7, జూన్ 2022, మంగళవారం

రాశుల వారికి సంభవించు వ్యాధులు

 ఆయా రాశుల వారికి సంభవించు వ్యాధులు  -


 *  మేషము  - 


      తలనొప్పి, వాపులు వచ్చే వ్యాధులు , మెదడుకు సంబంధించిన రోగములు , మెదడువాపు వ్యాధి , సృహతప్పుట, నిద్రపట్టని వ్యాధి , మెదడులో రక్తనాళాలు పగులుట అనగా సెరిబ్రల్ హేమరేజ్ , బ్రెయిన్ ట్యూమర్, కోమా , మెదడులో జబ్బు కారణంగా వచ్చు జ్వరం వంటి సమస్యలు సంభవిస్తాయి.


        మేషరాశి కోపమును , తొందరపాటును , పట్టుదల , దుడుకు చర్యలను సూచిస్తుంది. వీరికి మాంసాహారం ఎక్కువుగా పడదు. వీరు కోపమును ఉద్రేకమును కంట్రోల్ చేసుకోవడం అవసరం.


 *  వృషభం  -


        గొంతువ్యాధులు ముఖ్యముగా టాన్సిల్స్ వాపు వాటి వలన కలుగు ఇన్ఫెక్షన్ , గొంతువాపు , గొంతునొప్పి, మెడనొప్పి, మెడలోని నరాలు బిగదీసుకు పోవడం , గొంతు బొంగురు పోవడం , నాలుక పూత, నాలుకపై కురుపులు , దంతాల నొప్పి, దంతాలు పుచ్చడం , కంటి వ్యాధులు , ముఖము పొంగుట , మృగశిర 1 వ పాదం ముఖం పై గాయాలు , ముఖం పై రాళ్ళ దెబ్బలు , లాలాజలం ఉత్పత్తి అయ్యే గ్రంథుల కు జబ్బు, కళ్లు ఎర్రబడుట, కళ్ల కలక, కంటి వాపు , కంట్లో శుక్లాలు , స్వరపేటికకు వచ్చే జబ్బు , మూత్రపిండాల జబ్బు, మూత్రాశయపు జబ్బులు , మూత్రం వలన అంటు జబ్బులు వంటి సమస్యలు కలుగును.


 *  మిధునము  -


      ముఖ్యముగా ఊపిరితిత్తులకు సంబంధించిన అన్ని రోగములు , శ్వాసనాళాల వాపు , శ్వాసనాళాల నొప్పి, బ్రాంకైటిస్ , క్షయవ్యాధి , చెవి వ్యాధులు , ముఖ్యముగా కుడి చెవికి వచ్చు వ్యాధులు , చెవుడు, చెవినొప్పి, చెవిలో కురుపులు , చీముకారుట మొదలయిన సమస్యలు , లంగ్ క్యాన్సర్ , శ్వాసనాళములో కఫం గట్టిపడటం మొదలయిన సమస్యలు , జననేంద్రియ , సుఖవ్యాధులు , పాద సంబంధ సమస్యలు , రెక్టమ్ వంటి విసర్జకావయావాల  సమస్యలు సంభంవించును.


 *  కర్కాటకం  - 


        ఛాతినొప్పి, ఛాతిలో బరువుగా ఉండటం , ఆస్తమా , క్షయవ్యాది , జలోదరం , గ్యాస్ జబ్బు, మానసిక వ్యాధులు , అజీర్ణం పునర్వసు 4 వ పాదం పచ్చకామెర్లు , క్యాన్సర్ వ్యాధి , మతిచాంచల్యం , పుష్యమి నక్షత్రం గాల్ బ్లాడర్ లో రాళ్లు తగినంత పైత్యరసం ఉరకపోవడం వలన అజీర్ణం , పులుపు వలన ఇబ్బందులు , ఊపిరితిత్తుల జబ్బు, ఊపిరితిత్తులలో రాళ్లు , కండపెరుగుట , శ్వాసక్రియ సక్రమంగా లేకపోవటం ఆయాసం , జలుబులు, ముక్కులో కండలు పెరుగుట, ముక్కులో నొప్పి, శ్వాసకోశ వ్యాధులు , తాగుడు దాని మూలంగా కలుగు వ్యాధులు సంభవిస్తాయి.


 *  సింహము -


      ముఖ్యంగా గుండెజబ్బులు , ముఖానక్షత్రం రక్తపోటు , గుండెదడ , గుండెలో కండరాల వాపు , గుండె వాల్వుల జబ్బు మరియు గుండె వాల్వులు చెడిపోవుట , జ్వరములు తలతిరగడం , కొలెస్ట్రాల్ అధికం అయ్యి రక్తనాళాలు మూసుకుపోవడం ముఖ్యంగా పుబ్బ నక్షత్రం వారికి ఇది చూపిస్తుంది. గుండెకి సంబంధించిన అన్నిరకాల వ్యాధులు , గుండె మార్పిడి , కాళ్లు పొంగడం , మోకాళ్ల వాపు , మోకాళ్ల నొప్పులు , మోకాలి చిప్ప వాపు మరియు నొప్పి , మూర్చ జబ్బు. వంటి సమస్యలు వస్తాయి.


 *  కన్య  -


      కడుపుకి సంబంధించిన సమస్త రోగములు , లివర్ , గాల్ బ్లాడర్ వ్యాధులు , డిసెంట్రీ , కడుపునొప్పి, అల్సర్లు , చిత్త 1 , 2 పాదములు పైత్యం, అల్సర్ , వాంతులు , పైత్య వికారం, తల తిరగడం వంటి వాటిని చూపిస్తాయి. కడుపులోని రక్తనాళాలకు జబ్బు, ఈ రాశి నుండి కుంభం 6 వది కావడం వలన పిక్కలు , చీలమండల వాపులు , నొప్పులు వీటిపైన దెబ్బలు తగలడం ముఖ్యంగా రాతి వలన దెబ్బలు , ప్రమాదాలు జరిగి తలకు దెబ్బలు తగలడం , ముఖం పగలడం , అజీర్ణవ్యాది , ఎక్కువ ఆహారం తినటం వలన కలిగే వ్యాధులు , కన్యారాశి జీర్ణం అయిన ఆహారం లో నుండి శక్తికి గ్రహించడం కలిసిపోవడం మరియు శక్తిని శరీరానికి ఉపయోగించేలా క్రియలు చేస్తుంది . కాబట్టి ఈ క్రియలకు అడ్డు కలిగించే వ్యాధులు , తాగుడు ( హస్తా నక్షత్రం ) దానివలన మత్తు కలిగి ప్రమాదాలకు గురి అవడం జరుగును.


 *  తుల  -


       మూత్రపిండాల జబ్బు, మూత్రపిండం మార్పిడి , మూత్రనాళాలలో రాళ్లు , మూత్రనాళాల వాపు , వెనక భాగం వీపు దిగువ భాగంలో తట్టుకోలేని విపరీతమైన నొప్పి , ముత్ర విసర్జనకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులు , మూత్రంలో గ్లూకోజ్ , యూరినరీ ఇన్ఫెక్షన్ , మూత్రపిండాల ఇన్ఫెక్షన్ వలన నొప్పి, అపెండిసైటిస్ , పాదాల వాపు , పాదాల వ్రేళ్ల వాపు , నొప్పులు , పాదాల ఇన్ఫెక్షన్ సమస్యలు కలుగును.


 *  వృశ్చికం  -


         బాహ్యజననేంద్రియాలకు సంబందించిన వ్యాధులు , మూత్రకృచ్చం , బ్లాడర్ వాపు , హైడ్రోసిల్ , బ్లాడర్ లో రాళ్లు , రతిక్రియ ద్వారా సంభవించు వ్యాధులు , గుదము , రెక్టమ్ వీటికి సంబంధించిన సమస్యలు , మూలవ్యాది, భగంధరం , గుదములో పుండ్లు , గర్భాశయ క్యాన్సర్ , అండాశయం యొక్క వ్యాధి , హెర్నియా , పొత్తి కడుపులో నొప్పి, తెల్లబట్ట , పసుపు బట్ట మొదలగు స్త్రీ జననేంద్రియ వ్యాధులు , గనేరియా , సిఫిలిస్ , ప్రొస్టేట్ గ్రంథి వాపు , గర్భాశయంకు శస్త్ర చికిత్స చేసి తీసివేయుట , విసర్జన సక్రమంగా జరగకపోవటం , అనురాధ నక్షత్రం వలన మలబద్దకం , గ్యాస్ సమస్య , నపుంసకత్వం , నరాల బలహీనత, తలలో కురుపులు , నిద్రలో నడుచుట, మత్తులోకి పోవటం , దీర్ఘనిద్ర , జననేంద్రియముల వద్ద చర్మవ్యాధి , ఫెలోపియన్ నాళాల వాపు , నిస్సంతానం వంటి సమస్యలు కలుగును.


 *  ధనస్సు  -


        కీళ్లవాతం, ధనుర్వాతం, సయాటిక, పిక్కలు , తొడలు నొప్పి, వాటి ఎముకలు విరుగుట , పిరుదులపైన కురుపులు , నడుమునొప్పి, తొడలలో వచ్చు తొడపాము అనే జబ్బు , గౌట్ జబ్బు కలుగును. పూర్వాషాడాలో చంద్ర , గురు , శుక్రులలో ఎవరైనా ఒక్కరు ఉన్నను మధుమేహం కలుగచేస్తారు . ఉత్తరాషాడ 1 వ పాదం వలన పిరుదులపైన శగ కురుపులు , మూలా నక్షత్రం వలన ఎక్సరేకి కూడా చిక్కని అంతుదొరకని నడుమునొప్పితో ఇబ్బంది పడతారు.  కీళ్లవాతాలు సంభంవించును.


 *  మకరం  -


        మోకాళ్ళ నొప్పులు , వాపులు , ఎముకలు విరుగుట, చర్మవ్యాదులు ఎగ్జిమా , కీళ్లవాతం , జలుబులు , శ్వాశకోశ వ్యాధులు , శ్వాశ పీల్చలేకపోవడం ఆయాసం , గుండెవ్యాధులు సంభంవించును.


 *  కుంభం  -


         గుండె వ్యాధులు , చెవి వ్యాధులు , ముఖ్యంగా ఎడమచెవి సమస్యలు , కాళ్లవాపు , చీలమండల వాపు , రక్తపోటు , బోదకాలు , చర్మవ్యాదులు , మలబద్దకం , అజీర్ణవ్యాధులు , రక్తప్రసరణ సరిగ్గా లేకపోవటం , చిగుళ్లవాపు , నొప్పి , శ్వాసనాళంలో అన్య వస్తువు లేక కండరం పెరగటం , శ్వాసక్రియకు అడ్డుతగలడం వంటి సమస్యలు కలుగును.


 *  మీనము  -


       తాగుడుకు బానిస అవ్వడం , గ్యాస్ట్రిక్ సమస్యలు , పాదముల వాపు , నొప్పులు , మడమల పగుళ్లు , మడమశూలలు , అరికాలిలో కురుపులు , పాదాలకు ఎక్కువ చెమట పట్టడం , పాదాలలో ఆనెలు కలుగును. పూర్వాభాద్ర 4 వ పాదం వలన లివర్ సమస్యలు , ఉత్తరాబాద్ర కారణమున పచ్చకామెర్లు , వాతం , లివర్లో రాళ్లు , లివర్ పెరగటం , రేవతి వలన నరాల జబ్బులు , పాదాల వాపు కలుగును. ముఖ్యంగా పాదాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువ కలుగును.


       ఇప్పటి వరకు మీకు నేను ఆయా రాశుల వారికి కలుగు వ్యాధుల గురించి తెలియచేశాను మన వ్యక్తిగత జాతకం అనుసరించి ఆయా గ్రహస్థితుల స్థానాన్నిబట్టి మనుష్యులకు రోగాలు వచ్చును.  రాబోయే మరికొన్ని పొస్టులలో నక్షత్రాల వలన ఆయా నక్షత్రాల వారికి కలుగు వ్యాధులను వివరిస్తాను.


           ఆయా రాశుల వారు తమ అనారోగ్యాలను ముందుగానే గుర్తించి సరైన చికిత్సలు తీసుకోవడానికి ఈ పోస్టు పెట్టాను .


         మరిన్ని అతి సులభ యోగాల కొరకు నా గ్రంథాలను చదవగలరు.


     గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

భూషణము

 శ్లోకం:☝️

*యతీనాం భూషణం జ్ఞానం*

    *సంతోషో హి ద్విజన్మనాం l*

*ఉద్యమః శత్రుహననం*

    *భూషణం భూతిమిచ్ఛతాం ll*

    - శ్రీ దేవీ భాగవతం


భావం: యతులకు జ్ఞానము భూషణము. ద్విజులకు సంతోషము భూషణము. సంపదలను కోరు క్షత్రియులకు శత్రునాశన ప్రయత్నము భూషణము. వెరసి ఏ వర్ణాశ్రమం వారికి ఆ ధర్మములు భూషణములు.🙏

పూరీజగన్నాథ్

 🌹పూరీజగన్నాథ్ స్వామి వారి విశిష్టత🌹


 శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దహన సంస్కారాలు జరిగాక ఆయన శరీరమంతా ఐదు మూలకాలలో కలిపారు కానీ ఆయన గుండె ఒక సాధారణ మనిషి గుండెలా కొట్టుకుంటూనే ఉంది.


💕ఆయన గుండె ఈనాటి వరకూ సురక్షితంగా ఉంది. ఇది జగన్నాథుని చెక్క విగ్రహంలో ఉంది. అలా కొట్టుకుంటూనే ఉంది.


🌺పూరీజగన్నాథ్ (శ్రీ కృష్ణుడి) ని కలియుగ ప్రభువు అని కూడా అంటారు.


💕ప్రతి 12సంవత్సరాలకు ఒకసారి మహాప్రభు విగ్రహం మార్చబడుతుంది. ఆ సమయంలో పూరి నగరం మొత్తం చీకటిగా మారుతుంది. అంటే మొత్తం నగరం అంతటా లైట్లు ఆపివేయబడతాయి. లైట్లు ఆపివేసిన తరువాత సిఆర్ పిఎఫ్. సైన్యం అన్ని వైపుల నుండి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముడుతుంది ... 

ఆ సమయంలో ఎవరూ ఆలయంలోకి ప్రవేశించలేరు.


❤️ఆలయం లోపల దట్టమైన చీకటి ఉంటుంది. పూజారి కళ్ళు కట్టుకుంటారు... పూజారి చేతిలో చేతి తొడుగులు ఉంటాయి.. పాత విగ్రహం నుండి "బ్రహ్మ పదార్ధం" తీసి కొత్త విగ్రహంలోకి మార్చుతారు... ఈ బ్రహ్మ పదార్ధం ఏమిటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ... ఈ రోజు వరకు ఎవరూ చూడలేదు. .. వేలాది సంవత్సరాలుగా ఇది ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి బదిలీ చేయబడుతూనే ఉన్నది.


🌺ఈ రోజు వరకు మహాప్రభు జగన్నాథ్ విగ్రహంలో ఏముంది అని ఏ పూజారి కూడా చెప్పలేకపోయారు.


💕కొంతమంది పూజారులు మేము చేతిలో తీసుకున్నప్పుడు ఆయన కుందేలు లాగా దూకుతున్న అనుభూతి కలిగిందని చెప్పారు.


❤️ఇప్పటికీ జగన్నాథ్ యాత్ర సందర్భంగా పూరి రాజు స్వయంగా బంగారు చీపురుతో ఊడుస్తాడు.


చాలా దేవాలయాల శిఖరాలపైన పక్షులు కూర్చుని ఎగురుతూ ఉండడాన్ని మనం చూస్తూంటాం. కాని జగన్నాథ్ ఆలయం మీదుగా ఏ పక్షి కూడా ఎగరదు.


🌺జెండా ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది


 ❤️జగన్నాథ్ ఆలయం యొక్క 45 అంతస్తుల శిఖరంపై ఉన్న జెండాను ప్రతిరోజూ మార్చడం జరుగుతుంది, జెండాను ఏరోజైనా మార్చకపోతే ఆనాటినుండి ఆలయం 

18 సంవత్సరాలపాటు మూసివేయబడుతుంది.


❤️జగన్నాథ్ ఆలయం పైభాగంలో ఉన్న సుదర్శన్ చక్రం ఏదిశ నుండి చూసినా అది మనకు ఎదురుగానే ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. జగన్నాథ్ ఆలయ వంటగదిలో 

7 మట్టి కుండలు ఒకదానిపైన ఒకటిఉంచి ప్రసాదాన్ని కట్టెలపొయ్యి మీదనే వండుతారు.


💕జగన్నాథ్ ఆలయంలో ప్రతిరోజూ చేసిన ప్రసాదం భక్తులకు ఎప్పుడూ తగ్గదు. కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆలయ తలుపులు మూసిన వెంటనే ప్రసాదం కూడా ముగుస్తుంది.🌹

============================సేకరణ

కోరికలుకోరికలు

 శ్లోకం:☝️

*న జాతు కామః కామానాం*

    *ఉపభోగేన శామ్యతి l*

*హవిషా కృష్ణవర్త్మేవ*

    *భూయ ఏవాఽభివర్థతే ll*

    - మనుస్మృతి 2-94


భావం: కోరికలు ఎన్నటికీ అనుభవించుటచేత ఉపశమించవు. నేయి పోసిన కొద్దీ అగ్ని ప్రజ్వరిల్లునట్లు, అనుభవించిన కొద్దీ కోరికలు పెరుగుచునే యుండును. కనుక

కోరికలను ఎంత అదుపులో ఉంచుకోగలిగితే ప్రాణానికి అంత సుఖంగా ఉంటుంది. అందుచేత ఆ దిశగా ప్రయత్నం చేద్దాం.

తెలంగాణ ప్రాంత- అల్ట్రా వైలెట్ రేడియేషన్

 తెలంగాణ ప్రాంత-  అల్ట్రా వైలెట్ రేడియేషన్ హెచ్చరిక: RED ALERT!!    ( ప్రచరణ కొరకై)


గత కొన్ని రోజులుగా విపరీతమైన వేడితో కూడిన గాలుల వలన, ప్రజలు ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రాంతంలో అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఇండెక్స్ = 12 చేరడంతో, హైదరాబాదులోని అశ్విని ఎలర్జీ సెంటర్ వైద్యబృందం, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారా 2.5 కోట్లమంది, ఎలర్జీ వ్యాధితో బాధపడుతున్న వారిని దృష్టిలో ఉంచుకొని,  ఒక ప్రకటన విడుదల చేసింది.


అల్ట్రా వైలెట్ రేడియేషన్ index 12కు చేరడంతో, ప్రజలను ఆరోగ్య విషయంలో అప్రమత్తం చేసే విధంగా, సూచనలు విడుదల చేసింది.


అల్ట్రా వైలెట్ రేడియేషన్ index 12, ఉండడంవల్ల : 


 1)SUN ALLERGY విపరీతంగా పెరుగుతున్నాయని, ఈ ప్రభావం వల్ల శరీరమంతా విపరీతమైన మంటలు, దురదలు, ఎర్ర దద్దుర్లు, రావడం జరుగుతోందని హెచ్చరించింది.


2) అత్యవసర పరిస్థితులు, అనివార్య అవసరాలు మినహా, ఎట్టిపరిస్థితుల్లో ఉదయం 11 గంటల నుంచి 4pm గంటల మధ్యలో ఎండలో పోకూడదని, అశ్విని ఎలర్జీ మెడికల్ టీం చీఫ్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు.


3) గత పది రోజులుగా, చర్మం మీద ఎలర్జీలు తో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిందని, దీనికి కారణం సూర్యుని నుండి వెలువడుతున్న అల్ట్రావైలెట్ రేడియేషన్ మే కారణమని, అలర్జీ ఇమ్యునాలజీ వైద్యులు చెబుతున్నారు.


4) బయటికి వెళ్ళ వలసిన పరిస్థితి ఏర్పడితే SUN PROTECTION  CREAM (60spf) చర్మంపై రాసుకొని వెళ్లాలని సూచించారు.


5) ఫోటో డెర్మటైటిస్, POLYMORPHIC LIGHT ERUPTION వంటి సన్ ఎలర్జీలు తో బాధపడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.


6) తలపై CAP, SUNGLASSES, LOOSE Clothing వేసుకొని బయటికి వెళ్లాలని సూచించారు.


7) అల్ట్రా వైలెట్ సూర్యకాంతి తాకిన అరగంట గంటలో, చర్మం దురదలు రావడం, చర్మంపై మంటలు రావడం, దద్దుర్లు రావడం, గమనించినట్లయితే వెంటనే దగ్గర్లోని అలర్జీ ఇమ్యునాలజీ స్పెషలిస్ట్ లను సంప్రదించవలసినదిగా సూచించారు.


8) మబ్బులు ఉన్నాయి కదా అని బయటకెళ్ళిన, ప్రమాదమని, మబ్బుల నుంచి కూడా సూర్యుని అల్ట్రా వైలెట్ రేడియేషన్ కాంతులు భూమిని తాకుతుందని, దానివల్ల కూడా అలర్జీల ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చరించారు.


9) ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని బయటకు తీసుకు వెళ్ళకూడదని, దీనివలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.



డాక్టర్: వ్యాకరణం నాగేశ్వర్

Allergist & Immunologist

Environment Protection Activist

& Medical Journalist.

9949529392

www.aswiniallergycentre.com


సేకరణ :

యెనుములపెళ్లి నాగ రామచందర్,

వరంగల్. తెలంగాణా..

తే.గీ.పడతి నాలుగు వర్ణముల్ పదములోన సకియ మొదటివర్ణముబోవ శ్రవణమగును ఆది చివరివర్ణము గూడ నందమగును తెలిసి యున్నచో చెప్పుము తెలుగు లేమ. పి.మోహన్ రెడ్డి.

 తే.గీ.పడతి నాలుగు వర్ణముల్ పదములోన

సకియ మొదటివర్ణముబోవ శ్రవణమగును

ఆది చివరివర్ణము గూడ నందమగును

తెలిసి యున్నచో చెప్పుము తెలుగు లేమ.

పి.మోహన్ రెడ్డి.

పొడుపు పద్యము …

 . .... జాతీయ తెలుగు సాహితీ పీఠము …. 

  తేనియల్ చిందు నా భాష తెలుగుభాష

        డా. నలవోలు నరసింహా రెడ్డి


          …… పొడుపు పద్యము …...

ఆ. అరయ నొక్క పదము కైదక్షరమ్ములు 

ఒండు, రెండు, నైదు నొప్పు ''వంద'' 

మూడు, నాలు, గైదు చూడగా ''గర్వము''  

పదము తెలుప వలయు పసిడి బాల..! 58

జవాబు ..? 

నిన్నటి జవాబు ... (కోరికలు)

ఓం సహనా వవతు

 *పూర్వం గురుశిష్యులు చెప్పుకునే మంత్రం.!*


*ఈ మధ్య ఎక్కడ మనం వినడం -చూడటంలేదు..*


ఓం సహనా వవతు

సహనౌ భునక్తు

సహవీర్యం కరవావహై

తేజస్వినావధీతమస్తు

మా విద్విషావహై

ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః


పాఠం చెప్పుకునే ముందు గురుశిష్యులు చెప్పుకునే శాంతిమంత్రమిది. 


భగవంతుడు మన ఇద్దరినీ రక్షించుగాక. 

మన ఇద్దరినీ వృద్ధి చేయుగాక. 

ఈ అధ్యయనానికి అవసరమైన శక్తి మన ఇద్దరికీ అబ్బునుగాక. 

మనం చదివేది మన ఇద్దరికీ వెలుగుని ఆపాదించు గాక. మన మధ్యలో విభేదాలు తలయెత్తకుండు గాక. 

టూకీగా ఇదీ అర్ధం.


*భావము.*


ఈశ్వరుడు మనల నిరువురుని రక్షించుగాక. 

అతడు మనల నిరువురను పోషించుగాక.  

మనము గొప్ప శక్తి తో(దివ్య బలముతో) కలసి 

పని చేయుదుముగాక. 

అధ్యయనము చే మనమిరువురమును 

మేథా సంపదను పొందుదుము గాక! 

           

మనమితరులను ద్వేషింపకుందుము గాక. 

శాంతి, శాంతి, శాంతి సర్వత్ర ఉండుగాక.  

(ఈ వైదిక ప్రార్థన ప్రేమ సౌభ్రాబ్రత్వము,  పరస్పరావగాహన ,శాంతి సామరస్యము అను ఉదారములైన ఆశయములను ప్రకటించును. )


*వివరణ:.💐*


పాఠం చెప్పుకునే ముందు గురుశిష్యులు చెప్పుకునే శాంతిమంత్రమిది. 

భగవంతుడు మన ఇద్దరినీ రక్షించుగాక. మన ఇద్దరినీ వృద్ధి చేయుగాక. ఈ అధ్యయనానికి అవసరమైన శక్తి మన ఇద్దరికీ అబ్బునుగాక. మనం చదివేది మన ఇద్దరికీ వెలుగుని ఆపాదించు గాక. మన మధ్యలో విభేదాలు తలయెత్తకుండు గాక. 

టూకీగా ఇదీ అర్ధం.


పాఠం, అధ్యయనం మాత్రమే కాదు, 

ఏ ఇద్దరు మనుషులు కలిసి మాట్లాడుకునే సందర్భమైనా ఈ ప్రార్ధన సముచితమే కాక, 

ఇప్పటి రోజుల్లో అయితే మరీ అవసరం కూడాను. ఆధునిక జీవితంలో మనుషుల మధ్య సంబంధాలు ఎలాగైనాయంటే - 

నేను చెబితే నువ్వు వినాలి, 

నేను గెలిస్తే నువ్వు ఓడాలి, 

నాది పైచెయ్యి నీది కింది చెయ్యి, 

నేను అంటాను నువ్వు పడు. 

ఉద్యోగ వ్యాపారాల్లోను, స్నేహాల్లోను, 

ఇంట్లో మనుషుల్తోను ఇదే తంతు. 


తరవాత్తరవాత కాలం కొంచెం మారింది. 

కొత్త ఆలోచనలు బయల్దేరినై. 

వాణిజ్య లావాదేవీల్లోను, ఉద్యోగ శిక్షణల్లోను, 

మానవ సంబంధాల్లోను - Win win mentality, 

Active listening, Empathetic listening 

వంటి concepts ప్రాచుర్యం పొందుతూ వచ్చాయి. 


పూర్వకాలంలో నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందని సామెత. 

కానీ ఎంతటి వాడికైనా ఎల్లవేళలా నోరు అంతమంచిగా పెట్టుకోవడం సాధ్యమా? 

ఇద్దరు మనుషులు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటేనే ఇన్నేసి విభేదాలు తలెత్తుతున్నాయే, మరింక ప్రత్యక్షంగా కాకుండా ఫోన్‌లలో, ఈమెయిళ్లలో, మెసేజుల్లో, బ్లాగుల్లో .. ఎలా సాధ్యం? 

మన మనసులో ఏ దురుద్దేశం లేకపోయినా అవతల వినే వ్యక్తికి మనమాటలో ఏ విరుపు వినబడుతుందో, మనరాతలో ఏ వగరు కనబడుతుందో?


అప్పుడే అనిపిస్తుంది, 

ఈ మంత్రం ఇప్పటి జీవితంలో మరీ అవసరమని. మంత్రాన్ని మళ్ళీ ఒకసారి చదవండి. 

మంత్రార్ధాన్ని మననం చేసుకోండి. 

ఆ అర్ధాన్ని ధ్యానం చెయ్యండి. 

మంచి జరగాలి అనుకుని ఊరుకోవడం కాదు - 

చెడు జరగకూడదని స్పష్టంగా వ్యక్తపరచడం ఎంత గొప్ప ఆలోచన అది. 

మనిద్దరం కేవలం బాగుండాలి అని కోరుకోవడమే కాదు. వృద్ధి పొందాలి. 

ఎదురుగా ఉన్న పని తేలికైనది కాదు, 

దాన్ని సాధించగలిగే శక్తి మాకు కలగాలి. 

అటుపైన ఆ చేసిన పని మా యిద్దరికీ వెలుగునివ్వాలి. నాకు నేను ఏమి కోరుకుంటున్నానో, 

నా ఎదురుగా ఉన్న వ్యక్తికికూడా మనస్పూర్తిగా అదే కోరుకుంటున్నాను. 

అంతరాంతరాల్లో ఈ నిజాన్ని పూర్తిగా జీర్ణించుకుంటే 

స్వ-పర భేదం మాయమవుతుంది. 

త్వమేవాహం. 

ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః


*సర్వే జనా సుఖినోభవంతు..!!

గుండె - గంధం

 గుండె - గంధం


1959లో పరమాచార్య స్వామివారు మద్రాసు దగ్గర్లోని నజరత్ పేట్ లో మకాం చేస్తున్నారు. పూజకు గంధం కావాల్సిరావడంతో కైంకర్యం వాళ్ళల్లోని రామమూర్తి అనే అతణ్ణి పిలిచి గంధం తీయమన్నారు. అప్పటికప్పుడు పూజకు సరిపడా గంధం అరగదీసి స్వామివారికి ఇచ్చాడు.  


రామమూర్తి సాయింత్రం సమయంలో గుండెల్లో కొద్దిగా భారంగా తోచి వెంటనే డాక్టరు వద్దకు పరిగెత్తాడు. “డాక్టరు గారు నాకు గుండెల్లో ఏదో ఇబ్బందిగా, భారంగా ఉంది. ఉదయం నుండి బాగానే ఉంది. పరమాచార్య స్వామివారి కైంకర్యంలో భాగంగా ఈరోజు గంధం కావాలంటే అరగదీసి ఇచ్చాను. సాయింత్రం నుండి కాస్త ఇబ్బందిగా తోస్తోంది” అని చెప్పాడు. 


డాక్టరు గారు అతణ్ణి పరీక్ష చేసి అతనితో, ”నీ గుండె చలా బలహీనంగా ఉంది. పెద్ద పెద్ద బరువులు మోయడము, ఒత్తిడి ఉన్న పనులు చేయడము మానుకోవాలి. ముఖ్యంగా గంధం తీయడం వంటి పనులు అస్సలు చేయకూడదు” అని అన్నారు.


రామమూర్తి డాక్టరు వద్ద నుండి తిరిగొచ్చి మహాస్వామి వారితో తన ఆరోగ్య పరిస్థితి గురించి, జరిగిన విషయమంతా చెప్పాడు. రేపటి పూజకు కూడా గంధం అవసరం ఉండడంతో స్వామివారు మరలా అతణ్ణే పిలిచి గంధం తీయమన్నారు. 


మహాస్వామివారు అతనితో, “అంతా చంద్రమౌళీశ్వరుడు చూసుకుంటాడు. నువ్వు గంధం అరగదీసి ఇవ్వు” అని ఆజ్ఞాపించారు. 


పరమాచార్య స్వామివారి మాటలను కాదనలేక రామమూర్తి గంధం తీసి ఇచ్చాడు. మరలా అతనికి గుండెల్లో ఇబ్బందిగా అనిపించి మహాస్వామి వారితో డాక్టరు తనకు చెప్పిన విషయం చెప్పాడు. 


”అది గుండేపోటు అయితే మాత్రమే ప్రమాదమైనది. గుండె బలహీనంగా ఉన్నవారు శతాయుష్కులై జీవించారు. నీ పని నువ్వు చెయ్యి. దిగులు పడవద్దు” అని అనునయించారు. 


ఇవి సాక్షాత్ భగవంతుని పలుకులు కదా? 


అప్పటి నుండి చాలాకాలం పూజకై స్వామివారికి గంధం తీసి సమర్పించే భాగ్యం రామమూర్తికి దక్కింది. కాని మరలా ఎప్పుడూ తనకి అలా ఇబ్బంది కలగనేలేదు.


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం