13, మార్చి 2021, శనివారం

సోరియాసిస్



      మనుష్యులకు వచ్చు అత్యంత తీవ్రమైన మరియు అంత సులభముగా  లొంగని ఒక వ్యాధి గురించి మీకు వివరిస్తాను. దాని పేరు  "సిద్మ కుష్టు"  దీనిని " సోరియాసిస్ " అంటారు. ఇది ఒక రకమైన కుష్టు వ్యాథిగా ఆయుర్వేదం పరిగణించినది . 18 రకాల కుష్టు వ్యాధులలో ఇది ఒకటి. ముఖ్యంగా దీని లక్షణాలు చర్మం పైన పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడి పొట్టు రాలడం . అదే విధముగా కీళ్ల భాగములో సోరియాసిస్ వచ్చినపుడు "సోరియాసిస్ ఆర్థరైటిస్ "

వచ్చును. ఇది అత్యంత మొండి వ్యాధి . 


             ఇది రావడానికి ప్రధానమైన కారణం . విరుద్దమైన ఆహారాలు భుజించటం వలన శరీరం నందలి రక్తం దోషం పొందటం వలన , తీవ్రమైన మానసిక ఒత్తిడి వలన ఈ వ్యాధి సంప్రాప్తించును. దీనికి చికిత్స చేయడం అత్యంత సవాలుతో కూడుకుని ఉన్నది. అల్లోపతి వైద్యవిధానము నందు దీనికి సంపూర్ణమైన చికిత్స లేదు . ఒక్క ఆయుర్వేదం మాత్రమే దీనికి సంపూర్ణ పరిష్కారం చూపించగలదు. ఈ సమస్యని నేను నయం చేయుటకు ఎంతో పరిశోధించి కొన్ని ఔషధ మిశ్రమాలను తయారుచేశాను . వీటితో అత్యంత సులభముగా " సోరియాసిస్ " సమస్యను నిర్మూలించవచ్చు. మొదటి 2 నుంచి 3 నెలలలో మీకు మార్పు వస్తుంది . 6 నెలలపాటు ఆపకుండా వాడవలెను .  


       పైన చెప్పిన విధముగా ఒక వ్యక్తికి నేను చేసిన చికిత్స ఫలితాన్ని ఫొటో రూపంలో మీకు చూపిస్తాను. ఇది కేవలం 15 రోజుల్లొ వచ్చిన మార్పు మాత్రమే . మరికొన్ని రోజుల్లొ ఆ వ్యక్తి ఆ పరమేశ్వరుడి దయవలన సంపూర్ణముగా సమస్య నుంచి బయటపడతాడు . ఇది తధ్యం . 


          నేను చెప్పిన విధముగా ఔషధ సేవన చేస్తూ పథ్యం పాటించగలిగిన వారు మాత్రమే చికిత్స కొరకు నన్ను సంప్రదించండి. 


                     కాళహస్తి వేంకటేశ్వరరావు 


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                          9885030034

మాఘ పురాణం*_🚩 🚩 _*30 వ అధ్యాయము*_🚩

 🚩 _*మాఘ పురాణం*_🚩 

🚩 _*30 వ అధ్యాయము*_🚩


      *శనివారం*

*మార్చి 13, 2021*


🕉🌞🕉️🌞🕉️🌞🕉️🌞


*మార్కండేయుని వృత్తాంతము*


🕉️☘☘☘☘☘☘🕉️


వశిష్టుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకండుని జననము, కావిశ్వనాధుని దర్శనము, విస్వనాధుని వరంవలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి "మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్దగా ఆలకింపుమని యీ విధముగా చెప్పదొడంగిరి. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే రోజులు గడచుచున్నకొలది తల్లిదండ్రులకు దిగులు యెక్కువగుచుండెను. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నిటిని పూర్తి చేసిరి. ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రివలెనే అచిరకాలములో సకలశాశ్త్రములు, వేదాంత పురాణేతిహాసములు, స్మృతులు పథించి గుణవంతుడని ప్రశంసలనందెను. అయిననూ మరుద్వతీ మృకండులు నిత్యమును మార్కండాఎయునకు "కుమారా! నీవు పసితనమునందే సకలశాస్త్రములు అభ్యసించి నీ బుద్దికుశలతచే అందరిమన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువులయెడ,పెద్దలయెడ, బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావముతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును గాన, నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధీగును" అని చెప్పుచుండెడివారు. అటుల పదిహేను సంవత్సరములు గడిచిపోయినది. రోజు రోజుకు తల్లిదండౄల ఆందోళన, భయము ఎక్కువగానున్నవి. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి, మహాఋషులందరుకును ఆహ్వానము పంపినారు, మునీశ్వరులు, గురువర్యులు మొదలగువారందరు మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిధిసత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చి పెద్దలందరుకూ నమస్కరించినాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా, ఆయన మార్కండేయుని వారించినారు, అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావా! మీరిట్ళు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించెను.అంత వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవుకమ్ము అని దీవించితిరి గదా! అదెటుల అగును. ఇతని ఆయుర్దాయము పదహారెండ్లే గదా? ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుచున్నారు. పరమేశ్వరుదిచ్చిన వరము ప్రకారము యీతడు ఇంకోక సంవత్సరము మాత్రమే జీవించును అని చెప్పెను.


అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. 'చిరంజీవివై వర్ధిల్లు' మని దీవించినందున వారి వాక్కులసత్యములగునని బాధపడి దీనికి మార్గాంతరము లేదా? యని వశిష్టుల వారినే ప్రశ్నించిరి, వశిష్టులు కొంతసేపాలోచించి "మునిసత్తములారా! మనమందరమునూ ఈ మార్కండేయుని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుదమురండు" అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొనిపోయిరి. మునీశ్వరుల యాగమునకు బ్రహ్మ్హ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ 'చిరంజీవిగా జీవించు నాయనా' అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరబాటునకు విచారము వెల్లబుచ్చి కొతతడవాగి "భయపడకు"మని మార్కండేయుని దగ్గరకు చేరదీసి "పరమేశ్వరుడు యీ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయునుగాక" యని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునుల వంక చూచి "ఓ మునులారా! మీరు పోయిరండు ఇతనికి యే ప్రమాదమునూ జరుగనేరదు" అని పలికి వత్సా మర్కండేయా! నీవు కాశీ క్షేత్రమునకు పోయి, విశ్వనాధుని సదా సేవించుచుండుము. నీకే ప్రమాదమూ కలుగదని ధైర్యము చెప్పి పంపి వేసెను.


మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, 'కాశీనాధుని సేవించి వచ్చెదను అనుజ్ఞ ' నిమ్మని కోరగా మృకండుడు నాతని భార్యయు కొడుకు యొక్క యెడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి యుండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. మృకండుడు కుటుంబ సహితముగా కాశీకి పోయి .విశ్వేస్వరాలయ సమీపమందొక ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనేయుండసాగెను.


క్రమముగా నాతడు పదహారవయేట ప్రవేశించెను. మరణ సమయ మాసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు గొనితెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివసన్నిధితో ధ్యానము చేసుకొనుదున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి, ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాశము విసురుటకు చేతుల నెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహాతేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణములవలె బాధించెను. ఆ బాధ కోర్వలేక భటులుపోయి జరిగిన వృత్తాంతమును యముని కెరిగించగా యముడాశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాశమును విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరచి చూచుసరికి యముడతని ప్రాణములను తీసుకొనిపోవసిద్దముగా నుండగా, నాతడు భయపడి, శివలింగమును కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి, మార్కండేయుని రక్షించెను.


యముడు చనిపోవుటచే అష్టదిక్పాలురు బ్రహ్మాదిదేవతలు వచ్చి శివుని అనేక విధముల ప్రార్థించిరి, కోపముచల్లార్చుకో మహేశా! యముడు తన కర్తవ్యమును నెర వేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువు నిచ్చితిరిగదా! అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా జేసితిరి. అందుకు మేమెంతయో ఆనందిచుచున్నాము. కాని, ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటుకదా గాన, మరల యముని బ్రతికించుడని వేడుకొనిరి. అంతట నీశ్వరుడు యముని బ్రతికించి యమా నీవు నా భక్తులదరికి రావలదు సుమా! అని హెచ్చరించి అంతర్ధానమయ్యెను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందులకు మృకండుడు మిక్కిలి సంతసించి, తాను చేసిన మాఘమాస వ్రతఫలమే తన కుమారుని కాపాడినదని నమ్మి యీ మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుచుండెను.


*ముప్పయ్యవ అధ్యాయము* 

               *సమాప్తం*

🌹🌷🌼🛕🔔🌼🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

మాఘ పురాణం*_🚩 🚩 _*29 వ అధ్యాయము*_🚩

 🚩 _*మాఘ పురాణం*_🚩 

🚩 _*29 వ అధ్యాయము*_🚩


      *శుక్రవారం*

*మార్చి 12, 2021*


🕉🌹🕉️🌹🕉️🌹🕉️🌹


*మృగశృంగుని కథ*


🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️


వశిష్ట మహర్షి దిలీపునితో నిట్లనెను. దిలీపమహారాజా వినుము. పూర్వము కుత్సుడను పేరుగల బ్రాహ్మణుడు కలడు. అతడు కర్దమ ముని కుమార్తెను వివాహమాడెను. వారికొక కుమారుడు కలిగెను. ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటనము చేయడలని తల్లిదండ్రుల అనుమతి నండి యింటి నుండి బయలుదేరెను. మాఘమాసము ప్రారంభమగునాటికి అతడు కావేరె తీరమును చేరెను. మాఘమాసమంతయు కావేరీ నదిలో స్నానము చేయవలెనని తలచెను. అతడచట కావేరీనదిలో ప్రతి దినము స్నానము చేయుచు మూడు సంవత్సరములుండెను. శ్రీమన్నారాయణుని దయను పొందుటకై స్నానము చేయవల్యునను సంకల్పము కలిగెను. అతడు శ్రీమన్నారాయణుని ఉద్దేశించి తపము చేయనారంభించెను. కుత్సుని పుత్రుడగుటచే వానికి మృగశృంగుడను పేరు వచ్చెను. వాని తపమునకు మెచ్చి శ్రీమన్నారాయణ మూర్తి వానికి ప్రత్యక్షమయ్యెను. మృగశృంగుడు శ్రీహరిని జూచి ఆనందపరవశుడై పెక్కు రీతుల స్తుతించెను. శ్రీహరియు వాని తపమునకు స్తుతులకు మెచ్చియిట్లనెను. "నాయనా! నీవు అనేక పర్యాయములు మాఘమాసస్నానమును విడువక చేసి అఖండమైన పుణ్యమును, నా ప్రేమను సాధించితిని. నీయీ తపముచే మరింతగా నీపై ప్రేమ కలిగినది. వరమును కోరుకొమ్మనెను". మృగశృంగుడును "స్వామీ! నీ దివ్యదర్శనమును కలిగించినందులకు కృతజ్ఞుడను, ఇట్టి నీయనుగ్రహము పొందిన తరువాత నాకు మరే విధమైన కోరికయు కలుగుటలేదు. కావున యీ ప్రదేశామున నీవు భక్తులకు దర్శనమిచ్చు చుండవలయునని కోరెను". శ్రీమన్నారాయణుడును వాని ప్రార్థనకంగీకరించి అంతర్థానము నందెను.


కౌత్సుడు యింటికి తిరిగివచ్చెను. వాని తల్లిదండ్రులు వానికి వివాహము చేయదలచిరి. కౌత్సుడును వారి అభిప్రాయమును అంగీకరించెను. అనుకూలతకల యువతి భార్యగా లభించినచో గృహస్థ ధర్మమును చక్కగ పాటించి, ధర్మార్థకామ మోక్షములను పురుషార్థములు నాల్గిటిని సాధింపవచ్చును. ఇందువలన కన్యను పరిశీలించి వివాహమాడవలయునని భార్యకుండవలసిన లక్షణములను వారికి వివరించెను. వారును అతని ఆలోచనను మెచ్చిరి.


భోగాపురమున సదాచారుడను ఉత్తమ బ్రాహ్మ్ణుడు  నివసించుచుండేను. వానికొక కుమార్తె కలదు. ఆమె పేరు సుశీల, ఆమె పేరుకు తగిన ఉత్తమురాలు, గుణవంతురాలు. కౌత్సుడామెను వివాహము చేసికొనవలయునని తలచెను. సుశీల యొకనాడు తన యిద్దరు స్నేహితురాండ్రతో కలిసి నదీస్నానమునకు బయలు దేరినది. ఆ సమయమున మదించిన అడవియేనుగు వారిని తరిమెను. అప్పుడు సుశీల, ఆమె మిత్రురాండ్రును బెదిరిపారిపోవుచు గట్టులేని నేల బారునూతిలో పడి మరణించిరి. కౌత్సుడు వారి మరణవార్తను విని దుఃఖించెను, చనిపోయిన ముగ్గురిని బ్రదికింపవలయునని నిశ్చయించుకొనెను. వారి తల్లిదండ్రులకు ఆ శరీరములను రక్షింపుడని చెప్పెను. సమీపమున నున్న నదిలోస్నానము చేసి ధ్యానమగ్నుడై యుండేను. మదించిన ఆ యేనుగు వానికెదురుగ నిలిచి వానిని కొంతసేపుచూచెను. తటాలున వానియెదుట తలవంచి వానిని తోండముతో తన మీదకు యెక్కించుకొన్నది. కౌత్సుడును శ్రీమన్నారాయణుని స్మరించుచు దానిపై నీటిని చల్లెను. రెండు చేతులతో దానిని స్పృశించెను. వెంటనే ఆ యేనుగు తన రూపమును విడిచి దివ్యరూపమునందెను. శాప విమోచనమును కల్గించిన మృగశృంగునకు కృతజ్ఞతలను తెలిపి నమస్కరించి తన లోకమునకు బోయెను.


కౌత్సుడును చనిపోయినవారిని బ్రతికింపవలయునని మరల నదిలో మునిగి యమధర్మరాజు నుద్దేశించి తపము చేయసాగెను, యముడును వానికి ప్రత్యక్షమయ్యెను. వరము నిత్తును కోరుకొమ్మనెను. మృగశృంగుడును(కౌత్సుడు) యమునికి నమస్కరించి స్తుతించెను. దుర్మరణము చెందిన ముగ్గురు కన్యలను బ్రతికింపుమని కోరెను. యముడును వాని పరోపకార బుద్దికి మెచ్చుకొనెను అడిగిన వరమునిచ్చి యంతర్థానము చెందెను. మృగశృంగుడు పట్టుదలతో చేసిన తపముచేతను, యముని దయవలన, సుశీల ఆమె ఇద్దరు మిత్రురాండ్రు బ్రతికిరి. వారిని జూచి అందరును ఆశ్చర్యపడిరి. సుశీల మున్నగువారు నిద్రనుండి లేచినట్లుగ లేచికూర్చుండిరి. వారు యమలోకమున జూచిన విశేషములను యిట్లు చెప్పిరి. జీవిచేసిన పాపముననుసరించి శిక్షింపబడును. భయంకరములైన పాపములను చేసినవారు కఠినముగ శిక్షింపబడుదురు. పాపము చేసిన వాడు యెఱ్ఱగాకాలిన యినుపస్తంభమును కౌగిలించు కొనవలయును. మరుగుచున్న నూనెలో, పాపముచేసిన వానిని పడవేయుదురు. తలక్రిందుగ వ్రేలాడదీసి క్రిందమంటలను పెట్టుదురు. ఎఱ్ఱగా కాల్చివానితో వాతలు పెట్టుదురు. భయంకరములైన సర్పాదులున్న చోట పడవేయుదురు అని వారు వివరించిరి.


వారు చెప్పిన మాటలను మిగిలిన వారందరును భయపడిరి. అప్పుడు సుశీల మున్నగువారు భయపడకుడు. మాఘమాసస్నానము చేసి, యిష్టదైవమును పూజించి, యధాశక్తి దానము, జపము మున్నగునవి చేయుట యొక్కటే సర్వ సులభమైన ఉపాయము మాఘస్నానము వలన చేసిన పాపములు నశించి పుణ్యములు కలిగి జీవుల శుభలాభము ఆనందవచ్చును అని మిగిలిన వారికి ధైర్యము చెప్పిరి. ఇట్లు పలుకుచున్న వశిష్టమహర్షిని దిలీపుడు గురువర్యా! భూలోకమునకు యమలోకమునకు గల దూరమెంత? చనిపొయిన వారు మరల బ్రదుకుటకు వీలగునా యని ప్రశ్నించెను. అప్పుడు వశిష్టమహర్షి నాయనా! భక్తికి పుణ్యమునకు సాధ్యముకానిది లేదు. పుణ్యమును కలిగించు మాఘస్నానమును, సుశీల మున్నగువారు అనేకమార్లు చేయుటవలన వారు సంపాదించిన పుణ్యము, కౌత్సుడు చేసిన తపఃప్రభావము వారిని యీ విధముగా కాపాడినది సమాధానము చెప్పి నాయనా యిట్టిదే మరొక్క విషయము కలదు వినుము. పుష్కరుడను జ్ఞానవంతుడొకడు కలడు. అతడు సద్గుణములు భక్తి కలిగినవాడు. మాఘస్నానము మొదలగు పుణ్యప్రదములగు కార్యములనెన్నిటినో చేసినవాడు.


యముడొకనాడు తన భటులను చూచి పుష్కరుని తీసుకొని రండని పలుకగా యమభటులు పుష్కరుని తీసికొని వచ్చిరి. యముడు తీసికొని రమ్మన్నది యితనిని కాదు పుష్కరుడను పేరు గల మరియొకనిని భటులు పాపాత్ముడగు పుష్కరుని తీసికొని వచ్చుటకు బదులు పొరబాటున పుణ్యాత్ముడగు పుష్కరుని తీసుకొనివచ్చిరి. యముడును తన భటులు చేసిన పొరబాటునకు భటులను మందలించెను. క్షమింపుడని పుష్కరుని ప్రార్థించెను. పుష్కరుని భూలోకమున దించి రండని భటులకు ఆజ్ఞనిచ్చెను. పుష్కరుడును యమలోకమును చూచుటకు యముని అనుమతిని కోరెను. యముడందులకంగీకరించెను. భయంకరములగు శిక్షలననుభవించువారిని చూచి యితడు భయపడెను. భయముపోవుటకై హరినామ భజనమును చేసెను. ఇట్టి భజనమును వినుటచే పాపాత్ములపాపములు తగ్గి వారి శిక్షలును తగ్గసాగినవి. పుష్కరుడు నరకమును చూచుటచే మరింత జ్ఞావంతుడయ్యెను. దిలీపా! యమ లోకమునకు పోయి వెనుకకు తిరిగి వచ్చిన వారింకను యెందరో ఉన్నారని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించెను.


*మృగశృంగుని వివాహములు*


వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల నిట్లనెను. మృగశృంగుని విద్యాభ్యాసము పూర్తి అయినది. అతడు ప్రజ్ఞుడై దేశాటనము చేసెను, మాఘమాసస్నానములు తపము చేసి శ్రీహరియనుగ్రహమును పొందెను. దుర్మరణము చెందిన సుశీల మున్నగువారిని యముని అనుగ్రహము నంది బ్రదికించెను. ప్రయోజకుడని నలుగురును మెచ్చిరి. ఇట్టి కుమారునికి వివాహము చేయవలయునని వాని తల్లిదండౄలు తలచిరి. మృగశృంగుడు తాను సుశీలనే వివాహమాడుదునని తల్లిదండ్రులతో చెప్పెను. వారును సంతోషముతో నంగీకరించిరి. శుభముహూర్తమున సుశీలామృగశృంగులకు వివాహము మహావైభవముగ జరుప నిశ్చయింపబడినది. సుశీల స్నేహితురాండ్రులిద్దరును మృగశృంగుని చేరి తమ యిద్దరిని కూడ ఆ ముహూర్థముననే వివాహము చేసికొనవలసినదిగ కోరిరి. మృగశృంగుడు అంగీకరింపలేదు. వారు పురుషుడు యెక్కువ మంది యువతులను పెండ్లాడుట శాస్త్ర విరుద్దము, ధర్మవిరుద్దము కాదు దశరధునకు భార్యలు ముగ్గురు లేరా? శ్రీకృష్ణునకుయెనిమిది మంది పట్టపు రాణులు లేరా? ఆది దేవుడైన పరమేశ్వరునకు గౌరీ, గంగ యిద్దరు లేరా? వారికి లేని అభ్యంతరము నీకెందులకు? అని వాదించిరి. ప్రాణదానము చేసినవానికి భార్యలమై కృతజ్ఞతను చూపు అవకాశమునిమ్మని నిర్భందపరచిరి. పెద్దలును వారి అభిప్రాయమునే బలపరచిరి. చివరకు మృగశృంగుడు సుశీలతో బాటు వారిద్దరిని వివాహమాడెను.


కథను వినుచున్న దిలీపుడు మహర్షీ వివాహమెన్ని విధములో వివరింపుడని కోరెను. అప్పుడు వశిష్టుడు బ్రాహ్మణకన్యను అలంకరించి వరునకిచ్చి చేయువివాహము బ్రహ్మవివాహము, యజ్ఞము చేయునప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భార్యగానుండుటకై కన్యనిచ్చి చేయు వివాహమును దైవ వివాహమందురు. పెండ్లికుమారుని నుండి గోవులను తీసికొని కన్యనిచ్చి చేయువివాహమును ఆర్ష వివాహమందురు. ధర్మము కోరకు కలసియుండునని చేయు వివాహమునకు ప్రజాపత్య వివాహమని పేరు. ధనమును తీసికొని కన్యనిచ్చి చేయు వివాహమునకు అసురరమని పేరు, ఒకరినొకరు ప్రేమించుకొని తమంతతాముగ్స్ చేసికొను వివాహమును గాంధర్వమని యందురు. బలవంతముగ కన్యనెత్తుకొని పోయి చేసికొను వివాహము రాక్షస వివాహము మోసగించి చేసికొను వివాహము పైశాచికము అని వశిష్ఠుడు దిలీపునకు చెప్పెను. గృహస్థ ధర్మములను పతివ్రతా లక్షణములను దిలీపుడు కోరగా వానికి వానిని గూడ వివరించెను.


దిలీపుడు కోరగా వశిష్టుడు మరల నిట్లు కథను కొనసాగించెను. మృగశృంగుడు నలుగురు భార్యలతో గలసి సుఖముగనుండెను. గృహస్థుని ధర్మములను పాటించుచు ధర్మమును తప్పక అందరి మన్ననలను పొందెను. మృగశృంగుడు సుశీలయందు పుత్రుని పొందెను. ఉత్తమ లక్షణములు కల వానికి మృకండుడని పేరు పెట్టెను. మృకండుడును బందువుల కానందమును కలిగించుచు సద్గుణశాలియై పెరుగుచుండెను. మృగశృంగుడు మృకండునకు ఉపనయనము కావించి గురుకులమునకు పంపెను. మృకండుడును శ్రద్ధాసక్తులతో వినయ విధేయతలతో తెలివితేటలతో గురుకులమున అందరికి యిష్టుడై అందరిలోను అన్నిటమిన్నయై విద్యలన్నిటిని నేర్చెను, మృగశృంగుడు ఉత్తమలక్షణములు కల మరుద్వతియను కన్యతో వానికి వివాహము కావించెను.


మృగశృంగుని మిగిలిన యిద్దరు భార్యలును పుత్రులను కనిరి వారును మృకండుని వలె విద్యలనుగ్రహించిరి. మృగశృంగుడు వారికిని వివాహములు చేసెను. ఇన్ని జరిగినను అతడు మాఘమాసస్నానములను మానలేదు. ఇష్టదేవతార్చనను వీడలేదు. దానములను మానవయధాశక్తిగ చేయుచుండెను. తన కుటుంబ సభ్యుల చేతను చేయించుచుండెను. మాఘమాస స్నాన మహిమ వలన సర్వసౌఖ్యములను, సర్వలాభములను పొందెను, మనుమలను గూడ పొందెను. ఈ విధముగనున్న తన వృద్ధికి సంతృప్తినంది గృహమును విడిచి తపోవనమునకు పోయి తపమాచరించి విష్ణు సాన్నిధ్యమునందెను. ఇక, అతని జ్యేష్ఠకుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపుము అని వశిష్టులవారు దిలీపమహారాజునకు ఇట్లు వివరించినారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృకండుడే పరివార భారమంతయు మోపి గృహమునందు యే అశాంతియు లేకుండ చూచుచుండెను. అయిననూ ఒక విచారము పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహమాడి చాలకాలము గడిచిననూ సంతానము కలుగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. అతడొకనాడు యీ విధముగా తలపోసెను. "కాశీ మహాపుణ్యక్షేత్రము, సాంబశివునకు ప్రత్యక్ష నిలయము అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయేగాక, మనస్సునందలి కోరికలు నెరవేరెను, అనేకమంది కశీవిశ్వనాధుని దర్శనము చేసికొని, వారి యభీష్టములను పొందగలిగిరి గాన మేను నా కుటుంబ సమేతముగా కాశీ వెళ్ళుదును అని మనస్సులో నిశ్చయించుకొని ప్రయాణసన్నద్ధుడై బయలదేరును. మార్గమధ్యమున అనేక క్రూరమృగముల బారినుండి క్రిమికీటకాల ప్రమాదముల నుండి అతికష్టము మీద తప్పించుకొని, కుటుంబసహితముగా కాశీక్షేత్రము చేరినాడు.


కాశీపట్టణము నానుకొని పవిత్రగంగానది తన విశాలబాహువులను చాచి, ప్రశాంతముగా ప్రవహించు చున్నది. మృకండుడు  పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్య స్నానాదికవిధులు నెరవేర్చుకొని, విశ్వనాధుని మందిరమునకు వెళ్ళెను. ఆలయావలలోనికి రాగానే మృకండునకు యెక్కడలేని ఆనందము కలిగెను. తన జన్మ తరించెననియు, తాను కైలాసమందున్నట్లును తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్దలతో ప్రార్థించెను. ఈ విధముగా సకుటుంబముగా మృకండుడు కాశీవిశ్వేశ్వరుని ధ్యానించి, ఒక లింగమును ప్రతిష్టించి, దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణము చేసి దాని కెదురుగా తన భార్యపేర మరొక లింగమును ప్రతిష్ఠించెను. ఆ విధముగా ఒక సంవత్సరము వరకును విశ్వేశ్వరుని స్న్నిధానమందు గడపనెంచెను. ఒక దినము మృకండుని మువ్వురు తల్లులను పవిత్రంగా నదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచిరి. మృకండుడు చాల దుఃఖించెను. విధిని యెవ్వరూ తప్పించలేరు గదా! అయినను వారు ముగ్గురును యీశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచిరి. చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకండుడు యధావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ ఋణమును దీర్చుకున్నాడు. మృకండుడు యెంతకాలమునకునూ సంతానము కలుగనందుననే కాశీక్షేత్రము వచ్చినాడు గదా! సంతానము కొరకు భార్యాసమేతుడై విశ్వనాధుని గూర్చి తపస్సు చేసినాడు. అతని తపస్సునకు మెచ్చి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమైరి. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందము కలిగి, ప్రమేశ్వరుని అనేక విధముల స్తుతించగా పరమేశ్వరుడు. "మహామునీ! మీ భక్తికి యెంతయో సంతసించినారము. మీరు చేయు తపస్సుమమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కళంగ భక్తికి మెచ్చి మీ కోర్కెలను దీర్చగా వచ్చి నారము. కాన మీ యభీష్టమెరిగినపుడు" డని పలికెను. అంత మృకండుడు నమస్కరించి "తండ్రి! మహాదేవా! తల్లి అనంపూర్ణా! ఇవే మా నమస్కృతులు, లోకరక్షకా! మీదయవలన నాకు సులక్షణవతి, సౌందర్యవతి, సుకుమారవతియగు పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సుఖసంసారము అనుభవించుచున్నాము. కాని యెంతకాలమైననూ మాకు సంతానము కలుగనందున కృంగి కృశించుచున్నము. సంతానము లేనివారికి నుత్తమగతులు లేవు గదా! కావున మాకు పుత్రసంతానము ప్రసాదింప వేడుకొనుచున్నాను" అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించినాడు. మృకండుని దీనాలాపము లాలకించిన త్రినేత్రుడు "మునిసత్తమా! నీ యభీష్టము నెరవేరగలదు. కానీ ఒకా నియమమున్నది. బ్రతికియున్నంతవరకు వైధవ్యముతో నుండు పుత్రిక కావలయునా? లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలయునా?" 

అని ప్రశ్నించెను. మృకండునకు ఆశ్చర్యము కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలోపడవలసి వచ్చెను. కొంత తడవాగి "హే శశిధరా! నన్ను పరీక్షింప నెంచితివా? నాకు జ్ఞానోదయమయినది మొదలు నేటివరకును మీ ధ్యానమునే పలుకుచు సేవించుచున్న నాకు యేమి చెప్పవలయునో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృశించు పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమే ప్రసాధింపుమని" అడిగెను. "అటులనే అగునుగాక!" అని వరమిచ్చి త్రిశూలధారి పార్వతీ సమేతముగా అంతర్ధానమయ్యెను. పరమేశ్వరానుగ్రహము వలన మృకండుని భార్యయగు మరుద్వతి ఒక శుభ ముహూర్తమున పుత్రునిగనెను. మృకండూనకు పుత్ర సంతానము కలిగెనని అనేక మంది ఋషిసత్తములు బాలుని చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడావచ్చి ఆ బిడ్డకు జాతకర్మవేసి వెడలెను. ఓ దిలీపమహారాజా! పరమపూజ్యుడును, ఋషిసత్తముడునూ యగు మృకండుడు పరమేశ్వరుని మెప్పించి, వారి దయకు పాత్రుడయి పుణ్యమును బడసిన యీ పుత్రుడే పరమ భాగతోత్తముడగు మార్కండేయుడు.


*ఇరవైతొమ్మిదవ అధ్యాయము*  

                  *సమాప్తం*

🌹🌷🌼🛕🔔🌼🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

శతమానం భవతి

 _*💫“శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి.”*_


_-[వేద పురుష ఆశీర్వచనం]-_


_-[“గుడ్ మార్నింగ్”, “గుడ్ నైట్” చెప్పటంలోని ఔచిత్యం..]-_


_“శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి” అనేది వేద పురుష ఆశీర్వచనం._ 


_మనలను నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది. వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం._ 


_అలాగే నిత్యం చేసుకొనే సూర్యోపస్థానంలో “పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం” అని చెప్పబడించి._ 


_*“నిండు నూరేళ్లు ఆ సూర్యుని చూడగలగాలి. నిండా నూరేళ్ళు జీవించాలి. ఆది కూడా ఆనందంగా జీవించాలి”* అని ఆకాంక్షిస్తాం. ఇలా ఆకాంక్షించటంలో ఎంతో విలువ ఉంది. *“గుడ్ మార్నింగ్”* అని చెప్పడం, *"గుడ్ నైట్”* చెప్పటంలోనూ లౌకికంగా కూడ అట్టి ఆకాంక్షలు ఆధునిక కాలంలోనూ అనుసరిస్తూనే ఉన్నాం._ 


_మంచి మనస్సు నుండి వచ్చే శుభాశీస్సుకు, శుభాకాంక్షాలకు కూడ శక్తి ఉంది. దాని వలన మేలు జరుగుతుంది. ఇది పూర్వకాలపు విషయమే కాదు, నేటి విషయం కూడా అని అర్థం చేసుకొనగలం._

         

_*“బ్రతికి యుండిన శుభములు బడయవచ్చు”* కాబట్టి బ్రతికి ఉండటం అంటే ఆయుర్దాయం మొదట కోరదగినది. అందుకే *ఏ పూజ చేసినా సంకల్పంలో ఆయురారోగ్య భోగభాగ్యాలు కాంక్షిస్తాం.* అందులో ముందు కోరేది ఆయుర్దాయాన్నే._ 


_కోట్ల సంపద లభించినా అయుర్దాయం లేక మరుసటి రోజే మరణించే వానికి ఈ కోట్ల సంపద వలన ప్రయోజనమేమిటి ? అందువలనే మొదట కోరదగినది ఆయుర్దాయం._ 


_నిజమే. ఆయుర్దాయమనేది కోరుకొంటే వచ్చేదా ? అనేది ప్రశ్న._ 


_*“దీర్ఘాయుష్మాన్ భవ”* అని దీవించటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందా? ఆని సందేహం._

          

_ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధన మేవ చ|_

         _పంచైతా న్యపి సృజ్యంతే గర్భస్థస్తైవ దేహినః||_

_అని చెప్పబడింది. అంటే *“ఆయుష్షు, వృత్తి, ధనం, విద్య, చావు అనేవి ఐదూ జీవి గర్భంలో ఉండగానే నిర్ణయింపబడుతూ ఉంటాయి”* అని దాని అర్థం._


_ఆయుర్దాయం, మరణం అనేవి ముందే నిర్ణయింపబడితే ఇంకా ఈ ఆశీస్సుల వల్ల కాని, మరే జాగ్రత్తల వల్ల కాని ప్రయోజనమేమిటని ప్రశ్న ?_ 


_“లలాట లిఖితా రేఖా పరిమార్ట్షుం న శక్యతే” నుదుట వ్రాసిపెట్టినది ఎవరూ తుడవలేరని, మార్చలేరని, జరిగి తీరుతుందని మరికొందరి మాట._ 


_“ఏది నిజం” మనేది సామాన్యునకు వచ్చే ప్రశ్న. ఆయుష్షుకు వృద్ధి, క్షీణతలు ఉంటాయా ? ఉంటేనే దాని విషయంలో జాగ్రత్తలు తీసుకొనటం అవసరం తప్ప అదేమీ లేనప్పుడా యత్నమే వ్యర్థం కదా!_ 


_ఆయుర్వేదం అనే వైద్య విధానం పేరులోనే ఆయువు ఉన్నది. ఆయుర్వేదమనేది ఊసుపోక చెప్పిన సామాన్యపు మాట కాదు. వేదాలలో మొదటిదైన ఋగ్వేదానికి సంబంధించిన ఉపవేదమే ఆయుర్వేదం. అంటే ఆయువును గూర్చి తెలిసికొనదగిన విజ్ఞానం అది. అందువల్ల ఆయువునకు సంబంధించి వృద్ధి క్షయాలు కూడ పరిగణింపదగినవే అని తెలుస్తుంది._

          

_లలాట లిఖితమైన ఆయుర్దాయాన్ని ఎవ్వరూ మార్చలేరనేది యదార్థమైనా మార్కండేయుడు, శంకరాచార్యుల వారు మొదలైన వారు దైవానుగ్రహం వలన ఆయుర్దాయాన్ని పెంచుకొనటం చూస్తాం. అంతే కాదు హనుమంతుడు, విభీషణుడు మొదలగు వారు చిరంజీవులుగా వరమందటమూ చూస్తాం. ఇంకా విశేషం ద్వాపర యుగంలో సాందీపనే గురువు యొక్క పుత్రుడు మరణించగా శ్రీకృష్ణుడు గురుదక్షిణగా బ్రతికించినట్లు, త్రేతాయుగంలో చనిపోయిన వానర వీరుడు గంధమాదనుని హనుమంతుడు బ్రతికించి తెచ్చినట్లు కూడ ఇతిహాసాల ద్వారా తెలుస్తోంది !_ 


_కాబట్టి దైవానుగ్రహం వలన కాని, అమోఘవచనులైన ఋష్యాదుల ఆశీర్వచనాల వల్ల కాని ఆయుర్దాయం పెంచుకొనటం సాధ్యమే అని తెలుస్తుంది._ 


_కాబట్టే మన పూర్వజులు *“ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం”* అని సంకల్పంలో చెప్పుకొనటంలో అనౌచిత్యం లేదని, *“శతమానం భవతి”* అంటూ మహనీయుల ఆశీస్సులు పొందటం శ్రేయస్కరమే అని తెలుస్తుంది._ 


_అందుకే అట్టి ఆశీర్వచనాల కోసం పెద్దల యెడ వినయ విధేయతలతో ఉండాలి. చదువొక్కటే కాదు సంస్కారం కూడా ఖచ్చితంగా అలవర్చుకోవాలి. సంస్కారం లేని ఎంతగొప్ప చదువైనా అది సామాజిక శ్రేయస్సుకు, వ్యక్తి శ్రేయస్సుకు ఉపకరించదు !!


Dr nittala Astro Vasthu  VSKP Ap Ind

ఇదినిజం*

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


👉 *అది యూరప్ అమెరికా వాళ్ళ అసహాయత!*🙏

👉 *ఇది మన అనంతమైన అజ్ఞానం!*🙏

 

1.  తాజా ఆహారం అందుబాటులో లేక, వండుకోవదానికి సమయం కేటాయించుకో లేక ఎప్పుడో నెలల క్రితం చేసిన రుబ్బిన పిండిని కేన్ లో వేసుకుని నిలవ పెట్టీ పెట్టీ దానితో రోజూ Pan కేకుల్నీ, ఆర్నెల్ల క్రితం చేసిన పిజ్జాలమీద, బంకలు సాగే కూరలు వేసుకుని తినాల్సిన ఖర్మపట్టడం అమెరికా యూరప్ *వాళ్ళ నిస్సహాయత !*

👉 56 భోజన వంటకాలను పక్కనపెట్టి ఎవడో ఏనాడో వండి పెట్టిన రొట్టెని కాలవలో పారెయ్యకుండా, ఫ్రిజ్జిలో మురగబెట్టి పెట్టీ మోడ్రన్ స్టైల్ పేరుతో ఆ పిజ్జాల్ని వేడిచేసి ₹ 400 / - పెట్టి  మరీ తినడం, *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


2. ఎనిమిది నెలలు ఎముకలు కొరికే చలి తట్టుకోలేక, కోట్లూ సూట్లూ వేసుకోవడం *వారి నిస్సహాయత...*

👉 వేసవి వేడిలో చమటలతో ఉక్కపోసి వళ్ళంతా జిడ్డుజిడ్డుగా అతుక్కుంటూ చిర్రెెత్తిపోతున్నా కూడా పెళ్లి రోజు వెర్రిగా కోట్లూ సూట్లూ వేసుకుని  తిరగడం *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


3. తాజా భోజనం వండేవాళ్ళు లేక ఫ్రీజ్ వాడడం, అమెరికా యూరోప్ *వాళ్ళ నిస్సహాయత...*

👉 రోజూ తాజా కూరగాయలు వస్తున్నా, వారం రోజుల కూరగాయలు ఫ్రీజ్ లో కుక్కి కుక్కి అవి  మురుగుతున్నవాటిని వండుకు తినడం, *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


4 . ఔషధ మొక్కల జ్ఞానం లేక, మూలికలతో పరిచయం లేక, వారు జీవ జంతువుల మాంసం తో కెమికల్స్ తో ఏవేవో మందులు తయారు చేయడం, వాటి సైడ్ ఎఫెక్ట్స్ కి వేరేవేరో రోగాల పాలవ్వడం *వారి నిస్సహాయత...*

👉 మరి ఆయుర్వేదం లాంటి గొప్ప చికిత్సా విధానం తెలిసినప్పటికీ, పట్టించుకోకుండా... కెమికల్  మందులు ఉపయోగించడం, సైడ్ ఎఫెక్ట్ లతో కొత్తరోగాలు తెలిసితెలిసి తెచ్చుకోవడం *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


5. సరిపడ ధాన్యం లేక పంటలు పండక పళ్ళూ కాయలూ దొరకకా  పాముల్ని, కప్పల్నీ, కుక్కల్ని నక్కల్ని కూడా చంపి తినడం *వాళ్ళ నిస్సహాయత...*

👉 మరి 1600 రకాల ఆహార ధాన్యాలు లభిస్తున్నా వాళ్ళల్లా తినడానికి ప్రయత్నించడం *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


6. కొబ్బరి నీళ్ళూ మావిడి పళ్ళు బత్తాయి పళ్ళూ, సపోటా, అంబలి, చల్ల, మజ్జిగ, పాలు మొదలైనవి లేకపోవడం లేదా తెలియకపోవడం వల్ల పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు తాగడం *వారి నిస్సహాయత...*

👉 అవన్నీ కాక ఎన్నో రకాల ప్రాకృతిక పానీయాలు అందుబాటులో ఉన్నా... పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు అనే విషాన్ని తాగడం ఆధునికంగా అభివృద్ది చెందామని భావించండం *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


7. వాళ్ళ పంపుల్లో నీళ్ళు గడ్డకడుతుంటే టాయిలెట్ కి వెళ్ళిన  తరవాత కడుక్కోలేక టిష్యూ పేపర్లతో తుడుచుకొని తిరగడం స్నానం చెయ్యలేక సెంటేసుకుని పడుకోవడం *వాళ్ళ నిస్సహాయత...*

👉 సుబ్బరంగా మనకు నీళ్ళొస్తున్నా కడుక్కోకుండా  

తుడుచుకొని, సెంటేసుకుని తిరగడం *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


8. ఎలాంటి ముందుచూపూ లేక, మరుగుదొడ్ల నీళ్ళని నదుల్లో  కలుపుకోవడం మళ్ళీ వాటినే శుభ్రం చేసుకుని తాగడం *వాళ్ళ బుద్దిహీనత*

👉 అన్నీ తెలిసి తెలిసి వాళ్ళని గుడ్డిగా అనుసరించి అదే అభివృద్ది అనుకుని మనం కూడా మన నదుల్ని మురికి కూపాలు చేసుకుని మంచినీటి కోసం ఏడవడం *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


9. తోటలూ మొక్కలూ లేక ఎక్కడో ఎవరి దగ్గరో బానిసలా బతికడం కాయలూ పళ్ళూ కొనుక్కు తెచ్చుకోవడం. సరియైన కుటుంబ వ్యవస్థ లేకపోవటం వల్ల, నా అనే వాళ్ళు లేక, అశాంతిగా ఒంటరిగా జీవించడం *వాళ్ళ నిస్సహాయత...*

👉 చక్కగా పల్లెల్లో ఫాం హౌసుల్లాంటి ఇళ్ళల్లో, చక్కని ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో,  పెరట్లో బోలెడన్ని మొక్కలేసుకుని, చెట్టుకి పండిన కాయలూ పళ్ళూ తిన్నన్ని తిని పక్కవాళ్ళకిచ్చి సంతోషంగా, అందరితో కష్ట సుఖాలను పంచుకుంటూ, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించే మనం...

ఆ అమెరికా, యూరోప్ వారిని అనుకరించడం... ఇలా కొట్టుకు చస్తూ, ఏడుస్తూ బతకడం... *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


10. చెట్లు పెంచుకోవడానికి ఏ ఎరువెయ్యాలో తెలియక రసాయనిక మందులేసుకోవడం కడుపులో ఎసిడిటీలు కేన్సర్లూ  తెచ్చుకోవడం *వాళ్ళ నిస్సహాయత...*

👉 ఇంట్లో వుండే ఎద్దులూ, ఆవులు, కోళ్ళు, మేకల మల మూత్రాలను బయో ఫెర్టిలైజర్స్ గా, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ గా వాడుకుంటూ హాయిగా ఆరోగ్యంగా బతికిన మనం...

వాటిని వదిలి అమెరికా, యూరోప్ వాళ్ళ మోజులో పడి వాళ్ళని అనుసరించి, మనం కూడా ఆ క్రిమిసంహారక మందులే వాడుతూ, ఇమ్యూనిటీ నాశనం చేసుకుంటూ ఆ రోగాలే తెచ్చుకోడం *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


11. ఒక్కోసారి ఆరునెలల పాటు వాళ్లకు సూర్యుడు కూడా కనిపించడు కనక వాషింగ్ మెషిన్ లో ఉతికేసిన బట్టలు సూర్యరశ్మిలో ఎండబెట్టే అవకాశం లెక డ్రైయ్యర్లో ఆరబెట్టుకుంటూ వాటికున్న ఎరోబిక్ ఎనరోబిక్ బాక్టీరియాల్లో కొన్ని చావకపోయినా హానికరమైన కెమికల్స్ వేసుకుని బతకడం *వాళ్ళ నిస్సహాయత...*

👉 హాయిగా ఎంతో ఆరోగ్యాన్నిచ్చే సూర్యరశ్మి నిండుగా వున్నా వాషింగ్ మెషిన్లో ఉతికిన బట్టల్ని అందులోనే ఆరబెట్టుకోవడం మన బుద్దిహీనత *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


12. గడ్డకట్టేసిన నీటితో  స్నానం చెయ్యలేక శానిటైజేషన్ పేరుతో మురికి చేతులపైనే పురుగులమందులు జల్లుకుంటూ...

అవే బట్టలతో ఇల్లంతా తిరగడం, మంచాల మీద పడుకోవడం... వాటివల్ల మాటిమాటికీ రోగాలు తెచ్చుకోవడం మందులు మింగడం *వాళ్ళ నిస్సహాయత...*

👉హాయిగా నీళ్ళొస్తున్నా స్నానం చెయ్యకుండా స్టైల్ పేరుతో కుక్కకంపు కొట్టే సెంట్లు కొట్టుకుంటూ తిరగడం *మన అనంతమైన అజ్ఞానం.*

*🙏మరోసారి మళ్ళీ క్షమించాలి ఇదినిజం*🙏


13. దూరంగా నిలబడి ఆహ్వానించడం, నమస్కరించడం, 

చెప్పులు వేసుకుని ఏ ఇంట్లోకి వెళ్ళక పోవడం. 

కాళ్ళు చేతులూ కడుక్కోవడానికి బకెట్ తో నీళ్ళివ్వడం 

మన సంస్కారం. మన పెద్దలు మనకు నేర్పిన అత్యుత్తమ సంస్కారం. దాన్ని వదిలేసి ఇవ్వాళ ఏడవడం *మన అజ్ఞానం.!*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


14. విపరీతమైన చలితట్టుకోలేక ఇంటాబయటా అవే సాక్స్ అవే బూట్లతిరగడం *వాళ్ళ నిస్సహాయత.*

👉ఇంట్లోకి వచ్చేముందు చెప్పులు గుమ్మం బయటే వదిలెయ్యడం, బయట తిరిగిన బట్టల్ని బాత్ రూములొ  తడిపేసి స్నానం చేసి ఇంట్లోకి రావడం మన పద్దతి. అలాంటి పద్దతుల్ని చాదస్తం పేరుతో... ఆలోచన లేకుండా వదులుకోవడం *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

 

మనం ఎంతో ఆత్మీయత గుండెల్లో పొంగితే కానీ చేతులు పట్టుకోలేం, హత్తుకుని కౌగిలించుకోలేం. తల మీదో బుగ్గల మీదో ముద్దులు పెట్టుకోలేం కానీ అవి అమెరికా వాళ్ళకి అత్యంత సహజం..

కానీ నేడు దాన్ని వద్దంటోంది ప్రపంచ ఆరోగ్య మానవాళి... అంతా 

భారతీయుల్ని చూసి  క్వారంటైన్ జ్ఞానం నేర్చుకుంటోంది. నేర్చుకోమంటోంది.


కనీసం ఇప్పటికైనా మనం మన మడి ఆచారాలను మళ్ళీ పాటించడం ప్రారంభించకుంటే అది *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


🧐🧐🧐 జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ అజ్ఞానం అంతా వాళ్ళని చూసి మనకుగా మనం తెచ్చిపెట్టుకున్న అజ్ఞానం...

 

మన బానిస మనస్తత్వ అజ్ఞానం...


విదేశీ వ్యామోహ అజ్ఞానం...


కరోనా లాంటి వైరస్ లను కొంపమీదకు తెచ్చిపెట్టుకునే అజ్ఞానం...


అమెరికాలో యాపిల్ ఫోన్ అంత మంచిఫోన్ మరొకటి లేదు.

అన్నది ఎంత నిజమో...


అమెరికా, యూరోపియన్ ప్రజలు తినేంత అనారోగ్యకరమైన ఆహారం...

వాళ్ళ కున్నన్ని ఆర్టిఫిషల్ అలవాట్లు కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేవు. అన్నది కూడా అంతే నిజం...


ఆధునీకరణ, ఫ్యాషన్, మొదలగు పేర్లతో ఋషులు మనకు అందించిన

దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా...

ప్రాకృతిక జీవనాన్ని  వదలేసుకోవడం *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

 

Bottom LIne.

*వేటిని స్వీకరించాలో వాటినే స్వీకరిద్దాం...*


కానీ గుడ్డిగా...

మోజుతో...

వెర్రిగా...

అనాలోచనతో...

అనుకరిస్తే...

పోతాం! 


ఏం వచ్చి పోతాం?


కరోనా లాంటివి వచ్చి పోతాం!. -..🙏..🙏..🙏..🙏..🙏

జై సనాతన ధర్మ✊

భారతీయ సంస్కృతిని రక్షిద్దాం.

భారతీయ ఆచార సంప్రదాయాలను పాటిద్దాం.

( నాకు నచ్చిన ఒక వాట్సాప్ మిత్రుడి నుండి సేకరించిన మంచి పోస్ట్)

కథావల్లరి - 3*

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

        *నాకు నచ్చిన ఓ* 

       *వాట్సాప్ కథానిక* 

              🌷🌷🌷

          *కథావల్లరి - 3* 

               🌷🌷🌷

              *పాకవేదం* 

               🌷🌷🌷

"బాపన్నగారమ్మాయికి పెళ్లి కుదిరిందిటా.  విశేషాలేమిటి పంతులు గారూ!"

"పెళ్లి ఎక్కడ చేస్తున్నారు పంతులు గారూ, దసపల్లా లోనా, డాల్ఫిన్ లోనా"

"మనందరికీ బస్సు వేయిస్తారా లేదా బాపన్న గారు, ముందది చెప్పండి పంతులు గారూ."

                       విశాఖపట్నానికి అత్యంత సమీపంలో ఉన్న పల్లెటూరది. బాపన్న గారు ఆ ఊళ్లో పేరు మోసిన భూస్వామి.  ఆయనకి ఉన్న సంతానమల్లా కూతురు జానకి ఒక్కర్తే.  జానకి పేరే పాత పేరు.  అందరూ లాస్య, షర్మిల లాంటి పేర్లు పెట్టుకుంటున్న రోజుల్లో బాపన్న గారు కూతురికి 'జానకి' అని తన తల్లి పేరు పెట్టుకున్నారు.  పిల్లని పద్ధతిగా పెచుకొచ్చారు. జానకి కూడా తండ్రికి తగ్గ కూతురే.  చదువులో సరస్వతే గాని ఫ్యాషన్ల రాణి మాత్రం కాదు. అన్ని రకాల ఆధునిక దుస్తులూ వేసుకుంటుంది. కాని ఎక్కడా అసభ్యత కనబడనివ్వదు. నల్లని, ఒత్తైన నిడుపాటి కురుల్ని చక్కగా జడ వేసుకుని మల్లెలూ, మొల్లలూ, కనకాంబరాలూ పెట్టుకుంటుంది.  పండుగలకి చక్కగా పట్టుచీర కట్టుకుని, నగలు పెట్టుకుని రుక్మిణీదేవిలా అమ్మవారి గుడికి వెళుతూ ఉంటుంది. 

           ఆంధ్రా యూనివర్సిటీ కాలేజీలో సీటు తెచ్చుకుని, ఇంజనీరింగ్ టాప్ ర్యాంక్ లో పాసైన జానకికి ఉద్యోగం కూడా వచ్చేసింది.  అందులో జాయిన్ అవకముందే సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. ఆ ముందు రోజునే పెళ్లి చూపులయాయి. ముహూర్తాలు పెట్టే పండితులు వేరే ఉన్నా, అమ్మాయి భక్తిగా కొలిచే అమ్మవారి గుడి పూజారి గదా అని రామయ్య పంతుల్ని కూడా చూపులకి ఆహ్వానించారు బాపన్న. మొత్తం తతంగం అంతా పూర్తి అయి, రామయ్య పంతులు ఇల్లు చేరే సరికి రాత్రి తొమ్మిదైంది.  తెల్లారి ఆయన గుడికి వచ్చిన దగ్గర నుంచీ జనం వస్తూనే ఉన్నారు. బాపన్న గారమ్మాయి పెళ్లి గురించి తలో ప్రశ్నా వేస్తూనే ఉన్నారు.  వాళ్లని కాస్త ఆగమని, అమ్మవారి పూజాదికాలు గబగబా కానిచ్చేశాడు పంతులు. తీరిగ్గా మంటపంలోకి వచ్చి కూచుని, "చెప్పుకోవాలే గాని పెద్ద కథర్రా.  మహా పసందైన కథ" అన్నాడు. 

     "చెప్పండి, చెప్పండి" జనం ఆయన చుట్టూ చతికిలబడ్డారు.

     "బాపన్నగారు ఎంత పద్ధతి మనిషో మనకి తెలిసిందే కదా.  ఆయనకి కాబోయే వియ్యంకుడు మరో నాలుగాకులు ఎక్కువ.  పెళ్లి ఏ దసపల్లా లోనూ కాదు. ఇక్కడే, మనందరి మధ్యనే. "

శ్రోతల ఆశ్చర్యానికి మేర లేదు. 

   "అవునర్రా... నిన్న బాపన్న గారూ, ఆయన వియ్యంకుడూ మాట్లాడుకున్న మాటలు వింటుంటే నాకు ఒళ్లు గరిపొడిచిందనుకోండి. పెళ్లి వైశాఖ మాసంలో.. ఇక్కడే. తాటాకు పందిరేసి ఇంటి ముంగిట్లోనే.  అచ్చంగా ఒకప్పటి పెళ్లిళ్లు ఎలా జరిగేవో అలాగే.  ఒక్క స్వీటు ముక్క కూడా బజార్లో కొనరు. పెళ్లికి పదిహేను రోజుల ముందే వియ్యంకుడు గారు రంగాజమ్మ గారి బృందాన్ని ఇక్కడికి పంపిస్తారుట. రంగాజమ్మ గారంటే వంటావిడ. జానకి అత్తవారి ఊళ్లోనే ఆవిడా ఉంటుందిట. రంగాజమ్మ, ఆవిడ తమ్ముడు, కొడుకు, కోడలు, ఇంకా మరో ఇద్దరు కుర్రాళ్లు.. వీళ్లంతా కలిసి ఒక బృందం.  మర కత్తిపీటలు, మామూలువి పెద్ద పెద్ద కత్తిపీటలు,పనసకాయ కత్తులు, బూందీ చట్రాలు ఇలాంటి సామగ్రి అంతా వాళ్ల దగ్గర ఉంటుందిట. ఐదారువందల మంది జనానికి అవలీలగా వండి వారుస్తారుట.  లడ్డూలు, అరిసెలు, బూరెలు వగైరా వంటలు అద్భుతంగా చేస్తారుట.  పనసపొట్టు కూర, కందా బచ్చలి, వాక్కాయ పప్పు, ఆవ పెట్టిన పులిహోర ఇలాంటి పాతకాలం వంటలు వీళ్లు చేసినట్టు ఎవ్వరూ చెయ్యలేరుట. 

           పెళ్లికి పదేను రోజుల ముందొచ్చి వాళ్లు ఆవకాయ, మాగాయ, తొక్కుపచ్చడి వగైరాలు పెడతారుట. అప్పడాలు, వడియాలు కూడా ఇంట్లోనే తయారు చేస్తారుట. పెళ్లి దగ్గర పడనిచ్చి లడ్డూ, సున్ని, మైసూర్ పాక్, చక్కిలాలు, కారం బూందీ చేస్తారుట. పెళ్లి కార్యక్రమాలు రెండు రోజుల పాటు జరుగుతాయి. ఆ రెండ్రోజులూ మన ఊరు ఊరంతటికీ బాపన్న గారింట్లోనే భోజనాలు. "మనిద్దరికీ డబ్బుకి లోటు లేదు. మన అభిరుచి మేరకు ఇలా చేద్దాం" అని వియ్యంకులిద్దరూ మాట్లాడుకున్నారు. "మీక్కావలిస్తే సిటీలో మళ్లీ రిసెప్షన్ ఇద్దాం" అని పెళ్లి కొడుకుతో వాళ్ల నాన్న అంటే ఆ అబ్బాయి ఏమన్నాడో తెలుసా... వాళ్ల ఫ్రెండ్స్ కూడా హొటళ్లూ, బిర్యానీలతో విసిగెత్తిపోయి ఉన్నారుట... "వాళ్లకి కూడా ఇవే నచ్చుతాయిలే నాన్నా" అన్నాడు. 

అదీ సంగతి"

రామయ్య పంతులు చెప్పడం పూర్తి చేసిన మరుక్షణం నుంచే జనం రంగాజమ్మ బృందం కోసం ఎదురు చూపులు ప్రారంభించారు. 

        అనుకున్న రోజు రానే వచ్చింది.  తెల్లని మల్లుచీర కట్టుకుని, వేలిముడి వేసుకున్న రంగాజమ్మా, పెద్ద కత్తిపీట పుచ్చుకుని అత్తగారి అడుగుజాడల్లో నడుస్తూ ఆవిడ కోడలూ, నామం దిద్దుకుని ఓ భుజం మీద కండువా, ఇంకో భుజం మీద పనసకాయ కత్తీ పట్టుకుని ఆవిడ తమ్ముడూ, మర కత్తిపీటలు పట్టుకుని కుర్రాళ్లూ దిగారు. 

          బాపన్నగారూ, ఆయన వియ్యంకుడూ ఏర్పాటు చేసిన ప్రకారం అప్పటికే మాడుగుల నుంచి ఆవాలు, బందరు నుంచి మిరపకాయలు, అనకాపల్లి నుంచి బెల్లం దిమ్మలు, సామర్లకోట నుంచి పప్పునూనె, నూజివీడు నుంచి రసాలు, బంగినపల్లి కాయలు ఇంకా ఇతర సామగ్రి వచ్చేశాయి. 

"అత్త లేని కోడలుత్తమురాలూ ఓయమ్మా"అంటూ ఆవాలు, మిరపకాయలు దంపి, ఆవకాయ పని ముగించారు. ఊరంతా తలా కాస్తా రుచి చూసి "హా" అంటూ లొట్టలేశారు.  రంగాజమ్మ బృందాన్ని చూస్తూనే ప్రేమలో పడిపోయిన ఊరి జనం, వాళ్ల చేతి ఆవకాయ రుచి చూశాక దాసోహం అంటూ తలో పనీ అందుకుని సాయం చెయ్యడం ప్రారంభించారు. 

     ఆవకాయలతో బాటే కారం అప్పడాలు, పెసర అప్పడాలు రంగాజమ్మా, కోడలూ వత్తి ఇస్తూ ఉంటే మిగిలిన వాళ్లు ఆరబెట్టి, బొత్తులు పెట్టారు.  మినపప్పు నానబోసి రుబ్బి గుమ్మడి వడియాలు, పులుసులూ కూరల్లోకి చిట్టొడియాలూ పెట్టారు.  సగ్గుబియ్యం ఉడికించి పల్చగా అప్పడాలంతేసి సగ్గుబియ్యం వడియాలు పెట్టారు. 

      ఆవకాయలు, అప్పడాలు, వడియాల పని అయాక, బాపన్న గారి పెరట్లోనే దగ్గరుండి గాడిపొయ్యి తవ్వించింది రంగాజమ్మ.  వేసవి ఎండకి ఎండిన కట్టెల్ని పొయిలో పెట్టి, శుభ ముహూర్తం చూసి ఇంత కర్పూరం వేసి వెలిగించగానే, హోమాగ్నిలా ఝామ్మంటూ మంటలు లేచాయి. గాడిపొయ్యి దగ్గర వంతుల వారీగా పిండివంటలు చేసే పని రంగాజమ్మ, ఆవిడ తమ్ముడిదే.  మిగిలిన వాళ్లు పిండి కలపడం, ఉండలు చుట్టడం వగైరా పనులు చేసేవారు. 

       బాపన్నగారి కోరిక మేరకు పంచదార లడ్డూ, బెల్లం లడ్డూ రెండూ చేశారు రంగాజమ్మ అండ్ పార్టీ.  పచ్చకర్పూరం ఘుమఘుమలకు స్వచ్ఛమైన నేతి గుబాళింపు జోడై, లడ్డూ నోట పెట్టిన వారికి స్వర్గం అరడుగు దూరంలో కనిపించింది.  నేతి తడితో మెరుస్తూ తయారైన మైసూర్ పాక్ దాని రుచి ముందు మైసూరు రాజ్యం కూడా దిగదుడుపే అనిపించేసింది. బెల్లంతో చేసిన మినపసున్ని, ఒక్కటైనా తినకపోతే జన్మ ఎందుకు అనిపించింది అందరికీ.  చక్కిలాల కరకర, బూందీలో జీడిపప్పు మిసమిస జీవితం పసందుగా ఉందనిపించాయి.

       ఇలా ముందస్తు ఏర్పాట్లు పూర్తయి, పెళ్లివారు తరలి వచ్చారు. ఊరు ఊరంతా వాళ్లకి స్వాగతం పలికి, తమ ఇళ్లన్నీ విడిదిగృహాలే అనుకోమన్నారు. సింహాచలం నుంచి వచ్చిన మరో నలుగురు పండితులతో బాటు రామయ్య పంతులు కూడా పెళ్లి పౌరోహిత్యం స్వీకరించాడు. ఆయన భార్య, కొడుకు, కోడలు తలో పనీ అందుకున్నారు. మొదటిరోజు కత్తెర స్నాతకం - తోట సంబరం సంబరంగా ముగిశాయి.  తమ ఆడపడుచు పెళ్లి జరుగుతున్నంత ఆనందంగా ఊరి జనం పెళ్లి పనుల్లోనూ, కార్యక్రమాల్లోనూ పాలు పంచుకున్నారు. వాక్కాయ పప్పు, పనసపొట్టు కూర, గుత్తి వంకాయ, గోంగూర పచ్చడి, ముక్కల పులుసు, ఆవడలు, బొబ్బట్లు, పాయసంతో తొలిరోజు విందు జరిగింది. 

          మర్నాడు పెళ్లికొడుకు శ్రీరామ్ జానకి మెడలో తాళి కట్టిన తరువాత అందరికీ కొబ్బరి బొండాలు కొట్టి ఇచ్చారు. కందా బచ్చలి కూర, అరటికాయ బెల్లం వేసిన కూర, మావిడికాయ పప్పు, కొబ్బరి, మావిడి కలిపి పచ్చడి, పులుసు, ఆవ పెట్టిన పులిహోర, బూరెలు, చక్రపొంగలి, లడ్డూ, బంగినపల్లి మామిడి పండు ముక్కలు, కమ్మని పెరుగు.. వీటితో పెళ్లి భోజనం చేసి ఊరంతా భుక్తాయాసంతో బ్రేవ్ మంటూ త్రేన్చింది. 

     పెళ్లి జరిగిన మర్నాడు కొత్త కోడల్ని తీసుకుని పెళ్లివారు బయల్దేరారు.  ఊళ్లో ముఖ్యమైన వాళ్లు కొందరు కార్ల దగ్గరకి వచ్చి జానకికి వీడ్కోలు పలికారు. మిగిలిన వాళ్లంతా ఇంకా పెళ్లి భోజనపు మత్తు వదలనట్టు ఇళ్లల్లో పడుకున్నారు.   మరో రెండు రోజుల్లో బాపన్న గారి ఇంట్లో అన్నీ సర్ది పెట్టి, మంచిరోజు చూసి గాడిపొయ్యి కూడా మూసి పెట్టి రంగాజమ్మ బృందం తిరుగు ప్రయాణమైంది.  వాళ్లు సొంత కష్టంతో కొనుక్కున్న మెటడార్ వ్యాన్ లో కత్తులూ కత్తిపీటలూ అన్నీ సర్దుకోబోయేసరికి ఊరు ఊరంతా అక్కడ హాజరైంది. రంగాజమ్మ బృందాన్ని కూర్చోబెట్టి సామానంతా ఊరిజనమే సర్దారు. 

    "ఈ మర కత్తిపీటతో ఆయన అంతలేసి మావిడికాయల్ని ఎంత చులాగ్గా టకటకా తరిగేశారో.. మళ్లీ అన్ని ముక్కలూ ఒక్కలాగే వచ్చాయ్"

    "దీని పేరే పనసకాయ కత్తి ట. ఆ పెద్దమ్మ గారు దీంతో పనసకాయని ఎంత చిన్న ముక్కలుగా కొట్టారో... అసలు కత్తి కదులుతున్నట్టే అనిపించేది కాదు. పెద్దయ్యగారు నేర్పారంట ఆమెకి అలా తరగడం"

   "ఈ చట్రంతో పెద్దమ్మ గారు మిఠాయి బూందీ కొట్టి పెట్టేస్తే కోడలు గారు ఎంత చకచకా ఉండలు కట్టేదో... ఆవిడ చేతులు మంట పెట్టవా అని నేను అనుకునేదాన్ని గానీ ఆవిడ నవ్వుతూనే ఉండేది"

     ఊరివాళ్ల మాటలు వింటూ ఆనందంతో కంటనీరు పెట్టుకున్నారు రంగాజమ్మ బృందం. 

        బాపన్నగారు కూడా వాళ్లకి వీడ్కోలు పలుకుతూ, "ఒకప్పటి పాక వైభవాన్ని మళ్లీ మా కళ్లకూ నోటికీ చూపించారమ్మా. మిమ్మల్ని పంపినందుకు మా వియ్యంకుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి నేను. మీకు మా అందరి తరఫునా ధన్యవాదాలు" అంటూ చేతులు జోడించారు. 

రంగాజమ్మ బృందం ఆనందబాష్పాలతో తిరిగి నమస్కారాలు చేస్తూ సాగిపోయింది. 

          🌷🌷🌷                  

లక్ష్మీ గాయత్రి, విశాఖపట్నం.

నేను కాదు మనం.

 నేను కాదు మనం...


జ్యోతి వలబోజు

(రచయిత్రి, పబ్లిషర్)


"నాన్నా!.. మీరు పేపర్సన్నీ పెట్టుకుని, టాక్సీ మాట్లాడుకుని రేపు వచ్చేస్తారా.? నన్ను రమ్మంటారా..? లేక ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయనా?" ఫోనులో మాట్లాడుతున్నాడు కిశోర్.

కొద్దిసేపు మాట్లాడి "సరే మీ ఇష్టం.జాగ్రత్తగా రండి. బయలుదేరేటప్పుడు కాల్ చేయండి" అంటూ ఫోన్ పెట్టేసాడు. 

పక్కనే ఉన్న అతని భార్య ప్రియ "ఏమంట? మామయ్యవాళ్లు ఎందుకొస్తున్నారు. ఏమైంది?" అని అడిగింది.a

"అమ్మకు, నాన్నకు రెగ్యులర్ హెల్త్ చెకప్ ఉందిగా. అలాగే అమ్మకు ఈ మధ్య బాక్ పెయిన్ వస్తోందంట. ఇక్కడ స్పెషలిస్టుకు చూపించాలని వస్తున్నారు" అని చెప్పాడు. తల్లితండ్రులు వస్తున్నారన్న ఆనందం అతని మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రియ మాత్రం మొహం మాడ్చుకుంది. 

తెల్లారి ఆదివారం కావడంతో కిశోర్ తమ ఇంట్లో ఉన్న నాలుగు బెడ్‌రూమ్స్ లో ఒకదాన్ని తెరిచి పనిమనిషితో శుభ్రం చేయించి, బాత్‌రూం అవీ క్లీన్ చేయించాడు. బెడ్‌షీట్స్, కర్టెయిన్స్ కూడా తనే మార్చాడు. అతని హడావిడి చూసి, బామ్మా, తాతయ్యలు వస్తున్నారని తెలిసిన పిల్లలిద్దరు మేము కూడా చేస్తాం అంటూ అతనికి సాయం చేయసాగారు. టీవీ పక్కన టేబుల్ మీద చిన్న గాజు సీసాలో పువ్వులు పెట్టారు. తాతయ్య చదువుతాడని పుస్తకాలు కూడా పెట్టారు పిల్లలు. 

కిషోర్, పిల్లలు ఇంత హడావిడి చేస్తున్నా ప్రియ కనీసం తొంగి కూడా చూడలేదు. వంటింట్లో పని చేసుకుంటూ ఉండిపోయింది ఇది ఎప్పుడూ ఉండేదే కదా అనుకుంటూ.

అసలు ప్రియకి పెళ్లైనప్పటినుండి ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం లేదు. కాకినాడలో అత్తగారింట్లో అసౌకర్యంగా ఫీలయ్యేది. 

మణి ఒక్కడే కొడుకని, కోడలిని కూడా  ఎంతో ప్రేమగా చూసుకునేది.  ప్రియ, కిషోర్ ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. లక్షల్లో సంపాదించినా ఇంటి పెత్తనం అంతా కిషోర్ తండ్రి మధుసూధన్ దే. ఇంట్లో ఆయన చెప్పినట్టే నడవాలి. అలాగని ఆయన నియంతలా ప్రవర్తించలేదు. ఒక క్రమశిక్షణతో ఉండాలి అనేవాడు. అది ప్రియకు నచ్చలేదు. హైదరాబాదులో పుట్టి పెరిగిన అమ్మాయి. ఒక్కతే కూతురు కావడంతో ఒంటరిగా అలవాటయింది. పుట్టింట తనకు నచ్చినట్టుగా ఉన్న వ్యక్తి, అత్తగారింట పెద్దవాళ్లు చెప్పినట్టు ఉండాలంటే ఇబ్బందిగా ఫీలయ్యేది. అలాగే సణుగుతూ, అసహనంతో రెండేళ్లు గడిపింది. ఒక బాబు పుట్టిన తర్వాత కూడా ప్రియ అత్తగారింట సర్దుకుపోలేదు. పట్టుబట్టి కంపెనీ మార్చే ప్రయత్నం చేసి భర్త, కొడుకుతో కలిసి. హైదరాబుకు షిఫ్ట్ అయింది.. 

భార్యను కట్టడి చేయలేక, తల్లి తండ్రులను వదిలిపెట్టలేక కిషోర్ చాలా సతమతమయ్యాడు. 

అతని పరిస్థితి చూసి, అతని బాధను అర్ధం చేసుకున్న తండ్రి "నాన్నా! కిషోర్!... ఇప్పుడేమైందని. మీరు వెళ్లండి. మేము రాము. సొంత ఇల్లు, వ్యవసాయం, బంధుజనం, ఊరివాళ్లు అందరూ ఉన్నారు. ఇంకా ఆరోగ్యంగానే ఉన్నాం కదా. మమ్మల్ని మేము చూసుకోగలం. అయినా హైదరాబాదు ఎంత దూరమని. సంతోషంగా వెళ్లండి" అని ఆశీర్వదించి పంపించాడు మధుసూధన్.. 

హైదరాబాదులో ఉన్న ప్రియ తల్లితండ్రులు అప్పటికే ఒక ఇల్లు చూసి పెట్టారు. వాళ్లకు అన్ని సదుపాయలు ఉన్నాయో లేదో చూసి వెళ్లిపోయారు.

మరో రెండేళ్ళకు కూతురు పుట్టినపుడు వచ్చి మళ్లీ వెళ్లిపోయారు. 

ఎందుకో మరి ప్రియకి అత్తామామలు వచ్చినపుడు అసహనంగా ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేకుంటే తనిష్టమొచ్చినపుడు నిద్ర లేవడం, వంట చేయడం, చేయకపోతే బయటినుండి ఆర్డర్ చేయడం, పార్టీలు అంటూ బయటకు వెళ్లడం, ఇంట్లో చేసుకోవడం.. అలా గడిపేస్తూ ఉండింది. ఆమె తల్లితండ్రులు వచ్చినా అడ్డంకి ఉండదు. కాని అత్తమామలు వచ్చినపుడు మాత్రం ఇవన్నీ కుదరవు కదా. అత్తగారు మణి కూడా గయ్యాలి ఏమి కాదు కాని పద్ధతిగల వ్యక్తి. అన్ని టైమ్ ప్రకారం జరగాలి అంటుంది అంతే..

అందుకే వాళ్లు వస్తున్నరంటే అసహనంగా, చిరాగ్గా ఉంది ప్రియకి.


******


 తెల్లారి వస్తానన్నవాళ్లు నాలుగు రోజుల తర్వాత వచ్చారు. ఊర్లో ఏదో పంచాయితీ పని పడింది మధుసూధన్‌కి. 

స్కూలునుండి వచ్చేసరికి కనపడ్డ బామ్మా, తాతయ్యలను చూసి "బామ్మా! తాతా!" అని అరుస్తూ వెళ్లి హత్తుకున్నారు. 

పెద్దవాళ్లిద్దరు కూడా ఎంతో సంతోషపడ్డారు చాలా రోజుల తర్వాత మనవళ్లను చూసినందుకు. 

తను స్వయంగా చేసిన సున్నుండలు, కజ్జికాయలు, జంతికలు, కారప్పూస, జున్ను, థోతలో కాసిన మామిడిపళ్లు, పనసపండు, అల్లనేరేడు పళ్లు తీసి టేబుల్ మీద పెట్టింది మణి.. 

పిలల్లతో పాటు కిషోర్ కూడా పిల్లాదైపోయాడు. నాకూ అంటూ గారాం చేసాడు.

రాత్రి ఏడు గంటలకు వచ్చిన ప్రియ ఇద్దరికీ నమస్కరించింది. 

రాత్రి భోజనాలయ్యాక తల్లితండ్రులను హాస్పిటల్ కి తీసుకువెళ్లడానికి కావలసిన పేపర్లన్నీ తీసి పెట్టుకున్నాడు కిషోర్. 

తెల్లారి లీవ్ పెట్టాడు కిషోర్. 

ఆఫీసులో పనుందని ప్రియ వెళ్లిపోయింది. పిల్లలు స్కూలుకెళ్లారు.

తర్వాత కిషోర్ తల్లిదండ్రులను తీసుకుని వెళ్లి టెస్టులన్నీ చేయించి, డాక్టర్‌ని కలిసి , కావలసిన మందులు రాయించుకుని ఇంటికొచ్చారు.

తెల్లారి వెళ్లిపోదామనుకున్నారు మణి, మధుసూధన్. కాని కిషోర్, పిల్లలు వెళ్లొద్దని మొండికేసారు. రెండురోజులుందాములే అని ఉండిపోయారు. ప్రియకి ఏమాత్రం ఇష్టం లేదు కాని ఏమనలేక ఊరకుండిపోయింది.

రెండురోజులకు వచ్చిన అదివారం నాడు జనతా కర్ఫ్యూ అన్నారు. తర్వాత కరోనా మూలంగా లాక్‌డౌన్ ప్రకటించారు.

ఇది వినగానే "కిషోర్! లాక్‌డౌన్ అంటున్నారు. మాకు ఓ టాక్సీ మాట్లాడు. లేదా ఫ్లైట్ టికెట్స్ తీసుకొ. మేము ఇంటికెళ్లిపోతాం"అన్నాడు మధుసూధన్.

"నాన్నా! లాక్‌డౌన్ అంటే మొత్తం అన్నీ మూసేసారు. ఏది వెళ్లనివ్వరు. బస్సులు, రైళ్లు, కార్లు ఏవి కూడా. ఇంట్లోనే ఉండాలి. మీరు ఇక్కడే ఉండండి. ఈ పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలీదు. మీరక్కడ, నేనిక్కడ ఎందుకు. మీరు ఎక్కడికీ వెళ్లొద్దు" అని బ్రతిమిలాడాడు కిషోర్. 

కోడలికి ఇష్టం ఉండదని తెలిసినా, చేసేదేమీ లేక ఇద్దరూ మిన్నకుండిపోయారు.

తను చెయగలిగేదేమీ లేనందున ప్రియ ముభావంగానే తన గదిలోకి వెళ్లిపోయింది.

****

తెల్లారి ఏడుగంటలకు లేచి బయటకు వచ్చిన ప్రియకు వంటింటినుండి కుక్కర్ శబ్దం వినపడింది. ఫిల్టర్ కాఫీ ఘుమఘుమలు బయటకొస్తున్నాయి.  సాంబార్ వాసనలు హాలు వరకు గుభాళిస్తున్నాయి. కిచెన్లోకి వెళ్లి చూస్తే అత్తగారు ఒకవైపు సాంబారు పెట్టి, ఒక వైపు కుక్కర్లో కూర చేస్తూ, మరోవైపు ఇడ్లీలు వేయడానికి ప్లేట్లు తీసిపెడుతోంది. 

"ప్రియా! ఇడ్లీకి చట్నీతో పాటు పొడి చేసేదా. నీకు ఏ పొడి ఇష్టం చెప్పు. అదే చేస్తా. మరో అరగంటలో టిఫిన్ రెడీ అవుతుంది. అందాక కాఫీ తాగుతావా" అంటూ ఆప్యాయంగా అడిగారు.

ప్రియ మనసుకు ఎంత హాయిగా అనిపించిందో, లేట్ నైట్ వరకు ఆఫీసు వర్క్, పొద్దున ఓపిక లేక పిల్లలకు సరిగా వండలేక, ఏదో ఒకటి చేసి పెట్టి, తామిద్దరూ కూడా తిన్నామంటే తిన్నామన్నట్టు అఫీసులకు పరిగెత్తడం అలవాటైపోయింది.. ఇవాళ నిద్ర లేవగానే ఇంటి భోజనం రెడీగా ఉంటే అంతకంటే ఏం కావాలి.

"కాఫీ ఇవ్వండత్తయ్యా! స్నానం చేసాక అందరం ఒకేసారి టిఫిన్ చేద్దాం" అంటూ గ్లాసు తీయడానికి వెళ్లింది.

ఎలాగూ ఆఫీసులకు వెళ్లేది లేదు, పిల్లలకు స్కూళ్లు లేవు. అందరూ ఒకేసారి వేడి వేడీ ఇడ్లీలు చట్నీ, వెల్లుల్లి కారం పొడి, సాంబార్ తో తిన్నారు. 

పిల్లల ఆనందానికైతే అంతులేదు.

టిఫిన్ అయ్యాక ప్రియ, కిషోర్ తమ గదిలోకి వెళ్లిపోయారు ఆఫీసు పని చేసుకోవడానికి. 

మణి వంటింట్లోకి వెళ్లింది మధ్యాహ్నం వంట పనులు చూడడానికి.

పిల్లలు "తాతయ్యా! ఎలాగూ స్కూలు లేదుగా. మేము గేమ్స్ ఆడుకుంటాం. నువ్వు టీవీ చూసుకో" అన్నారు.

"ఒరేయ్ పిల్లలూ.. ఇట్రండి. నాకు చాలా ఆటలు వచ్చు తెలుసా. మా ఊర్లో నేనే చాంపియన్. ఏమనుకున్నారో" అని పిలిచాడు మధుసూధన్.

"ఐపాడ్‌లో గేమ్స్ ఆ?" అడిగారు ఉన్నచోటినుండే.

"ఏమీ కాదు. అది పక్కన పెట్టి మీరిద్దరూ ఇట్రండి" అని పిలివగానే ఉత్సాహంగా పరిగెత్తుకొచ్చారు. వాళ్లకు కూడా ఐపాడ్‌లో గేమ్స్ అన్నీ బోర్ కొట్టాయి.

మధుసూధన్ తన రూంలో ఉన్న ఫైల్ నుండి ఒక వైట్ పేపర్ తీసి అష్టాచెమ్మా గీసాడు. అటు ఇటు వెతికి, షెల్ఫులో గవ్వలు కనిపించాయి. అవి ఇంకో రెండు మూతలు తెచ్చి వాళ్లిద్దరినీ కూర్చోబెట్టి అష్టాచెమ్మా ఎలా ఆడాలో నేర్పించాడు. 

ఈ రకం ఆట కొత్తగా ఉండడంతో పిల్లలు కదలకుండా గంట సేపు ఆడారు. అయిపోయినా మళ్లీ .. మళ్లీ అంటూ ఇంకా ఆడతామన్నారు. కాని బామ్మ వచ్చి భోజనానికి రమ్మంది. 

ముద్దపప్పు, క్యాబేజీ కూరా, టమాటా పచ్చడి, రసం పెట్టి తను తెచ్చిన గుమ్మడొడియాలు, మినప అప్పడాలు వేయించి పెట్టింది.

"కిషోర్.. ప్రియా! రండి తిందురు గానీ" అంటూ కేకేసింది మణి.

పొద్దున టిఫిన్ తిన్నప్పటినుండి తమను అస్సలు డిస్టర్బ్ చేయకుండా, అల్లరి చేయకుండా పిల్లలు ఏం చేస్తున్నారో అనుకుంటూ క్రిందకు దిగారు ఇద్దరూ.

రోజూ తినడానికి సతాయించే పిల్లలు బుద్ధిగా కూర్చుని ముద్దపప్పులో బామ్మ తెచ్చిన నెయ్యి వేసుకుని అప్పడాలు ఒక చేతిలో పెట్టుకుని తింటున్నారు. 

వాళ్లను చూసి కిషోర్, ప్రియలకు కూడా ఆకలి గుర్తొచ్చింది. 

తృప్తిగా తినేసి, మళ్లీ వెళ్లి తమ ఆఫీసు పనిలో పడిపోయారు వాళ్లిద్దరూ.

గంట సేపు ఆడిన తర్వాత ఇద్దరికీ ఆసక్తి పెరిగి వాళ్లే ఆడుకోవడం మొదలుపెట్టారు. ఈలోపు పెద్దవాళ్లిద్దరూ కాస్త కునుకు తీసారు. 

రాత్రి భోజనాల తర్వాత పిల్లలు టీవీలో కార్టూన్స్ చూస్తామన్నారు. అపుడు బామ్మ పిలిచింది.

"నాకు బోల్డు కథలు వచ్చు. చెప్పేదా?" 

"అంటే కార్టూన్స్ లో వచ్చే కథల్లాంటివా?" అనడిగారు పిల్లలు.

"అదేం కాదు. నాకు వచ్చిన కథలు ఆ టీవీవాళ్ళకెవరికీ తెలీదు తెలుసా?" అని కాస్త ఊరించింది మణి.

"అవునా!.. చెప్పు చెప్పు" అంటూ బామ్మ దగ్గరకొచ్చి కూర్చున్నారు. 

"పదండి అలా బయటకెళ్లి కూర్చుందాం. మీకు రోజుకో కొత్త కథ చెప్తా" అని వాళ్లను బయట వరండాలో కూర్చోబెట్టుకుని అనగనగా అంటూ ఎంతో ఆసక్తికరంగా కథ చెప్పింది. వాళ్లు ఊ కొడుతూ విన్నారు. ఓ గంట అలా విన్న తర్వాత ఆవులింతలు తీస్తుంటే కిషొర్ వచ్చి తీసికెళ్లాడు.

మొదట అత్తామామలు ఉండడం ఇష్టపడని ప్రియ కూడా మారసాగింది. ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే ఎంత సుఖమో ప్రత్యక్షంగా అర్ధమైంది. పిల్లలు కూడా ఐపాడ్, టీవీ అనడం మానేసారు. బామ్మ, తాతయ్యల దగ్గర మంచి మంచి కథలు, ఆటలు నేర్చుకుంటున్నారు. 

రెండు నెలల తర్వాత లాక్‌డౌన్ సడలించినప్పుడు  ప్రియ అత్తగారిని తనకు తెలిసిన చీరలు అమ్మే వాళ్లింటికి తీసికెళ్లి ఆమెకు నచ్చిన మంచి ఉప్పాడ పట్టు చీర కొనిచ్చింది. 

మొదటిసారి తన కోడలు ఇష్టంగా కొనిచ్చిన చీరను చూసి మణి కూడా మురిసిపోయింది.

మధ్యలో ఒకసారి డాక్టర్ చెకప్ ఉంటే కిషోర్ జ్వరంతో ఉన్నాడని ప్రియానే తీసికెళ్లింది. 

నాలుగు నెలల తర్వాత లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేసారు. ఇక ఇంటికి వెళతామని బయలుదేరారు మణి, మధుసూధన్.

"బామ్మా!తాతా!  వద్దు మీరు వెళ్లొద్దు. ఇక్కడే ఉండండి" అంటూ ఏడుపు మొహం పెట్టారు పిల్లలిద్దరూ.

ప్రియ కూడా దిగులుగా ఉంది. నాలుగు నెలలు వాళ్లతో బాగా అలవాటు పడింది. ఇంట్లో పెద్దవాళ్లు ఉండడం ఎంత అవసరమో తెలిసి వచ్చింది. 

"అత్తయ్యా,  మావయ్యా మీరు వెళ్లకండి. ఇల్లు సరిపోతుంది కదా. నేను చేసిన తప్పులకు మన్నించి మీరు కూడా ఇక్కడే ఉండండి. మనమంతా కలిసి ఉందాం" అన్నది ప్రియ..

"అమ్మా!ప్రియా!.. నాకు నీ మీద ఎప్పుడూ కోపం లేదు. అయినా  నేను నేను అని కాకుండా, మనం అని అనుకుని మనవాళ్లందరినీ కలుపుకుని బ్రతుకుతామో అప్పుడు మన జీవితం సంతోషంగా గడిచిపోతుంది. పదిమందితో కలిసిమెలిసి ఉంటే మనకు అవసరమైనపుడు వాళ్లు వచ్చి సహాయం చేస్తారు. ఆపదలో ఆదుకుంటారు. ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే మీకు, పిల్లలకు కూడా చాలా మంచిది. వాళ్ల అనుభవలను రంగరించి మీకు, మీ పిల్లలకు మంచి చేయడానికే ప్రయత్నిస్తారు. మేము వెళ్లాలి. ఊర్లో చాలా పనులున్నాయి. మళ్లీ వస్తాం కదా.. " అన్నాడు మధుసూధన్.

" అమ్మా ప్రియా! దిగులు పడకు. మేము వెళ్లాక అమ్మవాళ్లని పిలిపించుకో. వాళ్లు ఇద్దరే ఉంటారు కదా. వాళ్లు కూడా పిల్లలతో, మీతో గడిపితే సంతోషంగా ఉంటారు. అసలు వాళ్లు ఒంటరిగా ఎందుకుండాలి. ఇక్కడే ఉండమను. ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. మేమూ వస్తుంటాము" అంటూ  అనునయంగా చెప్పి కోడలిని హత్తుకుంది మణి.

"బామ్మా, తాతా! ఈసారి మేమే వస్తాం హాలిడేస్ రాగానే. సరేనా.. నీకు ఏమేం కావాలో చేప్పు. మేము తీసుకొస్తాం ఈసారి" అంటూ చెప్పారు ఆరిందాల్లా పిల్లలు..

"సరేరా.. లిస్ట్ పంపిస్తా.. ఉంటా మరి.. అమ్మానాన్నలను సతాయించొద్దు. మేము చెప్పినవి గుర్తుపెట్టుకోండి..బై" అంటూ కారెక్కారు మణి, మధుసూధన్.. 

“థాంక్స్ కరోనా” మనస్ఫూర్తిగా అనుకున్నాడు కిషోర్..

*****

మన మహర్షులు- 48

 మన మహర్షులు- 48


 సంవర్త మహర్షి



🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹



బ్రహ్మ మానస పుత్రుడయిన అంగిరసుడు తన ధర్మపత్ని శ్రద్ధ యందు పొందిన కొడుకు సంవర్తుడు.


సంవర్తుడు జ్ఞాని, యోగి, తపశ్యాలి, నిస్సంగ, నిర్మముడు, నిరుపమ శక్తి సంపన్నుడు. సంవర్తనుడు ప్రపంచ విషయాలకీ విరక్తుడై విరాగియై యోగీశ్వరుడై అడవులలో తిరుగుతూ ఉండేవాడు.


పూర్వం మనువంశ రాజైన మరుదత్తుడు, ధర్మతత్పరతతో దయా దాక్షిణ్యాలతో, శక్తియుక్తుడుగా రాజ్యం పరిపాలిస్తున్నాడు .ఇంద్రుడికి అసూయ ఎక్కువైపోయి ఏంచెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు.


అదే సమయంలో మరుదత్తుడు ఇంద్రుణ్ణి మించి పోవాలని ఒక మహాయజ్ఞం బృహస్పతిని చేయించమని అడిగాడు.


 ఇంద్రుడు పిలిచాడు వెళ్ళాలన్నాడు. బృహస్పతి, ఈలోగా నారదుడు కనిపించి బృహస్పతి తమ్ముడు సంవర్తుడు నీతో యజ్ఞం

చేయిస్తాడని మరుదత్తుడికి చెప్పాడు.


సంవర్తుని కలిసి యజ్ఞం చేయించమని అడిగి బృహస్పతి తనను ఎలా అవమానపరిచాడో చెప్పాడు మరుదత్తుడు. 


అన్న దగ్గర అనుమతి తీసుకుని వస్తేనే నేను చేయిస్తాను, ఎందుకంటే అతడు నాకు గురువులాంటివాడన్నాడు సంవర్తుడు. 


మరుదత్తుడు జరిగిందంతా సంవర్తుడికి చెప్పి ఇంద్రుడే నా యజ్ఞం పూర్తి కాకుండా చూస్తున్నాడని బ్రతిమలాడి చివరికి ఒప్పించాడు.


మరుదత్తుడితో యజ్ఞం మొదలుపెట్టించి చివరిసారిగా ఆలోచించుకో ఇంద్రుడికి బృహస్పతికి శత్రువవుతావేమో అన్నాడు సంవర్తుడు,


 మరుదత్తుడు మునీంద్రా! మీరుండగా నేనెవరికీ భయపడను, సూర్యచంద్రులు ఉన్నంతవరకు నువ్వే నా గురువు అన్నాడు భక్తితో హిమవత్సర్వతానికి ఉత్తర భాగంలో వున్న ముంజవంతమనే పర్వతం మీద శివుడి దయతో యజ్ఞం మొదలుపెట్టడానికి మరుదత్తుడికి ఎన్నో పసిడి మోపులు తెచ్చిచ్చాడు సంవర్తుడు.


ఇక్కడ సంవర్తుడు మరుదత్తుడితో యజ్ఞం చేయిస్తుంటే అక్కడ బృహస్పతి ఇంద్రుడితో యజ్ఞం చేయిస్తున్నాడు .


ఇంద్రుడు అగ్ని హోత్రుడ్ని పిలిచి ఎలాగేనా సంవర్తుడు చేయిస్తున్న యజ్ఞం ఆపమని

పంపించాడు


అగ్నిహోత్రుడు: మరుదత్తుడి దగ్గరికి వచ్చి ఆతిథ్యం తీసుకుని రాజా! బృహస్పతి నీతో యజ్ఞం చేయించి ఇంద్రపదవి వచ్చేలా చెయ్యడానికి అంగీకరించి నన్ను స్వయంగా ఇక్కడికి పంపాడు, సంవర్తు వల్ల యజ్ఞం పూర్తవదని చెప్పాడు.


మరదత్తుడు అందుకు అంగీకరించక నాకు సంవర్తుడు ఎలా చేయించినా ఫర్వాలేదన్నాడు.


సంవర్తుడు నీ రాయబారం పూర్తియింది కదా ఇంక వెళ్ళమన్నాడు - అగ్నిహోత్రుణ్ణి,


అగ్నిహోత్రుడు జరిగినది ఇంద్రుడికి చెప్పి ఇంక నావల్ల కాదన్నాడు ఇంద్రుడు.


 గంధర్వపతయిన ధృతరాష్ట్రుణ్ఞి పిలిచి మరదత్తుణ్ణి ఎలాగయినా బహస్నతితో యజ్ఞం చేయించుకుందుకు ఒప్పించమని చెప్పాడు.


 వినకపోతే ఇంద్రుడి వజ్రాయుధం నిన్ను యముడి దగ్గరికి పంపుతుందని చెప్పమన్నాడు.


మరుదత్తుడి దగ్గరకు వెళ్ళి ఇంద్రుడు చెప్పమన్నట్లు చెప్పాడు ధృతరాష్ట్రుడు గంధర్వరాజా! మొదట నేను బృహస్పతిని అడిగాను, అతడు అంగీకరించి

సమయానికి మాట తప్పాడు. ఇప్పుడు సంవర్తుడు అంగీకరించి యజ్ఞం మొదలు పెట్టాక వద్దు వెళ్ళిపొమ్మనడం న్యాయమేనా మీరే చెప్పండన్నాడు మరుదత్తుడు.


అదే సమయంలో వజ్రాయుధం వేగంగా వస్తుండడం చూసి భయపడున్న మరుదుత్తద్ని సంవర్తుడు అది నీ దాకా రాడు భయపడకన్నాడు.


నాకు 'సంస్తంభ విద్య వచ్చని దాని వల్ల దేవతలు కూడా నా ముందాగలేరని ఇంద్రుడికి తెలుసు. నాశక్తి ముందు దేవతలకి ఆయుధాలు ఏవయినా సరే పని చేయ్యవని

చెప్పాడు సంవర్తుడు.


అప్పటికే వజ్రాయుధం శక్తి హీనమై గాలిలో తిరిగుతోంది. 


మరుదత్తుడాశ్చర్యంతో సంవర్తుడి కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు.



. నీకేం కావాలో కోరుకోమన్నాడు సంవర్తుడు


మునీంద్రా! ఇంద్రుణ్ణి విరోధం మాని యజ్ఞంలో తన హవ్య భాగం తీసుకోమని

చెప్పమని అడిగాడు మరుదత్తుడు.


 సంవర్తుడు యజ్ఞం పూర్తిచేసి తన మంత్రబలంతో ఇంద్రాదులందర్నీ సేవకుల్లా రప్పించాడు .సంవర్తుడు మరుత్తుడు వాళ్ళకి ఎదురు వెళ్ళి తీసుకువచ్చి ఆసనం కూర్చోబెట్టారు.


మరుదత్తుడు ఇంద్రుడికి నమస్కరించి నీరాకవల్ల నా జన్నము, జన్మము కూడా సఫలమయ్యాయి. సంవర్తుడు నీ గురువు బృహస్పతికి తమ్ముడు. నీకు గురు సమానుడు

నాకు అన్నీ ఆతడే కనుక కోపం మాని యజ్ఞం పూర్తి చేయించమన్నాడు. 


ఇంద్రుడు సరేనన్నాడు సంవర్తుడు రెండవ అగ్నిలా ప్రకాశిస్తూ యజ్ఞం పూర్తి చేయించి దేవతలందర్నీ తృప్తి పరిచాడు. తర్వాత మరుదత్తుణ్ణి దీవించి సంవర్తుడు వెళ్ళిపోయాడు.


మరుదత్తుడు. ఆనందంతో ఆదర్శప్రాయంగా రాజ్యపాలన చేసి షట్చక్రవర్తులో ఒకడయ్యాడు .


సంవర్తుడు దేవతలనే శాసించగల సర్వశక్తి సంపన్నుడై మహర్షి, మహాయోగి

సర్వేశ్వరుడితో సమానమైనవాడయ్యాడు.


 ఇతను రాసిన 'సంవర్త సృఫతి'లో, కన్యావివాహనర్ణన, గోదానమహాత్మ్వం

ఆచారవ్యవవహారం, దినచర్య, ఉపవాసప్రతం, బ్రాహ్మణ భోజనం, గాయత్రీ జపం ప్రాణాయామం లాంటి విషయాలెన్నింటి గురించో వివరంగా తెలియచేశాడు.


 అంతేకాదు అన్ని దానాల్లోకి అన్నదానమే గొప్పదనీ, ఇక ముందు కూడా దాన్ని మించిన దానం లేదని

చెప్పాడు సంవర్త మహర్షి .


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷

మన మహర్షులు- 48

 మన మహర్షులు- 48


 సంవర్త మహర్షి



🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹



బ్రహ్మ మానస పుత్రుడయిన అంగిరసుడు తన ధర్మపత్ని శ్రద్ధ యందు పొందిన కొడుకు సంవర్తుడు.


సంవర్తుడు జ్ఞాని, యోగి, తపశ్యాలి, నిస్సంగ, నిర్మముడు, నిరుపమ శక్తి సంపన్నుడు. సంవర్తనుడు ప్రపంచ విషయాలకీ విరక్తుడై విరాగియై యోగీశ్వరుడై అడవులలో తిరుగుతూ ఉండేవాడు.


పూర్వం మనువంశ రాజైన మరుదత్తుడు, ధర్మతత్పరతతో దయా దాక్షిణ్యాలతో, శక్తియుక్తుడుగా రాజ్యం పరిపాలిస్తున్నాడు .ఇంద్రుడికి అసూయ ఎక్కువైపోయి ఏంచెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు.


అదే సమయంలో మరుదత్తుడు ఇంద్రుణ్ణి మించి పోవాలని ఒక మహాయజ్ఞం బృహస్పతిని చేయించమని అడిగాడు.


 ఇంద్రుడు పిలిచాడు వెళ్ళాలన్నాడు. బృహస్పతి, ఈలోగా నారదుడు కనిపించి బృహస్పతి తమ్ముడు సంవర్తుడు నీతో యజ్ఞం

చేయిస్తాడని మరుదత్తుడికి చెప్పాడు.


సంవర్తుని కలిసి యజ్ఞం చేయించమని అడిగి బృహస్పతి తనను ఎలా అవమానపరిచాడో చెప్పాడు మరుదత్తుడు. 


అన్న దగ్గర అనుమతి తీసుకుని వస్తేనే నేను చేయిస్తాను, ఎందుకంటే అతడు నాకు గురువులాంటివాడన్నాడు సంవర్తుడు. 


మరుదత్తుడు జరిగిందంతా సంవర్తుడికి చెప్పి ఇంద్రుడే నా యజ్ఞం పూర్తి కాకుండా చూస్తున్నాడని బ్రతిమలాడి చివరికి ఒప్పించాడు.


మరుదత్తుడితో యజ్ఞం మొదలుపెట్టించి చివరిసారిగా ఆలోచించుకో ఇంద్రుడికి బృహస్పతికి శత్రువవుతావేమో అన్నాడు సంవర్తుడు,


 మరుదత్తుడు మునీంద్రా! మీరుండగా నేనెవరికీ భయపడను, సూర్యచంద్రులు ఉన్నంతవరకు నువ్వే నా గురువు అన్నాడు భక్తితో హిమవత్సర్వతానికి ఉత్తర భాగంలో వున్న ముంజవంతమనే పర్వతం మీద శివుడి దయతో యజ్ఞం మొదలుపెట్టడానికి మరుదత్తుడికి ఎన్నో పసిడి మోపులు తెచ్చిచ్చాడు సంవర్తుడు.


ఇక్కడ సంవర్తుడు మరుదత్తుడితో యజ్ఞం చేయిస్తుంటే అక్కడ బృహస్పతి ఇంద్రుడితో యజ్ఞం చేయిస్తున్నాడు .


ఇంద్రుడు అగ్ని హోత్రుడ్ని పిలిచి ఎలాగేనా సంవర్తుడు చేయిస్తున్న యజ్ఞం ఆపమని

పంపించాడు


అగ్నిహోత్రుడు: మరుదత్తుడి దగ్గరికి వచ్చి ఆతిథ్యం తీసుకుని రాజా! బృహస్పతి నీతో యజ్ఞం చేయించి ఇంద్రపదవి వచ్చేలా చెయ్యడానికి అంగీకరించి నన్ను స్వయంగా ఇక్కడికి పంపాడు, సంవర్తు వల్ల యజ్ఞం పూర్తవదని చెప్పాడు.


మరదత్తుడు అందుకు అంగీకరించక నాకు సంవర్తుడు ఎలా చేయించినా ఫర్వాలేదన్నాడు.


సంవర్తుడు నీ రాయబారం పూర్తియింది కదా ఇంక వెళ్ళమన్నాడు - అగ్నిహోత్రుణ్ణి,


అగ్నిహోత్రుడు జరిగినది ఇంద్రుడికి చెప్పి ఇంక నావల్ల కాదన్నాడు ఇంద్రుడు.


 గంధర్వపతయిన ధృతరాష్ట్రుణ్ఞి పిలిచి మరదత్తుణ్ణి ఎలాగయినా బహస్నతితో యజ్ఞం చేయించుకుందుకు ఒప్పించమని చెప్పాడు.


 వినకపోతే ఇంద్రుడి వజ్రాయుధం నిన్ను యముడి దగ్గరికి పంపుతుందని చెప్పమన్నాడు.


మరుదత్తుడి దగ్గరకు వెళ్ళి ఇంద్రుడు చెప్పమన్నట్లు చెప్పాడు ధృతరాష్ట్రుడు గంధర్వరాజా! మొదట నేను బృహస్పతిని అడిగాను, అతడు అంగీకరించి

సమయానికి మాట తప్పాడు. ఇప్పుడు సంవర్తుడు అంగీకరించి యజ్ఞం మొదలు పెట్టాక వద్దు వెళ్ళిపొమ్మనడం న్యాయమేనా మీరే చెప్పండన్నాడు మరుదత్తుడు.


అదే సమయంలో వజ్రాయుధం వేగంగా వస్తుండడం చూసి భయపడున్న మరుదుత్తద్ని సంవర్తుడు అది నీ దాకా రాడు భయపడకన్నాడు.


నాకు 'సంస్తంభ విద్య వచ్చని దాని వల్ల దేవతలు కూడా నా ముందాగలేరని ఇంద్రుడికి తెలుసు. నాశక్తి ముందు దేవతలకి ఆయుధాలు ఏవయినా సరే పని చేయ్యవని

చెప్పాడు సంవర్తుడు.


అప్పటికే వజ్రాయుధం శక్తి హీనమై గాలిలో తిరిగుతోంది. 


మరుదత్తుడాశ్చర్యంతో సంవర్తుడి కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు.



. నీకేం కావాలో కోరుకోమన్నాడు సంవర్తుడు


మునీంద్రా! ఇంద్రుణ్ణి విరోధం మాని యజ్ఞంలో తన హవ్య భాగం తీసుకోమని

చెప్పమని అడిగాడు మరుదత్తుడు.


 సంవర్తుడు యజ్ఞం పూర్తిచేసి తన మంత్రబలంతో ఇంద్రాదులందర్నీ సేవకుల్లా రప్పించాడు .సంవర్తుడు మరుత్తుడు వాళ్ళకి ఎదురు వెళ్ళి తీసుకువచ్చి ఆసనం కూర్చోబెట్టారు.


మరుదత్తుడు ఇంద్రుడికి నమస్కరించి నీరాకవల్ల నా జన్నము, జన్మము కూడా సఫలమయ్యాయి. సంవర్తుడు నీ గురువు బృహస్పతికి తమ్ముడు. నీకు గురు సమానుడు

నాకు అన్నీ ఆతడే కనుక కోపం మాని యజ్ఞం పూర్తి చేయించమన్నాడు. 


ఇంద్రుడు సరేనన్నాడు సంవర్తుడు రెండవ అగ్నిలా ప్రకాశిస్తూ యజ్ఞం పూర్తి చేయించి దేవతలందర్నీ తృప్తి పరిచాడు. తర్వాత మరుదత్తుణ్ణి దీవించి సంవర్తుడు వెళ్ళిపోయాడు.


మరుదత్తుడు. ఆనందంతో ఆదర్శప్రాయంగా రాజ్యపాలన చేసి షట్చక్రవర్తులో ఒకడయ్యాడు .


సంవర్తుడు దేవతలనే శాసించగల సర్వశక్తి సంపన్నుడై మహర్షి, మహాయోగి

సర్వేశ్వరుడితో సమానమైనవాడయ్యాడు.


 ఇతను రాసిన 'సంవర్త సృఫతి'లో, కన్యావివాహనర్ణన, గోదానమహాత్మ్వం

ఆచారవ్యవవహారం, దినచర్య, ఉపవాసప్రతం, బ్రాహ్మణ భోజనం, గాయత్రీ జపం ప్రాణాయామం లాంటి విషయాలెన్నింటి గురించో వివరంగా తెలియచేశాడు.


 అంతేకాదు అన్ని దానాల్లోకి అన్నదానమే గొప్పదనీ, ఇక ముందు కూడా దాన్ని మించిన దానం లేదని

చెప్పాడు సంవర్త మహర్షి .


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷

34 యోగశాస్త్ర నియమాలు*

 +++


*ఆరోగ్యానికి 34 యోగశాస్త్ర నియమాలు*


1. ఉదయం 4.30 కి నిద్ర లేవాలి 

2. లేచిన వెంటనే గ్లాస్ గోరు వెచ్చని నీరు కూర్చుని నెమ్మదిగా త్రాగాలి.

3. ఐస్ క్రీం  ఎప్పుడూ తినకూడదు.

4. ఫ్రిజ్ లో తీసినవి గంట తర్వాత తినాలి 

5. కూల్ డ్రింక్స్  త్రాగకూడదు.

6. వండిన ఆహారం వేడిగా 40ని.లో తినాలి

7. భోజనం  తర్వాత వజ్రాసనం  5 - 10 నిమిషాలు వేయాలి

8. ఉదయంటిఫిన్ 8.30 గం లోపు తినాలి

9. ఉదయం టిఫిన్ తో పండ్లరసం త్రాగాలి

10. టిఫిన్ తిన్నాక తప్పకుండా పని చేయాలి.

11. మధ్యాహ్నం లోగా మంచినీరు  2,3 గ్లాసులు త్రాగాలి 

12. మంచినీళ్ళు భోజనానికి 48 ని.ముందు త్రాగాలి 

13. భోజనం క్రింద కూర్చుని తినాలి

14. ఆహారం బాగా నమిలి మ్రింగాలి

15. మధ్యాన్నం కూరల్లో వాముపొడి వాడాలి

16. మధ్యాహ్న భోజనం నిండుగా తినాలి 

17. మధ్యాన భోజనం తర్వాత  మజ్జిగ  త్రాగాలి

18. మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి  

19. రాత్రి భోజనం సూర్యాస్తమయం లోపు చేయాలి

20. రాత్రి పూట చాలా తక్కువగా, తినాలి

21. రాత్రి భోజనంతర్వాత 1కి.మీ నడవాలి

22. రాత్రి భోజనంతర్వాత గంటకు పాలు త్రాగాలి.

23. రాత్రిపూట లస్సీ, మజ్జిగ త్రాగకూడదు

24. రాత్రి పుల్లటి పండ్లు తినకూడదు.

25. రాత్రి  9 - 10 గం.పడుకోవాలి

26. పంచదార, మైదా,గుండఉప్పు తక్కువ వాడాలి.

27. రాత్రి పూట సలాడ్ తినకూడదు.

28. విదేశీ ఆహారంను ఎప్పుడూ కొనరాదు 

29. టీ,కాఫీ ఎప్పుడు  త్రాగకూడదు.

30. పాలలో పసుపు వేసి మరిగించి త్రాగితే 

క్యాన్సర్ రాదు

31.ఆయుర్వేద వైద్యం ఆరోగ్యంకు మంచిది

32. అక్టోబరు నుంచి మార్చ్ ( చలికాలంలో) వెండి, బంగారు పాత్రలోని  నీరు  త్రాగాలి

33. జూన్ నుంచి సెప్ట్ంబర్ (వర్షాకాలంలో) లో రాగి పాత్రలో నీరు త్రాగాలి

34. మార్చ్ నుంచి జూన్ (ఎండాకాలంలో) మట్టి పాత్రలో నీరు త్రాగాలి



*ఆరోగ్యానికి 34 యోగశాస్త్ర నియమాలు*


+++

మొగిలిచెర్ల అవధూత

 *వ్యాధి..నివారణ..*


"నేను కృష్ణమూర్తిని మాట్లాడుతున్నానండీ..మేము మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సమాధిని దర్శించుకోవాలని అనుకుంటున్నాము..ఎలా రావాలో తెలుపుతారా..?" అని నన్ను ఫోన్ లో అడిగారు..కృష్ణమూర్తి గారు వుండే ప్రదేశం నుంచి శ్రీ స్వామివారి మందిరానికి రావడానికి ఉన్న అన్ని మార్గాలూ వివరంగా తెలిపాను.."మేము మొత్తం నలుగురం వస్తామండీ..మా తల్లిదండ్రులు..నేనూ, నా భార్యా..మా అమ్మా నాన్న గార్లు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి వాళ్లకొఱకు ఒక రూమ్ ఏదైనా చూడగలరా?..మేమిద్దరం స్వామివారి సన్నిధిలో ఉంటాము.." అన్నారు..వాళ్ళు ఎప్పుడు రాదల్చుకున్నదీ చెప్పారు కనుక..వాళ్ళకొఱకు ఒక గది కేటాయించి పెట్టాను..మరో రెండువారాల తరువాత ఒక శనివారం ఉదయం కృష్ణమూర్తి గారు తన భార్యా..తల్లిదండ్రుల తో కలిసి స్వామివారి మందిరానికి వచ్చారు..


"వీరు మా నాన్నగారు సత్యనారాయణరావు గారు, మా అమ్మగారు వెంకటలక్ష్మి..మా ఆవిడ సుమిత్ర " అంటూ..పేరు పేరునా పరిచయం చేశారు..వాళ్లకు కేటాయించిన గది కి వెళ్లి స్నానాదికాలు ముగించుకొని మళ్లీ మందిరం లోకి వచ్చి నా వద్ద కూర్చున్నారు..కృష్ణమూర్తి గారు నాతో ఏదో చెప్పుకోవాలని వున్నారు అని అనిపించింది...."ఏదైనా సమస్యతో వచ్చారా..? లేక..కేవలం స్వామివారి సమాధి దర్శనానికి వచ్చారా?.." అని అడిగాను..కొద్దిగా సందేహంగా నా వైపు చూసి.."ప్రసాద్ గారూ..చిన్న సమస్య కాదండీ..పెద్ద సమస్య తోనే వచ్చాము..మా ఇద్దరికీ వివాహం జరిగి పదిహేను సంవత్సరాలు అవుతోంది..మాకు ఇద్దరు సంతానం..ఇద్దరూ మొగపిల్లలే..పెద్దవాడికి పన్నెండేళ్ళు..రెండోవాడికి పదేళ్లు..రెండోవాడు పుట్టినప్పుడు..కాన్పు తరువాత ఆరు నెలలకు నా భార్యకు చర్మ సంబంధ వ్యాధి వచ్చింది..ఎన్నో రకాల మందులు వాడాము..ఎందరో డాక్టర్లకు చూపించుకున్నాము..నయం కాలేదండీ..అలానే రోజులు గడచిపోతున్నాయి..అల్లోపతి, హోమియో..ఆయుర్వేదం..ఇలా అన్నిరకాల వైద్యాలూ అయ్యాయి..మా నాన్నగారు సలహా ఇచ్చారండీ.."ఒక్కసారి మొగిలిచెర్ల వెళ్లి, ఆ దత్తాత్రేయ స్వామివారి సమాధి వద్ద మొక్కుకొని రండి..ఫలితం వుంటుంది.." అన్నారండీ..పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా..ఈమె సోదరి వద్ద వదిలిపెట్టి..మేము నలుగురమూ ఇలా వచ్చాము.." అన్నారు..


"ఈరోజు శనివారం కనుక..స్వామివారి సమాధి ని ముట్టుకొని మొక్కుకోలేరు..కేవలం ఆ గడప ఇవతలి నుంచి చూసి..నమస్కారం చేసుకోవచ్చు..మీకు వీలుంటే..ఈరోజు ఇక్కడకు దగ్గరలోనే మాలకొండ అని లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఉన్నది..వెళ్లి దర్శించుకొని రండి..రాత్రికి ఇక్కడ పల్లకీసేవ వుంటుంది..అందులో పాల్గొనండి..రేపుదయం స్వామివారి సమాధిని దర్శించుకొనవచ్చు.." అని చెప్పాను..అలాగే అన్నారు..మాలకొండ కు వెళ్ళొచ్చారు..సాయంత్రం పల్లకీసేవలో పాల్గొన్నారు..ఆ ప్రక్కరోజు ఉదయం స్వామివారి సమాధిని దర్శించుకొని..ఇవతలికి వచ్చారు..ఆరోజు మధ్యాహ్నం మూడు గంటల వేళ..కృష్ణమూర్తి గారు ఆయన భార్యా వచ్చారు.."ప్రసాద్ గారూ..ఈవిడ మరో పదకొండురోజులపాటు ఇక్కడే ఉంటుందట..మా అమ్మగారిని సహాయంగా ఉండమని అడిగింది..ఆవిడా ఒప్పుకున్నది..నాకు ఆఫీస్ పని ఉంది కాబట్టి నేను వెళతాను..వచ్చే వారం వస్తాను..వీళ్ల కొఱకు ఆ రూమ్ అట్టే పెట్టండి..ఆ ఒక్క సహాయం చేయండి.." అని అభ్యర్ధించారు..సరే అన్నాను..


ఆ ప్రక్కరోజు నుంచీ ఆవిడ రెండు పూటలా స్వామివారి మందిరం లో ప్రతి సేవలోనూ పాల్గొనేది..రోజుకు మూడు సార్లు స్వామివారి విభూతి ని తన శరీరం పై వ్యాధి ఉన్న చోట శ్రద్ధగా రాసుకునేది..ఆవిడ ను చూస్తే ఏదో దీక్ష తీసుకున్న దానిలాగా..నిరంతరం స్వామివారి ధ్యాస లోనే ఉండేది..పదకొండు రోజులు ఉంటానని చెప్పిన ఆ సుమిత్ర గారు నలభై రోజులు తన అత్తగారు మామగార్లతో కలిసి స్వామివారి మందిరం వద్దే ఉండిపోయింది..మధ్యలో కృష్ణమూర్తి గారు రెండు మూడు సార్లు వచ్చి వెళ్లారు..నలభై ఒక్క రోజు పూర్తి అయిన తరువాత..సుమిత్ర గారు నా వద్దకు వచ్చి.."ప్రసాద్ గారూ..రేపు సాయంత్రం మేము మా ఊరెళ్లి పోతున్నాము..మా వారు రేపుదయం వస్తున్నారు..స్వామివారి దయవల్ల నా చర్మవ్యాధి పూర్తిగా తగ్గిపోయింది..ఈ నలభైరోజులు నన్ను స్వామివారే పట్టుబట్టి ఇక్కడ ఉంచారు.." అన్నారు..ఆ ప్రక్కరోజు కృష్ణమూర్తి తన పిల్లలను కూడా తీసుకొని వచ్చారు..అందరూ కలిసి స్వామివారి సమాధి ని దర్శించుకొన్నారు..


"ప్రసాద్ గారూ..మా మామగారు ఇచ్చిన సలహామేరకు ఇక్కడకు వచ్చాము..మొదటిరోజు కొద్దిగా సందేహం తోనే ఉన్నాము..ఆరోజు రాత్రి ఇక్కడ నిద్రచేసిన తరువాత..నాలో ఏదో మార్పు వచ్చింది..ఇక్కడే వుండి..ఈ వ్యాధి నయం చేసుకోవాలి అనే మొండితనం వచ్చింది..స్వామివారి విభూతి తప్ప మరేదీ వాడలేదు..స్వామివారి నామం..ఆ విభూతి..ఈ రెండే నా జబ్బును తగ్గించాయి..ఇన్నాళ్లూ..ఈ వ్యాధి మూలంగా నా బిడ్డలను కూడా దూరంగా పెట్టాను..వాళ్లకు అంటుకుంది అనే భయం ఉండేది..ఇప్పుడు ఆ బాధలేదు.." అంటూ కన్నీళ్ల తో చెప్పింది..


కృష్ణమూర్తి గారు తమ సమస్య తీరిపోయినందుకు స్వామివారికి నమస్కారం చేసుకొని..ప్రతి మూడునెలలకు ఒకసారి స్వామివారి దర్శనానికి రావడం ఒక నియమంగా పెట్టుకున్నారు..ఆ దంపతులు అదే పాటిస్తున్నారు కూడా..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

Correct use of AC:

 Correct use of AC:

As hot summer has started and we use  Air conditioners regularly, let us follow the correct method.


Most people have a habit of running their ACs at 20-22 degrees and when they feel cold, they cover their bodies with blanket.


Do you know that the temperature of our body is 37 degrees Celsius? The body can tolerate temperature ranging from 23 degrees to 39 degrees easily. It is called human body temperature tolerance. 


When the Room temperature is lower or higher, the body  reacts, by sneezing, shivering, etc.


When you run the AC at 19-20-21 degrees, room temperature is much lower than the normal body temperature and it starts the process called hypothermia in the body which affects blood circulation, whereby, blood supply in some parts of the body is not adequate. There are many disadvantages in  long term such as arthritis etc.


Most of the time there is no sweating when AC is ON, so the toxins of the body can not come out and in the long term, cause risk of many more diseases, such as skin allergy or itching, high blood pressure etc.


What is the best way to run AC ??

It is always better to run AC at 26+ degrees and put the fan on at  slow speed. 28 plus degrees is better.


 The blood pressure on the brain will also decrease and Saving will ultimately help reduce the effects of global warming. How ?? 


Suppose you save about 5 units per AC per night by running AC on 26+ Degree and other 10 lakh houses also do like you then we save 5 million units of electricity per day.


Please consider the above and do not run your AC at all below 26 degrees. Keep your body and environment healthy.


*Forwarded in Public Interest*

*Ministry for Power 

and Energy. GOI.

👏👏👏👏👏👏👏👏

*Forward share.*

👍👍👍👍👍👍👍👍

మన మహర్షులు- 47

 మన మహర్షులు- 47


 వ్యాఘ్రపాదుడు


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


 మహర్షులు దివ్యజ్ఞాన సంపన్నులు. మన నైతికతకు, మనం నడిచే దారి చూసే మార్గదర్శకత్వానికి వారే దిక్సూచులు. 


అటువంటి మహర్షుల చరిత్ర పారాయణం, తెలుసుకోవడం పుణ్యప్రదం. 


వ్యాఘ్రపాదుడు మన మహర్షులలో ఒకరు.


 ఈయనది విచిత్రమైన రూపం. ఈయనను వ్యాఘ్రపాద లేదా వ్యాఘ్రపాదుడు అనే పేర్లతోనూ పిలుస్తారు. వ్యాఘ్రము అనగా పులి. లేదా మృగము. మృగాలు నిత్యం సంచరిస్తూనే ఉంటాయి. అందుకు తగినట్టుగా ఆయన పాదాలు పులి పాదాల వలే ఉంటాయి.


 పరమశివుడే ఒక సందర్భంలో ఈయనకు ఈ విధంగా పులి పాదాలను ప్రదానం చేశాడని అంటారు. 


వ్యాఘ్రపాదుడు కృత యుగానికి చెందిన మహర్షి.


ఈయన ధర్మ ప్రవచన దక్షుడు. వేద వేదాంగ విదుడు. పురాణాలలోనూ ఈ మహర్షి గురించి ఘనమైన ప్రస్తావనలే ఉన్నాయి.


 లభిస్తున్న ఆధా రాలను బట్టి ఈయన భారతదేశంలోని తమిళనాడుకు చెందిన వారు. అక్కడి చిదంబరం ఆలయ ప్రాంగణంలో గల నటరాజ స్వామి (శివుడు)కి వ్యాఘ్రపాదుడు పరమ భక్తుడు. 


ఆయనకు నిత్యం భక్తిశ్రద్ధలతో పూజలు ఆచరించేవాడు. ఈ క్రమంలో నటరాజును అర్చించేందుకు.. తేనె టీగలు తాకని పూలను సేకరిస్తుండే వాడు ఈ మహర్షి.


అయితే, పుష్పాలు కోసి, సేకరించే సమ యంలో వ్యాఘ్రపాదుడు ముళ్లు మరియు కఠినమైన బండరాళ్ల కారణంగా గాయాలకు గురయ్యే వాడు. 


ఈ మహర్షి తన పట్ల చూపిస్తున్న భక్తి శ్రద్ధలకు, తనను పూజించడం కోసం సేకరిస్తున్న పూల కోసం పడుతున్న కష్టాలకు చలించిన శివుడు.. ఈ మహర్షికి పులి పాదాలను ప్రదానం చేశాడు. 


దీంతో పువ్వులు కోసేటప్పుడు పాదాలు కఠినమైన పరిస్థితులకు గురయ్యే బాధ తప్పింది. శివుని వర ప్రభావంతో పులి పాదాలను పొందిన కారణంగా అప్పటి నుంచి వ్యాఘ్రపాదుడు అనే పేరు స్థిరపడింది.


తమిళనాడులోని చిదంబరం వెళ్లినపుడు, అక్కడి నటరాజ స్వామి పక్కన సర్ప పాదాలతో, పులిపాదాలతో నిల్చుని ఉన్న ఇద్దరు మహర్షులు నటరాజ స్వామిని ప్రార్థిస్తున్న చిత్రాలను చూడ వచ్చు. 


అందులో పాము పాదాలతో ఉన్న మహర్షిని పతంజలి మహర్షి అనీ, పులి పాదాలతో ఉన్న మహర్షిని వ్యాఘ్రపాదుడని అంటారు.


 వ్యాఘ్రపాదుడు సగం పులి శరీరం, మిగతా సగం మానవ శరీరం కలిగి ఉంటాడు.


వ్యాఘ్రపాదుడు ఒక ముని కన్యను వివాహం చేసికొని  ఉపమన్యుడు మరియు  ధౌమ్యుడు అనే కుమారులని పొందాడు.


 ఉపమన్యుడు శివుని యొక్క కటాక్షం పొంది మహా జ్ఞాని, మహా యోగి అయ్యాడు.. అలాగే, రెండవ కుమారుడు ధౌమ్యుడు మహర్షి అయ్యాడు. అనంతర కాలంలో పాండవు లకు పురోహితుడిగానూ వ్యవహరించాడు.


ఒకనాడు ఈయన కాశీ విశ్వేశ్వరుడిని దర్శించి, అనన్య నిరుపమానమైన భక్తితో ఈ విశ్వనాథాష్టకాన్ని స్తుతించాడని అంటారు. ‘‘గంగా తరంగ కమనీయ జటా కలాపం..’’ అంటూఎనిమిది పాదాలతో సాగే అష్టకం చివరిలో ‘‘వ్యాఘ్రోక్త మష్టక మిదం పఠతే మనుష్య:..’ అని ముగుస్తుంది


. కాశీ విశ్వేశ్వరుడు వ్యాఘ్రపాదుని భక్తిప్రపత్తులతకు సంతోషించి, అతనికి సాక్ష్యాత్కరించి కోరిన వరాలను ఇచ్చాడు.


 వ్యాఘ్రపాదుడు మహర్షులకి బోధించిన దాన్ని 'వ్యాఘ్రపాద స్మృతి', అంటారు.


వ్యాఘ్రపాద స్మృతిలో బ్రహ్మచారి, గృహస్థు, యతి, వానప్రస్థుడు మొదలైన వాళ్ళకి సంబంధించిన విషయాలు వాళ్ళు ఆచరించాల్సిన విషయాలు ఉన్నాయి..


ఇదీ వ్యాఘ్రపాద మహర్షి కథ🙏


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷

వేసవిలో

 *వేసవిలో మజ్జిగ పానీయాలు*


★మంచుకొండల్లో పాలు తోడుకోవు. అందుకని అక్కడ పెరుగుగానీ, దాన్ని చిలికిన మజ్జిగ గానీ దొరికే అవకాశలు ఉండవు. ఈ కారణంగా కైలాసంలో ఉండే పరమశివుడికి, మజ్జిగ తాగే అలవాటు లేకపోవటాన ఆయన నీలకంఠ యాడు నీలకంఠుడయ్యాడు పాల సము సముద్రంలో నివసించే విష్ణుమూర్తికి మజ్జిగ ఎటు తిరిగీ దొరకవు కాబట్టే, ఆయన నల్లని వాడయ్యాడు. స్వర్గంలో ‘సుర’ తప్ప మజ్జిగ దొరకవు కాబట్టి, ఇంద్రుడు బలహీనుడయ్యాడు. మజ్జిగతాగే అలవాటే గనక ఉంటే  చంద్రుడికి క్షయ వ్యాధి, వినాయకుడికి పెద్ద పొట్ట, కుబేరుడికి కుష్టురోగ౦, అగ్నికి కాల్చే గుణ౦ ఇవన్నీ వచ్చేవే కాదు” *యోగరత్నాకర౦* అనే వైద్యగ్ర౦థ౦లో ఈ *చమత్కార విశ్లేషణ* కనిపిస్తు౦ది. *మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి తలెత్తకు౦డా ఉంటాయనీ, “విషదోషాలు”, “దుర్బలత్వ౦”, “చర్మరోగాలు”, “క్షయ”, “కొవ్వు”, “అమిత వేడి” తగ్గిపోతాయనీ, శరీరానికి మ౦చి వర్చస్సు కలుగుతు౦దనీ దీని భావ౦. అక్కడ దేవతల కోస౦ అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోస౦ మజ్జిగనీ భగవ౦తుడు సృష్టి౦చాడట!*


★వేసవి కాలాన్ని మన౦ మజ్జిగతోనే ఎక్కువగా గడిపే౦దుకు ప్రయత్ని౦చాలి. *తోడుపెట్టిన౦దు వలన పాలలో ఉ౦డే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిల౦గా ఉ౦డట౦తో పాటు, అదన౦గా “లాక్టో బాసిల్లై” అనే “మ౦చి బాక్టీరియా” మనకు  దొరుకుతు౦ది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉ౦డదు*. అ౦దుకని, వయసు పెరుగుతున్నకోద్దీ మజ్జిగ అవసర౦ పెరుగుతు౦ది. *#ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థక౦ అవుతు౦ది. అ౦దుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు#. చిలికిన౦దువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణ౦ వస్తు౦ది. అ౦దుకని పెరుగుకన్నా మజ్జిగ మ౦చిది.* 


*వేసవి కోస౦ ప్రత్యేక౦ “కూర్చిక పానీయ౦”:*    

★ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అ౦దులో రె౦డుగ్లాసుల పుల్లని మజ్జిగ కలప౦డి. ఈ పానీయాన్ని  *‘కూర్చిక’* అ౦టారు. ఇ౦దులో “ప౦చదార” గానీ, “ఉప్పు” గానీ కలపకు౦డానే తాగవచ్చు. *”ధనియాలు”, “జీలకర్ర”, “శొ౦ఠి” ఈ మూడి౦టినీ  100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా ద౦చి, మూడి౦టినీ కలిపి తగిన౦త “ఉప్పు” కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకో౦డి. “కూర్చిక”ను తాగినప్పుడల్లా, అ౦దులో దీన్ని ఒక చె౦చా మోతాదులో కలిపి తాగ౦డి. #వడదెబ్బ కొట్టదు. పేగులకు బలాన్నిస్తు౦ది. జీర్ణకోశ వ్యాధులన్ని౦టికీ ఇది మేలు చేస్తు౦ది. వేసవిలో కలిగే జలుబుని నివారిస్తు౦ది#*.


*వడదెబ్బ కొట్టని పానీయ౦ “రసాల”:*

★పెరుగు మీద తేరుకున్న నీళ్ళు, పాలు కలగలిపి ఆరోగ్యకరమైన “రసాల” అనే పానీయాన్ని “భీముడు” తయారు చేశాడని “భావప్రకాశ” వైద్య గ్ర౦థ౦లో ఉ౦ది*. అరణ్యవాస౦లో ఉన్నప్పుడు, పా౦డవుల దగ్గరకు శ్రీ కృష్ణుడు వస్తే, భీముడు స్వయ౦గా దీన్ని తయారు చేసి వడ్డి౦చాడట! *ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకు౦డా చేస్తు౦ది* కాబట్టి, ఎ౦డలో తిరిగి ఇ౦టికి వచ్చిన వారికి ఇచ్చే పానీయ౦ ఇది. తన ఆశ్రమాన్ని స౦దర్శి౦చటానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి  రాముని గౌరవార్థ౦ ఇచ్చిన వి౦దులో రసాల కూడా ఉ౦ది. *భావ ప్రకాశ* వైద్య గ్ర౦థ౦లో దీన్ని ఎలా తయారు చేసుకొవాలో వివర౦గా ఇచ్చారు:

*1.*  బాగా కడిగిన ఒక చిన్న కు౦డ లేదా ము౦త తీసుకో౦డి. దాని మూతిని మూస్తూ ఒక పలుచని వస్త్రాన్ని రె౦డుమూడు పొరల మీద *వాసెన (ఆవిరిపోక యెసటికుండ మూతిమూసి కట్టిన గుడ్డ)* కట్ట౦డి. *ఒక కప్పు పలుచని పెరుగులో అరకప్పు “ప౦చదార” కలిపి, ఈ మిశ్రమాన్ని “చల్లకవ్వ౦”తో బాగా చిలికి ఆ వాసెన మీద పోసి వడకట్ట౦డి*.

*2.* పెరుగులో ప౦చదార కరిగి నీరై ఆ వస్త్ర౦లో౦చి క్రి౦ది ము౦తలోకి దిగిపోతాయి. వాసెనమీద పొడిగా పెరుగు ముద్ద మిగిలి ఉ౦టు౦ది. దాన్ని అన్న౦లో పెరుగు లాగా అవాడుకో౦ది. ఈ *రసాల* కు దానితో పని లేదు. ము౦తలో మిగిలిన తియ్యని పెరుగు నీటిని *‘ద్రప్య౦’* అ౦టారు. ఈ *‘ద్రప్య౦’* ని౦డా *లాక్టోబాసిల్లస్* అనే *ఉపకారక సూక్ష్మజీవులు* ఉ౦టాయి.  అవి *పేగుల్ని స౦రక్షి౦చి జీర్ణాశయాన్ని బలస౦పన్న౦ చేస్తాయి*. ఆ నీటితోనే రసాలను తయారు చేస్తారు 

*3.*  ఇప్పుడు, కాచి చల్లార్చిన పాలు ఈ ద్రప్యానికి రెట్టి౦పు కొలతలో తీసుకొని ము౦తలోని పెరుగు నీళ్ళతో కలప౦డి.  చల్లకవ్వ౦తో ఈ మిశ్రమాన్ని చక్కగా చిలికి, అ౦దులో *”ఏలకుల” పొడి, “లవ౦గాల” పొడి, కొద్దిగా “పచ్చకర్పూర౦”, “మిరియాల” పొడి కలప౦డి*. ఈ కమ్మని పానీయమే *రసాల*! *#దీన్ని అప్పటికప్పుడు తాగేలాగా తయారు చేసుకొవాలి.#* 

*4.*  ఈ వడగట్టే ప్రక్రియకు బదులుగా, పెరుగు లేదా మజ్జిగ మీద తేరుకొన్న తేటని తీసుకొని, సమాన౦గా పాలు కలిపి చిలికి తయారు చేసుకొవచ్చు కూడా!  *”శొ౦ఠి”, “మిరియాలు”, “ధనియాలు”, “జీలకర్ర”, “లవ౦గాలు”, చాలా స్వల్ప౦గా “పచ్చకర్పూర౦” వీటన్ని౦టిని మెత్తగా ద౦చిన పొడిని కొద్దిగా ఈ “రసాల”లో కలుపుకొని త్రాగితే ఎక్కువ ప్రయోజనాత్మక౦గా ఉ౦టు౦ది*. 

*5.* *మజ్జిగ మీద తేటలో కేవల౦ ఉపయోగకారక సూక్ష్మజివులు లాక్టోబాసిల్లై మాత్రమే ఉ౦టాయి. ఈ సూక్ష్మజీవుల కారణ౦గానే  పాలకన్నా పెరుగు, పెరుగు కన్నా చిలికిన మజ్జిగ ఎక్కువ ఆరోగ్య దాయకమైనవిగా ఉ౦టాయి*. మజ్జిగలొని లాక్టోబాసిల్లై ని తెచ్చి పాలలో కలిపి,  చిలికి ఈ రసాల ప్రయోగాన్ని మన పూర్వీకులు చేశారన్నమాట. 

ఇది *”అమీబియాసిస్” వ్యాధి, “పేగుపూత”, “రక్త విరేచనాలు”, “కలరా” వ్యాధులు ఉన్నవారిక్కూడా ఇవ్వదగిన పానీయ౦*. వేసవి కాలానికి అనుకూల౦గా ఉ౦టు౦ది. *వడ దెబ్బ తగలనీయదు. శరీర౦లో వేడిని తగ్గిస్తు౦ది. తక్షణ౦ శక్తినిస్తు౦ది. “కామెర్ల” వ్యాధిలో ఎక్కువ మేలు చేస్తు౦ది*. *#పెరుగు మీద తేట, వైద్యపర౦గా, చెవులను బలస౦పన్న౦ చేస్తు౦దని “ఆయుర్వేద శాస్త్ర౦” చెప్తో౦ది. “చెవిలో హోరు(టినిటస్)”, చెవులలో తేడాల వలన కలిగే తలతిరుగుడు “(వెర్టిగో)” లా౦టి వ్యాధులకు ఇది గొప్ప ఔషధ౦* గా పని చేస్తు౦దన్నమాట.


*వేసవి కోస౦ “తేమన౦” అనే పానీయ౦:*

★ *తేమన౦* అనేది *శ్రీనాథుడి* కాల౦ వరకూ ప్రసిద్ధి చె౦దిన వ౦టకమే! దీన్ని “తిపి”గానూ, “కార౦”గానూ రె౦దు రకాలుగా తయారు చేసుకొ౦టారు. *”మజ్జిగ”లో “పాలు”, “బెల్ల౦” తగిన౦త చేర్చి, ఒక పొ౦గు వచ్చే వరకూ కాస్తే “తేమన౦” అనే తెలుగు పానీయ౦ తయారౌతుంది*. *#ఇది వేసవి పానీయాలలో మేలయిన పానీయ౦. వడదెబ్బ వలన కలిగే శోషని నివారిస్తు౦ది. శరీరానికి తక్షణ శక్తినిస్తు౦ది. చల్లారిన తరువాత త్రాగట౦ మ౦చిది. దీన్ని “తీపి మజ్జిగ పులుసు” అనవచ్చు#*. 


ఇ౦క *“కార౦” మజ్జిగపులుసు* గురి౦చి మనకు తెలిసినదే! *పులవని “చిక్కని మజ్జిగ” తీసుకో౦డి. వెన్న తీసిన మజ్జిగ అయితే మరి౦త రుచికర౦గా ఉ౦టాయి. ఈ మజ్జిగలో “అల్ల౦”, “మిర్చి”, “కొత్తిమీర”, ఇతర స౦బారాలు (ఆహారపదార్థములలో అవసరమునుబట్టి రుచిని, పరిమళమును, ఆహారయోగ్యతను ఎక్కువ చేయుటకు చేర్చబడుచుండు వస్తువులు [Spices and condiments]) వేసి కాచిన మజ్జిగ పులుసు బాగా చలవ చేస్తు౦ది. మజ్జిగ పులుసు వేసవి కోస౦ తరచూ  వ౦డుకొవాల్సిన వ౦టక౦ అని గుర్తి౦చ౦డి!* 


*ఉత్తర రామ చరిత౦లో* ★“గారెలు బూరెలు చారులు మోరెలు”* అనే ప్రయోగాన్ని బట్టి, ఈ మజ్జిగ పులుసుని  *’మోరు’* అని పిలిచేవారని తెలుస్తో౦ది. *”బియ్యప్పి౦డి”, “అల్ల౦” తదితర స౦బారాలు చేర్చి ఉ౦డలు కట్టి మజ్జిగ పులుసులో వేసి వ౦డుతారు. ఈ ఉ౦డల్ని ‘మోరు౦డలు’ అ౦టారు. వీటిని ఆవడ(పెరుగువడ)లాగా తినవచ్చు*. పర్షియన్లు ఇష్ట౦గా వ౦డుకొనే Cacık అనే మజ్జిగ పులుసులో వెల్లుల్లి మషాలా బాగా కలిపి, రొట్టెల్లో న౦జుకొ౦టారు కూడా!


*మె౦తి మజ్జిగ:*

★ *మె౦తులు తేలికగా నూరి చిక్కని పులవని మజ్జిగలో కలిపి, తాలి౦పు పెడితే, దాన్ని “మె౦తి మజ్జిగ” అ౦టారు. “మజ్జిగ చారు” అని కూడ పిలుస్తారు*. తెలుగిళ్ళలో ఇది ప్రసిద్ధ వ౦టక౦. దీన్ని అన్న౦లో ఆధరవుగానూ తినవచ్చు లేదా విడిగా తాగావచ్చు కూడా! *మామూలు మజ్జిగకన్నా అనునిత్య౦ మజ్జిగచారునే వాడుకోవట౦ ఎప్పటికీ మ౦చిది. #ముఖ్య౦గా షుగర్ వ్యాధి ఉన్నవారికీ, వచ్చే అవకాశ౦ ఉన్నవారికీ ఇది మ౦చి చేస్తు౦ది#*. 


*తీపి లస్సీ:*

★ *మజ్జిగలో “ప౦చదార” లేదా “తేనె” కలిపిన పానీయమే లస్సీ*!  హి౦దీ లేదా ప౦జాబి పద౦ కావచ్చు. *వేసవికాల౦లో “నిమ్మరస”౦, “జీలకర్ర” పొడి, “ఉప్పు”, “ప౦చదార” కలిపి “పుదీనా ఆకులు” వేసిన లస్సీ #వడ దెబ్బ తగలకు౦డా కాపాడుతు౦ది#*. తెలుగులో దీన్ని *‘సిగరి’* అ౦టారు. *శిఖరిణి* అనే స౦స్కృత పదానికి ఇది తెలుగు రూప౦ కావచ్చు. *చిక్కని మజ్జిగ అయితే “లస్సీ” అనీ, వెన్న తీసేసి, నీళ్ళు ఎక్కువ కలిపితే “‘చాస్’” అనీ పిలుస్తారు*. టర్కీలో Ayran, ఆర్మీనియాలో Than, పర్షియాలో Doogh, ఆల్బేనియాలో Dhalle అనే పానీయాలు ఇలా౦టివే! గుర్ర౦ పాలతో kumiss అనే పానీయాన్ని మధ్య ఆసియా స్టెప్పీలు ఇష్ట౦గా తాగుతారట! పర్షియన్ Cacık అనేది మన మజ్జిగ పులుసు లా౦టిదే!


*మజ్జిగమీద తేట:*

★మజ్జిగమీద తేటకు మజ్జిగతో సమానమైన గుణాలున్నాయి. *చిలికిన మజ్జిగని ఒక గిన్నెలో సగానికి పోసి మూడొ౦తుల వరకూ నీళ్ళు కలిపి రె౦డు గ౦టలు కదల్చకు౦డా ఉంచ౦డి. మజ్జిగమీద ఆ నీరు తేరుకొ౦టు౦ది. మజ్జిగ తేటను వ౦చుకొని మళ్ళీ నీళ్ళు పోయ౦డి. ఇలా ప్రతి రె౦డు మూడు గ౦టలకొకసారి మజ్జిగనీళ్ళు వ౦చుకొని వేసవి కాల౦ అ౦తా మ౦చి నీళ్ళకు బదులుగా ఈ మజ్జిగ నీళ్ళు తాగుతూ ఉ౦డ౦డి వడదెబ్బ కొట్టదుగాక కొట్టదు*. మజ్జిగ వాడక౦ మనకున్న౦తగా ఉత్తరాది వారికి లేదు. మధురానగరిలో తెలుగు కృష్ణుడు చల్లలమ్మబోయే అమ్మాయిల దారికి అడ్డ౦ పడ్డాడు గానీ, పెరుగులమ్మబోయే వారికి కాదు గదా!


*ఎండలోకి వెళ్లబోయే ము౦దు దీన్ని తాగ౦డి:*

★*చక్కగా “చిలికిన  మజ్జిగ” ఒక గ్లాసుని౦డా తీసుకో౦డి. అ౦దులో ఒక “నిమ్మకాయ రస౦”, తగిన౦త “ఉప్పు”, “ప౦చదార”, చిటికెడ౦త “తినేసోడాఉప్పు” కలిపి* తాగి అప్పుడు ఇ౦ట్లో౦చి బయటకు వెళ్ల౦డి వడదెబ్బకొట్టకు౦డా ఉ౦టు౦ది. మరీ ఎక్కువ ఎ౦డ తగిలి౦దనుకొ౦టే తిరిగి వచ్చిన  తరువాత ఇ౦కోసారి త్రాగ౦డి. *ఎ౦డలో ప్రయాణాలు చేయవలసి వస్తే, ఒక సీసాని౦డా దీన్ని తయారు చేసుకొని వె౦ట తిసుకెళ్ల౦డి. మాటిమాటికీ తాగుతూ ఉ౦టే వడదెబ్బ కొట్టదు*.                                                                                         ★ *Astro Village[INDIA]*★                                  ◆ *జ్యోతిష్యాలయం*◆                                                           ■వాట్సాప్: *+91-8008872109*