8, డిసెంబర్ 2023, శుక్రవారం

ప్రమాణమవుతాయి


 ॐ దయచేసి దీనిని చదివి, వీడియో చూడండి. 

    అందఱికీ అవసరమని భావిస్తే, మీ పరిచితులకి కూడా పంపి, ఆనందాన్ని పంచండి. 


    బ్రహ్మశ్రీ జటావల్లభుల జగన్నాధంగారు జ్ఞానవృద్ధులూ, 

    97 సంవత్సరాలు నిండుతున్న వయోవృద్ధులూ. 


1. వారు విశ్రాంత తెలుగు పండితులు, పశ్చిమ గోదావరి జిల్లా కైకరం వాస్తవ్యులు. 

2. మా తండ్రిగారూ వారూ, 1959 నుంచీ మిత్రులుగా ఉండేవారు. 

    వారు కైకరంలోనూ, మా నాన్నగారు, 

    ఆ పక్క గ్రామమైన పూళ్ళలోనూ పనిచేసేవారు. 

3. నేను నిడదవోలులో పనిచేస్తున్నప్పుడు, 1995లో వసంత నవరాత్రుల సందర్భంగా, వారు ఉపన్యాసాలకి వచ్చినపుడు,   

    మా నాన్నగారూ వారూ పండిత చర్చ చేసికొంటూ, పాత జ్ఞాపకాల నేమఱువేసుకొనేవారు. 

4. వారు భద్రాచలం వచ్చినపుడు కూడా, 

    మా నాన్నగారూ వారూ చాలా బాగా గడిపేవారు. 

5. వారికి నేనంటే బాగా ఇష్టం. నాకు వారు పితృతుల్యులు.  

    అప్పుడప్పుడూ వారు నాపై పుత్రవాత్సల్యంతో ఫోనులో మాట్లాడుతూ, అనేక విషయాలు చెబుతూ ఉంటారు. 

6. కైకరం దగ్గర గోపీనాథపట్నంలో ఈ నెల 1వ తేదీ, హనుమత్ విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు నేను వెళ్ళాను. 

    ఆ సాయంత్రం కైకరంలో జగన్నాథంగారిని, వారి గృహంలో దర్శించుకొన్నాను. 

6. అటువంటి పెద్దల విషయ జ్ఞానం అత్యంత ప్రామాణికమూ, అనుభవపూర్వకమైనదీ. 

    ప్రాచీన సాహిత్యంపై అనర్గళంగా ఉపన్యసించడం వారికే సాధ్యం. 

    అంతేకాక, ప్రస్తుత ఆధనిక విజ్ఞానాన్ని, పురాతన విషయాలతో సమన్వయపరచడం వారి ప్రత్యేకత. 

    దానిని రికార్డు చేసి భద్రపరచుకొనకపోతే, 

   ప్రస్తుత ప్రముఖ ప్రవచకుల - అర మార్కే ప్రథమ రాంకు అయి, 

    నాలాటి సున్న మార్కులవాళ్ళకు అవే ప్రమాణమవుతాయి. 

7. ఇప్పటికీ, వారి ధారణా - కంచు కంఠ ధ్వనీ గమనిస్తే, అత్యంత ఆశ్చర్యం వేస్తుంది. 

    నేను కైకరం వెళ్ళిన సందర్భంలో, 

వారు చెప్పిన అనేక విషయాలలో ఒకదానిని ఇప్పుడు విందాం.    


  — రామాయణం శర్మ 

            భద్రాచలం

కామెంట్‌లు లేవు: