుశాస్త్రంలో దీనికి సంబంధించిన వివరాలున్నాయి.



🌾వాస్తుశాస్త్రం ప్రకారం🌾


వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతి దేవతకకు వారికిష్టమైన దిశలు ఉంటాయి. అందువల్ల వారిని ఆయా దిక్కుల్లోనే పూజించాలి. దేవత లేదా దేవత యొక్క విగ్రహం ఏ దిశలో ఉండాలి.. భక్తులు ఏ దిశలో ఉండాలి లేదా ఆరాధించాలి అని గ్రంథాలలో వివరంగా ప్రస్తావించారు.


🍂​భవానీకి ఇవి ఎంతో ఇష్టం..🍂



దుర్గాదేవిని పడమర లేదా ఉత్తరం దిశలో ఉండాలి. కాబట్టి భక్తులు వారిని ఆరాధించేటప్పుడు దక్షి లేదా తూర్పుకు అభిముఖంగా ఉండాలి. ఈ రెండు దిశలనే దేవతకు ప్రియమైందిగా భావిస్తారు. తూర్పు లేదా దక్షిణ దిక్కుల్లో అభిముఖంగా కూర్చవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. తూర్పుకు అభిముఖంగా ఆరాధించడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. దక్షిణ దిశ వల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇలా చేయడం ద్వారా దేవుడికి నేరుగా కనెక్ట్ అవుతారని నమ్ముతారు.


🌹​ఈ రంగుల్లో ఉండాలి..🌹


వాస్తుశాస్త్రం ప్రకారం పూజమందిరంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్టున్నట్లయితే స్వస్తిక్ ను వెలుపల భాగంలో పసుపు లేదా సింధూరం గుర్తించేలా చూసుకోండి. భవానీ విగ్రహాన్ని గుర్తించినప్పుడల్లా అది పెద్దదిగా ఉండకూడదని గుర్తించుకోండి. మూడంగుళాల కంటే పెద్ద విగ్రహం ఇంట్లో ఉండకూడదు. అలాగే విగ్రహం రంగు, పూజగది రంగు లేత పసుపు, ఆకుపచ్చ లేదా గులాబీ రంగులో ఉంచాలి. ఇది సానుకూల శక్తిని సృష్టిస్తుంది. ఇదే సమయంలో కుటుంబ జీవితంలో ఆనందం, శ్రేయస్సును పెంచుతుంది. ***సేకరణ

పరమ ఏకాదశి


 పరమ ఏకాదశి లేక మతత్రయ ఏకాదశి 

పరమ ఏకాదశి 11 వ రోజున , అంటే మన క్యాలెండర్‌లోని *'అధిక మాసం'* యొక్క కృష్ణ పక్ష (చంద్రుని చీకటి పక్షం) సమయంలో *'ఏకాదశి'* తిథిని ఆచరిస్తారు. 

గ్రెగోరియన్ క్యాలెండర్లో , ఇది జూలై-ఆగస్టు నెలల మధ్య వస్తుంది. *హిందూ క్యాలెండర్లో , అధిక మాసం అనేది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సంభవించే ఒక అదనపు చంద్ర నెల.* చాలా సందర్భాలలో ఈ అధిక మాస నెల 'ఆశాడా' నెలలో వస్తుంది , పరమ ఏకాదశిని 'ఆశాధిక మాసా ఏకాదశి' అని కూడా పిలుస్తారు. ఈ నెల చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు విష్ణువుకు అంకితం చేయబడినది. కాబట్టి పరమ ఏకాదశిని *'పురుషోత్తం కమల ఏకాదశి'* అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశిని పాటించడం భౌతిక పురోగతిని తెస్తుందని మరియు జీవితకాలంలో చేసిన అన్ని పాపాలను కడిగివేస్తుందని నమ్ముతారు.


_*పరమ ఏకాదశి ఆచారాలు:*_

పరమ ఏకాదశి రోజున భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. వారు ఆహారాన్ని అస్సలు తినరు కాని కొందరు భక్తులు పండ్లు మరియు పాల ఉత్పత్తులను తినడం ద్వారా ఈ వ్రతాన్ని పాటిస్తారు. అన్ని ఇతర ఏకాదశి వ్రతాల మాదిరిగానే , ఈ రోజున ఉపవాసం కూడా *'దశమి'* నుండి ప్రారంభమవుతుంది. ఈ వ్రత చేసేవారు ఉప్పును ఉపయోగించకుండా తయారుచేసిన ఆహారాన్ని తింటారు. ఏకాదశి రోజున ఆహారం యొక్క ఆనవాళ్ళు కడుపులో ఉండకుండా ఉండటానికి ఇది జరుగుతుంది. పరమ ఏకాదశి వ్రతం ఒక బ్రాహ్మణుడికి ఆహారాన్ని అర్పించిన తరువాత 'ద్వదాశి' తిథిపై ముగుస్తుంది.

ఏకాదశి విష్ణువును ఆరాధించడానికి అంకితం చేయబడింది , అందుకే ఈ రోజు కూడా భక్తులు తమ దేవుడికి పూర్తి భక్తితో ప్రార్థనలు చేస్తారు. విష్ణువు విగ్రహాన్ని పువ్వులు , తులసి ఆకులు , పండ్లు , మరియు ధూపాలతో పూజిస్తారు.

పరమ ఏకాదశిపై *'విష్ణు సహస్రనామం' జపించడం , 'విష్ణు పురాణం'* చదవడం శుభంగా భావిస్తారు. వ్రతాన్ని చేసేవారు *'పరమ ఏకాదశి వ్రత కథ'* ను కూడా తప్పక చదవాలి. భక్తులు కూడా విష్ణువు ఆలయాలను సందర్శిస్తారు మరియు రాత్రంతా భక్తి పాటలు మరియు భజనలు వింటారు. బ్రాహ్మణులకు ఆహారాలు మరియు బట్టల రూపంలో విరాళాలు ఇవ్వడం కూడా పరమ ఏకాదశి రోజున ఎంతో సంతోషాన్నిస్తుందని నమ్ముతారు.


_*పరమ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత:*_

పరమ ఏకాదశి వైష్ణవుల అత్యంత శుభమైన ఏకాదశి ఆచారం. ఈ వ్రాతం చేసేవారు పునర్జన్మ చక్రం నుండి స్వేచ్ఛ పొందుతాడు మరియు మరణం తరువాత నేరుగా *'వైకుంఠం'* కు వెళతారు అనేది బలమైన నమ్మకం. ఇది మాత్రమే కాదు, పరమ ఏకాదశి ఉపవాసం ద్వారా , వ్యక్తి మరణించిన పూర్వీకులు కూడా శాంతిని పొందుతారు. హిందూ ఇతిహాసాల ప్రకారం , ఈ వ్రతాన్ని ఒకప్పుడు కుబేరుడు చేసాడు , తరువాత అతన్ని విష్ణువు చేత *'సంపద ప్రభువు'* గా నియమించారు. పరమ ఏకాదశి వ్రతం యొక్క శక్తి దాని పరిశీలకుడి జీవితం నుండి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించగలదు. పరమ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను వివిధ మత హిందూ గ్రంథాలలో చదవవచ్చు. ఈ వ్రతాన్ని మతపరంగా పాటిస్తున్నవారికి విష్ణువు యొక్క ఆశీర్వాదం మరియు ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది.


_*పరమ ఏకాదశి వ్రత కథ*_

శ్రీ యుధిష్ఠిరా మహారాజు శ్రీ కృష్ణుడిని *“ప్రభూ , పురుషోత్తమ అదనపు , లీప్ - ఇయర్ నెల యొక్క చీకటి పక్షం (కృష్ణ పక్ష) సమయంలో సంభవించే ఆ ఏకాదశి పేరు ఏమిటి ? దీన్ని సరిగ్గా పరిశీలించే ప్రక్రియ ఏమిటి ? దయచేసి ఇవన్నీ నాకు వివరించండి ? ”*


శ్రీకృష్ణుడు ఇలా బదులిచ్చారు.


*“ఓ యుధిష్ఠిరా , ఈ పురస్కార దినాన్ని పరమ ఏకాదశి అంటారు. ఇది ఆనందించే జీవితం యొక్క గొప్ప పుట్టుక మరియు మరణం నుండి విముక్తుడిని చేస్తుంది. దీనిని పరిశీలించే ప్రక్రియ కార్తీక ఈ నెలలో కాంతి భాగంలో సంభవించే ఏకాదశిని గమనించడానికి సమానంగా ఉంటుంది. నేను ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన కథ చెబుతాను , కంపిల్య నగరంలోని గొప్ప ఋషి నుండి విన్నాను.


ఒకప్పుడు సుమేధ అనే ధర్మబద్ధమైన బ్రాహ్మణుడు తన భార్య పవిత్రతో కలిసి తన భర్త పట్ల అంకితభావంతో కంపిల్యలో నివసించాడు. తన మునుపటి జీవితంలో కొంత పాపం చేసిన కారణంగా , సుమేధకు డబ్బు లేకుండా ఉంది మరియు అతనికి తగినంత ఆహారం , దుస్తులు , ఆశ్రయం లేదు. అతని భార్య పేదరికం ఉన్నప్పటికీ సుమేధకు నమ్మకంగా సేవ చేస్తూనే ఉంది. అతిథులు వచ్చినప్పుడు ఆమె వారికి తన స్వంత ఆహారాన్ని ఇస్తుంది.


సుమేధ ఒక రోజు పవిత్రతో , 'నేను ధనికుల నుండి భిక్షాటన చేస్తున్నాను , కానీ ఏమీ పొందలేను. అందువల్ల దయచేసి దేశాలకు వెళ్లి కొంత సంపద సాధించడానికి నన్ను అనుమతించండి. '


పవిత్ర అతనికి చాలా గౌరవం మరియు ఆప్యాయతతో సమాధానమిచ్చాడు: 'ధుఃఖంలో ఉన్నప్పటికీ , ఇతరుల సంక్షేమం పట్ల ఆసక్తి ఉన్నవాడు మీలాగే మాట్లాడుతాడు. ఏది ఏమయినప్పటికీ , ఒక వ్యక్తి తన జీవితంలో ఏ సంపదను సంపాదించుకున్నాడో , అతడు మునుపటి జీవితాల్లో దానధర్మాలు ఇవ్వడం వల్లనేనని , ఒకరు దానధర్మాలు ఇవ్వకపోతే , అతను బంగారు మట్టిదిబ్బ పైన కూర్చున్నప్పటికీ , అతను ఇంకా పేదవాడిగా ఉంటాడని గ్రంథాలు చెబుతున్నాయి . కాబట్టి , దయచేసి నాతో ఉండండి మరియు మనకు లభించే సంపదతో సంతృప్తి చెందండి. '


ఇది విన్న సుమేధ తిరిగి ఉండాలని నిర్ణయించుకుంది. ఒక రోజు కౌండిన్య అనే గొప్ప ఋషి వారి స్థానానికి వచ్చాడు , అతన్ని చూడగానే సుమేధ మరియు అతని భార్య ఆయనకు నమస్కారం చేశారు. '' ఈ రోజు మీ దర్శనం పొందడం ద్వారా , 'నేను చాలా అదృష్టవంతుడిని అయ్యాను' అని సుమేధ అన్నారు. వారు భరించగలిగినట్లుగా వారు ఋషికి ఆహారం ఇచ్చారు, తరువాత , పవిత్ర ఋషిని అడిగాడు , 'ఓహ్ చాలా నేర్చుకున్నాడు , మన పేదరికం నుండి ఉపశమనం పొందడానికి మనం ఏ విధానాన్ని అనుసరించవచ్చు ?'


కౌండిన్య ఒక క్షణం ప్రతిబింబిస్తూ , 'హరి ప్రభువుకు చాలా ప్రియమైన రోజు ఉంది. ఈ రోజు ఉపవాసం అన్ని రకాల పాపాలను తొలగిస్తుంది. మరియు పేదరికం వల్ల కలిగే అన్ని కష్టాలను తొలగిస్తుంది. అదనపు , లీపు - ఇయర్ నెల యొక్క చీకటి భాగం (కృష్ణ పక్ష) సమయంలో సంభవించే ఈ ఉపవాసం రోజును పరమ ఏకాదశి అంటారు. ఇది విష్ణువు యొక్క అత్యున్నత రోజు , అందుకే పరమ అని పేరు.


ఈ పవిత్ర ఉపవాసాన్ని ఒకప్పుడు కుబేరుడు నమ్మకంగా పాటించాడు. శివుడు కుబేరుని ఎంత కఠినంగా ఉపవాసం ఉన్నారో చూసినప్పుడు , అతను చాలా సంతోషించి , కుబేరుని స్వర్గం కోశాధికారిగా చేశాడు. అలాగే , హరిశ్చంద్ర రాజు తన ప్రియమైన భార్య మరియు కొడుకును అమ్మిన తరువాత ఈ ఏకాదశిపై ఉపవాసం ఉన్నాడు , మరియు రాజు వారిని తిరిగి పొందగలిగాడు. అందువల్ల , మీరు కూడా పరమ ఏకాదశి పవిత్రమైన ఉపవాసాలను పాటించాలి.


అప్పుడు అతను సుమేధతో ,


'ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి నాడు , మీరు అన్ని నియమ నిబంధనల ప్రకారం పంచరాత్రిక ఉపవాసాలను పాటించాలని ప్రతిజ్ఞ చేయాలి. ఉదయాన్నే స్నానం చేసిన తరువాత , మీరు మరియు మీ భార్య , మీ తల్లిదండ్రులు మరియు ఆమె మీ ఇద్దరితో పాటు , మీ సామర్థ్యం ప్రకారం ఐదు రోజులు ఉపవాసం ఉండాలి. అప్పుడు మీరందరూ విష్ణువు నివాసానికి రావడానికి అర్హులు అవుతారు.


ఈ సలహా విన్న సుమేధ మరియు పవిత్ర , పరమ ఏకాదశిని , పంచరాత్రిక ఉపవాసాలను పాటించారు , ఆ తర్వాత వారు రాజభవనం నుండి ఒక అందమైన యువరాజు తమ దగ్గరికి రావడాన్ని చూశారు. అతను వారి జీవనోపాధి కోసం ఒక అందమైన ఇల్లు మరియు మొత్తం గ్రామాన్ని ఇచ్చాడు.


ఓహ్ యుధిష్ఠిరా , ఈ రోజున ఉపవాసం ఉన్నవాడు గయాలోని తన పూర్వీకులకు అర్పణల సమర్పణలను కూడా పూర్తి చేశాడు. అతను అన్ని ఇతర పవిత్ర రోజులలో ఉపవాసం ఉన్నాడు.


పంచరాత్రిక ఉపవాసం - అదనపు , లీపు సంవత్సరం నెలలో ఐదు రోజుల (పంచ = ఐదు, రాత్రి = రాత్రులు) ఉపవాసం - అన్ని రకాల అసహ్యకరమైన పాపాలను తొలగిస్తుందని అంటారు. కానీ పంచరాత్రిక ఉపవాసం , పరమ , పద్మిని ఏకాదశి ఉపవాసాలతో కలిసి ఒక వ్యక్తి చేసిన పాపాలన్నింటినీ నాశనం చేస్తుంది. ఈ రోజుల్లో ఒక వ్యక్తి ఉపవాసం చేయలేకపోతే , అతను తన సామర్థ్యానికి అనుగుణంగా అదనపు నెలలో ఉపవాసాలను పాటించాలి. అరుదైన మానవ జననం యోగ్యతను కూడబెట్టుకోవటానికి మరియు చివరికి ఈ భౌతిక ప్రపంచం నుండి విముక్తి విడుదల కోసం ఉద్దేశించబడింది.


శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించినట్లు యుధిష్ఠిర రాజు సరిగ్గా చేసాడు మరియు అతని సోదరులు మరియు వారి భార్యలందరూ చేశారు. ఎవరైతే , సరైన స్నానం చేసిన తరువాత , ఈ రెండు అదనపు నెలల ఏకాదశిలపై ఉపవాసం పాటిస్తే వారు స్వర్గానికి వెళతారు. ఈ విధంగా స్కంద పురాణం నుండి పరమ ఏకాదశి మహిమల కథనం ముగుస్తుంది.


         *_🌷శుభమస్తు🌷_*

🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

బ్రాహ్మణుడు

 బ్రాహ్మణుడు నిత్యము ఏమేమి విధులని ఆచరించాలి?


బ్రాహ్మణుడైన వాడు నిత్య ఆచార వంతుడై, అనుష్ఠాన పరుడై, స్వాధ్యాయమును సాగించుచూ క్రొత్త విషయములను వేదములనుండి గ్రహించుచూ, తనకు తెలిసిన వాటిని తెలియని వారికి తెలుపుచూ ఉండవలెను. తాను ఎంత శ్రమకు ఓర్చి అయినను నిత్యానుష్ఠాన,దేవతార్చనాదులను ఆచరించ వలెను. ఆవిధముగా ఆచరించినపుడు మాత్రమే అతడు “భూసురుడు” అన్న మాటకు తగిన వాడు అవుతాడు. అటులకాని వాడు భూలోకమున దేవతల రూపముధరించిన కలిపురుషుడే కానీ మరొకడు కాదు.

ఇక బ్రాహ్మణుడు నిత్యము ఏమేమి చేయాలి అన్నది చాలామందికి సందేహము. అది కొంత తీర్చే ప్రయత్నము చేద్దాము.

ప్రొద్దున్నే నిద్రనుండి ౪ గం.లకు లేవాలి. ప్రాతస్మరణము,శుభవస్తు దర్శనము చేసి, కాలకృత్యములు తీర్చుకుని, నదికి గానీ తటాకమునకు గానీ వెళ్లిస్నానమాచరించవలెను.

౧. స్నానము

౨.సంధ్యోపాసనము

౩.జపాదికము

౪.ఔపాసనము

౫. పంచాయతన దేవతార్చనము

౬.బ్రహ్మయఙ్ఞము

౭. వైశ్వదేవము

౮. పంచాయతనమునకు పునః పూజ

౯. అతిథిపూజ( భోజనము)

౧౦.భోజనము

౧౧.సత్సంగము

౧౨. సాయం సంధ్యావందనము

౧౩. సాయమౌపాసనము

౧౪. రాత్రి వైశ్వదేవము

౧౫. రాత్రి దేవతార్చనము

ఇవిగాక స్వాధ్యాయము, అధ్యాపనము, యజనము-యాజనము, దానము-ప్రతిగ్రహణము,నైమిత్తికములు,శాంతులు, నిత్య లౌకిక కృత్యములు మొదలైనవి నిత్యము చేయాలి

ప్రస్తుత కాలంలో మంచి లక్షణాలు కలిగిన బ్రాహ్మణులు చాలా తక్కువగా కనిపిస్తున్నారు.

బ్రాహ్మణులకి ఉండవలసిన, ఉండకూడని లక్షణాలు ఏమిటి ?.

దైవాధీనం జగత్ సర్వం | మంత్రాధీనంతు దైవతం ||

తన్మంత్రం బ్రాహ్మణాధీనం | బ్రాహ్మణో మమ దేవత ||

ఈ జగత్తు మొత్తము దైవము యొక్క అధీనంలో వుంటుంది.

ఆ దేవతలు మంత్రముల ద్వారా సంతృప్తి చెంది, ఆ మంత్రములకు అధీనులై వుంటారు.

ఆ మంత్రము సాత్విక లక్షణములు కలిగిన బ్రాహ్మణుల అధీనంలో వుంటుంది.

అటువంటి బ్రాహ్మణులు దేవతా స్వరూపములు అని తెలుసుకోవాలి.

పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం చేత, మనుష్యులలో బ్రాహ్మణ జన్మ లభిస్తుంది. కానీ, లభించిన ఆ జన్మలో చెడు మార్గాల వైపు ప్రయాణం చేస్తూ వుంటే మాత్రం, అందుకు తగిన పరిహారం ఖచ్చితంగా చేల్లించుకోవాలి. వచ్చే జన్మ సంగతి ఎలా వున్నా, ఈ జన్మలోనే ముందు ఆ దోషముల ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఉద్యోగాలు చేసుకునే బ్రాహ్మణుల విషయం ఎలా వున్నా, కనీసం వైదికంలో వుండే బ్రాహ్మణులు (హిందూ ప్రీస్ట్) మాత్రం కొన్ని కనీస నియమాలు పాటించాలి. అవి పాటించటం కష్టం అనుకుంటే, వైదికవృత్తి వదిలేసి వేరే వృత్తి చూసుకోవటం మంచిది.

బ్రాహ్మణుడికి ఉండవలసిన కనీస లక్షణాలు :

యజ్ఞోపవీత (జంధ్యం) ధారణ :

కేవలం యజ్ఞోపవీతం ధారణ చేయటమే కాకుండా, దానికి సంబంధించిన నియమాలు పాటించాలి.

నిత్య సంధ్యావందనం :

నిత్యం ఖచ్చితంగా సంధ్యావందనము, గాయత్రీ జపము చేస్తూ వుండాలి.

శిఖా సంస్కారం (పిలక), చెవి పోగులు :

బ్రాహ్మణులకి శిఖా సంస్కారం (పిలక) మరియు చేవిపోగులు ఖచ్చితంగా వుండాలి. ఎవరైనా బ్రాహ్మణులు శిఖ లేకుండా బ్రాహ్మణ వృత్తి చేస్తూ వుంటే, అతనికి తన వృత్తి పట్ల, దేవతల పట్ల నమ్మకం లేదు అని తెలుసుకోవాలి. అంతే కాకుండా, అతను సమాజాన్నీ, భక్తులనీ మోసం చేస్తున్నాడు అని తెలుసుకోవాలి. అతనిని గౌరవించవలసిన అవసరం లేదు. సంస్కారాలకి విలువ ఇవ్వనివాడు ఎంత చదువుకున్నా ప్రయోజనం లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే శిఖ లేనివాడు బ్రాహ్మణుడే కాదు.

పవిత్రద్రవ్య ధారణ :

ముఖము నందు బ్రహ్మ తేజస్సు కనిపించాలి. ఎల్లవేళలా, నుదిటిన కుంకుమ లేక విభూది లేక గంధము ధరించినవాడై వుండాలి. వారిని చూస్తే గురు భావన కలగాలి.

ప్రశాంతంగా ఉండుట :

ఎప్పుడూ ప్రశాంతంగా వుండాలి తప్ప, కోపము, చికాకు, విసుకు, అయిష్టము, ద్వేషము వంటి గుణములు వుండకూడదు. నిగ్రహం లేనివ్యక్తి దేవతా అర్చానాదులకి అర్హుడు కాడు.

స్పష్టంగా మాట్లాడుట :

మాట్లాడే మాట స్పష్టంగా వుండాలి. మనస్సులో ఒకటి, బయటికి చెప్పేది వేరొకటి వుండకూడదు. సత్యమే మాట్లాడాలి. మాటలో వెకిలితనం, గర్వం, ఇతరులని నిందించటం వంటివి వుండకూడదు. అట్లాగే, ఇతరులకి చెడు కలిగే మాటలు మాట్లాడకూడదు.

చెడు వ్యసనములు లేకుండుట :

మాంసం, మద్యం, పొగ త్రాగటం, మత్తు పదార్థాలు నములుతూ వుండటం పనికిరాదు. పర స్త్రీ, పర ధనం గురించి వ్యామోహం వుండకూడదు.

సమ భావన :

ధనిక, బీద అనే తేడా లేకుండా అందరితో సమ భావన కలిగి వుండాలి.

కేవలం, పైన చెప్పిన లక్షణాలే కాకుండా ఇంకా అనేక అంశాలు వుంటాయి. కనీసం, పైన చెప్పిన లక్షణాలు వుంటే అతను మంచి బ్రాహ్మణుడు అని చెప్పవచ్చు. వైదికాన్ని (అర్చకత్వ, పురోహిత లేక ఆగమం) ఒక డబ్బు సంపాదించే వృత్తిగా మాత్రమే భావిస్తూ, డబ్బుతో బాటు చెడు వ్యసనాలు కూడా కలిగినవారిని గౌరవించాల్సిన అవసరం లేదు.

కానీ, నిస్వార్థంగా లోకశ్రేయస్సు కోసం దేవతా అర్చన, ఆరాధనలు చేస్తున్న బ్రాహ్మణులకు ఏ కష్టం రాకుండా కాపాడుకునే బాధ్యత సమాజంలో ప్రతి వ్యక్తి పైనా వుంది. బ్రాహ్మణులు, గోవులు సుభిక్షంగా వున్నంత కాలం లోకం సుభిక్షంగా వున్నట్లే అని గ్రహించాలి.

మనీషీ






 

ప్రసాదములు తయారు చేసే విధానం

 దేవీ నవరాత్రులు సమీపించుచున్న శుభతరుణంలో అమ్మవారి ప్రసాదములు తయారు చేసే విధానం 


1.! శ్రీ బాలత్రిపురసుందరిదేవి !! 


మొదటి రోజు.


!! పొంగల్ !!!! కావలసినవి !!


పెసరపప్పు 150 గ్రాం

కొత్త బియ్యం 100 గ

మిరియాలు 15

పచ్చిమిరప కాయలు 6

పచ్చి కొబ్బెర 1 కప్

కాచిన నెయ్యి 1/4 కప్

జీడిపప్పు 15

జీర 1/2 టేబల్ స్పూన్

ఆవాలు 1/4 టేబల్ స్పూన్

ఎండుమిర్చి 3

మినపప్పు , శనగపప్పు 2 టేబల్ స్పూన్స్

కోత్తమిర , కరేపాకు , తగినంత

ఉప్పు రుచిని బట్టి

ఇంగువ 2 చిటికెళ్ళు.


!! చేయవలసిన విధానము !!


దళసరి పాత్రలొ లో కాస్త నేయి వేడి చేసి

పెసరపప్పుని దోరగా ఏయించండి .బియ్యం కడిగి నీళ్ళన్నీ తీసేసిన తరువాత బియ్యం కూడా బాగా వేయించండితెలుపు రంగు పోకూడదు సుమా 5 nimushaalu

వేపితే చాలు పెసరపప్పుకూడ కలర్ మార కూడదు,


అదే మూకుడులో మరికాస్త నెయ్యి వేసి

జీడిపప్పులను వేయించి పెట్టడి.సన్నగా తరిగిన పచ్చి మిర్చిపచ్చికొబ్బెర Kori , జిలకర miriyaalu వేయించిన బియ్యం

పెసరపప్పు ఇవన్నీ 4 కప్పుల నీళ్ళతో

కుక్కర్లో వుంచి 3 whistles / కూతలు వచ్చాక ష్టవ్ కట్టివేయడం చేయండి.


చల్లారాక అందులో ఆవాలు , మినపప్పు ,

శనగపప్పు , జిలకర్ర , ఎండుమిర్చి ,ఇంగువ, కరేపాక్ వేసి తాలింపు పెట్టిమిగిలిన నేయ్యి అంతా పొంగలిలో వేసివేడి వేడి ప్రసాదము ఆతల్లి త్రిపురసుందరీదేవికి నైవేద్యంపెట్టి

భక్తిగా పూజించి ఈ దసరా 10 రోజులు మాకు శక్తినిచ్చి నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లీ అని ప్రార్ధించాలి .

 


2 .గాయత్రి దేవి !! 


రెండవ రోజు


!! పులిహోర !! కావలసినవి !!


బియ్యం 150 గాం

చింతపండు 50 గ్రాం

పసుపు1/2 స్పూన్

ఎండుమిర్చి 5

ఆవాలు 1/2 స్పూన్

మినపప్పు 1 స్పూన్

శనగ పప్పు 2 స్పూన్

వేరు శనగ పప్పు 1/2 కప్పు

కరివేపాకు 2 రెబ్బలు

ఇంగువ చిటికెడు

నూనె 1/4 కప్పు

ఉప్పు తగినంత

బెల్లం కొద్దిగా


!! చేయవలసిన విధానం !!


అన్నం వండి చల్లార్చి పసుపు , ఉప్పు , కలిపి పెట్టాలి .చింతపండును అరకప్పు నీళ్ళు పోసి

నాన పెట్టి ,చిక్కటి గొజ్జు తీసి పెట్టండి, మూకుడులో కాస్త నూనె వేసి అందులో ఆవాలు ఎండుమిర్చి వేసి ఈ చింతపండు గొజ్జు వేసి కాస్తబెల్లం వేసి బాగా వుడికించండి (కావాలంటే పచ్చి మిర్చి వేసుకోవచ్చుగుజ్లో )

వుడికిన గొజ్జు అన్నంలో కలిపండి .


బాణలిలో నూనె వేడి చేసి ముందుగా ఆవాలు ,మినపప్పు , శనగ పప్పు , ఇంగువ , ఎండుమిర్చి , వేసి ఆ వాలు చిటపట అన్న తరువాతవేరుశనగ గుళ్ళు వేసి అన్నీ బాగా వేగాక కరేపాక్ వేసి , అన్నంలో కలపడమే కమ్మటి పులిహోర రెడీవ్వగానే శ్రీ జగదీశ్వరీ మాతైన ఆ గాయిత్రి దేవికి నైవేద్యం పెట్టి ఆ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకొందాము


3 .! అన్నపూర్ణా దేవి !! 


మూడవ రోజు


!! కొబ్బెరన్నం !కావలసినవి !!


బియ్యం 1/2 కిలో

తురిమిన పచ్చికొబ్బెర 1 కప్

పచ్చిమిర్చి 5

కరేపాక్ , కోత్తమిర , ఉప్పు .

పోపు సామాగ్రి ఎండుమిర్చి , ఇంగువ .

జీడి పప్పు 10

నూనె , 1/4 కప్

నెయ్యి 1 టెబల్ స్పూన్


!! చేయవలసిన పద్ధతి !!


అన్నం పోడి పోడి గా వండుకొనిపచ్చికొబ్బెర కాస్త నేతిలో వేయించి ఈ వేగిన కొబ్బెర అన్నంలో కలిపండి .


అదే మూకుడులో నూనె వేసి పోపుసామాగ్ర వేసి ఎండుమిర్చి , ఇంగువ , వేసి ఆవాలు చిటపట చిటపట అనగానేపొడవుగా తరిగిన పచ్చిమిరప కాయలు , కరే పాక్ , కోత్తమిర ,

అందులో వేసి తీసేయండి ఈ వేగనిచ్చినదం తా అన్నంలో కలిపి ఉప్పు జీడిపప్పుకూడ వేసి పైన కాస్త కోత్తిమీర చల్లండి కమ్మటి కొబ్బెరన్నం రెడి .


శ్రీ అన్నపూర్ణా దేవికి నైవేద్యం పెట్టి మనస్సు పూర్తిగా ప్రార్థించి అమ్మ కృప కు పాత్రులగుధా.

 


  4 .లలితా దేవి !!


నాల్గవ రోజు


!! అల్లం గారెలు కావలసినవి !!


మినపప్పు2 కప్స్

అల్లం చిన్న ముక్క

పచ్చిమిరప కాయలు 6 సన్నగా తరిగినవి

జీరా 1/4 స్పూన్

ఉప్పు రుచికి తగినంత

కరేపాక్ , కోత్తమిర తగినంత

నూనె గారెలు వేయించేందుకు


!!! చేసే విధానం !!!


మినపప్పు బాగా కడిగి 4 , 5 , గంటలు (hours) నానపెట్టి ( లేకుంటే ముందు రోజు రాత్రి నానపెట్టుకొండి ) .


నానిన మినపప్పును గ్రైండర్లో వేసి , ఉప్పు , కాస్త సోడ , వేసి బాగా గ్రైడ్ చేసుకోండి . ఆ పిండిలో అల్లం,పచ్చిమిరప కాయలు కరివేపాకు, కోత్తమిర , సన్నగా తరిగి వేసి కాగిన నూనెలో ఈ మినపిండిని చేతిలో తీసుకొని రౌడుగా అదిమి నూనెలో విడచాలి .


దోరగా వేగిన వడలను , సహస్రనామాలతో ఆ శ్రీ లలితాదేవి కి ఆరాధించి నైవేద్యం పెట్టి 

ఆశీర్వాదం పొందుదాము


  5 .! సరస్వతి పూజ !!


ఐదవ రోజు


!! పెరుగన్నం , దద్ధోజనం !!కావలసినవి !!


బియ్యం 1/4 కిలో

పాలు 1/2 లీ

చిక్కటి పెరుగు 1/2 లీ

నూనె 1/2 కప్పు

నెయ్యి 1 స్పూన్

కొత్తమిర , కరివేపాకు

చిన్న అల్లం ముక్క

పచ్చిమిర్చి

పోపు సామాగ్రి

జీడిపప్పు 20

ఉప్పు , ఇంగువ ఎండుమిర్చి


!! చేసే విధానం !!


ముందు బియ్యం కడిగి అన్నం వండి , కాస్త చల్లారాక కాచినపాలు , పెరుగు , ఉప్పు , వేసి బాగా కలిపి వుంచండి,


సన్నగా తరిగిన చిల్లి , కొత్తమిర ,కోరిన అల్లం ,అన్నీరెడ్డిగ్గా వుంచుకొని ష్టవ్ పై మూకుడుంచి అందులో నునె వేసి పోపు కావలసినవన్నీ వేసిఎండుమిర్చి ఇంగువ తో పాటు తరిగి వుంచిన వన్నీ వేసి బాగా వేగనిచ్చి పెరుగులో కలిపికాస్త నేతిలో జీడి పప్పులు వేయించి అవీవేయండిరుచికరమైన దద్ధోజనం అంటే ఆ చదువుల తల్లికి అంత మక్కువ ఆ తల్లి దీవెనలతో అందరూ బాగా చదివి అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుతూ ప్రార్థించాలి.


6 !! శ్రీ మహాలక్ష్మిదేవి !!


ఆరవ రోజు


!! రవ్వ కేసరి కి కావలసినవి !!


రవ్వ 1 కప్

షుఘర్ 3/4 కప్

నెయ్యి 2 టెబల్ స్పూన్

కేసరి కలర్ / చిటికెడు.

యాలకులు 4

ఎండు ద్రాక్షా 6

జీడిపప్పు 10

మిల్క్ 1 కప్ ( మిల్క్ మేడ్ 1 )

వాటర్ 1/2 కప్


!!! చేసే విధానం !!!


ముందు మూకుడులో కాస్త నెయ్యి వేసి రవ్వ దోరగా వేయించి తీసి ప్లేట్ లోవేసివుంచండి .

మూకుడులో కాస్త నెయ్యి వేసి జీడిపప్పు , ఎండుద్రాక్షవేయించితీసివుంచండి .నీళ్ళూ ,పాలూ ,కలిపి బాగా మరగనివ్వాలి.అందులో

కేసరి కలర్ ,చెక్కర , రవ ,వేసి నెయ్యి వేస్తూ బాగాకలిపిఅందులోద్రాక్షా ,జీడిపప్పు ,మిగిలిన నెయ్యి అంతా వేసి బాగా కలిపి వేడి వేడి గా ఘుమ ఘుమగా నేతితో ఆ మహాలక్ష్మికి నైవేద్యం గా పెట్టి సౌభాగ్యం ఇవ్వమని ప్రాథించి నైవేద్యం పెట్టండి

 


7 .!! కదంబం ప్రసాదం !!


ఏడవ రోజు


!! కావలసినవి !!


కందిపప్పు 1/2 కప్

బియ్యం 1/2 కప్ ( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది )

1 వంకాయ

1/4 సొర్రకాయ

1 దోసకాయ

బీన్స్ తగినన్ని

1 పోటాటో

వేరుశెనక్కాయలు ( పీనట్ ) 2 పిడికిళ్ళు

2 మొక్కజొన్నలు

1/2 క్యారెట్

2 టోమాటో

తగినంత కరివేపాకు

కోత్తమీర

కోరిన పచ్చి కొబ్బెర 1 చిప్ప

4 పచ్చి మిర్చి

నూనె తగినంత

నెయ్యి చిన్న కప్పు

చింతపండు గొజ్జు తగినంత

కాస్త బెల్లం ( జాగిరి )

ఉప్పు , పసుపు తగినంత

3 చెంచాలు సాంబర్ పౌడర్

పోపు గింజలు ,ఎండుమిర్చి, ఇంగువ .


!!!! చేయవలసిన విధానము !!!!


ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కోని వుంచుకోండి


కుక్కర్లోకందిపప్పు ,బియ్యం ,పీనట్ ,టోమాటో తప్ప అన్నీ కూరగాయలు వేసి

పసుపు , ఉప్పు ,నీళ్ళు 5 పావులు వేసి రెండు విజిల్ వచ్చాక stove off చేయండి .

మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాతపచ్చిమిర్చి ,కరేపాకు ,టొమాటో ,చింతపండు గొజ్జు ,సాంబర్ పౌడర్ , జాగిరి .వేసి బాగా వుడికిన తరువత ఆ గ్రేవి అంతావుడికినరైస్లోవేసి,కోత్తమీర ,కరేపాక్ ,నెయ్యి వేసిమరోసారి వుడికించండి అంతా బాగావుడికినతరువాత ,ఎండుమిర్చి ,ఇంగువతో తాలింపు పెట్టికొబ్బరి కలిపి దించండి వేడి వేడిగా దుర్గాదేవికి నెయ్యివేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి

 


8.మహిషాసుర మర్ధిని !!


ఎనిమిదవ రోజు


!! బెల్లం అన్నం కావలసినవి !!


బియ్యం 100 గ్రాం

బెల్లం 150 గ్రాం 

యాలకులు 5

నెయ్యి 50 గ్రాం

జీడిపప్పు 10


!! చేసే విధానం !!!


ముందుగా బియ్యం కడిగి అరగంట నానని వ్వండి .తరువాత మెత్తగా వుడికించాలి .

అందులో తరిగిన బెల్లం వేసిమొత్తం కరిగెంత వరకు వుడికించాలి .జీడిపప్పులు నేతిలో దోరగా వేయించి ,యాలకుల పొడి మిగితా నెయ్యి మొత్తంఅన్నంలోకలిపిదించేయడమే .

తియ్యని కమ్మని నైవేద్యం సమర్పించి కొని అమ్మ కృప కు పాత్రులఘుధాం.

 


9. !! రాజ రాజేశ్వరి దేవి ప్రసాదం 


తొమ్మిదవ రోజు


!! పరమాన్నం కావలసినవి !!


చిక్కటి పాలు 6 కప్స్ ( 1 టిన్ మిల్క్ మేడ్ ) బియ్యం 1 కప్

Sugar 1,1/2 కప్స్

ద్రాక్షా , జీడిపప్పు 1/4 కప్

ఏలకలుపౌడర్ 1/2 స్పూన్

నెయ్యి 5 టేబల్ స్పూన్స్


!! చేసే విధానం !!


ముందు దట్టమైన వెడల్పాటి పెద్ద గిన్నెలో కాస్త నెయ్యి వేసిఅందులో బియ్యం పోసి పచ్చి వాసన పోయెంత వరకు వేయించండి

తరువాత పాలు , ఏలక పౌడర్ , వేసి కుక్కర్`లో 2 విజిల్ వచ్చెంత వరకు వుంచండిఅది పక్కన పెట్టి చిన్న మూకుడు ష్టవ్ పై వుంచిఅందులో కాస్త నెయ్యి వేసి ఈ ఎండు ద్రాక్ష. ద్రాక్షా , జీడిపప్పు దోరగా వేయించి వుంచండి .చల్లారిన కుక్కర్ మూత ఓపన్ చేసి వుడికిన అన్నానికి చెక్కరవేసి

ఒక్క 5 నిముషాలు మళ్ళీ వుడికించి

( అలా వుడికి నప్పుడు బియ్యం పాలు చక్కర కలుసుకొని చిక్కగా కావాలి )

అందులో వేయించిన జీడిపప్పు అవి వేసి బాగా కలిపి కస్త నెయ్యి వేసి వేడి వేడి గా ఆ రాజ రాజేశ్వరిదేవికి నైవేద్యం పెట్టండి


10. ప్రధాన దేవత ను సర్వాభరణములతో అలంకారం.పదవ రోజుఈ తొమ్మిది రోజులూ చేసిన అన్ని ప్రసాదములను నైవేద్యముగా ఏట్టాలి .


*ఓం శ్రీ మాత్రే నమః*

🙏🔱🙏🔱🙏🔱🙏🔱🙏🔱🙏