22, ఫిబ్రవరి 2022, మంగళవారం

ఋతుశూల

 ఋతుశూల హరించుటకు నేను ప్రయోగించిన సులభ ఔషధ యోగం  - 


    ఈ ఋతుశూల అనునది చాలామంది స్త్రీలలో కనిపిస్తుంది. దీనిని ముట్టునొప్పి అనికూడా అంటారు. ఇది చాలా భయంకరమైన నొప్పితో కూడుకొని ఉంటుంది. ఇది కేవలం బహిష్టు సమయంలో వస్తుంది. కొంతమంది తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ వాడతారు. మరికొంతమందికి ఈ ముట్టునొప్పి ఉండటం వలన సంతానం ఉండదు.  


      ఇప్పుడు మీకు నేను చెప్పబోయే చికిత్స నా అనుభవపూర్వకం . మరియు అతి సులువు అయినది. దీనిని ఉపయోగించి చాలమంది సమస్య నివారించగలిగాను . 


    ముట్టునొప్పి ఉన్నవారు తెల్లజిల్లేడు పాలు 5 చుక్కలు చక్కెరకేళి అరటిపండులో గుంటలా చేసి అందులో వేసుకొని ఉదయం పూట మాత్రమే 4 రోజులు సేవించినచో ఋతుశూల తగ్గిపోవును . 


 మరియొక నా అనుభవ యోగం  - 


    ముదురు చింతచెట్టు బెరడు తెచ్చుకొని ఆ బెరడుని కాల్చి బూడిద చేయవలెను.   వేరే కర్రపుల్లలు వాడరాదు . ఆ బూడిదని జల్లించి ఆ పొడిని భద్రపరచుకొని ఇంకో రెండు రోజుల్లో బహిష్టు అవుతారు అనగా ఆ బూడిదని ఒక గ్రాము మోతాదుగా ఉదయం పూట కొంచెం నిమ్మరసంలో కలిపి తీసికొనవలెను . మరలా సాయంత్రం పూట ఒక గ్రాము తేనెతో కలిపి సేవిస్తూ ఉండాలి . బహిష్టు మూడు రోజులు కూడా ఇలాగే సేవించాలి . దీనివల్ల ముట్టునొప్పి పూర్తిగా తగ్గును. సంతాన యోగ్యత కలుగును. 


   పైన సూచించిన రెండు యోగాలతో చాలా మందికి చికిత్స చేశాను . వీటిలో మీకు ఏది సులభంగా అనిపిస్తే దానిని పాటించండి.


    ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  గమనిక  -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు  550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass  pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

 _*మాఘమాసం*_

🍁 _*మంగళవారం*_🍁

🎋 _*ఫిబ్రవరి 22వ తేది 2022*_🎋


     _*🍁మాఘ పురాణం*_🍁

 🌴 _*21 వ అధ్యాయము*_🌴


🕉🌹🍁🍁🍁🍁🌹🕉️


 *శివ స్తుతి*


☘☘☘☘☘☘☘☘


శ్రీమహావిష్ణువు చేసిన శివ ప్రశంస - నారదుని శివస్తుతి.

గృత్నృమదమహర్షి జహ్నుమునితో మరియు నిట్లనెను. విష్ణువు శివుని జూచి యిట్లనెను. శంకరా ! నీవు నాతో సమానుడవు. మన ఇద్దరికిని భేదము లేదు. నావలెనే సర్వ పూజ్యుడవు. సర్వవ్యాపకుడవు , సర్వోత్తముడవు , సర్వవ్యాపివి , సర్వాత్మకుడవు సుమాయని యిట్లు స్తుతించెను.


*🌴విష్ణుకృత శివస్తుతి🌴*


*శంభో భవానర్కహిమాంశు* *నహ్నివేత్రత్రయస్తే ఖిలలోక కర్తా*

*తధాసమస్తామర పూజితాంఘ్రీః* *సంసేవ్యమానస్పురయోగిబందైః ||*

*వచాస్తికించిత్తవ మిత్ర భేదస్తే హంచ్వహం త్వం సురనాధసత్యం*

*వేదాంద వేద ప్రముఖా నిశం ర్వాంసన్యాసినస్వృర్గ విముక్తి హేతుం*

*వదంతి తద్వత్ సుభజంతిశంభో ప్రయాంతి ముక్తించ తివ ప్రసదం ||*

*సర్వభేదవినిర్ముక్తః సర్వభేదాశ్రయోభవాన్*

*త్వంత్వరిష్ఠాయలోకేస్మిన్ మహాదేవో మహేశ్వరః ||*

*త్వమేవ పరమానందస్త్వమే వాభయదాయకః*

*త్వమక్గరం పరంబ్రహ్మ త్వమేవహినిరంజనః ||*

*శివస్స్ర్వగతః సూక్ష్మః ప్రబ్రహ్మవిదామసి*

*ఋషీణాంచ వశిష్ఠస్త్వం వ్యాసోవేదనిదామసి ||*

*సాంఖ్యానాంకపిలోదేవః రుద్రాణామపి శంకరః*

*ఆదిత్యానాముపేంద్రప్త్యం వసూనాం చ హిపొవకః ||*

*వేదానాంసామవేదస్త్యం సావిత్రి చందసామపి*

*ఆధ్యాత్మ విద్యావిద్యానాం గతీనాం పరమాగతిః ||*

*మాయాత్వం సర్వశక్తీనాం కాలకలయతామపి*

*ఓంకారస్సర్వగుహ్యానాం వర్ణానాం చ ద్విజోత్తమః ||*

*ఆశ్రమాణాం చ గార్హ్యస్థ్యం ఏశ్వరాణాం మహేశ్వరః*

*పుంసాంత్వమేకుపురుషః సర్వభూతహృదిస్థితః ||*

*సర్వోపనిషదాంచేవ గుహ్యోపనిషదుచ్యతే*

*కల్పానాంచమహాకల్పః యుగానాంకృత మేవచ*

*ఆదిత్యః సర్వమారాణాం వాచాందేవి సరస్వతీ ||*

*ర్వం లక్ష్మీశ్చారురూపాణాం విష్ణుర్మాయావినామసి*

*సూక్తాణాం పౌరుషంసూక్తం బ్రహ్మసిబ్రహ్మవేదినాం ||*

*సావిత్రీచాసి జాహ్యిరాం యజుషాం శతరుద్రీయః*

*పర్వతానాం మహామేరుః అనంతోయోగినామపి ||*

*సర్వేషాం పరబ్రహ్మచ్వన్మయం సర్వమేనహి*

*యరైవాహం త్వంహి సర్వముఖ్యోషు శంకర ||*


శంకరా ! నీకు నాకును భేదమే లేదు. వేదాంతవేత్తలకిది స్పష్టముగ తెలియును. నేను నారదునకు నీ మహిమను చెప్పగా నతడు నీయనుగ్రహమునకై తపమాచరించెను. నిన్ను దర్శింపనెందెను. నీవాతని ననుగ్రహించితివి. అతడు నిన్నెట్లు స్తుతించెనో గుర్తున్నదా ? మరల స్మరింపుము.


*కూపంతనాశేష కధాభిగుప్తం అగోచరం* *నిర్మలమేకరూపం*

*అనాదిమధ్యాంత* *మనంతమాద్యం నమామి దేవంతమనః పరస్తాత్ ||*

*ర్వాందేకపస్యంతి జగతృసూతిం వేదాంత సునిశ్చితార్థాః*

*ఆనందమాత్రం ప్రణనాభిధానం* *చతేవరూపం శరణం ప్రపధ్యే ||*

*ఆశేషభూతాంతర సన్నివిష్టం ప్రభావతాయోని* *వియోగహేతుం తేజోమయం* *జన్మవినాశహీనం ప్రాణాభిధానం ప్రణతోస్మిరూపం ||*

*ఆద్యంత హీనం జగదాత్మభూతం విభిన్న సంస్థం ప్రకృతేపరస్తాత్*

*కూటస్థమవ్యక్తవపు స్తదైవ నమామిరూపం పురుషాభిదానం ||*

*సర్వాశ్రయం సర్వజగద్విధానం సర్వతనం సర్వతమ ప్రవిష్టం*

*సూక్ష్మంవిచిత్రం త్రిగుణం ప్రసన్నం నతోస్మిలే రూపములుస్త భేధం ||*

*ఆద్యం మహత్త్వే పురుషార్త్మరూపం ప్రకృత్యవస్థం త్రిగుణాత్మబీజం*

*ఐశ్వర్య విజ్ఞాన విరాగధర్మైస్పమన్వితం దేవనతోస్మిరూపం ||*

*ద్వీసప్తలోకాత్మకమంబు సంస్థం విచిత్ర భేదం పురుషైకరాధం*

*అనంత భూతైరధివాసితంతే వతోస్మ్యహం తజ్జ గదంద స్థంస్థం ||*

*అశేష దేవాత్మక మేకమాద్యం స్వతేజసారూపితలోక భేదం*

*త్రికాలహేతుం పరమార్జరూపం నమామ్యహం త్వాం రవి మండలస్థం ||*

*సహస్రమూర్థానమనంత శక్తీం సహస్రబాహుం పురుషం పురాణం*

*శయానమంతస్పంలే తదైవ నారాయణాఖ్యం ప్రణతోస్మినిత్యం ||*

*దంష్ట్రాకరాళం త్రిదశాదినంద్యం యుగాంత కాలావల కాలరూపం*

*అశేషరూపాండ వినాశహేతుం నమామి రూపం తవకాల సంజ్ఞం ||*

*ఫణా సహస్రేణ విరాజమానం భోగీంద్రముఖ్యైరభీ పూజ్యమానం*

*జనార్దన ప్రీతి మహత్కరం త్వాం సతోస్మిరూపంతవ శేష సంజ్ఞం ||*

*అన్యాహతైస్వర్యమయుగ్మ నేత్రం బ్రహ్మమృతానంద రవజ్ఞమేకం*

*యుగాంతశేషం దివిసృత్యమానం నతోస్మ్యహంత్వామె తిరుద్ర సంజ్ఞం ||*

*ప్రక్షీణశోకం విమలం పవిత్రం సురాసురైర్చిత పాదయుగ్మం*

*మకోమలం హింద్ర సుశుభ్రదేవాం నమామ్యహాం త్వామఖిలాభినాధం ||*

*చతుర్భుజం శూలమృగాగ్నిపాణీం ప్రయత్నతో భక్తవర ప్రదానం*

*వృషధ్వజం త్వాం గిరిజారదేహం వతోస్మ్యహందేవ కృపాకరేశం ||*


శంకరా ! నారదుడు చేసిన అమోఘమైన యీ స్తుతిని విని నీవు మిక్కిలి సంతోషించితిమ్ని. మునులందరి స్తోత్రమును చదువుచు నిన్ను సేవించిరి కదా. కావున నీకును నాకును బ్రహ్మకును భేదమును లేదు. మనకు భేదమున్నదని తల్చు మూఢులు నరకమున బడుదురు సుమా అని శ్రీమన్నారాయణుడంతర్థానము నందెను.


జహ్నుమునీ ! విష్ణు ఏ విధముగ రజస్తమోగుణ భేదము వలన వివాదపడిన బ్రహ్మను శివుని శాంతపరచి లోకములకి వినయము నీ విధముగ తెలిపెను. ప్రస్తుతం ముగ్గురికి భేదములేకున్నను భేదమున్నదని తలచివాదించు , అహంకార పండితులకొరకీ సంఘటన జరిగినది. మాధమాసవ్రతము నాచరించు వారి విషయమును తప్పక గ్రహింపవలయును. అజ్ఞానముచే నాలోచించి దోషమునకు ఓడిగట్టరాదు. కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడై సర్వాత్మకుడైన విష్ణువునే భావించి జ్ఞానులైముక్తినందవలెను. అజ్ఞానులు మాఘమాసవ్రతము నాచరించి జ్ఞానులై ఇహపరముల యందు సుఖింపవలయును సుమా వృధాపదములు బుద్ధిహీనులకే గాని బుద్ధిమంతులకుగాదని తెలుపుటే యీ సంఘటన జరిగినది లెనిచో సర్వాధికిలు సర్వాధారులు సర్వోత్తములునగు త్రిమూర్తులకు కలహమేమి యెక్కువ తక్కువలేమి ? మూర్ఖుడైనను భక్తితో మాఘమాసవ్రతము నాచరించిన జ్ఞానియై సుఖించును.


అహంకారము దుఃఖమును కలిగించునని అది త్రిమూర్తులంతటి వారికైనను తప్పదని దీని భావము. గర్వమని అశక్తుడైన వాని నాక్షేపింతురు. సర్వసమర్థుడైన వానికేది అయినను వానిశక్తికి లోబడినదే. పరమాత్మకు అహంకారమెట్లుండును ఉండదు. ఏదియును అయనను మించినది లేదుకదా. జ్ఞానము కలుగలలెనని భగవంతుడే యిట్టి సంఘటన నేర్పరచి మనవంటి మూఢులకు అహంకూడదని తెలిపెను. కావున గర్వమును , సిగ్గును , అభిమానమును విడిచి బుద్ధిమంతుడు మాఘమాసవ్రతము నాచరించి విష్ణుకథలను విని తరింపవలెను. యధాశక్తి దానములాచరించి సాటివారియందు ప్రేమనుచూపుచు సర్వాత్మకుని దయా విశేషము నందవలయును అని గృత్నృమదమహర్షి జహ్నుమునికి మాఘమాస మహత్త్యమును భగన్మహిమను బోధించెను.


      🌷🌷 *సేకరణ*🌷🌷

        🌴 *న్యాయపతి*🌴 

      🌿 *నరసింహారావు*🌿

🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴


🙏🙏🍁🙏🙏🍁🙏🙏

నమ్మకం

 💐💐💐 *నమ్మకం* 💐💐💐




ఒక చిన్న గదిలో *నాలుగు  మైనపు దీపాలు* వెలుగుతూ ఉన్నాయి.


ఇంతలో పెద్దగా గాలి💨 రావడం  మొదలయింది.  


*ప్రశాంతత* అనే దీపం:- ఈ గాలికి నేను ఆరిపోతానేమో అని  బయపడింది గాలి రావడంతో ఆరిపోయింది.


*ప్రేమ* అనే దీపం:- కూడా ఈ గాలిని నేను కూడా తట్టుకోలేను నేను ఆరిపోతానేమో అని అనడంతో రెండో దీపం కూడా ఆరిపోయింది.   


*తెలివి* అనే దీపం:- నేను ఈ గాలిని ఎదిరించి వెలగలేనేమో అని భయపడుతూ ఆ గాలికి ఆగిపోయింది.


నాలుగో దీపం మాత్రం:- నేను ఎలాగైనా *ఈ గాలిని ఎదిరించి వెలుగు ఇవ్వాలి* ఆరిపోకూడదు అని తన  వంతు ప్రయత్నం తాను చేసింది.   ఆ గాలిని ఎదిరించి వెలిగింది.  


దీపాలు ఉన్న గదిలోకి  చిన్న పిల్లవాడు  వచ్చి అయ్యో మూడు  దీపాలు ఆరిపోయాయే అని బాధ పడ్డాడు.


బాధ పడుతున్న అబ్బాయిని  చూసి దీపం ఇలా చెప్పింది.


*బాధపడకు నేను ఉన్న కదా నా నుండి ఆ మూడు దీపాలు వెలిగించుకో*  అన్నదట...


 సంతోషంతో  ఆ పిల్లవాడు  ఆ నాలుగో దీపాన్ని  నీ పేరేంటి  అని అడిగాడు.


నా పేరు *నమ్మకం* అని చెప్పింది... ఆ దీపం.


*అన్ని పోగొట్టుకున్నా మనపైన మనకు నమ్మకం ఉంటె చాలు  పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించేసుకోగలం*


🌹🌹🌹🌹🌹🌹🌹

శివ బ్రహ్మల వివాదము

 _*మాఘమాసం*_

        🕉️ _*సోమవారం*_🕉️

🎋 _*ఫిబ్రవరి 21వ తేది 2022*_🎋


    _*🚩మాఘ పురాణం🚩*_   

 🌴 _*20 వ అధ్యాయము🌴*_


🕉🌹🕉️🌹🕉️🌹🕉️🌹


*శివ బ్రహ్మల వివాదము*


☘☘☘☘☘☘☘☘


గృత్నృమద మహర్షి మరల యిట్లు పలికెను. శ్రీమహవిష్ణువు తత్త్వమును మహత్త్యమును వివరించు మరియొక వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు , శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరు ఒకప్పుడు యెవరికివారు తానే ప్రధానుడనని యనుకొనిరి. సర్వలోకకర్తను , దేవతల కిస్టుడైన అధిపతిని నేనే మరియొకరు నాకంటే ఉత్తములు లేరని యెవరికి వారే తలచిరి. ఎంతకాలము గడచినను వారి వివాదము ఆగలేదు. కాలము గడచుచునేయున్నది వివాదము పెరుగుచునేయున్నది.


ఇట్లుండగా వారి యెదుటనొక మహారూపము సాక్షాత్కరించెను. ఆ రూపము అనేక సూర్యులకాంతి కలిగి తేజోమయమై యుండెను. అనేకములైన ముఖములు , నేత్రములు , బాహువులు , పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమైయుండెను. దివ్యము మనోహరము అనంతమునగు ఆ రూపము శ్రీమహవిష్ణు రూపమని వారు గ్రహించిరి. సర్వమును ఆ రూపమునందేవారు చూచిరి. బ్రహ్మ , శివుడు ఆ రూపము చెవులలోనుండిరి. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును జూచి శివబ్రహ్మలిద్దరును ఆ రూపము తుది మొదళ్లను చూడదలచిరి. ఆ రూపము యొక్క ఆద్యంతములు నెరిగిన వారే తమ యిద్దరిలో నుత్తములని తలచిరి , ప్రయాణమైరి , నాలుగుదిక్కుల క్రిందను , పైనను చిరకాలము సంచరించిరి. ఆరూపమును మొదలునుగాని , చివరనుగాని చూదలేకపోయిరి , తాము ఇద్దరమును దానిని కనుగొనుటకు అశక్తులమని గమనించిరి. అప్పుడారూపము నిట్లు తలచిరి.


ఈ పురుషుడే జగత్కర సృష్టిస్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు. గుణాధికుడు. గురువు రక్షించువాడు సర్వేశ్వరుడు , స్వయంప్రకాశుడు , సర్వప్రాణులయందు నివసించువాడు , సర్వప్రాణులను తనయందే నిలుపుకొనువాడు , మనము వీనికంటె అధికులముకాము. మన వలన నేమియు జరుగుట లేదు. ఇట్టి యధార్థ పరిజ్ఞానము కలిగి శ్రీమహావిష్ణువు నిట్లు స్తుతించిరి.


*🌳బ్రహ్మ శివకృత విష్ణు స్తుతి🌳*


అనంతమూర్తీ ! సర్వాద్యమూ , సర్వాధారమూ , అనంత ప్రకాశమూ సర్వమనోహరమూ అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్సమనట్లు చేయుము. సర్వాత్మకా ! సర్వేశ్వరా ! సర్వప్రాణి నమస్కృతా ! అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు , భర్తవు నీ తేజమనంతము , నీవందరికిని అన్నిటికిని యిచ్చువాడవు , సర్వస్వరూపుడవు , సర్వవ్యాప్తరూపుడవు అనుచునిట్లనిరి.


*హేవిషోవంతమూర్తే తవఘవ* *విఖిలాకారమాద్య స్వరూపం*

*సర్వాధారం సురేశందినపతి హత భుక్కోటి సూర్యప్రకాశం |*

*అవాభ్యమత్రి దృష్టం సకలముని మనోవాసమబ్జాయతాక్షం*

*చిమ్రావేం స్వాత్మశక్త్యాకురు నిఖిలగురో సర్వరూపంత్విదానం ||*

*నమస్తే విశ్వాత్మన్ విధిహరసురేంద్రాది విబురై*

*త్రయీ శాత్త్రాలాపైః విగదితన వ్యాంఘ్ర్యంబుజయుగం |*

*పరంమత్రంయంత్రం పరమపద బీజం జ్వలతియః*

*ససాక్షాత్పారూప్యం వ్రజతి తవదేవేశసతతం ||*

*త్రిలోక కర్తా భివదస్యభర్తా హరే మహద్రూపమనేక తేజాః*

*గురుర్గుర్ణాం నరదోవరాణాం మహార్ణవాంబూపల జస్త్వమేర |*

*త్రిదేవ దేవాసుర రాజయష్ట శిష్టేష్ట తుష్ట త్రిదివే వినిష్ట*

*దృష్టామృతాస్వాద్యమిరాశు పాణిః సురాసురాణామఖిలేశ్వరరస్త్వం ||*

*లక్ష్మీపతి స్త్వంతు సుగుహ్యగోప్తా గుహాశయః పంకజ పత్రనేత్ర*

*త్వంపంచ వక్త్రశ్చ చతుర్ముఖశ్చ చరాచరేశో భగవన్నమస్తేః* 


*సృష్టించ విశాలాం సృజసిత్వమేవ చైశ్వర్యవాన్* *సర్వగుణశ్చదేవ*

*త్వమేవ భూర్భూరికృత* *ప్రవేశః తధాద్య భూతం విదధాసియత్తత్ ||*

*త్వమగ్ని సూర్యౌ పవనస్త్యమేవ* *యమోభవాన్ వైశ్రవణస్త్వమేవ*

*త్వమేవశక్ర స్పురలోకనాధః* *నాధాబిమస్త్వం భగవన్ నమస్తే ||*

*పరమం పరాణాం పరమంపవిత్రం పురాణ కర్తారమనం తమాశ్రయం*

*త్వాం వేదమోహుః కవయః సుబుద్ద్వా నమోస్తుతే పన్నగవైరి కేతో ||*

*వేదాశ్చవేద్యశ్చ దిగంతరాళం యష్ఠాసురసానమపి త్వమేవ*

*కర్మాణ్యనంతాని సుఖప్రదాని ఋదశ్చవాతో నిగమాశ్చసర్వే ||*

*నదీషు గంగాహిమవాన్ నగేషు మృగేషు సింహో భుజగోష్వంతః*

*రత్నేషు వజ్రంజలజేషు చంద్రః క్షీరోదధశ్చాపి యధాతథాత్వం ||*

*అహం ప్రభు స్తద్వరహం ప్రభుశ్చ సంస్పర్ద మానౌ బహువర్ణానాం*

*తస్నాదదావీం పరిహర్తు మేవం స్వయం ప్రభుస్త్యం కరుణైకరాసి ||*

*తేనాత్రతే దర్శనబుద్ది రాసీత్ కృపాలో* *భగవన్నమస్తే*

*తూర్ణం జగనాథ* *మహత్స్వరూపం భూత్వాపున స్చామ్య వపుఃప్రసీద ||*


ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని శ్రీమహా విష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపముతో వారికిట్లనెను. బ్రహ్మేశ్వరులారా ! మీరిద్దరును చిరకాలము వివాదపడుచుండుటచే మీ వివాదమును నిలుపుటకే నేను యిట్టి విరాట్రూపమును ప్రదర్శించితిని. మీరును నా విరాట్ రూపమును గమనింప నశక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంతబుద్దులై నన్ను స్తుతించిరి. మీ వివాదమునకు కారణమును నేనెరుగుదును. ఆ వివాదము నెవరును పరిష్కరింపలేరు. సత్వరజస్తమోగుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడినవారికి యదార్థము తెలియదు. సత్వగుణము నిర్మలము స్వయంప్రకాశకము అనామయము. సుఖసంగముచే దేహినిబంధించును. పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై ఆశక్తిచే ప్రబలమగును. జీవికి కర్మాసక్తిని కలిగించును. అనగా పరమాత్మ స్వరూపజ్ఞానమును కప్పి , ఇహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనులయందు ప్రవర్తింపజేయును. తమోగుణము అజ్ఞానముచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును. దీని వలన ప్రమాదము కలుగును. ప్రమాదమనగా చేయవలసినదానిని మరచుట ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్దసరిగా లేకపోవుట , శ్రద్ధాలోపముచే కార్యనిర్వహణ శక్తి లేకపోవుట జరుగును. నిద్రయనగా నీ యజ్ఞానముచే , చేయవలసిన దానిని వీడి నిద్రించుట , కావున ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జీవితములు జీవగుణ త్రయబద్దుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది. నేను దీనిని పొందితిని. దీనిని పొందగలను , నేను చేయగలను నాకెవరును సాటి ఇట్టి బుద్ధి ఆలోచన రజస్తమోగుణముల ప్రభావము.


మీకును ఈ గుణ ప్రభావము వలన వివాదము కలిగి పెరిగినది. మొట్టమొదట నంతయు చీకటిగ నుండినది పంచభూతములప్పటి కేర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్దవలెనుంటిని. తరువాత నవయవము లేర్పడినవి. తరువాత మన ముగ్గురము యేర్పడితిమి. మనము ముగ్గురము సృష్టిస్థితిలయములకు కర్తలమైతిమి. బ్రహ్మసృష్టికర్తగను , నేను పోషకునిగను , శివుడు లయకర్తగను మనము ముగ్గురము అయితిమి. కావున ఒకే దానినుండి వచ్చిన మనకు మొదట భేదములేదుకదా !


అని బ్రహ్మకు శివునికి శ్రీమహావిష్ణువు తత్త్వమును స్మృతికి తెచ్చెను , మరియు బ్రహ్మతో నిట్లనెను , బ్రహ్మ ! నీవు స్వతంత్రుడవు , నిగ్రహానుగ్రహ సమర్థుడవు. సర్వప్రాణులను సృషించినవాడవు. దేవతలకు ప్రభువువు. వేదములకు స్థానము అన్ని యజ్ఞములకును అధిపతిని. సర్వలోకములకు సంపదనిచ్చువాడవు. స్వశక్తితోడనే పరమాత్మయోగమునందినవాడవు. సర్వ రక్షకుడవు. నా నాభి కమలమందు బాలార్కునివలె ప్రకాశించువాడవు. మనకు భేదము లేదు , ఏకత్వములో నున్న నేనే అనేకత్వము నందితిని. మనమిద్ధరమొకటే. నీవును నా వలెనే సమస్త దేవతలకు పూజనీయుడవు. అని బ్రహ్మ మనసునకు నచ్చునట్లుగ తత్త్వమును బోధించెను. అని గృద్నృమదమహర్షి జహ్నుమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించెను.


      🌷🌷 *సేకరణ*🌷🌷

        🌴 *న్యాయపతి*🌴 

      🌿 *నరసింహారావు*🌿

🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

బాల్యం క్రీడలతోను

 శ్లోకం:☝️

  *క్రీడంతి హర్షేణ విముగ్ధబాలాః*

*స్థిగ్ధా యువానో వనితాసు లోలాః l*

  *వృద్ధాః సదా చింతనమాత్రశీలాః*

*కోఽపి ప్రపంచే న దధాతి మాలాః ll*


భావం: బాల్యం క్రీడలతోను, యౌవ్వనం ఇంద్రియ సుఖాలతోను గడిచిపోతాయి. ఇక వృద్ధాప్య మంతా సంతానం గురించి, రకరకాల విషయ చింతలతోను గడిచిపోతుంది. ఇలా ప్రపంచంలో ఎవరి చింత వారిదే కానీ ఎవరూ దీనిని లీలగా గుర్తించి ఆనందించరు (ధరించరు). ( *విశ్వం = దర్పణ - దృశ్యమాన - నగరీతుల్యం ; వైచిత్ర్య - చిత్రీకృతం* )🙏

కైలాస పర్వతం

కైలాస పర్వతం - పౌరాణిక,మార్మిక,  వైజ్ఞానిక విశ్లేషణ :

--- 3 ---

హిమాలయాలలో గల కైలాస పర్వతం, భారత్-టిబెట్ ల మధ్య గల కైలాస హిమ శ్రేణులలో ఎత్తైన శిఖరం. కైలాస పర్వతం , ఈ విశ్వానికే "ఆధ్యాత్మిక మూల స్థంభంగా" పరిగణించబడుతోంది. కైలాస పర్వత శ్రేణిలో గల ఈ మహోన్నత కైలాస శిఖరం, పవిత్రమైన-మార్మికమైన శిఖరం. బహు విచిత్రంగా దీని ఆకారం ఈజిప్టు పిరమిడ్లలా ఉండడం కాకతాళీయమేనా? లేక ఇంకేదైనా మార్మిక కారణం ఉందా?

కైలాస శిఖరం , నలువైపుల నుండి సింధునది, సట్లెజ్ నది( శతధృ నది) , బ్రహ్మ పుత్రానది, కర్నాలి నదులు....పుట్టి తాము ప్రవహించినంత మేరా సస్యశ్యామలము చేస్తున్నాయి. ఇవి జీవ నదులై, అన్ని కాలాల లోనూ, ప్రజలను పోషిస్తున్నాయి.

ఎందుకీ కైలాస శిఖరానికి అంత విశిష్టత?

కైలాస శిఖరం, ఆది దేవుడైన పరమ శివుడి నివాసం. మాత పార్వతితో కలసి యున్న మహాదేవుడు ఇచటనే ఉన్నాడు. టిబెటన్లు, హిందువులు,జైనులు కైలాస ప్రదక్షిణం చేస్తారు. ఈ కైలాస శిఖరం, భౌతిక ప్రపంచానికి-ఆధ్యాత్మిక ప్రపంచానికి వారధి లాంటిదని, మర్మ యోగులు చెబుతారు.

ఆధునిక విజ్ఞాన శాస్త్రం , భూమి యొక్క అక్షం మీద ఈ కైలాస శిఖరం ఉందని (మేరు పర్వతం !!!) , ఈ భూగోళానికి చెందిన వాతావరణ పరిస్థితులను, సమతుల్యం చేస్తుందని చెబుతుంది. ప్రపంచంలోని ప్రతి భూభాగంతోనూ, భూమి యొక్క ధృవాలతోనూ ఈ పర్వతం సంబంధం కలిగి యుండి.....సమన్వయాన్ని కూడా కలిగి ఉంటుంది. అంటే ఆయా ప్రాంతాల్లో వచ్చే మార్పులు, కైలాస పర్వతం ప్రస్ఫుటీకరిస్తుంది. అలాగే, కైలాస పర్వతం నుండి వచ్చే భౌతిక,అభౌతిక మార్పులు...ఆయా ప్రాంతాలు స్వీకరిస్తాయి. ఈ కైలాస పర్వతం "స్టోన్ హెంజ్" నకు, 6714 కి.మీ. దూరంగా ఉండడం యాధృచ్చికమేనా?

ఈ కైలాస శిఖరం అధిరోహించడానికి, చాలా మంది ఔత్సాహికులైన,సాహసవంతులైన పరిశోధకులు ఎంతో ప్రయత్నించారు. కానీ ఇంతవరకూ ఎవరూ అధిరోహించలేదు. ఇది బహు విచిత్రం! ఇక్కడ విచిత్రం ఏమిటంటే, కైలాస పర్వతం (ఒక వింత సిద్ధాంతం ప్రకారం)తన స్థానం మార్చుకుంటున్న కారణంగా, ఈ పర్వతారోహకులు విజయం సాధించలేక పోతున్నారు. నిరంతరం ఈ శిఖరం తన స్థానం మార్చుకోవడం మాత్రం బహు విచిత్రం, వింతలలో కెల్లా వింత.

ప్రస్తుతం భూమి మీద చెల్లా చెదురుగా ఉండి ఏ సంబంధమూ కనిపించని Easter Island, Stone Henge, Egyptian Pyramids, Mexican pyramids, Bermuda Triangle వంటివి కైలాసశిఖరం నుండి, వాటి దూరాల్ని కొలిచి చూస్తే అవన్నీ ఒక క్రమ పద్ధతిలో ప్రణాళిక వేసుకుని కట్టిన దృశ్యం కళ్లముందు కనబడతాయి. సనాతన ధార్మిక సాహిత్యం నిర్ధారించి చెప్పిన దాని ప్రకారం అనంతకోటి విశ్వాలలో ఒకటైన మన విశ్వాండం యొక్క అక్షం భూగోళం యొక్క అక్షంతో కలిసి పైకి సాగుతూ వూర్ధ్వలోకాలకు వేసిన నిచ్చెన వలె పొడుచుకుని వచ్చిన ఆకారమే కైలాసశిఖరం! కైలాసశిఖరం ఉన్న చోటు నుంచి కిందకి meridian line గీస్తే భూమికి రెండవ వైపున Easter Island ఉంటుంది.

అత్యంత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానం అక్కరలేదు,ఈ ప్రాంతాలని గుర్తు పట్టగలిగిన సైజు గ్లోబు గనక మీ దగ్గర ఉంటే ఇప్పటికిప్పుడు కొలిచి చూసుకోవచ్చు - Mount Kailash నుంచి Egyptian Pyramids వరకు ఒక సరళరేఖ గీస్తే అది Easter Island వైపు చూస్తుంది,ఆ రెంటినీ కలపండి.ఇప్పుడు కొలిస్తే Mount Kailash నుంచి Egyptian Pyramids మధ్య ఉన్న దూరం Mount Kailash నుంచి Ester Island మధ్య దూరంలో నాలుగో వంతు ఉన్నట్టు తెలుస్తుంది.అంతే కాదు, Easter Island నుంచి Mexican Pyramids వారకు ఒక సరళరేఖ గీస్తే అది Mount Kailash వైపుకు సాగుతుంది,ఆ రెండింటిని కూడా కలపండి.ఇప్పుడు Ester Island నుంచి Mexican Pyramids మధ్య దూరం కూడా Mount Kailash నుంచి Easter Island మధ్య ఉన్న దూరంలో నాలుగో వంతు ఉన్నట్టు తెలుస్తుంది.అంటే,Egyptian Pyramids నుంచి Mount kailash మధ్య ఉన్న దూరమూ Mexican Pyramids నుంచి Easter Island మధ్య ఉన్న దూరమూ సమానం అన్నమాట!

ఈ లెక్క ఇంతటితో అయిపోలేదు, Mount Kailash నుంచి Stonehenge Monument వరకు ఒక సరళరేఖ గీస్తే అది కూడా Easter Island వైపుకే సాగుతుంది.మళ్ళీ Mount Kailash నుంచి Stonehenge వరకు గల దూరం Mount Kailash నుంచి Easter Island వరకు గల భూమి వ్యాసంలో నాలుగోవంతు ఉంటుంది.ఈ Mount Kailash నుంచి Stonehenge మీదుగా Easter Island వరకు సాగుతున్న రేఖ మీద Easter Island వైపునుంచి మూడోవంతు దూరం దగ్గిర చుక్క పేడితే - అక్కడ Bermuda Triangle ఉంది!Bermuda Triangle రహస్యం గురించి పరిశోధనలు చేస్తున్నవారిలో, కొందరు అప్పుడే ఈ అమరికను బట్టి కొత్త సూత్రీకరణలు చేస్తున్నారు.వారి విశ్లేషణల ప్రకారం ఈ వలయంలోని ఆ ప్రాంతంలో ఉన్న ఒక నిర్మాణం భూమిలోనికి కుంచించుకుపోయి ఉండవచ్చు. అది శ్రీచక్రబహుభుజి వంటి నిర్మాణంలో ఉండాల్సిన చోట ఉండకపోవటం వల్ల ఐన్స్టీన్, విశ్వంలో కాంతి వంగుతుందన్నట్టు తన ప్రభావం తీవ్రంగా ఉన్నంతమేర స్థల-కాల ద్రవ్యశక్తి తత్వాలను వంచుతున్నది!

ఈ దూరాల లెక్కలో ఉన్న అసలైన విశేషాన్ని గమనించండి - Mount Kailash నుంచి Stonehenge Monument వరకు ఉన్న దూరం 6714 కిలోమీటర్లు, Stonehenge Monument నుంచి Bermuda Triangle వరకు ఉన్న దూరం 6714 కిలోమీటర్లు, Bermuda Triangle నుంచి Easter Island వరకు ఉన్న దూరం 6714 కిలోమీటర్లు, North Pole  నుంచి Mount Kailash వరకు ఉన్న దూరం 6714 కిలోమీటర్లు కాగా Mount Kailash ఎత్తు 6714 మీటర్లు!

ఒక కొలత మాత్రం మీటర్లలో ఉండి మిగిలినవి కిలోమీటర్లలో ఉండడం కూడా గణితశాస్త్రంలోని ఒక శాఖ అయిన Fractal Mathematics ప్రకారం చూస్తే అది అనుకోని పొరపాటు వల్ల జరిగినట్టు కాక ఈ నిర్మాణాలను ఇంత ప్రణాళికతో నిర్మించినవారు గణితశాస్త్రంలోని ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టలేదనేటందుకు సాక్ష్యంగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ అన్ని నిర్మాణాలను గురించి విడివిడి పరిశోధనలు చేస్తున్న వారిలో కొందరు ఇవి మానవనిర్మితాలనీ కొందరు, గ్రహాంతరవాసుల చేత నిర్మించబడినాయనీ మరికొందరు, ఇలా రెండుగా చీలిపోయి ఉన్నారు. నాకైతే ఈ రెండూ కాక పరమేశ్వరుడు భూమి మీద తన ఉనికిని సర్వులకూ చాటి చెప్పడానికి దివ్యపురుషులను నియోగించి నిర్మింపజేశాడని అనిపిస్తున్నది!ఇతర దేశాల వారికి అయితే మానవులూ లేకుంటే గ్రహాంతరవాసులూ అనటం తప్ప ఇంకేమీ తెలియదు.మనకు అలా కాదు.ప్రాచీన భారతీయ విజ్ఞానుల విశ్వనిర్మాణ సిద్ధాంతం ప్రకారం భూలోకానికి పైన ఏడు వూర్ధ్వలోకాలూ కింద ఆరు అధోజగత్తులూ ఉన్నాయి.ఈ ప్రతి లోకంలోనూ జీవజాతులు ఉంటాయి,ఉంటారు.మన భూమి ఉన్న లోకానికి ఈ పదమూడు లోకాల వారూ రాకపోకలు సాగించగలరు. అధోజగత్తు అన్నందువల్ల మనకన్న అధములు అనుకోవడం కాదు ,ఈ పదమూడు లోకాల లోనివారు అందరూ మనకన్న అధికులే . వారిలో ఎవరో ఒక లోకం వారు నిర్మించి ఉండవచ్చు! అసలు స్టోన్ హెంజ్కు- ఈష్టర్ ఐలాండ్స్ కు- కైలాస పర్వతానికి - ఈజిప్టు పిరమిడ్లకు...సంబంధం ఏమిటి? ఒకానొకప్పుడు మానవాళి సనాతన ధర్మమే (సనాతన విజ్ఞానమే) అనుసరించిందని...చెప్పేటందుకు ఈ సూచనా?.....

ఆధునిక విజ్ఞానశాస్త్రం సృష్టిలోని అనేకమైన కొలతలలో 11 కొలతలను (dimensions) మాత్రమే నిర్వచించగలిగింది. కానీ మర్మజ్ఞులు, కొన్ని వందలలో dimensions ఉన్నాయని, మనం వాటిని తెలుసుకోవలసి ఉందని, హిందూ యోగులు,మార్మికులు...ఈ డైమన్షన్స్ ను చాలా తెలుసుకున్నారని, అర్హులైన వారికి ఆ విజ్ఞానం బోధిస్తారని చెబుతారు. మనం నాల్గవ కొలతలో ఉన్నాం, అంటే పొడవు,వెడల్పు,ఎత్తు,కాలం అనే ఈ మూడు కొలతలలోనే మన ఇంద్రియాలు పని చేస్తాయి. (నిజానికి వ్యక్తావ్యక్త విశ్వం - బహుళ మితీయమైనది).మనకు కొద్ది దూరంలో ఉన్న వస్తువుని కదల్చాలంటే మనం అక్కడికి వెళ్ళి స్పర్శ ద్వారా మాత్రమే కదిలించగలం . అయితే అయిదవ కొలతలోకి వెళ్ళగలిగితే అక్కడికి వెళ్ళకుండానే ఆ వస్తువుని కదిలించగలం.అలాంటి దివ్యపురుషులు నిర్మించడం వల్లనే ఎల్లోరా కైలాసనాథ స్వామి ఆలయంలో తొలచిన రాళ్ళ జాడ కనబడటం లేదు, మానవులు తొలిస్తే గనక అన్ని టన్నుల రాళ్ళని ఆనవాళ్ళు లేకుండా మాయం చెయ్యడం కుదరదు. కొంతమంది సిద్ధాంతీకరించిన మానవుడి ఆధిక్యతను సవాలు చేస్తున్న ఈ దివ్య నిర్మాణాలను చూసి కూడా  సనాతన ధర్మమే అన్నిటికన్న ఉన్నతమైనదని ఒప్పుకోలేనివారిని కాలమే సమాధాన పరుస్తుంది - అది ఎంతో దూరం కూడా లేదు!

ఈ పరిశోధనలు చేస్తున్నవారు గానీ ఈ సూత్రీకరణలను చేస్తున్నవారు గానీ, పొరపాటున హిందువులై ఉంటే  ఈ దేశంలోని వారే వారిని కుళ్ళబొడిచి ఉండేవారు. మన అదృష్టం బాగుండి వాళ్ళు విదేశీయులు అయ్యారు!ఇన్నాళ్ళూ వైదిక సంస్కృతికి పుట్టినిల్లు అయిన హరప్పా  పాకిస్తానుకి పోయిందని బాధగా ఉండేది,ఇవ్వాళ కైలాసశిఖరం యొక్క గొప్పదనం తెలిశాక మనస్సు చల్లగాలికి చిన్న చిన్న అలల్ని పుట్టిస్తూ తుళ్ళింతలై నవ్వుతున్న సరస్సులా తయారైంది!

రష్యావారి పరిశోధన ప్రకారం, కైలాస పర్వతం , మనిషిచే చేయబడిన పిరమిడ్. దానికి తగ్గట్టు ఈ పర్వత ఆకారం...దాదాపుగా పిరమిడ్ ఆకారమే. ఇంతవరకు ఏ రకమైన విమానం,హెలీకాప్టర్ గానీ....కైలాస పర్వతం మీదుగా ఎగర లేక పోయాయి. బహుశ దీనికి కారణం, ఈ శిఖరం, మానవ మాతృడు చేరలేని "ఎత్తు" కావచ్చు. లేదా మరి ఏ ఇతర మార్మిక కారణాలు కావచ్చు ! దీని ఎత్తు సుమారు 30,000 అడుగులు. ఇక్కడ విమానాలు, తదితర వాహనాలకు అనుమతించిన ఎత్తు, 25 నుండి 35000 అడుగులు.

ఇక కైలాస పర్వత ప్రాంతాలలో గల మానస సరోవరం.... ఈ మానస సరోవరం ఎంతో సుందరమైనది. ఈ సరస్సు  స్వచ్ఛమైన నీటితో ఉండి, తీరానికి వచ్చేసరికి నీలి రంగులో ఉండి, సరస్సు మధ్యమంలో పచ్చ రంగులో ఉండి, బహు సుందరంగా ఉంటుంది. ప్రశాంత వాతావరణం కారణంగా ఈ సరస్సు నీరు బహు స్వచ్ఛంగా ఉంటుంది.

కైలాస పర్వతారోహణకు ప్రయత్నించేవారికి "కాలం చాలా వేగంగా గడుస్తున్నట్లు" అనుభవానికి వచ్చేదని, చెబుతారు. అయితే ధృవీకరించలేక పోయారు. ఏదో మిష్టరీ ఉంది!!!

మరి కొంతమంది పర్వతారోహకులు, తమ ప్రయాణం ప్రారంభించిన 12గంటల్లో తమ గోళ్ళు, జుట్టు పెరిగినట్లు రిపోర్టు ఇచ్చారు. ఎందుకిలా జరుగుతోంది? ఏమిటి ఈ మిష్టరీ?

కైలాస పర్వతం చుట్టూ, దాదాపు 100 చిన్న పిరమిడ్లు ఉంటూ, వాటి మధ్యలో కైలాస పర్వతం ప్రతిష్టించబడి ఉన్నది. ఒక కమలం లాగా!

హిందూ పురాణాలు, ఐతిహ్యాల ప్రకారం, ఈ కైలాస పర్వత ప్రాంతం స్వర్గారోహణకు ముఖద్వారం లాంటిది. "సటోపంత్ " ఈ ప్రాంతంలోనే ఉన్నది. తంత్ర శాస్త్రాలు, మార్మిక శాస్త్రాలు, పురాణాలు...ఈ కైలాస పర్వతాన్ని, స్వర్గానికి-భూమికి వారధిగా నిర్ణయించాయి. మహా భారతం నందలి , స్వర్గారోహణ పర్వంలో ఈ విశేషాలు కనిపిస్తాయి.

కైలాస పర్వతానికి చెందిన గొప్ప మిష్టరీ ఏమిటంటే, ఈ శిఖరారోహణ సమయంలో(శిఖరం ఎవరూ పూర్తిగా అధిరోహించలేదు...గమనించగలరు.), రెండు వారాల్లో మనిషి యొక్క వయస్సు ఎంత పెరుగుతుందో, ఆ పెరుగుదల, ఈ శిఖర అధిరోహణ కాలంలో.... 12గంటల్లోనే పెరగడం, మనలను ఆశ్చర్య చకితులను చేస్తుంది.

ఓంకార పర్వతం :

భగవంతుడున్నాడని, మనం ఈ పర్వతాన్ని చూస్తే ఖచ్చితంగా నమ్మాలి. ఈ పర్వత శిఖరాలపై మంచు "ఓం" కార రూపంలో కురుస్తుంది. ఇది బహు విచిత్రము. విశ్వ చలనా యంత్రపు మర్మర ధ్వనియే ఓంకారము కదా!.....

అలాగే,  ప్రతి సాయంకాలం, సూర్యాస్తమయ సమయానికి , కైలాస పర్వతంపై పడే నీడ "స్వస్తిక్" ఆకారంలో ఉండడం కాకతాళీయమా?

టిబెట్ యోగి మిలారేపా, మాత్రమే ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించాడని, టిబెట్ పురాణ సాహిత్యం చెబుతోంది. యోగి మిలారేపా గొప్ప తాంత్రికుడు, యోగి, కవి కూడా. బుద్ధ భగవానుని బోధనలు, జనం పాడుకునే పాటల రూపంలో అందించాడు.

కైలాస పర్వతం చేరే సామాన్య మనుజులు గానీ, యోగులు గానీ,తాత్వికులు గానీ...ఈ  ప్రాంతంలోని గహన గాంభీర్యానికి, ప్రకృతి రమణీయకతకు లోనై ధ్యాన ముద్రలో ఉండి పోతారు. వారి ఇంద్రియ వ్యాపారాలు అడుగంటి, వారిలోని పరమేశ్వర చైతన్యం ఊర్ధ్వగమిత్వం చెందే ప్రయత్నం చేస్తుంది.

ఓం నమఃశివాయ

భట్టాచార్య

(సశేషం)

ఎడమ వైపు నిద్ర పోవడం*

 *ఎడమ వైపు నిద్ర పోవడం*


భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని పచనం ( జీర్ణం ) చెయ్యటానికి జఠరాగ్ని ప్రదీప్త మవుతుంది. మెదటగా మెదడులోని రక్తం, తర్వాత ఇతర అవయవాల్లోని రక్తమంతా తిన్న ఆహారాన్ని పచనం చేయడానికి పొట్ట భాగానికి చేరుతుంది. అపుడు మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది. అందువలన నిద్ర వస్తుంది. నిద్ర పోవడం మంచిది .


ఉదయం లేక మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు ఖచ్చితంగా నిద్ర పోవలెను. ఏ కారణం చేతనైనా విశ్రాంతి తీసుకునే అవకాశం లేని వారు కనీసం 10 నిమిషాల పాటు *వజ్రాసనం* వేయండి.


# రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్ర పోకూడదు . కనీసం *2 గంటల* తర్వాత నిద్ర పోవాలి . మీరు వెంటనే నిద్ర పోవడం వలన *డయాబెటీస్* , *హార్ట్ ఎటాక్* వచ్చే ప్రమాదముంది.


*పడుకునే విధానం* :----

ఎడమ ప్రక్కకు తిరిగి, ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకొని విశ్రమించాలి.


# దీనిని *వామ కుక్షి* అవస్దలో విశ్రమించటం అంటారు.


# మన శరీరంలో *సూర్యనాడి, చంద్ర నాడి మరియు మధ్యనాడి* అనే మూడు నాడులున్నాయి.


సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చెయ్యటానికి పనికొస్తుంది. ఈ సూర్య నాడి ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కగా పని చేస్తుంది.


# మీరు అలసత్వానికి గురైయినపుడు, ఇలా ఎడమ వైపున తిరిగి పడుకొనుట వలన అలసత్వం తొలగి పోతుంది. మిగతా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు.


*ప్రయోజనాలు* :--


1 . గురక తగ్గి పోవును.

2. గర్బిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది . గర్బాశయంకు , కడుపులోని పిండమునకు మరియు మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగును. వెన్ను నొప్పి, వీపు నొప్పుల నుండి ఉపశమనం కలుగును.

3. భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయ పడుతుంది.

4 . వీపు, మెడ నొప్పులున్న వారు ఉపశమనం పొందెదరు.

5 . శరీరంలో వున్న విషాలని, వ్యర్ద పదార్ధలని తొలగించే రసాయనాలకు తోడ్పడుతుంది.

6 . తీవ్రమైన అనారోగ్యానికి కారణమైన విష పదార్ధాలు బయటికి నెట్టి వేయ బడును .

7 . కాలేయం మరియు మూత్ర పిండాలు సక్రమంగా పని చేస్తాయి.

8 . జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగును .

9 . గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా పని చేయును .

10 . గుండెలోని మంటను నిరోధిస్తుంది. కడుపులోని ఆమ్లాలు శాంతిస్తాయి .

11 . ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా వుంటారు .

12 . కొవ్వు పదార్ధాలు సులభంగా జీర్ణం అవుతాయి .

13 . మెదడు చురుకుగా పని చేస్తుంది .

14 . పార్కిన్సన్ మరియు అల్జీమర్ వ్యాధులను కంట్రోలు చేస్తుంది .

15 . ఆయుర్వేధం ప్రకారం *ఎడమ వైపున తిరిగి పడుకొనే విధానం చాలా ఉత్తమమైన పద్ధతి* .


ప్రతి ఒక్కరు వారి వారి పద్దతులలో నిద్రపోతారు . కావున వెంటనే మీరు మీ పద్ధతిని మార్చుకోవాలంటే చాలా కష్టం . కాని మీరు మీ ఆరోగ్యం కొరకు కొద్దిగా ప్రయత్నం చేస్తే మార్పు చేసుకోవచ్చును .

ఎడమ వైపు తిరిగి పడుకొనిన యెడల , మీ శరీరంలో కలిగే మార్పులను ప్రతి రోజు మీరు గమనించ వచ్చును.


*మీరు ఈ చిన్న మార్పుని చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.

ఒంటి బ్రాహ్మణుని ఎదురు వస్తే

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

ఒంటి బ్రాహ్మణుని ఎదురు వస్తే అది మంచి శకునం కాదా ?


చాలా మంది ఆఖరికి బ్రాహ్మలకి తో సహా ఈ అపోహ ఉంది. 


అసలు తోటి బ్రాహ్మడు [ అతను వేద పండితుడే కానక్కరలేదు అసలు అతడు బ్రాహ్మడు అయితే చాలు చుట్టమైనా పక్కమైనా ] ఎదురు వచ్చినా సరే వెంటనే అపశకునం అంటూ వెనక్కి వెళ్ళి పోతారు.  


ఈ అపోహ చాలా తప్పు అని వాళ్ళు గ్రహించరు. 


నిజానికి అది ఒంటి బ్రాహ్మణుడు ఎదురోస్తే దాన్ని అపశకునంగా భావించి అలా వెనక్కి వెళ్ళమని కాదు అర్ధం.  


పూర్వం గురుకులాల్లో ప్రతీ రోజు గురువుగారు తనవద్ద విద్యని అభ్యసిస్తున్న బ్రహ్మచారులని బిక్షాటనకు ఊరిలోకి పంపేవారు. 


ఒక్కొక్క బ్రహ్మచారి ఒక్కొక్క వీధిలోకి వెళ్లి గృహస్తుల నుంచి వాళ్ళు ఇచ్చిన బిక్ష సేకరించి తెచ్చేవారు. 


ఆ కాలంలో ఎవరైనా గృహస్తు తన ఇంట్లో నుంచి బయటకి వెళ్లే సమయంలో, అలా భిక్షకి వస్తున్న ఆ బ్రాహ్మణ బ్రహ్మచారి గానీ ఎదురయితే, వెంటనే వెనక్కి ఇంట్లోకి వెళ్లి అతన్ని సాదరంగా ఆహ్వానించి తగిన బిక్షవేసి పంపించే వారు.  


అలా ఒంటి బ్రాహ్మణ బ్రహ్మచారి ఎదురయి నప్పుడు అతన్ని చూసి, అతను దేనికి వస్తున్నాడో తెలిసి కూడా నిర్లక్ష్యంచేసి బిక్ష వెయ్యకుండా వెళ్లడం అతన్ని అవమానపరచి నట్టు ఉంటుందని, ఆలా ఆ విధంగా బిక్ష కోసం వచ్చే ఒంటి బ్రహ్మచారి, లేదా బ్రాహ్మణుడు ఎదురు వస్తే అతన్ని పట్టించు కోకుండా వెళ్లడం దోషం.  


అందుకే అలా [ బిక్ష వేయకుండా ] వెళ్ళకూడదు అంటారు.  


అంతే తప్ప అది అపశకునం కాదు. 


ఒక వేద పండితుడు, జ్ఞాని ఎదురవ్వడం వలన మంచిదే తప్ప అది చెడు శకునం ఎప్పటికీ కాదు. 


ఒక్కో సారి అలా ఒకరు కాకుండా ఇద్దరు లేక ఆపైన ఎంతమంది ఎదురయినా వాళ్ళు ఏదో సమావేశానికో, వేద పారాయణానికో, చర్చలకో, లేక ఏ జప హోమాలకో వెళ్తూన్నారని అర్ధం.


ఈ రోజులలో బిక్షాటన చేసే బ్రహ్మచారులూ లేరు [ ఒకవేళ ఉన్నా అక్కడడక్కడా ఉండచ్చు గాక ]. అలా రోజు వారి విద్యార్థుల చేత బిక్షాటన చేయించే గురుకులాలు అంతకన్నా లేవు. 


*కాబట్టి ఏ కాలంలో అయినా సరే, ఒంటి లేక జంట బ్రాహ్మణులు ఎంత మంది ఎదురయినా అది మంచి శకునమే గాని దుశ్శకునం ఎంత మాత్రమూ కాదు అని గ్రహించాలి*.  


అయితే ఇక్కడ ఒక్క విషయం ప్రతి వాళ్ళు స్పష్టంగా తెలుసుకోవాలి. 


మనం బయటకి వెళ్తున్నప్పుడు ధర్మము అంటూ ఎవరయినా ఎదురయితే *అతను బ్రాహ్మణుడవనీయండి, బ్రాహ్మణేతరుడే కానీయండి* వీలయితే అతనికి మీకు చేతనైన సహయము నిష్కామకర్మతో చేసి కదలండి. 


అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. 


మీరనుకున్న కార్యం, మీరు వెళ్తున్న పని దిగ్విజయంగా నెరవేరుతుంది. 


సాటి మానవుడి ఎదురు, 

సాటి జీవాల ఎదురు మంచిది కాదని చెప్పడానికి మన మెంత మన కున్న జ్ఞానమెంత ఒక్కసారి ఆలోచించండి !


అందువలన ఇటువంటి అపోహలను సమాజంలో దూరం చెయ్యడం ప్రతి ఒక్కరి విధి.

 *సేకరణ* :- వాట్సాప్

హితోపదేశః, మిత్రలాభః*

 🪔 *ॐ卐 _-|¦¦|శుభోదయమ్-సుభాషితమ్|¦¦|-_ ॐ卐* 💎


శ్లో𝕝𝕝 యదశక్యం న తచ్ఛక్యం యచ్ఛక్యం శక్యమేవ తత్|

నోదకే శకటం యాతి న నౌకా గచ్ఛతి స్థలే ||

 

*హితోపదేశః, మిత్రలాభః*


తా𝕝𝕝 *ఏ పని ఎవరు చేయగలరో ఆ పని వారు చేయ వలసినదే..... అంతే గానీ అన్ని పనులూ అందరూ చేయలేరు*..... బండి నీటిలో తేలుచూ నడవదు, పడవ బాటపై పయనించదు....

ఔషదాలు అనేవి

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

ఔషదాలు అనేవి సీసాలలో, టాబ్లెట్స్ లో, వాక్సిన్ లలో దొరికేవి కావు....శరీరాన్ని విషరహితము చేసుకోవడము ఔషదం,.. జంక్ ఫుడ్స్ వదిలెయ్యడము ఔషదం.. వ్యాయామము ఔషదం.. ఉపవాసము ఔషదం.. ప్రకృతి ఔషదం.. శాఖా ఆహారము ఔషదం.. మనసారా నవ్వడము ఔషదం.. పండ్లు ఔషదం.. నిద్ర ఔషదం.. సూర్యకాంతి ఔషదం.. కృతజ్ఞత, ప్రేమ ఔషదం.. మిత్రులు ఔషదం.. ధ్యానం ఔషదం.. నిర్భయము ఔషదం.. సకారాత్మక ఆలోచన ఔషదం.. అన్ని జీవుల ఎడ షరతులు లేని ప్రేమ ఔషదం.. వినడము ఔషదం.. మాట్లాడము, అనుభవాలను పంచుకోవడము ఔషదం.. అంగీకారము, ప్రస్తుకాలంలో జీవించడము అన్నింటికన్నా ఉత్తమ ఔషదం.. (English లో నేను చూసిన posting కు అనువాదం మాత్రమే )..

సేకరణ: రాజసుఖ (వాట్సాప్)

ఛలోక్తి

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

*గరికపాటి గారి ఛలోక్తి లో నోరూరించే చారు (రసం)*


చారుకి చారని పేరెందుకంటే నవ్వుతారేంటో...నవ్వకండి, ఇది చిత్తగించండి...


చింతపండు

ఇంగువ

పోపు దినుసులు

ఉప్పు


ఈ నాలుగు(చార్) కీలక పదార్థాలు నీటిలో వేస్తే తయారౌతుందని దానిని చారన్నారో మరేమో....

చారు చాలా సులభంగా ఏ కష్టమూ లేకుండా తయారౌతుంది....


*పప్పేస్తే పప్పు చారు*


*టమాటాలతో టమాటా చారు*


*మునగేస్తే మునగచారు*


*మిరియం వేస్తే మిరియాల చారూ*


ఏక్ దో తీన్ చార్ అని నాలుగు నిమిషాలలో.......


ఇలా పాపం దేనిని తగిలిస్తే దానితో కలగలిసిపోయి తన రుచిని దానికిచ్చేసి దాని పసని తనలో కలిపేసుకుని వేడి వేడిగా తాగినవాడిలో కొత్త ఉత్తేజాన్ని నింపేస్తుంది.


పళ్ళు రాని పాపడి నుంచి  పళ్ళూడిన తాత దాకా మరి మెచ్చేదే చారూ బువ్వ....


అన్న ప్రాసన తర్వాత రుచులు అలవాటయ్యేది చారుతోటే.

మారాం చేసే బుజ్జి గాడికి గోరుముద్దలు తినిపించేది చారుగుజ్జు తోనే...


మీకు ఉప్మా నచ్చదా...ఐతే ఓ రెండు చెంచాల చారు కలుపుకొండి...అమృతమే....


జొరమొస్తే లంఖణం తర్వాత తినిపించేది చారే...


*ఇంట్లో శ్రీమతికి కోపం వచ్చిందంటే(వస్తేనూ) కంచంలో తగిలేవి చారునీళ్ళే...* *అంతే కాదండోయ్ ప్రేమగా పెడితే చారంత రుచికరమైన వంటకం మరోటి ఉంటుందా....నిజం ఒప్పుకోండి....* 


ఇంట్లో పెద్దాళ్ళకి జలుబు పట్టిందంటే...మరింక ఆ రోజు అందరికీ చారు భోజనమే...


*ప్రియే....చారు శీలే ... అన్నారు గుర్తుందండీ జయదేవులవారు...*


**చారు అంటే అందమైనది అద్భుతమైనది అని..*  *అలాగే చారు బాగా కాచగలిగిన ఇల్లాలిని చారుశీల అనీ, చారు లేందే ముద్ద దిగని భర్తను చారుదత్తుడు అని అంటే తప్పా... చెప్పండి...* 


మరి చారు  తాగే జయదేవులు  అష్టపదులు చెప్పుంటారు లెండి మరి...ఒడిషా మరి తెలుగు దేశానికి దగ్గరే కదా....


మరి వేడి చారు తాగడానికి సమయం సందర్భం అవసరం లేదని నా అభిప్రాయం....


వేడి వేడి చారు  పొగలు గ్రక్కుతూ ఇంగువ ఘాటుతో కరివేపాకు ఘుమఘుమలు ముక్కుకు తగుల్తూ ఉంటే దాని ముందు అన్ని పేరొందిన ద్రవపదార్థాలు దిగదుడుపే... మరి కొత్తిమీర త్రుంచివేసి, కాచిన చారైతే మరింత రుచి... అద్భుతః, అమోఘః......


మా అమ్మమ్మ పెట్టేది కుంపటి పై కాచిన సత్తుగిన్నెలో చారు....ఆ పోపుకొచ్చిన ఘాటు నాకు ఇప్పటికీ జ్ఞాపకం....ఆ రుచి....ఇప్పటికి మళ్ళీ చూడలేదు....


మరి చారు రుచి ప్రాంతాన్ని బట్టి మారుతుంది....  గుంటూరు ఘాటు మిర్చితో పెట్టిన చారుదొక తీరు... ఉత్తరాంధ్రలో బెల్లంతో పెట్టిన చారే వేరు....

ఇలా చెప్పుకుంటూ పోతే..


అహో ఏమి చెప్పను చారు...

వేడి వేడిగా గొంతులో జారు.. చెవులనుండి వచ్చు హోరు..

జలుబు దగ్గులు ఓ గుటకతో తీరు......


ఇంకే ద్రవమేనా చారుముందు  బేజారు


చార్ మినిట్ మే బనే చారు

ఆ ఘాటుకు  మాత్రం నా జోహారు


*మాతృహీన శిశుజీవనం వృధా, కాంతహీన నవయవ్వనం వృధా,*

*శాన్తిహీనతపసః ఫలం వృధా, తింత్రిణీరస విహీన భోజనం వృథా, వృథా!!*


తల్లిలేని పిల్లవాని బ్రతుకు, భార్యలేనివాని యవ్వనం, శాంతం లేని ఋషి  తపస్సు ఇవన్నీ ‘చారు’ లేని భోజనంలా నిష్ఫలం అని పై శ్లోకానికి అర్ధం.


*🙏మరి స్వస్తి🙏*


🔅🔅🔅😇😇😇🔅🔅🔅

తెలుగు భాషా వికాసం

🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹
తెలుగు భాషా వికాసం :-
తెలుగు భాషా వికాసానికి యేందరో యెందరెందరో మహానుభావులు పాటు పడినారు. అందరికీ వందనాలు. తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం! మన జీవన సౌందర్యం! తేనె కన్నా తీయనిది తెలుగు! తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష! మన భావాలకు, అనుభూతులకు భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష! శబ్ద సౌందర్యం, అక్షర సౌష్టవం తెలుగు ప్రత్యేకత! ఇంత చక్కని మనమాతృభాషను కాపాడుకోవడం, సజీవంగా ఉంచుకోవడం, నిత్య నూతనంగా ఉంచుకోవడం మలచుకోవడం బిడ్డలుగా మన కర్తవ్యం! 
శంకరం బాడి సుందరాచారి “మా తెలుగు తల్లికి మల్లెపూ దండ మా కన్న తల్లికి మంగళారతులు” పాట వింటే చాలు మనసు పులకరించిపోతుంది.  
"చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా” అంటూ తెలుగు తేజాన్ని ఉద్వేగంతో గొంతెత్తి చాటిన వేములపల్లి శ్రీకృష్ణ,
తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను - తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి - దేశ భాషలందు తెలుగు లెస్స
                                                              —శ్రీ కృష్ణదేవ రాయలు
తియ్యని తేనెల తెలుగు పలుకక - ఇంగ్లిష్ మీద మోజు పడుట   
ఇంట కమ్మని భోజనముండగా – హోటళ్ళ కెగబ్రాకినట్లు భార్గవ
                                                                —చేరువేల భార్గవ శర్మ
జనని సంస్కృతంబు సకల భాషలకును - దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద - మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె
                                                          — వినుకొండ వల్లభరాయడు
సంస్కృతంబులోని చక్కెర పాకంబు - అరవ భాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన - కలిసిపోయె తేట తెలుగునందు
                                                   — *మిరియాల రామకృష్ణ* 
సేకరణ:- కొడవంటి సుబ్రహ్మణ్యం గారు.