13, మార్చి 2023, సోమవారం

కర్మలకు నేనే కర్తను " అని భావించును.

 🙏💐🌹🙌Establishment of Supreme Court bench in AP for South India is our main aim🙌🌹💐👍


🌹భగవద్గీత🌹

               

మూడవ అధ్యాయము కర్మయోగము నుంచి 27 శ్లోకము. పదచ్ఛేద , టీకా , తాత్పర్య సహితముగా.


ప్రకృతేః క్రియమాణాని  

గుణైః కర్మాణి సర్వశః ౹

అహంకారవిమూఢాత్మా

కర్తాఽహమితి మన్యతే ౹౹(27)


ప్రకృతేః , క్రియమాణాని ,

గుణైః , కర్మాణి , సర్వశః ౹

అహంకారవిమూఢాత్మా ,

కర్తా , అహమ్ , ఇతి , మన్యతే ౹౹(27)


కర్మాణి = కర్మలన్నియును ;

సర్వశః = అన్నివిధముల ;

ప్రకృతేః గుణైః = ప్రకృతిగుణముల ద్వారా ;

క్రియామాణాని = చేయబడు చుండును ;

అహంకారవిమూఢాత్మా = అంతఃకరణము నందు అహంకార మోహితుడైన అజ్ఞాని ;

అహం , కర్త , ఇతి = "నేనే కర్తను" అని ;

మన్యతే = తలంచును


తాత్పర్యము :- వాస్తవముగా కర్మలన్నియును అన్ని విధముల ప్రకృతిగుణముల ద్వారానే చేయబడు చుండును. అహంకార విముఢాత్ముడు (అహంకారముచే మోహితమైన అంతఃకరణము గల అజ్ఞాని) " ఈ కర్మలకు నేనే కర్తను " అని భావించును. (27)

   

      ఆత్మీయులందరికి శుభ శుభోదయం 

               Yours Welwisher 

Yennapusa Bhagya Lakshmi Reddy 

Advocate AP High Court Amaravathi

పరమోన్నతం

 " సృష్టిలో పరమోన్నతం, అత్యుత్తమం, సకల జీవ ప్రశాంత జీవన దృక్పథం "                                                   భగవత్కృపతో లభించిన జన్మకు సాకారం, అత్యంత శ్రేష్ఠమైన మానవతా దృక్పథ నిత్య జీవకారుణ్యతా జీవన మార్గం ! సువిశాల విశ్వ చక్రభ్రమణంలో మానవాళికి భగవంతుడు ఒసగిన మహత్తర సుహృద్భావ సముచిత జీవన దివ్య వీక్షణం ! చరాచర జీవజాతి సుసంక్షేమాత్మక జీవన నిత్య గమనంలో మానవాళి పాత్ర మహోన్నతం ! మానవాళి తమ నిత్య సంచారంలో, తమ తోటి వారి ప్రశాంత జీవన గమన దృక్కోణ సురక్షామార్గాన నడవాలన్నదే ప్రధానాంశం !                                                     " సహనావవతు ! సహనౌ భునక్తు ! సహవీర్యం కరవావహే ! తేజశ్వినావధీతమస్తు ! మా విద్విషావహై ! "                                 ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః !                                               ✍️గుళ్లపల్లి ఆంజనేయులు

మూత్రపిండములలో రాళ్లు

: మూత్రపిండములలో రాళ్లు కరిగించు గొప్ప ఔషధ యోగములు  - 


 *  కానుగ గింజలలోని పప్పు మూడు గ్రాములు తీసుకుని పొడిచేసి 60 మిల్లీలీటర్ల ఆవుపాలలో కలిపి లోపలికి తీసుకొనుచుండిన మూత్రపిండాలలోని రాళ్లు పడిపోవును .


 *  యవాక్షరం , బెల్లం సమాన భాగాలుగా కలిపి రెండు గ్రాముల చొప్పున రోజుకొకసారి ఒక వారం నుంచి పదిరోజులపాటు తినిన రాళ్లు కరిగి పడిపోవును . దీనితో పాటు బూడిదగుమ్మడికాయ రసం కూడా వాడిన ఫలితం తొందరగా కనిపించును.


 *  వేపాకు నీడలో ఎండించి కాల్చి భస్మం చేసి పూటకు ఒకటిన్నర గ్రాము చొప్పున ఒకరోజు నిలువ ఉంచిన నీళ్లతో కలిపి తీసుకొనుచున్న మూత్రపిండాలలో రాయి కరిగిపోవును . రెండుపూటలా తీసికొనవలెను .


 *  రణపాల ఆకు రసము 6 గ్రాములు కాచిన వెన్న 13 గ్రాములు కలిపి ప్రతినిత్యము తాగుచున్న రాళ్లు కరుగును.


 *  పల్లేరు చూర్ణం ఒక స్పూన్ , కొండపిండి చూర్ణం ఒక స్పూన్ ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి ఉదయం మరియు సాయంత్రం తీసుకొనుచున్న మూత్రపిండాలలో రాళ్లు నివారణ అగును.


 *  పొద్దుతిరుగుడు పువ్వు చెట్టు వేర్లు పొడి 25 గ్రాములు తీసుకుని ఒక లీటర్ తియ్యటి మజ్జిగతో కలిపి తీసుకొనుచున్న రాళ్లు కరుగును.


 *  పూటకు రెండు వెల్లుల్లి రేకల గుజ్జు తినుచున్న మూత్రాశయపు రాళ్లు కరుగును. అలా అప్పుడప్పుడు తినుచున్న రాళ్లు పుట్టవు .


  మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు  -


 తినవలసిన ఆహారపదార్దాలు  -


  పాతబియ్యపు అన్నం , యవలు , గోధుమలు , ఉలవలు , పెసలు , మజ్జిగ , ఆవునెయ్యి , ఆవుపాలు , పెసరకట్టు , ఉలవకట్టు , అల్లం , తియ్యని కల్లు , చక్కెర , ముదురు గుమ్మడికాయ , బూడిద గుమ్మడికాయ , పొట్లకాయ , కొండపిండికూర , పల్లేరుకూర , చిర్రికూర , పెరుగుతోటకూర , ఖర్జురము , వెదురుమొలకలు , కొబ్బరికాయ , తాటిముంజలు , నక్కదోసకాయ , మేకమాంసం .


 తినకూడని ఆహార పదార్ధాలు  -


    మలబద్ధకర ఆహారాలు , చద్ది అన్నం , బిరుసుఅన్నం , తాంబూలం , ఎక్కువ ఉప్పు గల ఆహారపదార్థాలు , ఎక్కువ నూనె , పిండివంటలు , నువ్వులపిండి , పులుసు , ఇంగువ , నువ్వులు , ఆవాలు , మినుములు , మామిడికాయ , వెల్లుల్లి మొదలగు వేడివస్తువులు , మలబద్దకాన్ని కలిగించు వస్తువులు , కోడిమాంసం , పందిమాంసం , చేపలు , మద్యం , మైథునం , అతిశ్రమ , మూత్రము , వీర్యము నిరోధము చేయరాదు . 


         పైన చెప్పిన ఆహారపదార్ధాలు పాటిస్తూ ఔషధాలను వాడగలరు .


          మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  : శరీరంలో నీరసం , నిస్సత్తువ హరించుటకు సులభయోగాలు  -


 *  వేసవికాలంలో మంచిరకం మరియు తియ్యటి మామిడిపండ్లు పూటకు ఒకటిచొప్పున రోజూ తినుచున్న త్వరలో శరీరంలో నీరసం పోవును .


 *  రోజుకో కొబ్బరిబోండం తాగుచూ అందులోని లేతకొబ్బరి తినుచున్న నీరసం పోయి బలం కలుగును.


 *  అప్పుడప్పుడు కొంచం దాల్చిన చెక్క బుగ్గన పెట్టుకుని దాని రసం మింగుచున్నా శరీరం లొని నీరసం తగ్గును.


 *  రోజుకొకసారి నేలవేము సమూల కషాయాన్ని పావుకప్పు చొప్పున ప్రతినిత్యం తాగుచున్న నీరసం , నిస్సత్తువ హరించును . జబ్బు వలన శరీరం నీరసపడినవారు దీనిని వాడటం వలన మంచి ఫలితాలు వస్తాయి.


 *  రాత్రి సమయంలో నాలుగు ఎండు ఖర్జూరాలు ఒక రాగిచెంబులో నానబెట్టి ఉదయాన్నే విత్తనాలు తీసివేసి ఆ ఖర్జూరాలు తిని ఆ రాగిచెంబులోని నీరు తాగుచున్న శరీరము నందలి నిస్సత్తువ హరించును .


 *  తుమ్మజిగురు ఉశిరికాయ అంత తీసుకుని ఒక కప్పు నీటిలో వేసి కొంచం పంచదార చేర్చి ప్రతినిత్యం తాగుచున్న నీరసం పోయి బలం కలుగును.


 *  ప్రతినిత్యం పులవకుండా తియ్యగా ఉన్న తాటికల్లు ఒక గ్లాసు చొప్పున తీసుకొనుచున్న శరీరానికి మంచి పుష్టి కలుగును.


         పైన చెప్పిన వైద్య యోగాలలో మీకు సులభమైన యోగాన్ని ఎన్నుకుని దానిని పాటించండి.


  

          మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  

 ఆయుర్వేద వైద్యంలో పేరుగాంచిన గొప్ప ఔషధం 

  -


       మొమ్మాయి అనే ఈ ఔషధానికి ఆయుర్వేదంలో చాలా గొప్ప పేరు ఉంది. ఈ ఔషదానికి మరొక పేరు "గోమూత్ర శిలజిత్"  మార్కెట్ లో పచారీషాపుల్లో అమ్ముతుంటారు కాని అది అంత స్వచ్ఛమైనది కాదు. ఇది అసలైనది తెప్పించి నేను ప్రయోగించాను . చాలా జబ్బులలో మంచి ఫలితాలు ఇచ్చినది. మనకి దొరికిన మొమ్మాయి అసలైనదా కాదా అని తెలుసుకొవడానికి ఒక చిన్న పరీక్ష ఉన్నది.


               మొమ్మాయిని ఒక కందిగింజ అంత ఒక చిన్నగ్లాస్ నీటిలో వేయాలి . అప్పుడు నీరు ఎర్రగా మారుతుంది. అందులో ఒక పొడవాటి గుడ్డముక్కని వేసి నానబెట్టి ఒక కోడి కాలు విరగగొట్టి విరిగిన కాలుకు దీనిని చుట్టవలెను . కేవలం 15 నిమిషాలలో కాలు అతుక్కొని అది పరిగెత్తును . ఈ విధంగా పరీక్షించిన తరువాత మాత్రమే మొమ్మాయిని ఔషధంగా వాడవలెను .


           ఒకసారి ఈ మొమ్మాయిని వాడితే అది శరీరంలో 44 సంవత్సరాలపాటు నిలిచి ఉంటుంది. ఇది ఎక్కువుగా ఇరాన్ దేశములోని కొండలలో దొరుకుతుంది. శిలాజిత్ కీలువలే నల్లగా కాంతి వలే మైనము వలే కొంచం ఎర్రగా ఉంటుంది . ఇది శరీరంలో అత్యంత త్వరితముగా వ్యాపించి తన ప్రభావాన్ని చూపును . దీని మోతాదు ఒక వడ్లగింజ నుంచి రెండు వడ్లగింజల ఎత్తువరకు వాడవచ్చు . శిలాజిత్ చూర్ణములలో కలుపవలసి వచ్చినపుడు పన్నీటితో ఎండబెట్టి కలుపుకొనవలెను. లేహ్యములలో కలుపవలసివచ్చినప్పుడు ఆవునేతితో శిలజిత్ ని కలిపి కాచి చల్లార్చి కలుపవలెను గాని ప్రత్యేకంగా కలుపకూడదు.


  మొమ్మాయి ఉపయోగాలు  -


 *  హృదయానికి బలమును ఇస్తుంది.


 *  మనస్సుకు సంతోషాన్ని ఇస్తుంది.


 *  పొట్ట, జీర్ణకోశం , రక్తం తదితర వాటిని శుభ్రపరచును .


 *  శరీరంలోని సమస్త అవయవాలకు , నరాలకు బలాన్ని ఇస్తుంది.


 *  శ్లేష్మాన్ని హరించును .


 *  విరిగిన ఎముకలను , కీళ్ళని బాగుచేయును .


 *  గాయములను మాన్పును .


 *  వ్రణాలను నయంచేయును .


 *  ఎక్కిళ్లు , కడుపులో మంట, గుండెల్లో దడ నివారించును.


 *  అజీర్ణం , పరిణామశూల మొదలగు శూలలను తగ్గించును .


 *  కీళ్లనొప్పులు హరించును .


 *  అన్నిరకాల జ్వరాలను తగ్గించును .


 *  పక్షఘాతము , పక్షవాతము , సర్వాంగవాతములను హరించును .


 *  అతిమూత్రవ్యాది మరియు సమస్త మూత్రవ్యాధులను హరించును .


 *  ఉబ్బు , శ్వాస సంబంధ సమస్యలు , మతిచాంచల్యం , మూర్చ, ముక్కుకి వాసన తెలియకపోవడం , ముక్కులోపల పుట్టెడు వ్రణం నివారించును.


 *  జీర్ణకోశమును అంటి ఉండే పేగు గట్టిపడు రోగం కూడా తగ్గును.


 * ఒక చెయ్యి , ఒక కాలి యొక్క కీలులో పుట్టి అలా నిలిచి ఎంతకీ తగ్గని నొప్పిని కూడా తగ్గించును .


 *  స్త్రీల గర్భాశయం నందు జనించెడి పురుగులను చంపును.


 *  సుఖరోగాలను , చర్మవ్యాధులను నయం చేయును .


 *  బోధకాలు వ్యాధి , నాలిక మందం అయ్యే సమస్య , గొంతుకవ్యాధులను నయం చేయును .


 *  దవడనొప్పి , నాలుకలో నొప్పి సమస్యలకు వడ్లగింజ అంత మొమ్మాయి నీళ్లతో కలిపి ఆయా స్థలముల యందు పట్టువేసిన బాగు అగును.


 *  పిచ్చితనం ప్రారంభదశలో ఉండగా వడ్లగింజ ఎత్తు మొమ్మాయి గాడిదపాలతో కలిపి అరగదీసి లోపలికి ఇచ్చిన పిచ్చి తగ్గును.


 *  కొండనాలుక వాపుకు కాని గొంతుక వాపుకు మొమ్మాయి ఇప్పపువ్వు సారాయి తో కలిపి అంగిట పట్టించిన పై సమస్యలు తగ్గును. ఇప్పపువ్వు సారాయి దొరకనప్పుడు పెసరపప్పు కషాయం వాడవచ్చు .


         పైనచెప్పినవే కాకుండా మరెన్నో రోగములకు ఈ మొమ్మాయి అమృతం వలే పనిచేయును . ఈ మొమ్మాయి వాడే సమయమున బెండకాయ కూర, ఆవాలు వాడకూడదు. అదే విధముగా మొమ్మాయి అవునేయ్యితో కలిపి ఇచ్చేప్పుడు స్వచ్చమైన దేశవాళీ ఆవునెయ్యిని మాత్రమే వాడవలెను. మార్కెట్లో దొరికే మొమ్మాయిని పరీక్షించి మాత్రమే వాడవలెను. నకిలీలు చాలా ఉన్నాయి .


         మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  

పూర్వం హిందువులు రైళ్ల పేర్లు.

 పూర్వం హిందువులు రైళ్ల పేర్లు.

నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్..

పేద నవాజ్.

హజ్రత్‌గంజ్..


 ఇప్పుడు జరగండి...

*రామాయణ ఎక్స్‌ప్రెస్*...

*వందే భారత్ ఎక్స్‌ప్రెస్*

*మహాకాల్ ఎక్స్‌ప్రెస్*.....

తేడా స్పష్టంగా ఉంది

అర్థం చేసుకునే వారికి


కేవలం శివరాత్రి కారణంగా

రేపు కాశీ నుండి...

ఒక రైలు

ప్రారంభోత్సవ గౌరవనీయులు

ప్రధాని చేశారు

దీని పేరు *మహాకల్ 🚩 ఎక్స్‌ప్రెస్*,

ఈ రైలులో

శివునికి కోచ్..

B 4లో 64 బెర్త్ రిజర్వ్ చేయబడింది...


సీటుపై శివాలయం నిర్మించారు

మూడు జ్యోతిర్లింగాలకు

కనెక్ట్ చేస్తోంది

కాశీ-మహాకాల్ ఎక్స్‌ప్రెస్..


ఈ మూడు మతపరమైన ప్రదేశాలు

జోడిస్తుంది-

వారణాసిలో కాశీ విశ్వనాథుడు

ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు

మరియు

 *ఇండోర్ సమీపంలోని ఓంకారేశ్వర్*


ఇప్పుడు మోడీకి

ప్రతిదీ సరిపోదని అర్థం చేసుకోవడం

  

మోడీ చాలా కష్టపడాల్సి వస్తుంది

మోడీ కూడా కష్టపడతారు.

కానీ ఈ దేశ ప్రజలు

ముఖ్యంగా హిందువులకు

మోదీకి అండగా నిలవాలి.


ఎందుకంటే మోడీ ఈ యుద్ధాన్ని తనపైకి తీసుకోలేదు, కానీ

భావి తరాలకు మరియు భారతదేశ ఉజ్వల భవిష్యత్తు కోసం.

కోసం ఆటపట్టించారు.


*భారతదేశంలోని హిందువులు 01-05-2023న వీధుల్లోకి వచ్చి హిందూ దేశాన్ని కోరాలని హిందువులు మోడీ కోరుకుంటున్నారు*


*మొదటి సారిగా హిందువులు మత పోరాట పతాకాన్ని ఎగురవేశారు, ప్రపంచం మొత్తం చూపులు 01-05-2023న జరిగే భారత్ బంద్ విజయవంతమై ఉన్నాయి.హిందువులకు ఒకే ఒక కల ఉంది, భారతదేశం హిందువుగా ఉండాలి. దేశం, భారత్ బంద్‌ను అన్ని మత సంస్థలు ప్రకటించాయి, సనాతన ధర్మ సోదర సోదరీమణుల పూర్తి సహకారం ఉంటుంది, ఒక రోజు బంద్ హిందువుల భవిష్యత్తును నిర్ణయిస్తుంది.



గుడి బద్దలైతే ఎవరూ మాట్లాడరు

*ఆవు చంపబడింది, ఎవరూ మాట్లాడరు*

హిందూ తల్లులు మరియు సోదరీమణుల గౌరవం సురక్షితం కాదు, ఎవరూ మాట్లాడరు.

*హిందువులు మారారు, ఎవరూ మాట్లాడరు*

*అయితే వీటన్నింటిని అక్కడక్కడా రక్షించడానికి హిందువులెవరైనా ముందుకు వస్తే, ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుంది*

ఎక్కడో ఇస్లాం పేరుతో, ఎక్కడో క్రైస్తవం పేరుతో, ఎక్కడో మరికొందరి పేరుతో,

*అన్నింటికంటే, మీరు ఎప్పుడైనా దాని వెనుక ఆలోచించడానికి ప్రయత్నించారా, మేము పూర్తి దూకుడుతో వాటన్నింటినీ రక్షించడానికి దృఢ సంకల్పంతో పని చేసి ఉంటే, అప్పుడు మేము ఎప్పుడూ రక్షణలో ఉండాల్సిన అవసరం లేదు.*

* అంతెందుకు ఈ దేశంలో హిందువుల విధ్వంసానికి కారణాలు ఏమిటో, ఆ కారణాలను, పరిష్కారాలను హిందువులు ఆలోచించాలి. *


*భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించడానికి, భారతదేశం మొత్తం 01-05-2023న మూసివేయబడుతుంది*



*ఈ సందేశాన్ని కనీసం 5 గ్రూపులకు పంపాలి*

*కొందరు పంపరు*

*అయితే మీరు తప్పకుండా పంపుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను*


🙏🙏🙏🙏🙏

సుభాషితమ్

 .


           _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝  

*ఆదిత్య చంద్రా వనిలోనలశ్చ*

*ద్యౌర్భూమిరాపో హృదయం యమశ్చ|*

*అహశ్చ రాత్రిశ్చ ఉభే చ సంధ్యే*

*ధర్మో హి జానాతి నరస్య వృత్తమ్||*


తాత్పర్యము:

*సూర్యుడు, చంద్రుడు, గాలి, నిప్పు, ఆకాశము, భూమి, నీరు, తన హృదయము* (మనసు), *యముడు, పగలు రాత్రి, ఉభయ సంధ్యలు, మరియు ధర్మము మానవుని ప్రవర్తనకు (చేయు పనులకు) సాక్షీ భూతములు*.....

 _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝  

*జకారో జన్మవిచ్చేదః* 

*పకారః పాపనాశకః |*

*తస్మాజ్జప ఇతి ప్రోక్తో*

*జన్మ పాపవినాశకః ||*


తా𝕝𝕝

*“జ”కారము జన్మ కలుగకుండ జేయును....ప” కారము పాపమును నశింప జేయును*.... *జన్మము, పాపము రెంటిని నాశము చేయునది కావున “జప” మందురు*.... *పరమాత్ముని నామము లన్నింటిలో మూగవాడు కూడ పలుకదగిన నామము "ఓమ్" అనునది శ్రేష్ఠమైనది*.....

జ్ఞానాదేవతు కైవల్యం."

 .


*ధ్యానాది సాధనలు చేసినవారంతా ఎందుకు మహర్షులు కాలేకపోతున్నారు? ముక్తులు కాలేకపోతున్నారు?*


శ్లో॥

మీనః స్నానపరః ఫణీ పవనభుజ్మే మేషోస్తి పర్ణాశనః

నీరాశీ ఖలు చాతకః ప్రతిదినం శైలే బిలే మూషికః

భష్మోద్దూళిత విగ్రహస్తు శునకో ధ్యానాధిరూఢో బకః

ఏతేషాం ఫలమస్తి కిం నహి నహి జ్ఞానం పరం కారణమ్||


గంగయందే పుట్టిపెరిగిన జలచరములన్నియు, నిత్యమూ గంగా స్నానమే చేసియు, అందే నివసించి వున్ననూ, సర్పము వాయుభక్షణమును చేసినను, మేక ఆకులను తినినను, చాతకపక్షులుకు జలమే ఆహారమైనను,

ఎలుకలు సదా గుహలలో వున్ననూ, కుక్క బూడిద పూసుకున్ననూ, కొంగ మౌనమును శీలించినను, వీటియన్నిటికిని ఎలాంటి విశేషఫలమును ఉండదు. ఎందుకంటే వీటన్నిటికీ బాహ్యాచారమే కానీ, అంతరంగనిష్ఠ ఏమాత్రమూ ఉండదు. 


పై వాటి వలె కాసేపు ధ్యానం, ఆహారనియమాలు, ప్రార్ధనలు, శాస్త్రపఠనాలు, ప్రవచనాలు వినడం... ఇత్యాది సాధనలు బాహ్యంగా ఆచరించినంత మాత్రమున ఫలితముండదు. అంతరంగనిష్ఠ ఉండాలి. సాధకునికి శ్రద్ధ, విశ్వాసం ఉండాలి. ఎటువంటి అవరోధాలు కల్గినను, పట్టుదలతో, అనన్య దైవభక్తితో, సాగిపోవాలి, ఆత్మసాక్షత్కారం, ముక్తి లాంటి అత్యున్నత స్థితులను చేరుకోవాలంటే, హృదయ పరిశుద్ధత అత్యవసరం. అందుకు ఎంతో సాధన అవసరం..."!! "జ్ఞానాదేవతు కైవల్యం."

లోకం గురించి

 *లోకం గురించి పరశురాముని ఆలోచన!* 

                     ‌‌‌‌‌        

నిశ్శబ్ద.


 ఒక రోజు పరశురాముడు దత్తాత్రేయుని సందర్శించడానికి బయలుదేరి, మార్గమధ్యలో లోకవ్యవహారం గురించి ఆలోచిస్తూ ఇలా అనుకొన్నాడు…


 “అయ్యో! నేను ఇంతవరకు దేనిని గురించి ఆలోచించాలో ఆ ముఖ్యవిషయం గురించి ఆలోచించలేదు. ప్రవాహంలో పడి కొట్టుకొనిపోతున్నవాడిలా - ఎలా వెళుతున్నానో, ఎందుకు వెళ్ళుతున్నానో తెలియకుండానే అందరితోపాటు నేను కూడా వ్యవహారం చేస్తున్నాను. గ్రుడ్డివాని వెంట వెళ్ళే గ్రుడ్డివారివలె ప్రజలందరూ ఒకరిని చూసి మరొకరుగా వ్యవహారములలో మునిగిపోతున్నారు. తాము చేస్తున్న పనికి పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసుకోకుండానే ప్రజలు వ్యవహరిస్తున్నారు. 


ఎవనికైనా ఒకనికి ఏదో కొంచెం ఫలం దైవికంగా సంభవించడం చూసి, తమకు కూడా అటువంటి ఫలమే అంతకన్నా అధికంగా లభిస్తుందనే పేరాశతో, శక్తికి మించిన పనులను పూనుకొని ఆపదలను కూడా పొందుతున్నారు. ఇదంతా - 'ఎరను చూసి దానికొరకు గాలములో చిక్కుకొంటున్న చేపలాగా' ఉంది. అలాగాక *ఈ దిక్కుమాలిన సంసారంలో సుఖం ఏముంది?*


 దేవతల నుండి క్రిమికీటకముల వరకు అందరూ సుఖం పొందాలనే మిక్కిలి ఆరాటంతో వ్యవహరిస్తున్నారు. నాలుక వలన కలిగే రుచి, మైధునం వలన సుఖం క్రిమికీటకములతో సమానంగానే త్రిలోకాధిపతికీ కలుగుతున్నది. భౌతికమైన ఈ దేహం కొరకే సర్వం కోరబడుతున్నది. ఇది మల మూత్ర మాంసం మొదలైనవాటితో పూర్ణమై, కుత్సితమై, దుఃఖమూలమై ఉంది. దీని మూలంగానే పుత్ర-మిత్ర-కళత్ర రూపమైన సంసారం ఏర్పడుతున్నది. ఇటువంటి దేహమునే తననుగా భావిస్తూ దీనికోసమే పామరుడు, పండితుడు కూడా నింద్యకృత్యములకు పాల్పడుతున్నారు. 


దేహం రోగగ్రస్తమై ముసలితనంలో కృశించి హేయమవడం ఇతరులలో చూస్తున్న ప్రతివ్యక్తి, నా శరీరం మాత్రం అటువంటి బాధలకు లోను కాదు అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. ఈ కుత్సితమైన శరీరమునందే స్త్రీలు, పురుషులు సౌందర్యమును భావిస్తూ భోగలంపటులు అవుతున్నారు. నాలుకయొక్క రుచికి, మైధున సుఖమునకు లోబడి మానవులు ఎల్లపుడూ అతి సమీపంలోనే ఉండే మృత్యువును గమనించడం లేదు.


 తమ జీవితం ఎంత అల్పమైందో గుర్తించని ఈ మానవులు దీర్ఘ కాలంలో, ఎప్పటికో లభించు ఫలములను కోరి నిరంతరం పాటుపడుతున్నారు. స్వార్థం కోసం వీరు ఇతరులను చంపడానికి కూడా వెనుకాడరు. ఇలా కామక్రోధ పరాయణులై వీరు పొందే సుఖం ఏమిటి? అల్పసుఖంకోసం వీరు అధిక దుఃఖమునే పొందుతున్నారు. వీరి ఆశలకు అంతం ఎక్కడ? ఆశ ఉన్నంతవరకు సుఖం ఎక్కడ? 


 మనస్సు కామానికి లొంగడమే మహాదుఃఖము. సర్వసంపదలతో సామ్రాజ్యం లభించినవానికైనా సుఖం ఎక్కడిది? వాటిని ఇంకా అభివృద్ధి చేయాలనే ఆశ వలన, శత్రువులు వచ్చి చంపుతారేమో అనే భయం వలన రాజులకు, ధనవంతులకు కూడా ఎల్లపుడూ దుఃఖమే కలుగుతోంది.


 ఎంతో కష్టపడి మనుష్యులు సంపదలను పొందుతున్నారు. వాటికొరకే మిత్రులు శత్రువులు అవుతున్నారు. పుత్రులు తండ్రులపై తిరగబడుతున్నారు. ప్రియురాలు ప్రియునికి ద్రోహం చేస్తున్నది. భార్యాపుత్రులు కూడా ధనవంతునకు మృత్యువును కోరుతున్నారు. అలా మృత్యువుతో సమానమైన ధనమును కోరుతూ మానవులు కుటుంబమును తమచుట్టూ గూడువలె అల్లుకొని, అందులో చిక్కుపడి బయటకు రాలేక తన్నుకొంటున్నారు. 


 ఎవడు ఏ కుటుంబంతో ఎటువంటి సంబంధమును, ఎంతకాలం కలిగి ఉన్నా ఒకప్పటికి వియోగం పొందక తప్పదు. కానీ, భార్యా పుత్రులతో సంబంధం అత్యంత స్థిరమైనట్లుగా స్నేహమును పెంపొందించుకొని, మనుష్యులు చివరకు మహాదుఃఖమును పొందుతున్నారు. ధనములు, జనములు మొదలుగా సర్వము అత్యంత బలిష్ఠమైన మృత్యువుచేత ఆక్రమింపబడి ఉంది. కావున మనశ్శాంతిని కోరే బుద్ధిమంతుడు ఎవడూ వాటిమీద ఆసక్తి చెందకూడదు. ఏది ప్రాప్తిస్తే భయమే ఉండదో, అటువంటి పదమునే బుద్ధిమంతుడు కోరుకోవాలి. కాబట్టి అభయమును కలిగించే విజ్ఞానం కోసం నేను మహనీయుడైన దత్తాత్రేయుని ఆశ్రయిస్తాను అనుకున్నాడు పరశురాముడు.