17, సెప్టెంబర్ 2022, శనివారం

 ఏమయ్యా..ఎందుకా ఇంగ్లీష్ పుస్తకాలు కలిబెడుతున్నావు...

అవి నీలాంటి వాళ్ళకేం అర్థమౌతాయి! అని కసురుకున్నాడు,.. 

పాండీబజార్లో పేవ్ మెంట్ మీద పాత పుస్తకాలు అమ్ముకునే వాడు..ఆ పెద్ద మనిషిని.


నీరుకావి పంచె,మామూలుగా కనిపించే తెల్ల చొక్కా వేసుకున్న ఆ పెద్దమనిషి..నవ్వేసి...అవును..నాకెందుకు! అనుకుంటూ...తనకు కావలసిన బుక్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. 


పాపం...ఆ పుస్తకాలమ్మే వాడికేం తెలుసు ఆయనెంతటి విద్వాంసుడో! కాకపోతే...ఎంత విద్వత్తు ఉందో...అంత వినయమూ ఉంది. బాహ్యాడంబరాలు....అసలు తెలియవు.


ఆయన తెలుగు, సంస్కృతం లలో ఎం.ఏ.అని.....వేదాలు, మహాభాష్యం, బ్రహ్మసూత్రాలు..అభ్యసించి...


షుమారు 100 భాషలు తెలిసిన మహామేధావి అని ఎప్పుడూ...ఎవరికీ చెప్పుకోలేదు. ఒరియా, బెంగాలీ, అస్సామీ లే కాక...ఫ్రెంచ్, గ్రీక్, జపనీస్, జర్మన్, లాటిన్, చైనీస్....ఇలా బహు భాషా కోవిదుడు.


ఆయనే వచన రచనకు మేస్త్రీ....మల్లాది రామకృష్ణ శాస్త్రి.


                                *********


పద్యమైనా.... గద్యమైనా. 

కథ అయినా..., కవిత అయినా, 

సినిమా పాటైనా -- 

తెలుగు భాషా సుగంధ పుష్పం యొక్క పరిమళం నలుదెసలా వ్యాపింప చేసిన *కథా మేస్త్రి* శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. 


ఆయన చేసుకున్న పాపం వల్ల,....

మనం చేసుకున్న పుణ్యం వల్ల....వీరు తెలుగు రచయితగా పుట్టారు. 


ఇటువంటి కవి, మరే భాషలో ఉన్నా అంతర్జాతీయ ఖ్యాతి పొంది ఉండేవాడు.


ఆయన పాటలే కాదు వాక్యాలు కూడా గీతాల లాగా గుబాళిస్తాయంటే అతిశయోక్తి కాదు.


సినిమాలో, మాటలు, పాటలు రాయడానికి ముందు...., 

పలు పత్రికల్లో వ్యాసాలు, కథలు రాసారు. నవలలు, నాటకాలు రాసి పేరు తెచ్చుకున్నారు. 


దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం ‘పల్నాటియుద్ధం’....

చిత్ర రచన విషయంలో సలహాల కోసం 1945లో... 

మల్లాది వారిని మద్రాసుకు ఆహ్వానించారు. 


తొలిచిత్రం-పాట : చిన్నకోడలు (1952) - పిల్లనగ్రోవి పాటకాడ... 

ఆఖరిచిత్రం : వీరాంజనేయ (1968) 


(మల్లాదివారి కథల్లోంచి ఒక పాటను తీసుకొని అత్తగారు-కొత్తకోడలు (1968) చిత్రంలోవాడారు) 


పాటలు : 200 (39 చిత్రాలకు).


                              *********


ఆడంబరమైన అసత్యాలు....వాక్కులుగా శ్రీ మల్లాది వారి నుండి రమ్మన్నా రావు! మనిషి భాహ్య వేష ధారణకు ....అసలు విలువ ఇచ్చేవారు కాదు. వాక్కులు....బేరీజు వేసుకుని మరీ మాట్లాడేవారట!


1934 లో కృష్ణా పత్రికలో....కవిమిత్రులు శీర్షికన...శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, శివశంకర శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ & కాటూరి వంటి వారి గురించి...చక్కటి వ్యాసాలు వెలువరించారు.


అదే పత్రికలో చలవ మిరియాలు....పేరిట...సునిశితమైన విమర్శనాత్మక వ్యాసాలుండేవి.


1945 లో మద్రాస్ వచ్చేశాక....సీనియర్ సముద్రాల వారే ఆశ్రయమిచ్చారు. 

ఇద్దరూ కలిసే...రత్నమాల, బాలరాజు,లైలా- మజ్ఞు, స్వప్నసుందరి & మనదేశం వంటి మూవీస్ కి....కలిసే వ్రాశారు. పేరు మాత్రం సముద్రాల వారిదే!*


ప్రతిభా వారి చిన్నకోడలు(కృష్ణ కుమారి హీరోయిన్)లో మొట్టమొదట...మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి పేరుతో వ్రాశారు!


కృష్ణా తీరం,

తేజోమూర్తులు,

చలవ మిరియాలు,

కేళీ గోపాలం,

గోపిదేవి,

బాల

 &

సేఫ్టీ రేజర్....

ఇవన్నీ మల్లాది వారి సాహిత్య మణిపూసలు.


                                 *********


ఓ రోజున ఆరుద్ర నేరుగా...గురువుగారూ మీకసలు ఎన్ని భాషలు తెలుసును?*అని అడిగారు. 


దానికి సమాధానంగా శాస్త్రిగారు జాబితా రాసుకోమని చెబితే,.... 


అప్పుడు ఆరుద్ర... 

అలా కాదు. మీకెన్ని భాషల్లో కవిత్వం చెప్పగల సాధికారత ఉందో, అన్ని భాషల్లోనూ ఈ విసనకర్ర ఆకులపై ఒక్కో ఆకుమీద ఒక్కో సంతకం చొప్పున ఆయా భాషల్లోనే చేసివ్వండి*...


అంటూ తాటాకు విసనకర్రను, ఇంకు పాళీ కలాన్ని ఆయన చేతికి ఇచ్చారు. 


అప్పుడు శాస్త్రిగారు ఒక్కో ఆకుమీద ఒక్కో భాషలో సంతకం చేస్తూపోతే మొత్తంగా ఆ తాటాకు విసనకర్రకు రెండు వైపులా ఉన్న ఆకులన్నీ నిండిపోయాయి! 


ఇది స్వయంగా రామకృష్ణశాస్త్రిగారి పెద్ద కుమారుడు మల్లాది నరసింహశాస్త్రిగారు చెప్పిన విషయం. 


కనుక రామకృష్ణశాస్త్రిగారికి వందకు పైగా భాషల్లో కవిత్వం చెప్పగలిగిన పాండిత్యం ఉండేదని నిష్కర్షగా చెప్పొచ్చు.


                                  ********


మద్రాసులోని పానగల్ పార్క్ చూసినప్పుడల్లా అందరికీ గుర్తుకు వచ్చే మొదటి వ్యక్తి శ్రీ రామకృష్ణ శాస్త్రి గారు. అటు తర్వాత గుర్తుకు వచ్చేది శ్రీ శ్రీ గారు. 


పానగల్ పార్క్ లోని సిమెంట్ బల్లలపై కూర్చుని, వేరు శనగ కాయలు తింటూ, ఎవరు 'కూలీ'కి పిలుస్తారా అని ఎదురు చూసే 'మేస్త్రీ' ఈయన.


ఆయన గొప్ప మానవతావాది. 

కాళ్లకు వేసుకునే చెప్పులు ఎంత పాతవి అయిపోయినా, ఊడిపోతూ ఉన్నా,...


వాటిని తిరిగి కుట్టించుకుంటూ, బాగు చేయించుకుంటూ అవే తొడుక్కునేవారు. 


ఎందుకు పాతవాటితో అవస్థ పడటం?...


అని మహారథి ప్రశ్నిస్తే.... '*చెప్పులు కుట్టేవాడికి పని పెట్టాలి కదా! అతడికి దానం చేస్తే తీసుకోడు మనం ఇవ్వకూడదు. 

పని చేయించుకుని ఏదైనా ముట్ట చెప్పాలి. కొత్త చెప్పులు కొనుక్కుంటే అతడి బతుకెలా గడుస్తుంది? రిపేరు చేయటం నా వల్లకాదు అని అతగాడు అన్నప్పుడే కొత్తవి కొంటాను*..


అనేవారట!


                                   *********


సముద్రాల రాఘవాచార్య గారిని...ఏవిటండీ...శాస్త్రి గారి చేత పాటలు వ్రాయించుకుని....మీపేరు వేసుకుంటున్నారు?! అని అడిగితే...


ఇందులో తప్పేముంది. నాకు టైం లేదు. ఆయనకు డబ్బు అవసరం. అది నేనిచ్చి వ్రాయించుకుంటున్నాను.ఒక పండితుడికి అవకాశం ఇస్తున్నాను!...అనేవారట.


తన పేరు మీద రాని పాటలు...తనవి అని ఎప్పుడూ చెప్పుకోలేదు శాస్త్రి గారు. ఆ మాటలే చెప్తాయి అవి ఎవరు వ్రాశారో!


ఏమో తటిల్లతిక మేమెరుపు...

 మేడలోనే అల పైడిబొమ్మా.....ఇలాంటి పదాలు ఇక ఎవ్వరూ వ్రాయలేరు..ఆ మాటల మేస్త్రీ తప్ప!


అసలు కుడి ఎడమైతే...పాటకు అర్థమేమిటండీ? అని అడిగితే....*ఆ తాగుబోతు వాడి పాటకు అర్థాలు కూడానా...అని నవ్వుతూ తప్పుకునేవారు శాస్త్రి గారు.


శాస్త్రి గారి పేరు మీద మహా అయితే ఒక 200 పాటలు వచ్చిఉంటాయి. కానీ అజ్ఞాతం గా ఎన్నో పాటలు వ్రాశారు!


1967 లో రహస్యం మూవీ లోని గిరిజా కళ్యాణం యక్షగానం శాస్త్రి గారిదే. కాకపోతే...ఆయన ఎప్పుడో ముందే వ్రాసిపెట్టినది..ఆ సినిమాలో వాడుకున్నారు.


                                 **********


మల్లాది వారి గురించి కొందరు సుప్రసిధ్ధుల అభిప్రాయాలు చెప్పాలంటే.....ఇదుగో ఇలా ఉన్నాయి.


శ్రీ తాపీ ధర్మారావు -- సినిమా పాటకు కావ్య గౌరవం కల్పించిన మహాకవి శ్రీ మల్లాది.


శ్రీ పింగళి -- శ్రీ మల్లాది వారి లేఖిని నుండి వెలువడిన సంతత సారస్వత ధారావాహినికి జోహార్!ఆయన అనర్గళ వాక్చాతుర్య సౌశీల్యానికి కైమోడ్పు.


శ్రీ శ్రీ -- తెలుగు సినిమా పాటకి సాహిత్య ప్రశస్తి సంతరించిన ఆద్యులలో ప్రముఖుడు శ్రీ మల్లాది.


శ్రీ దాశరధి -- అతని శైలిలోన అమృతాలు తొణుకాడు.


శ్రీ నారాయణ రెడ్డి -- శ్రీ మల్లాది వారి ప్రతి పదబంధం మధు నిష్యందం.


శ్రీ వేటూరి -- ఆయన పలుకులోంచి అమృతం పుట్టింది. అది తెలుగు సినిమా పాటను చిరంజీవిని చేసింది.


శ్రీ వెన్నెలకంటి -- ఆంద్ర సాహిత్యానికి కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రన అయితే,..

తెలుగు చలనచిత్ర సాహిత్యానికి కవిత్రయం సముద్రాల, పింగళి, మల్లాది.


బాపు-రమణలు -- వచన రచనకు మేస్త్రి రామకృష్ణ శాస్త్రి. తక్కువ సినిమాలకు రాసినా విశిష్ట రచనలే ఎక్కువ చేసారాయన.


                                   *********


100 భాషలలో ప్రావీణ్యం.....

వేదాల ఔపోసన,...

బ్రహ్మ సూత్రాలు...

మహాభాష్య జ్ఞానం...

మహా గ్రంథాల రచయిత....


ఇవేవీ కూడా....ఆ మహానుభావుని...దారిద్ర్యానికి బలి కాకుండా ఆపలేక పోయాయి!


కేవలం....

లౌక్య రాహిత్యం,... 

త్యాగశీలత,... 

అతి మంచి తనం,... 

నిస్వార్థత.....


ఇవి చాలు....కలిలో....కడతేరి పోవడానికి!


వారి వ్యక్తిగత జీవితం దుర్భరం అయినది. వారి భావాలు నచ్చకనో లేక వారికి కలిగిన వేదాంత ధోరణి వల్లో, భార్యా భర్తలు విడిపోయారు. 


ఆయన జీవితంలోని విషాదమంతా దేవదాసులోని పాటలో ప్రతిబింబిస్తుంది..... 


అన్నిటినీ, అందరినీ పోగొట్టుకొని, 'తన వారు పరులైన' జీవితాన్ని అనుభవించిన ఈ మహాకవి.... 12-09-1965 న కీర్తిశేషులయ్యారు.


మల్లాది వారి వర్థంతికి నివాళి సమర్పిస్తూ...


  - డాక్టర్. కె.వి.ఎస్. ప్రసాద్.

దర్శించు ప్రదేశాలు

 శ్రీ రాజరాజేశ్వర టూర్ అర్గనైసర్స్ 🙏🏻నమస్కారం మీ ఆనంద్ రాంపల్లి  


*అష్ట వినాయక 🚌బస్సు యాత్ర* తేదీ 2022 అక్టోబర్ 9 నుండి అక్టోబర్ 17 వరకు వరంగల్ మరియు హైదరాబాద్ నుండి 


 *యాత్ర వివరాలు దర్శించు ప్రదేశాలు*


 1)భీమశంకర్ (జ్యోతిర్లింగం) 2)*అష్టావినాయకులు

1)మొరేశ్వర్ గణపతి

2)సిద్ది వినాయక్

3)భలాలేశ్వరా గణపతి

4)వరద వినాయక్

5)చింతమణి గణపతి

6)గిరిజాతమాజ గణపతి

7)విఘ్ణేశ్వర గణపతి

8)మహగణపతి

 3కొల్హాపూర్ (శక్తి పీఠం) 4)పండరీపూర్  మొదలగునవి

5)నర్సీంహవాడి

 

ప్రయాణం 🚍 బస్సు ద్వారా👌మంచి 🛌 వసతి ఒక పూట🍽 బొజనం మరియు ఒకపూట👌 🍽ఫలహారం మరియు రెండు పూటల👌 🍵చాయి ఇవ్వబడును


 *⛵పడవ ఖర్చులు దర్శనం ఖర్చులు ఎవరివి వారివె*.


 *రాదలిచినవారు 9705172629 ☎ఫోన్ చెయ్యగలరు.🙏*

30-40 నిమిషాలు నడవండి

 *వృద్ధాప్యం పాదాల నుండి పైకి మొదలవుతుంది!*

       

 మీ పాదాలను చురుకుగా, బలంగా ఉంచండి !!


  మన వయస్సు పెరుగుతున్నప్పుడు మరియు  వృద్ధాప్యం చెందుతున్నప్పుడు, మన పాదాలు ఎల్లప్పుడూ చురుకుగా & బలంగా ఉండాలి.


 మనం నిరంతరం వృద్ధాప్యం చెందుతున్నందున, మన జుట్టు బూడిదరంగు (లేదా) చర్మం కుంగిపోవడం (లేదా) ముఖంపై ముడతలు పడటం గురించి మనం భయపడకూడదు.


 * *దీర్ఘాయువు *సంకేతాల మధ్య, ప్రముఖ యుఎస్ మ్యాగజైన్ "ప్రివెన్షన్" ద్వారా సంగ్రహించినట్లుగా, సుదీర్ఘమైన ఫిట్ లైఫ్, బలమైన కాళ్ల కండరాల పైన *అత్యంత ముఖ్యమైనవి & అవసరమైనవిగా నిరూపణ చేయబడ్డాయి. *


 దయచేసి ప్రతిరోజూ నడవండి.


 మీరు కేవలం రెండు వారాల పాటు మీ కాళ్ళను కదపకపోతే, మీ కాళ్ళ బలం 10 సంవత్సరాలు తగ్గుతుంది.


 *కేవలం నడవండి*


  డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయం నుండి జరిపిన ఒక అధ్యయనంలో వృద్ధులు & యువకులు, రెండు వారాల పాటు *నిష్క్రియాత్మకత *, వల్ల 


 కాళ్ల కండరాల బలం *మూడవ వంతు బలహీనపడవచ్చు, ఇది 20-30 సంవత్సరాల వృద్ధాప్యానికి సమానం !!


 *కాబట్టి నడవండి*


 మన కాలి కండరాలు బలహీనపడటం వలన, మనం తరువాత తెలుసుకుని వ్యాయామాలు చేసినప్పటికీ, కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.


 *కాబట్టి నడవండి*.


 అందువల్ల, *నడక వంటి రెగ్యులర్ వ్యాయామం చాలా ముఖ్యం *.


 మొత్తం శరీర బరువు/ లోడ్ అలాగే ఉండి కాళ్లపై విశ్రాంతి తీసుకుంటుంది.


  *పాదాలు ఒక రకమైన స్తంభాలు *, మానవ శరీరం యొక్క మొత్తం బరువును భరిస్తూ ఉంటాయి.


 *రోజూ నడవండి.*


  ఆసక్తికరంగా, ఒక వ్యక్తి యొక్క బలం ఎముకలలో 50% & కండరాలలో 50%, రెండు కాళ్లలో ఉంటాయి.


 **రోజూ నడవండి.**


 మానవ శరీరంలోని అతి పెద్ద & బలమైన కీళ్ళు & ఎముకలు కూడా కాళ్లలో ఉన్నాయి.


 రోజు *10 వేల  అడుగులు నడవండి  *


  బలమైన ఎముకలు, బలమైన కండరాలు మరియు సౌకర్యవంతమైన కీళ్ళు *ఐరన్ ట్రయాంగిల్ *ను ఏర్పరుస్తాయి, 


ఇవి అత్యంత ముఖ్యమైన భారాన్ని కలిగి ఉంటాయి, 


 ▪️70% మానవ కార్యకలాపాలు మరియు ఒకరి జీవితంలో శక్తి దహనం (burning of calories) రెండు పాదాల ద్వారా జరుగుతుంది.


 ఇది మీకు తెలుసా?  


ఒక వ్యక్తి చిన్న వయస్సులో ఉన్నప్పుడు, అతని/ఆమె *తొడలు 800 కిలోల చిన్న కారును ఎత్తడానికి తగినంత బలాన్ని కలిగి ఉంటాయి! *


 * *పాదము శరీర లోకోమోషన్ *.


 కాళ్లు రెండూ కలిపి మానవ శరీరంలోని 50% నరాలను, 50% రక్తనాళాలను మరియు 50% రక్తం వాటి ద్వారా ప్రవహిస్తున్నాయి.


 ఇది శరీరాన్ని కలిపే అతి పెద్ద ప్రసరణ నెట్‌వర్క్.


 *కాబట్టి రోజూ నడవండి.*


 *ఒకవేళ * పాదాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది, 


కనుక బలమైన కాలు కండరాలు ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా బలమైన హృదయాన్ని కలిగి ఉంటారు. ..


* కాబట్టి రోజూ నడవండి.*.


 ▪️వయస్సు పాదాల నుండి పైకి మొదలవుతుంది


 ఒక వ్యక్తి యవ్వనంలో ఉన్నప్పటి కంటే  వయస్సు పెరిగే కొద్దీ, మెదడు మరియు కాళ్ల మధ్య సూచనల ప్రసార ఖచ్చితత్వం & వేగం తగ్గుతుంది, 


.  కాబట్టి *దయచేసి నడవండి *


  అదనంగా, బోన్ ఫెర్టిలైజర్ కాల్షియం అని పిలవబడేది కాలక్రమేణా త్వరగా తగ్గి పోతుంది, ఇది వృద్ధులను ఎముక పగుళ్లకు గురి చేస్తుంది.  


* కాబట్టి రోజూ నడవండి.*..*


 వృద్ధులలో ఎముక పగుళ్లు, ముఖ్యంగా మెదడు త్రోంబోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధులను సులభంగా ప్రేరేపిస్తాయి.


  తొడ ఎముక విరిగిన సంవత్సరంలోపు 15% మంది వృద్ధ రోగులు సాధారణంగా చనిపోతారని మీకు తెలుసా.  


 *ప్రతిరోజూ తప్పకుండా నడవండి*


 ▪️ *కాళ్లు వ్యాయామం చేయడం, 60 ఏళ్లు దాటినప్పటికీ, చాలా ఆలస్యం కాదు. *


కాలంతోపాటు మన పాదాలు/ కాళ్లు క్రమంగా వయస్సు మీద పడుతున్నప్పటికీ, మన పాదాలకు/ కాళ్లకు వ్యాయామం చేయడం అనేది జీవితకాల పని.


 *10,000 అడుగులు నడవండి*


 కాళ్లను క్రమం తప్పకుండా బలోపేతం చేయడం ద్వారా, ఒకరు మరింత వృద్ధాప్యాన్ని నివారించవచ్చు లేదా తగ్గించవచ్చు. 


 *365 రోజులు నడవండి*


  దయచేసి మీ కాళ్లకు తగినంత వ్యాయామం అందేలా మరియు మీ కాలి కండరాలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడానికి 


రోజూ కనీసం 30-40 నిమిషాలు నడవండి.


 *మీకు నచ్చినట్లితే ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీరు 10 మందికి పంపండి

🙏

హోమాలు

_*హోమాలు అంటే ఏంటీ?*_
*ముఖ్య హోమాలు వాటి ప్రయోజనాలు .....



*గణపతి హోమం :'*
విఘ్నాలను తొలగించే విఘ్ననాయకుడు గణపతి. మానవులు ప్రారంభించే ప్రతి కార్యాల్లోనూ మొదటగా గణపతిని పూజించడం జరుగుతుంది. ప్రారంభించిన కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుతూ వినాయకుడిని పూజిస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ప్రతికూల అంశాలను తొలగించడానికి వినాయకుడికి గణపతిహోమం నిర్వహిస్తాము ఈ గణపతి హోమం చేయడం వలన విజయము, ఆరోగ్యము, సంపద కార్యసిద్ధి కలుగుతాయి  హిందూ ధర్మం ప్రకారం ఏ శుభకార్యం చేయాలన్నా మొదటగా గణపతి హోమం తోనే ప్రారంభించడం జరుగుతుంది. ఈ గణపతి హోమానికి అష్ట ద్రవ్యలు/ 8 రకాలు. దర్భ మొదలగునవి ఉపయోగించడం జరుగుతుంది

*రుద్ర హోమం:-*
పురాణ కథలను అనుసరించి రుద్ర అనునది శివునికి మరొక నామము.శివుడు లేదా రుద్రుని అనుగ్రహం కొరకు చేసే హోమాన్ని రుద్రహోమము అంటారు. ఈ హోమం చేయుట వలన శివుని అనుగ్రహం పొంది తద్వారా అపమృత్యు భయాలు తొలగింపబడి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొంది శక్తి సంపన్నులు అవుతారు. దీర్ఘాయుష్షుని పొందడం జరుగుతుంది. మృత్యువు మీద విజయాన్ని సాధించడానికి కూడా ఈ రుద్ర హోమం చేస్తారు. ఏ వ్యక్తి అయితే రుద్ర హోమం చేస్తారో ఆ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం ఆధారంగా నిర్ణయించబడిన ముహూర్తానికి రుద్రహోమం జరపబడుతుంది. ఈ రుద్రహోమం అత్యంత శక్తివంతమైనది.

*చండీ హోమం:-*
 హిందూ పురాణాల ప్రకారం అత్యంత శక్తిస్వరూపిణి చండీ. జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగించడానికి, ఆనందమైన జీవితాన్ని గడపడానికి, సిరిసంపదల కోసం చండి హోమం నిర్వహించడం జరుగుతుంది. చండి హోమం నిర్వహించడం వలన జీవితంలో ఉన్న ప్రతికూల అంశాలన్నీ తొలగిపోతాయి. చండీ హోమం చేసేప్పుడు నవగ్రహాలను ఆవాహన చేసుకొని చేయడం జరుగుతుంది.చండీ హోమాన్ని ఎక్కువగా శుక్రవారం రోజు లేదా అష్టమి, నవములలో చేయడం శ్రేష్టం. సప్తశతిలో ఉన్నటువంటి 13 అధ్యాయాల ప్రకారంగా చండీహోమం చేసేందుకు 13 రకాల విభిన్నమైన పదార్థాలను వాడడం జరుగుతుంది.

*గరుడ హోమం:-*
మానవుని శరీరాకృతి, గరుడుని ముఖము కలిగి... శ్రీమహావిష్ణువు వాహనంగా పిలువబడే దైవ స్వరూపమే గరుడుడు. గరుడుడు అనంతమైన శక్తికి, జ్ఞానానికి స్వరూపం. గరుడార్, గరుడ భగవాన్ అని పిలిచుకొనే గరుడుడికి చేసే హోమమే గరుడ హోమం. సరైన విధి విధానాలతో కనుక గరుడ హోమం చేసినట్లయితే ఆకర్షణ శక్తి పెరగడం అలాగే అనేక విషయాల పట్ల, వ్యక్తుల పట్ల ఆధిపత్యాన్ని సాధించడం, శత్రువుల మీద విజయం, ప్రమాదాల నుంచి రక్షించబడడం, అన్ని శారీరక, మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం మొదలగునవి లభిస్తాయి. అంతేకాకుండా ఈ గరుడ హోమం చేయడం వలన జ్ఞానము అలాగే జ్ఞాపకశక్తి వృద్ధి జరుగుతుంది

*సుదర్శన హోమం:-*

శ్రీమహావిష్ణుకు చెందిన అత్యంత శక్తివంతమైన ఆయుధమే సుదర్శన చక్రం.హిందూ పురాణాల ప్రకారం ఈ ఆయుధం చాలా శక్తివంతమైన ఆయుధం అవ్వడమే కాకుండా దైవిక శక్తి కలిగి ఉండి దుష్టశక్తులను సంహరిస్తుంది. మానవుని జీవితంలో లేదా కుటుంబంలో జరుగుతున్న ప్రతికూల అంశాలకు కారణమైన దుష్టశక్తుల నుండి రక్షింపబడడానికి, నరదృష్టి తొలగించడానికి ఈ సుదర్శన హోమం చేయడం జరుగు తుంది. ముఖ్యంగా గృహ ప్రవేశ సమయంలో మరియు మిగిలిన శుభకార్యాల సమయంలో కూడా సుదర్శన హోమం నిర్వహించబడుతుంది. హోమాగ్నికి అష్ట ద్రవ్యాలను సమర్పిస్తూ అత్యంత పవిత్రమైన సుదర్శన మంత్రాన్ని జపిస్తూ ఈ హోమం చేయడం జరుగుతుంది. మానవుని జన్మ నక్షత్రం ఆధారంగా నిర్ణయింప బడిన ముహూర్తాన్ని అనుసరించి ఈ హోమం చేయడం జరుగుతుంది.

*మన్యుసూక్త హోమం:-*
వేదాల ననుసరించి మాన్యు అనగా ఆగ్రహం అని, లేదా మరొక అర్థం లో తీవ్రమైన భావావేశము అని చెప్పబడుతుంది.మాన్యు దేవుడి ఆశీస్సుల కోసం చేసే హోమము మన్యుసూక్త పాశుపత హోమం.ఈ హోమాన్ని ప్రధానంగా శత్రు సంహారం కోసం చేయడం జరుగుతుంది. కోర్టు కేసుల లాంటి దీర్ఘకాలిక సమస్యల నుండి విముక్తి కోసం కూడా ఈ హోమాన్ని చేస్తారు.ఈ హోమాన్ని శనివారం చేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు పొందడం జరుగుతుంది.

*లక్ష్మీ కుబేర పాశుపతహోమం:-*
హిందూ ధర్మానుసారంగా... సంపదకి దేవతలుగా లక్ష్మీ దేవిని, కుబేరున్ని పూజిస్తాము. జీవితంలో ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న వారికోసం సూచింపబడేదే లక్ష్మి కుబేర పాశుపతహోమం.జీవితంలో ఆర్థిక వృద్ధి, సిరి సంపదల కొరకు లక్ష్మీదేవిని అలాగే కుబేరుడిని కూడా ఈ హోమంలో పూజించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ హోమాన్ని శుక్రవారం రోజున చేయడం శ్రేష్టం. ఎందుకనగా శుక్రవారాన్ని లక్ష్మీ వారంగా పరిగణిస్తాము కనుక. హోమం చేసుకునే వ్యక్తి యొక్క జన్మ నక్షత్రాన్ని అనుసరించి నిర్ణయించబడిన ముహూర్తానికి ఈ హోమం చేయబడును. ఈ హోమం చేయడానికి కమలాలని వాడడం జరుగుతుంది.

*మృత్యుంజయ పాశుపత హోమం:-*
మరణం నుంచి విజయాన్ని పొందడమే మృత్యుం జయం. పేరులో ఉన్నట్టుగానే మృత్యువుపైన విజయాన్ని సాధించడం కోసం మృత్యుం జయ పాశుపత హోమం నిర్వహిస్తారు. ప్రాణ హాని అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందడం కోసం ఈ హోమం చేయడం జరుగుతుంది.
దుష్టశక్తులను అదుపుచేసి, సంహరించే భూత నాథుడిగా పిలవబడే ఆ శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం చేసే హోమం చేస్తారు. ఈ హోమం చేసుకునేవారు హోమానికి సంబంధించిన మంత్రాన్ని 21సార్లు జపించవలసి ఉంటుంది. ఈ హోమం చేయడానికి కావాల్సిన ప్రధాన వస్తువులు. దర్భ, అమృత మూలిక. దీర్ఘాయుష్షును కోరుతూ హోమము చేసే వారి జన్మదినం రోజున ఈ హోమాన్ని నిర్వహిస్తారు.

*నవదుర్గ పాశుపత హోమం:*
- భక్తుల చేత దుర్గామాత నవదుర్గగా పూజింప బడుతుంది. జట దుర్గ, శాంతి దుర్గ, శూలిని దుర్గ,శబరి దుర్గ,లవణ దుర్గ,అసురి దుర్గ, దీప దుర్గా, వన దుర్గ, మరియు జ్వాలా దుర్గ. దుర్గామాత యొక్క ఈ తొమ్మిది రూపాలను పూజించడానికి చేసే హోమమే ఈ నవదుర్గ పాశుపత హోమం.ఈ హోమం చేయడం వలన దుష్ట శక్తుల నుంచి విముక్తి, శాంతి,సంపద, ఆరోగ్యం, ఆయుష్యు, సంతానం, విద్య మొదలైనవి లభించి ప్రతికూలమైన ఆలోచనలు, ప్రతికూలమైన అంశాలను నుండి విముక్తి కలుగుతుంది.

మొలలబాధ విముక్తి

 తీవ్రమయిన మొలలబాధ నుంచి విముక్తి కలిగించే అతి సులభ యోగం - 


    తుత్తురి బెండ ఆకులు 3 తీసుకుని మంచి వంట ఆముదం లో వేయించి ఆ ఆకులని చపాతీలో పెట్టుకుని తిని ఆ ఆముదం తాగవలెను. ఆముదం మోతాదు ఒక స్పూన్ చాలును. ఇలా ప్రతిరోజు రాత్రి సమయం లో చేసిన 3 నుంచి 5 సార్లు వాడేలోపు మొలలు అదృశ్యం అవుతాయి. బాగా మరిగించిన నీటిలో మునగ ఆకు వేసి ఆ ఆవిరిని ఆసనానికి పట్టించిన మొలల నొప్పి అదృశ్యం అగును. 


 ఇది నా అనుభవపూర్వకం ...


  గమనిక - 


      తుత్తురి బెండని పిచ్చి బెండ , అతిబల ఇలా రకరకాలుగా పిలుస్తారు. ఇది ఖాళి స్థలాలలో పెరుగును .