4, ఆగస్టు 2024, ఆదివారం

ఐదుగురు తల్లులు

 *🦜𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝🦜*


*శ్లోకము౹౹ :1)*


      *రాజపత్నీ గురోః పత్నీ*

      *భ్రాతృపత్నీ తథైవ చ।*

      *పత్నీమాతా స్వమాతా చ* 

      *పంచైతా మాతరః స్మృతాః॥*


*భావము:*


ఈ లోకంలో మనుజులకు కన్న తల్లి తో సహా ఐదుగురు తల్లులు ఉంటారు. వారెవరంటే, 


1) రాజ్యాన్ని పాలించే రాజు గారి ధర్మపత్ని, 

2) గురువు గారి ధర్మపత్ని, 

3) అన్న భార్య అంటే వదిన గారు,

4) భార్య తల్లి అంటే అత్తగారు 

5) జన్మను ఇచ్చిన సొంత తల్లి


కావున ప్రతి మనిషి  కన్న తల్లితో పాటు పైన చెప్పబడిన మిగిలిన నలుగురి పట్ల కూడా  సమానమైన మాత్రుతుల్య పూజ్య భావాన్ని కలిగి ఉండాలి.


*శ్లోకము౹౹ :2)*


      *జనితా చోపనేతా చ*

      *యస్తు విద్యాం ప్రయచ్ఛతి*।

      *అన్నదాతా భయత్రాతా* 

      *పంచైతే పితరః స్మృతాః ॥*


*భావము:*

అటులనే 

1) కన్న తండ్రి

2) ఉపనయనం చేసిన వారు

3) విద్య గరపిన వారు ఆంటే గురువు

4) అన్నం పెట్టి పోషించిన వారు

5) కష్టాలలోనూ, ఆపదలోనూ ఉన్నప్పుడు భయాన్ని పోగొట్టి ఆదుకునే వారు.


కన్న తండ్రితో సహా మిగిలిన నలుగురి పట్ల కూడా తండ్రి తో సమానమైన పిత్రుతుల్య పూజ్య భావాన్ని కలిగి ఉండవలెనని ఈ శ్లోకార్థం.


*మరి, ఒకే ఒక లక్షణంతో లేదా ఒకే ఒక బాధ్యత నెరవేర్చి నందులకే కొంతమందికి, తల్లి తండ్రులతో సమానమైన స్థాయి మరియు గౌరవం  ఆపాదించబడినప్పుడు, తనకు జన్మనిచ్చిన కన్న తల్లి తండ్రుల పట్ల ప్రతీ మనిషి ఎంతటి గౌరవ భావం, కృతజ్ఞతా భావం, పూజ్య భావం కలిగి ఉండాలో కదా!*

🙏🙏🙏

డొనెషన్లు

 డొనెషన్లు

మిత్రులారా మన బ్లాగు అభివ్రుద్దికి డొనేషనులు +91 9848647145 మొబేలు నంబరుకు జీ పే, ఫొనె పె, లొ దేనితొ నయినా పంప వచ్హు. మీ స్క్రీన్ షాట్ పంపిస్తె మన బ్లాగులొ పబ్లిష్ చేస్తాము. ఇక ఆలశ్యం యెందుకు ఇప్పుడె మీరు డొనెషన్ పంపండి. మన బ్లాగు అభివ్రుద్దికి తొట్పడండి 

ధర్మాచరణ

 ✳️*ధర్మాచరణ:*✳️

                   ➖➖➖



*సృష్టిలో కనిపించే లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అత్యంత శ్రేష్టమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆకలి, నిద్ర, సంతానోత్పత్తి ఇతర ప్రాణుల్లోనూ ఉన్నాయి. మరి మనిషి ప్రత్యేకత ఏమిటి?*


*ధర్మాన్ని ఆచరించే యోగ్యత మనిషికే ఉంది. ఏ ఇతర ప్రాణుల్లో ధర్మాన్ని ఆచ రించే అవకాశం లేనందువల్ల, అది మనిషికి దక్కిందని జ్ఞానులు చెబుతారు. ఆ స్థానాన్ని పొందిన మనిషి సరైన మార్గంలో ధర్మాన్ని ఆచరించకపోతే, మిగిలిన ప్రాణులకూ మనిషికి తేడా ఉండదు.* 


*మనిషికి మాట్లాడేందుకు నోరు, పూజించడానికి చేతులు, ఆలకించేందుకు చెవులు, ఆలయానికి వెళ్ళడానికి కాళ్లు భగవద్వాసనలు ఆఘ్రాణించే నాసిక, దైవ తీర్ధం-సేవించే జిహ్వ ఉన్నాయి.* 


*మిగిలిన ప్రాణులకు చెవులు ఉన్నాయి. కానీ... భగవంతుడి స్తుతులను ఆలకించాలని తెలియదు. కాళ్లు ఉన్నాయి కానీ గుడికి వెళ్ళాలని తెలియదు. పూజ చేసే చేతులు లేవు. నోరు ఉంది. కానీ భగవన్నామం చెయ్యా లని తెలియదు. అందుకే వాటిలో లేని ఆ  యోగ్యత మనిషిలో ఉంది. కాబట్టే-మానవ జన్మ అత్యున్నతమైనది.* 


*శాస్త్రోకమైన ధర్మాచరణ చేసేవారిని మహాత్ములు అంటారని శంకరులు తమ భాష్యంలో తెలిపారు.* 


*ధర్మం ఈ చరాచర జగత్తును అంతటినీ నడిపిస్తున్న దివ్యశక్తి, దానివల్లనే ఈ బ్రహ్మాండమంతా నిలబడుతోంది. ప్రకృతి ఎలా ప్రవర్తించాలి. ప్రాణికోటి ఎలా ప్రవర్తించాలో తెలియజేసేదే  ధర్మం.* 


*అది కాలానుగుణమైన మార్పులకు మారేది కాదు. దానికి కాల దోషం లేదు. దేని కారణంగా మనిషికి ఆధ్యాతికోన్నతి లభిస్తుందో అదే ధర్మం.* 


*"మనిషి కచ్చితంగా దాటాల్సిన భౌతిక దశలన్నీ క్షణభంగురాలే. ఈ లోకంలో అచంచలమైనది, స్థిరమైనది ధర్మం ఒక్కటే అన్నారు వివేకానంద.* 


*సత్కర్మల్లో ముఖ్యంగా దానం, ధ్యానం ప్రతినిత్యం శ్రద్ధగా చేసేవారికి మనో చైతన్యం కలిగించేది ధర్మం మాత్రమే. ప్రతివారూ తమ పనులు ధర్మబద్ధంగా ఉన్నాయా లేవా అని తరచి చూసుకోవాలి.*


*’ధర్మం సారమే ఈ జగత్తు!’ అన్నాడు గౌతను బుద్ధుడు. మనిషిని జీవింపజేసే..ధర్మాల్లో ముఖ్యమైనవి- నిగ్రహం, ప్రేమ, సంతృప్తి, త్యాగం, దహింపచేసేవి- అత్యాశ, ద్వేషం, పరదూషణ, పగ.*


*వ్యక్తిగత ధర్మాలు సమష్టి ధర్మాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు అలాంటివాటిని త్యజించడమే అసలైన ధర్మం.*


*రామాయణంలో ధర్మం మూర్తీభవించిన శ్రీరాముడు, మహాభారతంలో ధర్మానికి ప్రతినిధి అయిన ధర్మరాజు, లోక ధర్మానికి కట్టుబడి భార్యను, కుమారుణ్ని, రాజ్యాన్ని వదిలి వెళ్ళిన గౌతమ బుద్ధుడు ధర్మ స్వరూపుల య్యారు. అనంతర కాలంలో రామకృష్ణ పరమహంస, వివేకానందుడు. అరవిందులు... ధర్మాచరణలో సఫలీకృతులైన సత్పురుషులు.*


*ధర్మరాజు యుద్ధంలో ‘అశ్వత్థామ హతః' అని చెప్పడం, యుద్ధంలో నియమ విరుద్ధంగా దుర్యోధనుని గదతో తొడలపై మోదడం, కర్ణుడు నేలపై ఉండగా సంహరించడం.. ధర్మ విరుద్ధాలు కావా అనే సందేహం కలుగుతుంది. ధర్మాన్ని ధర్మంతో, అధర్మాన్ని అధర్మంతో ఎదుర్కోవాలని భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలియజెప్పాడు.*


*మనిషి ఆధ్యాత్మిక కర్మలను ధర్మబద్ధంగా ఆచరించినప్పుడే తనను, సమాజాన్ని, ఇతర ప్రాణుల్ని, ప్రకృతిని, ప్రపంచాన్ని రక్షించగలుగుతాడు. ధర్మం అనేది లేకపోతే పై వాటికి రక్షణ లేదు.*


*ధర్మం అంటే పరస్పర రక్షణ. దాన్ని ఆచరించి, రక్షించే ఉత్తమ యోగ్యతను మనిషికి ప్రసాదించాడు భగవంతుడు, ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వారిని ధర్మం రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః

                  - 

.          *✳️సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*🙏

*శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 399*


⚜ *కర్నాటక  : సోమనాథ్ పుర - మైసూరు*


⚜ *శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం*

 


💠 దాదాపు 400 సంవత్సరాల పాటు సారవంతమైన కావేరీ పరీవాహక ప్రాంతాన్ని పాలించిన హొయసల రాజవంశం వారి ఫలవంతమైన ఆలయ నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. 

 వారి హయాంలో 900 దేవాలయాలను నిర్మించారని, వాటిలో 100 దేవాలయాలు కాలక్రమేణా మనుగడలో ఉన్నాయని భావిస్తున్నారు. 


💠 కన్నడలో ఒక సామెత ఉంది, ‘బేలూర్ దేవాలయం, మీరు లోపలి నుండి చూడాలి, హళేబీడు దేవాలయం, మీరు బయట నుండి చూడాలి, కానీ సోమనాథపుర ఆలయాన్ని మీరు లోపల మరియు వెలుపల నుండి చూడాలి.


💠 పవిత్రమైన కావేరీ నది ఒడ్డున సోమనాథపుర ఒక చిన్న ప్రశాంత పట్టణం. ఇక్కడ ప్రసిద్ధ ప్రసన్న చెన్నకేశవ దేవాలయం లేదా కేశవ దేవాలయం ఉంది.


💠 1258లో ప్రతిష్టించబడిన ఇది వైష్ణవ హిందూ దేవాలయం, ఇది శ్రీకృష్ణుడి (చెన్న= అందమైన మరియు కేశవ= కృష్ణుడు) శక్తి మరియు అందానికి అంకితం చేయబడింది. సుందరమైన ప్రదేశాన్ని తిలకించేందుకు సమీప మరియు దూర ప్రాంతాల నుండి పర్యాటకులు ఆలయాన్ని సందర్శించడానికి వస్తుంటారు.


💠 హొయసల సామ్రాజ్య రాజులు తమ రాజ్యంలోని వివిధ ప్రాంతాలలో నిర్మించిన 1500 దేవాలయాలలో చెన్నకేశవ దేవాలయం ఒకటి, ఇది హోయసల ఆలయ శైలిలో  అభివృద్ధి అని చెప్పబడింది మరియు ఇంకా అనేక ఇతర మార్గాల్లో ప్రత్యేకంగా ఉంటుంది. 


💠 ప్రసిద్ధ హోయసల వాస్తుశిల్పానికి ఒక అద్భుతమైన ఉదాహరణ మరియు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో నామినేట్ చేయబడిన మూడు దేవాలయాలలో ఇది ఒకటి. 

దురదృష్టవశాత్తు, ఈ ఆలయాన్ని ఇప్పుడు ప్రార్థనా స్థలంగా ఉపయోగించడం లేదు, ఎందుకంటే ఆక్రమించిన ముస్లిం సైన్యాలు విగ్రహాలను పగలగొట్టి అపవిత్రం చేశాయి. 

ఏది ఏమైనప్పటికీ, ఆలయ సౌందర్యం ఇప్పటికీ వేలాది మంది సందర్శకులను ఆకర్షిస్తోంది.


🔆 *ఆలయ చరిత్ర*


💠 సోమనాథపుర, ఈ పట్టణాన్ని 13వ శతాబ్దంలో సోమనాథ దండనాయక అనే సైన్యాధ్యక్షుడు హోయసల రాజు నరసింహ III సేవలో ఉన్నప్పుడు స్థాపించాడు. 

ఆ తరువాత, అతను రాజు అనుమతిని కోరాడు మరియు పట్టణంలో, సోమనాథపుర (పోషకుడి పేరు తర్వాత పిలుస్తారు) దేవాలయాలను నిర్మించడానికి మరియు నిర్వహించడానికి బ్రాహ్మణులకు భూములు మరియు వనరులను మంజూరు చేశాడు. 


💠 ఈ కొత్త పట్టణం నడిబొడ్డున, జనరల్ సోమనాథుడు కేశవ ఆలయాన్ని నిర్మించి 1258 లో ప్రతిష్టించాడు. అదనంగా, నగరంలో అనేక ఇతర హొయసల శైలి దేవాలయాలు కూడా నిర్మించబడ్డాయి, అయితే హిందూ రాజ్యాలు మరియు ముస్లిం సుల్తానుల మధ్య యుద్ధాలు ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేసిన తర్వాత లక్ష్మీ నరసింహ ఆలయం మినహా మిగిలినవన్నీ కనుమరుగయ్యాయి లేదా శిథిలావస్థలో ఉన్నాయి.


💠 శాసనాల ప్రకారం, 14వ శతాబ్దంలో జరిగిన యుద్ధం కారణంగా చెన్నకేశవ దేవాలయం కూడా భారీ నష్టాన్ని చవిచూసింది, అయితే ఒక శతాబ్దం తరువాత విజయనగర సామ్రాజ్య రాజులు ఇచ్చిన గ్రాంట్లు మరియు ఆర్థిక సహాయంతో మరమ్మతులు చేయబడ్డాయి.


💠 ప్రధాన ఆలయ వరండా మరియు ఉత్తర గోపురం మరియు వేదికలోని కొన్ని భాగాలలో రాళ్ల రంగు మరియు నాణ్యతలో తేడా ఈ మరమ్మతులకు నిదర్శనం. 

మరోసారి, అందమైన ఆలయం 19వ శతాబ్దంలో నష్టాన్ని చవిచూసింది మరియు 20వ శతాబ్దం ప్రారంభంలో వలసరాజ్యాల కాలం నాటి మైసూర్ ప్రభుత్వంచే మరమ్మత్తు చేయబడింది.


🔆 *సోమనాథపుర ఆలయ నిర్మాణం*


💠 13వ శతాబ్దంలో అందమైన కావేరీ నది 

ఒడ్డున ఈ క్లిష్టమైన దేవాలయం నిర్మించబడింది. 

ప్రత్యేకమైన మరియు అందమైన హొయసల వాస్తుశిల్పం ఈ ప్రదేశం యొక్క అనేక లక్షణాలలో ఒకటి, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. 

మొత్తం ఆలయ సముదాయం, దాని ద్వారాలు, మండపం మరియు శాసనం రాళ్ళు సబ్బు రాయితో చెక్కబడ్డాయి, ఇది కళాకారులు అందంగా క్లిష్టమైన కళాకృతిని చెక్కడానికి వీలు కల్పించింది. 


💠 వెలుపల గోడల ప్రాంగణంలో అలంకరించబడిన ప్రధాన ద్వారం లేదా మహాద్వార్ కలిగి ఉంది. 

ఈ మహాద్వార్ వెలుపల ఒక ఎత్తైన స్తంభం ఉంది, పైన గరుడ విగ్రహం ఉంది, అది విష్ణువు వాహనంగా పరిగణించబడుతుంది. 

గరుడ విగ్రహం ఇప్పుడు కనిపించలేదు. మహాద్వార్ నుండి ప్రవేశిస్తున్నప్పుడు, ఒక బహిరంగ బహిరంగ ప్రాంగణం, మధ్యలో ప్రధాన మూడు గోపురాల ఆలయం కనిపిస్తుంది. 


💠 ఆలయంలో ఉన్న మూడు పవిత్ర విగ్రహాలు, కేశవ, జనార్దన మరియు వేణుగోపాల్ అన్నీ హిందూ గ్రంథం భగవద్గీతలో కనిపించే కృష్ణుడి పేర్లు.  

చెన్నకేశవ అంటే 'అందమైన కృష్ణుడు' మరియు భగవంతుని శక్తి యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక సౌందర్యాన్ని సూచిస్తుంది.  దురదృష్టవశాత్తు, ఈ ప్రాంతంలో జరిగిన అనేక సైనిక యాత్రలు మరియు ముస్లిం సైన్యాలతో జరిగిన యుద్ధాల వల్ల ఇక్కడి విగ్రహాల వైభవం దెబ్బతింది.


 

💠 ఇది మైసూరు నగరానికి తూర్పున 38  కిలోమీటర్లు  దూరంలో ఉంది . 

శ్రావణ మాసం*

 🍀5తేదీ నుండి…


                *శ్రావణ మాసం*

                  ➖➖➖✍️



ఆగస్ట్ 05 తేదీ సోమ వారం 

                 నుండి…

సెప్టెంబర్ 03తేదీ మంగళ వారం      

                   వరకు …

శ్రావణ మాసం..!


💐5 సోమవారములు:


1. 05.08.2024 సోమవారం

2. 12.08.2024 సోమవారం

3. 19.08.2024 సోమవారం

4. 26.08.2024 సోమవారం

5. 02.09.2024 సోమవారం



💐4 శనివారములు:


1. 10.08.2024 శనివారం

2. 17.08.2024 శనివారం

3. 24.08.2024 శనివారం

4. 31.08.2024 శనివారం



💐4 శుక్రవారములు:


1. 09.08.2024 శుక్రవారం

2. 16.08.2024 శుక్రవారం

3. 23.08.2024 శుక్రవారం

4. 30.08.2024 శుక్రవారం



 💐 పండుగలు:


🪴08.08.2024 గురువారం నాగుల చవితి (ఉపవాసం)

🪴09.08.2024 శుక్రవారం నాగుల పంచమి 

🪴15.08.2024 గురువారం స్వాతంత్ర్య దినోత్సవం 

🪴16.08.2024 శుక్రవారం వరలక్ష్మి వ్రతం 

🪴19.08.2024 సోమవారం రాఖీ పౌర్ణమి 

🪴27.08.2024 మంగళ వారం 

శ్రీ కృష్ణాష్టమి 

🪴07.09.2024 శనివారం 

శ్రీ వినాయక చవితి. 


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జీవితమంతా

 *2042*

*కం*

జీవిత మంతయు శ్రమపడి

జీవన సౌఖ్యములు వీడి సిరులార్జించన్(సిరులను కూర్చన్)

దైవానుగ్రహముండక

నీవారసులైన సుఖము నెరుగరు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! జీవితమంతా కష్టపడి జీవితం లోని సౌఖ్యములు విడిచిపెట్టి ధనము లు సంపాదించిననూ దైవానుగ్రహం లేకపోతే నీవారసులైనా కూడా వాటి సుఖములు పొందలేరు.

*సందేశం*:-- ధనార్జన తో బాటుగా ఆ ధనముల వలన సుఖసంతోషాలను అనుభవించవలెనంటే దైవానుగ్రహం కావాలి. అది గోసంరక్షకపోషణాదిసేవలు,దానములు వంటి ధార్మిక సత్కర్మలు చేయడం వలన నే సాధ్యమవుతుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

మానవ జన్మ!*

            *మానవ జన్మ!*

                   ➖➖➖✍️


*భగవంతుడు ప్రసాదించిన - మానవ జన్మ ఎలా తరింప చేసుకోవాలో - నిర్ణయం మనదే!*


*సృష్టిలో మానవజన్మ ఎంతో క్లిష్టమైనది. అతడు పుట్టడంతోనే అతనిలో మమేకమై ఉన్నవి పదకొండు ఇంద్రియాలు. అవి లేకుంటే అతడు మనుగడ సాగించలేడు.*


*ఆ పదకొండులో....*


*1. అయిదు జ్ఞానేంద్రియాలు,*


*2. అయిదు కర్మేంద్రియాలు,*                  

       *మనసు ఉన్నాయి.*


*1. శ్రోత్రం (చెవి),*

*2. త్వక్‌ (చర్మం),*

*3. చక్షుషీ (కన్నులు),*

*4.జిహ్వా (నాలుక),*

*5.నాసికా (ముక్కు)*

     *అనేవి జ్ఞానేంద్రియాలైతే,*


*1. పాయు (మలద్వారం),*

*2. ఉపస్థ (మూత్రద్వారం),*

*3. హస్త (చేతులు),*

*4. పాద (కాళ్లు),*

*5. వాక్‌(మాట)అనేవి కర్మేంద్రియాలు.*

    *ఈ పదింటికి చివర మనసు.*


*ఇదీ ఇంద్రియ సమూహం.*

*ఈ పదకొండు ఇంద్రియాలు పదకొండు విధాలుగా మనిషిని కష్టపెడతాయి. ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి.*


*ఇంద్రియనిగ్రహం అనేది మనిషికి బతుకు సమస్య.*


*ఇంద్రియాలు గుర్రాల వంటివని, రథాన్ని నడిపే సారథి పగ్గాలను సమర్థంగా పట్టుకొని అదుపు చేయకపోతే గుర్రాలు ఇష్టం వచ్చిన దిక్కుకు ప్రయాణిస్తాయని, అప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయని, కనుక సారథి వంటి మనిషి ఇంద్రియాలు అనే గుర్రాల పగ్గాలు లాగి అదుపులో పెట్టుకోవాలని అంటాడు మనువు.*


*1. మనిషి సంయమనాన్ని కోల్పోతే చెవులు చెడు మాటలనే వింటాయి.*


*2. చర్మం పనికిరాని స్పర్శను కోరుతుంది.*


*3. కళ్లు అశ్లీలాన్ని చూస్తాయి.*


*4. నాలుక అనారోగ్యకరమైన రుచులను కోరుతుంది.*


*5. ముక్కు దుర్గంధాలనే స్వీకరిస్తుంది.*


*6. మల, మూత్రద్వారాలు పనిచేయకుండా పోతాయి.*


*7. కాళ్లూ చేతులూ హింసను ఆచరిస్తాయి.*


*8. మాట అదుపు తప్పుతుంది.                ఇలా పది ఇంద్రియాలు చేసే నష్టం ఒక ఎత్తయితే,*


*9. మనసు అనే పదకొండో ఇంద్రియం చేసే నష్టం ఒక ఎత్తు.*


*అసలు పది ఇంద్రియాలను మంచిగాను, చెడుగాను మార్చేది మనసే. మనసు చెప్పినట్లే ఇంద్రియాలు వింటాయి.*


*అందుకే వాల్మీకి- ‘ఇంద్రియాల సత్‌ప్రవర్తనకు, అసత్‌ప్రవర్తనకు మనసే మూలకారణం’ అని రామాయణ మహాకావ్యంలో అంటాడు.*


*చెడు వినకుండా, చెడు కనకుండా, చెడు అనకుండా, చెడు తినకుండా, చెడు ఆఘ్రాణించకుండా ఉండగలిగేవాడే జితేంద్రియుడని శాస్త్రాల ప్రబోధం.*

*ఇలా ఉండాలంటే మనిషి మొదట జ్ఞానవంతుడు కావాలి. జ్ఞానం లేని కర్మాచరణ పిచ్చివాడి చేతిలో రాయి వంటిదే. అది ఎవరిమీదనైనా పడవచ్చు. నిప్పును తాకితే కాలుతుందని తెలిసిన జ్ఞాని, నిప్పును తాకడానికి సాహసించడు.*


*ఆ విషయం తెలియని బాలుడు నిప్పును తాకి చేతులు కాల్చుకుంటాడు. కనుక ఏ పనిచేసే సమయంలో అయినా ఆ పనికి సంబంధించిన జ్ఞానం అవసరం.    లేకుంటే ఇంద్రియాలు మనిషిని పక్కదారి పట్టిస్తాయి. ఇంద్రియాలు అదుపులో ఉన్నంతవరకు మనిషి ఉజ్జ్వలంగా వెలిగిపోతాడు.*


*ఇంద్రియాల్లో ఏ ఒక్కటి అదుపుతప్పినా, అన్ని ఇంద్రియాలూ క్రమంగా పట్టుతప్పిపోతాయి.*


*పర్యవసానంగా మనిషిలోని ప్రజ్ఞ నశించిపోతుంది.*


*ప్రకృష్టమైన(విశిష్టమైన) జ్ఞానమే ప్రజ్ఞ. అంటే అన్నింటినీ చక్కగా గుర్తించే గుణం.  అది ఉన్నంతకాలం మనిషి మెదడు అనే యంత్రం పనిచేస్తుంది.*


*మెదడును చక్కగా ఉంచుకోవడానికి ‘ఆయుర్వేదం’ ఇలా మార్గోపదేశం చేస్తోంది-..*

*’పరిశుద్ధమైన ఆహారాన్ని మాత్రమే ప్రతినిత్యం స్వీకరించాలి. అలా స్వచ్ఛమైన ఆహారాన్ని తినడంవల్ల ఇంద్రియాలన్నీ పటిష్ఠంగా ఉంటాయి. అవి దృఢంగా ఉన్నప్పుడే మెదడు బాగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి వర్ధిల్లుతుంది’.*


*ఇంద్రియాల వెనక ఉన్న ఇంతటి సాంద్రమైన విషయాన్ని మనిషి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.*


*అందువల్ల జితేంద్రియుడు (ఇంద్రియాలను జయించినవాడు) కావాలో, ఇంద్రియజితుడు (ఇంద్రియాలతో ఓడిపోయినవాడు) కావాలో తేల్చుకోవలసింది మనిషే!*✍️

         …సేకరణ   -Ambicasreenu.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

జయము’ అని పేరు!



*మహాభారతానికి…*

                *’జయము’ అని పేరు!*

                 ➖➖➖✍️



*భారతానికి 'జయ'మని పేరు రావడంలో అంతరార్థం:-*

                  

*మానవ జీవితంలో ధర్మానికే అంతిమ విజయం అని నిర్దుష్టంగా నిరూపించడం చేత మహాభారతం 'జయ'మని పిలువబడింది.* 


*అంతేకాదు. 'జయత్యనేన సంసారమితి' భారతం చదివి, విషయాలను తెలుసుకొని సంసారాన్ని జయించవచ్చు.* 


*సంఖ్యాశాస్త్రం రీత్యా కూడ 'జ', 'య' అనే రెండక్షరాలకు ఎంతో ప్రాధాన్యం వుంది. ‘జ’ అనేది ఎనిమిదిని(8),  'మ' (1) ఒకటిని సూచిస్తాయి.* 


*'అంకా నాం వామ తో గతిః'- ఎడమవేపుకు అంకెలు లెక్కించాలి - అనే సూత్రం ప్రకారం, ఇవి (8,1) 18 అవుతాయి. అందుకే 18 పర్వాలున్న మహాభారత గ్రంథం 'జయం' అని, 'జయసంహిత', అని ప్రసిద్ధిలోకి వచ్చింది.* 


*మనోజయానికి, ధర్మజయానికీ మహాభారతం ప్రతీక అయింది.                        ఒక త్రాసులో మహాభారతాన్ని ఒక ప్రక్క వేదాలను మరొక వేపు వుంచితే, 'మహత్త్వాత్ భారవ త్వాచ్చ' - భారతమే ఎక్కువ తూగిందట!* 


*అందుకే మన సనాతన ధర్మ సాహిత్యంలో భారతానికి 'జయ'మని పేరు వచ్చింది.*


*'జయో నా మేతి హాసో యం'- జయమని పేరుగల గ్రంథాలు మనకు ఇంకా వున్నా, ఒక్క మహాభారత ఇతిహాసానికే 'జయం' అని పేరు రావడంలో గల అంతరార్థం యిది.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

Panchaag


 

శరీరంలో వాతపిత్తకఫాలను

 శరీరంలో వాతపిత్తకఫాలను వృద్ధిచేసే ఆహారాలు     


          మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన  యొక్క ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. ఆయా ఆహారాలు మనశరీరతత్వానికి అనుగుణంగా ఉన్నాయో లేవో చూసుకొని తీసుకున్నచో మనకి అనారోగ్య సమస్యలు దరిచేరవు . రోగం వచ్చినప్పుడు చికిత్స తీసుకోవడం కన్నా ఆ రోగం రావడానికి గల కారణాలు గుర్తించి సరైన జాగ్రత్తలు పాటించడం 

చాలా మంచిది .


           ఇప్పుడు నేను మీకు వివరించబోయే ఆహార విషయాలు ఆయా శరీరతత్వాల వారు పాటించి పడని ఆహారపదార్థాలుకు దూరంగా అయినా ఉండటం లేదా అతితక్కువ మోతాదులో ఎప్పుడో ఒకసారి తీసుకోవడం వలన ఆనారోగ్యానికి గురికాకుండా ఉంటారు.


 * శరీరంలో వాతాన్ని కలిగించు ఆహారాలు -


      అతిగా వ్యాయామం చేయడం , అతిగా ఉపవాసాలు , ఎత్తు నుంచి దూకుట , కాళ్లు చేతులు విరుగుట, ధాతుక్షయం, రాత్రిజాగారం, మలమూత్రాలు బంధించుట లేదా బలవంతంగా విసర్జించుట, అతిగా వాంతులు మరియు విరేచనాల వలన, కషాయాలు మరియు చేదు వస్తువులను అతిగా వాడుట, అతిగా భాధపడుట, భయం , అతిగా ఏడవటం వంటివాటివలన సంధ్యాసమయాలలో, వర్షాకాలంలోనూ, భోజన ముందు సమయాలలోను వాతం వృద్ధిచెందును.


 * శరీరంలో పిత్తాన్ని కలిగించు పదార్థాలు -


        అతి పులుపు , అతికారం , ఉప్పు వంటి తీక్షణ పదార్థాలు తీసుకోవడం , అతిగా కోపగించుకొనుట, ఎండలో ఎక్కువ తిరుగుట, నువ్వులు , పెరుగు , తరవాణి వంటివాటిని అతిగా సేవించుట వలన , మద్యసేవన  వలన , అన్నం జీర్ణం అయ్యే సమయంలోను ,శరత్,గ్రీష్మ ఋతువుల్లోనూ , మధ్యాన్న , మధ్యరాత్రి సమయాల్లోనూ శరీరంలో పిత్తం వృద్ది చెందును .


 * శరీరంలో కఫం వృద్ధి కలిగించు పదార్దాలు -


          చిక్కని మధుర పదార్దాలు అతిగా సేవించుట , పెరుగు , బెల్లం, వెన్న, నెయ్యితో చేయబడిన మధురపదార్ధాల వలన , పగటినిద్ర వలన, హేమంత, వసంత ఋతువులలోను , భోజనం అయినవెంటనే పగలు , రాత్రుల ప్రారంభ సమయాలలో కఫవృద్ధి జరుగును.


     ఇప్పుడు శరీరంలో వాత,పిత్త,కఫాన్ని తగ్గించు ఆహారవిహారాల గురించి తెలియచేస్తాను .


 * శరీరంలో వాతాన్ని తగ్గించు ఆహారవిహారాలు -


        తియ్యని,పుల్లని , లవణ రసాలు కలిగిన మృదువు కలిగి ఉండి కొంచం ఉష్ణం కలిగించు ఆహారపదార్థాలు .


 *  శరీరంలో పిత్తాన్ని తగ్గించు ఆహారవిహారాలు -


         కషాయ , చేదు రుచులు కలిగిన చల్లని మధురమైన మృదువు, సాంద్రత కలిగిన ఆహారవిహారాలు .


 * శరీరంలో కఫాన్ని తగ్గించు ఆహారవిహారాలు -


          వగరు,కారం,చేదు కలిగిన ఆహార పానీయాలు , తీక్షణత, వేడి కలిగిన ఆహారవిహారాలు కఫాన్ని నాశనం చేస్తాయి.


         కావున పైన చెప్పినవిధంగా ఆయా దోషాలు కలిగినవారు  వాటికి తగ్గ ఆహారపదార్థాలు సేవించడం , విడిచిపెట్టడం ద్వారా మీయొక్క ఆరోగ్యాలు కాపాడుకొనవలెను .


  

         ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

శార్దూలే

 ऊँ!

----

" శార్దూలే..

--

ఈడేవేంకటనాథం సుధాభ హృదయం ఋత్విక్స్తుతంమాన్యదమ్..


వందేపన్నగశాయినంమురజితం భక్తార్తి విచ్ఛేదినం ,


మందస్మేరముఖం భవాబ్ధితరణం మాక్ష్మాపతిం ముక్తిదం ,


కందర్పోపమకాంతిభాస విలసద్గాత్రం రమేశం భజే / నమే/ స్తువే !!! "

----

గుత్తివంకాయ

 గుత్తివంకాయ!

---------------------

సీ||

గుంటూరులో నైన గుత్తిలోనైనను

          కూరలన్నిటిలోన 

          జోరు తనదె!

గుత్తివంకాయన్న మత్తులో దేలుచు

           గుటక వేయుచునుంద్రు,

           గొప్ప గాదె!

విందుభోజనమైన,పెళ్లి,పండుగలైన

           విధిగ వార్తాకమే వెలుగు       

           గాదె!

గోంగూర తర్వాత గుత్తివంకాయయే

           తెలుగువారిది సొత్తు 

           తెలియవలదె!

ఆ.వె||

నాల్గుభాగములుగ నాణ్యంబుగా కోసి

కూరపొడిని లోన కూరవలయు!

తైలమందు వేసి తాళింపు వాసనల్

చాకముందె తినగ చాలు!చూడు!



-----------కోడూరి శేషఫణి శర్మ!

---------------------

సీ||

గుంటూరులో నైన గుత్తిలోనైనను

          కూరలన్నిటిలోన 

          జోరు తనదె!

గుత్తివంకాయన్న మత్తులో దేలుచు

           గుటక వేయుచునుంద్రు,

           గొప్ప గాదె!

విందుభోజనమైన,పెళ్లి,పండుగలైన

           విధిగ వార్తాకమే వెలుగు       

           గాదె!

గోంగూర తర్వాత గుత్తివంకాయయే

           తెలుగువారిది సొత్తు 

           తెలియవలదె!

ఆ.వె||

నాల్గుభాగములుగ నాణ్యంబుగా కోసి

కూరపొడిని లోన కూరవలయు!

తైలమందు వేసి తాళింపు వాసనల్

చాకముందె తినగ చాలు!చూడు!



-----------కోడూరి శేషఫణి శర్మ

🌸శ్రీ రామ స్తుతి 🙏

 🌸శ్రీ రామ స్తుతి 🙏

సీ. సాకేత రామయ్య! స్వామివి నీవయ్య !

               మముకావ రావయ్య మౌనమేల

     తాటకమర్ధనా !  తాపస పూజితా !

                పరమాత్మ ! శ్రీరామ ! పాహి పాహి !

     ఆశ్రితజనపోష ! యఖిలేశ ! రఘువీర !

                సత్యపరాక్రమా ! శరణు శరణు !

     వైకుంఠపురి వాస ! వైజయంతీధరా !

               మైథిలీప్రాణేశ ! మహిత తేజ !

తే.ధర్మ సంస్థాపనము సేయ ధరను నున్న

    ఆదినారాయణా ! నీకు ననవరతము

    నతుల నర్పింతు నతులిత భక్తి తోడ,

    రమ్యగుణగణశోభితా రామచంద్ర !


జయలక్ష్మి

*శ్రీ గణనాథోద్భవము

 *శ్రీ గణనాథోద్భవము!* మూలం: శ్రీ శివ మహాపురాణం!

                               ☘️🌷🙏🌷☘️

14.

 పరమేశ్వరుని గూర్చి బాలుడే మెరుగును, 

                     కనుక నాపసివాడు జనకునరసి 

ఆదిదేవా తల్లి యాన లేకున్నచో, 

                   నేను బంపగ రాదు లోనికనుచు                        స్నానమాడగ తల్లి సన్నద్ధు రాలయ్యె, 

                 నెచ్చోట కేగంగ నెంచి నావు, 

తొలగిపొమ్ము వలదు దోరభూమిని వీడి 

                యనుచు నడ్డు నిలువ నలిగి శివుడు!

తే.గీ.

ఎవరి ననుకొంటి వీవు నన్నెరుగలేక, 

నడ్డగించితి వీరీతి ననుచు,.భవ్య 

కీశుడను ద్రుంతునిన్నిదే యేన నంగ! 

శివగణంబులు బాలకు చెంతజేరె!!


భావము: వచ్చినవాడు పరమేశ్వరుడని ఆబాలునకెట్లు

తెలియును.అందుచే తండ్రిని జూచి కూడా ఆదిదేవా!నాతల్లి యనుజ్ఞ లేకుండా నిన్ను లోనికి పంప కూడదు, స్నానము చేయుటకు అమ్మ సిద్ధమైనది. నీవెచ్చటకు వెళ్ళదలచితివి. ఈ ద్వారా ప్రదేశమునుండి వెడలి పొమ్ము అని అడ్డునిలువగా కోపించి శివుడు నేనెవరినో తెలియక ఈవిధముగా అడ్డగించిన నిన్ను సంహరించెదనని పలుకగా శివగణములా బాలుని వద్దకు చేరెను.

క్రొత్తపలుకు-13

 క్రొత్తపలుకు-13 

చదువవలయు కోరి చదువుల మర్మమ్ము 

చదువవలయు లోకజనుల విధము 

చదువవలయు మిత్రసౌహార్ద్రదఘ్నతన్ 

చదువకున్న చేటు జరుగగలదు 



క్రొత్తపలుకు-14 

స్నేహమధురఫలము సేవింప ధన్యత 

జీవితమున కలుగు చింత దొలగు 

స్నేహితుడిని మించు నీ హితు డెందున 

దొరకబోడు వెదుక ధరణిలోన 

*~శ్రీశర్మద*

భక్తి బయటకి కనిపించకూడదు.*

 *భక్తి బయటకి కనిపించకూడదు.*


జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ వారు అచంచలమైన భక్తి కల ఒక భక్తుని ఇంటికి అతని ప్రార్ధన మీద వేంచేశారు. స్వామివారి రాక సందర్భంగా ఆ భక్తుడు అతని ఇంట్లో పూజా గదిని అద్భుతంగా అలంకరించారు. ఆ భక్తుడు గురువుగారిని ఆ పూజ గదికి తీసుకెళ్లాడు.ఆ పూజా గదిని చూచి గురువుగారు ఇలా అన్నారు.

H.H: మీ పూజ గది బహు చక్కగా నిర్వహించడమేకాదు, చక్కగా అందంగా అలంకరించబడి ఉంది.

అతను: అవును స్వామి, మీ పవిత్రమైన పాదాలు మా ఇంటిని, ఈ పూజాగదిని పవిత్రం చేస్తాయని నిన్ననే మా కుటుంబం మొత్తం ఈ పూజాగదిపై శ్రద్ధగా పని చేశాము.

H.H : (ఆశ్చర్యకరమైన స్వరంతో) ఓహ్,అలాగా. ఈ పూజాగది, మీ నివాసం ప్రతిరోజూ ఇలా కనిపించదా..? లేదా?

అతను : లేదు, ఎంతో పవిత్రమైన మీ పాదాస్పర్శ, మీ సందర్శనకు గుర్తుగా ఈ పూజాగది, ఇల్లు శుభ్రం చేయబడి, ఇలా అలంకరించబడింది.

H.H : (నవ్వుతూ) కాబట్టి, మీ దృష్టిలో గురువుల యొక్క భౌతిక ఉనికి మాత్రమే మీకు నిజమైన ఉనికిని సూచిస్తుంది అన్నమాట, అంతేకానీ గురువుగారి ఛాయాచిత్రాలు కేవలం కాగితం ముక్కలుగా పరిగణించబడతాయి. ఔనా?

అతను : (వణుకుతూ) నేను క్షమాపణలు కోరుతున్నాను, గురూజీ, నా అజ్ఞానానికి...

H.H: చింతించకండి. నా పట్ల మీకున్న భక్తి గురించి నాకు ఎటువంటి సందేహం లేదు. అయితే, ఇప్పుడు న రాక సందర్భంగా కనిపిస్తున్న భక్తిని మీ రోజువారీ చర్యగా మీరు అలవాటుచేసుకున్నట్లయితే, మీరు గురువుల అనుగ్రహాలు పొందుతారు. *‘నా గురువు ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు’* అనే భావన (వైఖరి) ఒకరిని ఉద్ధరించేది అనే విషయం గుర్తుంచుకోండి. మిమ్మల్ని భగవంతుడు శ్రీ శారదాంబా సదా అనుగ్రహించుగాక అంటూ... భక్తుడిని వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ, ఎంతో అర్ధం స్ఫూరించేలా జగద్గురువులు ఆ ఇంటి నుంచి పయనమయ్యారు.

శాశ్వత చిరునామా

*శాశ్వత చిరునామా అంటే ఏమిటి.....???*

*రచించినది శ్రీమతి. నిర్మలా సీతారామన్.*


*చాలా ఆలోచింపజేసేది!*


తిరుచిరాపల్లిలోని మా ఉమ్మడి కుటుంబం ఇంటిలో 5 నుండి 95 సంవత్సరాల వయస్సు వరకు 14 మంది ఉండేవారు. పిల్లలు, మనుమలు, తాతయ్యలు,  అమ్మమ్మలు. కానీ ఈరోజు, మా అమ్మ ప్రతిరోజు గంటల తరబడి చూసుకునే మా అమ్మ తోటను ప్రకృతి ఆధీనంలోకి తీసుకోవడం, పూర్వీకుల ఇళ్లు రెండూ వదిలివేయడం నేను చూస్తున్నాను. జామున్, డ్రమ్‌స్టిక్, కొన్ని వేప మరియు పీపాల్ మనుగడలో ఉన్నాయి, కానీ అందం అంతా అస్థిరమైనది మరియు పెళుసుగా ఉంటుంది మరియు ఎంట్రోపీ యొక్క చట్టం శక్తివంతమైనది. అసంఖ్యాక రంగుల సుందరమైన పువ్వులు అన్నీ పోయాయి. రోజూ వచ్చి మా అమ్మ చేతి నుంచి తిన్న ఉడుతలు, నెమలి కుటుంబం ఏమైపోయాయో అని ఆశ్చర్యపోతున్నాను. బుల్బుల్, పిచ్చుకలు, చిలుకలు, మచ్చల ఫ్లైక్యాచర్‌లు, కోకిలలు, కోతుల భారీ దళం నెలకొకసారి ఈ ప్రదేశం యొక్క క్రమాన్ని దెబ్బతీస్తాయి.


*ఒకసారి మనుషులు వెళ్లిపోతే ఇల్లు ఇల్లు అవుతుంది*.


*మొదట్లో, నాకు అమ్మాలని అనిపించలేదు మరియు ఇప్పుడు వెళ్లాలని అనిపించడం లేదు. కాలం తన పద్నాలుగు మందిలో పది మందిని తీసుకువెళ్లింది.* 


నేను మా చుట్టుపక్కల చుట్టూ తిరుగుతున్నాను మరియు ఒకప్పుడు జీవితంతో నిండిన చాలా ఇళ్లలో ఇదే విధమైన విధిని చూస్తున్నాను, ఇప్పుడు పిల్లలు వేరుగా, తల్లిదండ్రులు వేరుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లు భర్తీ చేయబడ్డాయి. కాకులు మాత్రమే నిశ్చలంగా పడి ఉన్నాయి.


ఇళ్ళు కట్టుకోవడానికి మనం ఎందుకు సాగదీసి ఒత్తిడి చేస్తాం?  చాలా సందర్భాలలో, మా పిల్లలకు ఇది అవసరం లేదు లేదా అధ్వాన్నంగా ఉంటుంది, దానిపై పోరాడండి.


*భూస్వామి ఇచ్చిన అనిశ్చిత పదవీకాలంతో దేవుడు ఇచ్చిన లీజు జీవితంలో అపార్ట్‌మెంట్‌ల శాశ్వత యాజమాన్యం కోసం ప్రయత్నించడం ఈ మానవ మూర్ఖత్వం ఏమిటి, దీని నిబంధనలు చర్చించలేనివి మరియు అప్పీల్ కోర్టు లేనివి*


ఏదో ఒక రోజు మనం ప్రేమతో కట్టుకున్న ఇళ్లు కూల్చివేయబడతాయి, పోట్లాడుతాం, అమ్ముకుంటాం లేదా శిథిలావస్థలో పడిపోతాయి. 


నేను _'శాశ్వత చిరునామా'_ కోసం అడిగే ఫారమ్‌ను నింపిన ప్రతిసారీ నేను మానవ మూర్ఖత్వాన్ని చూసి నవ్వుతాను. 


ఒక జెన్ కథనం ప్రకారం, ఒక ముసలి సన్యాసి రాజు యొక్క ప్యాలెస్‌లోకి వెళ్లి ఈ సత్రంలో రాత్రి గడపాలని కోరాడు మరియు కాపలాదారులు అతనితో, “ఏం ఇన్నా? మీరు దాని రాజభవనాన్ని చూడలేదా?" సన్యాసి అన్నాడు “నేను కొన్ని దశాబ్దాల క్రితం ఇక్కడికి వచ్చాను. అక్కడ ఎవరో బస చేశారు. కొన్ని సంవత్సరాల తరువాత, మరొకరు అతని నుండి సింహాసనాన్ని తీసుకున్నారు, తరువాత మరొకరు. నివాసి మారుతున్న ప్రదేశమేదైనా సత్రమే.”


జార్జ్ కార్లిన్ *"మీరు బయటకు వెళ్లి మరిన్ని వస్తువులను పొందేటప్పుడు మీ వస్తువులను ఉంచే స్థలం మాత్రమే ఇల్లు" అని చెప్పారు.* 


ఇళ్లు పెద్దవుతున్న కొద్దీ కుటుంబాలు చిన్నవి అవుతున్నాయి. *ఇంట్లో నివాసితులు ఉన్నప్పుడు, మేము గోప్యతను కోరుకుంటాము మరియు గూడు ఖాళీ అయినప్పుడు, మేము కంపెనీ కోసం ఆరాటపడతాము.* 


పక్షులు మరియు జంతువులు తమ కలల ఇంటిని నిర్మించుకోవడం కోసం జీవించడం మానేసి, చివరికి, శాశ్వత నివాసంగా తప్పుగా భావించిన సత్రాన్ని విడిచిపెట్టే మానవులమైన మనల్ని చూసి నవ్వుతూ ఉండాలి.


*మానవ కోరిక యొక్క అసలైన మూర్ఖత్వం!*

ధర్మం

 🚩నా భారతీయ సాంప్రదాయం 🙈ధర్మం 🔱ప్రతి రోజు అనాది కాలం నుండి,

లక్షల క్రితం నుండి 

వేద ఋషులు, పండితులు,

మాకు చదువు చెప్పిన గురువులు, మాకు ప్రతి

నిత్యం ఇంట్లో కూడా

మాతృదేవోభవః👏🏻

పితృ దేవోఃభవః👏🏻

ఆచార్య దేవోఃభవః 👏🏻

అతిథి దేవోఃభవః 👏🏻

ఇప్పుడు 

పకృతి దేవోభవః

ఇది నా భారతదేశ సనాతనమైన 

సంప్రదాయ సంస్కారం

నాకు  నేర్పింది.

కుచేలుని కి శ్రీ కృష్ణునికి

లాంటి  మితృలు ఈ కాలంలో ఎంతమంది ఉన్నారో ❓

ఈ దినోత్సవం పాశ్చాత్య దేశాల్లో సంవత్సరానికి ఒక సారి తమ చిన్న నాటి స్నేహితులు ఈ రోజు కలుసు కుంటారు.🐄🐿️

తల్లి తండ్రుల దినోత్సవాలు వస్తాయి.

ఇది మన సంస్కారం కాదు.

అక్క చెల్లె కాళ్ళు కూడా మొక్కతాం.

మన ఇంటి ఆడబిడ్డ అని గౌరవిస్తాం.

ఈలాంటి సంప్రదాయం ఏ దేశాల్లో కూడా లేదు.

మనం పెంచే భూతాలను కూడా పూజిద్దాం.

లేవగానే భూమాత కు

వందనం 🙏🏻

ఆదిత్యునికి వందనాలు 🙏🏻

తర్వాత జలబింధువులకు మంత్ర హుచ్చరణతో 

నమస్కారం 👏🏻

తులిసి వృక్ష జాతికి వందనం👏🏻

గిరులకు పర్వతాలకు వందనాలు.

ఈలాంటి సాంస్కృతిక విద్యా చిన్నారి పిల్లలకు నేర్పాలి.

ఇదియే నా భారతీయత🎺👏🏻

నారదుడు విష్ణువు

 🏵️☘️🏵️☘️🏵️☘️🏵️

ఒకసారి నారదుడు విష్ణువును అడిగాడు " మీ భక్తులు ఎందుకు పేదవారుగా ఉంటారు ?" అప్పుడు విష్ణువు చెప్పాడు - "నారదా, నా కృపను అర్థం చేసుకోవడం చాలా కష్టం."


ఇలా చెబుతూ, విష్ణువు నారదునితో పాటు సాధువు వేషంలో భూమిపైకి వచ్చి భిక్ష అడగడానికి ఒక ధనికుడి ఇంటి తలుపు తట్టారు. . ధనికుడు కోపంగా తలుపు వైపు వచ్చి, అక్కడ నిలబడి ఉన్న ఇద్దరు సాధువులను చూశాడు. సాధు వేషంలో ఉన్న విష్ణువు అన్నాడు - "స్వామి నాకు చాలా ఆకలిగా ఉంది. మాకు భోజనం పెట్టించండి "


ధనికుడు కోపంగా, "ఎద్దుల్లాగున్నారు, పని చేసుకుని తినండి " అని వాకిలి వేసేశాడు. నారదుడు అన్నాడు - "చూడండి ప్రభూ! ఇతను నీ భక్తులను మరియు నిన్ను అగౌరవపరిచే వ్యక్తి. ఇప్పుడే అతన్ని శపించండి."


నారదుని మాటలు విన్న దేవుడు ఆ వ్యాపారవేత్తకు మరింత సంపదను ప్రసాదించాడు


. దీని తర్వాత, విష్ణువు నారదున్ని ఒక వృద్ధురాలి ఇంటికి తీసుకెళ్లాడు. ఆమెకు ఒక చిన్న గుడిసె ఉంది, అందులో ఆవు తప్ప మరేమీ లేదు. భగవంతుడు భిక్ష అడగగానే ఆ వృద్ధురాలు ఎంతో సంతోషంతో బయటకు వచ్చింది. సాధువులిద్దరినీ ఒక ఆసనంలో కూర్చోబెట్టి, వారికి తాగడానికి పాలు తెచ్చి - "ప్రభూ! నా దగ్గర ఇంకేమీ లేదు, దయచేసి దీనిని సేవించండి." అన్నది.


. విష్ణువు ఎంతో ప్రేమతో దానిని అంగీకరించాడు. అప్పుడు నారదుడు భగవంతునితో ఇలా అన్నాడు - "ప్రభూ! ఈ లోకంలో నీ భక్తుల కష్టాలు చూడు, . ఈ పేద వృద్ధురాలు నీ భజనలు పాడుతుంది మరియు అతిథులను కూడా ఆదరిస్తుంది. దయచేసి ఆమెకు మంచి సంపదను ఇవ్వండి."


కాసేపు ఆలోచించిన తరువాత, విష్ణువు ఆమె ఆవును చనిపోవాలని శపించాడు.


అది విన్న నారదుడు కోపంతో ఇలా అన్నాడు - "ప్రభూ మీరు ఏమి చేసారు?"


విష్ణువు అన్నాడు - "ఈ వృద్ధురాలు మహా భక్తురాలు . కానీ ఆమెకు ఆమె ఆవు మీద మోహం ఉన్నది. ఆమె కొన్ని రోజుల్లో చనిపోతుంది. చనిపోతుండగా, ఆమె తన ఆవు గురించి ఆందోళన చెందుతుంది. దీనివలన ఆమె మరుజన్మలో ఆ అవుకు దూడ అయి జన్మిస్తుంది. కానీ ఆ ఆవు చనిపోతే ఆమెకు ఉన్న ఏకైక బంధం వీడి నన్ను మాత్రమే తలచి మోక్షాన్ని పొందుతుంది. కానీ ఆ ధనికుడు అజ్ఞాని. ఆతను తన దనం మీద ఉన్న అపరిమిత మొహం వల్ల మరు జన్మలో తన ధనాన్ని కాపాడే పాముగా పుడతాడు. ,.ప్రకృతి నియమం ఏమిటంటే, మనిషి ఏ వస్తువుతో అత్యంత అనుబంధంగా ఉంటాడో. అదే అతనికి మోక్ష ప్రతిబంధకం అవుతుంది"


కాబట్టి మీ ఆలోచనలను భగవంతునిపై ఎక్కువగా ఉంచండి...హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే.

🏵️☘️🏵️☘️🏵️☘️🏵️

మన స్నేహం

 🌹🌹🌹

తేదీ 04.08.2024

శీర్షిక మన స్నేహం మధురమైనది(స్నేహితుల దినోత్సవం సందర్బంగా )

కవి పేరు ప్రభాకర్ రావు గుండవరం

కలం పేరు మిత్రాజీ


మధురమైన స్నేహం లో

మమతలెన్నో దాగుండు

విడలేని బంధం స్నేహం

విడిపోని మనసే నేస్తం


ఒంటరి మనిషికి తోడే స్నేహం

చీకటిలో చిరుదీపమే స్నేహం

కష్టాల కడలిలో ఓదార్పే స్నేహం

నేనున్నాను అనే ధైర్యమే స్నేహం


కడదాక నీడలాగా

తోడు ఉండేదే స్నేహం

పచ్చని చెట్టుకు చల్లని నీటిలా

చీకటి బతుకుకు వెలుగే స్నేహం


మరువలేని మధుర జ్ఞాపకాలు

మరిచిపోని తీయని కలలు

మన నిత్య జీవితంలో కదలాడే

నిత్య వసంత రాగ శోభితలు

అందాల ఆనంద రస గీతికలు


మరిచిపోని మన స్నేహాన్ని

మళ్ళి మళ్ళీ గుర్తు తెచ్చుకో

చిననాటి చిలిపి పనులను

జీవితం అంతా నెమరువెసుకో


కలిసి పని చేసిన కాలమే

మనదై మన స్నేహ పరవళ్లే

నిజమై ఆ ఆనంద భావనే

మనసు నిండగా ఆ దేవుడే

మన స్నేహానికి తథాస్తు పలుకు 

🌹🌹🌹

ఉమామహేశ్వరులను

 శ్లోకం:☝️

*భవానీశంకరౌ వన్దే*

  *శ్రద్ధావిశ్వాస రూపిణౌ ।*

*యాభ్యాం వినా న పశ్యన్తి*

  *సిద్ధాః స్వాన్తస్తమీశ్వరమ్ ॥*

 - రామచరిత మానస


భావం: ఎవరు శ్రద్ధా మరియు విశ్వాసము యొక్క స్వరూపులో, ఎవరు లేకుండా సాధకులు తమ హృదయాలలో ఉన్న భగవంతుడిని దర్శించలేరో, జగత్తుకి మాతాపితరులైన ఆ ఉమామహేశ్వరులను నేను ఆరాధిస్తాను.🙏

కుశపురం

 


* కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్

* లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్

* తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్

* పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్

భాగవతం,మహాభారతం * మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్

* నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్

* జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్

* మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప ్రదేశ్

* శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం,

* దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా

* పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి 

తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం

* మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా

* నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్

* వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్

* నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్

* వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్

* రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్

* సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర

* హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్

* మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్

* వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర

* కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్

* మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్

* ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్

* గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా

* కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)

* పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్

* కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్,గుజరాత్

* శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్

* హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్

* విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర

* కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర

* చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్

* కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) – దాతియ జిల్లా, మధ్యప్రదేశ్

* ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర

* కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్

* పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్,సహజహంపూర్,ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్

* కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్

* జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్

* కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా

* మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్

* విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్

* శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం

* ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం

* నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం – ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్

* జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్

* కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)-ల నేపాల్ లోని తిలార్కోట్ See* బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్

* గౌతమ బుద్ధుడు పరినిర్య ాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్

_స్నేహితుల దినోత్సవం

 🌹 *_స్నేహితుల దినోత్సవం_*🌹

~~~~~~~~~~~~~~~~~~~


04/08/2024 - ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం నాడు భారతదేశం లో స్నేహితుల దినోత్సవం జరుపుకుంటారు.


శ్లో: పాపాన్నివారయతి,యోజయతే హితాయ 

గుహ్యం నిగూహతి,గుణాన్ ప్రకటీకరోతి !

ఆపద్గతం చ న జహాతి,దదాతి కాలే 

సన్మిత్రలక్షణమిదం,ప్రవదన్తి సంత:!


భావం : ఒక మంచి మిత్రుడు "పాపాన్నివారయతి"అంటే తన స్నేహితుడు చేసే పాపాలను నివారించి,

"యోజయతేహితాయ"అంటే మంచి పనుల యందు నియమిస్తాడు.

"గుహ్యంనిగూహతి"అంటే తన మిత్రుని రహస్యాలను రహస్యము గానే ఉంచుతాడు.

"గుణాన్ప్రకటీకరోతి"అనగా తన మిత్రుని సద్గునాలను నలుగురిలో ప్రకటిస్తాడు తప్ప చెడుగా చెప్పడు.

"ఆపద్గతం చ న జహాతి "అనగా ఆపత్కాలంలో తన మితున్ని వదిలి పోడు 

"దదాతి కాలే "భవిష్యత్ లో కష్ట సుఖాలలో చేయూతనన్దిస్తాడు.


ఇవి నిజమైన మన మేలుకోరే మిత్రుల లక్షణాలు.


🤝 *స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు* 🤝

చూసినప్పుడు

 *స్నేహం అనగా*


"దర్శనే స్పర్శనే వాపి

 భాషణే భావనే తథా

 యత్ర ద్రవత్యంతరంగం

స స్నేహః ఇది కథ్యతే"


ఎవరినైతే చూసినప్పుడు గాని,

స్పృశించినప్పుడు కానీ,

మాట్లాడినప్పుడు కానీ, 

మనసులో భావించినప్పుడు కానీ మనస్సు ఆహ్లాదంతో, ఆనందంతో, ఆత్మీయతతో, ఆర్ద్రతతో ద్రవిస్తుందో దానిని స్నేహం అని అంటారు.

*స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు*

విషయవాసనలు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


   *శ్లో𝕝𝕝 వనేఽపి దోషాః ప్రభవన్తి రాగిణాం* 

        *గృహేఽపి పఞ్చేన్ద్రియనిగ్రహస్తపః।*

        *అకుత్సితే కర్మణి యః ప్రవర్తతే*

        *నివృత్తరాగస్య గృహం తపోవనమ్॥*


           *... _హితోపదేశః_ …*


*తా𝕝𝕝 "విషయవాసనలు కలవారికి అడవికి వెళ్లినా కామక్రోధాదిదోషాలు సంభవిస్తాయి.... పంచేంద్రియాలను నిగ్రహించినవారు ఇంటిలో ఉన్నా తపస్సు చేయగలరు.... అనగా వారు తాపసులే....* *శాస్త్రముచే నిందింపబడని (శాస్త్రసమ్మతములైన) కర్మలు ఆచరిస్తూ విషయవాంఛలు వదిలి చరించేవాడికి ఇల్లే తపోవనమ్*."


🙏🪷 ✍️🙏

మంచి మాట

 నేటి మంచి మాట ఆది వారం.  4/8/24.             ....  1  నువ్వు నిరు పేదవని అనుకోవద్దు. మనకి శక్తిని ఇచ్చేది ధనం కాదు.మన మంచితనం,పవిత్రత,దృఢ విశ్వాసం మరియు ప్రణాళిక బద్ధమైన కృషి ఇవి మాత్రమే మన ధాన్యాగారం.

2  పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ.

3 మీ అవసరాలు,ఆనందాలు తీర్చలేదు అని తల్లి తండ్రులను తప్పు పట్టకు.ఎందుకు అంటే వారికి ఆ అవకాశం లేదు ఎమో అని ఆలోచించూ.కానీ.నీకు ఈ జన్మ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సంతోషించు.

4 ఇవాళ ఆదివారం రోజున మీరు రోడ్డు పక్కన గానీ దేవాలయాల్లో గానీ ఒక మంచి మహా వృక్షాన్ని నాటండి.

పరమేశ్వర ఆరాధన !

 


పరమేశ్వర ఆరాధన !        


             చ:  ఉనికి  శిలోచ్చయంబు , నిజయోష  శిలోచ్చయరాజ  పుత్రి ,  నీ


                   ధనువు  శిలోచ్చయంబు , పురదాహ!  రథీకృత రత్నగర్భ !  నీ 


                    మనమున  కీ  శిలాశకల  మండలమెట్లు  ప్రియంబు  సేసె?  నే


                    మనగలవాడ  నిన్ను?  వ్రతహానియొనర్చు  దురాత్ముఁడుండగన్.


                     శ్రీ కాళ హస్తీశ్వర మాహాత్మ్యము--2--ఆ :  122పద్యం:  ధూర్జటి  మహాకవి! 


                అర్ధములు:  శిలోచ్చయము-- రాళ్ళసముదాయం-పర్వతం;  నిజయోష-- భార్య ;  పురదాహ--త్రిపురములను దహించినవాడా!  రథీకృత--రథముగా చేయబడిన; రత్నగర్భ-- భూమి; శిలాశకలములు--రాతిముక్కలు:  మండలము--సముదాయము; 


                    భావము;  త్రిపురములను దహించిన ఓపరమశివా! రత్నగర్భను రథముగా నెన్నుకొనినవాడా!  నీనివాసం  రాళ్ళగుట్ట(కొండ )నీభార్యయా పర్వత రాజపుత్రి ( ఒకపెద్ద బండరాయి కూతురు)  నీకు రాళ్ళకేమి కొదవయ్యా! నీపరివారమంతా రాళ్ళేకదా? అయినా నీకీ రాతిముక్కలెలా  ప్రియమయ్యాయి స్వామీ! నిన్నని పనేమిలే  నాపూజా వ్రత భంగకారకుడుండగా!

అని భావము. 


                           ఇదియొక  గొప్పపద్యము. నిందాస్తుతితో  పరమేశ్వరారాధనము  చేయుట. వినుటకిదినింద వలేగన్పించును గాని , నిజమున కిది పరమేశ్వర తత్వమను ప్రస్తుతించుటయే. 


                               హిమవత్పర్వతమాతని నివాసమని, పరమేశ్వరుడు  మనకందనంత స్థానంలో ఉంటాడనీ భక్తితో ఆరాధిస్తే  అతని సన్నిధికి చేరగలమని  సూచిమచటమే! పర్వత రాకుమారిగా పార్వతిని పేర్కొనటం ప్రకృతి స్వరూపిణియని  చెప్పటమే! పర్వతములు

భూధరములట!- అంటే  భూభార వహన శక్తిగలవని యర్ధము. అట్టిపర్వతములకు శివుడు బంధువగుట పరోక్షముగా భూభారనిర్వహనమునకు తోడుపడుటయే.పర్వతరాజపుత్రి యతని భార్య యగుట ,సకల ప్రాణిసముదాయమునకు  మాతృరూపిణిగా సూచించుటయే!


                             రథీకృత  రత్నగర్భ!  యని సంబోధించటం  సమస్త రత్నములకు నెలవైన భూమి యతని సేవకురాలని  సూచించుట. దానివలన రత్నములకు లోటులేనివాడని భావము. ఇన్నియున్నవాడవే  నీకేమి లోటని ఆఱాతిముక్కల కాసపడితివి? అవునులే అవియన్నియు ఆలివైపు వచ్చిన ఆత్మబంధువర్గమే నాయె, నెత్తినబెట్టుకొనక యేమిచేతువు. అనిపరమేశ్వరుని  నిలదీయుట.

ఇవియన్నియు భక్తునకు భగవంతునిపైగల మమకారమునకుసూచకములు.ఇదీ ఈపద్యమునందలి చమత్కారము.


                      ఇంతకు కథాపరముగా అక్కడ జరిగినదిది. కాళము --అనగా పాము  రత్నములతో  పూజించి వెడలిన వెనుక  హస్తి వచ్చింది. అది మృగమాయె  దానికేమితెలుసు.? అవి మణులని విలువైన రత్నములని.మణులుకూడ  రాళ్ళేయగుట  రాతిముక్కలవలె 

నది భావించినది. పరమేశ్వరుని పూలతోపూజించాలిగానీ  పనికిరాని రాళ్ళతోనా? అని బాధపడి  వానిని తొలగించి పూలతో ఆకులతో పూజించి వెడలిపోతుంది. 


                                  ఈవిధంగా ఈగ్రంధంలో మృగజాతుల ఆరాధనా విశేషాలను ధూర్జటిబహు రమ్యంగా వర్ణించాడు.


                 వ్యాజ స్తుత్యలంకారం  ఈపద్యంలో  ప్రధానంగా గమనింపదగినది.


                                                                               స్వస్తి!🌷🌷🌷🙏🌷🌷🙏🌷🌷🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🕉️🕉️

ఆదివారం,ఆగష్టు4,2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హo*


ఆదివారం,ఆగష్టు4,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - గ్రీష్మ ఋతువు

ఆషాఢ మాసం - బహుళ పక్షం

తిథి:అమావాస్య మ3.59 వరకు 

వారం:ఆదివారం(భానువాసరే)

నక్షత్రం:పుష్యమి మ1.50 వరకు  

యోగం:సిద్ధి మ12.00 వరకు

కరణం:నాగవo మ3.59 వరకు

తదుపరి కింస్తుఘ్నం తె4.25 వరకు

వర్జ్యం:తె3.27 - 5.09

దుర్ముహూర్తము:సా4.46 - 5.37

అమృతకాలం:ఉ7.10 - 8.50

రాహుకాలం:సా4.30 - 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30

సూర్య రాశి: కర్కాటకం 

చంద్రరాశి ; కర్కాటకం 

సూర్యోదయం:5.42

సూర్యాస్తమయం:6.29


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*