13, మార్చి 2023, సోమవారం

 ఆయుర్వేద వైద్యంలో పేరుగాంచిన గొప్ప ఔషధం 

  -


       మొమ్మాయి అనే ఈ ఔషధానికి ఆయుర్వేదంలో చాలా గొప్ప పేరు ఉంది. ఈ ఔషదానికి మరొక పేరు "గోమూత్ర శిలజిత్"  మార్కెట్ లో పచారీషాపుల్లో అమ్ముతుంటారు కాని అది అంత స్వచ్ఛమైనది కాదు. ఇది అసలైనది తెప్పించి నేను ప్రయోగించాను . చాలా జబ్బులలో మంచి ఫలితాలు ఇచ్చినది. మనకి దొరికిన మొమ్మాయి అసలైనదా కాదా అని తెలుసుకొవడానికి ఒక చిన్న పరీక్ష ఉన్నది.


               మొమ్మాయిని ఒక కందిగింజ అంత ఒక చిన్నగ్లాస్ నీటిలో వేయాలి . అప్పుడు నీరు ఎర్రగా మారుతుంది. అందులో ఒక పొడవాటి గుడ్డముక్కని వేసి నానబెట్టి ఒక కోడి కాలు విరగగొట్టి విరిగిన కాలుకు దీనిని చుట్టవలెను . కేవలం 15 నిమిషాలలో కాలు అతుక్కొని అది పరిగెత్తును . ఈ విధంగా పరీక్షించిన తరువాత మాత్రమే మొమ్మాయిని ఔషధంగా వాడవలెను .


           ఒకసారి ఈ మొమ్మాయిని వాడితే అది శరీరంలో 44 సంవత్సరాలపాటు నిలిచి ఉంటుంది. ఇది ఎక్కువుగా ఇరాన్ దేశములోని కొండలలో దొరుకుతుంది. శిలాజిత్ కీలువలే నల్లగా కాంతి వలే మైనము వలే కొంచం ఎర్రగా ఉంటుంది . ఇది శరీరంలో అత్యంత త్వరితముగా వ్యాపించి తన ప్రభావాన్ని చూపును . దీని మోతాదు ఒక వడ్లగింజ నుంచి రెండు వడ్లగింజల ఎత్తువరకు వాడవచ్చు . శిలాజిత్ చూర్ణములలో కలుపవలసి వచ్చినపుడు పన్నీటితో ఎండబెట్టి కలుపుకొనవలెను. లేహ్యములలో కలుపవలసివచ్చినప్పుడు ఆవునేతితో శిలజిత్ ని కలిపి కాచి చల్లార్చి కలుపవలెను గాని ప్రత్యేకంగా కలుపకూడదు.


  మొమ్మాయి ఉపయోగాలు  -


 *  హృదయానికి బలమును ఇస్తుంది.


 *  మనస్సుకు సంతోషాన్ని ఇస్తుంది.


 *  పొట్ట, జీర్ణకోశం , రక్తం తదితర వాటిని శుభ్రపరచును .


 *  శరీరంలోని సమస్త అవయవాలకు , నరాలకు బలాన్ని ఇస్తుంది.


 *  శ్లేష్మాన్ని హరించును .


 *  విరిగిన ఎముకలను , కీళ్ళని బాగుచేయును .


 *  గాయములను మాన్పును .


 *  వ్రణాలను నయంచేయును .


 *  ఎక్కిళ్లు , కడుపులో మంట, గుండెల్లో దడ నివారించును.


 *  అజీర్ణం , పరిణామశూల మొదలగు శూలలను తగ్గించును .


 *  కీళ్లనొప్పులు హరించును .


 *  అన్నిరకాల జ్వరాలను తగ్గించును .


 *  పక్షఘాతము , పక్షవాతము , సర్వాంగవాతములను హరించును .


 *  అతిమూత్రవ్యాది మరియు సమస్త మూత్రవ్యాధులను హరించును .


 *  ఉబ్బు , శ్వాస సంబంధ సమస్యలు , మతిచాంచల్యం , మూర్చ, ముక్కుకి వాసన తెలియకపోవడం , ముక్కులోపల పుట్టెడు వ్రణం నివారించును.


 *  జీర్ణకోశమును అంటి ఉండే పేగు గట్టిపడు రోగం కూడా తగ్గును.


 * ఒక చెయ్యి , ఒక కాలి యొక్క కీలులో పుట్టి అలా నిలిచి ఎంతకీ తగ్గని నొప్పిని కూడా తగ్గించును .


 *  స్త్రీల గర్భాశయం నందు జనించెడి పురుగులను చంపును.


 *  సుఖరోగాలను , చర్మవ్యాధులను నయం చేయును .


 *  బోధకాలు వ్యాధి , నాలిక మందం అయ్యే సమస్య , గొంతుకవ్యాధులను నయం చేయును .


 *  దవడనొప్పి , నాలుకలో నొప్పి సమస్యలకు వడ్లగింజ అంత మొమ్మాయి నీళ్లతో కలిపి ఆయా స్థలముల యందు పట్టువేసిన బాగు అగును.


 *  పిచ్చితనం ప్రారంభదశలో ఉండగా వడ్లగింజ ఎత్తు మొమ్మాయి గాడిదపాలతో కలిపి అరగదీసి లోపలికి ఇచ్చిన పిచ్చి తగ్గును.


 *  కొండనాలుక వాపుకు కాని గొంతుక వాపుకు మొమ్మాయి ఇప్పపువ్వు సారాయి తో కలిపి అంగిట పట్టించిన పై సమస్యలు తగ్గును. ఇప్పపువ్వు సారాయి దొరకనప్పుడు పెసరపప్పు కషాయం వాడవచ్చు .


         పైనచెప్పినవే కాకుండా మరెన్నో రోగములకు ఈ మొమ్మాయి అమృతం వలే పనిచేయును . ఈ మొమ్మాయి వాడే సమయమున బెండకాయ కూర, ఆవాలు వాడకూడదు. అదే విధముగా మొమ్మాయి అవునేయ్యితో కలిపి ఇచ్చేప్పుడు స్వచ్చమైన దేశవాళీ ఆవునెయ్యిని మాత్రమే వాడవలెను. మార్కెట్లో దొరికే మొమ్మాయిని పరీక్షించి మాత్రమే వాడవలెను. నకిలీలు చాలా ఉన్నాయి .


         మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  

కామెంట్‌లు లేవు: