28, జనవరి 2025, మంగళవారం

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(34వ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

           *చిత్రకేతువు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *వృత్రాసురుడు రాక్షసుడు కదా, అతన్ని సంహరిస్తే ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకోవడం ఏమిటి? అన్న సందేహం రాక మానదు.*


*దానికి సమాధానం ఏమిటంటే వృత్రుడు తపస్స్వభావుడు. బ్రహ్మవంశసంజాతుడు. గొప్ప విష్ణుభక్తుడు. అదెలా అంటే అతని పూర్వజన్మ గురించి తెలుసుకోక తప్పదు.*


*పూర్వం శూరసేన దేశాన్ని చిత్రకేతువు పాలించేవాడు. అతనికి కోటి మంది భార్యలు. అంతమంది భార్యలు ఉన్నప్పటికీ అతనికి పిల్లలు లేరు. దాంతో చిత్రకేతువు చెప్పలేనంత దుఃఖాన్ని అనుభవించసాగాడు. ఆ సమయంలో లోకసంచారం చేస్తూ బ్రహ్మర్షి అంగిరసుడు శూరసేనదేశాన్ని సందర్శించాడు. అంగిరసునికి సకల మర్యాదలూ చేశాడు చిత్రకేతువు. పూజించాడతన్ని. తన మనోదుఃఖాన్ని కూడా విడమరచి చెప్పాడు. సంతతి కలిగే మార్గం చెప్పమని ప్రాథేయపడ్డాడు. జాలి చెందాడు అంగిరసుడు. వెంటనే అతని చేత త్వష్టృయాగం చేయించాడు. యజ్ఞఫలాన్ని చిత్రకేతు పెద్దభార్య కృతద్యుతికి అందజేసి, త్వరలోనే ఆమె ఓ కొడుకుని ప్రసాదిస్తుందని చెప్పి, అక్కణ్ణుంచి నిష్క్రమించాడతను.*


*కృతద్యుతి గర్భవతి అయింది. నవమాసాలూ నిండి ఓ కుమారుణ్ణి ప్రసవించింది. ఆ కుమారుణ్ణి చూసి చిత్రకేతువు ఆనందించాడు. రాజ్యం అంతటా పండుగ చేశాడు. ప్రజలకు అనేక కానుకలిచ్చాడు. బ్రాహ్మణులకూ, మునులకూ భూరిదానాలిచ్చాడు. అందరినీ సంతృప్తి పరిచాడు.*


*ఇంత వరకూ బాగానే ఉంది. పెద్ద భార్య కృతద్యుతికి తప్ప తామెవ్వరికీ సంతానం లేదని, చిత్రకేతువు మిగిలిన భార్యలంతా దుఃఖించసాగారు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం)*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

సరస్వతి ఆలయాలు

 ⑴ సరస్వతి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. 

కాశ్మీర్.. *బాసరా (తెలంగాణ)..*

⑵ బ్రహ్మదేవుడి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో... 

పుష్కర్ (రాజస్థాన్).. *ధర్మపురి (తెలంగాణ)..* 

⑶ త్రివేణి సంగమాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. 

అలహాబాద్ (ఉత్తర్ ప్రదేశ్).. *కాలేశ్వరం (తెలంగాణ)*

⑷ ఉత్తర వాహినిగా ప్రవహించే నదుల ప్రాంతం రెండే కలవు.. 

నర్మదా నది.. ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్)

*గోదావరి నది.. చెన్నూర్ (తెలంగాణ)*


*ధర్మపురి:-*

యముడు శివునికై తపస్సు చేసింది ఇక్కడే.. 

(మార్కండేయుని విషయంలో చేసిన పాపం కారణంగా)

బ్రహ్మదేవుడు (సృష్టి)

నరసింహుడు, (స్థితి)

శివుడు, (లయం)

యముడు, (కాలం)

అరుదైన దైవ సంయోగ దేవాలయం ఇది


*కాళేశ్వరం:-*

ఒకే పానవట్టం పై రెండు శివలింగాల అపురూప ఆలయం ఇది.. 

గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల అమృత సంగమ క్షేత్రం ఇది.. 

సరస్వతి నది చివరి సారి దర్శనం ఇచ్చింది ఇక్కడే.. 


*వేములవాడ:-*

అహల్య విషయంలో పాపం చేసిన దేవేంద్రుడు (దేవరాజు) శాప పరిహారానికి శివుడికై తపస్సు చేసింది ఇక్కడే. ఇక్కడి శివుడి నామదేయం రాజరాజేశ్వరుడు (రాజులకే రాజు ఆయన)


*మెదక్:-*

సప్తరుషులు తపస్సు చేసింది ఇక్కడే, మంజీర నది ఏడు పాయలుగా విడిపోయిన అద్భుత దృశ్యం ఇక్కడ ఉంది.. 


*యాదగిరి:-*

అహోబిలం నుండి ఉగ్రరూపంతో వస్తున్న ఉగ్రనరసింహుడు శాంతించి లక్ష్మిదేవితో కలిసి వెలిసిన దేవాలయం.. 


*కొండగట్టు:-*

శ్రీరాముడు నడయాడిన ప్రాంతం గనక అమితానందంతో ఆంజనేయుడు సంజీవని పర్వతంలో ఓ భాగాన్ని వదిలిన ప్రాంతం.. 


*బాసర (వ్యాసపురి):-*

వేదవ్యాస మహర్షి సరస్వతి మాతకై తపస్సు చేసి మహాభాగవతం రచించిన ప్రాంతం.. 


*భద్రాచలం:-*

శ్రీరాముడు మహావిష్ణువు రూపంలో ఉన్న ఏకైక ఆలయం. 


*చెన్నూర్:-*

గోదావరి నది ఉత్తర వాహినిగా ప్రవహించే ఏకైక ప్రాంతం. 


*మంథని:-*

మంత్రనగరి అసలు పేరు, త్రేతాయుగంలో వైదిక మంత్ర తంత్ర సాధన, పరిశోదనకై అగస్త్య మహాముని ఏర్పటు చేసిన తొలి ఆశ్రమం ఇక్కడే. 


*బోదన్:-*

బోధనపురి అసలు పేరు. మంతనిలో అభ్యసించి అర్హత సాదించిన గురువులు శిష్యులకు బోధించడానికి ఏర్పాటు చేసిన తొలి గురుకుల పాఠశాల ఇక్కడే.!!


🙏 *మన తెలంగాణ ఘన కీర్తి గల తెలుగు నేల* హిందువుగా గర్వించు.! హిందూవుగా జీవించు.!!🙏

చీరల క్విజ్

 చీరల క్విజ్


1. గోవిందుని తలపించే చీర ?


2. ప్రసిద్ధి చెందిన కోట గల వూరి పేరే ఈ చీర పేరు.


3. శ్రీరామనవమి ప్రసాదం, ఈ స్వామి కోవెల గల ఉరే ఈ చీర పేరు.


4. ప్రసిద్ధ హాస్య నటుడి ఇంటి పేరు ఈ చీర పేరు.


5. ఏడుకొండల స్వామిని తలపించే ఈ చీర పేరు?


6. భూదానోద్యమాన్ని తలపించే ఈ చీర పేరు?


7. చందమామను చూడు, నన్ను చూడు... అంటుంది ఈ చీర.


8. కోడికూరను తలపించే చీర?


9. ఇంగ్లీష్ లో అరటిపండు రసాన్ని తలపించే చీర?


10. దక్షిణభారతం లోనే కాదు, ప్రపంచప్రఖ్యాతి ఈ చీరది..


11. మైసూర్ ప్యాలెస్ ను గుర్తు చేసే చీర?


12. పంజాబీ ఫుల్కాను గుర్తు చేసే చీర?


13. ఇంగ్లీష్ కొండ చిలువను తలపించే చీర?


14. ఈ చీర పేరు చెప్తేతెలుగు కోట గుర్తు వస్తుంది.


15. లోన లొటారం పైన పటారంలా ధ్వనించే చీర?


16. తెలుగులో పెన్ను ను గుర్తు చేసే చీర?


17. కాశ్మీర్ లో శాలువలతో పాటు ఈ చీరలు కూడా ప్రసిద్ధి.


18. జామకాయను గుర్తు చేసే చీర?


19. హిందీ జాగ్రత ఈ చీరలో వినిపిస్తుంది..


20. ఒకప్పటి రష్యా అధ్యక్షుడి పేరు ఈ చీరది..


21. లవణాన్ని స్ఫురింపచేసే ఈ చీర?


22. మన పక్క దేశం రాజధాని పేరు ఈ చీర..


23. మన దేశంలో ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రం పేరు ఈ చీరది.

బుధవారం🪷* *🌷29, జనవరి, 2025🌷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🪷బుధవారం🪷*

*🌷29, జనవరి, 2025🌷*

    *దృగ్గణిత పంచాంగం*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - హేమంత ఋతౌః*

*పుష్యమాసం - కృష్ణపక్షం*


*తిథి     : అమావాస్య* సా 06.05 వరకు

*వారం  :బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం  : ఉత్తరాషాఢ* ఉ 08.20 వరకు ఉపరి *శ్రవణం*


*యోగం  : సిద్ధి* రా 09.22 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం : నాగ* సా 06.05 *కింస్తుఘ్న* రా 05.10 తె ఉపరి *బవ*


*సాధారణ శుభ సమయాలు* 

                 *-ఈరోజు లేవు-*

అమృత కాలం  : *రా 09.19 - 10.51*

అభిజిత్ కాలం  :  *ఈరోజు లేదు*


*వర్జ్యం             : మ 12.09 - 01.41*

*దుర్ముహూర్తం  : ప 11.58 - 12.43*

*రాహు కాలం   : మ 12.21 - 01.46*

గుళికకాళం       : *ఉ 10.55 - 12.21*

యమగండం     : *ఉ 08.04 - 09.30*

సూర్యరాశి : *మకరం* 

చంద్రరాశి : *మకరం*

సూర్యోదయం :*ఉ 06.39*

సూర్యాస్తమయం :*సా 06.02*

*ప్రయాణశూల  : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 06.39 - 08.56*

సంగవ కాలం        :      *08.56 - 11.12*

మధ్యాహ్న కాలం    :      *11.12 - 01.29*

అపరాహ్న కాలం    : *మ 01.29 - 03.46*


*ఆబ్ధికం తిధి    :పుష్య అమావాస్య*

సాయంకాలం        :  *సా 03.46 - 06.02*

ప్రదోష కాలం         :  *సా 06.02 - 08.34*

రాత్రి కాలం            :  *రా 08.34 - 11.55*

నిశీధి కాలం          :*రా 11.55 - 12.46*

బ్రాహ్మీ ముహూర్తం:*తె 04.58- 05.48*

________________________________

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


 *🪷శ్రీ సరస్వతి స్తోత్రం🪷*     

        *(అగస్త్య కృతం)*


*సరస్వతి నమస్తుభ్యం* 

*సర్వదేవి నమో నమః*

*శాంతరూపే శశిధరే* 

*సర్వయోగే నమో నమః* 


 *🌷ఓం సరస్వత్యై  నమః🌷* 


🌷🪷🌹🌷🛕🌷🌹🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🪷🪷🍃🌷

 🌹🌷🪷🪷🪷🪷🌷🌹

Panchaag


 

🕉 108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::

 🕉 108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::


     59వ దివ్యదేశము 🕉


🙏శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం 🙏


తిరువనంతపురం. ( Trivandrum). కేరళ.


💠 ప్రధాన దైవం పేరు : శ్రీ అనంత పద్మనాభస్వామి 

💠 ప్రధాన దేవత :శ్రీహరిలక్ష్మీతాయార్

💠 పుష్కరిణి : మత్స్య పుష్కరిణి 

💠 విమానం : హేమకూట విమానము .


🌀  స్థలపురాణం 🌀


💠అనంతునిపై శయనించిన పెరుమాళ్ నాభిలో చతుర్ముఖ బ్రహ్మతో , పద్మము యొక్క రేకుల వంటి నేత్రములతో మహా శోభాయమానముగా దర్శనమిచ్చు చుండుటచే అనంత పద్మనాభ స్వామిగా ప్రసిద్ధి నొందెను . 

పెరుమాళ్ మూర్తి నిడివి 18 అడుగులు .

 

💠 బిళ్వ మంగళ స్వామి అను ఒక నంబూద్రి బ్రాహ్మణుడు గొప్ప విష్ణుభక్తుడై యుండెను . అతని భక్తికి సంతసించిన శ్రీమన్నారాయణుడు అనంతశయన రూపము ప్రత్యక్షమునిచ్చెను.

అంతట ఆ బ్రాహ్మణుడు సంతోషాతిరేకమున ఏమయినా పెరుమాళ్ కు నివేదించ వలయునన్న తపనతో ఇటునటు చూచి , పచ్చి మామిడికాయలు కోసి పాత్ర ఏమియు లేక పోయినందు వలన ప్రక్కన ఉండిన ఒక కొబ్బరి చిప్ప పెంకులో ఆ ముక్కలనుంచి స్వామికి అర్పించెను .

 ఈ ఆలయమున ఇప్పటికినీ అది ఆచారముగా కొనసాగించుచున్నారు . 

కాని పచ్చి మామిడి కాయల ముక్కలను ఒక బంగారు కొబ్బరి చిప్పలో ఉంచి నివేదించుచున్నారు . నంబూద్రి బ్రాహ్మణులే ఈనాటికినీ సుప్రభాత సేవ చేయుదురు . 


💠 ఈ ఆలయంలోనికి హిందువులని మాత్రమే అనుమతిస్తారు. మగవాళ్ళు పంచలు మాత్రమే ధరించి లోనికి వెళ్ళాలి.  అందరు సాంప్రదాయ వస్త్రాలలోనే ప్రవేశించాలి.


💠ఈ మధ్యనే ఈ దేవాలయం లోని నేలమాళిగలలో లక్షన్నర కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడడంతో ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. 


💠 అతి పెద్ద చెరువు పక్కన ఉండటం వలన ఆలయ సౌందర్యం రెట్టింపయ్యింది. ఈ చెరువును పద్మతీర్థం (తామరల కొలను) అంటారు. ఈ దేవాలయం పేరుమీదే కేరళ రాజధానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. ‘తిరు’ ‘అనంత’ ‘పురం’ అంటే ‘అనంతపద్మనాభునికి నెలవైన ప్రదేశం’ అని అర్థం.

 ఈ విగ్రహాన్ని కటుశర్కర యోగం అనే ఆయుర్వేద ఔషధాల మిశ్రమంతో తయారుచేశారు. 

 

💠 నేపాల్‌లోని గండకీ నదీ తీరం నుంచి ఏనుగుల సహాయంతో తీసుకొచ్చిన 12000 సాలగ్రామాలతో ఈ విగ్రహం తయారయ్యింది. ఈ విగ్రహానికి అభిషేకం చేయరు. కేవలం పూలతో మాత్రమే పూజిస్తారు. 

 

💠ఇక్కడ భగవంతుడు మూడు ద్వారాల గుండా దర్శనమిస్తాడు. మొదటి ద్వారం నుంచి విష్ణువు చేతికిందుగా ఉన్న శివుని ముఖం, రెండవ ద్వారం గుండా నాభి నుంచి వెలువడిన కమలం మీద ఆసీనుడైన బ్రహ్మ, ఉత్సవమూర్తులు, శ్రీదేవిభూదేవులు, మూడవ ద్వారం నుంచి విష్ణుమూర్తి పాదపద్మాలు దర్శనమిస్తాయి.


🙏జై శ్రీమన్నారాయణ 🙏

*శ్రీ సీతారామచంద్ర స్వామి

 🎻🌹🙏 *శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం...భద్రాచలం...!!*


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌿దక్షిణ అయోధ్య పిలుచుకునే భద్రాచలం 

శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామి దేవాలయం ..గోదావరి నది ఒడ్డున భద్రగిరి కొండపై ఉంది. 


🌸 పర్వతశ్రేష్ఠుడైన మేరువు అనే పర్వత రాజుకి ,మేనకకు భద్రుడనే కొడుకున్నాడు. ఈయన ఒక పర్వతరాజు. ఇతడు గౌతమీ తీరంలోగల దండకారణ్యంలో ఘోరమైన తపస్సు చేసి శ్రీరామచంద్రుని సాక్షాత్కారాన్ని పొందాడు. 


🌿శ్రీ రాములవారు వరం కోరుకొమ్మని అడిగితే కైలాసగిరి మీద శివుడలంకరించునట్లు తన శిఖరముమీద శ్రీ సీతారామలక్ష్మణ సమేతులైన రామ ప్రభువును తన శిఖరము నలంకరించి జీవులకు మోక్షసామ్రాజ్య మందించవలయునని కోరుకొన్నాడట భద్రుడు. 


🌸 లక్ష్మీ శేష సహితుడైన శ్రీమహా విష్ణువు రామావతార రూపంలో తానిచ్చిన వాగ్దానం ప్రకారం శిలారూపంలో ఉన్న భద్రుని తలపై వాసం ఏర్పరచుకున్నాడు. ఆనాటి నుండి దీనికి భద్రాచలం అని పేరు వచ్చింది ఇది సంగ్రహంగా పురాణ కధ.


🌿 భధ్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తరువాత మరల భూమి మీదకి వచ్చి, తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచినాడు. 


🌸ఇక్కడి శ్రీరామచంద్రుడ్ని భక్తులు ప్రేమగా వైకుంఠ రాముడని, చతుర్భుజ రాముడని, భద్రగిరి నారాయణుడని పిలుస్తారు. సాధారణంగా శ్రీరామ ఆలయాలలో శ్రీ రామునికి రెండు చేతులుంటే ఈ భద్రాచలంలో శ్రీరామచంద్రమూర్తికి నాలుగు చేతులుంటాయి. శంఖము, చక్రము కూడా ఉంటాయి.


🌿విష్ణుమూర్తి వైకుంఠం నుండి ఆతురతతో వస్తూ శంఖాన్ని కుడిచేతిలోను, చక్రాన్ని ఎడమ చేతిలో ధరించాడు అంటారు. చతుర్భుజాలతో అలరారుచున్న శ్రీ వైకుంఠ రామమూర్తిని, ప్రక్కన కూర్చుని ఉన్న సీతమ్మతల్లిని, ప్రక్కగా ఉన్న లక్ష్మణమూర్తిని చూచెడి భక్తుల భాగ్యమే భాగ్యం.


 🌸ఈ స్వామి విగ్రహాలు వెలుగులోకి తెచ్చిన భాగ్యం పోకల దమ్మక్క అనే భక్తురాలిది. మిక్కిలి వృద్ధురాలైన  పోకల దమ్మక్క స్వప్నంలో ఆ శ్రీరాముని దర్శనం చేసుకుని విగ్రహాలు పుట్టలో ఉన్న ప్రదేశానికి  మార్గం గ్రామస్థుల సానుభూతి సహకారాలతో కనుగొని, ఆ విగ్రహాలకు దేవాలయ ప్రతిష్టచేసి బ్రహ్మోత్సవాలు, నిత్యపూజలు, చేయించడం ప్రారంభించింది.

ప్రతీ సంవత్సరం సీతారాముల కల్యాణం కూడా నిర్వహించేవారని స్థలపురాణం చెబుతుంది.


🌹 *భక్త రామదాసు* : 🌹


🌿అనంతరం రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న  గొప్ప రామభక్తుడు. ఆనాటి తానీషా ప్రభువు దక్కను సామ్రాజ్యాన్ని ఏలుచున్నవాడు.


🌸 ఆయనకు అక్కన్న, మాదన్న యను మంత్రులున్నారు. వీరు కంచర్ల గోపన్నకు మేనామామలు.

వారి ప్రాపకంవల్ల కంచర్ల గోపన్న 1670లో పరగణాధికారము పొందాడు. 

ఇక్కడి పాల్వంచ తాలుకా తహశీల్దారుగా పదవీబాధ్యతలు చేపట్టాడు. 


🌿శ్రీరామ భక్తుడిగా మారిపోయిన గోపన్న రాములవారికి ఒక ఆలయం కట్టాలి అని గట్టి నిర్ణయం తో 1674 వరకు శ్రీ రామాలయము నిర్మాణం చేయించినాడు. సర్కారుకు కట్టవలసిన పన్నుడబ్బును ఆలయ నిర్మాణానికి వెచ్చించినందుకు 1686 వరకు కారాగారబద్ధుడైనాడు.

తానీషా రామదాసును గోల్కొండకు రప్పించి.. బందిఖానాలో ఖైదు చేయిస్తాడు. 


🌸 12 ఏళ్ల పాటు రామదాసు ఆ బందిఖానాలో నానా కష్టాలు అనుభవిస్తాడు. ఆయా సందర్భాల్లో అతను భద్రాచల శ్రీరాముడికి తన దుస్థితిని మొరపెట్టుకుంటూ ఆర్తితో ఆలపించిన వందలాది కీర్తనలు ఆ తర్వాత ప్రపంచ విఖ్యాతమయ్యాయి. 


🌿చివరకు రామదాసు ప్రార్థనలు ఫలించి.. శ్రీరాముడు స్వయంగా లక్ష్మణ సమేతంగా వచ్చి.. తానీషాకు బాకీ సొమ్ము 6 లక్షల మొహరీలు చెల్లించి.. రశీదు తీసుకొని మరీ రామదాసును బందిఖానా నుంచి విముక్తం చేశాడట! 


🌸 రామదాసు నిర్మించిన దేవాలయానికి తగినంత అదరాభిమానాలు జరుగక కొంత కాలానికి శిథిలమైపోయింది.  భక్తలోకం ముందుకు వచ్చి దేవాలయ పునరుద్ధరణకు పూనుకుంది. పూర్వం దేవాలయం ఉండిన స్థలంలో క్రొత్తగా దేవాలయం నిర్మించబడింది. 


🌿ఇప్పటికీ అప్పట్లో శ్రీ రామదాసు తన ఆరాధ్యదైవమైన శ్రీరాముడితో పాటు.. సీత.. లక్ష్మణస్వాములకు చేయించిన పలు ఆభరణాలు... తానీషాకు శ్రీరాముడు స్వయంగా చెల్లించిన బంగారు మొహరీలు.. ఉత్సవ సామగ్రి.. అప్పటి శాసనాలు.. పరికరాలు ఆలయంలో చూడొచ్చు. 


🌸ఈ ఆలయంలో శ్రీ పాంచరాత్ర ఆగమం ప్రకారం స్వామివారికి నిత్యపూజలు.. ప్రత్యేక అర్చనలు, విశేష ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.


🌿 శ్రీ సీతారాముల  కళ్యాణోత్సవము:

ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవము చాలా విశేషము. జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకున్నది.


🌸 కళ్యాణోత్సవమును తిలకించటానికి లక్షల మంది యాత్రికులు వస్తారు.

ఇక్కడ జరిగే కళ్యాణోత్సవ కార్యక్రమాలు ఆలిండియా రేడియో; టి.వి.ల్లో ప్రసారం చేయబడతాయి


🌿 ముత్యాల తలంబ్రాలు రాములవారి కల్యాణంలో ముత్యాల తలంబ్రాలకు ఒక ప్రత్యేక స్థానం వుందనే చెప్పాలి. స్వామివారి కల్యాణంలో శ్రీ రామునిపై వేసే కోటి తలంబ్రాలను చేతితో తయారుచేస్తారు.


🌸 అంటే తలంబ్రాలకు అవసరమయ్యే బియ్యం కోసం ఒక్కొక్క వడ్లగింజ మీద పొత్తును చేతితో తీసి ఆ బియ్యాన్ని కోటితలంబ్రాలుగా చేస్తారు... స్వస్తి...జై శ్రీరామ్...🌞🙏🌹🎻


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*


*సంతానం..సంతోషం..*


చాలా రోజుల క్రిందట సంగతి ఇది..శ్రీ స్వామివారి మందిరాన్ని దర్శించడానికి బెంగుళూరు నుండి ఒక కుటుంబం వచ్చారు..తల్లీ తండ్రీ ఇద్దరు కుమారులు..వారి భార్యలు.. ..మొత్తం ఆరుగురు..నిజానికి వాళ్ళు మాలకొండ లోని శ్రీ లక్ష్మీనృసింహుడి దర్శనం కోసం వచ్చారు..అక్కడికి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం దగ్గరే అని తెలుసుకొని..చూసిపోదామని వచ్చారు..ఆరోజు శనివారం..వీళ్ళు మందిరానికి చేరే సరికి సాయంత్రం నాలుగు గంటల సమయం అయింది..


ఎలాగూ వచ్చారు కనుక పల్లకీ సేవ చూసి వెళ్ళండి అని చెప్పాము..అందరూ ఒకరినొకరు సంప్రదించుకొని..సరే అన్నారు..వాళ్ళ ఉద్దేశ్యం లో పల్లకీ సేవ అయిపోగానే..ఆలస్యం గా నైనా నెల్లూరు వెళ్ళిపోయి..రాత్రికి అక్కడ బస చేయాలని..అందుకే మమ్మల్ని రూము కూడా అడగలేదు..


పెద్దవాళ్ళిద్దరూ శ్రీ స్వామివారి గురించి అన్ని వివరాలు అడిగి మరీ తెలుసుకున్నారు..ఆసక్తిగా విన్నారు..ముఖ్యంగా పెద్దవాళ్ళిద్దరూ ఓపికగా శ్రీ స్వామివారి మందిరం అంతా తిరిగి చూసారు..


"శ్రీ స్వామివారు తపస్సు చేసుకునేటప్పుడు.. ఈ పులిచర్మం మీద కూర్చున్నారు కదా..ఆయన శరీర స్పర్శ పొందింది కదా!.." అని ఆ పెద్దాయన తన భార్యకు చెప్పి..మనసారా నమస్కారం చేసుకున్నారు..అలానే శ్రీ స్వామివారు నేలమాళిగ లో సాధన చేసుకునే ముందు..ఆ నేలమాళిగ పైన మూత లాగా వాడిన చెక్కపలక ను ముట్టుకుని కళ్లకద్దుకున్నారు..శ్రీ స్వామివారి గురించి మరింతగా తెలుసుకోవాలని వున్నదనీ..వీలైతే చెప్పమని నన్ను అడిగారు..ఆ సమయం లో పల్లకీ సేవ ఏర్పాట్ల లో కొద్దిగా పనిలో వున్నాను..అదే మాట వారికి చెప్పి..మా అమ్మగారు శ్రీ స్వామివారి గురించి వ్రాసిన పుస్తకం ఆయన కు ఇచ్చాను..భక్తిగా తీసుకున్నారు..


పల్లకీ సేవ లో కుటుంబం యావత్తూ పాల్గొన్నారు..ప్రసాదం తీసుకొని..ఇవతలికి వచ్చి..వారిలో వారే ఏదో మాట్లాడుకుంటున్నారు..ఒక పది నిమిషాల తరువాత నా దగ్గరకు వచ్చి.."ఏమండీ రాత్రికి ఇక్కడ ఉండాలని అనుకుంటున్నాము..చూసారు కదా మేము మొత్తం ఆరుగురం వున్నాము..ఏదైనా రూము వుంటే..అందులో సర్దుకుంటాము.."అన్నారు..ఒక చిన్న గది ఉందనీ..అందులో ఆడవాళ్లు అందులో సర్దుకుంటే..మొగవాళ్ళు మందిర ప్రాంగణం లో పడుకోవచ్చనీ తెలిపాను..సరే అన్నారు..


ఆ రాత్రికి అందరూ నిద్ర చేసి..తెల్లవారి ఆదివారం ఉదయం శ్రీ స్వామివారి కి అర్చన చేయించుకొని..సమాధికి నమస్కారం చేసుకొని..ఇక బయలుదేరి పోబోతూ..నా దగ్గరకు వచ్చి.."రాత్రి..పల్లకీ సేవ వద్ద కొందరు భక్తులతో మాట్లాడానండీ.. ఇక్కడ మనస్ఫూర్తిగా మ్రొక్కుకుంటే సంతానం కలుగుతుందని చెప్పారు..పెద్దవాడికి వివాహం జరిగి ఐదు సంవత్సరాలు అయింది.. శ్రీ స్వామివారికి మ్రొక్కు కున్నాము..అందుకోసమే రాత్రి ఇక్కడ నిద్ర చేసాము..అదృష్టం బాగుండి.. వాళ్లకు సంతానం కలిగితే..మళ్లీ ఇక్కడికి అందరం వచ్చి మ్రొక్కు తీర్చుకుంటాము.." అన్నారు..ఆ వెంటనే సెలవు తీసుకొని వెళ్లిపోయారు..


దాదాపు సంవత్సరం తరువాత.. ఒక ఆదివారం నాడు మళ్లీ వాళ్ళందరూ వచ్చారు..నేరుగా శ్రీ స్వామివారి అర్చన టికెట్ కొనుక్కొని..పూజ చేయించుకొని..నా దగ్గరకు వచ్చి.."శ్రీ స్వామివారు మహిమ చూపారండీ..పెద్దవాడికి అమ్మాయి పుట్టింది..శ్రీ స్వామివారికి మ్రొక్కు కున్న విధంగా..హుండీ లో నేననుకున్న మొత్తం సమర్పించుకున్నాను..శ్రీ స్వామివారి పేరు కలిసి వచ్చేటట్లు గా పాపకు పేరు పెట్టుకుంటాము..ఆయన ప్రసాదం కాబట్టి..ముందుగా ఇక్కడికి వచ్చాము.." అన్నారు..


వాళ్ళందరి ముఖాల్లో సంతోషం తాండవిస్తోంది..అందుకు కారణభూతుడైన ఆ స్వామివారు మాత్రం సమాధినుంచి చిద్విలాసంగా చూస్తూవున్నారు..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114.. సెల్..94402 66380 & 99089 73699)

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*


*విభూతి..గంధం..*


"మేము అండమాన్ లో వుంటామండీ..మా బంధువులు ఇక్కడికి దగ్గరలో ఉన్న చుండి గ్రామం లో వుంటారు..ఒకప్పుడు మేమూ ఈ ప్రాంతం వాళ్ళమే.. కానీ కొన్ని సంవత్సరాల క్రిందట అండమాన్ వెళ్లి..అక్కడే వ్యాపారం చేసుకుంటూ స్థిరపడ్డాము.. మావాళ్ళు ఈ క్షేత్రం గురించి..శ్రీ స్వామివారి గురించి గొప్పగా చెపితే..చూసిపోదామని వచ్చాము..మాకు ఈ క్షేత్రం గురించి వివరాలు చెపుతారా?.." అన్నారా దంపతులు..వాళ్ళు మాట్లాడుతున్నది తెలుగులోనే అయినా..కొద్దిగా తేడాగా ఉంది..


శ్రీ స్వామివారు మాలకొండ క్షేత్రం లో తపస్సు చేసుకుంటూ ఉన్నప్పటి నుంచి..మొగలిచెర్ల లోని ఫకీరు మాన్యం లో తాను నిర్మించుకున్న ఆశ్రమం లో కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన దాకా జరిగిన సంఘటనలన్నీ క్లుప్తంగా వివరించాను..శ్రద్ధగా విన్నారు..శ్రీ స్వామివారు సమాధి చెందిన అనంతరం..వేలాదిమంది వచ్చి దర్శించుకొని వెళుతున్నారని..వారికేమైనా సమస్యలు ఉన్నా..ఈ సమాధి దగ్గర మ్రొక్కుకుంటే..అవి తీరిపోతున్నాయనీ ..తమ బంధువుల ద్వారా విన్నామని వాళ్ళు నాతో అన్నారు..


ఆ తరువాత ఆ దంపతులు శ్రీ స్వామివారి మందిరానికి మూడు సార్లు ప్రదక్షిణాలు చేసి..శ్రీ స్వామివారి విగ్రహం వద్ద పూజ చేయించుకుని..శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..ఒక ఐదారు నిమిషాల పాటు ప్రార్ధన చేసుకొన్నారు..శ్రీ స్వామివారి విభూతి..గంధం..రెండూ తీసుకున్నారు..వెళ్ళొస్తామని చెప్పి వెళ్లిపోయారు..


మరో మూడు నాలుగు నెలల తరువాత..మందిరానికి నూరు రూపాయల మనీ ఆర్డర్ వచ్చింది..అందులో..తమ చిరునామాకు..శ్రీ స్వామివారి విభూతి, గంధం..రెండూ పోస్ట్ ద్వారా పంపమని వ్రాసారు..ఆ చిరునామా..అండమాన్ లోని పోర్టుబ్లయర్ కు సంబంధించినది..అప్పుడు మాకు గుర్తుకు వచ్చింది..కొంతకాలం క్రిందట వచ్చి వెళ్ళింది వీళ్ళే కదా అని..అందులో వారి ఫోన్ నెంబర్ ఇవ్వలేదు..వారు కోరిన విధంగా విభూతి..గంధం..పోస్ట్ ద్వారా పంపాము..మరో రెండు నెలల తరువాత..చుండి గ్రామం నుంచి ఒక వ్యక్తి వచ్చి..తాను అండమాన్ వెళుతున్నాననీ..తమ బంధువుల కోసం శ్రీ స్వామివారి విభూతి, గంధం కావాలని అడిగారు..ఇచ్చాము..వచ్చిన ఆ వ్యక్తి ద్వారా తెలిసింది..అప్పుడు వచ్చిన ఆ దంపతుల కోసమే ఈ విభూతి.. గంధం..


మరో ఆరేడు నెలల తరువాత..ఒక శనివారం నాడు ఆ దంపతులు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు.."శ్రీ స్వామివారు చాలా మహిమ కలవాడు..మేము పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సమస్యల్లో ఉన్నామండీ..ఒక రకంగా చెప్పాలంటే ఆర్ధికంగా..మానసికంగా కృంగిపోయి వున్నాము..ఎటూ దిక్కుతోచని పరిస్థితి లో వున్నాము..ఇక్కడినుంచి పోతూ పోతూ..శ్రీ స్వామివారి విభూతి..గంధం..తీసుకెళ్లాము..ప్రతిరోజూ ఇంటినుంచి ఉదయాన్నే స్నానం చేసి..దీపారాధన చేసుకొని..శ్రీ స్వామివారి విభూతిని..గంధాన్ని.. నుదుటిన ధరించడం అలవాటు చేసుకున్నామండీ..కేవలం పదిహేను రోజుల లోపే మాకు చాలా మార్పు కనబడింది..మా దగ్గర అప్పు తీసుకొని..ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు..ఇంటికొచ్చి మరీ చెల్లించి వెళ్లారు..దాదాపు డెబ్భై శాతం వసూలు అయ్యాయి..ఆ డబ్బు చేతికి వచ్చిన మరుక్షణం మేము చెల్లించాల్సిన వాళ్లకు చెల్లించివేశాము..ఇప్పుడు మాకున్న అప్పులన్నీ తీరిపోయాయి..వడ్డీ వ్యాపారం కూడా మానేసాము..ఒకళ్లను పీడించి..ఏడిపించి.. వాళ్ళ ఆర్ధిక బలహీనత మీద చేసే ఆ వ్యాపారం మంచిది కాదని..మాకు తోచింది..వేరే వ్యాపారం చూసుకున్నాము..అంతా ఆ స్వామివారి విభూతి మహిమ..అందుకే మీ దగ్గరనుంచి విభూతి..గంధం..రెండు మూడు సార్లు తెప్పించుకున్నాము..ఈరోజు శ్రీ స్వామివారిని దర్శించుకుని మా మ్రొక్కు చెల్లించుకోవాలని అనుకున్నాము.." అన్నారు..


" రాబోయే శనివారం, ఆదివారం రోజులలోఅన్నదానం చేయాలని అనుకున్నాము..సరుకులన్నీ మేమే తీసుకొస్తాము..సుమారు ఎంతమందికి తయారు చేయాలో మీరు చెపితే..దానికి తగ్గ విధంగా ఏర్పాటు చేసుకుంటాము.." అన్నారు..శనివారం రాత్రికి సుమారుగా వేయి మంది భక్తులు వుంటారనీ.. ఆదివారం మధ్యాహ్నం అయితే..ఎనిమిది వందల మంది భక్తుల కొరకు ఏర్పాట్లు చేయాలనీ.. చెప్పాము..వచ్చే శని, ఆదివారాల్లో రెండుపూటలా తామే చేస్తామని చెప్పారు..


అనుకున్న విధంగానే ఆ దంపతులిద్దరూ అన్నదానం చేశారు..అవకాశం ఇచ్చినందుకు నాకూ మా సిబ్బందికి ధన్యవాదములు తెలిపారు..తిరిగి వెళుతూ..మర్చిపోకుండా శ్రీ స్వామివారి విభూతి..గంధం..రెండూ ఎక్కువ మోతాదులో తీసుకొని వెళ్లిపోయారు..ఇప్పటికీ సంవత్సరం లో కనీసం మూడు నాలుగు సార్లు మనీ ఆర్డర్ ద్వారా నగదు పంపి..విభూతి..గంధం..తెప్పించుకుంటూ వుంటారు..


విభూతి..గంధం..ఈ రెండింటి ద్వారా ఆ దంపతుల భక్తిని శ్రీ స్వామివారు స్థిరపరచారు..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114.. సెల్..94402 66380 & 99089 73699).

వారు ఆరోగ్యంగా ఉంటేనేకదా

 

ఈమధ్య చెన్నై వెళ్ళినప్పుడు కంచికి వెళ్ళి వస్తుండగా బాగా ఆకలివేసి ఓ హోటలు దగ్గరకు వెళ్ళాము. మధ్యాహ్నం సమయం హోటల్ లో భోజనం తయారై వడ్డించడానికి రెడీగా ఉంది. వివిధ రకాల వంటలు వేడి వేడిగా ఉన్నాయి.


బాగా ఆకలిమీద ఉన్న మేము టొమేటోబాత్ తీసుకురమ్మని సర్వర్ కు చెప్పాము. అప్పుడు ఆ హోటల్ మేనేజరు వచ్చి కాసేపు ఆగాలని మర్యాదగా చెప్పాడు. ఎందుకు అని అతన్ని అడిగాము. దానికి అతను ఇలా చెప్పాడు.


" అరటి ఆకులు రావడానికి 10 నిమిషాలు పడుతుంది.అవి రాగానే మీకు అందులోనే టొమేటోబాత్ ఇస్తాము. దయచేసి ఓపిక పట్టండి " అని

చాలా వినయంగా చెప్పాడు. చిన్న హోటల్ అయినా చాలా శుభ్రంగా

ఉంది. చేసేదేం లేక అలాగే కూర్చున్నాము.


కాసేపటికి అరటి ఆకులు రాగానే మాకు టొమేటోబాత్ సర్వ్ చేశాడు. తింటూ అతనితో మాటలు కలిపాము.


" అరటి అకులు లేకపోతే ఏమైంది ??? ఇప్పుడంతా ప్లాస్టిక్ ప్లేట్లు వచ్చాయి కదా! పైగా అవి రేటు కూడా తక్కువే కదా! మీరు అరటి ఆకులోనే వడ్డిస్తున్నారు.

దానికేమైనా కారణం ఉందా? అని అడిగాము.


" నిజమే! మీరు చెప్పినట్లు ప్లాస్టిఫ్ ప్లేట్లు చాలా చవకే అరటి ఆకులతో పోలిస్తే! కానీ, ఆ ప్లాస్టిక్ ప్లేట్లల్లో తింటే రకరకాల జబ్బులు వస్తున్నాయని చెపుతున్నారు. నేనేమీ చదువుకోలేదండీ! అన్నీ మంచిగా ఉన్నవి తింటేనే రోగాల బారిన పడుతున్నాము. నా హోటలుకు వచ్చేవారు ధనవంతులు కాదండీ..... లక్షల్లో రోగాలకు ఖర్చు పెట్టడానికి.

వారు ఆరోగ్యంగా ఉంటేనేకదా మా హోటలుకు వచ్చేది. వారివల్లనే

కదా నా కుటుంబం బ్రతుకుతోంది. కొంతమందికి ఉపాధి కలిగేది వారివల్లనే కదా! అలాంటప్పుడు నేను నా పదార్థాలను వారికి అరటి ఆకుల్లోనే పెట్టడం మంచిదనిపించింది. పైగా అరటి ఆకుల్లో వేడి పదార్థాలు పెట్టినప్పుడు ఆ ఆకులోని ఔషధ గుణాలు వారికి మంచి చేస్తాయని విన్నాను. నాకు ప్లాస్టిక్ ప్లేట్లు వాడితే మహా అంటే 300 మిగులుతాయేమో! కోటీశ్వరుడిని కాలేను కదా! అందుకే కాస్త రేటు ఎక్కువైనా నేను అరటి అకులే వాడతాను. మీరు బాగుంటేనే నేను బాగుంటాను " అంటూ ఆప్యాయంగా మరింత కొసరి కొసరి వడ్డించాడు.


నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చెడిపోయిన పదార్థాలను కూడా మంచివాటిలో కలిపేసి ప్లాస్టిక్ ప్లేట్లల్లో వడ్డించే చాలా పెద్ద హోటల్ వాళ్ళు ఇతని ముందు చాలా చిన్నగా కనిపించారు నాకు. అతని సహృదయానికి నిజంగా మనస్ఫుర్తిగా అభినందించి సంతృప్తిగా బయటకు వచ్చాము.


ఎంతమంది హోటల్ యజమానులు ఇలా ఆలోచిస్తున్నారు చెప్పండి.

నిజంగా ఆ హోటల్ యజమాని అభినందనీయుడు. మీరూ అభినందించాలి.

12-20-గీతా మకరందము

 12-20-గీతా మకరందము

          భక్తియోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అ-అధ్యాయాంతమున ఫలశ్రుతిని చెప్పుచున్నారు-


యే తు ధర్మ్యామృతమిదం 

యథోక్తం పర్యుపాసతే 

శ్రద్ధధానా మత్సరమా 

భక్తా స్తే౽తీవ మే ప్రియాః


తా:- ఎవరైతే శ్రద్ధావంతులై, నన్నే పరమగతిగ నమ్మి {నాయందాసక్తిగలవారై), ఈ అమృతరూపమగు (మోక్షసాధనమైన) ధర్మమును (ఇప్పడు) చెప్పబడిన ప్రకారము  అనుష్ఠించుదురో అట్టి భక్తులు నాకు మిక్కిలి ఇష్టులు.


వ్యాఖ్య:- పైన తెలుపబడిన ధర్మములను శ్రద్ధాభక్తులతో అనుష్ఠించువారికి కలుగు ఫలితమును వచించుచున్నారు, ఏదియైన ధర్మమును బోధించునపుడు దాని ఫలితమునుగూడ చెప్పినచో ఆచరించువారికి దానిపై పరమవిశ్వాస మేర్పడుచుండును. అందువలననే కాబోలు భగవానుడు భక్తునిలక్షణములను పేర్కొని పేర్కొని కట్టకడకు వాని ననుష్టించుటవలన కలుగు గొప్పఫలితమును చెప్పివైచిరి. ఆ ఫలితమేమి? "తే అతీవ మే ప్రియాః' - భగవంతునకు పరమప్రీతిపాత్రులగుటయే. ఇంతకుమించిన ఫలము జీవుల కేమి కావలయును? అదియున్నచో అన్నియు లభించినట్లే, అది లేనిచో తక్కినవి యెన్నియున్నను నిరుపయోగములే. భగవత్కృపకు మించిన వస్తువు ముల్లోకములందును మరియొకటి లేదు. ఏలయనగా, అట్టి కృప మోక్షమునకు దారితీయును. ఎట్లనిన భగవదనుగ్రహముగలవారికి బుద్ధియోగము (తత్త్వవిచారణాశక్తి) సంప్రాప్తించును. (దదామి బుద్ధియోగమ్) దానిచే నతనికి మోక్షము సన్నిహితమగును.


" ధర్మ్యామృతమ్' - పైన తెలుపబడిన ధర్మములు అమృతరూపమున వర్ణింపబడినవి. ఎందువలననగా,

జననమరణములనుండి తప్పించగల సామర్థ్యము వానియందు గలదు. జీవుని అమరునిగ చేయగలశక్తి వానియందు గర్భితమైయున్నది. భగవానుడు కరుణతో అమృతవర్షమును కురిపించిరి. వారివారి బుద్ధియనుపాత్ర నిండుగ ఆ అమృతమును పట్టి తనివితీర త్రాగుట జీవులధర్మము. ఎవరట్లుచేయరో వారు ఆ అమృతమును త్రావు సౌభాగ్యమును చేతులారా జారవిడుచుకొనినవారే యగుచు సంసారదాహపీడితులై దుర్భరయాతనల ననుభవించవలసివచ్చును. అయితే ఆ ధర్మముల నేప్రకారమనుష్టించవలెను?


"శ్రద్ధధానా" - శ్రద్ధతో ననుష్టించవలెనని చెప్పబడినది. ఒకతూరికాదు, రెండుతూర్లుకాదు, భగవాను డనేకతూర్లు ఈశ్రద్ధయొక్క ఆవశ్యకతను గీతయందు పేర్కొనుచుండుట గమనింపదగియున్నది. మరియు "మత్పరమాః" - పరాత్పరుడే పరమగతియని నమ్మి వారిని ధ్యానించుచు ఆయా సుగుణములను, ధర్మములను అనుష్ఠింపవలెను. "అతీవ మే ప్రియాః" అని చెప్పుటవలన, ఆ ప్రకారమాచరించువారు తనకు మిక్కిలి ప్రియులని గీతాచార్యులభావమైయున్నది. పాఠశాలలో ఉపాధ్యాయునకు ప్రీతిపాత్రుడైయుండు విద్యార్థియొక్క భవిష్యద్విద్యాభివృద్ధివిషయమై ఏలాటి సంశయ మెట్లుండదో, తండ్రి యొక్క అభయహస్తము క్రిందనున్న చంటిపిల్లవానియొక్క యోగక్షేమములవిషయమై ఏ సందేహమున్ను ఎట్లుండదో, అట్లే భగవంతునకు మిక్కిలి ప్రీతిపాత్రుడై యుండు జీవునియొక్క మోక్షవిషయమై ఏ సందియమున్ను ఉండదు. ఆతడు కడతేరినట్లేయగును. కాబట్టి ముముక్షువులు త్వరబడి భగవత్ప్రోక్తమగు ఈ ధర్మ్యామృతమును తనివితీర పానముచేసి కృతార్థులగుటకై యత్నింపవలయును, "యే తు" - అని యచ్ఛబ్ద ప్రయోగము చేయుటవలన ఎవరైననుసరియే వానిని శ్రద్ధతో అనుష్ఠించినచో మోక్షభాగులు కాగలుగుదురని భావము.

ప్ర:- శ్రీకృష్ణమూర్తి బోధించిన ఈ ధర్మములెట్టివి? 

ఉ:- అమృతరూపములు. జననమరణములనుండి తప్పించి జీవుని అమరునిగ (ముక్తునిగ) చేయగలిగినవి.

ప్ర:- ఈ ధర్మముల నేప్రకార మాచరించవలెను? 

ఉ:- శ్రద్ధతో, భగవంతునియెడల అపారమైన భక్తితో.

ప్ర:- అట్లాచరించినందువలన కలుగు ఫలితమేమి? 

ఉ:- వాని నాచరించువాడు భగవానునకు మిక్కిలి ప్రీతిపాత్రుడు కాగలడు.


ఓమ్ ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగోనామ ద్వాదశో౽ధ్యాయః 


ఇది ఉపనిషత్ప్రతిపాదకమును, బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు భక్తియోగమును పండ్రెండవ అధ్యాయము.

ఓమ్ తత్ సత్

తిరుమల సర్వస్వం -132*

 *తిరుమల సర్వస్వం -132*


 *అలిపిరి మార్గం-3*



 *అలిపిరి అంటే?* 


 తిరుమలకు మెట్లదారి మరియు కొండపైకి వాహనాలు వెళ్ళే ఘాట్ రోడ్డు, రెండూ ఒకే ప్రదేశంలో, అంజలి ఘటిస్తూ సమున్నతంగా నిల్చొని ఉన్న గరుత్మంతుని విగ్రహం వద్ద ఆరంభ మవుతాయి. ఆ ప్రదేశాన్నే *"అలిపిరి"* గా పిలుస్తారు. దానికా పేరు రావడం వెనుక అనేక కథనాలున్నాయి -


 *"ఆదిపడి"* అనే తమిళ పదబంధంలో - "ఆది" అనే పదానికి "మొట్టమొదట" అని, "పడి" అనే పదానికి "గట్టు" లేదా "ద్వారము" అని అర్థం. తిరుమల కొండకు చేరుకునే మొట్టమొదటి "మెట్టు" ఇక్కడే ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశానికి *"ఆదిపడి"* అనే నామం ఏర్పడి, అదే కాలక్రమంలో *"అలిపిరి"* గా ఆంద్రీకరించబడింది.


 మరో కథనం ప్రకారం, తిరుమలకు ఉన్నట్లుగా చెప్పబడే అనేక మార్గాల్లో, చారిత్రకాధారాలు లభ్యమైనంత వరకూ, ఇదే ప్రప్రథమ మార్గం. అందువల్లనే దీనిని "ఆదిపడి" లేదా "అలిపిరి" అని పిలుస్తారు.


 ఈ ప్రదేశంలో, శ్రీవైష్ణవులు పరమ పవిత్రంగా భావించే, శాఖోపశాఖలు కలిగిన "చింతచెట్టు" ఉండేది. చింతచెట్టు తొర్రలో నుండే తమిళుల ఆరాధ్య దైవమైన నమ్మాళ్వారుల వారు ఉపదేశం చేశారని ప్రతీతి. తమిళంలో – చింతచెట్టును "పులి" గానూ (చింతపండుతో చేసే పులి హోరను గుర్తుకు తెచ్చుకుందాం!), పర్వతపాదాన్ని "అడివారం" గానూ వ్యవహరిస్తారు. అందువల్ల, పర్వత ప్రారంభంలో ఉండే ఈ చింతచెట్టును "అడివారపు పులి", లేదా "అడిపులి" గా పిలిచేవారు. అదే, కాలక్రమాన "అలిపిరి" గా రుపాంతరం చెందింది.


 "అలిపిరి" అంటే, "సూక్ష్మరూపం కలిగిన" అనే మరో అర్థం వస్తుంది. ఇక్కడ శ్రీనివాసుడు "సూక్ష్మరూప ధారి" గా కొలువై ఉంటాడనే నమ్మకం ఉండటం చేత, ఆ ప్రదేశానికి "అలిపిరి" అనే పేరు వచ్చింది.


 శ్రీవెంకటేశ్వరుని మహిమను సాక్షాత్కరింప జేసే మరో అద్భుతమైన, చారిత్రాత్మక కథనం కూడా ఉంది. అదేంటంటే.


 *నాటి "అలీఫిరే!" నే - ఈనాటి అలిపిరి* 


 'అలిపిరి' కి ఆ పేరు రావడం వెనుక, ఒక అజ్ఞాతభక్తుడు విరచించిన *"వేంకటాచల విహారశతకము"* అనే గ్రంథంలో మరో కథనం కూడా ఉంది. దాని ప్రకారం.....


 పదిహేడవ శతాబ్దం ద్వితీయార్థంలో, ఢిల్లీలో మొఘలు చక్రవర్తుల పరిపాలన నడుస్తోంది. దక్షిణాన శ్రీకృష్ణదేవరాయల అనంతరం జరిగిన రాక్షసితంగడి, తళ్ళికోట యుద్ధాల తరువాత విజయనగర రాజుల ప్రాబల్యం క్షీణించడంతో; మొఘలు చక్రవర్తులకు సామంతునిగా ఉన్న నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాన్ని ఆక్రమించి, హిందూ దేవాలయాలపై అత్యాచారాలు చేయసాగాడు. 


 ఆ శతాబ్దపు చివరి దశకంలో, ఢిల్లీకి ఆజ్ఞాబద్ధుడైన నిజాంనవాబు "అలీ" అనబడే కరుడుగట్టిన మహమ్మదీయ ఛాందసవాది ఆధ్వర్యంలో తన అపరిమిత సైన్యాన్ని తిరుమల దేవాలయంపై దండయాత్రకు పంపాడు. హైందవమతానికి ఆయువుపట్టైన శ్రీవేంకటేశ్వరుని ఆలయాన్ని ధ్వంసం చేయండా ద్వారా హిందూమతాన్ని నిర్వీర్యం గావించి, ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడమే గాకుండా; అంతకు ముందు శ్రీకృష్ణదేవరాయల వారు స్వామివారికి సమర్పించిన అమూల్య ఆభరణాలను తస్కరించటం కూడా ఈ దండయాత్ర లక్ష్యం. నవాబు ఆదేశం మేరకు తిరుపతి చేరుకున్న అలీ సైన్యానికి పట్టణ ప్రజలందరూ ఎదురై తమ ఊరిలోని స్త్రీలందరి వద్దనున్న బంగారు ఆభరణాలు స్వీకరించి తిరిగి వెళ్ళిపొమ్మని, స్వామివారి జోలికి వెళ్లవద్దని అభ్యర్థించారు. తాళిబొట్లతో సహా గ్రామస్తుల అందరి ఆభరణాలను చేజిక్కించుకున్నా, విశ్వాసఘాతకుడైన "అలీ" ఒప్పందాన్ని ధిక్కరించి, ముందుగా రచించుకొన్న పథకం ప్రకారం తిరుమలపై దండయాత్రకు ఉపక్రమించాడు. 


 శేషాచల పర్వతపాదం వద్ద, అంటే సరిగ్గా ఇప్పుడు "అలిపిరి" గా పిలువబడే ప్రాంతంలో, అలీకి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. వరాహరూపంలో సాక్షాత్కరించిన స్వామివారు అలీ సైన్యాన్ని నిలువరించారు. అయినా ఆ ముష్కరులు వెనుకకు తగ్గకపోవడంతో, శ్రీవారి ఆగ్రహం వల్ల "అలీ" దృష్టివిహీను డయ్యాడు. గాఢాంధకారంలో అలమటిస్తూ, దిక్కుతోచక విలపిస్తున్న అలీకి తక్షణమే వెనుదిరిగ వలసిందిగా స్వామివారి హెచ్చరిక వినబడింది. కనువిప్పు కలిగిన అలీ వెంటనే శ్రీవారిని క్షమాభిక్ష నర్థించి నేత్రదానం చేయమని వేడుకొన్నాడు. శాంతించిన స్వామివారి ఆదేశానుసారం అక్కడి నుండి "బతుకు జీవుడా!" అనుకుంటూ అలీ నిష్క్రమించడంతో – అక్కడున్న సిపాయి లందరూ, మహమ్మదీయ మతస్తులతో సహా, అంతులేని ఉద్వేగానికి లోనై, "అలీ ఫిరే!" అంటూ నినాదాలు చేశారు. ఈ ఉత్తరభారత పదబంధానికి "అలీ తోక ముడిచాడు" అని అర్థం. ఈ ఉదంతాన్ని పరిసర ప్రాంతాలలోని సంస్థానాధీశు లందరూ సంబరంగా జరుపుకుని, "అలీ ఫిరే!" అంటూ దండోరా వేయించారు. సాక్షాత్తు స్వామివారు సాక్షాత్కరించిన ఆ ప్రాంతానికి, తండోప తండాలుగా భక్తులు తీర్థయాత్రకు తరలి వెళ్ళేవారు. "అలి ఫిరే!" అన్న నానుడి తదనంతర కాలంలో ఆంద్రీకరించబడి, "అలిపిరి" గా స్థిరమైంది. ఎలా వచ్చినప్పటకీ, వినసొంపైన "అలిపిరి" పేరు వినగానే ముప్పిరిగొనే ఆధ్యాత్మిక భావోద్వేగంతో మనసు తనువు

పులకరించి పోతాయి.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*భీష్మ పర్వము తృతీయాశ్వాసము*


*271 వ రోజు*


*యుద్ధారంభం*


సూర్యోదయం కాగానే పాండవులు సేనాసమేతులై రణముకు బయలుదేరారు. సేనకు ముందు భాగంలో శిఖండిని నిలిపారు. ఇరువైపులా భీమార్జునులను, వెనుక వైపు అభిమన్యిని, ద్రౌపదీ పుత్రులను, వారికి ఇరువైపులా చేకితానుడు, సాత్యకి వారి వెనుక ధృష్టద్యుమ్నుడు మొదలగు పాంచాలకుమారులను నిలిపారు. నకుల సహదేవులను ఇరివైపులా నిలువగా ధర్మరాజు వీరందరిని పరిరక్షిస్తూ విరాటరాజు, ద్రుపదుడు మొదలగు రాజులు, కేకయరాజులు, ధృష్టద్యుమ్నుడు మొహరిస్తున్నారు. భేరి తూర్య నాదములు మిన్నంటగా యుద్ధం ఆరంభం అయింది. ఇరుపక్షాలు తీవ్రంగా పోరాడుతూ దేవదానవ యుద్ధాన్ని తలపింపి చేస్తుంది. నకుల సహదేవులు చెలరేగి కౌరవ సేనలను తనుమాడుతున్నారు. భీమార్జునులు కౌరవ సేనను ఊచకోత కోస్తున్నారు. మోత్తం పాండవసేన విజృంభించి కౌరవ సేనను ధ్వంశం చేయ సాగింది. ఇది చూసిన భీష్ముడు కల్పాంతంలో విజృంభించిన రుద్రిడిలా పాండవ సేనపై శరవర్షం కురిపిస్తున్నాడు. రధాశ్వములు, గజములు, కాలబలం నేల కూలుతూ ఉన్నాయి. శిఖండి భీష్మునిపై మూడు బాణములు వేసాడు. భీష్ముడు " నిన్ను బ్రహ్మ స్త్రీగా సృంష్టించాడు. నీవు మధ్యలో పురుషత్వం పొందావు. నీవు నా మీద శరవర్షం కురిపించినా నేను నీ మీద కోపం తెచ్చుకోకుండా చిరునవ్వుతోనే నిలబడతాను కాని నీతో యుద్ధం చేయను " అన్నాడు. అది విన్న శిఖండి " భీష్మా ! ఎంతో మంది రాజులను గెలిచావు. పరశురామునితో పోరి నిలిచావు. నీ శౌర్యం నాకు చూపవా ! నీవు నాతో యుద్ధం చేయకున్నా నేను మాత్రం నిన్ను వదలను క్రూరశరములు వేసి నిన్ను చంపుతాను. నేను ఎవరైతే ఎందుకు నాతో యుద్ధం చెయ్యి " అని కవ్వించాడు శిఖండి. ఇది చూసిన అర్జునుడు " నేడు శిఖండి వైఖరి వింతగా ఉంది. భీష్ముడు పడిపోవుటకు సమయం ఆసన్నమైనట్లు కనపడుతుంది. అందుకే దైవ ప్రేరితుడై శిఖండి ఇలా ప్రవర్తిస్తున్నాడు " అని మనసులో అనుకున్నాడు. అర్జునుడు " శిఖండీ ! ఇన్ని మాటలాడి ఊరకున్న లోకం నిన్ను చూసి నవ్వుతుంది. నీ వెనుక నేను ఉన్నాను నిర్భయంగా భీష్ముని మీద నీ వాడి శరములు వేసి హతమార్చు " అన్నాడు. కాని గాంగేయుడు " అక్కడి నుండి తొలగి పోయి పాంచాల సైన్యమును తనుమాడుతున్నాడు. అర్జునుడు తన సైన్యముతో భీష్ముని ఎదుర్కొన్నాడు. అర్జునిని ధాటికి కౌరవ సేన నిలువలేక పారి పోయింది. సుయోధనుడు అది చూసి " పితామహా ! మీరు చూస్తుండగానే సేనలు పారిపోతుంటే చూస్తూ ఊరుకోవడం న్యాయమా " అన్నాడు. ఆ మాటలకు నొచ్చుకున్న భీష్ముడు " సుయోధనా నేను పది రోజులకు పది వేల మందిని చంపుతానని మాటిచ్చాను. పదివేల మందిని చంపి నీ రుణం తీర్చుకున్నాను. ఈ రోజు యుద్ధంలో నన్ను పాండవులో వారిని నేనో చంపడం తధ్యం. కాని నేను మానవమాతృడను వారు దైవాంశ సంభూతులు కనుక నా చేతిలో వారు మరణించుట అసాధ్యం అయినా నా శక్తి వంచన లేక యుద్ధం చేస్తాను " అని భీష్ముడు బదులిచ్చి తరువాత భీష్ముడు సైన్యమును వెంటబెట్టుకుని పాండవ సైన్యాలను నిర్మూలించ సాగాడు. భీష్మునికి సాయంగా నీ కుమారులు అక్కడ నిలిచి పోరాడుతున్నారు. ఇది చూసిన పాండవులు మత్స్య, పాంచాల, కేకయ, పాండ్య, యాదవ రాజులు తమ సైన్యాలతో వచ్చి ఒక్కుమ్మడిగా భీష్మునిపై లంఘించారు. సమరం సంకులమైంది.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

రణభూమి లో

 > శ్లో॥

> న రణే విజయాత్ శూరో అధ్యయనాత్ న చ పండితః

> న వక్తా వాక్పటుత్వేన న దాతా చ అర్ధ దానతః

> ఇంద్రియాణాం జయే శూరో ధర్మాచరతి పండితః

> హిత ప్రయోక్తిభిః వక్త దాతా సన్మాన దానతః

> భావం:

> రణభూమి లో గెలుచినంత మాత్రం శూరుడు కాలేడు, గ్రంధాలు చదివినంతమాత్రాన పండితుడు కాలేడు, అనర్గళంగా మాట్లాడినంత మాత్రాన వక్త కాలేడు, ధనం ఇచ్చినంత మాత్రాన దాత కాలేడు. 

> ఇంద్రియములను జయించినవాడు శూరుడు, ధర్మాన్ని ఆచరించేవాడు పండితుడు, హితోక్తులు చెప్పేవాడు వక్త, గౌరవంగా సహాయం చేసేవాడు దాత.

######################

అనువాదపద్యము:


శా॥

*పోరాటమ్మున గెల్వ శూరుడగునే? స్పూర్తిన్ జితేంద్ర్యుండెపో*

*ఆరాటమ్మున విద్య గొన్న బుధుడే? యా ధర్మబద్ధుండెపో* 

*భూరిన్ మాటలు చెప్ప వక్త యగునే? ప్రోద్యద్ధితోక్తుండెపో*

*కారుణ్యమ్మున విత్తమీయ ప్రదియే? కాంక్షించి పూజించకన్*

----------------------------------------------------

మగడు=శూరుడు; ప్రది=దాత; పూజించు=గౌరవించు;

----------------------------------------------------

~"కవితాభారతి" 

*~శ్రీశర్మద*

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం - చతుర్దశి - పూర్వాషాఢ -‌‌ భౌమ వాసరే* (28.01.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

Panchaag