🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *భాగం 106*
''నాకంటూ ఒక 'పని ఉన్నది''
ఒక రోజు స్వామీజీ కలతగా ఉన్నారు. అందుకు కారణం ఏమిటని శరత్ అడిగినప్పుడు కాసేపు అంతర్ముఖులై ఉండిపోయిన స్వామీజీ ఆ తరువాత ఇలా అన్నారు: “నాయనా! నేను నిర్వర్తించవలసిన మహాకార్యం ఒకటి ఉంది. కాని అందుకు తగిన సామర్ధ్యంకాని, అర్హత కాని నాలో లేవని అనుకొన్నప్పుడు నా మనస్సు తల్లడిల్లి పోతుంది.
పని అంటే మామూలు పని కాదు; మన మాతృదేశాన్ని పునర్నిర్మించ వలసిన మహాకార్యం అది. ఆధ్యాత్మికత ఇక్కడ అడుగంటిపోయింది. ఆకలి, పస్తులు దేశం అంతటా విలయతాండవం చేస్తున్నాయి. భారతం మళ్లీ మేల్కొనాలి; తన పారమార్థికతతో లోకాన్నే జయించాలి." ఏదో మహోన్నత శక్తి ఆవేశించినట్లు స్వామీజీ మాట్లాడడం విన్న శరత్ ఆశ్చర్యచకితుడై కూర్చుండి. పోయాడు.
స్వామీజీ మాట్లాడడం ఆపగానే శరత్ ఆయనతో, "స్వామీజీ! ఇదిగో మీ శిష్యుణ్ణి నేను ఉన్నాను. మీరు తలపెట్టిన కార్యం నిమిత్తం నేను ఏం చేయాలో ఆదేశించండి" అంటూ తన హృదయాంతరాళం నుండి పలికాడు. వెంటనే స్వామీజీ, "ఒక భిక్షాపాత్ర, కమండలం పుచ్చుకొని ఇంటింటికి పోయి భిక్షాటన చేసిరాగలవా?" అని అడిగారు. అందుకు శరత్ "చేసిరాగలను" అని దృఢంగా జవాబిచ్చాడు. స్వామీజీ ఆ మాట విని ఎంతో సంతోషించారు.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి