29, మే 2026, శుక్రవారం

పంచాంగం

 


ಬೆಂಗಳೂರಿನ ಪ್ರಸಿದ್ಧ ದೇವಸ್ಥಾನಗಳು

 👉👉👉ಬೆಂಗಳೂರಿನ ಪ್ರಸಿದ್ಧ ದೇವಸ್ಥಾನಗಳು

ಚೊಕ್ಕನಾಥಸ್ವಾಮಿ ದೇವಾಲಯ: ದೊಮ್ಮಲೂರು


ದೊಡ್ಡ ಬಸವಣ್ಣ ದೇವಾಲಯ: ಬಸವನಗುಡಿ


ಶ್ರೀ ಪ್ರಸನ್ನ ವೀರಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯ: ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಲೇಔಟ್


ಪಂಚಮುಖಿ ಗಣಪತಿ ದೇವಾಲಯ: ಮೈಸೂರು ರಸ್ತೆ


ನಿಮಿಷಾಂಬ ದೇವಾಲಯ: ರಾಜರಾಜೇಶ್ವರಿನಗರ


ಸೋಮೇಶ್ವರ ದೇವಾಲಯ: ಹಲಸೂರು


ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯ: ಕಡುಮಲ್ಲೇಶ್ವರ


ಪುಣ್ಯಕ್ಷೇತ್ರ ಶ್ರೀ ಧರ್ಮಗಿರಿ ಮಂಜುನಾಥ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯ: ಬನಶಂಕರಿ


ಚಂಪಕಧಾಮ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯ: ಬನ್ನೇರುಘಟ್ಟ


ಗವಿ ಗಂಗಾಧರೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯ: ಗವಿಪುರ


ಗಾಳಿ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯ: ಬಾಪೂಜಿನಗರ


ರಾಮಾಂಜನೇಯ ಕುಡ್ಡದ ದೇವಾಲಯ: ಹನುಮಂತನಗರ


ಕಾಶಿ ವಿಶ್ವನಾಥ ಸ್ವಾಮಿ: ದೊಡ್ಡ ಪೇಟೆ ಕುರು


ಶ್ರೀ ರಾಜರಾಜೇಶ್ವರಿ ದೇವಾಲಯ: ರಾಜರಾಜೇಶ್ವರಿನಗರ


ದೊಡ್ಡ ಗಣಪತಿ ದೇವಾಲಯ: ಬಸವನಗುಡಿ


ಬನಶಂಕರಿ ಅಮ್ಮನವರ ದೇವಾಲಯ: ಬನಶಂಕರಿ


ಇಸ್ಕಾನ್ ದೇವಾಲಯ: ರಾಜಾಜಿನಗರ


ಶಿವ ದೇವಾಲಯ: ಹಳೆಯ ಮದ್ರಾಸ್ ರಸ್ತೆ


ಧರ್ಮರಾಯ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯ: ಓಟಿಸಿ ರಸ್ತೆ


ಅಣ್ಣಮ್ಮ ದೇವಾಲಯ: ಮೆಜೆಸ್ಟಿಕ್


ಓಂಕಾರೇಶ್ವರ ದೇವಾಲಯ: ರಾಜರಾಜೇಶ್ವರಿನಗರ


ಜಲಕಂಠೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯ: ಕಲಾತಿಪಾಳ್ಯ


ಕಾರ್ತಿ ನಿಧಿ ಆಂಜನೇಯ ದೇವಾಲಯ: ಗಿರಿನಗರ


ಮಾರುತಿ ಮಂದಿರ: ವಿಜಯನಗರ


ಬಂಡಿ ಮಹಾಕಾಳಿ ದೇವಾಲಯ: ಕೆಂಪೇಗೌಡನಗರ


ಲಕ್ಷ್ಮಿ ಹಯಗ್ರೀವ ದೇವಾಲಯ: ಗಾಂಧಿನಗರ


ದುರ್ಗಾ ಪರಮೇಶ್ವರಿ ದೇವಾಲಯ: ವಿದ್ಯಾರಣ್ಯಪುರ


ಕಾಳಿ ಮಂದಿರ: ಮಲ್ಲೇಶ್ವರ


ಶೃಂಗೇರಿ ಶಂಕರ ಮಠದ ದೇವಾಲಯ: ಶಂಕರಪುರ


ರಾಧಾಕೃಷ್ಣ ಪುಟ್ಟ ಶ್ರೀ ಪ್ರಸನ್ನ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯ: ಜಯನಗರ


ಶ್ರೀ ಪಂಚಲಿಂಗೇಶ್ವರ ದೇವಾಲಯ: ಬೇಗೂರು


ಶ್ರೀ ಚನ್ನಕೇಶವ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯ: ಅರಳುಪೇಟೆ


ಶೃಂಗಗಿರಿ ಶ್ರೀ ಷಣ್ಮುಖ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯ: ರಾಜರಾಜೇಶ್ವರಿನಗರ


ಕೋಟೆ ಜಲಕಂಠೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯ: ಕಲಾಸಿಪಾಳ್ಯ


ಶ್ರೀ ಜಗನ್ನಾಥ ಸ್ವಾಮಿ: ಅಗಲ


ದಕ್ಷಿಣಾಮುಖ ನಂದಿ ತೀರ್ಥ ಕಲ್ಯಾಣಿ ದೇವಾಲಯ: ಮಲ್ಲೇಶ್ವರ


ಕೈಲಾಸ ವೈಕುಂಠ ಮಹಾಕ್ಷೇತ್ರ ದೇವಾಲಯ: ರಾಜಾಜಿನಗರ


ಕೋಟೆ ಶ್ರೀ ವೆಂಕಟರಮಣ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯ: ಬಸವನಗುಡಿ


ಶ್ರೀ ಕಾಶಿ ವಿಶ್ವನಾಥ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯ: ಬೆಟ್ಟದಾಸನಪುರ


ಶ್ರೀ ಸುಬ್ರಮಣ್ಯ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯ: ಹಲಸೂರು


ಲಕ್ಷ್ಮಿ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯ: ವಯಾಲಿಕಾವಲ್ ಲೇಔಟ್

🙏🙏

మన‘యజ్ఞము’యొక్క

  మన‘యజ్ఞము’యొక్క.  

              గొప్పదనము, దాని శక్తి!

                  ➖➖➖

```

ఈ యజ్ఞాన్ని 'ప్రవరాగ్య హోమం' అ౦టారు.


 దీన్ని సాధారణంగా అతిరాత్ర౦ లో చేస్తారు.


 ఇది యజ్ఞాలలో ముఖ్యమైన వాటిలో ఒకటి.


గతంలో పెద్దాపురం లో జరిగిన అతిరాత్ర యాగ౦లో ఒక భాగం ఇది! 


ఈ యజ్ఞంను అత్యంత అనుభవం గల వేద ప౦డితులు మాత్రమే చేయగలరు.


 కేవలం 50ml హోమద్రవ్య౦తో వచ్చిన అగ్ని న్యూక్లియర్ బా౦బు పేలితే వచ్చే అగ్ని లాగా కనిపిస్తుంది.```

  మరి మీరుకూడా చూడండి...

అతిరాత్రం

 *అతిరాత్రం:*

                   ➖➖➖


*సప్త సోమయాగాలలో అగ్నిస్టోమం, అత్యగ్నిస్టోమం, ఉక్ధ్యం, షోడసి, వాజపేయం, ఆప్తోర్యామం, అతిరాత్రం ఉన్నాయి.*


```ఈ సప్త సోమయాగాలలో అతి పవిత్రమైంది…'అతిరాత్రం'``` (అతిశయితా రాతిః ఇతి అతిరాత్రః) ```అని విజ్ఞులు చెబుతున్నారు.

****************```


అతిరాత్రం_అత్యద్భుతం: ```తేల్చిన కేరళ శాస్త్రవేత్తల బృందం.


అతిరాత్రం మహాయజ్ఞంలో శాస్త్రీయత ఎంత…? ఇది హేతువాదులతో పాటు… హిందూధర్మంపై నమ్మకం ఉన్నవారికి కూడా ఆసక్తి కలిగించే ప్రశ్న.


దీనికో అద్భుతమైన జవాబు దొరికింది. అతిరాత్రం వల్ల పర్యావరణానికి, ఉత్పాదకతకు జరిగే మేలు అంతా ఇంతా కాదని తేలింది. 


ఇది తేల్చింది ఏ సాధుసన్యాసులో, పండితులో కాదు… ఏకంగా ఒక శాస్త్రవేత్తల బృందమే పరిశోధించి తేల్చిన నిజమిది.```


వివరాల్లోకి వెళితే…


```హోమగుండంలో వేసే పదార్థాలు, సామూహికంగా చదివే వేద మంత్రాలు ఇవన్నీ ఎంతో సహేతుకమైనవని, పర్యావరణానికి సానుకూలమని, ఆరోగ్యకరములని, ఎంతో అర్ధవంతమైనవని కేరళ రాష్ట్రంలో ప్రొఫెసర్ నాంపూరి(ఫార్మర్ డైరక్టర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫోటానిక్స్, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ), మరి కొంతమంది సైంటిస్టులతో కలిసి చేసిన రీసెర్చ్ లో కుండ బద్దలుగొట్టేలా స్పష్టం చేసారు.


కేరళ రాష్ట్రం., త్రిస్సూర్ జిల్లా., పంజల్ గ్రామంలో నిర్వహించిన “అతిరాత్రం” యజ్ఞాన్ని ప్రత్యక్షంగా పరీక్షించిన ఈ శాస్త్రవేత్తల బృందం అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు...


యఙ్ఞాలను నిర్వహిస్తున్నప్పుడు చుట్టుపక్కల వున్న ప్రదేశమంతా చక్కటి ప్రశాంతతతో, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సంతరించుకుంటుంది.


గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం ఇలా సకల జీవకోటికి ఆధారాలైన పంచభూతాలను యఙ్ఞ కర్మలు శుద్ధి చేస్తాయి.


యఙ్ఞ ప్రభావిత ప్రాంతాలలో మనుషులే కాదు… సకల జీవరాశుల పెరుగుదల ఆరోగ్యవంతంగా ఉంటుంది. దీనిని ఋజువు చేయటానికి… వాళ్ళు కొన్ని రకాల విత్తనాలను యజ్ఞస్థలానికి దగ్గరగా… మరికొన్ని మరికాస్త దూరంగా నాటారు. యాగానికి మరీ దగ్గరగా ఉన్న విత్తనాల పెరుగుదల … దూరంగా ఉన్నవాటి కంటే 2000 రెట్లు ఎక్కువ వేగంగా ఉందని తేల్చారు. అందుకు హోమద్రవ్యాల ప్రభావంతో పాటు…. వేదమంత్రోచ్ఛారణ సైతం మొక్కల ఎదుగుదలపై సానుకూల ప్రభావం కనబరించిందని ధృవీకరించారు.


యఙ్ఞం నిర్వహిస్తున్న ప్రాంతం నుంచి భూమిపై కొన్ని కిలోమీటర్ల దాకా, అలాగే ఆకాశంలో మేఘాల దాకా ఆ మంత్ర ధ్వనుల తరంగదైర్ఘ్యాలు(wave-length) ఆవరిస్తాయని, దానివల్ల స్వచ్ఛమైన గాలితో పాటుగా సకాలంలో వర్షాలు కూడా కురుస్తాయన్నారు.


వీటితో పాటు యజ్ఞంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారు కూడా ఆ మంత్రోచ్ఛారణ ప్రభావంతో సానుకూల ధోరణులతో వ్యవహరిస్తారని శాస్త్రవేత్తల బృందం వివరించింది.

జ్ఞాపకాల దొంతర



*1950-70 లో పుట్టిన వాళ్ళ జ్ఞాపకాల దొంతర*


SSC పాసవగానే టైప్ ఇన్ స్టిట్యూట్ కి పేపర్లు గుండ్రంగా చుట్టుకుని వెళ్లిన తరం మనది . అద్దెకి బుక్స్ (నవలలు ) తెచ్చుకుని చదువుకున్న తరం మనది. సినిమా హాలు క్యూలో పాటల పుస్తకాలు కొనుక్కుని బట్టీలు పట్టిన కాలం మనది.


 సైకిళ్లు తొక్కుకుని ఆఫీస్ లకు కాలేజ్ స్కూళ్ళకు వెళ్లిన రోజులవి. అందుకే డ్రాయింగ్ రూమ్ జిమ్ములలో సైకిల్ తొక్కే అవసరం పడేది కాదు.


చేబదుళ్లకి కాదేదీ అనర్హం. పిన్నిగారింట్లోంచి గ్లాస్ తో చెక్కర అయినా, స్పున్ తో కాఫీ పొడైనా, బాబాయ్ గారి రేలీ సైకిల్ అయినా, పక్కింటి అన్నయ్య జామెంట్రీ బాక్సూ , స్కూల్లో డ్రామాకి ఎదురింటి అక్కయ్య జడగంటలూ అయినా.


అప్పు పుట్టని పచారీ షాపులూ బట్టల కొట్టులూ వుండేవే కావు. రేషన్ షాపుల్లో పంచదార కోసం, కిరసనాయిల్ కోసం క్యూ లో నిలబడి డ్యూయెట్లూ, పాలసీసా కోసం బూతుల దగ్గర నిలబడినప్పుడు లవ్ లెటర్స్ ఎక్స్చేంజ్ లు జరిగేవి.


*ఇంటి ముందుకు* కోతులాడించేవాడు, పాములాడించేవాడు, గంగిరెద్దులాడించే వాడు, ఎలుగు బంటిని తెచ్చేవాడు, చిలక జోస్యం చెప్పేవాడు, వానల్లు పడాలి వాన దేవుడా అని కప్పలకి పెళ్లిళ్లు చేసే వాళ్లు కాలాన్ని బట్టి వచ్చి వినోదం అందించే వాళ్లు. మేకప్పులు అంటే తెలీని రోజుల్లో మొహాలకి గులాబీ రంగులేసుకునొచ్చి, ఇళ్ల ముందు సినిమా పాటలకి డాన్స్ లాడే వారు. గారడీల వాళ్లు బాలన్సింగ్ ఎలాగో పైన తాడు మీద చిన్న పిల్లలని నడిపిస్తూ చూపించే వాళ్లు. మూలికలూ, పసర్లూ అమ్మేవాళ్లు తాము నయం చెయ్యలేని రోగం లేదనే వాళ్లు. బస్టాండ్ లో చెవి గులిమిలు తీస్తామనే పెట్టెలతో తిరిగే వాళ్లూ. ఇళ్లముందు కొచ్చి సవరాలు కడతాం అనే వాళ్లూ.


వాళ్ల కోసం టిన్నుల్లో జుట్టు వూడితే దాచుకున్న వాళ్లూ వుండేవారు. "దువ్వెన్నలు, బొట్లు, కాటుక పెట్లు, ఇయర్ పిన్లు, రబ్బర్ గాజులు, రిబ్బన్లహో". అంటూ పెట్టె నెత్తిన పెట్టుకొచ్చే వాళ్ల దగ్గర దొరకని ఫ్యాన్సీ వస్తువుండేది కాదు. "పాత బట్టలకి స్టీల్ సామాన్లిస్తాం". అన్న వాళ్లు వచ్చి ఎన్నేసినా, ముందు చూపించినా గంగాళం కాకుండా, ఆఖర్న చూపించిన గిన్నె ఇచ్చి పోయేవాళ్లు. గోతాముడు పాత బట్టలొదిలిపోయేవి. కత్తికి సాన పెడ్తాం, నవార్లు నేస్తాం. పరుపులేకుతాం. గిన్నెలకి సొట్టలు తీస్తాం. బంగారు వెండి వస్తువులకి పాలిష్ పెడతాం. అరువు మీద చీరలిస్తాం అంటూ ఇంటి ఇల్లాళ్లని ఊపిరి తీసుకోనిచ్చే వాళ్లు కారు. ఇంక ముగ్గు అమ్మే వాళ్లూ, ఉప్పు అమ్మేవాళ్లూ, కూరలూ పండ్లూ అమ్మే వాళ్లూ సరేసరి.


మాదా కబళం వాళ్లు "అన్నం వుంటే పెట్టమ్మా నీ కొడుకులు, బిడ్డలు, మనవలు సల్లంగుండ" అంటూ టైముల వారీగా వచ్చే వాళ్లు... సాయంత్రం 8 గంటల బిచ్చగాడొచ్చి వెళితే మా నానమ్మ మాత్రలేసుకునేది..


రేడియోలో బినాకా గీత్ మాలా ఊహల రెక్కలు విప్పేది. భూలే భిస్రే గీత్ అమర లోకాల్లో విహరింప చేసేది. రహస్య ప్రేమలు, అచ్చట్లు, ముచ్చట్లు... "ఏమిటో" అనుకోవడాలు ప్రొద్దుట సంస్కృత వార్తలు 'ఇతి బలదేవానంద సాగరహా 'తో ప్రారంభం అయితే ఈ మాసం పాటలూ కార్మికుల కార్యక్రమాలూ సంక్షిప్త శబ్ద చిత్ర ప్రసారాలూ..వివిధ భారతి మీరుకోరిన పాటలూ..పండితులచే నిర్మించబడ్డ నాటకాలూ..వావ్ రేడియో స్వర్ణ యుగం అది!


అప్పట్లో పేపరు చదువుతూ కాఫీ తాగని మనుషులు అరుదు..ఇంగ్లీష్ పేపర్ చదువుతే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అయినట్లే, దూర్దర్శన్ లో ఇంగ్లీష్ వార్తల వల్ల ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నాం.. తాతయ్యలకీ దూరపు చుట్టాలకీ ఉత్తరాలు రాస్తూ లెటర్ రైటింగులు నేర్చుకున్నాం.... ఉభయకుశలోపరి ఎక్కడ పెట్టాలో, గంగాభాగీరధీ సమానురాలైన ఎప్పుడు వాడాలో తెలుసు కున్నాం!


రైల్వే స్టేషన్ లో వెయింగ్ మిషన్ ఎక్కడానికి 10 పైసల బిళ్ల కోసం మారాం చేసిన జెనరేషన్ మనది . ఇంటి ముందు కొచ్చే పాల ఐసు 10 పైసలూ, ఫ్రూట్ ఐసు 5 పైసలూనూ.


*ఎన్నని చెప్పగలం ఆ పాత మధురమైన జ్ఞాపకాలు*.... *ఇప్పటికి ఎప్పటికి మా గుండెల్లో నిలిచిపోయి మా గుండెలు అగిపోయేవరకు మాతో వెన్నుండి మమ్మల్ని నడిపిస్తున్న గుర్తులు*.


ఇప్పటి కాలం పిల్లలకు

అమ్మ చేతి మురుకులు లేవు

అలసట లేని పరుగులు లేవు

ఎత్తరుగులు మొత్తం పోయే

రచ్చబండలూ మచ్చుకు లేవు

వీధిలో పిల్లల అల్లరి లేదు

తాతలు ఇచ్చే చిల్లర లేదు

ఏడు పెంకులు ఏమైపోయే

ఎద్దు రంకెలు యాడకి పోయె

ఎక్కడా వెదురు తడికెలు లేవు

ఏ తడికకీ భోగి పిడకలు లేవు

కూరలమ్మే సంతలు లేవు

పెరుగులమ్మే ముంతలు లేవు

బువ్వా లాటల విందే లేదు

గవ్వలాటలు ముందే లేదు

కుప్పిగంతులు లేనే లేవు

కళ్ళ గంతలు కానే రావు

డ్రింకు మూతల గోలే లేదు

బచ్చాలాడే ఇచ్చా లేదు

కోతి కొమ్మచ్చి ఏమైపోయే

అవ్వా అప్పచ్చి ముందే పాయె

గూటీ బిళ్ళా గూటికి పోయే

తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చె

గచ్చకాయలు మచ్చుకు లేవు

చింత పిక్కలు లెక్కకూ లేవు

ధారగా కారే ముక్కులు లేవు

జోరుగా జారే లాగులు లేవు

కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు

కొండముచ్చుని కెలుకుడు లేదు

బట్టన మురికి అంటక పోయె

మనసుకి మురికి జంటగ చేరె

కాకి ఎంగిలి కరువై పోయే

భుజాన చేతులు బరువై పోయె

అన్ని రంగులూ ఏడకో పోయె

ఉన్న రంగులూ మాసికలాయె

దానికితోడు కరోనా వచ్చె

బళ్ళూ, గుళ్ళూ మూసుక పోయె

బడిగంటల ఊసే లేదు

బడికి పోయే ధ్యాసే లేదు

మూతులన్నీ మాస్కుల పాలు

చేతులన్నీ సబ్బుల పాలు

ఆన్ లైన్ లో పాఠాలాయె

అర్థం కాని చదువులాయె

ప్రశ్నలకు జవాబులుండవు

కొన్నాళ్ళకు ప్రశ్నలే ఉండవు

ప్రస్తుత బాల్యం వెలవెల పోయె

దానికి మూల్యం ప్రస్తుత మాయే

రేపటి సంగతి దేవుడి కెరుక

నేటి బాలలకు తప్పని చురక

బాలానందం లేని నేటి జీవితం

మానవాళికే మాయని మరక.

అందుకే మన తరం అదృష్టవంతులమ్..


1950 -70 లో పుట్టిన మనం ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మన తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు*.


ఆంగ్ల మాధ్యమంలో చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము. లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము. పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న *సామాజిక -ఆర్థిక* పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం నల్గురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు. *ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది...* అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది. *పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే.* పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. బొగ్గుల కుంపటిలోనో, కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి, ఇంత మంది పిల్లలను పెంచిన *ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము.*


దాదాపు అందరం భట్టిపంతుల బడిలోనో ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకొన్న వాళ్ళమే. మన లో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు కూడా లేకుండా నడిచిన వాళ్ళమే!


ఆ రోజుల్లో చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు. ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే.


మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. *పావలా/అర్ద రూపాయి ఇచ్చి నేల, బెంచి టిక్కెట్ కొనుక్కుని తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో.* అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్,కళ్యాణ్ జీ ఆనంద్ జీ ... ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.


మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ల గోళీలాట ఏడుపెంకులాట బుచ్చలాట, రాత్రికి హరికథలు బుర్ర కథలు నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం.


ఈ నాటికీ దాదాపు మనం అందరం* ✌🏻*55- 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకున్న వాళ్ళమే. పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే! అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్న వాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకున్న వాళ్ళమే.


*ఆహా! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ!! అచ్చంగా బాల్యాన్ని చూసుకున్నట్టు ఉంది కదా.

🙏💐💐💐💐💐💐💐💐💐👍

పెద్దల పాదాలను

 *పెద్దల పాదాలను తాకి ఎందుకు నమస్కరిస్తారు?*

పెద్దల పాదాలకు నమస్కరించడం అనేది గౌరవప్రదమైన చిహ్నంగా పరిగణించబడే ఒక పురాతన భారతీయ సంప్రదాయం. ఈ అలవాటు భారత దేశంలోనే కాకుండా, మరియు విదేశాలలోని దాదాపు భారతీయ మూలాలు ఉన్న అన్ని హిందువుల కుటుంబాలలో చూడవచ్చు.

ఇంట్లో వారే కాదు.. పెద్దవారు ఎవరు కనిపించినా పాదాలకు నమస్కారం చేస్తాం. ఇది భారతదేశంలో ఎక్కువగా కనిపించే సంప్రదాయం. ఇంట్లో పెద్దవారి నుంచి పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేకమైన రోజుల్లో కూడా పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకుంటాం. అయితే ఎందుకు అలా చేస్తారు? 

హిందూమతం శతాబ్దాలుగా అనుసరిస్తున్న అనేక నమ్మకాలు మరియు సంప్రదాయాలను కలిగి ఉంది. ఈ సంప్రదాయాలలో ఒకటి పెద్దల కాళ్లకు నమస్కరించే సంస్కృతి (నమ్మకం), ఆధునిక యుగంలో ఇది కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటికీ అనుసరిస్తుంది. 

ఇలా ప్రతి రోజూ ఉదయాన్నే లేచి తల్లిదండ్రుల పాదాలను తాకాలని శాస్త్రాలలో చెప్పబడింది. పెద్దల పాదాలు తాకి ఆశీస్సులు పొందాలని చిన్నప్పటి నుంచి అమ్మమ్మలు పిల్లలకు ఈ గుణాన్ని నేర్పుతారు. కానీ పెద్దలు, తల్లిదండ్రులు, గురువులు లేదా ఏ పెద్దల పాదాలకు నమస్కరించడం వెనుక కారణం కేవలం ఆశీర్వాదం మాత్రమే అని చెప్పబడింది. 

పెద్దల కాళ్ళ మీద పడటం గురించి మీ అమ్మమ్మ లేదా అమ్మ చెప్పే మాటలు మీకు కాసేపు వింతగా లేదా పురాణగా అనిపించవచ్చు. కానీ దాని కారణం మరియు ప్రయోజనాలు గ్రంథాలలో వివరించబడ్డాయి. మీరు ఆ సలహాను పాటిస్తే, మీరు సంతోషిస్తారని మరియు భవిష్యత్తులో జరిగే అశుభ సంఘటనల నుండి రక్షించబడతారని కూడా నమ్ముతారు. పాద స్పర్శ యొక్క కర్మ మరియు జ్యోతిష్య ప్రయోజనాలు .కొంతమంది ప్రతిరోజు మేల్కొన్న వెంటనే తాతయ్య, నానమ్మ లేదంటే తల్లిదండ్రుల పాదాలకు మొక్కుతారు. రాత్రి పడుకునే ముందు కూడా ఇలా చేస్తారు. ఇలా చేయడం వల్ల గొప్ప శక్తి లభిస్తుందని, గొప్ప అనుభూతి కలుగుతుందని మహాభారతంలో కూడా చెప్పబడింది. పెద్దవారి పాదాలను తాకడం వారికి ఇచ్చే గౌరవంగా భావిస్తాం. ఋషులు కూడా పాదాలను తాకడం వల్ల ప్రయోజనకరమైన నాలుగు అంశాలు చెప్పారు. బలం, బుద్ధి, జ్ఞానం, కీర్తి కలుగుతాయట. ఆధునిక కాలంలో పాదాలకు మొక్కడం అంటే ఆయురారోగ్యాలు, అదృష్టము, జ్ఞానము అని చెబుతారు.

భారతీయ సంస్కృతిలో పాదాలను తాకడానికి మూడు మార్గాలు ఉన్నాయి. ముందుగా నమస్కరించడం, రెండవది మోకాళ్లపై కూర్చోవడం మరియు మూడవదిగా నమస్కరించడం ద్వారా. ఈ మూడింటి వల్ల కలిగే భౌతిక మరియు మతపరమైన ప్రయోజనాలు వివరించబడ్డాయి. పెద్దవారి పాదాలను తాకి ఆశీస్సులు పొందడం వల్ల వినయం, సంస్కారం, గౌరవం కలుగుతాయని చెబుతారు. దీనితో పాటు, వ్యక్తిలో సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది. 

పెద్దవారి పాదాలను తాకడం వల్ల తొమ్మిది గ్రహాలకు సంబంధించిన దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్యుడు అనీష్ వ్యాస్ చెప్పారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తండ్రి, సూర్యుడు, అమ్మమ్మ, అమ్మ, అత్త, కోడలు, అత్తగారు, మామగారు మొదలైన వారి పాదాలను తాకడం చంద్రుడు, కుజుడు, పాదాలను తాకినట్లే. సాధువులు మరియు బ్రాహ్మణులు బృహస్పతి యొక్క బలాన్ని బలపరుస్తుంది, ఇది బుధుడు, బృహస్పతికి నమస్కరించడం లాంటిది. పెద్దవారి పాదాలను తాకడం వల్ల కేతువు బలపడుతుందని, కోడలు పాదాలను తాకడం వల్ల శుక్రుడు బలపడతాడని వారు చెబుతున్నారు. పాదాలను తాకడం వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. మనం ఎవరి పాదాలను తాకినప్పుడు వారి చేయి మన తలపై ఉంటుంది. ఇది సానుకూల శక్తి మార్పిడికి దారితీస్తుందని అనిష్ చెప్పారు. 

పాదాలను తాకడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు. 

పాదాలను తాకడం వల్ల పెల్విస్ పై భాగంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది చర్మం మరియు జుట్టు సమస్యలను కూడా నయం చేస్తుంది. యోగాలో పాదాలను తాకడాన్ని సాష్టాంగం అంటారు.శాస్త్రం ప్రకారం మనం వంగి మన పాదాలను తాకినప్పుడు అది తుంటికి మరియు వెన్నెముకకు ఉపశమనం ఇస్తుంది. మోకాళ్లపై కూర్చొని పాదాలను తాకడం వల్ల పాదాల కీళ్లన్నీ వంగి ఉండడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రాణం అన్ని కీళ్లను కొంతకాలం సాగదీస్తుంది, ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.అసలు పెద్దవారి పాదాలకు ఎలా నమస్కారం పెట్టాలి? అంటే దానికి ఓ పద్ధతి ఉంది. మోకాళ్లను వంచకుండా శరీరం పై భాగాన్ని మాత్రమే వంచి పెద్దల పాదాలను తాకేలా రెండు చేతుల మధ్యలో తల ఉంచాలి. ఎడమ చేతి వేళ్లు వారి కుడి పాదాన్ని, కుడి చేతి వేళ్లు వారి ఎడమ పాదాన్ని తాకాలి. మీ తలపై వారు కుడిచేయిని ఉంచి ఆశీర్వాదం ఇవ్వాలి.మనలో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీ ఉంటాయి. ఎడమవైపు పాజిటివ్, కుడివైపు నెగెటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. మనం పాదాలకు నమస్కరిస్తున్నప్పుడు రెండు భాగాలు కలిసి పాజిటివ్‌గా మారతాయట. మెదడు నుంచి వచ్చే నరాలు శరీరమంతా ఉంటాయి. ఈ నాడులు చేతులు, కాళ్ల వేళ్ల వద్ద ఎండ్ అవుతాయి. మీ చేతివేళ్లు పెద్దవారి పాదాలను తాకినపుడు రెండు శరీరాలకు సంబంధించిన ఎనర్జీ అనుసంధానం అవుతుంది. అవి మనలో మరింత శక్తిని ప్రసరించేలా చేస్తాయట. పెద్దవారి పాదాలను తాకినపుడు మనలో ఉండే అహాన్ని పక్కన పెడతాం. అలా చేయడం వల్ల పెద్దవారి నుంచి వెలువడే శక్తి వారు ఆశీర్వదిస్తున్నప్పుడు వారి చేతుల నుంచి మనల్ని చేరుతుందట.

పాదాలను మూడు రకాలుగా తాకాలట.. ముందుకు వంగి పాదాలను తాకడం, మోకాళ్లపై కూర్చుని పాదాలను తాకడం. మూడవది సాష్టాంగ ప్రణామం. ముందుకు వంగి పాదాలు తాకడం వల్ల నడుము, వెన్నెముక సాగుతుందని చెబుతారు. మోకాళ్లపై కూర్చుని పెద్దవారికి నమస్కారం చేసినపుడు మీ మోకాళ్లకు ఉపశమనం లభిస్తుంది. శరీరంలోని కీళ్లన్నీ సాగుతాయి. సాష్టాంగ ప్రణామంతో శరీరంలో ఏ నొప్పులు ఉన్నా నయమవుతాయట. పెద్దల పాదాలను తాకి నమస్కరించడం వల్ల వారిని మనం గౌరవించడంతో పాటు మనకి ఇన్ని ప్రయోజనాలు చేకూరుతాయన్నమాట.

సైన్స్ ప్రకారం, మానవ శరీరంలో ప్రతికూల మరియు సానుకూల విద్యుత్ ప్రవాహాలు ఉంటాయి. మానవ శరీరం యొక్క ఎడమ వైపు ప్రతికూల విద్యుత్ ప్రవాహాలు ఉంటాయి మరియు శరీరం యొక్క కుడి వైపు సానుకూల విద్యుత్ ప్రవాహాలు ఉంటాయి. అందువల్ల, రెండు భాగాలు కలిసి సానుకూల లేదా ప్రతికూల విద్యుత్ ప్రవాహాలతో కూడిన సర్క్యూట్‌ను పూర్తి చేస్తాయి. కాబట్టి పాదాలను తాకేటప్పుడు, మనం చేతులను దాటాలని సూచించబడింది. తద్వారా రెండింటిలోనూ సానుకూల విద్యుత్ ప్రవాహాలు ఏకరీతి సర్క్యూట్‌లో ప్రవహిస్తాయి మరియు అదేవిధంగా ప్రతికూల విద్యుత్ ప్రవాహాలు ఒక సర్క్యూట్‌లో సంయుక్తంగా ప్రవహిస్తాయి. అందువలన, రెండు విద్యుత్ ప్రవాహాలు బాగా ఏకీకృత సర్క్యూట్‌ను ఏర్పరుస్తాయి.

మీరు మీ అహాన్ని పక్కనపెట్టి ఒక పెద్దవారి పాదాలను తాకినప్పుడు, ఆ పెద్దవారు మీ శ్రద్ధను లేదా మీ తగ్గిన అహాన్ని అంగీకరిస్తారు మరియు వారి హృదయం సానుకూల ఆలోచనలు మరియు శక్తిని ప్రసరింపజేస్తుంది, దానిని మనం కరుణ అని కూడా చెప్పవచ్చు, అది వారి చేతులు మరియు కాలి వేళ్ల ద్వారా మిమ్మల్ని చేరుకుంటుంది.

పాదాలను నమస్కరించి తాకడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది, ఇది ఆరోగ్యానికి మంచిది.

ఒక్క విషయం గుర్తుకు పెట్టుకోవాలి.మనం దేవాలయంలో ఒక్క భగవంతునికి తప్ప మానవ మాత్రులు ఎంత పేద వారైన అక్కడ కనిపిస్తే వారికి నిలబడి రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి.గుడి ఆవరణంలో మాత్రం పాదాలకు తాకి నమస్కారం చేయకూడదు.ఈ సాంప్రాదాయాన్ని మనం మన పిల్లల ముందు మన పెద్దలను గౌరవించి వారి పాదాలకు నమస్కారం చేసి మన పిల్లలతో చేయిస్తే భవిష్యత్తు తరాలవారికి పెద్దలను గౌరవించాలి అనే గొప్ప సంస్కారం భావితరాల వారికి నేర్పించిన వాళ్ళం అవుతాం.పెద్దల ముందు తలవంచితే మేలే జరుగుతుంది కాని కీడు రాదు అని గ్రహించాలి. మనం ఆచరిస్తేనే మన పిల్లలు మనలని చూసి వాళ్ళు చూసి నేర్చుకుంటారు.

జీవితమంటే

 *జీవితమంటే ఓ సమస్య నుండి మరో సమస్య ప్రయాణమే..

*ఏ సమస్య లేని జీవితం ఉండదు.. *ఎంతటి సమస్యలైనా ఎదుర్కోవడానికి నీ కాళ్ళు, కళ్ళు, నోరు చేతులు అన్ని సిద్ధంగానే ఉంటాయి.. 

*కానీ మొద్దుబారిపోయేది మెదడు మాత్రమే.. 

*ప్రతీ సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది.. పరిష్కారం లేనిది అసలే సమస్యే కాదు.. ఆలోచించండి.. 


*నవ్వుతూ సమస్యలను జయించండి.

సమస్యలను జయిస్తూ గమ్యం చేరగలిగితే ఆది విజయం అవుతుంది. 

*అనేక సమస్యలు వచ్చినా ఎదిరించి గమ్యం చేరగలిగితే ఆది చరిత్ర అవుతుంది. 

*ఒక నిమిషం సమయము మన జీవితాన్ని మార్చ లేకపోవచ్చు.. 

కానీ ప్రతీ నిమిషము సద్వినియోగం చేసుకుంటే మన జీవితం ఖచ్చితంగా పెను మార్పు వస్తుంది.

*చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో.. భూమి ని చూసి ఓర్పుని నేర్చుకో.. చెట్టుని చూసి ఎదుగుదల నేర్చుకో.. *కోపంలో ఎప్పుడు సమాధానం చెప్పకు.. సంతోషంలో ఎప్పుడు వాగ్దానం చేయకు.. వత్తిడిలో ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకు.. ఏదైనా ఆలోచించి ప్రశాంతమైన మనసుతో మంచి నిర్ణయా*జీవితమంటే ఓ సమస్య నుండి మరో సమస్య ప్రయాణమే..

*ఏ సమస్య లేని జీవితం ఉండదు.. *ఎంతటి సమస్యలైనా ఎదుర్కోవడానికి నీ కాళ్ళు, కళ్ళు, నోరు చేతులు అన్ని సిద్ధంగానే ఉంటాయి.. 

*కానీ మొద్దుబారిపోయేది మెదడు మాత్రమే.. 

*ప్రతీ సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది.. పరిష్కారం లేనిది అసలే సమస్యే కాదు.. ఆలోచించండి.. 


*నవ్వుతూ సమస్యలను జయించండి.

సమస్యలను జయిస్తూ గమ్యం చేరగలిగితే ఆది విజయం అవుతుంది. 

*అనేక సమస్యలు వచ్చినా ఎదిరించి గమ్యం చేరగలిగితే ఆది చరిత్ర అవుతుంది. 

*ఒక నిమిషం సమయము మన జీవితాన్ని మార్చ లేకపోవచ్చు.. 

కానీ ప్రతీ నిమిషము సద్వినియోగం చేసుకుంటే మన జీవితం ఖచ్చితంగా పెను మార్పు వస్తుంది.

*చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో.. భూమి ని చూసి ఓర్పుని నేర్చుకో.. చెట్టుని చూసి ఎదుగుదల నేర్చుకో.. *కోపంలో ఎప్పుడు సమాధానం చెప్పకు.. సంతోషంలో ఎప్పుడు వాగ్దానం చేయకు.. వత్తిడిలో ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకు.. ఏదైనా ఆలోచించి ప్రశాంతమైన మనసుతో మంచి నిర్ణయాలు తీసుకో!లు తీసుకో!

అహల్య రాయి కాలేదు*

  *అహల్య రాయి కాలేదు*

               ➖➖➖

```

*రామాయణం మనకు ఏం చెప్పింది?


ఇంద్రుడివల్ల అహల్య మోసపోలేదు‌. తప్పు చేసినందుకుగానూ రాయిలా జడపదార్థమై పడి ఉండమని గౌతముడు శపించినట్టుగానే చెప్పింది వాల్మీకి రామాయణం. 


చేసిన తప్పుకు అహల్య కూడా సంఘ బహిష్కరణకు గురై అన్నిటినీ కోల్పోయి జడపదార్థమై ఒక రాయిలా జీవనాన్ని సాగిస్తోంది. 


అప్పటికే చాలా కాలం గడిచిపోయింది..


తప్పులు చెయ్యడం మానవ నైజం! 


ఎంత కాలం ఒక మనిషికి శిక్ష కొనసాగుతుంది? 


ఇక అహల్యను సహజమైన జీవితంలోకి తీసుకురావాలన్న‌ ఆలోచనతో విశ్వామిత్రుడు జడపదార్థంలా, రాయిలా‌, జీవచ్చవంలా పడి ఉన్న అహల్య ఆశ్రమానికి రాముణ్ణి తీసుకువెళతాడు. 


తన ఆశ్రమంలో రాముని పాదం పడగానే అహల్యకు ప్రాణం లేచివచ్చింది. 

స్వయానా రాముడే వెళ్లి అహల్యను పరిగణించడం జరిగాక ఇతర ఆశ్రమవాసులు కూడా అహల్యను తమలోకి తీసుకున్నారు. 


అప్పటి నుంచి ఆమె మామూలు మనిషి అయింది. 


అలా రాముడి పాదం వల్ల అహల్య పాపం కడగబడింది. *“కామిని పాపము కడిగిన పాదము” అని అన్నమయ్య అన్నారు.


అహల్య రాయిగా మారడమూ, రాముడి పాదం తగలగానే మళ్లీ స్త్రీ అవడమూ వాల్మీకి రాసింది కాదు. 

తరువాతి నాళ్లలో మార్చి చెప్పబడింది అది. 

తప్పు జరిగాక, శిక్ష అనుభవించాక ఎవరినైనా మళ్లీ మామూలు జీవనంలోకి తీసుకురావాలి అన్న విశ్వామిత్రుడి చింతన విప్లవాత్మకమైంది ఆపై మహోన్నతమైంది. 


ఇది రామాయణం మనకు నేర్పే సంస్కారం.


రామాయణంలో ఉన్నదాన్ని మార్చి అహల్య‌ రాయిగా మారి ఆపై రామ పాదం సోకి మళ్లీ‌ స్త్రీ అయిందని చెప్పడం వల్ల రామాయణం మనకు చెప్పిన మహోన్నతమైన తత్త్వం మనకు అందకుండా పోయింది.


మహర్షులు, మహనీయులు చెప్పినదాన్ని ఉన్నదున్నట్టుగానే తీసుకుని అర్థం చేసుకోవాలి.

ఏకో ధర్మః పరం

  🔔*సుభాషితమ్*🔔


        శ్లో 𝕝𝕝 *ఏకో ధర్మః పరం శ్రేయః*

                  *క్షమైకా శాన్తిరుత్తమా|*

                  *విద్యైకా పరమా తృప్తిః*

                  *అహింసైకా సుఖావహా||*


  తా 𝕝𝕝 *"ధర్మమొక్కటే పరమశ్రేయస్సును కలిగించును. ఓర్పు ఒక్కటే ఉత్తమమైన శాంతినిస్తుంది. చదువొక్కటే మిక్కిలి తృప్తిని ప్రసాదించును. అహింస ఒక్కటే సుఖాన్ని చేకూర్చును"......*


https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B

   

🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

శుక్రవారం,మే.29,2026

  🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻

శుక్రవారం,మే.29,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

అధిక జ్యేష్ఠ మాసం -శుక్ల పక్షం

తిథి:త్రయోదశి ఉ9.34 వరకు

వారం:శుక్రవారం(భృగువాసరే)

నక్షత్రం:స్వాతి ఉ10.46 వరకు 

యోగం:పరిఘము తె4.46 వరకు

కరణం:తైతుల ఉ9.34 వరకు తదుపరి గరజి రా10.20 వరకు

వర్జ్యం:సా4.52 - 6.36

దుర్ముహూర్తము:ఉ8.04 - 8.56

మరల మ12.23 - 1.15

అమృతకాలం:రా3.19 - 5.04

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30

సూర్యరాశి:వృషభం

చంద్రరాశి:తుల    

సూర్యోదయం:5.29

సూర్యాస్తమయం:6.25

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                       చతుర్దోధ్యాయః

               జ్ఞాన కర్మ సన్యాస యోగము



అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేఽపానం తథాపరే ।

ప్రాణాపానగతీ రుధ్వా ప్రాణాయామపరాయణాః ।। 29 ।।

అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి ।

సర్వేఽప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః ।। 30 ।।



ప్రతిపదార్థ:



 అపానే — లోనికి వచ్చే శ్వాస; జుహ్వతి — సమర్పణ; ప్రాణం — బయటకు వెళ్ళే శ్వాస; ప్రాణే — బయటకు వెళ్ళే శ్వాస యందు; అపానం — లోనికి వచ్చే శ్వాస; తథా — ఇంకా; అపరే — మరికొందరు; ప్రాణ — బయటకు వెళ్ళే శ్వాసలో; అపాన — మరియు లోనికి వచ్చే శ్వాస; గతీ — కదలిక; రుధ్వా — నిలిపి; ప్రాణ-ఆయామ — శ్వాశని నియంత్రించి; పరాయణాః — పూర్తిగా నిమగ్నులై ; అపరే — మరికొందరు; నియత — నిగ్రహించి; ఆహారాః — ఆహార స్వీకరణ; ప్రాణాన్ — ప్రాణ వాయువులు; ప్రాణేషు — జీవ శక్తి; జుహ్వతి — సమర్పణ; సర్వే — సమస్త; అపి — కూడా; ఏతే — ఇవి; యజ్ఞ-విదః — యజ్ఞము తెలిసినవారు; యజ్ఞ-క్షపిత — యజ్ఞకార్యములచే పరిశుద్ధి చేయబడుతూ; కల్మషాః — మలినముల నుండి. 



తాత్పర్యము : 



మరికొందరు లోనికి వచ్చే శ్వాస యందు బయటకు వెళ్ళే శ్వాసను యజ్ఞముగా సమర్పిస్తారు, వేరొకరు బయటకు వెళ్ళే శ్వాస యందు లోనికి వెళ్ళే శ్వాసను సమర్పిస్తారు. కొందరు ప్రాణ శక్తి నియంత్రణలో నిమగ్నమై, ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ లోనికివచ్చే, బయటకు వెళ్ళే శ్వాసల నియంత్రణ చేస్తుంటారు. ఇంకా మరికొందరు, ఆహారాన్ని తగ్గించి, శ్వాసను ప్రాణ శక్తిలో యజ్ఞంగా సమర్పిస్తారు. యజ్ఞం తెలిసినవారంతా ఇటువంటి ప్రక్రియల ద్వారా తమ తమ మలినముల నుండి శుద్ధి చేయబడుతారు.   



వివరణ:


కొందరు ప్రాణాయామ అభ్యాసం వైపు ఆకర్షితులవుతారు, ప్రాణాయామం అంటే ‘శ్వాస యొక్క నియంత్రణ’ అని చెప్పవచ్చు. ఈ ప్రక్రియలో ఈ క్రిందివి ఉంటాయి :


పూరకము: శ్వాసను ఊపిరితిత్తుల లోనికి తీసుకోనే ప్రక్రియ.


రేచకము: ఊపిరితిత్తులను ఖాళీ చేసే ప్రక్రియ.


అంతర కుంభకము: గాలి పీల్చుకున్న తరువాత ఊపిరి బిగబట్టడం. లోనికి వెళ్ళే శ్వాస లో బయటకు వచ్చే శ్వాస ఈ నిలుపుదల సమయంలో తాత్కాలికంగా నిరోధించబడుతుంది.


బాహ్య కుంభకము: ఊపిరి విడిచి పెట్టిన తరువాత ఊపిరితిత్తులను ఖాళీగా ఉంచటం. బయటకు వెళ్ళే శ్వాసలో లోనికి వచ్చే శ్వాస, ఈ నిలుపుదల సమయంలో తాత్కాలికంగా నిరోధించబడుతుంది.


ఈ రెండు కుంభకములు క్లిష్టమైన ప్రక్రియలు కాబట్టి బాగా తెలిసిన గురువుల పర్యవేక్షణ లోనే వీటిని అభ్యాసం చేయాలి, లేదా అవి హాని చేయవచ్చు. ప్రాణాయామం వైపు మొగ్గు చూపే యోగులు, ఇంద్రియములను నియంత్రించటానికి, మనస్సుని కేంద్రీకరించటానికి ఈ యొక్క శ్వాస నియంత్రణ ప్రక్రియను ఉపయోగిస్తారు. ఆ తరువాత వారి యొక్క నియంత్రించబడిన మనస్సుని యజ్ఞ పూర్వకంగా భగవంతునికి సమర్పిస్తారు.


ప్రాణం అంటే నిజానికి శ్వాస కాదు; చేతనాచేతన వస్తువులన్నిటిలో, శ్వాస యందు వ్యాపించి ఉన్న సూక్ష్మమైన జీవ శక్తి అది. వైదిక శాస్త్రాలు, శరీరంలో ఐదు రకముల ప్రాణముల గురించి చెప్పాయి - ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదానములు - ఇవి శారీరక ప్రక్రియలను నియంత్రిచటానికి పని చేస్తాయి. వీటిలో 'సమాన' మనేది జీర్ణ వ్యవస్థని నడిపిస్తుంది. కొందరు ఉపవాసం వైపు మొగ్గు చూపుతారు. తీసుకునే ఆహారం మనిషి యొక్క ప్రవర్తన మరియు నడవడిక మీద ప్రభావం చూపుతుందని తెలిసి, వారు ఆహారాన్ని తీసుకోవటాన్ని నియంత్రిస్తారు. ఈ విధమైన ఉపవాసం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియగా భారత దేశంలో అనాదిగా ప్రాచుర్యంలో ఉంది, ఇది కూడా ఒక యజ్ఞ రూపంగా ఇక్కడ పేర్కొనబడినది. ఆహారం తగ్గించినప్పుడు, ఇంద్రియములు నీరసించిపోతాయి, దీనితో జీర్ణ వ్యవస్థను నడిపే 'సమానము' తనను తానే నిర్వీర్యం చేసుకోవటం జరుగుతుంది. కొందరు చేసే యజ్ఞం ఈ విధంగా ఉంటుంది.


జనులు ఈ విధమైన ఎన్నో రకాల నిష్ఠలను పరిశుద్ధత/పవిత్రత కోసం చేస్తుంటారు. మనోఇంద్రియముల వాంఛలను తీర్చాలనే కోరికలే అంతఃకరణ మాలిన్యానికి దారి తీస్తాయి. భౌతిక వస్తువుల సుఖాన్ని కోరే మనోఇంద్రియముల యొక్క సహజ స్వభావాన్ని నియంత్రించటమే ఈ అన్ని వ్రతాల/నిష్ఠల ప్రధాన ప్రయోజనం. ఎప్పుడైతే ఈ నిష్ఠలన్ని భగవత్ అర్పితముగా చేయబడుతాయో, వాటి ఫలితంగా అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. (అంతఃకరణ అంటే మనోబుద్ధులతో కూడిన అంతర్గత వ్యవస్థ).

పంచాంగము