17, నవంబర్ 2020, మంగళవారం

క్షేత్ర సందర్శనం:త్రేతాయుగం


క్షేత్ర సందర్శనం:త్రేతాయుగం నాటి క్షేత్రం... జూత్తిగ. 


వ్యాసుడు రచించిన పురాణాల్లో వాయుపురాణం ఒకటి.ఆపురా ణంలో గోస్తనీ నది గురించి ఉమా మహేశ్వరక్షేత్రం గురించిరాసారు. సాక్షాత్తు ఆక్షేత్రమేనేటికి పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రమండ లంలో జుత్తిగ గ్రామంలో అలరారు తోంది. సుందరమైన ప్రకృతిరమణీ యతల మధ్య నిర్మితమైన చారిత్రక దేవాలయం ఇది.

భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువుగా విరాజిల్లుతున్న ఈ ఆలయాన్ని దర్శించు కున్న భక్తులంతా ఆధ్యాత్మిక ఆనందానికి గురౌతారు. ఈ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామిని సేవించేవారికి శత్రు, రుణ, రోగ, మృత్యు భయాలు ఉండవని అంటారు. సోమవారం నాడు ఈ శివలింగాన్ని సేవించి అన్నదానం చేస్తే కోటి రెట్లు ఫలితం కలుగు తుందట. మహాశివరాత్రి పర్వదినాన ఈ శివలింగానికి అభిషేకం చేసి అర్చించినవారు పునర్జన్మ రహితమైన కైవల్యం పొందగలరు. జుత్తిగలోని సోమేశ్వర స్వామి ఆలయం కాశీ క్షేత్రమంత పవిత్రమైనది. | త్రేతాయుగంలో రావణాసురుడు, అతని పరివారం దేవతలందరిని పీడిస్తుండే వారు. అలా ఒకరోజు రవి, వాసుకి, సోము డు, రావణ భటులచేపరభావింపబడి దుఃఖిస్తుండగా, బ్రహ్మ చూసి వారి దుఃఖాన్ని పోగేట్టుందుకు, రావణవధ శీఘ్రంగా జరిగి లోక కళ్యాణం జరిగేందుకు వారికి ఒక సలహా ఇచ్చారట. బ్రహ్మ ఆదేశానుసారము ఉమా, వాసుకి, సూర్యచంద్రులు గోస్తనీ నది తీరంలో ఉత్తర వాహిని, నిత్య పుష్కరిణి ఉన్నచోట పశ్చిమాభిముఖంగా శివలింగా న్ని ప్రతిష్టించి కొలవసాగారు. అలా త్రేతా యుగంలో నెలకొల్పబడిన ఈ లింగమే శ్రీ

*

ఉమావాసుకి | సోమేశ్వర లింగం.15వ శతా బ్దంలో ఖిల్జీ పాదుషావారి ఆజ్ఞానుసారం సత్తిరాజు వంశస్తులచే ఈ దేవాలయం పున ర్నిర్మాణం జరిగినట్లుగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది. సత్తిరాజు వంశస్తులే నిర్వాహక ధర్మకర్తలుగా ఉంటున్నారు.

ఆలయ గోపురాలు రమణీయ ప్రతిమ లతో దర్శనమిస్తాయి. గర్భాలయంలో శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి లింగం స్పటిక స్వచ్చంగా, పవిత్రంగా భాసిస్తుంది. స్వామికి మహాన్యాస, నమక, చమక సంపుటీ కరణతో అభిషేకాలు, బిల్వార్చన భక్తులు నిర్వర్తింప చేసుకుంటూ ఇహపర ఫలితా లను అందుకుంటారు. ఉమా, వాసుకీ రవి సోమేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవా లను మాఘమాసం బహుళ పక్షంలో దశమి నుంచి అమావాస్య వరకూ నిర్వహిస్తారు.

ఈ ఆలయంలో ఉత్తరాన దక్షిణాది ము ఖంగా పార్వతీదేవి భక్తులకు దర్శనం ఇస్తుం ది. గర్భాలయాన అమ్మవారు స్వర్ణ కిరీట ధారినై కుంకుమార్చనలను అందుకుంటూ ఉంటుంది. ఈ ప్రాంగణంలో అనేక దేవి, దేవతల ఆలయాలు ఉన్నాయి. పార్వతిదేవి ఎడమ భాగాన శ్రీ భద్రకాళి, వీరభద్రేశ్వరుల ఆలయం ఉంది. మండప స్తంభాలు నయన మనోహరంగా ఉంటాయి. ప్రధాన ఆలయం శివలింగానికి ఎదురుగా ముఖమండపంలో శ్రీ శారదాదేవి, శ్రీ అనిస్రమ్మదేవి దర్శనమిస్తా రు. ఇక్కడ లక్ష్మి జనార్ధన స్వామి ఆలయం ఉంది. వైశాఖ శుద్ధ త్రయోదశి నుండి పౌర్ణమి వరకు లక్ష్మి జనార్దనస్వామి కళ్యాణ మహో త్సవాలు జరుగుతుంటాయి. ఆలయానికి ఈశాన్యంలో శ్రీ సూర్యనారాయణుడు, ఛాయాదేవి సహితంగా ఉషఃకిరణ కాంతు లతో దర్శనమిస్తాడు. శ్రీ కాలభైరవస్వామీ ఆలయాన్ని 1924వ సంవత్సరంలో

సత్తిరాజు వంశస్తులే ప్రతిష్టించారు. ప్రధాన ఆలయానికి ఆగ్నేయంలోగణపతి, నైరుతి దిక్కున శ్రీ దుర్గాదేవి ప్రతిష్ణుతులై పూజలం దుకుంటున్నారు. అలాగే 1958లో నిర్మిం చిన దూతికాదేవి ఆలయం ఇక్కడ నెలకొని ఉంది. ఇక్కడ 1997-98వ సంవత్సరంలో నవగ్రహమండపాన్ని నిర్మించారు. ఆలయ రెండవ ప్రాకారంలో శ్రీవల్లి సమేతుడైన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి నెలకొని ఉన్నారు. ఇది 1907వ సంవత్సరంలో నిర్మింపబడినది. ఇక్కడ ప్రతి మంగళవారం పూజలు జరుగు తాయి. మార్గశిర శుద్ధ పంచమినాడు శ్రీ వల్లి దేవి సుబ్రహ్మణ్యస్వామి వారి కళ్యాణం, తీర్ధం జరుగుతాయి. ఈ ఆలయములో సంతానము లేని దంపతులు పూజలు చేసిన సంతానము కలుగుతుందని నమ్ముతారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి చేరువలోనే చంద్ర పుష్కరిణి ఉంది. మొదటి ప్రాకారాని కి ఉత్తర దిక్కులో శ్రీ కంచి కామాక్షి ఆలయం కూడా సందర్శించుకోవచ్చు. కామాక్షి దేవికి కుంకుమ పూజలు విశేషంగా నిర్వహిస్తారు.

ఈ ఆలయంలో స్వామికి రోగ పీడి తులు మృత్యుంజయ అభిషేకం చేయించ టం, సుఖజీవన సంప్రాప్తికి సోపానంగా విశ్వ సిస్తారు. మాఘ బహుళ దశమి నుండి అమా వాస్య వరకు ఏటా ఉమా వాసుకి రవి సోమే శ్వరస్వామి కళ్యాణోత్సవాలు జరుగుతాయి. " కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ ఆలయాన్ని దర్శించి స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మృత్యుంజయ అభిషేకం చేసుకోవడం వలన సమస్య నుంచి విముక్తి కలుగుతుంది.

ఎలా వెళ్లాలి...? జుత్తిగకు తణుకు నుండి అన్ని రవాణా సౌకర్యాలు ఉన్నాయి. తణుకు పట్టణం నుండి ఈ క్షేత్రం 14 కి.మీ. దూరంలో ఉంది. తాడేపల్లి గూడెం నుండి 28 కి.మీ., అత్తిలి నుండి 6 కి.మీ., మార్టేరు నుండి 15 కి.మీ. దూరంలో ఈ క్షేత్రముంది.


🌷🌷🕉🌷🌷🕉🌷🌷🕉🌷🌷🕉

కామెంట్‌లు లేవు: