18, జులై 2024, గురువారం

విష్ణు సహస్ర నామ స్తోత్ర ఆవిర్భావం

 🙏 విష్ణు సహస్ర నామ స్తోత్ర ఆవిర్భావం 🙏


విష్ణు సహస్రనామ స్తోత్రము ఆవిర్భవించిన పరిస్థితులు ఆసక్తికరమైనవి. కురుక్షేత్రయుద్ధంలో జరిగిన జనక్షయం, కష్టాల వలన పాండవాగ్రజుడు, యుధిష్ఠిరుడు కృంగి పోయి ఉన్నాడు. తన వంశోన్నతిని కోరిన భీష్ముడు అంపశయ్యపై మరణానికి సిద్ధంగా ఉన్నాడు. అనితర జ్ఞాన నిలయమైన భీష్ముని ఆశ్రయించి ధర్మాన్ని, నీతిని తెలిసికొనమని యుధిష్ఠిరుడుని వేదవ్యాసుడు, శ్రీ కృష్ణుడు ఆదేశించారు. అలా  భీష్ముడు అంపశయ్యపై నుండే యుధిష్ఠిరునకు  సమస్త జ్ఞాన ధర్మములను మరియు "విష్ణు సహస్రనామము"లను ఉపదేశించెను. మనకు విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది! భీష్మపితామహ విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు కృష్ణుడు, ధర్మరాజుతో సహా. కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం?


అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తినీ అక్కడున్న వారినందిరినీ వుద్దేశించి, "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది" అని అడిగారు. 


ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?"


ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు"  


స్వామివారు, "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"


మళ్ళీ నిశబ్దం.


స్వామివారు చెప్పడం మొదలుపెట్ట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, అందరూ కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు. అప్పుడు యుధిష్టురుడన్నాడు, "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని యుదిష్టురుడిగాడు. 


"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.  


శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.  


"అదేలా" అని అందరూ అడిగారు. 


శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు. 


శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యాస మహర్షి వ్రాసిపెట్టాడు. 


ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.

https://chat.whatsapp.com/J4FTIeytOPA4A37dRSq6dR

జయ జయ శంకర !  హర హర శంకర !! గురుభ్యో నమ:🙏

కామెంట్‌లు లేవు: