ఎంతమంది నిన్ను గమనిస్తున్నారో ఎవరికి తెలుసు? పరులు నీవు నడచిన దారిలో నడిచేలాగ, ఒక ప్రభావంతమైన నడవడికను నీవు కలిగివుండాలి. అలాంటి జీవితాన్ని నీవు జీవించాలి. నీవు ఇతరుల జీవితాల్లో వెలుగు నింపాలి. నీ వలన వారు, వారి చీకటి జీవితాలకి చరమ గీతం పాడాలి. ఈ విధంగా నీవు ఉన్నప్పుడు నీ జీవితం ఇతరులకి ఒక వరం కాగలదు.
తానే అన్ని కర్మలకు కర్తని అనే భ్రమ నుండి బయటపడిన వాడు జ్ఞాని. అతనికి ఆనందం, దుఃఖం రెండూ ఉండవు. జ్ఞాని ఇలా అనుకుంటాడు----నేను ఒక కెరటాన్ని, ఉపరితలం లో ఉన్నాను. భగవంతుడు నేను ఎగిసిపడాలి అనుకుంటే, ఎగిసిపడతాను. క్రిందపడాలి అనుకుంటే క్రిందపడతాను. పని చేయమంటే చేస్తాను, వద్దంటే ఆపేస్తాను.
సమర్పణ కన్నా కష్టమైనదేదీ లేదు. సమర్పణకి అడ్డుపడేది అహం. సమర్పణ జరగడానికి నువ్వేం చేయనక్కర లేదు. దానంతట అదే జరగాలి. నీవు సమర్పిస్తే, అక్కడ కర్త ఉంటాడు. కర్తే సమర్పణకి అడ్డంకి.
ధార్మికతకి కావలసినది ఏమంటే నీవు ఒక పనిముట్టుగా ఉండి, భగవంతుడు ఆ పనులన్నీ చేయడానికి అవకాశం ఇవ్వాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి