23, మే 2026, శనివారం

సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*750 వ రోజు*

అశ్వమేధ పర్వము చతుర్ధాస్వాసం

యాగములో జరిగిన దానధర్మాలు

ధర్మరాజు సదస్యులకు కోటివేల నిష్కములు దానముగా ఇచ్చాడు. వ్యాసుడికి ధర్మరాజు తనరాజ్యమును దానముగా ఇచ్చాడు. వ్యాసుడు " ధర్మనందనా ! నీవు నాకు భూమిని దానంగా ఇచ్చావు. నేను ఈ భూమిని ఏమి చేసుకుంటాను. దానికి సమానమైన బంగారమును దానముగా ఇవ్వు " అని అన్నాడు. ధర్మరాజు " వ్యాసమునీంద్రా ! అశ్వమేధయాగ సమాప్తంలో భూదానము చెయ్యాలని ఆర్యులు అంటారు. అందు వలన అర్జునుడి వలన జయింపబడిన భూమిని నీకు దానము ఇచ్చాను. నాకు ఇక రాజ్యము లేదు. కనుక వనవాసముకు వెడతాను. అంతేకాని ఇచ్చిన రాజ్యము తిరిగి తీసుకోను " అన్నడు. వ్యాసుడు " ధర్మతనయా ! నీ చేత దానముగా స్వీకరించబడిన ఈ భూమి నాకే స్వంతము అనుటలో ఎటువంటి సందేహము లేదు. అందుకని మేము తిరిగి ఈ భూమిని నీకు అమ్ముతున్నాము నువ్వు తగిన వెల ఇచ్చి దానిని తిరిగి నీవే తీసుకో. ఇది రాజధర్మము ఇందులో ఎమీ తప్పులేదు " అని వ్యాసుడు చెప్పాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు కూడా వ్యాసుడు చెప్పినట్లే చెయ్యమన్నాడు. అప్పుడు ధర్మరాజు కోటికోట్లమాడలు కుప్పగా పోసి " నేను దానముగా ఇచ్చిన భూమి వెల ఇంత " అన్నాడు. వ్యాసుడు ఆ బంగారమును తీసుకుని రాజ్యాన్ని ధర్మరాజుకు తిరిగి ఇచ్చాడు. ఆ బంగారమును వ్యాసుడు యాగముకు వచ్చిన బ్రాహ్మణులకు దానముగా ఇచ్చాడు. ధర్మరాజు యాగము కొరకు తయారుచేసిన బంగారు పళ్ళెములు, బిందెలు, ఇతర వస్తువులు బ్రాహ్మణులకు పంచి పెట్టాడు. బ్రాహ్మణ దానములు అయిన తరువాత క్షత్రియులకు ఆ తరువాత వైశ్యులకు, ఆ తరువాత శూద్రులకు, ఆ తరువాత ఇంకా తక్కువ జాతి వారికి అపారముగా దానములు చేసాడు. యజ్ఞముకు వచ్చిన వారంతా అత్యంత సంతుష్టులై వారి వారి నివాసములకు వెళ్ళారు. వేదవ్యాసుడు తన వంతుకు వచ్చిన ధనమును కుంతీదేవికి ఇచ్చాడు. కుంతీదేవి ఆ ధనమును పేదలకు పంచి ఇచ్చింది. జనమేజయ మహారాజా ! దానములలో ధర్మరాజు రెండవ మరుత్తు అనిపించుకున్నాడు. యజ్ఞము పరిసమాప్తి అయిన తరువాత ధర్మరాజు తమ్ములతో భార్య ద్రౌపదితో యజ్ఞస్నానము చేసాడు. ఈ యజ్ఞముతో ధర్మరాజు తన మనసును శరీరాన్ని పవిత్రము చేసుకున్నాడు. ఆ యజ్ఞమును నిర్విజ్ఞముగా జరిపించిన వ్యాసుడికి ధర్మరాజు సాష్టాంగప్రమాణము చేసాడు. ధర్మరాజును దీవించి వ్యాసుడు తన శిష్యులతో అక్కడ నుండి వెళ్ళి పోయాడు.

యాగానంతరం రాజులను సత్కరించుట

అశ్వం తిరిగివచ్చిన తరువాత జరిగిన విందులో యుధిష్టురినితో మాట్లాడుతున్న కృష్ణుడు - రాజ్మానామా నుండి ఒక దృశ్యం

వ్యాసుడు తన శిష్యులతో వెళ్ళిన తరువాత ధర్మరాజు " యాగముకు వచ్చిన రాజులకు సముచిత సత్కారాలు చేసాడు. బంగారమును, మణులను, నగలను, మాణిక్యాలను, నగలను, ఏనుగులను, అశ్వములను, వేశ్యలను కానుకగా ఇచ్చాడు. బభ్రువాహనుడికి సముచుత సత్కారము చేసి తన దేశముకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. ఎన్ని రోజులుగానో అర్జునుడికి దూరముగా ఉన్న ఉలూపి, చిత్రాంగదలు తమ భర్త అర్జునుడి వద్ద ఉండి పోయారు. బభ్రువాహనుడు మాత్రము తన దేశానికి తిరిగి వెళ్ళాడు. అందరికంటే ముందుగా యాగము చూడడానికి వచ్చిన శిశుపాలుని భార్యను ధర్మరాజు సముచితంగా సత్కరించాడు. ఆమె మనుమడిని సింధుదేశానికి అధిపతిగా పట్టాభిషిక్తుడిగా చేసాడు. తరువాత భారత యుద్ధములో ఓడిపోయి చనిపోయిన రాజుల రాజ్యాలను వారి వారసులకు ఇచ్చివేసాడు. అందరూ వెళ్ళిన తరువాత కూడా శ్రీకృష్ణుడు, బలరాముడు, యాదవ ప్రముఖులు ఉండిపోయారు. శ్రీకృష్ణుడికి, బలరాముడికి, సాత్యకికి, మిగిలిన యాదవ ప్రముఖులకు ధర్మరాజు అనేక రత్నాభరణాలు, విలువైన కానుకలు ఇచ్చి సత్కరించాడు. ధర్మరాజు చేసిన సత్కారాలకు తృప్తిచెందిన యాదవప్రముఖులు ద్వారకకు తిరిగి వెళ్ళారు " అని వైశంపాయనుడు జనమేజయునికి అశ్వమేధయాగ విశేషములు తెలిపాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీ శంకర నారాయణ స్వామి దేవాలయం

 🕉 మన గుడి : నెం 1486


⚜  తమిళనాడు : టెంకాసి


⚜  శ్రీ శంకర నారాయణ స్వామి దేవాలయం 



💠 హిందూ మతంలోని రెండు ప్రధాన భాగాలైన శైవ మతం మరియు వైష్ణవ మతాల ఐక్యతను సూచిస్తు శివుడు మరియు విష్ణువు ఒకే విగ్రహంలో శంకరనారాయణర్ అనే పేరుతో కలిసి ఉండే ఆలయమే 

శంకర్ నారాయణ స్వామి ఆలయం.


💠 ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని టెంకాసి వద్ద శంకరన్ కోవిల్ వద్ద ఉన్న శివుడికి అంకితం చేయబడిన దేవాలయం.

ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో ఉక్కిర పాండియన్ నిర్మించాడు.


💠 'శ్రీ శంకర లింగ స్వామి' అని పిలువబడే శివుడు, తన భార్య పార్వతితో కలిసి ఈ ఆలయానికి ప్రధాన దేవత, ఆమెను ' గోమతి అమ్మన్ ' అని పిలుస్తారు .


💠 పాండ్య రాజు ఉక్ర పాండియన్ ఈ ఆలయాన్ని నిర్మించి, ఆ పట్టణానికి "శంకర నారాయణర్ కోవిల్" అని పేరు పెట్టాడు .


🪔 స్థల పురాణం 


💠 కల్పిత చరిత్ర ప్రకారం, శివుడు మరియు మహా విష్ణువుల మధ్య ఎవరు సర్వశక్తిమంతుడు అనే దానిపై వివాదం ఉందని నమ్ముతారు. 

చివరికి ఒక రాజీ కుదిరింది మరియు వారు ఈ ఆలయంలో ఏకమైన దేవుడిగా కలిసి కనిపించారు. 


💠 శంకర నారాయణుడిగా శివుడు మరియు విష్ణువు కలిసి దర్శనం చేసుకోవడానికి పార్వతి తల్లి తపస్సు చేసింది


💠 శంకరలింగ స్వామి భార్య గోమతి అమ్మన్ చేసిన తపస్సును స్మరించుకుంటూ జూలై నెలలో జరిగే ఆది తపసు అనే 10 రోజుల పండుగ అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంది.

ఇది అంబికకు మాత్రమే జరిగే పండుగ కాబట్టి, ఆమె మాత్రమే రథోత్సవంలో వస్తుంది. 

చివరి రోజున, అంబిక తపస్సు మండపానికి వెళుతుంది. 

సాయంత్రం శంకరనారాయణుడు అంబికకు దర్శనం ఇచ్చి, ఏనుగు వాహనంపై కలిసి ఆలయంలోకి ప్రవేశిస్తాడు.


🪔 ప్రధాన చరిత్ర :-


💠 తంజోరును భీమచోళ రాజు పాలించాడు. అతని భార్య భద్రాట్సి. రాజు దేవుని పనిలో చాలా నిమగ్నమై అనేక పుణ్యకార్యాలను అర్థం చేసుకున్నాడు. 


💠 భీమేశ్వరర్ తన పేరు మీద ఒక ఆలయాన్ని నిర్మించాడు. 

గొప్ప భక్తుడైన రాజుకు కొడుకు పుట్టలేదు. రాజు మరియు రాణి, కొడుకు కోసం దేవుడిని ప్రార్థించారు. ఒకరోజు భీమచోళుడి భార్య కలలో శివుడు కనిపించి, తంజావూరులో ప్రహదీశ్వరుడు మరియు కొంగనేశ్వరుడి మధ్య శంకర నారాయణ పేరుతో నాకు మరియు విష్ణువుకు ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్పాడు. 

" నేను ఆ ప్రదేశంలో లింగరూపుడిని. ఈ ఆలయాన్ని నిర్మించే పని నువ్వు చేస్తే నీకు కొడుకు పుడతాడని" చెప్పి అతను అదృశ్యమయ్యాడు.


💠 భద్రాట్సి తన భర్తకు తన కలలో చూసిన విషయాన్ని చెప్పింది.  ఆశ్చర్యపోయిన రాజు,మంత్రులతో కలిసి ప్రభువు నిర్దేశించిన ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ప్రగతిశ్వర ఆలయం మరియు కొంగనేశ్వర ఆలయం మధ్య ఉన్న ప్రాంతంలో ఒక శివలింగాన్ని కనుగొన్నాడు. 

దేవుడు చెప్పినట్లుగా ఆ ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. 


💠 ఆ సమయంలో పాపాలను తొలగించగల గుప్త గంగ సమీపంలోని బావిలో ఉప్పొంగింది; 

సోమవారం విశాఖ నక్షత్రం నాడు అందులో స్నానం చేసి భక్తితో పూజిస్తే, రాజుకు పుత్ర సంతానం కలుగుతుందని ఆయన చెప్పాడు. శివుని మాట ప్రకారం, చోళ రాజు శంకర నారాయణర్ కోసం ఒక ఆలయాన్ని నిర్మించి పూజలు చేశాడు. 

దేవుని దయ వల్ల మగ శిశువు జన్మించాడని స్థల చరిత్ర చెబుతోంది


💠 శివుడు అభిషేక స్నానం ఇష్టపడతాడు, విష్ణువు ఆకర్షణీయమైన వస్త్రధారణను ఇష్టపడతాడు. 

శంకరనారాయణుడు ఎల్లప్పుడూ తన ఉత్తమ అలంకార వస్త్రధారణలో కనిపిస్తాడు. 


💠 గోమతి: 

గో అంటే సంస్కృతంలో ఆవు, మతి చంద్రుడు. 

అంబిక తపస్సుకు సహాయం చేయడానికి స్వర్గలోకం నుండి కన్యలు గోవుల రూపంలో ఆమెతో వచ్చారు. 

చంద్రుని వలె ప్రకాశవంతమైన ముఖం మరియు గోవుల యజమాని అయిన అంబికను గోమతి అని పిలుస్తారు. 

గోమతి యొక్క తమిళ వెర్షన్ అయిన ఆవుదయంబికై అని కూడా ఆమెను ప్రశంసించారు. 


💠 సోమవారాలు అమ్మవారు పువ్వులు మరియు శుక్రవారం బంగారు లంగా ధరించి ఉంటారు. వివాహ ప్రయత్నాలలో సమస్యలు ఎదుర్కొంటున్నవారు మరియు పిల్లల సంక్షేమం గురించి ఆందోళన చెందుతున్నవారు నెయ్యితో కలిపిన బియ్యం పిండితో చేసిన దీపాలను వెలిగిస్తారు.


💠 సర్ప వినాయకుడికి ఒక మందిరం ఉంది.

సర్ప గ్రహం రాగువు యొక్క ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటున్నవారు, ఆదివారం రాహు కాలంలో (సాయంత్రం 4.30 నుండి 6.00 వరకు) ఇక్కడ పూజలు చేస్తారు. 

విషపు కాటు నుండి పిల్లలను రక్షించడానికి, భక్తులు సర్ప వినాయకుడికి నివేదనగా అరుగంపుల్ (వివిధ రకాల గడ్డి) దండలను, పాల పాయసం సమర్పిస్తారు.


💠 "వాన్మికం" అని పిలువబడే ఆలయం లోపల అమ్మన్ సన్నిధి చుట్టూ ఉన్న ప్రాకారంలో ఒక పాము గొయ్యి కనుగొనబడింది. 

పాము గొయ్యి నుండి తీసిన ఇసుక అన్ని వ్యాధులను నయం చేస్తుందని నమ్ముతారు.


💠 ఈ ఆలయం దక్షిణాదిలోని పంచభూత స్థలాలకు ప్రధానమైనది, ఈ ఐదు ప్రదేశాలు ఐదు అంశాలలో ఒకదానిని సూచిస్తాయి. 

ఇక్కడ మూలకం భూమి.



💠 తెన్కాసి నుండి శంకరన్‌కోవిల్‌కి దూరం 39 కి.మీ


రచన


©️ Santosh Kumar

*శ్రీ మహావిష్ణు పురాణం*

 235f4;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀9️⃣6️⃣




      *శ్రీ మహావిష్ణు పురాణం*

              ➖➖➖✍️

              96 వ భాగం 


*శ్రీకృష్ణావతారము - యదువంశ కథ - కంసుడి నుంచి శ్రీకృష్ణుడి వరకు జననం,మరణం.*```

యదువు మరో పుత్రుడు అనలునికి ఆనకదుందుభి అనే కుమారుడు జన్మించాడు. అతని సుతుడు పునరస్వుడు. పునర్వసుని కుమారుడు ఆహుకునకు దేవకుడు, ఉగ్రసేనుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. దేవకునకి వృకదేవ, ఉపదేవ, దేవరక్షిత, శ్రీదేవి, శాంతిదేవి, దేవకి, సహదేవి అనే ఏడుగురు కుమార్తెలు జన్మించారు. వీరిని వసుదేవునికి ఇచ్చి వివాహం చేశారు. ఉగ్రసేనుడికి కంసుడు మొదలైన పదిమంది కుమారులు జన్మించారు.


భజమానుని కుమారుడు విదూరథుడు, అతని కుమారుడు శూరుడు, శూరునికి ప్రతిక్షతుడు, ప్రతిక్షతునికి భోజుడు, భోజునికి హృదీకుడు, హృదీకునికి కృతవర్మ, ఆనందుడు జన్మించారు. కృతవర్మ పదివేల యదువీరులకు నాయకుడై శ్రీకృష్ణుడి చేత దుర్యోధనుడికి ఇవ్వబడి కౌరవుల పక్షాన కురుక్షేత్ర యుద్దంలో పోరాడాడు. కౌరవ సేనలో చివరకు మిగిలిన ముగ్గురులో కృతవర్మ ఒకడు.


శూరునికి మారిష అనే మరో భార్య యందు పదిమంది కుమారులు కలిగారు. వారిలో వసుదేవుడు ప్రసిద్ధి చెందినవాడు. వసుదేవుడు జన్మించే సమయంలో దేవతలు ఆకాశంలో "ఇతని కుమారుడిగా మహావిష్ణువు జన్మించి మమ్మల్ని, ముల్లోకాలను కాపాడతాడు" అంటూ దేవదుందుభులు మ్రోగించారు. కనుక అతనికి ఆనకదుందుభుడు అనే పేరు కూడా ఉంది.


వసుదేవుడు దేవకుని పుత్రికలైన దేవకి మొదలైన ఏడుగురుని వివాహం చేసుకునే ముందే రోహిణి మొదలైన ముగ్గురు కన్యలను వివాహం చేసుకుని ఉన్నాడు. వసుదేవునికి ఐదుగురు పృధ, శ్రుతదేవ, శ్రుతకీర్తి, శ్రుతశ్రవ, రాజాధీదేవి అనే చెల్లెళ్ళు ఉన్నారు. కుంతీభోజుడు ఆడ సంతానం లేకపోతే వసుదేవుని తండ్రి శూరుని ఒప్పించి పృధను దత్తత తీసుకున్నాడు. ఆమె పేరు కుంతీదేవిగా మారింది.


కుంతీదేవి కురువంశానికి చెందిన పాండురాజుని పెళ్ళాడింది. పెళ్లికి పూర్వం దుర్వాస మహర్షికి సేవ చేసి "కోరిన దేవుడి వలన పుత్రుని పొందే" మంత్రం సేవకు ఫలంగా పొందింది. మునిశాపం వలన పాండురాజు తండ్రి కాలేకపోవడంతో యమధర్మరాజుని ప్రార్ధించి ధర్మరాజుని, వాయుదేవుని ప్రార్ధించి భీముని, ఇంద్రుని ప్రార్ధించి అర్జునుడికి తల్లి అయ్యింది. తన మంత్రాన్ని సవతి మాద్రికి ఉపదేశించగా ఆమె అశ్వనీ దేవతలను ప్రార్ధించి నకుల సహదేవులను పొందింది.


కుంతీదేవి పెళ్లికి పూర్వం దుర్వాస మహర్షి మంత్రం పరీక్షించాలనే చంచల బుద్దితో సూర్యదేవుడిని ప్రార్ధించి కవచకుండాలు కలిగిన కర్ణుని పుత్రునిగా పొందింది. లోకోపవాదుకి భయపడి నదిలో వదిలేయగా, ధృతరాష్ట్రడి సారథి అయిన సూతుడు చేరదీసి పెంచాడు.


కరూశ దేశాధిపతి అయిన వృద్ధధర్ముడు వసుదేవుని చెల్లెలు శ్రుతదేవను వివాహమాడాడు. వారికి ఐదుగురు కుమారులు జన్మించారు. మరో చెల్లెలు రాజాధిదేవిని అవంతిరాజు వివాహం చేసుకున్నాడు. వీరికి విందుడు, అనువిందుడు అనే ఇద్దరు కుమారులు, లక్ష్మణ అనే పుత్రిక జన్మించింది. లక్ష్మణను స్వయంవరంలో శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నాడు.


చేదిరాజు దమఘోషుడు వసుదేవుని మరోచెల్లెలు శ్రుతశ్రవను పెళ్లి చేసుకున్నాడు. వీరికి శిశుపాలుడు జన్మించాడు. వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు సనకసనందాదుల శాపం వలన మహావిష్ణువు శత్రువులుగా మూడు జన్మలు మూడు యుగాలలో ఎత్తి నారాయణుని అవతారాలచే సంహరించబడి వైకుంఠం తిరిగి చేరారు. కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించి వరాహ, నరసింహ అవతారాలచే సంహరించబడ్డారు. త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా జన్మించి శ్రీరామునిచే చంపబడ్డారు. ద్వాపరయుగంలో శిశుపాలుడు, దంతవ్రక్తునిగా జన్మించి కృష్ణుని చేత చంపబడ్డారు.


కంసుడు తన పెదనాన్న పుత్రిక అయిన చెల్లెలు దేవకిపై అమితమైన ప్రేమ కలిగి ఉండేవాడు. ఆ ప్రేమతోనే దేవకిని వసుదేవుడు పెళ్ళాడినప్పుడు స్వయంగా రథ సారధ్యం చేసి అత్తవారింట దింపడానికి రథంలో తీసుకుని బయలుదేరాడు. దారిలో ఆశరీరవాణి కంసుని "దేవకికి పుట్టే అష్టమ సంతానం చేతిలో మరణముంటుందని" హెచ్చరించింది. దానితో దేవకిని చంపబోయాడు. వసుదేవుడు "దేవకికి పుట్టిన సంతానం అప్పగిస్తాను" అన్నమాటతో చంపకుండా భార్యాభర్తులను వెనుకకు తెచ్చి కారాగారంలో బంధించాడు.


కంసుడి చర్యకు భయపడిన వసుదేవుని పెద్ద భార్య రోహిణి వసుదేవుడు మిత్రుడైన గోపాలుర రాజైన నందుని ఇంట తలదాచుకుని రహస్యంగా ఉంది. వసుదేవుడు కంసుడికి ఇచ్చిన మాట పాటించి పుట్టిన ఆరుగురు పుత్రులని కంసుడికి అప్పగించగా కంసుడు చంపివేశాడు. దేవకి ఏడవ గర్భంలో పురుడు పోసుకుంటున్న ప్రాణాన్ని యోగమాయ మహావిష్ణువు ఆదేశంతో దేవకి గర్భం నుంచి రోహిణి గర్భానికి మార్చింది. రోహిణికి ఆదిశేషుడు పుత్రుడిగా జన్మించి బలరాముడు అనే పేరు పొందాడు.


దేవకి అష్టమ పుత్రుడిగా మహావిష్ణువు జన్మించాడు. యోగమాయ నందుని భార్య యశోదకు పుత్రికగా జన్మించింది. మహావిష్ణువు ఆదేశంతో వసుదేవుడు పుట్టిన మగ శిశువును నందుని ఇంటికి చేర్చి యశోదకు పుట్టిన ఆడ శిశువుని తీసుకు వచ్చి దేవకి వద్ద ఉంచాడు.

ఆడపిల్లని చూడకుండా కంసుడు ఆడపిల్లను ఆకాశానికి ఎగరేసి చంపబోయాడు. ఆకాశానికి ఎగిరిన శిశువు యోగమాయగా మారి "నిన్ను చంపబోయేవాడు పుట్టి మరోచోట సురక్షితంగా ఉన్నాడు" అని హెచ్చరించి మాయమైంది.


మహావిష్ణువు యశోద పుత్రుడు శ్రీకృష్ణుడిగా ఎదిగి పదహారు వేల ఎనిమిదిమందిని వివాహమాడాడు. వారికి లక్ష ఎనభై వేల మంది పుత్రులు జన్మించారు. ఈవిధంగా యదువు వంశం యాదవ, అంధక, వృష్ణి, భోజ వంశాలుగా విస్తరించి వ్యాపించింది. శ్రీకృష్ణుని అవతార సమాప్తి సమయంలో గాంధారి, మునుల శాపాల వలన కలిగిన అంతర్గత యుద్దంలో యదు వంశాలన్ని ఒకరితో ఒకరు పోరాడి అంతమైపోయాయి.✍️

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం..

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో..

-సేకరణ:పెండ్యాల ఉపేంద్ర రావు```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

వేంకటేశ్వరస్వామి

  156c;0212C5;13E7;235f9;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀


*వేంకటేశ్వరస్వామి ఆయుధాలు ధరించకుండా మనకు ఎందుకు దర్శనమిస్తాడు?*

           ➖➖➖✍️



*వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి.!!*

```

‘సింహాద’అనే దైత్యుడు మహాదుష్టుడు. బ్రహ్మ గురించి తపస్సు చేసి మెప్పించి దేవదానవ, గంధర్వ, యక్ష కిన్నెర కింపురుష మానవులందరూ తనకు ఆధీనంలో ఉండేట్లు వరం సంపాదిస్తాడు.


దానితో గర్వించి అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు.


దేవతల మొర విన్న శ్రీనివాసుడు వారిని బ్రాహ్మణ వేషంలో తొండమాన్ చక్రవర్తిని శరణు వేడమని సలహా ఇస్తాడు.


తొండమానుడు వారికి అభయం అయితే ఇస్తాడు కానీ ‘సింహాద’ గురించి తెలియక శ్రీనివాసుని శరణు వేడుతాడు. శ్రీనివాసుడు ఆ రక్కసిని మట్టుపెట్టమని తొండమానునికి సహాయంగా తన శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనస్సులను ఇచ్చి ఆశీర్వదించి పంపుతాడు.


దేవతలతో పోరాటానికి ‘సింహాద’ లక్ష కోటి బలగంతో పాపనాశన తీర్ధ స్థలంలో యుద్ధం చేసాడని పురాణం చెబుతోంది.


తొండమానుడు స్వామి వారి ఖడ్గం, గద, ధనస్సుల ఆయుధాలను ఉపయోగించి ఒక 100 సార్లు తల తెంచినా మరల బ్రతికి వచ్చేవాడు.


ఆ మాయ అర్ధం కాక ఖిన్నుడైన చక్రవర్తి చెవిలో వాయుదేవుడు చక్రం ప్రయోగించమని చెబుతాడు.


స్వామి వారి చక్ర మహిమతో శాశ్వతంగా ఆ దైత్యుడు మరణిస్తాడు.


అలా సంహరించిన ఆయుధాలు మరల స్వామి వద్దకు వెళ్ళిపోతాయి.


తొండమానుడు స్వామి వారి వద్దకు వచ్చి భక్తితో ఈ కార్యం అంతా స్వామి మహిమే అని కృతజ్ఞతలు వ్యక్తం చేస్తాడు.


స్వామివారు వరం కోరుకోమనగా నీవు నాకు ఆయుధాలు అనుగ్రహించి నాకు విజయం చేకూర్చిన విషయం మనిద్దరికీ తప్ప మరెవరికీ తెలియదు, అందరికీ తెలియాలంటే నీవు ఈ రూపంలో ఆయుధాలు ధరించకుండా వుండాలి.


స్వామి వారి ఆయుధాల ప్రసక్తి వచ్చినప్పుడు ఈ పర్వం అంతా వారు స్మరించి నాకు శాశ్వత కీర్తిని అనుగ్రహించమని వేడుకుంటాడు. వింత కోరిక.


స్వామి వారు సరే అని చెప్పి, కానీ కలియుగంలో ఒక పుణ్యశాలి నా శంఖచక్రాలను పోలినవి చేయించి విమానాదులను నిర్మింప చేస్తాడని, అప్పుడు కృత్రిమములైన శంఖ చక్రాలను తాను ధరిస్తానని చెబుతాడు.


స్వామి వారి ఆయుధాలు ఒకొక్క తీర్ధంలో వసించడం మొదలుపెడతాయి. కపిలతీర్ధమే చక్రతీర్ధం,


దానిపై వరుసగా శంఖ తీర్ధ, శాంగతీర్ధం, నందక తీర్ధం, కౌమోదక తీర్ధం అని పంచాయుధ తీర్దాలున్నాయి.

ఆ తీర్దాలలోనే మార్కండేయ మహర్షి శుద్ధ అన్న బ్రాహ్మణునితో స్నానం చేస్తూ వేంకటాచలం వస్తారు.


తొండమాను చక్రవర్తి గురించి అన్నమయ్య కీర్తనలో కూడా వివరించారు.

కొండలలో నెలకొన్న ఉదాహరణకి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికివచ్చి నమ్మినవాడు.


భగవంతుడు ఆ ఆయుధాలను ఎవరికిచ్చిన వారు సింహాదను చంపెవారే ఎందుకంటె.. చంపేవి భగవంతుని శక్త్యాయుధాలు కానీ వారు కాదు కాబట్టి.


వేడుకున్న దేవతలలో ఎవరో ఒకరికి అవి ఇవ్వవచ్చును కానీ పిలిపించి, అడక్కుండా అనుగ్రహించి, అతనికి కీర్తిని ఇవ్వడానికే, చేసిన భక్తి శ్రద్ధలకు, కైంకర్యానికి ప్రతిఫలం ఇవ్వడానికే స్వామి వారు ఈ లీల చేసారు.


మనకేది మంచో, మనకేమి ఇవ్వాలో భగవంతునికి తెలుసు... మనం చూపించవలిసిందల్లా ఆయన మీద భక్తిశ్రద్ధలు.


ఆ ద్వాపరంలోని శ్రీ కృష్ణుడే నేడు వేంకటాచలం పైన ఉన్న మన శ్రీనివాసుడు...✍️```

*ఓం శ్రీనివాసో రక్షతు!!*

*ఓం  నమో వేంకటేశాయ..!!..*

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: ఒకటవ అధ్యాయం 

అర్జునవిషాద యోగం: సంజయ ఉవాచ


ద్రుపదో ద్రౌపదేయాశ్చ

సర్వశః పృథివీపతే |

సౌభద్రశ్చ మహాబాహుః

శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ || (18)


సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు, భుజబలుడు సుభద్రా తనయుడైన అభిమన్యుడు తమ శంఖములను పూరించిరి.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

ఏడుకొండలు

  *తిరుమల ఏడుకొండలు - విశేషాలు*  


https://chat.whatsapp.com/HGoXAYiuwFRFe5L7RwnZUF


*1. తిరుమల అంటేనే ఏడుకొండలు*


కలియుగ వైకుంఠం తిరుమల. ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నది ఏడు కొండల మీద. అందుకే స్వామిని *"ఏడుకొండల వాడా వెంకటరమణా"* అని పిలుస్తాం.


ఈ 7 కొండలకు *"సప్తగిరులు"* అని పేరు. ఒక్కో కొండకు ఒక్కో విశేషం, ఒక్కో పురాణ కథ ఉంది.


*2. ఏడుకొండల పేర్లు & విశేషాలు*


*1. వృషభాద్రి - ఎద్దు కొండ*  

- వృషభుడు అనే రాక్షసుడు ఇక్కడ శ్రీనివాసుడి కోసం తపస్సు చేశాడు.  

- స్వామి ప్రత్యక్షమై వరం ఇచ్చాడు. అందుకే ఈ కొండకు ఆ పేరు.  

- *విశేషం*: తపస్సుకు ఫలితం దక్కే కొండ.


*2. అంజనాద్రి - ఆంజనేయుడి కొండ*  

- అంజనాదేవి ఇక్కడ తపస్సు చేసి హనుమంతుడిని కన్నది.  

- హనుమంతుడి జన్మస్థలం ఇదే అని స్థల పురాణం.  

- *విశేషం*: బలం, ధైర్యం కోరే వాళ్ళు ఈ కొండను తలచుకుంటారు.


*3. నీలాద్రి - నీలాదేవి కొండ*  

- నీలాదేవి అనే భక్తురాలు స్వామి కోసం ఇక్కడ తపస్సు చేసింది.  

- స్వామి వరం ఇచ్చి ఈ కొండకు ఆమె పేరు పెట్టాడు.  

- *విశేషం*: స్వామి మొదట నీలాదేవిని పెళ్లి చేసుకున్నాడని ఒక కథ.


*4. గరుడాద్రి - గరుత్మంతుడి కొండ*  

- శ్రీ మహావిష్ణువు వాహనం గరుత్మంతుడు ఇక్కడ తపస్సు చేశాడు.  

- *విశేషం*: గరుడ గమనం లాగా భక్తుల కష్టాలు తొలగిపోతాయి అని నమ్మకం. తిరుమల గుడి గోపురం గరుడాద్రి మీదే కట్టారు.


*5. శేషాద్రి - ఆదిశేషుడి కొండ*  

- మహావిష్ణువు పాన్పు అయిన ఆదిశేషువు స్వామి కోసం కొండగా మారాడు.  

- తిరుమల మొత్తం ఏడుకొండలు కలిపి చూస్తే పడుకున్న శేషువులా కనిపిస్తుంది.  

- *విశేషం*: స్వామి ఆదిశేషువు మీదే కొలువై ఉన్నాడు. అన్ని కొండలకు మూలం ఇదే.


*6. నారాయణాద్రి - నారాయణుడి కొండ*  

- శ్రీనివాసుడు, పద్మావతి అమ్మవారి కల్యాణం ఈ కొండ మీదే జరిగింది.  

- *విశేషం*: ఇక్కడే శ్రీవారి పాదాలు ఉన్నాయి. "శ్రీవారి పాదాలు" గుడి ఇక్కడే ఉంది. కల్యాణం కోరుకునే వాళ్ళు ఇక్కడికి వెళ్తారు.


*7. వేంకటాద్రి - వేం + కట = పాపాలను పోగొట్టేది*  

- "వేం" అంటే పాపాలు, "కట" అంటే పోగొట్టేది.  

- స్వామి వెలసిన ప్రధాన కొండ ఇదే. ఆనంద నిలయం ఇక్కడే ఉంది.  

- *విశేషం*: ఈ కొండ ఎక్కితే జన్మ జన్మల పాపాలు పోతాయి అని నమ్మకం. అందుకే "వేంకటేశ్వరుడు" అని పేరు.



*3. ఏడుకొండలు ఎందుకు? పరమార్థం ఏంటి?*


పెద్దలు చెప్పేది ఏంటే:  

ఈ 7 కొండలు మనలోని *7 చక్రాలకు, 7 దోషాలకు* గుర్తు.  

1. కామం 2. క్రోధం 3. లోభం 4. మోహం 5. మదం 6. మాత్సర్యం 7. అహంకారం.  


ఈ 7 కొండలు ఎక్కి స్వామిని దర్శిస్తే, ఈ 7 దోషాలు పోయి మనసు శుద్ధి అవుతుంది అని అంతరార్థం.


*మరో విశేషం*: ఈ 7 కొండల్లో అడుగడుగునా తీర్థాలు ఉన్నాయి. స్వామి పుష్కరిణి, ఆకాశగంగ, పాపవినాశనం, జాపాలి తీర్థం లాంటివి. ఒక్కో తీర్థంలో స్నానం చేస్తే ఒక్కో పాపం పోతుంది అంటారు.


---


*4. భక్తులకు మెసేజ్*


కాళ్ళతో కొండ ఎక్కలేకపోయినా, మనసుతో ఈ 7 కొండలు ఎక్కు.  

"గోవిందా గోవిందా" అని తలచుకుంటూ నీలోని అహంకారం అనే కొండ దిగితే చాలు, స్వామి నీ గుండెలోనే కనిపిస్తాడు.


*ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవిందా*🙏

యోగ వాశిష్ఠ హృదయం-2

 యోగ వాశిష్ఠ హృదయం-2


2. గ్రంథపఠనార్హత


గ్రంథావిర్భావ క్రమాన్ని ఈ ప్రకారంగా వర్ణించటంవల్ల మనబోటివాళ్ళకి ఏమనిపిస్తుందంటే “ఆనాటి భరద్వాజ మునికుమారుడి లాగా అనేక దివ్య శక్తులు సాధించి, సాక్షాత్తుగా బ్రహ్మగారితో మాట్లాడగలిగేటంత శక్తి సంపాదించిన వారికోసం మాత్రమే ఈ గ్రంథం వ్రాయబడిందన్న మాట. అయితే ఈ గ్రంథాన్ని ముట్టుకొనేందుకు మనకు అర్హత ఎక్కడ వుంటుంది?" అని. ఈ సందేహంతో మనం ఆ పుస్తకాన్ని ముట్టుకొనే ముట్టుకోం. కానీ, వాల్మీకి మహర్షి ఉద్దేశ్యం అది కాదు.


ఈ గ్రంథ రచనలో తనయొక్క కర్తృత్వం నామమాత్రమేనని, సాక్షాత్తు బ్రహ్మగారియొక్క సంకల్పబలంవల్లనే ఈ గ్రంథం ఆవిర్భవించిందని, సవినయంగా చెప్పుకోవాలన్నదే వాల్మీకి మహర్షి ఉద్దేశ్యం. అందుకే ఆ ఘట్టాన్ని ఆయన మనకు చెప్పాడు. ఉద్దేశ్యం బాగానే వుంది కానీ, "ఈఘట్టంవల్ల ఈ గ్రంథానికి మనం పనికిరాం బాబూ" అనే అపార్థం కలిగే సావకాశం వచ్చింది. దాన్ని పోగొట్టటం కోసం మరొక సన్నివేశాన్ని ఈ గ్రంథారంభంలోనే వాల్మీకి మహర్షి వర్ణించాడు.


3. అరిష్టనేమి కథ


పై సంఘటనకు కొద్ది కాలం తరువాత. అరిష్టనేమి అనే మహారాజు పెద్దవాడై రాజ్యం కొడుకులకు అప్పచెప్పి, తాను తపోవనాలకు వెళ్ళాడు. అక్కడ ఆయన మంచి తీవ్ర తపోనిష్ఠలో కాలం గడపసాగాడు. దేవేంద్రుడికి ఈ వ్యవహారం తెలిసింది. ఎవరైనా తీవ్ర తపస్సులు చేస్తూ వుంటే, వారిని పరీక్షించవలసిన బాధ్యత దేవరాజుగా ఇంద్రుడికి వుంది. ఈ విషయం తెలియక, ఈ కాలంలో కొందరు, దేవేంద్రుడు అసూయాగ్రస్తుడని చులకన చేసి మాట్లాడుతూ వుంటారు. ఇప్పుడు చెప్పబోయే కథలో ఇంద్రుడియొక్క పరీక్షాతత్త్వం కూడా మనకు అవగతం అవుతుంది.


అరిష్టనేమి మహారాజుయొక్క తపస్సు ఒక స్థాయికి వచ్చేసరికి, దేవేంద్రుడు ఒక దేవదూతతో ఒక విమానాన్ని పంపి, “హే రాజర్షీ! నీకు సశరీరంగా స్వర్గంలో నివసించే యోగ్యత వచ్చింది. కనుక ఈ దేవ విమానం మీద సరాసరి స్వర్గానికి విచ్చేయ వలసింది" అని కబురు చేశాడు. ఆ దేవదూత వచ్చి ఎంతో వినయంగానూ, ఆదరంగానూ, ఈ వార్త ఆ మహారాజుకు చెప్పాడు. అయితే ముసలి మహారాజు చాలా గట్టివాడు. ఆయన దేవదూతకి, దేవేంద్రుడికి, కూడా చాలా వినయంగా కృతజ్ఞతలు చెప్పి, మెల్లిగా ఇలా అన్నాడు. "అయ్యా! దేవదూతా! మీ స్వర్గంలోవుండే విశేషాలేమిటి? ఈ భూమికంటే స్వర్గంలో వున్న గొప్పతన మేమిటి? ఆ స్వర్గంలో నన్ను శాశ్వతంగా వుండనిస్తారా? మధ్యలో పంపేటట్లయితే ఆ పంపే విధానమేమిటి?”


ఇది విని దేవదూత కొద్దిగా ఆలోచించి ఇలా చెప్పాడు. “రాజేంద్రా! నువ్వుతపస్సులో వున్నావు. కనుక, నీ దగ్గర అబద్ధం చెప్పకూడదు. స్వర్గం సుఖాల మయం. భూలోకంలో చేసుకొన్న పుణ్యాన్నిబట్టి, స్వర్గలోకంలో సుఖాల స్థాయి పెరిగిపోతూ వుంటుంది. అయితే, స్వర్గంలో అసూయల బాధ ఒకటి కనిపిస్తూ వుంటుంది. దానివల్ల ఒకోసారి పోట్లాటలు, కొట్లాటలు కూడా వుంటూ వుంటాయి. ఎక్కువవాళ్ళకు తక్కువ వాళ్ళను చూస్తే సంతోషం. తక్కువవాళ్ళకు ఎక్కువవాళ్ళను చూస్తే కడుపు మంట. తమకు ఎంత పుణ్యం మిగిలివుందో ఎవరికీ తెలియదు. పుణ్యం అయిపోయిన రోజున, వున్నట్టుండి స్వర్గం నుంచి గెంటిపారేస్తూ వుంటారు. ఆ సమయం వచ్చేసరికి వెళ్ళం అని మొండికెత్తి, మెడబట్టి గెంటించుకొని, ఏడుస్తూ అవతలికి పోతూ వుంటారు. కనుక, మహారాజా! శాశ్వతంగా స్వర్గంలో స్థానం నీకే కాదు. ఎవరికీ వుండదు. వెళ్ళేటప్పుడు ఎవరైనా ఏడుస్తూ పోవలసిందే. నువ్వైనా అంతే. నేనైనా అంతే. స్వర్గంలోకి వచ్చాక మాత్రం సుఖాల్లోపడి కొట్టుకుపోవడమే తప్ప, ఇక వేరే తపస్సులు, ఏమీ కుదరవు. సంగ్రహంగా ఇవీ విషయాలు. ఇక విమానం ఎక్కండి."


దేవదూత చెప్పిన అంశాలన్నీ విని, అరిష్టనేమి మహారాజు పెద్ద నమస్కారం పెట్టి, ఇలా అన్నాడు. "దేవదూతా! మీ స్వర్గానికో దండం. నీకో దండం. మీ దేవేంద్రుడికో దండం. అలాంటి స్వర్గం నాకు వద్దే వద్దు. శరీరం వున్నంత కాలం ఇక్కడే తపస్సు చేసుకొంటూ పడుంటాను. చేతనైతే ఈ జన్మలోనే పరమాత్మలో ఐక్యం పొందుతాను. చేతకాకపోతే మళ్ళీ జన్మ ఎత్తి, మళ్ళీ తపస్సే చేస్తాను. నాకు భూలోక రాజ్యాలూ వద్దు, స్వర్గలోక రాజ్యాలూ వద్దు. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. నన్ను ఆశీర్వదించు. దేవేంద్రులవారి ఆశీస్సులు ప్రార్థిస్తున్నానని మనవి చేయి.”


ఇది విని, “ఇదెక్కడి వెఱి మారాజు రా! బాబూ!" అనుకొంటూ, దేవదూత వెనక్కి వెళ్ళి, జరిగిందంతా దేవేంద్రుడికి చెప్పాడు. దేవేంద్రుడికి చాలా ఆనందమయింది.


అరిష్టనేమి రాజు నిజాయితీ, నిష్కామత, నిర్మలత, ఆయనకు బాగా నచ్చాయి. ఆ రాజుకి ఏదైనా సహాయం చేయాలనిపించింది. ఇదే దేవేంద్ర పదవిలోని బాధ్యత. ఎవరైతే నిష్కామంగా తపస్సు చేస్తారో, వారికి ఆయన సహాయం చేస్తాడు. ఎవరైతే సకామంగా తపస్సు చేస్తారో, వారి విషయంలో ఆయన పరిశోధన చేస్తాడు. ఏమని పరిశోధన? వీడి కోరిక లోకానికి మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? అని. కీడు చేస్తుంద తపస్సును చెడగొట్టేందుకు ప్రయత్నం చేస్తాడు.


అలా కాక, ఆ తపస్సు లోకానికి మేలు చేస్తుంది అనుకొంటే, ఆ వరాన్ని పొందే యోగ్యత ఈ వ్యక్తికి వుందా, లేదా అని, బంగారాన్ని ఒరిపిడి రాయి మీద గీసినట్లు, ఆ తపస్విని పరీక్షలకు గురి చేస్తాడు. ఇది దేవేంద్రుడి బాధ్యతా విధానం. ప్రస్తుత సందర్భంలో అరిష్టనేమి మహారాజు నిస్స్వార్థంగా తపస్సు చేస్తున్నాడని తేలిపోయింది. కనుక, ఆయనకు సహాయం చెయ్యవలసిన బాధ్యత దేవేంద్రుడి పైన పడ్డది.


పూర్వం మేరు శిఖరం మీద దేవసభలో భరద్వాజ మునికుమారుడు శ్రీమద్రామాయణం గానం చేసిన సందర్భం ఆయనకు గుర్తుకొచ్చింది. ఆ మహాసభలో సాక్షాత్తుగా బ్రహ్మదేవుడు, ఇంకా పూర్తికాని యోగవాశిష్ఠ గ్రంథాన్ని గూర్చి అంత గొప్పగా మాట్లాడే సరికి, దేవేంద్రుడి దృష్టి ఆ గ్రంథం మీద పడ్డది. అందువల్ల, వాల్మీకి మహర్షి ఆ గ్రంథంలో ఏమి వ్రాశాడా అని, దేవేంద్రుడు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే వున్నాడు. పరిశీలించి, ఎప్పటికప్పుడు పరమానందపడుతూనే వున్నాడు. ఇప్పుడు అరిష్టనేమి విషయంలో దేవేంద్రుడికి ఆ గ్రంథం మాట గుర్తొచ్చింది. అందువల్ల దేవేంద్రుడు ఆ దేవదూతతో ఇలా అన్నాడు. "నువ్వు వెంటనే అదే విమానంలో ఆ రాజు దగ్గరకే వెళ్ళు. ఆయనను ఎక్కించుకొని వాల్మీకి మహర్షిగారికి ఆయనను అప్పచెప్పు. వీరికి ఆయన వ్రాసిన యోగవాశిష్ఠం ఉపదేశించమని నేను ప్రార్థిస్తున్నానని వాల్మీకి మహర్షి గారికి మనవి చెయ్యి.”


దేవదూత సరే అని, మళ్ళీ అరిష్టనేమి మహారాజు దగ్గరకు వచ్చి, ఆయనను వాల్మీకిమహర్షికి అప్పజెప్పి, తాను వెళ్ళిపోయాడు. ఆ మహారాజు కూడా దేవేంద్రుడి ఉపకారానికి చాలా సంతోషపడి, వాల్మీకి మహర్షి పాదాల మీద పడి, “ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే" అంటూ తనను శిష్యుడిగా స్వీకరించి, తత్త్వబోధ చేయవలసిందిగా ప్రార్థించాడు. వాల్మీకి మహర్షి ఆయనకు తాను రచించిన ఈ యోగవాశిష్ఠ మహాగ్రంథాన్ని అనుపూర్విగా ఉపదేశించాడు.


ఈ ఘట్టాన్ని చెప్పడంవల్ల నిష్కామ ప్రవృత్తి గల మానవులందరికీ ఈ యోగవాశిష్ఠ గ్రంథం పఠనార్హమే అనే విషయం చెప్పినట్లయింది. కాగా, నిష్కామత్వాన్ని అభ్యసించకపోతే వేదాంతవిద్య మనస్సుకు ఎక్కదనే విషయం కూడా చెప్పినట్లయింది. అంత వరకూ బాగానే వుంది కానీ, ఈ కథవల్ల కూడా మనకు ఒక చిక్కు వచ్చి పడుతోంది. అరిష్టనేమి మహారాజు లాగా సశరీర స్వర్గం వచ్చేటంత తపస్సు చేసినాకనే ఈ గ్రంథం పఠించడానికి యోగ్యత వస్తుందని, ఈ కథ సూచిస్తోంది. అప్పుడు కూడా, దేవ విమానం ఎదురుగుండా వచ్చినా సరే, వద్దు పొమ్మని తిరస్కరించేటంత వైరాగ్యం వుంటేనే, ఈ గ్రంథం ముట్టుకోవాలి- అని కూడా ఈ కథ సూచన చేస్తోంది.


మరి మనం ఎక్కడున్నాం? ఈ షరతులకు మనం సరిపోతామా? ఈ గ్రంథానికో దండం- అనుకొనే ప్రమాదం ఈ అరిష్టనేమి కథవల్ల మనకు కలుగుతోంది. దీనిని నివారించేందుకోసం వాల్మీకి మహర్షి మరో చిన్న సన్నివేశాన్ని కూడా గ్రంథారంభంలో చేర్చాడు.


4. అగ్నివేశ్యుడు- కారుణ్య కుమారుడు


“అగ్నివేశ్యుడు” అని ఒక సత్పురుషుడు వుండేవాడు. ఆయన గృహస్థుడు. కానీ, నిరంతరం తపస్సీలి గా వుండేవాడు. ఆయనకు "కారుణ్యుడు" అని ఒక కొడుకు వుండేవాడు. వాడు తెలివైన వాడు. చిన్న వయస్సులోనే విద్యలన్నీ పూర్తి చేసి, గురుకులంనుంచి ఇంటికి వచ్చాడు. ఇంకా వివాహం కాలేదు. ఈ పిల్లవాడు చదువు పూర్తి చేసుకొని ఇంటి దగ్గరకు వచ్చినప్పటి నుంచీ విచిత్రంగా వుంటున్నాడు. కనీసం నిత్యపూజలు కూడా చేయడం లేదు. ఎప్పుడూ బద్దకంగా పడుకొంటున్నాడు. మనిషిలో ఉల్లాసమే కనిపించటం లేదు. చూసి చూసి, ఒకరోజు తండ్రి అతనిని నిగ్గదీశాడు. అతడు మెల్లిగా తన మనస్సులో వున్న కల్లోలాన్ని వివరించసాగాడు-


“కుర్వన్నేవేహ కర్మాణి

జిజీవిషే చ్ఛతగ్ం సమాః - అని వేదంలో ఒకచోట వుంది.

ఇలా శాస్త్రాలలోనూ, వేదాలలోనూ, కొన్ని చోట్ల మనిషి మరణించే దాకా సత్కర్మలు చేస్తూనే వుండాలి అని వుంది. వాటిల్లోనే మరికొన్ని చోట్ల -

న కర్మణా న ప్రజయా ధనేన

త్యాగేనైకే అమృతత్వమానశుః” అని వుంది.


అంటే చిట్టచివరి ఫలితమైన మోక్షం ఎన్ని కర్మలు చేసినా రాదని ఈ వాక్యం చెబుతోంది. నేను అన్ని వేదాలూ చదివాను. అన్ని శాస్త్రాలూ చదివాను. ప్రతిచోటా ఈ విషయంలో సందేహమే వస్తోంది. అందువల్ల ఏ కర్మలూ లేకుండా, ఏ వేదాంతాలూ లేకుండా, మౌనంగా వుంటున్నాను" అన్నాడు కుర్రవాడు.


అతని మాటలు విని తండ్రి బాగా ఆలోచించి, ఇలా అన్నాడు. “నాయనా! ఈ విషయంలో నీకు సంపూర్ణమైన సమన్వయాన్ని ప్రదర్శించ గల ప్రామాణిక గ్రంథం వాల్మీకి రచించిన యోగవాశిష్ఠం మాత్రమే.


నీకు నేను ఆ గ్రంథాన్ని ఉపదేశిస్తాను. అది విన్నాక నీకు ఎలా తోస్తే అలా చేయి.”


ఆ విధంగా తండ్రి అయిన అగ్నివేశ్యుడి ద్వారా ఈ గ్రంథాన్ని ఉపదేశం పొందిన కారుణ్య కుమారుడు, సమన్వయాన్ని బాగా గ్రహించి, ముందు సత్కర్మల ద్వారా చిత్తశుద్ధిని సాధించి, ఆ పైన జ్ఞానయోగం ద్వారా జీవన్ముక్తి సాధించాడు.


ఈ కథ ద్వార వాల్మీకి మహర్షి చెప్పదలచింది ఏమంటే? “ఈ యోగవాశిష్ఠం శ్రవణం చెయ్యటానికి విద్యావంతులై, ఆధ్యాత్మిక జిజ్ఞాస కలవారందరూ అర్హులే" అని ఇంతవరకు చెప్పిన కథలవల్ల ఈ గ్రంథం బ్రహ్మదేవుడికి, దేవేంద్రుడికీ, కూడా సమ్మతమైనదనీ, అరిష్టనేమి వంటి ఉత్తమస్థాయి సాధకులకు, కారుణ్య కుమారుడి వంటి సామాన్య సాధకులకు అందరికీ కూడా ఉపయోగపడే గ్రంథమే- అని తేలుతోంది.


5. గ్రంథ ప్రాశస్త్యము


అయితే, ఎక్కడో స్వర్గంలో వున్నవారి మాట మనకు సరీగా తెలియదు. వాల్మీకి నాటి సాటి మహర్షులు, పండితులు, ఈ గ్రంథాన్ని గురించి ఏమని భావించేవారో మనకు తెలిస్తే, అప్పుడు మనకు ఈ గ్రంథం మీద ప్రామాణిక బుద్ధి ఏర్పడుతుంది. అందుకోసం, వాల్మీకిమహర్షి అలాంటి ఘట్టాన్ని ఒక దానిని ఈ గ్రంథంలో మొదట చేర్చాడు.


పూర్వరామాయణంలో, అరణ్యకాండలో, వనవాస సమయంలో, శ్రీరాముడు యే యే మహాత్ములను దర్శించాడో ఆ వివరాలు కొన్ని వున్నాయి. భారతదేశ దక్షిణాపథాన ఆ నాటి సుప్రసిద్ధ మహర్షులలో అగస్త్యమహర్షి అత్యంత ప్రముఖుడని చెప్పటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. త్రేతాయుగ ప్రారంభంలోనే దండక

మహారాజుకు సంక్రమించిన గురుశాపంవల్ల ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్యలో దండకారణ్యమనే భయంకర అరణ్యం ఏర్పడింది. ఈ అరణ్యంవల్ల దక్షిణ భారతదేశం ఆనాటి రాక్షసులకు స్థావరంగా మారింది. దానివల్ల దక్షిణ భారతదేశంలో వైదిక సంస్కృతి దెబ్బతింటూ వచ్చింది. ఈ పరిస్థితిని సరి చేయటం కోసం, ఆ నాటి మహర్షులెందరో రాజకీయాలకు రాజులకు, అతీతంగా కృషిచేశారు. వారిలో అగస్త్యమహర్షి చాలా ప్రముఖుడు.


ఆయన కృష్ణా, కావేరీ, గోదావరీ నదీ తీరాల వెంట పాద సంచారాలు చేసి, లెక్కకు మించిన స్థలాలలో అగస్త్యేశ్వర ఆలయాలను ప్రతిష్ఠ చేసి, ఆ యా ప్రాంతీయ భాషలకు సాంస్కృతిక జీవనం పోసి, సనాతన ధర్మోద్ధరణకై అపార కృషి చేశాడు. అది గాక కొన్ని వేలమంది సాధకులకు సాధన మార్గ నిర్దేశనం చేశాడు.


శ్రీరామచంద్రుడు తన అరణ్యవాస క్రమంలో అగస్త్య మహర్షిని ప్రత్యేకంగా దర్శించాడు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ, ఆ సందర్భంలో వాల్మీకి మహర్షి

సుతీక్షణం చాప్యగస్త్యం చ

అగస్త్య భ్రాతరం తథా|| అని ముగ్గురి పేర్లు వరుసగా చెప్పాడు.


సుతీక్ష్ణుడు, అగస్త్యుడు, అగస్త్యభ్రాత, అని. వీరిలో అగస్త్య భ్రాత పేరేమో ఇంతవరు మనకు తెలియదు. అందుకనే విద్యావంతులై కూడా పేరు ప్రతిష్ఠలు లేకుండా వున్నవారిని "అగస్త్యభ్రాతలు" అనటం . పండితులలో సామెతగా మారిపోయింది. అగస్త్యుడు సుప్రసిద్ధుడే.(సశేషము)

Mantra - 48

  Mantra - 48 ARUNAM 6 anuvaakam


ఈ మంత్రం అరుణ ప్రశ్నలోని అత్యంత నిగూఢమైన మరియు చమత్కార భరితమైన మంత్రాలలో ఒకటి. ఇది పురాణ గాథలోని ఒక యుద్ధ సన్నివేశాన్ని ఉటంకిస్తూనే, గంభీరమైన ఆధ్యాత్మిక రహస్యాలను వెల్లడిస్తుంది. దీనిని ద్వైత మరియు అద్వైత కోణాల్లో ఇలా అర్థం చేసుకోవచ్చు:


“అవ ద్రప్సో అగ్ంశుమతీమతిష్ఠత్ |

ఇయానః కృష్ణో దశభి స్సహస్రైః| 

ఆవర్తమిన్ద్ర శ్శచ్యా ధమన్తమ్। 

ఉపస్నుహి తం నృమణామథద్రామితి॥”


ఇది పరమాత్మ యొక్క వీరత్వాన్ని మరియు అంధకార శక్తులపై వెలుగు సాధించిన విజయాన్ని సూచిస్తుంది.


‘అవ ద్రప్సో అగ్ంశుమతీమతిష్ఠత్’ - ‘ద్రప్సః’ అంటే ప్రకాశవంతమైన సూర్య బిందువు. 'అంశుమతి' అనేది కిరణములు లేదా ఆకాశం లేదా యమునా నది వంటి ఒక దివ్య ప్రవాహం. ఆ ప్రకాశవంతమైన చైతన్యం అంశుమతీ తీరంలో నిలిచి ఉంది. 


‘ఇయానః కృష్ణో దశభి స్సహస్రైః’ - 'కృష్ణః' అంటే చీకటి. ఇక్కడ అంధకారానికి లేదా అసుర శక్తికి సంకేతం, పదివేల మంది అనుచరులతో ఆ అంధకారం వెలుగును కప్పివేయడానికి ప్రయత్నించింది.


‘ఆవర్తమిన్ద్ర శ్శచ్యా ధమన్తమ్’ - ఇంద్రుడు (పరమాత్మ) తన 'శచి' - దివ్య శక్తి లేదా బుద్ధి తో ఆ అంధకార సుడిగుండాలను (ఆవర్తమ్) చెల్లాచెదురు చేశాడు.


‘ఉపస్నుహితం నృమణామథద్రామితి’ - మానవజాతికి హితం కోరే ఆ పరమాత్మ, అంధకారాన్ని పారద్రోలి జగత్తును రక్షించాడు.


సాధారణ మంత్ర సారం:

"అసురుడు పదివేల మంది సైన్యంతో అంశుమతీ నది ఒడ్డున నిలిచి ఉన్నాడు. ఇంద్రుడు తన శక్తితో అతనిని ఆవరించి, గాలిని ఊదినట్లుగా చెదరగొట్టాడు. ఓ ఇంద్రా! నీవు ఆ శత్రువును సంహరించావు, నిన్ను మేము కీర్తిస్తున్నాము.


అయితే ఇది స్థూలంగా దేవాసుర సంగ్రామం గా ఉంది.‌ కానీ అలా అర్ధం చేసుకోకూడదు. అందులో సారం లేదు. సూక్ష్మం గా తత్వ విచారణ చేసి చూడాలి.


వేదాంత విచారణ:

అద్వైత వేదాంతం ప్రకారం, ఈ మంత్రం 'ఆత్మజ్ఞానం' మరియు 'మాయ, అజ్ఞానం' మధ్య జరిగే నిరంతర సంఘర్షణను వివరిస్తుంది.


‘అవ ద్రప్సో అగ్ంశుమతీమతిష్ఠత్’ - పరమాత్మ సృష్టిని నిర్మించేటప్పుడు మొదట 'అపః' - ఉదకము లేదా జలము ను సృష్టించాడు. ఆ జగత్కారణమైన జలతత్త్వం లో (అంశుమతీ) సాక్షిగా నిలిచిన పరమ చైతన్యమే ఈ 'ద్రప్సః'. 

‘ద్రప్సః (బిందువు)’ - ఇది అంతరాత్మలోని 'జ్ఞాన జ్యోతి' లేదా సాక్షి చైతన్యం. ‘అగ్ంశుమతీ (నది)’ - ఇది మన 'అంతఃకరణ'. ఆత్మ చైతన్యం బుద్ధి అనే ప్రవాహంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. 


‘కృష్ణో దశభి స్సహస్రైః’ - 'కృష్ణః' అంటే అజ్ఞానం, అవిద్య. మనలోని పది ఇంద్రియాలు (5 జ్ఞానేంద్రియాలు + 5 కర్మేంద్రియాలు) వాటి అనంతమైన కోరికలు, ఉపాధులతో, వృత్తులతో (దశ సహస్రైః) ఆత్మజ్ఞానాన్ని కప్పివేస్తాయి.


‘ఇన్ద్ర శ్శచ్యా ధమన్తమ్’ - 'ఇంద్రుడు' అంటే ఇక్కడ సాక్షి చైతన్యం. 'శచి' అంటే ఆత్మ విచారణ లేదా జ్ఞాన శక్తి. పరమాత్మ తన జ్ఞాన శక్తితో, ఇంద్రియాల వల్ల కలిగే మోహపు సుడిగుండాలను ఛేదిస్తాడు.


‘ఉపస్నుహితం…’ - అజ్ఞానపు పొరలు తొలగిపోగానే, ఆత్మ తనంతట తానుగా ప్రకాశించి (నృమణాః - ఆనందాన్ని ఇచ్చేది) మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఉపస్నుహి అంటే ఆ పరమాత్మను ఆశ్రయించడం. 


ఈ మంత్రం అంతరంగ యుద్ధం గురించి చెబుతుంది. బయట శత్రువులను గెలవడం ఎంత ముఖ్యమో, మన మనస్సులో పేరుకుపోయిన అజ్ఞానాంధకారాలను (రాక్షసుడు) జ్ఞానమనే ఆయుధంతో (ఇంద్రుడి శక్తితో) నిర్మూలించడం అంతకన్నా ముఖ్యం. సాధకుడు తనలోని అహంకారాన్ని జయించి, ఆత్మ జ్ఞానాన్ని పొందినప్పుడే నిజమైన విజయం సిద్ధమని ఈ మంత్రం బోధిస్తోంది.


ఈ మంత్రం మనలోని ఇంద్రియాల అలజడిని తగ్గించి, ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు చేసే ప్రార్థనగా అద్వైతులు భావిస్తారు. అరుణ ప్రశ్న పారాయణలో ఈ మంత్రం చదవడం వల్ల అజ్ఞానాంధకారం తొలగి, హృదయంలో జ్ఞాన సూర్యుడు ఉదయిస్తాడని ఫలశృతి.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*750 వ రోజు*

అశ్వమేధ పర్వము చతుర్ధాస్వాసం

యాగములో జరిగిన దానధర్మాలు

ధర్మరాజు సదస్యులకు కోటివేల నిష్కములు దానముగా ఇచ్చాడు. వ్యాసుడికి ధర్మరాజు తనరాజ్యమును దానముగా ఇచ్చాడు. వ్యాసుడు " ధర్మనందనా ! నీవు నాకు భూమిని దానంగా ఇచ్చావు. నేను ఈ భూమిని ఏమి చేసుకుంటాను. దానికి సమానమైన బంగారమును దానముగా ఇవ్వు " అని అన్నాడు. ధర్మరాజు " వ్యాసమునీంద్రా ! అశ్వమేధయాగ సమాప్తంలో భూదానము చెయ్యాలని ఆర్యులు అంటారు. అందు వలన అర్జునుడి వలన జయింపబడిన భూమిని నీకు దానము ఇచ్చాను. నాకు ఇక రాజ్యము లేదు. కనుక వనవాసముకు వెడతాను. అంతేకాని ఇచ్చిన రాజ్యము తిరిగి తీసుకోను " అన్నడు. వ్యాసుడు " ధర్మతనయా ! నీ చేత దానముగా స్వీకరించబడిన ఈ భూమి నాకే స్వంతము అనుటలో ఎటువంటి సందేహము లేదు. అందుకని మేము తిరిగి ఈ భూమిని నీకు అమ్ముతున్నాము నువ్వు తగిన వెల ఇచ్చి దానిని తిరిగి నీవే తీసుకో. ఇది రాజధర్మము ఇందులో ఎమీ తప్పులేదు " అని వ్యాసుడు చెప్పాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు కూడా వ్యాసుడు చెప్పినట్లే చెయ్యమన్నాడు. అప్పుడు ధర్మరాజు కోటికోట్లమాడలు కుప్పగా పోసి " నేను దానముగా ఇచ్చిన భూమి వెల ఇంత " అన్నాడు. వ్యాసుడు ఆ బంగారమును తీసుకుని రాజ్యాన్ని ధర్మరాజుకు తిరిగి ఇచ్చాడు. ఆ బంగారమును వ్యాసుడు యాగముకు వచ్చిన బ్రాహ్మణులకు దానముగా ఇచ్చాడు. ధర్మరాజు యాగము కొరకు తయారుచేసిన బంగారు పళ్ళెములు, బిందెలు, ఇతర వస్తువులు బ్రాహ్మణులకు పంచి పెట్టాడు. బ్రాహ్మణ దానములు అయిన తరువాత క్షత్రియులకు ఆ తరువాత వైశ్యులకు, ఆ తరువాత శూద్రులకు, ఆ తరువాత ఇంకా తక్కువ జాతి వారికి అపారముగా దానములు చేసాడు. యజ్ఞముకు వచ్చిన వారంతా అత్యంత సంతుష్టులై వారి వారి నివాసములకు వెళ్ళారు. వేదవ్యాసుడు తన వంతుకు వచ్చిన ధనమును కుంతీదేవికి ఇచ్చాడు. కుంతీదేవి ఆ ధనమును పేదలకు పంచి ఇచ్చింది. జనమేజయ మహారాజా ! దానములలో ధర్మరాజు రెండవ మరుత్తు అనిపించుకున్నాడు. యజ్ఞము పరిసమాప్తి అయిన తరువాత ధర్మరాజు తమ్ములతో భార్య ద్రౌపదితో యజ్ఞస్నానము చేసాడు. ఈ యజ్ఞముతో ధర్మరాజు తన మనసును శరీరాన్ని పవిత్రము చేసుకున్నాడు. ఆ యజ్ఞమును నిర్విజ్ఞముగా జరిపించిన వ్యాసుడికి ధర్మరాజు సాష్టాంగప్రమాణము చేసాడు. ధర్మరాజును దీవించి వ్యాసుడు తన శిష్యులతో అక్కడ నుండి వెళ్ళి పోయాడు.

యాగానంతరం రాజులను సత్కరించుట

అశ్వం తిరిగివచ్చిన తరువాత జరిగిన విందులో యుధిష్టురినితో మాట్లాడుతున్న కృష్ణుడు - రాజ్మానామా నుండి ఒక దృశ్యం

వ్యాసుడు తన శిష్యులతో వెళ్ళిన తరువాత ధర్మరాజు " యాగముకు వచ్చిన రాజులకు సముచిత సత్కారాలు చేసాడు. బంగారమును, మణులను, నగలను, మాణిక్యాలను, నగలను, ఏనుగులను, అశ్వములను, వేశ్యలను కానుకగా ఇచ్చాడు. బభ్రువాహనుడికి సముచుత సత్కారము చేసి తన దేశముకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. ఎన్ని రోజులుగానో అర్జునుడికి దూరముగా ఉన్న ఉలూపి, చిత్రాంగదలు తమ భర్త అర్జునుడి వద్ద ఉండి పోయారు. బభ్రువాహనుడు మాత్రము తన దేశానికి తిరిగి వెళ్ళాడు. అందరికంటే ముందుగా యాగము చూడడానికి వచ్చిన శిశుపాలుని భార్యను ధర్మరాజు సముచితంగా సత్కరించాడు. ఆమె మనుమడిని సింధుదేశానికి అధిపతిగా పట్టాభిషిక్తుడిగా చేసాడు. తరువాత భారత యుద్ధములో ఓడిపోయి చనిపోయిన రాజుల రాజ్యాలను వారి వారసులకు ఇచ్చివేసాడు. అందరూ వెళ్ళిన తరువాత కూడా శ్రీకృష్ణుడు, బలరాముడు, యాదవ ప్రముఖులు ఉండిపోయారు. శ్రీకృష్ణుడికి, బలరాముడికి, సాత్యకికి, మిగిలిన యాదవ ప్రముఖులకు ధర్మరాజు అనేక రత్నాభరణాలు, విలువైన కానుకలు ఇచ్చి సత్కరించాడు. ధర్మరాజు చేసిన సత్కారాలకు తృప్తిచెందిన యాదవప్రముఖులు ద్వారకకు తిరిగి వెళ్ళారు " అని వైశంపాయనుడు జనమేజయునికి అశ్వమేధయాగ విశేషములు తెలిపాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

*26 డిగ్రీల వద్ద AC ఉంచండి* *26 డిగ్రీల వద్ద AC ఉంచండి*

 *26 డిగ్రీల వద్ద AC ఉంచండి*   

విద్యుత్ బోర్డు నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంపిన చాలా ఉపయోగకరమైన సమాచారం.

AC యొక్క సరైన ఉపయోగం:

వేడి వేసవి ప్రారంభమైనందున మరియు మేము ఎయిర్ కండిషనర్లను క్రమం తప్పకుండా ఉపయోగిస్తాము, సరైన పద్ధతిని అనుసరిద్దాం.

చాలా మందికి 20-22 డిగ్రీల వద్ద తమ ఎసిలను నడిపే అలవాటు ఉంది మరియు వారు చల్లగా ఉన్నప్పుడు, వారు తమ శరీరాలను దుప్పట్లతో కప్పుతారు. ఇది రెట్టింపు నష్టానికి దారితీస్తుంది.

ఎలా ???

మన శరీర ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ అని మీకు తెలుసా?

శరీరం 23 డిగ్రీల నుండి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను సులభంగా తట్టుకోగలదు. దీనిని మానవ శరీర ఉష్ణోగ్రత సహనం అంటారు.

గది ఉష్ణోగ్రత తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నప్పుడు, తుమ్ము, వణుకు మొదలైన వాటి ద్వారా శరీరం స్పందిస్తుంది.

మీరు ఎసిని 19-20-21 డిగ్రీల వద్ద నడుపుతున్నప్పుడు, గది ఉష్ణోగ్రత సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే చాలా తక్కువగా ఉంటుంది మరియు ఇది శరీరంలో అల్పోష్ణస్థితి అని పిలువబడే ప్రక్రియను ప్రారంభిస్తుంది, ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది, తద్వారా శరీరంలోని కొన్ని భాగాలలో రక్త సరఫరా ఉండదు తగినంత. ఆర్థరైటిస్ మొదలైన వాటిలో దీర్ఘకాలిక ప్రతికూలతలు చాలా ఉన్నాయి,

ఎసి ఆన్‌లో ఉన్నప్పుడు ఎక్కువ సమయం చెమట ఉండదు, కాబట్టి శరీరంలోని టాక్సిన్స్ బయటకు రావు మరియు దీర్ఘకాలికంగా చర్మ అలెర్జీ లేదా దురద, అధిక రక్తపోటు మొదలైన అనేక వ్యాధుల ప్రమాదం ఏర్పడుతుంది.

మీరు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఎసిని నడుపుతున్నప్పుడు, ఇది కంప్రెసర్ నిరంతరం పూర్తి శక్తితో పనిచేస్తుంది, అది * ఫైవ్ స్టార్స్ * అయినా, అధిక శక్తిని వినియోగిస్తుంది మరియు ఇది మీ జేబు నుండి డబ్బును వీస్తుంది.

ఎసిని నడపడానికి ఉత్తమ మార్గం ఏమిటి ??

26 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ 

26+వద్ద ఎసిని ఉంచడం ఎల్లప్పుడూ మంచిది. 28+ డిగ్రీలు ఉత్తమం.

దీనికి తక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది మరియు మీ శరీర ఉష్ణోగ్రత కూడా పరిధిలో ఉంటుంది మరియు మీ ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావం ఉండదు.

దీని యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే, ఎసి తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది, మెదడుపై రక్తపోటు కూడా తగ్గుతుంది మరియు పొదుపు చివరికి గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను తగ్గించటానికి సహాయపడుతుంది.

ఎలా ??

26+ డిగ్రీ మరియు ఇతర 10 లక్షల ఇళ్ళలో ఎసిని నడపడం ద్వారా మీరు రాత్రికి 5 యూనిట్లు ఆదా చేస్తారని అనుకుందాం, అప్పుడు మేము రోజుకు 5 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఆదా చేస్తాము.

ప్రాంతీయ స్థాయిలో ఈ పొదుపు రోజుకు కోట్ల యూనిట్లు.

దయచేసి పైన పేర్కొన్న వాటిని పరిశీలించండి మరియు మీ ఏసీ ని 26 డిగ్రీల క్రింద అమలు చేయవద్దు. మీ శరీరం మరియు పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచండి.


ప్రజా ప్రయోజనం కోసం

విద్యుత్ మంత్రిత్వ శాఖ

మరియు శక్తి, భారత ప్రభుత్వం ఫార్వార్డ్ చేయవచ్చు మరియు పంచుకోవచ్చు

సర్వాంతర్యామి

  *భగవంతుడు సర్వాంతర్యామి అంటారు కదా - గుర్తించడం ఎలా??** 


శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులనే పంచ గుణము లుండడంచేత భూమి చాలా భారంగా ఉన్నది. 


జలములో శబ్ద, స్పర్శ, రూప, రసాలున్నాయిగాని, గంధము లేదు, 

ఆ ఒక్క గుణము తగ్గిపోవడంతో దీనికి కదలిక వచ్చింది,


మూడవది అగ్ని... 

ఇందులో శబ్ద, స్పర్శ, రూపములున్నాయిగాని, 

రస గంధాలు లేవు, అందువల్ల ఇది పైకి పోతుంది. 


నాలుగవది వాయువు,

ఇందులో శబ్ద, స్పర్శ గుణాలు రెండు మాత్రమే ఉన్నాయి; 

రూప, రస, గంధములు లేవు. 


మూడు గుణాలు తగ్గేసరికి ఇది ఎంతో తేలికైపోయి సర్వత్రా సంచరిస్తూ ఉంటుంది. 


ఐదవది ఆకాశము,

దీనికి శబ్దమొక్కటే ఉన్నది; స్పర్శ, రూప, రస, గంధాదులు లేవు, కనుక, ఆకాశం ఎక్కడ చూసినా వుంటుంది. 


ఇది ఒకే గుణంతో ఉన్నది కనుక, అంతటా ఉన్నది. 


*భగవంతునికి ఆ ఒక్క గుణం కూడా లేదు కాబట్టి, అతడు సర్వాంతర్యామి*.


          *శుభమస్తు*

🙏శ్రీ సద్గురు పీఠం ద్వారా....✍️

సమస్త లోకా సుఖినోభవంతు 🙏

వాతాపి జీర్ణం"*.

 మన భారతీయ సంస్కృతిలో జ్ఞాన భాండారం అనంతం. *వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు* - ఇవన్నీ మహా జ్ఞాన సాగరాలు. కానీ ఆ లోతైన జ్ఞానాన్ని సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పడం ఎలా? 


అందుకే పూర్వకాలంలో *శుక మహర్షి* లాంటి మహానుభావులు పరీక్షిత్తుకు భాగవతం చెప్పారు. కథల రూపంలో ధర్మం బోధించారు. ఆధునిక కాలంలో ఆ పని *కవులు* చేశారు. ముఖ్యంగా *తెనాలి రామకృష్ణ కవి* లాంటి వాళ్లు పురాణ కథలనే తీసుకుని, చమత్కారంతో, హాస్యంతో సామాన్యుడి గుండెలకు హత్తుకునేలా చెప్పారు. 


అలాంటి ఒక మహా కథే *"వాతాపి జీర్ణం"*. 


---


*వాతాపి-ఇల్వలుల కథ - నేపథ్యం*


ఒకప్పుడు *అగస్త్య మహాముని* తన ధర్మపత్ని *లోపాముద్ర*తో కలిసి దక్షిణ దేశ యాత్ర చేస్తున్నారు. ఉత్తరాన విజృంభించిన *వింధ్య పర్వతం* గర్వం అణచడానికి, దక్షిణాన స్థిరపడటానికి బయలుదేరారు.


వింధ్య పర్వత ప్రాంతంలో *వాతాపి, ఇల్వలుడు* అనే ఇద్దరు రాక్షస అన్నదమ్ములు ఉండేవారు. వీళ్ల పని అమాయకులను చంపి, వాళ్ల సొమ్ము దోచుకోవడం.


*వాళ్ల మోసం:* ఇల్వలుడు బ్రాహ్మణ వేషం వేసుకుని బాటసారుల్ని "భోజనం చేయండి మహాప్రభో" అని ఇంటికి పిలిచేవాడు. వాతాపిని మేకగా మార్చి, వండి, అతిథికి వడ్డించేవాడు. 


భోజనం అయ్యాక ఇల్వలుడు *"వాతాపీ! బయటకు రా!"* అని గర్జించేవాడు. వెంటనే మాయా శక్తితో వాతాపి అతిథి పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేవాడు! పాపం ఆ బాటసారి చనిపోయేవాడు. ఇలా ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు.


---


*అగస్త్యుడి రాక - వాతాపి జీర్ణం*


ఒకరోజు అగస్త్యుడు, లోపాముద్ర ఆ మార్గంలో వెళుతుండగా ఇల్వలుడు ఎదురయ్యాడు. మామూలే - "స్వామీ, మా ఇంట భిక్ష స్వీకరించండి" అని ఆహ్వానించాడు.


అగస్త్యుడు సర్వజ్ఞుడు. వీళ్ల మాయ తెలిసిపోయింది. అయినా "సరే" అని వెళ్లాడు. ఇల్వలుడు వాతాపి మాంసం వండి వడ్డించాడు.


*అగస్త్యుడు* ఒక్క ముక్క వదలకుండా తినేశాడు. తిన్నాక బొజ్జ నిమురుకుంటూ *"వాతాపి జీర్ణం!"* అని త్రేన్చాడు. అంతే! తన తపశ్శక్తితో వాతాపిని కడుపులోనే భస్మం చేశాడు.


ఇల్వలుడు ఎప్పటిలా *"వాతాపీ! బయటకు రా!"* అని అరిచాడు.  

*అగస్త్యుడు చిరునవ్వుతో:* "ఎక్కడి నుంచి వస్తాడురా మూర్ఖుడా? వాడు అరిగిపోయాడు. జీర్ణం అయిపోయాడు!"


ఇల్వలుడు గడగడ వణికిపోయాడు. కాళ్ల మీద పడ్డాడు. అగస్త్యుడు జ్ఞానబోధ చేసి, వాడికి బుద్ధి చెప్పి పంపాడు. వింధ్య ప్రాంతం వీళ్ల పీడ వదిలింది. అగస్త్యుడు వింధ్య గర్వం కూడా అణచి దక్షిణానికి వెళ్లాడు.


---


*ఇప్పుడు తెనాలి రామకృష్ణుడి చమత్కారం*


*సందర్భం:* విజయనగరంలో విందు. తాతాచార్యుల వారు రామలింగడితో "ఒరేయ్! అగస్త్యుడు బ్రాహ్మణుడై ఉండి మేక మాంసం తిన్నాడు. తప్పు కాదా?" అని దెప్పాడు.


*రామలింగడు - తేటగీతి:*  

*"తాతా! అగస్త్యుడు మేకను తినలేదయ్యా,*  

*'మోసం' అనే మేకను తిన్నాడయ్యా!*  

*వాతాపి మాంసం కాదది, 'పాపం' మూట అది!*  

*'జీర్ణం' అనగానే జీర్ణించెను - లోకం రక్షించెను!*  

*నీవు వేసే నిందల పప్పన్నం కన్నా,*  

*ఆయన తిన్న 'రాక్షస' కూరే నయం!*  

*కడుపులో అరిగేది 'అన్నం', కడుపు మండేది 'అజ్ఞానం'!*  

*అగస్త్యుడు 'వాతాపి జీర్ణం' అన్నాడు,*  

*నేను 'తాతాపి జీర్ణం' అంటాను - నీ అహంకారం అరిగిస్తాను!"*


*తాతాచార్యులు:* "ఏమిట్రా నీ బొంకు! బ్రాహ్మణుడు మాంసం తింటే తప్పు కాదా?"  


*రామలింగడు:* "తాతా! ఆపద్ధర్మం వినలేదా? ధర్మ రక్షణ కోసం, లోక కళ్యాణం కోసం చేస్తే అది అధర్మం కాదు. వాడు మేక కాదు, రాక్షసుడు. అగస్త్యుడు రుచికి తినలేదు, *రక్షణకు మింగాడు*. 


'ఋణం కృత్వా ఘృతం పిబేత్' అన్న చార్వాకుడిలా స్వార్థం కోసం కాదు. *'వాతాపిం హత్వా లోకం పాహి'* అని పరార్థం కోసం చేశాడు. అర్థమైందా? 


కాబట్టి *మేక మాంసము నో ఇష్యూ తాతా!* సంకల్పం ముఖ్యం. వైద్యుడు కత్తి కోస్తే హత్యా? కాదు గదా! అలాగే ఇదీను."


*సభ:* "భళా రామలింగా! భళా!" 🤣  

*రాయలవారు:* "వాతాపిని అగస్త్యుడు అరిగిస్తే, తాతాచార్యుల గర్వాన్ని రామలింగడు అరిగిస్తున్నాడు!" 


*సూత్రం:* *"అగస్త్యుడిలా సమస్యను 'జీర్ణం' చేసుకో. నమిలి మింగి అరిగించుకో. అప్పుడే నీకు శాంతి!"*

దేవతా స్వరూపం "గోవు

 *******సర్వ దేవతా స్వరూపం "గోవు"*******.


.సర్వ దేవతా స్వరూపం అయిన గోవు ను హిందువులు పూజిస్తారు..జంతువులలో ఏ జంతువుకు ఇంతటి ప్రాముఖ్యత లేదు . గోహత్య మహా పాపం కూడా..గోవు లక్ష్మీ దేవి స్వరూపం.." గోవు మహాలక్ష్మి "కి కోటి దండాలు అంటూ చాలా చోట్ల "గోశాల" లు ఏర్పాటు చేస్తున్నారు.. వాటికి కావలసిన గ్రాసాన్ని భక్తులు ఇచ్చిన విరాళాలతో కొనుగోలు చేస్తూ ఉన్నారు.. గోవు నుంచి లభించే ప్రతి ఒక్కటీ పూజకు అర్హమైనది...వీటినే " పంచ గవ్యములు" అంటారు..గోమూత్రం నందు వరుణదేవుడు..గోమయం ( పేడ)నందు అగ్నిదేవుడు, గో ఘృతం (నెయ్యి) నందు సూర్యుడు, గో దధి (పెరుగు) నందు వాయు దేవుడు ,గో క్షీరము ( పాలు) నందు చంద్రుడు ఉంటారు...అంతటి పవిత్రమైనది ఆవు.. దశ విధ స్నానాలలో గోవులు నడిచి నప్పుడు వాటి గిట్టలనుండి వెలువడే పాద ధూళిని శరీరానికి పట్టించుకుంటే దానిని "వాయవ్య స్నానము" అంటారు.. మన ఇంటి ముంగిట కూడా శుభ్రంగా కసువు ఊడ్చుకుని " గోమయం" తో కళ్ళాపి చల్లుకుంటే ఎలాంటి దుష్టశక్తులు మనదరికి చేరవు..ఇంటి ముంగిట వేసే ముగ్గులో కూడా శ్రీ మహాలక్ష్మీ దేవి కొలువై ఉంది..అందుకే గడపకు పసుపు రాసుకుంటారు...మహిళలు కాళ్లకు పసుపు రాసుకుంటారు.. దాని ద్వారా మన దగ్గరకు హాని చేసే ఏ క్రిమి కీటకాలు రావు. దుష్టశక్తులు దరి చేరవు..ప్రాణాన్ని కాపాడే గోమయాన్ని విడచిపెట్టి .నేడు అంగళ్లలో చౌకగా అమ్ముతున్న, అతి తక్కువ ధరకు దొరుకుతున్న " పేడ రంగు" ప్యాకెట్లు తెచ్చుకుని ఇంటి ముంగిట పచ్చగా ఉంటుందని అలుక్కుంటూ ఉన్నారు..దీని వలన ఎలాంటి లాభం లేదు...అంతే కాకుండా ఈ విషతుల్యమైన రంగును " కుటుంబంలో కలహాలు" పడి నీటిలో కలుపుకుని త్రాగుతూ "ఆత్మహత్యలు" కూడా చేసుకుంటున్నారు.. ఎంత చైతన్యం కలిగిస్తూ ఉన్ననూ ఒకరిని చూసి మరొకరు పోటీ పడి తెచ్చుకుని ఆ విషతుల్యమైన పసుపు రంగును చూసి మురిసి పోతూ యున్నారు...ఇలాంటి అమ్మకాలను ప్రభుత్వం తక్షణమే 100% నిషేధించాలి...ఆకస్మిక తనిఖీలు జరిపి ప్రజల ప్రాణాలను కాపాడమని కోరుతూ యున్నాను.... (అంగళ్లలో అమ్మే పేడ రంగులను అమ్మే వారిని శిక్షించాలి ..ఎవ్వరూ దయచేసి ఈ రంగు ప్యాకెట్లు కొనకండి./అమ్మకండి .. ప్లీజ్)

పంచాంగం 23.05.2026 Saturday,

  ఈ రోజు పంచాంగం 23.05.2026 Saturday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధికజ్యేష్ఠ మాస శుక్ల పక్ష అష్టమి తిథి స్థిర వాసర మఘ నక్షత్రం ధ్రువ తదుపరి వ్యాఘాత యోగః భద్ర తదువరి బవ కరణం.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

  


శ్రాద్ధ తిథి: అష్టమి.


 

నమస్కారః , శుభోదయం

ఓడిపోయిన బ్రహ్మదేవుడు

 *హంస చేతిలో ఓడిపోయిన బ్రహ్మదేవుడు - కథ*


ఇది *సృష్టి రహస్యం + అహంకారం* గురించి శివపురాణం, స్కాంద పురాణంలో చెప్పిన అద్భుత కథ.


*కథ - సరస్వతీ శాపం & హంస గెలుపు*


*1. సృష్టి మొదలైన తర్వాత:*  

బ్రహ్మదేవుడు సృష్టి చేసి అహంకారంతో విర్రవీగాడు. "నేనే సృష్టికర్తను, నాకంటే గొప్పవారు లేరు" అని గర్వపడ్డాడు. తన 4 తలలతో 4 వేదాలు చదువుతూ అందరినీ చిన్నచూపు చూశాడు.


*2. సరస్వతీ దేవి ఆగ్రహం:*  

బ్రహ్మ భార్య సరస్వతీ దేవి - విద్యకు అధిదేవత. ఆమె వాహనం *హంస*. హంసకు పాలు, నీళ్లు వేరు చేసే శక్తి ఉంది - అంటే *సత్యం-అసత్యం, జ్ఞానం-అజ్ఞానం* వేరు చేస్తుంది.


బ్రహ్మ అహంకారం చూసి సరస్వతి బాధపడింది. "వేదాలు చదివినంత మాత్రాన జ్ఞానం రాదు, అహంకారం పోతేనే బ్రహ్మజ్ఞానం" అని చెప్పింది. బ్రహ్మ వినలేదు.


*3. శివుని పరీక్ష:*  

శివుడు బ్రహ్మ గర్వం అణచాలని అనుకున్నాడు. సరస్వతీ హంసను పిలిచి "నీవు వెళ్లి బ్రహ్మకు జ్ఞాన పరీక్ష పెట్టు" అని ఆజ్ఞ ఇచ్చాడు.


*4. హంస - బ్రహ్మ వాదన:*  

హంస బ్రహ్మ సభకు వెళ్లింది. బ్రహ్మ నవ్వుతూ "ఓ పక్షీ! నీకేం తెలుసు? నేను వేదాలు సృష్టించాను" అన్నాడు.


హంస ఇలా అడిగింది:  

*"హే చతుర్ముఖా! వేదాలు నీవు సృష్టించావు సరే. కానీ వేదాల సారం ఏమిటి? 'తత్ త్వం అసి' - అది నీవే అయివున్నావు అంటే ఎవరు? పరబ్రహ్మం ఎక్కడ ఉంది?"*


బ్రహ్మ 4 తలలతో 4 వేదాలు వల్లించాడు కానీ *అనుభవ జ్ఞానం* చెప్పలేకపోయాడు. పుస్తక జ్ఞానం మాత్రమే ఉంది, ఆత్మ జ్ఞానం లేదు.


*5. హంస గెలుపు:*  

హంస ఇలా చెప్పింది:  

*"పాలను నీళ్ల నుండి వేరు చేసినట్లు, నేను సత్యాన్ని అసత్యం నుండి వేరు చేస్తాను. నీలో ఉన్నది పుస్తక జ్ఞానం - అది నీళ్లు. అనుభవ జ్ఞానం - అది పాలు. నీ దగ్గర పాలు లేవు, నీళ్లే ఉన్నాయి. కాబట్టి నీవు ఓడిపోయావు."*


బ్రహ్మ తల దించుకున్నాడు. అహంకారం నశించింది.


*6. సరస్వతీ శాపం & వరం:*  

సరస్వతి బ్రహ్మతో "నీకు పూజ తగ్గిపోతుంది. భూలోకంలో నీకు 1-2 గుడులు మాత్రమే ఉంటాయి. కానీ నా హంస గెలిచింది కాబట్టి, జ్ఞానం కావాలన్నవారు ముందు హంసను - అంటే వివేకాన్ని - పూజించాలి" అని చెప్పింది.


అందుకే *పుష్కర్* తప్ప బ్రహ్మకు గుడులు లేవు. కానీ సరస్వతీ పూజలో హంసకు మొదటి పూజ.


*వేదాంత రహస్యం - కథలో అంతరార్థం*

పాత్ర దేనికి సంకేతం

*బ్రహ్మ* పుస్తక జ్ఞానం, శాస్త్ర పాండిత్యం, అహంకారం

*హంస* వివేకం, ఆత్మ జ్ఞానం, పరమహంస స్థితి

*పాలు-నీళ్లు* సత్యం-అసత్యం, నిత్యం-అనిత్యం

*సరస్వతి* శుద్ధ విద్య, అనుభవ జ్ఞానం

*ఓటమి* "నేను" అనే అహంకారం చస్తేనే బ్రహ్మజ్ఞానం

*"హంసః సోహం"* - ఆ హంసే నేను. ఉచ్ఛ్వాస నిశ్వాసలలో "హం-సః" అని శబ్దం వస్తుంది. అది తెలుసుకున్నవాడు పరమహంస అవుతాడు.


*ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సినవి*


1. *డిగ్రీలు, పుస్తకాలు చదివితే జ్ఞానం రాదు:* అనుభవం + వినయం ఉంటేనే నిజమైన జ్ఞానం.  

2. *అహంకారం = పతనం:* బ్రహ్మదేవుడికే తప్పలేదు. "నేను గొప్ప" అనుకున్న క్షణం పతనం మొదలు.  

3. *వివేకం ముఖ్యం:* ఎంత చదివినా "మంచి ఏది, చెడు ఏది" వేరు చేయగలిగితే అదే హంస తత్వం.  

4. *గురువు:* సరస్వతి - విద్యకు గురువు. హంస - వివేకానికి గురువు. ఇద్దరూ లేకపోతే బ్రహ్మ కూడా ఓడిపోతాడు.


*మంత్రం:* *"ఓం హంసః సోహం శివోహం"* - రోజూ 11 సార్లు. అహంకారం నశిస్తుంది, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.


*సారాంశం:* బ్రహ్మ హంస చేతిలో ఓడిపోయాడు అంటే - *పుస్తక జ్ఞానం అనుభవ జ్ఞానం ముందు తల వంచింది.* అందుకే సన్యాసులను "పరమహంస" అంటారు.


*ఓం సరస్వత్యై నమః | ఓం హంసాయ నమః*