9, సెప్టెంబర్ 2020, బుధవారం

**శివానందలహరి**

*దశిక రాము**

**శివానందలహరి**
4 వ శ్లోకం

" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"

అవతారిక:
సర్వ దేవతల కంటే శివుడు గొప్పవాడని తలచి, శివుని పాద సేవ
చేసే భాగ్యం తనకు కల్గింౘమని ఆ శివుణ్ణి శంకరులు యాచిస్తున్నారు.

శ్లో" **సహస్రం వర్తంతే,**

**జగతి విబుధాః **

**క్షుద్ర ఫలదాః**

**నమన్యే స్వప్నేవా**

**తదనుసరణం తత్కృత ఫలమ్.**

**హరిబ్రహ్మాదీనా మపి **

**నికట భాజా మసులభం**

**చిరం యాచే శంభో** _

**శివ తవపదాంభోజ భజనమ్** !!

పదవిభాగం:
సహస్రం వర్తంతే, జగతి _విబుధాః _ క్షుద్ర ఫలదాః _ న మన్యే, స్వప్నే _
వా_ తదనుసరణం _ తత్కృత ఫలమ్ _ హరిబ్రహ్మాదీనామ్ _ అపి_
నికటభాజామ్ _ అసులభం _ చిరం _ యాచే _ శంభో _ శివ _ తవ
_ పదాంభోజ భజనమ్.

తాత్పర్యం:
ఓ శంభూ! మహాదేవా! జగత్తులో స్వల్పమైన ఫలములను ఇచ్చే
దేవతలు, ఎందరో ఉన్నారు. వారిని అనుసరింౘడం కానీ, వారిచ్చే
ఫలములను కానీ, నేను కలయందు కూడా స్మరింపను. ( పగటి వేళ
స్మరింపనని వేరుగా చెప్పనక్కఱలేదు) ఎల్లప్పుడు నూ, నీ సన్నిధానంలో నే
ఉండే విష్ణుమూర్తి, బ్రహ్మవంటి దేవతలకు కూడా దొరకని మీ పాదసేవను
శాశ్వతంగా వేడుకుంటాను. మిమ్మల్ని పదేపదే వేడుకుంటున్నాను.
ఇతర దేవతలు క్షణికములైన భోగాది ఫలములను ఇస్తారు. నీవు ఒక్కడివే,
పునరావృత్తి రహితమైన, మోక్షపదవిని ఈయగలవాడవు. అందుచే వారిచ్చే
ఫలమును కోరక, నీ పాదపద్మముల సేవనే నేను యాచిస్తాను.

వివరణ:
బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనవారు, ౘావు పుట్టుకలు గలవారు. వారు
క్షుద్రఫలదులు. కాబట్టి వారిచే ఫలములను తాను కోరననీ, జననమరణాలు
లేని మహాదేవునే సేవిస్తాననీ, శంకరులు ఈ శ్లోకం లో చెప్పారు. శంకరుని
పాదపద్మ సేవనే తాను యాచిస్తున్నానని చెప్పారు. మోక్షము కన్నా శివపాద సేవ
గొప్పదని ఫలితార్థం.
🙏🙏🙏

**ధర్మము - సంస్కృతి**
🙏🙏🙏
https://chat.whatsapp.com/EYVSW5i6Q1O1973h8txkPS

**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**

కామెంట్‌లు లేవు: