9, సెప్టెంబర్ 2023, శనివారం

బలవంతుడి దెబ్బ కన్నా


*కం*

తెలివైన వారి ప్రహరము

బలవంతుని వేటు కన్న బలముగ తగులున్.

తెలివగువారల వొడుపులు

బలవంతులకెరుకగావు బలముగ సుజనా.

*భావం*:-- ఓ సుజనా! తెలివైన వారు కొట్టే దెబ్బ బలవంతుడి దెబ్బ కన్నా బలంగా తగులుతుంది. తెలివైన వారి ఒడుపులు అంత బలంగా బలవంతులకు అర్థం కావు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


*కం*

తక్కువ మాట్లాడునపుడు

నెక్కువ విలువొందగలరు నెక్కడనైనన్.

మక్కువ గొని మాట్లాడగ

నెక్కువ గలవిలువలెవరు నెరుగరు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! తక్కువ గా మాట్లాడటం వలన ఎక్కడ నైనా ఎక్కువగా విలువలు పొందగలరు. (మనవాళ్ళు కదా అనే) అభిమానం తో ఎక్కువగా మాట్లాడిననూ ఆ విలువలు ఎవ్వరూ తెలుసుకొనరు.

*సందేశం*:-- మన విలువ పెంచుకోవాలంటే మనవాళ్ళ దగ్గర అయినా తక్కువ గానే మాట్లాడాలి. ఒక గొప్ప వాడు ఎక్కువగా మాట్లాడితే అభిమానం అని గుర్తించక లోకువగా చూస్తారు. తక్కువ గా మాట్లాడితే విలువ లేని వారి కి కూడా అతిగా విలువలు ఇస్తారు. ఇదే జనుల సాధారణ నైజం.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

Panchaag


 

Mirchi bajji


 

Proportional motion


 

Earthing


 

Neutral control


 

Vegetable cutter


 

Vedaant


 

Ram ram


 

⚜ శ్రీ గంగామైయా మందిర్

 🕉 మన గుడి : నెం 173


⚜ ఛత్తీస్‌గఢ్ : బలోద్ ( దుర్గ్ )


⚜ శ్రీ గంగామైయా  మందిర్




💠 ఈ ఆలయం ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో ఝల్మల అనే గ్రామంలో ఉంది. 

ఛత్తీస్‌గఢ్‌లో అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ, అన్నింటికీ భిన్నమైన నమ్మకాలు ఉన్నాయి. 

అదే విధంగా ఈ గంగా మైయా ఆలయ కోరకు కూడా భిన్నమైన నమ్మకం ఉంది.


💠 ఇది చారిత్రక ప్రాధాన్యత కలిగిన మతపరమైన ప్రదేశం. 

ఈ ఆలయానికి మహిమాన్వితమైన  మరియు చాలా మంత్రముగ్ధమైన చరిత్ర ఉంది. 

వాస్తవానికి, గంగా మయ్య ఆలయాన్ని స్థానిక మత్స్యకారుడు ఒక చిన్న గుడిసె రూపంలో నిర్మించాడు. చాలా మంది భక్తులు మంచి మొత్తాన్ని విరాళంగా అందించారు, ఇది సరైన ఆలయ సముదాయంగా నిర్మించడంలో సహాయపడింది. 

ఇది బలోద్ - దుర్గ్ రహదారిపై ఉన్నందున, ఛత్తీస్‌గఢ్‌లోని ఏదైనా జిల్లా నుండి ఈ మందిరానికి చేరుకోవడానికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.


🔅 ఆలయ పురాణం 🔅


💠 ఈ ఆలయ నిర్మాణం గురించి మాట్లాడితే, ఈ ఆలయం సుమారు 100 సంవత్సరాల నాటిదని చెబుతారు. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి స్థానిక నానుడి ఒకటి ఉంది.


💠 గంగా మయ్య ఆలయం యొక్క మూలం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. స్థానికంగా ఉన్న ఒక మత్స్యకారుడు గ్రామ సమీపంలోని సరస్సులో చేపలు పట్టుతుండగా అతని వలలో ఒక  విగ్రహం కనిపించింది. 

అతను దానిని తిరిగి నీటిలో ముంచాడు, కాని విగ్రహం అతని వలలో పదే పదే వస్తూనే ఉంది. చివరకు విగ్రహాన్ని వదిలి ఇంటికి వెళ్లిపోయాడు. 


💠 అదే రోజు రాత్రి, గంగా దేవి అతని కలలో కనిపించి "మత్స్యకారులు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు మరియు నన్ను బయటకు తీసి ఏదో ఒక పవిత్ర స్థలంలో తన విగ్రహాన్ని ప్రతిష్టించమని ఆదేశించింది. 

మత్స్యకారుడు గంగా మాత ఆజ్ఞ గా భావించి ఆమె సూచనలను అనుసరించాడు. 

ఆ తర్వాత కొందరు వ్యక్తులు చెరువులోకి ప్రవేశించి ఇరుక్కుపోయిన రాయిని బయటకు తీయగా అది అమ్మవారి విగ్రహమని గుర్తించారు. 


💠 నేడు అదే ఆలయాన్ని గంగా మైయా దుర్గ్ అని పిలుస్తారు.

ఇక్కడ ఉన్న మాత విగ్రహం నీటి అడుగున దొరికిందని చెబుతారు. అందుకే దీనిని గంగా మైయా ఆలయం అని పిలుస్తారు  .

విగ్రహాన్ని మొదట్లో ఒక చిన్న గుడిసెలో ఉంచినప్పటికీ, గంగ మయ్య యొక్క భక్తి వ్యాప్తి చెందడంతో, అన్ని ప్రాంతాల నుండి విరాళాలు వెల్లువెత్తాయి, ఆలయ సముదాయం నిర్మించబడింది.


💠 తరువాత, అదే స్థలంలో భికం చంద్ తావ్రీ శాశ్వత ఆలయాన్ని నిర్మించారు. 

దీని తరువాత, ఆలయ నిర్మాణానికి ప్రత్యేకమైన డిజైన్‌ను అందించిన శ్రీ భికం చంద్ తావ్రీ ద్వారా ప్రారంభ రూపాంతరం చెందినప్పటి నుండి ఆలయం అనేక పునర్నిర్మాణ ప్రక్రియలకు లోనైంది. 


💠 భక్తులకు గంగా మైయా ఆలయాన్ని సందర్శించడానికి నిర్దిష్ట సమయం లేదు. భక్తులు మరియు ప్రయాణికులు ప్రతి రోజూ ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. ఆలయాన్ని సందర్శించడానికి నవరాత్రి పవిత్ర సమయం.


💠 ఇక్కడ గంగా ఏకాదశిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. స్థానికులు పుణ్యస్నానాలు ఆచరించి అందరికీ ప్రసాదం పంచుతారు.దీనికి మత్స్యకారులు పెద్ద ఎత్తున తరలివస్తారు


💠 అమ్మవారి దర్శనం కోసం ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ జ్యోతి కలశాన్ని ప్రతి సంవత్సరం రెండు నవరాత్రులలో మాత ఆలయంలో ఏర్పాటు చేస్తారు.


💠 నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. 

మా దుర్గా భక్తులు నవరాత్రులు జరుపుకోవడానికి ఇక్కడకు వస్తారు. నవరాత్రుల తొమ్మిది రోజులు, భక్తులు ఉపవాసం ఉండి, చెప్పులు లేకుండా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

ఆ సమయాల్లో ఆలయ సముదాయం మొత్తం లైటింగ్‌లతో అలంకరించబడి వివిధ జాతరలు మరియు పండుగలు నిర్వహించబడతాయి.


💠 ఆలయ ట్రస్ట్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది.


💠 ఆలయం ఉదయం 6 నుండి 12 గంటల వరకు తెరిచి ఉంటుంది. 

మరియు మధ్యాహ్నం 1 నుండి రాత్రి 9 వరకు.


💠 ఎలా చేరుకోవాలి : 

రైలు ద్వారా : 

సమీప రైల్వే స్టేషన్లు రాయిపూర్, బిలాస్పూర్ మరియు బలోద్ (20 కి.మీ).


 

©మమ

వృద్ధాప్యమా

 వృద్ధాప్యమా వర్ధిల్లు.


60 దాటారంటే మీరు చాలా అదృష్టవంతులు* ఎందుకంటే 100 కి 11 మంది మాత్రమే 60 దాట గలుగుతున్నారు. ఏడు మంది మాత్రమే 65 దాటి 70 చేర గలుగు తున్నారు.

 మీరు ఆనందంగా ఉండడానికి పది చిట్కాలు


 1. దప్పిక అనిపించినా లేకున్నా *నీరు తాగుతూ ఉండాలి*. రోజు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి.


 2. ఆడతారో, తిరుగుతారో, నాట్యం చేస్తారో మీ ఇష్టం కదులుతూ ఉండండి. లేకపోతే కీళ్ల న్నీ బిగుసుకుపోతాయి .


3 . బ్రతకడానికి తినండి తినటానికి బ్రతకకండి పిండి పదార్థాలు బాగా తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పోషకాహారం తినండి. ముఖ్యంగా *రాత్రిపూట పిండి పదార్థాలు బాగా తగ్గించాలి*.


 4. *వీలైనంత వరకు నడవండి* లేదా సైక్లింగ్ చేయండి 100 నుంచి 200 మీటర్ల దూరం వాహనం వాడకండి, నడవండి. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఎలివేటర్ వాడొద్దు రైల్వేస్టేషన్లలో ఎస్క లేటర్లు వాడొద్దు వాహనాలు వాడొద్దు. *మెట్లు ఎక్కండి రాంప్ పై నడవండి*.


 5. కోపం తగ్గించండి. తక్కువ మాట్లాడండి. మీ నివాస ప్రాంతంలో *" కోప నిషేధ స్థలం "* బోర్డు పెట్టండి. అది మీకు కోపం రాకుండా ఉంచుతుంది. మీ చుట్టూ ఉన్నవారికి కూడా గుర్తు చేస్తూ ఉంటుంది.


 6. ధనం పై వ్యామోహం వదిలిపెట్టండి జీవనానికి అవసరమైనంత వరకు మాత్రమే సంపాదించాలి డబ్బు వెంట మీరు పరిగెత్తకండి డబ్బు మీ వెంట పరిగెత్తాలి .


7 మీరు కోరుకున్నది దక్కకపోతే బాధపడకండి. నిన్ను నీవు దూసించుకో వద్దు. దానిని మర్చిపోండి.


8 *డబ్బు, తెలివి, సౌందర్యం, అధికారం, కులం, పదవి వీటి వల్ల అహంకారం పెరుగుతుంది*. దీనిని *వదిలిపెట్టాలి* దీనికోసం పై వాటిపై నియంత్రణ సాధించాలి‌. వినయంగా ప్రజలతో ప్రేమగా ఉండాలి. ఆనందంగా నవ్వుతూ గడపాలి అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావు.


 9. తెల్ల జుట్టు గురించి ఆందోళన వద్దు. *కాళ్



ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి మరియు IMPACT FOUNDATION చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి


https

Om namaaivay


 

Sculpture


 

Self defense


 

Purnarupa


 

Road wenndor


 

Automatic


 

Tiger bathing


  

Old sculpture


 

నవగ్రహా పురాణం🪐* . *20వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *20వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*చంద్రగ్రహ జననం - 2*


శీలవతి చీర కట్టడం ముగించి , పైట సర్దుకుంది. నుదురు మీద బొట్టు పెట్టుకుంది. భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఎవరో ముత్తైదువ దానం చేసిన పువ్వుల్ని జడలో దోపుకొంటోంది. *"ఎక్కడ ఏడుస్తున్నావ్ ?"* భర్త ఉగ్రశ్రవుడి కంఠంలో ఆగ్రహం ఆమెకు చెంపపెట్టులా తాకింది.


*"వస్తున్నా స్వామీ !”* అంటూ , మాట వెంటే భర్త ఉన్న చోటికి పరుగెత్తింది శీలవతి. గుడిశ మూలలో కుక్కి మంచం మీద కూర్చున్న ఉగ్రశ్రవుడు శీలవతిని ఎగాదిగా చూశాడు.


*"ఏమిటే... చీరకట్టి , పువ్వులు పెట్టి సింగారించుకున్నావ్ ? ఎవడు చూడాలనే ? ఉగ్రశ్రవుడు ఉరిమాడు.


*"అదేమిటి స్వామీ , అలా అంటారు ? భిక్ష కోసం వీధి వీధి తిరిగాం కదా.. కట్టుకున్న వస్త్రాలు చెమటతో తడిసిపోయాయి. చెమట వాసన మీరు భరించలేరు. అందుకని స్నానం చేసి...”*


*“చాలు !"* ఉగ్రశ్రవుడు కసిరాడు. *"ఆకలి మండిపోతోంది ! మాటలతోనే కడుపు నింపేస్తావా ఏమిటి ? పిడికెడు తిండి పడేస్తావా లేదా ?”*


*"ఒక్కక్షణం. దీపం వెలిగించి... భోజనం పెట్టేస్తాను."* అంటూ శీలవతి వెనుతిరిగి వెళ్ళింది.


ఉగ్రశ్రవుడు బుసలు కొడుతూ కూర్చున్నాడు. శీలవతి క్షణంలో వచ్చింది. ఆమె చేతిలో పట్టుకున్న చిన్న ప్రమిదలో దీపం వెలుగుతోంది. గాలి తాకకుండా ఒక అరచేతిని ఆమె దీపకళికకు రక్షణగా పట్టుకుంది.


ఉగ్రశ్రవుడు ఆమెనే చూస్తున్నాడు. ప్రమిదలో దీపకళిక గాలితాకిడికి స్పందిస్తూ , శీలవతి మొహానికి వెలుగుల్ని అద్దుతోంది. కోలమొహం మీద దోబూచులాడుతున్న దీపం వెలుతురు శీలవతి అందాన్ని హెచ్చవేత వేస్తోంది. ప్రమిదను పట్టుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తున్న శీలవతి మేఘాల మీద అలవోకగా నడుస్తున్న అప్సరసలా ఉంది..


శీలవతి మూలలో ఉన్న పెద్దదీపాన్ని వెలిగించి , భర్త వైపు నడుస్తోంది. అలంకారం. లేకుండా అతి నిరాడంబరంగా ఉన్న ఆమె సన్నటి శరీరం తగుమాత్రం ఆకులున్న లేత వయసు తీగలా ఉంది. చేతిలోని ప్రమిదలో స్పందిస్తున్న దీపకళిక కాంతి కిరణాలతో శీలవతి ముఖాన్ని పుణుకుతోంది.


ఆమెనే చూస్తున్న ఉగ్రశ్రవుడు రౌద్రంగా నిట్టూర్చాడు. యవ్వనంలో ఉన్న తన భార్య సౌందర్యవతే ! సందేహం లేదు ! అయితే ఆమెలోని భక్తి , రక్తిని మింగేసింది. వినయమూ , విధేయతా వలపునీ , వయ్యారాన్నీ చంపేశాయి. భార్య భక్తిని కుమ్మరిస్తే చాలదు. వలపుని వొలకబోయాలి. తాళికట్టిన నాటి నుండీ ధర్మపత్నిని ద్వేషించుకుంటున్న ఉగ్రశ్రవుడు కసిగా అనుకున్నాడు.


ప్రమిదను భర్తకు దగ్గరగా ఉంచి , తిరిగి వెళ్ళి , క్షణంలో అన్నపాత్రతో వచ్చింది. శీలవతి. ఉగ్రుడు ఆశగా , ఆకలిగా కంచంలోని పదార్థాలను చూశాడు. చక్కగా కలుపుకుని , నోటినిండుగా పెద్ద పెద్ద ముద్దలు కూరుకుంటూ , వేళ్ళు చీకుతూ , లొట్టలు వేసుకుంటూ తినాలనిపిస్తోం అతనికి ! కానీ తనకి ఆ అదృష్టం లేదు ! పాపిష్ఠి కుష్ఠుతో వేళ్ళన్నీ కుళ్ళిపోయాయి.


శీలవతి వేళ్ళు భర్త నోటికి అన్నం ముద్దను అందించాయి.


*"పెద్ద ముద్దలు పెట్టలేవా ఏమిటి ?"* అన్నం ముద్దను నములూ అరిచాడు. ఉగ్రశ్రవుడు. *"నా నోట్లో ఇంత కుక్కి దాచుకుని ఆరగించాలనుకుంటున్నావా ?”*


శీలవతి చిన్నగా నవ్వింది. *"ప్రతి పూటా ఇలాగే అంటారు ! మీ ఆకలి పూర్తిగా తీరితే గానీ , నాకు ఆకలి వేయదు , స్వామీ !” "పెట్టు , పెట్టు ! కొంచెం పెద్ద ముద్ద నోటికి అందించి ఏడు !"* ఉగ్రశ్రవుడు

కసిరాడు.


భార్య తినిపించే అన్నం తింటూ , ఆమెను తిట్టే తిట్లను ఆనందంగా నంజుకుంటూ ఉగ్రశ్రవుడు తృప్తిగా భోజనం ముగించాడు.


*"అయిపోయిందా, ఉందా ?"* కసిరినట్లు అడిగాడతను.


*“అయిపోయింది స్వామీ... ఇవ్వాళ భిక్ష తక్కువగానే దొరికింది...”* శీలవతి నొచ్చుకుంది. 


*"దరిద్రపు మొహం ! అడుగుపెట్టావు నా జీవితంలో. అప్పట్నుంచీ అరకడుపే !”* అంటూ ఆగి , బ్రేవ్ మంటూ తేన్చాడు ఉగ్రశ్రవుడు.


శీలవతి మాట్లాడకుండా పళ్ళెం తీసుకుని వెళ్లింది. 


*"పడుకోండి ! కాళ్లు నొక్కుతాను !"* తిరిగి వచ్చిన శీలవతి అంది.


ఉగ్రశ్రవుడుగుడ్లురిమాడు. *“ఏమిటే తొందర ? ఈ రోగిష్ఠివాణ్ణి త్వరగా నిద్రపుచ్చి , వెన్నెల్లో విహరిద్దా మనుకుంటున్నావా ?”*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

⚜ శ్రీ గంగామైయా మందిర్

 🕉 మన గుడి : నెం 173


⚜ ఛత్తీస్‌గఢ్ : బలోద్ ( దుర్గ్ )


⚜ శ్రీ గంగామైయా  మందిర్



💠 ఈ ఆలయం ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో ఝల్మల అనే గ్రామంలో ఉంది. 

ఛత్తీస్‌గఢ్‌లో అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ, అన్నింటికీ భిన్నమైన నమ్మకాలు ఉన్నాయి. 

అదే విధంగా ఈ గంగా మైయా ఆలయ కోరకు కూడా భిన్నమైన నమ్మకం ఉంది.


💠 ఇది చారిత్రక ప్రాధాన్యత కలిగిన మతపరమైన ప్రదేశం. 

ఈ ఆలయానికి మహిమాన్వితమైన  మరియు చాలా మంత్రముగ్ధమైన చరిత్ర ఉంది. 

వాస్తవానికి, గంగా మయ్య ఆలయాన్ని స్థానిక మత్స్యకారుడు ఒక చిన్న గుడిసె రూపంలో నిర్మించాడు. చాలా మంది భక్తులు మంచి మొత్తాన్ని విరాళంగా అందించారు, ఇది సరైన ఆలయ సముదాయంగా నిర్మించడంలో సహాయపడింది. 

ఇది బలోద్ - దుర్గ్ రహదారిపై ఉన్నందున, ఛత్తీస్‌గఢ్‌లోని ఏదైనా జిల్లా నుండి ఈ మందిరానికి చేరుకోవడానికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.


🔅 ఆలయ పురాణం 🔅


💠 ఈ ఆలయ నిర్మాణం గురించి మాట్లాడితే, ఈ ఆలయం సుమారు 100 సంవత్సరాల నాటిదని చెబుతారు. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి స్థానిక నానుడి ఒకటి ఉంది.


💠 గంగా మయ్య ఆలయం యొక్క మూలం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. స్థానికంగా ఉన్న ఒక మత్స్యకారుడు గ్రామ సమీపంలోని సరస్సులో చేపలు పట్టుతుండగా అతని వలలో ఒక  విగ్రహం కనిపించింది. 

అతను దానిని తిరిగి నీటిలో ముంచాడు, కాని విగ్రహం అతని వలలో పదే పదే వస్తూనే ఉంది. చివరకు విగ్రహాన్ని వదిలి ఇంటికి వెళ్లిపోయాడు. 


💠 అదే రోజు రాత్రి, గంగా దేవి అతని కలలో కనిపించి "మత్స్యకారులు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు మరియు నన్ను బయటకు తీసి ఏదో ఒక పవిత్ర స్థలంలో తన విగ్రహాన్ని ప్రతిష్టించమని ఆదేశించింది. 

మత్స్యకారుడు గంగా మాత ఆజ్ఞ గా భావించి ఆమె సూచనలను అనుసరించాడు. 

ఆ తర్వాత కొందరు వ్యక్తులు చెరువులోకి ప్రవేశించి ఇరుక్కుపోయిన రాయిని బయటకు తీయగా అది అమ్మవారి విగ్రహమని గుర్తించారు. 


💠 నేడు అదే ఆలయాన్ని గంగా మైయా దుర్గ్ అని పిలుస్తారు.

ఇక్కడ ఉన్న మాత విగ్రహం నీటి అడుగున దొరికిందని చెబుతారు. అందుకే దీనిని గంగా మైయా ఆలయం అని పిలుస్తారు  .

విగ్రహాన్ని మొదట్లో ఒక చిన్న గుడిసెలో ఉంచినప్పటికీ, గంగ మయ్య యొక్క భక్తి వ్యాప్తి చెందడంతో, అన్ని ప్రాంతాల నుండి విరాళాలు వెల్లువెత్తాయి, ఆలయ సముదాయం నిర్మించబడింది.


💠 తరువాత, అదే స్థలంలో భికం చంద్ తావ్రీ శాశ్వత ఆలయాన్ని నిర్మించారు. 

దీని తరువాత, ఆలయ నిర్మాణానికి ప్రత్యేకమైన డిజైన్‌ను అందించిన శ్రీ భికం చంద్ తావ్రీ ద్వారా ప్రారంభ రూపాంతరం చెందినప్పటి నుండి ఆలయం అనేక పునర్నిర్మాణ ప్రక్రియలకు లోనైంది. 


💠 భక్తులకు గంగా మైయా ఆలయాన్ని సందర్శించడానికి నిర్దిష్ట సమయం లేదు. భక్తులు మరియు ప్రయాణికులు ప్రతి రోజూ ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. ఆలయాన్ని సందర్శించడానికి నవరాత్రి పవిత్ర సమయం.


💠 ఇక్కడ గంగా ఏకాదశిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. స్థానికులు పుణ్యస్నానాలు ఆచరించి అందరికీ ప్రసాదం పంచుతారు.దీనికి మత్స్యకారులు పెద్ద ఎత్తున తరలివస్తారు


💠 అమ్మవారి దర్శనం కోసం ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ జ్యోతి కలశాన్ని ప్రతి సంవత్సరం రెండు నవరాత్రులలో మాత ఆలయంలో ఏర్పాటు చేస్తారు.


💠 నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. 

మా దుర్గా భక్తులు నవరాత్రులు జరుపుకోవడానికి ఇక్కడకు వస్తారు. నవరాత్రుల తొమ్మిది రోజులు, భక్తులు ఉపవాసం ఉండి, చెప్పులు లేకుండా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

ఆ సమయాల్లో ఆలయ సముదాయం మొత్తం లైటింగ్‌లతో అలంకరించబడి వివిధ జాతరలు మరియు పండుగలు నిర్వహించబడతాయి.


💠 ఆలయ ట్రస్ట్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది.


💠 ఆలయం ఉదయం 6 నుండి 12 గంటల వరకు తెరిచి ఉంటుంది. 

మరియు మధ్యాహ్నం 1 నుండి రాత్రి 9 వరకు.


💠 ఎలా చేరుకోవాలి : 

రైలు ద్వారా : 

సమీప రైల్వే స్టేషన్లు రాయిపూర్, బిలాస్పూర్ మరియు బలోద్ (20 కి.మీ).


 

©మమ

Siva


 

Ship


 

Increase speed


 

Tirumal thirtham


 

Sports


 

M


 

Srilalahastiswara

 


ఇది కధ కాదు



 ఇది కధ కాదు. బ్రిటిష్ కాలంలో మధురై డిస్ట్రిక్ట్ కి పీటర్ అనే వ్యక్తి కలెక్టర్ గా ఉండేవారు. ఆయన ఆఫీస్ కి ఇంటికి మధ్యలోనే మీనాక్షి అమ్మవారి టెంపుల్. పీటర్ ప్రతిదినం తన కార్యాలయానికి అమ్మవారి దేవాలయం ముందరనుండి తన గుర్రంమీద వెళ్లేవారు. అలా వెడుతున్న సమయంలో పీటర్ తన కాళ్లకున్న చెప్పులు తీసి గుర్రం దిగి నడచి వెళ్లేవారు భక్తిగా. ఒకసారి రాత్రి ఉరుములు మెరుపులతో పెద్ద గాలితో వర్షం కురుస్తోంది. పీటర్ తన ఇంట్లో పడుకుని ఉండగా పెద్ద శబ్దం వినిపించి ఉలిక్కిపడి లేవగానే, ఎదురుగా ఒక స్త్రీ వంటినిండా బంగారు ఆభరణాలతో నిలుచుని ఉంది. పీటర్, ఎవరమ్మా నువ్వు అని అడుగుతుండగానే ఆ స్త్రీ బయటకు వెళ్ళిపోతూ, రా రా అని పీటర్ ను బయటకు పిలిచి, కనీసం కాళ్లకు పాదరక్షలు కూడా లేకుండా ఆ జోరు వర్షంలోనే వడి వడిగా నడుస్తూ కొంతదూరంలో అదృశ్యమవడం, ఇంటి నుంచి బయటకు వచ్చిన పీటర్ గమనించి వెనుతిరిగిన మరుక్షణంలోనే, అతని నివాసం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నిర్ఘాంత పోయిన పీటర్ కొద్దిసేపటికి తేరుకుని, ఆ అర్ధరాత్రి వచ్చి తనను బయటకు పిలిచి ఈ ఘోరాపద నుండి కాపాడినది, సాక్షాత్తు ఆ మధుర మీనాక్షి అమ్మవారే అని గ్రహించి చేతులెత్తి నమస్కరించిన కలెక్టర్ పీటర్ ఆ మరునాడు భక్తితో ఆలయానికి వెళ్లి అర్చకులను సంప్రదించి, రాత్రి జరిగిన ఆ ఉదంతాన్ని వారికి తెలియ చేస్తూ, అయ్యా రాత్రి నాకు దర్శనమిచ్చిన మీనాక్షి అమ్మవారి కాళ్లకు పాదరక్షలు లేవని గమనించాను. నేను అమ్మవారికి బంగారు పాదరక్షలు బహుమతిగా ఇవ్వదలిచాను. మీరు అంగీకరించి నాకు ఈ అవకాశాన్ని ఇవ్వగలరు అని వారి అంగీకారంతో 412 రూబీస్, 72 ఎమిరాల్డ్స్, 80 డైమండ్స్ తోవజ్ర వైడూర్య సహితమైన అత్యంత విలువైన స్వర్ణ పాదుకలను ఆ మధుర మీనాక్షి తల్లికి సమర్పించారు కలెక్టర్ పీటర్. "పీటర్ పాదుకలుగా" పిలువబడే ఆ పాదుకలను ఇప్పటికీ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏటా జరిగే "చిత్ర ఫెస్టివల్" సందర్భాన అమ్మవలారి ఉత్సవ మూర్తి పాదాలకు అలంకరించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఆనాడు సత్య తార్కాణంగా జరిగిన ఈ సన్నివేశం, అన్య మతస్థుడైనా, భగవంతునిపై ఆయనకున్న భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిపోయింది.


అపూర్వమైన సందేశం పంపిన వారికి ధన్యవాదములు

ఎంతసంపాదించిననూ

 *1896*

*కం*

ఎంతటి సిరులార్జించిన

చింతలనీవుండునపుడు చెంతన నిలువన్

స్వాంతముగలవారుండక

యెంతటి సిరులుండి విలువ యేమిటి సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఎంతసంపాదించిననూ నువ్వు సమస్యలలో ఉన్నప్పుడు నీ తోడుండే మనస్సు (స్వాంతము) గలవారు లేకపోతే నీదగ్గర ఎంతగొప్ప సిరులు ఉండి కూడా వాటి విలువ యేమిటి!?

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

ॐ ఏడుకొండల స్వామి లీల

 ॐ  ఏడుకొండల స్వామి లీల 


1982లో కొంతకాలం..


ఉదయం 11.30 గంటల సమయంలో..

    పవిత్ర తిరుమల కొండపై కార్యకలాపాలు ఊపందుకుంటున్న వేళ..

    శ్రీవేంకటేశ్వర స్వామి భక్తుల గోవింద నామస్మరణలతో తిరుమలలోని ఏడుకొండలు మారుమోగుతున్న వేళ..

    తిరుమల ఆలయంలోని గర్భ గృహంలో ఉన్న అర్చకులందరూ శ్రీవారికి నిత్య సేవల్లో నిమగ్నమైన వేళ..

    ఆ క్షణంలో అర్చకులకిగానీ, భక్తులకుగానీ తెలియని ఒక గొప్ప విశ్వ నాటకం ప్రకృతిలో నిశ్శబ్దంగా ఆవిష్కృతమైంది.

    ఈ నాటకం తరువాత తిరుమల ఆలయ చరిత్రలో చాలా ప్రసిద్ధి చెందిన ఆర్జిత సేవకు దారితీసింది.

    ఈ రోజు లక్షలాది మంది భక్తులు ఈ ఆర్జిత సేవ కోసం సంవత్సరాల ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటారు… 


ఈ అద్భుత విశ్వ నాటకంలో భాగంగా ఆ రోజు..


    అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నివాసి అయిన షేక్ మస్తాన్ అనే ముస్లిం భక్తుడు, 

    తిరుమల ఆలయంలోని ఏడు పవిత్ర కొండలపైకి నడుచుకుంటూ వెళ్తున్నాడు.

    తిరుమలలో అడుగుపెట్టిన ఆయన నేరుగా - తిరుమల ఆలయంలోని మహా ద్వారం (ప్రధాన ద్వారం) వద్దకు వెళ్లి..  అక్కడ విధులు నిర్వహిస్తున్న అర్చకుల ముందు ఓ అసాధారణమైన అభ్యర్థనను ఉంచారు.

    అతని అభ్యర్థనతో ఆశ్చర్యపోయిన ఆలయ అర్చకులు, పవిత్ర తిరుమల ఆలయానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలను నిర్వహించే స్వతంత్ర ట్రస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఉన్నతాధికారులకు త్వరత్వరగా మార్గనిర్దేశం చేశారు. 


దీంతో రంగం టీటీడీ బోర్డు కార్యనిర్వహణాధికారి (ఈవో) కార్యాలయానికి మారింది. .


    ఆ రోజుల్లో, శ్రీ PVRK ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్..     

    అదే సమయంలో మరియు కాలంలో TTD బోర్డు కూడా ఈ స్వర్ణోత్సవ సంవత్సరాన్ని ఘనంగా మరియు సముచితంగా నిర్వహించాలని యోచిస్తోంది.

    ఇంతకుముందు అనేక రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ, వారి స్వర్ణోత్సవ సంవత్సరాన్ని చిరస్మరణీయమైనదిగా చేయడానికి వారు ఏమి చేయాలో టీటీడీ బోర్డు ఇప్పటికీ నిర్ణయించలేకపోయింది.

    టిటిడి బోర్డు గది లోపల జరుగుతున్న అటువంటి కీలకమైన సమావేశంలో - ఒక కార్యాలయ అటెండర్ గదిలోకి వెళ్లి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారికి ముస్లిం భక్తుడు తనను కలవాలనే ఉద్దేశ్యం గురించి తెలియజేశాడు. 

    ప్రసాద్ గారు, ఆ ముస్లిం భక్తుని నేరుగా బోర్డు గదిలోకి పంపమని అటెండర్‌కి చెప్పారు. 

    తద్వారా అతను త్వరగా అతనితో మాట్లాడవచ్చు మరియు టిటిడి బోర్డు యొక్క విలువైన సమావేశ సమయాన్ని చాలా వృధా చేయకుండా రెండు నిమిషాల్లో పంపవచ్చు అని అనుకొన్నారు.  

    అటెండర్ బయటకు వచ్చి, షేక్ మస్తాన్ అనే ముస్లిం భక్తుడిని బోర్డు గది లోపలికి వెళ్లి వారి EO ని కలవమని అడిగాడు. 


    మరికొద్ది నిమిషాల్లో అందరూ కలవబోతున్న ఆ ముస్లిం భక్తుడిని, 

    సాక్షాత్తూ పవిత్ర శ్రీవేంకటేశ్వరుడే పంపాడనీ, 

    అతడి అసాధారణ ప్రతిపాదన కారణంగా టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం తీసుకోబోతోందని ఆ క్షణంలో వారెవరికీ తెలియదు. 

    కొత్త సేవతో పవిత్ర భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడమే కాకుండా TTD స్వర్ణోత్సవ సంవత్సరాన్ని మరపురాని సంవత్సరంగా మారుస్తుంది.. కాలం అని ఎవరికీ అప్పుడు తెలియదు. 


సమావేశంలో ఆ భక్తుని మాటలు 


    ఆ భక్తుడు లోపలికివెళ్ళి, ముకుళిత హస్తాలతో ముందుగా బోర్డు గదిలో ఉన్న అందరినీ పలకరించాడు...

    పివిఆర్‌కె ప్రసాద్‌గారు తన అభివాదాలను చాలా సాధారణంగా అంగీకరిస్తూ, షేక్ మస్తాన్‌ని అడిగాడు,

   “మేమంతా ఇప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్‌లో ఉన్నాము.. మీరు ఎక్కడి నుండి వచ్చారు మరియు ఎందుకు నన్ను ప్రత్యక్షంగా చూడాలనుకున్నారు.. ఇంత ముఖ్యమా..??.. అలా అయితే, దయచేసి వృధా చేయకుండా నాకు తెలియజేయండి. మా సమయం చాలా ముఖ్యమైనది" అన్నారు. 


    అప్పుడు బోర్డ్ రూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తూ, 

    పవిత్ర శ్రీ వేంకటేశ్వరుని గొప్ప ముస్లిం భక్తుడు షేక్ మస్తాన్ ప్రసాద్‌తో అప్పుడు ఇలా చెప్పాడు.

   “సార్ నా పేరు షేక్ మస్తాన్.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన చిన్న వ్యాపారిని.. 

    చాలా తరాలుగా మా కుటుంబ సభ్యులు శ్రీవేంకటేశ్వర స్వామికి గొప్ప భక్తులు..

    నియమం ప్రకారం, నా కుటుంబం అంతా ప్రతిరోజూ ఉదయాన్నే శ్రీవారి ముందు నిలబడి, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పారాయణం చేస్తాం..    

    ఎలాంటి పొరపాట్లూ లేకుండా శ్రీ వేంకటేశ్వర స్తోత్రం, శ్రీనివాస ప్రపత్తి, మంగళశాసనం కూడా పారాయణం చేస్తాం.. 

    నా స్వంతంగా శ్రీనివాస గద్యాన్ని కూడా పూర్తిగా పఠించగలను. .

    సార్ ! చాలా తరాలుగా ప్రతి మంగళవారం మా ఇంట్లో, శ్రీవారికి అష్టోత్తర శత నామ పూజ (వేంకటేశ్వర స్వామికి 108 పవిత్ర నామాలు పఠించే ప్రార్థన) చేయడం మా కుటుంబంలో పవిత్రమైన ఆచారం.

    మేము వ్యక్తిగతంగా మా పెరట్లో పెంచుతున్న వివిధ రకాల పుష్పాలతో ఈ పూజను నిర్వహిస్తాము.. 

    ఈ పవిత్ర పూజా సమయంలో మేము శ్రీ వారి 108 నామాలలో,  ఒక్కొక్కదానిని పఠించిన ప్రతిసారీ, శ్రీవారి పవిత్ర పాదాల వద్ద ఒక్కొక్కటిగా ఒక పువ్వును ఉంచుతాము.


    కానీ సార్! చాలా దశాబ్దాల క్రితమే మా తాతగార తిరుమల ఆలయంలో ఇలాంటి సేవలో 108 స్వర్ణ కమలం పుష్పాలను వినియోగించేందుకు మా శ్రీవారి పవిత్ర పాదాల చెంత 108 స్వర్ణ కమలం ఉంచుతానని ప్రతిజ్ఞ చేశారు.

    ఆ రోజుల్లో మా ఆర్థిక వనరులు అంతగా లేవు కాబట్టి, మా  తాతగారు తన జీవితకాలంలో కొన్ని బంగారు కమలాలు మాత్రమే సేకరించగలిగారు. 

    అనంతరం, మా నాన్నగారు ఆ బాధ్యత తీసుకొని, మరికొన్ని చేయించగలాగారు. 108 బంగారు తామర పువ్వులు. 

    తరువాత, వారి మొక్కు తీర్చే ప్రయత్నంలో, 

    చాలా కష్టపడి ఈ గోల్డెన్ ఫ్లవర్స్ అన్నీ సంపాదించగలిగాం.. 

    వీటిలో ఒక్కో పువ్వు దాదాపు 23 గ్రాముల బరువు ఉంటుంది.

    మా పేద కుటుంబం నుండి శ్రీవారికి కానుకగా ఈ స్వర్ణ కమలాలను స్వీకరించి, 

    అష్టోత్తర శతనామ పూజ లేదా మరేదైనా సేవ సమయంలో ఆయన కమల పాదాల వద్ద ఉంచి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ ఇప్పుడు ముకుళిత హస్తాలతో కోరుతున్నాను. 

    వాటిని ఉపయోగించడం విలువైనవిగా భావించండి..

    సార్, దయచేసి మా కుటుంబం యొక్క అభ్యర్థనను తిరస్కరించకుండా పరిగణించగలిగితే, 

    మా కుటుంబం మొత్తం మీకు ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటుంది.. 

    మా పెద్దల ఆత్మలు కూడా ఇప్పుడు ఆయన పవిత్ర పాదాల వద్ద తృప్తిచెందుతాయి.. 

    నేను మీకు తెలియజేయవలసింది అంతే సార్.. 

    ఇప్పుడు నిర్ణయాన్ని పూర్తిగా నీకే వదిలేస్తున్నాను.." అని షేక్ మస్తాన్ ముగించారు.. 


నిశ్శబ్దం.. 


సంపూర్ణ నిశ్శబ్దం..

అసాధారణ నిశ్శబ్దం..

అశాంతి నిశ్శబ్దం..

భావోద్వేగ నిశ్శబ్దం..


నిశ్శబ్దం మరియు నిశ్శబ్దం మరియు నిశ్శబ్దం.. 


    టీటీడీ బోర్డు గదిలో కొద్ది క్షణాలు..

    గది నలుమూలలా వేసిన పెడెస్టల్ ఫ్యాన్‌ల డోలాయమానం తప్ప.. మరో శబ్దం వినిపించలేదు.

    ఆ సమయంలో ఆ గదిలో ఉన్న టీటీడీ బోర్డు ఛైర్మన్, కార్యనిర్వహణాధికారి, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు ఇతర సభ్యులందరూ తీవ్ర నిశ్శబ్దంలో మునిగిపోయారు.

    ఆ సమయంలో తమ ఎదురుగా ముకుళిత హస్తాలతో నిలబడిన ఆ గొప్ప ముస్లిం భక్తుడి గొప్ప వాదనలకు ఏం చెప్పాలో, ఎలా స్పందించాలో వారికి తెలియలేదు. 


కార్యనిర్వహణాధికారి తేరుకొన్న చర్య 


    అకస్మాత్తుగా ఏదో నిగూఢమైన అనుమానం కలిగి, హఠాత్తుగా పవిత్రమైన శ్రీవేంకటేశ్వరుని యొక్క దివ్యమైన సన్నిధిని పసిగట్టడంతో, వారి మధ్యలో, 

    ఆ ఘనీభవించిన స్థితి నుండి త్వరగా బయటకు వచ్చి, ముందుగా కదిలింది పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు. 

    కళ్లలోంచి ఆగలేని కన్నీళ్లు కారుతుండడంతో, ఆయన త్వరగా కుర్చీలోంచి లేచి, 

    షేక్ మస్తాన్ నిలబడి ఉన్న చోటికి పరుగెత్తారు. 

    అతనిని వారి ముందు ఎక్కువసేపు నిలబడేలా చేసినందుకు అతనికి క్షమాపణలు చెబుతూ, ప్రసాద్ గారు,ఐౄ   

    షేక్ మస్తాన్‌ని తన పక్కన కుర్చీలో హాయిగా కూర్చోబెట్టి, వినయపూర్వకమైన స్వరంతో అతనికి హామీ ఇచ్చాడు.


   “మస్తాన్ గారూ, ఈ రోజు మీలాంటి గొప్ప భక్తుడు మా మధ్య ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది.. 

    మేము మా కెరీర్‌లో చాలా మంది గొప్ప భక్తులను ఖచ్చితంగా చూశాము 

    కాని మీలాంటి వారిని మేము ఇంతకు ముందు చూడలేదు”

   “మేము మీ నుండి ఈ అమూల్యమైన బంగారు పువ్వులను బేషరతుగా స్వీకరిస్తాము.. అయితే, 

    మేము వాటిని సేవా సమయంలో తప్పకుండా ఉపయోగిస్తామని నేను మీకు ఈ క్షణం హామీ ఇవ్వలేను..     

    ఇది విధానానికి సంబంధించిన విషయం మస్తాన్ గారూ మరియు మేము కూడా ఆయన సేవకులమే. 

    సేవ సమయంలో వాటిని ఉపయోగించాలనే ఏ నిర్ణయం పూర్తిగా నా చేతుల్లో ఉండదు"

   “ఏదేమైనప్పటికీ, ఆలయంలో సేవలో ఈ స్వర్ణ కమలం పువ్వులను సద్వినియోగం చేసుకోవడంలో మీ కుటుంబ కోరికలను నెరవేర్చడానికి మేము ఇంకా మా వంతు కృషి చేస్తామని TTD బోర్డు తరపున నేను మీకు హామీ ఇస్తున్నాను.. 

    అయితే దయచేసి మాకు మరికొంత సమయం ఇవ్వండి. 

    దాని కోసం మరియు నేను ఖచ్చితంగా మీకు వీలైనంత త్వరగా తిరిగి కలుస్తాను" 


కార్యాచరణ 


    తర్వాత త్వరితగతిన పనులు జరిగాయి.. 

    మరో రెండు సమావేశాల తర్వాత తిరుమల ఆలయంలో శ్రీవారికి కొత్త ఆర్జిత సేవను ప్రవేశపెట్టాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.

    ఈ సేవలో శ్రీ వేంకటేశ్వర భగవానుని 108 పవిత్ర నామాలను పఠిస్తారు.. 

    ఈ స్వామి నామ పారాయణ సమయంలో, షేక్ మస్తాన్ కుటుంబం బహుమతిగా ఇచ్చిన ఒక్కొక్క బంగారు తామరపువ్వును శ్రీ వేంకటేశ్వరుని పవిత్ర కమలాల వద్ద ఉంచుతారు.

    1984లో TTD ఈ కొత్త ఆర్జిత సేవను ప్రవేశపెట్టింది.. 

    తరువాత, ఈ కొత్త సేవ TTD బోర్డు యొక్క గోల్డెన్ జూబ్లీ సంవత్సరాన్ని అత్యంత చిరస్మరణీయమైనదిగా మార్చడమే కాకుండా, 

    షేక్ మస్తాన్ యొక్క గొప్ప భక్తి కుటుంబం వారి తరాల పాత కోరికను తీర్చడంలో సహాయపడింది.

    పవిత్ర తిరుమల ఆలయంలో ప్రతి మంగళవారం నిర్వహించే ఈ ఆర్జిత సేవలో నేటికీ షేక్ మస్తాన్ కుటుంబీకులు కానుకగా అందించిన బంగారు తామరపువ్వులనే ఉపయోగిస్తున్నారు.. 

    కాలక్రమేణా ఈ కొత్త ఆర్జిత సేవ తిరుమల ఆలయంలో ఎంతో గొప్ప సేవగా మారింది.

    మొదట్లో అష్టదళ స్వర్ణ పద్మపూజ అని పిలిచినప్పటికీ, 

    ఈ సేవ నేడు అష్టదళ పాద పద్మారాధన సేవగా ప్రసిద్ధి చెందింది.

🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -39🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -39🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*వేంకటేశ్వరుని బీబీ నాంచారమ్మ:*


ఒక దేవుడిని పూజించేవారంద‌రూ క‌లిసి త‌మ‌ని తాము ఒకే మ‌తంగా భావించుకోవ‌చ్చు. కానీ సాక్షాత్తూ ఆ భ‌గ‌వంతుని కులం ఏది అని అడిగితే ఏమ‌ని చెప్పగ‌లం! ఆద్యంత ర‌హితుడికి కులమ‌తాల‌ను ఆపాదించ‌లేం క‌దా! దానిని నిరూపించే ప్రమాణ‌మే బీబీ నాంచార‌మ్మ! `


నాచియార్‌` అనే త‌మిళ ప‌దం నుంచి నాంచార‌మ్మ అన్న పేరు వ‌చ్చింద‌ని చెబుతారు. అంటే భ‌క్తురాలు అని అర్థమ‌ట‌.


 ఇక `బీబీ` అంటే భార్య అని అర్థం. బీబీ నాంచార‌మ్మ గాథ ఈనాటిది కాదు. క‌నీసం ఏడు వంద‌ల సంవ‌త్సరాల నుంచి ఈమె క‌థ జ‌న‌ప‌దంలో నిలిచి ఉంది.


 కొన్ని క‌థ‌ల ప్రకారం బీబీ నాంచార‌మ్మ, మాలిక్ కాఫిర్ అనే సేనాని కుమార్తె. ఆమె అస‌లు పేరు సుర‌తాని. స్వత‌హాగా హిందువైన మాలిక్ కాఫిర్, అల్లాఉద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారి తాను కూడా ముస్లిం మ‌తాన్ని స్వీక‌రించాడు. త‌న రాజ్యాన్ని విస్తరించే బాధ్యత‌ను ఖిల్జీ, మాలిక్ కాఫిర్ మీద ఉంచాడు. 


దాంతో మాలిక్ కాఫిర్ ద‌క్షిణ భార‌త‌దేశం మీద‌కి విరుచుకుప‌డ్డాడు. త‌మ దండ‌యాత్రలో భాగంగా మాలిక్, శ్రీరంగాన్ని చేరుకున్నాడు. అత‌ను శ్రీరంగం చేరుకునేస‌రికి రంగ‌నాథుని ఆల‌యం, భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌ల‌తో ధ‌గ‌ధ‌గ‌లాడిపోతోంది. పంచ‌లోహాల‌తో రూపొందించిన ఆయ‌న ఉత్సవ‌మూర్తిని చూసిన కాఫిర్ క‌ళ్లు చెదిరిపోయాయి


. అలాంటి విగ్రహాల‌ను క‌రింగిస్తే ఎంత ధ‌నం స‌మ‌కూరుతుందో క‌దా అనుకున్నాడు. అలా త‌న దండ‌యాత్రలో దోచుకున్న వంద‌లాది విగ్రహాల‌లోకి రంగ‌నాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకుని దిల్లీకి బ‌య‌లుదేరాడు.

దిల్లీకి చేరుకున్న త‌రువాత తాను దోచుకున్న సొత్తుని త‌న కుటుంబం ముంద‌ర గొప్పగా ప్రద‌ర్శించాడు మాలిక్‌. వాట‌న్నింటి మ‌ధ్యా శోభాయ‌మానంగా వెలిగిపోతున్న రంగ‌నాథుని విగ్రహాన్ని చూసిన అత‌ని కూతురు, త‌న‌కు ఆ విగ్రహాన్ని ఇవ్వమ‌ని తండ్రిని అడిగింది.


 ఆ విగ్రహం త‌న‌చేతికి అందిందే త‌డ‌వుగా, దాన్ని త‌న తోడుగా భావించ‌సాగింది. విగ్రహానికి అభిషేకం చేయ‌డం, ప‌ట్టు వ‌స్త్రాల‌తో అలంక‌రించడం, ఊయ‌ల ఊప‌డం... అలా త‌న‌కు తెల‌య‌కుండానే ఒక ఉత్సవ మూర్తికి చేసే కైంక‌ర్యాల‌న్నింటినీ ఆ విగ్రహానికి అందించ‌సాగింది. 


ఆ విగ్రహంతో ఒకో రోజూ గ‌డుస్తున్న కొద్దీ దాని మీదే సుర‌తాని మ‌న‌సు ల‌గ్నం కాసాగింది. మ‌రో ప‌క్క రంగ‌నాథుని ఉత్సవ మూర్తి లేని శ్రీరంగం వెల‌వెల‌బోయింది. దండ‌యాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంత‌గా బాధ‌ప‌డ్డాయో, రంగ‌నాథుని విగ్రహం కోల్పోయిన భ‌క్తులూ అంతే బాధ‌లో మునిగిపోయారు. 


చివ‌ర‌కి వారంతా ధైర్యం చేసి ఆ మాలిక్ కాఫిర్‌నే వేడుకునేందుకు దిల్లీకి ప్రయాణ‌మ‌య్యారు. సాక్షాత్తూ ఆ రామానుజాచార్యులే వారికి ప్రాతినిధ్యం వ‌హించార‌ని చెబుతారు.

రంగ‌నాథుని ఉత్సవ‌మూర్తిని వెతుక్కుంటూ త‌న ఆస్థానాన్ని చేరుకున్న అర్చకుల‌ను చూసి మాలిక్ కాఫిర్ మ‌న‌సు క‌రిగిపోయింది. ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకువెళ్లేందుకు సంతోషంగా అనుమ‌తిని అందించాడు. అయితే ఆపాటికే రంగ‌నాథుని మీద మ‌న‌సుప‌డిన సుర‌తాని గురించి విన్న అర్చకులు, ఆమె ఆద‌మ‌రిచి నిదురించే స‌మ‌యంలో ఆ విగ్రహాన్ని ఊరు దాటించారు. సుర‌తాని ఉద‌యాన్నే లేచి చూస్తే ఏముంది! త‌న క‌ల‌ల ప్రతిరూపం క‌నుమ‌రుగైంది. 


ఎవ‌రు ఎంత ఒదార్చినా సుర‌తాని మ‌న‌సు శాంతించ‌లేదు. ఆ విష్ణుమూర్తినే త‌న ప‌తిగా ఎంచుకున్నాన‌ని క‌రాఖండిగా చెప్పేసింది. ఆ విగ్రహాన్ని వెతుకుతూ తాను కూడా శ్రీరంగానికి ప‌య‌న‌మైంది. శ్రీరంగం చేరుకున్న సుర‌తాని ఆ రంగ‌నాథునిలో ఐక్యమైంద‌ని చెబుతారు. ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడ‌వ‌చ్చు.


మ‌రికొన్ని గాథ‌ల ప్రకారం ఆ విగ్రహం రంగ‌నాథునిది కాదు. మెల్కోటే (క‌ర్నాట‌క‌)లో ఉన్న తిరునారాయ‌ణునిది అని చెబుతారు. 


దానికి సాక్ష్యంగా ఇక్కడి ఆల‌యంలో కూడా బీబీ నాంచార‌మ్మ విగ్రహం క‌నిపిస్తుంది. ఇంకొంద‌రు భూదేవి అవ‌తార‌మే బీబీ నాంచార‌మ్మ అని న‌మ్ముతారు. క‌లియుగ‌దైవ‌మైన వేంక‌టేశ్వరునికి తోడుగా నిలిచేందుకు ఆమె కూడా అవ‌త‌రించింద‌ని భ‌క్తుల విశ్వాసం. అందుక‌నే తిరుప‌తిలోనూ బీబీనాంచార‌మ్మ విగ్రహం కూడా క‌నిపిస్తుంది. ఏదేమైనా ఆమె ముస‌ల్మాను స్త్రీ అన్న విష‌యంలో మాత్రం ఎలాంటి వివాద‌మూ లేదు. 


ఎందుకంటే తుళుక్క నాచియార్ అంటే త‌మిళంలో తుర‌ష్క భ‌క్తురాలు అని అర్థం. బీబీ నాంచార‌మ్మను చాలామంది ముస‌ల్మానులు సైతం వేంక‌టేశ్వరునికి స‌తిగా భావిస్తారు. క‌ర్నాట‌కను హైద‌ర్ఆలీ అనే రాజు పాలించే కాలంలో, అత‌ను ఓసారి తిరుమ‌ల మీద‌కు దండ‌యాత్రకు వ‌చ్చాడ‌ట‌. అయితే ఆ ఆల‌యం ఒక ముస్లిం ఆడ‌ప‌డుచును సైతం అక్కున చేర్చుకుంద‌న్న విష‌యాన్ని తెలుసుకుని వెనుతిరిగాడ‌ట‌. ఇదీ బీబీ నాంచార‌మ్మ క‌థ 



వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ

బెండ్లియాడి మతమభేదమనియె

హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల?

పాపసాబు మాట పైడిమూట ---- తక్కెళ్ళపల్లి పాపాసాహెబ్‌

పింగళి నాగేంద్రరావు

నాపాలి దైవమని నమ్ముకున్నానయ్య

నా భాగ్యదేవతా నను మరువకయ్యా

బీబి నాంచారమ్మ పొంచి ఉన్నాదయ్య

చాటు చేసుకు ఎటులో చెంతజేరెదనయ్య…

ఏడు కొండలవాడ వెంకటా రమణా -- 



 గోకుల కృష్ణ గోవిందా, గరుడ వాహన గోవిందా, శ్రీ గాన లోల గోవిందా, శ్రీ చంద్ర హాస గోవిందా; |

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||39||


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️

నవగ్రహా పురాణం🪐* . *20వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *20వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*చంద్రగ్రహ జననం - 2*


శీలవతి చీర కట్టడం ముగించి , పైట సర్దుకుంది. నుదురు మీద బొట్టు పెట్టుకుంది. భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఎవరో ముత్తైదువ దానం చేసిన పువ్వుల్ని జడలో దోపుకొంటోంది. *"ఎక్కడ ఏడుస్తున్నావ్ ?"* భర్త ఉగ్రశ్రవుడి కంఠంలో ఆగ్రహం ఆమెకు చెంపపెట్టులా తాకింది.


*"వస్తున్నా స్వామీ !”* అంటూ , మాట వెంటే భర్త ఉన్న చోటికి పరుగెత్తింది శీలవతి. గుడిశ మూలలో కుక్కి మంచం మీద కూర్చున్న ఉగ్రశ్రవుడు శీలవతిని ఎగాదిగా చూశాడు.


*"ఏమిటే... చీరకట్టి , పువ్వులు పెట్టి సింగారించుకున్నావ్ ? ఎవడు చూడాలనే ? ఉగ్రశ్రవుడు ఉరిమాడు.


*"అదేమిటి స్వామీ , అలా అంటారు ? భిక్ష కోసం వీధి వీధి తిరిగాం కదా.. కట్టుకున్న వస్త్రాలు చెమటతో తడిసిపోయాయి. చెమట వాసన మీరు భరించలేరు. అందుకని స్నానం చేసి...”*


*“చాలు !"* ఉగ్రశ్రవుడు కసిరాడు. *"ఆకలి మండిపోతోంది ! మాటలతోనే కడుపు నింపేస్తావా ఏమిటి ? పిడికెడు తిండి పడేస్తావా లేదా ?”*


*"ఒక్కక్షణం. దీపం వెలిగించి... భోజనం పెట్టేస్తాను."* అంటూ శీలవతి వెనుతిరిగి వెళ్ళింది.


ఉగ్రశ్రవుడు బుసలు కొడుతూ కూర్చున్నాడు. శీలవతి క్షణంలో వచ్చింది. ఆమె చేతిలో పట్టుకున్న చిన్న ప్రమిదలో దీపం వెలుగుతోంది. గాలి తాకకుండా ఒక అరచేతిని ఆమె దీపకళికకు రక్షణగా పట్టుకుంది.


ఉగ్రశ్రవుడు ఆమెనే చూస్తున్నాడు. ప్రమిదలో దీపకళిక గాలితాకిడికి స్పందిస్తూ , శీలవతి మొహానికి వెలుగుల్ని అద్దుతోంది. కోలమొహం మీద దోబూచులాడుతున్న దీపం వెలుతురు శీలవతి అందాన్ని హెచ్చవేత వేస్తోంది. ప్రమిదను పట్టుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తున్న శీలవతి మేఘాల మీద అలవోకగా నడుస్తున్న అప్సరసలా ఉంది..


శీలవతి మూలలో ఉన్న పెద్దదీపాన్ని వెలిగించి , భర్త వైపు నడుస్తోంది. అలంకారం. లేకుండా అతి నిరాడంబరంగా ఉన్న ఆమె సన్నటి శరీరం తగుమాత్రం ఆకులున్న లేత వయసు తీగలా ఉంది. చేతిలోని ప్రమిదలో స్పందిస్తున్న దీపకళిక కాంతి కిరణాలతో శీలవతి ముఖాన్ని పుణుకుతోంది.


ఆమెనే చూస్తున్న ఉగ్రశ్రవుడు రౌద్రంగా నిట్టూర్చాడు. యవ్వనంలో ఉన్న తన భార్య సౌందర్యవతే ! సందేహం లేదు ! అయితే ఆమెలోని భక్తి , రక్తిని మింగేసింది. వినయమూ , విధేయతా వలపునీ , వయ్యారాన్నీ చంపేశాయి. భార్య భక్తిని కుమ్మరిస్తే చాలదు. వలపుని వొలకబోయాలి. తాళికట్టిన నాటి నుండీ ధర్మపత్నిని ద్వేషించుకుంటున్న ఉగ్రశ్రవుడు కసిగా అనుకున్నాడు.


ప్రమిదను భర్తకు దగ్గరగా ఉంచి , తిరిగి వెళ్ళి , క్షణంలో అన్నపాత్రతో వచ్చింది. శీలవతి. ఉగ్రుడు ఆశగా , ఆకలిగా కంచంలోని పదార్థాలను చూశాడు. చక్కగా కలుపుకుని , నోటినిండుగా పెద్ద పెద్ద ముద్దలు కూరుకుంటూ , వేళ్ళు చీకుతూ , లొట్టలు వేసుకుంటూ తినాలనిపిస్తోం అతనికి ! కానీ తనకి ఆ అదృష్టం లేదు ! పాపిష్ఠి కుష్ఠుతో వేళ్ళన్నీ కుళ్ళిపోయాయి.


శీలవతి వేళ్ళు భర్త నోటికి అన్నం ముద్దను అందించాయి.


*"పెద్ద ముద్దలు పెట్టలేవా ఏమిటి ?"* అన్నం ముద్దను నములూ అరిచాడు. ఉగ్రశ్రవుడు. *"నా నోట్లో ఇంత కుక్కి దాచుకుని ఆరగించాలనుకుంటున్నావా ?”*


శీలవతి చిన్నగా నవ్వింది. *"ప్రతి పూటా ఇలాగే అంటారు ! మీ ఆకలి పూర్తిగా తీరితే గానీ , నాకు ఆకలి వేయదు , స్వామీ !” "పెట్టు , పెట్టు ! కొంచెం పెద్ద ముద్ద నోటికి అందించి ఏడు !"* ఉగ్రశ్రవుడు

కసిరాడు.


భార్య తినిపించే అన్నం తింటూ , ఆమెను తిట్టే తిట్లను ఆనందంగా నంజుకుంటూ ఉగ్రశ్రవుడు తృప్తిగా భోజనం ముగించాడు.


*"అయిపోయిందా, ఉందా ?"* కసిరినట్లు అడిగాడతను.


*“అయిపోయింది స్వామీ... ఇవ్వాళ భిక్ష తక్కువగానే దొరికింది...”* శీలవతి నొచ్చుకుంది. 


*"దరిద్రపు మొహం ! అడుగుపెట్టావు నా జీవితంలో. అప్పట్నుంచీ అరకడుపే !”* అంటూ ఆగి , బ్రేవ్ మంటూ తేన్చాడు ఉగ్రశ్రవుడు.


శీలవతి మాట్లాడకుండా పళ్ళెం తీసుకుని వెళ్లింది. 


*"పడుకోండి ! కాళ్లు నొక్కుతాను !"* తిరిగి వచ్చిన శీలవతి అంది.


ఉగ్రశ్రవుడుగుడ్లురిమాడు. *“ఏమిటే తొందర ? ఈ రోగిష్ఠివాణ్ణి త్వరగా నిద్రపుచ్చి , వెన్నెల్లో విహరిద్దా మనుకుంటున్నావా ?”*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 17*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 17*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷

       

         *సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగ రుచిభి:*

         *వశిన్యద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః|*

         *స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభి:*

         *వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః ||*


ఈ శ్లోకంలో అమ్మవారిని గాయత్రిగా వర్ణిస్తున్నారు. ఈ రూపములో ధ్యానించినవారికి అమ్మవారు


మహతాం భంగిరుచిభి: = మహర్షులు చేసిన విధముగా


స కర్తా కావ్యానాం భవతి = మహా కావ్యములు రచించగలిగిన శక్తిని ఇస్తుంది. ఇంకా,


వాగ్దేవీ వదన కమలామోద మధురైః = సరస్వతీ దేవి యొక్క తాంబూల పరిమళముల వంటి వాక్కులను ప్రసాదిస్తుంది. ఆ తాంబూల పరిమళం దశదిశలా వ్యాపించినట్లు వీరి కవిత్వం యొక్క మాధుర్యం,కీర్తి ప్రపంచం అంతటా వ్యాపిస్తాయి.


ఇంతకీ ఆ తల్లి ఎలా వున్నది?


వశిన్యద్యాభిస్త్వాం సహ = వశిని మొదలైన వాగ్దేవతలు పరివేష్టించియుండగా


శశిమణి శిలాభంగ రుచిభి: = ఆ వాగ్దేవతలు చంద్రకాంత శిలలు పగిలితే ఎంత తెల్లగా ప్రకాశిస్తాయో, అంత తెల్లగా మెరసిపోతున్నారట.


సవిత్రీభిర్వాచాం = వారు వాక్కులకు కన్న తల్లులు.

గాయత్రీ మంత్రము 24 అక్షరాల సంపుటి. ఇక్కడ అమ్మవారు, వాక్కుకు, విద్యకు సంబంధించిన 8 మంది వశిన్యాది వాగ్దేవతలతోనూ, 12 మంది యోగినులతోను, తెల్లగా మెరిసిపోతున్న ఆకర్షణ శక్తి కల నలుగురు దేవతలతోనూ పరివేష్టించి ఉన్నారట.


వాగ్దేవతలు :-వశిని, కామేశ్వరి, మోదిని, విమల, జయిని, అరుణ, సర్వేశ్వరి, కౌళిని.(8) ఈ వశిన్యాది వాగ్దేవతలే అమ్మవారి ఆజ్ఞ ప్రకారం లలితా సహస్ర నామములు చెప్పారు.


యోగినులు :- విద్య, రేచిక, మోచిక, అమృత, దీపిక, జ్ఞాన, ఆప్యాయిని, వ్యాపిని, మేథ, వ్యోమరూప, సిద్ధరూప, లక్ష్మి (12 )


ఆకర్షక_శక్తులు :- గంధ, రస, రూప, స్పర్శ,భూమి, నీరు, తేజస్సు, వాయువుల తన్మాత్రలు. (4 )


అమ్మవారు *మాతృకా వర్ణ రూపిణి* అని కొలువబడ్డ అక్షర రూపిణి.


            🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

Divam Dharmam 1 to 4


 


This Bloger pravachan in Hindu Dharmam TV channel. 

Divam dharman


 

Payasam


 

శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 33*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 33*


కాలాంతరంలో నరేంద్రుడు ఇలా చెప్పాడు.


"ఆయన జవాబు నా మనస్సులో ప్రగాఢ ముద్ర వేసింది. 'నేను భగవంతుణ్ణి దర్శించాను; ఈ లోకాన్ని మనం అనుభూతం చేసుకోవడానికన్నా అనేక రెట్లు లోతుగా గ్రహించవలసిన విషయం' అంటూ వచించే ఒక వ్యక్తిని నేను ప్రప్రథమంగా కలుసుకొన్నాను. ఆయన చెప్పిన విషయాలు విన్న తరువాత, 'ఇతర మత బోధకులలా కల్పనలో స్ఫురించినది ఈయన మాట్లాడడం లేదు. భగవంతుని కోసం నిజంగానే సర్వస్వాన్నీ త్యజించి, ఆయనను మనఃస్ఫూర్తిగా ప్రార్థించి, భగవదనుభూతి పొంది, తదనుభవంతోనే మాట్లాడుతున్నారు' అని తెలుసుకొన్నాను.


"కాని ఆయన ఇప్పటి మాటలూ, కాసేపటి క్రితం ప్రవర్తించిన తీరూ ఎంతో విరుద్ధంగా కనిపించాయి. 'అలా అయితే కొన్ని సమయాల్లో స్పష్టంగాను, మరికొన్ని సమయాల్లో పిచ్చిపట్టినట్లూ ఉంటారా ఈయన? బహుశా సగం పిచ్చేమో!' అని అనిపించింది. ' కాని భగవంతుని కోసం ఇలా సర్వస్వాన్నీ త్యజించిన వ్యక్తిని చూడడం ఎంతో అరుదు. పిచ్చివాడే అయినప్పటికీ ఈయన పరమ పావనుడు, అత్యుత్తమ సాధువు; అందుకే మానవాళి స్తుతించి, ఆరాధించదగిన వ్యక్తి' అని అనుకొన్నాను. 


మరో ఆశ్చర్యం కూడా కలుగకపోలేదు. నిద్రపోతున్నప్పుడు పొందుతున్న జ్యోతిర్మయ దర్శన అనుభవం గురించి తాను ప్రారంభంలో ఒకరిద్దరు మిత్రులతో చెప్పడంతో సరి! ఆ తరువాత ఎవరితోనూ ఆ సంగతి ప్రస్తావించలేదు. ఆ విషయం ఈయనకు ఎలా తెలిసింది?  'నాకు ధ్యానం పట్ల అమిత ఆసక్తి ఉండడమూ, నేను ధ్యానం చేయడమూ ఈయనకు ఎలా తెలుసు?' ఈ రకంగా అనేక ప్రశ్నల తరంగాలు చెలరేగాయి.


శ్రీరామకృష్ణులలో సైతం తరంగాలు ఉవ్వెత్తున లేచాయి. అవి ప్రేమ తరంగాలు! నరేంద్రుణ్ణి మళ్లీ చూడాలనే వ్యాకులతామయమైన తరంగాలు. ఆ వ్యాకలత ఆయన హృదయాన్ని మెలిపెట్టి పిండివేసింది.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

https://youtube.com/shorts/Wj5mLq4aJtI?si=eWFzk9gmO5hjNUKn 



https://youtube.com/shorts/56atMB5r7o8?si=Jd4mpaD5dSk0YAmm 

నవగ్రహ పురాణం - 50 వ అధ్యాయం*

 *నవగ్రహ పురాణం - 50 వ అధ్యాయం*

🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷


*శనిగ్రహ జననం - 1*



మందిరంలో నిశ్శబ్దం తాండవిస్తోంది. వైవస్వతుడూ , యముడూ , యమీ పడుకున్నట్టున్నారు. సూర్యుడు తన శయనాగారం వైపు అడుగులు వేశాడు.


సంతానం ముందు నిలబడి ఆకాశంలోకి చూస్తోంది. ఆమె పైట - ఆమె అందానికి కట్టిన పతాకంలా గాలిలో చలిస్తోంది. సూర్యుడు భార్యను సంతృప్తిగా చూస్తూ సమీపించి , వెనుకవైపు దగ్గరగా నిలుచున్నాడు. సంజ్ఞ భుజాల మీద రెండు చేతుల్నీ వేశాడు.


ఎందుకో సంజ్ఞ ఉలిక్కిపడింది. ఏదో దెబ్బ తగిలినట్టు ప్రతిస్పందిస్తూ తటాలున దూరంగా జరిగి , సూర్యుడి వైపు తిరిగింది. ఆమె ముఖంలో చిరునవ్వే లేదు. చూపులు పక్కకు తిరిగాయి.


*“సంజ్ఞా... భయపడ్డావా ?”* సూర్యుడి కంఠంలో అనురాగం పలికింది.


*“భయపడుతున్నాను...”* అంది సంజ్ఞ.


*“ఏం జరిగింది ? ఎందుకు భయం ? ఎవర్ని చూసి , దేన్ని చూసి భయపడుతున్నావు , దేవీ ?"* సూర్యుడు ఆందోళనతో అడిగాడు. ధైర్యం చెపుతున్నట్టు ఆయన శరీరం ఆమె దగ్గరగా జరిగింది.


సంజ్ఞ కళ్ళకి చేతిని అడ్డం పెట్టుకుంటూ , దూరంగా జరిగింది. *“ఎవర్ని చూసి భయపడుతున్నానో చెప్పనా ?”* అంది మెల్లగా.


*“చెప్పు ! వాడు ఎవడైనా సరే... నిన్ను భయ పెట్టినందుకు...”* సూర్యుడు ఆవేశంతో చెప్పుకు పోతున్నాడు. 


*“ముందు - వినండి !”* సంజ్ఞ ఆయనను వారిస్తూ అంది. *“నేను భయపడుతోంది మిమ్మల్ని చూసే !"*


*"సంజ్ఞా !"* సూర్యుడు ఆశ్చర్యంతో అరిచాడు.


*"ఔను ! మిమ్మల్ని చూడగానే నా శరీరం వణికిపోతోంది...”* 


*"సంజ్ఞా !"* అంటూ సూర్యుడు ఆమె దగ్గరగా జరిగాడు.


*"దయచేసి దూరంగా ఉండండి !"* అంటూ సంజ్ఞ ఎడంగా జరిగింది. నివ్వెరపోయి చూస్తున్న భర్తతో ఇలా అంది. *"నిజం చెప్తున్నాను. మన్నించండి ! మీ శరీరం వెదజల్లే కాంతినీ , వేడిమినీ భరించలేకుండా ఉన్నాను...”*


సూర్యుడు తాత్కాలికంగా మూగవాడైపోయాడు. నమ్మలేనట్టు సంజ్ఞ వైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు.


సంజ్ఞ అరచేతిని కళ్ళకు అడ్డంగా ఉంచుకునే ఉంది. 


*"సంజ్ఞా ! పరిహాసానికా ఇది !"* సూర్యుడు ఆశగా అడిగాడు. *"అపరాధం చేశానా ? నొప్పించానా ? ఇది...ఇది... ప్రణయ కోపమా , దేవీ ?”*


*"ప్రణయ కోపం కాదు, ప్రణయ శాపం !"* సంజ్ఞ కంఠంలో ఆవేదన ధ్వనించింది. *" మన్నించండి ! నేను నిజమే చెప్తున్నాను. మీ శరీరం ప్రసరించే కళ్ళు చెదిరే కాంతినీ , మీ శరీరం వెదజల్లే చెమటలు పట్టించే వేడిమినీ భరించడం ఇక నా వల్ల కాదు...”*


సూర్యుడు దెబ్బతిన్నట్టు చూశాడు. *"అయితే ఇంతకాలం ఎలా భరించావు ?”*


*“భరించాను... భరించక చేయగలిగింది ఏముంది ? అపార్థం చేసుకోకండి ! మీ సామీప్యంలో నేను... చిత్రహింస అనుభవిస్తున్నాను... దయచేసి దూరంగా జరగండి”* సంజ్ఞ తనే దూరంగా జరుగుతూ అంది.


ఆశ్చర్యం నుండి కోలుకున్న సూర్యుడు చిన్నగా నవ్వాడు. *“గతం మరిచావా , సంజ్ఞా ? నా వెచ్చదనం నీకు ఎంతో ఇష్టం అంటూ ఆనాడు...”*


*"అది ఆనాడు ! మన దేహాల ఐక్యత ప్రారంభమవుతున్న ప్రాథమిక క్షణాలు. ఆ ఆకర్షణ వేరు , ఆ ఆవేశం వేరు. ఉరకలెత్తే ఉత్సాహం మనలోని ఆధిక్యతలనూ , న్యూనతలనూ గుర్తించనివ్వలేదు !"*


*"నీ ధోరణితో , అర్థం లేని భయంతో నన్ను - నీ పతిదేవుణ్ణి అస్పృశ్యుడు నీ చూస్తున్నావు సంజ్ఞా !"*


*"స్వామీ ! అలా అనకండి. నా కోసం... ఒక పని చేయండి... చేస్తారా ?".*


*"కోరుకో !"*


*"నా కోసం...మీ వెలుగునూ , వేడిమినీ తగ్గించుకోండి !"* 


*"అసంభవం !"* సూర్యుడు వెంటనే అన్నాడు.


*"స్వామీ !"* సంజ్ఞ ఆశ్చర్యంతో అంది. *"నేను మీ అర్ధాంగిని , ప్రేయసిని ! మీ మాటల్లో చెప్పాలంటే మీ సర్వస్వాన్ని. నా మాటల్లో చెప్పాలంటే - నా సర్వస్వాన్నీ మీ సర్వస్వంగా మార్చిన మీ ప్రణయదాసిని !"* సంజ్ఞ ఆవేశంగా అంది.


*"ఔను ! నువ్వు చెప్పినవన్నీ నాకు కూడా వర్తిస్తాయి సంజ్ఞా ! కానీ...నీ కోరిక తీర్చలేను. నా ప్రకాశాన్నీ , ప్రతాపాన్నీ తగ్గించడం అసాధ్యం !"*


*"స్వామీ !"*


*"ఔను సంజ్ఞ... నీ శరీరకాంతినీ , ఉష్ణాన్నీ నువ్వు మార్చుకోలేవు. నేను కూడా అంతే ! గతంలోలాగా ఆవేశాన్ని , ఆకర్షణనూ కవచాలుగా చేసుకుని , నువ్వు సర్దుకుపోవాల్సిందే ; భరించాల్సిందే !"*


సంజ్ఞ అయోమయంగా , ఆందోళనగా చూసింది. *"స్వామీ...”*


*"ఆలోచించు , సంజ్ఞా ! జన్మతో సంక్రమించిన శరీర ధర్మాన్ని గౌరవించాల్సిందే. ఆలోచించు ! నిన్ను నువ్వు సిద్ధపరుచుకో ! భర్త దేహధర్మాన్ని భరించే శక్తిని కూడదీసుకొని , నువ్వే నన్ను సమీపించాలి సుమా ! అప్పటి దాకా నా ప్రతాపం , నా ప్రకాశం నీకు దూరంగానే ఉంటాయి !”* ధైర్యం చెప్తున్నట్టు నవ్వుతూ , సూర్యుడు శయ్యా మందిరం లోంచి అవతలకి నడిచాడు.


సంజ్ఞ బలహీనంగా కూర్చుంది.


*“స్వామీ...”*


సంజ్ఞ పిలుపు విని , సూర్యుడు వెనుదిరిగి ఆమె వైపు చూశాడు.


*“నన్ను... ఆలోచించమన్నారు. నన్ను... సన్నద్ధం చేసుకోమన్నారు. నేను... నేను.. మీ దగ్గరగా ఉంటూ మీకు దూరంగా ఉండలేను...”*


*"సంజ్ఞా..."* సూర్యుడి కంఠంలో ప్రేమావేశం పలికింది. *“నా పుట్టినింటికి వెళ్తాను. కొంత కాలం మీకు దూరంగా , దూరంగా ఉండి , నను నేను సిద్ధం చేసుకొని తిరిగి వస్తాను. అనుమతిస్తారా ?”* 


సూర్యుడి ముఖం మీద చిరునవ్వు వెలిగింది. *"దూరంగా వెళ్ళి , నాకు దగ్గరయే నీ రాక కోసం నిరీక్షిస్తూ ఉంటాను సంజ్ఞా ! వెళ్ళిరా !"*


*“నేను తిరిగి వచ్చేదాకా వైవస్వతుడినీ , యముడినీ , యమినీ మీరే చూసుకోవాలి సంజ్ఞ అభ్యర్థిస్తూ అంది. 


*“అలాగే సంజ్ఞా ! చూసుకుంటాను. నీ జన్మస్థల ప్రవాసం త్వరగా పూర్తి చేయ సుమా !”* సూర్యుడు నవ్వాడు. సంజ్ఞ కూడా నవ్వింది.

చాలాచాలా చేసారు

 *కాంగ్రెస్ వాళ్ళు చాలాచాలా చేసారు, కానీ అవన్నీ ముస్లింల కోసం?*                                       ♦️  చరిత్ర తెలుసుకోవాలి -: కాంగ్రెస్‌ను విచక్షణారహితంగా విమర్శిస్తూ వెళ్లడం సరికాదు. కాంగ్రెస్ సాధించిన విజయాలు కూడా తెలుసుకోవాలి👇:.


▪️ ❌గత 65 ఏళ్లలో కాంగ్రెస్ ఏ పని చేయలేదని ఎవరు చెప్పారు❌❓❓ ✅ కాంగ్రెస్ వాళ్ళు చాలాచాలా చేసారు, కానీ అవన్నీ ముస్లింల కోసం?✅


 •  ముస్లింల కోసం పాకిస్తాన్ సృష్టించబడింది, ,బంగ్లాదేశ్ ముస్లింల కోసం తయారు చేయబడింది.


• ఆర్టికల్ 370 అమల్లోకి వచ్చింది, ముస్లింల కోసం.


• మైనారిటీల బిల్లు ముస్లింల కోసం వచ్చింది.


•  ముస్లింల కోసం ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏర్పడింది.


•  ముస్లింల కోసం మైనారిటీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయబడింది. ముస్లింల కోసం వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేశారు.


 • మైనారిటీ విశ్వవిద్యాలయం ముస్లింల కోసం తయారు చేయబడింది.


 • దేశ విభజన మత ప్రాతిపదికన, ముస్లింల కోసం జరిగింది. • ప్రార్థనా స్థలాల చట్టం తీసుకొచ్చారు, ముస్లింలుకోసం.


♦️ •  మతహింస వ్యతిరేక బిల్లును పార్లమెంటులో రెండుసార్లు ప్రవేశపెట్టారు, కానీ బిజెపి దానిని ఆమోదించడానికి అనుమతించలేదు.  ఆ బిల్లు కూడా ముస్లింలకు సంబంధించి నదే మరియు ఈ బిల్లుగనుక ఆమోదించబడివుండి వుంటే , హిందువుల్ని ఈ దేశం లో లేకుండా చేయడానికి కేవలం 10 సంవత్స రాలు కూడా పట్టదు ?  ఎవరికైనా ఏదైనా ఈ విషయం లోసందేహం ఉంటే, అతను గూగుల్ కి వెళ్లి చదవవచ్చు.


 • దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేసింది, హిందూ సమాజం ఎప్పుడూ పరస్పరం పోరాడు కునేలా హిందువులకు మాత్రమే రిజర్వేషన్ ఇచ్చింది. మరియు ఘజ్వా-ఎ-హింద్‌ను హిందువులు ఎప్పటికీ అర్థంచేసు కోలేదు, చేసుకోలేకపోయారు, చేసుకోనివ్వ లేదు. హిందువుల్ని నమ్మకం మీద మోసం చేశారు. గాంధీ - నెహ్రూ లు, ముస్లిమ్స్ జన్మతః ముస్లిమ్స్ అయివుండి - వారు హిందువులు గా పైకి నటిస్తూ, అన్నీ హిందూ వ్యతిరేకంగా చేస్తూ వచ్చారు.


▪️ హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చేయడానికి - హిందూ కోడ్ బిల్లుతీసుకు రాబడిం ది , అది కూడా ముస్లింలకు మేలు చేయడానికి మాత్రమే.


 ▪️ కొన్నిసార్లు నాకు దీన్ని పోస్ట్ చేయకూడదని అనిపిస్తుంది. కానీ పోస్ట్ చేసినప్పుడే భారతదేశం దీన్ని చదువుకుంటుంది అనే ఆలోచన వస్తుంది. అప్పుడే భారతదేశం కాంగ్రెసోళ్ల ఛాతీ పైకి ఎక్కుతుంది.


▪️ ఈ పోస్ట్ చదివిన తర్వాత మీకు ఏమైనా అర్థమైతే, ఆ పోస్ట్ గరిష్ట సంఖ్యలో వ్యక్తులకు చేరుకోవ డానికి ఇది సహాయపడాలి.


This is a watsapp forewarded  message. 


WHY BJP HAS TO WIN

 WHY  BJP HAS TO WIN 


 బీజేపీ ఇచ్చిన హామీని నెరవేర్చింది...


 ● రామమందిరం

 ● CAA / NRC

 ● కొత్త విద్యా విధానం

 ● ఆర్టికల్ 370

 ● పటిష్ట రక్షణ

 ● బిగించిన NGOలు

 ● బిగుసుకుపోయిన నక్సల్స్

 ● బిగించిన మిషనరీలు

 ● 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

 ● కరోనా టీకా

 ● కాశీ కారిడార్

 ● SPACEని జయించారు

 ● బానిసత్వం యొక్క చిహ్నాలను చెరిపివేయడం

 ● మౌలిక సదుపాయాలు

 ● IITలు

 ● AIIMS

 ● మంత్రిత్వ శాఖ స్థాయిలో అవినీతి సున్నా

 ● GST

 ● డీమానిటైజేషన్

 ● జీరో బాంబ్ బ్లాస్ట్

 ● కాశ్మీర్‌లో శాంతి

 ● మొబైల్ తయారీలో 2వది

 ● రైల్వేల 100% విద్యుదీకరణ

 ● రైల్వే గేట్లను పూర్తిగా తొలగించడం

 ● వందే భారత్ రైలు

 ● ఎలాంటి తూటా పేల్చకుండా పాకిస్థాన్‌ను నాశనం చేసింది

 ● ప్రతి ఇంటి వద్ద నీరు

 ● ఆయుష్మాన్ భారత్ కింద వైద్య బీమా

 ● సీనియర్ సిటిజన్ల కోసం చార్ ధామ్ యాత్ర


 మరU


 ● BJP దేశాన్ని అమ్మదు

 ● చైనాతో బీజేపీ రహస్య ఒప్పందం కుదుర్చుకోదు

 ● పాకిస్తాన్ పట్ల బిజెపి మెతకగా ప్రవర్తించదు


 బీజేపీని మళ్లీ మళ్లీ గెలిపించాలి.


 2024 BJP🚩

 2029 అవును, BJP మాత్రమే🚩

 2034 BJP🚩

 మరియు అంతకు మించి.......


 మీ చుట్టూ ఉన్న కనీసం 11 మందికి అవగాహన కల్పించి, బీజేపీయేతర ఓట్లను బీజేపీకి మార్చండి


 మా పిల్లలు సురక్షితంగా ఉన్నారు


 మన జీవితం ముగిసింది


 మేము మంచి జీవితాన్ని గడిపాము


 మనము ఈ దేశానికి ఒకటి ఇవ్వాలి

 సురక్షిత సమాజం కోసం

 సురక్షిత జీవితం కోసం

 సురక్షిత భవిష్యత్తు కోసం


 మన తర్వాతి తరం కోసం


 దీన్ని అర్థం చేసుకోండి మరియు 11 విభిన్న ప్రాంతాల సమూహంలో భాగస్వామ్యం చేయండి మరియు


 దీన్ని 11 మంది స్నేహితులతో భాగస్వామ్యం చేసుకోండి మరియు వారికి ఆవశ్యకతను వివరించండి

 మన స్వంత కుటుంబసబ్యులకొరకు స్వంత భద్రత మరియు స్వేచ్ఛ కోసం ఓటు BJP కి వేయండి.  జై హింద్ జై భారత్🇳🇪 🙏🙏🙏🙏🙏

 ధన్యవాదాలు🙏


FOR SAKE OF NATION 

IT SEE THE WELFARE OF ALL THE CITIZENS

పంచాంగం _సెప్టెంబరు 9, 2023_

 ॐశుభోదయం, పంచాంగం ॐ 

🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏

_సెప్టెంబరు 9, 2023_

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం*

*వర్ష ఋతువు*

*నిజ శ్రావణ మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *దశమి* రా9.08

వారం: *స్థిరవాసరే*

(శనివారం)

నక్షత్రం: *ఆర్ధ్ర* సా5.27

యోగం: *వ్యతీపాతం* రా2.15

కరణం: *వణిజ* ఉ8.42

భద్ర* రా9.08

వర్జ్యం: *లేదు*

దుర్ముహూర్తము: *ఉ5.49-7.28*

అమృతకాలం: *ఉ6.52-8.33*

రాహుకాలం: *ఉ9.00-10.30*

యమగండం: *మ1.30-3.00*

సూర్యరాశి: *సింహం*

చంద్రరాశి: *మిథునం*

సూర్యోదయం: *5.50*

సూర్యాస్తమయం:6.06*లోకాః సమస్తాః*సుఖినోభవంతు*

పంచాంగం

 卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

శుభోదయం, నేటి పంచాంగం *శుక్రవారం, సెప్టెంబరు 8, 2023*

 *శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

 *దక్షిణాయనం - వర్ష ఋతువు*

*నిజ శ్రావణ మాసం - బహళ పక్షం*

తిథి *నవమి* రా8.17 వరకు 

వారం శుక్రవారం* (భృగువాసరే)

నక్షత్రం  : *మృగశిర* సా4.03 వరకు

యోగం సిద్ధి* రా2.31 వరకు

కరణం తైతుల* ఉ8.07 వరకు తదుపరి *గరజి* రా8.17 వరకు 

వర్జ్యం :*రా12.56 - 2.38*  

దుర్ముహూర్తము :ఉ8.17 - 9.06 మ12.23 - 1.12*

అమృతకాలం  *ఉ6.55 - 8.34* 

రాహుకాలం  ఉ10.30 - 12.00*

యమగండ/కేతుకాలం మ3.00 -4.30*

సూర్యరాశి:సింహం చంద్రరాశి: *మిథునం*

సూర్యోదయం: *5.50 సూర్యాస్తమయం: *6.07*

*సర్వేజనా సుఖినో భవంతు *

రామాయణమ్ 319

 రామాయణమ్ 319

...

మొదలయ్యింది లంకాదహనం.

.

 ముందుగా తనను ప్రశ్నించిన ప్రహస్తుని ఇంటికి నిప్పు పెట్టాడు ,

ఆతరువాత మహా పార్శ్వుడి కొంపతగలబడ్డది ,

వంజ్రదంష్ట్ర

శుకసారణుల గృహాలవంతు వెంటనే వచ్చింది .

.

ఆ తరువాత ఇంద్రజిత్తు ఇంటికి నిప్పంటించాడు ,జంబుమాలి,సుమాలి,రశ్మికేతువు ,

సూర్యశత్రువు ఇలా వరుసగా రాక్షస యోధుల ఇళ్ళన్నీ అగ్నిదేవుడికి ఆహుతి ఇచ్చాడు.

.

 ఒక్క విభీషణుడి ఇల్లు మాత్రమే వదిలి పెట్డి వరసపెట్టి అందరి ఇళ్ళు తగులబెట్టాడు మారుతి.

.

అందరి ఇళ్ళూ కాల్చి చివరగా రావణుడి ఇంటికి కూడా తన తోక చివరన ఉన్న అగ్నిని అంటించి సింహగర్జన చేశాడు వాయునందనుడు.

.

మిత్రులిరువురూ వారి పని వారు చేసుకొని పోసాగారు.

.

 అగ్నిదేవుడు వాయుదేవుడు ఒకరికొకరు సహాయపడుతూ లంకనంతా అగ్నిగుండంగా మార్చి వేశారు.

.

ఫెళఫేళార్భాటాలతో ఇళ్ళన్ని కాలి బ్రద్దలై కూలిపోసాగాయి.

.

అటుఇటు పరుగెడుతూ తమ వారిని ఎలా రక్షించుకోవాలో తమనెట్లా కాపాడుకోవాలో దిక్కుతోచక పరుగులుపెట్టే జనం.

.

జనంజనం 

మహాదుఃఖసాగరం!!

.

 హా తాత,

హా మిత్ర,

హా పుత్ర 

అంటూ కేకలు వేస్తూ వీధులలో పరుగెడతున్న జనం ..

.

చంటిపాపడిని చంకన పెట్టుకొని ఒకతి

జుట్టు విరబోసుకొని జారినబట్టలు సవరించుకొనే సమయములేక మరొకతి.

మెట్లమీదనుండి వచ్చే సమయములేక మేడమీద నుండి దూకి ప్రాణాలు కాపాడుకొనేది ఇంకొకతి.

.

ముసలి,ముతక,పిల్లజెల్లా అంతా విపరీతమయిన భయముతో ప్రాణాలుకాపాడుకోవాలనే తపనతో వీధులవెంట పరుగులు పెడుతున్నారు.

.

కాలిన భవనాలనుండి

రాలిన మణి మాణిక్యాలు

.

ఎంత కాల్చినా అగ్నిదేవుడికి తృప్తి కలగటంలేదు .

ఎంతమంది రాక్షసులను చంపినా మారుతికి తృప్తికలగటంలేదు...

ఇరువురికీ తృప్తిలేదు.

.

వలయాలు వలయాలుగా తిరుగుతున్న అగ్ని శిఖలు లంకలో విలయాలను సృష్టిస్తూ ప్రళయవేళను మైమరపిస్తున్నవి.

.

ఎవడీ కోతి 

ఎందుకు చేశాడు ఈ రీతి?

ఏమివీడి నిర్భీతి?

.

వీడు ఇంద్రుడా?

వీడు రుద్రుడా??

వీడు కుబేరుడా ?

కాదుకాదుమనపాలిటి 

కాల యముడు 

అని చర్చించుకుంటూ పరుగులుపెడుతున్నారు  లంకా నగరవాసులు.

.

వూటుకూరు జానకిరామారావు

ಸುಭಾಷಿತ


ಸುಭಾಷಿತ . 618 .


ಅನೇಕೇ ಫಣಿನಃ ಸಂತಿ ಭೇಕಭಕ್ಷಣತತ್ಪರಾಃ | ಏಕ ಏವ ಹಿ ಶೇಷೋಯಂ ಧರಣಿಧರಣಕ್ಷಮಃ ||


ಕಪ್ಪೆಗಳನ್ನು ನುಂಗುವುದರಲ್ಲೇ ನಿರತರಾದ ಸರ್ಪಗಳು ಬೇಕಾದಷ್ಟಿವೆ . ಆದರೆ ಭೂಭಾರವನ್ನು ಹೊರಬಲ್ಲ ಆದಿಶೇಷನು ಒಬ್ಬನೇ .


ಭೋಜಪ್ರಬಂಧ .


కప్పలని తినే పని లో నిమగ్నమైన సర్పములు చాలా ఉన్నాయి. కానీ భూభారాన్ని మోసే ఆదిశేషు ఒక్కడే ఉన్నాడు.

ఎప్పుడూ ఉత్సాహంతో ఉండాలి.

 సుభాషితం - 739

---------------

*యారుత్సాహి సదా మర్త్య:*

*పరాభవతి యజ్ఞానాన్* ౹

       *యబుద్ధతం వదేద్వాక్యం* 

*తత్సర్వం విత్తజం బలమ్ ౹౹* 

      

*భావం    మనుష్యులు ఎప్పుడూ ఉత్సాహంతో ఉండాలి.ఇతరులను అవమానం చేసేది ఉద్ధరించినట్లు మాట్లాడేది ఇవన్నీ ధనముతో వచ్చే బలాలు*.

🌺✍🏽

        .

ధైర్యం మాత్రం ఉండి తీరాలి.

*1895*

*కం*

మనుషుల ధైర్యము బ్రతుకగు

మనుషుల భయమెప్పుడైన మరణ సదృశమౌ.

ధనములు వితతంబైనను

(ధనముల గనియున్నను మరి)

మనసున ధైర్యం పు లేమి మరణమె సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మనుషుల యొక్క ధైర్యమే జీవితం, భయమెప్పుడైనా మరణం తో సమానం. ఎన్నో రకాలు గా ధనములు ఉన్నప్పటికీ మనసు లో ధైర్యం లేకపోతే అది మరణమే అవుతుంది.

*సందేశం*:-- మనిషి బతకడానికి డబ్బు ఉన్నాలేకున్నా ధైర్యం మాత్రం ఉండి తీరాలి.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ* 


చెట్లు లేని ప్రదేశంలో ఆముదం మొక్కను

 🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝  


*_అల్పజ్ఞః పూజ్యతే గ్రామే*

*విశేషజ్ఞవివర్జితే।_*

*_దేశే వృక్షవినాభూతే*

 *ప్యేరణ్డో హి వనస్పతి:॥_*



*తా𝕝𝕝 చెట్లు లేని ప్రదేశంలో ఆముదం మొక్కను మహావృక్షం గా వ్యవహరిస్తారు*..... *అసలు విద్వాంసులు అందుబాటులో లేని చోట అర్ధంతరమైన జ్ఞానం ఉన్న వ్యక్తిని కూడా పండితుడిగా పరిగణిస్తారు*.... 


🧘‍♂️🙏🪷 ✍️🙏

సంపద

 *1894*

*కం*

కొందరు ధనముల కోరును

కొందరు నభిమానధనుల కూరిమి మెచ్చున్.

అందరితో నెయ్యంబుల

నొందెడి సిరికన్న మేటి యుండదు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! కొంత మంది ధనముల ను ఇష్టపడగా కొందరు అభిమానముపంచువారి ని ఇష్టపడతారు. అందరితో స్నేహాన్ని పొందడం కంటే గొప్ప సంపద ఏదీ ఉండదు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

పిల్లల మఱ్ఱివారి శృంగార శాకుంతలము!




పిల్లల మఱ్ఱివారి శృంగార శాకుంతలము!


తెనుగు సాహిత్యం ఒక మహా సాగరం. అందులో యెన్ని అపురూపమైన రత్నాలున్నాయో? ఆరత్నాలే మనకవులు. వారిచ్చిన కావ్యాలు వెలగొనలేనివి. అట్టి మహాృకవులలో ' పిల్లల మఱ్ఱి పినవీరభద్రుడు బహుధా గణనీయుడు. ప్రతిభా వ్యుత్పత్తులు రెండును సమేళణ నములై యితని కవిత్వానికి వన్నెలుదిద్దాయి. పిల్లల మఱ్ఱివారి శృంగార శాకుంతలము. యితని ప్రతిభకు ప్రతీక! అందులోఞయెన్ని మెరుపులో, యెన్నితళుకులో,

.

దుష్యంతుడు వేటకోసం అడవికి వచ్చాడు. డస్సి, ఆయలుపుఁదీర్చుకొనుటకు కణ్వాశ్రమానికి వచ్చాడు. ఆయాశ్రమ ప్రాంతంలోని ప్రకృతికి పరవసిస్తూ , అడుగులు ముందుకు సారించాడు. ఇంతలో బాలపాదపాల దాహార్తిదీరుస్తూ, నీటికడవ నెత్తుకొనివచ్చు కన్యను గాంచాడు. అంతే మతిపోయింది ఆపిల్ల అందానికి. దివ్యాదివ్యసౌందర్య దర్శనం ప్రదర్శనచేసే ఆమెసౌందర్యం ఆరాజుకు విభ్రమ దాయకమైనది. 

ఆమె సౌందర్య వీక్షాదక్షమైన చక్షుః ప్రీతివలన యిలా అనుకుంటున్నాడు. 

దుష్యంతుని భావనకు ముకురాయమానమైన యీపద్యాన్ని చిత్తగించండి!

.

సీ: సురకన్య కాఁబోలు; సురకన్య యయ్యెనే 

ఠీవిమై రెప్పలాడించు టెట్లు?

పుత్తడి కాఁబోలు, పుత్తడి యయ్యనే 

హంసీ గతుల నడయాడుటెట్లు?

వనలక్ష్మి కాఁబోలు, వనలక్ష్మి యయ్యెనే? 

కటి వల్కలంబులు గట్టు టెట్లు?

రతిదేవి కాఁబోలు , రతియయ్యెనే 

వలరాజు నెడబాసి వచ్చు టెట్లు?

కన్నుగవ యార్చుటను సురకన్య కాదు; 

నడి యాడెడుఁ గానఁ బుత్తడియు గాదు; 

లలిఁ దపశ్చిహ్నమున వనలక్ష్మి కాదు; 

ప్రసవశర ముక్తైనది రతియుఁ గాదు;

.

దుష్యంతుడు ప్ర ప్రధమంగా శకుంతలను కణ్వాశ్రమంలో చూచాడు. ఆమెయెవరో తెలియదు. కణ్వుడా వయోవృధ్ధుడు. పైగా బ్రహ్మచారి. ఆయనకు కూతురెలాఉంటుంది? అదీ అనుమానం. మరి యెవరైయుంటుంది? పరపరి విధాలమనస్సు ఆలోచన చేస్తోంది.నిర్ధారణజరిగేదాకా మనః పరిభ్రమణంతప్పదుగదా! అదేయీపద్యంలో ని చిత్రణ!

.

ఫలానా కావొచ్చు అనుకోవటం, ఆలక్షణంలేదుకాబట్టి కాదనుకోవటం. అనేది , పృధక్కరణ! యిదోకావ్య కళాశిల్పం. ఆశిల్పమే అనల్పంగా యీ పద్యంలోకనిపించే విశేషం!

దేవతలేమో అనిమిషులు, మరి యీపిల్లను చూతామా రెప్పలాడిస్తోంది. కాబట్టి దేవకన్యకాదు. పోనీ బంగారం అందామా అది చలనంలేని లోహం. కానీ యీమెనడుస్తోంది. 

కాబట్టి పుత్తడి యనటానికీ వీలులేదు. పోనీ వనలక్ష్మియనుకుందామా? వస్త్ర ధారణ చేసినది కదా! కాబట్టి వనలక్మీ యనలేము. రతీదేవిృయని యనుకుందామా? పక్కన మనమధుడు లేడు. కాబట్టి అదీ కుదరదు. కానీ యిక్కడ కవియిక్కడ మన్మధుడు లేని రతిగా నామెను చెప్పుటచే, సమీప భవిష్యత్తులో ఆనాయకుని స్థానం మనం పూరించ వచ్చునులేయని దుష్యంతుని యభిప్రాయమైనట్లుగా ధ్వని. యిదండీ పిల్లల మఱ్ఱివారు చేసిన గారడీ!

నేనంటే వాళ్ళకి

 😆😆😆


చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మా మాస్టారు నన్ను కొట్టినప్పుడల్లా ప్రతీదెబ్బ తిన్న వెంటనే నేను చేతులను దులుపుకుని నా లాగుకి రాసుకున్న తర్వాతే రెండో దెబ్బకు చెయ్యి చాచేవాణ్ణి. శుచి-శుభ్రత అన్నది నాకు అప్పటినుంచే ఉండేది తెలుసా ! 


😊😊


అప్పట్లో మా గురువులంతా పాఠం చెప్పినంతసేపూ నిలబడే ఉండేవాళ్ళు, ఎందుకో తెలుసా? గౌరవం...

నేనంటే వాళ్ళకి అంత గౌరవం...అంతే!


            😊😊😊


నేను చదువుకునే రోజుల్లో

మా గురువులు నాలుగురోజులకొకసారి

మా నాన్నగారిని తీసుకుని రమ్మనే వారు! ఎందుకంటే వాళ్ళందరూ ఏ విషయమైనా నాకు సూటిగా చెప్పడానికి చాలా భయపడేవారు!


               😊😊


నేను రాసినవి చదవడానికి

మా గురువులంతా చాలా ఇష్టపడేవారు. అందుకే వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలకు కొన్ని వందలసార్లు మళ్ళీ మళ్ళీ రాసి చూపించమని ప్రతీరోజూ అభ్యర్థించేవారు!


            😊😜🫢


మా గురువులందరూ నన్ను "వీడొక సింహబలుడు" అన్నట్టుగా చూసేవారు. అందుకే వాళ్ళకి ఏమాత్రం భయం వేసినా క్లాసులో నుంచి నన్ను బయటకు పంపి గుమ్మం దగ్గర కాపలా కోసం నిల్చోబెట్టేవారు.


           😊😊😊


మా గురువులకి నేను చాలా తెలివైనవాడిని అనే భావన

బాగా బలంగా ఉండేది.

అందుకే వాళ్ళంతా,

"ఒరేయ్, నువ్వు స్కూలుకి ఎందుకొస్తావురా.

పోయి ఎక్కడైనా పనిలో చేరిపోవచ్చు కదా!", అని కనీసం రోజుకోసారైనా అనేవారు! 

అంటే... చిన్నప్పుడే నేను ఉద్యోగం చేసే తెలివి తేటలు సమర్ధత ఉన్నాయి అని ముందుగానే గ్రహించారు అన్నమాట..


          😊😜😊


అందుకే, నా చిన్నతనం నిజంగా ఒక స్వర్ణ యుగం! 

😀😀😀😊😊😊