1, మార్చి 2023, బుధవారం

ప్రశాంత జీవన సంకేతం

 శుభమస్తు, శుభోదయం             🌹💐🤝🌹💐                                                సువిశాల విశ్వంలో సుస్నేహ వికాసం, విశ్వ చరాచర ప్రశాంత జీవన సంకేతం ! సృష్టి ఒసగిన స్వీయ ప్రకాశాత్మక నిత్య ప్రశాంత జీవన మార్గం, విశ్వ వ్యాప్త సన్మైత్రీ భావనాత్మక తేజో వికాసం ! పవిత్ర భువిపై ప్రకృతి రమణీయతకు తోడుగా, " భగవంతుడు కల్పించిన సుస్నేహ భావనకు ", ఎప్పటికీ శిఖరాగ్రమై నిలచెడి, అత్యున్నత జీవన సోపానం ! ఈ సువిశాల విశ్వంలో,  " ప్రకృతి ", ప్రతి ప్రభాతాన ఇచ్చెడి సుహృద్భావ స్ఫూర్తిమంతమైన సందేశం, స్నేహితులకు ఎల్లవేళలా చేదోడువాదోడై అండగా నిలవాలన్న సుచైతన్య నిత్య సమైక్యతాత్మక జీవన దివ్య పథం !                          🌹💐🤝💐🌹💐                   గుళ్లపల్లి ఆంజనేయులు

 విశ్వ దర్శనంలో అనునిత్యం కానవచ్చెడి అద్భుత దృశ్యం, సుస్నేహ వికాసం ! స్నేహమయమైన అమృతాత్మక దివ్య భావనకు, ప్రతి క్షణం ప్రకృతి ఒసగెడి సమున్నత ఆత్మీయ స్పర్శ ! చరాచర జీవ జగతికి, సువిశాల విశ్వ సురక్షాచక్రం, సృష్టి ఒసగిన దివ్య సన్మైత్రీ భావనాత్మక సుహృద్భావ చైతన్య శక్తి ! పుణ్య ధరిత్రిపై సృష్టి కర్త బ్రహ్మ ఒసగిన ప్రత్యేక దివ్య సుప్రకాశాత్మక జీవన వ్యవస్థ, " సకల జీవ నిత్య ప్రశాంత సమైక్య జీవన సువికాస తేజోమయ జీవన మార్గం " ! భారతీయ సనాతన ధార్మిక విధాన ప్రత్యేక నిత్య దివ్య సమ్మిళిత చైతన్య స్ఫూర్తి, సువిశాల విశ్వ నిత్య ప్రశాంత సురక్షా జీవన దివ్య పథం ! సువిశాల విశ్వ చరాచర జీవ జగతికి సృష్టి కర్త ఒసగిన దివ్య వరం, విశ్వ మానవాళి నిత్య సత్య సుచైతన్య సుహృద్భావ సువ్యక్తిత్వ జీవన దృక్పథం ! " స్నేహ ధర్మాన్ని మించిన గొప్ప ధార్మిక వ్యవస్థ ఎదీ లేదు, ఈ పవిత్ర భువిపై తరచి చూచిన " ! విశ్వ మానవాళి గమనించాలి, ఈ పవిత్ర " విశ్వ సురక్షా సన్మైత్రీ భావనాత్మక జీవన బాటను ", అనుక్షణం, పరమోన్నత జీవకారుణ్య నిత్య సన్మార్గ ప్రశాంత వాతావరణంలో ! " కలసి ఉంటే కలదు సుఖం, సన్మైత్రీ భావనాత్మక సన్మార్గ దివ్య పథంలో పయనించాలందరూ, విశ్వ సుసంక్షేమ సురక్షా జీవన సద్వికాసానికై !                            🌹💐🤝🌹💐                     గుళ్లపల్లి ఆంజనేయులు

పుణ్యకార్యాలు చేసిన వారికే

 శ్లో|| 

*ప్రీణాతి యః సుచరితైః పితరం స పుత్రో*

*యద్భరురేవ హితమిచ్చతి తత్కలత్రమ్ |*

*తన్మిత్రమాపది సుఖమే చ సమక్రియం*

*యదేత్రయం జగతి పుణ్యకృతాం లభిస్తే ||*


*తా|| తన సత్ప్రవర్తనతో తండ్రిని తృప్తిపరచగలిగే, కొడుకే కొడుకు...!*_


_*ఎప్పుడూ, తన భర్త ప్రయోజనాలను మాత్రమే కోరుకునే స్త్రీ మూర్తి మాత్రమే భార్య...!*_


_*ఎవరైతే మన సుఖ దుఃఖాలలో ఎప్పుడూ ఒకే ప్రవర్తన కలిగి ఉంటారో, అతడే నిజమైన స్నేహితుడు...!*-


_*ఈ లోకంలో పుణ్యకార్యాలు చేసిన వారికే ఈ మూడూ లభిస్తాయి.*_

గాయత్రి దేవీ*

 *గాయత్రి  దేవీ*               తల్లి గాయత్రి

 ఒకసారి వశిష్ఠ మహర్షి విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా, ‘నా, స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని. అగ్ని నుండి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హ్రుతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తితమవుతున్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.

గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.

ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత త్సవితుర్వరేణ్యమ్

భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.

త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు

ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.

బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.

గాయత్రి మంత్రాక్షరాలు💐

సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం

సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే

‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్’

గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం లేదు. ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.’ శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది. 

పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. 

ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. 

వీటిలో 12 వైదిక మార్గాలు కాగా, 12 తాంత్రిక మార్గాలు. 

ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. 

గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి...🙏🏻

విరేచనాల నివారణ

 విరేచనాల నివారణ కొరకు ఆయుర్వేద ఔషధ యోగాలు - 


 *  కరివేపాకును కషాయముగా కాచి పుచ్చుకొనుచున్న విరేచనములు తగ్గును . ఇది వాంతులను కూడా తగ్గించును . 


 *  బొప్పాయి పండు తినిన నీళ్ల విరేచనములు తగ్గును . 


 * సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలలో 5 గ్రా మెంతులు ,రెండు గచ్చకాయలు అంత వెన్నను కలిపి రోజుకు రెండు పర్యాయములు లోపలికి తీసుకొనుచున్న రక్తవిరేచనములు , జిగురు విరేచనములు తగ్గును . 


 * ఒక కప్పున్నర పెరుగులో 20 గ్రా మోతాదులో మెంతులు చేర్చి లోపలికి తీసుకున్నను విరేచనాలు కట్టును . 


 *  వేడివేడి జిలేబి గాని సగ్గు బియ్యపు పాయసం గాని సేవించుచున్న అతిసార విరేచనాలు తగ్గును . 


    విరేచనాలు అగుచున్నప్పుడు తగ్గేంతవరకు ఉప్పు మరియు కారపు పదార్దాలు నిషిద్దం . చప్పిడి పథ్యం ( పదార్దాలు ) తినుట చాలా మంచిది . 


        మ .

పాముల_నర్సయ్య గారు

 #పాముల_నర్సయ్య గారు 

మంత్రాలకు చింతకాయలు రాలతాయా?అని ప్రశ్నించే వారికి సమాధానం పాముల నర్సయ్య గారి జీవితం. ఎందుకంటే దైవత్వం మూర్తీభవించిన పాముల నర్సయ్య గారి నోటి నుంచి వచ్చే మంత్రం విషానికి విరుగుడుగా మారింది అంటే అతిశయోక్తి కాదు. కేవలం దైవానుగ్రహం తో ప్రసాదించబడిన ఆ మంత్రం ఆనాటి కాలంలో పాము కాటుకు గురైన ఎంతో మందికి పునర్జన్మను ప్రసాదించింది. దైవశక్తి గల ఆ మంత్రం ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు ఎలాంటి కాలకూట విషానికైనా విరుగుడు లభించినట్లే. దైవానుగ్రహంతో తన మాటనే మంత్రం గా మలచుకున్న కారణజన్ముడు పాముల నర్సయ్య ‌.


నరసయ్య మంత్ర మహిమ...

పాముల నర్సయ్య గారు విశాఖపట్టణం ప్రాంతానికి చెందిన వారు. చెరుకుమిల్లి వెంకట నరసింహారావు అనేది తల్లిదండ్రులు పెట్టిన పేరు. కానీ మంత్రశక్తి ఆయనను పాముల నర్సయ్యగా మార్చేసింది. చిన్న వయసులో ఒకసారి కాశీ వెళ్లారు.అక్కడ గంగానదిలో స్నానం చేస్తుండగా అదే సమయంలో ఆనాటి శృంగేరి పీఠాధిపతి కూడా అక్కడికి రావడం జరిగింది.ఆ శృంగేరీ పీఠాధిపతి నర్సయ్యను చూసి, ఇతనిలో ఏదో దివ్యత్వం దాగి ఉంది, ఇతని వల్ల ఒక మహత్కార్యం జరగాల్సి ఉందని గ్రహించి ఆయనకు గారుడీ మంత్రాన్ని ఉపదేశించారు. విషాన్ని హరించే మంత్రం అది. నర్సయ్య ఆ మంత్రాన్ని ఎన్నో ఏళ్ల పాటు భక్తిశ్రద్ధలతో జపించి శక్తిని సాధించారు. ఆ మంత్రశక్తితో ఆయన పాముకాటుకు గురైన ఎంతోమందిని కాపాడారు.


నరసయ్య గారి జీవితానికి ఓ మలుపు...

ఓ బ్రిటిష్ అధికారిని కాపాడటం పాముల నర్సయ్య గారి జీవితానికి ఓ మలుపు గా మారిందని చెప్పవచ్చు. అ మలుపే ఎంతో మందికి ప్రాణదానం జరిగేటట్లు చేసింది. ఒక్కసారి ఓ బ్రిటిష్ అధికారి పాముకాటుకు గురి అయ్యాడు.కొంతమంది చెంచులు పసరు మందు వేసినా ఫలితం కనపడలేదు.శరీరమంతటికీ విషం పాకిపోయింది. ఇక కొద్ది క్షణాల్లో చనిపోతాడు అనగా అటుగా వెళ్తున్న నరసయ్యకు ఈ విషయం తెలిసి ఆ బ్రిటిష్ అధికారి చెవిలో మంత్రాన్ని చెప్పాడు. కాసేపటికి ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. రైల్వేలో ఉద్యోగం ఇవ్వడమే కాదు, ఆయన కూర్చున్న చోట ఫోన్ కూడా ఏర్పాటు చేశారు.


ఆ ఫోన్ నెంబరు ఆంధ్రా లోని అన్ని రైల్వే స్టేషన్లో వ్రాయించారు .ఇప్పుడు 108 అంబులెన్స్ నెంబర్ ఎలా ఉందో అలా నర్సయ్య గారి ఫోన్ నెంబరు నాటి జనం నోళ్ళలో నానింది. ఆ నెంబర్కు ఎవరైనా ఫోన్ చేసి పాము కాటుకు గురయ్యారు అని చెబితే చాలు ,నరసయ్యగారు ఆ పాము మంత్రాన్ని పాముకాటుకు గురైన వ్యక్తి చెవిలో చెప్పి విషాన్ని దించేసేవారు. ఇలా కేవలం ఫోన్ ద్వారానే మంత్రం చెప్పి కొన్ని వేలమందిని బతికించారు .కానీ ఏనాడు ఎవరి వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మద్రాసు రైల్వే సూపరింటెండెంట్ గా బదిలీ చేసినా,అక్కడ కూడా ఇదే విధంగా ఫోను ఏర్పాటు చేయడం జరిగింది.


వైద్యం ఎలా చేసేవారంటే...

మంత్రం పనిచేయాలంటే కొంతమంది స్పర్శ ద్వారా చేస్తారు. మరి కొంతమంది తీర్థం ఇచ్చి మంత్రం పని చేసేలా చేస్తారు. కానీ నర్సయ్య గారు ఫోన్ రిసీవర్ తో నయం చేసేవారు. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఇది వాస్తవం వైద్యం ఎలా చేసేవారంటే విజయవాడలోని ఓ వ్యక్తికి పాము కరిచినట్లు ఫోన్ వస్తే ఆ ఫోన్ రిసీవర్ ను పాము కరిచిన వ్యక్తి చెవి దగ్గర పెట్టు అనేవారు. నరసయ్య భుజం మీద ఎప్పుడూ గుడ్డ పీలికలు ఉండేవి .దాంట్లోని ఓ పీలికనకు ముడి వేసి ఆ తర్వాత పాము కాటు వేసిన వ్యక్తికి చెవిలో గారుడీ మంత్రాన్ని చెప్పేవారు. కాసేపు ఆయన కళ్ళు మూసుకొని ఉపా‌సన చేసేవారు .దిగిపోతుందని చెప్పే వరకు ఆయన పాముకాటుకు గురైన వ్యక్తి చెవిలో ఏదో చెబుతుండే వారు . విషం దిగిపోయింది అని చెప్పిన తర్వాత ఆ గుడ్డ పీలికలలో కొంచెం ఇసుక వేసి దానిని చెట్టుకు కట్టివేసేవారు. దాంతో ఆ ప్రక్రియ పూర్తయినట్లు. ఇలా కొన్ని వేలమందిని ఆయన గారుడీ మంత్రంతో బతికించారు.


చేతులెత్తేసిన పరిశోధకులు...

నరసయ్య మంత్ర మహిమ ను గుర్తించి ఎన్నో దేశాల వారు ఆహ్వానాలు పంపారు .అదే సందర్భంలో ఈయన మంత్రం పై పరిశోధనలు సైతం జరిగాయి .నరసయ్య గారు తన జీవిత కాలంలో 22 సార్లు జర్మనీ వెళ్లారు .అలాగే 12 సార్లు ప్రపంచ పర్యటన చేశారు ఈయన పర్యటించిన దేశాలలో వీరి మంత్రాన్ని ఎన్నో విధాలుగా పరీక్షించారు.


ఓసారి రష్యా వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఈయనకే పాము కాటు వేస్తే బ్రతుకుతాడో లేదో పరీక్షించబోయారు, ఇలాంటి పిచ్చి పనులు చేయ వద్దని చెప్పిన వినలేదు. ఈయన నోట్లో నాభి అనే వేరు ఉండేది. దాని రసాన్ని ఎప్పుడూ పిలుస్తూ ఉండేవారు. ఆ మూలిక విషానికి విరుగుడుగా పని చేసేది. నన్ను పాము కాటు వేస్తే ఆ పాము కే ప్రమాదం అని చెప్పారు. కానీ రష్యన్లు ఈయన మాట వినకుండా ,ఎవరితోనో మాట్లాడుతుంటే చాటుగా భయంకరమైన సర్పంతో వేయించారు. సరిగ్గా ఎనిమిది నిమిషాలు అయ్యే సరికి ఆ సర్పం చనిపోయింది . పాము చనిపోయిన విషయం తెలుసుకుని నరసయ్య గారు ఎంతో బాధ పడ్డారు. ఎందుకంటే వీరికి పాములంటే ఎంతో ఇష్టం .ఎవరైనా పాములను చంపితే ఊరుకునేవారు కాదు.


ఒక మిత్రుని ద్వారా...

మానవుడెంత పురాతనుడో

 మానవుడెంత పురాతనుడో అంత పురాతనులు వారు


ప్రబలుతున్న భౌతికవాదం వల్లగానీ, విస్తరిస్తున్న పారిశ్రామీకరణం వల్లగానీ, సంకీర్ణంగావున్న ఆధునిక జీవన పద్ధతుల వల్ల గానీ, భారతదేశంలోని ఆధ్యాత్మికతకు ఎలాంటి హాని కలగదని శ్రీ కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖర యతీంద్ర సరస్వతీ పరమాచార్య స్వామి వారన్నారు. మతంలో ఔత్సుక్యమూ, నిష్టా ప్రస్తుతం తగ్గిపోతున్నట్లు కనబడినప్పటికీ, యోగులూ, ఋషులూ పుట్టి హిందూమతాన్ని తప్పక సముద్దరిస్తారని తమ అభిప్రాయం కచ్చితంగా చెప్పారు.


రెండవ ఆగమసదస్సు సందర్భంగా మధుర సమీపంలోని నారాయణవరంలో స్వామివారు విడిదిచేసి వున్నప్పుడు ఒక సోమవారం రాత్రి మద్రాసులోని అమెరికా కాన్సల్ జనరల్ గా ఉద్యోగం చేస్తున్న డాక్టర్ ఆల్బర్ట్ డి. ఫ్రాంక్లిన్ తో సంభాషిస్తూ ప్రసంగవశాన వారు వెలిబుచ్చిన అభిప్రాయం ఇది.


అమెరికా కాన్సల్ జనరల్ స్వామి విడిదికి వచ్చి సంభాషించారు. వారి గోష్ఠి దాదాపు అరగంట సేపు సాగింది. ఆ గోష్ఠిలో శ్రద్ధాళువైన ఒక వ్యక్తికి, ఆధునిక జీవన విధానాల్లోని అనేకానేక సంకీర్ణతల వల్ల మతసంప్రదాయాలకు ఎలాంటి ప్రమాదం కలుగుతుందోనని సహజంగా కలిగే భయాన్ని డాక్టర్ ఫ్రాంక్లిన్ వ్యక్తం చేశారు. కాని, చివరకు వారు తమ భయాలన్నీ విడిచి తృప్తిగా, నిశ్చింతగా సెలవు తీసుకున్నారు.


పళ్లూ, కొబ్బరికాయలూ స్వామివారికి సమర్పించి వారిని దర్శించే భాగ్యం తనకు కలిగినందుకు ఎంతటి ధన్యభావంతో మనస్సంతా నిండిపోయిందో ఫ్రాంక్లిన్ వ్యక్తం చేశారు. స్వామివారు ఉదారంగా నవ్వి ఊరుకున్నారు.


డాక్టర్ ఫ్రాంక్లిన్ స్వామివారిని నిశితంగా ప్రశ్నించి అనేక విషయాల మీద వారి ఉపదేశాన్ని అర్థించారు. ముందుగా క్రైస్తవుడైనా తనకితర మతాల మీద గౌరవం వుందనీ, యితర మత సిద్ధాంతాలు అవగాహన చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. తమకున్న కొన్ని సందేహాలు తీర్చవలసిందిగా స్వామివారిని కోరారు.


మానవుల శ్రేయస్సు కోసమే ప్రవక్తలందరూ మతాలు స్థాపించారనీ, అందువల్ల సర్వమతాలకు లక్ష్యం ఒకటేనని, ఇతర మతాల మీద డాక్టర్ ఫ్రాంక్లిన్ ఆసక్తి చూపటం తనకు సంతోషం కలిగిస్తున్నదనీ స్వామివారన్నారు. 


డాక్టర్ ఫ్రాంక్లిన్ : కాలం గడిచేకొలది ప్రపంచ ప్రజలు దగ్గరౌతున్నారు. రేడియోలాంటి ఆధునిక సమాచార సాధనాల మూలంగా ఈనాడు ఒక క్రైస్తవుడు తన హైందవ సోదరునితో సులభంగా మాట్లాడగలుగుతున్నాడు. దీనివల్ల ప్రపంచమతాలు ఒకదాని కొకటి క్రమేణా సన్నిహితం కావా?


స్వామివారు : ఈనాడు ప్రపంచమంతటా అనేక రాజకీయ సిద్ధాంతాలు కనబడుతున్నాయి. ప్రతి సిద్ధాంతమూ తానే సర్వోత్తమమైన సిద్ధాంతమనీ, ఇతర సిద్ధాంతాలనుండి తాను నేర్చుకోవలసిందేమీ లేదని అంటున్నది. చైనా వంటి దేశాలు తమదే అత్యుత్తమమైన రాజకీయ వ్యవస్థ అని చాటుకుంటున్నాయి. కాని మత విషయంలో అలాంటి అరమరికలకు తావులేదు. ఏ మతంనుండైనా, ఎవరైనా ఏదైనా గ్రహించవచ్చు. అలా గ్రహించటాన్ని ఏమతమూ నిషేధించదు. మతోన్మాదులు మాత్రమే ఇతర మతాల అధ్యయనం మీద ఆంక్షలు విధించేది! కాని శ్రద్ధాళువులైన మతాభిమానులు ఈ ఆంక్షలు పాటించరు. ఈనాటి సమాచార సాధనాలవల్ల ఒక మతస్థుడు మరొక

మతానికి చెందిన విషయాలు సులభంగా గ్రహించగలుగుతున్నాడు. 


డాక్టర్ ఫ్రాంక్లిన్: ఆధునిక జీవితం ఎంతో సంకీర్ణమై పోయింది. వాణిజ్యంగానీ, సమాచార ప్రసారాలుగానీ అతివేగంగా జరుగుతున్నాయి. వ్యామోహా లెక్కువైనాయి. హిందూమతం కొన్నివేల సంవత్సరాలనాటిదని విన్నాను. తన మౌలిక లక్షణాలు వదలక, పెద్దగా మారక పురాతన కాలంనుంచీ యిప్పటివరకూ అది అలాగే నిలిచివుందనికూడా విన్నాను. స్వామివారు నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్నారనీ, అతి సామాన్యమైన ఆహారం తీసుకుంటారనీ, పాదచారులై ప్రయాణిస్తారనికూడా విన్నాను. అయితే అనుక్షణం పెరుగుతున్న రద్దీ, జీవనవేగం, వ్యామోహాలూ, హిందూమతానికీ, ఆధ్యాత్మికతకూ ప్రమాదం కలిగించవంటారా? సామాన్యుడు వీటి ప్రలోభాలకు లోబడకుండా మనగలడంటారా? 


స్వామివారు : పురాతన కాలంలోనూ ప్రలోభాలు లేకపోలేదు. కాని మతాభినివేశం కల సత్పురుషులు ఎన్నో త్యాగాలు చేసి వచ్చే ఆపదలు తప్పించారు. అప్పటికన్నా ఇప్పుడు ప్రలోభా లెక్కువయ్యాయి. వాటినుండి తప్పించుకోవాలంటే ప్రజలు ఇంకా గొప్ప త్యాగాలు చెయ్యాలి. 

డాక్టర్ ఫ్రాంక్లిన్: ఎప్పటినుండో భారతదేశం ఆధ్యాత్మికంగా ప్రసిద్ధికెక్కింది. ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. భౌతికమైన ఈ పురోగతివల్ల దాని ఆధ్యాత్మికత సడలిపోదా? ప్రజల జీవిత విధానంలో ఇంతవరకూ మతం వహిస్తున్న పాత్రలో మార్పు రావాలా?


స్వామివారు : భారతదేశంలో ఇంతకన్నా ఎక్కువమంది యోగులూ, మతాచార్యులూ వుండివుంటే, ఆధ్యాత్మికతకు కలిగిన ముప్పు సులభంగా తొలగిపోయేది. ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులనూ, పొలాల్లో పనిచేసే కర్షకులనూ సహితం ఉత్తేజపరచగల మహానుభావులు ఇప్పుడెందరో అవసరం. అలాంటి మహానుభావులు సామాన్యజనాన్ని కూడా భగవంతుని వైపు మళ్లించగలరు. అప్పుడు పారమార్థికతకు ఏ అపాయమూ వాటిల్లదు. 


పారిశ్రామీకరణంవల్ల గ్రామాలూ, పట్టణాలూ, నగరాలూ ఎంతగా మారినా ప్రజల్లో రక్తగతమైవున్న పారమార్థికత అలాగే వుంది. మతాచారాలు పాటించటంలో ప్రస్తుతం కొన్ని మార్పులు వచ్చాయి. కాని మౌలికమైన మతసిద్దాంతాల్లో ఏమార్పూ రాలేదు. ఈ వాస్తవం ఒక్క హిందూ మతంలోనే కాదు. అన్ని మతాల్లోనూ కనబడుతుంది. 


డాక్టర్ ఫ్రాంక్లిన్: హిందూమతం ఒకప్పుడు ఉచ్చస్థితిలో వుండేదనీ, హిందువులు ఉదాత్తంగా జీవించేవారనీ, కలిపురుషుడు ప్రవేశించాక పతనం ప్రారంభమైందనీ విన్నాను. కల్కి అవతారానికి ఇంకెంతకాలం పడుతుంది? 


స్వామివారు : మతానికి మళ్లీ మళ్లీ ప్రాణంపోసిన మహానుభావులు భారతదేశంలో ఎందరో పుట్టారు. ముఖ్యంగా గడచిన మూడు నాలుగు శతాబ్దాల్లో అలాంటి వారవతరించి ప్రజల్లో మత చైతన్యాన్ని కలిగించారు. వచ్చే శతాబ్దాల్లో కూడా ఇది సంభవించవచ్చు. 


పూర్వయుగాల్లో భగవంతుడు సాక్షాత్కారించాలంటే తపస్సుచేయవలసి వుండేది. కాని కలియుగంలో భగవత్ సాక్షాత్కారానికి నామజపం చాలు. భగవత్ భక్తివుంటే చాలు.


కృష్ణచైతన్య స్వామి గాఢమైన మధురభక్తి ప్రతిపాదించారు. భగవంతుణ్ణి ప్రేమించమన్నారు. భగవంతునికోసం తపించమన్నారు. భగవంతునకు సర్వస్వమూ అర్పించుకోమన్నారు.


ఇలాటి భక్తి ఎంతో కోమలమైంది. సులభమైంది. ఇదికూడా అలవరచుకోని వారున్నారు. ఆచారపరంగా కొంత శైథిల్యం కనబడుతున్నా మొత్తం మీద ఆధ్యాత్మికతకు భంగం కలగదు. ఈ యుగానికి సంబంధించిన సులువులు ఈ యుగానికున్నాయి. ఒకవైపు సముద్రం భూమిని కోసేస్తుంటే మరొకవైపు భూమి సముద్రంలోకి చొచ్చుకుపోతోంది. 


డాక్టర్ ఫ్రాంక్లిన్: మిమ్ము దర్శించే భాగ్యం కలిగినందుకు ఎంతో సంతోషంగా వుంది. మీ ఆశీర్వాదాలు పొందాను. మీ సన్నిధిలో ఇంతసేపున్నాను. ఎంతో ధన్యుణ్ణి. 


స్వామివారు : శ్రద్ధాళువులైనవారు అరుదు. శ్రద్ధాళువులైన కొంతమంది నన్ను చూడటానికి వస్తారు. వారిలో మీరొకరు. మీకూ, మీ శ్రీమతికీ నా ఆశీస్సులు. మీరు నన్నెప్పుడు కలుసుకోవా లనిపించినా వచ్చి కలుసుకోవచ్చు. 


ఆగమ శిల్ప సదస్సు సందర్భంగా ఏర్పాటైన శిల్పాల, పంచలోహ విగ్రహాల దేవాలయ ఛాయాచిత్రాల ప్రదర్శన విభాగాన్ని ఫ్రాంక్లిన్ దంపతులు సందర్శించారు.


మధురలో జరిగిన మీనాక్షీ దేవాలయ కుంభాభిషేకం మహోత్సవానికి ఆహ్వానింప బడినవారిలో, అప్పుడే మద్రాసులో అమెరికా కాన్సల్ జనరల్ గా పదవీ స్వీకారం చేసిన డాక్టర్ ఆల్బర్ట్ బి. ఫ్రాంక్లిన్ కూడా ఒకరు. 1963వ సంవత్సరం డిసెంబరు మాసంలో వెలువడిన “స్పాన్” అనే అమెరికన్ పత్రికలో కుంభాభిషేకాన్ని గురించి వారిలా వ్రాశారు.


“మీనాక్షీదేవి కోసం అపరంజి పూతపూసిన ఒక క్రొత్త విమానాన్ని నిర్మించారు. అందులోకి దేవి వెళ్లవలసివుంది. విమాన గోపురం ముందు బహిరంగ ప్రదేశంలో జనం క్రిక్కిరిసి వున్నారు. ఉన్నట్లుండి వారిలో ఒక సంచలనం బయలుదేరింది. గుమిగూడిన ప్రముఖ వ్యక్తులు ప్రక్కకు తప్పుకుని గౌరవంగా దారియిస్తున్నారు. ఒక వృద్ధుడు, పలితశ్మశ్రుముఖుడు చేతిలో దీర్ఘదండం పుచ్చుకుని వారి మధ్యగుండా నడిచి విమాన గోపురానికి వేసిన నిచ్చెన దగ్గరకు వెళ్లారు. వారే కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకరాచార్యులవారు. మధ్యమధ్య ఆగుతూ చుట్టూ చూస్తూ, పరిసరాలలో వున్న వ్యక్తులనూ గమనిస్తూ వెళ్లారు వారు. వారెవరు? వారి కొక పేరుంది. ఒక నివాసస్థానముంది. ఒక వయస్సుంది. కాని నిజానికి వారు ప్రతిమనిషీ, మానవుడెంత పురాతనుడో అంత పురాతనులు వారు. మానవుడి ఆలోచన ఎంత పురాతనమైందో వారి ఆలోచనలూ అంత పురాతనమైనవి. వారొక మతశాఖకు ప్రతినిధి. తన సర్వస్వమూ వదిలి ఆ మతశాఖ చూపిన దారిలో పయనిస్తున్నవారు. ప్రతి మతమూ కోరే సర్వసంగపరిత్యాగానికి వారు చిహ్నం. క్రీస్తంతటివారు సంపన్నుడైన యువకుడొకడు తన దగ్గరకు వచ్చి “రక్షణకోసం నే నెవరి నాశ్రయించాలి"? అని అడిగినప్పుడు సర్వసంగపరిత్యాగా న్నాశ్రయించాలని ఆదేశించారు.


“ఇక్కడ ఈ సమయంలో ఈ దేవాలయంలో ప్రముఖవ్యక్తులందరికన్నా వారే ప్రముఖ వ్యక్తి. ఆ వయసులో వున్న వారిలో కనబడనంత చైతన్యంతో, ఉత్సాహంతో సన్నటి పొడుగాటి చేతివేళ్ల మధ్య నిచ్చెన గట్టిగా పట్టి చురుగ్గా ఏడెనిమిది మెట్లు క్షణంలో ఎక్కేశారు. తన హస్తదండంతో విమాన శిఖరాన్ని అందుకోదగినంత ఎత్తుకు అందరూ చూస్తుండగానే ఇట్టే చేరారు. ఆనాటి కార్యక్రమంలో అంతమంది జనంలోనూ, అందరు ప్రముఖుల మధ్యా వారే వారొక్కరే కేంద్ర భూమిక వహించారు.”


--- డాక్టర్. ఎ.బి. ఫ్రాంక్లిన్


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

సుభాషితమ్

 *సుభాషితమ్*


మహేశ్వరం మంజుల వాగ్విలాసం

గంగాధరం చంద్రకళావతంసం

గౌరీవరం శ్రీనిధిశైలవాసం

శ్రీమల్లినాధం శిరసానమామి.


*మహేశ్వరుడును, మృదువైన వాగ్విలాసము కలవాడును, గంగను ధరించు వాడును, చంద్రకళ శిరోభూషణముగ కలవాడును, పార్వతీ భర్తయు, సంపదకు నిధియైన పర్వతము నివాసముగా కలవాడునైన శ్రీమల్లికార్జున స్వామికి శిరస్సుతో నమస్కరించుచున్నాను*.... 

*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

*సంకలనం*

హిందూధర్మం, సనాతనధర్మం

 🎻🌹🙏నాయనమ్మ_ఉవాచ

   ఒరేయ్ అలా మడి ఆచారాలు, శుచి, శుభ్రత లేకుండా ఏంటిరా ఆ అప్రాచ్యపు పనులు..


🔸 చెప్పులు ఇంట్లోకి తీసుకు రాకురా.


🔸 బయటి నుండి రాగానే కాళ్ళు కడుక్కొరా


🔸 స్తానం చేసిన తరువాత మాత్రమే తిను 


🔸 బయట తిరిగి వచ్చిన తరువాత స్థానం చేసి , వేరే బట్టలు వేసుకొని ఇంట్లోకి రా 


🔸 ఉతకని బట్టలు కట్టు కోవద్దు 


🔸 ఏదైనా తినే ముందు చేతులు కడుక్కో 


🔸 ఎవర్ని బడితే వాళ్ళని తాకి , వాళ్ళు ఎంగిలి చేసినది నువ్వుతినకు


🔸 శాఖాహారం మాత్రమే తిను 


🔸 కుక్కల్ని , పిల్లుల్ని అలా ఒళ్ళో కూర్చో బెట్టుకొని ముద్దుచేయకు 


🔸 బయట వండినవి , నిన్న వండినవి తినకు , వేడిగా ఉన్నప్పుడే తిను 


🔸 మడి కట్టుకొని వండు  , నేను వంట చేస్తు న్నప్పుడు నన్ను ముట్టుకోవద్దు 


🔸 పిల్లల్ని నేరుగా ముద్దాడద్దు


🔸 పాత్రలు ఎండలో బోర్లా పెట్టు 


🔸 శవాన్ని ముట్టు కోవద్దు , చనిపోయిన వారి కుటుంబ సభ్యులను రెండు వారాలదాకా ముట్టుకోవద్దు,  వారితో తిరగ వద్దు


ఒకప్పుడు మన ఇళ్ళల్లో పెద్దలు ఇలా అంటే చాదస్తం అని చిరాకు పడే వాళ్ళం. 

ఇప్పుడు ప్రపంచం మొత్తానికి చాదస్తం పట్టుకుంది.


హిందూమతం కాదు మనది హిందూధర్మం, సనాతనధర్మం సనాతనవేదం.. 

👏👏🌷🌹🙏🌹🌷👏👏


     🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏

*శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

 :

*శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ .ఇది నిజంగా అద్భుతం.!!*


*భారతదేశంలోని నేటి 29 రాష్ట్రాల పేర్ల మొదటి* *అక్షరాలను ఒక దోహాలో క్రమంగా పేర్కొన్నాడు.* *అత్యంత ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ అంశు.* *దోహాలోని అక్షరాల వరుసను కింద పేర్కొన్న రాష్ట్రాల మొదటి అక్షరాలనూ పరిశీలించండి.*


*"రామ నామ జపతే* 

*అత్రి మత గుసి ఆవు"*

*"పంక మే ఉగోహమి* 

*ఆహి కే ఛబి ఝాఉ"*


*రా* - రాజస్థాన్

*మ* - మహారాష్ట్ర

*నా* - నాగాలేండ్

*మ* - మణిపూర్

*జ* - జమ్మూ కాశ్మీర్

*ప* - పశ్చిమ బెంగాల్

*తే* - తెలంగాణ

*అ* -  అస్సామ్

*త్రి* - త్రిపుర

*మ* - మధ్యప్రదేశ్

*త* - తమిళనాడు

*గు* - గుజరాత్

*సి* - సిక్కిం

*ఆ* - ఆంధ్రప్రదేశ్

*ఉ* - ఉత్తర ప్రదేశ్

*పం* -పంజాబ్

*క* - కర్నాటక

*మే* -మేఘాలయ

*ఉ* - ఉత్తరాఖండ్

*గో* - గోవా 

*హ* - హరియాన

*మి* - మిజోరమ్

*అ* - అరుణాచల ప్రదేశ్

*కే* - కేరళ

*ఛ* - ఛతీస్ ఘడ్

*బి* - బిహార్

*ఝా* - ఝార్ఖండ్

*ఉ* - ఉడిసా


*ఇది నిజంగా అధ్బుతమైన అక్షరాలు  "రామ నామ మంత మధురానుభూతిని కలిగిస్తుంది"*

జై శ్రీ రామ..🚩🚩

B. రామబ్రహ్మం