🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 33*
కాలాంతరంలో నరేంద్రుడు ఇలా చెప్పాడు.
"ఆయన జవాబు నా మనస్సులో ప్రగాఢ ముద్ర వేసింది. 'నేను భగవంతుణ్ణి దర్శించాను; ఈ లోకాన్ని మనం అనుభూతం చేసుకోవడానికన్నా అనేక రెట్లు లోతుగా గ్రహించవలసిన విషయం' అంటూ వచించే ఒక వ్యక్తిని నేను ప్రప్రథమంగా కలుసుకొన్నాను. ఆయన చెప్పిన విషయాలు విన్న తరువాత, 'ఇతర మత బోధకులలా కల్పనలో స్ఫురించినది ఈయన మాట్లాడడం లేదు. భగవంతుని కోసం నిజంగానే సర్వస్వాన్నీ త్యజించి, ఆయనను మనఃస్ఫూర్తిగా ప్రార్థించి, భగవదనుభూతి పొంది, తదనుభవంతోనే మాట్లాడుతున్నారు' అని తెలుసుకొన్నాను.
"కాని ఆయన ఇప్పటి మాటలూ, కాసేపటి క్రితం ప్రవర్తించిన తీరూ ఎంతో విరుద్ధంగా కనిపించాయి. 'అలా అయితే కొన్ని సమయాల్లో స్పష్టంగాను, మరికొన్ని సమయాల్లో పిచ్చిపట్టినట్లూ ఉంటారా ఈయన? బహుశా సగం పిచ్చేమో!' అని అనిపించింది. ' కాని భగవంతుని కోసం ఇలా సర్వస్వాన్నీ త్యజించిన వ్యక్తిని చూడడం ఎంతో అరుదు. పిచ్చివాడే అయినప్పటికీ ఈయన పరమ పావనుడు, అత్యుత్తమ సాధువు; అందుకే మానవాళి స్తుతించి, ఆరాధించదగిన వ్యక్తి' అని అనుకొన్నాను.
మరో ఆశ్చర్యం కూడా కలుగకపోలేదు. నిద్రపోతున్నప్పుడు పొందుతున్న జ్యోతిర్మయ దర్శన అనుభవం గురించి తాను ప్రారంభంలో ఒకరిద్దరు మిత్రులతో చెప్పడంతో సరి! ఆ తరువాత ఎవరితోనూ ఆ సంగతి ప్రస్తావించలేదు. ఆ విషయం ఈయనకు ఎలా తెలిసింది? 'నాకు ధ్యానం పట్ల అమిత ఆసక్తి ఉండడమూ, నేను ధ్యానం చేయడమూ ఈయనకు ఎలా తెలుసు?' ఈ రకంగా అనేక ప్రశ్నల తరంగాలు చెలరేగాయి.
శ్రీరామకృష్ణులలో సైతం తరంగాలు ఉవ్వెత్తున లేచాయి. అవి ప్రేమ తరంగాలు! నరేంద్రుణ్ణి మళ్లీ చూడాలనే వ్యాకులతామయమైన తరంగాలు. ఆ వ్యాకలత ఆయన హృదయాన్ని మెలిపెట్టి పిండివేసింది.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి