4, జులై 2024, గురువారం

కర్మ, విధి,

 *శ్రీ గురుభ్యోనమః*


   *కర్మ,  విధి,  మానవసంకల్పము*


*ప్రశ్న :  ఇప్పటి  అనుభవాలన్నీ  పూర్వపు  కర్మల  ఫలమే  అయితే,  పూర్వం  చేసిన  తప్పులు  తెలిస్తే  వాటిని  సరిదిద్దు  కోవటం  వీలుపడుతుందా ?*


*జవాబు :*  ఒక  తప్పుని  దిద్దుకున్నా,  సంచిత  కర్మలో  ఇంకా  ఎన్నో  మిగిలి  ఉన్నాయి.  అవన్నీ  ముందు  ముందు  ఎన్నో  జన్మలనిస్తాయి.  కాబట్టి  ఆ పద్ధతి  కాదు  అవలంబించాల్సింది.  కొమ్మలని  తీసివేసేకొద్దీ  చెట్టు  బాగా  ఎదుగుతుంది.  నీవు  కర్మని  సరిదిద్దుకున్న  కొద్దీ  అది  ఎక్కువవుతూంటుంది.  కర్మకి  మూలమేమిటో  కనుక్కో !  దానిని  నిర్మూలించు.


*ప్రశ్న :  ప్రపంచమంతా  కార్యానికి,  ప్రతిస్పందనకి  ఫలితమనే  కదా ..  కర్మ  సిద్ధాంతం  చెప్పేది ?  అయితే,  ఈ రెండూ  దేనికి  సంబంధించినవి ?*

*జవాబు :*  ఆత్మసాక్షాత్కారమయ్యే  వరకు  కర్మ  ఉంటుంది.  అదే  కార్యమూ,  ప్రతిస్పందనాను !  సాక్షాత్కారమయిన  తరువాత  కార్యమూ  ఉండదు,  ప్రపంచమూ  ఉండదు.

             

*"నీ సహజస్థితిలో  ఉండు"*

కామెంట్‌లు లేవు: