24, ఫిబ్రవరి 2023, శుక్రవారం

ఆత్మజ్ఞానం లేని చదువు వృథా*

 *శ్లోకం:*-  

*పఠన్తి  చతురో  వేదాన్!* 

*ధర్మ శాస్త్రాణ్యానేకశ:*! 

*ఆత్మానం  నైవ జానన్తి!* 

*దర్వీ  పాకరసం  యథా!!*! 


తాత్పర్యము - 

*నాలుగు వేదాలు చదువుకున్నా!! ఎన్నో  శాస్త్రాలు  వల్లించినా!! ఏం  లాభం??? నిరంతరం  శాకపాకాల్లో  మునిగితేలే  తెడ్డుకు (గరిటే) వాటి రుచి  తెలియనట్లే!! , ఎన్ని చదివినా తమను తాము తెలుసుకోలేని!.!ఆత్మజ్ఞానం  లేని చదువు వృథా*!

మన సాధన

 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

*పూజలు, నోములు, వ్రతాలు, అర్చనలు, ఆరాధనలు, అభిషేకా లు, తీర్థయాత్రలు, దక్షిణలు, ప్రదక్షిణ లు, నామస్మరణలు యిలాంటి పనులన్నింటినీ మనం ఆధ్యాత్మికం అంటున్నాం. అనుకుంటున్నాం. ఇవేవీ కానివి, వీటికి సంబంధంలేని ఇతరత్రా పనులన్నిటినీ లౌకికమని అంటున్నాం. నిజానికి పూజలు, వ్రతాలు వంటివన్నీ ఆధ్యాత్మికానికి మనల్ని తీసుకువెళ్ళే మార్గాలు. సాధనా సరంజామాలు.*


*కానీ అవే అసలు సిసలైన ‘ఆధ్యాత్మికం’ అని అనలేం. ‘నేను’ అనే స్థాయి నుంచి విస్తృతమై, విశాలమై ‘మనం’ అనే స్థాయికి చేరుకునే ప్రయాణమే ఆధ్యాత్మికం. రాక్షసత్వం నుంచి పశుత్వానికి, పశుత్వం నుంచి మాన వత్వానికి, మానవత్వం నుంచి మాధవత్వానికి చేరుకోవటమే ఆధ్యాత్మికం. సంకుచిత్వం నుంచి సంయుక్త తత్వానికి, ఆటవికం నుంచి ఆత్మ తత్వానికి చేరుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మికం.*


*ఆధ్యాత్మికం అనేసరికి పూర్వ జన్మ సుకృతం, కర్మ ఫలం, ప్రాప్తం, అప్రాప్తం అనే మాటల్ని మనం తరచుగా వింటూ ఉంటాం. అన్నీ వాతంతట అవే అమరిపోయి అన్నీ చకచకా జరిగిపోతుంటే, ‘ఆహా! అది వాడి ప్రాప్తం’ అంటాం. అలా జరగక ఎదురు తిరిగితే ప్రాప్తం లేదంటాం. పూర్వజన్మ ఫలం అంటాం. కర్మ అనుభవించాలి అంటాం. అప్రాప్తం అని కూడా అంటాం.*


 *తలచింది జరిగిందంటే అంతా మన ప్రతిభ అనంటాం. తలచింది జరగని నాడు తలరాతం టూ విధిపై నెడతాం. అయితే భగవంతుడి అనుగ్రహం అనేది ఈ ప్రాప్తం, అప్రాప్తాలు, పూర్వజన్మలు, కర్మలు, సుకృతాల మీదే ఆధారపడి ఉండదు. మన సాధన మీద, మన ప్రయత్నం మీద, దీక్ష మీద, మనం ఉండే స్థితి మీద, పరిస్థితి మీద, మన సంసిద్ధత మీద ఆధారపడి ఉంటుంది.*

అల్ప రక్తపోటు

 అల్ప రక్తపోటు ( Low BP ) సమస్య నివారణ కొరకు సులభ చిట్కా - 


   ఆయుర్వేద పచారీ షాపులలో జటామాంసి అనే మూలిక దొరుకుతుంది . దానిని చూర్ణం చేసి పూటకు 2 గ్రాముల మోతాదుగా మంచినీటితో కలిపి తీసుకొనుచున్న అత్యంత త్వరగా low bp సమస్య తీరును . 


తెలుగు కవిత

 🙏 ఒక తెలుగు అభిమాని కవిత 🙏


పూతరేకులరిసె పూర్ణాలు బొబ్బట్లు

కాకినాడ కాజ కజ్జికాయ

బాదుషాలు జాంగ్రి పాయసమ్ముల కన్న

తీయనైన భాష తెలుగు భాష!


మిసిమి బంగినపల్లి మామిడుల రుచులు

తాటిముంజలు మేటి సీతాఫలాలు

మెరయు చక్కెరకేళి మాధురులకన్న

తీయనైనది నా భాష తెలుగు భాష!


పెసర పిండి  పైన  ప్రియమగు నల్లంబు

దాని పైన మిర్చి దద్దరిల్ల 

జీల కర్ర తోడచేర్చిన ఉప్మాకు   

సాటి తెలుగు  భాష మేటి భాష


స్వర్గ మందు దొఱకు చప్పని అమృతంబు

తాగ లెక సురులు ధరణి లొన 

ఆంధ్ర దెశమందు ఆవిర్భవింతురు     

ఆవ కాయ కొఱకు నంగలార్చి.


కూర్మి తోడ తెచ్చి గోంగూర యాకులు

రుబ్బి నూనె మిర్చి ఇంపు తోడ 

కారమింగువలను  తగిలించి తిను వాడు 

ఘనుడు తెలుగు వాడు కాదె భువిని


ఆట వెలది యనిన అభిమానమెక్కువ

తేట గీతి యనిన తియ్య దనము

సీస పద్యమనిన చిత్తమ్ము రంజిల్లు

కంద పద్యమెంత సుందరమ్ము !! 


తెలుగు భాష.. తెలుగు వంటకములు, తెలుగు తీపి,  ....👏👏👏👍👌😊