ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
11, మార్చి 2026, బుధవారం
శుకపికాలాపరావాలసుప్రభాత
*"
తే.గీ.
శుకపికాలాపరావాలసుప్రభాత
స్తోత్రపాఠాల మేల్కొల్పు శుభదమౌను
నరుణకిరణాలు తూర్పున నలదుకొనగ
మీకిదె శుభోదయమగు మేలిసఖుడ!
*~శ్రీశర్మద*
🌸విఘ్నేశ్వర స్తుతి🙏
గణపతి దేవా రావా
మణిమయ భూషణ గణేశ మంగళతనయా
గుణమణి మూషిక రథుడా
గుణధామా నిను కొలిచెద కుడుముల తోడన్
కందపద్యం
గరికను తెచ్చియు గణపతి
నిరతము నిన్నే కొలుతురు నీ భక్తు రిలన్
వరములు నియ్యగ దేవా
గిరిదిగి రావా బిరబిర గిరిజా తనయా
సాహితీ శ్రీజయలక్ష్మి
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం - అష్టమి - జేష్ఠ - సౌమ్య వాసరే* (11.03.2026)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
---------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
