💐 *హాయిగా సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు కదా..* 💐 👍మొత్తం చదవండి-భయపడకండి.👍
*పాజిటివ్ పదనిసలు*
మా పక్క ఇంటి ఆయన
వచ్చి బైక్ అడిగాడు
హాస్పిటల్ కి వెళ్లి టెస్ట్ రిపోర్ట్ తీసుకుని వస్తానని అన్నాడు!
బైక్ తాళం ఇచ్చాను. ఒక గంట తరువాత వచ్చాడు. రాగానే తాళం తిరిగిచ్చి ధన్యవాదాలు చెప్పి, బండి ఇచ్చినందుకు, గట్టిగ కౌగలించుకుని
వెళ్ళాడు!!
వాళ్ళావిడ గుమ్మం లోనే ఎదురొచ్చి
"ఏమయ్యింది రిపోర్ట్?"
అని ఆదుర్దాగా అడిగింది!
ష్ ..అసలే ఎండ లో వచ్చాను..🤦🏻♂️
కాసిని మంచి నీళ్లు ఇచ్చి అడగొచ్చుగా అంటూ, కుర్చీ లో కూలబడుతూ ..
*పాజిటివ్ వచ్చింది" అన్నాడు!*
ఆ మాట నా చెవిన కూడా పడింది??
*దెబ్బకి గుండెల్లో రాయి పడింది!*😩😩
గబా గబా ,
బాత్రూంలోకెళ్ళి ,
డెట్టాల్ సబ్బుతో రుద్ది-రుద్ది
రెండు సార్లు స్నానం చేసాను!
బండి మొత్తం లైజాల్ తో కడిగాను!!
బైక్ తాళంని, శానిటైజర్ తో ముంచేసాను!😩
అయినా....ఇంట్లో వాళ్ళు నాకు దూరంగా జరుగుతూ సణుగుతూనే వున్నారు ...🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
*నన్ను అనుమానంగా చూస్తున్నారు!!!*
ఎవరికి పడితే వాళ్లకి బైక్ ఇచ్చెయ్యడమేనా?? అని శ్రీమతి...... ఇస్తే ఇచ్చారు ఆయనికి *షేక్ హాండ్స్ ఎందుకిచ్చారు* అని కొడుకు! మీకు *అతి వేషాలు*
మొహమాటాలు ఎక్కువయ్యాయి అని మా అమ్మాయి .....🤦🏻♂️
సణుగుతూనే వున్నారు !!!
నాకు, కోపం, చికాకు అన్నీ హై లెవెల్ లో వచ్చేసాయి !!😡😡😡😡😡😡😡
వెంటనే పక్కింటికెళ్లి , ఆయన్ని దులిపేసాను.
కొంచెం మీరు మ్యానెర్స్ నేర్చుకోండి సర్ ........
మీ రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని తెలిసినా......
నాకు షాక్ హ్యాండ్ ఇవ్వడం ,
కౌగిలించుకోవడం ...
ఇవి శాడిస్ట్ లక్షణాలు !!! 😡🤦🏻♂️😡
మీ లాంటి వారికి,
హెల్ప్ చెయ్యడం నాది బుద్ధి తక్కువ ",... అని గట్టిగా అరిచేసి వచ్చేస్తుంటే......
*వాళ్ళావిడ , లోపలి నుండి వచ్చి* ..
నా చేతులు పట్టుకుని బ్రతిమాలుతూ ...
అయ్యో అంకుల్ అలా తప్పుగా అనుకోవద్దు మమ్మల్ని..... అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.... 😢😢😢😢
*అవును అంకుల్*...
*ఆ రిజల్ట్ నాది కాదు మాఆవిడది" అన్నాడు వాళ్ళ ఆయన!!*
*Again shocked*--అయ్యబాబోయ్ ....🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
నేను మళ్ళీ స్నానం చెయ్యాలరా బాబూ ...
*ఇప్పుడు ఆవిడ కూడా నా చేతులు పట్టుకుందిగా* ???
*నా ఖర్మ...*
అనుకుంటూ, నేను కళ్ళ నీళ్లు పెట్టుకోవడం చూసి....😩😩😩😩😩
( *ట్విస్ట్ కొరకు wait చేయండి* )
అవును అంకుల్...
ఆ టెస్ట్ రిజల్ట్ మా యావిడది...పాజిటివ్ వచ్చిన మాట నిజమే...కానీ...కానీ..అని సణుగుతూ
అది మా ఆవిడ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ అంకుల్!
అన్నాడు ఆ పక్కింటి పెద్ద మనిషి ! తాపీగా........😊😊😊😊
😊😊జస్ట్ రిలాక్స్...😊😊 అన్నిటికి భయపడకండి. *ఈ భూమ్మీద నూకలు బాకీ ఉన్నన్ని రోజులు ఎవ్వడు ఏమి చేయ లేడు.*🙏💐🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి