9, సెప్టెంబర్ 2020, బుధవారం

శివామృతలహరి

 శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

మ||

సిరి చేరన్ దరిబేసివాడయిన వాసింగాంచు సంఘంబు నం
దరుదౌ రూపసిగా, మహామహుడుగా నత్యంతమేధావిగా
వరదాతృత్వ గుణాభిరాముడుగ ; వహ్వా ! కర్మ వక్రించి ఆ
సిరి జారన్ తలక్రిందు లౌ సకలమున్ శ్రీ సిద్దలింగేశ్వరా !|

ఎంత పనికి మాలిన వాడైనా అతని దగ్గరికి డబ్బు వచ్చి చేరిందంటే
కేవలం ధనాన్ని మాత్రమే చూసే సంఘం లోని మనుషులు,
అతన్ని గొప్ప అందగాడు అంటారు,
మహా మహుడు అంటారు,గొప్ప మేధావి అంటారు,గొప్ప దాన కర్ణుడు అంటారు, సుగుణాల రాశి అని తెగ పొగుడుతారు.
కర్మగాలి ఆ డబ్బు పోయి అతను అతను బికారిగా మారితే మాత్రం
పైన చెప్పిన వన్నీ తల్లక్రిందులవుతాయి కదా శివా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

నాన్న గారు శివామృతల హరి
లలితామృతలహరి, స్వరా మృతలహరి, శ్రీ నృపాల హరి,
సాయి కృపామృతలహరి మొదలైన
పద్య శతకాలను రచించారు.
కానీ వాటికి అర్ధ తాత్పర్యం వ్రాయలేదు.
ఏదో నాకు తెలిసిన మటుకు, నాకు అర్ధమైన రీతిలో ప్రతి పదార్థం కాకుండా కేవలం భావాన్ని వ్రాస్తున్నాను.ఏమైనా తప్పులుంటే మన్నించి సరి దిద్ద గలరు.
సుబ్బు శివకుమార్ చిల్లర

కామెంట్‌లు లేవు: