28, నవంబర్ 2024, గురువారం

శ్రీ దత్త ప్రసాదం - పదిహేడవ భాగము

 ఓం శ్రీ గురుభ్యోనమః


శ్రీ దత్త ప్రసాదం - పదిహేడవ భాగము


మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కృపాకటాక్ష సాక్షాలను, శ్రీ దత్త ప్రసాదం పేరిట ధారావాహిక రూపములో ప్రతి గురువారము ఆడియో రూపంలో యూట్యూబ్లో అలానే, ఇతర సామాజిక మాధ్యమాల(spotify, amazon music) ద్వారా అందజేసే ప్రయత్నం ఇది. మా ఈ ప్రయత్నంలో మీరందరూ భాగస్వామ్యులు అవుతారని ఆశిస్తూ.....



సర్వం,

శ్రీ దత్త కృప.


Youtube : 


https://youtu.be/Qa1o9ShWlGs


Spotify : 


https://open.spotify.com/show/180mOvorIe6I4wBVECQEzj


Amazon Music : 


https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_BPSZHjKoqpUd0aAE2Gob29jXV


దయచేసి like చెయ్యండి, share చెయ్యండి మరియు subscribe చేసుకొన ప్రార్ధన.


గమనిక : ఈసరికే subscribe చేసుకున్న వారు, దయచేసి *notification లను activate చేయ ప్రార్ధన.


సర్వం శ్రీ దత్త కృప 🙏


పవని శ్రీ విష్ణు కౌశిక్

(@sridattaprasaram)


మందిర వివరముల కొరకు సంప్రదించవలసిన వారి వివరాలు: 


శ్రీ పవని నాగేంద్ర ప్రసాద్, 

వ్యవస్థాపక ధర్మకర్త, 

శ్రీ దత్తత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల

సెల్ no:9908973699

ధన్యోస్మి 🙏


-----


మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము, పూజా పటాలు మరియు ఇతర శ్రీ దత్త ప్రసాదముల కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు :🙏


Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632


--

గురుశిష్యుల మధ్య

 గురుశిష్యుల మధ్య న్యాయాలు.       1. విహంగ న్యాయం.


పక్షి గుడ్లను పెట్టి పొదిగి తన రెక్కల స్పర్శ చేత గుడ్లను పిల్లలుగా చేస్తుంది. అలాగే సద్గురువు తన 'స్పర్శ' చేత శిష్యునికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తాడు.      2. భ్రమర కీటక న్యాయం.


భ్రమరం ఒక కీటకాన్ని తెచ్చి దాని చుట్టూ తిరుగుతూ 'ఝుంకార' శబ్దం చేస్తుంది. అప్పుడు ఆ కీటకము ఝుంకారము వల్ల భ్రమరంగా మారిపోతుంది. అలాగే సద్గురువు శిష్యునకు 'వాక్కు' ద్వారా బోధ చేస్తూ తన వలెనే తయారు చేస్తాడు.  3. మీన న్యాయం.


చేప గుడ్లను పెట్టి వెనకకు తిరిగి వాటిని తీక్షణంగా చూస్తుంది. తల్లి చేప దృష్టి సోకగానే గుడ్లు పిల్లలుగా మారుతాయి. ఇదేవిధంగా సద్గురువు కరుణామృత 'దృష్టి' ప్రసరించడం వల్ల శిష్యుడు జ్ఞాన పరిపుష్టి పొందుతాడు.    4. తాబేటి తలపు న్యాయము...


తాబేలు ఒకచోట గుడ్లు పెట్టి ఆహారానికి వెళుతుంది. ఆ గుడ్లు పిల్లలు కావాలని 'సంకల్పిస్తుంది '. ఆ సంకల్ప బలంతో ఆ గుడ్లు పిల్లలుగా తయారవుతాయి. అలాగే శిష్యుడు ఎక్కడ ఉన్నా అతను పర బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి, పరమార్థ జ్ఞానాన్ని చేరాలి అని 'సంకల్పిస్తారు'. ఆ దివ్య సంకల్పంతో శిష్యుడు అభివృద్ధి పొంది పరమార్ధం పొందుతారు.


ఓం శ్రీ గురుభ్యో నమః.

పరమపద సోపాన పటము


 ఇదొక భిన్నమైన పరమపద సోపాన పటము. ఈ పటంలో మనం ఏమేమి చేస్తే ఆరోగ్యంగా ఉంటామో, ఎలా జీవిస్తే, లేక ఏ ఆరోగ్య సూత్రాలు పాటిస్తే మనం రోగాలబారిన పడకుండా సుదీర్ఘ 

కాలంపాటు ఆరోగ్యంగా జీవిస్తామో ఇది వివరిస్తుంది. చక్కటి ఆరోగ్యం కోసం ఏమి చేయాలో 'నిచ్చెన గదులు' సూచిస్తే, ఏమి చేయకూడదో 'పాము గడులు' వివరిస్తాయి.*


ఒక వైద్యుడు తన ఔట్ పేషెంట్ వార్డు హాలులో గోడమీద అంటించిన ఈ పోస్టర్ హాస్పిటల్ సందర్శకులకు పెద్ద ఆకర్షణగా నిలుస్తున్నది.


ఇమేజ్ ని కాస్త జూమ్ చేసి చూస్తే ఆరోగ్యం కోసం ఏమి చేయదగినవో, ఏమేమి చేయదగనివో తెలుసుకోవచ్చును.*

కార్తిక పురాణము - ఇరవై ఎనిమిదవ అధ్యాయము

 *కార్తిక పురాణము - ఇరవై ఎనిమిదవ అధ్యాయము*


*సుదర్శన చక్ర స్తోత్ర పారాయణ - మహిమ*


*అంబరీష ఉవాచ:*

అంబరీషుడు ఓ సుదర్శన చక్రమా! ఆగు నీకు నమస్కారము.ఈ బ్రాహ్మణుని చంపుట తగదు. నీకు వధతో కూడిన ఆహారము కావలెనన్న నా శరీరమును ఇచ్చెదను. ఈ బ్రాహ్మణుని విడువుము. లేని యెడల నాతో యుద్ధము చేయుము. నీవు హరియొక్క ఆయుధమువి గనుక నాకు దైవమయినప్పటికీ నీతో యుద్ధము చేయుదును గాని నిన్ను బ్రతిమాలుటలేదు.క్షత్రియునకు బ్రహ్మ యుద్ధమును విధించెను గాని యాచనను విధించలేదు.అయినాను నీవు నాకు దేవతవు గనుక యాచించవచ్చును. ఓ సుదర్శన చక్రమా! నీవు సమస్త భూతములకు అజేయుడవన్నమాట నాకు తెలియును అయినను నా బాహుబలమును చూడుము.

విష్ణ్వాది దేవతలందరూ నీ బలమును నా బలమును చూతురు గాక. నిన్నిపుడు భూమియందు పడవైచెదను. అట్టియవస్థను చెందక ఇతనిని విడువుము. నీకు జీవించియుండి హరిహస్తమందు నివసించు కోరికయున్న యెడల నన్ను పాలించుము.శరణాగతుడైన ఈ బ్రాహ్మణుని విడువమని రాజు స్తుతించగా సుదర్శన చక్రదేవత సంతోషించి రాజును పరీక్షించవలయునను తలంపుతో కోపము వచ్చినట్లు నటించి సుదర్శనము, రాజా! నీకు తెలియునా? మధుకైటభులను రాక్షససులను చంపితిని దేవతలకు జయించుటకు శక్యము కాని వారైన రాక్షసులను అనేకులను చంపితినని తెలియదా?ఈ దుర్వాసుని కోపముతో కూడిన ముఖమును చూచుటకెవ్వడైన సమర్దుడున్నాడా?ఈ దుర్వాసుడు శంకర బ్రహ్మల యొక్క తేజోధారియైనను ఇప్పుడిట్టి అవస్థను నావలన చెందెను గదా? శంకరుని వలన క్షత్రియ సంహారకారకమయిన తేజస్సు సంభవించినది. ఆ బ్రహ్మ తేజస్సు నాకంటే అధికము గాదు.అదియు నాచేత అనేక పర్యాయములు అతిక్రమించబడినది.క్షత్రియ తేజోవంతుడైన నీవు నాతో యుద్ధమునకు ఎట్లు సమర్థుడవగుదువు? బ్రహ్మ శంకరుల రెండు తేజస్సులు నాకు చాలనివి.

రాజా! క్షేమము కోరినవాడు బలవంతునితో స్నేహము చేయవలెను. ఇట్లు న్యాయముండగా నీవు మూర్ఖత్వమునవలంబించి నాతో యుద్ధమునకు సన్నద్ధుడవెందుకైతివి? నీవు హరిభక్తుడవని నేను నిన్ను ఇంతవరకు సహించితిని. నీవు దూరముగా పొమ్ము. ప్రాణములను వృధాగా పోగొట్టుకొనకు! అన్న సుదర్శన చక్ర వాక్యమును విని అంబరీషుడు కళ్ళెర్రజేసి సుదర్శన చక్రముతో అంబరీషుడు ఇట్లు పల్కెను.

సుదర్శన చక్రమా! నీవు నా దేవునకు ఆయుధమైతివని నిన్ను బాణములచేత నూరు ఖండములుగా కొట్టలేదు.నీవు క్షత్రియ ధర్మము అవలంబించి నాతో మాట్లాడుచున్నావు.గనుక ఇకముందు నీకు గర్వముండబోదు.నీ గర్వమును నశింపజేయు బాణములు నా హస్తమందున్నవి.నేను బ్రాహ్మణులందును, దేవతలందును, స్త్రీలయందును, జ్ఞాతులందును గోవులందును, బాణములను వదలను.నీవు క్రూరుడవైనను దేవుడవగుట చేత ఇంతవరకు ఉపేక్షించితిని. నీవు దేవత్వమును వదలుకొని క్షత్రియత్వముతో గూడి నాయందు నిలిచి అగ్నితో సమానమైన వేడిగల నా బాణములను సహించు చూతమని అంబరీషుడు ఇరువది నాలుగు బాణములను సుదర్శన చక్ర పాదముల మీద వదలెను.

క్షాత్ర పౌరుషముతో గూడిన రాజును జూచి సుదర్శనుడు నవ్వుచు సుదర్శనుడు రాజా! నీ సంరక్షణ నిమిత్తమే హరినన్ను పంపినాడు. నిన్ను శరణాగతుడైన బ్రాహ్మణుని విడిచితిని.సుఖముగా ఉండుమని పలికి ధనుర్బాణములతో గూడియున్న రాజును కౌగలించుకుని భూమియందు పడి నమస్కారము చేసెను.

ఓ అగస్త్యా! రాజు అలా విధేయుడైన సుదర్శన చక్రస్థ పురుషునితో చక్రముతో సంసార మధ్యను సంచరించెడు పురుగునైన నేనెక్కడ? హరియొక్క హస్తమందు ప్రకాశించెడి నీవెక్కడ? ఇట్లు తెలిసియు నీతో యుద్ధమునకు సన్నద్ధుడయిన నా తప్పును క్షమించుము.నేను నిన్ను తిరస్కరించి విజ్రుంభించి యుద్ధమునకు సిద్ధపడితిని. క్రూరమయిన నా క్షత్రియ స్వభావమిట్లు చేసినది గనుక క్షమించుము.ఇది శుక్ల పక్షము, పగలు, యుద్ధభూమి, మకరమాసము., మాఘమాసము.ఇట్టి పుణ్యకాలమునందు నా దేవుడైన నీవలన మృతిని గోరియే యుద్ధమునకు వచ్చితిని. *భగవద్గీతయందు ఇట్లు కలదు.*

*ఉత్తరాయణమందు శుక్లపక్షమందు పగలు మృతినొందిన వారు బ్రహ్మపదమును చేరుదురు.* కార్తిక శుక్ల ద్వాదశినాడు వెళ్ళిన దుర్వాసనుడు మాఘమాసమునకు తిరిగి వచ్చెను.సుమారు మూడు మాసములకు అంబరీషుని చేరినాడు.

జ్వాలలచేత భయంకరమై నూరు మెరుపులకంటే అధికమయిన కాంతిగలదియును అయిన నీ రూపమును గవ్వతో సమానుడను నేనెట్లు సహింతును? సహస్రాగ్నియుతమైన రవిబింబము వలె సహస్రారములను ధరించునటువంటి సమస్త సంహారకరమగునటువంటి నీ రూపముతో యుద్ధము చేయనేనెట్లు శక్తుడనగుదును? కోరలతో గూడి భయంకరము దశదిక్కులందు అగ్నులను బయటకి చిమ్ముచున్నటువంటి నీ యొక్క దంతపుదెబ్బను దేవుడుగాని, రాక్షసుడు, దేవేంద్రుడు గాని, రాక్షసాధిపతి గాని ఇంకెవ్వడు గాని సహించగలడు? మెరుపులను సూర్యునికిరణజాలములును మొత్తములై భయంకరాకారములను ధరించి వచ్చినను నీ తేజస్సును తిరస్కరించలేవు.

విష్ణువు భయంకరాకారమయిన నిన్నాశ్రయించి మూడు లోకములను పాలించుచున్నాడు. నీతో విరోధించినయెడల దేవతలు గాని, దానవులు గాని, అన్యులు గాని నిన్ను జయించలేరు. దైత్యులన చంపుదానవు భక్తులను పరిపాలించుదానవు.విష్ణువు యొక్క కాంతిచేత ప్రకాశించుదానవు. ప్రాణగమన కష్టమును హరించుదానవు అగు నీకు నమస్కారము.

ఇట్లు స్తుతించి నమస్కారము చేయుచున్న రాజును లేవదీసి నీకు క్షేమమగుగాక! అని సుదర్శనుడు పలికెను. ఈ సుదర్శన చక్ర స్తోత్రమును మూడుకాలములందు పఠించువాడు ఆపదలనుండి విముక్తులై నిరంతరసుఖములను పొందుదురు.

కలియుగమందు ఈ అధ్యాయమును ఒకమారయినను వినువారు అనేక భోగములు పొంది అంతమందు మోక్షము పొందుదురు.


*ఇతి శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే అష్టావింశాధ్యాయ సమాప్తః!!*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం - త్రయోదశి - చిత్ర -‌‌ గురు వాసరే* (28.11.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

శ్రీకృష్ణుని ఈ కార్తిక మాసాన

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్రీకృష్ణుని ఈ కార్తిక మాసాన ఆరాధించితే బహుశ్రేష్ఠం.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*కార్తిక మాసం ఆధ్యాత్మికంగా దివ్యమైనది. ఈ మాసం స్నానానికి విశిష్టమైనది. ఇది దామోదర మాసం. కనుక 'కార్తిక దామోదర' అనే నామంతో స్మరణ చేయాలి.*


*సూర్యోదయానికి ముందుగా 'ఆకాశదీపం' పెట్టే సంప్రదాయం ఉంది. హృదయాకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఈ ఆకాశదీపం ద్యోతకమవుతుంది.దీనిని దేవాలయంలోనే కాక ఇంటిలోనూ వెలిగించవచ్చు.*


*ఈ మాసం దీపారాధనకి విశిష్టమైనది.ఏక భక్తం (ఒంటిపూట భోజనం) ఈ మాసంలో చేయాలి. ప్రతిరోజూ ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి శివదర్శనం చేయడం శ్రేష్ఠం.*


*శివాలయంలో, విష్ణ్వాలయంలో దీపాన్ని వెలిగించడం మంచిది.*


*ఇంట్లో కూడా ప్రతిరోజూ సంధ్యాదీపం వెలిగించాలి.*


*కార్తికమాసమంతా కార్తిక పురాణం రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభకరం.*


*శివుడు 'ఆశుతోషుడు' - వెంటనే సంతోషించే స్వామి.*


*అభిషేక ప్రియః శివః - అన్నారు కనుక ఈ మాసంలో శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి, సకల శుభాలను ప్రసాదిస్తుంది.*


*కార్తికమాసం బృందావన యాత్ర, బృందావన పూజ విశిష్టం. బృందావనంలో శ్రీకృష్ణుని ఈ కార్తిక మాసాన ఆరాధించితే బహుశ్రేష్ఠం. దానికి ప్రత్యామ్నాయంగాఇంట్లో తులసి కోటను ఆరాధించే విధానాన్ని ఏర్పరచారు. నెలరోజులూ తులసి సన్నిధిలో దీపాన్ని వెలిగించి, విష్ణు పూజ చేయడం మంచిది.*


*పాడ్యమి నాడు - గోవర్ధన పూజ చేయాలి. బృందావనం వెళ్లిగోవర్ధన పూజ చేయలేని వారు - ఇంట్లో ఆవుపేడను ముద్దగా పెట్టి గోవర్ధన గిరిగా భావించి పూజించాలి. కార్తిక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యమును సంపాదించుకుంటారు.*


*కార్తిక బహుళ త్రయోదశి మొదలు అమావాస్య వరకు గల మూడు రోజులు గోపూజ చేస్తే ఇహమందు ఐశ్వర్యమును అనుభవించి అంత్యమున విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తిక శుద్ధ అష్టమి నాడు గోపూజ చేసిన వారు సమస్త వ్రతములు చేసిన ఫలమును పొందుతారు.*


*ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః ।*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

ఆదిగురువు - దక్షిణామూర్తి*

 🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

  *ఆదిగురువు - దక్షిణామూర్తి*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడిచెవికి మకరకుండలం ఎడమ చెవికి "తాటంకం' అలంకారాలుగా కనిపిస్తాయి.*


*మకరకుండలం పురుషుల శ్రవణాలంకారం. తాటంకం స్త్రీల అలంకృతి, దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి.*


*సనకసనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే ఏకాకృతిగా దర్శనమిచ్చాయి.*


*అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే కాక, అమ్మమూర్తి కూడా ఈ విషయాన్నే లలితాసహస్రంలో "దక్షిణామూర్తి రూపిణీ సనకాదిసమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ" అని వివరిస్తోంది.*


*ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనమవుతుందో ఆ 'దయ'ను 'దాక్షిణ్యం' అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి (దాక్షిణ్యం) భగవంతునికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి.*


*పరమ జ్ఞానమూర్తియైన ఈ ఆది గురువును స్తుతిస్తూ ఆదిశంకరులు రచించిన దక్షిణామూర్తి సోత్రము బహుళ ప్రసిద్ది చెందింది. దక్షిణామూర్తి సకల జగద్గురు మూర్తి కనుక - స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది. ఐహికంగా - బుద్ధి శక్తిని వృద్ధి చేసి విద్యలను ఆనుగ్రహించే ఈ స్వామి పారమార్థికంగా తత్త్వ జ్ఞానాన్ని ప్రసాదించే దైవం.*


*ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః ॥*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

కార్తీకపురాణం - 27

 ॐ కార్తీకపురాణం - 27 వ అధ్యాయం ॐ

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉🕉️🕉🕉🕉


🍃🌷దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట:


మరల అత్రి మహాముని అగస్త్యున కిట్లు వచించెను, “ఓ కుంభసంభవా! ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇలా చెబుతున్నాడు…” అని వృత్తాంతాన్ని వివరించారు.


శ్రీమహావిష్ణువు దుర్వాసునితో ఇలా చెబుతున్నాడు… ఓ దుర్వాస మహాముని! నీవు అంబరీషుడిని శపించిన విధంగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారమెత్తుట కష్టం కాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వక తప్పదు. అందుకు నేను అంగీకరించాను. బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండేలా చేయడమే నా కర్తవ్యం.


నీవు అంబరీషుని ఇంట్లో భుజించకుండా వచ్చినందుకు అతను చింతతో ఉన్నాడు. బ్రాహ్మణ పరివృత్తుడైనందుకు ప్రాయోపవేశం (అగ్నిలో దూకి ఆత్మహత్య) చేసుకోవాలని నిర్ణయించాడు. ఆ కారణం వల్ల విష్ణు చక్రం నిన్ను బాధించేందుకు పూనుకుంది.


ప్రజారక్షణే రాజధర్మం. ప్రజాపీడనం కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనట్లయితే… వాన్ని జ్ఞానులైన బ్రాహ్మణులు శిక్షించాలి. ఒక విప్రుడు పాపి అయితే.. మరో విప్రుడు దండించాలి. ధనుర్బాణాలు ధరించి ముష్కరుడై యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుడిని తప్ప, మరెవ్వరూ బ్రాహ్మణుడిని దండించకూడదు. బ్రాహ్మణ యువకుడిని దండించడం కంటే మరో పాపం లేదని న్యాయశాస్త్రాలు ఘోషిస్తున్నాయి.


బ్రాహ్మణుడి సిగబట్టి లాగినవాడు, కాలితో తన్నినవాడు, విప్రుని ద్రవ్యం అపహరించేవాడు, బ్రాహ్మణుడిని గ్రామం నుంచి తరిమినవాడు, విప్ర పరిత్యాగమొనర్చినవాడు.. బ్రహ్మ హంతకులే అవుతారు. 


కాబట్టి ఓ దుర్వాస మహర్షి! తప:శ్శాలి అయిన అంబరీషుడు నీ మూలంగా ప్రాణ సంకటం పొందుతున్నాడు. నేను బ్రహ్మ హత్యచేశానే అని చింతిస్తూ పరితాపం పొందుతున్నాడు. కాబట్టి, నీవు వేగమే అంబరీషుడి వద్దకు వెళ్లు. అందువల్ల మీ ఇద్దరికీ శాంతి లభిస్తుంది” అని విష్ణుదేవుడు దుర్వాసునికి నచ్చజెప్పి అంబరీషుడి వద్దకు పంపాడు.


ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్య మందలి సప్త వింశోధ్యాయం – ఇరవయ్యేడవ రోజు పారాయణం సమాప్తం.


ఓం నమః శివాయ…🙏🙏

సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*


*209 వ రోజు*


*దృతరాష్ట్ర సభలో సంధివిషయంలో చెలరేగిన వివాదాలు*


బ్రాహ్మణుని మాటలు విన్న భీష్ముడు లేచి " పాండవులు శ్రీకృష్ణునితో కలసి ఉండటం వారు శాంతియుతంగా సమస్యా పరిస్కారానికి దారులు వెదకడం అదృష్టం. మీ మాటలు వినడానికి కొంత కటువుగా ఉన్నా ఆమోదయోగ్యం. పాండవులు అనుభవించిన కష్టాలు మనందరికి తెలుసు. కనుక వారిని సగౌరవంగా వారి రాజ్య భాగాన్ని ఇవ్వడం సముచితం. కాని పక్షంలో ఆగ్రహించిన అర్జునిని యుద్ధంలో ఎవరు ఆపగలరు. సాక్షాత్తూ వజ్రాయుధం ధరించిన ఇంద్రుడు కూడా అర్జునుడి ముందు నిలువలేడు. ఇక తక్కిన ధనుర్ధారుల సంగతి చెప్పనేల. అతని బాణాగ్నికి సర్వం ఆహుతి కాక తప్పదని నా అభిప్రాయం " అన్నాడు. భీష్ముడు ఇలా మాట్లాడుతుండగా కర్ణుడు లేచి "బ్రాహ్మణోత్తమా! అందరికి తెలిసిన విషయాన్ని మాటి మాటికి ప్రస్తావించడం వ్యర్ధం. దుర్యోధనుని కొరకు శకుని జూదం ఆడాడు ధర్మరాజు సకలము ఓడాడు. ఇందులో అపరాధం లేదు. అనుకున్న ప్రకారం అజ్ఞాత వాసం ముగియకనే రాజ్యభాగం కోరడం తప్పు. విరాటుడు, ద్రుపదుడు సహాయంగా ఉన్నారని రాజ్యభాగం అడగటంలో ఏమి న్యాయం ఉంది? ఇంత అన్యాయం ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? " అన్నాడు. అందుకు భీష్ముడు బాధపడుతూ " కర్ణా! ఏమిటిది? పెద్ద వీరుడి మాదిరి మాట్లాదుతున్నావు. గోగ్రహణంలో అర్జునుడు మనందరిని గెలిచాడు. పలుమార్లు నీవు అతనితో తలపడి ఓడిన నీ పరాక్రమం ఏమిటో అప్పుడే చూశాం. ఇప్పుడు నువ్వు మాటలతో గెలుస్తున్నావు. గోగ్రహణ సమయంలో సుయోధనునికి నేను అజ్ఞాత వాసం ముగిసిందని చెప్ప లేదా ఇప్పుడు మరలా ఆ ప్రస్తావన ఎందుకు ? ఈ బ్రాహ్మణుడు చెప్పినట్లు చేయకపోతే యుద్ధంలో మనం ఆర్జునుడి చేతిలో దెబ్బలు తిని మట్ట్టి కరువక తప్పదు" అని కోపంగా అన్నాడు. దృతరాష్ట్రుడు భీష్ముని శాంతింప చేసి కర్ణుడిని నిందించి " విప్రోత్తమా! మీరు చెప్పింది సావధానంగా విన్నాను. తగు విధంగా ఆలోచించి మేము ఒక సౌమ్యుని పాండవుల వద్దకు పంపి మా మనసులో మాట తెలియచేస్తాము. మీరు వెళ్ళి రండి " అన్నాడు.


*సంజయుని సంధి కొరకు ఉపప్లావ్యం పంపుట*


దృతరాష్ట్రుడు సంజయుని పిలిచి " సంజయా! పాండు రాజకుమారులు ఉపప్లావ్యంలో ఉన్నారు. నీవు వారి వద్దకు వెళ్ళి శ్రీకృష్ణుని సాన్నిధ్యంలో వారితో అరణ్య, అజ్ఞాతవాసాలు ముగించుకున్నందుకు అభినందిస్తున్నాని చెప్పు. సుయోధనుడు వివేచనా శూన్యుడు కనుక ఇన్ని అనర్ధాలు జరిగాయి అని తెలుపుము. ధైర్యవంతులు, ఉత్సాహవంతులు అయిన పాండవుల దోషం ఏమీ లేదని చెప్పు. పాలు, నీళ్ళ లాగా అన్నదమ్ములను కలిసి ఉండమని చెప్పు. వారు వారి తండ్రి రాజ్యభాగానికి అర్హులని చెప్పు. మనలను అసత్యవాదులని పాండవులు నమ్మరు. కాని ధర్మాత్ముడైన ధర్మరాజుకు రాజ్యభాగం ఇవ్వకుండా ఉండలేము కదా. మేము గర్వించి ఇవ్వకున్న శ్రీకృష్ణుని సారథ్యంలో అర్జునుడు ముల్లోకాలను క్షోభపెట్టగలడు. భీముని తలచిన దడ పుడుతుంది. నకుల, సహదేవుల పరాక్రమం సామాన్యం కాదు. ద్రుపద, సాత్యకులు తక్కువ వారు కాదు. వారి మిత్రులు కేకయ రాజు, పాండ్యుడు ఎవరికీ తీసి పోరు. ఇక ధర్మజుని ఆగ్రహం ఎదుర్కొనుట రుద్రునికైనా సాధ్యం కాదు. కనుక ధర్మజుని వద్దకు వెళ్ళి అతని తమ్ములకు ఆగ్రహం కలుగకుండా ప్రీతి కలిగేలా మాట్లాడు. శాంతి కలిగేలా మాట్లాడి కార్యం సఫలం చేసుకుని రా " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కార్తీక పురాణం - 28

 _*🚩కార్తీక పురాణం - 28 వ అధ్యాయము🚩*_


🕉🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️


*విష్ణు సుదర్శన చక్ర మహిమ*


☘☘☘☘☘☘☘☘☘


జనక మహారాజా ! వింటివా దుర్వాసుని అవస్ధలు ! తాను ఎంతటి కోపవంతుడైనను , వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శుద్దిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున , ఎంతటి గొప్ప వారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను.


అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి *"అంబరీషా , ధర్మపాలకా ! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము , నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్నాహ్వనించితివి , కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయతల పెట్టితిని. గాని నా దుర్బద్ది నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్దమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్దించితిని . ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపశ్శాలినైనను, ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందు అవియేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తునుండి కాపాడు"* మని అనేక విధాల ప్రార్ధించగా , అంబరీషుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి , *"ఓ సుదర్శన చక్రమా ! నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో , తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడు గాన , ఈతనిని చంపవలదు , ఒక వేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని , ముందు నన్నుచంపి , తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి , నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు , దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్దములలో , అనేక మంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని యింత వరకు చంపలేదు. అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా ! సురాసురాది భూతకోటులన్నియు ఒక్కటిగా యేకమైననూ నిన్నేమియు చేయజాలవు , నీ శక్తికి యే విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లోకమంతటికి తెలియును. అయినను మునిపుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుచున్నాను.*


*నీ యుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి యిమిడియున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును , శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము"* అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి *"ఓ భక్తాగ్రేశ్వరా ! అంబరీషా ! నీ భక్తిని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు , మహాపరాక్రమవంతులైన మధుకైటభులను - దేవతలందరు ఏకమైకూడ  - చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా ! ఈ లోకములో దుష్టశిక్షణ , శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును. ఇది యెల్లరకు తెలిసిన విషయమే , ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీవ్రతమును నశింపజేసి , నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్ను ఎర్రజేసి నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి , ఈ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.*


*ఈతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మతేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భులోకవాసుల నందరను చంపగలదుగాని , శక్తిలో నా కంటె యెక్కువేమియుగాదు. సృషి కర్తయగు బ్రాహ్మతేజస్సు కంటెను , కైలాసవతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటెను యెక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియ తేజస్సుగల నీవు గాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించువారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోనగలరు.*


*ఇంత వరకు జరిగినదంతయు విస్మరించి , శరణార్థియై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు"* మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి , *" నేను దేవ గో , బ్రాహ్మణాదులయుందును , స్త్రీలయందును , గౌరవము గలవాడను. నా రాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవలెననియే నా అభిలాష. కాన , శరణుగోరిన ఈ దుర్వాసుని , నన్నూ కరుణించి రక్షింపుము. వేలకొలది అగ్నిదేవతలు , కోట్ల కొలది సూర్య మండలములు ఏక మైననూ నీ శక్తీకి , తేజస్సుకూ సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి మహా విష్ణువు లోకనిందితులపై , లోకకంటకులపై , దేవ - గో - బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి , వారిని శిక్షించి , తన కుక్షియుందున్న పధ్నాలుగు లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన , నికివే నామనఃపూర్వక నమస్కృతులు"* అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాడాలింగన మొనర్చి *"అంబరీషా ! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని.


విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు ఎవరు పఠింతురో , ఎవరు దానదర్మములతో పుణ్యఫలమును వృద్ది చేసుకొందురో , ఎవరు పరులను హింసించక - పరధనములను ఆశపడక - పరస్త్రీలను చెరబట్టక - గోహత్య - బ్రాహ్మణహత్య - శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి , ఇహమందును పరమందును సర్వసాఖ్యములతో తులతూగుదురు. కాన , నిన్నూ , దుర్వాసుని రక్షించుచున్నాను , నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు."* అని చెప్పి అతన్నీ ఆశీర్వదించి , అదృశ్యమయ్యెను.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి అష్టావింశోధ్యాయము - ఇరవయ్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.*


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

28 - 11 - 2024,

 🙏సర్వేజనాః సుఖినోభవంతు:🙏


    🍃*శుభోదయం*🌼

     -------------------


🏵️ *మహనీయుని మాట*🏵️

        -------------------------

"ఎప్పుడైతే భారం అనిపిస్తుందో

 అప్పటి నుంచే దూరమవడం మొదలవుతుంది..అది.... 

బంధమైనా, లక్ష్యమైనా..."

       --------------------------

🌹 *నేటి మంచి మాట* 🌹

      ---------------------------

"సహనం కోల్పోయిన వ్యక్తికి సమాజంలో గౌరవం దక్కదు."


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻


🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🥀పంచాంగం🥀

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ ... 28 - 11 - 2024,

వారం ... బృహస్పతివాసరే ( గురువారం )

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

దక్షిణాయణం,

శరదృతువు,

కార్తీక మాసం,

బహుళ పక్షం,


తిథి : త్రయోదశి పూర్తి,

నక్షత్రం : చిత్ర ఉ7.50 వరకు,

యోగం : సౌభాగ్యం సా4.56 వరకు,

కరణం : గరజి సా6.45 వరకు,


వర్జ్యం : మ2.01 - 3.47,

దుర్ముహూర్తము : ఉ9.57 - 10.41,

                              మరల మ2.22 - 3.07,

అమృతకాలం : రా12.37 - 2.23,

రాహుకాలం : మ1.30 - 3.00,

యమగండం : ఉ6.00 - 7.30,

సూర్యరాశి : వృశ్చికం,

చంద్రరాశి : తుల,

సూర్యోదయం : 6.16,

సూర్యాస్తమయం: 5.20,


              *_నేటి మాట_*


*దయనే దైవం - అది ఎలా???*

_ఈ విషయం మనకు అర్థం, కావాలంటే, ఒకసారి జరిగిన ఒక సంఘటన ద్వారా పరిశీలిద్దాము!!..._


మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన సంత్ ఏకనాథ్ కథ, ఒక "సారి ఏకనాథ్ తన స్నేహితులతో కలిసి హరిద్వార్ వెళ్ళారు...


అక్కడ నుంచి కావిళ్ళలో గంగ నీరు నింపుకొని, రామేశ్వరంలో శివుని అభిషేకం చెయ్యడానికి తీసుకెళుతున్నారు...

   దారిలో ఒక గ్రామంలో అనావృష్టి కారణంగా త్రాగడానికి నీరు కూడా లేక ప్రజలు చాలా బాధపడుతున్నారు. 

     ఇంక పశుపక్ష్యాదుల సంగతి చెప్పనక్కరలేదు, అక్కడ నీరు దొరకక పశువులు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నాయి..


ఒక గాడిద దాహంతో, ప్రాణాపాయ స్థితిలో ఉండడం ఏకనాథ్ దృష్టిలో పడింది. 


అది చూసిన ఏకనాథ్ తన దగ్గర ఉన్న నీటి ని లేచి ఆ గాడిద దగ్గర పెట్టారు...

నెమ్మదిగా కుండలోని నీరంతా త్రాగేసింది, అప్పుడు అది నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది...


ఏకనాధ్ కి చాలా సంతోషం కలిగింది, అతని స్నేహితులు నీ కుండలో నీరంతా ఆ గాడిదకు ఇచ్చేశావు, నువ్వు రామేశ్వరం వెళ్ళి శివుని అభిషేకం ఎలా చేస్తావు?" అడిగారు. 

ఏకనాథ్ చాలా అమాయకంగా, "ఏం మీరంతా మీ దగ్గర ఉన్న గంగ ఇవ్వరా?” అని అడిగారు...


"మేము హరిద్వార్ నుంచి స్వయంగా తెచ్చిన నీటితో అభిషేకం చెయ్యడమే విశేషం" అని మిత్రులు అన్నారు, ఏకనాథ్ నిస్సహాయంగా “ఏం చెయ్యను! నేను కూడా మీతోనే నడుస్తున్నాను... 

దాహంతో బాధ పడుతున్న గాడిదను చూసినప్పుడు నాకు ఆ రామేశ్వరంలో ఉన్న శివుడే కనిపించి, 'నేను ఇక్కడ దాహంతో ప్రాణం పోయే స్థితిలో ఉంటే మీరు నా అభిషేకానికి నీరు తీసుకొని రామేశ్వరం వెళుతున్నారా!? అని అడిగినట్టనిపించింది, అందుకని నేను గాడిదకు నీళ్ళు త్రాగించాను" అన్నాడు.


*స్వామి వివేకానంద “ఎవరైతే పేదవాడిలో, బలహీనుడిలో, రోగిలో శివుణ్ణి చూడగలుగుతారో వారే నిజంగా శివుణ్ణి ఆరాధించినట్లు, విగ్రహంలో మాత్రమే శివుణ్ణి దర్శించేవారి ఆరాధన ఇంకా ప్రాథమికావస్థలో ఉన్నట్లే" అని దైవారాధనకు వినూత్న నిర్వచనాన్నిచ్చారు.*


              *_🥀శుభమస్తు🥀_*

 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

సమస్య పూరణ.

 *సీత కరాంబుజాతమున శీతమయూఖుcడు వెల్గెc జూడుమా*

ఈ సమస్యకు నాపూరణ. 


రాతిరి పండు వెన్నెలను రాముడు సౌధము మీద నెక్కి భూ


జాతను బిల్వ వేగమున జానకి వచ్చెను దర్పణమ్ముతో


చేతిని జాచగా భువికి చేరగ వచ్చెనొ చందమామనన్


 సీత కరాంబుజాతమున శీతమయూఖుc డు వెల్గె జూడుమా!



అల్వాల లక్ష్మణ మూర్తి.

27.11.2024,బుధవారం

 *జై శ్రీమన్నారాయణ*

27.11.2024,బుధవారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - శరదృతువు

కార్తీక మాసం - బహుళ పక్షం

తిథి:ద్వాదశి తె5.41 వరకు

వారం:సౌమ్యవాసరే (బుధవారం)

నక్షత్రం:చిత్ర పూర్తి

యోగం:ఆయుష్మాన్ సా4.25 వరకు

కరణం:కౌలువ సా4.36 వరకు తదుపరి తైతుల తె5.41 వరకు

వర్జ్యం:మ2.04 - 3.51

దుర్ముహూర్తము:ఉ11.25 - 12.09

అమృతకాలం:రా12.43 - 2.29

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00

సూర్యరాశి:వృశ్చికం

చంద్రరాశి:కన్య

సూర్యోదయం:6.15

సూర్యాస్తమయం:5.20



శ్రీ కృష్ణుడి జీవితమంతా సంక్షోభం, పోరాటం, సవాళ్ల కథ. ఆయన పుట్టడమే చావుల మధ్యలో.. జైలులో పుట్టారు. అక్కడ నుంచి రక్షణ పొంది.. గోకులం చేరిన తరువాత పసి వయసులోనే రాక్షసుల నుంచి తనను తాను రక్షించుకునే పోరాటం చేయాల్సి వచ్చింది. జరాసంధ భయంతో, ఆయన తన కుటుంబంతో సహా మధురను వదిలి ద్వారకలో స్థిరపడాల్సి వచ్చింది. మహాభారత యుద్ధంలో ఆయన ఎంతో కోల్పోయారు. ఇందులో కృష్ణుని ఏకైక సోదరి సుభద్ర కుమారుడు అభిమన్యుడు దారుణంమైన చావుకు బలి అయ్యాడు. గాంధారి తన సంపూర్ణ వినాశనం కోసం కృష్ణుడిని శపించింది. కృష్ణుడి కళ్ల ముందు అతని కుటుంబమంతా తమలో తాము పోరాడి చనిపోయారు. శ్రీ కృష్ణుడి జీవితం పుట్టుక నుంచి చివరి వరకు, చాలా అసహ్యకరమైన, బాధాకరమైన ఎన్నో సంఘటనల నేపధ్యంలో గడిచింది. ఇంత జరిగినా, కృష్ణుడి కళ్ల నుంచి కన్నీళ్లు రాలేదు. ప్రతి ప్రతికూల పరిస్థితుల్లోనూ కృష్ణుడు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. దీనినే మనమూ అనుసరించవచ్చు. మనలో కృష్ణుడిని దేవునిగా చాలా మంది ఆరాధిస్తారు. దేవుడిపై నమ్మకం లేనివారికి కూడా ఒక కథగా మనం చెప్పుకున్నా.. కృష్ణుని చిరునవ్వు మనందరికీ ఆదర్శప్రాయమే. కష్టంలో కూడా నవ్వుతూ దానిని దాటే ప్రయత్నం చేసేవారికి విజయం కచ్చితంగా దొరుకుతుంది. అదే శ్రీ కృష్ణుడు బోధిస్తాడు …” జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, దానిని చిరునవ్వుతో ఎదుర్కోవాలి.”