4, జనవరి 2024, గురువారం

Free energy water pump


 

Charter flight


 

Great inventions


 

Pipe fitting


 

*కర్మ , తలుచుకుంటే

 *కర్మ , తలుచుకుంటే మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. 


*ఒక జంట భోజనం ముగించుకున్నాక ఆ ఇంటి ఇల్లాలు అన్ని సర్దుతున్నవేళ ఒక వ్యక్తి తలుపు కొట్టే శబ్దం వినిపించింది*

*ఎవరై ఉంటారు అని భర్త అడుగుతుంటే*

*ఆకలి అంటూ ఒక వ్యక్తి అన్నం పెట్టమని అడిగాడు*


*దానికి భార్య మిగిలిన కూర కాస్త అన్నం అతనికి పెట్టేస్తాను అంది**ఏమీ  అవసరం లేదు అవి అలాగే లోపల ఉంచేయి*

*రేపటికి మనకే పనికివస్థాయి అన్నాడు*

 *ఇలా చిన్న చిన్న మనస్పర్థలు పెరిగి పెద్దవయ్యాయి భార్యభర్తలు ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు.*


*అతడి పరిస్థితి* *తలకిందులైయింది, ఉద్యోగం పోయింది, అన్నం పెటేవారు లేరు ఇలా అతను**కటిక దరిద్రం అనుభవిస్తున్నాడు*


*భార్య మాత్రం విడిపోయాక కొన్ని ఏళ్ల తరువాత ఒక వ్యక్తిని వివాహం చేసుకుని హాయిగా గడుపుతుంది ఒకరోజు *భర్తతో కలిసి భోజనానికి సిద్ధం అవుతున్న వేల ఒక బిక్షగాడు ఆకలి అంటూ అన్నం పెట్టమంటే ఆ భర్త మొదట అతడికి పెట్టేసేయ్ తరువాత మనం వండుకోవచ్చులే అన్నాడు*


*సరే అని ఆమె బయటకెళ్లి వచ్చి బోరున ఏడవడం మొదలుపెట్టింది ఏమైంది అని అడిగాడు ఆ భర్త *వచ్చిన ఆ బిక్షగాడు ఎవరో తెలుసా నా మొదటి భర్త అని చెప్పింది *దానికి తాను నవ్వుతు నేనెవరో తెలుసా అని అడిగాడు . నేను ఆ రోజు ఆకలి అని నీ ఇంటి తలుపులు కొట్టినవాడిని అన్నాడు*


మిత్రులారా *జీవతం చాలా నేర్పిస్తుంది*

*నాకేంలే అని అనుకుని గర్వం చూపించగానే ఆ పొగరుని అనిచే రోజొకటి మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది*

*అహంకారం అసలు పనికిరాదు*

*జీవితం తలకిందులు అవడానికి చాలా సమయం అయితే తీసుకోదు*

*ఎదుటి వ్యక్తి బాగుంటే చూడలేని వారిని*

*నేను మాత్రమే బాగుండాలి అనుకున్న ప్రతి ఒక్కరి జీవితాలతోను దేవుడు ఏదో ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటాడు.*

*మనం చేసిన సహాయం లేదా అపకారం మనం మర్చిపోవచ్చేమో కానీ కాలం, కర్మ ఎప్పటికీ మర్చిపోవద్దు. ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది కచ్చితంగా మనకి ఇచ్చే తీరుతుంది మిత్రులారా!

                   🙏🙏

అయోధ్య శ్రీరాముని సేవలో

 


అయోధ్య శ్రీరాముని సేవలో ఎందరో ధన్యులు 🚩

#అయోధ్య గురించి మనలో (నాకు కూడా) ఇప్పటి వరకు తెలియని సంగతి తెలుసుకోండి. ప్రతి హిందువు తప్పక తెలుసుకోవాల్సిన సమాచారం ఇది.

అయోధ్యలో శ్రీరామ జన్మ భూమి మనకు రావడానికి ఒక ముఖ్య కారకుడు అయిన కె.కె.నాయర్‌  గారి గురించి తెలుసుకుందాం.

K.K.నాయర్ అని పిలువబడే కందంగళం కరుణాకరన్ నాయర్ 1907లో సెప్టెంబర్ 7న  కేరళలోని అలప్పుజా లోని గుటన్‌కడు అనే చిన్న గ్రామంలో జన్మించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు, అతను ఇంగ్లాండ్ వెళ్లి 21 సంవత్సరాల వయస్సులో బారిస్టర్ అయ్యి స్వదేశానికి తిరిగి వచ్చే ముందు ICS పరీక్షలో విజయం సాధించాడు. కేరళలో కొంతకాలం పనిచేసిన ఆయన నిజాయితీకి పేరుగాంచారు. ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రజల సేవకునిగా పేరు తెచ్చుకున్నారు.

1945లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ సర్వెంట్‌గా చేరారు. అతను వివిధ పదవులలో పనిచేశాడు. జూన్ 1, 1949న ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు.

బాల రాముని విగ్రహం అయోధ్య మందిరంలో హఠాత్తుగా కనిపించిందని ఫిర్యాదు రావడంతో  విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అప్పటి ప్రధాని నెహ్రూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ అక్కడికి వెళ్లి విచారణ చేయవలసిందిగా కె.కె.నాయర్‌ను కోరగా, KK నాయర్ తన సబార్డినేట్, శ్రీ గురుదత్ సింగ్ ని దర్యాప్తు చేసి నివేదిక ఇమ్మనమని కోరాడు. సింగ్ అక్కడికి వెళ్లి సమగ్ర నివేదికను కేకే నాయర్‌కు అందించారు. హిందువులు అయోధ్యను రాముడు (రామ్ లల్లా) జన్మస్థలంగా ఆరాధిస్తున్నారని, అది ఒక మసీదుగా ఉందని, అక్కడ ముస్లింలు సమస్యలు సృష్టిస్తున్నారు. కానీ అది హిందూ దేవాలయమని ఆయన నివేదిక తెలియచేసింది.  అంతేగాక అక్కడ పెద్ద దేవాలయం నిర్మించాలని కూడా ఆయన సూచించారు. దాని కోసం ప్రభుత్వం భూమి కేటాయించాలని, గొడవలు జరగకుండా ముస్లింలు ఆ ప్రాంతానికి వెళ్లకుండా నిషేధించాలని ఆయన నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదిక ఆధారంగా ఆలయానికి 500 మీటర్ల పరిధిలోకి ముస్లింలు వెళ్లడాన్ని నిషేధిస్తూ నాయర్ ఉత్తర్వులు జారీ చేశారు. (ఈ నిషేధాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం కానీ, కోర్టు కానీ ఎత్తివేయలేకపోవడం గమనార్హం). ఇది విని, నెహ్రూ చిరాకు పడి కోపం తెచ్చుకుని  ఆ ప్రాంతం నుండి హిందువులను తక్షణమే ఖాళీ చేయించి రామ్ లల్లాను తొలగించాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

నెహ్రు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ వెంటనే హిందువులను ఖాళీ చేయించాలని, రామ్ లల్లా విగ్రహాన్ని తొలగించాలని నాయర్‌ను ఆదేశించారు. కానీ నాయర్ ఆ ఉత్తర్వులను అమలు చేసేందుకు నిరాకరిస్తూ,  మరోవైపు, రామ లల్లాకు రోజూ పూజ చేయాలని మరో ఆదేశం జారీ చేస్తూ పూజకు అయ్యే ఖర్చు, పూజ చేసే పూజారి జీతం కూడా ప్రభుత్వమే భరించాలని ఉత్తర్వు జారీ చేశారు.

ఈ ఉత్తర్వుతో భయపడిన నెహ్రూ వెంటనే నాయర్‌ని ఆ పదవి నుండి తొలగించాలని ఆదేశించారు. అయితే, నాయర్ అలహాబాద్ కోర్టుకు వెళ్లి తన కేసు తానే వాదించుకుని నెహ్రూ జారీ చేయించిన తొలగింపు ఉత్తర్వులకు వ్యతిరేకంగా విజయం సాధించారు. నాయర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అదే స్థలంలో పని చేసేందుకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశం నెహ్రూకు చెంపపెట్టులా తగిలింది.

ఈ పరిస్థితులలో అయోధ్య వాసులు ఎన్నికల్లో పోటీ చేయాలని నాయర్‌ను కోరారు. అయితే ప్రభుత్వోద్యోగి అయిన తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని నాయర్‌ చెప్పడంతో, నాయర్ భార్యను అయినా పోటీ చేయాలని అయోధ్య వాసులు కోరారు.  ప్రజల అభ్యర్థనను అంగీకరిస్తూ, శ్రీమతి శకుంతలా నాయర్ ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా అయోధ్యలో అభ్యర్థిగా బరిలోకి దిగారు.

అప్పట్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించినా, అయోధ్యలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిపై నాయర్ భార్య భారీ మెజారిటీతో గెలిచారు. శ్రీమతి శకుంతల నాయర్ 1952లో జనసంఘ్‌లో చేరి సంస్థను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. ఇది చూసి ఆశ్చర్యపోయిన నెహ్రూ మరియు కాంగ్రెస్ పార్టీ నాయర్‌పై ఒత్తిడి తీసుకురావడంతో నాయర్  తన పదవికి రాజీనామా చేసి అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించాడు. 1967లో పార్లమెంటుకు ఎన్నికలు ప్రకటించబడినప్పుడు, ప్రజలు నాయర్ మరియు అతని భార్యను పోటీకి ఒప్పించడంలో విజయం సాధించారు. బహ్రైచ్ మరియు కైసర్‌గంజ్ నియోజకవర్గాలను గెలవడానికి ప్రజలు నాయర్ దంపతులకు సహాయం చేసారు. వారిది ఒక చారిత్రాత్మక విజయం. శకుంతల నాయర్ గారు మొత్తంగా ఒకసారి ఎమ్మెల్యే గా మూడుసార్లు ఎంపీ గా గెలిచారు. విచిత్రం ఏమిటంటే నాయర్ గారి పలుకుబడి ఎంత అంటే, అతని డ్రైవర్ కూడా ఫైసలాబాద్ నియోజకవర్గం నుండి రాష్ట్ర శాసనసభ్యునిగా ఒకసారి ఎన్నికయ్యాడు.

ఆ తర్వాత ఇందిర పాలనలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించినపుడు ఈ దంపతులను అరెస్టు చేసి జైలులో పెట్టారు. కానీ వారి అరెస్టు అయోధ్యలో భారీ అలజడికి కారణం అవ్వడంతో భయపడిన ప్రభుత్వం వారిని జైలు నుండి వెంటనే విడుదల చేసింది. ఆ దంపతులు అయోధ్యకు తిరిగి వచ్చి తమ ప్రజా సేవను కొనసాగించారు. స్వాతంత్య్రానంతరం అయోధ్య కేసును తొలిసారిగా పరిష్కరించింది నాయర్. ఇది పూర్తిగా అతనిచే నిర్వహించబడింది. మరి ఇప్పటికీ కూడా ఆయన అధికారిగా జారీ చేసిన ఉత్తర్వులను హిందూ వ్యతిరేకులు మార్చలేకపోయారు.

నాయర్ జారీ చేసిన నాటి ఆదేశాల ఆధారంగానే పూజలు మరియు రామ్ లల్లా దర్శనం ఇప్పుడు కూడా కొనసాగుతోంది.

1976లో, మిస్టర్ నాయర్ తన స్వగ్రామానికి తిరిగి రావాలనుకున్నాడు. అయితే ఆయన వెళ్లేందుకు ప్రజలు అనుమతించలేదు. అయితే నాయర్ తన చివరి రోజుల్లో తన స్వగ్రామంలో ఉండాలనుకుంటున్నానని ప్రజలకు నచ్చచెప్పి వీడ్కోలు తీసుకున్నారు.

సెప్టెంబర్ 7వ తేదీ 1977 లో ఆయన తన స్వగ్రామంలో శ్రీరామచంద్రమూర్తి పాదారవిందాలకు చేరుకున్నాడు. ఆయన చితాభస్మాన్ని స్వీకరించేందుకు అయోధ్య నుండి ఒక బృందం కేరళకు వెళ్లింది. ఆ చితాభస్మాన్ని  అలంకరించిన రథంలో ఘనంగా ఊరేగించి శ్రీరాముడు రోజూ స్నానం చేసి సూర్యుడిని ఆరాధించిన అయోధ్యలోని సరయు నదిలో నిమజ్జనం చేసారు.

నాయర్ కృషి వల్లనే మనం అయోధ్యలోని శ్రీరామ జన్మ భూమిలో పూజలు చేయగలుగుతున్నాం. అయోధ్య ప్రజలు ఆయనను *దైవమైన వ్యక్తిగా* పరిగణించడంలో ఆశ్చర్యం లేదు. ఆయన అయోధ్య విషయంలో చేసిన కృషికి గాను విశ్వ హిందూ పరిషత్ వారు అతని స్వగ్రామంలో భూమిని కొని అతనికి స్మారక చిహ్నం నిర్మించారు. K.K నాయర్ పేరుతో ప్రారంభించబడిన ట్రస్ట్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు మరియు శిక్షణను అందిస్తోంది.

జై శ్రీ రామ్ 🚩

....చాడా శాస్త్రి...

⚜ శ్రీ ధ్యున్సర్ మహాదేవ్ మందిర్

 🕉 మన గుడి : నెం 287


⚜ హిమాచల్ ప్రదేశ్  : తల్మెహ్రా


⚜ శ్రీ ధ్యున్సర్ మహాదేవ్ మందిర్



💠 ప్రపంచంలోని ప్రతిఆలయానికి  ఎదో ఒక చరిత్ర ఉంది, కానీ వాటి వెనుక చాలా ముఖ్యమైన చరిత్రను కలిగి ఉన్న ఆలయాలు ప్రపంచంలో చాలా తక్కువ  ఉన్నాయి.

ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్న భౌగోళిక, వాతావరణం మరియు ప్రశాంతమైన వాతావరణం 'దేవాల' భూమి అని పిలువబడే మరియు ఆకర్షిస్తున్న ప్రదేశాలలో హిమాచల ప్రదేశ్ ఒకటి.

హిమాచల్ ప్రదేశ్‌లోని జిల్లా ఉనాలోని ప్రసిద్ధ కొండలలో ధయూన్సర్ కొండ ఒకటి, ఎందుకంటే దానిపై చారిత్రాత్మక  శివాలయం ఉంది,



💠 ధ్యున్సర్ మహాదేవ్ శివాలయం చాలా పురాతనమైన దేవాలయం, దాదాపు 5500 సంవత్సరాల నాటిది. 

దీనిని సాధారణంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులు సదా శివ మందిర్/శివ్ తిల్లా అని పిలుస్తారు.


💠 ఈ ఆలయంలోని శివలింగం ...పార్వతి మరియు శివుని రూపంలో ఉంటుంది.


💠 ద్వాపర యుగంలో, శ్రీ ధౌమ్య ఋషి ఈ పర్వతాల గుండా తిరుగుతూ, ఒకసారి ఈ ధ్యుంసర్ పర్వతం మీదుగా వచ్చి ఈ పర్వతం వద్ద తపస్సు చేసాడు మరియు శివుడు అతనికి ఈ ప్రదేశంలో దర్శనం ఇచ్చాడు  అందుకే ఈ ప్రదేశం ధ్యున్సర్ సదా శివాలయంగా  ప్రసిద్ధి చెందింది.  

తరువాత, పాండవులు తమ అజ్ఞాతవాస సమయంలో ఈ ప్రదేశంలో ఒక మందిరాన్ని నిర్మించారు.


💠 శ్రీ ఓంకారానంద ఋషి ఉత్తర భారతదేశంలోని ఉత్తర కాశీ యొక్క పవిత్ర ప్రదేశంలో మరియు గంగా నది ఒడ్డున అతను క్రమం తప్పకుండా తపస్సు చేశాడు. 

 1937వ సంవత్సరంలో శివుడు స్వామికి కలలోకి వచ్చి ఈ ఆలయంలో భజన చేయమని కోరాడు. 


💠 శివుడు సాధువు యొక్క ధ్యానానికి ముగ్ధుడై ఒక వరం ఇచ్చాడు.

ఈ ధాయుంసర్ కొండ చుట్టూ ఎవరైతే ధ్యానం చేస్తారో, అతని కోరికలు నెరవేరాలని సాధువు అభ్యర్థించాడు. 

శివుడు ఇక్కడ ధ్యానం చేసేవారి కోరికలను తీరుస్తానని వాగ్దానం చేశాడు. 

ఇది ధ్యానం మరియు ఆధ్యాత్మిక విశ్రాంతికి అనువైన ప్రదేశం. 


💠  తర్వాత అతను ఈ ఆలయం కోసం చాలా కాలం పాటు వెతుకుతూనే ఉన్నాడు మరియు ఒకసారి 1947లో, శ్రీ శివ ప్రసాద్ శర్మ సహాయంతో, అతను ఈ స్థలాన్ని కనుగొనగలిగాడు మరియు అతను ఈ ఆలయానికి సమీపంలోని ఒక గుహలో (గుఫా) బస చేసి తన  తపస్సు పూర్తి చేశాడు.

 1948లో, ప్రజల సహాయంతో అతను ఆలయాన్ని నిర్మించాడు



💠 ధ్యాన్‌సర్ మహాదేవ్ ఆలయం దాని ఉత్సవాలు మరియు వేడుకలకు ప్రసిద్ధి చెందింది. 

ఇక్కడ మహాశివరాత్రి అత్యంత వైభవంగా జరుపుకుంటారు. 

దీనిని స్థానిక ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. 

నిజమైన హృదయంతో ఏది అడిగినా ఇక్కడ ఖచ్చితంగా లభిస్తుందని స్థానిక ప్రజలు నమ్ముతారు. 

ఆలయంలో నవరాత్రి, దీపావళి, హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి.


💠.సుదూర ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకుల కోసం, ధర్మశాలలో చాలా మంచి ఏర్పాటు ఉంది, ఇక్కడ సుమారు 500 మంది వ్యక్తులు బస చేయవచ్చు.

 

 🔅 కీర్తన హాల్:-

ఇక్కడ పెద్ద కీర్తన మందిరం ఉంది, దీనిలో దాదాపు 7000 మంది కలిసి ప్రార్థన చేయవచ్చు.


🔅 లంగర్ హాల్:- ( అన్నదానం)

లంగర్ హాల్ కూడా పాత్రల సరైన అమరికతో నిర్వహించబడుతుంది మరియు ఆహారం ప్రేమ మరియు ఆప్యాయతతో అందించబడుతుంది.  ఈ పవిత్ర ఆలయాన్ని పగలు మరియు సాయంత్రం సందర్శించే భక్తులకు ఉచితంగా రోజువారీ లంగర్ వడ్డిస్తారు.


🔅 హవాన్ భవనం:-

ఇక్కడ ఒక హవాన్ భవనం ఉంది, ఇక్కడ భక్తులు ప్రార్థనలు చేస్తారు మరియు ఆచారాలు చేస్తారు.


💠ఉనా నుండి 35కిమీ దూరంలో ఉంది.

 ఢిల్లీ - చండీగఢ్ - రోపర్ - నంగల్ - ఉనా - 430 కి.మీ.

జలంధర్ - హోషియార్పూర్ - ఉనా - 90 కి.మీ



 

వేగముగా గమ్యమునకు

 *1991*

*కం*

వేగముగా గమ్యమునకు

నేగెడి యాత్రంబుతోడ నిర్భాగ్యజనుల్

ఆగమమౌ మృత్యువొడిని

వేగిరమునచేరుచుండె విధివిడి సుజనా.

*భావం*:-- ఓ సుజనా! వేగంగా గమ్యం చేరుకోవాలనే ఆత్రంతో నిర్భాగ్యులు ఎప్పుడో చేరవలసిన మృత్యువు వొడికి వేగంగా విధిని విడిచిపెట్టి చేరుతున్నారు.

*సందర్భం*:-- ఈనాడు కొందరు నిర్భాగ్యులు వేగంగా వాహనాలు నడుపుచూ శ్రీఘ్రంగా గమ్యంచేరాలనే ఆత్రంతో ప్రాణాలను కాపాడుకొనలేక పోవుచున్నారు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

Jokes