💐💐💐 *నమ్మకం* 💐💐💐
ఒక చిన్న గదిలో *నాలుగు మైనపు దీపాలు* వెలుగుతూ ఉన్నాయి.
ఇంతలో పెద్దగా గాలి💨 రావడం మొదలయింది.
*ప్రశాంతత* అనే దీపం:- ఈ గాలికి నేను ఆరిపోతానేమో అని బయపడింది గాలి రావడంతో ఆరిపోయింది.
*ప్రేమ* అనే దీపం:- కూడా ఈ గాలిని నేను కూడా తట్టుకోలేను నేను ఆరిపోతానేమో అని అనడంతో రెండో దీపం కూడా ఆరిపోయింది.
*తెలివి* అనే దీపం:- నేను ఈ గాలిని ఎదిరించి వెలగలేనేమో అని భయపడుతూ ఆ గాలికి ఆగిపోయింది.
నాలుగో దీపం మాత్రం:- నేను ఎలాగైనా *ఈ గాలిని ఎదిరించి వెలుగు ఇవ్వాలి* ఆరిపోకూడదు అని తన వంతు ప్రయత్నం తాను చేసింది. ఆ గాలిని ఎదిరించి వెలిగింది.
దీపాలు ఉన్న గదిలోకి చిన్న పిల్లవాడు వచ్చి అయ్యో మూడు దీపాలు ఆరిపోయాయే అని బాధ పడ్డాడు.
బాధ పడుతున్న అబ్బాయిని చూసి దీపం ఇలా చెప్పింది.
*బాధపడకు నేను ఉన్న కదా నా నుండి ఆ మూడు దీపాలు వెలిగించుకో* అన్నదట...
సంతోషంతో ఆ పిల్లవాడు ఆ నాలుగో దీపాన్ని నీ పేరేంటి అని అడిగాడు.
నా పేరు *నమ్మకం* అని చెప్పింది... ఆ దీపం.
*అన్ని పోగొట్టుకున్నా మనపైన మనకు నమ్మకం ఉంటె చాలు పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించేసుకోగలం*
🌹🌹🌹🌹🌹🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి