18, జులై 2024, గురువారం

ఆకలి లేనివారికోసం

 ఆకలి లేనివారికోసం సులభ యోగాలు  - 


 *  మిరియాలను నూరి తీసిన రసం గాని మిరియాల కషాయం కాని తీసుకొనుచున్న అగ్నిమాంద్యం , ఆకలి లేకపోవటం వంటి సమస్య తొలగి జీర్ణశక్తి వృద్ది అగును.


 *  వేడిగా ఉన్న అన్నం వార్చిన గంజిలో కొంచం పొంగించిన ఇంగువ , సౌవర్చ లవణం కలిపి తాగుచున్న అగ్నిమాంద్యం తొలగును .


 *  యవాక్షారం , శొంఠి సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి పూటకు 5 గ్రాముల చొప్పున ఉదయం , సాయంత్రం తీసుకొనుచున్న మంచి ఆకలి కలుగును.


 *  బెల్లం , జీలకర్ర సమాన భాగాలుగా కలిపి తినుచున్న ఆకలి పెరుగును .


 *  పిప్పళ్లు చూర్ణం చేసి బెల్లముతో కలిపి తీసుకొనుచున్న ఆకలి పెరుగును .


 *  కరక్కాయ , పిప్పళ్లు , సౌవర్చ లవణం సమపాళ్లలో తీసుకుని నూరి చూర్ణం చేసి పెరుగు పైన ఉండే నీటితో కలిపి సేవించుచున్న అగ్నిమాంద్యం తొలగి ఆకలి పెరిగి జీర్ణశక్తి వృద్దిచెందును.


         పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా చేయగలరో చూసుకుని పాటించి అగ్నిమాంద్యం సమస్య నుంచి విముక్తి పొందగలరు.


 అగ్నిమాంద్య సమస్య ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు  -


 తినవలసినవి  -


 తేలికైన పాతబియ్యపు అన్నం , పెసలు , పేలాలు , పెసర కట్టు, చిన్న చేపలు , లేత ముల్లంగి , వెల్లుల్లి , లేత అరటికాయలు , లేత మునగకాయలు , పొట్లకాయ , బీరకాయ , వంకాయ , నక్క దోసకాయ , కాకరకాయ , అల్లం , చుక్కకూర, చెంచలికూర , ఉశిరికాయ , దానిమ్మపండు , నారింజపండు , పలచని మజ్జిగ , తాంబూలం , వేడినీళ్లు సేవించవలెను , తేనె , కారం , నూనె , చేదు , వగరు పదార్థాలు , వ్యాయమం .


 తినకూడనవి  -


        కొత్తబియ్యం , చేపలు , బచ్చలికూర , ఎక్కువుగా నీరు తాగరాదు , కంద , ఆలుగడ్డ మొదలగు దుంప కూరలు , నేరేడు పండ్లు , గోధుమలు , పిండివంటలు , మాంసపదార్దాలు , పాలు , పాలతో వండిన పదార్దాలు , చారపప్పు , ఎక్కువుగా నూనె ఉండు పదార్థాలు , పూర్తిగా ఉడకని పదార్ధాలు మరియు అన్నం , మద్యపానం,  ముందు తినిన పదార్దాలు పూర్తిగా అరగకముందే మరలా భుజించటం , అమిత భోజనం , నిద్రపోకుండా మేలుకుని ఉండటం, మలమూత్ర నిరోధం .


        పైన చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ ఔషధ యోగాలు వాడుచున్న సమస్య త్వరగా పరిష్కారం అగును.


         ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

దాశరధి శతకం


           చొప్పకట్ల.


భండనభీముఁడార్తజనబాంధవు డుజ్జ్వలబాణ తూణ కో

దండకళాప్రచండ

భుజతాండవకీర్తికి రామమూర్తికిన్ 

రెండవసాటిదైవమికలేడనుచున్ గడకట్టి భేరికా

డాండ డడాండ డాండ నినదండమజాండమునిండ మత్తవే

దండమునెక్కి సాటెదను దాశరధీ!కరుణా పయోనిధీ!

-దాశరధి శతకం-కంచెర్లగోపన్న.🙏

వాసుదేవ ద్వాద‌శి*_

 _ వాసుదేవ ద్వాద‌శి*_


వాసుదేవ ద్వాదశి రోజు ప్రధానంగా కృష్ణుడికి సంబంధించినది. తొలి ఏకాదశి తర్వాతరోజు జరుపుకోవాలి. చాతుర్మాస్య వ్రతం తొలి ఏకాదశి నుండి ప్రారంభించాలని మిగిలిన పురాణాలు చెబుతుండగా , వాసుదేవ ద్వాదశి నుండి ప్రారంభించాలని స్మృతి కౌస్తుభం చెబుతుంది. 


వాసుదేవుడు అంటే విష్ణువనే విషయం అందరికీ తెలిసిందే. విష్ణువు నామాల్లో ఒక్కొక్క దానికి ఒక్కో విశిష్టత ఉంది. అలాగే వాసుదేవ నామానికీ ఉంది. ఆయన వసుదేవుని కుమారుడైనందున వాసుదేవ అనే పేరు వచ్చింది. అన్నిటిలో వసించు వాడు కునుక వాసుదేవ అనే పేరు మరో విధంగా కూడా ఆయనకు సరిపడింది. ఆయన వేయి నామాల స్త్తోత్రమైన విష్ణుు సహస్ర నామంలోని *‘సర్వ భూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే’* అనేది దీనినే సూచిస్తోంది.


ఇక అన్ని ప్రాణులలో నివసించే ప్రాణ శక్తి, చైతన్య శక్తి, ఆత్మపరమైన శక్తికి వాసుదేవమనే పేరు ఉన్నట్టు పెద్దలు చెబుతారు. అలాగే ప్రాణులను ఆశ్రయించి ఉండే వైశ్వానరాగ్నికి వాసుదేవమనే పేరు ఉందని కూడా పేర్కొంటారు. *‘అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత:* అని గీతలో భగవం తుడు చెప్పిన విషయం తెలిసిందే. విష్ణు సహస్ర నామంలో *‘వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్త్రయం’* అని అన్నిటా ఆయన ఉన్నాడనే విషయాన్ని వివరించారు. అర్జునుడు కృష్ణుణ్ని ఎక్కువగా పిలిచే పేరు వాసుదేవ.

ఇక ఈ రోజు చేసే కార్యక్రమాల విషయానకి వస్తే శయనేకాదశి రోజున ఉపవాసం ఉన్న వారు ద్వాదశి రోజున విష్ణు పూజచేసి భోజనం చేయవచ్చు. ద్వాదశే పుణ్య తిథి. విషువుకు ప్రీతికర మైనది. శయనపేకాదశి తర్వాత వచ్చేది కనుక దీనికి ప్రాముఖ్యం ఎక్కువ. ఆ తర్వాత కూడా విష్ణు స్మరణతో కాలం గడిపితే మంచిది. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణ విశేషఫల దాయకం.

అంతేకాక మన సంప్రదాయం అంతా దానానికి ఎంతో ప్రాధాన్య మిచ్చింది. అందువల్ల విష్ణు సహస్ర నామస్తోత్ర పుస్తక దానం కూడా పుణ్యప్రదమే. కొంత మంది విసన కర్రలు కూడా దానం చేస్తారు. వాస్తవంగా చూస్తే వేయి నామాల ఆ దేవుని ఏ పేరుతో పిలిచినా , ఏ నామం పలికినా పుణ్యం వస్తుంది. జగదాధారుడైన ఆయనను ఒక పేరుతో పరిమితం చేయలేము. అందుకే వేయి నామాలతో విష్ణు సహస్ర నామం ఏర్పడింది. అయినా ఈ వేయి నామాలకు కూడా ఆయన పూర్తి స్వరూపాన్ని వర్ణించడం సాధ్యం కాదు. విష్ణువు అసలు స్వరూపాన్ని దేవతల రాజైన ఇంద్రుడే చూడలేద‌ని ఒక చోట ఉంది.


ఆయన అందరిలోనూ , అన్నిటా ఉన్నం దున ఒక ప్రదేశం నుంచి ఆయనను చూడడం కుదరదు. మరో విధంగా చెప్పాలంటే చూసేదీ ఆయనే , చూడబడేదీ ఆయనే. అటువంటి వారిని ఇలా ఉంటాడని చెప్పలేం. అయితే దేవునికి ఒక రూపం ఉండాలి కనుక ఆయన ధ్యాన శ్లోకాలు ఇలా ఉన్నాడని చెబుతున్నాయి కనుక మనం పరిమితులం కనుక పరిమితునిగానే ఆయననూ చూస్తున్నాం. ఆయన మనం ధ్యానించే రూపుడు కూడా.

చిదంబర రహస్యం

 "*చిదంబర రహస్యం*"

                ➖➖➖✍️

```

ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన, విశ్లేషణ అనంతరం, పాశ్చాత్య శాస్త్రవేత్తలు, ప్రపంచం యొక్క అయస్కాంత క్షేత్ర, భూమధ్య రేఖ యొక్క కేంద్ర స్థానం చిదంబరం లోని నటరాజ స్వామి పెద్ద బ్రొటన వేలు లో ఉన్నది అని నిరూపించారు.


మన ప్రాచీన తమిళ పండితుడు, కవి ’తిరుమూలర్’ ఈ విషయాన్ని ఐదు వేల సంవత్సరాల క్రితమే వక్కాణించారు. వీరు రచించిన ’తిరుమందిరం’ అనే గ్రంథం ప్రపంచం అంతటికీ శాస్త్రీయంగా మార్గ నిర్దేశం చేసే అద్భుతమైన గ్రంథరాజం. వీరి అధ్యయనాలను, విశ్లేషణలను అర్థం చేసుకోవడానికి బహుశా మనకు మరో వందేళ్లు కావాలి, ప్రత్యేకించి, చిదంబరం ఆలయం ఈ విధమైన లక్షణాలు, విశిష్టతలు కలిగి ఉంది.


1. ప్రపంచం యొక్క అయస్కాంత క్షేత్రం -భూమధ్యరేఖ యొక్క కేంద్ర స్థానం లో    ఈ ఆలయం నెలకొని ఉంది.


2. 'పంచభూత' ఆలయాలలో, చిదంబరం-'ఆకాశ' తత్వానికి ప్రతీక,               శ్రీ కాళహస్తి-'వాయు' తత్వానికి ప్రతీక, శ్రీ కాంచీ పురం-'భూమి' తత్వానికి ప్రతీక. ఈ మూడు క్షేత్రాలు/ ఆలయాలు ఒకే రేఖ పైన, 79 డిగ్రీల 41 నిమిషాల రేఖాంశం(79°41') పై నెలకొని ఉన్నాయి.


ఆసక్తి కలవారు ఈ విషయాన్ని గూగుల్ లో పరీక్షించుకోవచ్చును. ఇది ఒక అద్భుతమైన వాస్తవమే కాక, ఖగోళ శాస్త్రంలో  కూడా అద్భుతమే.


3. చిదంబర క్షేత్రం మానవ శరీర నిర్మాణం ఆధారంగా నిర్మించబడినది. మానవ శరీరం తొమ్మిది ద్వారాలను/రంధ్రాలను కలిగి ఉన్నట్లే, ఈ ఆలయం లో తొమ్మిది ద్వారాలు ఉన్నాయి.


4. ఆలయం పై కప్పు/ విమాన గోపురం లో 21,600 స్వర్ణ పత్రాలు/బంగారు రేకులు ఉపయోగించబడినవి. ఇవి, మనిషి ఒక రోజు లో తీసుకునే శ్వాస ను సూచిస్తాయి.(15x60x24=21,600).


5. ఈ 21,600 బంగారు రేకులను 72,000 బంగారు మేకులు ఉపయోగించి బిగించ బడినవి. మానవ శరీరం లో ఉన్న 72,000 నాడులకు ఇవి ప్రతీకలు. ఇవి శరీరం లోని కొన్ని అదృశ్య భాగాలకు 'శక్తి' ని సరఫరా చేస్తాయి.


6. మనిషి 'శివలింగం' ఆకారానికి ప్రాతినిధ్యం వహిస్తాడని తిరుమూలర్ వివరించారు. అదే 'చిదంబరం',                  'సదాశివం', నటరాజ తాండవాన్ని సూచిస్తుంది.


7. 'పొన్నాంబలమ్' కొద్దిగా ఎడమవైపుకు వంగి ఉంటుంది. ఇది హృదయ స్థానాన్ని సూచిస్తోంది. దీన్ని చేరుకోవడానికి ఐదు మెట్లను ఎక్కాలి, అవి, ‘పంచాక్షరి’ ‘పడి’, ‘శి  వా  య  న మః’ అనే పంచాక్షరీ మంత్రం. నాలుగు వేదాలే, నాలుగు స్తంభాలు గా, వీటి ఆధారంగా 'కనకసభ’ ఉన్నది.


8. 'పొన్నాంబలమ్' 28 శైవ ఆగమాలకు(28 పూజా విధానములు) సూచనగా 28 స్తంభాలను కలిగి ఉంది. ఈ 28 స్తంభాలు, ఆలయం పై కప్పు లోని 64 దూలాలకు(బీమ్) ఆధారంగా ఉన్నాయి. ఈ 64,   అరువది నాలుగు కళలను సూచిస్తాయి. ఆలయం లోని అడ్డ దూలాలు మనిషి శరీరం లో అంతటా వ్యాపించి ఉన్న రక్త నాళాలను సూచిస్తాయి.


9. గర్భాలయం పైన బంగారు విమానం పై ఉన్న తొమ్మిది కలశాలు, తొమ్మిది రకములైన శక్తి ని సూచిస్తాయి. అర్థ మంటపం లోని ఆరు స్థంభాలు, 'ఆరు శాస్త్రముల'కు సూచికలు. ప్రక్కగా ఉన్న మంటపం లోని 18 స్తంభాలు, పద్దెనిమిది పురాణాలను సూచిస్తాయి.


10. నటరాజ స్వామి తాండవాన్ని/నృత్యాన్ని పాశ్చాత్య శాస్త్రవేత్తలు విశ్వ తాండవం/నృత్యం గా పేర్కొన్నారు.

విజ్ఞాన శాస్త్రం ఇప్పుడు దేనిని సిద్ధాంతీకరిస్తున్నదో, దాన్ని వేల సంవత్సరాలకు పూర్వమే హిందూ మతం వక్కాణించి చెప్పింది.


హిందూ మతం అనేది ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం!✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


సేకరణ :శ్రీనివాస రెడ్డి గొదల

విష్ణు సహస్ర నామ స్తోత్ర ఆవిర్భావం

 🙏 విష్ణు సహస్ర నామ స్తోత్ర ఆవిర్భావం 🙏


విష్ణు సహస్రనామ స్తోత్రము ఆవిర్భవించిన పరిస్థితులు ఆసక్తికరమైనవి. కురుక్షేత్రయుద్ధంలో జరిగిన జనక్షయం, కష్టాల వలన పాండవాగ్రజుడు, యుధిష్ఠిరుడు కృంగి పోయి ఉన్నాడు. తన వంశోన్నతిని కోరిన భీష్ముడు అంపశయ్యపై మరణానికి సిద్ధంగా ఉన్నాడు. అనితర జ్ఞాన నిలయమైన భీష్ముని ఆశ్రయించి ధర్మాన్ని, నీతిని తెలిసికొనమని యుధిష్ఠిరుడుని వేదవ్యాసుడు, శ్రీ కృష్ణుడు ఆదేశించారు. అలా  భీష్ముడు అంపశయ్యపై నుండే యుధిష్ఠిరునకు  సమస్త జ్ఞాన ధర్మములను మరియు "విష్ణు సహస్రనామము"లను ఉపదేశించెను. మనకు విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది! భీష్మపితామహ విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు కృష్ణుడు, ధర్మరాజుతో సహా. కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం?


అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తినీ అక్కడున్న వారినందిరినీ వుద్దేశించి, "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది" అని అడిగారు. 


ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?"


ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు"  


స్వామివారు, "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"


మళ్ళీ నిశబ్దం.


స్వామివారు చెప్పడం మొదలుపెట్ట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, అందరూ కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు. అప్పుడు యుధిష్టురుడన్నాడు, "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని యుదిష్టురుడిగాడు. 


"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.  


శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.  


"అదేలా" అని అందరూ అడిగారు. 


శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు. 


శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యాస మహర్షి వ్రాసిపెట్టాడు. 


ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.

https://chat.whatsapp.com/J4FTIeytOPA4A37dRSq6dR

జయ జయ శంకర !  హర హర శంకర !! గురుభ్యో నమ:🙏

Support this blog

 Support this blog


Do you think this blog is useful. 

Please support financially by donating via G Pay Or phone pay to this Mbl. 9848647145

పురుష శ్రేష్ఠుడే

 🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


   శ్లో𝕝𝕝  

*ప్రసాదో యస్య వదనే కృపా యస్యావలోకనే*

*వచనేయస్య మాధుర్యం స స్సాక్షాత్పురుషోత్తమః*


తా 𝕝𝕝 ఎవని ముఖంలో ప్రసన్నత గోచరిస్తుందో, ఎవని చూపులలో దయ జాలువారుతూ ఉంటుందో, ఎవని మాటలలో తీయదనం ఉంటుందో అతడు *సాక్షాత్తు పురుష శ్రేష్ఠుడే*... ( *విష్ణువే* )

కుండలేశ్వరం

 🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸         

            *కుండలేశ్వరం*

*శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*కోనసీమలో గల ముమ్మిడివరం సమీపంలోని వృద్ధ గౌతమీ నదీ తీరంలో వెలిసిన క్షేత్రం కుండలేశ్వరం.*


*సూర్యభగవానుని కుండలము ఆకారంలో ఇక్కడ ఈశ్వర లింగాన్ని గౌతమ మహాముని ప్రతిష్టించారు. బ్రహ్మాండ పురాణం లో గౌతమి మహాత్మ్యంలో ఈ క్షేత్రము గూర్చి వ్యాస మహాముని 15వ శ్లోకములో 103వ అధ్యా యములో వర్ణించారు. బ్రహ్మదేవుడు నారద మహామునితో ఈ క్షేత్రం గురించి చెప్పినట్లుగా ఉంది.*


*గౌతమముని తీసుకొచ్చిన గోదావరి నది ప్రవహస్తూ సముద్రం కేసి గంభీరంగా వెళుతుంది. ఆ సమయంలో సముద్ర ఘోషవిని కోపంతో పాతాళలోకంలో ప్రవేశించి ఈ సముద్ర దేవుడిని భేదించాలి అనుకుంది గోదావరి.*  


*ఈ ఆలోచనలు పసిగట్టిన సముద్రుడు కుండలాలను, పూజాద్రవ్యాలను పళ్లెంలో ఉంచి గౌతమి నదికి ఎదురెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి గోదారమ్మ మొక్కి నా మీద కోపం వద్దు శాంతించి తన వేగాన్ని తగ్గించు కోమని కోరాడు. సూర్య భగవానుడి తేజస్సుతో మెరుస్తున్న ఈ కుండలాలను నీకు బహుమతిగా ఇస్తానని, లోగడ వరుణదేవుడు తపస్సు చేసి సూర్యుదేవుడి అనుగ్రహంతో వీటిని పొందాడని తెలియజేసాడు. దీనితో గోదావరి శాంతించింది.*


*సముద్రుని కోరిక మేరకు కుండలేశ్వర క్షేత్రంలో వీటిని దేవతల కొరకు వృద్ధ గౌతమీ నది గర్భంలో ఆలయం, మానవుల కోసం గ్రామంలో ఒక కుండల లింగాన్ని గౌతమ మహాముని స్ధాపించారని చెబుతారు.*


*కాశీలోని గంగ నరులు చేసిన పాపాలను తనలో స్నానమాచరించి ప్రక్షాళన చేసుకుంటుంటే ఆ పాపాల నివారణకు హంస రూపంలో వచ్చి కుండలేశ్వర క్షేత్రంలోని వృద్ధ గౌతమీ నదిలో స్నానమాచరిస్తుందని ఇక్కడ క్షేత్ర మహాత్మ్యం,.*


*ఇప్పటికి అర్థరాత్రి వేళ క్షేత్రం సమీపంలోని నదిగర్భం నుండి ఓంకారనాదాలు, భజనలు వినిపిస్తాయని అక్కడ అందరితో పాటు ఆలయ అర్చకులు తెలిపారు.*


*కుండలేశ్వర క్షేత్రం గురించి శంకరాచార్య కృతకమైన చంద్రశేఖర అష్టకములో ఈ స్వామిని *కుండలీ కృత కుండలేశ్వర అని మార్కండేయులు ధ్యానించారు.*


*మంగళాష్టకములోని ఒక శ్లోకములో ”కుండలపతి” అని చెప్పబడుచున్నది. 15వ శతాబ్దిలో శ్రీనాథ మహాకవి తన కాశీ ఖండము లోని భీమఖండములోను ఈ క్షేత్రమును వర్ణించి యున్నారు. ”*


*విరూపాక్షుండు కుండలేశ్వరుం డు” అని కాశీఖండములోను, ”కోటీపల్లిశ కోమలాంఘ్రులకు మ్రొక్కి కుండలాముఖ తీర్ధంబు గురించి గౌతమీ గంగ లవణాబ్ధి గౌగలించె” అని భీమ ఖండములో వర్ణించారంటే ఈ క్షేత్ర ప్రాశ స్త్యం ఎంత గొప్పదో అర్ధమవుతుంది.*


*ఈ ఆలయ గోపురంలో ఎక్కడా లేనివిధంగా 23 శివలీలల విగ్రహమూర్తులు కలవు. మరింత ఈ క్షేత్రం కోసం తెలుసుకోవటం కోసం ఒకసారి ఈ క్షేత్ర దర్శనం చేసుకోండి.*


*చంద్రశేఖరపాహిమాం.*


*ఓం నమః శివాయ॥*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸

వినాయకుడి ముందు

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు.*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*వినాయకుని పూజిస్తే ఏ పనిలోనూ ఆటంకాలు ఉండవని అందరూ నమ్ముతారు. కొంతమంది ప్రతిరోజూ వినాయకుని దర్శించనిదే ఎలాంటి పనులు మొదలు పెట్టరు. ముఖ్యంగా ద్రవిడ సంప్రదాయం పాటించేవారు పెద్దలైనా, పిల్లలైనా వినాయకుని ఆలయాన్ని దర్శించనిదే కార్యాలయాలకు కానీ, పాఠశాలలకు కానీ వెళ్లరు.*


*ఉదయం తొందరలో పెద్దగా పూజలవి చేయలేక పోయినా వినాయకుని ముందు కనీసం మూడు గుంజీలు తీసి తమ రోజువారీ పనులకు వెళ్లే వాళ్లు ఎంతో మంది ఉన్నారు.*


*అసలు వినాయకుడికి గుంజీలు అంటే ఎందుకంత ఇష్టం? దాని వెనుక ఉన్న పురాణం గాథలు తెలుసుకుందాం.*


*కైలాసం వెళ్లిన విష్ణుమూర్తి ఒకసారి శ్రీమహావిష్ణువు శివుడి దర్శనం కోసం కైలాసం వెళ్లారు. శివ దర్శనం అయిన తర్వాత విష్ణువు తన శంఖ చక్ర గదాయుధాలన్నీ పక్కన పెట్టి శివునితో కూర్చొని లోకాభిరామాయణం మొదలుపెడతారు.*


*శివుడు విష్ణువు సంభాషణల్లో మునిగి ఉండగా అటుగా వచ్చిన బాల గణపతి స్వర్ణ కాంతులతో ధగధగలాడుతున్న సుదర్శన చక్రాన్ని చూసి ముచ్చటపడి దానిని చేతిలోకి తీసుకుని అమాంతం మింగేస్తారు. ఈ విషయాన్ని శివుడు కానీ విష్ణువు కానీ గమనించరు. సుదర్శన చక్రం కోసం వెతుకులాట కొంచెంసేపు తర్వాత విష్ణువు తన ఆయుధాలు ఉంచిన చోట చూస్తే సుదర్శన చక్రం కనబడదు. అప్పుడు విష్ణువు సుదర్శన చక్రం కోసం కైలాసమంతా వెతకసాగారు*.


*అప్పుడు బాల గణేశుడు దేనికోసం వెతుకుతున్నావని విష్ణువును అడగగా, సుదర్శన చక్రం కనబడటం లేదని విష్ణువు చెబుతాడు. అప్పుడు గణేశుడు సుదర్శన చక్రాన్ని తానే మింగేసానని చెబుతారు. గణేశుని బతిమాలాడిన విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని తిరిగి ఇచ్చేయమని బాల గణపతిని విష్ణుమూర్తి ఎంతగానో బుజ్జగించి అడుగుతారు.*


*కానీ గణపతి ఇవ్వరు. ఆ సమయంలో గణేశుడి ప్రసన్నం చేసుకోవడానికి విష్ణుమూర్తి కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీస్తాడు. విష్ణుమూర్తి గుంజీలు చేయడం చూసిన వినాయకుడికి నవ్వాగలేదు. పొట్ట చేత పట్టుకొని పగలబడి నవ్వుతారు. బాల గణపతి విపరీతంగా నవ్వడం వల్ల సుదర్శన చక్రం నోట్లోంచి బయటకు వచ్చేస్తుంది.*


*ఆ దెబ్బకు బతుకు జీవుడా అనుకుంటూ విష్ణువు తన సుదర్శన చక్రాన్ని తీసుకొని వైకుంఠానికి తిరిగి వెళ్లిపోతారు. బాల గణపతి సమక్షంలో గుంజీలు తీసి విష్ణుమూర్తి తనకు కావలసింది పొందారు కాబట్టి ఆనాటి నుంచి గణపతి సమక్షంలో గుంజీలు తీస్తే కోరిన కోరికలు తీరుతాయన్న విశ్వాసం ఏర్పడింది.*


*గుంజీలు తీయడం వెనుక ఉన్న శాస్త్రీయత:~*


*మన చెవులకు చివర ఉన్న తమ్మెలు అంటే కమ్మలు ధరించే ప్రదేశం చాలా సున్నితంగా ఉంటుంది. ఒక క్రమ పద్ధతిలో ఆ ప్రాంతంలో సున్నితంగా ఒత్తిడి కలిగిస్తే మెదడులోని బుద్ధికి సంబంధించిన నరాలు చురుగ్గా పని చేసి తెలివితేటలు పెరుగుతాయని శాస్త్రజ్ఞులు చెబుతారు. అందుకే విద్యార్థులు గణపతి ముందు గుంజీలు తెస్తే బుద్ధి పెరుగుతుందని అంటారు.*


*గం గం గణపతియే నమః।*


*ఓం నమః శివాయ॥*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

స్థిరములు "కావు కావు

 స్థిరములు "కావు కావు" చల జీవితముల్, సిరి సంపదలు సుఖం కరములు "కావు కావు", 

పలు గద్దెలు మిద్దెలు నాత్మశాంతి కా కరములు "కావు కావు"; నవకమ్ములు నిత్యము" కావు కా"; వటం చరచుచునుండె కాకి, కను మల్లదిగో బహరాము గోరిపై!!

సద్య సుధా మంజరీ

ప్రేక్షకులకి ఎలా వుంటుందో

 🎬🎬ఒక పత్రికా విలేఖరి ఒక రైతును ఇంటర్ వ్యూ

చేస్తున్నాడు.

విలేఖరి: మీ మేకలకు మీరు ఏం పెడతారు..?

రైతు : నల్లమేకకా.., తెల్లమేకకా..?

వి : నల్లమేకకు..

రై : గడ్డి..

వి : మరి తెల్లమేకకు..?

రై : గడ్డి..

వి : మీరు మీ మేకలను ఎక్కడ కట్టేస్తారు..?

రై : నల్లమేకనా.., తెల్లమేకనా..?

వి : నల్లమేకను..

రై : బయటి వసారాలో..!!

వి : మరి తెల్లమేకను..?

రై : దాన్ని కూడా బయటి వసారాలో..!!

వి : వీటికి స్నానం ఎలా చేయిస్తారు..?

రై : నల్లమేకకా.., తెల్లమేకకా..?

వి : నల్లమేకకు..

రై : నీటితో..

వి : మరి తెల్లమేకకు..?

రై : దానికి కూడా నీటితో..!!

వి : నీకసలు బుధ్ధి వుందా..? రెండిటికీ ఒకేలా

చేస్తున్నప్పుడు అస్తమానూ నల్లమేకకా..,

తెల్లమేకకా అని ఎందుకడుగుతున్నావు..?

రై : ఎందుకంటే నల్లమేక నాది.

వి: మరి తెల్లమేక..?

.

.

.

.

.

.

.

రై : అదికూడా నాదే..!!

.

విలేఖరి తల గోడకేసి కొట్టుకున్నాడు.

రైతు నవ్వుతూ అన్నాడు..

ఇప్పుడర్థమైందా.. మీరు టివిలో ఒకే వార్త తిప్పి

తిప్పి గంటలు గంటలు చూపిస్తూంటే మా

ప్రేక్షకులకి ఎలా వుంటుందో..?

#followers

మానవుడికి ధర్మ మార్గాన్ని

 శ్లోకం:☝️

*యత్ సుఖం సేవామానోపి*

 *ధర్మార్థాభ్యాం న హీయతే |*

*కామం తదుపసేవేత*

 *న మూఢవ్రతమాచరేత్ ||*


అన్వయం: _మానవః ధర్మమార్గే స్థిత్వా యథేష్టం సుఖానుభవీ భవతు కిన్తు కేషు తావాన్ న రమమాణః స్యాత్ యేన అధర్మమార్గే గచ్ఛేత్ |_


భావం: మానవుడికి ధర్మ మార్గాన్ని అనుసరించడం ద్వారా తన ఇష్టానుసారం సుఖాలను అనుభవించే స్వేచ్ఛ ఉంది. కానీ అతను అధర్మ మార్గాన్ని పట్టుకునేంతగా వాటి మీద మోహం ఉండకూడదు. సుఖాల కోసం అధర్మ మార్గంలో వెళితే ఆ సుఖాలు లభించకపోగా పాపం మూట కట్టుకుంటాడు.

పంచాంగం 18.07.2024 Thursday.

 ఈ రోజు పంచాంగం 18.07.2024 Thursday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం గ్రీష్మ ఋతు ఆషాఢ మాస శుక్ల పక్ష  ద్వాదశి తిధి బృహస్పతి వాసర: జ్యేష్ఠ నక్షత్రం శుక్ల తదుపరి బ్రహ్మ యోగ: బవ తదుపరి బాలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


ద్వాదశి  రాత్రి 08:37 వరకు .

జ్యేష్ఠ రాత్రి 03:23 వరకు.


సూర్యోదయం : 05:55

సూర్యాస్తమయం : 06:50


వర్జ్యం : పగలు 08:49 నుండి ఉదయం 10:26 వరకు.


దుర్ముహూర్తం : పగలు 10:13 నుండి 11:05 వరకు తిరిగి మధ్యాహ్నం 03:23 నుండి 04:15 వరకు.


అమృతఘడియలు : సాయంత్రం 06:30 నుండి 08:07 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.



యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

పూజకు పనికి రాని విరులు.

 *పూజకు పనికి రాని విరులు.*...


*రూపం ముగ్ధ మనోహారం*..

*లావణ్యం అతి సుకుమారం*..


*ఎర్రటి సింధూర వర్ణం*...

*కళ్ళు చెదిరే వర్చస్సు, అందం.*.


*పూజకు పనికి రాని, తరుణీ సిగ లో ఇమడలేని యోగం* 


*రోడ్డు పక్కన,ఆ పక్కన,ఈ పక్కన పడి కాాళ్ళ కింద,వ్రేళ్ళ కింద నలగాల్సిందే*....


*ఎవరి కర్మ కు ఎవరు బాధ్యులు*..

*ఎవరి తలరాతకు వారే సజీవ సాక్ష్యాలు*.


*మనిషి కైన,పువ్వు కైన రంగు,హంగు,రూపు రేఖలు కాదు ముఖ్యం...గుణం*


✍✍మూర్తి's కలం.....

కాలమిస్ట్,కవి,లెక్చరర్.

9985617100.

ఆషాఢ మాసం -

 ॐ    ఆషాఢ మాసం - ప్రత్యేకత - II 


నేరేడుపండు - మాంసాహారం - అంతరార్థం    


    ఆషాఢమాసంలో నేరేడు పండు తినాలని పెద్దలు చెబుతారు. 

    సంవత్సరంలో ప్రతీవారూ ఏనుగు తల పరిమాణమంత మాంసాన్ని ఆహారంగా  తీసుకుంటారనీ, దానికి నేరేడు విరుగుడనీ పేర్కొంటారు. 

    దీనిలో ఉండే అంతరార్థాన్ని పరిశీలించాలి. 


శాకాహారులూ మాంసాహారులేనా? 


    మొక్కలకు ప్రాణముంటుందని జగదీశ్ చంద్రబోసు అనే శాస్త్రవేత్త కనుగొన్నట్లు మనం పాఠ్యాంశాలలో చదువుకున్నాం. 

    కానీ, సంస్కృతంలో "ఓషధి" అంటే "ఫలమునిచ్చి మరణించునది" అని  అర్థం. 

    వరిధాన్యంవంటివి మనం ఆహారంగా తీసుకుంటాము కదా! 

    మొక్క మనకి ఆహారమిస్తూ,అది ప్రాణాన్ని కోల్పోతుంది. అదియే మాంసాహారము. 

    ఆ విధంగా, ప్రతి ఒక్కళ్ళూ తినే ఆహారం, సంవత్సరంలో ఏనుగు శిరస్సంత ప్రమాణమే కదా! 


హింస - ప్రాయిశ్చిత్తము 


     మనం తెలిసి కూడా ఐదు హింసలకి పాల్పడతాం. వాటిని పంచ సూనములు అంటారు. వాటికి ప్రాయశ్చిత్తంగా పంచయజ్ఞాలు చేయాలి. 

     మన జీవనానికై ఆ హింసలు చేయక తప్పదు. 

    అందులో మొదటిది "ధాన్యాన్ని ఉత్పత్తి చేసేడప్పుడు జరిగే ప్రాణిహింస".  

     అందులో భాగమే ధాన్యాహార స్వీకరణ. 

    దానికి ప్రాయశ్చిత్తం "బ్రహ్మయజ్ఞం". 

    అంటే వేదాధ్యయనం చేయడం - చేయించడం. 


    ఆషాఢ మాసంలో వేదవ్యాసుని జయంతి వస్తుంది కాబట్టి, 

    వేదాలని న్యాసమొనరించి, ఈ రూపంలో అందించిన ఆయనను స్మరించి,  

     వేదాలని కాపాడుకోవడం మన విధి. 

    

ప్రకృతిలో మార్పు - సహజ చికిత్స 


    దేహంనుండీ శ్వేదరూపంలో బయటకు వెళ్ళే నీరు, 

    ఆషాఢంలో ఎండతగ్గి,    

    మూత్రంరూపంలో అధికంగా విడుదల అవుతుంది. 

    వాతావరణంలోని మార్పు జీర్ణకోశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. 

    అతిమూత్రవ్యాధికి నేరేడు మంచి మందనీ, వెంట్రుకలను కూడా కరగించి అరిగించే శక్తి దానికి ఉందనీ జీవశాస్త్రంలో విద్యార్థులు చదువుతారు. 


గమనించవలసిన విషయాలు 


1. వాతావరణంలోని మార్పుకు దేహం సరి అయ్యే విధంగా, ఆ కాలంలో ప్రకృతి అందించే నేరేడు ఔషధంలా ఉపయోగించడమూ, 

2. బ్రహ్మయజ్ఞం ఆవశ్యకత  గుర్తించి, మన అపూర్వ జ్ఞానరాశియైన వేదాలని కాపాడుకోవడాన్ని బేరీజు వేసుకునే విధంగానూ పెద్దలు మనకిచ్చిన వరం. 


ఆచరణ 


    కాబట్టి మన పెద్దలు ఆషాఢ మాసం సందర్భంగా మనకందిచ్చిన ఆరోగ్య సూత్రాన్ని పాటించి,  ఆరోగ్యాన్ని పొందుతూ, 

    తద్వారా, దాని వెనక ఏర్పరచిన సాంకేతిక కారణాన్ని తెలుసుకొని, 

     శాస్త్రీయ వైదిక విజ్ఞానాన్ని కాపాడుకొందాం. తరువాత తరాలకి అందిద్దాం.  


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం