ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
15, అక్టోబర్ 2023, ఆదివారం
విదురనీతి
విదురనీతి
సుధన్వోవాచ సుధన్వుడిట్లన్నాడు.
శ్లో)పితాపుత్రౌ సహాసీతాం ద్వౌవిప్రౌక్షత్రియావపి|
వృద్ధౌవైశ్యౌచ శూద్రౌచ నత్వన్యావితరేతరమ్ ||
అ)తండ్రి - కొడుకులు, ఇద్దరు బ్రాహ్మాణులు, ఇద్దరు క్షత్రియులు, ఇద్దరు వృద్ధులు, వైశ్యులు, శూద్రులు కూడ ఇద్దరేసి ఒక ఆసనం పైన కూర్చుండవచ్చును. ఇతరులు కూర్చొనకూడదు
మహాభారతములో - ఆది పర్వము*
*మహాభారతములో - ఆది పర్వము*
*తృతీయాశ్వాసము*
*24*
*అర్ధాంతరంగా ఆగిపోయిన సర్పయాగం*
తరువాత జనమేజయుడు ఋత్విక్కులకు దక్షిణాది సత్కారాలను చేసాడు. వ్యాస భగవానుని చూసి మీవంటి పూజ్యులచే పంచి ఇవ్వబడిన రాజ్యాన్ని పాలించకుండా కురు పాండవులు యుద్ధం ఎందుకు చేసారు అని అడిగాడు. వ్యాసుడు వైశంపాయుని చూసి జనమేజయునకు భారత కథను వివరించమని ఆదేశించాడు. జనమేజయుడు వైశంపాయునకు పూజలు చేసి బంధు మిత్ర పురోహిత సహితంగా భారతగాధను వినడానికి అతని ముందు కూర్చున్నాడు.
*ఉపరిచరవసువు*
చేది రాజ్యాన్ని పాలిస్తున్న వసువు ఒక నాడు వేటకు వెళ్ళి అక్కడ తపమాచరిస్తున్న మునులను చూసి ముచ్చట పడి తాను కూడా తపస్సు చేయడం మొదలు పెట్టాడు. అది చూసిన ఇంద్రుడు రాజా ! రాజ్యపాలన చేయవలసిన నీకు ఈ తపస్సేమిటి నాతో స్నేహం చేస్తే నేను నీకు దైవత్వాన్ని ఇస్తాను. ఇంద్రలోకానికి వస్తూ పోతూ ఉండచ్చు అని చెప్పి ఇంద్రుడు వసువుకు ఏ ఆయుధానికి లొంగని పూల మాలనూ దుష్ట శిక్షణా శిష్ట రక్షణా సామర్థ్యం కలిగిన వేణు ఇష్టి (విమానము)ను ఇచ్చి వెళ్ళాడు. వసువు ఆ విమానం ఎక్కి ఇంద్ర లోకానికి రాకపోకలు సాగించడంతో అతనికి ఉపరిచర వసువు అనే నామాంతరం కలిగింది. ఆ తరువాత అతడు ప్రతి సంవత్సరం రాజ్యంలో ఇంద్రోత్సవాలు జరిపించ సాగాడు. చేది రాజ్యానికి సమీపంలో కోలాహలము అనే పర్వతాన్ని ఆనుకుని శుక్తిమతి అనే నది ప్రవహిస్తుండగా కోలాహలుడు ఆ నది అందానికి మురిసి ఆమెను మోహించి నదికి అడ్డం పడ్డాడు. అటుగా వచ్చి అది చూసిన వసువు నదికి అడ్డంగా ఉన్న పర్వతాన్ని తొలగించాడు. శుక్తిమతి కోలాహలునికి జన్మించిన గిరిక అనే ఆడపిల్లను వసుపదుడు అనే మగ పిల్ల వాడిని శుక్తిమతి వసువుకు బహూకరించింది. వసువు గిరికను వివాహమాడి వసుపదుడిని సేనాధిపతిని చేసాడు. ఒక రోజు వేటకు వెళ్ళిన వసువుకు భార్య గుర్తుకు వచ్చి వీర్య పతనం జరుగగా వసువు దానిని ఒక దోనెలో భద్రపరచి ఒక డేగకు ఇచ్చి గిరికకు పంపించాడు. మార్గమధ్యంలో మరొక డేగ దానిని తినే పదార్ధమని భ్రమించి కలహించడంతో ఆ దొప్పలోని వీర్యం నేరుగా బ్రహ్మ శాపవశాన చేపగా మారి యమునా నదిలో తిరుగుతున్న అద్రిక అనే అప్సర నోట్లో నేరుగా పడింది. అద్రిక గర్భం దాల్చింది. జాలరి వాళ్ళ వలలో పడిన అద్రిక గర్భంలో ఉన్న ఆడపిల్లనూ మగ పిల్లవాడిని చూసి జాలర్లు వారిని దాశరాజుకు సమర్పించారు. ఆ పిల్లవాడు పెరిగి మత్స్యదేశ రాజైనాడు. దాశ రాజు ఇంట మత్స్యగంధి పేరిట ఆ పిల్ల పడవ నడుపుతూ ఉంది.
ఇంద్రకీలాద్రిపై గాయత్రి దేవి
*రేపు ఇంద్రకీలాద్రిపై గాయత్రి దేవి అలంకారం*
*గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న దేవతా శక్తులు...*
*మహా శక్తి వంతమైన గాయత్రి మంత్రాక్షరాలు ....*
*తల్లిని మించిన దైవం , గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా ...*
ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా , ‘నా , స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో , దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని , అగ్ని నుండి వాయువు , వాయువు నుండి ఓంకారం , ఓంకారంతో హృతి , హ్రుతితో వ్యాహృతి , వ్యాహృతితో గాయత్రి , గాయత్రితో సావిత్రి , సావిత్రితో వేదాలు , వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతుదిన్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.
గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.
గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు , వారి చైతన్య శక్తులు:
*1. వినాయకుడు:* సఫలత్వ శక్తికి అధిపతి. విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ , జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
*2. నృసింహ స్వామి:* పరాక్రమ శక్తికి అధిపతి , పురుషార్థ , పరాక్రమ , వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.
*3. విష్ణుమూర్తి:* పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.
*4. ఈశ్వరుడు:*
సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
*5. శ్రీకృష్ణుడు:*
యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను , వైరాగ్య , జ్ఞాన , సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.
*6. రాధాదేవి:*
ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి , భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.
*7. లక్ష్మీదేవి:*
ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం , సంపద , పదవి , వైభవం , ధనం , యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
*8. అగ్నిదేవుడు:* తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం , శక్తి , తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.
*9. మహేంద్రుడు:* రక్షాశక్తికి అధిష్ఠాత , అనారోగ్యాలు , శతృభయాలు , భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.
*10. సరస్వతి:*
విద్యా ప్రదాత. జ్ఞానాన్ని , వివేకాన్ని , బుద్ధిని ప్రసాదిస్తుంది.
*11. దుర్గాదేవి:*
దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి , శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
*12. ఆంజనేయుడు:* నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి , నిష్ఠ , కర్తవ్య పరాయణ తత్వం , బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.
*13. భూదేవి:* ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని , ధైర్యాన్ని , దృఢత్వాన్ని , నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
*14. సూర్య భగవానుడు:* ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని , సుదీర్ఘ జీవనాన్ని , ప్రాణశక్తికి , వికాసాన్ని , తేజస్సును ప్రసాదిస్తాడు.
*15. శ్రీరాముడు:*
ధర్మం , శీలం , సౌమ్యత , మైత్రి , ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.
*16. సీతాదేవి:* తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి , అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.
*17. చంద్రుడు:*
శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం , క్రోధం , మోహం , లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.
*18. యముడు:* కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.
*19. బ్రహ్మ:*
సకల సృష్టికి అధిష్ఠాత.
*20. వరుణుడు:* భావుకత్వాన్ని , కోమలత్వాన్ని , దయాళుత్వాన్ని , ప్రసన్నతను , ఆనందాన్ని అందిస్తాడు.
*21. నారాయణుడు:* ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
*22. హయగ్రీవుడు:* సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని , సాహసాన్ని ప్రసాదిస్తాడు.
*23. హంస:*
వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.
*24. తులసీ మాత:* సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి , దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.
*శ్రీ గాయత్రీ మాత మహాత్యం :*
వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.
*ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత* *త్సవితుర్వరేణ్యమ్*
*భర్గో దేవస్య ధీమహి* *ధియో యోనః* *ప్రచోదయాత్*
ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం , సంకల్ప బలం , ఏ కాగ్రత , ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం , గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ , వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని , ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలోనప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి , కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ *‘ఓం నమో గాయత్రీ మాత్రే’* అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.
బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ , నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి , సృష్టి ఉత్పత్తి , వర్తన , పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ ఋషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహాఋషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.
*గాయత్రి మంత్రాక్షరాలు :*
సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం
సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే
*‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్’*
గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. తల్లిని మించిన దైవం , గాయత్రిని మించిన దైవం లేదు. *‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.’* శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి , దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది. పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా , 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి.
*శ్రీ గాయత్రి అష్టోత్తర శత నామావళి*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
ఓం తరుణాదిత్య సంకాశాయై నమః
ఓం సహస్ర నయనోజ్జ్వలాయై నమః
ఓం విచిత్ర మాల్యాభరణాయై నమః
ఓం తుహినాచల వాసిన్యై నమః
ఓం వరదాభయ హస్తాబ్జాయై నమః
ఓం రేవాతీర నివాసిన్యై నమః
ఓం ప్రణిత్యయ విశేషజ్ఞాయై నమః
ఓం యంత్రాకృత విరాజితాయై నమః
ఓం భద్రపాదప్రియాయై నమః
ఓం గోవింద పదగామిన్యై నమః (10)
ఓం దేవర్షిగణ సంస్తుత్యాయై నమః
ఓం వనమాలా విభూషితాయై నమః
ఓం స్యందనోత్తమ సంస్థానాయై నమః
ఓం ధీరజీమూత నిస్వనాయై నమః
ఓం మత్తమాతంగ గమనాయై నమః
ఓం హిరణ్యకమలాసనాయై నమః
ఓం ధీజనాధార నిరతాయై నమః
ఓం యోగిన్యై నమః
ఓం యోగధారిణ్యై నమః
ఓం నటనాట్యైక నిరతాయై నమః (20)
ఓం ప్రణవాద్యక్షరాత్మికాయై నమః
ఓం చోరచారక్రియాసక్తాయై నమః
ఓం దారిద్ర్యచ్ఛేదకారిణ్యై నమః
ఓం యాదవేంద్ర కులోద్భూతాయై నమః
ఓం తురీయపథగామిన్యై నమః
ఓం గాయత్ర్యై నమః
ఓం గోమత్యై నమః
ఓం గంగాయై నమః
ఓం గౌతమ్యై నమః
ఓం గరుడాసనాయై నమః (30)
ఓం గేయగానప్రియాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం గోవిందపద పూజితాయై నమః
ఓం గంధర్వ నగరాకారాయై నమః
ఓం గౌరవర్ణాయై నమః
ఓం గణేశ్వర్యై నమః
ఓం గదాశ్రయాయై నమః
ఓం గుణవత్యై నమః
ఓం గహ్వర్యై నమః
ఓం గణపూజితాయై నమః (40)
ఓం గుణత్రయ సమాయుక్తాయై నమః
ఓం గుణత్రయ వివర్జితాయై నమః
ఓం గుహావాసాయై నమః
ఓం గుణాధారాయై నమః
ఓం గుహ్యాయై నమః
ఓం గంధర్వరూపిణ్యై నమః
ఓం గార్గ్య ప్రియాయై నమః
ఓం గురుపదాయై నమః
ఓం గుహ్యలింగాంగ ధారిన్యై నమః
ఓం సావిత్ర్యై నమః (50)
ఓం సూర్యతనయాయై నమః
ఓం సుషుమ్నా నాడిభేదిన్యై నమః
ఓం సుప్రకాశాయై నమః
ఓం సుఖాసీనాయై నమః
ఓం సుమత్యై నమః
ఓం సురపూజితాయై నమః
ఓం సుషుప్త్యవస్థాయై నమః
ఓం సుదత్యై నమః
ఓం సుందర్యై నమః
ఓం సాగరాంబరాయై నమః (60)
ఓం సుధాంశు బింబవదనాయై నమః
ఓం సుస్తన్యై నమః
ఓం సువిలోచనాయై నమః
ఓం సీతాయై నమః
ఓం సర్వాశ్రయాయై నమః
ఓం సంధ్యాయై నమః
ఓం సుఫలాయై నమః
ఓం సుఖదాయిన్యై నమః
ఓం సుభ్రువే నమః
ఓం సునాసాయై నమః (70)
ఓం సుశ్రోణ్యై నమః
ఓం సంసారార్ణవతారిణ్యై నమః
ఓం సామగాన ప్రియాయై నమః
ఓం సాధ్వ్యై నమః
ఓం సర్వాభరణ పూజితాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం విమలాకారాయై నమః
ఓం మహేంద్ర్యై నమః
ఓం మంత్రరూపిణ్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః (80)
ఓం మహాసిద్ధ్యై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మోహిన్యై నమః
ఓం మధుసూదన చోదితాయై నమః
ఓం మీనాక్ష్యై నమః
ఓం మధురావాసాయై నమః
ఓం నగేంద్ర తనయాయై నమః
ఓం ఉమాయై నమః
ఓం త్రివిక్రమ పదాక్రాంతాయై నమః (90)
ఓం త్రిస్వరాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం సూర్యమండల మధ్యస్థాయై నమః
ఓం చంద్రమండల సంస్థితాయై నమః
ఓం వహ్నిమండల మధ్యస్థాయై నమః
ఓం వాయుమండల సంస్థితాయై నమః
ఓం వ్యోమమండల మధ్యస్థాయై నమః
ఓం చక్రిణ్యై నమః
ఓం చక్రరూపిణ్యై నమః
ఓం కాలచక్ర వితానస్థాయై నమః (100)
ఓం చంద్రమండల దర్పణాయై నమః
ఓం జ్యోత్స్నాతపానులిప్తాంగ్యై నమః
ఓం మహామారుత వీజితాయై నమః
ఓం సర్వమంత్రాశ్రయాయై నమః
ఓం ధేనవే నమః
ఓం పాపఘ్న్యై నమః
ఓం పరమేశ్వర్యై నమః (108)
_*ఇతి శ్రీగాయత్ర్యష్టోత్తరశతనామావళిః సంపూర్ణం*_
శ్రీసత్యనారాయణస్వామివ్రత మాహాత్మ్యము
శ్రీసత్యనారాయణస్వామివ్రత మాహాత్మ్యము
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు సృష్టి స్థితి లయ కారకుండైన శ్రీమహావిష్ణువు కలి ప్రజల బాధల బాప అనుగ్రహించిన తన మరొక స్వరూపమే శ్రీ సత్యనారాయణ స్వామి. ఆ స్వామి వ్రతమును స్వయముగా తానే నారదునకు బోధించెను. ఆ వ్రతరాజమును సూతుడు సౌనకాది ఋషులకు లోకకల్యాణార్థము నైమిశారణ్యమున బోధించెను. మనమా వ్రతరాజము నన్నిక్రతువులందు పండుగలందు తప్పక ఆచరించుచుందుము. అది మన నిత్యజీవితమందు భాగమై యెప్పు చుండును. వ్రతము చేసుకొనుట, అందుగల ఐదు కథలను చదువుకొనుట వినుట భక్తిముక్తిదాయకము. ఆ కథలును నేను సరళ పద్యములందు ఆంధ్రీకరణ చేసియుంటిని . భక్త వరులు వాటిని చదివి ఆస్వాదింతురని ఆశించు చున్నాను.
భవదీయుడు, రచయిత
గోపాలుని మధుసూదన రావు
కావ్య వివరములు : మూల్యం: 80/-
పద్యగద్యములు: 186 పుటలు: 43
వలయు వారు యీ చిరునామా నుండి పుస్తకమును పొంద తగును
గోపాలుని మధుసూదన రావు
1-1-7/79. అశోక్ కాలనీ, కాప్రా
హైదరాబాదు. 500 062
చరవాణి : 99595 36545
శ్రీమద్రామాయణామృతము
శ్రీమద్రామాయణామృతము - బాలకాండము
శ్రీమద్ వాల్మీకీయ రామాయణమున బాలకాండము
ప్రసిద్ధి పొందినది. అందు కావ్యావతరణము, స్వామి జననము, అసురసంహారనాంది, కల్యాణము
యెప్పి యుండును. ఆ ఘట్టములను ఆదికవి ప్రత్యక్షమున నున్నట్లు తెలియ పరచెను. నేను ఆ బాలకాండము నందలి కథను శక్తిమేర సరళపద్యానుసరణము
చేసితిని.రామాకథను చెప్పుట ఒక భాగ్యము. అది నా సుకృతముగా తలంచి కావ్య రచన చేసితిని.
సీతారామకల్యాణ ఘట్టమును వీలైంత విపులముగా సమర్పించిని. అధ్యాత్మ పాఠకులు యీ చిరుకావ్యమును పఠింతురని ఆశిస్తున్నాను. పరమేశ్వరానుగ్రహమున విరచించిన యీ పుస్తకమును అందరూ ఆస్వాదింతురని ఆశించుచున్నాను.
భవదీయుడు, రచయిత
గోపాలుని మధుసూదన రావు
కావ్యవివరములు : మూల్యం: 240/-
పద్యగద్యములు: 748 పుటలు: 262
వలయు వారు యీ చిరునామా నుండి పుస్తకమును పొంద తగును
గోపాలుని మధుసూదన రావు
1-1-7/79. అశోక్ కాలనీ, కాప్రా
హైదరాబాదు. 500 062
చరవాణి : 99595 36545
విష్ణుచిత్తుని చరితము
విష్ణుచిత్తుని చరితము
(ఆముక్త మాల్యద)
ఆ. శ్రీల తోడ వెలుగు శ్రీవిల్లిపుత్తూరు
భువనమందు మిగుల భూతితోడ
పాండ్య దేశ మనెడు భామకు పాపటి
బొట్టు వోలె నొప్పి పొందె కీర్తి. 01*
వ. విభవోన్నతంబైన యా విల్లిపుత్తూరు
పట్టణ మందు. 02*
సీ. ఊరికి న్నికటమౌ నుద్యాన వనములన్
గోయిలల్ చిలుకలు గూయుచుండ
సవ్వడు లంతటన్ సదనాల మార్మ్రోగి
మిన్నుల నంటగా చెన్ను మీర
నడయాడుచుండు తన్నగర మార్గస్థులు
తలలెత్తి సద్మాల తరచి చూడ
చూరులం జెక్కిన శుక పిక గణములే
పాడుచుండె ననెడి భ్రాంతి గల్గె
తే. అంబరమ్మున కంటిన హర్మ్య చయము
వింతగా ప్రాకియున్ వినువీథి యందు
సందడించెను మనుజాళి డెందములను
విల్లిపుత్తూరు విభవమ్ము వినుతి కెక్క 03*
సీ. చెంగల్వ కొలనులో నంగన లాపురిన్
బసపాడి యత్యంత పావనముగ
నచ్యుతు పూజకై యావస్యకంబైన
తీర్థమున్ బిందెల దీసికొనియు
ఘటియందు నటునిటు కమలముల్ కదలగా
కటియందు కీలించి కదలు చుండ
చనుదోయిభారాన తను మధ్య మల్లాడ
భవ్య ప్రబంధముల్ పాడుకొనుచు
ఆ. పాదకటకము లను పదభూష లను దాల్చి
నడచుచుందు రింతు లొడలు కదల
నడక సోయగముల నయనాల వీక్షించి
విల్లుపురము ప్రజలు విస్తు పోగ. 04*
✍️గోపాలుని మధుసూదన రావు
హిందువులం సంఘటితం కావాలి!
*మన హిందువుల ధన మాన ప్రాణాలకు పూర్తి రక్షణ కోసం. . . హిందువులం అందరం సంఘటితం కావాలి! హిందూ ఓటు బ్యాంకు నిర్మించుకోవాలి!! అప్పుడే మన పిల్లల భవిష్యత్తు కు బరోసా!!!*
శరన్నావరాత్రులు
🎻🌹🙏 శరన్నావరాత్రులు - మొదటిరోజు - విజయవాడ దుర్గమ్మ ఈరోజు అలంకారం..
ఉద్ధవగీత
ఉద్ధవగీత
శ్లో)విధినా విహితే కుండే మేఖలా గర్తవేదిభిః | అగ్నిమాధాయ పరితః సమూహేత్ పాణినోదితమ్ !
అ)వేదోక్త మగువిధి ననుసరించి నిర్మితము లైన మేఖలాగర్త వేదిక లచే సుశోభిత మగుకుండమున అగ్నిని ప్రజ్వరిల్లజేసి చేతితో దాని నొకచోట ప్రోగుచేయవలెను,
శ్లో)స్తవైరుచ్చావచైః స్తోత్రైః పౌరాణై : ప్రాకృతైరపి |
స్తుత్వా ప్రసీద భగవన్నితి వందేత దండవత్ ||
అ)ప్రాచీనులచేత, ప్రాకృతులచేత (తనచే) చేయబడిన ఉత్కృష్టాపకృష్టము లగుస్తోత్రములచే నన్ను స్తుతించి దేవాః ప్రసన్నుడవుకమ్మనిప్రార్థించి సాష్టాంగ దండప్రణామము చేయవలెను
విదురనీతి
విదురనీతి
శ్లో)కేశిన్యువాచ - కేశిని పలికెను.
శ్లో)ఇహైవానాం ప్రతీక్షావ ఉపస్థానే విరోచన
సుధన్వాప్రాతరాగన్తా పశ్యేయం వాం సమాగతా॥
అ)ఓ విరోచన! మనమిద్దరం ఇక్కడనే ఎదురుచూద్దాము రేపిక్కడికి సుధన్వుడు వస్తాడు. అప్పుడు మీ ఇద్దరినీ నేను పరిశీలిస్తాను
శ్లో)విరోచన ఉవాచ = విరోచను డిట్లు పలికెను.
శ్లో)తవార్హతేతు ఫలకం కూర్చంవాప్యథవా బ్రుసీ సుధన్వన్నత్వ మర్హోఽసి మయాపహ సమాసనమ్||.
అ)ఓ సుధన్వుడా! నీకు చెక్కపలకకాని, దర్భలతో అల్లిన చాపకాని తగి ఉంటుంది. వాతో సమానంగా సమానాసనం పైన కూర్చోవటం తగదు
ఆపత్కాల పెన్నిధి
*ఆపత్కాల పెన్నిధి..*
మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు సిద్ధిపొందిన నాటినుండి నేటివరకు ...శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్న తరువాత తమ కష్టాలు తీరిపోయాయనీ..తాము ఆ స్వామి దయ వల్లే సుఖ సంతోషాలతో జీవిస్తున్నామనీ..చెప్పుకుంటున్నారు..శ్రీ స్వామివారి మందిరం లో ఉన్న మేము కూడా..కష్టాలతో, కన్నీళ్ళతో ఈ నెల మీద అడుగుబెట్టి..శ్రీ స్వామివారి కృపను పొంది..సంతోషం తో తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లడం మా కళ్లారా చూసాము..చూస్తూనే ఉన్నాము..శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఈ స్థలం లో అడుగుబెట్టిన మొదటి క్షణం లోనే.."ఇది దత్తక్షేత్రం..పుణ్యభూమి..అతిత్వరలో ఈ భూమి క్షేత్రం గా మారుతుంది.." అని చెప్పారు..వారి మాట పొల్లు పోలేదు..దూరప్రాంతాల నుంచి సైతం ఎందరో ఇక్కడకు వచ్చి..శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని వెళుతున్నారు..ఎందుకూ పనికిరాని భూమిగా పేరు పడిన "ఫకీరు బీడు" నేడు పుణ్యక్షేత్రం గా మారిపోయింది..
రెండు సంవత్సరాల క్రితం గురుపౌర్ణమి ముందు జరిగిన సంఘటన మీతో ఈరోజు పంచుకుంటున్నాను..
కర్ణాటక రాష్ట్రం లోని రాయచూరు వద్ద పార్థసారధి గారు కాంట్రాక్టర్ గా ఉండేవారు..ఆ క్రమం లో ఆర్ధికంగా కూడా మంచి స్థితి లో వున్నారు..భార్యా, ఇద్దరు పిల్లలు..ముచ్చటైన సంసారం..ఇద్దరు పిల్లల్లో మొదటి సంతానం కూతురు..రెండవ వాడు కుమారుడు..అమ్మాయి ఇంజినీరింగ్ చదువుతోంది..అబ్బాయి ఇంటర్ చదువుకుంటున్నాడు..అన్నీ అమర్చినట్టు ఉన్న జీవితం ఉంటే..దైవం మీదకు మనసు త్వరగా పోదు..ఏదో మొక్కుబడి కోసం దేవుడికో దండం పెట్టి..వెళ్లిపోవడం మానవులలో అతి సహజం..అదే జరిగింది పార్థసారధి విషయం లో కూడా..కానీ కాలం ఎల్లప్పుడూ ఒక లాగా ఉండదు..ఈ చక్రభ్రమణం లో చక్రానికి వుండే ఆకులు క్రిందకు, పైకి తిరుగుతూనే ఉంటాయి..
ప్రభుత్వం తరఫున చేసే పనుల్లో అవినీతి ఎక్కువగా ఉన్నదనీ..కాంట్రాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా పనులు చేసి బిల్లులు పొందుతున్నారనే అభియోగం మీద విచారణ నిమిత్తం అన్ని పనులనూ అర్దాంతరంగా ఆపివేయమని అధికారులు చెప్పారు..ఆ క్రమం లో పార్థసారధి గారి తాలూకు పనులు కూడా ఆగిపోయాయి..ఇది ఊహించని పరిణామం..పెద్దఎత్తున పెట్టుబడి పెట్టి వున్నారు..తనవద్ద ఉన్న డబ్బే కాక అప్పు తీసుకొచ్చి మరీ పెట్టుబడి పెట్టారు..కొద్దికాలం వేచి చూద్దామని నిర్ణయించుకున్నారు.ఇంతలో భార్యకు జబ్బు చేసింది..వైద్యం కోసం హాస్పిటల్లో చేరిస్తే..అన్ని పరీక్షలు చేసి..కడుపులో కణితి లాగా ఏర్పడ్డదనీ..త్వరగా ఆపరేషన్ చేయాలని చెప్పారు..ఒక్కసారిగా ఆయన డీలా పడిపోయాడు..ఏమీ దిక్కుతోచని స్థితి..
ఆ సమయం లో సుబ్రహ్మణ్యం గారని పార్థసారధి గారి స్నేహితుడు..తాను రోజూ వాట్సాప్ లో మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర ను చదువుతున్నాననీ..ఆ స్వామివారిని నమ్ముకుంటే మేలు జరుగుతుందని అనుకుంటున్నారని..నువ్వు కూడా నీ పరిస్థితి బాగు పడాలని ఆ స్వామివారిని వేడుకోమనీ..చెప్పారు..
పార్థసారధి గారి మీదఆ మాటలు ప్రభావం చూపాయి..తన స్నేహితుడి వద్ద శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం తాలూకు ఫోన్ నెంబర్ తీసుకొని..నాకు ఫోన్ చేశారు..తన పరిస్థితి బాగాలేదని తన కుటుంబం గోత్రనామాలను పంపుతాననీ..తమ పేరుతో అర్చన చేయమని చెప్పారు..అలాగే జరిపిస్తామని చెప్పాను..మరో వారం రోజుల్లో గురుపౌర్ణమి సందర్భంగా దత్తహోమాన్ని నిర్వహిస్తున్నామని..మీరు అంగీకరిస్తే..ఆరోజు హోమామ్ లో కూడా మీ గోత్రనామాలతో సంకల్పం చెప్పి..అర్చన చేస్తామని చెప్పాను..సరే స్వామీ..చేయించండి..దానికయ్యే ఖర్చు తెలపండి..పంపుతాను అన్నారు..నా పరిస్థితి బాగుపడితే..మా కుటుంబం తో సహా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటానని చెప్పారు..సరే అన్నాను..
అనుకున్న విధంగానే పార్థసారధి గారి గోత్రనామాలతో అర్చన జరిపించాము..అలాగే దత్తహోమము లో కూడా వారి పేర్లతో పూజ జరిపించాము..శ్రీ స్వామివారి విభూతి గంధం పోస్ట్ ద్వారా వారికి పంపాము..
సరిగ్గా మూడు నెలల తరువాత..పార్థసారధి గారు తమ కుటుంబం తో సహా శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు.."మీరు అర్చన చేయించిన వారం కల్లా..ప్రభుత్వం వారు మా పనులు కొనసాగించమని ఆదేశం ఇచ్చింది..మా బిల్లులు కూడా చెల్లించారు..మళ్లీ నా.పనులు యధావిధిగా కొనసాగుతున్నాయి..ఆర్ధిక పరిస్థితీ మెరుగు పడింది..ఇదిగో ఈవిడ నా భార్య..ఆపరేషన్ ఇప్పుడు అక్కర్లేదు..మందులతో తగ్గిపోతుంది అని బెంగుళూరుకు చెందిన డాక్టర్లు చెప్పారండీ..ఆవిడా ప్రస్తుతం ఆరోగ్యం గా ఉంది..ఈ స్వామివారి దయవల్ల బాగుపడ్డాను..ప్రతి ఏడూ దత్తహోమము లో మా గోత్రనామాలతో అర్చన చేయండి.." అని చెపుతూ.."ఇక్కడ అన్నదానం చేస్తే మంచిదని నా స్నేహితుడు సుబ్రహ్మణ్యం చెప్పాడు..వచ్చే శని, ఆదివారాల్లో జరిపే అన్నదానానికి అయ్యే ఖర్చు నేను భరిస్తాను.." అన్నారు..శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని సంతోషంతో తిరిగి వెళ్లారు.
స్వామివారి వద్ద ఎందరో భక్తులు పొందిన అపురూప అనుభవాలను మీలాటి పుణ్యాత్ములతో పంచుకోవడమే మా భాగ్యవశాన..స్వామివారి దయతో మేము చేయగలిగింది..
సర్వం..
దత్తకృప.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామిమందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).
ఆలోచనాలోచనాలు
👍 ఆలోచనాలోచనాలు 👌💐 సంస్కృత సూక్తి సుధ 💐 ***** పాతుం కర్ణాంజలిభిః, కిమమృత మిహయుజ్యతే? సదుపదేశం, కిం గురుతాయా / మూలం ? యదేత ద ప్రార్థనం నామ!! చెవులతో అమృతం లాగా ఆదరంతో పానం చెయ్యదగినది ఏది? ( శ్రద్ధాసక్తులతో వినదగినదేదీ?) ---- " మంచివారు చేసే హితోపదేశం." గౌరవం సంపాదించడానికి మూలమైనది ఏది? --- యాచించకుండా ఉండడం. ***** కిం గహనం? ..... స్త్రీచరితం, కశ్చతురో / యోన ఖండితస్తేన, కిం దుఃఖ? మసంతోషః, కిం లాఘవ? మధమతో యాచ్యా. తెలుసుకోవడానికి అసాధ్యమైనదేమిటి? స్త్రీల చరిత్ర లేదా వర్తనం. నిపుణుడెవడు? సన్మార్గాన్ని తప్పక అనుసరించేవాడు. దుఃఖం అంటే ఏమిటి? సంతోషంగా లేకపోవడమే! మానవుణ్ణి ఎందువలన చులకనగా చూస్తారు అంటే తనకంటే తక్కువవానిని యాచించడం ద్వారా. ***** కుత్ర విధేయో వాసః? సజ్జన నికటేఽధవా కాశ్యామ్, కః పరిహార్యో దేశః? పిశున జనయితో లుబ్ధభూపశ్చ. నివసించదగిన ప్రదేశం ఏది అంటే మంచివారుండే ప్రదేశం లేదా కాశీపట్టణం. తప్పక విడిచిపెట్టదగిన ప్రదేశం ఏదీ అంటే లుబ్ధుడైన పరిపాలకుడు , కొండెములు చెప్పే స్వభావం గల ప్రజలున్న దేశం. ***** కిం లఘుతాయా మూలం? ప్రాకృత పురుషేషు యాయాచ, రామాదపి క శ్శూరః? స్మరశర నిహతో నయశ్చలతి. ఎవరిని చులకనగా చూస్తారూ అంటే , ఎవడయితే పామరజనులను యాచిస్తాడో వాడిని. శ్రీరామచంద్రమూర్తి కంటే శూరుడు ఎవడు అంటే మన్మథబాణాలకు ఎవడైతే చలించకుండా ఉంటాడో, అతడు. ***** కో మాయీ? పరమేశః! , క ఇంద్రజాలాయతే? ప్రపంచోయమ్! కస్స్వప్నవిభో? జాగ్రద్వవహారః, సత్యమపిచ కిం? బ్రహ్మ! మాయకలవాడు ఎవడు? పరమేశ్వరుడు. ఇంద్రజాలం లాగా ఉన్నదేమిటి? -ప్రపంచం. స్వప్నంతో పోల్చదగిందేది అంటే మెలకువతో కనుపించే ఈ సమస్త వ్యవహారమునూ. సత్యమైనదేది అంటే పరబ్రహ్మ మాత్రమే! ***** పాత్రం కిమన్నదానే? క్షుదిరః, కోర్చ్యోహి? భగవదావతారః! కశ్చ భగవాన్? మహేశః, శంకర నారాయణాత్మైకః! అన్నం పెట్టదగినవాడు ఎవడు? ఆకలిగొన్నవాడు. పూజింపదగినవాడు ఎవడు? భగవంతుని అవతారాలలో ఒక రూపం. భగవానుడు ఎవరు అంటే అద్వితీయుడు మరియు హరిహరాత్మక రూపుడైన పరమేశ్వరుడు. చివరగా ఒక చమత్కార శ్లోకం తో ముగిద్దాం. ***** అంబలి, చింతకాయ, కూరగాయ, మరియు పాలనేతి. ఇవన్నీ తెలుగు పదాలు. వీటితో శ్రీ కృష్ణునికి( విష్ణువుకు) ప్రార్థనాశ్లోకాన్ని రచించిడొక కవి వరేణ్యుడు. గమనించండి. అంబలి ద్వేషిణం వందే. చింతకాయ శుభప్రదం. కూరగాయ కృతత్రాసం. పాలనేతి గవాం ప్రియం!! పై శ్లోకంలో అం+బలి ద్వేషిణం, చింత + కాయ, కు +ఉరగాయ, పాలన + ఇతి గా విడదీసుకొంటే ---- బలిచక్రవర్తిని అణచినట్టి, (ఆలోచించువారికి) చింతించువారికి శుభములను కలిగించునట్టి, విషసర్పమైన కాళీయుని భయం నుండి రక్షించునట్టి, ఆవులను పాలించుటకు ఇష్టపడేవాడైన శ్రీకృష్ణునికి ( విష్ణుమూర్తి కి) నమస్కారమని భావము. తేది 15--10--2023, ఆదివారం, శుభోదయం.
*🪷 శ్రీ మద్భగవద్గీత🪷* *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*
*🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*
*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*
*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*
*🌸 సాంఖ్య యోగః 🌸*
*2-అధ్యాయం,59వ శ్లోకం*
*విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః ।*
*రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ।। 59*
*ప్రతిపదార్థము*
విషయాః — (ఇంద్రియ) విషయములు; వినివర్తంతే — నిగ్రహించు; నిరాహారస్య — స్వీయ సంయమం పాటించి ; దేహినః — జీవునికి ; రస-వర్జం — రుచి తరిగిపోవుట; రసః — రుచి; అపి — కూడా; అస్య — అతనికి; పరం — పరమాత్మ; దృష్ట్వా — తెలుసుకున్న పిదప ; నివర్తతే — తరిగి పోవును.
*తాత్పర్యము*
ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలుగును. కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉండును. స్థితప్రజ్ఞనకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆసక్తిగూడా తొలగిపోవును.
*సర్వేజనాః సుఖినోభవంతు*
*హరిః ఓం 🙏🙏*
శరన్నవరాత్రాంతర్గత దేవీస్తుతి
🕉️ * శ్రీదేవీ శరన్నవరాత్ర్యుత్సవములు* 🕉️
*శరన్నవరాత్రాంతర్గత దేవీస్తుతి*
శా॥
శ్రీమన్మంగళమూర్తివై లలితవై హ్రీంకారసంవాసివై
నీమమ్ముల్ నియతాగ్నిహోత్రవిధులన్ నిత్యోత్సవమ్మొప్పగా
నీమాసమ్మున పూజలందు జననీ! యీ శారదాయామినీ
రామోల్లాసవిలాసభాసవసుధప్రాంతమ్ము నిన్మ్రొక్కెడున్ -1
శా॥
భూజమ్ముల్ పువులిచ్చి మ్రొక్కు మధువుం బూరించి భృంగమ్ములున్
వ్యాజమ్మించుక లేక దుగ్ధమిడి గోవ్రాతమ్ము లాజ్యమ్ముతో
పూజింపం జలమిచ్చు నాపగలు సమ్మోహంపుభక్త్యుద్ధతిన్
రాజద్దివ్యకలావిలాసి! నిను సంప్రార్థించ నిప్పర్వమున్ -2
*~శ్రీశర్మద*
8333844664
భక్తిసుధ
ॐ卐 *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐
*_శ్లోకమ్-_*
*_యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థగం భాసతే_*
*_సాక్షాత్తత్త్వమసీతి వేదవచసా యోబోధయత్యాశ్రితాన్_*
*_యస్సాక్షాత్కరణాద్భవేన్నపునరావృత్తిర్భవాంభోనిధౌ_*
*_తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదంశ్రీదక్షిణామూర్తయే....._*
*_దక్షిణాముర్తి స్తోత్రమ్-3 -_*
ఎవరి ప్రకాశముచే ఈ మాయా ప్రపంచము నిజముగా కనిపిస్తున్నదో, ఆయన, ఆత్మ జ్ఞానము పొంద గోరు వారికి వేదముల సారము ద్వారా పరబ్రహ్మ తత్త్వమును బోధిస్తున్నాడు.....ఈ సంసార సాగరాన్ని అంతము చేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి విశిష్టత*
*శ్రీ దేవీ నవరాత్రులు (ప్రతిరోజు ఒక అమ్మవారి అవతారం విశిష్టత గూర్చి)*
👇👇👇
*మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి విశిష్టత*
*బ్రహ్మశ్రీ రంగీ సత్యనారాయణ శర్మ గారిచే*
*(భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత)*
https://youtu.be/xNFZUpw_yDU?si=MFy0b_HRkO_B-Ai3
పంచాంగం 🕉️ 15🔸10🔹2023
🚥🚥🚥🚥🚥🚥🚥🚥
శుభోదయం, నేటి పంచాంగం
🕉️ 15🔸10🔹2023 🕉️
🚥🚥🚥🚥🚥🚥🚥🚥
➖➖➖➖➖➖➖➖
ఆదివారము, అక్టోబర్ 15, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
-----------------------------------------
దక్షిణాయణంఆశ్వీయుజ మాసం
శుక్ల పక్షము శరత్ ఋతువు
పాడ్యమి 00:32, అక్టోబర్ 16 వరకుచిత్త 18:13 వరకు
అమృతకాలము: 11:20 నుండి 13:03 వరకు
సూర్యోదయము: 06:09
సూర్యాస్తమయము: 17:55
రాహు కాలం: 16:27 నుండి 17:55 వరకు
యమగండము: 12:02 నుండి 13:30 వరకు
దుర్ముహుర్తములు: 16:21 నుండి 17:08 వరకు
అభిజిత్: 11:38 నుండి 12:25 వరకు
కరణం: కింస్తుఘ్న 12:01 వరకు, బవ 00:32, అక్టోబర్ 16 వరకు
చాంద్ర రాశి: తుల
వర్జ్యం: 00:08, అక్టోబర్ 16 నుండి 01:49, అక్టోబర్ 16 వరకు
చంద్రోదయం: 06:27
చంద్రాస్తమయం: తుల
తిథులు: పాడ్యమి 00:32, అక్టోబర్ 16 వరకు
నక్షత్రము: చిత్త 18:13 వరకు
గుళిక కాలం: 14:58 నుండి 16:27 వరకు
యోగా: వైధృతి 10:25 వరకు
ఆదివారం, అక్టోబరు 15, 2023
*శ్రీమతే రామానుజాయ నమ:*
*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*
*ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం*
*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *నమామ్యహం*
ఆదివారం, అక్టోబరు 15, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం - శరదృతువు
ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం
తిథి:పాడ్యమి రా11.28 వరకు
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:చిత్ర సా6.20 వరకు
యోగం:వైధృతి ఉ11.37 వరకు
కరణం:కింస్తుఘ్నం ఉ10.58 వరకు తదుపరి బవ రా11.28వరకు
వర్జ్యం:రా12.13 - 1.52
దుర్ముహూర్తము:సా4.03 - 4.50
అమృతకాలం:ఉ11.29 - 1.12
రాహుకాలం:సా4.30 - 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30
సూర్యరాశి కన్య
చంద్రరాశి తుల
సూర్యోదయం:5.55
సూర్యాస్తమయం:5.40
*శ్రీమతే రామానుజాయ నమ:*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
పండితుడు ఐన వేదాంతీకుడి మాటలలో
ఆర్యభట్ట '0'ని కనుక్కున్నాడని చెప్తారు కదా మరి ఆయన కలియుగం లో కనుక్కన్నాడు కదా అలాంటప్పుడు పూర్వ యుగాలలో కౌరవులు 100 అని రావణుడికి 10 తలలు అని ఎలా లెక్కపెట్టారు అని ఓక విద్యార్ధి అడగగా,ఆ టీచర్ రాజీనామా చేసి అన్వేషిస్తూ ,అన్వేషిస్తూ వేదిక్ స్కూల్ లో చేరాడు.పైన చెప్పింది హాస్యంగా అనిపించినా కానీ అందులో ముఖ్య విషయం వుంది.
ఒక పండితుడు ఐన వేదాంతీకుడి మాటలలో
నేను మీకు వేదాలనుండి ఒకటి పురాణాల నుండి ఒకటి చొప్పున ఆధారం ఇస్తున్నాను.
1)వేదాల నుండి యజుర్వేదం ప్రకారం
మేధాతిథి మహర్షి ఒక యజ్ఞం చేయటానికి ఇటుకలు పేరుస్తూ అగ్ని కి ఈ విధంగా ప్రార్ధించాడు.
ఇమం మే ఆగ్నా ఇష్టక దేనవ,సంత్వేక కా,దశ కా,శతం కా,సహస్రం కా,యుతం కా,నియుతం కా,ప్రయుతం కా, అర్బుదం కా,న్యార్బుదం కా,సముద్రం కా,మధ్యం కా,అంతం కా,పరార్ధం కా,ఇత మే అగ్నా ఇష్టక దేనవసంత్వాముత్రంముష్మిన్లోకే.
ఇప్పటికీ శ్రీ వైఖానస (వైష్ణవ)/సాంప్రదాయం లో అగ్ని ప్రతిష్ట కు అర్చకులు ఈ మంత్రాన్ని మొదటగా చదువుతున్నారు.
అంటే,ఓ అగ్ని దేవా!ఈ ఇటుకలే నాకు పాలు ఇచ్చే ఆవులుగా మారాలి అలా నాకు వరం ఇవ్వండి .
అవి ఒకటి,పది,వంద,వేయి,పది వేలు,లక్ష,పదిలక్షలు,కోటి ,పది కోట్లు ,వంద కోట్లు,వేయి కోట్లు,లక్ష కోట్లు ఈ విశ్వం లో వేరే విశ్వాలలో.
ఇక మంత్రం అర్ధం చూస్తే
ఏక - 1
దశ - 10 (10 to the power of 1)
శత - 100(10 to the power of 2)10×10
సహస్ర - 1000 (10 to the power of 3)10×10×10
ఆయుతం - 10,000 (10 to the power of 4)10×10×10×10
నియుతం - 1,00000(10 to the power of 5)10×10×10×10×10
ప్రయుతం - 10,00000(10 to the power of 6)10×10×10×10×10×10
అర్బుధం - 10,000,000(10 to the power of 7)10×10×10×10×10×10×10
న్యార్బుదం - 100,000,000 (10 to the power of 8)10×10×10×10×10×10×10×10
సముద్రం - 1,000,000,000( 10 to the power of 9)
10×10×10×10×10×10×10×10×10
మద్యం - 1,000,0000,000( 10 to the power of 10)10×10×10×10×10×10×10×10×10×10
అంతం - 100,000,000,000(10 to the power of 11)10×10×10×10×10×10×10×10×10×10×10
పరార్ధం - 1,000,000,000,000(10 to the power of 12)10×10×10×10×10×10×10×10×10×10×10×10.
రెఫ్ 2 గురించి భాగవతం లోని 3.11లో సమయం గురించి వివరించబడింది.అందులో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న "నానో సెకండ్స్"గురించి లక్షల,కోట్ల సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది.నేను కేవలం 2 రెఫ్ లు మాత్రమే ఇచ్చాను.మనం మనసు పెట్టి కనుక చూస్తే అలాంటివి చాలా కనిపిస్తాయి.దీన్ని బట్టి భారతీయులు ఎప్పటినుండో లెక్కల గురించి వాటి ఖచ్చితత్వం గురించి పూర్తిగా తెలుసుకున్నాం అని.మరియు,వాటి స్థానాల గురించి.నిజం వున్నా కూడా మనకు వ్యతిరేకం గ అతితెలివి తో ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వేస్తారో తెలియదు.!?
1)ప్రశ్న ఎప్పుడు వస్తుంది? దాన్ని మనం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినప్పుడు.బ్రిటీషర్ లు పవిత్రమైన మన గురు శిష్యుల మైత్రి వలన భావితరాలకు ఉత్తమ విద్యను అందించకుండా ఆ ఆచార పరంపరను వారి తెలివితో నాశనం చేయడం.మనం తెలివి తక్కువ పని చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం.మన పూర్వం గురించి చెప్పుకోవడానికి మనం సిగ్గు పడుతున్నాం ఒకవేళ కొందరు ధైర్యం తో మాట్లాడినా వారు కూడా గిల్టీ ఫీల్ అయ్యేలా చేస్తున్నారు.
2)మనం గుడ్డిగా పాటిస్తున్నాం మెకాలే విద్యావ్యవస్థను బ్రిటీషర్ లు మన మీద రుద్దినది.మనకు మరో పిచ్చి ఏంటంటే ఆర్యభట్ట '0' కనుక్కున్నాడు అని అనడం!ఇది పిచ్చి స్టేట్మెంట్.మరొక పిచ్చి విషయం ఏంటంటే క్లాసికల్ సంస్కృతం అని ,వేదిక సంస్కృతం అని వేరువేరు ఉన్నాయని ప్రచారం చెయ్యటం.
3)ఇక మరో పిచ్చి ,పెరిగిపోయిన దిక్కుమాలిన సెక్యూలరిజం.దీనివలన ఇలాంటి జోక్స్ వేస్తుండడం మన తరువాత తరాలకు పరిపాటిగా మారుతుంది.
జవాబు:ఆర్యభట్ట "0" ను కనుక్కోలేదు,అనేదే.ఆయన "0" ను సరిగ్గా ఏ స్థానం లో వాడితే దాని విలువ ఎలా ,ఎంతలా మారుతుంది అని ఆధారాలతో చెప్పిన మొదటి వాడు ఆర్యభట్ట.ఆయన లెక్కలను విపులం గా ,సోదాహరణం గా వివరించాడు.మనకు రోమన్ సంఖ్యలు కూడా వున్నాయి.కానీ,అవి సరిగ్గా సరిపోవు.అందుకే మనం ఆర్యబట్టను,వేదాలను,పురాణాలను ప్రామాణికంగా తీసుకుంటున్నాం.
జై సనాతన ధర్మ.
A frustrated student asked his Maths teacher...😡😡😡
If Zero was invented by Aryabhatt and he was born in the Kalayuga... Then...
In the past in Satayuga, who counted 100 Kavravas and Ravana's 10 heads and How?😳😳🙄🙄🤔🤔🤔🤔
Teacher resigned and went back to Vedic education but is still not able to find the answer...
Joke apart but the point needs to noted...
P.s: Got the above msg as joke. But any reply for that?
An expert's answer:
Let me start with just 1 reference from Vedas and 1 from Puranas (to keep this answer short - we will not have enough space if we want to document all such references).
1. Vedic Reference (Yajur veda):
The Rishi Medhātithi, after preparing bricks for a Vedic ritual, prays to the Lord of fire, Agni.
Imā me Agna istakā dhenava Santvekā ća desa ća satam ća
Sahasram ćāyutam ća niyutam ća Prayutam ćārbudam ća nyarbudam ća
Samudrasća madhyam ćāntasća Parārdhasćaita me agna ishtakā
Dhenavasantvamutrāmushmimlloke .
(The mantra recited is in vogue for srivaikhanasa Archakas in Agniprathishta till now.... Ima me agna ishtaka....)
Meaning:
Oh Agni! Let these bricks be milk giving cows to me. Please give me one and ten and hundred and thousand. Ten thousand and lakh and ten lakh and One crore and ten crore and hundred crore, A thousand crore and one lakh crore in this world and other worlds too.
For starters, here is the meaning of some of the key words in that sloka:
eka - 1
dasa - 10 (10 to the power 1)
satam - 100 (10 square)
sahasram - 1000 (10 cube)
ayutam - 10000 (10 to the power 4)
niyutam - 100000 (10 to the power 5)
prayutam - 1000000 (10 to the power 6)
arbudam - 10000000 (10 to the power 7)
nyarbudam -100000000 (10 to the power 8)
samudram - 1000000000 (10 to the power 9)
madhyam - 1000000000 (10 to the poewr 10)
antam - 100000000000 (10 to the power 11)
parardham -1000000000000 (Trillion - 10 to the power 12)
2. Reference from Bhagavata Purana:
Chapter 3.11 of Srimad Bhagavatam explains the concept of time. It starts from what is now called nano seconds and goes up to trillions of years.
I have just given couple of references (which is just the tip of iceberg). If we read with an open mind we can find many more such references. This clearly shows that ancient Indians knew a lot of mathematics, counting, decimal systems etc. Why are we getting such "Intelligent" questions, when the truth is actually the opposite?
1. This question arises due to our ignorance. One of the biggest atrocity done by Britishers to India was to eradicate the Guru-Sishya tradition of educating our ancient knowledge and values. We are repeatedly fed nonsense after nonsense about our past, to the extent that we all either feel ashamed to talk about it. Even those who talk, do so with a sense of guilt.
2. We also blindly vomit (reproduce) the Macaulay based education system that Britishers left us with. One of such nonsense is that Aryabhatta "invented" zero. This is an ambiguous statement, which doesn't give the right perspective to Aryabhatta's contribution. Another such nonsense is that there is Classical Sanskrit (whose grammar was codified by Panini) and then there is Vedic Sanskrit, which is somehow a different language. Absolute nonsense - Panini composed a treatise summarizing the Sanskrit grammar from days of yore - till his time. This doesn't mean that the language itself didn't exist or it existed as a different language.
3. We also have a screwed up version of "Secularism" and it has become a fad among our generation to post such questions and jokes, which makes us look "cool" (in reality it does make us look stupid).
Summary:
Rather than saying that Aryabhatta "Invented zero", I would say that he was the first person to formally define the place value system using Zero. He also elaborated on its mathematical usage. The alternative available was Roman numerals, which is not scalable (to the levels that our Vedas went). Why we refer Aryabhatta and not our Vedic and Puranic texts: Aryabhatta's work was intended to be a Mathematical treatise. His work summarizes the knowledge that was available with us until that time. Our Puranas and Itihasas on other hand, though had several references to larger and smaller numbers, were not Mathematical texts - Maths in them were incidental.
బతుకమ్మ
☘️☘️☘️☘️☘️☘️☘️
*_తెలంగాణ పల్లెల నుంచి నగరాల దాకా బతుకమ్మ,నవరాత్రి ఉత్సవాలు..దసర సంబరం ప్రారంభమైంది.._*
*_తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ వేడుకలు మొదలయ్యాయి.._*
*_బతుకు అమ్మా అనే దీవనే బతుకమ్మ అయింది.. సంస్కృతి అంటే సినిమా పాటలు, డాన్సులు, కప్పగంతులే కనిపిస్తున్నాయి.._*
*_సాంప్రదాయ, జానపద కళలు క్రమంగా మరుగున పడుతున్నాయి.. ఇలాంటి రోజుల్లో కల్తీలేని అచ్చ తెలుగుదనం, సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా నిలిచి ఉన్నాయంటే, అది బతుకమ్మ రూపంలోనే అంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు.._*
*_కష్ట సుఖాలు, ఆనందం, ప్రేమ, ఆప్యాయత, ఉత్సాహం, చరిత్ర, పురాణాలు అన్నీ బతుకమ్మ పాటల రూపంలో కనిపిస్తాయి._*
*_మన బతుకమ్మ.. మన బోనం.. కట్టూ, బొట్టూ, సాంప్రదాయం, ఆచారం.. ఏదైనా ఇలాగే కాపాడుకొని భావితరాలకు అందిద్దాం.. తెలంగాణ తెలుగు ఆడపడచులు సనాతన కాలంగా చేసుకుంటున్న పండుగలు ఇవి.._*
*_ఈ పండుగలను రాజకీయాల కోసం వాడే వారికి పట్ల అప్రమత్తంగా ఉందాం.. ఈ మధ్య కాలంలో కొత్త బాణీలు సృష్టిస్తున్నారు.. అవి మన సాంప్రదాయాలకు భంగం కలిగించనంత వరకు మాత్రమే స్వాగతిద్దాం.._*
*_దురదృష్టవశాత్తు బతుకమ్మను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.._*
*_గతంలో ఓ పెద్దాయన హైదరాబాద్ ను తానే కట్టాను అన్నట్లుగా చెప్పుకునేవాడు.. ఇప్పుడు బతుకమ్మను తామే కనిపెట్టామన్నట్లుగా బిల్డప్పులు ఇస్తున్నారు కొందరు.._*
*_వీరికి మనవి ఏమిటంటే బతుకమ్మను ఇలాగే బతకనివ్వండి.. ప్రజలప పండుగగానే కొనసాగించండి..._*
*_అందరికీ బతుకమ్మ పండుగ ప్రారంభవేళ శుభాకాంక్షలు.._*
🚩🚩🙏🙏🙏💐
వేణుగానం
వేణుగానం!
"ఏది మరొక్కసారి,హృదయేశ్వర!,గుండెలు పుల్కరింపఁగా/
ఊదగదోయి!ఊదగదవోయి!సుధామయ యుష్మదీయ వే /
ణూదయ రాగడోలికల నూయలలూగుచు విస్మృతిలో విలీనమై /
పోదును; నాదుక్రొవ్వలపుపువ్వుల ముగ్ధపరీమళమ్ముతో;
కరణామయి-ఉదయశ్రీ-
జంధ్యాలపాపయ్యశాస్త్రి.
ఈపద్యంవింటే రాధికయేగాదు మనంగూడా తన్మయులమైపోతాం.శాస్త్రిగారి కవితాశక్తియలాంటిది!
హే హృదయేశ్వరా! కృష్ణా! మరోసారి వేణువూదవా! మరోసారి,ఆఁహః కాదుకాదు మరోసారి,బృందావనిలోనీవు వేణువూదుతుంటే,ఆవలపుగానంలో నాతనువూ మనసూ మరచి తన్మయస్ధితిలోలీనమై, నాతొలివలపుల తీయనియూహలు మదిలో నూగుచుండగా,నీకోసంఈ రాధపరవసిపోతుంది.నీకోసం పలవరిస్తుంది.
మరొక్కసారి వేణువు నూదవయ్యా!కృష్ణా! నాకోసం,కాదుకాదు, మనకోసం;
ఇదీ ఈపద్యంలోని రాధపిలుపు.శాస్త్రిగారి పద్యంలో వలపు రవంతైనా మీకు అందించగలిగానా నాజన్మధన్యమే!
స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🌷
శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్రరత్నమ్*
*ॐ శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్రరత్నమ్*
*1. శ్రీదేవీ సంబోధనమ్*
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః - ఓం నమస్త్రిపురసుందరి!
*2. న్యాసాంగదేవతాః*
హృదయదేవి! - శిరోదేవి! - శిఖాదేవి! - కవచదేవి! - నేత్రదేవి! - అస్త్రదేవి!
*3. తిథినిత్యాదేవతాః*
కామేశ్వరి! - భగమాలిని - నిత్యక్లిన్నే! - భేరుండే! - వహ్నివాసిని!- మహావజ్రేశ్వరి! - శివదూతి! - త్వరితే! - కులసుందరి! - నిత్యే! - నీలపతాకే! - విజయే! - సర్వమంగళే! - జ్వాలామాలాని! - చిత్రే! - మహానిత్యే!
*4. దివ్యౌఘగురవః*
పరమేశ్వరపరమేశ్వరి! - మిత్రేశమయి! - షష్ఠీశమయి! - ఉద్దీశమయి! - చర్యానాథమయి! - లోపాముద్రామయి! - అగస్త్యమయి!
*5. సిద్ధౌఘగురవః*
కాలతాపనమయి! - ధర్మాచార్యమయి! - ముక్తకేశీశ్వరమయి! - దీపకళానాథమయి!
*6. మానవౌఘగురవః*
విష్ణుదేవమయి! - ప్రభాకరదేవమయి! - తేజోదేవమయి! - మనోజదేవమయి - కల్యాణదేవమయి! - వామదేవమయి! - వాసుదేవమయి! - రత్నదేవమయి! - శ్రీరామానందమయి!
*7. శ్రీచక్ర ప్రథమావరణదేవతాః*
అణిమాసిద్ధే! - లఘిమాసిద్ధే! - గరిమాసిద్ధే! - మహిమాసిద్ధే! - ఈశిత్వసిద్ధే! - వశిత్వసిద్ధే! - ప్రాకామ్యసిద్ధే! - భుక్తిసిద్ధే! - ఇచ్ఛాసిద్ధే! - ప్రాప్తిసిద్ధే! - సర్వకామసిద్ధే!
(ఇతి భూపుర ప్రథమ రేఖాయామ్)
బ్రాహ్మి! - మాహేశ్వరి! - కౌమారి! - వైష్ణవి! - వారాహి! - మాహేంద్రి! - చాముండే! - మహాలక్ష్మి!
(ఇతి భూపుర ద్వితీయ రేఖాయామ్)
సర్వసంక్షోభిణి! - సర్వవిద్రావిణి! - సర్వాకర్షిణి - సర్వవశంకరి! - సర్వోన్మాదిని! - సర్వమహాంకుశే! - సర్వఖేచరి! - సర్వబీజే! - సర్వయోనే! - సర్వత్రిఖండే!
(ఇతి భూపుర తృతీయ రేఖాయామ్)
త్రైలోక్యమోహనచక్రస్వామిని! - ప్రకటయోగిని!
*8. శ్రీచక్ర ద్వితీయావరణ దేవతాః*
కామాకర్షిణి! - బుద్ధ్యాకర్షిణి! - అహంకారాకర్షిణి! - శబ్దాకర్షిణి! - స్పర్శాకర్షిణి! - రూపాకర్షిణి! - రసాకర్షిణి! - గంధాకర్షిణి! - చిత్తాకర్షిణి! - ధైర్యాకర్షిణి! - స్మృత్యాకర్షిణి! - నామాకర్షిణి - బీజాకర్షిణి - ఆత్మాకర్షిణి - అమృతాకర్షిణి - శరీరాకర్షిణి!
సర్వాశాపరిపూరకచక్రస్వామిని! - గుప్తయోగిని!
*9. శ్రీచక్ర తృతీయావరణ దేవతాః*
అనంగకుసుమే! - అనంగమేఖలే! - అనంగమదనే! - అనంగమదనాతురే! - అనంగరేఖే! - అనంగవేగిని! - అనంగాంకుశే! - అనంగమాలిని!
సర్వసంక్షోభణచక్రస్వామిని! - గుప్తతరయోగిని!
*10. శ్రీచక్ర చతుర్థావరణ దేవతాః*
సర్వసంక్షోభిణి! - సర్వవిద్రావిణి! - సర్వాకర్షిణి! - సర్వాహ్లాదిని! - సర్వసమ్మోహిని! - సర్వస్తంభిని! - సర్వజృంభిణి! - సర్వవశంకరి! - సర్వరంజని! - సర్వోన్మాదిని! - సర్వార్థసాధికే! - సర్వసంపత్తిపూరణి! - సర్వమంత్రమయి!సర్వద్వంద్వక్షయంకరి!
సర్వసౌభాగ్యదాయకచక్రస్వామిని! - సంప్రదాయయోగిని!
*11. శ్రీచక్ర పంచమావరణ దేవతాః*
సర్వసిద్ధిప్రదే! - సర్వసంపత్ప్రదే! - సర్వప్రియంకరి! - సర్వమంగళకారిణి! - సర్వకామప్రదే! - సర్వదుఃఖవిమోచని! - సర్వమృత్యుప్రశమని! - సర్వవిఘ్న(ghna)నివారిణి! - సర్వాంగసుందరి! - సర్వసౌభాగ్యదాయిని!
సర్వార్దసాధకచక్రస్వామిని! - కుళోత్తీర్ణయోగిని!
*12. శ్రీచక్ర షప్ఠావరణ దేవతాః*
సర్వజ్ఞే! - సర్వశక్తే! - సర్వైశ్వర్యప్రదాయిని! - సర్వజ్ఞానమయి! - సర్వవ్యాధివినాశిని! - సర్వాధారస్వరూపే! - సర్వపాపహరే! - సర్వానందమయి! - సర్వరక్షాస్వరూపిణి! సర్వేప్సితఫలప్రదే!
సర్వరక్షాకరచక్రస్వామిని! - నిగర్భయోగిని!
*13. శ్రీచక్ర సప్తమావరణ దేవతాః*
వశిని! - కామేశ్వరి! - మోదిని! - విమలే! - అరుణే! - జయిని! - సర్వేశ్వరి! - కౌళిని!
సర్వరోగహరచక్రస్వామిని! - రహస్యయోగిని!
*14. శ్రీచక్రాష్టమావరణ దేవతాః*
బాణిని! - చాపిని! - పాశిని! - అంకుశిని! - మహాకామేశ్వరి! - మహావజ్రేశ్వరి! - మహాభగమాలిని! - మహాశ్రీసుందరి!
సర్వసిద్ధిప్రదచక్రస్వామిని! - అతిరహస్యయోగిని!
*15. శ్రీచక్ర నవమావరణ దేవతాః*
శ్రీశ్రీమహాభట్టారికే!
సర్వానందమయచక్రస్వామిని! పరాపరరహస్యయోగిని!
*16. నవచక్రేశ్వరీ నామాని*
త్రిపురే! - త్రిపురేశి! - త్రిపురసుందరి! - త్రిపురవాసిని! - త్రిపురాశ్రీః! - త్రిపురమాలిని! - త్రిపురాసిద్ధే! - త్రిపురాంబ! - మహాత్రిపురసుందరి!
*17. శ్రీదేవీవిశేషణాని - నమస్కారనవాక్షరీచ*
మహామహేశ్వరి! - మహామహారాజ్ఞి! - మహామహాశక్తే! - మహామహాగుప్తే! - మహామహాజ్ఞప్తే! - మహామహానందే! - మహామహాస్కంధే! - మహామహాశయే - మహామహా శ్రీచక్రనగరసామ్రాజ్ఞి!
*నమస్తే - నమస్తే - నమస్తే - నమః*
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
భావమేమిటంటే
మనం శివాలయానికి వెళితే అక్కడ పరమశివుని లింగం పైన
చుక్క చుక్కగా నీరు పడుతూ ఉంటుంది. పక్కనే అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది.
దీనికి భావం మనకి కలుగుతుందా.
ఇక్కడ భావమేమిటంటే ఓ భక్తా! ఈ చుక్క చుక్క నీరు లాగా నీ జీవితం కూడా క్షణక్షణం ఆయువు కరిగిపోతూ ఉంటుంది. పడిన నీటి చుక్క వృధాపాలుకాక భగవంతుని సన్నిధిని ఎలా చేరుతుందో అలాగే నువ్వు కూడా భగవంతుని అనుక్షణం జ్ఞాపకం చేసుకో. పక్కనున్న అఖండ దీపం వలె నీ జ్ఞానతేజస్సు పెంచుకొని మరల జన్మ జన్మ రాకుండా చూసుకో.🙏🙏🙏
బతుకమ్మ చరిత్ర
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🌹బతుకమ్మ చరిత్ర - పండుగ విశిష్టత🌹*
సెప్టెంబరు , అక్టోబరు నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు. ఈ నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు , ఇటువైపు అంతా పండుగ సంబరాలు , కుటుంబ కోలాహలాలు , కలయకలుతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ , మరియొకటి దసరా (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం , తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక పండుగ.
రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ , సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు , ప్రేమ , స్నేహం , బంధుత్వం , ఆప్యాయతలు , భక్తి , భయం , చరిత్ర , పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.. తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు , భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని , తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు.. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. పాటల వెనుక ఉండే మర్మం ఇదే..
ఈ పండుగ వర్షాకాలపు చివరిలో , శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు , తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి , చేమంతి , నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు (షిత్పొలా పండ్లు అంటారు) కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. సీతాఫలాన్ని పేదవాని ఆపిల్ అంటారనేది తెలిసినదే. అలాగే జొన్న పంట కోతకు సిధ్ధంగా తలలూపుతూ ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు
తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది.
_*బతుకమ్మ పండుగ కథ*_
తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యలు సామంతులుగా ఉండేవారు. చోళులకు , రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యలు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతంచేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాస్రాయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు. అప్పటి వేములవాడ (ప్రస్తుత కరీంనగర్ జిల్లా)లో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందరచోళా కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళానే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. అతని కుమారుడైన రాజేంద్రచోళ సత్యాస్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు.
ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ.
క్రీస్తు శకం 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బ్రిహదేశ్వరాలయంలో ప్రతిష్టించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బ్రిహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళ రాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి , బ్రిహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది.బృహదమ్మ(పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను , తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణవాసులు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణవాసులు జరుపుకుంటున్నారు. *బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే*. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలాగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు.
బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో , జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి , భూమితో , జలంతో , మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు *"బొడ్డెమ్మ"* (మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ) ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు.
బతుకమ్మ పండుగ జానపదులు తమసంతు దక్కాలని అమ్మదేవతలకు మొక్కుకునే ఆనవాయితీ పురాతనమైనది. పుట్టిన పిల్లలను చల్లగా చూడమని అమ్మదేవతల ముందు కట్టిన ముడుపులు , మొక్కులు చెల్లించుకుంటారు. కొంతమంది పుట్టినపిల్లలు పుట్టినట్లు చనిపోతుంటే , పిల్లలు పుట్టిన వెంటనే పెంట మీద వేసి తెచ్చుకుని *‘పెంటమ్మ లేదా పెంటయ్య’* అని పేరు పెట్టుకుంటారు. మరి కొందరు పుట్టినపిల్లల్ని ఎవరికైనా ఇచ్చి *‘బిచ్చంగా’* తిరిగియ్యమని కోరుకుంటారు. అట్లా తీసుకున్న పిల్లలకు *‘భిక్షపతి , భిక్షమ్మ’* లని పేరు పెట్టుకుంటారు. వాళ్ళే బుచ్చపతి , బుచ్చమ్మలుగా పిలువబడుతుంటారు. ఇట్లాంటి సందర్భాల్లోనే బతుకనిపిల్ల బారెడనే సామెతలు పుట్టాయి. పిల్లల్ని బతికించమనే వేడుకునే దేవతల్లో మన బతుకమ్మ ఒక దేవత. ఆ దేవత వరాన బతికితే బతుకమ్మ , బతుకయ్యలని పేర్లు పెట్టుకుంటారు. సమ్మక్క మేడారంలో బతుకయ్య పేరున్న వాళ్ళు ఇపుడు కూడా వున్నారు.
ఈ పూలపండుగ బతుకమ్మ ఎంగిలిపూలతో మొదలుపెట్టి సద్దులబతుకమ్మతో ముగిసిపోతుంది. బొడ్డెమ్మపండుగ నాడు *‘బొడ్డెమ్మ బొడ్డెమ్మా వలలో , బిడ్డాలెందారే.. వలలో’* అని పాడే పాట సంతానం గురించే కదా. నాటి రోజుల్లో నీళ్ళాడే(ప్రసవ)సమయాల్లో శిశుమరణాలు జాస్తిగా వుండేవి. నీటిరేవులే ఆనాటి తల్లులకు ప్రసూతి స్థలాలు. నీళ్ళల్లో ప్రసవించే సమయంలో తల్లులు తమసంతు బతికినందుకు ప్రతీకగా నీటివారనపెరిగే తంగేడు , గునుగు పూలముద్దలను నిమజ్జనం చేసివుంటారు. ఆ తల్లుల ఆచారమే బతుకమ్మపండుగగా మారి వుంటుంది. ఇది తెలంగాణా ప్రాంతానికే చెందడం మనగొప్పసంస్కృతికి సాక్ష్యం. ఎవ్వరికన్న ఐదారుగురు కన్నా ఎక్కువమంది పిల్లలుంటే ఆ తల్లిని గౌరవించేవాళ్ళు. మానవజాతి పిల్లలవల్లనే కదా ఇన్ని వేలయేండ్లుగా మనగలిగింది. అందుకే తల్లికంత గౌరవం. అమ్మతనం మీద భక్తి. ఆ భక్తే అమ్మదేవతలను కల్పించింది. పూజించింది. అమ్మదేవతల పూజల్లో ఒక ఆరాధనా రూపమే మన బతుకమ్మ.
బౌద్ధంలో ముందు చెడ్డదేవతగా , పిల్లల్ని ఎత్తుకపోయే రాక్షసిగా పిలువబడ్డ హారీతి బుద్ధునివల్ల మంచిదానిగా , పిల్లల్ని రక్షించే దేవతగా మారిపోయింది. ఆమెనే పిల్లలదేవతగా కొలుస్తారు. పుట్టిన తమ పిల్లలు బతుకాలని , రోగాలు , రొష్టులు లేకుండ వుండాలని హారీతిని ఆరాధించేవారు. ఈ దేవతను గురించి బౌద్ధజాతక కథల్లో చదువగలం. వివిధ చారిత్రకదశల్లో ఈ దేవత విగ్రహాలు వేర్వేరు రూపాల్లో అగుపిస్తున్నాయి. చాళుక్యులు తమను తాము హారీతిపుత్రులుగా శాసనాల్లో చెప్పుకున్నారు.2వ శతాబ్దంలో ఇక్ష్వాకుల కాలం నుండి హారీతి శిల్పాలు కనిపిస్తున్నాయి.12వ శతాబ్దందాకా శాసనాల్లో హారీతిపేరు ప్రస్తావించబడ్డది. పిల్లల్ని బతికించే దేవత హారీతినే బతుకమ్మగా భావించినారేమో.
కూష్మాండిని దేవతకు ప్రతీకగా గుమ్మడిపువ్వును పూజించే ఆచారమే బతుకమ్మ పండుగగా మారిందని కొందరి అభిప్రాయం. మనపూర్వీకులు ఇనుము - ఉక్కు తయారీకి తంగేడుచెక్కను వాడేవారని , తోలు తయారీకి తంగేడు ఎంత అవసరమో అందరికి తెలుసు. గునుగుకు నీళ్ళను శుభ్రపరిచే గుణముంది. తమకు నిత్యజీవితాసరాలైన తంగేడు , గునుగుపూలతో మనపూర్వీకులు తమ అమ్మదేవత(కూష్మాండిని ?) ని పూజించే రూపమే పరిణామంలో జాతరగా మారి వుంటుంది.
గునుగు , తంగేడుపువ్వులతో కొప్పురం రూపంలో పూలబతుకమ్మను పేర్చి , శిఖరం లేదా సిగమీద గుమ్మడి పువ్వుంచి , పసుపు , కుంకుమలతో అలంకరిస్తారు. పూజ పువ్వులను తొక్కుట్లవెయ్యని ఆచారమే బతుకమ్మలను నీళ్ళలో వదిలే సంప్రదాయమైంది.
దసరా పండుగ సందర్భంగా కొలిచే హిందూదేవత నవదుర్గారూపాల్లో కూష్మాండిని ఒకటి. ఎనిమిదవ రోజున కూష్మాండినిని అర్చిస్తారు. అదేరోజు బతుకమ్మలాడుతారు. కొన్ని ప్రాచీన ఆచారాలను మతాలు స్వంతం చేసుకున్న క్రమం చరిత్రలో కనిపిస్తుంది మనకు. ఈ పండుగకు కూడా కులాల మసిపూయడం అనాచారం. ఇది ఎక్కువ (పెద్దకులాల) వాళ్ళ పండుగ కాదు తక్కువ(చిన్నకులాల , జాతుల) వాళ్ళదే. గిరిజనులదే. తొలి మొలకలను , తొలిపూతను కొలిచే ఆచారం గిరిజనులదే. పువ్వంటే రేపటి ఫలమని వాళ్ళకు తెలుసు.ఆడపిల్లలను , పువ్వుల్ని కొలిచే పండుగే మన బతుకమ్మ. ఈ పండుగకు మతం లేదు. మతాచారాలు రుద్దబడ్డాయి. మనప్రాంతంలో కూష్మాండిని ఆరాధన జైనులవల్ల వచ్చింది. జైనమతానుయాయులైన కాకతీయులవల్ల ప్రోత్సహించబడ్డది. జైనంలో 22వ తీర్థంకరుని శాసనదేవత , యక్షిణి అంబిక(అంబ=అమ్మ) లేదా కూష్మాండిని (గుమ్మడితీగె , గుమ్మడిపువ్వు). ఈమె ప్రతిమాలక్షణంలో చేతుల్లో ఫలాలతో , ఇద్దరు పిల్లలతో , మామిడిచెట్టుకింద కూర్చొనివున్నట్టు వుంది. అంబిక కూడా ఒక అమ్మదేవతే. ఈ దేవతలకు ప్రతిమారూపాలు క్రీ.శ.5వ శతాబ్దం నుంచే కల్పించబడ్డాయి. అంతకు ముందున్నట్టు చారిత్రకాధారాలు లేవు.
బతుకమ్మల తయారీలో కూడా చాలా భేదాలు కనిపిస్తాయి. బతుకమ్మలు స్తూపాల ఆకారంలో వుంటాయి. లింగాల తయారీలో కూడా ఇటువంటి సంప్రదాయముందని చాలాచోట్ల చెప్పబడింది. పూర్వం బౌద్ధులు తమ ఆరాధనలో భాగంగా చేసుకున్న స్తూపాలను పూలు , మట్టి , ఇసుక , పేడ , రాయి , ఇటుకలతో తయారుచేసుకునేవారు. బౌద్ధభిక్షుకులు నిరంతరం ప్రయాణిస్తుండడం వల్ల స్తూపారాధనకు తమకు దొరికిన వాటినే స్తూపాలుగా చేసుకుని బుద్దునికి ప్రతీకగా నమస్కరించేవారు. పూలు , ఇసుక , మట్టి , పేడ స్తూపాలను నీటిలో కలిపేసేవారు మర్యాదగా. వాళ్ళు తిరుగాడిన ప్రదేశాల్లోని ఎన్నో వాగులు , ప్రవాహాలు భిక్కేరులుగా పిలువబడుతున్నది ఒక్క తెలంగాణలోనే. అందువల్లనే తొలుత బౌద్ధులైన గిరిజనులు , వనజనులు ఈ ఆచారాన్ని కొనసాగించివుంటారు. దానికి వారి కోరికలు మన్నించిన అమ్మదేవతకు ప్రతీకగా తర్వాత చేసుకుని వుంటారు. పిదప కాలాల్లో వచ్చిన మతపరిణామాలవల్ల ఈ దేవతలను తమ , తమ మతదేవతలుగా చేసుకున్నారు. ఆ దేవతలే బౌద్ధంలో హారీతిగా , జైనంలో ఆమ్రకూష్మాండినిగా , హిందూమతంలో అంబికగా పూజింపబడ్డారు. తెలంగాణాలో అతిప్రాచీనమైన అమ్మదేవతల ఆరాధనమే తల్లులరూపంలో ఏ దేవతవచ్చినా తమదేవతల్లో కలుపుకున్న సంప్రదాయమే బతుకమ్మ జాతరగా నిలిచిపోయింది. దసరాపండుగతో బతుకమ్మను కలుపడం , అమ్మదేవతలను కాకుండా పితృదేవతలను పూజించే ఆచారంగా మారడం ‘పెత్రామాస’(పితృ అమావాస్య)ను ఈ పండుగలో చేర్చడం తర్వాతి కాలాల్లో వచ్చిన పరిణామమే.
జనపదుల ఆచారాలు చాలా ప్రాచీనమైనవి. అవి వేలయేండ్ల పూర్వపువి. ఒక్కో జాతికి , ప్రాంతానికి పరిమితమైనవి. బతుకమ్మ మనకు , మన తెలంగాణాకే పరిమితమైంది. ప్రపంచంలో మరెక్కడా లేని పూలపూజ మన సంస్కృతి. బతుకమ్మ జానపదుల పండుగ. బతుకమ్మ ఆటలో గుస్సాడి నృత్యం , చప్పట్లలో జానపదుల పాట , ఆటల కలయిక మనమూలాలను ఎరుకపరిచే మంచి సాంప్రదాయం. బతుకమ్మ అచ్చతెలుగు మాట. దాన్ని సంస్కృతీకరించి పౌరాణికం చెయ్యొద్దు.
*తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు*
🧆🥗🍲🍛
9 రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు , యువతులు పాల్గొంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.
*ఎంగిలి పూల బతుకమ్మ:*
మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు , బియ్యంపిండి , నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
*అటుకుల బతుకమ్మ :*
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు , బెల్లం , అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
*ముద్దపప్పు బతుకమ్మ :*
ముద్దపప్పు , పాలు , బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
*నానే బియ్యం బతుకమ్మ :*
నానేసిన బియ్యం , పాలు , బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
*అట్ల బతుకమ్మ :*
అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు..
*అలిగిన బతుకమ్మ :*
ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.
*వేపకాయల బతుకమ్మ :*
బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
*వెన్నముద్దల బతుకమ్మ :*
నువ్వులు , వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
*సద్దుల బతుకమ్మ :*
ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం , చింతపండు పులిహోర , లెమన్ రైస్ , కొబ్బరన్నం , నువ్వులన్నం. తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు , జొన్నలు , సజ్జలు , మినుములు , శనగలు , పెసర్లు , పల్లీలు , నువ్వులు , గోధుమలు , బియ్యం , కాజు , బెల్లం , పాలు ఉపయోగిస్తారు.
*తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో*
మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని , చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. . ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి , ప్రతీ సాయంత్రం వాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు.అయితే చివరి రోజు బతుకమ్మ (సద్దుల బతుకమ్మ) పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడు , గునుగు మొదలగు పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిళ్ళపాదీ కూర్చుని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో గునుగు పూలు , తంగెడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి.
ఈ పూలను జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం (తాంబలం) లో వలయాకారంగా , రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగెడు ఆకులు , పూలు పళ్లెంలో లేదా తాంబోలంలో పేర్చుతారు , ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది పెడతారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెడతారు. ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవస్థానంలో అమర్చి కొవ్వొత్తులతో , అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు. సాయంకాలం అందరూ తమ తమ బతకమ్మలతో ఒక చోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు. ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను దరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా చాలా సేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు.
ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం , సత్తుపిండి ( మొక్కజొన్నలు , లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర పిండి లేదా బెల్లం , నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు) లను ఇచ్చి పుచ్చుకొని తింటారు.
మలీద - చక్కెర , రొట్టెతో చేసిన పిండివంటకం చివరి రోజు సాయంత్రం , ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు , అభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్న వారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత , సోదరభావం , ప్రేమను కలిపి రంగరిస్తూ మానవ హారం ఏర్పరిచి పాటలు పాడుతారు. ఒకరు ముందుగా పాట మొదలుపెడితే మిగిలినవారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు. ఈ జానపద గీతాలు చుట్టు పక్కలా ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణా సంస్కృతిని ఆవిష్కరిస్తాయి.
చీకటి పడుతుంది అనగా , స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువు గానీ , తటాకంవైపు గానీ ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకిరించుకున్న స్త్రీలు , బతుకమ్మలతో అత్యంత సుందరంగా , వైభావయానంగా ఉంటుంది. ఈ ఊరేగింపు కొనసాగినంత సేపూ , జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి. జలాశయం చేరుకున్న తరువాత , మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ , ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తరువాత "మలీద" (చక్కెర , రొట్టెతో చేసినది) అనే పిండి వంటకాన్ని బంధు మిత్రులకు పంచిపెడతారు. ఆ తరువాత ఖాళీ తాంబలంతో పాడుతూ , బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుతారు. ఈ తొమ్మిది రోజులూ , ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకూ వీధులలో మారు మ్రోగుతూనే ఉంటాయి.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
వేంకటేశ్వర అవతారానికి🌹* *3 ప్రధానమైన కారణాలు?*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🌹వేంకటేశ్వర అవతారానికి🌹*
*3 ప్రధానమైన కారణాలు?*
1. ఒక నాడు నారద ముని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి అడిగారుట. కలియుగంలో మానవులు తక్కువ కాలం జీవిస్తున్నారు, భగవంతుడి మీద అస్సలు మనస్సు లేదని. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారుట, నేను వారి పాపాలని కడగడానికి, వారిని ఉద్ధరించడానికి శ్రీ వేంకటేశ్వరునిగా అవతరిస్తాను. వారు ఒక్కసారి నా కొండకి వచ్చి, తల నీలాలు సమర్పించి, నా దర్శనం చేసుకుని, ఒక్క ఆర్జిత సేవ చేసినా (కలియుగంలో అశ్వమేథయాగం చేసినంత పుణ్యం. అసలు కలియుగంలో చెయ్యడం చాలా కష్టం మరియు నిషిద్ధం కూడా) వారి పాపాలని నేను తీసేస్తాను. వారి డబ్బు వెయ్యకపోయినా సరే, తల నీలాలు సమర్పిస్తే చాలు.
2. ద్వాపర యుగంలో యశోదమ్మ చిన్నికృష్ణున్ని పెంచే అదృష్టం కలిగింది. ఈ లోకంలో యశోదమ్మవంటి అదృష్టవంతురాలు ఇంక ఎవ్వరులేరు. యశోదమ్మ అడక్కుండా రెండు మూడు సార్లు విశ్వరూప దర్శనభాగ్యం ఆమెకి మాత్రమే కలిగింది. కృష్ణుడి బాల్య క్రీడలు అంత సాధారణమైనటువంటివి కావు. వ్యాస భగవానుడు సంస్కృతంలో భాగవతాన్ని రాస్తే, పోతనాచార్యుల వారు తెలుగులోకి ఆంధ్రీకరించారు. కానీ యశోదమ్మకి ఒక కోరిక మిగిలి పోయింది. రుక్మిణి కల్యాణం చూడలేకపోయింది. అప్పుడు ఆమె అడిగితే, కృష్ణుడు వాగ్థానం చేశాడుట నేను కలియుగంలో వేంకటేశ్వరునిగా అవతరిస్తాను, నీవు వకుళమాతగా వచ్చి నా కల్యాణం చేయించు అని.
3. వేదవతిని పరిగ్రహించాలి (వివాహ మాడాలి)
సీతమ్మ దొరికినట్లుగానే, ఈమె కూడా దర్భల మీద దొరికింది. నెమ్మదిగా పెరిగి యుక్త వయ్యస్సులోకి రాగానే, ఆమె తండ్రి వివాహం చేద్దామని సంకల్పించారు. అప్పుడు ఆమె చెప్పిందట నేను సాక్షాత్తు శ్రీనివాసుడిని వివాహమాడతాను అని. అప్పుడు తండ్రిగారు అన్నారు, శ్రీనివాసుడిని పరిణయమాడడమంటే మాటలా. పార్వతి దేవి చూడు ఎంత తపస్సు చేసింది శంకరుడు గురించి. అప్పుడు వేదవతి కూడా హిమవత్ పర్వతానికి వెళ్లి తపస్సు చేసిందిట. ఆమె తపస్సు చేస్తుంటే, రావణాసురుడు వచ్చి ఎత్తుకుపోవాలని చూస్తే, వేదవతి వాడిని శపించి (నువ్వు ఒక స్త్రీ వల్లే నాశనం అవుతావని, ఆమెయే సీతమ్మ) అగ్ని ప్రవేశం చేసింది. ఆ సమయంలో అగ్నిహోత్రుడు ఆమెను కాపాడి, కూతురిగా స్వీకరించాడు. కొన్నాళ్ళ తరువాత, రావణుడు సీతమ్మని ఎత్తుకు పోతుండగా అగ్నిహోత్రుడు తారసపడ్డాడు. రావణాసురుడు నమస్కారం కూడా చేయలేదని ఆగ్రహించి అన్నాడుట, నీ రథంలో ఉన్న సీత నిజ మైన సీత కాదు, మాయ సీత అని. అసలు సీత నా దగ్గర ఉందని. అప్పుడు రావణాసురుడు చాలా సంతోషపడి, అగ్ని హోత్రుడి దగ్గర ఉన్న మాయాసీతని నిజమైన సీత అనుకుని లంకకి తీసుకుపోయాడు. నిజమైన సీత మాత్రం అగ్ని హోత్రుడి దగ్గర ఉండిపోయింది. అసలుసీత తరపున వేదవతి అశోక వనంలో 12 నెలలు ఉండి, రాముడిని రప్పించి, రావణ వాత చేయించింది. వేదవతి తన కార్యం పూర్తి అయ్యాక, అగ్నిహోత్రుడు దగ్గరకి వెళ్ళిపోయింది.
వేదము యొక్క స్వరూపమే సీత. సీతమ్మ స్వరూపమే వేదవతి. నిజానికి ఇద్దరు లేరు, ఉన్నది ఒక్కరే. రావణాసురుడి గురుంచి చెబుతూ, రావణుడు వేదాలు చదివాడు, క్రమం తప్పకుండా సంధ్యా వందనం చేసేవాడు. చాలా తపస్సు చేసాడు కాని శ్రద్ధ లేదు, వక్ర బుద్ధి పోలేదు. అందుకే రాముడి చేతిలో మరణించాడు. శంకరుడుకి చాలా పూజలు చేసాడు కానీ, సీతయే పార్వతి అని తెలుసుకోలేక పోయాడు. తన కులదేవత స్వరూపాన్నే కావాలనుకున్నాడు. 12 నెలలు సీతమ్మ తరపున వేదవతి అశోకవనంలో ఉంది కనుక, అగ్నిహోత్రుడు రాముడితో వేదవతిని కూడా భార్యగా స్వీకరించమన్నాడు. అప్పుడు రాముడన్నాడు, ఈ అవతారం లో నేను ఏకపత్ని వ్రతున్ని. నేను కలియుగంలో శ్రీ వేంకటేశ్వరునిగా అవతరించి వేదవతిని (పద్మావతి అమ్మవారు) పరిణయమాడతానన్నాడు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
నవగ్రహా పురాణం🪐* . *54వ అధ్యాయం*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *54వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*శనిగ్రహ జననం - 5*
ఛాయ అడుగులో అడుగు వేసుకుంటూ , సూర్యుడి వద్దకు నడిచింది. సూర్యుడు ఆమె వైపు చిరునవ్వుతో చూశాడు. గర్భ భారం ఆమెలో అలసత్వాన్ని పెంచింది. వేగాన్ని తగ్గించింది.
*"గర్భం నీ దేహకాంతిని ద్విగుణీకృతం చేసింది సంజ్ఞా !"* ఆమె చూస్తూ అన్నాడు సూర్యుడు. శరీరాన్ని మెప్పుగా చూస్తూ అన్నాడు సూర్యుడు.
*"మీ దగ్గరగా వచ్చానుగా , మీ కాంతి నా మీద పడి ప్రతిఫలిస్తోంది !"* ఛాయ నవ్వుతూ అంది.
*"నీ శరీరాన్ని ప్రకాశింపజేస్తున్న ఆ కాంతి నాదీ , నీదీ కాదు ! నీ గర్భంలోని మన పుత్రుడిది !"* సూర్యుడు చిరునవ్వుతో అన్నాడు.
*"నా కుమారుడు మీలాగా కమల వర్ణంలో ఉంటాడో , నాలాగా కనక వర్ణంలో ఉంటాడో - చెప్పండి చూద్దాం !”* అంది ఛాయ.
"కమల వర్ణం , కనక వర్ణం రెండూ కలిసిన నూతన కాంతిలో మెరిసిపోతూ ఉంటాడు !"* సూర్యుడు నవ్వుతూ అన్నాడు.
*"ఔను ! నాకూ అలాగే అనిపిస్తోంది !"* అంది ఛాయ గర్వంగా.
అది ప్రమోదూత నామ సంవత్సరం. పుష్య మాసం. కృష్ణ పక్షం. స్వాతీ నక్షత్రంతో కూడిన అష్టమి తిథి.
ఆ సమయంలో ఛాయ మగ శిశువుకు జన్మనిచ్చింది. ఛాయా సూర్యుల ఊహలను తల క్రిందులు చేస్తూ , నల్లటి దేహకాంతితో పుట్టాడు ఆ బాలుడు. కాటుక ముద్దలాంటి శరీరం ! గోరోచనం గుళికల్లాంటి కళ్ళు ! బలహీనంగా అవుపిస్తున్న సన్నటి ఆకారం...
అనాకారిగా , సన్నగా కనిపిస్తున్న కుమారుణ్ణి తదేకంగా చూసి , ఛాయ సూర్యుడి వైపు అర్థం కానట్టు చూసింది. సూర్యుడు ఆమె ఆలోచన అర్థమైనట్టు చిన్నగా నవ్వాడు.
*"ఏమిటి దేవీ , నాలాగా ధగధగలాడే రంగులో లేడని ఆలోచిస్తున్నావా ? బాలుడు నా కుమారుడు ! అందుకే అలా నల్లగా ఉన్నాడు. నిలువు తెలుపు , నీడ నలుపు ! సహజమే కదా !!*
మనవడి నామకరణ మహోత్సవానికి అదితి , కశ్యపులూ , విశ్వకర్మ దంపతులూ వచ్చారు. వాళ్లనూ , సూర్యుడినీ ఆశ్చర్యానందాలలో ముంచివేస్తూ త్రిమూర్తులూ , నారదుడు వచ్చారు.
*"నీ కుమారుడు చాలా నెమ్మదిగా , అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తాడు. అతని సంచారం చాలా నిదానంగా ఉంటుంది. మందగమనం. అందుచేత బాలునికి అర్ధవంతమైన నామధేయం సూచిస్తున్నాను..."* శ్రీమహా విష్ణువు సూర్యుడితో అన్నాడు.
*"అవశ్యం ! అది మా చిన్నవాడి అదృష్టం!"* అన్నాడు సూర్యుడు వినయంగా.
*"నీ కుమారుని నామధేయం, "శనైశ్చరుడు'!"* విష్ణువు అన్నాడు.
బాలుడికి శాస్త్ర సమ్మతంగా అదే పేరు పెట్టారు. త్రిమూర్తులు బాలకుణ్ణి దీవించారు. భవిష్యత్తులో బాలుడు నవగ్రహ దేవతలలో ప్రముఖుడవుతాడనీ , విద్యాబుద్ధులు నేర్పుతూ చక్కగా పెంచి పెద్దవాణ్ణి చేయమనీ శివుడూ , బ్రహ్మా సూర్యుడికి చెప్పారు. తన సంతతి పరంపరలో ఇద్దరు నవగ్రహాదేవతలు ఆవిర్భవించినందుకు కశ్యప ప్రజాపతి మహానంద భరితుడయ్యాడు.
శనైశ్చరుడు ఛాయ ప్రత్యేక పోషణలో పెరుగుతున్నాడు.
కాలక్రమాన ఛాయకు ద్వితీయ పుత్రుడు జన్మించాడు. తండ్రి సూర్యుడి దేహవర్ణంతో 'సవర్ణుడు'గా జన్మించిన బాలునికి సూర్యుడు 'సావర్ణి' అని నామకరణం చేశాడు. ముడవ సంతానంగా ఛాయకు ఒక పుత్రిక పుట్టింది. కుమార్తెకు 'తపతి' అనే పేరు నిర్ణయించాడు సూర్యుడు.
సంజ్ఞ సంతానమూ , ఛాయ సంతానమూ - ఆరుగురూ ఛాయ అదుపాజ్ఞలలో పెరగసాగారు. తన బిడ్డలైన శనైశ్చరుడూ , సావర్ణి , తపతీ క్రమంగా వృద్ధి చెందే కొద్దీ , ఛాయలో సంజ్ఞ బిడ్డల పట్ల మమతానురాగాలు క్షీణించసాగాయి.
*"ఇప్పుడు నవగ్రహాలలో అష్టమగ్రహమైన రాహువు జన్మగాథ చెప్తాను , సావధానంగా వినండి !"* అన్నాడు శని జన్మ వృత్తాంతం ముగించిన నిర్వికల్పానంద.
*"గురువుగారూ ! రాహువును 'సింహికాగర్భసంభూతుడు' అంటారు కదా ! అంటే రాహువు కశ్యప ప్రజాపతి భార్య అయిన సింహిక పుత్రుడనేనా అర్ధం ?"* శివానందుడు అడిగాడు.
*"ఔను ! రాహువు దక్షప్రజాపతి పుత్రికా , కశ్యప ప్రజాపతి ధర్మపత్ని అయిన సింహిక పుత్రుడే ! రాహువు జన్మ వృత్తాంతంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు ఏవీ లేవు. సూర్యుణ్ణి కబళించే మహాశక్తివంతమైన గ్రహంగా రూపొందిన మన రాహువు జననం సర్వసాధారణంగా జరిగింది. ఆ వృత్తాంతం తెలుసుకోవడానికి మనం కశ్యపాశ్రమానికి వెళ్ళాలి..."* అంటూ కథనం కొనసాగించాడు నిర్వికల్పానంద.
*రేపటి నుండి రాహుగ్రహ జననం ప్రారంభం*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 64*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 64*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*విధి ఇలా ఉన్నప్పుడు ఎవరిని ఎందుకోసం నిందించాలి?*
అవినీతి మార్గాలు చూపిన వారితో కూడా సన్న్యాస జీవిత మహత్వాన్ని గురించి నరేంద్రుడు చెప్పేవాడు. అయినప్పటికీ వారు మాత్రం మళ్లీ అతణ్ణి లౌకిక విషయాల వైపు లాగడానికే ప్రయత్నించేవారు. "జీవితంలో ఎలాంటి నిర్ణయానికి రాకుండా ఎందుకు ఇలా ఉన్నావు? ధనం సంపాదించే ప్రయత్నంలో తీవ్రంగా మునిగిపో. అప్పుడే కదా సుఖమయ జీవితం గడపగలవు!' అంటూ ఉపదేశించేవారు.
అందుకు నరేంద్రుడు, “నాకూ అలాంటి ఆలోచనలు రాకపోలేదు. కీర్తి ప్రతిష్ఠలు, పదవీ ఐశ్వర్యమూ, అంతస్తులతో కూడిన జీవితం గడపాలనే ఆలోచన నాలో తరచు కలగడం కద్దు. కాని, బాగా లోతుగా ఆలోచించినప్పుడు, ఈ ధ్యేయం అర్థరహితమని తోచేది.
మరణం అనేదొకటి ఈ లోకంలో ఉన్నదే! దాని కబంధ హస్తాల నుండి ఎవరైనా తప్పించుకోగలరా? సన్న్యాసులు మరణపు పిడికిలి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సత్యమైన, శాశ్వతంగా మార్పులేని వస్తువును అన్వేషిస్తున్నారు. కనుక సన్న్యాస జీవితమే సర్వోత్కృష్టమైనదిగా "నేను భావిస్తున్నాను" అన్నాడు. అయినప్పటికీ మిత్రులు వదలిపెట్టలేదు.
వారిలో ఒకడు, "దక్షిణేశ్వరంలోని వృద్ధుడే నరేంద్రుణ్ణి పాడుచేస్తున్నాడు. ఇతడి
భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు" అన్నాడు. తరువాత నరేంద్రుణ్ణి చూసి, “నరేన్! నీకు సొంత బుద్ధి అనేది ఉంటే, ఆయన వద్దకు వెళ్లడం మానుకో. లేకపోతే నీ చదువు, భవిష్యత్తు నాశనమయిపోతాయి. నువ్వు ప్రతిభావంతుడివి; జీవితం వైపు మనస్సును మరలిస్తే నువ్వు సాధించలేనిది ఏదీ ఉండదు. కనుక దక్షిణేశ్వరానికి స్వస్తి చెప్పు" అని సలహా ఇచ్చాడు.
"ఇలా చూడండి! ఆయన గురించి మీకు ఏమీ తెలియదు; నాకు పెద్దగా ఏమీ అర్థం కాలేదు; కాని, నేను ఆ వృద్ధుణ్ణి. శ్రీరామకృష్ణులను అమితంగా అభిమానిస్తున్నాను" అని గద్గద స్వరంతో చెప్పాడు నరేంద్రుడు.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
సౌందర్యలహరి🌹* *శ్లోకం - 54*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 54*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*పవిత్రీకర్తుం నః పశుపతిపరాధీన హృదయే*
*దయా మిత్రై ర్నేత్రై రరుణధవళ శ్యామరుచిభిః |*
*నదశ్శోణో గంగా తపనతనయేతి ధ్రువ మయం*
*త్రయాణాం తీర్థానా ముపనయసి సంభేద మనఘమ్ ‖*
పవిత్రీకర్తుం నః = అమ్మా, నీ చల్లని చూపులు మమ్ములను పవిత్రం చేయుగాక!
పశుపతి పరాధీన హృదయే = పశుపతికి
(పాశములతో బంధింపబడ్డ మానవులు పశువులు, శివుడు పశుపతి.ఈ పశువులకు అధిపతి, పాశములను తొలగించువాడు) పరాధీనమైన హృదయము కల తల్లీ
దయా మిత్రై ర్నేత్రై = దయతో కూడియుండే నీ చూపులు
అరుణ ధవళ శ్యామ రుచిభిః = ఎరుపు, తెలుపు, నలుపు రంగులతో కూడినవి.
క్రిందటి శ్లోకంలో చెప్పుకున్నాము. ఈ వర్ణాలు త్రిగుణములకు, వాటిని కలిగి సృష్టి స్థితి లయములు చేసే త్రిమూర్తులను నియంత్రించే అమ్మవారి కన్నుల వర్ణములకు సంకేతములని.
నదశ్శోణో గంగా తపనతనయేత్ ధ్రువ మయం = పవిత్రమైన శోణ, గంగ, యమునా (సూర్యుని కుమార్తె యమున, కుమారుడు యముడు) నదుల ప్రవాహాలు మా తాపాన్నీ, దాహాన్నీ, తాపత్రయాలనూ పోగొట్టి మమ్ములను పునీతులను చేయునట్లుగా వున్నాయి. ఈ మూడు నదుల సంగమం యొక్క మహిమను నీ చూపుల ద్వారా పొందుతున్నామని భావం.
ఇతః పూర్వం చెప్పుకున్నాము జంబుకేశ్వర క్షేత్రంలో అఖిలాండేశ్వరి అమ్మవారి నేత్ర దృష్టి తీవ్రముగా వుండటము, ఆ తీవ్రతను ఆదిశంకరులు మంత్ర యుక్తముగా ఉపసంహరించి, శ్రీచక్ర యంత్రములుగా ఆమె తాటంకములలో నిక్షిప్తము చేయటము. ఆమె చూపులు ఉగ్రముగా వున్నా, పుత్ర వాత్సల్యంతో చల్లబడుతాయని ఆమె విగ్రహానికి ఎదురుగా విఘ్నేశ్వరుని విగ్రహ ప్రతిష్ఠాపన చేయటము చెప్పుకున్నాము.
శోణా నదిలో (బీహారులో) ఎర్రని గణపతి శిలలు దొరుకుతాయి, పంచాయతనములో పూజించటానికి.
మిగతా నాలుగు ఇవీ
నర్మదా నదిలో శివ లింగాలు
గండకీ నదిలో విష్ణు సాలగ్రామాలు
సువర్ణముఖిలో అంబికా రూపాలు
గుజరాత్ లో లభించే స్ఫటికాలలో సూర్యరూపములు.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
వేదాశీర్వాదములు
*ది.15-10-2023, భానువాసరే, శ్రీ శోభకృత్ నామ సంవత్సరే, దక్షినాయనే, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్ల పక్షం,*
*తిథి:- పాడ్యమి రా.11-28 వరకు,*
*నక్షత్రం:- చిత్ర సా.6-20 వరకు.*
*శరన్నవరాత్రి/దేవీ నవరాత్రుల ప్రారంభం.*
*బ్రహ్మశ్రీ గుళ్లపల్లి శివ శర్మ గారి వేదాశీర్వాదములు*
https://youtube.com/watch?v=WU6us5ex67g&feature=shared