23, మే 2026, శనివారం

దేవతా స్వరూపం "గోవు

 *******సర్వ దేవతా స్వరూపం "గోవు"*******.


.సర్వ దేవతా స్వరూపం అయిన గోవు ను హిందువులు పూజిస్తారు..జంతువులలో ఏ జంతువుకు ఇంతటి ప్రాముఖ్యత లేదు . గోహత్య మహా పాపం కూడా..గోవు లక్ష్మీ దేవి స్వరూపం.." గోవు మహాలక్ష్మి "కి కోటి దండాలు అంటూ చాలా చోట్ల "గోశాల" లు ఏర్పాటు చేస్తున్నారు.. వాటికి కావలసిన గ్రాసాన్ని భక్తులు ఇచ్చిన విరాళాలతో కొనుగోలు చేస్తూ ఉన్నారు.. గోవు నుంచి లభించే ప్రతి ఒక్కటీ పూజకు అర్హమైనది...వీటినే " పంచ గవ్యములు" అంటారు..గోమూత్రం నందు వరుణదేవుడు..గోమయం ( పేడ)నందు అగ్నిదేవుడు, గో ఘృతం (నెయ్యి) నందు సూర్యుడు, గో దధి (పెరుగు) నందు వాయు దేవుడు ,గో క్షీరము ( పాలు) నందు చంద్రుడు ఉంటారు...అంతటి పవిత్రమైనది ఆవు.. దశ విధ స్నానాలలో గోవులు నడిచి నప్పుడు వాటి గిట్టలనుండి వెలువడే పాద ధూళిని శరీరానికి పట్టించుకుంటే దానిని "వాయవ్య స్నానము" అంటారు.. మన ఇంటి ముంగిట కూడా శుభ్రంగా కసువు ఊడ్చుకుని " గోమయం" తో కళ్ళాపి చల్లుకుంటే ఎలాంటి దుష్టశక్తులు మనదరికి చేరవు..ఇంటి ముంగిట వేసే ముగ్గులో కూడా శ్రీ మహాలక్ష్మీ దేవి కొలువై ఉంది..అందుకే గడపకు పసుపు రాసుకుంటారు...మహిళలు కాళ్లకు పసుపు రాసుకుంటారు.. దాని ద్వారా మన దగ్గరకు హాని చేసే ఏ క్రిమి కీటకాలు రావు. దుష్టశక్తులు దరి చేరవు..ప్రాణాన్ని కాపాడే గోమయాన్ని విడచిపెట్టి .నేడు అంగళ్లలో చౌకగా అమ్ముతున్న, అతి తక్కువ ధరకు దొరుకుతున్న " పేడ రంగు" ప్యాకెట్లు తెచ్చుకుని ఇంటి ముంగిట పచ్చగా ఉంటుందని అలుక్కుంటూ ఉన్నారు..దీని వలన ఎలాంటి లాభం లేదు...అంతే కాకుండా ఈ విషతుల్యమైన రంగును " కుటుంబంలో కలహాలు" పడి నీటిలో కలుపుకుని త్రాగుతూ "ఆత్మహత్యలు" కూడా చేసుకుంటున్నారు.. ఎంత చైతన్యం కలిగిస్తూ ఉన్ననూ ఒకరిని చూసి మరొకరు పోటీ పడి తెచ్చుకుని ఆ విషతుల్యమైన పసుపు రంగును చూసి మురిసి పోతూ యున్నారు...ఇలాంటి అమ్మకాలను ప్రభుత్వం తక్షణమే 100% నిషేధించాలి...ఆకస్మిక తనిఖీలు జరిపి ప్రజల ప్రాణాలను కాపాడమని కోరుతూ యున్నాను.... (అంగళ్లలో అమ్మే పేడ రంగులను అమ్మే వారిని శిక్షించాలి ..ఎవ్వరూ దయచేసి ఈ రంగు ప్యాకెట్లు కొనకండి./అమ్మకండి .. ప్లీజ్)

కామెంట్‌లు లేవు: