8, డిసెంబర్ 2023, శుక్రవారం

సుభాషితం

 *జైశ్రీరామ్*


                              31-5-2020

                              అభ్యాసం-21


                            *సుభాషితం*


"అన్న గ్రహణకె సమయేమే

  విచారు మన్ మే కర్నాహై

  కిస్ హేతూసే ఇస్ శరీరుకా

  పాలన్ పోషన్ కర్నాహై |

  హే పరమేశ్వర్ ఏక్ ప్రార్ధనా

  నిత్య తుమ్హారే చరణోంమే

  లగ్జాయే తన్ మన్ ధన్ మేరా

  మాతృభూమికీ సేవామే"||


                                *భావం*


ఆహారం తీసుకొనే సమయంలో మనసులో ఒక ఆలోచన చెయ్యాలి. నేను ఆహారాన్ని దేనికోసం తీసుకుంటున్నాను.కేవలం ఆకలి తీర్చుకుని, కడుపు నింపుకుని ఈ శరీరాన్ని పోషించటం కోసమేనా లేక అంతకుమించి ఏమైనా ఉందా! అప్పుడు అనిపిస్తుంది కేవలం దానికోసమే కాదు అని .

      అప్పుడు భగవంతుని ఇలా ప్రార్ధించాలి.ఓ పరమేశ్వరా! నా శరీరము,మనసు, ధనము (తన్ మన్ ధన్) మాతృభూమి సేవకు ఉపయోగపడేలా చెయ్యి.అదే నా కోరిక.


                         *అమృతవచనం* 


పరమ పూజనీయ *గురూజీ* ఇలా అన్నారు:

వ్యక్తి సంతత వ్రత, సాధనాలద్వరా తనను తాను ఉద్ధరించుకోవాలి.తన్ను తాను ఉద్థరించుకోలేనివాడు ఇతరులను ఉద్ధరించటమనేది దుష్కర మయిన విషయం.ఉత్తమకార్యం చేయడానికి పూనుకున్నవాడు తాను చేపట్టిన కార్యంపట్ల వైమనస్యాన్ని కలిగి ఉండరాదు.మాటవల్లనే మిత్రత్వం వస్తుంది.మాటవల్లనే శతృత్వం వస్తుంది.అందువల్ల వ్యక్తి ఎప్పుడూ వాక్ నియమాన్ని పాటించాలి.అంతేకాదు సర్వలోక మనోహరమైన మధుర వాక్కును అలవర్చుకోవాలి.విరోధులైన వారిలో మార్పు తీసుకొనిరావాలంటే వారితో యుక్తియుక్తంగా మాట్లాడాలి.సౌమ్యంగా మాట్లాడాలి.స్వానుభవ పూర్వకమైన ప్రమాణాలు చూపిస్తూ మాట్లాడాలి.

      పెద్దలను తండ్రివలె, స్త్రీలను తల్లివలె,సమవయస్కులను సోదరులవలె, బాలురను-శిశువులను పుత్రులువలె మన్నించాలి.ఇతరుల కార్యాన్ని తన సొంతపనిగా పూనుకొని చేసిపెట్టాలి.

       ఒక్కడే కూర్చుని భుజించకూడదు, నలుగురితో కలిసి భుజించాలి.ఏకాంతంగా సమయాన్ని వ్యర్ధం చేయకూడదు.నలుగురితో కలిసిమెలిసి జీవించడం నేర్చుకోవాలి.ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.ఉచిత వేషం ధరించి ఎప్పుడూ మందస్మిత వదనడై కనిపించాలి.హితముగా,మితముగా భుజించాలి.మంచివాళ్ళతో స్నేహం చేసి సత్సాంగత్యాన్ని వృద్థిపరచుకోవాలి.పరోపకారాన్ని పరమ ధర్మంగా, ప్రయత్నాన్ని దైవంగా,సౌశీల్యాన్ని తోడునీడగా భావించాలి.సచ్ఛీలుడైన వ్యక్తికి ప్రేమ మరణ పర్యంతం ఉండాలి,క్రోధం క్చణకాలం ఉండాలి, ద్వేషం అసలు ఉండకూడదు.


                      శ్రీవేంకటేశ్వర్లు వబిలిశెట్టి


.

ఆలోచనాలోచనాలు

 *** ఆలోచనాలోచనాలు *** అక్షరరూపం దాల్చిన ఒక సిరాచుక్క; లక్ష మెదళ్ళకు కదలిక *** అవధాన మధురిమలు ***  శతావధాని శ్రీ కాకర్ల కొండల రావు*** సమస్యాపూరణములు***    1* "" మరణముఁ గోర వచ్చినది మానిని నీ వెటు లాదరింతువో""                      ఉ. సరసుడ వంచు సూనశరాస్త్రవరిష్టుడవంచు పండితా/ భరణుఁడ వంచు సన్మధుర వాక్చతురత్వయుతుండవంచు భా/ సుర నవయౌవన స్ఫురిత సుందరగాత్రుడవంచెఱింగి కా/మ రణముఁగోర వచ్చినది మానిని నీ వెటు లాదరింతువో!                       2* "" తల చేతులలోనయుండు దలప జగంబుల్.""                       కం. కలస్థావర జంగమ జం/ తులఁబుట్టింపగఁ బెంప ద్రుంపంగ సమ/ ర్థులగుట ముగురమ్మల నే/ తల చేతులలోన నుండుఁదలప జగంబుల్.     3* "" పాలను దునియలుగ జేసె బటు భల్లమునన్.""       కం. చాలగద్రావి యొకండమి/ త్రాళి వధింపగ నేగి యా సదనముల/ న్వ్రేలెడు ఛాయపటరూ/ పాలను దునియలుగ జేసె బటు భల్లమునన్.                         4*"" కాయలు పండ్లుగావు మరి గాయలుగావల పండ్లు కోమలీ.""                   ఉ. ఆయతదాన వాల్యాయ మృగాంగుడనే నల రావణుండ రం/ భా యెద నిన్నె కోరితిని వంచన సేయగ నెంచబోకు మ/ మ్మాయలమారి నూర్వశిని మానసమందున నొల్లసుంతయుం/ గాయలు పండ్లుగావు మరిగాయలుగా వలపండ్లు కోమలీ!                                 5*"" తల్లిని జూచి కౌగిటికి దార్చి రమింపగ జొచ్చె నయ్యెడన్.""                        ఉ. పల్లవ పత్ర పుష్ప ఫలభాసురమైన వసంతవేళ రా/ నుల్లములోని మోహభర నేరక పాండురాజు వి/ ద్యుల్లతవోలె కట్టెదుట నొప్పెసలారెడు ధర్మపుత్రు మా/ ర్తల్లని జూచి కౌగిటికి దార్చిరమింపగ జొచ్చె నయ్యెడన్.                            6* ""భీష్మద్రోణుల కావహంబు జరిగెన్ భీమంబుగా నయ్యెడన్.""     శా. శ్లేష్మంబందునపడ్డ మక్షికమటుల్ చిత్తంబు చొక్కొండగా/ నూష్మశ్రేణిని వుడ్చికొంచు రిపు వీరోత్తంసముల్ చేడ్పడన్/ గ్రీష్మాదిత్యుని భంగి మంటలొలయం గ్రీడించు నక్క్రీడితో/ భీష్మద్రోణుల కావహంబు జరిగెన్ భీమంబుగా నయ్యెడన్.         దత్తపదులు;---                     1*" ముండ -- దండ -- పండ -- బండ -- నిండ -- కుండ -- కొండ"" పదములతో "" రామాయణార్థములో "" పద్యం .                              చం. పొలుపుగ వచ్చి శూర్పణఖ ముండ రఘూద్వహు దండ పండగా/ గులుకుచు బండ మాటలను కోరిక నిండగ బల్కి డెంద మం/ దొలసిన కూర్మి జంకు గొనకుండ సమీపము జేరరాఘవుం/ డులుకున లేచి పల్కకుమికొండని యవ్వల ద్రోసె దానినిన్.                       2* ""కర్పూరము -- దేవానాంప్రియులు -- పరమార్థచింత -- కవీశాగ్రణి"" పదములతో "" శ్రీ విష్ణు పూజ"" పై పద్యం.      మ. బరువౌ పాపము వాపుకోదలచు దేవానాంప్రియుల్ భక్తిమై/ వర కర్పూరము ధూపవస్తువులు పుష్పశ్రేణులుం గూర్చి దు/ ష్కర వృత్తిం బరమాత్మచింత నెపుడుం గంజాక్షునిం గొల్చుచో/ దెఱలుం బాపము, ముక్తియుంగలుగు నెందేనిం గవీశాగ్రణీ!               ( డా. రాపాక ఏకాంబరాచార్యులవారి అవధాన విద్యా సర్వస్వం సౌజన్యంతో)                         "" ఆనో భద్రాః, క్రతవోయంతు విశ్వతః!"" మనకు అన్ని వైపులనుండి ఉదాత్త భావములు లభించుచుండును గాక!           ( Let noble thoughts come from every side.)  తేది 6--12--2023, బుధవారం, శుభోదయం.

మోడీ రెండో దెబ్బ

 మోడీ రెండో దెబ్బ రాబోతోంది,

 చట్టం 30-A రద్దు చేయబడవచ్చు-.

 నెహ్రూ హిందువులకు చేసిన ద్రోహాన్ని సరిదిద్దడానికి మోదీజీ పూర్తిగా సిద్ధమయ్యారు.

 మీరు "లా 30" మరియు లా "30A" గురించి విన్నారా?

 హిందీలో "30A" అంటే ఏమిటో తెలుసా?

 మరింత తెలుసుకోవడానికి ఆలస్యం చేయవద్దు ⬇

 30-A అనేది రాజ్యాంగంలో ఉన్న చట్టం.

 నెహ్రూ ఈ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చాలని ప్రయత్నించినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీవ్రంగా వ్యతిరేకించారు.

 సర్దార్ పటేల్, "ఈ చట్టం హిందువులకు ద్రోహం, కాబట్టి ఈ చట్టాన్ని రాజ్యాంగంలోకి తీసుకువస్తే, దానికి వ్యతిరేకంగా నేను మంత్రివర్గం మరియు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను.

 అంతిమంగా సర్దార్ పటేల్ కోరికకు నెహ్రూ తలవంచాల్సి వచ్చింది.

 కానీ దురదృష్టవశాత్తు తెలియదు.. ఈ ఘటన జరిగిన కొన్ని నెలలకే సర్దార్ వల్లభాయ్ పటేల్ హఠాన్మరణం చెందాడా..?

 సర్దార్ పటేల్ మరణానంతరం నెహ్రూ వెంటనే ఈ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చారు.


 30-A అంటే ఏమిటి, దాని ఫీచర్లను మీకు చెప్తాను!...

 ఈ చట్టం ప్రకారం - హిందువులు తమ "హిందూ మతాన్ని" బోధించడానికి/బోధించడానికి అనుమతించబడరు.  "చట్టం 30-A" అతన్ని అనుమతించదు లేదా అధికారం ఇవ్వదు.....

 కాబట్టి హిందువులు తమ ప్రైవేట్ కళాశాలల్లో హిందూ మతాన్ని బోధించకూడదు.

 హిందూ మతాన్ని బోధించడానికి కాలేజీలు ప్రారంభించకూడదు.  హిందూ మతాన్ని బోధించడానికి హిందూ పాఠశాలలు ప్రారంభించకూడదు.  చట్టం 30-A ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలల్లో హిందూ మత సంస్కృతిని బోధించడానికి ఎవరికీ అనుమతి లేదు.

 ఇది వింతగా ఉంది, (30-A) నెహ్రూ తన రాజ్యాంగంలో *"లా 30"*లో మరొక చట్టాన్ని చేసారు.  ఈ "లా 30" ప్రకారం ముస్లింలు, సిక్కులు మరియు క్రైస్తవులు తమ మత విద్య కోసం ఇస్లామిక్, సిక్కు, క్రైస్తవ మత పాఠశాలలను ప్రారంభించవచ్చు.

 ముస్లింలు, సిక్కులు మరియు క్రైస్తవులు తమ మతాన్ని బోధించవచ్చు.

 చట్టం 30 ముస్లింలకు వారి స్వంత 'మదరసా'ను ప్రారంభించేందుకు పూర్తి హక్కును మరియు అనుమతిని ఇస్తుంది మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 వారి స్వంత మతపరమైన పాఠశాలలు మరియు కళాశాలలను స్థాపించడానికి మరియు బోధించడానికి క్రైస్తవులకు పూర్తి హక్కు మరియు అనుమతిని ఇస్తుంది.  మీ మతాన్ని ఉచితంగా ప్రచారం చేయండి... ఇందులోని ఇతర చట్టపరమైన అంశం ఏమిటంటే, హిందూ దేవాలయాల డబ్బు మరియు ఆస్తులన్నీ ప్రభుత్వ విచక్షణకు వదిలివేయవచ్చు, హిందూ భక్తులు హిందూ దేవాలయాలకు ఇచ్చే డబ్బు మరియు ఇతర విరాళాలన్నీ రాష్ట్ర ఖజానాకు వెళ్తాయి.  లోపలికి తీసుకోవచ్చు.

 అదే సమయంలో, ముస్లిం మరియు క్రైస్తవ మసీదుల నుండి విరాళాలు మరియు భిక్ష క్రైస్తవ-ముస్లిం సమాజానికి మాత్రమే ఇవ్వబడుతుంది.  ఈ "చట్టం 30" యొక్క లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి.

 కాబట్టి, చట్టం 30-A" మరియు "చట్టం 30" అనేది హిందువులపై ఉద్దేశపూర్వక వివక్ష మరియు ఉద్దేశపూర్వకంగా క్రమబద్ధమైన ద్రోహం.

 ఈ రోజు హిందువు జానపద కథలకే పరిమితమైందనే విషయాన్ని అందరూ బాగా అర్థం చేసుకోవాలి.  హిందువులకు వారి గ్రంధాల జ్ఞానం లేదు.  నేర్చుకో

 ఇతరుల పట్ల అవగాహన మనమందరం సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం.  చదవండి, నేర్చుకోండి మరియు వ్యాప్తి చేయండి..

 దీనికి కారణం ఆర్టికల్ 30-A

 మన దేశంలో ఎక్కడా భగవద్గీత బోధించలేము.

 చదివిన తర్వాత, మీకు సరిగ్గా అనిపిస్తే, దయచేసి ఫార్వార్డ్ చేయండి.  కాబట్టి ప్రతి ఒక్కరూ టికి, దయచేసి దీన్ని 5 మందికి ఫార్వార్డ్ చేయండి.*

 *🙏🙏 ధన్యవాదాలు.  *



వాలుకుర్చి

 వాలుకుర్చి (కవిత )

_________________________

     -లలితా చండీ 


రాజుగారి  ఇంట్లో 

రాజసంగా వెలిగిన కుర్చీ 

 పెద్ద వారి హోదాలకు 

దర్పంగా నిలిచిన కుర్చీ 

 

పాత తరానికి గుర్తుగా 

తాతగారికి ఇష్టమైనది

కొత్తతరం కూర్చో లేనంతగా మెరిసిన కుర్చీ


కళ్లజోడు  సరి  చేసుకొంటూ

వార్తాపత్రిక  చదివేది,

తాతగారు కూర్చోని

పిల్లలకు పాఠాలు చెప్పే

తీయని  స్మృతులకు నెలవైనది


కుర్చీ కర్ర తీసేసి 

ట్యూషన్ మాస్టర్ ని పడెేయాలని

అమ్మమ్మ చూసేలోగ

కర్ర దాచేసే

ఆకతాయి  పిల్లలకు

ఆ కర్రతోనే

దెబ్బలకు అనువైనది


అలసివచ్చిన నాన్న

సేదతీరేందుకు సుళువైనది

అమ్మ ఇచ్చే కాఫీతో

అపూర్వమైన దృశ్యమైంది


చాలా కాలం హాలులో

ఆపై వరండాలోకి చేరి 

తరువాత స్టోర్ రూమ్ లోకి

మారిపోయింది

కాలాంతరంలో కొత్త రూపంలో   

దర్శనం ఇచ్చిన ఓ వాలు కుర్చీ!  

మా జ్ఞాపకాల మడతలలో 

ఎప్పటికీ నువ్వు

మడత కుర్చీవేగా!


 🔴🟢🟣

జ్వరము లక్షణాలు

 జ్వరము లక్షణాలు - నివారణా యోగాలు .


    శరీరం వణుకుట, పెదవులు , నోరు ఆరిపోవుట, నిద్రపట్టకపోవుట, తుమ్ము రాకుండా ఉండటం, తల ఇతర భాగాలు నొప్పులుగా ఉండటం, నోటికి రుచి తెలియకపోవటం , మలబద్దకం, కడుపునొప్పి, కడుపుబ్బరం, ఆవులింతలు ఇటువంటి లక్షణాలు అన్నియు వాతం వలన కలుగు జ్వర లక్షణాలు .


     బాగా వొళ్ళు కాలుట, అతిసారం, సరిగ్గా నిద్రపట్టకపొవుట, వాంతులు , నోటిలో పుండుపడుట, నోరు చేదుగా ఉండటం, మూర్చ, తాపము , దాహము , మలమూత్రాలు, కళ్లు పచ్చగా ఉండటం వంటి లక్షణాలు అన్నియు పిత్త సంబంధ జ్వర లక్షణాలు .


     శరీరం బాగా చలిగా ఉండటం, సోమరితనం, నోరు తియ్యగా ఉండటం , చర్మం పాలిపోవుట , మూత్రం తెల్లగా రావటం, శరీరం బిగుసుకుపోయినట్టు ఉండటం, పొట్ట, శరీరం బరువుగా ఉండటం , అతినిద్ర, మలము కొద్దిగా వచ్చుట, నోటిలో ఎక్కువ నీరు ఊరట, మూత్రం ఎక్కువుగా రావటం, వాంతులు , అరుచి , జీర్ణం కాకుండా ఉండటం, దగ్గు, జలుబు , కళ్లు తెల్లగా ఉండటం ఈ లక్షణాలు అన్నియు కఫ సంబంధ జ్వర లక్షణాలు .


         పైన చెప్పిన విధముగా జ్వరం వచ్చినపుడు లక్షణాన్నిబట్టి దేని సంబంధమైన జ్వరమో నిర్ణయించుకొని దానికి తగ్గ ఔషథాన్ని నిర్ణయించుకుని వాడవలెను.


 నివారణా యోగాలు  -


 *  తిప్పతీగ , మోడి , శొంటి మూడు సమాన బాగాలుగా తీసుకుని కషాయం చేసుకుని సేవిస్తున్న వాతజ్వరం నశించును.


 *  దురదగొండి వేర్లు, పర్పాటకం, ప్రేంఖనం , నేలవేము , అడ్డసరం, కటుకరోహిణి వీటి కషాయం ఎక్కువుగా చక్కర కలిపి తీసుకుంటే దాహము , రక్తపిత్తం, జ్వరం, తాపం నివారిస్తాయి.


 *  పర్పాటకం , చందనం,వట్టివేళ్ళు , ధనియాలు  వీటి కషాయం తీసుకుంటే పైత్య జ్వరం వెంటనే నివారణ అగును.


 *  వాము , వస, శొంటి, పిప్పళ్లు , నల్ల జీలకర్ర సమాన చూర్ణాలను తీసుకుని కలిపి కొంచం నీరు కలిపి శరీరానికి మర్దన చేయుచున్న టైఫాయిడ్ జ్వరములో వచ్చు శరీరపు మంటలు తగ్గును.


 *  బెత్తెడు వేపచెక్క దంచి గ్లాసున్నర నీటిలో వేసి మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు లోపలికి ఇచ్చి పడుకోపెట్టి లొపలికి గాలి చొరబడకుండా నిండగా దుప్పట్లు కప్పవలెను. లోపల అంత చెమట పట్టి జ్వరం తగ్గును. ఈ విధముగా మూడుపూటలా చేయుచున్న అన్నిరకాల జ్వరాలు నశించును.


 *  నిమ్మకాయ రసంలో పంచదార కలిపి తాగించుచున్న జ్వరం వల్ల వచ్చు తాపం తగ్గును.


 *  కృష్ణ తులసి ఆకులు 50 గ్రాములు , మిరియాలు 10 గ్రాములు రెండూ కలిపి నూరి బటాణిగింజ అంత మాత్రలు చేసి పూటకి ఒక మాత్ర చొప్పున ఇచ్చి వేడి నీరు తాగించవలెను . చలిజ్వరం నందు పూటకి రెండు మాత్రలు చొప్పున ఇవ్వవలెను.  దీనివలన సాధారణ జ్వరములు, మలేరియా జ్వరములు కూడా నశించును.


 *  గుంటగలగరాకు జ్వరం ఉన్నవారు కొంచం కొంచం నమిలి మింగుచున్న జ్వరం తగ్గును.


 *  రావిచెట్టు ఆకులు 5 , మారేడు ఆకులు 15 , తులసి ఆకులు 45 ఈ వస్తువులను మెత్తగా నూరి అర లీటరు నీళ్లలో కలిపి కషాయం కాచి పావులీటరులో సగం వచ్చేంత వరకు మరిగించి దింపి వడపోసుకొని ఉంచుకుని గంట గంటకు 10ml చొప్పున తాగించుచున్న రెండు రోజుల్లొ టైఫాయిడ్ జ్వరం నశించును.


 *  గుంటగలగర చిగుళ్లు 7 , మిరియాలు 7 కలిపి నూరి ఒక్క మోతాదుగా రోజూ రెండుపూటలా ఇచ్చుచుండిన యెడల చలిజ్వరం తగ్గును.


 *  5 తులసి ఆకులు , 5 మిరియపు గింజలు కలిపి నూరి 60ml నీరు , 15ml తేనె కలిపి భోజనానికి గంట ముందుగా ఉదయం , సాయంత్రం కలిపి ఇచ్చుచుండిన టైఫాయిడ్ జ్వరం తగ్గాక వచ్చు బలహీనత నివారించబడును.


 *  వరిపేలాలు చూర్ణం చేసి కషాయం పెట్టి ఆ కషాయంలో కొంచం పటికబెల్లం పొడి కలిపి తాగించున్న పైత్యం వలన వచ్చు జ్వరం తగ్గును.


 * గోధుమల కషాయం లో పటికబెల్లం పొడి కలిపి తాగించుచున్న పైత్యజ్వరం నశించును.


      జ్వరం తగ్గుటకు పథ్యం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. సరైన పథ్యమును పాటిస్తూ ఔషధాలను తీసుకొనుచున్న ఎటువంటి జ్వరం అయినా నశించును.


  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  


     కాళహస్తి వేంకటేశ్వరరావు 


  అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          9885030034

లయ-లయం

 

లయ-లయం 

మనం తరచుగా రెండు పదాలను వింటూవుంటాము. "లయ" అంటే ఒక క్రమ పద్దతిలో నడిచే కదలిక కానీయండి శబ్దం కానీయండి దానిని మనం లయ అంటాము. ఉదాహరణకు మన శ్వాస , నడక, హృదయ స్పందన, కదిలే చక్రము ఏదైనా కానీయండి. ఇంకా ఇప్పటి ఆధునిక సైన్సు ప్రకారం చుస్తే విదుత్ పౌనపుణ్యం, లేక కంప్యూటర్ వేగాన్ని సూచించే పౌనపుణ్యం (హెర్డ్జి) ఇలా చుప్పుకుంటూ పొతే మనకు  అన్నీ కూడా లయబద్దంగానే గోచరిస్తాయి.  

బౌతికంగా ఇవి అయితే ఇక సంగీతము, నృత్యము శాస్త్రాలు పూర్తిగా లయమీదనే ఆధారపడి  వున్నాయి. విషయం ప్రతి వారికి తెలిసినదే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచం మొత్తం ఒక క్రమపద్ధతిలో వున్నది అదే లయ ప్రకారంగా వున్నది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే లయ లేనిది జగత్తు లేనే లేదు. మన భూమిని కాకుండా ఖగోళాన్ని ఒక్కసారి గమనిస్తే మనకు అంతా లయప్రకారమే గోచరిస్తుంది. సూర్య, చంద్ర, నక్షత్ర గతులు కూడా పూర్తిగా లయ ప్రకారమే ఉన్నాయిమనకు తెలుసు భూమి తనచుట్టూ తానూ తిరగటానికి ఒక్కరోజు పడుతుంది అది ఒక లయ సమయంలోకూడా తన వేగాన్ని మార్చుకోదు అంటే ఒక సారి సగం రోజు ఇంకొకసారి రెండురోజులు అలా ఒకవేళ అదే జరిగితే భూప్రపంచం మొత్తం  నాశనం అవుతుందిఅదే విధంగా చంద్రుడు భూమి చుట్టూ ఒక నెలరోజుల సమయంలో తిరుగుతాడుచంద్రగతి కూడా అనాదిగా అదే విధంగా వున్నదిఇలాగే సూర్య భగవానుడు కూడా ప్రతి గ్రహం, నక్షత్రం పాలపుంతలో ఒక క్రమ వేగంతో సంచరిస్తూవుంటాయిపూర్తి దృశ్యమాన జగత్తు  లయమీదనే ఆధారపడి వున్నది. ఇంకొక విషయంకూడా మనం గమనించాలి ఒక గ్రాహం ఇంకొకగ్రహంకు తాకకుండా పరి బ్రమించటం కూడా లయ మీదనే ఆధారపడి వున్నది. లయ తప్పితే గ్రహగతులు తప్పుతాయి అని వేరే చెప్పక్కరలేదు

ఒక వీధిలో వెళ్లే వాహనాలు వేటి లయ (speed) వాటికి ఉంటుంది ఎప్పుడైతే లయ మారుతుందో లేక లయ ఆగుతుందో అప్పుడు ప్రమాదాలు జరగటం మనం చూస్తూవున్నాము. ఒక మనిషి వీధిలో నడుచుకుంటూ వెళుతున్నాడు అనుకోండి అంటే అతను ప్రతి అడుగు కూడా లయ బద్దంగా వేస్తూ వున్నాడని అర్ధం. ఒకవేళ అతను అలా కాకుండా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వేయాలన్న వేయలేడు తన వేగాన్ని మారుస్తే పర్యావసానంగా లయ మారుతుందికానీ లయ మాత్రం ఉంటుంది. వేగంగా ప్రయాణిస్తే వేగవంతమైన లయ ఉంటుంది నిదానంగా ప్రయాణిస్తే తక్కువ వేగవవంతమైన లయ ఉంటుందికానీ లయ మాత్రం ఎప్పుడు ఉంటుంది. మనిషి జీవితం మొత్తం ఒక లయ బద్దంగానే కొనసాగుతుంది. పుట్టినప్పటి నుండి చరమ దశ వరకు 

లయ బద్దంగా ఉండటమే ఒక నటన అదే ఈశ్వరుడు సృష్టించిన నాట్యం. అందుకే ఈశ్వరునికి నటరాజు అనే పేరు కూడా వున్నది పరమేశ్వరుడు రచించిన నాటకంలో ప్రతిదీ ఒక పాత్ర పోషిస్తూవుంటుంది. మనుషుల పాత్ర మనుషులది పశు పశ్యదుల పాత్ర వాటిదికొన్ని నిర్జీవులు కొన్ని సజీవులు జీవం ఉండటం ఉండక పోవటం కూడా పరమేశ్వరుని లీలలో భాగమే విషయం ప్రతి సాధకుడు తెలుసుకోవాలి

లయం అంటే ఏమిటో కాదు లయ ఆగటమే లయం. సాధారణంగా మనం నిత్యం ఏదో ఒక పని చేస్తూ ఉంటాము అంటే అది లయ, కొంత సమయం తరువాత పని  అయిపోతుంది. అంటే లయ  ఆగిపోతుంది. అదే లయం ఎందుకంటె అప్పుడు పని లేదునీవు హైదరాబాదు నుండి కాశీకి ప్రయాణం చేయాలని రైలు ఎక్కావు రైలు కదిలింది అంటే లయ మొదలైంది. కొంతకాలం తరువాత నీ రైలు కాశీని చేరుకుంది అంటే అప్పటి దాకా రైలుకు వున్న లయ ఆగిపోయింది అంటే లయ లయంగా నిశ్చలంగా మారింది అని అర్ధం

ప్రతి మనిషి శ్వాస కూడా ఒక లయ, ఏదో ఒకరోజు లయ ఆగిపోతుంది అంటే లయం  అవుతుంది. దాని అర్ధమే జీవన చివరి  ఘట్టం. లయను, లయాన్ని రెంటిని శాసించేవాడే పరమేశ్వరుడు విషయం మనం తెలుసుకోవాలిఎప్పుడైతే లయకారుని స్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతామో అప్పుడే మనకు మనస్సులో ఒక భావన కలుగుతుంది అదేమిటంటే మనలను కాపాడేవాడు, రక్షించేవాడు కరుణించేవాడు మోక్షసిద్దిని ఇచ్చేవాడు పరమేశ్వరుడు తప్ప వేరొకరు  కాదని. నిత్యం శివాలయంలో మనకు లయ, లయం రెండు దృగ్గోచరితం అవుతుంటాయి. మన మహర్షులు మనకు ప్రతి క్షణం మనం ఎలా మసలుకోవాలి, ఎలాంటి ఆలోచనలు చేస్తే మనం జన్మరాహిత్యాన్ని పొందగలం అనే విషయం అను క్షణం గుర్తుచేస్తున్నారు.  

శివాలయలో పరమశివుని లింగం మీద ఒక్కొక్క చుక్కగా జలం పడటం మనం చూస్తూవుంటాము జల పాత్రలో నీరు ఒక రోజో లేక కొన్ని గంటలో పడి కాళీ అయి  పోతుంది. అదే విధంగా మానవ జీవితంలోని కాలం కూడా ఒక్కొక్క క్షణం కరిగిపోయి చివరికి కాళీ అయి పోతుందిఅంటే అక్కడ అతని కాలం ఆగిపోతుందికాబట్టి కాలం చాలా విలువైనది అని  గమనించాలి. మరి కాలాన్ని ఎలా వినియోగించాలి అంటే ఎలాగ అయితే పాత్రలోని నీరు చుక్క చుక్కగా పరమేశ్వరుని అభిషేకం చేయటానికి ఉపయోగపడుతున్నదో అదే విధంగా మన మనస్సు ప్రతి క్షణం దేవదేవుని అంటే పరమశివుని పాదాలమీదనే ఉండి నిత్యం ఆయనతోటె సంబంధం కలిగి ఆయననే పట్టుకుంటే అప్పుడే మనకు ఆయన కరుణా కటాక్షం కలుగుతాయి

శివుడు బాహ్యంలో కాదు మాన హృదయాంతరాళాల్లో నిక్షిప్తమై వున్నాడు సత్యాన్ని తెలుసుకొని మన హృదయేశ్వరున్ని నిత్యం అను క్షణం తలుస్తూ, కొలుస్తూ ఉంటే తప్పకుండ కైవల్యం లభిస్తుంది. అది ఎలా అంటే 

నేను తీసుకునే శ్వాస అజపా జాపంగా భావించి నిత్యం అజపాజపం చేయాలి. అంటే రోజుమొత్తం నేను జపంలోనే ఉన్నాననే భావనలో ఉండటంనేను స్నానం చేస్తున్నాను అంటే శివునికి అభిషేకం చేస్తున్నాననే భావనలో  ఉండాలి. నేను మల మూత్ర విసర్జన చేస్తున్నాను అంటే శివుని వద్ద మాలిన్యాన్ని తొలగిస్తున్నాను అని  నేను  మాట్లాడుతున్నాను అంటే శివుడు మాట్లాడుతున్నాడు అనే భావన ఇలా నా పూర్తి దైనందిక జీవనం శివునిదే కానీ నాది కాదనే భావనలో సాధకుడు ఉంటే నిత్య కైవల్యమే స్థితి మనం చెప్పుకునే అంత  సులభం కాదు కఠోర దీక్షతో, అకుంఠిత పరిశ్రమతో మాత్రమే సాధ్యంకానీ అసాధ్యము మాత్రం కాదు. "కృషితో నాస్తి దుర్భిక్షం"

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు 

మీ భార్గవశర్మ

 

సుభాషితమ్

 🕉️🪔  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪔🕉️

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔


*అంధస్యమే హృతవివేక మహాధనస్య*

*చోరై ర్మహాబలభి రింద్రియనామధేయైః* |

*మోహాంధకారకుహరే వినిపాతితస్య*

*లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్* ||


_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం - 15_* _


*తా*: ఓ నరసింహ ప్రభూ! మహాబలవంతులగు

ఇంద్రియములనెడి దొంగలు నా వివేక ధనమును

దొంగిలించుకొని, అజ్ఞానమును అంధకారపు గుహలో

త్రోసివేసిరి. కన్నులు కాన రాకున్నవి. నాకు చేయూత నిచ్చి, ఆ గుహ నుండి బయటకు తీసి నన్నుద్ధరింపుము. *లక్ష్మీదేవితో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము*.

రైలు ప్రయాణంలో

 నేను రైలు ప్రయాణంలో 

ఓ ఊరు వెళుతుండగా నేను కూర్చున్న భోగీలో నాసీటు కింద కాళ్లదగ్గర  ఒక పాత నలిగిపోయిన పర్సు కనిపించింది.


దానిని పైకి తీశాను. అందులో కొద్దిపాటి నోట్లు ఒక *కృష్ణుడిఫోటో* తప్ప ఏమీ లేవు. ఎవరిదో తెలిపే ఆనవాళ్ళు ఏమీ లేవు.

ఎలా తిరిగి ఇవ్వడం?

ఈ పర్స్ ఎవరిదండీ? అంటూ అడిగా, అక్కడ ఉన్నవాల్లలో అందరూ పర్స్ కేసి చూశారు, తమ జేబులు తడుముకున్నారు.


ఇంతలో పక్కబెర్తులో కూర్చుని *భగవద్గీత* చదువుకుంటున్న ఒక పెద్దాయన నెమ్మదిగా వచ్చి అది తన పర్స్ అని చెప్పాడు.

మీ పర్సు అని నమ్మకం ఏమిటీ? ఏదైనా ఆనవాలు ఉంటే చెప్పండి అన్నాను. "అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండీ"అన్నాడాయన. 

"ఆ ఒక్క ఆనవాలు చెబితే ఎలాగండీ? ఇంకా ఏదైనా చెప్పండి. మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా!" అని అడిగాను.

అప్పుడు ఆ పెద్దాయన చెప్పిన సమాధానం మన అందరికీ ఒక పాఠమే.


బాబూ..!  అది చిన్నప్పుడు నాకు మా నాన్న ఇచ్చిన పర్సు, అప్పుడు నాకు మా అమ్మానాన్న అంటే చాలా ఇష్టం, అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను.

కాలం గడిచేకొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది. అందుకని నేను అప్పుడు పర్సులో నా ఫోటో పెట్టుకున్నాను.


నాకో ఉద్యోగం వచ్చి పెళ్లి అయ్యింది. నా భార్య చాలా అందగత్తె. నాకు ఆమె అంటే చాలా ప్రేమ. అపుడు ఆమె ఫోటో పర్సులో పెట్టుకునే వాడిని.


ఇంకో రెండు సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడు. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడి కోసం ఆఫీసు వదలగానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం అన్నట్టుగా గడిపేవాడిని.

వాడిని భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేవాడిని. వాడిని నా పక్కనే పడుకోబెట్టుకునే వాడిని. వాడే నా లోకం. అప్పుడు పర్సులో వాడి ఫోటో పెట్టుకునే వాడిని. వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు.


నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది.

కొడుకు నన్ను మరచిపోయాడు. నాకెవ్వరూ లేరు. ఇపుడు భయం వేస్తోంది. ఈ వయసులోనేగా తోడు కావాలి. అందుకని నాకు తోడుగా కృష్ణుడిని పెట్టుకున్నాను. ఆయనే నాకు ఇపుడు తోడు.


నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు.

నా విచారానికి ఓదారుస్తాడు.

నాతో ఎప్పుడూ ఉండే ఆయనను ఎప్పుడో పర్సులో పెట్టుకోవలసిన నేను చాలా ఆలస్యంగా గుర్తించాను. ఇప్పుడు నేను ఆయనతో గడుపుతున్నాను.


*భగవద్గీత* చదువుతుంటే స్వయంగా ఆ జగద్గురువే నాతో మాట్లాడుతున్న అనుభూతి, ఆనందం కలుగుతున్నాయి. చిన్నతనం నుంచీ నన్ను విడిచిపెట్టిపోయే అశాశ్వతమైన అంశాలకే ప్రాధాన్యత ఇచ్చాను తప్ప, శాశ్వతమైన పరమసత్యం 

ఈ భగవద్గీత అనే నిజాన్ని విస్మరించాను. జీవితం అర్ధభాగం పైగా గడిచిపోయిన తరువాత ఈ *బ్రహ్మవిద్యపై* శ్రద్ధ కలిగినదుకు సంతోషించాలో, కనీసం నూటికి 90 మందికిపైగా ఇప్పటికీ దేవుని ఉవాచపై శ్రద్ధ లేనందుకు విచారించాలో తెలియడం లేదు అన్నాడు 

ఆ పెద్దాయన.


ఆయన మాటల్లో ఆవేదన, ఆయన కళ్ళల్లో పలుచటి నీటిచెమ్మ లీలగా కనిపించాయి.

నేను మారు మాట్లాడకుండా పర్సు ఆయనకు ఇచ్చేశా.

పక్క స్టేషనులో రైలు ఆగింది, నేను దిగవలసినది అక్కడే. రైలు దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నా ఆలోచనలు మాత్రం వేగంగానే సాగుతున్నాయి. బయటకు రాగానే ఎదురుగా గోడపై

*భగవద్గీత చదవండి,*

*శ్రీ కృష్ణుని నిజభావం తెలుసుకొనండి"*  అని వ్రాసి ఉన్న బోర్డు చూసి, దానిపై ఉన్న నెంబర్ కి కాల్ చేసి నాకు భగవద్గీత కావాలని అడిగాను. ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి నేనున్న రైల్వేస్టేషన్ కు 20 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నానని, మీకు ఆలస్యం అవుతుందంటే మీ అడ్రస్ కు తెచ్చి ఇస్తామని చెప్పాడు. గంట సమయమైనా నేను ఇక్కడే వేచి ఉంటాను వెళితే భగవద్గీత గ్రంథంతోనే ఇంటికి వెళ్తాను అని చెప్పాను.

సుమారు 25 సంవత్సరాల వయసున్న వ్యక్తి అర్ధగంటకి  బైకుపై వచ్చి నా నెంబర్ కి కాల్ చేసాడు. అతనిని చూసి చెయ్యి పైకెత్తి పిలిచాను. అతను దగ్గరకు వచ్చి *"భగవద్గీత"* నా చేతిలో పెడుతూ ఆలస్యం అయ్యింది ' క్షమించాలి అన్నాడు. 

ఆ మాటల్లో మర్యాద..... నిజంగానే "భగవద్గీత" ఇంత సంస్కారం నేర్పుతుందా అని చిరునవ్వు నవ్వి, ఆ గ్రంథం యొక్క వెల చెల్లించి, ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పి, ఆటోని పిలిచాను. ఆ పెద్దాయన చెప్పింది నిజమే.,  భగవద్గీత పట్టుకుని అడుగులు వేస్తుంటే స్వయంగా ఆ దేవదేవుడే నా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది.

 

*భగవంతుడు తప్ప నిన్ను కాపాడేవాడే లేడు...* నిత్యం మనకు ఎన్ని పనులు వున్నా భగవంతునికి , భగవంతుడు చెప్పిన భగవద్గీతకు కాస్త సమయం కేటాయిస్తే ఆయన మన కోసం జీవితకాలం తోడు వుంటాడు. ఆయన్ని అర్జునుడిలా శరణు వెడితే!

నీ జీవితమంతా అదే అర్జునుడికి తోడుగా ఉన్నట్టే ఉండి.. నిన్ను నడిపిస్తాడు


🙏జై శ్రీ కృష్ణ🙏జై శ్రీ కృష్ణ🙏


 🌹🙏 సర్వేజనా సుఖినోభవంతు🙏🌹

శ్రీ మకరధ్వజ దండి హనుమాన్ మందిర్

 🕉 మన గుడి : నెం 260


⚜ గుజరాత్ : బేట్ ద్వారక 


⚜ శ్రీ మకరధ్వజ దండి హనుమాన్ మందిర్



💠 మీరు హనుమాన్ యొక్క అనేక అద్భుత దేవాలయాల గురించి విని ఉంటారు, కానీ బాలబ్రహ్మచారి హనుమాన్ కి కూడా ఒక కొడుకు ఉన్నాడని మీకు తెలుసా?  

ఇది మాత్రమే కాదు, బజరంగబలి తన కుమారుడితో కలిసి కూర్చున్న ఆలయం ఉందా? 

 అవును, ఇది బజరంగబలి యొక్క ఏకైక ఆలయం, ఇక్కడ అతను తన కొడుకుతో పాటు పూజించబడతాడు.  

అతని కుమారుడు ఎప్పుడు మరియు ఎలా జన్మించాడు అనేదానికి సంబంధించిన కథ పురాణాలలో వివరించబడింది.


💠 బేట్ ద్వారక ప్రధాన శ్రీ కృష్ణ ఆలయానికి తూర్పున 5 కిలోమీటర్ల దూరంలో హనుమంతుని కోసం అద్భుతమైన మరియు ప్రత్యేకమైన ఆలయం ఉంది.  

దీనిని దండి హనుమాన్ దేవాలయం అని పిలుస్తారు.  ఈ ఆలయం విశిష్టత ఎలా ఉంటుందనేది మరింత ఆసక్తికరం. 


💠 శ్రీ హనుమంతుడు తన కుమారుడైన మకరధ్వజునితో మొదటిసారిగా కలుసుకున్నాడని విశ్వసించబడే ప్రదేశంలోనే ఈ ఆలయం ఉంది.


💠 లంక దహన కార్యక్రమం తర్వాత హనుమంతుని చెమట కొంత సముద్రంలో పడినందున మకరద్వాజుడు మొసలి నుండి పుట్టాడు. అందుకే హనుమంతుడు కొడుకు పేరు మకరధ్వజుడు .

మకరం అంటే మొసలి 


💠 ఈ ఆలయంలో ఇంతకుముందు మకరధ్వజ విగ్రహం చిన్నగా ఉండేదని, ఇప్పుడు రెండు విగ్రహాలు సమానంగా ఎత్తుగా మారాయని చెబుతారు.  

ఈ ఆలయాన్ని దండి హనుమాన్ దేవాలయం అంటారు.  

హనుమాన్‌ తన కుమారుడు మకరధ్వజ్‌ని మొదటిసారిగా కలిసిన ప్రదేశం ఇదే అని స్థానికులు గట్టిగా  నమ్ముతారు.


💠 మీరు ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే, ముందు హనుమంతుని కుమారుడు మకరధ్వజ్ విగ్రహం ఉంది, సమీపంలో హనుమంతుని విగ్రహం కూడా ప్రతిష్టించబడింది.  

ఈ రెండు విగ్రహాల ప్రత్యేకత ఏమిటంటే, వారి చేతుల్లో ఆయుధాలు లేవు మరియు అవి ఆనంద భంగిమలో ఉన్నాయి. 

 

💠 ఈ ఆలయం 500 సంవత్సరాల పురాతనమైనది.  

హనుమ మరియు మకరధ్వజ్ ...తండ్రి-కొడుకు) కలయికను చూపించిన భారతదేశంలో ఇది మొదటి ఆలయం.


💠 హనుమంతుడు శ్రీరాముడు-లక్ష్మణులను తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు, అతను మకరధ్వజునితో భీకర పోరాటం చేసాడు.  

కొన్ని మత గ్రంథాలలో, మకరధ్వజుడు హనుమంతుని చెమట ద్వారా చేప నుండి జన్మించిన హనుమంతుని కుమారునిగా కూడా  వర్ణించబడింది.  


💠 శ్రీ రాముని యొక్క గొప్ప భక్తుడు మరియు శంకరుడి 11వ రుద్ర అవతారమైన శ్రీ హనుమ బాల బ్రహ్మచారి అని మనకి బాగా తెలుసు.

అయితే మత గ్రంధాలలో హనుమంతుని కుమారుని వర్ణన ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.  


💠 హనుమంతుని కుమారుడైన మకరధ్వజ మూలం యొక్క కథ-మత గ్రంధాల ప్రకారం, హనుమంతుడు సీతను వెతుకుతూ లంకకు చేరుకుని, మేఘనాథునిచే పట్టబడినప్పుడు, అతన్ని రావణుడి ఆస్థానంలో హాజరుపరిచారు.  

అప్పుడు రావణుడు తన తోకకు నిప్పు పెట్టాడు మరియు హనుమంతుడు మండుతున్న తోకతో మొత్తం లంకను కాల్చాడు.  

హనుమంతుడు తన తోక కాలడం వల్ల తీవ్రమైన బాధతో  దానిని శాంతింపజేయడానికి అతను తన తోకలోని అగ్నిని చల్లబరచడానికి సముద్రపు నీటిని ఉపయోగించాడు.


💠 ఆ సమయంలో అతని చెమట చుక్క ఒక చేప తాగిన నీటిలో జారింది.  

చేప ఆ చెమట బిందువు నుండి గర్భవతి అయింది మరియు ఒక కొడుకుకు జన్మనిచ్చింది, అతని పేరు "మకరధ్వజ్".  


💠 మకరధ్వజుడు కూడా హనుమంతుని వలె శక్తివంతమైనవాడు మరియు తెలివైనవాడు.  అహిరావణుడు మకరధ్వజుడిని పాతాళానికి ద్వారపాలకుడిగా నియమించాడు.  అహిరావణుడు శ్రీరాముని మరియు లక్ష్మణుడిని దేవతకు బలి ఇవ్వడానికి తన భ్రాంతి శక్తితో శ్రీరాముడు మరియు లక్ష్మణుడిని పాతాళానికి తీసుకువచ్చినప్పుడు, హనుమంతుడు శ్రీరాముడిని మరియు లక్ష్మణుడిని విడిపించడానికి పాతాళానికి చేరుకున్నాడు మరియు అక్కడ అతను మకరధ్వజుని కలుసుకున్నాడు.  


💠 ఆ తర్వాత హనుమంతుడికి, మకరధ్వజుడికి మధ్య భీకర యుద్ధం జరిగింది.  చివరకు హనుమంతుడు అతన్ని ఓడించి తన తోకకు కట్టేశాడు.  

మకరధ్వజుడు తన మూలాన్ని హనుమంతునికి వివరించాడు.  హనుమంతుడు అహిరావణుడిని చంపడం ద్వారా శ్రీరాముడు మరియు లక్ష్మణుడిని విడిపించాడు మరియు శ్రీరాముడు మకరధ్వజుడిని పాతాళానికి అధిపతిగా నియమించాడు.


💠 ఈ విగ్రహం అతని జ్ఞాపకార్థం స్థాపించబడింది.ఈ మొదటి మకరధ్వజ్ మరియు హనుమంతుని ఆలయం గుజరాత్‌లోని భెంట్‌ద్వారికలో ఉంది.  



💠 ఈ ప్రదేశం ప్రధాన ద్వారక నుండి 2   కిలోమీటర్ల లోపలికి ఉంటుంది.