18, మే 2021, మంగళవారం

సింగినాదం జీలకర్ర*

 *సింగినాదం జీలకర్ర*

ఇది తరచుగా వినిపించే ఒక సామెత...


*సింగినాదం అంటే  ఆటవికుల చేతిలో ఉంచుకునే వాద్య పరికరం (దీనిని దుప్పి కొమ్ముతో తయారు చేస్తారు)* 


గతంలో ఓడ రేవులలో *సరుకులతో ఒక ఓడ రేవుకు వచ్చిందంటే దాని రాకను తెలియచేస్తూ శంఖారావం* లాంటి శబ్దం చేసేవారు..... 

దాంతో ప్రజలు, వ్యాపారస్తులు పొలోమని ఓడ వద్దకు వెళ్లి తమకు కావలసిన వస్తువులు తెచ్చుకునే వారు.... 


*ఓడ రాకను తెలియచేసేదే సింగినాదం* .  


*ప్రత్యేకించి ఒక ఓడ మాత్రం అన్ని సార్లూ జీలకర్ర తోనే రేవుకు వచ్చేది*  

సింగినాదం వినపడినా ప్రజలు ఓడ వద్దకు వెళ్లేవారు కాదు....  

ఆఁ .................. ఏముందిలే జీలకర్రె కదా!

అని అనుకుని మిన్నకుండి పోయేవారు....

ఆ విధంగా పుట్టిందే  ఈ మాట......

*సింగినాదం జీలకర్ర* .


మరో కథనం...

సింగినాదం జానపదుల, గిరిజనులు ఎక్కువగా వాడే కొమ్ము వాయిద్యం....

 అప్పట్లో మేక, గొర్రె కొమ్ముతో  కూడా ఈ వాయిద్య పరికరం తయారు చేసి వాడేవారు.....  

ఈ *మేక, గొర్రె దుప్పి కొమ్మును* నీటిలో మరిగించి అందులోని గుజ్జును తీసివేసి వాయిద్య పరికరంగా తయారు చేసేవారు..... *సంస్కృతం లో కొమ్మును శృంగం* అని అంటారు..... 

ఆ శృంగనాదమే వాడుక లో *సింగి నాదం* అయుంది. .... 


పల్లెటూళ్లలో గిరిజనులు అడవి ప్రాంతాలనుంచి వచ్చి పల్లెటూళ్లలో జీలకర్ర అమ్ముతుండేవారు..... 

అలా అమ్మడానికి వచ్చినప్పుడు *శృంగ నాదం* అదే 

*సింగి నాదం* ఊదేవారు..... 



అలా వచ్చిందే ఈ  *సింగి నాదం జీలకర్ర,* అనే సామెత....


*సింగి నాదం జీలకర్ర,*  అంటే చాలా చిన్న విషయం అని కూడా మరొక అర్ధం....

*ఓ చేదు నిజం*

 *పథ్యపు మాటలు!*

 *ఓ చేదు నిజం*   

 *ఒక కథానిక* పూర్తిగా చదవండి  


“ పెద్దనాన్నగారూ! నాన్నను నిన్ననే అపోలోలో జాయిన్ చేసా! నాలుగురోజులుగా జ్వరం తగ్గలేదు! ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి. ఛాన్స్ తీసుకోలేక, వెంటనే అపోలోకి తెచ్చా. రాపిడ్ టెస్ట్ పాజిటివ్! నిన్ననే Remdesivir మొదలుపెట్టారు! ఫ్రెండొకడు పెద్ద రికమెండేషన్ మీద రూమ్ ఇప్పించాడు!”.... పాఠం అప్పచెప్పినట్టు చెప్పేసాడు ఋుషి... కొంత ఆయనంటే భయం, కొంత తండ్రిగురించిన ఆందోళనా పాపం పిల్లాడిలో! 


   “ అవునా! ఎలా ఉన్నాడ్రా వాడు?”.... అని అడిగారు సత్యమూర్తిగారు. “ ఇదిగోండి ఇస్తా ! ఒకసారి మాట్లాడండి!”.... అంటూ తండ్రిచేతికి ఇచ్చాడు ఋుషి! “ అన్నయ్యా!”... అంటూ నీరసంగా పలకరించాడు సూర్యం!


“ జాగ్రత్తరోయ్! రోజులేం బాలే! మన కుటుంబంలోనే... ఇప్పటికి డజన్ కేసులు. నలుగురు పోనే పోయారు. మా చుట్టుపక్కల అపార్ట్ మెంట్లలో రోజుకో రెండుమూడు కేసులురా! ఈ సెకండ్ వేవ్ ఊడ్చిపెట్టేస్తోంది జనాలను! ఇంట్లో ఏ కషాయాలో తాగి ఉండకుండా... వెధవ ఆసుపత్రికి ఎందుకు పోయావ్. ఆస్పత్రికి వెళ్ళిన వాళ్ళు సగం మంది తిరిగే రావడం లేదట! పైగా మూడువేల మందు ముప్ఫైవేలకు అమ్ముతున్నారట. అయినా కుర్రవెధవ నీతో ఉండడమేంటి? మొన్న మా రాజారావ్ కొడుకు... తల్లీతండ్రికీ కోవిడ్ వచ్చిందని పరిగెట్టుకొస్తే, వాడికీ మహమ్మారి అంటుకుని... మొత్తం కుటుంబం బలయిపోయారు!”...... అన్నగారి భయభ్రాంతిజనిత వాక్కులకు అప్పటికే వణికిపోతున్నాడు సూర్యం! ... స్వాభావికంగా కుటుంబంలోనే పిరికివాడు, అర్భకుడు అతను. దానికి తోడు కోవిడ్! 


        భర్తచేతిలోంచి ఫోన్ లాక్కున్నట్టు తీసుకుంది సత్యవతమ్మ! 


“ నాయనా సూర్యం!! నేను పెద్దవదిన్ని!”... అందో లేదో భోరుమన్నాడు మరిది! 


“ వదినా! అంతా అయిపోయింది. పిల్లల్ని , సీతనీ దిక్కులేని వాళ్లను చేసి పోతున్నాను. వాళ్ళ పెళ్ళిళ్లు, పుణ్యకార్యాలూ నీదే బాధ్యత ఇకపై”... అంటూ ఏవేవో అనేస్తున్నాడు సూర్యం! 


“ నీ మొహం! ఏవీ అవ్వవు.రెండు రోజుల్లో లక్షణంగా ఇంటికొచ్చేస్తావు. పోనీ నన్ను రమ్మంటావా, అంత భయంగా ఉంటే! 

సూరీ నీకొకటి చెప్పనా, ఏడిద సుబ్బారాయుడి గారు రాసిన నీ జాతకప్రకారం నీకు తొంభై ఎనిమిదేళ్ళ ఆయుర్దాయం ఉంది. ఇప్పటి వరకూ ఆయన చెప్పింది సహస్రాంశమేనా తప్పలేదు. చిన్నప్పుడు మశూచికమే ఏమీ చెయ్యలేదు నిన్ను, ఈ కోవిడ్ ఎంతయ్యా! 

నువ్వు చేసుకునే...నిరంతర మహాసౌరజపం , ప్రాణాయామం ఉత్తినే పోవు. ఇట్టే తరిమేస్తాయి మహమ్మారిని. ధైర్యంగా ఉండు. నాకూ, సీతకూ మానససరోవరం చూపిస్తానన్నావు. మాట నిలబెట్టుకోవాలిగా! కనుక వెర్రి ఆలోచనలు మాని, హాయిగా వైద్యం చేయించుకుంటూ, బలంగా తింటూ,భగవధ్యానం చేసుకో. శుభ్రంగా నయమయిపోతావు. అన్నయ్య చేత ఓ లక్షరూపాయిలు నీ అకౌంట్లో వేయిస్తా. అందాకా వుంచు! అవసరమయితే అందరం నీతో ఉన్నాం! సరేనా నాన్నా!”..... వదినగారి సాంత్వన వచనాలతో సగం రోగం తగ్గనట్టయింది సూర్యానికి! 


   “ అన్నయ్య తెగ భయపెట్టేసాడనుకో వదినా!”... అన్నాడు నీరసంగా! 


“ విన్నానయ్యా! ఏం మనిషో ఏం లోకమో! అలాగేనా మాట్లాడేది? అంత తెలివే ఉంటే... కలెక్టర్ గా రిటయిర్ అయ్యేవారు కాదూ! డిప్టీగా మిగిలిపోయారు! ... అందామె కినుకగా! 


        పకపకా నవ్వాడు సూర్యం,ఆమె మాట్లాడిన తీరుకి ! తనేం తప్పు గా మాట్లాడేడో తెలియక ,అయోమయంగా చూస్తూ, మళ్ళీ టీవీలో కరోనా వార్తలకు అతుక్కుపోయారు సత్యమూర్తి! 

హెచ్చరిక  :-కరొనా పేషెంట్లా మనసులో   ధైర్యాన్ని నింపుదాం  


ధన్యవాదాలతో

ఓలేటి శశికళ

వైశాఖమాస దానములు*

 _*వైశాఖ పురాణం - 7 వ అధ్యాయము*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*వైశాఖమాస దానములు*



☘☘☘☘☘☘☘☘☘




అంబరీష మహారాజు నారదమహర్షికి నమస్కరించి యిట్లనెను. మహర్షీ ! నేను చూచినది సత్పురుషుల చరిత్రవలె మహాశ్చర్యకరముగ నున్నది. ఇక్ష్వాకు మహారాజగు హేమాంగదుడు ముక్తినందిన ధర్మమును మరింత వివరముగ తెలిసికొన గోరుచున్నాను. దయయుంచి నాకు వివరింపగోరుచున్నాను. శ్రుతకీర్తిని మాటలను విని శ్రుత దేవమహాముని నాయనా నీవడిగినది మంచి విషయము తప్పక చెప్పదగినది. బాగు బాగు వినుమని యిట్లు వివరింపసాగెను.


రాజర్షీ శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములగు ధర్మములను వినవలయునను కోరిక యుక్తమైనది. నీ బుద్దికి గల సదాసక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు కథాప్రసంగము నందాసక్తి కలుగును. నీవు యువకుడవు రాజాధిరాజువు. నీకిట్టి విష్ణుకధాసక్తి ధర్మజిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్దుడవైన ఉత్తమ భాగవతుడవని తలచుచున్నాను. కావున జన్మసంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములగు భాగవత ధర్మములను వివరింతును వినుము. యధోచితములగు శుద్ది , మడి , స్నానము , సంధ్యావందనము , దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణములు , అగ్నిహోత్రము , పితృ శ్రాద్దము మానకుండుట , వైశాఖవ్రతాచరణము ఇవి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖమాస ధర్మముల నాచరింపనివానికి ముక్తి లేదు.


సర్వధర్మములయందును వైశాఖవ్రత ధర్మముత్తమము సాటిలేనిది. రాజులేని రాజ్యప్రజలవలె పెక్కు ధర్మములున్నవి. కాని అవి దుఃఖప్రదములు అనగా కష్టములను కలిగించును. సుఖసాధ్యములు కావు. వైశాఖధర్మములు సులభములు , సువ్యవస్థితమగు రాజు పరిపాలనలో నున్న ప్రజలకువలె సుఖశాంతి ప్రదములు. అన్ని వర్ణములవారికి , అన్ని ఆశ్రమములవారికి సులభములు ఆచరణ సాధ్యములు పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను ఇచ్చుట , మార్గమున చెట్లనీడలో చలివేండ్రము నేర్పరచుట , చెప్పులను , పావుకోళ్లను దానమిచ్చుట , గొడుగును , విసనకఱ్ఱలను దానమిచ్చుట , నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట , ఆవుపాలు , పెరుగు , మజ్జిగ , నెయ్యి , వెన్న వీనిని దానము చేయుట , ప్రయాణము చేయువారికి సౌకర్యముగ మార్గముల యందు బావులు , దిగుడుబావులు , చెరువులు త్రవ్వించుట , కొబ్బరి , చెరకు గడల రసము , కస్తూరి వీనిని దానము చేయుట , మంచి గంధమును పూయుట , మంచము , పరుపు దానమిచ్చుట , మామిడిపండ్ల రసము , దోసపండ్ల రసము దానముచేయుట , దమనము , పుష్పములు , సాయంకాలమున గుడోదకము(పానకము) పూర్ణిమయందు పులిహోర మొదలగు చిత్రాన్నముల దానము ప్రతిదినము దధ్యోదనము దానము చేయుట , తాంబూల దానము వైశాఖ అమావాస్య నాడు వెదురుకొమ్మలదానము ముఖ్యములు. ఆ కాలమున వచ్చు సర్వవిధములగు ఫల పుష్పములను వివిధ వస్తువులను దానము చేయవలెను.


ప్రతిదినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలయును. శ్రీమహావిష్ణు పూజ తరువాత విష్ణుకథాశ్రవణము చేయవలయును. అభ్యంగస్నానము వైశాఖమున చేయరాదు. ఆకులో భుజింపవలెను. ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసనకఱ్ఱతో విసరుట , సుగంధ పుష్పములతో ప్రతి దినము విష్ణుపూజ , పండ్లు , పెరుగన్నము నివేదించుట ధూపదీపముల సేవ , గోవులకు ప్రతి దినము గడ్డిని పెట్టుట , సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై జల్లుకొనుట , ముఖ్యకర్తవ్యములు. బెల్లము , శొంఠి , ఉసిరిక , పప్పు , బియ్యము , కూరగాయలు వీనిని దానము చేయవలెను. ప్రయాణీకులను ఆదరించి కుశలప్రశ్నలడిగి కావలసిన ఆతిధ్యము నీయవలెను. ఇవి వైశాఖమాసమున తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో చిగుళ్లతో విష్ణుపూజ , విష్ణువును తలచుకొని పుష్పములను దానమిచ్చుట దధ్యన్ననివేదనము మున్నగునవి సర్వపాపములను హరించును. అఖండ పుణ్యమునిచ్చును.


పుష్పములతో శ్రీమహావిష్ణువు నర్చింపక , విష్ణుకథాశ్రవణము చేయక వ్యర్థముగ కాలమును గడుపు స్త్రీ పతి సౌఖ్యమును, పుత్రలాభమును పొందదు. ఆమె కోరిక లేవియును తీరవు. శ్రీమహావిష్ణువు వివిధరూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖమాసమున సంచరించు సపరివారముగ మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతిగృహమున నివసించును. అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాదికములను చేయని మూడుఢు శ్రీహరి కోపమునకు గురియగును. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మనైదుమార్లు పొందును. ఇట్టి కష్టములు వలదనుకొన్న వారు యధాశక్తిగ వైశాఖవ్రతము నాచరించుచు ఆకలిగలవారి కన్నమును , దప్పిక కలవారికి జలమును ఈయవలెను. జలము , అన్నము సర్వప్రాణుల ప్రాణములకును ఆధారములు కదా. అట్టి దానములచే సర్వప్రాణుల యందున్న సర్వాంతర్యామియగు శ్రీమహావిష్ణువు. సంతోషించి వరములనిచ్చును. శ్రేయస్సును సర్వసుఖ భోగములను , సంపదలను , కలిగించి ముక్తినిచ్చును. జల దానము చేయనివారు పశువులై జన్మింతురు. అన్నదానము చేయనివారు పిశాచములగుచున్నారు. అన్నదానము చేయక పిశాచత్వమునందిన వారి కథను చెప్పుచున్నాను వినుము. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము సుమా !

భగవంతుణ్ణి శబ్దాత్మకుడు

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

*🌷సంస్కార యోగ్యత🌷* 

                🌷🌷🌷

సంస్కారాన్ని మార్చుకొనే యోగ్యత మానవజన్మకి ఉంది... మనిషి ఇది లేదు అది లేదు అని ఈ నాడు ఇన్ని ఏడుపులు వస్తున్నాయి అంటే మనస్సుకి నియంత్రణ అనేది లేకుండా పోయింది. ఇతరులని అణిచివేసి బ్రతుకుతున్నాడు అంటే, మనస్సుకి కలిగిన ఉద్రేకాల వల్ల కదా! కేవలం బాహ్యమైన లోపాల వల్ల ఏడుపు కలగడం లేదు, అవి మనస్సులో ఏర్పడ్డ లోపం వల్ల. 


దీనికి కారణం సంస్కారం అని సహవాసం అని రెండు ఉన్నాయి.  ఇందులో సంస్కారం చాల భలమైనది. సహవాసం కొంత తోర్పడగలదు, కొంత మార్పు తేగలదు.  కానీ సంస్కారం తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది.  సులభంగా అర్థం చేసుకోవడానికి చిన్ని ఉదాహరణ తీసుకుందాం...


మిరప గింజ రుచి ఏమిటి? కారం.  పంచదార రుచి ఏమి? తీపి.  ఒక మిరపగింజను పంచదారలొ వేసారనుకోండి, దానికి తీయటి సహవాసం దొరికింది, కానీ మిరప గింజ యొక్క కారం పోతుందా. సహవాసం ఎంతటిదైనా సంస్కారం భలీయమైనది. అట్లాకాక మిరపకాయను పంచదార పాకంలో ఉడికించినా, దాని ప్రభావం అది చూపించి తీరుతుంది. మిరపగింజయే కాదు చింత పులుపు అయినా, వేప చేదు అయినా తీసుకోండి, సంస్కార ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. 


ఇది మనిషి కంటే ఇతరమైన ప్రాణుల్లో.  కానీ మానవ శరీరం చాల గొప్పది.  సహవాసం, సంస్కారం రెంటినీ బాగు చేసుకోవడానికి యోగ్యమైన ప్రాణి మానవుడంటే.  మిగతా ప్రాణులకి ఎంత చేసినా వాటి ప్రవృత్తి పోదు. కానీ మనిషికి సహవాసం మంచిదైతే సంస్కారాన్ని మార్చుకొనే  యోగ్యత ఉంది, కనుకనే మన పెద్దలు సత్సంఘం, సజ్జన సహవాసం చేయండి అని పదే పదే చెబుతుంటారు. సహవాసం వల్ల బయట కొంత మార్పు కనిపిస్తుంది, ఆ సహవాసం కొంతకాలం సాగితే లోన సంస్కారం కూడా మారుతుంది.  అట్లాంటి అవకాశం ఉంది.  సామాన్య మానవుడికి తన సంస్కారాన్ని మార్చుకొనే యోగ్యత ఉంది. రెంటి వల్ల మారే అవకాశం ఉంది.  ఒకటి శాస్త్రీయమైన ఆచరణ వల్ల, రెండవది భగవంతుని అనుగ్రహ విశేషం చేత. 


మానవ జన్మలో అట్లా మనస్సుని సంస్కరించుకొనే అవకాశం భగవంతుడు ఇచ్చాడు.  మనల్ని మార్చటానికి అద్భుతమైన ప్రపంచాన్ని ఏర్పాటు చేసాడు. ఇందులో మనం బాగుపడటానికి వీలుగా ఉపదేశాన్ని ప్రసాదించాడు. భగవంతుడు ఎప్పుడూ చుట్టు ఉంటాడు, కానీ భగవత్ రూపాన్ని చూసే యోగ్యత లేదు, గుర్తించగలిగే యోగ్యత లేదు. విశ్వసించే యోగ్యత లేదు. 


నేను దేవుణ్ణి..! ఇదిగో నా విరాట్ స్వరూపం అని చూపిస్తే, చూసిన అర్జునుడికే నమ్మకం కలగలేదు, యుద్ధం అంతా పూర్తి అయ్యాక రథాన్ని డేరా వద్దకు తెచ్చి, నేను విజయం సాధించాను, నీవు సారథివి వచ్చి తలుపుతీయాలని తెలియదా అని అడిగాడు కృష్ణుడిని. అంటే నేరుగా కృష్ణుడినుండే విన్నా, విశ్వాసం కలగలేదు. అందుకే భగవంతుడు నేను దేవుణ్ణి అని అనుకొనేట్టు రాడు, ఉపదేశాత్మకుడై ఎప్పుడూ ఉంటాడు.  అందుకే భగవంతుణ్ణి శబ్దాత్మకుడు అని అంటాం.

కవిత

 *#అద్భుతమైన కవిత*


"నేనిక లేనని తెలిశాక  విషాదాశ్రులను 

వర్షిస్తాయి నీ కళ్ళు..

కానీ  నేస్తం అది నా కంట పడదు!

ఆ విలాపమేదో ఇపుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా! 


నీవు పంపించే పుష్పగుచ్ఛాలను 

నా పార్ధివదేహం 

ఎలా చూడ గలదు?

అందుకే... అవేవో ఇప్పుడే పంప రాదా!


నా గురించి నాలుగు మంచి  మాటలు పలుకుతావ్ 

కానీ అవి నా చెవిన పడవు..

అందుకే ఆ మెచ్చేదేదో ఇపుడే మెచ్చుకో !


నేనంటూ మిగలని నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు !

కానీ నాకా సంగతి తెలీదు..

అదేదో ఇపుడే క్షమించేస్తే పోలా?!


నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది

కానీ అది నాకెలా తెలుస్తుంది?

అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా !


నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది

అదేదో ఇప్పుడే గడపరాదూ!


సానుభూతి తెలపడానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావ్.. నా మరణ వార్త విన్నాక! 

సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని?


ఇప్పుడే నావైపు చూడు, నాతో మాట్లాడు, బదులు పలుకు వస్తుంది!"


( *ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత. అందుకే  బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకొందాం.కష్ట సుఖాలు పంచుకొందాం. ఈ రోజు కలిసిన ,మాట్లాడిన వ్యక్తి మళ్ళీ కలుస్తాడో లేదో,మాట్లాడతాడో లేదో  అన్న భయానక పరిస్థితిని సృష్టిస్తోంది కరోనా మహోత్పాతం. అందుకే అందరూ be careful...STAY HOME STAY SAFE*  )

సీనియర్ సిటిజన్స్

 *"సీనియర్ సిటిజన్స్ దయచేసి గమనించండి"*


*_యునైటెడ్ స్టేట్ లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం 51% పైగా వృద్ధులు మెట్లు ఎక్కేటప్పుడు పడిపోతారు._*

*_ప్రతి సంవత్సరం, చాలా మంది అమెరికన్లు మెట్లు ఎక్కేటప్పుడు పడి చనిపోయారు.*


 *నిపుణుల రిమైండర్:*


*_60 సంవత్సరాల తరువాత, ఈ 10 చర్యలకు దూరంగా ఉండాలి._*


 *1. మెట్లు ఎక్కవద్దు.*

*_మీరు తప్పక ఎక్కితే, మెట్ల కేసు రైలింగ్‌లను గట్టిగా పట్టుకొని ఎక్కండి_*

 

 *2. మీ తలను వేగంగా తిప్పకండి.*

*కళ్ళు బైర్లు కమ్మి మీరు క్రింద పడిపోవచ్చు•*


*_3. మీ కాలి బొటనవేలును తాకడానికి మీ శరీరాన్ని వంచవద్దు.🤸🤸*_

 *_మొదట మీ శరీరాన్ని సిద్ధం చేసుకోండి_*


 *4. మీ ప్యాంటు ధరించడానికి నిలబడకండి.* 

*కూర్చుని మీ ప్యాంటు ధరించండి•*


 *_5. నిలబడి ఒక్కసారి గా పడుకోకుండా మీ శరీరం యొక్క ఒక వైపు (ఎడమ చేతి వైపు, లేదా కుడి చేతి వైపు) నుండి కూర్చోని పడుకోండి.*


 *6. వ్యాయామానికి ముందు మీ శరీరాన్ని ట్విస్ట్ చేయవద్దు. మొదట మీ శరీరాన్ని సిద్ధం చేసుకోండి•*


 _*7. వెనుకకు నడవకండి.*_

 *_వెనుకకు పడటం వలన తీవ్రమైన గాయం అవుతుంది.*


 *8. భారీ బరువును ఎత్తడానికి నడుము వంచవద్దు. మీ మోకాళ్ళను వంచి, సగం చతికిలబడినప్పుడు వస్తువును పైకి ఎత్తండి. 🏋‍♀*


 *_9. మంచం మీద నుండి వేగంగా లేవకండి. మంచం నుండి లేవడానికి ముందు కొన్ని నిమిషాలు వేచి ఉండండి.*


 *10. వాష్‌రూమ్‌లో అధిక శక్తిని ఉపయోగించవద్దు. ఇది సహజంగా రావనివ్వండి.*


 *ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఎల్లప్పుడూ చురుకుగా ఉండాలి మరియు*


          🥀🌹

*అన్ని బాదలకి దివ్య ఔషదo*

*చిరునవ్వు ఒకటే🥀🌹🥀*


       🥀🌹🥀

*ఎన్ని కష్టాలు వచ్చినా సరే*

*గుండె నిబ్బరంతో ఉంటూ🥀🌹🥀*


        🥀🌹🥀

*పెదవులపై నీ చిరునవ్వు ని ఎప్పటికి చెదరనివ్వకు నేస్తం🥀🌹🥀*


          🥀🌹🥀

*నీ చిరునవ్వు కి నీ కష్టాలు*

*దాసోహం అవుతాయి నేస్తం 🥀🌹🥀*


                  

 *దయచేసి అందరూ సీనియర్లకు ఫార్వార్డ్ చేయండి 💐🙏🏼*

పాజిటివ్ పదనిసలు

 💐 *హాయిగా సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు కదా..* 💐 👍మొత్తం చదవండి-భయపడకండి.👍

*పాజిటివ్ పదనిసలు* 

మా పక్క ఇంటి ఆయన

వచ్చి బైక్ అడిగాడు

హాస్పిటల్ కి వెళ్లి టెస్ట్ రిపోర్ట్ తీసుకుని వస్తానని అన్నాడు! 

బైక్ తాళం ఇచ్చాను. ఒక గంట తరువాత వచ్చాడు. రాగానే తాళం తిరిగిచ్చి ధన్యవాదాలు చెప్పి, బండి ఇచ్చినందుకు, గట్టిగ కౌగలించుకుని

వెళ్ళాడు!!

వాళ్ళావిడ గుమ్మం లోనే  ఎదురొచ్చి

"ఏమయ్యింది రిపోర్ట్?"

అని ఆదుర్దాగా అడిగింది!


ష్ ..అసలే ఎండ లో వచ్చాను..🤦🏻‍♂️

కాసిని మంచి నీళ్లు ఇచ్చి అడగొచ్చుగా అంటూ, కుర్చీ లో కూలబడుతూ ..

*పాజిటివ్ వచ్చింది" అన్నాడు!* 


ఆ మాట నా చెవిన కూడా పడింది??

*దెబ్బకి గుండెల్లో రాయి పడింది!*😩😩


గబా గబా , 

బాత్రూంలోకెళ్ళి , 

డెట్టాల్ సబ్బుతో రుద్ది-రుద్ది

 రెండు సార్లు స్నానం చేసాను!

బండి మొత్తం లైజాల్ తో కడిగాను!!

బైక్  తాళంని, శానిటైజర్ తో ముంచేసాను!😩


అయినా....ఇంట్లో వాళ్ళు నాకు దూరంగా జరుగుతూ సణుగుతూనే వున్నారు ...🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️

*నన్ను అనుమానంగా చూస్తున్నారు!!!*

ఎవరికి  పడితే వాళ్లకి బైక్ ఇచ్చెయ్యడమేనా?? అని శ్రీమతి......   ఇస్తే ఇచ్చారు ఆయనికి *షేక్ హాండ్స్ ఎందుకిచ్చారు* అని కొడుకు!  మీకు *అతి వేషాలు*

మొహమాటాలు ఎక్కువయ్యాయి  అని మా అమ్మాయి .....🤦🏻‍♂️

సణుగుతూనే వున్నారు !!!


నాకు, కోపం, చికాకు అన్నీ హై లెవెల్ లో వచ్చేసాయి !!😡😡😡😡😡😡😡

వెంటనే  పక్కింటికెళ్లి , ఆయన్ని దులిపేసాను.

కొంచెం మీరు మ్యానెర్స్  నేర్చుకోండి సర్ ........

మీ రిజల్ట్  పాజిటివ్ వచ్చిందని తెలిసినా...... 

నాకు షాక్ హ్యాండ్ ఇవ్వడం ,

కౌగిలించుకోవడం ...

ఇవి శాడిస్ట్ లక్షణాలు !!!    😡🤦🏻‍♂️😡

మీ లాంటి వారికి, 

హెల్ప్ చెయ్యడం నాది బుద్ధి తక్కువ ",... అని గట్టిగా అరిచేసి వచ్చేస్తుంటే...... 


*వాళ్ళావిడ , లోపలి నుండి వచ్చి* ..

నా చేతులు పట్టుకుని బ్రతిమాలుతూ ...

అయ్యో అంకుల్ అలా తప్పుగా అనుకోవద్దు మమ్మల్ని.....    అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.... 😢😢😢😢

*అవును అంకుల్*...

*ఆ రిజల్ట్ నాది కాదు మాఆవిడది" అన్నాడు వాళ్ళ ఆయన!!*


*Again shocked*--అయ్యబాబోయ్  ....🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️

నేను మళ్ళీ స్నానం చెయ్యాలరా బాబూ ...

*ఇప్పుడు ఆవిడ కూడా నా చేతులు పట్టుకుందిగా* ???

*నా ఖర్మ...*

అనుకుంటూ, నేను కళ్ళ  నీళ్లు పెట్టుకోవడం చూసి....😩😩😩😩😩


( *ట్విస్ట్ కొరకు wait చేయండి* )







అవును అంకుల్...

ఆ టెస్ట్ రిజల్ట్ మా యావిడది...పాజిటివ్ వచ్చిన మాట నిజమే...కానీ...కానీ..అని సణుగుతూ

అది మా ఆవిడ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ అంకుల్!

అన్నాడు ఆ పక్కింటి పెద్ద మనిషి ! తాపీగా........😊😊😊😊  



😊😊జస్ట్ రిలాక్స్...😊😊    అన్నిటికి భయపడకండి.  *ఈ భూమ్మీద నూకలు బాకీ ఉన్నన్ని రోజులు ఎవ్వడు ఏమి చేయ లేడు.*🙏💐🙏

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*గురుబోధ గురించిన వివరణ..అవధూత లక్షణం..*


*(ముప్పై ఒకటవ రోజు)*


శ్రీ స్వామివారు ధ్యానం లో కూర్చుని సమాధి స్థితిలోకి వెళ్లిపోయేవారు..అలా ఎంతసేపు ఉండిపోతారన్నది ఎవరికీ తెలియదు..ఒక్కొక్కసారి సాయంత్రం దాకా..లేదా ఏ అర్ధరాత్రికో..ఇంకోసారి మరుసటిరోజు ఉదయానికో..ఇలా..ఒక నిర్దిష్ట సమయమన్నది లేకుండా వుండేవారు..ఎంతసేపు సమాధి స్థితిలో వున్నా కూడా..వారు బైటకు వచ్చేసరికి వారి ముఖంలో ఒక అద్భుత తేజం గోచరిస్తూ ఉండేది..స్వచ్ఛమైన చిరునవ్వు తో..ఎంతో ప్రశాంతంగా వుండేవారు..


ఒకరోజు సాయంత్రం వేళ..శ్రీ స్వామివారు వరండాలో కూర్చున్నారు..ఆసరికి మొగలిచెర్ల గ్రామస్థులు కూడా కొంతమంది శ్రీ స్వామివారిని చూద్దామని వచ్చి వున్నారు..శ్రీధరరావు దంపతులూ అక్కడే వున్నారు..వచ్చిన అందరికీ ఆధ్యాత్మికంగా ఏదైనా చెప్పదలచారో.. లేక..శ్రీధరరావు దంపతులకు పరోక్షబోధ చేయదలిచారో..మొత్తంమీద గంభీర కంఠస్వరం తో ఉపన్యాస ధోరణిలో ప్రారంభించారు..


"సాధారణంగా అందరూ అనేమాట..అన్ని మంత్రాలూ పుస్తకాలలో అంగన్యాస కరన్యాసాలతో సహా వ్రాసి ఉంటాయి కదా..వాటిని జపిస్తే చాలదా?..మళ్లీ ప్రత్యేకంగా "గురుబోధ" ఎందుకూ..? అని!..కానీ అది తప్పు!..శిష్యులలో కూడా ఉత్తమ..మధ్యమ.. అధమ.. సంస్కారం గల శిష్యులు వుంటారు..


"రామకృష్ణపరమహంస..రమణ మహర్షి లాటి వారు ఉత్తమ తరగతికి చెందిన వారు..రామకృష్ణ పరమహంస కు ఆయన గురువుగారు "తోతాపురి" గారు తాంత్రిక సాధన గురించి బోధిస్తున్న తరుణంలోనే..సమాధి స్థితి పొంది..అప్పటిదాకా బోధిస్తున్న గురువుగారినే విభ్రాంతి కి లోనయ్యేటట్లు చేశారు..అంటే దీనర్థం వినండి..గురుబోధ జరిగే సమయం లోనే..అందులోని సారాంశాన్ని గ్రహించి..అది తు. చ. తప్పకుండా పాటించి..గురువు కృపను పొందగలిగినవాడు..ఉత్తమ శిష్యుడు..


"కొంతమంది గురుబోధ స్వీకరించి.."ఆ జీవితం చాలా ఉంది..ఇప్పుడే ఇవన్నీ అవసరమా?..మెల్లిగా చేద్దాం.." అనుకుంటూ..ఏ పది పన్నెండేళ్లకో కోటి జపం పూర్తి చేసి..గురువు ఋణం తీర్చుకుంటారు..వీళ్లకు కష్టాలు వచ్చినప్పుడు..గురువు బోధించిన మంత్రాన్ని శంకిస్తారు..గురువునూ అనుమానిస్తారు.. మరలా ఆ గురువే ధైర్యం చెపితే..మరలా ప్రారంభిస్తారు..వీళ్ళు మధ్యమ స్థాయి శిష్యులు.." అంటూ ప్రభావతి గారి వైపు చూసి.."అమ్మా!..నీలాటి వాళ్ళు ఈ కోవకు చెందుతారు" అన్నారు..


"ఇక..అధమ స్థాయి శిష్యులు..వీళ్ల గురించి ఎంత తక్కువ చెపితే..అంత మంచిది..వీళ్లకు గురుబోధ అన్నది కేవలం గొప్పగా చెప్పుకోవడానికే తప్ప..తాము ఆచరించరు.."ఆ గురువు గారు చెప్పారు..మనం విన్నాం..సంసారాలు చూసుకోవాలి కదా..పొద్దస్తం జపం అంటూ కూర్చుంటే..పనులేలా సాగుతాయి..చేద్దాం లే..తీరికున్నప్పుడు..అయినా గురువు కు మనమీద కరుణ వుంటే..ఆయనే అన్నీ చూసుకోడా?..కష్టం వచ్చినప్పుడు ఆయన శరణు వేసుకుంటే..అన్నీ ఆయనే సరి చేస్తాడు..మనకెందుకొచ్చిన శ్రమ!.."అనుకుంటూ వుంటారు.."


"అందుకే గురుబోధ చేసేముందు..శిష్యుని మానసిక పరిణితి ని గ్రహించి..మంత్రోపదేశం చేయాలి..అర్హత లేని వారికి ఉపదేశం చేస్తే..గురువు కూడా సద్గతి పొందడు!.." అన్నారు..


"నాయనా!..దత్తాత్రేయుడు ని "సద్గురువు".."అవధూత"...అంటారు..మీరు వివరంగా చెప్పగలరా?.." అన్నారు ప్రభావతి గారు..


శ్రీ స్వామివారి ముఖంలో ఒక్కసారిగా సంతోషంతో కూడిన వెలుగు వచ్చింది..ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని ధ్యానం లోకి వెళ్లిపోయారు..అపరితమైన ఆనందం ఆయన వదనం లో తాండవిస్తోంది..శ్రీ స్వామివారు ఆపాదమస్తకమూ పులకించిపోయినట్లుగా..ఒకానొక పారవశ్యపు స్థితి లోకి ఉండిపోయారు..


"అమ్మా!..మంచి వివరణ కోరావు తల్లీ!..ఈరోజు తప్పకుండా చెపుతాను..శ్రీ దత్తాత్రేయ అవతారం అంటే నాకు ప్రత్యేకమైన భక్తి.. గౌరవం..అభిమానం..ఆ స్వామి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..నా శక్తిమేరకు మీకు వివరిస్తాను..ముందుగా కొన్ని విషయాలు తెలిపి..ఆపై..ఆ దత్తుడి గురించి మాట్లాడతాను..శ్రద్ధగా వినండి.." అన్నారు..


"అవధూత అంటే..ఒకవిధంగా..ముక్తసంగుడు..జీవన్ముక్తుడు.. కారణ జన్ముడు..అవధూత పైకి ఆడంబరంగా కనిపించడు.. పసిపాపలా..పిచ్చివాడిలా..పిశాచరూపుడిగా.. అంటే..శరీర శుభ్రత పాటించకుండా..ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా..రకరకాల అమాయకపు వేషాలతో ప్రవర్తిస్తూ వుంటారు..అంతరంగంలో నిత్య సమాధి స్థితి లో వుంటారు.." అని చెప్పి కళ్ళు మూసుకొని..ఏదో ఆలోచిస్తూ..


"అమ్మా..ఇది రాక్షస గడ్డ!..ఇక్కడ భక్తి..భగవంతుడు..సాధుపూజ..అన్నవి చాలా తక్కువ మందికే తెలుసు..చెప్పినా వినిపించుకోరు..పైగా హేళన చేస్తారు..రాక్షసత్వం ప్రబలిన చోట..దానిని అదుపు చేయడానికి ఒక మహాత్ముడు ఉద్భవిస్తాడు..ఆయన బోధలు..ప్రవర్తన..వీళ్ళలో పరివర్తన తెస్తుంది..అదే ఉత్తర హిందూ దేశంలో చూడండి..నేటికీ..అవధూతలంటే ఎంత గౌరవం ఇస్తారో..ఒక సాధువు తమ ఊరికి వచ్చి బస చేస్తే..ఆ ఊరిలో వుండే ధనవంతులు..బీదవారు..ఎవరైనా సరే..అతని సేవ చేసుకుంటారు..ఏనాడూ ఇల్లు దాటిరాని స్త్రీలు కూడా ఆ సాధువు కోసం ఆహారపదార్ధాలు..మిఠాయిలు..చేత పట్టుకొని వస్తారు..ఆ మహనీయుడు తమ పళ్లెం లోని పదార్ధాలలో ఒక్క మెతుకు ముట్టుకుని రుచి చూసినా..తమ పది తరాలు సుభిక్షంగా వుంటాయని వాళ్ళ నమ్మకం..అది నిజం కూడా!.."


అవధూతలు..దత్తాత్రేయుడి గురించిన వివరణ రేపు కూడా...


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

సనందులవారి గురుభక్తి

 ✍🏼 .... నేటి చిట్టి కథ


జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య గారి  శిష్యులలో ఒకరైన పద్మపాదుల వారి అసలు పేరు సనందన .  ఈ కథ సనందులవారి గురుభక్తిని చాటి చెప్తుంది.  


ఒక రోజు శంకరాచార్యుల వారు కాశిలో ఉన్నప్పుడు, గంగా నది ఒడ్డున సనందనుడు గురువుగారి తడి బట్టలను ఆరేస్తున్నారు. మరొక వైపు శంకరాచార్యుల వారు నదిలో

స్నానం చేసి తడి బట్టలతో బయటికి వచ్చి నిలబడ్డారు. పొడి బట్టలను తెమ్మని శిష్యుడిని పిలిచారు


సనందుడు గురువుగారిని తడి వస్త్రములతో చూడలేకపోయాడు.ఆయన పట్ల ఉన్న అమితమైన భక్తి ,ప్రేమల కారణంగా సనందుడు, ఎక్కడ ఉన్నాడో ఆలోచించకుండా,వెంటనే వెళ్ళి ఆయనకి పొడి బట్టలని అందించాలని అనుకున్నాడు.


గంగా నది దాటాలి  అంటే పడవలో వెళ్ళాలి, అనికూడా ఆలోచించించ లేదు.


సనందుడికి ఒక్కటే ఆలోచన ఏమిటి అంటే గురువువుగారికి పొడి వస్త్రములు అందించడం. అంతే !


అలలని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా హుటాహుటిన బయలుదేరాడు.  


నేలమీద నడిచినట్టు , గంగా నదిలో నడుచుకుంటూ , గురువుగారి దగ్గరకి వెళ్ళిపోయాడు.


ఒక వేళ తాను నదిలో మునిగిపోతే ఉన్న పొడి బట్టలు కూడా తడిసిపోతాయని కూడా అతనికి తట్టలేదు. మరి అటువంటి భక్తులకి భగవంతుడు అండగా నిలవడా ?


సరిగ్గా అదే జరిగింది.


సనందుడు నడుస్తుండగా  గంగా దేవి నది పొడుగునా తామర పువ్వులతో దారి పరిచింది



తాను వేసే ప్రతి అడుగుకి ఒక తామర పువ్వు వికసించడం చూసి అందరూ ఆశ్చర్య పోయారు.


ఈ విధంగా సనందన సునాయాసంగా నదిని దాటి, గురువుగారి దగ్గరకి స్వయంగా వచ్చి  పొడి వస్త్రములను అందించాడు.


అప్పుడు శంకరాచార్యులు “నదికి ‘అవతల ఉన్న నువ్వు ఇంత తొందరగా నదిని  ఎలా దాటగలిగావు’?అని ప్రశ్నించారు. సనందనడు ‘గురువుగారు !మిమ్మల్ని తలుచుకుంటేనే , ఈ సంసారం అనే సముద్రంలో నీరు, మోకాళ్ళ లోతుకి వెళ్ళిపోతుంది.’ అటువంటి మీరు ఆజ్ఞాపించినప్పుడు నేను నదిని దాటడంతో ఆశ్చర్యమేముంది “ అని వినయంగా సమాధానము ఇచ్చాడు.  


శంకరాచార్యులు వారు, సనందుడికి  తామరపువ్వులు పరిచిఉన్న త్రోవని చూపిస్తూ సనందుడి అడుగులకి తామరపువ్వులు వికసించాయి.  కాబట్టి అతనికి ‘పద్మపాదా ‘ అని పిలిచారు.


నీతి:


ఎవరైతే అచంచల  భక్తి, విశ్వాసములతో గురుపాదములను శరణు వేడుతారో వారి మంచి చెడ్డలన్నీ గురువు చూసుకుంటారు.


🍁🍁🍁🍁🍁🍁🍁



అణుమాత్రాత్మకం దేహం షోడషార్ధం ఇతి స్మృతమ్‌

 ఆద దీత యతో జ్ఞానం తం పూర్వం అభివాదయేత్‌


అణు మాత్రమైన దేహములో అయిదు పంచ భూతములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు అనే పదహారింటి నివాసం అని ఆ దేహం గురించి ఆ దేహములో ఉండే ఆత్మ గురించి ఆత్మలో ఉండే పరమాత్మ గురించి ఎవరి వల్ల తెలుసుకుంటామో ముందు అతనికి నమస్కరించాలి. అనగా షోడశ వికారములు కల శరీరాన్ని ఇచ్చిన వారు తల్లిదండ్రులు. ఈ శరీరంలో ఇవన్నీ ఉన్నాయని నీవు పూర్వ జన్మలో చేసుకున్న కర్మే నీకు ఈ శరీరాన్ని తల్లిదండ్రుల ద్వారా ప్రసాదించినది. కర్మ ఫలాన్ని ఇచ్చేవారు తల్లిదండ్రులు జ్ఞాన ఫలాన్ని ఇచ్చేవారు గురువు. అందువలన తల్లిదండ్రుల వద్ద ఉన్నపుడు మొదట వారికి నమస్కరించవలెను. వారు కాక తక్కిన వారు ఎవరున్నా మొదట గురువుకు నమస్కారం చేయవలెను. తల్లిదండ్రులు ఇచ్చినది అణుమాత్ర దేహం, గురువు ఇచ్చినది మేరువంత జ్ఞానము కావున గురువుకు ముందుగా నమస్కరించవలెను.


🍁🍁🍁🍁🍁

మృకండు మహర్షి

 *రేపు మృకండు మహర్షి జయంతి*



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




*మృకండు మహర్షి తపస్సు*



మృకండు మహర్షి సార్థక నామధేయుడు. ఆయన తపస్సులో లీనమై నిశ్చలుడై ఉన్న సమయంలో ఆయన శిల వలె ఉండడం వల్ల మృగములు వచ్చి తమ కండుయాన్ని *(దురద పోవడానికి జంతువులు రాళ్లకు శరీరాన్ని రాపిడిచేయడం)* తీర్చుకొనేవి. మృగముల కండుయాన్ని తీర్చినవాడు కాబట్టి ఆయనను మృకండు మహర్షి అని పిలిచేవారు. మరుద్వతి అనే మహాసాద్వి ఆయన భార్య. వారి ఉన్న ఏకైక లోటు సంతానం లేకపోవడం. పుత్రులు  లేకపొతే పై లోకాలలో ఉన్నత గతులు ఉండవు అని భావించి వారణాశికి తపస్సు చేయడానికి సతీసమేతంగా బయలు దేరుతాడు. వారణాశిలో వారు రెండు లింగాలు ప్రతిష్ఠించి, శివుడు గురించి ఘోర తపస్సు చేస్తారు. మహాదేవుడు తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై మృకండ మహర్షిని మరోమారు పరీక్ష చేయడానికి, సద్గుణుడై 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు కావాలా లేక దుర్గుణుడైన చిరంజీవి కావాలా అని ప్రశ్నించగా మృకండు మహర్షి సద్గుణుదైన 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు చాలంటాడు. మహదేవుడు సంతసించి పుత్రుడ్ని ఇచ్చాను అని పలికి అదృశ్యమౌతాడు.


*సప్తర్షులు ఆశీర్వచనం*


మహాదేవుని మాట ప్రకారం మరుద్వతి గర్భవతి అయి 9 నెలలు నిండాక దివ్యతేజస్సు కలిగిన పుత్రుడ్ని ప్రసవించింది. మృకండు మహర్షి కొడుకు కావడం వల్ల వానికి *'మార్కండేయుడు'* అని నామకరణం చేశారు. 7 సంవత్సరాలు 3 నెలలు నిండిన వెంటనే మార్కండేయుడికి ఉపనయనం చేశారు. రోజులు ఇలా జరుగుతుండగా ఒకరోజు సప్తఋషుల మృకండ మహర్షి చూడడానికి వస్తారు. మార్కండేయుడు సప్తఋషులకు నమస్కరించిన వెంటనే సప్తఋషులు చిరంజీవా అని దీవిస్తారు. మృకండు మహర్షి ఇది విని తనకొడుకు నిజంగా చిరంజీవి అవుతాడా అని అడుగగా సప్తఋషులు దివ్యదృష్టితో శివునికి మృకండునికి జరిగిన సంవాదాన్ని గ్రహిస్తారు. వీరు మార్కండేయుడుని బ్రహ్మ దగ్గరకు తీసుకొనిపొయి బ్రహ్మ చేత కుడా చిరంజీవి అని దీవింపచేస్తారు. ఆ తరువాత దివ్యదృష్టితో మృకండు మహర్షికి శివునికి మధ్య జరిగిన సంగతి తెలుసుకొని మార్కండేయుడిని నిరంతర శివారాధన చెయ్యమని చెప్పి బ్రహ్మ కూడా శివుని గురించి తపస్సు చేసి మార్కండేయుడుడిని చిరంజీవి చెయ్యమని అడుగుతాడు.



*నారదుడు యముడిని మార్కండేయుడుని కలవడం*


మృకండు మహర్షికి శివునికి మధ్య జరిగిన సంవాదాన్ని సప్తఋషులు బ్రహ్మ పలికిన ఆశీర్వచనాలు గురించి నారదుడు యముడుకి చెప్పి 16 ఏళ్ళు నిండిన వెంటనే మార్కండేయుని ప్రాణాలు  తీయ్యకపొతే ప్రపంచానికి యమడి భయం పొతుందీని చెప్పి మార్కండేయుని దగ్గరకు వెళ్తాడు. నారదుడు మార్కండేయునికి నిరంతర శివారాధన చెయ్యమని చెప్తాడు.


*మార్కండేయుడు చిరంజీవి అవడం*


విష్ణువునుపూజిస్తున్న మార్కండేయుడు

16 సంవత్సరాలు నిండిన రోజు యముడు తనకింకర్లుని మార్కండేయుడి ప్రాణాలు తీసుకొని రమ్మని పంపుతాడు. యమకింకరులు మార్కండేయుడి తేజస్సు చూసి మార్కండేయుడి ప్రాణాలు తేవడం తమవల్ల కాదు అని యముడికి చెబుతారు. వెంటనే యముడు తన దున్నపోతుమీద మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి బయలుదేరతాడు. యముడు వచ్చేటప్పటికి మార్కండేయుడు అకుంఠిత భక్తితో శివారాధన చేస్తున్నాడు. యముడు తన యమపాశాన్ని విసిరేటప్పటికి మార్కండేయుడు  శివలింగాన్ని కౌగలించుకొని శివామహాదేవా కాపాడు అని మార్కండేయుడు అన్నవెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి కాలరూపుడై యముడిపైకి వస్తాడు. దీన్ని చూసి యముడు భయపడిపొయి మహాదేవా క్షమించు కరుణించమంటాడు. శివుడు  యముడ్ని క్షమించి మార్కండేయునితో నాయనా చిరంజీవి ! నువ్వు పుట్టినప్పటి నుంచి చిరాయుర్ధాయం కలవాడివి. నీ తండ్రి పుత్రుడిన్ని కోరుకోమన్నప్పుడు పుత్రుడ్ని ఇచ్చాను అని చెప్పాను కాని 16 ఏళ్ళు మాత్రమే బ్రతికే పుత్రుడ్ని ఇచ్చాను అనలేదు. ఇప్పటికి కూడా చిరంజీవిగా ఉన్నాడు.