ఒబేసిటీ గురించి సంపూర్ణ వివరణ -
ఒబేసిటీ గురించి ఆయుర్వేదం చాలా చక్కగా వివరిస్తుంది. ఆయుర్వేదంలో అతి కొవ్వురోగం అని పిలుస్తారు . ఒబేసిటీ రావడానికి గల ప్రధాన కారణం శ్లేష్మకారకాలు అయిన పదార్ధాలను అతిగా తీసుకోవడం అదేవిధముగా అంతకు ముందు తీసుకున్న ఆహారం సంపూర్ణంగా జీర్ణం కాకుండానే మళ్ళీ ఆహారం తీసుకోవడం , సరైన వ్యాయామం చేయకపోవటం , పగలు అతిగా నిద్రించడం , మైధున ప్రక్రియ లేకపోవడం , మనస్సుకు ఆలోచన లేకుండా ఒకేచోట కూర్చుండిపోవడం వంటి కారణాల వలన శరీరంలో కొవ్వు ఎక్కువ పేరుకొనిపోవును. స్థూలకాయుల అయిన తల్లితండ్రులకు పుట్టడంకూడా మరొక కారణం అగును.
పైన చెప్పిన కారణాల వల్లన శరీరంలో మేధోధాతువు వృద్ధిపొందుతుంది. శరీరంలో కొవ్వుపెరగడం మొదలైతే ఏది తినినను అది కొవ్వుగా మారును . శరీరానికి అవసరం అయిన మిగిలిన ధాతువులుగా ఆహారరసం పరిణమించదు. ఒక్క కొవ్వు మాత్రమే పెరుగుతూ మిగిలిన ధాతు పోషణం లేకపోవటం వలన ఆయుష్షు తగ్గిపోవును .
శరీరంలో పెరిగే కొవ్వుకు శైధిల్యం చెందించే గుణము కలదు. ఇది సుకుమారము , గౌరవము అగు ధాతువు అగుట చేత శరీరముకు త్వరగా ముసలితనపు లక్షణాలు వస్తాయి. దానివలన ఎటువంటి పనిచేయలేకపోతాడు. శుక్రధాతువు స్వల్ప పరిమాణంలో ఉండటం చేత ఉన్న కొంచం శుక్రానికి కొవ్వు పెరగటం వలన మార్గావరోధం ఏర్పడుట వలన సంసారసంబంధ కార్యం చాలా తగ్గిపోవును . ఇతర ధాతువులు క్షీణించి మేధస్సు మాత్రం పెరుగుట చేత కలిగిన ధాతు వైషమ్యం వలన శరీరంలో బలహీనతను వృద్ది చేస్తుంది.
సహజసిద్ధంగానే కొవ్వు ఒకరకమయిన దుర్వాసన కలిగి ఉంటుంది. శరీరం నందు కొవ్వు అతిగా ఉన్నటువంటి వ్యక్తికి చెమట అధికంగా పట్టును . దీనివలన శరీరం నుంచి దుర్వాసన అధికం అగును. అదే సమయంలో శరీరంలో కొవ్వుతో పాటు శ్లేష్మం కూడా అధికం అగుట చేత ఈ రెండూ నెయ్యి వలే కరిగే స్వభావం ఉండటం చేత వ్యాయమం చేయుటకు కూడా ఇష్టం అనిపించదు . కొవ్వు పేరుకుపోవడం వలన శరీరంలో వాతమార్గాలను అడ్డం ఏర్పడును . ఇలా మార్గావరోధం ఏర్పడటం వలన వాతం ఉదరంలో తిరుగుతూ వృద్ది చెంది తనతోపాటు జఠరాగ్నిని కూడా వృద్ధిచెందించును. దీనివల్ల అతిగా కొవ్వుతో బాధపడే వ్యక్తికి ఆకలి ఎక్కువ అగును. అతిగా నీటిని సేవిస్తాడు. త్వరగా జీర్ణం అవ్వును. మరలా తింటాడు. దీనివల్ల కొవ్వుతో పాటు కొంచం మాంసం కూడా వృద్ధిచెంది పిరుదులు, పొట్ట, స్తన ప్రదేశం బాగా లావు అయ్యి వేలాడుచుండును. కూర్చున్నప్పుడు , లేచేప్పుడు ఆయాసపడుతూ ఉంటాడు. ఇలా ఆయసపడుతూ శ్వాస తీసుకోవడాన్ని ఆయుర్వేదంలో క్షుద్రశ్వాస అని అంటారు.
పైన చెప్పిన విధంగా అతిగా కొవ్వుపట్టిన వ్యక్తి ఆహారం తీసుకునే వేళ తప్పితే ఆకలిబాధ అస్సలు భరించలేడు . ఎప్పుడూ ఆకలిగానే ఉంటాడు ఎప్పుడూ దప్పికతోనే ఉంటాడు. పడుకుంటే కంఠం నుంచి గురగురమని శబ్దం పుడుతుంది. మాట్లాడబోతే పూర్తిగా మాట బయటకి రాదు .
శ్లేష్మ, మేథస్సు వలన పుట్టిన రసం ఈ రోగానికి కారణం అని ఆయుర్వేదం చెప్తుంది. అతిస్థూలకాయుడు పైన చెప్పిన లక్షణములతో కొంత వయస్సు గడిపి పూర్తి వయస్సు గడవక మునుపే ప్రమేహ వ్రణాలతోనో , జ్వరం వల్ల గాని భగంధరం వల్ల కాని , విద్రది వల్లనో , తీవ్రమైన సన్నిపాత జ్వరం వల్లనో పట్టుకొని మరణించుట తప్పక జరుగును.
గమనిక -
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
9885030034
అనువంశిక ఆయుర్వేద వైద్యులు