23, జూన్ 2022, గురువారం

అహోబిలంలో నిలువుదోపిడి

 అహోబిలంలో నిలువుదోపిడి


*లక్ష్మీ నరసింహ ఇక మేము నీ దర్శనానికి రాలేము* 👏 

 *మమ్మలని క్చమించండీ స్వామి 👏* 


నంద్యాల జిల్లా 

అహోబిలం లో


👉అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం వారి దోపిడీ


👉 మాకు ఫ్రీ నే కదా అని 😁 పట్టించు కోని ఎమ్మెల్యే లు ,ఎంపీ లు ,నాయకులు ,అధికారులు  🤔


👉అహోబిలం  దర్శనం కావాలంటే జేబులకు చిల్లు పడాల్సిందే


👉అహోబిలం ఎంటర్ కాగానే నిర్మొహమా టంగా  ముక్కు పిండి మరీ రూ. 150 .00 లు కార్ పార్కింగ్ పేరుతో వసూలు చేస్తారు.


 *కేశకండన* 


👉" కేశకండన " దగ్గర కూడా10₹ తీసుకొని టికెట్ ఇస్థారు


👉గుండుగిసే వాడు 🤦‍♂️

నిర్మొహమాటంగా   పెద్దలకు ,పిల్లలకు అనే తేడా లేకుండా 100₹ లు రూపాయలు ఇస్తేనే గుండు ‼️

లేక పోతే లేదు.

 

👉మా ఇష్టం వచ్చినట్లు మేము రాబట్టు కుంటాం అంటున్న టోల్ గేట్ కాంట్రాక్టర్

 

👉మమ్ములను అడిగే హక్కు ఎవరికీ లేదు అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి.


👉ఇదేంది బయట బోర్డు.ఎవరికి డబ్బులు ఇవ్వరాదు అని ఉంది మీరేమో డబ్బులు తీసుకుంటున్నారు అంటే ఆ బోర్డులు ఎవరు పెట్టారో మాకు తెలియదు అంటూ నిర్లక్ష సమాధానం.


👉మాకు దానితో సంబంధం లేదు డబ్బులు ఇవ్వా ల్సిందే.... 


👉అంత పెద్ద టెంపుల్ లొ ఫ్రీగా ఆలయ కమిటి  కేశకండనం కూడా చేపించలేక పోవడం కొసమెరుపు.🤦‍♂️🤦‍♂️🙏🙏🙏


 *దర్శనం* 


👉 ఇక దర్శనం కావాలంటే మీకు స్పెషల్ దర్శనం కావాలంటే ఒక రేటు, 

శీఘ్ర దర్శనం కావాలంటే ఒక రేటు

ఇలా ఒక్కో దర్శనానికి ఒక్కో రేటు🤔


  *కార్ పార్కింగ్* 


👉ఇక కార్ పార్కింగ్ విషయానికి వస్తె ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్న వ్యాపారులు 

అహోబిలంలో గుడికి 3 - 4  కిలోమీటర్ల ముందుగానే ఆపివే యడం కొసమెరుపు.


👉4 కిమి  దూరం లోనే కొండ చెట్లు, గుట్టల మధ్యనే పోలీసులను పెట్టీ మరీ ఆపడం ఒక ఎత్తైతే భక్తులు ఎవరైనా మేము నడవలేము, మేము ముసలి వాళ్ళం , మేము ఆడవాళ్ళం ,మాకు చిన్న పిల్లలు ఉన్నారు అని ఎంత విన్న వించు కున్నా  కూడా పోలీసులు వినిపించుకోవడం లేదంటూ భక్తుల ఆరోపణ. 


👉తమకు కావలసిన వారికి మాత్రమే వారి వాహనాలు అనుమ తించడం గమనార్హం.  


 *స్నాన ఘట్టాలు :* 


👉 స్నాన ఘట్టాలు : ఏదో కరెంటు ఉంటే నీరు ఒక 4 కొలాయి లలో వస్తాయి ‼️లేకపోతే అదీ లేదు🤔


👉ఇక స్త్రీలు బట్టలు మార్చు కొనుటకు కనీసం ఒక  నీడ కానీ ఒక రూం కానీ లేక పోవడం , 


 *మరుడొడ్లు* 


👉స్త్రీల కు కనీసం మరుడొడ్లు కూడా లేక పోవడం గమనార్హం

 

👉ఇవేవీ లేకుండా నే భక్తుల నుంచి ముక్కు పిండి డబ్బులు దోచుకుంటున్న దేవస్థానం.


👉 పూలు మూర కావాలా రూ.100.00 లు కావాల్సిందే


👉 తులసి ఆకులు /మాల రూ. 100/- 🤔


👉టెంకాయ కావాలా కేవలం 50/- , 60 /- మాత్రమే🤔


👉 త్రాగు నీరు కావాలా - 70 రూ మాత్రమే


👉  గమ్య స్థానాలకు వెళ్లే లోపు ఇలాంటి టోల్ గేట్ లు ఎన్నో లెక్క లేదు


👉 గుడి దగ్గర ఎంట్రన్స్ లోనే పార్కింగ్ పేరుతో , టోల్ గేట్ పేరుతో మరో రూ.150/- లు అక్షరాల చెల్లించాలి.


👉 రూ.150/- కట్టీ 3 , 4 కి మీ ర్ల దూరంలో పార్క్ చేసి అక్కడి నుంచీ కాలికి బుద్ధి చెప్పాల్సిందే


👉 గుడికి వెళ్ళాక అక్కడ గంటల కొద్ది క్యూ లో ఉండి రూ.10/- పెట్టీ తల నీలాలు టికెట్ తెచ్చు కోవాలి


👉 రూ.10/- ఇస్తే సరిపోదు ,అక్చరాలా రూ. 100 /- లు లంచం ఇస్తేనే గుండు 

లేక పొతే లేదు 


మీకు ఇష్టమైతే నే గుండు లేక పోతే లేదు , మీరు ఎవరికి చెప్పుకున్నా సరే🤔


👉 పాద రక్చలు ఉంచు కోవాలంటే  డబ్బు చెల్లించు కోవాలి.


👉ఇంతా కస్టపడి వెళితే , అక్కడ భారీ క్యూ ఉంటుంది 


👉 ఆ క్యూ లో గంటల తరబడి నిలుచొని వెళితే , కనీసం స్వామిని కళ్ళారా చూసి తరించే అవకాశం ఉండదు. క్షణం లో బయటకు తోస్తారు.


👉 బయటికి వచ్చి ఏమైనా పిల్లకు తినే తందుకూ కొనిపెడదమంటే 

ఇంక చెప్ప నక్కర్లేదు, ఒక చిన్న పిల్లవాడి ఆకలి తీర్చా లి అంటే


👉ఒక దోశె 50/- 70/- అంటే ఒక మనిషికి రూ.150/- దాటల్సిందే.


👉ఇంక కుటుంబ సభ్యులకు ఆకలి తీర్చా లి అంటే రూ.1000/- కావాల్సిందే.


ఇది అహోబిలం పరిస్తితి 


భగవంతుడా నీ దర్శనం ఇంత ఖరీదైనది అయింది 


మేము నీ దర్శనానికి రాలేము తండ్రీ మమ్మల్ని క్షమించండి.


...దోపిడిలో అందరికి భాగస్వామ్యం కావడంతో భక్తులను దోచుకుంటున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు.

...ప్రధాన ఆలయాల్లో దోపిడీని నివారించే నాధుడే కరువయ్యారు.

...దేవాలయాల్లో దోపిడితో ఆలయాలకు పోవాలంటేనే ఖర్చుతో కూడుకున్న పని అని భక్తులు అంటున్నారు.

....సమస్యలు విన్నవించుకొని తమ కష్టాలు తీర్చుకోవడానికి వెళ్లే భక్తుల కుటుంబాలకు దేవాలయాల్లో అడుగు పెట్టి బయటికి రావాలంటే ఒకొక్క కుటుంబానికి వెయ్యి నుంచి మూడు వేలు ఖర్చుఅవుతుందంటూ వాపోతున్నారు.

...దేవా మీ దర్శనం పొందాలంటే మాకింత ముందే మహాలక్ష్మిని కనుకరించు మహా ప్రభో అంటూ భక్తులు ముక్కుతున్నారు.


*లక్ష్మీ నరసింహ ఇక మేము నీ దర్శనానికి రాలేము* 👏 

 *మమ్మలని క్చమించండీ స్వామి 👏* 


నంద్యాల జిల్లా 

అహోబిలం లో


👉అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం వారి దోపిడీ


👉 మాకు ఫ్రీ నే కదా అని 😁 పట్టించు కోని ఎమ్మెల్యే లు ,ఎంపీ లు ,నాయకులు ,అధికారులు  🤔


👉అహోబిలం  దర్శనం కావాలంటే జేబులకు చిల్లు పడాల్సిందే


👉అహోబిలం ఎంటర్ కాగానే నిర్మొహమా టంగా  ముక్కు పిండి మరీ రూ. 150 .00 లు కార్ పార్కింగ్ పేరుతో వసూలు చేస్తారు.


 *కేశకండన* 


👉" కేశకండన " దగ్గర కూడా10₹ తీసుకొని టికెట్ ఇస్థారు


👉గుండుగిసే వాడు 🤦‍♂️

నిర్మొహమాటంగా   పెద్దలకు ,పిల్లలకు అనే తేడా లేకుండా 100₹ లు రూపాయలు ఇస్తేనే గుండు ‼️

లేక పోతే లేదు.

 

👉మా ఇష్టం వచ్చినట్లు మేము రాబట్టు కుంటాం అంటున్న టోల్ గేట్ కాంట్రాక్టర్

 

👉మమ్ములను అడిగే హక్కు ఎవరికీ లేదు అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి.


👉ఇదేంది బయట బోర్డు.ఎవరికి డబ్బులు ఇవ్వరాదు అని ఉంది మీరేమో డబ్బులు తీసుకుంటున్నారు అంటే ఆ బోర్డులు ఎవరు పెట్టారో మాకు తెలియదు అంటూ నిర్లక్ష సమాధానం.


👉మాకు దానితో సంబంధం లేదు డబ్బులు ఇవ్వా ల్సిందే.... 


👉అంత పెద్ద టెంపుల్ లొ ఫ్రీగా ఆలయ కమిటి  కేశకండనం కూడా చేపించలేక పోవడం కొసమెరుపు.🤦‍♂️🤦‍♂️🙏🙏🙏


 *దర్శనం* 


👉 ఇక దర్శనం కావాలంటే మీకు స్పెషల్ దర్శనం కావాలంటే ఒక రేటు, 

శీఘ్ర దర్శనం కావాలంటే ఒక రేటు

ఇలా ఒక్కో దర్శనానికి ఒక్కో రేటు🤔


  *కార్ పార్కింగ్* 


👉ఇక కార్ పార్కింగ్ విషయానికి వస్తె ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్న వ్యాపారులు 

అహోబిలంలో గుడికి 3 - 4  కిలోమీటర్ల ముందుగానే ఆపివే యడం కొసమెరుపు.


👉4 కిమి  దూరం లోనే కొండ చెట్లు, గుట్టల మధ్యనే పోలీసులను పెట్టీ మరీ ఆపడం ఒక ఎత్తైతే భక్తులు ఎవరైనా మేము నడవలేము, మేము ముసలి వాళ్ళం , మేము ఆడవాళ్ళం ,మాకు చిన్న పిల్లలు ఉన్నారు అని ఎంత విన్న వించు కున్నా  కూడా పోలీసులు వినిపించుకోవడం లేదంటూ భక్తుల ఆరోపణ. 


👉తమకు కావలసిన వారికి మాత్రమే వారి వాహనాలు అనుమ తించడం గమనార్హం.  


 *స్నాన ఘట్టాలు :* 


👉 స్నాన ఘట్టాలు : ఏదో కరెంటు ఉంటే నీరు ఒక 4 కొలాయి లలో వస్తాయి ‼️లేకపోతే అదీ లేదు🤔


👉ఇక స్త్రీలు బట్టలు మార్చు కొనుటకు కనీసం ఒక  నీడ కానీ ఒక రూం కానీ లేక పోవడం , 


 *మరుడొడ్లు* 


👉స్త్రీల కు కనీసం మరుడొడ్లు కూడా లేక పోవడం గమనార్హం

 

👉ఇవేవీ లేకుండా నే భక్తుల నుంచి ముక్కు పిండి డబ్బులు దోచుకుంటున్న దేవస్థానం.


👉 పూలు మూర కావాలా రూ.100.00 లు కావాల్సిందే


👉 తులసి ఆకులు /మాల రూ. 100/- 🤔


👉టెంకాయ కావాలా కేవలం 50/- , 60 /- మాత్రమే🤔


👉 త్రాగు నీరు కావాలా - 70 రూ మాత్రమే


👉  గమ్య స్థానాలకు వెళ్లే లోపు ఇలాంటి టోల్ గేట్ లు ఎన్నో లెక్క లేదు


👉 గుడి దగ్గర ఎంట్రన్స్ లోనే పార్కింగ్ పేరుతో , టోల్ గేట్ పేరుతో మరో రూ.150/- లు అక్షరాల చెల్లించాలి.


👉 రూ.150/- కట్టీ 3 , 4 కి మీ ర్ల దూరంలో పార్క్ చేసి అక్కడి నుంచీ కాలికి బుద్ధి చెప్పాల్సిందే


👉 గుడికి వెళ్ళాక అక్కడ గంటల కొద్ది క్యూ లో ఉండి రూ.10/- పెట్టీ తల నీలాలు టికెట్ తెచ్చు కోవాలి


👉 రూ.10/- ఇస్తే సరిపోదు ,అక్చరాలా రూ. 100 /- లు లంచం ఇస్తేనే గుండు 

లేక పొతే లేదు 


మీకు ఇష్టమైతే నే గుండు లేక పోతే లేదు , మీరు ఎవరికి చెప్పుకున్నా సరే🤔


👉 పాద రక్చలు ఉంచు కోవాలంటే  డబ్బు చెల్లించు కోవాలి.


👉ఇంతా కస్టపడి వెళితే , అక్కడ భారీ క్యూ ఉంటుంది 


👉 ఆ క్యూ లో గంటల తరబడి నిలుచొని వెళితే , కనీసం స్వామిని కళ్ళారా చూసి తరించే అవకాశం ఉండదు. క్షణం లో బయటకు తోస్తారు.


👉 బయటికి వచ్చి ఏమైనా పిల్లకు తినే తందుకూ కొనిపెడదమంటే 

ఇంక చెప్ప నక్కర్లేదు, ఒక చిన్న పిల్లవాడి ఆకలి తీర్చా లి అంటే


👉ఒక దోశె 50/- 70/- అంటే ఒక మనిషికి రూ.150/- దాటల్సిందే.


👉ఇంక కుటుంబ సభ్యులకు ఆకలి తీర్చా లి అంటే రూ.1000/- కావాల్సిందే.


ఇది అహోబిలం పరిస్తితి 


భగవంతుడా నీ దర్శనం ఇంత ఖరీదైనది అయింది 


మేము నీ దర్శనానికి రాలేము తండ్రీ మమ్మల్ని క్షమించండి.


...దోపిడిలో అందరికి భాగస్వామ్యం కావడంతో భక్తులను దోచుకుంటున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు.

...ప్రధాన ఆలయాల్లో దోపిడీని నివారించే నాధుడే కరువయ్యారు.

...దేవాలయాల్లో దోపిడితో ఆలయాలకు పోవాలంటేనే ఖర్చుతో కూడుకున్న పని అని భక్తులు అంటున్నారు.

....సమస్యలు విన్నవించుకొని తమ కష్టాలు తీర్చుకోవడానికి వెళ్లే భక్తుల కుటుంబాలకు దేవాలయాల్లో అడుగు పెట్టి బయటికి రావాలంటే ఒకొక్క కుటుంబానికి వెయ్యి నుంచి మూడు వేలు ఖర్చుఅవుతుందంటూ వాపోతున్నారు.

...దేవా మీ దర్శనం పొందాలంటే మాకింత ముందే మహాలక్ష్మిని కనుకరించు మహా ప్రభో అంటూ భక్తులు ముక్కుతున్నారు.

పిల్లలూ, మనవలూ..

 అల అగ్రహారంలో  ఎత్తు అరుగులున్న ఓ వందేళ్ళనాటి పెద్ద ఇల్లు.. నాలుగైదు వాకిళ్ళూ, వరండాలూ, పెరడూ.. గదులూ...


ఎర్రటి వేసవికాలపు ఎండలో మెరుస్తూ రాజసంగా కనబడేది...


శలవుల్లో ‘శ ‘ అనగానే రక రకాల ఊర్లనించీ గూడు చేరిన పక్షుల్లా ఆనందంగా ఎగిరొచ్చి వాలిపోయే పిల్లలూ, మనవలూ.. 


చిన్నా, పెద్దా కలిసి ముఫ్ఫైమంది కి తక్కువకాని మనుష్యులు...


“బారెడు పొద్దెక్కాకా వీధరుగులు కడుక్కోరర్రా! పొద్దున్నే కడుక్కోవాలి..” 


పెద్ద కోడలి మాట వినడానికి పిల్లలు నిద్ర లేస్తేగా?


  పిల్లలు రాత్రి ఓ పట్టాన పడుకోరు, పొద్దున్న లేవరు.. ప్రతీ తరంలోనూ ఏ మాత్రం అంతరం లేని నిరంతర ప్రక్రియ ఇది....


మండువాలోనే రాత్రే బకెట్ నీళ్ళు, చెంబూ పెట్టుకుని.. పొద్దు పొడవకుండానే ఆవిడే లేచి వీధి అరుగులు, గుమ్మాలు కడుక్కుని, వాకిట్లో పేణ్ణీళ్ళు కలాపి చల్లి ఓ గుమ్మడిపండో, పనసచెక్కో ముగ్గు వేసి వచ్చేసరికి ముడుచుకుని పడుకున్న పిల్లలు కదలరు.. మంచాల మీది పెద్దలు మెదలరు....


కాఫీ వసారాలో పొయ్యి వెలిగించి డికాక్షన్ వేసే సమయానికి ఒక్కొక్కళ్ళూ ప్రత్యక్షం.. మెట్ల మీద సుఖాసనాలు.. కులాసా కబుర్లు.. సందడి..


' వదినా నాకు పంచదారెక్కువ.. 


అక్కా, నాకు పాలు తక్కువ.. 


నాకు డికాక్షనూ, పంచదారా రెండూ ఎక్కువే.. 


నాకు బాగా వేడిగా ఉండాలి.. నిన్న కాఫీ చల్లారిపోయింది.. 


' అయ్యబాబోయ్! నాకు వేడి ఒద్దు, నాలిక్కాలిపోయింది


 ఇలాంటి రకరకాల ఆదేశాలు, అభ్యర్ధనలు గుర్తు పెట్టుకుని.. అందరికీ కాఫీలిచ్చి.. పొయ్యిలో నిప్పులు బయటకి లాగి మిగతా కాఫీ చెంబులో పోసి వాటిమీద సన్నటి సెగకి పెట్టి, పొలంపనికొచ్చినవారికి అది తాగాలని గుర్తు చేసి నాలుగు చెంబులు నీళ్ళు పోసుకుని, జుట్టు ముడి వేసుకుని బొట్టు పెట్టుకుని వంట ఇంటి ప్రవేశం…


 వంద చదరపు అడుగులుంటుందేమో ఆ గది.. 


ఓ మూలకి పొయ్యి, పెడా.. మరో మూలకి గంజి వార్చుకునే తూము.. 

మెత్తగా దంచిన రాళ్ళ ఉప్పు పెట్టుకునే రాచ్చిప్పసైజుకు సరిపడా జాలకర్ర అనే ఓ చిన్న కిటికీ..


ఆ చిన్న గదిలో రెండు కూరలు, పప్పు, పులుసు, పచ్చడి, వేడి వేడి గా పొగలు కక్కే అన్నం వీటితో పసందైన భోజనం.. ఈ లోపుల ‘ఆకలో రామచంద్రా!’  అని ఏడ్చే పిల్లలకి తరవాణి చద్దన్నాలు


అందరి భోజనాలు కానిచ్చి,  ఆకులు తీసి పేడలు పెట్టి, అలసిన నడుముని నట్టింటి గడపకు జేరేసేసరికి మధ్యాహ్నం టీ వేళే..


 టీతో పకోడీలో, చెగోడీలో.. అదీ కాకపోతే పనసపళ్ళో..


మళ్ళీ ఇంతమందికీ రాత్రి భోజనాలో ఫలహారాలో అంటే బలుహారాలే.. రొట్టెముక్కలో, ఉప్పుడుపిండో.. ఇలా.. 


ఉప్పు, మిరపకాయల దగ్గరనించీ ఎండపెట్టుకుని దంపించి పెట్టుకునే ఊరగాయ కారాలూ..


ఆవకాయలూ, ఆల్చిప్పలకీ, కత్తిపీటలకీ నాలుగిళ్ళకీ పిల్లలని పంపి తెప్పించుకుని,  అరుగంతా పరిచి పెట్టే తొక్కుపచ్చడీ, మాగాయ ముక్కలూ.. దరిమిలా జాడీలకెక్కే ఊరగాయలూ..


పంచ మీదకి పాకిన బూడిద గుమ్మడికాయల్ని అలాగే తరిగి ఇంగువ ఘుమాయింపులతో పాటు పెట్టే గుమ్మడి వడియాలు, పొట్టు వడియాలు, చిట్టి వడియాలూ. మజ్జిగ మిరపకాయలూ..


కాలాన్ని బట్టి గింజలు తీసుకుని దాచుకునే చింతపండు ముద్దలూ..


రాత్రి నానబెట్టి మర్నాడు దంపించుకునే అటుకుల ధాన్యాలూ..


బియ్యం తడిపి పిండి కొట్టి వండే జంతికలూ, అరిసెలూ..


కొత్తనోములూ, పాత నోములూ అంటే దొంతరలుగా వేసే వందలాది అట్లూ..


ఈ లోపు గ్రహణాలూ, పుణ్యాహవచనాలు, శుద్ధి వేళలంటూ చింతపండు పెట్టి రాజుగారి సింహాసనాలంత ఉండే దేవుడి సింహాసనల్ని, సామాన్లనీ తోముకోవడాలు..


సాయంత్రమవుతూనే ముగ్గు పిండి,  మెత్తటి బట్టా పెట్టి లాంతర్లు తుడుచుకోవడాలు. కిరసనాయిలు పోసుకుని రెడీగా ఉంచడాలూ..


పాతచీరలతో బొంతలూ, పెరటిలో పండే బూరుగుదూదితో దిళ్ళూ, పరుపులూ కుట్టడాలు, కుట్టించడాలు...


ఇంట్లో బాలింతలో, పథ్యం వాళ్ళో ఉంటే వారికి ప్రత్యేక వంటలూ..


ఇంకా ఎన్ని మర్చిపోయానో నాకు గుర్తు లేదు.. 


ఇలా ఎడతెగని పనులతో అలుపెరగక తిరిగే అలనాటి అతివలు...


ఇంటివారి ఆకలినే కాక అభిరుచులనెరిగి వండి, వడ్డించే ఆ అన్నపూర్ణలు...


వీటన్నింటి మధ్యలో.. ఏడాదికో సారో, రెండుసార్లో పుట్టిళ్ళకి వెళ్ళేటప్పుడో, పేరంటానికి వెళ్ళేటప్పుడో తప్ప వీధిముఖం చూడని అసూర్యంపశ్యలు 


మా అమ్మమ్మతరం వాళ్ళు.. 


ఇప్పుడు లాక్ డవున్ పేరిట మనం పడుతున్నామనుకుంటున్న కష్టాలను, ‘తెల్లారింది.. వండామా, తిన్నామా, తోమామా’ అన్నట్లుగా గడుస్తున్న మన పరిస్థితిని చూస్తే ఏమంటారో? 


" ఇదీ ఓ పెద్ద విషయమేనటర్రా? అంటారో...


" ఇందులో ఇంత బాధ పడిపోవడానికేముందో అని ఆశ్చర్యపోతారో?


అనిపించి నవ్వొచ్చింది.. 

ఏదైనా నేర్పతరం కానీ మాన్పతరమా? అన్నట్టు.. ఆఫీస్ పనికో, మరొకదానికో బయటకు వెళ్తే కానీ గడవని తరం మనది.. అందుకే కాళ్ళు, చేతులు కట్టేసినట్టు ఈ విలవిల..


ఇదీ గడిచిపోతుంది.. 


మళ్ళీ అంతా మామూలవుతుంది.. 


నేడు మబ్బేసి,  మసకేసినా రేపు వెలుగొస్తుంది..


 ఇంట్లో ఉండవలసి వచ్చినందుకు బాధ పడక, క్షేమంగా ఉండడానికి మనకో చక్కటి ఇల్లు, మనతోడుగా మనదనుకునే ఒక కుటుంబం..


 నాలుగు నంబర్లు నొక్కితే కనిపించి, వినిపించడమే కాదు, మనకోసం కలత పడే నలుగురు స్నేహితులూ.. 


నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళే వెసులుబాటు ఉన్నాయని సంతోషిద్దాం.. 


మనకు కలిగింది కావలసిన వారితో పంచుకుందాం..


సర్వే జనా సుఖినోభవంతు..

ఆఘ్రాతం పరిచుంబితం

 *ఆఘ్రాతం పరిచుంబితం పరిముహుర్లీఢమ్ పునశ్చర్వితం* 


*త్యక్తం వా భువి నీరసేన మనసా తత్ర వ్యథాం మా కృధాః* 


*హే సద్రత్న! తవైవ తత్ర కుశలం యద్ వానరేణాదరాత్* 


*అంతర్గూఢ విలోకన వ్యసనినా చూర్ణికృతో నాశ్మనా*


 భావం:-ఒక కోతికి చక్కటి రత్నం దొరికింది.అదేమిటో దానికి అర్థం కాలేదు.వాసన చూసింది తెలియలేదు.ముద్దులు పెట్టింది, నాకింది దాని స్వరూపం ఏమీ కోతికి తెలియ లేదు.


విసుగొచ్చి నేలమీదికి విసిరి కొట్టింది.అయినా ఆ రత్నం వులుకూ పలుకూ  లేదు.దాంతో ఆకోతి రత్నం వైపు  అసహ్యంగా చూసింది.ఈ సందర్భంలో కవి ఆ రత్నాన్ని ఓదారుస్తున్నాడు.యేమని?


 ఓ రత్నమా!నిన్ను కోతి ఆదరించ లేదనీ,యిన్ని పరీక్షలకు గురిచేసిందనీ దుఃఖించకు 

నువ్వు చాలా అదృష్టవంతురాలివి.ఎందుకో తెలుసా?అసలు రత్నమైన నీలో ఏం వుందో 

తెలుసుకునే అభిప్రాయం తో ఓ రాతి మీద పెట్టి మరో బండరాతితో కొట్టి పొడి పొడి గా 

చేయలేదు.అందుకని నువ్వు అదృష్టవంతురాలివి సంతోషించు.


విశేషార్థం:---.ఒక మహా పండితుడున్నాడు.అతనికి ఆదరణ వుండక పోవచ్చు. దానికి కారణం అతని పాండిత్యపు లోతు తెలిసిన మహానుభావుడు దొరక్క పోవడమే అయితే పండితుడికి మాత్రం పరీక్షలకు కొదవేమీ వుండదు.అన్ని పరీక్షలకూ  గురి చేశాక నీవు  

పని చేయవు  అని తీర్మానం చేసి అవతలి వాళ్ళు అవమాన పరిచినంత మాత్రాన ఈ పండితుడికి అది గౌరవలోపం కానే కాదు.వాళ్ళు యింకో అడుగు ముందుకు పోయి  నీది అసలు పాండిత్యమే కాదు అని అజ్ఞానం తో పలక నందుకు ఆ పండితుడు  సంతోషించాలి.            ఈ కాలము లో జరుగుతున్నది యిదే .


ఒక రత్నవ్యాపారి మాత్రమే రత్నపు విలువ గ్రహించ గలిగినట్టే ఒక పండితుడు మాత్రమే 

పండితుడి పాండిత్యాన్ని గుర్తించ గలుగుతాడు.


*విద్వానేవ విజానాతి*

*విద్వజ్జన పరిశ్రమం* *నహి వంధ్యా విజానాతి*

*గుర్వీం ప్రసవ వేదనాం*    


అర్థము :--  ఒక విద్వాంసుడు మాత్రమే విద్వాంసులు  చేసిన పరిశ్రమను గుర్తించ గలుగుతాడు. ఎలాగైతే ఒక గొడ్రాలికి ప్రసవ వేదన తెలియనట్లే. పండితుడు కానివాడికి 

పండితుడి పరిశ్రమ తెలియదు  


  (భక్తిసుధ ఆధ్యాత్మిక  మాసపత్రిక  ఫిబ్రవరి 2012 సంచిక నుండి) 


సౌజన్యం....

శ్రీమతి సుగుణ. రూపనగుడి


సేకరణ...వేపా.పార్వతీశం,హైదరాబాద్

అయ్యకోనేరు అంతరంగం

 👆

🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

నాకు నచ్చిన శ్రీ కొచ్చెర్లకోట జగదీశ్ గారి కథనం "అయ్యకోనేరు అంతరంగం"

                🌷🌷🌷

మేలు కోరేవాణ్ణి మేలుకొమ్మంటూ సున్నితంగా లేపుతున్నారు అయ్యవారు. తూరుపుదిక్కు సూర్యుడికి అప్పటివరకూ పాలు కుడిపి, సాయంత్రందాకా భూలోకంలో ఆడుకురమ్మని తన పాలిండ్ల పర్వతాల మధ్యనుండి పంపేసింది. ఆ పిల్లాడు కంటికింపుగా బయటపడిన వాడు మధ్యాహ్నానికల్లా లోకులందరికీ కంటగింపుగా మారతాడు. 


ఎక్కడినుండి బయల్దేరిందో కరిమబ్బుల గుంపొకటి వడివడిగా పరుగెడుతూ అయ్యకోనేటి దగ్గరకొచ్చి ఆగింది. ఏ మేఘసందేశాలు అందుకుందో సరస్సంతా ఒక్కసారి జలజలా నవ్వింది. దక్షిణగట్టునున్న కుర్రాడొకడు ఏమీ తోచక విసిరిన గులకరాయికి కితకితలొచ్చి కిలకిలమంది. అలా మొదలైన ఒక్కో అలా చెరువంతా పాకేసింది.


పైనుండి ఈ పరవాశాల్ని గమనిస్తున్న మబ్బులక్కలన్నీ వాటిలో అవి మాటాడుకోవడం మొదలెట్టాయి.


‘ఇదుందే, ఈ కోనేరు... నా చిన్నతనాలనించీ చూస్తున్నానే! కాస్తంత వానకే కడుపు నింపేసుకుంటుంది. గట్టునున్నవాళ్లని చూసి గలగలమంటుంది. 


ఆ మొదటి మెట్టుమీద ఆదిభట్లాయన కూర్చునీవాడు గ్యాపకం వున్నాడా నీకూ?’ అంది మేఘమాల. 


‘నాకు తెలీకేం? పడమర గట్టునున్న వేణుగోపాలస్వామి మఠంలో తన శిష్యులందరికీ విద్య నేర్పీవాడు. సభనెలా రక్తి కట్టించాలి, వినేవాడిని తన కథాగానంతో ఎలా కట్టిపడెయ్యాలి, అసలు కథనీది ఎలా చెబితే మహరాజు సైతం మాటాడకుండా కూర్చుని వింటాడూ అనే సంగతులన్నీ ఆ మీసాల పంతులు చెబుతూ వుంటే ఒళ్లు ఝల్లుమనీదనుకో! ఆ కథలన్నీ విన్నాకనే ఆ కోనేట బండరాయిగా ఉండీదాన్ని కాస్తా కరిగి కన్నీరై ఇలా మబ్బుగా మారిపోయాను!’ అంటూ కంటనీరు పెట్టుకుంది సౌదామిని.


‘ఈ దక్షిణగట్టున కూర్చుని సామాజిక రుగ్మతలకి పిండం పెట్టేసిన గురజాడాయన పాదాలింకా గుర్తే నాకు! తెలుసునా? నిక్షేపంగా కాపరాలు చేసుకునే సాంప్రదాయ వాదుల మీద దయాదాక్షిణ్యాలు లేకుండా అక్షర బాణాలేసి సమాజాన్ని ప్రక్షాళన చేస్తానంటూ బయల్దేరాడు. అదేదో నాటకమొకటి సెలవిచ్చాడు. అబ్బో, మా చిన్నతనాల్లో మేమూ చూశాంలే! ఒక్కో మాటా గుండేసి పేల్చీసినట్టే అనుకో!’ మొయిద నుంచొచ్చిన పెద్ద మొయిలమ్మ మొదలెట్టింది.


అన్నీ కలిసి ఆ కోనేటి మీద చేరి కాసేపు కబుర్లాడుకుని, లోపలున్నదంతా కురిసి, మురిసిపోయాయి.


అప్పటివరకూ నిశ్శబ్దంగా తడిసి ముద్దైన కోనేరు తన అనుభవాల్ని చెప్పడం మొదలెట్టింది....


‘ఇప్పటికీ ఈ గట్లమీద సాయంకాలమైతే చాలు గొప్పలకు పోయే గిరీశాలు, గోల్ గప్పాలు తింటూ మోడర్న్ వెంకటేశాలు బోలెడంతమంది. జనానికి జెల్ల కొట్టీసి, రోజుగడుపుకునీ రామప్పంతుళ్లూ ఉన్నారిప్పటికీ! పదిమంది మంచీ కోరే సౌజన్యారావు పంతుళ్లు, కష్టకాలంలో చక్రం అడ్డేసి ఆదుకునే కరటకశాస్తుర్లూ కనబడతారిక్కడ.


మధురవాణిని మాత్రం ఇప్పటికీ చూడలేదమ్మలూ! అదొక తీరని కల!


మనం చూసిన సుబ్బికి మల్లే గట్టిగా బిగించి కట్టిన జడా, అందులోకి అల్లా ఉత్తర గట్టున జయంతివారింట్లోంచి తెంపుకొచ్చిన బంతిపూవొకటి పెట్టుకున్న ఆడపిల్లలెవర్నీ ఈమధ్య చూణ్ణేలేదనుకో! నేమానివారి కుర్రాడల్లే జుత్తు విరబోసుకున్న అమ్మాయిలే ఎప్పుడూ కనబడతున్నారు.


తూర్పుగట్టు మీదుండీ ఆంజనేయస్వామికి మంగళవారమొస్తే చాలు.... అప్పాలే, ఆకలే, ఆకులే... అంటూ ఒకటే గోల! తెల్లవారుతూనే ఒళ్లంతా సింధూరం మెత్తేసుకుని కోపం వచ్చినట్టు కనబడతాడా? కానీ ఎంత చల్లటి చూపో? ఈ కోనేరంత పెద్ద మనసున్న దేవుడు! ఇంకా ఈ గట్లమీద కొట్టే కొబ్బరిచిప్పల చప్పుళ్లు, కొత్తకోడళ్లని తిట్టే అత్తగార్ల దెప్పుళ్లు కూడా వినేదాన్ని! అప్పుడప్పుడు మధురమైన సంగీతమూ వినబడీది. 


అదెక్కడో పడమటి కుర్రాడొకడు వచ్చీసి, పట్రాయనాయన దగ్గిర పట్టుబట్టి పాట నేర్చుకున్నాడు. ఆ ఖంగుకి సినిమాల హంగు కలిస్తే చెప్పేదేముంది? ఆయన మది శారదాదేవి మందిరం. ఆ సుశీలమ్మతో యుగళాల కోసమే పుట్టిన గళమది! 


వెన్నెల రోజుల్లో ఈ గట్టున కూర్చుని ‘ఎచటనుండి వీచెనో ఈ చల్లనిగాలి?’ అంటూ పాట వినీవారు ఈ ఇళ్లవాళ్లందరూ! ఇదేం పాటరోయ్ అంటూ నేనూ ఓ చెవటు పడీసీదాన్ని. అంత ఖంగుమనీ కంఠాన్నీ దొంగలాగ మార్చీసి, మత్తుగా పాడుతోంటే  భంగు తిన్నట్టుండీదనుకో! 


అటువైపు చూసేవా? ఆ ఎత్తరుగుల ఇళ్లన్నీ ఇప్పుడంతా బోసిగా కనబడుతున్నాయి కదూ? ఆ దేవరకొండాయన ఠీవిగా కూర్చునుంటే చుట్టూతా అంతాచేరి భువనవిజయంలా వుండీదనుకో! ఇప్పుడు వాళ్ల మనవలంతా టీవీల ముందు కూర్చుంటుంటే ఆ అరుగుల మనసు విరిగి, వీధికుక్కల మొరుగులవుతున్నాయి. 


ఒకటొకటిగా డాబాలన్నీ మేడలైపోయాయి. వాహనాలకి కూడా చోటులేనంత ఇరుకిరుకుగా తయారైపోయారు. దారినపొయ్యే దానయ్యల దాహం కోసం మజ్జిగలిచ్చేవారు పూర్వం. ఇప్పుడా మంచిమనసులన్నీ ‘చలివేంద్ర’జాల మహేంద్రజాలాలతో రాజకీయ మయమైపోయాయి.


కార్తీకం నెల్లాళ్లూ ఆ ఆవునెయ్యి వాసనా, పత్తి కాలిన పరిమళమూ, నిత్యం మోగుతూ నా గుండె ఝల్లుమనిపించే ఆ గుడిగంటా ఎంతిష్టమో నాకు! సరాసరి కైలాసం నుంచి వచ్చీసి ఇక్కడ శంకరుడు మఠం వేసుకు కూర్చున్నాడనిపిస్తుందిస్మీ నాకీ ‘శంకరమఠం’ చూస్తే!


రేతిరయితే చాలు, చీకటొచ్చి నన్నూ, నా కడుపున ఉన్న ఈ బండల్నీ కౌగిలించేస్తుంది. అదెంత భయమో తెలుసా మీకు? ఎవరొచ్చి పలకరిస్తారు? రెండో ఆట చూసొచ్చి ఇటుగా నడుచుకుంటూ వెళ్లే వాళ్లు రేలంగోడి హాస్యం కబుర్లవీ చెప్పుకుంటూ నవ్వుకుంటూ వెళ్తూండీవారు. అదైనా కాసేపే! ఆ తరవాత భయంకరమైన నిశ్శబ్దం! 


కానీ కార్తీకమాసంలోని, క్షీరాబ్ది ద్వాదశికీ, ఇంకా శివరాత్రినాడూ ఈ ఊరివాళ్లంతా కలిసి కొబ్బరిచిప్పల్లోను, అరటిదొప్పల్లోను వెలిగించి వదిలే దీపాలు చూడంగానే నాకు సంబరంగా వుండీది. ఇక ఆ నెల్లాళ్లూ రాత్రుళ్లసలు భయమనీదే ఉండీది కాదు. వాటన్నిటినీ రాతిరంతా ఆరిపోకుండా కాపాడుకుంటూ భయంలేకుండా గడిపీవాళ్లం.


ఎన్నోటి జ్ఞాపకాలనుకున్నావు? దీపావళొస్తే చాలు, కుర్రాళ్లంతా చేరి ఈ గట్లమ్మట జువ్వలూ, సిసింద్రీలూ వేసుకుంటూ పోటీపడీవారు. 


బట్టలుతికీవాళ్లు, గేదెల్ని కడిగేవాళ్లయితే సరేసరి! 


ఇక నాకసలు నచ్చనిదొకటే!


ఎవరినైనా మట్టితోనే తయారుచేసి మట్టిలో కలిపేస్తాడు ఆ దేవుడు. అటువంటి దేవుణ్ణి మాత్రం మట్టితో కాకుండా ఏవేవో కలిపీసి తయారుచెయ్యడం, అవన్నీ తీసుకొచ్చి ఇందులో పారీడం! 


ఎంతకని భరిస్తానే నేనుమాత్రం?


అంతందంగా తయారుచేస్తారా ఆ బొమ్మల్నీ? సాక్షాత్తూ కైలాసాన్నే భూమికి దింపీగల కుమ్మరులున్నారు మనూళ్లో! ఆ బొజ్జ గణపయ్య కళ్లు చూస్తే ఎంత నిబ్బరంగా వుంటుందో మనసంతా! అంత ప్రశాంతంగా వున్నవాడూ వీళ్లు చేసీ అపభ్రంశాలన్నీ చూసీ చూసీ ‘ఎంత తొందరగా నన్ను నిమజ్జనం చేసీస్తారా? అప్పుడు కాదా నాకు హాయి? మరో ఏడాద్దాకా ఈ చల్లనితల్లి కడుపులో నిశ్చింతగా నిద్రపోతాను!’ అనీసుకుంటాడు.


ప్రతియేటా నిమజ్జనాలన్నీ అయ్యేక నాతో ఇవే కబుర్లు! ఒక్కో గణపతీ ఒక్కొక్క కథ చెప్పీవాడు. 


ఎన్నైనా చెప్పండే! నాకీ వూరంటే మమకారం. ఉషోదయాన ఈ చెట్లమీద చేరిన పిట్టలన్నీ బుజ్జిబుజ్జి గొంతులేసుకుని ఊరందర్నీ లేపుతాయి. తెల్లారిలేచి పొలాలకి బయల్దేరీ రైతన్నలు, కలంపట్టుకుని ఈ గట్లమ్మట చేరి కథలూ, కవితలూ సృష్టించే శాలువా కవులూ, అందెల సవ్వడి చేసుకుంటూ బిందెలట్టుకుని నడిచే చందమామలు.. ఎన్నని చెప్పను? తల్లి దగ్గిర కడుపునిండా పాలు తాగీసి, మూతికింకా అంటుకున్న పాలచుక్కలతో ముద్దొచ్చే లేగదూడలు, అమ్మచేతి ముద్దకైనా నోచుకోని ఎందరో అభాగ్యజీవులు.. వీళ్లందర్నీ చూస్తుంటాను!


నాకొక స్వప్నం. ఈ చుట్టూతా అందంగా పూలమొక్కల్ని పెంచీసి, పదిమందీ పడవలేసుకుని హాయిగా నాతో విహరించాలని! వెన్నెలంతా ఏటిపాలవుతోంటే వెర్రికుంకలు ఇళ్లలో బిగదీసుకుని కూర్చుంటారు. నాతో కలిసి ప్రతి పౌర్ణమికీ అంత వెన్నెల్నీ జుర్రేసుకుంటే ఈ రోగాలకీ, రొష్టులకీ ఆ కటకం డాక్టరు కూడా ఇవ్వలేని మందులా పనిచేస్తుంది.


ఎవరైనా వింటారా నా ఘోష?’ అంటూ మౌనంగా రోదించసాగింది.


మేఘాలన్నీ ఎప్పుడో కరిగి నీరైపోయాయి. 


.....జగదీశ్ కొచ్చెర్లకోట

 రామాయణం లో అత్యంత ముఖ్యమయిన/ విశిష్టమయిన శ్లోకం ఏది?


ఒకసారి విక్రమాదిత్య అనే రాజుకు తన సభలో ఉన్న "నవరత్నాలలో" ఎవరు ఉత్తమ పండితులో తెలుసుకోవాలని అనిపించింది.


రాజ్యసభలో ఉన్న పండితుల అందరినీ పిలిచి "రామాయణం" లో ఉన్న శ్లోకాలలో అత్యంత ముఖ్యమైన శ్లోకం ఏది అయి ఉంటుంది అని ప్రశ్నించారు.


ఆ శ్లోకం గురించి చెప్పిన వారికి 1000 బంగారపు నాణేలు ఇస్తాము అని కూడా ప్రకటించారు.


ఈ శ్లోకాన్ని రామాయణంలో నుంచి వెతికి పట్టుకోవడానికి పండితులకు విక్రమాదిత్యుడు 40 రోజుల గడువు ఇచ్చాడు.


విక్రమాదిత్యుని రాజ్యసభలో "వరరుచి" అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు.

అతనికి ఆ వెయ్యి  బంగారు నాణాలు ఎలాగైనా సంపాదించాలి అని కోరిక కలిగింది.


అప్పుడు ఆ వరరుచి దేశాటనకు బయలుదేరి అనేక రాజ్యాల లో తిరిగి రామాయణం లో ఉన్న ముఖ్యమైన శ్లోకం ఏది అని అందరు పండితులను అడగటం మొదలు పెట్టాడు.


అయితే అతనికి రామాయణం లో ఉన్న అన్ని శ్లోకాలలో ఒకే ఒక్క శ్లోకాన్ని ఉత్తమమైనది అని చెప్పటం సాధ్యం కాదు అన్న సమాధానమే దొరికింది. 


40 రోజులలో చివరి రోజు అతను తన రాజ్యానికి తిరిగి వస్తూ అలసిపోయి ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నాడు.


నిద్రపోతున్న సమయంలో ఆ చెట్టు మీదకు ఇద్దరు వనదేవతలు వచ్చి సంభాషించుకుంటూ ఉన్నారు.

వారిలో ఒక వనదేవత మాట్లాడుతూ  మాటల్లో రామాయణంలో ప్రముఖమయిన శ్లోకం "మాం విద్ధి... అని చెప్పింది.

ఆ సంభాషణ విన్న వరరుచికి ఎంతో ఆనందం కలిగింది.


అతను వెంటనే విక్రమాదిత్య రాజ్యసభకు వెళ్లి ఆ ముఖ్యమయిన శ్లోకం ఏదో చెప్పాడు.


ఆ శ్లోకం ఇది 


రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్

అయోధ్యామటవీం విద్ధి గచ్ఛ తాత యథాసుఖమ్


ఆ శ్లోకాన్ని విన్న విక్రమాదిత్యుడు ఆ శ్లోకానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? అని అడిగాడు.


అతను  చెప్పిన 18 రకాలయిన  అర్ధాలను విన్న విక్రమాదిత్యుడు రామాయణంలో ఇదే ఉత్తమమైన శ్లోకం గా భావించి అతనికి 1000 బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు.


ఈ శ్లోకంలో ఉన్న అర్ధం ఏమిటి?

ఎందుకు ఈ శ్లోకం అంత ముఖ్యమయినదిగా చెప్పారు?


ఈ శ్లోకం వాల్మీకి రామాయణంలోఅరణ్యకాండలో 40వ సర్గలో వస్తుంది.

రాముడు అరణ్యాలకి వెళ్తున్నాడు అని తెలిసి  లక్ష్మణుడు తను కూడా అరణ్యాలకు బయలుదేరుతూ,

తన తల్లి "సుమిత్ర" ఆశీర్వాదం కోరినప్పుడు సుమిత్ర లక్ష్మణుడికి చెప్పిన సమాధానం ఈ శ్లోకం.


ఈ శ్లోకానికి ఉన్న అనేక అర్థాలలో కొన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. 


రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్.

అయోధ్యామటవీం విధ్ది గచ్ఛ తాత! యథాసుఖమ్৷৷


మొదటి అర్ధం:


రామ= రాముడు:  దశరథం=దశరథుడు:  విద్ధి=అనుకో: మామ్= నేనే; జనకాత్మజ= జనకుని కూతురు;విద్ధి= అనుకో; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్=సుఖంగా


లక్ష్మణా! రాముడే దశరథుడు అనుకో,  సీతనే నేను(సుమిత్ర) అనుకో, అడవినే అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళిరా!


రెండవ అర్ధం:


రామ= రాముడు: (దశ = పక్షి రథం=రధం)  దశరథం= పక్షిని రధంగా కలిగిన వాడు, విష్ణువు ; మామ్= లక్ష్మీదేవి; జనకాత్మజ= జనకుని కూతురు; అయోధ్యా= శతృదుర్భేద్యమయినది(వైకుంఠం); మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్=సుఖంగా


ఓ పుత్రా! ఈ రాముడే శ్రీమహావిష్ణువు, సీతే శ్రీ మహాలక్ష్మి, వారిద్దరూ  ఎక్కడ ఉంటే అదే వైకుంఠం అనుకుని సుఖంగా వెళ్లి  రా! 


మూడవ అర్ధం:


రామ= రాముడు: దశరథం=దశరథుడు: విద్ధి=వలెనే: మామ్=నీ తల్లి (కైకను ఉద్దేశించి ); జనకాత్మజ= జనకుని కూతురు; విద్ధి= వలెనే; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=వలెనే; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్= వీలయినంత సుఖంగా


ఓ పుత్రా!  నీ తండ్రి దశరధుడు భార్యమాటని విని, అత్యంత అమూల్యమయిన రాముని సాంగత్యం పోగొట్టుకుని ఎలా దుఃఖిస్తాడో,

సీత మాట విని రాముడు కూడా అతనికి అమూల్యమయిన సీతను చేజార్చుకుని దుఃఖాన్ని పొందుతాడు.

రాముడు లేక అయోధ్య ఎలా శోకిస్తుందో అలాగే అరణ్యం కూడా సీత జాడ లేక  శోకిస్తుంది.

కనుక వీలయినంత దైర్యం చెప్తూ రాముని చెంత నీవు ఉండు.  


🙏

ఈ దేశం ఎంత గొప్పది, ఇక్కడ ఋషులు ఎంత గొప్ప వారో  వారు  వారసత్వంగా మనకు  అందించిన ఆ అమూల్య రత్నాలు ఎంత విలువైనదో 🙏

ఐక్యత


సోదరుల మంగళవారం వస్తోంది. ప్రతి మంగళవారం ఆలయానికి చేరుకోవడం అలవాటు చేసుకోండి.   మనం మంగళవారం రోజు హనుమాన్ మందిరం వెళ్లాలి.మంగళవారం కేవలం బలం, బుద్ధి, శక్తి రోజుయే కాదు ఇది  ఆంజనేయుని రోజు కూడా.

 హిందువు ఎప్పటికీ హిందువు కోసం నిలబడలేడని మీరందరూ ఫిర్యాదు చేస్తున్నారు.  మీరు కనీసం వారానికి ఒకసారి ఒకరినొకరు కలుసుకున్నప్పుడు

ఎడారిగా ఉన్న మన దేవాలయాల్లో శక్తి వస్తది మరియు సంస్థాగత ప్రదేశాలుగా అభివృద్ధి చెందదుతది.

ప్రతి మంగళవారం సాయంత్రం 7:00 నుండి 7:30 మధ్య, మీరు ఎక్కడ ఉన్నా ఆలయానికి చేరుకోవాలి. ఇది హనుమాన్ చాలీసా మరియు ఆరతి సమయం. మీరు ఇంట్లో ఉంటే ఇంటి దగ్గర ఉన్న గుడిలో.. షాపులో ఉంటే షాప్ దగ్గర ఉన్న గుడిలో.. ఆఫీస్ దగ్గర ఉన్న గుడిలో.. ప్రతి మంగళవారం ఆలయానికి చేరుకోవాలి. 7:00 నుండి 7:30 వరకు.భారతదేశంలో లక్షలాది దేవాలయాలు ఉన్నాయని ఊహించుకోండి, కేవలం 50 నుండి 100 మంది మాత్రమే ప్రతి ఆలయానికి చేరుకుని, శంఖం మరియు హారతి శబ్దాలు వారి గంటలతో ప్రతిధ్వనించినట్లయితే, భారతదేశం మొత్తంలో ప్రతి మంగళవారం సరిగ్గా 7:00 గంటలకు మిశ్రమ సంగీతం. 7 వరకు: ఇది 30 మధ్యలో ప్రతిధ్వనిస్తే, ఈ స్వరం ప్రపంచం మొత్తానికి వెళుతుంది, దాని ప్రభావం చాలా విస్తృతంగా ఉంటుంది.  నమ్మండి, ఈనాటి సమస్యలన్నీ కర్పూరంలా ఎగిరిపోతాయి, హిందువులు ఇంత పెద్ద సంఖ్యలో తమ దేవాలయాలకు చేరుకున్నప్పుడు, అది కూడా ప్రతి మంగళ వారం, హిందువులను ఆటపట్టించే ధైర్యం ఎవరికి‌ ఉండదు. వీలైతే భార్యాబిడ్డలను తీసుకుని గుడికి వెళ్లండి, ప్రతి మంగళవారం ఈ విధంగా క్రమం తప్పకుండా గుడికి చేరుకుంటే మీ ఇరుగుపొరుగు వారు కూడా మీతో కలుస్తారని మీకే తెలుస్తుంది, మీ బాంధవ్యం పెరుగుతుంది. ఆపై మీరు కూడా ఒకరికొకరు సుఖ దుఃఖాలలో పాలుపంచుకుంటారు, అదే విధంగా మనమందరం ఐక్యత అనే దారంలో కట్టుబడి ఉంటాము.

 మీకు సందేశం నచ్చినట్లయితే, దానిని అన్ని సమూహాలకు విస్తరించండి.  మరియు ఈరోజే ప్రతిజ్ఞ చేయండి, మనం ఏమి చేస్తున్నా, ప్రతి మంగళవారం 7:00 నుండి 7:30 వరకు, మేము ఖచ్చితంగా ఆలయానికి చేరుకుంటాము, మన కోసం కాదు, మన ధర్మం కోసం, మన సమాజం మరియు మరియు మన కుటుంబాల కోసం.  ఇప్పుడు ఇది అవసరం అయిందని గుర్తుంచుకోండి.  మీరు దీన్ని ఎంత త్వరగా ప్రారంభిస్తే, అంత త్వరగా మీరు ఐక్యత యొక్క దారం‌లో ఒకరికొకరు ముడిపడి ఉంటారు.


కాళిదాసజయంతి

 నేడు *మహాకవి"కాళిదాసజయంతి"*


ఆమహనీయుని,

కుడుగరగా,

కాళిదాస మనోవిశ్లేషణం !


సంస్కృత కవుల్లో కవికుల తిలకుఁడు కాళిదాసు స్థానం విశిష్ఠ మైనది. మనోవిశ్లేషణలో కాళిదాసుని మించిన వారులేరు. అతడు రచించిన నాటక త్రయంలో " అభిజ్ఙాన శాకుంతలమ్ " సర్వోత్తమమని విజ్ఙుల అభిప్రాయం.


శ్లో: కావ్యేషు నాటకం రమ్యమ్ నాటకేషు శకుంతలా 


తత్రాపి చతుర్ధోంకః తత్ర శ్లోక చతుష్టయమ్ - అన్నారు


కావ్యాలలో నాటకము  అందమైనదట (మనస్సును వెంటనే ఆకర్షించ గలదని యభిప్రాయం. అది దృశ్యమవటంవల్ల) 


అలాంటి నాటకాలలో కాళిదాస కృత శకుంతల నాటకం సర్వోత్తమం. అందులోకూడా నాల్గవ అంకం చాలారమ్యమైనది. 


అందులోకూడా నాలుగు శ్లోకాలు అసమానమైనవి . అనిదీని యర్ధం.


ఆనాలుగింటిలోకూడా శిఖరాయమానమైనది " కణ్వుడు శకుంతలను అత్తవారింటికి పంపుతూ తనలోతాను


మథనపడే ఆసన్నివేశాన్ని వివరించే శ్లోకం నిరుపమానం. చతుర్ధాంకం మొత్తం శకుంతల నత్తవారింటికి పంపే ఘట్టమే! ఆ ఘట్టాన్ని  మానవజీవితానికి అతి దగ్గరగా నడిపించి నిరుపమానమైన తన మనోవిశ్లేషణా చాతుర్యాన్ని  బహుముఖాలుగా వెల్లడించాడు కాళిదాసు.


శ్లో: యాస్యత్యద్య శకుంతలేతి హృదయం సంస్పృష్ఠముత్కంఠయా 


కంఠః స్తంభిత బాష్పవృత్తి కలుషః చింతాజడమ్ దర్శనమ్ 


వైక్లబ్య మమ తావదీదృశమహో స్నేహా దరణ్యౌకసః 


పీడ్యంతే గృహిణః కథన్ను తనయా విశ్లేష దుఃఖైర్నవైః !!


భావం: "ఈరోజు శకుంతల అత్తవారింటికి వెళుతూంటే , పిల్లవెళ్ళిపోతూందే అనే బాధతో నాహృదయ మెంతో ఉద్విగ్నతకు లోనవు తున్నది. కన్నుల నీరునిండుటచే చూపు మందగించింది. గొంతు బొంగురు బోయింది. అరణ్యవాసంచేస్తూ వీతసంగులమై తపోవృత్తి నవలంబించే మావంటివారే యింత బాధననుభవిస్తోంటే, లోకంలో ఆడపిల్లలను కనిపెంచిన తలిదండ్రులు వారిని అత్తవారింటికంపు నపుడు ఇంకెంతగా బాధపడతారోగదా! "-అనిమనస్సులో వాపోతాడు.


ఈమనోసంఘర్షణను కాళిదాసు యెంత సహజంగా చిత్రించాడోచిత్తగించారుగదా!


ఈనాటకాన్ని తెలుగున కనువదించిన కందుకూరి వీరేశలింగం పంతులుగారు అనువాదంలో మూలానికి వన్నె బెడుతూ యెలా అనువదించారో చూడండి!


ఉ: "కొందలమందె డెందము" , శకుంతల తానిపుడేగునంచయో 


క్రందుగ భాష్పరోధమున కంఠమునుం జడె ,దృష్టి మాంద్యమున్


బొందె , "నొకింత" బెంచిన తపోధనులే యిటుగుంద , నెంతగాఁ 


గుందెదరో? తమంత గను కూఁతులఁబాయు గృహస్తు లక్కటా!


అచ్చతెనుగు పదాలతో ముచ్చటగా సాగిన వీరి యనువాదంలో మూలభావం చక్కగా యిమిడి పోయింది. అంతేగాదు మూడవ పాదంలో " ఒకింత బెంచిన" అనే వాక్యంతో మూలానికి చక్కని వన్నెలు దిద్ది మెఱుగులు పెట్టారు.


మేం యీమెని పెంచిన దెంతకాలం? బహుస్వల్పం! అయినా యింత మమ కారమేమిటో? ఇందేమి మాయో? అనికణ్వుని తలపోతగా నుండి మూలమునకు మెఱుగు పెట్టినది.


ఇంతకూ  శకుంతల నత్తవారింటికి పంపు సన్నివేశమున, మామూలుగా పెండ్లియయిన ఆడుపిల్లనత్తవారింటికి బంపు నపుడు జరుగు ఉద్విగ్నవాతావరణమే,ఇందు కల్పింపబడినది. అన్నిటికన్నాముఖ్యమైనది. తలిదండ్రుల కన్నీటి వాడుక ,కాదుకాదు, అదివేడుకే! అదియునిందు పరికల్పిత మైనది.


ఈవిధంగా మానవాంతరంగాలలోని బాధలగాధలను,వేదనలను ,వేడుకలను, అతిసహజముగా చిత్రించి ,కాళిదాసు తన మనో విశ్లేషణాచాతుర్యాన్ని ప్రదర్శించి  " అభిజ్ఙాన శాకుంతలమ్"- నాటకాన్ని దృశ్యకావ్యాలలో అగ్రభాగాన నిలబెట్టాడు.


                         స్వస్తి!

చొప్పాకట్ల సత్యనారాయణ. 

🙏🌹🙏