🚩🚩
దేనిని కాపాడుకోవాలి?
🚩🚩
ఒక సాధువు వద్ద శిష్యులు గా వున్న విద్యార్థులు గురుకులం
లో శిక్షణ ముగించుకొని
ఆశీశ్శులు తీసుకుని బయలుదేరడానికి సిధ్ధమయ్యారు.
"ధర్మాన్ని రక్షిస్తూ న్యాయ మార్గంలో పయనించండి"
అని గురువు ఆశీర్వదించాడు.
ధర్మాన్ని కాపాడ్డానికి, నీతి ని కాపాడాలి కదా? అనే
సందేహం కలిగింది శిష్యులకి. అర్ధం చేసుకున్న గురువు వారు
అడగకుండానే ముందుగానే చెప్పాడు.
" నీతి అనేది ప్రాంతానికి, వున్న పరిస్థితులకి తగ్గట్టు మారుతుంది. మనిషికి తగ్గట్టు మారేది నీతి. ఉదాహరణకు వెనుకటి విరోధంతో , ఒకరిని చంపెయ్యడం హత్య. అటువంటి సమయంలోనే, ఎదుటి పక్షం వీరులతో పోరాడి
చంపడం హత్య అనబడదు..వీరం అనిపించుకుంటుంది.
ఈ విధంగా నీతి మారుతూ వుంటుంది.
కావున దానిని కాపాడలేము. కాని ధర్మం
మారదు . అందు వలన ధర్మాన్ని కాపాడడం అవసరం. "
అర్ధం చేసుకున్న శిష్యులు
సందేహనివృత్తులై బయలుదేరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి