శు భో ద యం🙏
జానుతెనుఁగు విన్నపముు !
బలుపొడతోలు సీరయును బాపసరుల్ గిరుపారుకన్ను, వెన్నెలతల, చేదుకుత్తుకయు,బన్నిన వేలుపుటేఱు, వల్గుపూ
సలుగల ఱేని లెంకనని జానుతెనుంగున విన్నవించెదన్
వలపు మదిందల్ిర్ప బసవా!బసవా! వృషాధిపా!
పాల్కురికి సోమన- వృషాధిపశతకము;
తొలి శతకకర్తగా పేరందిన శివకవి పాల్కురికి సోమన కవీంద్రుడు రచించిన వృషాధిపశతకంలోనిది పైపద్యరత్నం!
పై పద్యానికోప్రత్యేకత ఉంది.జానుతెనుగులో(వ్యవహారభాషలో)వ్రాయబడటం.మహాకవులరచనలు గ్రాంధికభాషకు(వ్యాకరణ సంస్కారమందినభాష)పట్టంగట్టగా శివకవులు మాత్రం నాటి వ్యవహారమైన తెనుగు బాసకు జానుతెనుగను పేరిడి దానిలోనే రచనలుగుప్పించి,రసజ్ఙులను మెప్పించి,తమదేశాభిమానమును మాతృభాషాభిమానమును వెల్లడించినారు.
వారే శివకవులు.వారిప్రయోగములకే శివకవి ప్రయోగములనుఖ్యాతి.
ప్రస్తుతము:
అర్ధములు:-
బలుపొడతోలుసీర-అనేక మచ్చలుగల చర్మాంబరము.
పాపసరులు-సర్పభూషణములు;
కిరుపాఱు-జ్వలించు;
వెన్నెలతల-తలపై వెన్నెలకురియు చందమామ;
చేదుకుత్తుక-విషపూరితమైనకంఠము;
బన్నిన-కదలకుండగట్టిన;.
వేల్పుటేఱు-గంగ;
నల్గుపూసలు-పుర్రెలనుపూసలహారముగల;
ఱేని-రాజుయొక్క;
లెంకనని-సేవకుడనని;
తరువాత సుబోధకమే!
పద్యమునందలి పదములు (ఒక్క వృషాధిపా!"-యనునదిదక్క) తక్కినవి దేశ్యములే!
భావము:వ్యాఘ్రాంబరధారియు,సర్పభూషణుడును,అగ్నినేత్రముగాగలవాడును.చంద్రధారియు, నీలగళుడును,కపాలమాలాధారియు, నగు నాపరమేశ్వరుని సేవకుడనని ప్రేమనిండిన మదితో విన్నవింతును.అని భావము.
స్వస్తి
!🌷🌷🌷💐🌷🌷💐💐💐💐💐🙏🙏🙏🌷💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి