18, ఆగస్టు 2022, గురువారం

బ్రాహ్మణులందరూ

 బ్రాహ్మణ భోజన ప్రియః 

బ్రాహ్మణులకు భోజనo పెడితే సకల దేవతలు సంతృప్తి చెందుతారట. దీన్నే అందరూ 'బ్రాహ్మణ భోజన ప్రియః' అని అపహాస్యం చేస్తారు. నిజానికి 'బ్రాహ్మణ'బహుజన ప్రియ' అని చాలా మంది ఎరుగరు. అసలు శ్లోకం ఏమిటంటే:

       " అలంకార ప్రియో విష్ణు 

          అభిషేక ప్రియః శివ 

          నమస్కార ప్రియః భాను 

          బ్రాహ్మణ భోజన ప్రియః"

 సాక్షాత్తూ పార్వతి దేవి చెప్పిన శ్లోకమిది. దీని అర్థము ఏమిటంటే "విష్ణువుకు అలంకారమంటే 

ఇష్టం, మరేమో శివునికి అభిషేకమంటే ఇష్టము. సూర్యనారాయణుడికి నమస్కారం ప్రీతి. బ్రాహ్మణునికి భోజనం ఇష్టమని కాదు ఇక్కడ కొశ్చెను, బ్రాహ్మణుడు తృప్తి చెందితే సమస్త దేవతలు సంతుష్టులౌతారట! మరేమో బ్రాహ్మణుడికి నాలుగు రుచికరమైన వంటకాలు వడ్డిస్తే ఆరగించి తృప్తిగా ' అన్నదాతా సుఖీ భవ' అని దీవిస్తాడు. భక్తులు శంకరుడిని కొలిస్తే, శంకరుడు నారాయణుడిని ధ్యానిస్తాడట. నారాయణుడు శివారాధన చేస్తాడట. హరిహరాదులు ఇరువురూ కలిసి 'బ్రాహ్మణుడిని'పూజిస్తారట! ఎందుకంటే బ్రాహ్మణులు గాయత్రి దేవి సత్పాత్ర బిడ్డలని, ముప్పూటలా వెయ్యి గాయత్రి జపం చేసి ఆ గాయత్రి మాతకు పరమాప్తులౌతారని"

      కాబట్టి బ్రాహ్మణులకు భోజనం పెడితే హరి హరాదులు సంతుష్టులై సకల కార్యాలు నెరవేరుతాయన్న మాట. అంతే కాని బ్రాహ్మణులు కడుపునిండా తినికూర్చుని  'బ్రేవ్' మని  త్రేలుస్తారని కాదు.

1. బ్రాహ్మణుడు పేదోడైతే 'కుచేలుడై' శ్రీ కృష్ణ సేవలను అందుకొంటాడు.

2. బ్రాహ్మణుడు అవమానింపబడితే ' చాణక్యుడై' పగ సాధిస్తాడు.

3. బ్రాహ్మణుడు కోపగిస్తే 'పరశురాముడై' గొడ్డలి పట్టి దుష్టులను నరికిపారేస్తాడు.

4. బ్రాహ్మణుడు విద్య నేర్చితే 'ఆర్య భట్టుడై'ప్రపంచానికి 'సున్న'నిస్తాడు. 

5. బ్రాహ్మణుడు వేదనాశనం చూస్తే 'శంకరుడై' వైదిక ధర్మ సంస్థాపన చేస్తాడు.

6. బ్రాహ్మణుడు రోగులను చూస్తే ' చరకుడై' లోకానికి ఆయుర్వేదాన్నిస్తాడు.

బ్రాహ్మణుడు తన జ్ఞానముతో విశ్వానికే పౌరోహితుడౌతాడు .

 ౧. బ్రాహ్మణ ధర్మం 'వేదము'

౨ .బ్రాహ్మణ కర్మ 'గాయత్రి'

౩ . బ్రాహ్మణ జీవనం 'త్యాగం'

౪ .బ్రాహ్మణ మిత్ర 'సుధాముడు'

౫.బ్రాహ్మణ క్రోధం 'పరశురాముడు'

౬ . బ్రాహ్మణ త్యాగం 'దధీచి'ఋషి 

౭ . బ్రాహ్మణ రాజు 'బాజీరావ్ పేష్వే మయూర వర్మ'

౮ . బ్రాహ్మణ ప్రతిజ్ఞ 'చాణక్య శపథం'

౯ . బ్రాహ్మణ బలిదానం 'మంగళ్ పాండే, చంద్ర శేఖర్ ఆజాద్'

౧౦ .బ్రాహ్మణ భక్తి 'రావణుడు'

౧౧ .బ్రాహ్మణ జ్ఞానం 'శంకర రామానుజ మధ్వ' ఆచార్య త్రయం.

౧౨ . బ్రాహ్మణ సమాజ సంస్కర్త 'మహర్షి దయానంద 

౧౩ . బ్రాహ్మణ రాజనీతి 'కౌటిల్యుడు'

౧౪ . బ్రాహ్మణ విజ్ఞానం 'ఆర్య భట్ట'

౧౫ . బ్రాహ్మణ గణితం' రామానుజo'

౧౬ . బ్రాహ్మణ క్రీడాకారులు 'జి ఆర్ విశ్వనాథ్, చంద్రశేఖర్, గవాస్కర్.

ఇదంతా ఎలా సాధ్యమైంది?

కర్మ, భక్తి, జ్ఞాన విజ్ఞానం, ధర్మ,శక్తి, యుక్తి, మూల్య విలువలు, బుద్ధి, కౌశలం, సంస్కార బలంతో,

1. బ్రాహ్మణ జన్మ 'విష్ణాంశ'

2. బ్రాహ్మణ బుద్ధి సకల సమస్యా పరిష్కారం.

3. బ్రాహ్మణ వాణి 'వేద విజ్ఞానం'

4. బ్రాహ్మణ దృష్టి 'సమతా మనోభావం'

5. బ్రాహ్మణ జాతి 'సంకట హరణo'

6. బ్రాహ్మణ కృప 'భవసాగరమును ఈదు సాధనం'

7. బ్రాహ్మణ కర్మ 'సర్వజనహితం'

8. బ్రాహ్మణ వాసం 'దేవాలయం'

9. బ్రాహ్మణ దర్శనం 'సర్వ మంగళ కరం'

10. బ్రాహ్మణ ఆశీర్వాదం 'సమస్త సుఖ వైభవ ప్రాప్తి'

11. బ్రాహ్మణ వరదానం 'మోక్ష ప్రాప్తి'

12. బ్రాహ్మణ అస్త్రం 'శాపం'

13. బ్రాహ్మణ శస్త్రం 'లేఖని'

14. బ్రాహ్మణ దానం 'సమస్త పాప విముక్తి'

15. బ్రాహ్మణ దక్షిణ'సప్త జన్మ పాప విమోచనం'

16. బ్రాహ్మణ ఘర్జన 'సర్వ భూత సంహారం'

17. బ్రాహ్మణ కోపం 'సర్వ నాశనo'

18. బ్రాహ్మణ ఐక్యత ?(అదే డౌటు)'సర్వ శక్తి వంతం!

జయ మహాకాల, జయ పరశురామ, జయగురుదత్త.

దయచేసి నిత్య కర్మానుష్టానము చేసే బ్రాహ్మణులందరూ ఈ సందేశాన్ని పంచుకోండి.

అభ్యర్థన

 అభ్యర్థన!


కైలాసమందుండి, 

కాలు కదపవు నీవు;

బంధాలు తెంచుకు నేను, 

బయట పడలేను;


అంతటా ఉన్నాను 

చూడమంటావు,

ఆత్మ చక్షువు నాకు 

విచ్చుకో లేదు;


చిద్విలాసము నీకు, 

చిత్రమేమోగాని,

చీకు చింతల తోటి 

నాకు సహవాసం;


పంతమెందుకు నాతొ,

 పాలెగాడను కానె?

సుంతైన దయరాదె,

 వింతగా తోచేను!


అయిన వాడను గాన, 

నీకు అలుసు అయ్యానా?

ఆర్తిగా యాచించి, 

అలిసి పోయాను!


పంతాలు నీకేనా? 

పరమేశ్వరా చూడు!

గుండెలో గుడి కట్టి 

కొలుచుకుంటాను;


అంతటా ఉన్నావు

అన్నదే నిజమైతే,

అక్కడికి రాకుండ

ఎక్కడికి పోతావు?


శ్వాస ఆగక మునుపె 

చూసి పోవయ్యా,

చరితార్థుడై నే నిన్ను 

చేరుకుంటాను!

🙏🙏🙏

సేకరణ

స్మ్రతి

 స్మ్రతి అనేది దేశకాల పరిస్థితులను బట్టి స్థానిక ప్రజలు ఏర్పాటుచేసుకొన్న ఆచారము కావచ్చు లేదా సాంప్రదాయం కావచ్చు. దీనినే ధర్మము అంటారు. మనకు అనేక స్మ్రతులున్నాయి, వీటినే ఆ ప్రాంతపు ధర్మ శాస్త్రమంటారు.


ఉదా॥ పరాశరస్మ్రతి, నారదస్మ్రతి, బృహస్పతిస్మృతి, దక్షస్మృతి, గౌతమస్మృతి, యమస్మృతి, అంగీరసస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి, ప్రచేతస్స్మృతి, శాతాతపస్మృతి, సంవర్తస్మృతి, ఔశనసస్మృతి, శంఖస్మృతి, లిఖితస్మృతి, ఆత్రేయస్స్మృతి, విష్ణుస్మృతి, ఆపస్తంబస్మృతి, హరీతస్మృతులు. 


ఇవన్ని  సమాజజీవితానికి నిర్దేశించబడినవే. ఇందులో వున్నదంతా ఉన్నది వున్నట్లుగా పాటించిన దాఖలాలు కాని, ఖచ్చితంగా పాటించాలన్న నియమ నిబంధనలు ఏమిలేవు. ఇష్టముంటే అనుకరించవచ్చు లేదంటే లేదు. ఒకే సమాజములో కొన్ని వర్గాలు తెగలు పాటించాయి, మరికొన్ని పాటించలేదని మనం గుర్తు చేసుకోవాలి.


ప్రయాణంలో ఓ ఎర్రచొక్కా సోదరుడు శూద్రులు వేదం వింటే సీసం కరిగించి చెవిలో పోయాలని వుంది కదా! దీనికేమంటావు నాతో అన్నాడు, నేనన్నాను అదే ధర్మశాస్త్రం జీవహింస చేయరాదు, అబద్దాలాడరాదు, దొంగతనం చేయరాదు, పరస్త్రీని గౌరవించాలని కూడా చెప్పింది కదా! నువ్వెపుడు కూడా అబద్దాలాడ లేదా, దొంగతనం చేయలేదా గుండెలమీద చేయి వేసుకొని చెప్పమన్నా అతగాడి సమాధానం నిశ్శబ్దము.


ఇంకొమాట అడిగా "అలా చెవులలో సీసం పోసినట్లుగా ఆధారాలు ఎక్కడన్నా వున్నాయా ? అని అతని దగ్గర

సమాధానం లేదు, నేనే చెప్పా మనసాహిత్యంలో, శాసనాలలో స్వదేశీవిదేశీ యాత్రికుల రచనలలో ఫలానా చోట ఫలానా వారికి జరిగిందని పేర్కొనలేదు, ఎక్కడా ఈ సంఘటన జరిగినట్లు రికార్డు కాలేదు, అలా ఎవరో ఎక్కడో ఎపుడో వ్రాసినంత మాత్రాన అమలైనాయని ఇపుడు ఏ ఆధారాలు లేకుండా మాట్లాడం భావ్యము కాదని తెలియచేశా !


 /సేకరణ/

.............................................. జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురము.

ఎలాంటి పేరును పెట్టాలి

 శిశువుకు ఎలాంటి పేరును పెట్టాలని మనుస్మ్రతి  సూచిస్తోంది.

............................................................


సమాజంలో చెడ్డవాడుగా దుష్టుడిగా ముద్రపడిన మనువు  వ్రాసిన స్మ్రతి అదేనండి మనుస్మ్రతిలో పేర్లు ఎలావుండాలనో ఇలా వుంది.


సమాజములో జ్ఞానులుగా పండితులుగా వున్నవారు తమ శిశువులకు శుభం సూచించే విధంగా, క్షాత్రధర్మము కలవారు పేరులో క్షత్రియోచిత లక్షణం వుండేలా, వర్తక వ్యాపారులు ఐశ్వర్యోచితమైన, ఇతరులు దర్పం హుందాలు ప్రతిపలించేలా తమ బిడ్డలకు పేర్లు పెట్టాలని సూచన ఇవ్వడం జరిగింది.


బాలికల విషయంలో మనోహరమైన మంగళకరమైన మృదువైన, పిలవటానికి సులభంగా ఉండేపేరును పెట్టాలని మనుస్మ్రతి చెబుతోంది. తల్లితండ్రులు ఏ వర్గానికి చెందినా బాలికల విషయంలో పేరు మాత్రం కఠినంగాను దుష్టత్వాన్ని సూచించే విధంగా నామకరణం చేయరాదని మనువు బాగాచెప్పాడు కదా !


ఇంకా ఇతర ధర్మశాస్త్రాలు బాలుడి పేరును వ్రాసినపుడు ఆ పేరులోని అక్షరాలు సరిసంఖ్యలో వుండాలని, అలాగే శిశువు జన్మించిన 11, 12, 16 తేదీలలో శుభదినాన నామకరణం చేయాలని, ఎట్టి పరిస్థితులలోను తల్లిదండ్రులు పితామహులు (అవ్వతాతలు) మేనత్త మేనమామలు దాంపత్య సహితంగానే అంటే దంపతులు ఇరువురు కలిసి పేరు పెట్టాలని అంతేకాని విడివిడిగా పేరు పెట్టరాదని తెలియచేస్తున్నాయి.


నామకరణము రోజున పేరు పెట్టే దంపతులు ఉదయాన్నే స్నానసంధ్యలు ముగించి, ఇల్లువాకిలి శుభ్రం చేసుకొని ముంగిట పేడతో అలికి, గడపకు పసుపు రాసి, తోరణాలు కట్టాలి. పసుపుతో విఘ్నేశ్వరుడిని చేసి పూజించి పల్లెములో బియ్యం పోసి అందులో కలశముంచి, కలశముపై  టెంకాయ వుంచి మామిడాకులతో అలంకరించి, ఆ కలశానికి తూర్పుముఖంగా దంపతులు కూర్చుని దేవతారాధన చేయాలి.


తదుపరి ఇల్లాలు పుట్టింటివారు ఇచ్చిన దుస్తులు ధరించాలి. పురుషుడు కూడా నూతన వస్త్రాలు ధరించాలి. ఆపై పల్లెములో సమతలంగా బియ్యం పోసి  పసుపు లేదా కుంకుమలతో  3 అంగుళాల ఎడంగా సమతలంగా మూడుగీతలు గీయాలి. మొదటి గీతలో 'శ్రీ ' లేదా 'ఓం' కారము, రెండో గీతపైన శిశువు జన్మ నక్షాత్రాలు, మూడవ గీతపై శిశువుకు ఏ పేరునైతే పెట్టాలనుకొన్నారో ఆ పేరును బంగారు /వెండి/ రాగి వుంగరముతో వ్రాయాలి. అటుపిమ్మట స్త్రీలు లాలిపాటలు పాడాలి, హజరైన వారందరు కొత్త పేరును పలుకుతూ శిశువును దీవించాలి. బీదలకు అన్నదానము చేయాలి. ఈ సాంగ్యాలన్ని ఇష్టముంటేనే చేయాలి.


నామకరణం తరువాత సంవత్సరంపాటు దంపతులు మాంసాహారము తినరాదని ధర్మశాస్త్రం చెబుతోంది.


/సేకరణ/

.............................................. జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురము.

శ్రీ కృష్ణుడు ఎలా వచ్చాడు

 ఉడిపీకి శ్రీ కృష్ణుడు ఎలా వచ్చాడు? స్వయంగా రుక్మిణీ దేవి చేయించిన 'ఉడుపీ శ్రీ కృష్ణ విగ్రహ రహస్యం'!


🍁 శ్రీ కృష్ణుని ఆలయాలలో, నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇవి ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ లోని మథుర, గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక, దక్షిణ భారతదేశంలో కేరళలోని గురువాయూరు, కర్ణాటకలోని ఉడుపి. ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు, త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యుల వారి జననం, జీవితం, ప్రసిద్ధ శ్రీ కృష్ణ క్షేత్రం, కర్ణాటకలోని ఉడుపితో ముడిపడి ఉంది. ఒక రోజు శ్రీ మధ్వాచార్యుల వారు, వేకువజామునే, సముద్ర తీరానికి వెళ్లి స్నానం చేసి, ప్రాత: సంధ్యాదికాలు ముగించుకుని, ఆ తీరంలోనే కూర్చుని, ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు. తపోదీక్షతో, ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది. ఆ రోజు పర్వదినం కావడంతో, అనేక మంది ప్రజలు కూడా వచ్చి, సముద్రస్నానం చేశారు.


🍁ప్రశాంతమైన ప్రాత: కాలం, భక్తి ప్రపత్తులు ప్రసరించడానికి అనువైన సమయం. అలాంటి నేపద్యంలో, శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంకంగా, ద్వాదశ స్తోత్రంలోని అయిదు అధ్యాయాల రచన పూర్తి చేశారు. ఆరవ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో, ద్వారక నుండి సరుకులు తీసుకువస్తోన్న ఒక నౌక తీరం వెంట వెళుతుండగా, అకస్మాత్తుగా, విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి. ఈ గాలులకు సముద్ర కెరటాలు, ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. నౌక ప్రమాదంలో చిక్కుకుంది. దానిని రక్షించుకోవడానికి, అందులోని నావికులు చేస్తోన్న ప్రయత్నాలు, ఫలించడం లేదు. క్రమంగా నౌకలోకి నీరు చేరడం ఆరంభమైంది. ఏ క్షణాన్నైనా, నౌక మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. నావికులందరూ భయాందోళనలకు గురైన సమయంలో, చివరి ప్రయత్నంగా, నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి ఒకతను, తీరం వైపు చూస్తూ, రక్షించేవారి కోసం ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. 


🍁అంత దూరం నుంచి కూడా, ఒడ్డున నిశ్చలంగా కూర్చొని రచన చేసుకుంటున్న శ్రీ మధ్వాచార్యుల వారు, ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు. ఆయననుద్దేశించి, మరింత ఆర్తితో ప్రార్థించసాగాడు. ద్వాదశ స్తోత్ర రచనలలో లీనమై ఉన్నప్పటికీ, అంతటి హోరుగాలిలోనూ అంత దూరంనుంచి వ్యాపారి చేస్తోన్న ప్రార్థన, మధ్వాచార్యుల చెవిని తాకింది. అప్రయత్నంగా అటుకేసి తల తిప్పారు. జాలి కలిగింది. వెంటనే తన ఉపవస్త్రం, ఒక కొసను పట్టుకుని గాలిలో నావ కేసి విసిరి, వెనక్కు తీసుకున్నారు. అంతే, ఆ క్షణం వరకూ సముద్రంలో మునిగిపోతుందా? అన్నట్లున్న నౌక, ఒక్కసారిగా స్థబ్దతకు వచ్చింది. ఎవరో తాళ్లు పట్టి లాగినట్లుగా, తీరానికి చేరి స్థిరంగా నిలిచింది. నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. అంతకు మునువు ప్రార్థన చేసిన వ్యాపారి, వడివడిగా మధ్వాచార్యుల వారిని సమీపించి, సాష్టాంగ నమస్కారం చేశాడు. అనేక విధాలుగా స్తుతించాడు. అనంతరం లేచి నిలబడి, అంజలి ఘటించి, ‘స్వామీ, నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకం ఉన్నాయి. వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి కాదనకండి’. అని అనేక విధాల ప్రాధేయపడ్డాడు. 


🍁మధ్యాచార్యుల వారు చిరునవ్వు నవ్వి, చివరకి అతని కోరికను మన్నించారు. అయితే, ‘నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్యమైన వస్తువు, నీ నౌకలో ఉన్న రెండు గోపీ చందనపు గడ్డలు, ఈయగలవా’ అన్నారు. వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే, గోపీచందనం, ద్వారకలో ఎక్కడపడితే అక్కడ దొరికే మట్టి. పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడూ, దించేటప్పుడూ, బరువు సమతూకం తప్పిపోకుండా, గోపీ చందనపు గడ్డల సహాయంతో, నౌకలో సరుకును అటూ ఇటూ సర్దుతూ ఉంటారు. అలాంటి గోపీ చందనం మట్టి గడ్డలు, ఈ మహానుభావుడు కోరడం, ఆ వ్యాపారికి సుతరామూ నచ్చలేదు. ఎంత ప్రార్థించినప్పటికీ, మధ్వాచార్యుల వారు, తాను కోరిన గోపీ చందనానికి మించి, మరే బహుమతినీ తీసుకోవడానికి అంగీకరించలేదు. చివరికి ఆ వ్యాపారి, స్వామి కోరిన ఆ గోపీ చందనం గడ్డలను ఇవ్వడానికి సిద్ధపడి, అవే కోరడంలోని పరమార్థం ఏమిటో, ఆ మట్టి గడ్డల మహిమ, విశేషాలేమిటో, కనీసం అవైనా తెలుపమని, ప్రార్థించాడు. 



🍁స్వామి మళ్లీ చిరునవ్వు చిందిస్తూ, ‘నువ్వే చూడు’ అంటూ, ఆ గడ్డలను అందరూ చూస్తుండగానే, నీటితో కరిగించారు. ఆ సమయంలో, అక్కడ ఓ అద్భుతం జరిగింది. ఒక గడ్డ నుండి బలరాముని విగ్రహం, రెండవ దాని నుండి శ్రీ కృష్ణుని విగ్రహం బయటపడ్డాయి. అక్కడున్నవారందరూ, సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. శ్రీ కృష్ణ విగ్రహ దర్శనం జరిగిన వెంటనే, మధ్వాచార్యులు, ద్వాదశ స్తోత్రంలోని ఆరవ అధ్యాయంలో, దశావతారాన్ని వర్ణించారు. బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి, శ్రీ కృష్ణుని విగ్రహం తీసుకుని, ఉడుపీకి ప్రయాణమయ్యారు. శ్రీకృష్ణ ప్రాప్తి తరువాత, ద్వాదశ స్తోత్రాన్ని పరిసమాప్తి చేశారు. అందుకే, ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైనది. అమృతరూపమైనటువంటి శ్రీ కృష్ణుని ఆగమనానికి కారణమైంది. అది విషాహార స్తోత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇంతకీ శ్రీ కృష్ణుని విగ్రహ రహస్యం ఏంటి? వాస్తవానికి జరిగిందేంటి? అనే కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. 


🍁ఆ శ్రీకృష్ణుని విగ్రహం, సామాన్యమైనదికాదు. ఒకసారి దేవకీదేవి, ‘కృష్ణా.. నీ బాల్య లీలలు చూసే భాగ్యం, యశోదకు కలిగినట్లు నాకు కలుగలేదు. వాటి గురించి వినీ, వినీ, ఎప్పటికైనా చూడాలని, నా మనస్సు ఉవ్విళూరుతోంది. చూపించవా కృష్ణా’ అని ప్రార్థించింది. కృష్ణుడు అనుగ్రహించాడు. మరుక్షణంలో శైశవ దశలో కృష్ణుడిగా మారిపోయాడు. తప్పటగులు వేస్తూ నడిచాడు. దేవకీ దేవి ఒడిలో కూర్చున్నాడు. ఆమె స్తన్యాన్ని త్రాగాడు. కేరింతలు కొట్టాడు. కుండ పగులగొట్టి వెన్న తిన్నాడు. ఒంటినిండా రాసుకున్నాడు. పామును తాడులాగా పట్టుకుని, మజ్జిగ చిలికినట్లు నృత్యం చేశాడు. మరీ ముఖ్యంగా, తనతో పాటు అన్న బలరాముణ్ణి కూడా చూపించాడు. ఈ చేష్టలను చూసి దేవకీ దేవి పరవశించి, మైమరచిపోగా, ఇదంతా గమనిస్తున్న రుక్మిణీ, తన పతి దేవుని శైశవ రూపాన్ని, ప్రపంచమంతా చూసి తరించాలని భావించి, వెంటనే విశ్వకర్మను పిలిపించి, ఆయా రూపాల్లో, శైశవ కృష్ణుడూ, బలరాముని విగ్రహాలను చేయించింది.


🍁ముందుగా తానే, సకల వైభవాలతో, విగ్రహాలను స్వయంగా పూజించింది. కృష్ణావతారం ముగిసింది. మరికొంత కాలానికి, ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయం, ఆసన్నమైంది. దూరదృష్టితో అర్జునుడు, ఆ విగ్రహాలను తీసుకువెళ్లి, ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి, దానికి రుక్మిణీ వనం అని నామకరణం చేశాడు. కాలక్రమంలో, ఆ వనం యావత్తూ, గోపీ చందనం మట్టిలో కలిసి, కనుమరుగైపోయింది. నావికులు తమ నౌకల్లో, సమతూకాన్ని పాటించడం కోసం, గోపీ చందనం గడ్డల్ని మోసుకెళ్లే అలవాటు ప్రకారం, కాకతాళీయంగా, ఈ విగ్రహాలున్న గోపీ చందనం గడ్డల్ని కూడా, నౌకలోకి చేర్చారు. వాటి విలువ తెలియకుండానే, వాటిని తీసుకెళ్లే భాగ్యం, ఆ వ్యాపారికి లభించింది. ఆ విగ్రహం, ఆ నౌకలో వస్తోందని మధ్వాచార్యులవారి దివ్య దృష్టికి ముందే తెలుసు. ద్వాదశ స్తోత్రాన్ని రచిస్తూ, ఆ విగ్రహాలను ఆహ్వానించడానికే, ఆయన ఆరోజు, ఆ తీరానికి వెళ్లారు. శ్రీ కృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు, తమ శిష్యుల చేత, మాధవ సరోవరంలో, ప్రక్షాళన చేయించారు. తరువాత తానే స్వయంగా అభిషేకించారు. ఈ అభిషేకానికి మునుపు, నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం, మధ్వాచార్యుల వారు అభిషేకించిన తరువాత, 30 మంది కలిసినా ఎత్తడం సాధ్యం కాలేదు. ఎందుకంటే, మధ్వాచార్యుల అభిషేకంతో, ఆ విగ్రహంలో, శ్రీ కృష్ణుని దివ్య శక్తి పరిపూర్ణంగా ఏర్పడింది. 


🍁మంత్ర విధులతో, మధ్వాచార్యులు అత్యంత శాస్త్రోకంగా, శ్రీ కృష్ణ విగ్రహాన్ని, విళంబి నామ సంవత్సరం, మాఘ శుక్ల తదియ నాడు, సామాన్య శకం, 1236 వ సంవత్సరంలో, ఉడుపిలో ప్రతిష్ఠింపజేశారు. ఆనాటి నుంచి, ఉడుపి ప్రాంత యాజ్ఞికులందరూ, శ్రీ మధ్వాచార్యులవారు అవలంభించిన విధానాలనే, అనుసరిస్తున్నారు. శ్రీ కృష్ణ మఠంగా పిలువబడే ఈ దేవాలయానికి అనుబంధంగా, తన 8 మంది శిష్యులచే నిర్వహింపబడేటట్లుగా, పెజావరు మఠం, పుట్టిగే, పాలిమరు, ఆడమారు, సోదే, కాణియూరు, శిరూరు, కృష్ణ పురా అనే ఎనిమిది మఠాలను, శ్రీ మధ్వాచార్యులు ఏర్పరచారు. వీటిని అష్టపీఠాలు అంటారు. ఇవన్నీ, ఉడుపి కేంద్రంగా, శ్రీ కృష్ణ మఠానికి చుట్టు ప్రక్కల ఉన్నాయి.

కొంగుబంగారం

 పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవాకపక్షి ఉండేది. అది ప్రతిరోజూ ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశమార్గాన అలా అలా పయనిస్తూ ఎన్నెన్నో దేశాలను దాటుకుంటూ కాశీ నగరానికి వచ్చి చేరేది.

అంత దూరం ప్రయాణించి మిట్టమధ్యాహ్న సమయానికి ఆ చక్రవాక పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి ఆకలి వేస్తుండేది.

ఆ ఆకలి తీర్చుకోవటం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడిఉన్న మెతుకులను ఏరుకొని తింటూ పొట్ట నింపుకొనేది.

ఇలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేది.

అలా చాలాకాలం గడిచింది. కాలాంతరంలో ఆ చక్రవాక పక్షి ఆయువు తీరి మరణించింది.

ఇతర పక్షులలాగా మరణానంతరం కూడా నరకయాతనలేవీ పడకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది.

రెండు కల్పాలపాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించింది.

ఆ తర్వాత భూలోకంలో ఓ రాజుగారి ఇంట మగశిశువుగా ఆ చక్రవాక పక్షి జన్మించింది.

పెద్దలు ఆ శిశువుకు బృహద్రథుడు అని పేరు పెట్టారు.

పెరిగి పెద్దయిన రాకుమారుడికి పెద్ద రాజు రాజ్యాభిషేకం కూడా చేశాడు. బృహద్రథుడికి త్రికాలజ్ఞత ఉండేది. భూత, భవిష్యత్తు వర్తమానాలు ఆయన కళ్లెదుట ఎప్పుడూ కనిపిస్తుండేవి. బృహద్రథుడు ప్రజారంజకమైన పరిపాలకుడుగా పేరు తెచ్చుకొన్నాడు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉత్తముడిగా పెద్దలందరి చేత ప్రశంసలందుకున్నాడు.

వీటన్నిటితోపాటు బృహద్రథుడికి పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండేవి. అతడి త్రికాలజ్ఞత, పూర్వజన్మ స్మృతి లాంటివి ఆనాడు ఆనోటా ఆనోటా ప్రజల అందరికీ చేరాయి.

గొప్ప గొప్ప మునులు సైతం ఆ రాజు మహత్తర శక్తికి ఆశ్చర్యపోతూ అంతటిశక్తి ఆయనకు ఎలా కలిగిందో తెలుసుకోవాలని ఉత్సాహపడుతుండేవారు. అలాంటి మునులలో కొందరు పెద్దవారు ధైర్యం చేసి ఒక రోజు రాజు దగ్గరకు బయలుదేరారు. మునులందరి రాకను గమనించిన బృహద్రథుడు తాను రాజునన్న అహంకారభావాన్ని కొంచమైనా మనసులో పెట్టుకోక ఆ మునులకు ఎదురు వెళ్లి నమస్కరించి, పూజించి, అతిథి సత్కారాలను చేసి, ఉచితాసనాలను సమర్పించి సత్కరించాడు.

యోగక్షేమపరామర్శలు అయ్యాక మునులు బృహద్రథుడికి త్రికాలజ్ఞత, పూర్వజన్మ స్మృతి ఎలా కలిగాయో చెప్పమని అడిగారు.

ప్రదక్షిణ ఫలితమే

అప్పుడు బృహద్రథుడు ఎంతో వినయంగా, అందులో పెద్ద రహస్యమేమీ లేదని, తాను ఆ శక్తుల సాధనకోసం ప్రత్యేకించి చేసిన యజ్ఞయాగాలు, క్రతువులు కూడా ఏవీ లేవన్నాడు. ఆ మాటకు మునులకు ఆశ్చర్యం కలిగింది. వారి ఆశ్చర్యాన్ని గమనించి బృహద్రథుడు మళ్లీ చెప్పసాగాడు.

గత జన్మలో తాను ఒక చక్రవాక పక్షినని ఆహారాన్వేషణలో తనకు తెలియకుండానే కాశీ మహానగరంలో ఉన్న అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణం చేశానని చెప్పాడు. ఆ ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చి పెట్టి రెండు కల్పాలపాటు స్వర్గ సుఖాలను ఇచ్చి ఈ జన్మలో మహారాజయోగాన్ని కూడా కలగజేసిందన్నాడు. తనకు లభించిన శక్తులు, భోగాలు అన్నీ కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసిన ప్రదక్షిణల ఫలితమేనని, జగదాంబ అయిన ఆ అన్నపూర్ణాదేవికి అంతటి మాహాత్మ్యం ఉందని బృహద్రథుడు చెప్పాడు. కాశీ అన్నపూర్ణావిశ్వేశ్వర స్వామి ఆలయ దర్శనం, ప్రదక్షిణ నమస్కారాలు ఎంతో విలువైనవి.

కాశి నగరంలోని అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణల ప్రభావం ఎంత గొప్పదో ఈ కథ సూచిస్తుంది.

కాశీ వెళ్లినప్పుడు తప్పకుండా విశ్వనాథ,అన్నపూర్ణ

మందిర ప్రదక్షిణం చేయండి.

కాశీ మహానగరం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. కాశీలో మరణించిన కుక్క కూడా స్వర్గానికే వెళుతుందన్నది నమ్మకం.

కాశీ మహానగరంలో ఉండే అన్నపూర్ణమ్మ తల్లి, విశ్వేశ్వరుడు నమ్మిన భక్తులకు కొంగుబంగారం లాంటివారు..


సేకరణ 🙏🏻

ఆప్యాయంగా పలకరించే వారు

 🌳విలువలతో కూడిన కథ 🌳


~~~~~~~~~~~~~



వెంకట్ ఒక గవర్నమెంట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు...


రోజూ బైక్ లో ఆఫీసుకి వెళ్లడం, సాయంత్రం ఆఫీసు నుంచి నేరుగా ఇంటికి రావడం...


సిటీకి కొత్తగా రావడం వలన


ఆప్యాయంగా పలకరించే వారు ఎవరూ లేరు తనకు, డ్యూటీ తరువాత తన భార్యతో కలిసి కాసేపు అలా అలా తిరిగి రావడం అంతే...


హడావుడిగా పరుగులు తీసే జనాలు


ఎవరి అవసరం వారిది, ఎవరి పనులు వారివి. ఒక్కరికీ ఆగి ఆప్యాయంగా పలకరించే సమయం లేదు.


సిటీ కదా... ఇంతేనేమో అనుకుంటూ రొటీన్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.


రోజులను బిజీగా గడిపేస్తున్నాడే గానీ, జీవితంలో ఏదో తెలియని వెలితి.


బహుశా ఆ వెలితి అందరిలోనూ ఉందనుకుంటా, కానీ పైకి కనబడకుండా లేని పనిని కల్పించుకుని బిజీగా ఉన్నట్టు నటిస్తూ


వాస్తవానికి దూరంగా పారిపోతున్నట్టున్నారు...



ఒకరోజు సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తూ, యధాలాపంగా రోడ్డు పక్కన కూర్చున్న ఒక ముసలావిడను చూసాడు. ముందు చిన్న బుట్ట పెట్టుకుని ఏదో అమ్ముతోంది. దగ్గరకు వెళ్ళి చూసాడు...


బుట్టలో సపోటా పండ్లు పెట్టి అమ్ముతోంది. బాగా వయసు మళ్ళిన వృద్ధురాలు, ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతోంది అనిపించింది వెంకట్ కి. కానీ ఒక్కరూ ఆవిడ దగ్గర ఆగి పండ్లను కొనడం లేదు, అసలు అక్కడ ఒక మనిషి కూర్చుని ఉందన్న విషయం కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలా బాధ కలిగింది తనకు,బండి ఒక ప్రక్కగా ఆపి ఆమె దగ్గరకు వెళ్ళాడు.


"ఎలా అమ్మా సపోటాలు, కిలో ఎలా ఇస్తున్నావ్" అనడిగాడు.


ఆమె రేటు చెప్పింది...


సరే ఒక కిలో ఇవ్వు అన్నాడు.


ఆమె ఒక కిలో తూచి సంచిలో వేసి ఇచ్చింది.


సంచిలోనుంచి ఒక పండు తీసి తిని, "ఏంటమ్మా అస్సలు తియ్యగా లేవు పండ్లు" అంటూ ఇంకో పండు సంచిలోనుంచి తీసి ఆమెకిచ్చాడు. ఆమె ఆ పండు తిని" అదేంటి నాయనా... పండు తియ్యగానే ఉంది కదా" అంది.


సరేలే అంటూ డబ్బులిచ్చి ఇంటికి బయలుదేరాడు.


ఆరోజు మొదలు ప్రతీరోజూ


ఆమె దగ్గర ఆగడం, ఒక కిలో సపోటాలు కొనడం, సంచిలోనుంచి ఒక పండు తీసుకుని తిని రుచిగా లేదు అని చెప్పడం, కావాలంటే నువ్వే చూడు అని ఆమెకు ఒక పండు ఇవ్వడం, ఆమె తిని బావుంది కదా అంటే డబ్బులు ఇచ్చి ఇంటికి వెళ్లడం - దినచర్య అయిపోయింది వెంకట్ కి.


ఒకరోజు తన భార్యతో కలిసి వెళుతూ ఆగాడు ఆమె దగ్గర...


ఎప్పటిలానే కిలో పండ్లు తీసుకున్నాడు. సంచిలోనుంచి ఒక పండు తీసుకుని తిని, పండ్లు తియ్యగా లేవని చెప్పి తన సంచిలోనుంచి ఒక పండు తీసి ఆమెకిచ్చాడు. ఆమె పండు తిని తియ్యగానే ఉన్నాయి కదా నాయనా అని చెప్పగానే డబ్బులిచ్చి బయలుదేరాడు. ఇదంతా చూసిన వెంకట్ భార్యకు కోపం వచ్చింది.


ఇంటికి వెళ్లాక


"రోజూ నువ్వు తీసుకుని వచ్చే పండ్లు చాలా తియ్యగా ఉంటాయి, ఎందుకని ఆవిడకు అబద్ధం చెప్పి బాధపెట్టావ్... పాపం కదా అసలే పెద్దావిడ" అనడిగింది.


వెంకట్ చిరునవ్వు నవ్వి


"ఆమె దగ్గర పండ్లు తియ్యగానే ఉంటాయని నాకూ తెలుసు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆవిడ ఆ పండ్లన్నింటినీ అమ్మడానికి కూర్చుంటుందే కానీ, ఒక్క పండు కూడా ఆమె తినదు. అలా అని నేను కొన్న పండ్లు ఆమెకు తినడానికి ఇస్తే ఆమె తీసుకోకపోవచ్చు. అందుకే అలా అబద్ధం చెప్పి, రోజూ ఆమె తినడానికి ఒక పండు ఇస్తున్నా"అని అసలు విషయం చెప్పాడు...



వెంకట్ తన భార్యతో కలిసి వెళ్లిపోగానే


వృద్ధురాలికి కొంచెం దూరంలో కూరగాయలు అమ్మే ఒకామె వృద్ధురాలి దగ్గరకు వచ్చి


" రోజూ చూస్తున్నాను... ఆ అబ్బాయి వస్తాడు, పండ్లు కొంటాడు. బాగాలేదని మొహం మీదే చెబుతాడు. అయినా కూడా రోజూ నువ్వు ఒక పండు ఎక్కువ తూయడం నేను చూస్తూనే ఉన్నా. అటువంటి వాడికి రోజూ ఒక పండు ఎందుకు ఎక్కువిస్తున్నావ్" అని అడిగింది.


వృద్ధురాలు చిన్నగా నవ్వి చెప్పింది


"పిచ్చిదానా... నేను తీసుకొచ్చే పండ్లన్నీ తియ్యగానే ఉంటాయని నాకు తెలుసు, అయినా తియ్యగా లేవని అబద్ధం చెప్పి కావాలనే రోజూ ఒక పండు నాచేత తినిపిస్తున్నాడు. ఆ అబ్బాయి చూపిస్తున్న ప్రేమకు ఆప్యాయతకు తెలియకుండానే ఒక పండు దానంతటదే ఎక్కువ తూగుతోంది" అని.



నిజంగా ఇలాంటి చిన్న చిన్న విషయాలలో ఎంతో ఆనందం దాగుంటుంది కదా. అన్ని ఆనందాలనూ డబ్బుతో కొనలేం, ఎదుటివారి పట్ల ప్రేమ ఆప్యాయతలే జీవితంలో నిజమైన తియ్యదనాన్ని నింపగలవు. మనిషికి ఉండవలసిన ఉదార స్వభావం కనుమరుగైపోతోంది. ఇవ్వడంలో ఉన్న ఆనందం, తీసుకోవడంలో దొరకదు.


ఆనందం పంచితే పెరుగుతుందే గానీ తగ్గదు.



అన్నీ ఉన్నా కూడా


ఈరోజుల్లో ఆప్యాయంగా పలకరించే వారు లేకుండా పోతున్నారు. ఆప్యాయంగా పలకరించడానికి ఎదుటివారితో మనకు బంధుత్వమే ఉండనవసరం లేదు, అందరూ ఆప్తులే అని చెప్పడం కోసమే ఈ చిన్న కధ.


🙏🙏🙏

జీవితం ఎప్పుడు అందమైంది

 🔥🔥🔥💥💥👑👑🥲🥲👩‍🦰👩‍🦰👳‍♀️👳‍♀️💐

     

రావు ఒక వాట్సాప్ గ్రూపులో సభ్యుడు. ఆ గ్రూపులో ఎవరు మెసేజస్ పెట్టినా ఖచ్చితంగా చదివి చక్కగా స్పందించి మంచి రిప్లై కామెంట్స్ పెడుతూంటారు. అలాంటి ---రావు గారు ఒకరోజు హఠాత్తుగా గ్రూపు నుండి లెఫ్ట్ అయ్యారు. అంతేగాక స్నేహితులతో అప్పుడప్పడూ సరదాగా కలవడానికి కూడా రావటం లేదు..


కొన్ని వారాలయ్యాక ఒకరోజు సాయంత్రం గ్రూప్ అడ్మిన్ .. లెఫ్ట్ అయిన రావు గారి ఇంటికి వెళ్ళేసరికి, ....

బాగా చలిగా ఉండటం వలన కొన్ని కర్ర దుంగలను కాల్చి ఆ మంట పక్కన చలి కాగుతూ ఒంటరిగా కూర్చున్నాడు రావు గారు.


అడ్మిన్ ను చూసి విష్ చేసి, మరేమీ మాట్లాడకుండా మిన్నకుండి పోయాడు...


 ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది.. కాలుతూ 

నాట్యం చేస్తున్న జ్వాలను చూస్తున్నారు... ఇద్దరూ..

 

మధ్యలో అడ్మిన్ లేచి బాగా కాలుతున్న కర్ర దుంగను పక్కకు లాగేసి మరల కుర్చీలో కూర్చున్నాడు.. 

జరిగే దానినంతా నిశితంగా చూస్తున్నాడు ---రావు 


అలా బాగా కాలుతున్నప్పుడు పక్కకు లాగిన ఆ ఒంటరి దుంగ, క్రమేపీ మంట ఆరి చల్లబడి నల్లని బొగ్గుగా మారింది...


 తిరిగి చచ్చుబడి, చల్లబడిన దుంగను కాలుతున్న మంటల్లో వేసాడు అడ్మిన్.

అది తిరిగి కాలుతున్న దుంగలతో కలసి మండి వేడిని కాంతిని ఇచ్చింది. 

*అడ్మిన్ తిరిగి వెళ్ళడానికి కుర్చీలోంచి లేచాడు... అప్పుడు ---రావు అతని దగ్గరకు వెళ్ళి, "ఇంటికి వచ్చి  నందుకు, మనసుకు హత్తుకునే పాఠం చెప్పినందుకు ధాంక్యూ.రేపటి నుండి మన మీటింగులకు వస్తాను. తిరిగి మన వాట్సాప్ గ్రూపులో నన్ను ఏడ్ చెయ్ అన్నాడు..* 


అసలు వాట్సాప్ గ్రూపు ఎందుకంటే ప్రతి మెంబరు మిగిలినవారి  నుండి జ్వాల, వేడిని ( fire & heat ) పొంది ఉత్తేజాన్ని పొందటానికి.. గ్రూపులోని వారందరూ వేడి తగ్గకుండా ఏక్టివ్ గా  ఉండాలి.. గ్రూపనేది ఒక కుటుంబం. ఏదో ఒక సమయంలో కొన్ని msgs, మాటల యుద్ధాలు, అపార్థాలు గ్రూపు సభ్యుల్ని బాధ పెట్టొచ్చు... గ్రూపనేది మనం కలవడానికి, ఆలోచనలు పంచుకోడానికి, మనం ఒంటరివాళ్ళం కాదని చెప్పడానికి...


*జీవితం నిజంగా ఎప్పుడు అందమైందని అనిపిస్తుందో తెలుసా! కుటుంబ సభ్యులు, మరియు స్నేహితులతో ఆత్మీయతతో కలిసి ఉన్నప్పుడు... ఇంకా మనలో హుషారు జ్వాలలు రగిలిస్తూ... స్నేహితులు, బంధువులూ.. అందరూ ఒకే కుటుంబంలా కలసి ఒకే గ్రూపులో అందరూ తమతమ అనుభవాలు, అభిప్రాయాలు పంచుకుంటూ  ఉన్నప్పుడే!.... అందుకే అలాంటి గ్రూపు క్రియేటర్ కు, గ్రూపు సభ్యులకు థ్యాంక్స్ చెబుదాం!*

 *(సేకరణ :Face Book నుండి)*