4, జులై 2024, గురువారం

*శ్రీ మాలతీశ ఆలయం*

 🕉 *మన గుడి : నెం 368*


⚜ *కర్నాటక  : దేవరగుడ్డ - హావేరి*


⚜ *శ్రీ మాలతీశ ఆలయం*



💠 కన్నడలో దేవరగుడ్డ అంటే "సర్వశక్తిమంతునికి చెందిన పవిత్ర కొండ" అని అర్థం. 


 

💠 దేవరగుడ్డ పైభాగంలో మాలతేశ్వరుని ఆలయం ఉంది (ఈ దేవతను పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో జ్యోతిబా / ఖండోబా అని కూడా పిలుస్తారు, ఆంధ్రప్రదేశ్‌లో అదే దేవుడిని మల్లన్న అని పిలుస్తారు).  


💠 ఈ ఆలయాన్ని ఆలయ ప్రాంగణంలో నివసిస్తున్న ఒక కుటుంబం అలాగే కర్నాటక ప్రభుత్వ ముజరాయ్ డిపార్ట్‌మెంట్ ప్రైవేట్‌గా నిర్వహిస్తుంది .


💠 ప్రతిరోజూ ఇక్కడ మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు మరియు పూర్ణిమాస్ (కన్నడ పౌర్ణమి రోజు), శని మరియు ఆదివారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

ప్రతి ఫిబ్రవరి/మార్చిలో నిర్దిష్ట పూర్ణిమ/పౌర్ణమి రోజున స్థానికంగా భరత్ హన్నిమ్ అని పిలుస్తారు, సుమారు 80,000 - 1,00,000 మంది భక్తులు సుమారు 10-15 రోజుల పాటు పవిత్ర స్థలాన్ని/రోజును సందర్శిస్తారు.  


💠 కర్ణిక అని పిలువబడే ఒక నిర్దిష్ట కర్మలో ఈ ప్రత్యేకమైన భరత్ హన్నిమే ప్రస్తుత సంవత్సరానికి సూచనగా ఆలయంలో అంచనా వేయబడింది.  

ఈ ప్రత్యేక రోజున 2 అడుగుల సైజులో కొత్త జత తోలు చెప్పులు ఆలయంలో ఉంచబడతాయి, అవి మరుసటి రోజు ఉదయం మాలతీశ భగవానుడి పాద ముద్రలను కలిగి ఉంటాయి.


💠 ఆలయ ప్రాంగణంలో విచిత్రమైన దుస్తులతో అనేకమంది పురుషులు కూడా చూడవచ్చు.  వీరిని గొరవప్ప అంటారు.  

ఈ గొరవప్పలు సాధారణంగా గొర్రెల ఉన్నితో చేసిన నలుపు రంగు గౌన్లు మరియు వాటిపై మతపరమైన చిహ్నాలను కలిగి ఉంటారు.  

ఈ పురుషులు తలపై తలపాగాలు ధరిస్తారు మరియు వారితో పాటు త్రిశూలాలను మరియు ఇతర మతపరమైన చిహ్నాలను తీసుకువెళతారు.  

వారు ప్రభువు యొక్క దూతగా పరిగణించబడతారు.  


💠 ఇక్కడ అప్పుడప్పుడు భక్తులు స్వామిని "ఏలుకోటి, ఏలుకోటి, ఏలుకోటిగో... చంగ్మాలో, చంగ్మాలో" అని పిలవడం చూడవచ్చు, అంటే "ఓ, ఏడు కోటలను జయించిన మహానుభావుడా, నేను మీ ఆశ్రయానికి వచ్చాను".


💠 దేవరగూడలో సాధారణ ఉష్ణమండల వాతావరణం శీతాకాలంలో 18 డిగ్రీల సెల్సియస్ నుండి వేసవిలో 36 డిగ్రీల వరకు ఉంటుంది.


💠 పురాణాల ప్రకారం, మాలతీశ స్వామి అక్కడ గొర్రెల కాపరిగా ఉండే అమాయకులను హింసించి చంపే ఇద్దరు రాక్షసులను చంపడానికి దేవుడిగా కనిపించాడు.


💠 దేవరగుడ్డ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని హవేరి జిల్లాలోని రాణేబెన్నూరు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.  

సమీప రైలుమార్గం రాణేబెన్నూరులో ఉంది.  సమీప విమానాశ్రయం హుబ్లీలో 113 కి.మీ.

Panchaag


 

పెళ్ళిళ్ళ........సరదాలు

 🎊🎊🎊🚩పెళ్ళిళ్ళ........సరదాలు......సంబరాలు....🌷😃😃


👉🏿అల్లరి చేసే పిల్లాణ్ని అదుపు చేయడానికి తల్లి

‘ఒరే! నీ పెళ్లి చేస్తానుండు’ అని బెదిరిస్తుంది. అంతే!

వాడి అల్లరి అటకెక్కిపోతుంది. చేతులు కట్టుకుని మరీ

నిలబడతాడు. అదీ పెళ్లి అనే మాటకున్న శక్తి!

😂

👉🏿 పెళ్లి నూరేళ్ల పంట

అంటారు. ‘కాదు... కాదు నూరేళ్ల వంట’ అని కస్సుమంటారు ఆడవాళ్లు. అయినా పంట లేనిదే వంట ఎక్కడుంది? ఇదోరకం అద్వైతం.

👉🏿పెళ్లి సరసాలకు మూలం. సరదాలూ ఉంటాయి. ‘తాళి కడితే ఖాళీ’ అంటారు కొందరు. నిజమే దంపతులు ఒకరికొకరు మానసికంగా తమ సర్వస్వం ధారపోసుకోవడంతో ఖాళీ అయిపోతారు. ‘ఇతరులకు ఇందులో ప్రవేశం ఉండదు!’ గిలిగింతలకయినా, కౌగిలింతలకయినా ఒకరికొకరే.

👉🏿‘అప్పగింతలవేళ అమ్మాయికది ఆఖరి ఏడుపు. అబ్బాయికది ఆఖరు నవ్వు’ అంటారు విజ్ఞులు. తత్వం బోధపడితే ఏడుపైనా, నవ్వయినా ఒక్కటేగా. ఏడ్చినా నవ్వినా కన్నీళ్లే అయినప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకు?

👉🏿

ఏదో ఒకటి లేదనేదే ఏడుపునకు మూలం. అది ఎంతోమందికి పెళ్లప్పటి నుంచే మొదలవుతుంది. అసలు సమస్య అదే!

👉🏿‘మా ఆయనకు నోట్లో నాలుక లేదు’ అని ఒకావిడ బాధపడిపోతుంటుంది. అది అనవసరం. సాక్షాత్తూ బ్రహ్మకే

నోట్లో నాలుక లేదు. ఆ నాలుక సరస్వతీదేవిది.

👉🏿'మా ఆయనకు హృదయం లేదు’ అని మరొకావిడ

పతిదేవుణ్ని తూలనాడుతుంటుంది.

అది అన్యాయం! విష్ణుమూర్తికే సొంతానికి హృదయం లేదు.

దానిని లక్ష్మీదేవి ఎప్పుడో ఆక్రమించేసింది.

👉🏿‘మా ఆయన ఒక్క అడుగు కూడా సొంతంగా వేయలేడు’ అని ఒక ఇల్లాలు బాధపడిపోతుంటుంది.

ఏం చేస్తాం? శివుడికే ఆ పరిస్థితి లేదు. అర్ధనారీశ్వరుడాయే!

ఒక కాలు పార్వతిదే. అదే ఆయన అవస్థ.

🚩ఇన్ని నిజాలు తెలిసీ భర్తల గురించి ఆడిపోసుకోవడం ఎందుకట అంటారు కొందరు పతులు.

సరికొత్త మానవపరిణామ సిద్ధాంతానికీ బాటలు వేసేది పెళ్లే.

👉🏿‘బ్రహ్మచారీ శతమర్కటః’ అన్నారు.

పెళ్లి కాగానే ఆ వంద కోతులూ మాయమైపోతాయి.

చెప్పింది వింటూ, పెట్టింది తింటూ బుద్ధిమంతుడిగా మారిపోతాడు వివాహితుడు.

👉🏿హెల్మెట్టూ భార్యా ఒకే రకం. నెత్తిన పెట్టుకుంటే తలకాయకు బోలెడంత భద్రత అని ఒకాయన స్వానుభవంతో ఉపదేశించాడు.

👉🏿పెళ్లి చేసుకొనుటయా? మానుటయా? అని ఈ రోజుల్లో బ్రహ్మచారులు తర్జనభర్జనలు పడుతున్నారు. అయినా పెళ్లి చేసుకొనుటే ఉత్తమంబు, ఉత్తమంబు.

👉🏿వెనకటికి మహాతాత్వికుడయిన సోక్రటీసును

శిష్యుడొకరు ‘గురూజీ పెళ్లి చేసుకొమ్మని మావాళ్లు ఒత్తిడి చేస్తున్నారు. తమరి సలహా ఏమిటి?’ అని అడిగాడు.

ఆయనేమో ‘చేసుకో నాయనా’ అన్నాడు తాపీగా.

శిష్యుడు జుట్టు పీక్కుని ‘ఏంటి గురూజీ అలా అన్నారు?

మీ ఇంట్లో అమ్మగారు గయ్యాళి అని అందరికీ తెలుసు.

అయినా పెళ్లి చేసుకొమ్మని నాకు సలహా ఇస్తున్నారు?’ అని ప్రశ్నించాడు.

దాంతో సోక్రటీసు ‘నాయనా! పెళ్లి చేసుకుంటేనే మేలు.

భార్య అనుకూలవతి అయితే గొప్ప భోగివి అవుతావు.

కాకపోతే గొప్ప తాత్వికుడివవుతావు. ఏదయినా మంచిదే కదా!’ అన్నాడు.

👉🏿దేవుడు ప్రతిచోటా తాను ఉండలేక తల్లుల్ని సృష్టించాడంటారు. మరి అదే దేవుడు భార్యల్ని ఎందుకు సృష్టించాడు?

ప్రతి ఇంట్లో పోలీసుల్ని పెట్టలేక భార్యల్ని సృష్టించాడు.

భార్యే లేకపోతే ఎన్ని అరాజకాలు? ఎన్నెన్ని ఘోరాలు?

ఎన్నెన్ని నేరాలు?

శాంతిభద్రతల పరిరక్షకురాలు ఇల్లాలే.

👉🏿ప్రతి ఇంటికి పెళ్లి ఇచ్చిన వరప్రసాదమే ఇల్లాలు.

అయినప్పటికీ ‘వివాహం ప్రకృతి, వివాదం వికృతి’ అని వెనకటికి ఒకాయన ‘పెళ్లి’కిలించాడు. కానీ ఈ వివాదం సంతోషం సృష్టించాలి. సంతోషం దాంపత్యానికి సగం బలం- కాదు కాదు సంపూర్ణ బలం.

ఎవరు గెలిచినా ఇద్దరూ గెలిచినట్టే.

👉🏿పండంటి కాపురానికి పది సూత్రాలు అంటారుగానీ ఈ ఒక్క ‘మంగళ’కరమైన సూత్రాన్నీ జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు.

👉🏿భార్యాభర్తలన్నాక ఎక్కసక్కెమాడుకోకపోతే ఏం మజా?

‘కన్యాదాన సమయంలో మీ నాన్న నా కాళ్లు పట్టుకుని,

కడిగినప్పుడు నీకు ఏమి అనిపించింది?’ అని కొత్తగా పెళ్లయిన యువకుడు తన భార్యను అడిగాడు.

ఆమె తడుముకోకుండా ‘ఆయన వసుదేవుడిలా కనిపించాడండీ’ అంది నవ్వుతూ. దాంతో మొగుడు కంగుతిన్నాడు.

👉🏿ఆ మాటకొస్తే అతివ అంటే ఎక్కువగా మాట్లాడు వ్యక్తి అనేదే పిండితార్థం. పండితార్థం.

👉🏿మూడు ముళ్లయినా, ఏడు అడుగులయినా ముసిముసి నవ్వులకు మూలకందాలే. పూలు తలలో పెట్టినా, చెవిలో పెట్టినా పెళ్లి పెళ్లే!

దానికి సాటీ లేదు! పోటీ లేదు!


సమర్పణ

🙌 😃😃😀

సమస్య పూరణ.

 *సూదుల తోడc గ్రుచ్చి సతి చూపెc గుమారుని పైనc బ్రేమనున్*

ఈ సమస్యకు నాపూరణ. 


"వాదము లేల? నో మగడ! వద్దన శబ్దము జేయుచుంటివే


 పాదము చేతబట్టి తన వాయిని పెంచెను నిద్ర లేచియున్


మోదమె? చూడు పాపడిని ముద్దులు వ" ద్దనె నోరచూపులన్


సూదుల తోడc గ్రుచ్చి సతి చూపెc గుమారుని పైనc బ్రేమనున్.


అల్వాల లక్ష్మణ మూర్తి.

రథయాత్ర

 *ఈ నెల 7న పూరీ  రథయాత్ర*

ఆషాఢంలో సర్వం జగన్నాథం! ఆషాఢ శుద్ధ విదియ మొదలు ఏకాదశి వరకు పూరీ క్షేత్రంలో ప్రతిరోజూ పండుగే. కడలి ఉప్పొంగుతుంది. అలలు కొత్త కళను సంతరించుకుంటాయి. పూరీ కేంద్రంగా ఇలాతలాన్ని పాలిస్తున్న జగన్నాటక సూత్రధారి.. గర్భాలయం వదిలి.. వీధుల్లోకి కదిలి వస్తాడు. ఎక్కడా లేని విశేషం పూరీలో ఒకటుంది. ఏ హిందూ ఆలయంలో అయినా.. ఊరేగింపు సేవకు మూలమూర్తిని కదిలించరు. ఊరూరా ఉత్సవ విగ్రహాలే ఊరేగుతాయి. పూరీలో మాత్రం మూలమూర్తి రథం ఎక్కుతాడు. ఊరంతా తిరుగుతాడు. పది రోజులు ఆలయాన్ని విడిచిపెడతాడు. బలభద్ర, సుభద్ర సమేతుడై  రథయాత్రకు వేంచేసే జగన్నాథుడి మూలవిరాట్టు.. భక్తజన హృదయ సామ్రాట్టు.


పూరీ ఆలయంలో ఎన్నో విశేషాలు. ఇక్కడ స్వామి కొయ్యతో కొలువుదీరడం ఆశ్చర్యం. భక్తులను స్వయంగా వచ్చి అనుగ్రహించడం మరో అద్భుతం. పైగా సాధారణంగా ఏ ఆలయంలో అయినా ఊరేగింపు కోసం ప్రతి సంవత్సరం ఒకే రథాన్ని వినియోగిస్తుంటారు. కానీ, పూరీలో మాత్రం జగన్నాథుడి రథ చక్రాలు మాత్రమే కాదు.. రథం కూడా ఏటా ప్రత్యేకంగా తయారవుతుంది.  రథయాత్రకు రెండు నెలల ముందు నుంచే రథ నిర్మాణ క్రతువు మొదలవుతుంది. వైశాఖ బహుళ విదియ రోజు రథ నిర్మాణానికి పూరీ సంస్థానాధీశుడు ఆదేశాలు జారీ చేస్తాడు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు.


అక్షయ తృతీయనాడు రథ నిర్మాణ పని మొదలుపెడతారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథాలను సిద్ధం చేస్తారు. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. దీని ఎత్తు 45 అడుగులు. పదహారు చక్రాలు పూన్చిన జగన్నాథుడి రథాన్ని దర్శించుకున్న మాత్రాన పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఆ రథాన్ని లాగే అవకాశం దొరకడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఇక బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు, పద్నాలుగు చక్రాలు ఉంటాయి. సుభద్రాదేవి రథం పేరు పద్మ ధ్వజం. ఎత్తు 43 అడుగులు. చక్రాలు పన్నెండు. జగన్నాథుడి రథాన్ని పసుపు వస్త్రంతో అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని ఎర్రటి చారలుండే నీలి వస్త్రంతో కప్పుతారు. పద్మధ్వజాన్ని ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో అలంకరిస్తారు.


కన్నుల పండుగ పహాండీ

విదియ నాడు ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత విగ్రహాలను వారి వారి రథాలపై అధిరోహింపజేస్తారు. ఈ వేడుకను ‘పహాండీ’ అని పిలుస్తారు. తర్వాత పూరీ సంస్థానాధీశులు రథం ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. దీనిని ‘చెరా పహారా’ వేడుకగా చెబుతారు. తర్వాత పలు సంప్రదాయ క్రతువులు కొనసాగుతాయి. చివరిగా భక్తుల జయజయధ్వానాల మధ్య  రథయాత్ర మొదలవుతుంది. ‘జై జగన్నాథ.. జైజై జగన్నాథ..’ అంటూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలుపెడతారు. దీన్నే ఘోషయాత్ర అంటారు. జగన్నాథ ఆలయం నుంచి మూడుమైళ్ల దూరంలో ఉన్న గుండీచా మందిరానికి రాత్రికి గానీ రథాలు చేరుకోవు. మూలమూర్తులను ఆ పూట రథంలోనే ఉంచుతారు.


మర్నాడు మేళతాళాలలో గుడిలోకి తీసుకెళ్తారు. గుండీచాదేవి.. జగన్నాథుడి పిన్నిగా చెబుతారు. ఆ ఆలయంలో స్వామి వారం రోజులు ఆతిథ్యం స్వీకరిస్తారు. తర్వాత ఆషాఢ శుద్ధ దశమి నాడు పూరీకి తిరుగు ప్రయాణం అవుతాడు. దీనిని బహుదాయాత్ర అంటారు. దశమి నాటి మధ్యాహ్నానికి పూరీ ఆలయానికి రథాలు చేరుకుంటాయి. రోజంతా ఆలయం వెలుపలే నిలిచి ఉంటాయి. తొలి ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలకంరిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. ద్వాదశినాడు మళ్లీ విగ్రహాలను గర్భగుడిలోని రత్న సింహాసనంపై ఉంచడంతో పూరీ  రథ యాత్ర ముగుస్తుంది.

కర్మ, విధి,

 *శ్రీ గురుభ్యోనమః*


   *కర్మ,  విధి,  మానవసంకల్పము*


*ప్రశ్న :  ఇప్పటి  అనుభవాలన్నీ  పూర్వపు  కర్మల  ఫలమే  అయితే,  పూర్వం  చేసిన  తప్పులు  తెలిస్తే  వాటిని  సరిదిద్దు  కోవటం  వీలుపడుతుందా ?*


*జవాబు :*  ఒక  తప్పుని  దిద్దుకున్నా,  సంచిత  కర్మలో  ఇంకా  ఎన్నో  మిగిలి  ఉన్నాయి.  అవన్నీ  ముందు  ముందు  ఎన్నో  జన్మలనిస్తాయి.  కాబట్టి  ఆ పద్ధతి  కాదు  అవలంబించాల్సింది.  కొమ్మలని  తీసివేసేకొద్దీ  చెట్టు  బాగా  ఎదుగుతుంది.  నీవు  కర్మని  సరిదిద్దుకున్న  కొద్దీ  అది  ఎక్కువవుతూంటుంది.  కర్మకి  మూలమేమిటో  కనుక్కో !  దానిని  నిర్మూలించు.


*ప్రశ్న :  ప్రపంచమంతా  కార్యానికి,  ప్రతిస్పందనకి  ఫలితమనే  కదా ..  కర్మ  సిద్ధాంతం  చెప్పేది ?  అయితే,  ఈ రెండూ  దేనికి  సంబంధించినవి ?*

*జవాబు :*  ఆత్మసాక్షాత్కారమయ్యే  వరకు  కర్మ  ఉంటుంది.  అదే  కార్యమూ,  ప్రతిస్పందనాను !  సాక్షాత్కారమయిన  తరువాత  కార్యమూ  ఉండదు,  ప్రపంచమూ  ఉండదు.

             

*"నీ సహజస్థితిలో  ఉండు"*

జానుతెనుఁగు విన్నపముు !

 శు భో ద యం🙏


జానుతెనుఁగు విన్నపముు !


బలుపొడతోలు సీరయును బాపసరుల్  గిరుపారుకన్ను, వెన్నెలతల, చేదుకుత్తుకయు,బన్నిన వేలుపుటేఱు, వల్గుపూ

సలుగల ఱేని లెంకనని జానుతెనుంగున విన్నవించెదన్

వలపు మదిందల్ిర్ప బసవా!బసవా! వృషాధిపా!


పాల్కురికి సోమన- వృషాధిపశతకము;


తొలి శతకకర్తగా పేరందిన శివకవి పాల్కురికి సోమన కవీంద్రుడు రచించిన వృషాధిపశతకంలోనిది పైపద్యరత్నం!

     పై పద్యానికోప్రత్యేకత ఉంది.జానుతెనుగులో(వ్యవహారభాషలో)వ్రాయబడటం.మహాకవులరచనలు గ్రాంధికభాషకు(వ్యాకరణ సంస్కారమందినభాష)పట్టంగట్టగా శివకవులు మాత్రం నాటి వ్యవహారమైన తెనుగు బాసకు జానుతెనుగను పేరిడి దానిలోనే రచనలుగుప్పించి,రసజ్ఙులను మెప్పించి,తమదేశాభిమానమును మాతృభాషాభిమానమును వెల్లడించినారు.

వారే శివకవులు.వారిప్రయోగములకే శివకవి ప్రయోగములనుఖ్యాతి.

ప్రస్తుతము:

అర్ధములు:-

బలుపొడతోలుసీర-అనేక మచ్చలుగల చర్మాంబరము.

పాపసరులు-సర్పభూషణములు;

కిరుపాఱు-జ్వలించు;

వెన్నెలతల-తలపై వెన్నెలకురియు చందమామ;

చేదుకుత్తుక-విషపూరితమైనకంఠము;

బన్నిన-కదలకుండగట్టిన;.

వేల్పుటేఱు-గంగ;

నల్గుపూసలు-పుర్రెలనుపూసలహారముగల;

ఱేని-రాజుయొక్క;

లెంకనని-సేవకుడనని;

తరువాత సుబోధకమే!

పద్యమునందలి పదములు (ఒక్క వృషాధిపా!"-యనునదిదక్క) తక్కినవి దేశ్యములే!


భావము:వ్యాఘ్రాంబరధారియు,సర్పభూషణుడును,అగ్నినేత్రముగాగలవాడును.చంద్రధారియు, నీలగళుడును,కపాలమాలాధారియు, నగు నాపరమేశ్వరుని సేవకుడనని ప్రేమనిండిన మదితో విన్నవింతును.అని భావము.

         

                             స్వస్తి


!🌷🌷🌷💐🌷🌷💐💐💐💐💐🙏🙏🙏🌷💐💐💐

సీతమ్మ తనువు చాలించిన ప్రదేశం🚩

 *🚩సీతమ్మ తనువు చాలించిన ప్రదేశం🚩*


రామాయణం ప్రకారం సీతాదేవి తన అవతారం చాలించినప్పుడు తన మాతృమూర్తి అయిన భూమాతలో ఐక్యం అయిపోయిందని చెప్పుతుంటారు. అయితే ఆ దేవి మాతృమూర్తి తో ఐక్యం అయినా ప్రదేశం ఎక్కడ ఉంది? ఆ ప్రదేశం యొక్క విశేషాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.అలహబాద్ మరియు వారణాసిలను కలిపే రెండవ జాతియ రహదారికి సుమారు 4 కి. మీ. దూరంలో దక్షిణాన ఉంటుంది. రెండవ జాతియ రహదారి పైన ఉన్న జంగిగంజ్ నుండి 14 కి.మీ ప్రయాణం చేస్తే అక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఆ ప్రదేశాన్ని ‘సీత సమాహిత్ స్థల్’ అని ‘సీత మారి’ అని పిలుస్తారు. ఇక్కడ ఒక గుడి ఉంది. దానినే సీతాదేవి యొక్క స్మారకం అంటారు.తమసా నది పరిసర ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో 90వ దశకంలో నిర్మించిన అందమైన స్మారక కట్టడం ఒకటుంది. ఈ స్మారక కట్టడం నిర్మాణం జరుగక ముందు ఇక్కడ అమ్మ వారి జుట్టుని తలపించేట్టుగా కేశ వాటిక ఉండేదని అక్కడి స్థానికులు చెబుతారు. అక్కడ మొలిచిన గడ్డి ని పశువులు కూడా తినేవి కాదట. స్మారకాన్ని నిర్మించేటప్పుడు ‘సీతా కేశ వాటిక’ ను పాడు చెయ్యకుండా అలాగే ఉంచారు. స్మారకం ఉన్న ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం ఉన్నది. ఈ ఆశ్రమంలోనే జానకి దేవి మళ్లీ అడవుల పాలైనప్పుడు నివాసము ఉండేది. ఆశ్రమానికి పక్కనే లవ కుశలకు జన్మనిచ్చిన స్థలం అయిన సీత వటవృక్షం కూడ ఉంటుంది.ఇక స్మారకం విషయానికి వస్తే, అది ముచ్చటగా రెండు అంతస్థుల నిర్మాణం. పై అంతస్తులోని అద్దాల మంటపం లో అమ్మ వారి పాల రాతి విగ్రహం ఉంటుంది. అలాగే కింద భాగంలో జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోకి చేరుకుంటున్నట్టుగా చూపిస్తున్న అమ్మ వారి ప్రతిమ ను చూస్తుంటే ఎంతటి వారికైన బాధ కలిగించే విధంగా ఉంటుంది. వెనక గోడల మీద ఆ సంఘటనలను చూపిస్తున్న సన్నివేశపు శిలా చిత్రం కనిపిస్తుంది.గుడి లేదా స్మారక వివరాల్లోకి వెళితే, దీన్ని స్వామి జితేంద్రానంద తీర్థులవారి ఆదేశం మేరకు ఇక్కడ నిర్మించారు. సన్యాసం స్వీకరించిన ఆయన ఋశికేష్ ఆశ్రమంలో కాలం గడుపుతుండగా, దేవి అనుగ్రహం మేరకు 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి కాలినడకన బయలుదేరి చేరుకుంటాడు. అప్పుడు ఆయన ఈ స్థలంలో స్మారకం నిర్మించాలని పరితపించి దాతలందరినీ కలుస్తాడు. చివరికి ప్రకాశ్ పున్జ్ గారి సాయంతో కల నెరవేర్చుకుంటారు తీర్థుల వారు. ఆలయం పక్కనే జీవకళ ఉట్టిపడే విధంగా తీర్థులవారి సమాధి ఉన్నది.ఇక్కడ సీతమ్మతో పాటు శివుని విగ్రహం, 20 అడుగుల కృత్రిమ రాతి పై నిర్మించిన 108 అడుగుల హనుమంతుడు కూడ ఉన్నాడు . ఈ రాతి నిర్మాణం కింద గుహలో చిన్న హనుమన్ దేవాలయం ఉంటుంది.

ఈ ఆధారాల కారణంగా సీతాదేవి తన తల్లి అయినా భూదేవితో ఐక్యం అయినా ప్రదేశం ఇదే అని అంటున్నారు.


జై శ్రీ రామ్ 

కంచర్ల వెంకట రమణ

శంకరుల భోధనలు*

 *శంకరుల భోధనలు* 

     

 *తవ హితమేగం పద్య వక్ష్యే, చృణు* 

మీ ప్రయోజనార్థం కోసం ఒక శ్లోకం చెబుతాను’’ అంటారు.  శ్రీ శంకరుల బోధన బోధన మనకు ఎప్పుడు ఉపయోగపడుతుంది?

 *శుకాగమో యాతి సతతం* 

"మీరు ఎల్లప్పుడూ ఆనందాన్ని కోరుకుంటే, ఈ బోధన మీకు ఉపయోగపడుతుంది."  

మరి వారి బోధన అంటే ఏమిటి?

 *స్వబ్నే దృష్టం సకలం హి మృషా జాగ్రతి స స్మర దత్వాతీతి ॥* 

“మీరు కలలో చూసేదంతా అబద్ధమని మీకు తెలుసు.  అదే విధముగా మేల్కొనే స్థితి మిథ్య అని తెలుసుకోవాలి'' అనేది ఆయన బోధన. 

ఈ విధంగా శంకర భగవత్పాదులు వేదాంత తత్వశాస్త్రంతో పాటు తన స్తోత్రాలతో మనకు అనుగ్రహించారు.  అందుచేత కేవలం శ్లోకాలను స్మరించుకోవడంతో పాటు భగవంతుని సన్నిధిలో  వాటిని పఠించడంతో ఆగిపోకుండా, భగవత్పాదాలు చెప్పిన తత్త్వాన్ని వాటిలో కూడా ప్రయోగిస్తే ఎంతో విశేషమైన ఫలితం లభిస్తుంది. తద్ద్వారా మనకు పరిపూర్ణ ధ్యాన ఫలితం దక్కుతుంది.మనం నిత్య నిర్మల మనస్కులమవుతాము.

-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

ప్రాతర్వేళల కేలుమోడ్చి

 శా॥

ప్రాతర్వేళల కేలుమోడ్చి మదిలో ప్రార్థింతు శ్రీశర్మదన్ 

భూతిం గూర్చగ భూతజాలముల నే స్ఫూర్తిం గృపం జూపగా 

వ్రాతల్ మార్చగ సౌఖ్యమందునటులన్ పారంగ దారిద్ర్యమున్ 

భూతేశేశ్వరి! పావనీ! వివిధమౌ మోహమ్ములం ద్రుంచవే! 

*~శ్రీశర్మద*

8333844664

పాండిత్యము సులభము కాదు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


       శ్లో𝕝𝕝 *క్షన్తవ్యో మన్దబుద్ధీనాం*

            *అపరాధో మనీషిణః* |

           *న హి సర్వత్ర పాణ్డిత్యం*

           *సులభం పురుషే క్వచిత్* ||


తా𝕝𝕝 బుద్ధిమంతులు మందబుద్ధి కలవారి అపరాధములను క్షమించవలెయును.... ఏ పురుషునికీ కూడా అన్నింటా పాండిత్యము సులభము కాదు....

తెలుగు సంవత్సరాల పేర్లు

 పండితులసంభాషణల్లో తెలుగు సంవత్సరాల పేర్లు 


తెలుగు సంవత్సరాల పేర్లు ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత అని ఇలా 60 ఉంటాయి.

పూర్వం పండితులు తమ చుట్టూ ఉన్న వారికి అర్ధం కాకుండా ఉండాలనో, అర్ధాలు తెలిస్తే చిన్నబుచ్చుకుంటారనో తెలియదు

కానీ తమ సంభాషణల్లో కొన్ని పదాలకు బదులు ఆ అర్ధాలు వచ్చే సంవత్సరాల పేర్లు వాడేవారు. వాటిలో కొన్ని తిట్లూ, కొన్ని ప్రశంసలూ, అడపా దడపా విమర్శలూ కూడా ఉంటాయి. వాటి గురించి చెప్పుకుందాం సరదాకి.


‘ఒరే! వాడొట్టి ఇరవై ఐదూ, ఇరవై ఆరు రా’ అన్నాడంటే ‘వాడు గాడిద కొడుకు’ అని తిడుతున్నాడని అర్ధం. 25వ సంవత్సరం పేరు #‘ఖర’ ( అంటే గాడిద). 26వ సంవత్సరం పేరు నందన ( అంటే కొడుకు).


‘ నీ కొడుక్కేంట్రా ‘ఇరవై తొమ్మిది’. గొప్పింటి సంబంధాలు వస్తాయి’ అంటే మన్మధుడని. 29వ సంవత్సరం పేరు #‘మన్మధ 


‘వాడికోసారి ‘నలభై’ జరిగినా తెలిసి రాలేదు’ అంటే ‘పరాభవం జరిగినా’ అని. 40వ సంవత్సరం ‘ #పరాభవ’.


‘వాడి కూతురికి సంబంధాలు రావడం కొంచెం కష్టంరా ‘ముప్పయి’ , ‘ముప్పై మూడు’ కదా! ‘ అన్నాడంటే ‘రూపవతి కాదని’ అర్ధం. 30వ సంవత్సరం ‘దుర్ముఖి’ 33వ సంవత్సరం ‘వికారి’.


‘నీ నలభై ఎనిమిది’ కి కారణమేంటో తెలుసుకోవచ్చా?’ 48వ సంవత్సరం పేరు ‘#ఆనంద’.


‘వాడితో వాదనెందుకురా వాడో ‘యాభై అయిదు ’. అంటే బుద్ధిలేనివాడని అర్ధం. 55వ సంవత్సరం ‘#దుర్మతి’.


‘అబ్బ వాళ్ళ పిల్లలతో వేగలేమండీ! అందరూ ‘నలభై ఒకటి’ లే' అంటే కోతులూ కప్పలూ అని అర్ధం. 41వ సంవత్సరం #‘ప్లవంగ’.


‘వాడసలే ‘ముప్పై ఎనిమిది’ జాగ్రత్తగా మాట్లాడు. అంటే కొంచెం కోపిష్టి అని. 38వ సంవత్సరం పేరు #‘క్రోధి.


🌹సేకరణ 🌹

శంకరుల భోధనలు

 *శంకరుల భోధనలు* 

     

 *తవ హితమేగం పద్య వక్ష్యే, చృణు* 

మీ ప్రయోజనార్థం కోసం ఒక శ్లోకం చెబుతాను’’ అంటారు.  శ్రీ శంకరుల బోధన బోధన మనకు ఎప్పుడు ఉపయోగపడుతుంది?

 *శుకాగమో యాతి సతతం* 

"మీరు ఎల్లప్పుడూ ఆనందాన్ని కోరుకుంటే, ఈ బోధన మీకు ఉపయోగపడుతుంది."  

మరి వారి బోధన అంటే ఏమిటి?

 *స్వబ్నే దృష్టం సకలం హి మృషా జాగ్రతి స స్మర దత్వాతీతి ॥* 

“మీరు కలలో చూసేదంతా అబద్ధమని మీకు తెలుసు.  అదే విధముగా మేల్కొనే స్థితి మిథ్య అని తెలుసుకోవాలి'' అనేది ఆయన బోధన. 

ఈ విధంగా శంకర భగవత్పాదులు వేదాంత తత్వశాస్త్రంతో పాటు తన స్తోత్రాలతో మనకు అనుగ్రహించారు.  అందుచేత కేవలం శ్లోకాలను స్మరించుకోవడంతో పాటు భగవంతుని సన్నిధిలో  వాటిని పఠించడంతో ఆగిపోకుండా, భగవత్పాదాలు చెప్పిన తత్త్వాన్ని వాటిలో కూడా ప్రయోగిస్తే ఎంతో విశేషమైన ఫలితం లభిస్తుంది. తద్ద్వారా మనకు పరిపూర్ణ ధ్యాన ఫలితం దక్కుతుంది.మనం నిత్య నిర్మల మనస్కులమవుతాము.

-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

ప్రాతర్వేళల కేలుమోడ్చి

 శా॥

ప్రాతర్వేళల కేలుమోడ్చి మదిలో ప్రార్థింతు శ్రీశర్మదన్ 

భూతిం గూర్చగ భూతజాలముల నే స్ఫూర్తిం గృపం జూపగా 

వ్రాతల్ మార్చగ సౌఖ్యమందునటులన్ పారంగ దారిద్ర్యమున్ 

భూతేశేశ్వరి! పావనీ! వివిధమౌ మోహమ్ములం ద్రుంచవే! 

*~శ్రీశర్మద*

8333844664

తెలంగాణ కొత్త ట్రాఫిక్ రూల్స్*

 *తెలంగాణ కొత్త ట్రాఫిక్ రూల్స్* (01/07/2024):


 1. సాధారణ నేరం:

    - మునుపటి జరిమానా: ₹100

    - ప్రస్తుత జరిమానా: ₹500



 2. రెడ్ లైట్ ఉల్లంఘన:

    - మునుపటి జరిమానా: ₹100

    - ప్రస్తుత జరిమానా: ₹500



 3. అథారిటీ ఆదేశాలను ధిక్కరించడం:

    - మునుపటి జరిమానా: ₹500

    - ప్రస్తుత జరిమానా: ₹2000



 4. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్:

    - మునుపటి జరిమానా: ₹500

    - ప్రస్తుత జరిమానా: ₹5000



 5. అతివేగం:

    - మునుపటి జరిమానా: ₹400

    - ప్రస్తుత జరిమానా: ₹1000



 6. ప్రమాదకరమైన డ్రైవింగ్:

    - మునుపటి జరిమానా₹1000

    - ప్రస్తుత జరిమానా: ₹5000



 7. మద్యం ప్రభావంతో డ్రైవింగ్:

    - మునుపటి జరిమానా₹2000

    - ప్రస్తుత జరిమానా: ₹10000



 8. రేసింగ్ మరియు స్పీడింగ్:

    - మునుపటి జరిమానా: ₹500

    - ప్రస్తుత జరిమానా: ₹5000



 9. హెల్మెట్ ధరించకపోవడం:

    - మునుపటి జరిమానా: ₹100

    - ప్రస్తుత జరిమానా: ₹1000 + మూడు నెలలకు లైసెన్స్ రద్దు



 10. సీట్‌బెల్ట్ ధరించకపోవడం:

     - మునుపటి జరిమానా:₹100

     - ప్రస్తుత జరిమానా: ₹1000



 11. అత్యవసర వాహనాలను నిరోధించడం:

     - మునుపటి జరిమానా: నిర్దిష్ట జరిమానా లేదు

     - ప్రస్తుత జరిమానా: ₹10,000


 12. ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్:

- జరిమానా: ₹1200


 13. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం:

     - ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు జరిమానాలు పెంపు.


 14. ద్విచక్ర వాహనాలపై ఓవర్‌లోడ్:

     - మునుపటి జరిమానా:₹100

     - ప్రస్తుత జరిమానా: ₹2000 + మూడు నెలలకు లైసెన్స్ రద్దు.




 15. బీమా లేకుండా డ్రైవింగ్:

    -మునుపటి జరిమానా:₹1000

     - ప్రస్తుత జరిమానా: ₹2000



  *సమాచారం ప్రామాణికమైనది. దయచేసి అప్రమత్తంగా ఉండండి*!