9, సెప్టెంబర్ 2020, బుధవారం

శంకరాచార్యుల వారు y

ఆది శంకరాచార్యుల వారు రచించిన గ్రంథాలను మూడింటిగా మనం విభజించుకోవచ్చు.

1) భాష్యగ్రంథం రచన
2) ప్రకరణ రచన
3) స్తోత్రవాఙ్మయం

భాష్యగ్రంథములంటే
1) ఉపనిషత్తులు,
2) బ్రహ్మసూత్రములు,
3) భగవద్గీత - వీటికే ప్రస్థాన త్రయం అని పేరు.

 ప్రకరణగ్రంథాలు ఏకశ్లోకి నుండి సహస్రశ్లోకముల వరకు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి వివేకచుడామణి, అపరోక్షానుభూతి మొదలగునవి.

తరువాత స్తోత్ర వాఙ్మయం ఇది అపారంగా ఉన్నది. భారత దేశంలో ఏపాటి భక్తి ఉన్నవారికైనా శంకరుల స్తోత్ర వాఙ్మయ స్పర్శ ఉండి తీరుతుంది. ఆయన ఇచ్చిన స్తోత్రములలో మణిపూస వంటివి శివానందలహరి, సౌందర్య లహరి.

శంకరులు రచించిన ఈ నూరు శ్లోకాల గ్రంథంలో ఒక సూత్రంగా ఉన్న ప్రత్యేకత : శివశక్తుల ఏకస్వరూపంగా అమ్మవారిని సంభావించడం.

ఇంతటి మహాగ్రంథానికి అద్భుతమైన ప్రత్యేక సైలిలో భావార్ధాన్ని రచించారు శ్రీ సామవేదం వారు. ఇది ఒక భావార్ధబోధక గ్రంథం, శ్రీ లలితాసహస్ర నామాలలోని ఎన్నో నామాలు సౌందర్యలహరి శ్లోకాలలో ధ్వనిస్తున్నాయి, వాటిని కూడా ఇందులో సూచించడం జరిగింది.

విశ్వవ్యాపకమైన , నిత్యమైన పరమేశ్వర చైతన్యమే స్త్రీపుం భావాతీతమైన సచ్చిదానంద తత్త్వం, అదే సౌందర్యం . ఇంతటి ప్రసిద్ధి చెందిన "సౌందర్య లహరి" శ్లోకాలకు సూటిగా, తేటగా, ఎదనెడ ముఖ్యాంశాలను తెలియజేస్తూ, అంతరార్థాలను తెలియచేసే చక్కని "ఉపోద్ఘాతం"తో పూజ్యులు సమన్వయ సరస్వతి, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు రచించిన ప్రత్యేక భావానువాద గ్రంథం ఋషిపీఠం కార్యాలయాలలో లభ్యం అవుతుంది. ఆసక్తి కలవారు ఋషిపీఠ కార్యాలయన్ని సంప్రదించవచ్చు. ఇది కేవలం ₹30/- లకే లభ్యం అవుతుంది..

పూర్తి వివరాలకు సంప్రదించవలసిన చిరునామా -

Bharata Rushipeetham
Plot No: 1-9-46, HIG A-40,
Dr A S Rao Nagar,
 Hyderabad - 500 062, TS, India

040-2713 2550 , 2713 4557

Online purchase : https://rushipeetham.com/rushipeetham-store/

Mail: info@rushipeetham.org

బృందావనం

🔔🙏🙏నిజంగా జరిగిన కథ🙏🙏🔔

మధురా "బృందావనం" లో కొన్నేళ్ల క్రితం నిజంగా
జరిగిన సంఘటన, ఇది!
ఇప్పటికీ ఆ ఆనవాళ్లు' ఇంకా ఉన్నాయి,
పోయి చూడటానికి,!!🙏

ఒక పండితుడు ,తన పూరి గుడిసె లాంటి
ఇంటి ముందు అరుగు పై కూర్చుండి,,
నిత్యం భక్తులకు పురాణం వినిపిస్తూ ఉండేవాడు,!
క్రమం తప్పకుండా భక్తితో.
భక్తుల నుండి ఏమీ ఆశించకుండా వినిపిస్తూ ఉంటే,
ఆ ప్రాంతం వారు, చాలామంది వచ్చి శ్రద్ధగా వింటూ తన్మయం చెందే వాళ్ళు!!

అప్పుడప్పుడూ ,ఆయన తాను చెబుతున్న పురాణం మద్యలో అపి, లోనికి వెళ్ళి వస్తూ ,
మా పిల్లవాడికి స్నానం చేయించా నని
భోజనం పెట్టానని, పడుకో బెట్టాను అనీ
దుస్తులు ధరింప జేశానని చెప్పేవాడు,,
ఇలా రోజూ జరుగుతూ వుండేది,!
కానీ గుడిసె లో పిల్లవాడి అలికిడి, అల్లరి, మాట
ఏది ఎవరికీ వినపడేది కాదు,,
ఇలా ఏళ్లు గడిచాయి,,

ఒకరోజు ఆయన దేహం చాలించాడు,
గ్రామస్తులు చాలా బాధ పడ్డారు,,,
అయ్యో ! ఎంత మంచి వాడు,,,!
ఎంతో భక్తిశ్రద్ధలతో ఎవరిని ఏమీ అడగకుండా అద్భుతంగా భగవద్ కథలు వినిపించి మనలను
తరింపజేశాడే ,!
మరల ఎవరు ఇంత గొప్పగా చెబుతారు,
అంటూ విచారపడుతూ ,అందరూ అనుకోని
ఆయన అంత్యక్రియలు జరిపే సన్నాహాలు
చేయడం ప్రారంభించారు ,!!

మా అబ్బాయి అని చెప్పాడు కదా అంటూ ఆ పిల్లాడి కోసం లోనికి వెళ్లి చూస్తే ఎవరూ కనపడలేదు వారికి!!
ఒక రోజు ఎదురు చూశారు!, పిల్లాడి జాడ లేదు, !చివరకు వాళ్ళే అతడి కళేబరాన్ని యమునానది ఒడ్డుకు తీసుకెళ్ళి మంచి గంధపు కట్టెలతో చితిని ఏర్పాటు చేశారు!!
ఇక నిప్పు పెట్టడానికి వాళ్ళలో ప్రతీ వాడు,
నేను పెడతాను అంటే..నేను పెడతాను అంటూ
పోటీలు పడ్డారు !
ఎందుకంటే, మహా పుణ్యాత్ముడు ఆయనకు చేసే ఈ పని వల్ల కర్మ చేసేవారికి ఎంతో పుణ్యం వస్తుంది కదా .!
ఇలా వాళ్ళు పేచీ పడుతూ ఉంటే,
దూరం నుండి ఒక పిలుపు వినవచ్చింది వారికి,!
ఆగండి !! ఆగండి !!""అంటూ

అందరూ చూస్తుండగా, దూరంగా, ఒక పదహారేళ్ళ బాలుడు పరుగు పరుగున అటే వస్తూ కనిపించాడు
నేను మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నాను ,!
చనిపోయిన ఈ పెద్దాయన నా తండ్రి. !!
నన్ను ఒక పని మీద పొరుగూరు పంపించాడు,!!
అది చూసుకొని రావడంలో నాకు కొంత ఆలస్యం జరిగింది, !!
నన్ను క్షమించి ,దయచేసి నా తండ్రికి అగ్ని సంస్కారం చేసే భాగ్యాన్ని అనుగ్రహించండి !!
అని విచార వదనంతో అంటుంటే వారికి చాలా ఆనందం కలిగింది,,
చూశారా! రక్త సంబంధము బలం ఎలా ఉంటుందొ ,?? ఆయనకు తన కన్న కొడుకు చేత ఈ పని చేయించుకునే అదృష్టం ఉండగా, ఇతరులకూ ఆ అవకాశం ఉంటుందా??" అనుకుని సరే అన్నారు!

ఆ పిల్లవాడు చక్కగా వేద మంత్రాలు పఠిస్తూ,,
అంత్యేష్టి కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాడు,!!
చక్కని పాండిత్యం అందమైన,ఉచ్చారణ ,!
పనస లు చదువుతూ ఉంటే, పురోహితులు కూడా ఆశ్చర్య పోతున్నారు.!
 ఏమా వర్చస్సు?! ఏమా శాస్త్ర పరిజ్ఞానం ,??
ఇంతవరకూ ఎవరూ, కనీ వినీ ఎరుగని శాస్త్ర విది ప్రకారం చేస్తూ చివరకు చుట్టూ ప్రదక్షణ నమస్కారం చేస్తూ దుఖిస్తూు ,చితికి నిప్పు అంటించాడు,!,

నాయనా ! ఇక నీవు వెనుదిరిగి చూడకుండా దూరం వెళ్లు అన్నారు ఊరి పెద్దవాళ్ళు,!
ఆ పిల్లవాడు అలాగే అన్నట్టుగా తల ఊపి, 
నేరుగా వెళ్తుండడం, ఒక దాదాపుగా 20 గజాల దూరం వెళ్ళాక, కనిపించకుండా అంతర్ధానం కావడం వారు అందరూ కళ్ళారా చూశారు,,
తెలిసి పోయింది, ఆ వచ్చినవాడు ""కృష్ణయ్య ""
ఇన్నాళ్లూ విన్న భాగవత కథల పుణ్యమా అని,
శ్రీకృష్ణుని ఒక బాలుని రూపంలో ప్రత్యక్షంగా దర్శించే మహా భాగ్యం లభించింది కదా అంటూ ..
ఆ బాలుడు నడచిన నేలపై గల ధూళిని ప్రసాదం గా , మహదైశ్వర్యముగా స్వీకరించారు వారంతా,!
ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని పరమ పావనం గా పవిత్రంగా భావిస్తూ పూజిస్తూ ఉన్నారు బృందావనవాసులు!,

శ్రీకృష్ణుడు అదృశ్య రూపంలో కొలువై నెలవై ,
భక్తుల పాలిట కల్పతరువుగా అచట ఉంటున్నాడనుటకు నిదర్శనం ఈ వాస్తవ గాథ,,!!

మా అబ్బాయికి నిద్ర, అహారం, స్నానం ఏర్పాట్లు చేసి వస్తానని చెబుతూ శ్రీకృష్ణ భగవానుని తన కుమారునిగా భావిస్తూ అదే ధ్యాసతో,అంతిమ శ్వాసను విడిచిన
ఆ మహానుభావునికి కృష్ణుడు, కొడుకు రూపంలో వచ్చి, స్వయంగా కన్న తండ్రి కి కొడుకు చేస్తున్నట్టుగా ,
శాస్త్ర రీతిలో పద్ధతిగా చేశాడు.
అలా పరందాముడే స్వయంగా, అంతిమ క్రియలు చేయడం వాళ్ళు గమనించారు,,
భక్తుడు ,ఈ భవ బంధాలను కోరుకోకుండా ,
నేరుగా భగవంతునితో సంబంధబాంధవ్యాలు పెట్టుకొని , పంచుకుంటూ, పెంచుకుంటూ ముక్తిని పొందాడు,,!

ఈ రోజుల్లో ,,కడుపున పుట్టిన కొడుకులు కూడా దూరంగా ఉంటూ ,,తండ్రి ఆర్తితో పిలిచే పిలుపు కు అందక పోవచ్చు!!,
లేదా ఖాతరు చేయకుండా పోవచ్చు,,!!
కానీ పరమాత్ముడు మాత్రం తనను నమ్మిన భక్తుడిని ,
సదా సంరక్షిస్తూ, అతడి యోగక్షేమాలు స్వయంగా చూస్తుంటాడు!!
ఇలా భగవంతునికి భక్తునికి ఉండే సంబంధం మాటలకు, ఊహకు, చేతలకు , అందదు!!
భావాగ్రాహి జనార్దనా !" అంటే భక్తుని అంతరంగం లో కదిలే భావాలను జనార్ధనుడు సదా గ్రహిస్తూ, ఉంటాడు..!!
ఆ ప్రేమానుబంధం అనిర్వచనీయం,!, అద్భుతం కూడా, !!అలాంటి బ్రహ్మానంద భక్తి సామ్రాజ్యము ఆ బృందావనం,;!
ఆఅందాల ఆనందాల అనుబంధాల బృందావన వనసీమలో ఒక రేణువుగా మారితే ఎంత బాగా ఉండేది !

నిత్యం అచట సంచరించే సాక్షాత్తూ రాధాకృష్ణుల మృదువైన పాదములు సుతి మెత్తగా సోకుతూ ఉండగా, కలిగే పరమానందాన్ని,,అఖండ ఐశ్వర్య విభూతి వైభవాన్ని అందించమని నల్లనయ్య ను కోరుకుందాం!!   

          ️స్వస్తి..
   :జై శ్రీ రాధే! జై జై శ్రీ రాధే!
  రాధాకృష్ణులకు జై! బృందావన విహారీ కి
జై హరే కృష్ణ హరే కృష్ణా!

 కృష్ణయ్య తండ్రి అందరిని చల్లగా చూడయ్యా ..🙏🌹🎻

రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ?

🙏బెంగుళూరు లోని ఓ ఇంటి ముందు
తిరుమల తిరుపతి కార్యనిర్వహణాధికారి
శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు..కారులోంచి దిగారు.
లోపలికి వెళ్ళి చూస్తే..అంతా నిశ్శబ్దం.
మంచం మీద ఓ వృద్ధుడు నిస్తేజంగా
పడుకుని ఉన్నారు. చుట్టూ ఎవరెవరో వున్నారు.
ప్రసాద్ తాను వచ్చిన పని గురించి చెప్పారు.
అందులో ఓ వ్యక్తి ఆసక్తిగా ముందుకు వచ్చి..
నాన్నగారు వారం నుంచి కోమాలో వున్నారు,
అంటూ ప్రసాద్ గారిని మంచం దగ్గరకు
తీసుకుపోయి..ఆ వృద్ధుని చెవిలో
"నాన్నగారూ..నాన్నగారూ" అంటూ పిలిచాడు.
సమాధానం లేదు. ఈ సారి చెవి దగ్గరగా..
"మీ కోసం తిరుమల నుండి ప్రసాదం వచ్చింది"
అన్నాడు. అప్పుడు తెరుచుకున్నాయి..
ఆ వృద్ధుని కళ్ళు. అర్ధ నిమీలిత నేత్రాలతో
ఆయన ప్రసాద్ వంక, ఆయన చేతిలోని ప్రసాదం
వంక చూస్తున్నాడు. ప్రసాద్ వెళ్లి ఆయన మెడలో
శ్రీవారి డాలర్ హారం అలంకరించి, శాలువా కప్పి,
శ్రీవారి ప్రసాదాన్ని ఆయన చేతిలో ఉంచారు..

"మిమ్ము స్వామి వారి ఆస్థాన విద్వాంసునిగా
నియమిస్తున్నాము" అని నియామక పత్రాన్ని
ఆయనకు అందించారు. ఆ వృద్ధుని కళ్ళు
వాటి వంక చూశాయి..కళ్ళనుంచి
నీళ్లు కారుతున్నాయి.పెదాలు వణుకుతున్నాయి.
ఏవో మాటలు వినిపిస్తున్నాయి.
ఏదీ అర్ధం కావడం లేదు.
ఆఖరు మాట ఒక్కటే అందరికీ వినిపించింది..

"స్వామీ! ఇన్నాళ్లకు నా మీద దయకలిగిందా?"
అంటూ..తన చేతనున్న వాటిని తడుముకుంటూ..
అనిర్వచనీయ అనుభూతిని అనుభవిస్తూన్నాడు.
స్వామి వారి కరుణ లభించింది.ఇక తన
జీవితానికి విముక్తి లభించిందన్నట్లు మరో
పది నిముషాల తరువాత....
"రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి ప్రాణాలు
అనంత వాయువుల్లో కలిసిపోయాయి!
అందరికీ అదో అద్భుతం,అనిర్వచనీయం!

ఎవరీ..రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ?

శ్రీనివాసునిపై అన్నమయ్య రాసిన కీర్తనలు
30 వేలకు పైగా ఉన్నాయి. అప్పటి పాలకులు
అన్నమయ్య కీర్తనలను తాళపత్రాలపై
చెక్కించారు. వాటిని స్వామి వారి ఆలయంలో
నిక్షిప్తం చేశారు. 20వ శతాబ్దంలో ఆలయ
నిర్వహణప్పుడు..ఇవి బయటపడ్డాయి.
ఆ తాళపత్రాలను గ్రంధ రూపంలోకి తెచ్చి,..
"జో అచ్యుతానంద..జోజో ముకుందా"
అని మనం పాడుకోగలుగుతున్నామంటే..
ఆ కృషికి కారకులు..'వేటూరి ప్రభాకర శాస్త్రి,
రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు!

ఓ రోజు సంగీత సమావేశం ముగిశాక..
అన్నమాచార్య ప్రాజెక్ స్పెషల్ ఆఫీసర్
కామిశెట్టి శ్రీనివాసులు..ప్రసాద్ గారితో..
సర్! రేపు మీరు బెంగుళూరు వెళుతున్నారు.
రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ గారు ప్రస్తుతం
అక్కడే ఉన్నారు. అన్నమయ్య కీర్తనలను
జనబాహుళ్యంలోకి తీసుకు రావడానికి
ఆయన కృషి ఎంతో ఉంది. ఆయన
సమకాలికులకు అన్ని గుర్తింపులు లభించాయి.
కానీ రాళ్లపల్లి వారికి మాత్రం అన్యాయం జరిగింది.
ఆయనను మీరు కలిస్తే బాగుంటుంది" అన్నారు.

పివిఆర్కే ప్రసాద్ చాలా సేపు ఆలోచించి
ఓ నిర్ణయానికి వచ్చారు. డిప్యూటీ ఈ.ఓ.ని పిలిచి..
ఉదయానికల్లా..రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని
ఆస్థాన విద్వాంసునిగా నియామక పత్రం,
శ్రీవారి గోల్డ్ డాలర్,శాలువా, ప్రసాదం
అక్షింతలు వగైరా సిద్ధం చేయండి అన్నారు!
డెప్యూటీ ఈ.ఓ.అవాక్కయ్యాడు.
"సర్! అలా నియమించే అధికారం మీ
పరిధిలోనిది కాదు.బోర్డు ఓ కమిటీని నియమించి,
ఆ కమిటీ ఎంపిక చేసిన వారిని మాత్రమే
బోర్డు నియమిస్తుంది. రూల్స్ కు విరుద్ధంగా
అలా చేస్తే మీ మీద ఏ చర్యలైనా తీసుకునే
అధికారం బోర్డుకు ఉంటుంది.అవసరమైతే
మిమ్ము ప్రభుత్వానికి సరెండర్ చేయొచ్చు
అన్నాడు..
అయినా ప్రసాద్ గారు వినలేదు.
వెంటనే నేను చెప్పినట్లు చేయండి..అన్నారు!
అలాగే అన్నీ సిద్ధం అయిపోయాయి.
అవి తీసుకుని బెంగుళూరు బయలుదేరారు
పివిఆర్కే ప్రసాద్ గారు. బెంగుళూరులో ఆఖరు
క్షణాలలో..వాటిని రాళ్లపల్లి వారికి సమర్పించడం.
దాని కోసమే ఆయన ఎదురుచూస్తున్నట్లుగా..
ఆ శుభ సందేశం అందుకోగానే ఆయన
స్వర్గస్థులవడం జరిగిపోయాయి!
            * * *
టిటిడి బోర్డు మీటింగ్ హాలు..వాతావరణం
సీరియస్ గా వుంది. జరిగిందంతా చెప్పి
ప్రసాద్ గారు నిశ్శబ్దంగా కూర్చున్నారు.
"ప్రసాద్ గారూ - మీరు చేసినది చాలా పెద్ద
తప్పిదం. రూల్స్ కు విరుద్ధం" అన్నాడో సభ్యుడు.
మీ మనసుకు ఏది తోస్తే అది చేసెయ్యడానికి
ఇక బోర్డు ఎందుకు? అన్నారు మరొకరు.
ఎవరికి తోచింది వారు మాట్లాడారు. చివరిలో
అందరూ చైర్మన్ నాగిరెడ్డిగారి వంక చూశారు.
ఆయన చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వారు!
"స్వామి వారికి బోర్డు చైర్మన్ నుండి..సాధారణ
యాత్రికుడి వరకూ అందరూ సమానం. ఆయన
సమస్త జీవరాసులను సమానంగా ప్రేమిస్తాడు.
ఎవరిని ఎప్పుడు, ఎక్కడ ఆదుకోవాలో
అప్పుడు ఏదో ఒక రూపంలో ఆదుకుంటాడు.
ఆయన లీలలు అలా ఉంటాయి. రాళ్లపల్లి వారిని
జీవన చరమాంకంలో సంతోష పెట్టేందుకే ప్రసాద్
గారిని అలా తరుముతున్నట్లు బెంగుళూరు
పంపించాడేమో? అని నేను భావిస్తున్నాను.

ఈ రూల్సు అన్నీ ప్రసాద్ గారికి తెలియనివి కావు.
రాళ్లపల్లివారికి ఎప్పుడో జరగవలసిన సత్కారం
అప్పుడు జరగలేదు.ఇప్పుడు మనకు భగవంతుడు
కల్పించిన అవకాశంగా నేను భావిస్తున్నాను!
ప్రసాద్ గారి చర్యకు ఆమోదం తెలుపుతున్నాను.
అన్నాడు. అంతా నిశ్శబ్దం. నాగిరెడ్డిగారి
తీర్మానాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఎన్నో చిత్రాలలో..కథలను మలుపులు తిప్పి,
ఉత్కంఠ రేకెత్తించి, ముగింపులో ఓ సందేశంతో
ప్రేక్షకులను ఇంటికి పంపే విజయాధినేత
నాగిరెడ్డిగారు..ఈ సమస్యకు ఒక్క చిరునవ్వుతో
ముగించిన ఆయన స్థితప్రజ్ఞతకు మనసులోనే
కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ప్రసాద్ గారు!

🌷🙏నారాయణ🙏🌷

ఆత్మ స్థైర్యాన్ని మించింది లేదు

కుహనా ఆర్ధిక వేత్తలు విదేశీ ఎంగిలి మెతుకు లకు ఆశపడి మన ఆర్ధిక వ్యవస్థపై లేని పోని భయాలు సృష్టిస్తూ బతుకు చున్నారు యిలాంటివారు కరోనాలవ్ల ఆర్ధిక వ్యవస్ధ ఏమీ కాదు తెలుసుకోండి అఙ్ఞానులారా. భగవంతుడు యింత మెతుకులు పండే లక్షణాన్ని యీ భరత గడ్డ పై వేదకాలం నుండి సృష్టించి మనకు సూత్రములద్వారా ఎంత సింపుల్ గా బ్రతకవచ్చ్ో చెప్ప నది. అందువలన మనందరి మనం పరిపాలన చేసుకోవచ్చు ఎవరో వీశేలానుండి నేర్చుకుని బ్రతుకు గడిపే ఖర్మ ఎప్పుడూ భారత్ కి పట్టదు. యిక్కడ కల విజ్ఞానం చూసి ఎవరైనా తెలుసుకోవాలి తప్ప మనకి అవసరం లేదు. ఎన్నో సంవత్సరాలనుండి ఎన్నో వడిదుడుకలకు తట్టుకుని జాతి నిలబడింది వర్క్ హిందువు కనుక నిలబడితే యీ సనాతన ధర్మం లక్షల సంవత్సరాల వరకు నిలబడి వుంటుంది స్వదేశీ వస్తువుల వల్ల మనకి నష్టం లేదు ఎందుకంటే అవి మన సనాతన ధర్మం. గుక్కెడు నీళ్ళు తాగి కూడా అవసరమైతే బ్రతుక వచ్చు గుప్పెడు మెతుకులు తిని కూడా వ్యవస్థ ను కాపాడ వచ్చు.


తెలుగుతేనియలు*

*

శివా..చూస్తూనే ఉన్నాను
నీవు చేయు చిద్విలాసాలు
నిమిత్త మాత్రుడనైన నాకు
ఎందుకు? ప్రతికూల పరిస్థితులు.

క్షణికమైన ఆవేశాలకు
కలతజెందే ఈమనసుకి
క్షరమైన జీవితములోన
ఎందులకీ కోపతాపాలు.

మనిషిగ జన్మనిచ్చినావు
కర్మఫలము కానుకజేసి
మనస్సొక్కటి ఇచ్ఛినావు
అంతరాత్మనాలకింపజేసి.

సృష్టి రహస్య విశేషాలు

🕉🕉🕉🕉

1 సృష్టి ఎలా ఏర్పడ్డది
.
2 సృష్టి కాల చక్రం ఎలా నడుస్తుంది
.
3 మనిషిలో ఎన్ని తత్వాలున్నాయి
.
( సృష్ఠి ) ఆవిర్బావము
.
1 ముందు (పరాపరము) దీనియందు శివం పుట్టినది
2 శివం యందు శక్తి
3 శక్తి యందు నాదం
4 నాదం యందు బిందువు
5 బిందువు యందు సదాశివం
6 సదాశివం యందు మహేశ్వరం
7 మహేశ్వరం యందు ఈశ్వరం
8 ఈశ్వరం యందు రుద్రుడు
9 రుద్రుని యందు విష్ణువు
10 విష్ణువు యందు బ్రహ్మ
11 బ్రహ్మ యందు ఆత్మ
12 ఆత్మ యందు దహరాకాశం
13 దహరాకాశం యందు వాయువు
14 వాయువు యందు అగ్ని
15 ఆగ్ని యందు జలం
16 జలం యందు పృద్వీ.
పృద్వీ యందు ఓషధులు
17 ఓషదుల వలన అన్నం
18 ఈ అన్నము వల్ల నర మృగ పశు పక్షి స్థావర జంగమాదులు పుట్టినవి.

.
( సృష్ఠి ) కాల చక్రం
.
పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది.
ఇప్పటివరకు ఏంతో మంది శివులు ఏంతోమంది విష్ణువులు ఏంతోమంది బ్రహ్మలు వచ్చారు ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.
1 కృతయుగం
2 త్రేతాయుగం
3 ద్వాపరయుగం
4 కలియుగం
నాలుగు యుగలకు 1 మహయుగం.
71 మహ యుగలకు 1మన్వంతరం.
14 మన్వంతరాలకు ఒక సృష్ఠి ఒక కల్పం.
15 సందులకు ఒక ప్రళయం ఒక కల్పం
1000 యుగలకు బ్రహ్మకు పగలు సృష్ఠి . 
1000 యుగాలకు ఒక రాత్రి ప్రళయం.
2000 యుగాలకు ఒక దినం.
బ్రహ్మ వయస్సు 51 సం.
ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.
1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.
7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.
14 మంది మనువులు.
ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం. శ్వేతవారహ యుగంలో ఉన్నాం.
5 గురు భాగన కాలంకు 60 సం
1 గురు భాగన కాలంకు 12 సం
1 సంవత్సరంకు 6 ఋతువులు.
1 సంవత్సరంకు 3 కాలాలు.
1 రోజుకు 2 పూటలు పగలు రాత్రి
1 సం. 12 మాసాలు.
1 సం. 2 ఆయనాలు
1సం. 27 కార్తెలు
1 నెలకు 30 తిధులు
27 నక్షత్రాలు - వివరణలు
12 రాశులు
9 గ్రహాలు
8 దిక్కులు
108 పాదాలు
1 వారంకు 7 రోజులు
పంచాంగంలో 1 తిధి. 2 వార. 3 నక్షత్రం. 4 కరణం. 5 యోగం.
.
సృష్ఠి యవత్తు త్రిగుణములతోనే ఉంటుంది
.
 దేవతలు జీవులలో చేట్లు అన్ని వర్గలలో మూడే గుణములు ఉంటాయి
1 సత్వ గుణం
2 రజో గుణం
3 తమో గుణం
.
( పంచ భూతంలు అవిర్బావాం )
,
1 ఆత్మ యందు ఆకాశం
2 ఆకాశం నుండి వాయువు
3 వాయువు నుండి అగ్ని
4 అగ్ని నుండి జలం
5 జలం నుండి భూమి అవిర్బవించాయి.
.
5 ఙ్ఞానింద్రియంలు
5 పంచ ప్రాణంలు
5 పంచ తన్మాత్రలు
5 ఆంతర ఇంద్రియంలు
5 కర్మఇంద్రియంలు = 25 తత్వంలు
.
1 ( ఆకాశ పంచికరణంలు )
.
ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల ( జ్ఞానం )
ఆకాశం - వాయువులో కలవడం వల్ల ( మనస్సు )
ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల ( బుద్ది )
ఆకాశం - జలంతో కలవడంవల్ల ( చిత్తం )
ఆకాశం - భూమితో కలవడంవల్ల ( ఆహంకారం ) పుడుతుతున్నాయి

2( వాయువు పంచికరణంలు )
.
వాయువు - వాయువుతో కలవడం వల్ల ( వ్యాన)
వాయువు - ఆకాశంతో కలవడంవల్ల ( సమాన )
వాయువు - అగ్నితో కలవడంవల్ల ( ఉదాన )
వాయువు - జలంతో కలవడంవల్ల ( ప్రాణ )
వాయువు - భూమితో కలవడంవల్ల ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.

3 ( అగ్ని పంచికరణములు )
.
అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల ( శ్రోత్రం )
అగ్ని - వాయువుతో కలవడంవల్ల ( వాక్కు )
అగ్ని - అగ్నిలో కలవడంతో ( చక్షువు )
అగ్ని - జలంతో కలవడంతో ( జిహ్వ )
అగ్ని - భూమితో కలవడంతో ( ఘ్రాణం ) పుట్టేను.

4 ( జలం పంచికరణంలు )
.
జలం - ఆకాశంలో కలవడంవల్ల ( శబ్దం )
జలం - వాయువుతో కలవడంవల్ల ( స్పర్ష )
జలం - అగ్నిలో కలవడంవల్ల ( రూపం )
జలం - జలంలో కలవడంవల్ల ( రసం )
జలం - భూమితో కలవడం వల్ల ( గంధం )పుట్టేను.

5 ( భూమి పంచికరణంలు )
.
భూమి - ఆకాశంలో కలవడంవల్ల ( వాక్కు )
భూమి - వాయువుతో కలవడం వల్ల ( పాని )
భూమి - అగ్నితో కలవడంవల్ల ( పాదం )
భూమి - జలంతో కలవడంతో ( గూహ్యం )
భూమి - భూమిలో కలవడంవల్ల ( గుదం ) పుట్టేను.
.
( మానవ దేహ తత్వం ) 5 ఙ్ఞానింద్రియంలు
.
1 శబ్ద
2 స్పర్ష
3 రూప
4 రస
5 గంధంలు.
.
5 ( పంచ తన్మాత్రలు )
.
1 చెవులు
2 చర్మం
3 కండ్లు
4 నాలుక
5 ముక్కు
.

5 ( పంచ ప్రాణంలు )
,
1 అపాన
2 సామనా
3 ప్రాణ
4 ఉదాన
5 వ్యాన
.
5 ( అంతఃర ఇంద్రియంలు ) 5 ( కర్మఇంద్రియంలు )
,
1 మనస్సు
3 బుద్ది
3 చిత్తం
4 జ్ఞానం
5 ఆహంకారం
.
1 వాక్కు
2 పాని
3 పాదం
4 గుహ్యం
5 గుదం
.
6 ( అరిషడ్వర్గంలు )
,
1 కామం
3 క్రోదం
3 మోహం
4 లోభం
5 మదం
6 మచ్చార్యం
.
3 ( శరీరంలు )
,
1 స్థూల శరీరం
2 సూక్ష్మ శరీరం
3 కారణ శరీరం
.
3 ( అవస్తలు )
,
1 జాగ్రదవస్త
2 స్వప్నవస్త
3 సుషుప్తి అవస్త
.
6 ( షడ్బావ వికారంలు )
,
1 ఉండుట
2 పుట్టుట
3 పేరుగుట
4 పరినమించుట
5 క్షిణించుట
6 నశించుట
.
6 ( షడ్ముర్ములు )
,
1 ఆకలి
2 దప్పిక
3 శోకం
4 మోహం
5 జర
6 మరణం

.7 ( కోశములు ) ( సప్త ధాతువులు )
,
1 చర్మం
2 రక్తం
3 మాంసం
4 మేదస్సు
( తరువాయి భాగం )👇👇👇👇
5.మజ్జ
6.ఎముకలు
7 శుక్లం
.
3 ( జీవి త్రయంలు )
,
1 విశ్వుడు
2 తైజుడు
3 ప్రఙ్ఞాడు
.
3 ( కర్మత్రయంలు )
,
1 ప్రారబ్దం కర్మలు
2 అగామి కర్మలు
3 సంచిత కర్మలు
.
5 ( కర్మలు )
,
1 వచన
2 ఆదాన
3 గమన
4 విస్తర
5 ఆనంద
.
3 ( గుణంలు )
,
1 సత్వ గుణం
2 రజో గుణం
3 తమో గుణం
.
9 ( చతుష్ఠయములు )
,
1 సంకల్ప
2 అధ్యాసాయం
3 ఆభిమానం
4 అవధరణ
5 ముదిత
6 కరుణ
7 మైత్రి
8 ఉపేక్ష
9 తితిక్ష
.
10 ( 5 పంచభూతంలు పంచికరణ చేయనివి )
      ( 5 పంచభూతంలు పంచికరణం చేసినవి )
.
1 ఆకాశం
2 వాయువు
3 ఆగ్ని
4 జలం
5 భూమి
.
14 మంది ( అవస్థ దేవతలు )
,
1 దిక్కు
2 వాయువు
3 సూర్యుడు
4 వరుణుడు
5 అశ్వీని దేవతలు
6 ఆగ్ని
7 ఇంద్రుడు
8 ఉపేంద్రుడు
9 మృత్యువు
10 చంద్రుడు
11 చతర్వకుడు
12 రుద్రుడు
13 క్షేత్రజ్ఞుడు
14 ఈశానుడు
.
10 ( నాడులు ) 1 ( బ్రహ్మనాడీ )
,
1 ఇడా నాడి
2 పింగళ
3 సుషుమ్నా
4 గాందారి
5 పమశ్వని
6 పూష
7 అలంబన
8 హస్తి
9 శంఖిని
10 కూహు
11 బ్రహ్మనాడీ
,
10 ( వాయువులు )
,
1 అపాన
2 సమాన
3 ప్రాణ
4 ఉదాన
5 వ్యానా
.
6 కూర్మ
7 కృకర
8 నాగ
9 దేవదత్త
10 ధనంజమ
.
7 ( షట్ చక్రంలు )
,
1 మూలాధార
2 స్వాదిస్థాన
3 మణిపూరక
4 అనాహత
5 విశుద్ది
6 ఆఙ్ఞా
7 సహస్రారం
.
( మనిషి ప్రమాణంలు )
,
96 అంగళంలు
8 జానల పోడవు
4 జానల వలయం
33 కోట్ల రోమంలు
66 ఎముకలు
72 వేల నాడులు
62 కీల్లు
37 మురల ప్రేగులు
1 సేరు గుండే
అర్ద సేరు రుధిరం
4 సేర్లు మాంసం
1 సరేడు పైత్యం
అర్దసేరు శ్లేషం
.
( మానవ దేహంలో 14 లోకలు ) పైలోకలు 7
,
1 భూలోకం - పాదాల్లో
2 భూవర్లలోకం - హృదయంలో
3 సువర్లలోకం - నాభీలో
4 మహర్లలోకం - మర్మంగంలో
5 జనలోకం - కంఠంలో
6 తపోలోకం - భృమద్యంలో
7 సత్యలోకం - లాలాటంలో
.
అధోలోకలు 7
.
1 ఆతలం - అరికాల్లలో
2 వితలం - గోర్లలో
3 సుతలం - మడమల్లో
4 తలాతలం - పిక్కల్లో
5 రసాతలం - మొకల్లలో
6 మహతలం - తోడల్లో
7 పాతాళం - పాయువుల్లో
.
( మానవ దేహంలో సప్త సముద్రంలు )
,
1 లవణ సముద్రం - మూత్రం
2 ఇక్షి సముద్రం - చేమట
3 సూర సముద్రం - ఇంద్రియం
4 సర్పి సముద్రం - దోషితం
5 దది సముద్రం - శ్లేషం
6 క్షిర సముద్రం - జోల్లు
7 శుద్దోక సముద్రం - కన్నీరు
.
( పంచాగ్నులు )
,
1 కాలగ్ని - పాదాల్లో
2 క్షుదాగ్ని - నాభీలో
3 శీతాగ్ని - హృదయంలో
4 కోపాగ్ని - నేత్రంలో
5 ఙ్ఞానాగ్ని - ఆత్మలో
.
7 ( మానవ దేహంలో సప్త దీపంలు )
,
1 జంబు ద్వీపం - తలలోన
2 ప్లక్ష ద్వీపం - అస్తిలోన
3 శాక ద్వీపం - శిరస్సుప
4 శాల్మల ధ్వీపం - చర్మంన
5 పూష్కార ద్వీపం - గోలమందు
6 కూశ ద్వీపం - మాంసంలో
7 కౌంచ ద్వీపం - వేంట్రుకల్లో
.
10 ( నాధంలు )
,
1 లాలాది ఘోష - నాధం
2 భేరి - నాధం
3 చణీ - నాధం
4 మృదంగ - నాధం
5 ఘాంట - నాధం
6 కీలకిణీ - నాధం
7 కళ - నాధం
8 వేణు - నాధం
9 బ్రమణ - నాధం
10 ప్రణవ - నాధం
🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏

*తలపై శిఖ ఎందుకు?*



తలపైఉండే జుట్టుముడినే శిఖ అనీ, *చూడా* అనీ అంటారు. చిన్నపిల్లలకు చేసే ఈ సంస్కారాన్నే *చూడాకరణం* అనీ, చేలమని పిలుస్తారు.

మన శరీరం ఒక విద్యుత్ కేంద్రం. దీనిలోని విద్యుత్ ఉత్పాదనలో ఎక్కువ తక్కువలొచ్చి ఆరోగ్యానికి భంగం వాటిల్లే అవకాశం ఉంది.

ఉపనయన సమయంలో, మంత్రోపదేశం చేసేటప్పుడు విద్యుత్ పెరిగిపోకుండా ఆయుష్కర్మ (వపనం=క్షురకర్మ) చేసి, పిలక పెట్టడం వల్ల విద్యుత్తు కొంతతగ్గి, శిరస్సుకు రక్షణ ఏర్పడుతుంది.

శిఖ అరచేతి అంత, గోష్పాదమంత ఉండాలని శాస్త్రం. పంచశిఖల్ని ఉంచుకోవడం వల్ల వివేకం, ధృఢత్వం, దూరాదర్శనం, దయ, నిగ్రహం కలుగుతాయి.

*సదోపవీతి నా భావ్యం, సదాబుద్ధ శిఖేనచ, విశిఖో వ్యుపవీతశ్చయ త్కరోతి నతత్కృతమ్* అంటే శిఖలేనివాడు, జందెం లేనివాడు చేసిన ధర్మకార్యాలు ఫలమునివ్వవు అని బోధాయనవచనం.

శిరస్సుపై బ్రహ్మ రంద్రముంటుంది. ఆ సహస్రారమే ఆత్మకు కేంద్రస్థానం. ఇక్కడే సాత్విక ఆధ్యాత్మిక శక్తులుంటాయి. వీటిని రక్షించుకోవడానికి ఆవుడెక్కంత పిలక ఉంచుకోవాలి. శిఖ తీసేస్తే కామవికారం పెరుగుతుంది.

కాబట్టే మునులు, బ్రహ్మచార్యులు, యోగులు, గర్భిణీ స్త్రీ భర్తలు జడలు, గడ్డాలు పెంచి ఇంద్రియ నిగ్రహం అలవరచుకునేవారు.
                                 స్వస్తి!

ధర్మానికి మూలం వేదం



మానవ సౌభాగ్యానికి, కల్యాణప్రదమైన జీవనానికి ప్రాచీన కాలం నుంచి వేదాలు అనేక రకాలుగా సృజనాత్మకతను జోడిస్తున్నాయి. వేదం దేవకావ్యం. అపౌరుషేయం. పరమాత్మచే అనుగ్రహించబడి మహర్షుల హృదయ మందిరములో అనుక్షణం ప్రకాశించే దివ్యజ్యోతి.

‘‘దేవస్య పశ్య కావ్యం న మమార న జీర్యతి’’
దేవుడు సృజియించిన కావ్యమైన వేదం నశించదు. జీర్ణం కాదు. వేదాలు మానవజాతికి ప్రప్రథమ శాస్త్రంగా గణుతికెక్కాయి. సంపూర్ణ జీవనానికి బీజరూపమైన వేదాలు ఉజ్జ్వలమైన జ్ఞాన నిధులు. పరమ సత్యమైన విద్యకు మూలమైవి వేదాలే. కార్యకారణబద్ధమైన ప్రకృతి, పరమాత్మ, జీవాత్మల స్వరూప స్వభావాలు వేదాల వల్ల అవగతమవుతాయి. సమస్త సృష్టి విజ్ఞానానికి కారణము తెలియజెప్పే అమోఘ ఆయుధం వేదాలు. వేదోఖిలో ధర్మమూలం.. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం సమస్త ధర్మాలకూ మూలం.

‘ఏక ఏవ నమస్యః విక్ష్వీడ్యః’
..అంటూ వేదాలలో ఏకేశ్వరవాదము చాలా గొప్పగా, విశుద్ధ గంభీరంగా చెప్పబడింది. వేదములను ధరించి విశ్వమంతటా ఒకే భగవంతుడు వ్యాపించాడు. అలాగే, వేదాలలో రుషుల ప్రస్తావన ఎంతో హృద్యమైనది. వారికి వేదాలే ప్రమాణాలు. సాహిత్య ప్రపంచంలో ఎట్టి ప్రక్రియలోనైనా వేదం లేని అంశమే లేదు. ఇతిహాసాలు, పురాణాలు, రామాయణ, భారత, భాగవతాదులు, భగవద్గీత మున్నగు ధార్మిక గ్రంథాలు పలికే వేద ఘోష అమూల్యం.

వేదాలతో పాటు.. యాజ్ఞవల్క్య స్మృతి, అత్రిస్మృతి, మనుస్మృతి.. ఇలా మనకు అనేక స్మృతులున్నాయి. అయితే.. శృతి (వేదం), స్మృతులలో విభేదం పొడసూపినపుడు శృతినే ప్రమాణంగా తీసుకోవాలి. వేదమే శబ్దానికి, ఆప్తునికి ప్రమాణం. ఆప్తుడనగా పరమాత్మ. వేదవిజ్ఞానం మృత్యుభయాన్ని పోగొడుతుంది. ముణ్డకోపనిషత్తు ప్రకారం వేదాలు పరమాత్మ నుంచే ఆవిర్భవించాయి. కనుక అవి సృష్టికి, సృష్టి విజ్ఞానానికి చక్కటి ప్రమాణాలు, సనాతన ధర్మానికి మూలం.

చదువు మానేసా




కొత్త తరహా సైబర్

*జాగ్రత్త..కొత్త తరహా సైబర్ నేరం వెలుగులోకి!!*

దాదాపు మన మొబైల్ నెంబర్ తో పోలి ఉన్న నెంబర్ తోనే లేదా ఏదో ఒక నెంబర్ నుండి మనకు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ సారాంశం ఏమంటే..

అయ్యా.. నేను ఉద్యోగం/ లేదా ఎదో రిజిస్ట్రేషన్ నిమిత్తం నా నెంబర్ కి బదులు పొరపాటున మీ నెంబర్ ఇచ్చేశాను..ఇప్పుడు మీ మొబైల్ కి నా మొబైల్ కి రావాల్సిన OTP వస్తుంది. కాస్తా ఆ OTP నాకు చెప్పండి ప్లీజ్ అలా ఐతే నాకు మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు అంటూ ఎంతో రిక్వెస్ట్ మానర్ లో ఆ కాల్ ఉంటుంది. ఒకవేళ మనం వాళ్ళకు ఆ OTP చెప్పామా మన అకౌంట్ లో డబ్బు గోవిందా..!

వాడు ఆ OTP ని ఉపయోగించి మన ఆన్లైన్ బ్యాంకింగ్ ని వాడి అధీనంలోకి తెచ్చుకుంటాడు. కాబట్టి మన ఫోన్ కు ఎలాంటి OTP లు వచ్చినా కూడా అవి ఇతరులకు చెప్పనవసరం లేదని గుర్తుంచుకోండి..

                     
          ఇట్లు
         *పోలీసు శాఖ*

**శివానందలహరి**

*దశిక రాము**

**శివానందలహరి**
4 వ శ్లోకం

" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"

అవతారిక:
సర్వ దేవతల కంటే శివుడు గొప్పవాడని తలచి, శివుని పాద సేవ
చేసే భాగ్యం తనకు కల్గింౘమని ఆ శివుణ్ణి శంకరులు యాచిస్తున్నారు.

శ్లో" **సహస్రం వర్తంతే,**

**జగతి విబుధాః **

**క్షుద్ర ఫలదాః**

**నమన్యే స్వప్నేవా**

**తదనుసరణం తత్కృత ఫలమ్.**

**హరిబ్రహ్మాదీనా మపి **

**నికట భాజా మసులభం**

**చిరం యాచే శంభో** _

**శివ తవపదాంభోజ భజనమ్** !!

పదవిభాగం:
సహస్రం వర్తంతే, జగతి _విబుధాః _ క్షుద్ర ఫలదాః _ న మన్యే, స్వప్నే _
వా_ తదనుసరణం _ తత్కృత ఫలమ్ _ హరిబ్రహ్మాదీనామ్ _ అపి_
నికటభాజామ్ _ అసులభం _ చిరం _ యాచే _ శంభో _ శివ _ తవ
_ పదాంభోజ భజనమ్.

తాత్పర్యం:
ఓ శంభూ! మహాదేవా! జగత్తులో స్వల్పమైన ఫలములను ఇచ్చే
దేవతలు, ఎందరో ఉన్నారు. వారిని అనుసరింౘడం కానీ, వారిచ్చే
ఫలములను కానీ, నేను కలయందు కూడా స్మరింపను. ( పగటి వేళ
స్మరింపనని వేరుగా చెప్పనక్కఱలేదు) ఎల్లప్పుడు నూ, నీ సన్నిధానంలో నే
ఉండే విష్ణుమూర్తి, బ్రహ్మవంటి దేవతలకు కూడా దొరకని మీ పాదసేవను
శాశ్వతంగా వేడుకుంటాను. మిమ్మల్ని పదేపదే వేడుకుంటున్నాను.
ఇతర దేవతలు క్షణికములైన భోగాది ఫలములను ఇస్తారు. నీవు ఒక్కడివే,
పునరావృత్తి రహితమైన, మోక్షపదవిని ఈయగలవాడవు. అందుచే వారిచ్చే
ఫలమును కోరక, నీ పాదపద్మముల సేవనే నేను యాచిస్తాను.

వివరణ:
బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనవారు, ౘావు పుట్టుకలు గలవారు. వారు
క్షుద్రఫలదులు. కాబట్టి వారిచే ఫలములను తాను కోరననీ, జననమరణాలు
లేని మహాదేవునే సేవిస్తాననీ, శంకరులు ఈ శ్లోకం లో చెప్పారు. శంకరుని
పాదపద్మ సేవనే తాను యాచిస్తున్నానని చెప్పారు. మోక్షము కన్నా శివపాద సేవ
గొప్పదని ఫలితార్థం.
🙏🙏🙏

**ధర్మము - సంస్కృతి**
🙏🙏🙏
https://chat.whatsapp.com/EYVSW5i6Q1O1973h8txkPS

**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**

శక్తిపీఠ్ శ్రీ దేవికూప్ భద్రకాళి మందిరం*



సతీదేవి తండ్రి దక్షప్రజాపతి ఆమె భర్త పరమేశ్వరుణ్ని ఆహ్వానించకుండా యాగం చేస్తాడు. ఎందుకిలా చేశావని ప్రశ్నించిన కూతురిని అవమానిస్తాడు. సహించలేని ఆమె యజ్ఞ గుండంలో దూకి అగ్నికి ఆహుతై పోతుంది. ఆగ్రహోదగ్రుడైన పరమేశ్వరుడు వీరభద్రుణ్ని సృష్టించి యాగాన్ని భగ్నం చేయిస్తాడు. విరాగిలా మారి భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని తిరుగుతుంటాడు. ఈశ్వరుడు తన కర్తవ్యాన్ని మరచి బాధతో అలా తిరుగుతుండటం వల్ల సృష్టి లయ తప్పుతుందని భావించిన శ్రీమహావిష్ణువు సతీదేవి దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. ఆ ముక్కలన్నీ వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడతాయి. అమ్మవారి సతి యొక్క కుడి చీలమండ పడిపోయిందని నమ్ముతారు. 

**రామేశ్వరం ఆలయం**

దశిక రాము**

**మన సంస్కృతి సాంప్రదాయాలు**

🌹🙏 **రామేశ్వరం ఆలయం** 🙏🌹

రామనాథ స్వామి ఆలయం రామేశ్వరం ద్వీపం యొక్క ప్రధాన ఆలయం, వేలాది మంది యాత్రికులు మరియు పర్యాటకులు ప్రతిరోజూ రామనాథ స్వామి ఆలయాన్ని దాని పవిత్రత మరియు నిర్మాణ సౌందర్యం కోసం సందర్శిస్తారు.

ఈ ఆలయం మూడు ముఖ్యమైన భారతీయ మత విభాగాలలో పవిత్ర తీర్థయాత్రగా పరిగణించబడుతుంది.

• శైవ మతం (శివుడిని ఆరాధించేవారు)
• వైష్ణవిజం (విష్ణువును ఆరాధించేవారు) మరియు
• స్మార్తిజం (స్మృతులను అధీకృత గ్రంథాలుగా అనుసరించేవారు, మరియు అన్ని దేవుళ్ళను బ్రాహ్మణులుగా ఆరాధించేవారు బ్రాహ్మణుల విభాగం, వారు అధ్వైత సూత్రాన్ని అనుసరిస్తారు)
ఈ మందిరంలోని శివ - లింగాన్ని త్రేతా యుగంలో (1.2 మిలియన్ సంవత్సరాల క్రితం) శ్రీ రాముడి చేత స్థాపించబడిందని నమ్ముతారు.

పౌరాణిక చరిత్ర

హిందువులు నమ్ముతున్నట్లుగా, రావణుడిని చంపిన పాపం పోగొట్టుకుందుకు రాముడు తన సిబ్బందితో శివుడిని ఆరాధించడానికి రామేశ్వరం వచ్చాడు కాని ఆరాధన చేయుటకు వారికి శివలింగం కావలసి వచ్చినది. అందులన పూజలు (ఆరాధన మరియు ఆచారాలు) చేయటానికి 2 శివలింగాలను తీసుకురావాలని హనుమంతుని కైలాశమునకు పంపిరి. కొన్ని కారణాల వల్ల హనుమంతుడు శివలింగమును తీసుకొని వచ్చుటకు జాప్యము జరిగినది. అదే సమయంలో సీతదేవి సరదాగా ఇసుకతో శివలింగాన్ని చేసినది. ఆచారాలకు శుభ సమయం మించిపోతున్నందున సముద్రపు ఇసుకతో సీత చేసిన శివలింగానికి పూజలు చేయమని ఋషులు మునులు శ్రీ రాములవారికి తెలియజేసారు.

సీతాదేవి నిర్మించిన శివలింగానికి రాముల వారు ఆచారాలతో పూజలు చేశారు. అన్ని పూర్తయిన తర్వాత హనుమంతుడు శివలింగాలతో రామేశ్వరం ఒడ్డుకు చేరుకున్నాడు.

అతను తెచ్చిన శివలింగానికి పూజలు చేయమని శ్రీరాముని కోరి అప్పటికే ప్రతిష్ట చెసి పూజలు చేసిన సైకత లింగాన్ని తొలగించడానికి ప్రయత్నించాడు (ఇసుకతో నిర్మించినది). కానీ శివలింగాన్ని తొలగించే ప్రయత్నంలో అతను విఫలమయ్యాడు. శ్రీ రాముడు హనుమంతుడిని సమాధాన పరచి, మీరు తెచ్చిన శివలింగమునకే మొదటి పూజలు చేసి ఆ తరువాత నేను ప్రతిష్టించి పూజ చేసిన సైకత లింగం నకు పూజలు మరియు అరాధన జరుగునని ఆనతిచ్చిరి. నేటికిని ఆ పద్దతినే రామేశ్వరము యందు ఆచరించుచున్నారు.

హనుమంతుడు తీసుకువచ్చిన శివలింగానికి విశ్వనాథర్ అని పేరు పెట్టారు.

దివ్యమైన ఆలయము యొక్క అవిష్కరణ
10 వ శతాబ్దం వరకు రామేశ్వరం ఆలయం ఒక చిన్న తాటాకుల మండపములో ఉండెను, ఈ ఆలయమును ఒక ముని నిర్వహించెడి వారు. ఈ ఆలయం మరియు దాని నిర్మాణాత్మక నిర్మాణాలు 12 వ మరియు 16 వ శతాబ్దాల మధ్య వివిధ రాజులచే అభివృద్ధి చెందాయి.

రామనాథ స్వామి ఆలయాన్నినిర్మించిన నమునాను “ద్రవిడ శైలి” పిలుస్తారు. ఆలయ సముదాయం చుట్టు ప్రహరి గోడ (తిరు మథిల్) నిర్మించారు. తూర్పు వైపు ప్రహరి గోడ పొడవు 865 అడుగులు - పడమర దిశలో మరియు దక్షిణ - ఉత్తరాన 657 అడుగులు విస్తరించి ఉన్నది. రామనాథస్వామి ఆలయంలో 4 గోపురాలు (ఆలయ ప్రవేశద్వారం పైన ఉన్న టవర్) ప్రతి దిశలో ఒకటి ఉన్నాయి.

రామనాథస్వామి ఆలయమును ఈ క్రింది వర్గాలుగా విభజించారు.
• ప్రాకారాలు
• సన్నిధిలు (ఆలయం లోపల చిన్న మందిరాలు)
• తీర్థాలు
• మండపాలు

రామేశ్వరం ఆలయ చరిత్ర
పూర్వ చారిత్రక రామేశ్వరం

కొన్ని వేదాలు మరియు పురాణాల ప్రకారం రామేశ్వరంని “గంధమధనం” అని వ్యవహరించెడి వారు మరియు రాముడు రాకముందే, రామేశ్వరంలో ఒక శివాలయం ఉన్నదని వారి నమ్మకము.
రామేశ్వరం ఆలయ చరిత్ర
స్పష్టమైన చారిత్రక ఆధారాల ద్వారా రామేశ్వరం వివిధ రాజవంశాల క్రింద పాలించబడినది.
*పాండ్య రాజ్యం (చోళ రాజ్యానికి ముందు రామేశ్వరం క్రీ.శ 9 వ శతాబ్దం వరకు) మదురై పాండ్య రాజ్య పాలనలో ఉన్నది
*చోళ రాజ్యం (క్రీ.శ. 1012 నుండి 1040 వరకు
*జాఫ్నా రాజ్యం (1153 - 1186 CE)
*పాండ్య రాజ్యం (క్రీ.శ 1253 – 1268)
*విజయనగర రాజ్యం (మదురై నాయకులు) (13 వ - 17 వ శతాబ్దం)
సేతుపతిస్ (రామనాథపురం పాలించటానికి మదురై నాయక్ చేత నియమించబడిన వారు)
పాండ్య మరియు చోళ రాజ్య కాలంలో చైనా, అరేబియా, సుమేరియా, ఈజిప్ట్, రోమ్ వంటి వివిధ దేశాలకు వివిధ రకాల శంఖాలు (ప్రధానంగా దక్షిణావర్త శంఖం) మరియు ముత్యాలు (తెలుపు, నలుపు, గోధుమ) ఎగుమతులు జరిగినవని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. రామేశ్వరం ఆ సమయంలో ఒక ముఖ్యమైన నౌకాశ్రయంగా పనిచేసినది.

చోళ మరియు పాండ్య గొప్ప రాజ్యాలు అయినప్పటికీ, వారు తమ పాలనలో వివిధ దేవాలయాల స్థాపనలలో సహకరించినప్పటికీ, రామేశ్వరం ఆలయ అభివృద్ధిలో వారి సహకారం చాలా తక్కువ. రామేశ్వరం ఆలయ నిర్మాణం విస్తరణ సేతుపతి రాజులు ప్రధాన సహకారంతో జరిగినది.

రామేశ్వర స్వామి ఆలయంలో అనేక సన్నిథులు (చిన్న దేవాలయాలు) ఉన్నాయి, వాటిలో 5 సన్నిథులు.
• నలేశ్వర సన్నిధి
• నీలేశ్వర సన్నిధి
• కవయేశ్వర సన్నిధి
• బాప పక్షేశ్వరార్ సన్నిధి
• పుణ్య తనేశ్వర సన్నిధి
ఈ సన్నిధులు 10 మరియు 11 వ శతాబ్దాల కాలంలో పరాంతక చోళ మరియు రాజ రాజ చోళ రాజుల చేత నిర్మించబడ్డాయి. ఈ దేవాలయాలు మూడవ ప్రాకారము (మూంద్రామ్ ప్రాకారం) యొక్క పడమటి వైపున ఉన్నాయి.

శ్రీలంక రాజు పరాక్రమబాహు (క్రీ.శ 1153 - 1186) 12 వ శతాబ్దం చివరిలో ఆలయం లోపల ప్రధాన సన్నిధులను మరియు మొదటి ప్రాకారమును నిర్మించారు.
• మూలవర్ సన్నిధి (మొదటి ప్రాకారము రామనాథస్వామి సన్నిధి)
• పర్వత వర్తిని అంబాల్ సన్నిధి
• కాశీ విశ్వనాథర్ సన్నిధి
• విశాలాక్షి సన్నిధి

1404 CE లో విజయనగర రాజవంశం యొక్క హరిహర - II రెండవ ప్రాకారము పనులను ప్రారంభించారు కాని పనులు పూర్తి కాలేదు (16 వ శతాబ్దంలో రెండవ ప్రాకారము యొక్క తూర్పు భాగాలను తిరుమలై సేతుపతి నిర్మించారు).
ఆ తరువాత క్రీ.శ 1414 లో శ్రీలంకన్ (తమిళ) రాజు పరరాజశేఖర ఆర్యచక్రవర్తి సహాయంతో ఉదయన్ సేతుపతి శ్రీలంక త్రింకోమలై నుండి గ్రానైట్ రాళ్లను తెచ్చి వాటితో పునరుద్ధరణ ప్రక్రియను, రామనాథస్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రారంభించారు.
పరమ శివుని ముందు 17 అడుగుల ఎత్తు మరియు 12 అడుగుల వెడల్పు కలిగిన గొప్ప నంది విగ్రహాన్ని చిన్న ఉడైయాన్ కట్టతేవర్ నిర్మించారు. పల్లియరాయ్ మరియు అంబాల్ సన్నిధి ముందు మంటపములను రవి విజయ రెగునాథ సేతుపతి నిర్మించారు.
పశ్చిమ గోపురం (78 అడుగుల ఎత్తు పశ్చిమ రాజ గోపురము) మరియు ఆలయ బయటి గోడలను క్రీ.శ 1434 నాటికి నాగూర్ వైశ్య భక్తుడు అందించిన విరాళాల సహాయంతో నిర్మించారు.
1722 వ సంవత్సరంలో విజయ రెగునాథ సేతుపతి రామనాథస్వామి ఆలయం మూడవ ప్రాకారమునకు పునాది రాయి వేశారు, తరువాత ఈ పని చెల్లా ముత్తు విజయ రెగునాథ సేతుపతి చేత చేయబడి 1772 నాటికి ముత్తు రామలింగ విజయ రెగునాథ సేతుపతి పాలనలో పూర్తయింది.
తూర్పు రాజ గోపురము యొక్క చిన్న భాగాన్ని అప్పటికే 17 వ శతాబ్దంలో తలవాయి సేతుపతి ప్రారంభించారు కాని పూర్తి కాలేదు. ఈ తూర్పు రాజ గోపురం (తూర్పు రాజ గోపురము 126 అడుగుల ఎత్తు మరియు 9 అంతస్తులు) 1897 నుండి 1904 మధ్య సంవత్సరాల్లో దేవకోట్టై A.L.A.R కుటుంబం విరాళాల ద్వారా నిర్మించబడింది.
సేతుపతి మండపం
తూర్పు గోపురం ముందు ఉన్న సేతుపతి మండపం నిర్మాణం 19 -11 -1969 న ప్రారంభించి 11 -12 -1974 న రామనాథ సేతుపతి చేత పూర్తయింది.
ఉత్తర మరియు దక్షిణ రాజ గోపురాలు:
ఉత్తర మరియు దక్షిణ గోపురాలను తమిళనాడు ప్రభుత్వ హెచ్ఆర్ & సిఇ మంత్రిత్వ శాఖ (హిందూ మత మరియు ఛారిటబుల్ ఎండోమెంట్స్), కంచి కామకోటి మట్ ట్రస్ట్ మరియు ష్రింగేరి మట్ టస్ట్ నిర్మించింది. కొత్తగా నిర్మించిన ఈ గోపురాల కుంబాబిషేగం రామేశ్వరం రామనాథస్వామి ఆలయంలోని మిగతా గోపురాలతో పాటు జనవరి 20, 2016 న జరిగినది.

రామనాథస్వామి ఆలయ ప్రాకారాలు
ఈ ఆలయంలో “కోవిల్ ప్రాకారాలు” అని పేరు పెట్టారు.
రామేశ్వరం ఆలయం మూడవ ప్రాకారము
మూడవ ప్రాకారము ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ ప్రాకారము, దాని కొలతలు.
స్తంభాల సంఖ్య 1212, ఎత్తు 22 అడుగులు 7.5 అంగుళాలు.బాహ్య వలయము (outer wing) (తూర్పు - పడమర) 690 అడుగులు (outer wing) (ఉత్తర దక్షిణ) 435 అడుగులు ఇన్నర్ వింగ్ (తూర్పు - పడమర) 649 అడుగులు ఇన్నర్ వింగ్ (ఉత్తర దక్షిణ) 395 అడుగులు
పైకప్పు పైభాగంలో ఉన్న రాళ్ళు 40 అడుగుల పొడవు వరకు ఉంటాయి. ప్రాకారములోని స్థంభాలన్నీ అందమైన శిల్పాలతో చెక్కబడ్డాయి.
రెండవ ప్రాకారము:
ఇక్కడ 108 శివ లింగాలు, మహా గణపతి విగ్రహం ఉన్నాయి.
ఆలయ ప్రధాన దేవత అయిన రామనాథస్వామి తన భార్య పర్వతవర్తిని అమ్మన్‌తో కలిసి ఆలయ మొదటి ప్రాకారములో దర్శనము. మొదటి ప్రాకారము ఇతర ప్రాకారములతో పోలిస్తే పురాతన ప్రాకారము. 12 వ శతాబ్దంలో నిర్మించబడి వివిధ కాలాలలో పునరుద్ధరించబడింది.
రామనాథస్వామి ఆలయం లోపల సన్నిధిలు (పుణ్యక్షేత్రాలు)
రామనాథస్వామి ఆలయం పూర్తిగా మూడు ప్రాకారాలను కలిగి వాటిలో సన్నిధులు అని పిలువబడే అనేక చిన్న మందిరాలు ఉన్నాయి.
రామేశ్వరం ఆలయం లోపల ఉన్న అన్ని ముఖ్యమైన పుణ్యక్షేత్రాల వివరాలు క్లుప్తంగా.
మొదటి ప్రాకారములో సన్నిధులు.
రామనాథస్వమి సన్నిధి (గర్భ గృహము)
ఈ ఆలయంలోని ప్రధాన దేవత (మూలవర్), రాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఈ సన్నిధిలో ఉన్న్దది. శివలింగాన్ని సముద్రపు ఇసుకతో సీతదేవి (శ్రీరాముని భార్య) నిర్మించారని భక్తుల నమ్మకము.
రామ నాథస్వామి మరియు అంబాల్ పార్వతవర్తిని పండుగలలో ఉపయోగించే ఉత్సవ విగ్రహాలు, రామ్, సీత, లక్ష్మణ, సుగ్రీవ, హనుమంతుని యొక్క లోహపు విగ్రహాలు రామనాథ స్వామి మందిరంలో ఉంచారు. ఈ విగ్రహాలను ఉత్సవములలో ఉపయోగించెదరు.
నల్ల గ్రానైట్ రాళ్లను ఉపయోగించి రామనాథస్వామి మందిరం నిర్మించబడింది మరియు గర్భ గృహ విమానం పైకప్పు బంగారం పూత చేయబడినది. ప్రధాన మూలవర్ పేర్లు: రామేశ్వర్, రామనాథర్, రామనాథస్వామి, రామ్‌నాథ్.

పధాన ఆలయము చుట్టు ఉన్న బేర మూర్తులు:
1. భార్యతో సహా సూర్యుని విగ్రహము
2. గంథమధన లింగం (ఈ లింగము రామేశ్వరమునకు శ్రీ రాముడు రాక ముందునుండి ఉందని నమ్మిక).
3. జ్యోతి లింగము (విభీషణుడు ప్ర్రతిష్టించెనని ప్రతీతి)
4. 63 నయనార్ల విగ్రహములు
5. దక్షిణా ముర్తి
6. సరస్వతి
7. నటరాజ (రెండు నటరాజ విగ్రహములు ఉత్త్రర తూర్పు మూలకు రామనాధ స్వామి సన్నిధికి దరిలో)
8. శివ దుర్గా దేవి
9. చండికేశ్వరర్ ఆలయము.
విశ్వ లింగం, విశ్వనాథర్ సన్నిధి:
కైలాష్ నుండి హనుమంతుడు తీసుకువచ్చిన రెండు శివలింగాలలో ఇది ఒకటి. ఈ సన్నిధి రామనాథస్వామి సన్నిధికి ఉత్తరం వైపు ఉన్నది. ఈ శివలింగానికి మాత్రమే పూజలు మరియు నైవేద్యాలు మొదట జరుగుతాయి.
ఇతర పేర్లు: కాశిలింగం, హనుమాన్లింగం, విశ్వ లింగం
విశాలాక్షి సన్నిధి:
విశాలాక్షి విశ్వనాథర్ భార్య. ఈ సన్నిధి విశ్వనాథర్ సన్నిధికి దగ్గరలో ఉన్నది. విశ్వనాథర్తో సంబంధం ఉన్న పూజలన్నిఈమెకు కూడ చేయుదురు.
రామేశ్వరం ఆలయంలో పార్వతవర్తిని అమ్మన్ సన్నిధి:
పార్వతవర్తిని అమ్మన్ రామనాథస్వామి భార్య, ఈ మందిరం రామనాథ స్వామికి ఎడమ వైపున ఉంది మరియు దక్షిణ దిశలో ఉంది. అంబాల్ విగ్రహం పద్మ పీఠము మీద నిలబడి చేతిలో రెండు కమలాలతో మనకు దర్శనము. ఈ మందిరంలో “శ్రీ చక్రం” ఏర్పాటు చేయబడినది. పార్వతవర్తిని అంబాల్ మందిరం తమిళనాడు యొక్క శక్తి పీఠాలలో ఒకటి. అంబాల్ మందిరం యొక్క విమానము కూడా బంగారంతో పూత పూయబడింది. అంబాల్ యొక్క ఇతర పేర్లు: పార్వతి దేవి, మలై వలార్ కాథాలి, ధాట్చాయిని.

రామేశ్వరం ఆలయంలోని విష్ణు మందిరం
ఇది అంబాల్ మందిరానికి వాయువ్య మూలలో ఉన్నది. శివాలయం లోపల విష్ణు మందిరాలు ఉన్న అతికొద్ది దేవాలయాలలో ఈ ఆలయం ఒకటి. విష్ణువు యొక్క భంగిమను (తిరుక్కోలము)“ఆనంద శయన” అంటారు. ఇతర పేర్లు: పల్లికొండ పెరుమాళ్, పెరుమాళ్.
సంతాన, సౌబ్యాగ గణపతి
ఇచట ఆలుమగలు ఈ గణపతిని పూజించడం ద్వారా సంతానం, సౌబ్యాగ్యం లభిస్తుందని నమ్ముతారు. ఈ మందిరం అంబాల్ మందిరానికి నైరుతి మూలలో ఉన్నది.
పల్లియరై:
ఈ గది అంబాల్ సన్నిధికి ఈశాన్య మూలలో ఉంది. ప్రతి రోజు రాత్రి రామ నాథస్వామి ఉత్సవ మూర్తిని రామ నాథస్వామి సన్నిధి నుండి ఒక పల్లకీలో ఈ గదికి తీసుకువెళ్ళి పూజలు చేస్తారు. ప్రతి ఉదయం ఈ విగ్రహాన్ని ఒక నిర్దిష్ట ఆచార పూజల తరువాత తిరిగి రామ నాథస్వామి సన్నిధికి తీసుకువెళతారు.
     
    • అంబాల్ సన్నిధి లోపల విగ్రహాలు
      *1. సప్త కన్నికల్ (అక్షరాలా 7 కన్య దేవతలు)
        1. బ్రహ్మి
        2. మహేశ్వరి
        3. గౌమరి
        4. వైష్ణవి
        5. వరాహి
        6. ఇంద్రాణి
        7. చాముండేశ్వరి
      *2. చండికేశ్వరి
   
      రెండవ ప్రాకారములో సన్నిధిలు
      ఈ ఆలయం యొక్క రెండవ ప్రాకారములొ నూట ఎనిమిది శివ లింగాలు ఉన్నాయి. రెండవ ప్రాకారము పశ్చిమ భాగంలో మహా గణపతి విగ్రహం ఉన్నది. ప్రతి నెల సంకటహర చతుర్థి నాడు ఈ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
   
      రెండవ ప్రాకారములో తీర్థాలకు (గంగా, యమునా, కోటి తీర్థాలు) సమీపంలో బైరవ మందిరం ఉంది.
   
      మూడవ ప్రాకారములో గల సన్నిధిలు
      మూడవ ప్రాకారములో ఐదు శివాలయాలు ఉన్నవి
      • నలేశ్వర సన్నిధి
      • నీలేశ్వర సన్నిధి
      • కావయేశ్వర సన్నిధి
      • బాపా పక్షేశ్వరార్ సన్నిధి
      • పుణ్య తనేశ్వర సన్నిధి

10 వ మరియు 11 వ శతాబ్ద కాలంలో పరాంతక చోళ మరియు రాజ రాజ చోళులు ఈ సన్నిధిలను నిర్మించారు. ఈ దేవాలయాలు మూడవ ప్రాకారము యొక్క పడమటి వైపున ఉన్నాయి.

సేతు మాధవర్ మందిరం:
సేతు మాధవర్ మందిరం మూడవ మరియు రెండవ ప్రాకారాల మధ్య ఉన్నది. మూడవ ప్రాకారములోని సేతు మాధవర్ తీర్థం దాటి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. సేతు మాధవ విగ్రహం తెలుపు పాలరాయిలో అందంగా చెక్కబడిది.
సేతు మాధవర్‌తో సంబంధం ఉన్న పౌరాణిక కథ
చాలా కాలం క్రితం సుందరపాండియన్ (పున్నియ నిధి) మదురై ప్రాంతాన్ని పరిపాలించాడు, ఆ కాలంలో రామేశ్వరం కూడా ఆయన పాలనలో ఒక భాగం మరియు పాండ్య రాజవంశం క్రింద ఉంది. ఒక రోజు అతను తన భార్య వింధవాని మరియు అతని సైన్యంతో సేతు (రామేశ్వరం పాత పేరు) ను సందర్శించాడు.
అతను తన కుటుంబం మరియు దేశం యొక్క సంక్షేమం కోసం విష్ణువుకు ప్రత్యేక యజ్ఞం చేసి పూజలు నిర్వహించాడు. యజ్ఞంకు సంతోషించిన విష్ణువు తన భార్యను ఒక అనాథ బాలిక రూపంలో పంపాడు. దేవాలయంలో ఒంటరిగా ఉన్న ఆ చిన్న బాలికను రాజు చూడగానే, ఆమె ఎవరు, ఎందుకు ఒంటరిగా ఉన్నావని విచారించాడు. ఆమె అనాథ అని రాజుతో చెప్పింది. పాండియ రాజు సంతోషించి ఆ బాలికను గుణ నిధి అని నామకరణము చేసి దత్తత తీసుకున్నాడు. ఆమె అభ్యర్ధన మేరకు ఆమెకు రక్షణ కల్పించాడు.

కొద్ది రోజుల తరువాత ఒక బ్రాహ్మణుడు రామనాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తాడు, అతను నల్ల రంగులో ఉన్నాడు, రుద్రాక్ష మాల ధరించాడు మరియు అతని భుజాలకు గంగ నీటి చెంబులు, చేతిలో తాటాకు విసన కర్ర ఉన్నాయి.
తోటలో రాజు దత్తత తీసుకున్న యువరాణి పువ్వులు త్రెంచు చుండ, ఆ నల్ల బ్రాహ్మణుడు అకస్మాత్తుగా తోటలోకి ప్రవేశించి గుణనిధి చేతులను బలవంతంగా పట్టుకున్నాడు. వెంటనే రాజ సేవకులు ఆ వ్యక్తిని రాజు వద్దకు తీసుకెళ్ళి అతని గురించి ఫిర్యాదు చేశారు.
రాజు అతనికి సంకెళ్ళు వేయమని ఆదేశించి, ఆలయంలోనే కారాగార శిక్ష విధించాడు. ఆ వ్యక్తి ఇప్పుడు సేతు మాధవ ఆలయం ఉన్న ప్రదేశంలో బంధించబడ్డాడు.
ఆ రాత్రి రాజు, విష్ణువు తను బంధించిన బ్రాహ్మణుడిగా, తన దత్తపుత్రికను తన భార్యగా చూపించినటుల కల కన్నాడు. అతను అకస్మాత్తుగా మేల్కొని ఆ బ్రాహ్మణుని సంకెళ్ళతొ బందించిన ప్రదేశానికి వెళ్ళాడు. అతను అక్కడ విష్ణువును మరియు దత్తపుత్రికను ఆభరణాలతో మరియు విష్ణువు యొక్క భార్య అయిన లక్ష్మిగా చూశాడు.
విష్ణువు తన లక్ష్మితో ఖైదీల గొలుసుతో ఈ ప్రదేశంలో నివసిస్తానని మరియు భక్తులను ఆశీర్వదించి, సేతు మాధవ అనే పేరుతో ఉంటానని రాజుకు హామీ ఇచ్చాడు.
రామ మందిరం:
మూడవ ప్రాకారము పడమటి వైపు రాముల వారి మందిరం ఉన్నది. ఈ రామ మందిరాన్ని కోదండ రామ సన్నిధి అని వ్యవహరింతురు. ఈ మందిరంలో రాములవారు సీత, లక్ష్మణ హనుమంతు సమేతంగా భక్తులకు దర్శనము.

రామ లింగ ప్రతిష్ఠ:
మూడవ ప్రాకారము యొక్క వాయువ్య మూలలో, రామ, సీత, లక్ష్మణ్, హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు మరియు ఋషులు రామనాధస్వామి లింగమును ప్రతిష్ట చేస్తున్న సన్నివేశమును సున్నపు రాయితో చేసిన విగ్రహములను మందిరం లోపల ఉంచారు.

రామేశ్వరం ఆలయంలో నటరాజర్ సన్నిధి.
నటరాజార్ మందిరం మూడవ ప్రాకారము యొక్క ఈశాన్య మూలలో ఉన్నది, ఈ మందిరం లోపలి భాగం పూర్తిగా రుద్రాక్షాలతో అలంకరించబడినది. ఈ మందిరం లోపల మహా విష్ణు విగ్రహం ఉన్నది. భక్టులు అగ్ని తీర్ధములో పూజలు చేసి నాగ ధోషం పోవడానికి ఈ మందిరం లోపల నాగ విగ్రహాలను ఏర్పాటు చేస్తారు.
యోగభ్యాసాన్ని కనిపెట్టి, రూపొందించిన యోగి పతంజలి సమాధి ఈ మందిరం లోపల ఉన్నది. పతంజలి ఋషి యోగాకు తండ్రి అని అంటారు. ఆ సమాధి స్థలంలో ఒక యోగ చక్రం ఏర్పాటు చేయబడింది మరియు నెయ్యిని ఉపయోగించి వెలిగించిన అఖండ జ్యోతి సమాధి వద్ద ఉంచబడినది.
నంది మండపంలో సన్నిధులు:
మహా గణపతి సన్నిధి.
గణపతి విగ్రహాన్ని ఈ మందిరం లోపల ఉంచారు, హిందూ పురాణాల ప్రకారం గణపతిని శివుని కుమారుడిగా భావిస్తారు. విఘ్నములు లేకుండునకు మొదట గణపతిని పూజించాలి అనేది హిందూ సంప్రదాయం. కాబట్టి భక్తుడు మొదట తమ ఆరాధనను దక్షిణాన నంది మండపంలో ఉన్న గణపతితో ప్రారంభించాలి. ఇతనిని వినాయగ, పిల్లయార్ అని వ్యవహరింతురు.
కార్తికేయన్ సన్నిధి.
కార్తికేయన్ను శివుని కుమారుడిగా కూడా పరిగణిస్తారు, అతను భక్తులను తన ఇద్దరు భార్యలైన దేవ్యానై, మరియు వల్లిలతో దర్శనము. ఈ మందిరం నంది విగ్రహానికి ఉత్తరం వైపు ఉంది. ఇతర పేర్లు: మురుగన్, సుబ్రమణియార్.
నవగ్రహ సన్నిధి
నంది మండపం సమీపంలో నవ గ్రహాల విగ్రహాలు గలవు.
నంది విగ్రహం
గొప్ప నంది విగ్రహం 17 అడుగుల ఎత్తు మరియు 12 అడుగుల వెడల్పు మరియు ఇటుకలు, సున్నపు రాళ్ళు మరియు సముద్రపు పెంకులతో నిర్మించబడింది. నంది విగ్రహం స్వామి శివుడిని ఎదుర్కొంటుంది. ప్రదోషం అని పిలువబడే దినమున నందికి ప్రత్యేక పూజలు (ఈ రోజు నెలవారీ రెండుసార్లు వస్తుంది) జరుగును.
ఆలయ తూర్పు ప్రవేశానికి సమీపంలో ఉన్న సన్నిధులు:
హనుమాన్ ఆలయం
ఈ మందిరం తూర్పు ద్వారం నుండి ఉత్తరంనకు కలదు, హనుమంతుని తిరుముగము దక్షిణ దిశకు (శ్రీలంక) ఉన్నది. రామ నాథస్వామి ఆలయంలోని హనుమంతుడి విగ్రహం 16 అడుగుల ఎత్తు గాని మనకు 8 అడుగుల విగ్రహమే ప్రదర్శించబడుతుంది. మిగిలిన సగం భూమిలో నీటి కింద మునిగి ఉంటుంది. హనుమంతుడి ముఖం మరియు శరీరం పూర్తిగా సింధూరం పొడితో పూయబడి ఉండును. ఈ హనుమంతుడిని “వీర హనుమాన్” అని పిలుస్తారు.

మహా లక్ష్మి ఆలయం:
తూర్పు ద్వారం నుండి దక్షిణం వైపు కొద్ది దూరములో మహలక్ష్మి సన్నిధి కలదు.
రామేశ్వరం రామనాథస్వామి ఆలయం లోపల తీర్థాలు
సేతు పురాణ గ్రంథం ప్రకారం, రామేశ్వరం పరిసరాల్లో పూర్తిగా 64 తీర్థాలు (పవిత్ర జల వనరులు) ఉన్నాయి. వాటిలో ఇరవై రెండు తీర్థాలు రామనాథస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.
రామనాథస్వామి ఆలయం లోపల 22 బావుల నుండి పవిత్ర స్నానం చేయడానికి సమయం:
రామేశ్వరం ఆలయం లోపల ఉన్న 22 బావులలో ఉదయం 5:30 నుండి 12:00 వరకు మరియు మధ్యాహ్నం 3:30 నుండి 6:00 గంటల వరకు భక్తులు స్నానం చేయడానికి అనుమతిస్తారు.
రామేశ్వరం ఆలయం లోపల ఉన్న 22 బావుల పేర్లు:
రామేశ్వరం ఆలయంలోని 22 తీర్థాల పేర్లు వాటి సంబంధిత ప్రదేశాలతో క్రింద ఇవ్వబడ్డాయి.
1.మహాలక్ష్మి తీర్థం: స్థానం: హనుమాన్ ఆలయానికి దక్షిణం.
2. సావిత్రి తీర్థం: స్థానం: హనుమాన్ ఆలయానికి పశ్చిమాన.
3. గాయత్రి తీర్థం: స్థానం: హనుమాన్ ఆలయానికి పశ్చిమాన.
4. సరస్వతి తీర్థం: స్థానం: హనుమాన్ ఆలయానికి పశ్చిమాన.
5. సక్కర తీర్థం: స్థానం: ఆలయ రెండవ కారిడార్‌లో.
6. సేతు మాధవ తీర్థం: స్థానం: ఈ తీర్థం మూడవ ప్రాకారములో చెరువుగా ఉన్నది.
7. నల తీర్థం: స్థానం: సేతుమాధవ ఆలయం దగ్గర. (మూడవ మరియు రెండవ ప్రాకారాల మధ్య).
8. నీలా తీర్థం: స్థానం: సేతుమాధవ ఆలయం దగ్గర. (మూడవ మరియు రెండవ ప్రాకారాల మధ్య).
9. గవాయ తీర్థం: స్థానం: సేతుమాధవ ఆలయం దగ్గర. (మూడవ మరియు రెండవ ప్రాకారాల మధ్య).
10. కవచ తీర్థం: స్థానం: సేతుమాధవ ఆలయం దగ్గర. (మూడవ మరియు రెండవ ప్రాకారాల మధ్య).
11. గంధమదన తీర్థం: స్థానం: సేతుమాధవ ఆలయం దగ్గర. (మూడవ మరియు రెండవ ప్రాకారాల మధ్య).
12. బ్రహ్మహతి విమోచన తీర్థం: స్థానం: సేతుమాధవ ఆలయం దగ్గర. (మూడవ మరియు రెండవ ప్రాకారాల మధ్య).
13. సూర్య తీర్థం: స్థానం: సేతుమాధవ ఆలయం దగ్గర. (మూడవ మరియు రెండవ ప్రాకారాల మధ్య).
14. చంద్ర తీర్థం: స్థానం: సేతుమాధవ ఆలయం దగ్గర. (మూడవ మరియు రెండవ ప్రాకారాల మధ్య).
15. సత్యమిర్థ తీర్థం: స్థానం: ఆలయ రెండవ ప్రాకారములో.
16. శివ తీర్థం: స్థానం: ఆలయ రెండవ ప్రాకారములో.
17. సర్వ తీర్థం: స్థానం: ఆలయ రెండవ ప్రాకారములో.
18. సంకు తీర్థం: స్థానం: ఆలయ రెండవ ప్రాకారములో.
19. గయ తీర్థం: స్థానం: ఆలయ రెండవ ప్రాకారములో.
20. గంగ తీర్థం: స్థానం: ఆలయ రెండవ ప్రాకారములో.
21. యమునా తీర్థం: స్థానం: ఆలయ రెండవ ప్రాకారములో.
22. కోటి తీర్థం: స్థానం: ఆలయ మొదటి ప్రాకారములో. (రెండవ ప్రాకారములో స్నానమాచరించడానికి స్థలము). కోటి తీర్ధము మిగతా తీర్ధముల వలే బావినుండి చేదుకొనుట వీలవదు. అచట ఒకరు మనకి చెంబుతో కోటి తీర్ధము ఒకటవ ప్రాకారము నుండి మనకు ఇచ్చుదురు.

       తడి దుస్తులతో ఆలయ దేవతలను పూజించడానికి భక్తులను అనుమతించరు, కాబట్టి భక్తులు స్నానం చేసిన తర్వాత ధరించడానికి పొడి బట్టలు తీసుకెళ్లాలి.
    1.
రామనాథస్వామి ఆలయంలో మండపాలు
1. సేతుపతి మండపం
2. అనుప్పు మండపం
3. నంది మండపం
4. సుగ్రీవర మండపం
5. కళ్యాణ మండపం
6. చోక్కట్టన్ మండపం

సేతుపతి మండపం
రామనాథస్వామి ఆలయం యొక్క తూర్పు ద్వారం ప్రవేశద్వారం పక్కన ఉన్న సేతుపతి మండపం. ఈ మండపం ప్రవేశద్వారం లో బాష్కర సేతుపతి విగ్రహాన్ని నిర్మించారు. ఈ మండపం 1974 లో రామనాథసేతుపతి నిర్మించారు.

అనుప్పు మండపం
ఈ మండపం తూర్పు ప్రధాన ద్వారం తరువాత ప్రారంభమవుతుంది. ఈ మండపం సేతుపతి మండపం తరువాత మరియు నంది మండపం ముందు ఉంది. అనుప్పు అనే పదానికి తమిళంలో “పంపడం” అని అర్ధం.
నంది మండపం
నంది విగ్రహం నిర్మించిన స్థలాన్ని నంది మండపం అంటారు.
సుగ్రీవర మండపం:
ఈ మండపం అంబాల్ సన్నిధికి ముందు ఉన్నది. స్వామి సన్నిథిలోని దక్షిణ ద్వారం ద్వారా కూడా ఈ మండపం చేరుకోవచ్చు.
అష్ట లక్ష్మి విగ్రహాలు ఉన్నాయి, అవి,
1. ఆది లక్ష్మి
2. సంతాన లక్ష్మి
3. గజ లక్ష్మి
4. ధన లక్ష్మి
5. ధా న్య లక్ష్మి
6. జయ లక్ష్మి
7. ఐశ్వర్య లక్ష్మి
8. వీర లక్ష్మి
దేవస్థానం నుండి ముందస్తు అనుమతి పొంది ఈ మండపంలో వివాహాలు జరుపుకోవచ్చు.
ఈ మండపం యొక్క స్తంభాలు ద్వార బాలికా మరియు దేవత శిల్పాలతో చెక్కబడ్డాయి, ఒక స్తంభంలో సేతుపతి రాజు కదంబ ధేవర్ విగ్రహం ఉంది.

      కళ్యాణ మండపం
      రెండవ తూర్పు ప్రవేశద్వారం వద్ద ఉన్న మండపం, సంవత్సరాల క్రితం ఈ మండపం దేవతల వివాహాలు (తిరు కళ్యాణం) నిర్వహించడానికి ఉపయోగించబడింది .ఇప్పుడు ప్రస్తుతం వివాహ కార్యకలాపాలు మూడవ ప్రాకారములో జరుతున్నాయి. ఈ మండపం స్తంభాలలో సేతుపతి రాజుల శిల్పాలు చెక్కబడ్డాయి.
      చొక్కట్టన్ మండపము:
      ఈ మండపం మూడవ ప్రాకారము యొక్క పశ్చిమ భాగంలో, సేతు మాధవర్ తీర్థం సమీపంలో ఉంది. ఆలయం యొక్క పడమటి ప్రవేశ మార్గంతో మూడవ ప్రాకారం జాయింట్ల పడమటి వైపు పైకప్పుపై “క్రాస్ మార్క్” (X) లాగా కనిపిస్తుంది. ఈ “క్రాస్ మార్క్” చిహ్నాన్ని ఉపయోగించి చోక్కట్టన్ అని పిలువబడే ఒక పురాతన ఆట ఉంది, అందువల్ల ఈ ప్రదేశం “చోక్కట్టన్ ఆట” ని గుర్తుచేస్తుంది, దీనికి చోక్కట్టన్ మండపం అని పేరు పెట్టారు.
      యాత్రికులు చోక్కట్టన్ మండపం దగ్గర నిలబడి గోపురాలు, రామనాథస్వామి విమానములను చూడవచ్చు.
    • రామేశ్వరం ఆలయంలో పూజలు
      • సోమవార పూజ (ప్రతి సోమవారం)
      • దక్షిణా మూర్తి పూజ (ప్రతి గురువారం)
      .మూడవ ప్రాకారము లో అంబాల్ ఊరేగింపు (ప్రతి శుక్రవారం)
      • నవగ్రహ పూజ (ప్రతి శనివారం)

   
రామనాథస్వామి ఆలయ సమయాలు:
** సాధారణ రోజులలో 5:00 AM - 1:00 PM మరియు 3:00 PM - 9:00 PM మధ్య తెరుచుకుంటుంది.
* మార్గాళి మాసం (మార్గాశ్రీష) ఆలయం త్వరగా తెరుచుకుంటుంది.
* గ్రహణం రోజులలో ఆలయం మూసివేయబడుతుంది (గ్రహణం సమయాల మధ్య)

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
🙏🙏🙏
సేకరణ
*ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏

**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**

**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏 

పెళ్లిసందడి

*పెళ్లిసందడి. 1940 కి పూర్వం...👇*

కానివ్వండర్రా...
మగ పెళ్ళివాళ్ల బండ్లు అప్పుడే పెద్దినాయుడు గారి గరువుకు చేరాయట...ఇంకో ఘడియలో ఊరిపోలిమేరలోకి వచ్చేస్తాయి...
ఆ మేళగాళ్ళేక్కడ తగలడ్డారో... ఎదురు వెళ్ళితీసుకురావద్దూ...
అబ్బాయీ...కాస్త వంటపందిరిలోకి చూసి... వంటవాళ్లను తొందరపెట్టు...విడిదిలోకి పలహారాలు పంపేందుకు సిద్ధంగా ఉన్నారో..లేదో..
అమ్మా ఆ ముత్తైదువలసింగారం ఎంత వరకొచ్చిందో చూడు... ప్రతీవాళ్ళూ పెళ్లి తనకే నన్నట్టు తయారై.పోతున్నారేవిటీ...త్వరగాతేమలండీ..
ఊరి పెద్దలు నలుగురూ వచ్చి పంది రిలోకూర్చున్నారు... కామేశం...వాళ్ళసంగతి కాస్తచూసుకో నాయనా...
ఆరేఅబ్బాయి... ఒక్కగానొక్క పిల్లదాన్ని... 6 మైళ్ల దూరమిస్తావా... ఏమీ...మీఅగ్రహారంలో ఆపాటి పిల్లవాడు దొరక్కపోయాడా...

అయ్యోరూ...
కాగడాల వాళ్ళమండీ...
నాలుగు పాత గుడ్డలిప్పిస్తే మాపనిమీదుంటాం బాబూ... 
బావా...పెట్రోమాక్సు లయిట్లు...పది తెచ్చాము...ఈ ఊర్లో అంతకు మించి లేవట...
పల్లకి వాళ్ళడుగుతున్నారు... పొలిమేరలోకి పోయి కరణం గారి తోటదగ్గర తయారుగా ఉంటారట...
పందిరిలో నాలుగు కుర్చీలు వేయాలి... ఈకుర్రాళ్లంతా ఏరిరా... సానిమేళం చుట్టూ మూగారూ... ఇక ఈముండలొస్తే... మనమాట ఓ లెక్కా...
బాబయ్యా... మునసబు గారి గుర్రాన్ని తెచ్చానండీ...ఎక్కడ కట్టమంటారూ...
అయ్యా పెదరాజు గారు... మగపేల్లొళ్ళకోసమట... అరిటిగేళ్ళు... పనసకాయలు పంపారండి... రెపటినుండి...5 రోజులూ దివాణం నుండే పాలు,పేరుగులు పంపిత్తామని సెప్పమన్నారు...
అయ్యా...పెద్ధిశెట్టిగారబ్బాయి నండీ... మానాయన ఈ రొక్కం మీకిమ్మన్నారండి... తర్వాత చూసుకుందామని సెప్పాడండి...!

*పెళ్లిసందడి...1940 నుండి 1990 వరకు...👇*

అయ్యా కట్నం ముఖ్యం గాదండీ...మాకు లాంఛనాలేమిస్తారూ... అడబడుచులు ఆరుగురు... వాళ్ళసంగతేవేటీ... పిల్లవాడికి బండి కావాలట... మీపిల్లకి బంగారం మీరేలాగూ పెట్టుకుంటారుకదా... పెళ్లి మీ ఇంటివద్దే... మేము తరలి రావటా నికి...ఎన్ని బస్సులు పెడతారో...
పెళ్లి కుమారుని బావలు కార్లో తప్పరారట... మీ ఇంటి దగ్గర పెళ్లంటే కాస్త ఇబ్బందే...
 ఓ కళ్యాణ మండపం చూద్దురూ... కాస్త ఘనంగా పెళ్లిచేస్తే నలుగురూ మెచ్చుకోరూ... ఈ రోజుల్లో అంతా టేబుల్ మీల్స్ అంటున్నారు... కొంపదీసి... చాపకూడనరుగదా... కాస్తబ్యాండు మేళం ఉంటేచూడండి... మా బంధువర్గానికి శెలవలు కష్టమట... అటుంచి ఆటే ట్రైన్సికి వెళ్తారుట... వివరాలిస్తాను... రిజర్వేషన్స్ దొరుకుతాయేమో చూద్దురూ...!

*పెళ్లిసందడి1990 నుండి 2020 వరకు...👇*

కట్నం మాకు పట్టింపు లేదండీ...పిల్లలిద్దరూ ఉద్యోగులే కదా... కాకపోతే... లాంఛనాలు ఘనంగా ఉండాలి... పెళ్లి మీరెలా చేశారని మేమడగం... రి సేపక్షను హైదరాబాదులోనే... మాకుసర్కిల్ ఎక్కువండీ...తప్పదు...ఏ ఫంక్షన్హాలో బుక్చేయాలి మరి... ఘనంగా మాహోదాకు తగ్గట్టు చేస్తారుకదా...!

*పెళ్లి సందడి మార్చి.2020 నుండి...👇*

మాఅబ్బాయి పెళ్లి... ఫలానా అమ్మాయితో... వాళ్ళింట్లోనే...మీరెవరూ పెళ్ళికి రావద్దు...50 మందికే పరిమితం. ఆడ పెళ్లి వాళ్ళకి 20 ఇవ్వగా మిగిలింది 30. అందులో మీపేరులేదు...కనుక మీరొస్తే పోలీసులు చర్య తీసుకొంటారు...అందుకు మాబాధ్యత లేదు...
ఇక... పెళ్లిలో...ఎవరి మాస్కులు వారివే... సానీటైజ్రు ఎవరికి వారే... మెసేజీలు పెట్టాం...లింక్ ఇచ్చాము... చూడాలనిపిస్తే... నీకొంపలోనుండే చూసుకోవచ్చు...
ఖంగారు పడకండి... పెళ్ళిభోజనాలు లేవు... కరోనా సమయంలో... క్యాటరింగ్ వాళ్ళు. హోం ఐసోలేషనులో ఉన్నారుట...ఇళ్ళు కదిలితే కాళ్లిరగ దీస్తామని... పోలీసువారు వారికి మనవి చేసుకొన్నారుట...ఇక పరిస్థితులు చక్కబడినతర్వాత... ఘనంగా రెసెప్సను... పెట్టుకోవాలని... ఉభయపార్టీల అంగీకారం. అప్పటికి పోయినవారు పోగా... మిగిలినవారితో... అప్పటి ప్రభత్వ నియమనిబంధనలనుసరించి... రిసెప్షన్ ఉంటుంది...!

*నీ పాద కమల సేవయు

*ఓం నమో భగవతే వాసుదేవాయ*

సందేహం;- జీవితం సఫలం కావడానికి మనం భగవంతుడిని ఏమి కోరుకోవాలి?

సమాధానం;- ఇది మంచి ప్రశ్న. ఒక సంఘటనలోకి వెళ్ళి దీనికి సమాధానం తెలుసుకుందాం.

కంసుని ఆహ్వానంపై అక్రూరుడితో బలరాముడు, కృష్ణుడు రేపల్లె నుండి మధురకు వచ్చారు. రాజవీధిలో నడుస్తున్నారు. మాలలు కట్టే సుదాముడింటికి వచ్చారు. అతని మాలా సత్కారంతో వారు సంతోషించారు. అపుడు శ్రీకృష్ణుడు సుదాముడి భుజంపై చేయివేసి *ఏం కావాలో కోరుకో* అని అప్యాయంగా అడిగాడు. అపుడు శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడే అని తెలిసినా సుదాముడు ఏమడిగాడు? మడులా, మాన్యాలా? వనాలా, భవనాలా, వజ్రాలా, వైఢూర్యాలా? అందాల అతివలా, అష్టైశ్వర్యాలా? ఇవేం కోరుకోలేదు. మరేం కోరుకున్నాడు?

*నీ పాద కమల సేవయు*
*నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాం*
*తా పార భూత దయయును*
*తాప సమందార నాకు దయసేయగదే!*

"సదా నీ సేవాభాగ్యం ఇలాగే కల్పించు స్వామీ! అదే పదివేలు. తనకంటే తన భక్తులను ప్రేమించేవారంటే భగవంతుడికి ప్రీతి. అదుగో అటువంటి స్వామి భక్తులతోనే తాను సహవాసం చేయాలి. అంతేనా ఎల్లవేళలా సర్వప్రాణుల పట్ల తాను దయగలిగి ప్రవర్తించాలి. తాపసులకు, సాధు జనులకు కల్పవృక్షం వంటి వాడా ఇవే నాకు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను"

అని నమస్కరించాడు సుదాముడు. జీవితం సార్ధకం కావడానికి ఎవరైనా ఇంతకంటే కోరదగిన దేముంటుంది?

*జై శ్రీకృష్ణ*

తిరుమల సమాచారం..

ఓం నమో వేంకటేశాయ, తిరుమల సమాచారం.....

సెప్టెంబ‌రు 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు ఏకాంతంగా శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు

          తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు సెప్టెంబ‌రు 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. సెప్టెంబ‌రు 18న అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు. బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో సెప్టెంబ‌రు 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది. క‌రోనా వ్యాధి వ్యాప్తిని అరిక‌ట్టే చ‌ర్య‌ల్లో భాగంగా, భ‌క్తుల‌కు, టిటిడి ఉద్యోగుల‌కు ఈ వ్యాధి వ్యాపించ‌కుండా నివారించేందుకు ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. ఈ ఉత్స‌‌వాల్లో విశేష‌మైన రోజుల వివ‌రాలిలా ఉన్నాయి.

సెప్టెంబ‌రు 19న - ధ్వ‌జారోహ‌ణం

సెప్టెంబ‌రు 23న - గ‌రుడ‌సేవ‌

సెప్టెంబ‌రు 24న - స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వం(స‌ర్వ‌భూపాల వాహ‌నం)

సెప్టెంబ‌రు 26న - ర‌థోత్స‌వం(స‌ర్వ‌భూపాల వాహ‌నం)

సెప్టెంబ‌రు 27న - చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం.

       కాగా, కోవిడ్-19 నిబంధనల నేపథ్యంలో సెప్టెంబ‌రు 24న స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వం, సెప్టెంబ‌రు 26న ర‌థోత్స‌వం ఉండని కారణంగా ఈ రెండు రోజుల్లో సర్వభూపాల వాహనంపై శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి వేంచేపు చేస్తారు.

*రెవెన్యూ కోర్టుల రద్దు!*

*రెవెన్యూ కోర్టుల రద్దు!*

*తెరపైకి జిల్లా ల్యాండ్‌ ట్రైబ్యునళ్లు*
*విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు*

*తహసీల్దారు... ఆర్డీవో.. జేసీ అధికారాల్లో కత్తెర*👌

*రెవెన్యూ కోర్టుల రద్దు!*🙏

 *ఆర్‌ఒఆర్‌-2020 చట్టంతో* రెవెన్యూ సంస్కరణలకు తెరతీసిన ప్రభుత్వం రెవెన్యూ కోర్టులను పూర్తిగా రద్దు చేయనుంది. ఏళ్ల తరబడి తేలకుండా రెవెన్యూ కోర్టుల్లో వ్యాజ్యాలు కొనసాగడం, క్షేత్ర స్థాయిలో భూ వివాదాలు పెరుగుతుండటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వేగంగా, పారదర్శకంగా తీర్పులు ఇచ్చేలా రెవెన్యూ కోర్టుల స్థానంలో ల్యాండ్‌ ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ వీటిని నెలకొల్పుతారు. ఇప్పటి వరకు భూ యాజమాన్య హక్కుల కల్పన చట్టం (ఆర్‌ఒఆర్‌) కింద తహసీల్దారు, ఆర్డీవో, సంయుక్త కలెక్టర్లు (ప్రస్తుతం అదనపు కలెక్టర్లు) రెవెన్యూ కోర్టులను నిర్వహిస్తున్నారు. ఆ పైన భూ పరిపాలన కమిషనర్‌, రెవెన్యూ మంత్రి వరకు అప్పీళ్లకు అవకాశం ఉంది. భూ వివాదాల్లో ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేయడం, తీర్పులు ఇచ్చి వివాద పరిష్కారం చేసే అధికారాలు దిగువ స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తహసీల్దారు నుంచి సంయుక్త కలెక్టర్‌ వరకు ఉన్న కోర్టుల్లో పలు రకాల కేసుల విచారణ తేలడం లేదని ప్రభుత్వం గమనించింది. వివాదాలకు పరిష్కారం లభించక ఏళ్లతరబడి భూ యజమానులు కార్యాలయాల చుట్టూ తిరగడం, చివరికి అప్పీళ్లకు పై కోర్టులను ఆశ్రయిస్తున్నారని గుర్తించింది. ఈ క్రమంలో తహసీల్దారు నుంచి సంయుక్త కలెక్టర్‌ వరకు ఉన్న కోర్టులను ప్రభుత్వం రద్దు చేస్తోంది. కొత్త చట్టంతో వారి అధికారాలకు కత్తెర పడనుంది. వాటి స్థానంలో జిల్లా స్థాయిలో ట్రైబ్యునళ్లు పనిచేయనున్నాయి.

*వివరాలు సేకరించిన ప్రభుత్వం*
కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలపై భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) జిల్లా కలెక్టర్లను నివేదిక కోరారు. వివిధ కోర్టుల్లో నమోదైనవి, వాదోపవాదాలు జరుగుతున్నవి, అప్పీళ్లకు వెళ్లినవి.. ఇలా పూర్తి వివరాలను ప్రభుత్వం తెప్పించుకుంది. కొన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున కేసులు కొనసాగుతున్నట్లు ఈ సందర్భంగా ఉన్నతాధికారులు గుర్తించారు.

*హైదరాబాద్‌ శివారు* ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఓ రెండున్నర ఎకరాల పట్టా భూమి వివాదంలో పడింది. తహసీల్దారు కోర్టులో కొంత కాలం సాగి...చివరికి తీర్పు వచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ భూ యజమానులు పైకోర్టును ఆశ్రయించారు. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. నేటికీ కేసు కొలిక్కిరాలేదు’’ అని ఒక అధికారి వివరించారు. ఇలాంటి కేసులు దండిగా ఉన్నాయని తెలిపారు.

*నమోదవుతున్న కేసుల్లో సరిహద్దు*
వివాదాలు, భాగ పంపిణీ, వారసత్వ బదిలీ, యాజమాన్య హక్కులు తదితరమైనవి ఉంటున్నాయి.

*ఆన్‌లైన్‌లో కేసులు.. తీర్పుల వివరాలు*
*భూ సంబంధిత కేసుల* వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో ఉంచేలా చర్యలు చేపడుతున్నారు. ఏ కోర్టులో.. ఏ కేసు.. ఏ దశలో ఉందో తెలిపే వివరాలు ప్రభుత్వ పోర్టల్లో ఉంచనున్నారు. దీంతోపాటు తహసీల్దారు నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు భూ యజమానులకు జారీ చేసే నోటీసులు, ప్రజలు ఇచ్చే దరఖాస్తులు, ఫిర్యాదులను కూడా ఉంచుతారు. భూ వివాదా లపై వచ్చే అంతిమ తీర్పులను ప్రదర్శించడం ద్వారా కొత్త వివాదాలు తలెత్తకుండా ప్రజలను అప్రమత్తం చేయొచ్చన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు.

*విశ్రాంత న్యాయమూర్తుల నేతృత్వం*
రాష్ట్రంలో ఏర్పాటయ్యే ల్యాండ్‌ ట్రైబ్యునళ్లకు విశ్రాంత న్యాయమూర్తులు నేతృత్వం వహించనున్నారు. ఒక అదనపు కలెక్టర్‌, డిప్యూటీ కలెక్టర్‌, ఇతర శాఖలకు చెందిన పలువురు అధికారులను ట్రైబ్యునళ్లలో నియమిస్తారు. భూ సంబంధిత నోటీసుల జారీ, దర్యాప్తు అధికారాలు వీటికి ఉండనున్నాయి.

మూకపంచశతి

**దశిక రాము**

*జయ జయ జగదంబ శివే*
*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*
*జయ జయ మహేశదయితే*
*జయ జయ చిద్గగన కౌముదీధారే||*

🏵️ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏

🌷 **మూకపంచశతి** 🌷

🌷 **ఆర్యాశతకము**🌷

🌹4.
**కుటిలకచం కఠిన కుచం**

**కుందస్మితకాంతి కుంకుమచ్ఛాయమ్౹**

**కురుతే విహృతిం కాంచ్యామ్**

**కులపర్వత సార్వభౌమ సర్వస్వమ్౹౹**

🌺భావం:
అందముగా వంకరలు తిరిగిన ముంగురులతో, కఠినమైన కుచములు ,కుందపుష్పములవంటి తెల్లనైన మందహాసముతో,కుంకుమవర్ణ కాంతితో కులపర్వత సార్వభౌముడైన హిమవంతుని గారాబుపుత్రిక,ఆతని సర్వస్వమైన శ్రీ కామాక్షీ దేవి కాంచీనగరమున విహరించుచున్నది.
🙏అమ్మా ,కామాక్షీ !మమ్ముల బ్రోవుము తల్లీ 🙏

🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱

   🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹

సశేషం....

🙏🙏🙏
సేకరణ

**ధర్మము-సంస్కృతి**
🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను**

**పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**

**ధర్మో రక్షతి రక్షితః**

*విష్ణు సహస్ర నామాలు*



శ్రీవిష్ణు సహస్ర నామ మహామంత్రం మహాభారతంలోని ఆనుశాసనిక పర్వంలోనిది. ఈ పర్వములో రెండు అద్భుత ఘట్టాలు ఉన్నాయి. ఒకటి గీతోపదేశం. మరొకటి శ్రీవిష్ణు సహస్ర నామ ఉపదేశం. విష్ణు సహస్ర నామాల్లోని ప్రతి నామం ఒక మంత్రం. ఈ నామాలను మహామాలా మంత్రం అనీ అంటారు. గంగా శంతనులకు జన్మించిన భీష్ముడికి ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడు. తండ్రి కోరిక తీర్చడం కోసం రాజ్యాధికారాన్ని శాశ్వతంగా విడిచిపెట్టాడు. తన తమ్ముల నూట అయిదుగురు రాజ కుమారులనూ ప్రేమతో పెంచి పోషించాడు. ద్రోణాచార్యుణ్ని గురువుగా నియమించి వారికి యుద్ధవిద్యలు నేర్పించాడు.
మాయాజూదంలో పైచేయి సాధించి పాండవులను ధార్తరాష్ట్రులు అరణ్యాలకు పంపారు. అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తిచేసుకొని వచ్చిన పాండవులకు నియమానుసారం వారి రాజ్యాన్ని కౌరవులు అప్పగించలేదు. మహా భారత యుద్ధం జరిగింది. విజయం పాండవులను వరించింది. భీష్ముడు పదోనాటి యుద్ధంలో నేలకు ఒరిగి అంపశయ్యపై పడుకొన్నాడు. ఆ సమయంలో ఆయన శ్రీకృష్ణుని స్మరించని క్షణం లేదు. అంతిమక్షణాల్లో శ్రీకృష్ణుడి దివ్యతేజాన్ని స్మరించుకొని మహాద్విభూతినంతా ఒక్కసారిగా తన హృదయ ఫలకంపై చిత్రించుకొన్నాడు. అనంత గుణాలతో, అనంత నామాలతో ఆ అమృత స్వరూపుణ్ని మననం చేసుకొన్నాడు. ఆ వాగ్రూప యజ్ఞాన్ని గ్రహించి భక్తవత్సలుడు సహస్రనామ స్తోత్రమంత్రాన్ని ప్రసాదించాడు. భువిపై అందరూ ఈ మహామాలా మంత్రాన్ని జపించి తరించేందుకు, ధర్మరాజుకు బోధించి విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందని శ్రీహరి చెప్పడంతో- యుద్ధానంతరం భీష్ముడు విష్ణు సహస్ర నామాలను ధర్మరాజుకు ఉపదేశిస్తాడు. 
విష్ణు సహస్ర నామ స్తోత్రంలో వెయ్యికి మించిన నామాలు ఉన్నాయి. మహావిష్ణువుకు సంబంధించినంతవరకు సహస్రం అంటే అనంతం. ఈ నామాలలో ఒకే పేరు రెండు, మూడుసార్లు సైతం కనిపిస్తుంది. ఏ నామం, ఎక్కడ ఎన్నిసార్లు కనబడినా ఆ నామాలకు ప్రతిచోటా ప్రత్యేక అర్థం ఉండటం విశేషం. ఈ మహా మంత్రానికి మంత్ర ద్రష్ట వేదవ్యాసుడు. ఈ మంత్రం అనుష్టుష్‌ అనే ఛందంలో ఉంది. అంటే నోటితో పలికేదని అర్థం. నలుగురికీ వినిపించేలా ఈ మంత్రాన్ని చదవాలి. ఈ మంత్రానికి అధిష్ఠాన దేవత శ్రీ మహావిష్ణువు. దీనికి స్రష్ట దేవకీనందనుడైన శ్రీకృష్ణుడు. ధర్మాన్ని, ధర్మాచరణ ద్వారా లభించే శాంతినీ అనుభవించే శక్తి ఈ మంత్రం వల్ల లభిస్తుందన్నది రుషి వాక్యం. ఈ మంత్రోచ్ఛారణ వల్ల మూలాధారచక్ర అధిష్ఠాన దేవత సిద్ధవిద్యాదేవి చైతన్యవంతమై జ్ఞానం సంపూర్ణమవుతుందన్నది నమ్మకం.
విష్ణుసహస్రనామాలు పలుకుతుంటే దేహంలో అనిర్వచనీయమైన అలౌకిక శక్తి, భగవంతుడు తనలో ఉన్నాడనే భావం, ‘నేను పవిత్రుణ్ని’ అనే అభిప్రాయం కలుగుతాయన్నది సాధకుల అనుభవం.
రాగద్వేషాలతో కలుషితం కాని భావసంచయం ఉత్తేజపరుస్తుందని, విష్ణు సహస్ర నామార్చనతో అనుభూతికి వచ్చే శక్తి ఆధ్యాత్మిక జీవితంలో అద్భుత విజయాలను చేరువ చేస్తుందన్నది సాధకుల మాట.

Yogasanas




శ్రీరామనామరత్నావళి


1) దశరథనందన శ్రీరామా
2) జనకాత్మజప్రియ శ్రీరామా
3) తాటకసంహర శ్రీరామా
4) యజ్ఞరక్షకా శ్రీరామా
5) కోదండధరా శ్రీరామా
6) లక్ష్మణాగ్రజా శ్రీరామా
7) సేతుబంధనా శ్రీరామా 
8) వాలిసంహారకశ్రీరామా
9) రావణమర్దనశ్రీరామా
10) పవనాత్మజస్తుత శ్రీరామా
11) ఇనకులతేజా శ్రీరామా
12) అద్భుతవిగ్రహశ్రీరామా
13) అమరపూజితా శ్రీరామా
14) కాలాగ్నిసమా శ్రీరామా
15) కబంధమర్దన శ్రీరామా
16) కరుణాజలధే శ్రీరామా
17) మేఘగంభీరా శ్రీరామా
18) ఆర్తరక్షకా శ్రీరామా
 19) త్యాగమూర్తీ శ్రీరామా
20) త్యాగరాజసన్నుత శ్రీరామా
21) తారకనామా శ్రీరామా
22) సంసారతారక శ్రీరామా
23) పూర్వభాషణా శ్రీరామా
24) మందస్మితానన శ్రీరామా
25) ప్రియసంభాషణ శ్రీరామా
26) ధర్మనిష్ఠాపర శ్రీరామా
27) దారిద్ర్యహరా శ్రీరామా
28) దుఃఖనివారక శ్రీరామా
29) సారసాక్షా శ్రీరామా
30) వేదవినీతా శ్రీరామా
31) శస్త్రాస్త్రప్రవీణ శ్రీరామా 
32) వరసిద్ధిదాయక శ్రీరామా
33) మునిజనసేవిత శ్రీరామా
34) వనసంచారా శ్రీరామా
35) వీరాసనస్థిత శ్రీరామా
36) కాలస్వరూపా శ్రీరామా
37) శివచాపభంజన శ్రీరామా
38) సంకటమోచన శ్రీరామా
39) మోక్షదాయకా శ్రీరామా
40) సప్తతాళభంజన శ్రీరామా
41) జయంతరక్షక శ్రీరామా
42) భక్తదాసపోషక శ్రీరామా
43) భద్రాచలస్థిత శ్రీరామా
44) అయోధ్యవాసీ శ్రీరామా
45) సుగ్రీవవరదా శ్రీరామా
46) మృగయాసంహర శ్రీరామా
47) కుంభకర్ణభంజన శ్రీరామా
48) ఋష్యాశ్రమప్రియ శ్రీరామా
49) ఆజానబాహూ శ్రీరామా
50) శివధ్యానపరా శ్రీరామా
51) బ్రహ్మజ్ఞానప్రద శ్రీరామా
52) అధర్మభంజన శ్రీరామా
53) సకలగుణనిధీ శ్రీరామా
54) ప్రశాంతాత్మా శ్రీరామా
55) పీతాంబరధర శ్రీరామా
56) గుహానుగ్రహ శ్రీరామా
57) కబంధసంహర శ్రీరామా
58) ఖరదూషణహర శ్రీరామా
59) లవకుశజనకా శ్రీరామా
60) స్నేహవాత్సల్యా శ్రీరామా
61) పురుషమోహనా శ్రీరామా
62) ప్రచండవిక్రమ శ్రీరామా
63) సరయూతటచర శ్రీరామా
64) లలితారూపా శ్రీరామా
65) హిమకరమానస శ్రీరామా
66) రాజ్యకౌశల్యా శ్రీరామా
67) రాగద్వేషరహితా శ్రీరామా
68) యోచనభాషణ శ్రీరామా
69) యోగదాయకా శ్రీరామా
70) అజ్ఞానధ్వాంతా శ్రీరామా
71) విజ్ఞానప్రద శ్రీరామా
72) ఏకపత్నీవ్రత శ్రీరామా
73) పాదుకదాయక శ్రీరామా
74) నిశ్చయాత్మా శ్రీరామా 
75) నిర్వికల్పా శ్రీరామా
76) నిష్కలంకా శ్రీరామా
77) నీలమేఘశ్యామా శ్రీరామా
78) సంసారభేషజ శ్రీరామా
79) పితృవాక్యప్రియ శ్రీరామా
80) మంగళదాయక శ్రీరామా
81) కౌశికప్రియా శ్రీరామా
82) కౌశల్యాకృతి శ్రీరామా
83) శబరిఫలస్వీకృత శ్రీరామా
84) చందనచర్చిత శ్రీరామా
85) మణిమయభూషణ శ్రీరామా
86) విష్ణుచాపభంజన శ్రీరామా
87) శంబూకహరా శ్రీరామా
88) కేయూరకంకణ శ్రీరామా
89) మానవావతారా శ్రీరామా
90) వాల్మీకిసంస్తుత శ్రీరామా
91) చిత్రకూటవాసా శ్రీరామా
92) పురాణపురుషా శ్రీరామా
93) మితసంభాషణ శ్రీరామా
94) పవిత్రచరితా శ్రీరామా
95) పాపభంజనా శ్రీరామా
96) యజ్ఞఫలదాయక శ్రీరామా
97) యోగానుష్ఠాన శ్రీరామా
98) భ్రాంతిభంజనా శ్రీరామా
99) వశిష్ఠప్రియ శ్రీరామా
100) శంకరప్రియా శ్రీరామా
101) హనుమవాహనా శ్రీరామా
102) పుణ్యతీర్థరూపా శ్రీరామా
103) సత్యవ్రతా శ్రీరామా
104) మునివేషధారీ శ్రీరామా
105) సూక్ష్మగ్రాహీ శ్రీరామా
106) యజ్ఞఫలజనితా శ్రీరామా
107) మాయావివర్జిత శ్రీరామా
108) ఇంద్రియనిగ్రహ శ్రీరామా
                               జయ జయ జయ జయ శ్రీరామా
                                జయ జయ జయ జయ రఘురామా
                                జయ జయ జయ జయ శ్రీరామా
                                జయ జయ జయ జయ రఘురామా

Unakoti Temple, Tripura.


☝️Unakoti Temple, Tripura.

Here in the jungle, the ninety-nine lakh ninety-nine thousand nine hundred ninety-nine gods idols of Shiva and all the gods have been cut in the rocks. The population is not so much here. There is no history of when and who made these statues, just guessing that these statues were made by a Shiva devotee in the 8th-9th century. 'Unakotiswar Kaal Bhairav' is the chief of the 30 feet high standing rock in the hills of Unakoti

The waterfall falling from above on the statue of Ganeshji on the Raghunandan mountains of Unakoti creates a wonderful view. Unakoti means one less than one crore. Perhaps it is very difficult to make such statues by cutting mountains with modern instruments.
ஓம் நமசிவாய!












ఉష‌శ్రీ అన్న‌య్య

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కాక‌ర‌ప‌ర్రును పండితుల అగ్ర‌హారంగా భావ‌న చేస్తారు.
ఎంద‌రో ఉద్దండ పండితులు, ఘ‌నాపాఠీలు కాక‌ర‌ప‌ర్రువార‌మ‌ని గ‌ర్వంగా త‌లెత్తుకుని చెప్పుకుంటారు.
అక్క‌డ పుట్టిన మ‌రో పండితుడు పురాణ‌పండ సూర్య‌ప్ర‌కాశ దీక్షితులు.
పురాణ‌పండ రామ‌మూర్తి, కాశీ అన్న‌పూర్ణ‌మ్మ‌ల ఇంట పెద్ద కుమారుడిగా 1928 మార్చి 16వ తేదీన భూమి మీద‌కు వ‌చ్చారు. అక్క‌డే ప‌సిపిల్ల‌వాడిగా పారాడారు.
కొద్ది కాలం త‌ర‌వాత తూర్పు గోదావ‌రి జిల్లా ఆల‌మూరు గ్రామానికి ఈ కుటుంబం త‌ర‌లి వ‌చ్చింది.
ఉష‌శ్రీ త‌ర‌వాత ఆ ఇంట్లో న‌లుగురు చెల్లెళ్ల‌లు, న‌లుగురు త‌మ్ముళ్లు అనుబంధంగా పుట్టారు.
అంద‌రికీ ఉష‌శ్రీ అన్న‌య్య అంటే గౌర‌వంతో కూడిన భ‌యం.
అంద‌రూ ఉష‌శ్రీ‌ని అన్న‌య్య అని పిల‌వ‌లేదు. అబ్బాయీ అని ఆప్యాయంగా పిలుచుకున్నారు.
ఉష‌శ్రీ‌కి త‌ల్లి అన్న‌పూర్ణ‌మ్మ దైవ‌స‌మానం.
చిన్న‌నాటి నుంచి త‌ల్లికి వంట‌లో ఎంతో స‌హాయ‌ప‌డేవారు. ప‌చ్చ‌ళ్లు రుబ్బి ఇచ్చేవారు. త‌మ్ముళ్లు, చెల్లెళ్ల ఆల‌న‌పాల‌న చూసుకున్నారు. వారంద‌రికీ గోరుముద్ద‌లు తినిపించి తానే త‌ల్లి అయ్యారు.
విద్యాబుద్ధులు నేర్పించే గురువు అయ్యారు.
తండ్రి రామ‌మూర్తిగారు రామాయ‌ణ‌మ‌హాభార‌త ఉప‌న్యాసాలు ఇస్తూ ఇంటికి కావ‌ల‌సిన ఆదాయం సంపాదించేవారు. అందువ‌ల్ల ఇంటి బాధ్య‌త ఇంటి పెద్ద కొడుకుగా ఉష‌శ్రీ స్వ‌యంగా స్వీక‌రించారు.
ఆడుతూపాడుతూ తిర‌గ‌వ‌ల‌సిన వ‌య‌స్సులోనే బాద్య‌త‌లు తీసుకోవ‌టం ఉష‌శ్రీ‌కి త‌ల్లి నుంచి వ‌చ్చిన సంస్కారం కావ‌చ్చు, భ‌గ‌వంతుడు ఇచ్చిన ఆదేశం కావ‌చ్చు.
ఏమైతేనేం వారి ప‌ట్ల కొంచెం క‌ఠినంగానే ఉండేవారు ఉష‌శ్రీ అని త‌మ్ముళ్లు, చెల్లెళ్లు గ‌ర్వంగా చెబుతారు.
ఆల‌మూరులో పురాణ‌పండ వారి వీధి నేటికీ అంద‌రికీ సుప‌రిచిత‌మే.
ఆ వీధి చివ్వ‌ర ఉష‌శ్రీ అడుగుల స‌వ్వ‌డి వినిపిస్తే చాలు, ఇంటిల్లిపాదీ గబ‌గ‌బ క్ర‌మ‌శిక్ష‌ణ‌గా ప‌నుల్లో నిమ‌గ్న‌మైపోయేవారు.
ఆ వీధిలో సంచ‌రించే శున‌కాలు సైతం పారిపోయేవ‌ని చెప్పుకుంటారు అంతా.
అతి అతిశ‌యోక్తి కావ‌చ్చు, యాదృచ్చికం కావ‌చ్చు.
ఉష‌శ్రీ ఇన్ని బాద్య‌త‌లు స్వీక‌రిస్తూనే సాహిత్య వ్యాసంగంలో పూర్తిగా నిమ‌గ్న‌మ‌య్యారు.
బాల్యంలో త‌ల్లి అల‌వ‌ర్చిన అక్ష‌ర‌దీక్ష ఉష‌శ్రీ‌ని తెలుగువారికి సుప‌రిచితుడ‌య్యేలా చేసింది.
పోత‌న భాగ‌వ‌తం కంఠ‌పాఠం చేయించింది త‌ల్లి.
ఆ అక్ష‌ర‌దీక్ష‌తోనే మూడు ప‌దులు నిండ‌కుండానే వ్యాస భార‌త అనువాదంలో తండ్రిగారికి పూర్తిగా తోడుగా నిలిచారు.
సంపాద‌క బాధ్య‌త తీసుకుని, వ్యాస‌భార‌తాన్ని సంపూర్ణంగా అనువ‌దించారు. తండ్రిగారు గ్రాంథికంగా రాసిన వ‌చ‌నాన్ని, స‌ర‌ళ వ్యావ‌హారికంలోకి మార్చారు.

అప్పుడే ఉష‌శ్రీ మ‌దిలో బీజం ప‌డి ఉంటుంది.
ఆ త‌ర‌వాత భార‌తాన్ని క‌నీసం ఇర‌వై సార్లు ర‌చించి ఉంటారు.
ఉష‌శ్రీ జీవితం న‌ల్లేరు మీద న‌డ‌క కాదు..
బాల్యం నుంచే ఎన్నో ఇబ్బందులు ప‌డ్డారు.
కొన్నిసార్లు తిండి లేక‌పోతే ఉన్న కాస్త అన్నంలో ప‌ల్చ‌టి మ‌జ్జిగ వేసుకుని లేచిన రోజులు ఉన్నాయ‌ని ఉష‌శ్రీ సోద‌రులు గుర్తు చేసుకుంటారు. మా అన్న‌య్య మా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. మ‌మ్మ‌ల్ని కొట్టి చ‌దివించ‌టం వ‌ల్లే మేమంతా ప్ర‌భుత్వ ఉద్యోగాలు చేసి, సుఖ‌ప‌డ్డాం అంటారు ఆనందంగా.
ఉష‌శ్రీ సోద‌రులు వ‌రుస‌గా పురాణ‌పండ రాధాకృష్ణ‌ మూర్తి, పురాణ‌పండ కామేశ్వ‌ర‌రావు, పురాణ‌పండ రంగ‌నాథ్‌, పురాణ‌పండ రాఘ‌వ‌రావు.
చెల్లెళ్లు అల్లంరాజు సుబ్బ‌లక్ష్మి, ద్విభాష్యం కామేశ్వ‌రి, కూచిభొట్ల రాజ్య‌ల‌క్ష్మి, అల్లంరాజు సూర్య‌ప్ర‌భ‌.
అంద‌రూ హాయిగానే జీవించారు. మంచి ప‌ద‌వుల‌లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు.
ఉష‌శ్రీ‌కి ఎంత వ‌య‌స్సు వ‌చ్చినా త‌ల్లి ముందు మాత్రం చంటి పిల్ల‌వాడిగానే ఉండేవారు.
ప్ర‌తి సంవ‌త్స‌రం వీలైనంత‌వ‌ర‌కు గుర్తు పెట్టుకుని, త‌న పుట్టిన‌రోజు అంటే ఉగాదికి నాలుగు రోజుల ముందు వ‌చ్చే ద్వాద‌శినాడు త‌ల్లి ద‌గ్గ‌ర‌కు ఆశీర్వ‌చ‌నం కోసం వెళ్లేవారు. త‌ల్లికి సాష్టాంగ ప్ర‌ణామం చేసి, ఆవిడ చేత త‌ల‌కు నూనె రాయించుకుని, త‌లంటుకుని, ఆ త‌ల్లి ఇచ్చిన ధ‌వ‌ళ వస్త్రాలు ధ‌రించి, నుదుటిన చిన్న కుంకుమ బొట్టు పెట్టుకుని, ఆవిడ‌కు ఆనందం క‌లిగిస్తూ, తాను ప‌ర‌వ‌శించేవారు. త‌ల్లిని సాక్షాత్తు ఆ కాశీ అన్న‌పూర్ణ‌మ్మ‌గానే భావ‌న చేసేవారు.
అందునా ఆవిడ వేష‌ధార‌ణ కూడా పార్వ‌తీదేవిలాగే ఉండేది.
నుదుట‌న వెడ‌ల్పుగా పెద్ద కుంకుమ బొట్టు, రెండు ముక్కుల‌కు ముక్కు పుడ‌క‌లు, మ‌ధ్య‌న అడ్డ‌బాసి, కాళ్ల‌కు క‌డియాలు, క‌చ్చాపోసి క‌ట్టుకునే జ‌రీ చీర‌, క‌ళ్ల‌కు నిండుగా కాటుక‌, ముడి చుట్టిన జుట్టు... ఎవ‌రైనా స‌రే ఆ త‌ల్లిని చూస్తే న‌మ‌స్క‌రించ‌కుండా ఉండ‌లేరు. రూపంతో పాటు అంద‌మైన మ‌న‌స్సు ఆవిడ‌ది. ఆ త‌ల్లి సుగుణాల‌ను అందిపుచ్చుకున్నారు ఉష‌శ్రీ‌.
ఇక ర‌చ‌నా వ్యాసంగం విష‌యానికొస్తే...
ఆల‌మూరులో ఉష‌శ్రీ‌తో పాటు చామ‌ర్తి క‌న‌క‌య్య‌, (క‌న‌క్ ప్ర‌వాసి), పోలాప్ర‌గ‌డ స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి .. వీరిద్దరితో క‌లిపి ఈ ముగ్గురినీ ఆల‌మూరు క‌విత్ర‌యం అనేవారు. ప్ర‌తిరోజూ ఈ ముగ్గురూ క‌లిసి గోదావ‌రి ఒడ్డుకి వెళ్లి, సాహిత్య చ‌ర్చ‌లు చేసేవారు. ప్ర‌తిరోజూ ఓ క‌థ రాసి, ప‌త్రిక‌ల‌కు పంపేవారు. ప్ర‌తి ప‌త్రిక‌లో రోజూ వీరి ముగ్గురి క‌థ‌లు వ‌చ్చి తీరాలి అనే ప‌ట్టుద‌ల‌తో ఉండేవారు. ఆ ఊరిలో ఒక ఇంటిలో పెద్ద వేడుక జ‌రుగుతోంది. ఆ వేడుక‌లో ఏదో ఒక విల‌క్ష‌ణ‌మైన కార్య‌క్ర‌మం చేయాల‌నుకున్నారు ఈ క‌విత్ర‌యం. ఆధునిక భువ‌న విజ‌యం చేద్దామ‌నుకున్నారు. అంతే ఆలోచ‌న‌కు కార్య‌రూపం తీసుకువ‌చ్చారు. విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌, శ్రీ‌శ్రీ‌, జ‌మ‌ద‌గ్ని శ‌ర్మ వంటి ఉద్దండుల‌ను పిలిచారు. కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అయ్యింది. ఆ విధంగా ఉష‌శ్రీ ఆధునిక భువ‌న‌విజ‌యానికి ఆద్యుడ‌య్యారు.
దేనినీ అనుక‌రించ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని ఉష‌శ్రీ, క‌విస‌మ్రాట్ విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ చెప్పిన‌ట్లుగా ఇది ఉష‌శ్రీ మార్గ‌ము అన్న ప్ర‌తిష్ట బ‌డ‌యుగాక అన్న చందాన త‌న మార్గాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌గా ఉర‌క‌లు వేయించారు.
1961 ప్రాంతంలో కృష్ణాప‌త్రిక‌లో పెళ్లాడే బొమ్మా పేరున ఒక న‌వ‌లా లేఖావ‌ళి ప్రారంభించారు. 30 వారాల పాటు నిరాఘాటంగా ఆ లేఖావ‌ళి ప్ర‌చురిత‌మైంది. పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఒక అన్న‌గా పురాణేతిహాసాల నుంచి ఉదాహ‌ర‌ణ‌లు ఇవ్వ‌ట‌మే కాకుండా, ప్ర‌స్తుత స‌మాజంలోని కుళ్లును ఎలా ఎదుర్కోవాలో బోధించారు.
సాహితీ ప్ర‌పంచంలో న‌వ‌లా లేఖావ‌ళి ర‌చించిన ఏకైక‌ వ్య‌క్తి ఉష‌శ్రీ‌
భీమ‌వ‌రం క‌ళాశాల‌లో ఉష‌శ్రీ కోసమ‌ని ప్ర‌త్యేకంగా తెలుగు శాఖ‌ను ప్రారంభించారు ఉష‌శ్రీ గురువులు, పితృతుల్యులు అయిన శ్రీ‌మాన్ నండూరి రామ‌కృష్ణ‌మాచార్యులు. అక్క‌డ చాలా చిత్రం జ‌రిగేద‌ట‌. ఉష‌శ్రీ‌కి బాల్యం నుంచి ధ‌వ‌ళ వ‌స్త్రాలు ధ‌రించ‌టం అల‌వాటు. చిన్న‌త‌నంలో పైజ‌మా లాల్చీ ధ‌రించేవారట‌. క‌ళాశాల‌కు మాత్రం తెల్ల పంచె, లాల్చీ, గోల్డు ఫ్రేమ్ క‌ళ్ల‌జోడు ధ‌రించి వ‌స్తుంటే, అధ్యాప‌కుడు వ‌స్తున్నారనుకుని విద్యార్థులు న‌మ‌స్క‌రించేవార‌ట‌. ఆ క‌ళాశాల‌కు క‌విస‌మ్రాట్ విశ్వ‌నాథ‌ను అతిథిగా తీసుకువ‌చ్చి క‌ళాశాల గౌర‌వాన్ని పెంచార‌ట‌. ఆ క‌ళాశాల‌లో ఉష‌శ్రీ ఉత్త‌మ విద్యార్థి బ‌హుమ‌తి అందుకున్నారు.

1962 ప్రాంతంలో ఉష‌శ్రీ అనేక చిన్న క‌థ‌లు ర‌చించారు. అన్నిటిలోకి త‌ల‌మానిక‌మైన క‌థ జ్వ‌లిత‌జ్వాల‌.
ఈ క‌థ‌కు చిన్న నేప‌థ్యం ఉంది.
ఈ క‌థ‌ను రెండు పేజీల క‌థ‌గా రాసి, అనేక ప‌త్రిక‌ల‌కు పంపితే, అది తిరుగుట‌పాలో వెన‌క్కి వ‌చ్చేసింద‌ట‌.
త‌న ర‌క్త‌మంతా ధార‌పోసి ర‌చించిన క‌థ ఎవ్వ‌రికీ న‌చ్చ‌లేద‌న్న బాధ‌తో, చిట్ట‌చివ‌ర‌గా ఆ క‌థ‌ను కొద్దిగా పెంచి, భార‌తి మా ప‌త్రిక‌కు, పంపి ఆ క‌థ‌తో పాటు ఒక ఉత్త‌రం రాశారట‌. ఈ క‌థ మీకు న‌చ్చ‌క‌పోతే, దానిని చింపి బ‌య‌ట పారేయండి. తిరిగి నాకు పంప‌వ‌ద్దు అని. ఆ మ‌రుస‌టి నెల ఉష‌శ్రీ చిరునామాకి భార‌తి ప‌త్రిక పోస్టులో వ‌చ్చింద‌ట‌. అందులో ఉష‌శ్రీ క‌థ ప్ర‌చురిత‌మైంది. ఆ క‌థ‌ను ఆ త‌ర‌వాత ఆకాశ‌వాణిలో పైడి క‌ట‌క‌టాలు పేరుతో నాటిక‌గా ప్ర‌ద‌ర్శించారు. నేటికీ ఉష‌శ్రీ ర‌చ‌న‌ల‌లో ఈ క‌థ ఉత్త‌మ‌మైన‌దే.
ఉష‌శ్రీ మ‌ల్లె పందిరి, జ్వ‌లిత‌జ్వాల‌, అమృత‌క‌ల‌శం అనే మూడు క‌థ‌ల సంపుటాలు ప్ర‌చురించారు. అనేక క‌థ‌లు ర‌చించారు. రాగహృద‌యం, వెంక‌టేశ్వ‌ర క‌ల్యాణం అనే రెండు య‌క్ష‌గానాలు ర‌చించారు. వెంక‌టేశ్వ‌ర క‌ల్యాణం య‌క్ష‌గానం కీ.శే. న‌ట‌రాజ రామ‌కృష్ణ‌గారి కోసం ర‌చించారు. అనేక ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చారు. నాటి రాష్ట్ర‌ప‌తి స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ స‌మ‌క్షంలో కూడా ఈ య‌క్ష‌గానం ప్ర‌ద‌ర్శ‌న‌కు నోచుకుంది. ఉష‌శ్రీ సంతోష‌ప‌డ్డారు. అయితే, ఈ య‌క్ష‌గానాన్ని తానే స్వ‌యంగా రాశాన‌ని న‌ట‌రాజ రామ‌కృష్ణ ఉష‌శ్రీ పేరు ప్ర‌స్తావించ‌క‌పోవ‌టంతో, ఉష‌శ్రీ బాధ‌తో, ఇంక ఎన్న‌డూ ప్ర‌ద్శించ‌వ‌ద్దు అని కోపంగా అని వ‌చ్చేశార‌ట‌.
ఇటువంటివి జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నా బాలాంత్ర‌పు ర‌జ‌నీకాంత‌రావు అనే చ‌ల్ల‌ని చంద్రుని వ‌ల్ల ఉష‌శ్రీ ప్ర‌పంచానికి చేరువ‌య్యారు.
ఆకాశ‌వాణిలో ఉష‌శ్రీ చేత 1973లో భార‌త ప్ర‌వ‌చ‌నం ప్రారంభింప‌చేశారు. అంతే ఇంక మ‌ళ్లీ వెన‌క్కి చూసుకోలేదు ఉష‌శ్రీ‌.
తెలుగ జాతి ఉష‌శ్రీ‌కి నీరాజ‌నాలు ప‌ట్టారు. ఉష‌శ్రీ ప్ర‌వ‌చ‌నం చెబుతున్నంత‌సేపు రేడియోకి హార‌తులిచ్చేవార‌నీ, వీధుల‌న్నీ నిర్మానుష్యంగా క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించేవ‌ని శ్రీ‌శ్రీ‌శ్రీ‌ల‌క్ష్మ‌ణ యతీంద్రులు స్వ‌యంగా వేదిక‌ల మీద చెప్పారు.
ఏ శుభ‌ముహూర్తాన ఉష‌శ్రీ మ‌హాభార‌త ర‌చ‌న ప్రారంభించారో, ఉష‌శ్రీ శ్వాస ఆగేవ‌ర‌కు ఆ ర‌చ‌న కొన‌సాగుతూనే ఉంది.
ఉష‌శ్రీ 1990, సెప్లెంబ‌రు 7వ తేదీన క‌న్నుమూసేనాటికి, ఆకాశ‌వాణిలో భాగ‌వ‌తం ప్ర‌సార‌మ‌వుతూనే ఉంది. ఉష‌శ్రీ గ‌తించిన మ‌రో రెండు నెల వ‌ర‌కు ఈ ప్ర‌వ‌చ‌నం కొన‌సాగింది.
ఉష‌శ్రీ రామాయ‌ణ‌భార‌తాల ద్వారా వాల్మీకివ్యాసుల‌ను తెలుగువారి గుండెల్లో నిల‌పాల‌నుకున్నారు. నిలిపారు.
ఇక తాను వ‌చ్చిన ప‌ని పూర్త‌యింద‌నుకున్నారో ఏమో, ఆ ఋషులను చేరుకున్నారు.
బ‌హుశ ఉష‌శ్రీ త‌న గంభీర గ‌ళంతో ఆ ఋషుల ర‌చ‌న‌ల‌ను వారికే వినిపిస్తూ వారి ఆశీర్వాదం పొందుతున్నారేమో.

భగవంతునికి పూజ


‘భగవంతునికి పూజ’ అనేది హిందు ధర్మములో సగుణ ఉపాసనా పద్ధతికి పునాదివంటిది.

 ‘వర్తమానములోని భారవంతమైన జీవనములో భగవంతుని పూజ చేయుటకు ఎవ్వరి దగ్గర సమయము ఉంది ?’, అనేటటువంటి నకారాత్మక మానసికత ప్రస్తుతము అనేక జనాల్లో కనిపిస్తున్నది.
 రోజు చేసే నిత్యకర్మలలో ఒక్క నిత్యకర్మను పూర్తి చేయాలని దేవుని మీద నీటిని తొందర-తొందరగా జల్లి చందనం బొట్టు పెట్టుట, ఏవో పువ్వులను సమర్పించి ఊదుబత్తిని తిప్పడము మరియు చివరిలో ‘దేవుని పూజ’, అయిపోయిందని అనుకోవడము జరుగుతుంది. ఇలాంటి విచిత్రము నేడు కనిపిస్తుంది.
సంపూర్ణ సృష్టిని పోషించే భగవంతుని తొందర-తొందరగా పూజించి ఈ విధంగా ‘పూర్తి చేయడము’, వాస్తవంగా భగవంతుని పూజ అనవచ్చా ?
 ఇలా చేసిన తరువాత భగవంతుడు కూడ మన మీద కృపను ఎందుకు చూపుతాడు ?
 ఏ విధంగా మనము ఇంటికి వచ్చిన అతిథిని గౌరవపూర్వకంగా స్వాగతిస్తామో, అదే విధంగా భగవంతుని స్వాగతిస్తే అనగా భగవంతునికి శాస్త్రాన్ని అనుసరించి పూజిస్తేనే, వారు మన మీద ప్రసన్నమై మనకు అనేకమైన ఆశీర్వాదములను ప్రసాదిస్తారు.

  దేవుడి పూజ అనగా ఏమి?
 దేవుని పూజ నిర్మితము, మహాత్వము, ప్రకారములు, కొన్ని దేవతల పూజ యొక్క విశిష్టత మరియు దానికి గల కారణాలు, దేవుడి పూజ రోజులో ఎన్ని సార్లు చేయాలి మరియు ఏ సమయము చేయాలి, దేవుడి పూజ ఎప్పుడు చేయకూడదు అనువాటి గురించి శాస్త్రమును తెలుసుకుందాం.

1. దైవ పూజ :

భగవంతునికి శ్రద్ధతో మనస్సు ద్వారా సమర్పించే విధియుక్త ఉపచారము అనగా ‘దైవ పూజ’. ‘దేవుని ఛాయాచిత్రము లేదా విగ్రహమునకు శాస్త్రీయ పద్ధతితో చేసిన పూజ భగవంతునికి అపేక్షిత రూపంగా ఉన్నచో, అది వాస్తవిక రూపములో ‘పూజ’ అవుతుంది.’ –

2. ఉత్పత్తి

 పూజావిధితో సంబంధిత కృత్యముల ఉత్పత్తి బ్రహ్మాండములో ఉన్న ఇచ్ఛాశక్తి సహాయముతో అగుట

‘పూజ చేయుట, నైవేద్యమును నివేదించుట మొదలగు కర్మకాండముతో సంబంధిత కృత్యములు బ్రహ్మాండములోని ఇచ్ఛాశక్తితో సంబంధించినవి. ఈ కృత్యములను చేయుచున్నప్పుడు జీవుని భావమునకనుగుణంగా  ఆయా కృత్యముల ద్వారా ఆయా దేవతల ఇచ్ఛశక్తికి సంబంధించిన తరంగాలు లభిస్తాయి.

3. ప్రాముఖ్యత

. విగ్రహం పై చేయబడే పూజ సంస్కారం వల్ల దైవత్వం జాగృతమగుట

ప.పూ. పాగనీస్ మహారాజ్ గారు ప్రతీరోజు ఒక దేవతా విగ్రహమును పూజించేవారు. విగ్రహము మీద నిరంతరము అవుతున్న ఈ సంస్కారముల వలన అందులో గల దేవతా తత్త్వము జాగృతము అయినది మరియు అందులో 5 శాతము వరకు పెరిగినది. పూజాది సంస్కారముల వలన విగ్రహములోని దేవతాతత్త్వము జాగృతము అవుతుంది. దానితో పాటుగా, సంస్కారములలో భావము ఉన్నచో, అనగా పూజా కృత్యములలో భావము ఉన్నచో, ఆ విగ్రహములో దేవతాతత్త్వము పెరుగతుంది.

భగవంతుని కృప అగుట

పూజ చేయుట వలన దేవతలు ప్రసన్నులౌతారు. అనగా దేవతా కృపను పొందుటకు పూజకునికి సులభము అవుతుంది.

 పూజకునిలో చైతన్యము పెరుగుట

భగవంతునికి పూజ చేయుట వలన పూజకునికి దేవతా తత్త్వము లభిస్తుంది. అతనిలో గల రజ-తమ ప్రమాణము తగ్గి చైతన్యములో వృద్ధి అగును.

 ‘భగవంతునికి పూజ చేయుట వలన లభించిన సాత్త్విక తరంగాల ద్వారా రోజు వారి కార్యము ప్రారంభము అవుతుంది.’

వాతావరణ శుద్ధి

భగవంతుని పూజ, వాతావరణములోని సాత్త్వికత పెరుగుటలో సహాయము చేస్తుంది.
భగవంతునికి పూజ’ అనేది హిందు ధర్మములో సగుణ ఉపాసనా పద్ధతికి పునాదివంటిది.
హిందూ పూజా విధానంలోని క్రియలలో అంతరార్థము.

1. గంటలు :
దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది.
ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం,
రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.

2.దీప హారతి:
దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం.
దైవమే కాంతి.
ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది. స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు.
కాంతివి నీవే.
నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి,
మా బుద్ధిని ప్రభావితం చేయి" అని.

3. ధూపం:
భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము.
వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి.
వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి.
విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన
అందరిలో కలుగుతుంది.
ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ
జ్ఞప్తి చేసినట్లవుతుంది.

4. కర్పూర హారతి:
వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం.
ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని
భక్తులు కోరుకుంటారు.

5. గంధపు సేవ:
ఈ సేవలో చాలా అర్థం ఉంది.
భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు.
అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది.
ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు.
ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం.

6. పూజ:
దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు.
కాని భగవంతునికి వీటితో పనిలేదు.
నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు.
కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది.

7 పత్రం(శరీరము):
ఇది త్రిగుణాలతో కూడుకున్నది.
పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు.

8 పుష్పం (హృదయము):
ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు
అని అర్థం కాదు.
సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం
అని అర్థం.
ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి.

9 ఫలం (మనస్సు):
మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.
దాన్నే త్యాగం అంటారు.

10. తోయం(నీరు):
భగవంతునికి అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన
దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు
దైవానికే అర్పితం కావాలి.

11 కొబ్బరికాయలు:
హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది.
దానిలో ఉండే నీరు సంస్కారము.
కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి.
అదే నిజమైన నివేదన.
లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం,
హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది.
హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు.
మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు.
మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

12. నమస్కారము:
చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి.
ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు.
ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము.

13. ప్రదక్షిణము:
ముల్లోకములన్నియు భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి.
ఆ భగవంతుని సగుణాకరామైన విగ్రహమునకు గాని, లింగమునకు గాని, ప్రదక్షిణము చేసినట్లయిన ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది..
అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు.

4. దైవపూజ యొక్క ప్రకారములు

ధర్మశాస్త్రములో భగవంతుని పూజకు కొన్ని ప్రకారములు చెప్పబడినవి. మొదటి రెండు ప్రకారములు, సామాన్యంగా దేనినైతే మనము ‘పూజ’ అంటామో, అది స్థూల స్థాయికి చెందినది మరియు దాని తరువాయి రెండు ప్రకారములు సూక్ష్మ స్థాయికి చెందినవి.

 పంచోపచార పూజ (మూర్తి లేదా చిత్రమునకు పూజ)

ఇందులో చందనము, పుష్పము, ధూపము, దీపము మరియు నైవేద్యము, ఈ అయిదు ఉపచారములను భగవంతునికి సమర్పిస్తారు.

. షోడశోపచార పూజ (మూర్తి లేదా చిత్రమునకు పూజ)

ఇందులో పైన చెప్పిన పంచోపచారములతో పాటుగా పదహారు ఉపచారములు సమావేశమైనవి.

మానస పూజ

మనస్సుతో సగుణ మూర్తి కల్పనను చేసి, దానిని పూజ చేయుట

. పరాపూజ

పరావాణితో నిర్గుణ పరబ్రహ్మను పూజించుట

 కొన్ని దేవతల పూజా విశేషతలు మరియు వాటి కారణములు

 దేవతలను ప్రసన్నలుగా చేసుకోవడం

పంచోపచారము మరియు షోఢశోపచారము పూజ వలన దేవత ప్రసన్నము అవుతారు. హిందూ ధర్మము విశేషత ఏమనగా, కొన్ని దేవతలకు ఫలానా ఉపాసనా పద్ధతులు ప్రియమై ఉంటాయి. వీటిని ఆచరించుట వలన ఆ దేవతలు ప్రసన్నులౌతారు. హిందూ ధర్మములోని ఈ విశేషతను తెలిపేందుకు ముందర కొన్ని దేవతల పూజా విశేషతలను కారణా సహితంగా ఇవ్వబడినవి. అధ్యాత్మలోని ఇంత లోతైన చింతన కేవలము హిందూ ధర్మములోనే కనిపిస్తుంది.

దీపప్రియః కార్తవీర్యో మార్తండో నతివల్లభః

స్తుతిప్రియో మహావిష్ణూర్గణేశస్తర్పణప్రియః ॥

దుర్గార్చనప్రియా నూనమభిషేకప్రియః శివః

తస్మాత్తేషాం ప్రతోషాయ విదధ్యాత్తత్తదాదరాత్ ॥

దీపప్రియః ………విదధ్యాత్తత్తదాదరాత్ ॥

సందర్భము : మంత్రమహోదధి 17.116-117 మరియు నారదపురాణము, పూర్వ. 76.115-116

అర్థము : కార్తవీర్యునికి దీపము, సూర్యునికి నమస్కారము, శ్రీవిష్ణూవునకు స్తుతి, శ్రీ గణేశునికి తర్పణము, శ్రీ దుర్గాదేవికి అర్చన మరియు శివునికి అభిషేకము ప్రియమైనవి. అందుకని ఈ దేవతలను ప్రసన్నముగా చేయుటకు వారికి ప్రియమైన కార్యమునే చేయవలెను.

శివపూజలో శంఖము యొక్క ప్రాముఖ్యత లేదు

శివపూజలో శంఖమును పూజించరు, అదే విధంగా శంఖముతో జలము వదిలి శివునికి స్నానమును చేయించరు. దేవుళ్ళ విగ్రహ స్థాపన పంచాయతనానుసారంగా ఉంటే, అప్పుడు అందులోని  బాణలింగము మీద శంఖోదకమును వదులవచ్చు; కానీ మహాదేవుని లింగమైన బాణలింగమునకు శంఖోదకముతో స్నానమును చేయించవద్దు.’

శాస్త్రము : శివలింగములో నీటిపాత్ర రూపములో స్త్రీకారకత్వము ఉండుట వలన మరలా స్త్రీకారకత్వము గల శంఖముతో జలమును వేయవలసిన ఆవశ్యకత లేదు. బాణలింగముతో పాటుగా నీటిపాత్ర ఉండదు కాబట్టి దానికి శంఖము జలముతో స్నానమును చేయిస్తారు.

 హారతి సమయములో శంఖునాదము విహితమైనది

‘దేవాలయములో మహాదేవుడి పూజ చేస్తున్నప్పుడు శంఖపూజ లేదు; కాని హారతికి ముందు శంఖనాదము చేయమని ఆదేశించడము జరుగతుంది మరియు తప్పకుండా జరుగతుంది.’

శాస్త్రము : శంఖానాదముతో ప్రాణాయామము యొక్క సాధనైతే అవుతుంది; దీనితో పాటుగా శంఖానాద ధ్వని ఎక్కడి వరకైతే వినబడుతుందో, ఆ పరిసరములలో భూతము, పిశాచి మొదలగు చెడు శక్తుల కష్టము ఉండదు.

భగవంతుని పూజను రోజులో ఎన్నిసార్లు
మరియు ఏ సమయములో చేయవలెను ?

దేవుని పూజ నిత్య కర్మయైనది. ప్రతీదినము త్రికాలములో (ప్రాతఃకాలములో, మధ్యాహ్నము మరియు సూర్యాస్తమయము తరువాత) షోడశోపచార (పదుహారు ఉపచారములతో) పూజ చేయవలెను. ఒక్కవేళ ఈ పూజను త్రికాలములో చేయడము సాధ్యము కాకపోతే ప్రాతఃకాలములో షోడశోపచార పూజను చేయవలెను మరియు మధ్యాహ్నము, సూర్యాస్తమయము తరువాత పంచోపచార (అయిదు ఉపచారములతో) పూజను చేయవలెను. త్రికాల పూజను చేయడము సాధ్యము కాకపోతే త్రికాల సమయములో కనీసము ఒక్కసారైనా పూజను చేయవలెను. షోడశోపచార మరియు పంచోపచార పూజ అసాధ్యము అయితే, చందనము మరియు పుష్పములతో రెండు ఉపచారములతో పూజను చేయవలెను. ధర్మశాస్త్రములో ఈ విధమైనటువంటి వికల్పములు ఇవ్వబడినవి. ఏ స్థితిలోనైనా ఉపాసకుని ద్వారా దేవుని పూజ జరుగవలెనని దీని ఉద్ధేశ్యము !

 ‘దేవునికి త్రికాల పూజను చేయవలెను’, అని శాస్త్రములలో చెప్పబడినది;
అయిననూ కూడ కలియుగములో ‘కేవలము ఉదయము అయినా పూజ
తప్పకుండా చేయండి, అని చెప్పుటకు గల వివిధ కారణములు

ప్రాతర్మధ్యందినో సాయం దేవపూజాం సమాచరేత్

అర్థము : అయినంతవరకు దేవునికి త్రికాల పూజను చేయవలెను.

 కలియుగములో సాత్త్వికత లోపము వలన కర్మకాండము మాదిరిగా ధర్మములోని
సర్వ ఆచారములను పాటించుట అసాధ్యము అగుట వలన రూఢీవాదము స్థాపితము అగుట

‘పూర్వకాలము సాత్త్వికముగా ఉండేది, అందువలనే త్రికాల పూజను చేసి రోజంతటిలోని మూడు జాములలో బ్రహ్మాండములో విడువబడే రజ-తమాత్మక ధారణను నాశనము చేసి వాతావరణమును శుద్ధముగా ఉంచుట సాధ్యము అయ్యేది; కాని ఇప్పుడు కలియుగములో సాత్త్వికత లోపించినది. అందుకనే కర్మకాండము మాదిరిగా ధర్మములోని సర్వ ఆచారములను పాటించుట అసాధ్యము అయినది. అందువలన కనీసము ఉదయము సమయములో భావపూర్వక పూజను చేసి భగవంతుని నుండీ ప్రక్షేపితము అయ్యే చైతన్యమును వాస్తులో పొందుపరచి ఉంచటానికి ఈ రూఢీవాదమును ప్రతిపాదితము చేయడము జరిగినది. అందుకనే కనీసము ప్రాతఃకాలములోనైనా పూజను చేయమని సంత్ మహానీయులు శిక్షణను ఇచ్చారని తెలుస్తుంది.

భక్తియోగములో ప్రత్యక్షముగా కర్మకు ఆధారమైన భావము,
మానసపూజ మరియు నామజపమునకు అధిక ప్రాముఖ్యతను ఇచ్చుట

  భావము మరియు మానసపూజ

ఉపాసనాకాండములో ప్రత్యక్షముగా ఆయా సమయములో కర్మను చేయుటను అనివార్యముగా భావిస్తారు; కానీ భక్తియోగములో కేవలము ప్రత్యక్ష కర్మకు ఆధారభూతమైన భావమునకు అధిక ప్రాముఖ్యతను ఇవ్వడము జరిగినది. అందుకనే మానసపూజ వంటి ఉపాసనా పద్ధతి నిర్మాణమైనది.

నామజపము

కలియుగములో మాయాలొని కర్మలకు విశేషమైన ప్రాముఖ్యత లభించినది. అందువలన ‘కర్మ చేస్తున్నప్పుడు నోటితో జపము చేయుట’ను సర్వశ్రేష్ఠ ప్రకార సాధనగా చెప్పబడినది మరియు త్రికాల పూజను చేయుట సాధ్యము కాకపోవుట వలన ఒక్కసారి ఉదయము పూజ చేసిన తరువాత పని చేస్తూ నామజపమును చేయుట సర్వత్రా సమ్మతించబడినది. అందుకనే సాధు-సంతులు కలియుగములో పూజాకాండము చేయుట కన్ననూ, నామసాధన సరళమైనది’ అని చెప్పారు.

దీని ద్వారా తెలిసేది ఏమనగా, ‘కాలము ఎలాగా ఉంటుందో, అలాగా ఉపదేశము’, ఈ ప్రధాన సూత్రమును ఉపయోగించి సాధు-సంతులు ఆయా కాలములలో సమష్టి (సమాజ) కళ్యాణమును సాధించుటకు ఎలా ప్రయత్నిస్తారనేది తెలుస్తుంది.’

భగవంతుని పూజను ఎప్పుడు చేయకూడదు ?

 స్నానము చేయనప్పుడు మరియు వ్యసన (మాదక పదార్థము) స్థితిలో ఉన్నప్పుడు

మడి అయిన పది రోజుల వరకు. (మడి తగిలిన తరువాత పది రోజుల వరకు మైలు ఉంటుంది. పదుకొండవ రోజు శుద్ధి అయిన పిమ్మట పూజను చేయవచ్చును. మడి తగిలిన 12వ రోజు తరువాతనే కర్త పూజ చేయవచ్చును.)

 ఇంటిలోని స్త్రీ రజస్వల అయితే మరియు ఏ గదిలోనైతే ఆమె తిరుగదో, ఆ గదిలో పూజాగదిని స్థాపించవలెను, ఇంటిలోని జ్యేష్ఠ పురుషులు స్నానోపరాంతము పూజను చేయవలెను. ఖాళీ ప్రదేశము లేకపోవుట వలన ఒక్కవేళ పూజాగదిని వేరే గదిలో పెట్టడము సాధ్యము కాకపోతే, నాలుగు రోజులు (స్త్రీ యొక్క రజోకాలము సమాప్తము అయ్యేంతవరకు) పూజాగదిని బట్టతో కప్పివేయవలెను. ఏదో కారణము చేత ఈ విధముగా పూజాగదిని మూసి ఉంచడము అనుచితము కాదు.
వైష్ణవ సంప్రదాయములోని దేవాలయములలో కూడ ‘భగవంతుడు స్నానమును చేస్తున్నాడు, భగువంతుడు నిద్రిస్తున్నాడు’ అనే కారణములతో భగువంతుని విగ్రహమును తెరతో కప్పివేసే పద్ధతి కలదు.
ఇది ఒక రకముగా భగవంతునికి వేరే గది తయారు చేయుటయే అగును.

 దేవుని పూజను ఏ దిశలో చేయవలెను?

తూర్పు దిశకు అధిక ప్రాముఖ్యము ఉన్నది మరియు ఆ దిశ వైపునకు ముఖమును చేసి పూజావిధిని చేయమని చెప్పబడినది; అందుకనే పూజాగది ఎల్లప్పుడూ తూర్పు-పశ్చిమ దిక్కులో ఉండటము సరియైనది.

కనుక ఆన్ లైన్ పూజలో ఆ వాతావరణము, సాత్విక తరంగాలు మరియు వాతావరణ శుద్ది /మన దాకా రావు/జరగదు.
🙏🙏🙏

స్వామి ప్రజ్ఞారణ్య (90)




స్వామి ప్రజ్ఞారణ్య (90)
యోగి రామ తపోవనం
అన్నారెడ్డి పాలెం
నెల్లూరు జిల్లా.

రమణ మహర్షి బోధించిన నేనెవరు? అనే అన్వేషణలోనే జీవితాంతం గడిపిన మహనీయులు ఈ ఉదయం నిర్యాణం చెందారు.

యోగి ప్రొటోప్లాజమ్ గా దేశవిదేశాల్లో విఖ్యాతి పొందారు.

నెల్లూరు వి ఆర్ కళాశాల అధ్యాపకులుగా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి విశేష కృషి చేశారు. సైన్స్ క్లబ్ లను ఉద్యమ స్థాయిలో అన్ని పాఠశాలల్లో ప్రారంభించేందుకు కృషి సలిపారు.

1960 దశకం లోనే తెలుగులో "సృష్టి" అనే సైన్సు పత్రిక నడిపారు. తదనంతరం "ఊహాశక్తి" అనే సైన్సు పత్రిక కూడా చాలాకాలం వెలువరించారు.

తిరుమల గిరులపై తాను కనుగొన్న నాచు జాతికి "స్పైరోజైరా ఏడుకొండల స్వామిన్సెస్" అని పేరు పెట్టారు. జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో తన పరిశోధన పత్రాన్ని తెలుగులోనే సమర్పించిన భాషాభిమాని.

ఆజన్మ బ్రహ్మచారి గానే అధ్యాపక వృత్తి నిర్వర్తించి, ఉద్యోగ విరమణ అనంతరం సన్యాసాశ్రమం స్వీకరించారు.

హిమాలయ ప్రాంతాల్లో కొన్ని సంవత్సరాల సాధన తర్వాత తన ఆధ్యాత్మిక గురువు, రమణ మహర్షి అంతేవాసి అయిన యోగి రామయ్య గారి పేరిట వారి స్వస్థలం నెల్లూరు జిల్లా అన్నారెడ్డిపాలెం లో యోగి రామ తపోవనం నెలకొల్పారు.

అక్కడ దేశ విదేశాల నుంచి వచ్చే సాధకులకోసం ధ్యాన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడే కాకుండా దేశంలోని పలు ప్రసిద్ధ ఆశ్రమాలు స్వామిజీని ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆహ్వానించేవి. ఆధునిక విజ్ఞానాన్ని ఆధ్యాత్మికతతో మేళవించి ఆయన చేసే ప్రవచనాలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకునేవి. ఈ విజ్ఞాన బోధలకు ఉపకరించే విధంగా ఒక మైక్రోస్కోప్ ను సైతం రూపొందించి, దాన్ని పేటెంట్ కూడా చేయించిన అరుదైన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త స్వామీజీ.

బెంగళూరులోని అంతర్జాతీయ వివేకానంద యోగ విశ్వవిద్యాలయం వారు రమణ మహర్షి పేరిట నెలకొల్పిన పీఠానికి స్వామీజీని అధిపతిగా నియమించారు.
🕉️